
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ను సుమారు రెండు గంటలకుపైగానే చిక్కడపల్లి పోలీసులు విచారించారు. అనంతరం వైద్యపరీక్షల కోసం ఆయన్ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే, బన్నీకి మద్ధుతుగా టాలీవుడ్ ప్రముఖులు చాలామంది పోలీస్టేషన్‌కు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో చిరంజీవి దంపతులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు.
అల్లు అర్జున్ అరెస్ట్ కేసు లైవ్ అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి
వైద్యపరీక్షల అనంతరం అల్లు అర్జున్‌ను నాంపల్లి కోర్టుకు పోలీసులు తీసుకెళ్తారు. మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖ కొంత సమయం క్రితమే అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. అదే సమయంలో నాగబాబు కూడా అక్కడికి వెళ్లారు. వారు వెళ్లిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ నిర్మాత, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు ఇప్పటికే బన్నీ కోసం చిక్కడిపల్లి పోలీస్టేషన్‌కు వెళ్లారు.

అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి#AlluArjun #Chiranjeevi
pic.twitter.com/nkGq4iC1ug— Suresh PRO (@SureshPRO_) December 13, 2024