ACB Telangana
-
అనుమతులు లేకుండా చెల్లింపులా?.. కేటీఆర్‌పై ఏసీబీ ప్రశ్నల వర్షం
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ కార్ రేసు నిర్వహణకు ఎలా బీజం పడింది?, నిబంధనలు ఎందుకు అతిక్రమించాల్సి వచ్చింది?, ఒప్పందాలతో పాటు నగదు చెల్లింపులకు సంబంధించిన ఫైళ్ల నిర్వ హణ ఎలా జరిగింది?, హెచ్ఎండీఏ పాలకమండలి అనుమతి లేకుండా, విదేశీ మారకద్రవ్య నిబంధనలు ఉల్లంఘించి ప్రైవేటు సంస్థకు పెద్దమొత్తం ఎలా చెల్లిస్తారు?, కేబినెట్, ఆర్థికశాఖ అనుమతి లేకుండా నిధుల మళ్లింపు ఎలా చేశారు?, ఫార్ములా–ఈ కార్ రేసు నిర్వహణతో రాష్ట్రానికి రూ.700 కోట్ల లాభం వచ్చినట్టు మీరు చెప్తున్నారు.. వాటి లెక్కలేవి?, రేసుకు సంబంధించిన ప్రకటనలతో ప్రభుత్వ సంస్థలకు ఏం లాభాలు వచ్చాయి?, టికెట్లు అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయం ఎంత?..తదితర అంశాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావుపై ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. మంత్రిగా కేటీఆర్ తీసుకున్న నిర్ణయం, దాని తాలూకు కేబినెట్ ఆమోదం ఫైళ్ల సర్క్యులేషన్‌కు సంబంధించిన ప్రక్రియ, నిధుల బదిలీ..వంటి అంశాల కేంద్రంగా ఏసీబీ విచారణ కొనసాగినట్టు తెలిసింది. సుమారు 7 గంటల విచారణ సందర్భంగా అధికారులు పదేపదే ఒకే అంశంపై ప్రశ్నిస్తుండడంతో ‘మీరు ఎన్ని గంటలు ఈ కార్యాలయంలో కూర్చోమన్నా కూర్చుంటా..మీకు కావాలి అంటే బ్రేక్ తీసుకోండి.. కానీ అడిగిన ప్రశ్నలే పలు రకాలుగా అడగడం వలన లాభం లేదు. ప్రభుత్వం ఒకవేళ నన్ను అరెస్టు చేయమని మీకు ఆదేశాలు ఇస్తే..ఈ ప్రశ్నలు అడగడం అనే వృధా ప్రయాస మానేసి ప్రభుత్వ ఆదేశాలు అమలు చేసుకోవచ్చు..’ అని కేటీఆర్ అన్నట్టు తెలిసింది. ఏసీబీ జేడీ ఆధ్వర్యంలో స్టేట్మెంట్ రికార్డ్ ఫార్ములా–ఈ కార్ రేసు నిర్వహణకు సంబంధించిన కేసులో ఏసీబీ అధికారులు నోటీసు ఇవ్వడంతో కేటీఆర్ గురువారం ఉదయం వారి ఎదుట విచారణకు హాజరయ్యారు. కోర్టు అనుమతి నేపథ్యంలో న్యాయవాది, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ రామచందర్‌రావుతో కలిసి ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. కోర్టు ఆదేశం ప్రకారం..విచారణ సమయంలో న్యాయవాదికి కేటీఆర్ కనిపించేలా ఏర్పాటు చేశారు. జాయింట్ డైరెక్టర్ రితిరాజ్ ఆధ్వర్యంలో మొత్తం ఐదుగురు సభ్యుల బృందం ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది. బిజినెస్ రూల్స్ అధికారులు చూసుకుంటారు.. రేసు నిర్వహణ ఫైల్ కేబినెట్ ఆమోదానికి ఎందుకు పంపలేదు? అన్న అంశంపై ఏసీబీ అధికారులు పలుమార్లు ప్రశ్నించగా.. బిజినెస్ రూల్స్ గురించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులే చూసుకుంటారని కేటీఆర్ సమాధానం ఇచ్చినట్టు సమాచారం. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు ఏసీబీకి లేదని ఆయన పేర్కొన్నారు. రేసు కొనసాగించకపోవడం వల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం వాటిల్లిందని.. ఒప్పందం రద్దుచేసి ప్రభుత్వానికి నష్టం చేకూర్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఈ కేసులో ఎందుకు భాగస్వామిగా చేర్చలేదని కేటీఆర్ ప్రశ్నించినట్లు సమాచారం. రేసు నిర్వహణకు కేబినెట్ ఆమోదం గురించి ఏసీబీ ప్రశ్నించినప్పుడు.. కేబినెట్ ఆమోదం లేకుండా రేసు రద్దు చేసినందుకు ముఖ్యమంత్రిని కూడా బాధ్యుల్ని చేయాల్సి వస్తుందని కేటీఆర్ అన్నట్టు తెలిసింది. ఈ రేసుకు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నీ, రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు తనకు ప్రభుత్వం కేటాయించిన అధికారిక ఈ–మెయిల్లో ఉన్నాయని.. ప్రస్తుతం ఆ అకౌంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్దనే ఉందని స్పష్టం చేశారు. మంత్రిగా విధానపరమైన నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వంలో భాగమైన తనకు ముమ్మాటికీ ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మీరు తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన జీవోను ఏమైనా ఇచ్చిందా? అని ప్రశ్నించినప్పుడు.. సచివాలయ బిజినెస్ రూల్స్ అన్నీ సీఎస్ పరిధిలో ఉంటాయని, ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వాన్నే అడగాలని కేటీఆర్ చెప్పినట్టు తెలిసింది. ఏస్ నెక్సŠట్ జెన్ సంస్థ మొదటిసారి రేసు నిర్వహించినప్పుడు పూర్తిగా డబ్బులు చెల్లించలేదంటూ.. ఆ సంస్థ ఆర్థిక వ్యవహారాల గురించి ప్రశ్నించినప్పుడు... ప్రైవేటు సంస్థ వివరాలు తనకు తెలియదని, ఆ అంశం తన పరిధిలోనిది కాదని కేటీఆర్ చెప్పినట్లు తెలిసింది. పత్రాలతో హాజరు..రేసుతో లబ్ధిపై వివరణ ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్‌లోని ఏసీబీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్.. ఏసీబీ ప్రశ్నించేందుకు అవకాశం ఉన్న పలు అంశాలకు సంబంధించిన కొన్ని పత్రాలను తన వెంట తెచ్చుకున్నారు. ముందు ఏసీబీ సీఐయూ డీఎస్పీ, ఈ కేసు దర్యాప్తు అధికారి మాజిద్ అలీని కలిసి, దర్యాప్తునకు సంబంధించి నోటీసులు తీసుకున్నారు. అప్పటికే కేటీఆర్‌ను విచారించేందుకు సిద్ధంగా ఉన్న ఏసీబీ జేడీ బృందం.. ప్రత్యేక గదిలో కేటీఆర్‌ను ప్రశ్నించింది. కాగా ఫార్ములా ఈ రేసు నిర్వహించడానికి గల కారణాలు..రేసు నిర్వహణతో రాష్ట్రానికి ఎలాంటి లబ్ధి జరిగిందన్న అంశాలను కేటీఆర్ వివరించినట్టు తెలిసింది. రేసు నిర్వహణతో రాష్ట్రానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా జరిగిన లబ్ధికి సంబంధించి కొన్ని పత్రాలు కూడా అందజేసినట్లు సమాచారం. విచారణ మధ్యలో కాసేపు భోజన విరామం ఇచ్చారు. ఒకవైపు కేటీఆర్‌ను ప్రశ్నిస్తూనే, మరోవైపు దర్యాప్తులో భాగంగా సేకరించిన అంశాలను ఏసీబీ అధికారులు పరిశీలించినట్టు తెలిసింది. సాయంత్రం 5 గంటల వరకు కేటీఆర్‌ను ప్రశ్నించిన అధికారులు, దర్యాప్తులో భాగంగా అవసరమైతే మళ్లీ హాజరుకావాల్సి ఉంటుందని సూచించినట్టు తెలిసింది. కాగా సాయంత్రం 5.06 గంటల సమయంలో కేటీఆర్ ఏసీబీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. అక్కడ కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. రేవంత్ రాసిచ్చిన నాలుగైదు ప్రశ్నలనే 40 రకాలుగా అడిగారు: మీడియాతో కేటీఆర్ ‘ఏసీబీ పెట్టింది చెత్త కేసు..ఇందులో విషయమే లేదు. నాలుగైదు ప్రశ్నలనే 40 రకాలుగా అడిగారు. కొత్తగా అడిగిందేమీ లేదు. రేవంత్ రాసిచ్చిన నాలుగైదు ప్రశ్నలనే అటూ ఇటూ తిప్పి అడిగారు. నాపై కేసు పెట్టి రేవంత్‌రెడ్డి ఏదైనా సాధించాలనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది. పైసలు పంపాను అని నేనే చెబుతున్నా. డబ్బులు వచ్చాయని వాళ్లు (ఎఫ్ఈఓ) చెబుతున్నారు. ఇందులో అవినీతి ఎక్కడుందని ప్రశ్నిస్తే అధికారుల దగ్గర సమాధానమే లేదు. వాళ్లు అడిగిన అన్ని ప్రశ్నలకు నాకున్న అవగాహన మేరకు సమాధానమిచ్చా. ఎన్నిసార్లు పిలిచినా తప్పక వస్తానని చెప్పా..’ అని కేటీఆర్ తెలిపారు. అభ్యంతరం తెలిపిన డీసీపీ కేటీఆర్ మీడియాతో మాట్లాడడంపై డీసీపీ విజయ్‌కుమార్ అభ్యంతరం తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ‘ట్రాఫిక్ ఇబ్బంది అవుతోంది.. ఇది మీడియా పాయింట్ కాదు..ఇక్కడ మీడియా సమావేశం పెట్టొద్దు..’ అని డీసీపీ అనడంతో కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ‘నేను ఇక్కడ మాట్లాడితే ఏం నొచ్చింది. ఏం ఇబ్బంది అయ్యింది. మీడియాపై మీ దాడి ఏంది..? మీకు ఇంత భయం ఎందుకు?..’ అంటూ నిలదీశారు. అయితే మీడియా ప్రతినిధులను పోలీసులు పక్కకు నెట్టేయడంతో కేటీఆర్ అక్కడి నుంచి నిష్క్రమించారు. -
ముగిసిన కేటీఆర్ ఏసీబీ విచారణ
ముగిసిన కేటీఆర్ ఏసీబీ విచారణఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసిందిఏడుగంటల పాటు కొనసాగిన విచారణమరోసారి విచారణకు రావాలని కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులుఏసీబీ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ పైసలు పంపించానని చెబుతున్నా.. వాళ్లు పైసలు ఇక్కడే ఉన్నాయని చెప్పారు కరప్షన్ ఎక్కుడందని అడిగినా.. వాళ్ల నుంచి సమాధానం లేదుమీరు విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తానని ఏసీబీ అధికారులకు చెప్పాను రాజకీయ ఒత్తిడిలో పొలిటికల్ కేసు పెట్టి ఏదో చేయాలని చూస్తే అది సీఎం రేవంత్‌రెడ్డి మూర్ఖత్వమే అవుతుంది.పాపం వాళ్లు(ఏసీబీ అధికారులు) రేవంత్ రాసిచ్చిన నాలుగు ప్రశ్నల్ని అలా తిప్పి.. ఇలా తిప్పి నలబైసార్లు అడిగారుఇది అసంబద్ధమైన కేసు అని ఏసీబీ అధికారులకు చెప్పానునాకు తెలిసిన సమాచారం అంతా ఏసీబీకి ఇచ్చానువిచారణకు ఎప్పుడు పిలిచినా వస్తానుఎప్పుడు పిలిచినా సంతృప్తికర సమాధానం ఇస్తానువాళ్లు ఎప్పుడు విచారణకు పిలుస్తారో తెలియదుఏసీబీ ఆఫీస్‌లో కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్న అధికారులుఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ విచారణ. ఏసీబీ ఆఫీస్‌లో కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్న అధికారులుఫార్ములా ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామంబీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్(KTR) విచారణఈ కేసులో ఏ1గా కేటీఆర్తెలంగాణ కోర్టులో కేటీఆర్‌కు దక్కని ఊరటహైకోర్టు తీర్పుతో.. కేటీఆర్ అరెస్ట్‌కు ఏసీబీకి తొలగిన అడ్డంకులు!ఏసీబీ తదుపరి చర్యలపై ఉత్కంఠ ప్రధాన అభియోగం ఇదే.. ఫార్ములా-ఈ ఆపరేషన్స్, ఎస్ నెక్ట్స్ జెన్, పురపాలకశాఖల మధ్య 9, 10, 11, 12వ సీజన్ల కార్ రేస్‌లు నిర్వహించేలా ఒప్పందం 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నెక్లెస్‌రోడ్డులో తొమ్మిదో సీజన్ రేసింగ్ నిర్వహణ. అప్పటి మంత్రి కేటీఆర్ ఆమోదంతోనే కుదిరిన ఒప్పందం శాఖాధిపతిగా ఎంవోయూ చేసిన ఐఏఎస్ అర్వింద్ కుమార్ ఈ రేసు నిర్వహించిన విదేశీ సంస్థకు హెచ్ఎండీఏ నుంచి చెల్లింపులు HMDA బోర్డు, ఆర్థిక శాఖ, ఆర్బీఐల అనుమతి తీసుకోకుండానే నేరుగా రూ.55 కోట్లు చెల్లింపుముఖ్యంగా రూ.46 కోట్ల వరకు డాలర్ల రూపంలో చెల్లించారనేది ప్రధాన అభియోగం.ఆయన ఫిర్యాదుతోఫార్ములా-ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఏ-1గా కేటీఆర్ పేరుఏ2గా ఐఏఎస్ అర్వింద్‌కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి పుపాలకశాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్ ఫిర్యాదు మేరకు కదలిన వ్యవహారం గవర్నర్ అనుమతి.. ఆపై ఏసీబీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఫార్ములా రేసు పూర్వాపరాలు, అనుమతి లేకుండానే హెచ్ఎండీఏ(HMDA) ఒప్పందం చేసుకోవడం, ఆర్బీఐ అనుమతి లేకుండా రూ.46 కోట్ల మేర విదేశీ కరెన్సీ చెల్లించడం వంటి వ్యవహారాలపై ఏసీబీ దృష్టి కేటీఆర్ విచారణ.. పెరుగుతున్న ఉత్కంఠఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కొనసాగుతున్న విచారణKTR విచారణ పై గంట గంటకు కొనసాగుతున్న ఉత్కంఠ..KTR ఏసీబీ విచారణ నేపథ్యంలో ఏసీబీ కార్యాలయం పరిసరాల్లో భారీగా మొహరించిన BRS శ్రేణులుఆరు గంటలుగా కొనసాగుతున్న ఏసీబీ విచారణఫిర్యాదు దారుడు దాన కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా కొనసాగుతున్న విచారణIAS అరవింద్ కుమార్ ఇచ్చిన వాగ్మూలం ముందు ఉంచి ప్రశ్నిస్తున్న ఏసీబీFEO తో ఒప్పందాలు నగదు,బదిలీ అంశాలపై ప్రశ్నిస్తున్న ఏసీబీకేబినెట్ ఆమోదం, ఆర్ధిక శాఖ అనుమతి లేకుండా ఎందుకు నగదు బదిలీ చేశారు?ఫార్ములా ఈ కార్ రేస్ నుంచి గ్రీన్ కో తప్పుకోవడానికి కారణం ఏంటి?BRS పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోళ్లపై ప్రశ్నిస్తున్న ఏసీబీఇప్పటికే సేకరించిన పత్రాలు ముందు ఉంచి ప్రశ్నిస్తున్న ఏసీబీకేటీఆర్కు ఏసీబీ సంధించిన ప్రశ్నలు ఇవేనా?అసలు హైదరాబాద్‌లో ఫార్ములా రేస్ ప్రతిపాదన ఎవరిది? ఎవరు ఆమోదించారు?ఇక్కడే ఎందుకు నిర్వహించారు?ప్రభుత్వానికి ఏమైనా ప్రయోజనం కలిగిందా?నగదు బదిలీ చేస్తే ఇబ్బందులు వస్తాయని ఎవరైనా హెచ్చరించరా?అసలు నిబంధనలు పట్టించుకోకుండా ఎందుకు బదిలీ చేశారు?గ్రీన్కో ఎందుకు స్పాన్సర్షిప్ నుంచి వైదొలగిందినిధుల మళ్లింపు కేబినెట్ దృష్టికి ఎందుకు వెళ్లలేదు?లంచ్‌బ్రేక్ తర్వాత తిరిగి ప్రారంభమైన కేటీఆర్ విచారణకేటీఆర్ను తిరిగి విచారిస్తున్న ఏసీబీలంచ్ తర్వాత కేటీఆర్‌ను విచారిస్తున్న ఏసీబీకేటీఆర్ విచారణ.. లంచ్ బ్రేక్కేటీఆర్ ఏసీబీ విచారణకు లంచ్ బ్రేక్భోజన విరామం తర్వాత కొనసాగనున్న విచారణఇప్పటిదాకా.. మూడున్నర గంటలకు పైగా కొనసాగిన విచారణ రెండు గంటలుగా విచారణ ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్న ఏసీబీ ప్రత్యేక బృందం రెండు గంటలుగా కొనసాగుతున్న విచారణకేటీఆర్ ఓ రూంలో.. ఆయన లాయర్ మరో రూంలోరేసు ఒప్పందాలు, నగదు బదిలీపైనే ప్రధానంగా కొనసాగుతున్న విచారణకేటీఆర్కు ప్రశ్నల వర్షంఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్న అధికారులు ఓ గదిలో కేటీఆర్, పక్కనే లైబ్రరీలో ఆయన లాయర్ రామచందర్రావులాయర్కు కేటీఆర్ కనిపించేలా ఏర్పాట్లుకేటీఆర్పై ప్రశ్నల వర్షం గుప్పిస్తున్న ఏసీబీ అధికారుల బృందంHMDA నుంచి FEOకు రూ. 55 కోట్ల నగదు బదిలీపై ఆరారేసు ఒప్పందాల కోసం ఎవరిని కలిశారు? ఎప్పడెప్పుడు కలిశారు? ఎలాంటి చెల్లింపులు జరిగాయి? ఏదైనా వివాదాలు వస్తాయని ముందు జాగ్రత్తగా ఆర్బిట్రేషన్ పెట్టుకున్నారా?అని ప్రశ్నించే అవకాశం. ACB-KTR వాదనలు ఇలా.. ఏసీబీ: ఒప్పందం కుదరకముందే చెల్లింపులు జరిగాయిKTR: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకే రూ.55 కోట్ల ఖర్చుఏసీబీ: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ చెల్లింపులు జరిగాయిKTR: గ్రీన్కో సంస్థ వెళ్లిపోవడంతో డబ్బులు సర్దుబాటు చేశాంఏసీబీ: ఒప్పందంలో భాగం కాకపోయినా హెచ్ఎండీఏ ద్వారా చెల్లింపులుKTR: డబ్బులు ఇచ్చిన సంగతి హెచ్ఎండీఏకి తెలుసుఏసీబీ: రూ.54 కోట్ల 88 లక్షల ప్రభుత్వ నిధుల దుర్వినియోగంKTR: ఈవెంట్ ద్వారా వచ్చిన ప్రయోజనం రూ.700 కోట్లుఏసీబీ: ఫార్ములా-ఈకి రెండు విడుతల్లో రూ.45 కోట్ల చెల్లింపులుKTR: కొన్ని సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాయిఏసీబీ: తొలి విడతలో రూ.22 కోట్ల 69 లక్షల విడుదలKTR: బ్యాటరీ వెహికిల్స్ రీపర్పస్ చేసే విధంగా జీవో తెచ్చాంఏసీబీ: మలివిడతలో రూ.23 కోట్లు చెల్లించిన హెచ్ఎండీఏKTR: మరో సంస్థ రూ.1200 కోట్ల పెట్టుబడులు పెట్టిందిఏసీబీ: ఆర్బీఐ గైడ్‌లైన్స్‌కు విరుద్ధంగా విదేశీ కంపెనీకి చెల్లింపులుKTR: మొబిలిటీ వీక్ ద్వారా ఎన్నో సంస్థలు పెట్టుబడులు పెట్టాయిప్రత్యేక గదిలో కేటీఆర్ విచారణఏసీబీ కార్యాలయంలో కొనసాగుతున్న కేటీఆర్ విచారణఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్న ఏసీబీ అధికారులుజాయింట్ డైరెక్టర్, డీఎస్పీ, సీఐల సమక్షంలో కొనసాగుతున్న విచారణవిచారణకు కేటీఆర్ లాయర్, మాజీ ఏఏజీ రామచందర్రావును లోపలికి అనుమతించిన అధికారులుఅరవింద్కుమార్తో పాటు దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ విచారణ?బిజినెస్ రూల్స్ ఉల్లంఘనతో పాటు నిధుల దుర్వినియోగం అభియోగాలుకేబినెట్ అనుమతి లేకుండా ఒప్పందాలు, ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపుల అభియోగాలపై ప్రశ్నలుఏసీబీ ఆఫీస్‌కు కేటీఆర్ఏసీబీ ఆఫీస్‌కు చేరుకున్న కేటీఆర్నందినగర్ నివాసం నుంచి ఏసీబీ ఆఫీస్‌కు చేరుకున్న కేటీఆర్కేటీఆర్ వెంట ఆయన లాయర్, మాజీ ఏఏజీ రామచంద్రరావునిఖార్సైన తెలంగాణ బిడ్డను..: కేటీఆర్నందినగర్ నివాసం వద్ద మీడియాతో కేటీఆర్తెలంగాణ ప్రతిష్టను పెంచడానికే నేను ప్రయత్నించానుహైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడానికి ప్రయత్నించాంఈ క్రమంలోనే ఈ కార్ రేసు నిర్వహించాంమంత్రిగా తన బామర్దులకు కాంట్రాక్ట్ ఇప్పించే ప్రయత్నం నేనేం చేయలేదుఅరపైసా కూడా అవినీతి చేయలేదుఇంకా ఎన్ని కేసులైనా పెట్టుకో.. వాటిని ఎదుర్కొంటాం (సీఎం రేవంత్‌ను ఉద్దేశించి..)తెలంగాణ బిడ్డగా రాష్ట్రం కోసం పోరాడిన నాయకుడిగా స్పష్టంగా చెప్తున్నారాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రం ప్రపంచ స్థాయిలో ఎదిగేలా పని చేశా.. మేము కుటుంబం కోసం పని చేయలేదునేను 50 లక్షల డబ్బుతో ఎమ్మెల్యే లను కొని దొరికిన దొంగను కాదునిజం నిలకడ మీద తెలుస్తది మీ వైఫల్యాలపై పోరాడింది బీఆర్ఎస్.. అందుకే మా మీద కేసులు మీ డైవర్షన్ లకు లోనుకామునేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను.. ఏ తప్పు చేయలేదుఏ ప్రశ్నలు అడిగిన చెప్తం .. తెలంగాణ కోసం చస్తాను తప్ప తల వంచను ఎక్స్‌లో కేటీఆర్తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకేర్ములా ఈ కార్ రేసు నిర్వహించాంపెట్టుబడులను రప్పించేందుకు కోసం కృషి చేశాంవీటన్నింటిని ప్రజలు అర్థం చేసుకుంటారని విశ్వసిస్తున్నాఎప్పటికైనా సత్యం, న్యాయమే గెలుస్తుంది Worked tirelessly for bringing a prestigious event to India, to enhance the Brand image of Hyderabad & Telangana globallyAgenda was to make Hyderabad a pivotal hub for sustainable mobility as the world transitions towards it. Formula-E race was a part of the effort to realise… pic.twitter.com/JhqimVe9TI— KTR (@KTRBRS) January 9, 2025భారీ భద్రత ఏర్పాటుబంజారాహిల్స్లోని ఏసీబీ ఆఫీస్ వద్ద భారీ బందోబస్తుకేటీఆర్ విచారణ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఏర్పాటుఏసీబీ ఆఫీస్‌కు ఇరువైపులా భారీ బారికేడ్లుమరోవైపు బీఆర్ఎస్ నేతల హౌజ్ అరెస్టులుకేటీఆర్ ఇంటికి బీఆర్ఎస్ నేతల క్యూ -
కేటీఆర్‌పై ఏసీబీకి మరో ఫిర్యాదు
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(KTR)పై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(ACB)కి మరో ఫిర్యాదు వెళ్లింది. అవుటర్ రింగ్‌రోడ్‌లో భారీ అవినీతి జరిగిందని చెబుతూ.. బీసీ పొలిటికల్ జేఏసీ బుధవారం ఫిర్యాదు చేసింది. ఓఆర్ఆర్(ORR)లో రూ.7,380 కోట్ల అవినీతి జరిగిందని, ఆ అక్రమాలపై దర్యాప్తు జరపాలని పేర్కొంటూ మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీకి ఫిర్యాదు వెళ్లింది. ‘‘ఫార్ములా ఈ రేస్ కేసుతోపాటు ఓఆర్ఆర్ అక్రమాల పై కూడా దర్యాప్తు జరపాలి. సీఎం, సీఎస్, ఈడీలతో పాటు ఇవాళ ఏసీబీకి ఫిర్యాదు చేశాం. ఓఆర్ఆర్ చుట్టూ మెయింటనెన్స్ ఖర్చు ఎక్కువగా ఉన్న ప్రాంతం అంతా హెచ్ఎండీఏ పరిధిలోనే ఉంది. ఆదయం వచ్చే రోడ్డును మాత్రం కంపెనీలకు ఇచ్చారు. ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు 2023 ఏప్రిల్ నుండి ముపై ఏళ్ళ పాటు లీజ్‌కు ఇచ్చారు. అయితే.. ఆ కంపెనీ రూ. 25 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చింది. కైటెక్స్ గార్మెన్స్ సైతం ఎక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేసింది. కైటెక్స్ కు సైతం హైదరాబాద్, వరంగల్, రంగారెడ్డి లో భూకెటాయింపులు జరిగాయి. క్విడ్ ప్రోకో(quid pro quo) ఇక్కడ చాలా స్పష్టంగా కనపడుతోంది. హెచ్ఎండీఏ నిధుల పై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలి. నిధులు దుర్వినియోగంలో అధికారుల పాత్ర పై దర్యాప్తు జరపాలి’’ అని బీసీ పోలిటికల్ జేఏసీ నేత యుగంధర్ గౌడ్ చెప్తున్నారు.ఇదీ చదవండి: ఎన్నికల బాండ్లు.. అది క్విడ్ ప్రోకో ఎలా అవుతుంది?: కేటీఆర్ఏసీబీ నోటీసుల్లో ఏముందంటే.. ఇదిలా ఉంటే.. ఫార్ములా ఈ రేసు కేసులో ఈ నెల 9వ తేదీన విచారణకు రావాలంటూ కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. అందులో ఏసీబీ కీలకాంశాలకు ప్రస్తావించింది..‘‘విచారణకు హాజరు కాకుండా తప్పించుకోవాలని చూస్తున్నారు. ఈ నెల 6వ తేదీన విచారణకు వచ్చినప్పుడు మీ లాయర్‌ను అనుమతించాలని మీరు కోరారు. కానీ, చట్ట ప్రకారం అది సాధ్యం కాదని మీకు తెలియజేశాం. కాబట్టి, 9వ తేదీన మీ విచారణకు కూడా లాయర్‌ను అనుమతించడం కుదరదు. మీరు విచారణకు హాజరుకండి. మీరిచ్చిన సమాచారం ప్రకారం ఏం డాక్యుమెంట్లు కావాలో అడుగుతాం’’ అని ఏసీబీ పేర్కొంది. మరోవైపు విచారణకు తన లాయర్‌ను అనుమతించేలా కోర్టు నుంచి అనుమతి కోసం కేటీఆర్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. -
కడిగిన ముత్యంలా కేటీఆర్ బయటకొస్తారు: హరీష్‌రావు
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఫార్ములా ఈ రేస్ కేసులో తనపై ఏసీబీ(ACB) దాఖలు చేసిన కేసును కొట్టేయాలన్న ఆయన అభ్యర్థనను ఉన్నతన్యాయస్థానం కొట్టేసింది. ఈ పరిణామంపై తెలంగాణ రాజకీయ వర్గాలు స్పందిస్తున్నాయి.హైకోర్టు తీర్పు అనంతరం నందినగర్‌లోని కేటీఆర్ నివాసం వద్ద బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘‘రేవంత్ రెడ్డివి డైవర్షన్ పాలిటిక్స్(Diversion Politics), కక్ష సాధింపు చర్యలు. ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ తరహా రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగానే కేటీఆర్‌పై అక్రమ కేసు పెట్టారు. ఫార్ములా ఈ రేస్ కేసు వల్ల తెలంగాణకు మంచే జరిగింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం కేటీఆర్ కష్టపడ్డారు. ఈ వ్యవహారంలో అవినీతికి ఆస్కారమే లేదు. న్యాయ స్థానాలు, చట్టంపై గౌరవం ఉంది. కేటీఆర్ ఎలాంటి తప్పు చేయలేదు. అందుకే కేటీఆర్ విచారణకు సహకరిస్తానన్నారు. ఏసీబీ విచారణకు వెళ్తే.. 40 నిమిషాలు బయట నిల్చొబెట్టారు. అయినా ఆయన ఓపికగా వ్యవహరించారు. తిరిగి 9వ తేదీన విచారణకు రమ్మన్నారు. ఆ రోజు కూడా ఆయన విచారణకు హాజరవుతారు. ఇది కుట్రపూరితమైన కేసు. మేం సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాం. ఈ కేసు నుంచి కడిగిన ముత్యంలా కేటీఆర్ బయటకు వస్తారు. మా పార్టీ వాళ్లపై రేవంత్ రెడ్డి ఇంకా కేసులు పెట్టొచ్చు. కానీ, మేం అధైర్య పడం. ఎన్ని కేసులు పెట్టినా ప్రజల తరఫున పోరాడతాం. రేవంత్ అక్రమాలకు ప్రశ్నిస్తూనే ఉంటాం.హైకోర్టు తీర్పు కాపీ ఇంకా అందలేదు. అది వచ్చాక ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై న్యాయనిపుణుల సలహా తీసుకుంటాం. సోషల్ మీడియాలో హైకోర్టు తీర్పుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కేటీఆర్‌ను విచారణ జరపమని మాత్రమే హైకోర్టు చెప్పింది. అసలు విచారణే ప్రారంభం కానప్పుడు.. ఇది తప్పుడు కేసు ఎలా అవుతుంది. కేటీఆర్‌కు శిక్ష పడుతుందంటూ బోగస్ వార్తలు ప్రచురిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు అవి మానుకుంటే మంచిది’’ అని హరీష్ అన్నారు.👉కేటీఆర్ యాక్టింగ్ చూసి సినిమా వాల్లే ఆశ్చర్యపోతున్నారు. జైలు కు పోవడానికి సిద్దం అని..ఇప్పుడు ఈ దొంగ నాటకాలు ఎందుకు.ఈ ఫార్ములా కేసు ను లొట్టపీసు కేసు అన్నది కేటీఆర్ కాదా?. జైలు కు పోయి యోగా చేస్తా అన్నది కేటీఆర్ కాదా?. తప్పే చేయలేదు , సుద్దపూస అని ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతున్నాడు. కేటీఆర్ కు చట్టం తెలియదా? అడ్వకేట్ లతో ఏసీబీ ఆఫీస్ కు ఎలా వెళ్తారు?. కోర్టు పర్మిషన్ లేకుండా అడ్వకేట్ లను ఏసీబీ అనుమతించదని తెలియదా?:::బల్మూరి వెంకట్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ👉కేటీఆర్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. ఫార్ములా ఈ రేసు.. మనీ లాండరింగ్ కేసులాగా అనిపిస్తోంది. ప్రభుత్వంలో ఉంటే ఏ తప్పైనా చేయొచ్చు అనుకుంటే పొరపాటే.:::వీహెచ్, మాజీ ఎంపీ -
కేటీఆర్‌కు బిగ్ షాక్.. వాట్ నెక్స్ట్?
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. అరెస్ట్ నుంచి రక్షణ కోరగా.. ఆ విషయంలోనూ ఊరట ఇవ్వలేదు. దీంతో వాట్ నెక్స్ట్ అనే చర్చ తెరపైకి వచ్చింది. వాస్తవానికి క్వాష్ పిటిషన్ విచారణ సమయంలో హైకోర్టు కేటీఆర్(KTR)కు ఊరట ఇచ్చింది. తీర్పు ఇచ్చేంతవరకు ఆయన్ని అరెస్ట్ చేయొద్దని కోర్టు దర్యాప్తు సంస్థలకు సూచించింది. దీంతో ఇవాళ్టి వరకు ఎలాంటి చర్యలకు అవి ఉపక్రమించలేదు. మరోవైపు.. ఈ కారణం చూపిస్తూనే ఆయన దర్యాప్తు సంస్థల నుంచి విచారణ విషయంలో ఊరట కోరారు. అయితే తాజా తీర్పు నేపథ్యంలో ఫార్ములా ఈ రేస్ కేసులో ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ బీఆర్ఎస్(BRS Party) శ్రేణుల్లో నెలకొంది. మరోవైపు కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారా? అనే చర్చ జోరుగా నడుస్తోంది.కోర్టు తీర్పు అనంతరం బంజారాహిల్స్ నందినగర్(Nandi Nagar)లోని కేటీఆర్ నివాసం వద్ద భారీ బందోబస్తు కనిపిస్తోంది. తీర్పు వేళ ఆయన సోదరి కవితతో పాటు హరీష్‌రావు, మాజీ మంత్రులు, పలువురు కీలక నేతలు అక్కడికి చేరుకుని కేటీఆర్‌తో మంతనాలు జరుపుతున్నారు. అయితే.. ఈ తీర్పును సవాల్ చేసే యోచనలో బీఆర్ఎస్ లీగల్ టీం ఉన్నట్లు సమాచారం. హైకోర్టు ఉత్తర్వుల కాపీ ఇంకా అందలేదు. సాయంత్రంలోపు అందే అవకాశం ఉంది. అవి అందాక తదుపరి చర్యలపై ఆలోచన చేస్తాం అని లీగల్ టీం ప్రకటించింది. మరోవైపు..ఏసీబీ(ACB) ఇప్పటికే ఆయన్ని 9వ తేదీన విచారణకు రావాలంటూ రెండోసారి నోటీసులు పంపింది. తన వెంట లాయర్‌ను అనుమతించకపోవడంతో సోమవారం ఆయన విచారణకు హాజరుకాకుండానే ఏసీబీ ఆఫీస్ నుంచి వెనుదిరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. విచారణ టైంలోనే కేటీఆర్‌ను అదుపులోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు ఆయన్ని ఈ కేసులో ఈడీ సైతం విచారణ జరపాల్సి ఉంది. తాజాగా.. హైకోర్టు క్వాష్ కొట్టేయడంతో మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.ఇదీ చదవండి: కేటీఆర్ క్వాష్ కొట్టివేత, హైకోర్టు ఏం చెప్పిందంటే.. -
కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేత
హైదరాబాద్, సాక్షి: ఫార్ములా ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు చుక్కెదురైంది. ఏసీబీ కేసును కొట్టేయాలని వేసిన క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఏసీబీ దర్యాప్తులో మేం జోక్యం చేసుకోం అని తీర్పు సందర్భంగా పేర్కొంది. అయితే ఆ సమయంలో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కేటీఆర్ తరఫు న్యాయవాది కోరగా.. ఆ విజ్ఞప్తిని ధర్మాసనం పరిగణనలోకి తీసుకోలేదు. ఈ పిటిషన్‌పై ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం(Bench).. డిసెంబర్ 31న వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని.. కావాలంటే విచారణ జరుపుకోవచ్చని దర్యాప్తు సంస్థలకు సూచించింది. మరోవైపు.. కోర్టు తీర్పు నేపథ్యంతోనే ఆయన ఇవాళ్టి ఈడీ విచారణ వాయిదా పడింది కూడా.ప్రభుత్వ వాదనలు ఇలా..ఏసీబీ తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘‘ఎఫ్ఐఆర్ నమోదు ప్రాథమిక అంశం మాత్రమే. అందులో పేర్కొన్న అంశాలే అంతిమం కాదు. దర్యాప్తులో తేలే విషయాల ఆధారంగా సెక్షన్లు చేరుస్తారు. రెండు నెలల క్రితమే కేసు నమోదుకు నిర్ణయించారు. కేసు నమోదు కోసం గవర్నర్ నిర్ణయానికి పంపారు. గవర్నర్ ఆమోదించాకే కేసు నమోదు చేశారు. ఫార్ములా సంస్థకు డబ్బు విదేశీ కరెన్సీలో చెల్లించారు. దీంతో హెచ్ఎండీఏపై అధిక భారం పడింది. విదేశీ కరెన్సీలో చెల్లింపు కోసం ఆర్బీఐ అనుమతి తీసుకోలేదు. ఆర్థికశాఖ అనుమతి కూడా లేదు.(గవర్నర్ అనుమతి కాపీని కోర్టు అడగడంతో ఏజీ అందజేశారు.)చెల్లింపుల్లో కేటీఆర్ పాత్ర ఏంటని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. కేటీఆర్ పాత్ర ఏంటో దర్యాప్తులో తేలుతుందని ఏజీ తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు అనేది దర్యాప్తు కోసమేనని వివరించారు. కేసు పూర్తి వివరాలు అభియోగపత్రంలో ఉంటాయని, రూ.56 కోట్లకు పైగా చెల్లింపుల్లో నిబంధన ఉల్లంఘన జరిగిందని ఏజీ కోర్టు దృష్టికి తెచ్చారు.దానకిశోర్ తరఫున సీనియర్ న్యాయవాది సీపీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పురపాలక శాఖ మంత్రి పర్యవేక్షణలోనే ఆ శాఖ అధికారులు విధులు నిర్వహిస్తారన్నారు. రేసింగ్‌కు సంబంధించిన చెల్లింపుల దస్త్రాన్ని అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆమోదించారని కోర్టుకు తెలిపారు. రేసింగ్ వ్యవహారంలో అన్ని రకాల నిబంధనలను ఉల్లంఘించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.బీఆర్ఎస్ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా డబ్బు చెల్లించారని కోర్టుకు ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టం, నేరపూరిత కుట్ర సెక్షన్లు నమోదు చేసినట్లు చెప్పారు. కేటీఆర్ తరఫు వాదనలు..‘‘అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన సెక్షన్లు ఈ కేసుకు వర్తించవు. ముఖ్యంగా 13(1)(a) సెక్షన్ ఈ కేసుకు వర్తించదు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని అనేందుకు ఆధారాలు లేవు. ప్రొసీజర్ పాటించలేదనడం సరైంది కాదు. 14 నెలల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రాథమిక విచారణ కూడా లేకుండా కేసు పెట్టారు. కేవలం రాజకీయ కక్షసాధింపు కోసమే కేటీఆర్‌పై కేసు పెట్టారు. ఈ కేసులో ఎన్నో తప్పులు కనిపిస్తున్నాయి. కార్ రేస్ నిర్వహణకు 2022 అక్టోబరు 25న ఒప్పందం జరిగింది. సీజన్ 10 నిర్వహణకు స్పాన్సర్ వెనక్కి తగ్గారు. రేస్ నిర్వహణలో ఇబ్బందుల నివారణకే ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇబ్బందులు రాకూడదనే హెచ్ఎండీఏ చెల్లింపులు చేసింది.సీజన్-9 వల్ల దాదాపు రూ.700 కోట్ల లాభం వచ్చింది. ఆర్థికశాఖ అనుమతి లేదని ఏసీబీ అధికారులు అంటున్నారు. కార్ రేసింగ్ ఒప్పందాన్ని కొత్త ప్రభుత్వం ఉల్లంఘించింది. కొత్త ప్రభుత్వం డబ్బు చెల్లించకపోవడంతో ఒప్పందం రద్దయింది. ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యానికి కారణాలు చెప్పలేదు. సుప్రీం తీర్పుల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యం తగదు. ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు ప్రాథమిక విచారణ అవసరమని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పులను ఏసీబీ అధికారులు పట్టించుకోలేదు. ప్రజాప్రతినిధిపై కేసుకు ముందు ప్రాథమిక విచారణ చేయాలి. 18న ఫిర్యాదు అందగానే.. 19న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేటీఆర్ స్పెక్యులేషన్ చేసినట్టు ఎక్కడా పేర్కొనలేదు. అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పలేదు. కానీ, అవినీతి నిరోధక చట్టం కింద కేసు పెట్టారు’’ అని కేటీఆర్ తరఫు న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు.ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు.. ఏసీబీ వాదనలనే పరిగణనలోకి తీసుకుని కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను కొట్టేసింది. -
రేవంత్ కనుసన్నల్లోనే ఏసీబీ డ్రామా: జగదీష్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్:ఎలక్టోరల్ బాండ్ల విషయం పాత చింతకాయ పచ్చడిలాగా ఉందని మాజీ మంత్రి,బీఆర్ఎస్ నేత జగదీష్‌రెడ్డి అన్నారు. సోమవారం(జనవరి6) తెలంగాణభవన్‌లో జగదీష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల బాండ్లకు ఏసీబీకి ఏం సంబంధం అని జగదీష్‌రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ కనుసన్నల్లోనే ఏసీబీ డ్రామా ఆడుతోందని విమర్శించారు.‘గ్రీన్ కో కంపెనీ దేశంలో 7,8 పార్టీలకు ఎలక్ట్రోలర్ బాండ్లు ఇచ్చింది.కేసు రూ. 55 కోట్లు ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించింది.ఇక్కడ గ్రీన్ కో కంపెనీకి ఎక్కడా లాభం జరగలేదు.ఏసీబీ కేసుకు ,గ్రీన్ కో కంపెనీకీ ఏం సంబంధం.రైతు భరోసా ఎగగ్గొట్టిన విషయం డైవర్ట్ చేయడానికే కేటీఆర్‌కు ఏసీబీ నుంచి నోటీసులు వచ్చాయన్నారు.ఈ డైవర్షన్ పాలిటిక్స్‌తో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడపలేడు.గ్రీన్ కో కంపెనీ ఎలక్ట్రో బాండ్లు చట్టం ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి.ఇందులో దాపరికాలు ఏం లేవు.రేవంత్‌రెడ్డి ఇందులో కనిపెట్టింది ఏం లేదు. కేటీఆర్‌పై కుట్ర కేసులో ప్రభుత్వానికి ప్రతిసారి షాక్ తగులుతోంది.ప్రభుత్వం బొక్క బోర్లా పడుతోంది. కేటీఆర్‌పై పనికిమాలిన చెత్త కేసు పెట్టి,చిల్లర ప్రయత్నం చేసింది ప్రభుత్వం.ప్రభుత్వం వద్దే అన్ని ఫైల్స్ ఉన్నాయి.కేటీఆర్ ఇంటిపై ఏసీబీ సోదాలు చేసి ఏవో ఫైల్స్ దొరికాయని లేనిది ఉన్నట్టు క్రియేట్ చేయాలని ఏసీబీ ప్రయత్నం చేస్తోంది.చట్టం,రాజ్యాంగం పట్ల గౌరవంతో కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. రేవంత్ కనుసన్నల్లో ఏసీబీ డ్రామా ఈ రోజు కుదరలేదు’అని జగదీష్‌రెడ్డి విమర్శించారు. ఇదీ చదవండి: ఇది రేవంత్ టీఎం చేస్తున్న దుష్ప్రచారం: కేటీఆర్ -
కేటీఆర్ ఆరోపణలపై స్పందించిన ఏసీబీ
హైదరాబాద్, సాక్షి: ఫార్ములా ఈ కార్ రేసు కేసులో తనను తన అడ్వొకేట్ల సమక్షంలోనే విచారించాలని పట్టుబట్టి.. చివరకు విచారణకు హాజరు కాకుండానే కేటీఆర్ వెనుదిరిగిన విషయం తెలిసిందే. అయితే.. వెళ్లే క్రమంలో ఆయన తన లిఖితపూర్వక స్టేట్మెంట్ను ఏసీబీ డీఎస్పీకి అందజేసి వెనుదిరిగారు. అందులో ఏముందంటే..ఏసీబీ(ACB) తనపై నమోదు చేసిన కేసులో తాను తెలంగాణ హైకోర్టు(Telangana High Court)ను ఆశ్రయించిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. అలాగే.. తనకు పంపిన నోటీసులు కేసుకు సంబంధించిన తన నుంచి సమాచారంతో పాటు సంబంధిత పత్రాలను ఏసీబీ కోరిందని పేర్కొన్నారాయన. అయితే.. అవి ఎలాంటి పత్రాలో స్పష్టత ఇవ్వలేదన్నారు... అవి ఎలాంటి పత్రాలో స్పష్టత ఇచ్చి.. తనకు కొంత సమయం ఇవ్వాలని కేటీఆర్(KTR) ఆ స్టేట్మెంట్ ద్వారా కోరారు. రాజ్యాంగం, చట్టం తనకు కల్పించిన హక్కులను వినియోగించుకుంటూనే.. కేసు దర్యాప్తునకు హాజరై సహకరిస్తానని తెలిపారారయన. అయితే హైకోర్టులో తాను వేసిన క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వ్‌లో ఉందని, తీర్పు వచ్చేదాకా తనకు గడువు ఇచ్చే అంశం పరిశీలించాలని ఏసీబీ డీఎస్పీని కేటీఆర్ కోరారు. ఏసీబీ.. నెక్ట్స్ ఏంటి?విచారణకు హాజరు కాకపోవడంతో పాటు తీవ్ర ఆరోపణలు చేసిన కేటీఆర్‌పై చర్యలకు ఏసీబీ ఉపక్రమించబోతోంది. ఆయనకు మరోసారి విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వనుందని సమాచారం. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇదే అంశాన్ని కేటీఆర్ ప్రధానంగా ప్రస్తావిస్తూ.. తనను కుట్రపూరితంగానే విచారణకు పిలిచారంటూ మండిపడ్డారు. అయితే తాము తీర్పు ఇచ్చేంత వరకు విచారణ చేసుకోవచ్చని హైకోర్టు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఏసీబీ ప్రస్తావించింది. అలాగే.. కేటీఆర్ చేసిన ఆరోపణలపైనా కోర్టులో మెమో వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక అడ్వొకేట్‌ను ఎందుకు అనుమతించలేదన్న విషయంపై ఏసీబీ అధికారులు స్పందించారు. కోర్టు ఆదేశాలు లేనందునే తాము కేటీఆర్ వెంట వచ్చిన లాయర్‌ను అనుమతించలేదని స్పష్టత ఇచ్చారు. -
‘రాజమౌళి కంటే అద్భుతంగా కథలు’.. కేటీఆర్ ఏసీబీ విచారణలో హైడ్రామా
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విచారణ సందర్భంగా హైడ్రామా నడిచింది. విచారణకు తనతో పాటు తన లాయర్‌ను ఆఫీస్‌లోకి అనుమతించకపోవడంపై కేటీఆర్ నిరసన వ్యక్తం చేశారు. అధికారుల స్పందన కోసం 40 నిమిషాల పాటు ఏసీబీ ఆఫీస్ బయట ఎదురు చూసి చివరకు అనుమతి లభించకపోవడంతో వెనుదిరిగారు. వెళ్లే క్రమంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘పోలీసులను నేను నమ్మ. లాయర్లు ఉంటేనే నాకు రక్షణ. అందుకే లాయర్‌తో వచ్చా. నా లాయర్‌తో విచారణకు హాజరవుతానంటే వీళ్లకు ఇబ్బంది ఏంటి?. అడ్వొకేట్ల సమక్షంలో విచారిస్తామంటే చెప్పమనండి.. లోపలికి వెళ్తా. పోలీసులు రాజమౌళి(దర్శకుడు) కంటే అద్భుతంగా కథలు అల్లుతున్నారు. నా స్టేట్మెంట్ను ఏఎస్పీకి రాతపూర్వకంగా ఇచ్చాను’’ అంటూ అక్కడి నుంచి నేరుగా తెలంగాణ భవన్‌కు వెళ్లిపోయారాయన. ఏసీబీ విచారణలో హైడ్రామా నడవడంతో లిఖితపూర్వక స్టేట్మెంట్ ఇచ్చి సరిపెట్టిన ఆయన.. రేపటి ఈడీ విచారణకు హాజరవుతారా? అనే ఉత్కంఠ నెలకొంది.ఇందులో తప్పేంటి?: కేటీఆర్అంతకు ముందు నందినగర్ నివాసం నుంచి బంజారాహిల్స్‌లోని ఏసీబీ ఆఫీస్‌కు తన లీగల్ టీంతో చేరుకున్నారాయన. ఆ టైంలో ఆయన లాయర్‌ను పోలీసులు లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. ఆపై మీడియాతో మాట్లాడారు.ఫార్ములా ఈ రేసుపై మంత్రిగా నిర్ణయం తీసుకున్నా. ఏసీబీ దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి. ప్రభుత్వం కావాలనే కక్షపూర్వకంగా వ్యవహరిస్తోంది. ఈ కేసులో నన్ను అసలు విచారణకు పిలవాల్సిన అవసరం లేదు. పట్నం నరేందర్ రెడ్డి విషయంలో జరిగిందే.. నా విషయంలోనూ జరిగే అవకాశం ఉంది. నరేందర్ రెడ్డి విషయంలో తప్పుడు స్టేట్మెంట్ సృష్టించారు. అలాగే నన్ను విచారణకు పిలిచి.. నా ఇంటిపై ఏసీబీతో దాడులు చేయించాలని చూస్తున్నారు. వాళ్లే నా ఇంట్లో ఏదో ఒకటి పెట్టి ఇరికించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో ఒకరకంగా నాపై తప్పుడు కేసు బనాయించాలని చూస్తున్నారు. నా లాయర్ నాతో పాటే విచారణకు వస్తే తప్పేంటి?. నా లాయర్‌ను అనుమతిస్తారంటే విచారణకు హాజరవుతా’’ అని బయటే అరగంటపైగా ఎదురు చూశారు. అయితే ఏసీబీ అంగీకరించకపోవడంతో ఆయన వెనుదిరిగారు.ఏసీబీది తప్పే: కేటీఆర్ లాయర్కేటీఆర్ వెంట తనను లోపలికి అనుమతించకపోవడంపై ఆయన లాయర్ సోమ భరత్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏసీబీ వైఖరిని తప్పుబట్టారాయన. లాయర్‌ను వెంట తీసుకెళ్లడం రాజ్యాంగబద్ధ హక్కు. చట్టాలన్నీ రాజ్యాంగానికి లోబడి ఉంటాయి. అని అన్నారాయన. నోటీసుల్లో.. కేటీఆర్‌కు ఏసీబీ పంపిన నోటీసుల కాపీ సాక్షి(Sakshi) సంపాదించింది. అందులో ఏసీబీ అధికారులు కీలక అంశాలను పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు విచారణకు హాజరుకావాలని కేటీఆర్‌కు సూచించారు. సెక్షన్ 13 (1),13(2) పీసీ యాక్ట్, ఐపీసీ సెక్షన్ 409,120B సెక్షన్స్ కింద ఆయనకు నోటీసులు జారీ చేశారు. మరోవైపు.. ఎఫ్ఐఆర్ కాపీలో ఏ1గా కేటీఆర్ పేరు ఉంది.బీఆర్ఎస్ నేతల సంఘీభావంఫార్ములా ఈ రేసు కేసులో విచారణకు హాజరవ్వడానికి ముందు.. కేటీఆర్‌ను పలువురు బీఆర్ఎస్ నేతలు కలిసి సంఘీభావం తెలిపారు. మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి. ఇతర బీఆర్ఎస్ నేతలు నందినగర్‌లోని నివాసానికి వెళ్లి మాట్లాడారు. మరోవైపు.. ముందస్తు జాగ్రత్త పేరుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్రెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు.మరోవైపు కేటీఆర్‌ను విచారించాలని.. డీజీ విజయ్‌కుమార్, డైరెక్టర్ తరుణ్ ఉదయాన్నే ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. విచారణ నేపథ్యంలో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఈ-ఫార్ములా కేసు కేటీఆర్ మెడకు చుట్టుకునేనా?
తెలంగాణ మాజీ మంత్రి, భారత రాష్ట్రసమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)పై కేసు నమోదు కావడం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఫార్ములా ఈరేసు నిర్వహణలో నిధులు దుర్వినియోగంపై పెట్టిన ఈ కేసు సమంజసమేనా? దీని ద్వారా కేటీఆర్ చిక్కుల్లో పడతారా? లేక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సెల్ఫ్ గోల్ వేసుకుంటుందా? తెలంగాణలో ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ ఉదంతం తర్వాత కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేయడం హాట్ టాపిక్ అయింది. మంత్రి హోదాలో కేటీఆర్ నిధుల దుర్వినయోగానికి పాల్పడ్డారన్నది అభియోగం. ఆ మేరకు ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసు పెట్టారు. ఇద్దరు సీనియర్ అధికారులు అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలపై కూడా కేసు నమోదైంది. కొన్ని నెలల కిందట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాంబు పేలబోతోందని ప్రకటిస్తే, రకరకాల ఊహాగానాలు సాగాయి. కేటీఆర్‌పై కేసు ఆ బాంబు అని అనుకోవాలిప్పుడు. అధికారం పోయిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం తర్వాత తీవ్రమైన ఒత్తిడికి లోనవుతోంది. కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టు అవడం పార్టీని ఇబ్బంది పెట్టింది. ఇదే టైమ్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణం వంటి వాటిపై రేవంత్ సర్కార్ విచారణ సంఘాలను వేసింది. వీటిలో కాళేశ్వరం విచారణ తీవ్రమైందనే చెప్పాలి. పలువురు ఐఎఎస్, ఇంజనీరింగ్ అధికారులు ఇప్పటికే సాక్ష్యాలు చెప్పారు. కేబినెట్ తో సంబంధం లేకుండా, డిజైన్ల ఆమోదం లేకుండా గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు బారేజీలు నిర్మించారన్నది ఆరోపణ. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో కేసీఆర్ ప్రభుత్వానికి సమస్యలు ఆరంభం అయ్యాయి. రేవంత్ ముఖ్యమంత్రి కాగానే దానిపై విచారణకు ఆదేశించి ఒక రిటైర్డ్ జడ్జిని కూడా నియమించారు. ఈ విచారణ క్రమంలో కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు కూడా విచారణకు హాజరవుతారా? లేదా? అన్న మీమాంస నెలకొంది. ఇవి ఇలా ఉండగా, తాజాగా అవుటర్ రింగ్ రోడ్డు టోల్ వసూలు కాంట్రాక్ట్ టెండర్ల వ్యవహారంపై కూడా రేవంత్ విచారణకు సిట్ ను నియమించారు.ఇప్పటికే ఫోన్ టాపింగ్ కేసులో కొందరు అధికారులు అరెస్టు అయ్యారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ లను ఏదో కేసులో ఇబ్బంది పెడతారని అంతా ఊహించిందే. నిజంగా వాటిలో తప్పులు జరిగి ఉంటే వారు కేసులు ఎదుర్కోక తప్పదు. కానీ కావాలని వేధించేందుకు కేసులు పెడుతున్నారని, తాము ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఇలాంటి కక్ష సాధింపులకు దిగుతోందని జనం భావిస్తే అది కాంగ్రెస్‌కు చేటు. ఇంతకుముందు లగచర్ల దాడి కేసులో కూడా కేటీఆర్ పేరును ఇరికించాలని ప్రభుత్వం చూసింది. కేసీఆర్ శాసనసభకు రాకపోయినా, కేటీఆర్, హరీష్ రావులు సభలో కాని, బయట కాని గట్టిగానే పోరాడుతున్నారు. వారిని వీక్ చేయడానికి సహజంగానే కాంగ్రెస్ ప్రయత్నాలు ఉంటాయని. ఇది సహజం. కేటీఆర్‌పై పెట్టిన కేసు డైవర్షన్ రాజకీయాలలో భాగమేనని బీఆర్ఎస్ విమర్శిస్తుండగా, ప్రజాధనం దుర్వినియోగమైతే చూస్తూ ఊరుకోవాలా అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఏసీబీ తనపై కేసు పెట్టగానే కేటీఆర్ మీడియా సమావేశం పెట్టి పలు విషయాలు వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఒక కేసు వస్తే, అందులో తనదే బాధ్యత అని ఎవరూ ధైర్యంగా చెప్పడం జరగలేదు. కాని కేటీఆర్ పూర్తిగా బాధ్యత తీసుకుని కేవలం హైదరాబాద్ ప్రతిష్ట పెంచడానికి, పెట్టుబడులు ఆకర్షించడానికి చేసిన ప్రయత్నంలో ఈ ఫార్ములా రేస్ సంస్థకు డబ్బులు చెల్లించామని స్పష్టంగా తెలిపారు. ఈ డబ్బుల చెల్లింపులో నిబంధనల ఉల్లంఘన జరిగిందని, కేబినెట్ ఆమోదం లేకుండా రూ.55 కోట్లు చెల్లించారని, అది కూడా ఆర్బీఐ అనుమతులు తీసుకోకుండా, విదేశీ మారక ద్రవ్యాన్ని చెల్లించారని రాష్ట్రానికి రూ. ఎనిమిది కోట్ల జరిమానా విధించిందని కాంగ్రెస్ చెబుతోంది. హైదరాబాద్ మెట్రో అభివృద్ది సంస్థ కు స్వతంత్రంగా నిధులు వినియోగించే స్వేచ్ఛ ఉంటుందని, అందులో ఇలాంటి క్రీడల ఏర్పాట్లకు నిధులు వెచ్చిండానికి ఆ సంస్థకు పవర్ ఉందని కేటీఆర్ చెబుతున్నారు. అసలు ఈ ఫార్ములా రేసింగ్ సంస్థకు మొత్తం డబ్బు చెల్లిస్తే అందులో అవినీతి ఏమి ఉంటుందని అంటున్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చకు సిద్దమని ఆయన సవాల్ విసిరారు. సభలో చర్చ జరగలేదు కాని, రేవంత్ మాత్రం దీని గురించి ప్రభుత్వ వాదనను వివరించారు. ఈ ఫార్ములా సంస్థ కో ఫౌండర్ ఒకసారి రేవంత్ ను కలిసివెళ్లిన విషయాన్ని కేటీఆర్ బయటపెట్టారు. దీనికి రేవంత్ బదులు ఇస్తూ, ఆ సంస్థ వారే కేటీఆర్‌తో రహస్య అవగాహన ఉందని తనకు చెప్పారని, ఈ స్కామ్ రూ.55 కోట్లు కాదని, రూ.600 కోట్లు అని సంచలనాత్మకంగా వెల్లడించారు. కాగా తదుపరి వాయిదా మొత్తం చెల్లించనందుకు గాను ప్రభుత్వానికి ఈ ఫార్ములా సంస్థ నోటీసు ఇచ్చిందని కేటీఆర్ అంటున్నారు. అంతేకాక తమతో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్నందుకు గాను ఆర్బిట్రేషన్ నిమిత్తం సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వేని ఆ సంస్థ నియమించుకుందని చెప్పారు. హైదరాబాద్ ఈ ఫార్ములా రేస్ నిర్వహించడం ద్వారా ప్రపంచం దృష్టిని తెలంగాణ ఆకర్షించిందని, సుమారు రూ.700 కోట్ల పెట్టుబడులు రావడానికి, మరికొంతమంది పారిశ్రామికవేత్తలు ముందుకు రావడానికి దోహద పడిందన్నది ఆయన వాదన. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం హైదరాబాద్ ఇమేజీని డామేజి చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. గతంలో చంద్రబాబు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఫార్ములా ఒన్ రేస్ నిర్వహించడానికి ప్రయత్నాలు జరిగాయి కాని సఫలం కాలేదని ఆయన గుర్తు చేశారు. కాని తాము తీసుకు వచ్చి దేశానికి, తెలంగాణకు గుర్తింపు తెచ్చామని, దీనికి సంతోషించవలసింది పోయి కేసు పెడతారా అని మండిపడ్డారు. ఈ మొత్తం విషయాన్ని పరిశీలించిన తర్వాత, కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడిన సంగతులు విన్నాక కేటీఆర్ పెద్ద తప్పు చేయలేదేమో అనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా తప్పు జరిగి ఉంటే అది ప్రొసీజరల్ లోపాలు కావచ్చు అన్న భావన కలుగుతుంది. మరి దీనికి గవర్నర్ అనుమతి కూడా ఉంది కదా అని ప్రభుత్వం చెప్పవచ్చు. గవర్నర్‌కు అన్ని వివరాలు ఇవ్వకుండా తప్పుదారి పట్టించారని కేటీఆర్ ఆరోపణ. హెచ్ఎండీఏ నిధులు జాతీయ బ్యాంకు అయిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో ఉన్నాయి. కేటీఆర్ ఆదేశాల మేరకే మున్సిపల్ శాఖ కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ ఆ నిధులను ఈ ఫార్ములా సంస్థకు పంపించే ఏర్పాట్లు చేశారు. దీనికి కేబినెట్ ఆమోదం తీసుకోకపోవడానికి కారణం అప్పట్లో ఎన్నికల హడావుడి, ఎన్నికల కోడ్ ఉండడమని చెబుతున్నారు. ఈ ఫార్ములా రేసింగ్ జరిగింది వాస్తవం, ఆ సంస్థకు డబ్బు చెల్లించింది నిజం. కాకపోతే ఆర్బీఐ అనుమతి ఎందుకు తీసుకోలేదన్నది సందేహం. దానిపై బ్యాంకు అధికారులు కాని, ప్రభుత్వ అదికారులు కాని వివరణ ఇవ్వవలసి ఉంటుంది. అయినా కేటీఆర్ సంబంధిత ఫైల్ ను సీఎం ఆమోదానికి పంపి ఉంటే ఈ గొడవ ఉండేది కాదేమో! కాని ఆ రోజుల్లో ఆయన తిరుగులేని అధికారాన్ని ఎంజాయ్ చేసేవారు.మళ్లీ గెలుస్తామన్న ధీమాతో ఈ డబ్బు మంజూరు చేయించారు. కాని కథ మారింది. బీఆర్ఎస్ ఓటమిపాలు కావడంతో ఇప్పుడు ఇది మెడకు చుట్టుకుంది. అయినా కేటీఆర్‌కు ఈ సందర్భంలో పెద్ద రోల్ ఉండకపోవచ్చు. విధాన పరమైన నిర్ణయం చేశారు.అలా చేయవచ్చా? లేదా? అన్నది ఒక కోణం. ఒకవేళ అది తప్పని తేలితే కేటీఆర్ కూడా ఇబ్బంది పడతారు. ఈ కేసు నమోదైన వెంటనే ఈడీ కూడా రంగంలో దిగడం కేటీఆర్‌కు కాస్త ఆందోళన కలిగించే అంశమే. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించి పది రోజులపాటు అరెస్టు కాకుండా రక్షణ పొందారు. ఏపీలో 201419 టరమ్ లో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో స్కామ్ జరిగింది. దానిని తొలుత ఈడీ గుర్తించింది. తదుపరి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వంలో సిఐడి అన్ని ఆధారాలు సేకరించి ఆ స్కామ్ డబ్బు షెల్ కంపెనీలకు ఎలా వెళ్లింది.. చివరికి టిడిపి ఆఫీస్ ఖాతాలోకి కూడా చేరింది వివరిస్తూ కేసు పెట్టారు. ఆ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లవలసి వచ్చింది. అయినా చంద్రబాబు తాను తప్పు చేయలేదని వాదించారు. అంతేకాక ఆయనకు మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా ఈ విషయాలన్నిటిని పక్కనబెట్టి జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని ప్రచారం చేసింది. కేటీఆర్ కేసులో డబ్బు మనీ లాండరింగ్ అయినట్లు కనిపించడం లేదు. అయినా ఈడీ రంగంలోకి రావడం తో ఏమైనా అలాంటి నేరం జరిగిందా అన్న డౌటు వస్తుంది. ఈ కేసులో కేటీఆర్ అవినీతి చేశారని రుజువు చేయడం ఎంతవరకు సాధ్యపడుతుందో చూడాలి. ఇంకో సంగతి కూడా చెప్పాలి. చంద్రబాబు 2004 కి ముందు ఆపధ్దర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేబినెట్‌తో సంబంధం లేకుండా ఐఎమ్ జి భరత్ అనే సంస్థకు హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన సుమారు 800 ఎకరాల భూమిని స్టేడియంల నిర్మాణానికి కేటాయించడం వివాదం అయింది. ఆ తర్వాత వచ్చిన వైఎస్ ఆర్ ప్రభుత్వం దానిని రద్దు చేసింది. అయినా ఆ వ్యవహారం కోర్టుకు వెళ్లింది. ఇప్పటికీ ఆ కేసు పరిష్కారం కాలేదు. అలాంటప్పుడు కేటీఆర్ ను ఈ కేసు ఇబ్బంది పెడుతుందా అన్నది డౌటు. ఒకవేళ హైకోర్టు స్టే తొలగిపోయి కేటీఆర్‌ను అరెస్టు చేసినా, కొద్ది రోజులపాటు జైలులో ఉండాల్సి రావచ్చు తప్ప పెద్దగా జరిగేదేమి ఉండకపోవచ్చు. ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ గట్టెక్కుతారా? లేదా అన్నది ఒక పాయింట్ అయితే రేవంత్ ప్రభుత్వం తనది పై చేయిగా రుజువు చేసుకుంటుందా? లేక సెల్ఫ్ గోల్ వేసుకుంటుందా అన్నది మరో అంశం. కేటీఆర్ తప్పు చేసినట్లు రుజువు చేసి శిక్షపడేలా చేయగలిగితే అప్పుడు కాంగ్రెస్ కు ఏదైనా ప్రయోజనం చేకూరవచ్చు. అంతవరకు కేటీఆర్‌కు, బీఆర్ఎస్కూ సానుభూతే రావచ్చన్నది ఎక్కువ మంది విశ్లేషణగా ఉందని చెప్పాలి. ఏది ఏమైనా ఈ కేసుల వివాదాలు ఎలా ఉన్నా, ఈ పరిణామాలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీకి కొంత నష్టం చేస్తున్నాయన్నది వాస్తవం.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఫార్ములా కారు కేసులో ఈడీ, ఏసీబీ దూకుడు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేస్ రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ కోర్టును ఆశ్రయించడం కేసు తీవ్రతను మరింత పెంచింది.మరోవైపు.. ఈకేసులోకి ఈడీ ఎంటర్ కావడం ఆసక్తికరంగా మారింది. ఫార్ములా ఈ-కార్ రేసింగ్‌పై ఈడీ ఈసీఐర్ నమోదు చేసింది. ఇందులో భాగంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద సెక్షన్లు నమోదు చేసింది. ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ అధికారులు.. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు కేసుల వివరాల కోసం ఏసీబీకి ఈడీ లేఖ రాసింది.ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. నేడు ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్ స్టేట్మెంట్ను ఏసీబీ అధికారులు రికార్డు చేయనున్నారు. హెచ్ఎండీఏ, ఏంఏయూడీలోని మరి కొంత మందిని ఏసీబీ అధికారులు విచారించనున్నారు. ఇదే సమయంలో ఫార్ములా ఈ-కారు రేసుకు సంబంధించిన ప్రతీ డాక్యుమెంట్‌ను ఏసీబీ అధికారులు పరిశీలించనున్నారు. ఎఫ్ఈవో నుంచి వచ్చిన ఈ-మెయిల్స్, ఎల్ఎఫ్ఏతో పాటు లావాదేవీల వివరాలు కూడా ఏసీబీ పరిశీలించనుంది. ఈ క్రమంలోనే నిందితులను ఏసీబీ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. -
ఏఈఈ నిఖేష్ అక్రమార్జనపై ఏసీబీ ఫోకస్.. బినామీగా వ్యవహరించాడా?
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖకు చెందిన ఏఈఈ నిఖేష్ కుమార్‌ను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిఖేష్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడంతో ఆయన ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు. కస్టడీలో భాగంగా నాలుగు రోజుల పాటు ఆయనను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. విచారణ కోసం గురువారం నిఖేష్‌ను ఏసీబీ కార్యాలయానికి తరలించారు.నిఖేశ్ కుమార్ భారీ అక్రమార్జనపై కూపీలాగే పనిలో ఏసీబీ అధికారులు నిమగ్నమయ్యారు. అయితే, అతను మరెవరికైనా బినామీగా వ్యవహరించాడా? అనే విషయాన్నీ తేల్చే ప్రయత్నంలో ఉన్నారు. వాస్తవానికి పదేళ్ల క్రితమే నిఖేష్ కుమార్ ఉద్యోగంలో చేరినా గండిపేట ఏఈఈగా పోస్టింగ్ వచ్చాకే అతడి అక్రమార్జన ప్రారంభమైనట్లు తెలుస్తోంది. కీలకమైన ఇబ్రహీంపట్నం, మేడ్చల్, గండిపేట ఏఈఈగా పోస్టింగ్ దక్కడంతో వసూళ్లే ధ్యేయంగా పనిచేసినట్లు సమాచారం.ఇదిలా ఉండగా.. నిఖేష్ కుమార్ అక్రమ దందా వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అధికారుల ప్రాథమిక విచారణలో రోజుకు తక్కువలో తక్కువ రూ.2 లక్షలకుపైగా సంపాదించినట్లు గుర్తించారు. ఉద్యోగంలో చేరిన కొద్దిరోజుల్లోనే అక్రమార్జనకు అలవాటు పడిన నిఖేశ్ కుమార్‌తోపాటు సన్నిహితుల ఇళ్లపై ఏసీబీ బృందాలు చేసిన దాడిలో బహిరంగ మార్కెట్లో రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించారు. రూ.17.73 కోట్ల అక్రమాస్తులు, ఒక లాకర్లోనే కిలోన్నర బంగారు ఆభరణాలు. వీటన్నింటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.100 కోట్లపైమాటే. వీటన్నింటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన స్నేహితుడి బ్యాంకు లాకర్లో ఉన్న డబ్బులను కూడా అధికారులు తీసుకున్నారు.నీటి పారుదల శాఖలో 2013లో చేరిన నిఖేష్‌కుమార్ మొదట వరంగల్ జిల్లాలో పనిచేసి తర్వాత వికారాబాద్ జిల్లాకు బదిలీ అయ్యాడు. మూడేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లాకు వచ్చాక నాలాలు, జలాశయాల పరిధిలో ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో అక్రమ నిర్మాణాలకు నిరభ్యంతర పత్రాలు జారీ చేయడం ద్వారా అక్రమార్జనకు పాల్పడ్డాడు. దరఖాస్తులను ఫార్వర్డ్ చేసేందుకు, వాటిని క్లియర్ చేయించేందుకు భారీగా వసూళ్లు చేసి ఉన్నతాధికారుల తరపున వాటాలనూ సేకరించి, ముట్టజెప్పినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ఉన్నతాధికారుల పాత్రపైనా ఏసీబీ ఆరా తీస్తుండటం ప్రాధాన్యం సంతరించుకొంది. -
‘కట్టలు’ తెగిన అవినీతి
సాక్షి, హైదరాబాద్: అవినీతి పుట్టలు బద్ధలవుతున్నాయి. ‘కట్టల’పాములు బయటికొస్తున్నాయి. అవినీతి నిరోధక విభాగం చేపడుతున్న వరుస తనిఖీలు, ఆకస్మిక ‘ఆపరేషన్లు’సత్ఫలితాలనిస్తున్నాయి. గతానికి భిన్నంగా ఇటీవలి కాలంలో పక్కా స్కెచ్‌తో రంగంలోకి దిగుతున్న ఏసీబీ అధికారులకు అనేక అవినీతి తిమింగలాలు చిక్కుతున్నాయి. ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కింది స్థాయి అధికారులకు పూర్తి స్వేచ్ఛ లభించింది.దీంతో వారు దూకుడు పెంచారు. అవినీతి అధికారుల భరతం పడుతున్నారు. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, విద్యుత్, ఆర్టీఏ.. ఇలా ఏ శాఖనూ వదలకుండా ముమ్మర దాడులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే 105 కేసులు నమోదు చేశారు. గతంలో బాధితులు చేసే ఫిర్యాదులు, వారందించే సమాచారం ఆధారంగా అవినీతి అధికారులను ట్రాప్ చేసేవారు. ఎక్కువగా ఆదాయానికి మించి ఆస్తుల కేసుల నమోదుకే పరిమితం అయ్యేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మార్చిన ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్పడి.. ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంట్ను ఎంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు.అందుబాటులో ఉన్న టెక్నాలజీని వాడుకుంటూ క్షేత్ర స్థాయిలో అవినీతి అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా ‘ఆపరేషన్లు’పూర్తి చేస్తున్నాయి. ఏసీబీ డీజీ సీవీ ఆనంద్‌కు విజిలెన్స్ శాఖను సైతం అప్పగించడంతో.. ఏసీబీ తనిఖీలతో పాటు విజిలెన్స్ సోదాలూ తీవ్రమయ్యాయి. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హెచ్ఎండీఏ టౌన్‌ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ రూ.వందల కోట్ల అవినీతి, గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి తదితర కేసులు వెలుగులోకి వచ్చాయి.ఏసీబీ ఇటీవల నమోదు చేసిన ప్రధాన కేసులు కొన్ని.. జనవరి 2024: హెచ్ఎండీఏ టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసు సంచలనం సృష్టించింది. ఏసీబీ అధికారులు రూ.వందల కోట్ల అవినీతి సొమ్మును వెలికి తీయడంతో పాటు పలువురిని అరెస్టు చేశారు. ఫిబ్రవరి 2024: గిరిజన సంక్షేమ శాఖ ఇన్చార్జి సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజినీర్ జగజ్యోతి ఈ ఏడాది ఫిబ్రవరి 19న రూ. 84 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఆ అధికారి ఇంట్లో జరిపిన సోదాల్లో రూ.65 లక్షల నగదు, రెండున్నర కిలోల బంగారం దొరికింది.మార్చి 2024: మార్చిలో మహబూబాబాద్ సబ్ రిజి్రస్టార్ తస్లీమా రూ.19 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.మే 2024: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్రావు ఇల్లు, బంధువుల ఇళ్లలో చేసిన సోదాల్లో రూ.కోట్ల ఆస్తులతో పాటు, బినామీల ఆస్తులకు సంబంధించిన పత్రాలు లభించాయి.ఆగస్టు 2024: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ ఇంట్లో చేసిన తనిఖీల్లో రూ.2.93 కోట్ల నగదు సహా రూ. 6 కోట్లకు పైగా ఆస్తులు ఏసీబీ గుర్తించింది.డిసెంబర్ 2023: గతేడాది డిసెంబర్లో వెలుగులోకి వచ్చిన గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించిన కుంభకోణంలో ఇప్పటివరకు రూ.700 కోట్ల అవినీతిని అధికారులు గుర్తించారు. మాజీ మంత్రి ఓఎస్డీ కల్యాణ్, పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ రాంచందర్ నాయక్ సహా పలువురిని అరెస్టు చేశారు.ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తప్పించుకోలేరు: ఏసీబీ డీజీ ‘లంచం తీసుకునేవారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏసీబీ అధికారుల నుంచి తప్పించుకోలేరు..’అని ‘ఎక్స్’లో చేసిన ఓ పోస్టులో ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. సోమవారం రాత్రి రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ఎంవీ భూపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మదన్‌మోహన్‌రెడ్డి రూ.8 లక్షలు లంచం తీసుకుంటూ అధికారులకు చిక్కారని తెలిపారు. -
మురికి కూపం.. పురుగుల బియ్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు సంక్షేమ హాస్టళ్లు దారుణమైన పరిస్థితుల్లో కొనసాగుతున్నాయి. విద్యార్థుల ఆరోగ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. వారికి మంచి అల్పాహారం కాని, భోజనం కాని అందడం లేదు. నాసిరకం కందిపప్పు, కూరగాయలు, పురుగులు పట్టిన బియ్యంతో వండిన ఆహార పదార్థాలనే వడ్డిస్తున్నారు. మెనూ పాటించడం లేదు. రోజూ ఇవ్వాల్సిన అరటిపండ్లు, గుడ్లు లాంటివి ఇవ్వడం లేదు. వసతి గృహాల్లో పారిశుధ్యం ఆనవాళ్లే లేవు. మరుగుదొడ్లు, స్నానాల గదులతో పాటు వంటశాలల్లోనూ అపరిశుభ్ర వాతావరణం కొనసాగుతోంది. కొన్నిచోట్ల విద్యార్థులతోనే గదులు, ఆవరణ శుభ్రం చేయిస్తున్నారు. విద్యార్థులకు సంబంధించిన రికార్డుల నిర్వహణ సరిగ్గా లేదు. మొత్తం విద్యార్థుల సంఖ్యకు, హాజరు పట్టీలో నమోదు చేసిన సంఖ్యకు, వాస్తవంగా తర గతి గదిలో ఉన్నవారి సంఖ్యకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. కొన్నిచోట్ల వార్డెన్లు అందుబాటులో లేరు. వారు ఇష్టారాజ్యంగా వచ్చి వెళుతున్నారు. మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఈ విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఎవరికి వారు అందినంత దండుకునే వ్యవహారంగానే హాస్టళ్ల పనితీరు ఉన్న ట్లు ఈ సోదాల్లో బయటపడింది. డీజీ సీవీ ఆనంద్ ఆదేశాలతో ఏసీబీ అధికారులు, స్థానిక తూనికలు, కొలతల అధికారులు, శానిటరీ, ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ఆడిటర్లతో కూడిన 10 బృందాలు.. రాష్ట్రంలోని 10 సంక్షేమ హాస్టళ్లలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించాయి. అత్యంత అధ్వాన పరిస్థితుల మధ్య విద్యార్థులు కాలం వెల్లదీస్తున్నట్టు గుర్తించాయి. ఈ సందర్భంగా అధికారులు విద్యార్థులతో మాట్లాడారు. ఈ సోదాలపై ఏసీబీ ఒక ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్ జాంబాగ్‌లోని ఎస్సీ బాలుర హాస్టల్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లిలోని బీసీ బాలుర హాస్టల్, మహబూబ్‌నగర్ జిల్లా కోయల్కొండలోని బీసీ బాలుర వసతిగృహం, నల్లగొండ జిల్లా తిప్పర్తి ఎస్సీ బాలికల వసతి గృహం, మంచిర్యాల జిల్లా వెమ్మనపల్లిలోని ఎస్టీ బాలుర హాస్టల్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇప్పలపల్లిలోని ఎస్సీ బాలుర హాస్టల్, జనగామలోని ఎస్సీ బాలికల హాస్టల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కారేపల్లి మండలంలోని ఎస్టీ బాలుర హాస్టల్, సిద్దిపేటలోని బీసీ బాలుర వసతిగృహం, నిజామాబాద్ కొత్తగల్లీలోని ఎస్సీ బాలికల హాస్టల్లో తనిఖీలు జరిగాయి. మెనూకు చెల్లు చీటీ.. ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం గాందీనగర్ గిరిజన జూనియర్ కళాశాల, గురుకుల విద్యాలయం నిర్వహణ అస్తవ్యస్థంగా ఉంది. మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. ప్రహరీగోడ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. తరగతి గదులు, వంటశాలలు అపరిశుభ్రంగా ఉన్నాయి. మెనూ కూడా పాటించడం లేదు. మంగళవారం ఇద్దరు ఉపాధ్యాయులు విధులకు హాజరుకాలేదు. నాణ్యత లేని భోజనం.. నల్లగొండ జిల్లా తిప్పర్తి ఎస్సీ బాలికల హాస్టల్ మొత్తం అపరిశుభ్ర వాతావరణంలోనే ఉంది. మరుగుదొడ్లే కాదు.. వంట గది పరిస్థితీ దారుణంగా ఉంది. నాణ్యత లేని టిఫిన్, భోజనం పెడుతున్నారు. తాగునీరు కూడా బాగా లేదు. వసతి గృహంలో 52 మంది విద్యార్థులు ఉండాల్సి ఉండగా 23 మందే ఉన్నారు. రికార్డులు సక్రమంగా నిర్వహించడం లేదు. ఖర్చుల వివరాల్లేవు.. సిద్దిపేట పట్టణంలోని బీసీ విద్యార్థుల వసతి గృహంలో రిజిస్టర్ల నిర్వహణ సరిగా లేదు. విద్యార్థుల హాజరుకు సంబంధించిన పూర్తి వివరాలు లేవు. విద్యార్థులు గైర్హాజరు అయితే కేవలం చుక్క మాత్రమే పెడుతున్నారు. జూన్, జూలై నెలలకు సంబంధించిన ఖర్చు, తదితర వివరాలను రికార్డుల్లో పొందుపరచలేదు. రేకుల షెడ్డులో కిచెన్.. సిరిసిల్ల మున్సిపల్ పరిధి ఇప్పలపల్లి గ్రామ శివారులో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకులం కిచెన్ తాత్కాలిక రేకుల షెడ్డులో నిర్వహిస్తున్నారు. విద్యాలయం పరిసరాలు పరిశుభ్రంగా లేవు. మౌలిక సదుపాయాల లోపం కూడా ఉంది. ఆహార పదార్థాలు సీజ్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లీ ఎస్సీ హాస్టల్లో విద్యార్థులకు పెట్టే భోజనం సక్రమంగా లేదు. మంగళవారం తనిఖీల సందర్భంగా నాణ్యత లోపించిన ఆహార పదార్థాలను సీజ్ చేసి, ల్యాబ్‌కు తరలించారు. మూత్రశాలల నిర్వహణ సరిగా లేదు. కోడిగుడ్లు, అరటిపండ్లకు ఎగనామం జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ ఎస్సీ బాలికల ప్రీ, పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో తనిఖీల సమయంలో వార్డెన్ కవిత విధుల్లో లేరు. వసతి గృహంలో రికార్డుల పరంగా 110 మంది విద్యార్థులుంటే 73 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. తనిఖీల సమయంలో 60 మంది మాత్రమే ఉన్నారు. మెనూ ప్రకారం కోడిగుడ్లు, అరటిపండ్లు ఇవ్వడం లేదు. భోజనంలో నాణ్యత లోపించింది. టాయిలెట్లు, మరుగుదొడ్లు కంపు కొడుతున్నాయి. విద్యార్థుల హెల్త్ చెకప్‌కు సంబంధించిన ప్రొఫైల్ కార్డులు నిర్వహించడం లేదు. త్వరలో ప్రభుత్వానికి వేర్వేరు నివేదికలు! అధికారుల తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన మరికొన్ని కీలక అంశాలు పరిశీలిస్తే..విద్యార్థుల గదులకు సరైన గాలి, వెలుతురు రావడం లేదు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఆహార పదార్థాల పట్టిక పాటించడం లేదు. బాలికల హాస్టళ్లల్లో బాత్రూంల పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉంది. మొత్తం 18 రకాల రికార్డులు అధికారులు నిర్వహించాల్సి ఉంటుంది. అయినా ఏ ఒక్కటీ సరిగా పాటించడం లేదు. వార్డెన్లు హాస్టళ్లలోనే ఉండాలి. కానీ వారానికి ఒకరోజు లేదంటే నెలకు ఒకరోజు వచ్చి, పోతున్నారు. రిజిస్టర్లలో రాసిన దానికి అందుబాటులో ఉన్న సరుకుల పరిమాణానికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. ఎక్కువ హాస్టళ్లలో కాలం చెల్లిన ఆహారపదార్థాలను వాడుతున్నారు. ఈ అంశాలతో పాటు ప్రభుత్వ నిధుల దురి్వనియోగంపై, హాస్టళ్ల సిబ్బందిపై తీసుకోవాల్సిన చర్యలు, హాస్టళ్లలోని ప్రస్తుత పరిస్థితులను మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వేర్వేరుగా త్వరలో ప్రభుత్వానికి నివేదికలు సమరి్పంచనున్నట్టు ఏసీబీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
ఒకే రోజు 350 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో కళ్లు బైర్లు కమ్మే అక్రమాలు వెలుగు చూశాయి. ఇటీవల బదిలీపై వెళ్లిన ఓ సబ్ రిజిస్ట్రార్ వెళుతూ.. వెళుతూ పెద్ద ఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఏసీబీ అధికారుల దృష్టికి వచ్చింది. ఒకే రోజు ఏకంగా సుమారు 350 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసినట్లు తేలింది. ఒక్కరోజే ఈ స్థాయిలో డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేయడంతో అనుమానం వచ్చిన ఏసీబీ అధికారులు గురువారం సాయంత్రం ఈ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన విషయం విదితమే.తనిఖీలు రాత్రంతా జరిగాయి. శుక్రవారం ఉదయం ఏడు గంటల వరకు అధికారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్లు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీలు చేస్తున్న సమయంలో కార్యాలయంలోని ఓ అధికారి రూ.96 వేల నగదును కార్యాలయం కిటికీలోంచి బయటకు విసిరేయడం కలకలం సృష్టించింది. ఈ క్రమంలో ఏసీబీ.. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా ఉన్న 64 డాక్యుమెంట్లను ఏసీబీ సీజ్ చేసింది. ఈ డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు.ప్రభుత్వ భూములకు రిజిస్ట్రేషన్లు..!ఏసీబీ అదుపులోకి తీసుకున్న అధికారులిద్దరూ ప్రభుత్వ భూములకు రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. పటాన్చెరు ప్రాంతంలో రూ.వందల కోట్లు విలువ చేసే భూములను ఈ అధికారులు రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం. జిల్లా ఏసీబీ అధికారులకు తెలియకుండా..ఈ తనిఖీలు నిర్వహించేందుకు హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయం నుంచి ఏసీబీ అధికారులు రావడం గమనార్హం. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఏసీబీ డీఎస్పీ కార్యాలయం ఉంటుంది. అయితే ఈ కార్యాలయం అధికారులకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా నేరుగా రాష్ట్ర కార్యాలయంలోని సీఐయూ విభాగం అధికారులు తనిఖీలు చేపట్టారు. -
హైదరాబాద్ జోన్: పోలీసుల్లో ఏసీబీ దాడుల టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పోలీసు వర్గాల్లో ఏసీబీ దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ జోన్ పరిధిలో రెండు నెలల కాలంలోనే ఏసీబీ దాడుల్లో పదుల సంఖ్యలో ఏసీబీ కేసులు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నడూ లేనంతగా పోలీసు అధికారులు ఏసీబీకి చిక్కుతున్నారు.వివరాల ప్రకారం.. హైదరాబాద్ జోన్ పరిధిలో ఏసీబీ దాడుల్లో పోలీసులు వరుసగా పట్టుబడుతున్నారు. భూ వివాదాల సెటిల్మెంట్, ఫైనాన్స్ కేసుల వ్యవహారాల్లో లంచాలు తీసుకుంటూ ఓ అధికారి అరెస్ట్ అయ్యాడు. అలాగే, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర రావు ఏసీబీ చిక్కారు. సీసీఎస్ సుధాకర్ గౌడ్ లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.ఇక, కుషాయిగూడలో మూడు లక్షలు లంచం తీసుకుంటూ సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరస్వామి, సబ్ ఇన్స్పెక్టర్ షఫీ, మధ్యవర్తి ఉపేందర్‌లు పట్టుబడ్డారు.తాజాగా సూరారం ఎస్ఐ ఆకుల వెంకటేశం లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు తీరు చర్చనీయాంశంగా మారింది. -
గొర్రెల స్కాంపై ఈడీ స్పీడ్.. పశుసంవర్ధక శాఖకు అధికారులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గొర్రెల పంపిణీ స్కామ్ చర్చనీయాంశంగా మారింది. ఈ స్కామ్ విచారణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచింది. ఇందులో భాగంగానే శుక్రవారం ఉదయం ఈడీ అధికారులు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యాలయం చేరుకున్నారు.కాగా, గొర్రెల పంపిణీ గురించి ఈడీ అధికారులు ఇప్పటికే పశుసంవర్థక శాఖకు లేఖ రాసిన విషయం తెలిసిందే. సదరు లేఖలో 10 అంశాలకు సంబంధించి వివరాలు ఇవ్వాలని కోరారు. ఇక, గొర్రెల పంపిణీ స్కామ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా స్కామ్‌కు సంబంధించిన వివరాలను ఈడీ కోరింది.అయితే, రాష్ట్రవ్యాప్తంగా గొర్రెల పంపిణీలో రూ.1000 కోట్ల అక్రమాలు జరిగినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇక, ఈ స్కాంకు సంబంధించి ఇప్పటికే ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, గొర్రెల పంపిణీలో భాగంగా మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తు చేయనుంది. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు.. తదితర సమాచారం ఇవ్వాలని ఈడీ కోరింది.గొర్రెల కొనుగోళ్ల కోసం సమాఖ్య నుంచి ఏయే జిల్లాల అధికారుల ఖాతాల్లో నిధులు జమ చేశారో వారి వివరాలు, ఆయా బ్యాంకు ఖాతాల సమాచారం, లబ్ధిదారుల వాటాగా జమ చేసిన నిధులు, ఏయే ఖాతాల్లో జమ అయ్యాయి? గొర్రెల రవాణా ఏజెన్సీల సమాచారం, వాటికి జరిగిన చెల్లింపుల వివరాలు, గొర్రెలకు కొనుగోలు చేసిన దాణా, దాన్ని ఏయే లబ్ధిదారులకు పంపించారు? దీని కోసం ఎవరికి నిధులిచ్చారు.. ఇలా సమగ్ర వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది. -
ఏసీపీ ఉమామహేశ్వరరావు కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. అంతకు ముందు ఏసీబీ కార్యాలయంలో ఆయనను విచారించిన అధికారులు.. ట్యాబ్‌లో ఉన్న ఆస్తి వివరాలపై ఆరా తీశారు. బీనామీ ఆస్తులపై కూపీలాగుతున్నారు. సందీప్ అనే వ్యక్తి ఎవరు? అతనితో ఉన్న లావాదేవీలు ఏంటి? అనే కోణంలో విచారణ చేపట్టారు. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న ఆస్తులు డాక్యుమెంట్స్ వివరాలను ఏసీబీ అధికారులు కోర్టుకు అందించారు. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం మూడు కోట్ల ఆస్తులను ఏసీబీ గుర్తించింది.ఆస్తి విలువ అనధికారికంగా బహిరంగ మార్కెట్లో రూ. 50 కోట్ల వరకు ఉంటుందని అంచనా. పలుమార్లు సస్పెండయినా కానీ కీలక పోస్టింగ్‌లు దక్కించుకోవటంపై ఏసీబీ ఆరా తీస్తోంది. ఉమామహేశ్వరరావు వెనక ఉన్న అధికారుల అవినీతిపై ఏసీబీ విచారణ చేస్తోంది. కాగా, ఏసీబీ విచారణకు ఉమా మహేశ్వర రావు ఏమాత్రం సహకరించడం లేదని సమాచారం. ఉమామహేశ్వరరావు ఫిర్యాదుదారులనే బెదిరించి వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. ల్యాప్ టాప్‌లో దొరికిన సమాచారం ఆధారంగా ఏసీబీ విచారణ చేపట్టింది. కొందరు పోలీస్ అధికారులతో కలిసి బినామీ వ్యాపారాలు చేసినట్టు ఏసీబీ గుర్తించింది.ఉమామహేశ్వరరావుకు జ్యూడీషియల్ రిమాండ్ఉమామహేశ్వరరావుకు నాంపల్లి ఏసీబీ కోర్టు 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. జూన్ 5 వరకు రిమాండ్ విధించింది. ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. -
ఉమా మహేశ్వర ‘అక్రమ’రూపస్య
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో (సీసీఎస్) ఏసీపీగా పని చేస్తున్న టీఎస్ ఉమామహేశ్వరరావును ఏసీబీ అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. న్యాయం కోసం వెళ్లిన వారిని ఆయన తీవ్ర ఇబ్బందులకు గురిచేసినట్టు అధికారులు గుర్తించారు.ఇక, ఏసీపీ ఉమా మహేశ్వరరావు వ్యవహారశైలిపై కూడా గతంలోనే ఫిర్యాదులు వచ్చాయి. అతనిపై ఇప్పటికే మూడుసార్లు సస్పెన్షన్ వేటుగా పడింది. అయినా కూడా ఆయన తన తీరు మార్చుకోలేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చి లక్షల రూపాయలను కాజేశారు.సీసీఎస్‌లో బాధితులకు న్యాయం చేయాల్సిన హోదాలో ఉంటూ వారితోనే బేరసారాలాడారు. కాగా, ఓ ఎన్నారై ఫిర్యాదు చేయడానికి రావడంతో అతడిని సైతం బెదిరించి డబ్బులు దండుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఇక, తోటి సిబ్బందిని బూతులు తిడుతూ, అవహేళన, వారిపై అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు చాలానే పోలీసులు చెబుతున్నారు. తన దగ్గరికి వచ్చిన ప్రతీ కేసులోనూ ఉమా మహేశ్వర రావు చేతివాటం చూపించినట్టు సమాచారం. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆయన, ఆయన బంధువుల నివాసాలపై మంగళవారం దాడులు చేశారు. తెలంగాణ, ఏపీలోని ఉమామహేశ్వరావు ఇళ్లు, ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లతో సహా మొత్తం 11 చోట్ల సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో నగదు, బంగారం, ఆస్తి పత్రాలతో పాటు రెండు బ్యాంకు లాకర్లను గుర్తించినట్లు తెలిసింది.అక్రమ ఆస్తుల కూడబెట్టుకుని నగర శివారులో విలాసవంతమైన విల్లాలు కొనుగోలు చేశారు. శామీర్‌పేటలో విల్లా, ఘట్కేసర్లో ఐడు ప్లాట్స్ కొనుగోలు చేశారు. అంతేకాకుండా తన ఇంట్లో నగదు ఉంచకుండా.. తన అత్తామామల ఇంట్లోనే డబ్బును దాచిపెట్టారు. లావాదేవీల మొత్తం సమాచారాన్ని ఆయన ట్యాబ్‌లో స్టోర్ చేసుకున్నారు. ఇక, ఉమా మహేశ్వరరావు ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 50కోట్లకు వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక, తెలుగు రాష్ట్రాల్లో 17చోట్ల ఆస్తులను గుర్తించారు. సోదాల్లో భాగంగా ఇప్పటి వరకు రూ.38లక్షల నగదు, 60 తులాల బంగారం సీజ్. కాగా, కాసేపట్లో ఉమా మహేశ్వర్‌ను అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నారు. -
సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో (సీసీఎస్) ఏసీపీగా పని చేస్తున్న టీఎస్ ఉమామహేశ్వరరావును ఏసీబీ అరెస్ట్ చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆయన, ఆయన బంధువుల నివాసాలపై మంగళవారం దాడులు చేశారు. తెలంగాణ, ఏపీలోని ఉమామహేశ్వరావు ఇళ్లు, ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లతో సహా మొత్తం 11 చోట్ల సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో నగదు, బంగారం, ఆస్తి పత్రాలతో పాటు రెండు బ్యాంకు లాకర్లను గుర్తించినట్లు తెలిసింది. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ప్రారంభమైన సోదాలు రాత్రి వరకు కొనసాగాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ ఉమామహేశ్వరరావును అరెస్టు చేసినట్లు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్రబాబు తెలిపారు. ‘ప్రీలాంచ్’ నిందితులకు వత్తాసుపై ఫిర్యాదులు ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో వేలాది మంది నుంచి డబ్బు వసూలు చేసి నిండా ముంచిన సాహితీ ఇన్ఫ్రా సంస్థ, దాని అనుబంధ సంస్థలపై అనేక కేసులు నమోదయ్యాయి. రూ.వేల కోట్లతో ముడిపడి ఉన్న ఈ స్కామ్‌కు సంబంధించిన కేసులు అన్నీ సీసీఎస్‌కు బదిలీ అయ్యాయి. దాదాపు 50 కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసిన ఉన్నతాధికారులు దాని బాధ్యతలు ఉమామహేశ్వరరావుకు అప్పగించారు. దీన్ని తనకు అనువుగా మార్చుకున్న ఉమా మహేశ్వరరావు నిందితుల నుంచి భారీ మొత్తం డిమాండ్ చేసి వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితులకు వత్తాసు పలుకుతూ బాధితులకు తీవ్ర అన్యాయం చేశారనే ఫిర్యాదులు ఏసీబీకి అందాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఫిర్యాదులూ వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. ఏపీలోని బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు మంగళవారం ఉదయం అశోక్‌నగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో ఉన్న ఉమామహేశ్వరరావు ఇల్లు, నేరేడ్మెట్, ఎల్బీనగర్‌ల్లోని స్నేహితుల ఇళ్లు, ఆయన సోదరుడు, మామ ఇళ్ళతో సహా ఏపీలోని భీమవరం, విశాఖపట్నం, నర్సీపట్నంల్లోని బంధువుల ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా రోలుగుంటలో ఉమామహేశ్వరరావు దూరపు బంధువు దివంగత మడ్డు తమ్మునాయుడు ఇంట్లో ఐదుగురు సభ్యులతో కూడిన తెలంగాణ ఏసీబీ అధికారుల బృందం తనిఖీలు చేసింది. తమ్మునాయుడు భార్య నుంచి వారి ఇల్లు, భూములు తదితర ఆదాయ వనరుల వివరాలు సేకరించారు. పత్రాలు, డైరీల్లో సందీప్ అనే పేరు దాడుల్లో పలు కీలక డాక్యుమెంట్లతో పాటు రూ.38 లక్షల నగదు, 60 తులాల బంగారం, 17 ఆస్తులకు సంబంధించిన పత్రాలు, 5 ప్లాట్ల వివరాలు లభించినట్లు తెలిసింది. ఉమామహేశ్వరరావు బినామీల పేరిట భారీగా ఆస్తులు కూడగట్టారని ఏసీబీ అధికారులు గుర్తించారు. బ్యాంకు లాకర్ల విషయంలో ఉమామహేశ్వరరావు సహకరించట్లేదని, వాటిని తెరవడానికి కొంత సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారు. ఉమామహేశ్వరరావు నుంచి స్వా«దీనం చేసుకున్న పత్రాలు, డైరీల్లో సందీప్ అనే పేరును అధికారులు గుర్తించారు. తన వెంట నిత్యం ల్యాప్‌టాప్ ఉంచుకునే ఉమామహేశ్వరరావు అందులో తాను ఎవరి నుంచి ఎంత తీసుకున్నరీ రాసుకున్నట్లు తెలిసింది. దీన్ని స్వాదీనం చేసుకున్న ఏసీబీ అధికారులు అందులోని వివరాలు విశ్లేషిస్తున్నారు. సోదాలు పర్యవేక్షించిన జేడీ సు«దీంద్రబాబు ఉమామహేశ్వరరావు, సందీప్ కలిసి అనేక చోట్ల పెట్టుబడులు పెట్టారని ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ సందీప్ ఎవరు? అతడి పాత్ర ఏంటి? అనేది లోతుగా ఆరా తీస్తున్నారు. సీసీఎస్‌లోని ఉమామహేశ్వరరావు చాంబర్లో తనిఖీలు చేపట్టి ,ఆయన దర్యాప్తు చేసిన కేసుల వివరాలు ఆరా తీస్తున్నారు. జేడీ సుదీంద్రబాబు మంగళవారం రాత్రి అశోక్‌నగర్‌లోని ఉమామహేశ్వరరావు ఇంటికి వెళ్లి సోదాలను పర్యవేక్షించారు. ఉమామహేశ్వరరావును అరెస్టు చేశామని, బుధవారం కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు. గతంలో అబిడ్స్ ఇన్స్పెక్టర్గా పని చేసిన ఉమామహేశ్వరరావు అక్కడ ఓ మహిళా కానిస్టేబుల్‌తో దురుసుగా ప్రవర్తించి సస్పెండ్ అయ్యారు. విధుల్లోకి తిరిగి వచి్చన ఆయన్ను రేంజ్ అధికారులు సైబరాబాద్ కమిషనరేట్‌కు అలాట్ చేశారు. జవహర్‌నగర్ పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్గా పని చేస్తుండగా ఓ నేర స్థలికి వెళ్లిన ఆయన అక్కడ ఓ మహిళ ముందు అభ్యంతరకంగా ప్రవర్తిస్తూ వివాదాస్పదుడు కావడంతో మరోసారి సస్పెండ్ అయ్యారు. ఇబ్రహీంపట్నం ఏసీపీగా పని ఉమామహేశ్వరరావు ఎన్నికల ముందు జరిగిన బదిలీల్లో సీసీఎస్‌కు వచ్చారు. -
ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి వెంకటేష్ అలియాస్ వెంకట్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం చోటుచేసుకున్న ఈఘటన వివరాలను వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య వెల్లడించారు. జిల్లాలోని దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన గుండగాని హరీష్.. దంతాలపల్లి మండల కేంద్రంలో 128 గజాల భూమి కొనుగోలు చేశాడు. రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా గజానికి రూ.200 చొప్పున డిమాండ్ చేయగా.. రూ.150 చొప్పున ఇస్తానని బేరం కుదుర్చుకుని వరంగల్ జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం సాయంత్రం మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ పూర్తికాగానే రూ.19,200 నగదును అవుట్ సోర్సింగ్ ఉద్యోగి వెంకటేష్‌కు ఇవ్వమని సబ్ రిజిస్ట్రార్ చెప్పగా.. హరీష్ ఆ డబ్బులను అందజేస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వెంకట్ వద్ద లెక్క చూపని మరో రూ.1.72లక్షలు నగదు ఉండగా స్వాధీనం చేసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఆలేటి వెంకట్‌ను అదుపులోకి తీసుకుని వరంగల్‌లోని ఏసీబీ కోర్టుకు తరలించారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. దాడుల్లో ఏసీబీ సీఐలు శ్యాంసుందర్, రాజు, సునీల్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
ACB raids: తహసీల్దార్ రజని ఇంట్లో ఏసీబీ తనిఖీలు..
జమ్మికుంట/వరంగల్‌క్రైం: రెండు అంతస్తుల ఇల్లు.. 21 ఇంటి స్థలాలు.. ఏడు ఎకరాల భూమి.. కిలోన్నర బంగారం.. ఇతరత్రా కలిపి మార్కెట్ వి లువ ప్రకారం రూ.12 కోట్ల ఆస్తులు. ఇవన్నీ జమ్మికుంట తహసీల్దార్ మర్కల రజనికి చెందిన హనుమకొండలోని ఇంటితోపాటు మరో ఐదు చోట్ల ఏకకాలంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు బుధవారం నిర్వహించిన దాడుల్లో వెలుగుచూశాయి. ఉదయం నుంచి హనుమకొండలోని కేఎల్ఎన్రెడ్డి కాలనీ, ధర్మసాగర్, మరో నాలుగు చోట్ల ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. తహసీల్దార్ రజని ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళిక ప్రకారం అమె బంధువులు, సన్నిహితుల ఇళ్లను టార్గెట్ చేసుకుని తనిఖీలు చేశారు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ రమణామూర్తి ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో ఒక్కో చోట ఇన్స్పెక్టర్ స్థాయి ఆధ్వర్యంలో దాడులు కొనసాగాయి. ఆమె గతంలో తహసీల్దార్‌గా పనిచేసిన ప్రాంతాల్లో ఆమెకు సన్నిహితంగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించారు. రూ.12కోట్ల అక్రమాస్తులు.. తహసీల్దార్ మర్కల రజనిపై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయని డీఎస్పీ రమణామూర్తి తెలిపారు. ఏసీబీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లాలో ఆరు చోట్ల దాడులు నిర్వహించామన్నారు. రజనికి హనుమకొండలో కేఎల్ఎన్రెడ్డి కాలనీలో రెండు అంతస్తుల ఇల్లు, 21 ఇంటి స్థలాలు, 7 ఎకరాల భూమి, 2 కార్లు, 3 ద్విచక్ర వాహనాలు, బ్యాంకులో రూ.25లక్షలు, లాకర్లు, ఇంట్లో కిలోన్నర బంగారం, ఇంట్లో రూ.1.50 లక్షల నగదు లభించినట్లు తెలిపారు. దీని విలువ (ప్రభుత్వ విలువ ప్రకారం) రూ.3.25 కోట్లు. ఇందులో సుమారు రూ.3కోట్ల అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించినట్లు ఆయన తెలిపారు. వీటి విలువ మార్కెట్ ప్రకారం సుమారు రూ.12 కోట్ల వరకు ఉంటుందని డీఎస్పీ రమణామూర్తి పేర్కొన్నారు. తహసీల్దార్ రజనిని అదుపులోకి తీసుకుని కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ రమణామూర్తి తెలిపారు. -
ఏసీబీ దర్యాప్తు.. సీడీపీవో ఆఫీసర్ శ్రీదేవి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: నిధుల దుర్వినియోగం వ్యవహారంలో.. సిటీ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అధికారిణి అనిశెట్టి శ్రీదేవిని ఏసీబీ అరెస్టు చేసింది. కరీంనగర్ కోర్టులో ఆమెను హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా జైనూర్‌లో గతంలో సీడీపీవోగా పనిచేసిన సమయంలో శ్రీదేవి నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించామన్నారు. 322 అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి దాదాపు రూ.65.78 లక్షల నగదును దారి మళ్లించినట్లు గుర్తించారు. ఆరోగ్యలక్ష్మి పాల సరఫరా ఖర్చులపై నకిలీ ఇండెంట్లను సృష్టించి నగదు కాజేసినట్లు దర్యాప్తులో తేల్చారు. -
మూడు లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన అవినీతి చేప
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో రూ.3 లంచం తీసుకుంటూ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ లచ్చునాయక్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. బాధితుల వద్ద నుంచి లంచం తీసుకుంటుండగా అధికారులు అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల ప్రకారం.. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ లచ్చునాయక్ ఏసీబీకి చిక్కారు. రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఔషధాల టెండర్ కోసం వెంకన్న అనే వ్యాపారి నుంచి ఈ మొత్తాన్ని డిమాండ్ చేశారు. దీంతో, సదరు బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. ఈ క్రమంలో శుక్రవారం ఆయన నివాసంలో వెంకన్న నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేశారు. రెడ్‌హ్యాండెడ్‌గా అధికారిని పట్టుకున్నారు. అయితే, ప్రభుత్వ ఆసుపత్రికి రెండేళ్లుగా ఔషధాలు సరఫరా చేస్తున్నట్లు వెంకన్న తెలిపారు. కొన్నాళ్లుగా సూపరింటెండెంట్ 10 శాతం కమీషన్ తీసుకుంటున్నారని, ఇటీవల అధికశాతం కావాలని డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. నెలరోజుల క్రితం రూ.లక్ష లంచంగా ఇవ్వగా.. నాలుగు రోజుల క్రితం మరో రూ. 3 లక్షలు డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించినట్లు తెలిపారు. -
HMDA శివబాలకృష్ణ కేసులో మరో ట్విస్ట్.. ఐఏఎస్ అరవింద్..
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈకేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ.. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అంశాన్ని బయటకు తీసింది. దీంతో, విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది. వివరాల ప్రకారం.. హెచ్ఎండీఏ అధికారి శివబాలకృష్ణ అవినీతి కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. శివ బాలకృష్ణ కేసులో తాజాగా ఏసీబీ నివేదిక రెడీ చేసింది. ఈ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఇక, ఈ కేసులో మరో కొత్త అంశాన్ని బయటకు తీసుకువచ్చింది. ఏసీబీ నివేదికలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ వ్యవహారాన్ని ప్రస్తావించింది. బాలకృష్ణ దగ్గర నుంచి అరవింద్ కుమార్ పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్టు నివేదికలో పేర్కొంది. ఇక, ఈ వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అయిన అరవింద్ కుమార్‌ను విచారించేందుకు ఏసీబీ.. ప్రభుత్వ అనుమతిని కోరింది. మరోవైపు.. బాలకృష్ణ నుంచి రికవరీ చేసిన ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. కాగా, గత పదేళ్ల కాలంలో దాదాపు 15 సెల్‌ఫోన్స్ మార్చినట్టు ఏసీబీ నివేదికలో వెల్లడించారు. ఈ ఫోన్లు, కాంటాక్ట్‌లకు సంబంధించి మరిన్ని కీలక విషయాలను ఏసీబీ వెల్లడించే అవకాశం ఉంది.