ఫార్ములా కారు కేసులో ఈడీ, ఏసీబీ దూకుడు | ED And ACB Speed Up Formula-E Car Race Case Investigation | Sakshi
Sakshi News home page

ఫార్ములా కారు కేసులో ఈడీ, ఏసీబీ దూకుడు

Published Sat, Dec 21 2024 11:20 AM | Last Updated on Sat, Dec 21 2024 11:41 AM

ED And ACB Speed Up Formula-E Car Race Case Investigation

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేస్‌ రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ కోర్టును ఆశ్రయించడం కేసు తీవ్రతను మరింత పెంచింది.

మరోవైపు.. ఈకేసులోకి ఈడీ ఎంటర్‌ కావడం ఆసక్తికరంగా మారింది. ఫార్ములా ఈ-కార్‌ రేసింగ్‌పై ఈడీ ఈసీఐర్‌ నమోదు చేసింది. ఇందులో భాగంగా మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద సెక్షన్లు నమోదు చేసింది. ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ అధికారులు.. కేసు ఫైల్‌ చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు కేసుల వివరాల కోసం ఏసీబీకి ఈడీ లేఖ రాసింది.

ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ-కార్‌ రేసు కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. నేడు ప్రిన్సిపల్‌ సెక్రటరీ దానా కిషోర్‌ స్టేట్‌మెంట్‌ను ఏసీబీ అధికారులు రికార్డు చేయనున్నారు. హెచ్‌ఎండీఏ, ఏంఏయూడీలోని మరి కొంత మందిని ఏసీబీ అధికారులు విచారించనున్నారు. ఇదే సమయంలో ఫార్ములా ఈ-కారు రేసుకు సంబంధించిన ప్రతీ డాక్యుమెంట్‌ను ఏసీబీ అధికారులు పరిశీలించనున్నారు. ఎఫ్‌ఈవో నుంచి వచ్చిన ఈ-మెయిల్స్‌, ఎల్‌ఎఫ్‌ఏతో పాటు లావాదేవీల వివరాలు కూడా ఏసీబీ పరిశీలించనుంది. ఈ క్రమంలోనే నిందితులను ఏసీబీ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement