సాక్షి, హైదరాబాద్: ఈఎస్‌ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) మందుల కుంభకోణంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడు కొనసాగుతోంది. మొదటి నుంచి అధికారులతో కుమ్మక్కయి అధిక ధరలకు మందులు కొనుగోలు చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఓమ్నీ మార్కెటింగ్ మేనేజర్ చెరుకూరి నాగరాజును ఏసీబీ అధికారులు గురు వారం అరెస్టు చేశారు. ఈ కేసులో నాగరాజు ఏ–9గా ఉన్నాడు. ఓమ్నీ ఫార్మా ఎండీ శ్రీహరిబాబు అలియాస్ బాబ్జిని ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
శ్రీహరిబాబే లెజెండ్ కంపెనీని సృష్టించి దానికి కృపాసాగర్‌రెడ్డి అనే వ్యక్తిని బినామీగా పెట్టాడని దర్యాప్తు లో అధికారులు గుర్తించారు. శ్రీహరిబాబుకు చెందిన ఓమ్నీ ఫార్మాలో నాగరాజు మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేసేవాడు. లెజెండ్ కంపెనీ ద్వారా అప్పటి డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ ద్వారా అధిక ధరలకు బిల్లులు చెల్లించేలా చేయడంలో నాగరాజు కీలకపాత్ర పోషించినట్లు శ్రీహరిబాబు ఏసీబీ దర్యాప్తులో వెల్లడిం చాడు. దీంతో ఏసీబీ నాగరాజును అరెస్టు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment