సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అల్లు అర్జున్, పుష్ప సినిమా విషయంలో రాజకీయ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక, తాజాగా పుష్ప సినిమాపై మంత్రి మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక స్మగ్లర్ సినిమాకు అవార్డు ఇవ్వడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.
మంత్రి సీతక్క తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో స్మగ్లర్‌ను హీరో చేశారు.. పోలీసును విలన్ చేశారు. ఒక స్మగ్లర్ పోలీసుల దుస్తులు విప్పి నిలబెడితే జాతీయ స్థాయిలో అవార్డులు ఇవ్వడం దేనికి సంకేతం. ఇలాంటి సినిమాలు నేర ప్రవృత్తిని పెంచేలా ఉన్నాయి. మానవతా దృక్పథం ఉన్న సినిమాలు రావాలి. జైభీమ్ వంటి సందేశాత్మక చిత్రాలకు అవార్డులు రాలేదు. అలాంటి సినిమాలకు ప్రోత్సహకాలు లేవు అంటూ ఘాటు విమర్శలు చేశారు.
ఇదిలా ఉండగా పుష్ప-2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు కాగా.. అల్లు అర్జున్ అరెస్టై జైలుకు కూడా వెళ్లి.. మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయంగానూ రచ్చ రేపింది. ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలు అల్లు అర్జున్‌కు మద్ధతుగా నిలిచాయి. రేవంత్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. అయితే.. కాంగ్రెస్ మాత్రం పోలీసుల చర్యలను సమర్థిస్తూ..అల్లు అర్జున్‌దే మొత్తం తప్పు అంటూ వాదిస్తూ వస్తోంది. దీంతో, ఈ వ్యవహరంలో రోజుకో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment