ARESTED
-
30 లక్షలకు నీట్ ప్రశ్నాపత్రం!
పట్నా: దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష–అండర్ గ్రాడ్యుయేట్(నీట్–యూజీ)లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రశ్నపత్రం లీక్ అయ్యిందని, పరీక్షలో రిగ్గింగ్ జరిగిందని కొందరు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ కోర్టులను సైతం ఆశ్రయించారు. నీట్–యూజీని రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు గ్రేసు మార్కుల వ్యవహారం తీవ్ర దుమారం సృష్టించింది. బిహార్‌లో నీట్ అక్రమాలపై జరగుతున్న దర్యాప్తులో సంచలనాత్మక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నీట్ అక్రమాలకు సంబంధించి బిహార్ పోలీసులు ఇప్పటివరకు 14 మందిని అరెస్టు చేశారు. వీరిలో ప్రభుత్వ జూనియర్ ఇంజనీర్ కూడా ఉండడం గమనార్హం. రూ.30 లక్షలు ఇచ్చి నీట్ ప్రశ్నపత్రం కొనుగోలు చేశామని ప్రాథమిక విచారణలో పలువురు అభ్యర్థులు అంగీకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. పకడ్బందీగా స్కెచ్ బిహార్‌లో పేపర్ లీక్ చేసి, అభ్యర్థులకు విక్రయించి సొమ్ము చేసుకున్న వ్యక్తులు తెలివిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. లీకేజీ వ్యవహారం బయటకు పొక్కకుండా పకడ్బందీగా వ్యవహరించారు. తమకు డబ్బులు ముట్టజెప్పిన అభ్యర్థులను తొలుత సురక్షిత స్థావరాలకు తరలించారు. వారికి అక్కడే ప్రశ్నపత్రం అప్పగించారు. జవాబులు సైతం చెప్పేశారు. తర్వాత నేరుగా పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లారు. మధ్యలో ఎవరినీ కలవనివ్వలేదు. ఇదంతా ప్రాథమిక దర్యాప్తులో బయటపడింది. నీట్ పేపర్ లీకేజీపై బిహార్ పోలీసు శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగం(ఈఓయూ) దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇప్పటికే పలువురు అభ్యర్థులను, అనుమానితులను ప్రశ్నించింది. శనివారం మరో 9 మంది అభ్యర్థులకు నోటీసులు జారీ చేసింది. సోమవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. వీరంతా బిహార్‌లో వేర్వేరు జిల్లాలకు చెందినవారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి అభ్యర్థుల వివరాలు తెలుసుకొని, నోటీసులు ఇచ్చామని ఈఓయూ డీఐజీ మనవ్జీత్ సింగ్ థిల్లాన్ చెప్పారు. కన్సల్టెన్సీలు, కోచింగ్ సెంటర్ల ముసుగులో.. నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ ఫిర్యాదులు రాగానే బిహార్ పోలీసులు వేగంగా స్పందించారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేశారు. అనుమానిత అభ్యర్థులు, పేపర్ లీక్ చేసిన బ్రోకర్లను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో అభ్యర్థులు నోరు విప్పారు. బ్రోకర్లకు రూ.30 లక్షలకుపైగా ఇచ్చి నీట్ ప్రశ్నాపత్రం కొనుగోలు చేశామని ఒప్పుకున్నారు. బిహార్ ప్రభుత్వ జూనియర్ ఇంజనీర్ సికిందర్ కుమార్ యాదవేందు(56)ను పోలీసులు అరెస్టు చేసి, ప్రశ్నించారు. పేపర్ లీక్ ముఠాతో తాను చేతులు కలిపినట్లు అంగీకరించాడు. కొందరు అభ్యర్థుల కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపానని చెప్పాడు. ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సంస్థను నడిపిస్తున్న నితీశ్, అమిత్ ఆనంద్ అనే వ్యక్తులను తన ఆఫీసులో∙కలిశానని, వారు మే 4వ తేదీన నీట్ ప్రశ్నాపత్రం తీసుకొచ్చారని వెల్లడించారు. పట్నాలోని రామకృష్ణానగర్‌లో అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేశామని, బేరసారాలు అక్కడే జరిగాయని పేర్కొన్నాడు. నితీశ్, అమిత్ ఆనంద్ అరెస్టయ్యారు. అభ్యర్థుల నుంచి రూ.30 లక్షల నుంచి రూ.32 లక్షల దాకా వసూలు చేశామని పోలీసుల విచారణలో వెల్లడించారు. బిహార్ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ టీచర్ రిక్రూట్మెంట్ పరీక్ష కుంభకోణంలో నితీశ్ కుమార్ ఇప్పటికే ఒకసారి జైలుకు వెళ్లొచ్చాడు. పేపర్ లీకేజీలో ఆరితేరాడు. లీకేజీ ముఠా సభ్యులు ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు, కోచింగ్ సెంటర్ల ముసుగులో అభ్యర్థులను సంప్రదించి, ప్రశ్నాపత్రాలు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిజానికి ఇలాంటి కన్సల్టెన్సీలు, కోచింగ్ సెంటర్లకు ప్రభుత్వ నుంచి ఎలాంటి గుర్తింపు ఉండదు. ఇదిలా ఉండగా, బిహార్‌లో బయటపడిన నీట్ అక్రమాలపై కేంద్ర విద్యా శాఖ గానీ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గానీ ఇంతవరకు స్పందించలేదు. -
కవిత అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళనలు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. పార్టీ పిలుపుమేరకు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పలుచోట్ల ప్రధాని మోదీ దిష్టి బొమ్మల దహనం, రాస్తారోకోలు, ధర్నాలతో బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు నిరసన తెలిపాయి. ఆందోళనలకు బీఆర్ఎస్ పిలుపు నేపథ్యంలో పోలీసులు పలుచోట్ల శనివారం తెల్లవారుజాము నుంచే పార్టీ ముఖ్య నేతలను అదుపులోకి తీసుకున్నారు. ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌తో పాటు సిరిసిల్ల, సిద్దిపేట, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్, వనపర్తి, నల్లగొండ తదితర చోట్ల నిరసనలు మి న్నంటాయి. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని బీఆర్ఎస్ ఆగ్ర హం వ్యక్తంచేసింది. లోకసభఎన్నికల ముందు బీఆర్ ఎస్‌ను మానసికంగా దెబ్బతీయాలనే ఆలోచనతో కుట్ర పన్నుతున్నారని పార్టీ నేతలు ఆరోపించారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ నిరసనలో అపశృతి సిరిసిల్ల: కవిత అరెస్ట్‌ను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సిరిసిల్లలో శనివారం చేపట్టిన ధర్నాలో భాగంగా ప్రధాని మోదీ ఫ్లెక్సీపై పెట్రోల్ చల్లి నిప్పంటించారు. ఈ క్రమంలో కోడం సాయి (30) అనే యువకుడికి మంటలంటుకున్నాయి. వెంటనే మంటలార్పి అతడిని ఆస్పత్రికి తరలించారు. కాగా, ఇదే ఆందోళన కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట, తంగళ్లపల్లి మహిళా ఎంపీపీలు పరస్పరం ఘర్షణపడి ఒకరినొకరు కొట్టుకోబోయారు. నేతలు వారిని వారించారు. -
అంబానీకి బెదిరింపుల కేసులో ఇద్దరి అరెస్ట్
ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీకి బెదిరింపు మెయిళ్లు పంపిన వ్యవహారంలో తెలంగాణ, గుజరాత్‌లకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ఎనిమిది రోజుల వ్యవధిలో అంబానీకి చెందిన సంస్థకు మూడు ఈమెయిళ్లు అందాయి. రూ.20 కోట్లు ఇవ్వాలని, లేకుంటే చంపేస్తామంటూ మొదటి మెయిల్ పంపారు. తమ వద్ద మంచి షూటర్లు ఉన్నట్లు అందులో బెదిరించారు. ఆతర్వాత మరో మెయిల్లో రూ.200 కోట్లు ఇవ్వాలని బెదిరించారు. సోమవారం పంపిన మెయిల్లో రూ.400 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామని ఉంది. వీటిపై అంబానీ భద్రతా అధికారి ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్న ఇద్దరిలో ఒకరు తెలంగాణలోని వరంగల్‌కు చెందిన గణేశ్ రమేశ్ వనపర్తి(19) కాగా, మరొకరు గుజరాత్‌కు చెందిన షాదాబ్ ఖాన్(21). శనివారం గణేశ్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరచగా ఈ నెల 8వ తేదీ వరకు పోలీస్ కస్టడీకి అనుమతించింది. షాదాబ్ ఖాన్ ఉన్నతవిద్యా వంతుడని పోలీసులు చెప్పారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
'జైలర్' విలన్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం అదే?
వర్త్ వర్మ వర్త్.. ఈ డైలాగ్ వినగానే మీ 'జైలర్' సినిమాలో విలన్ గుర్తొస్తాడు. మూవీలో విలనిజంతో అదరగొట్టిన నటుడు వినాయకన్‌ని కేరళ పోలీసులు నిజంగానే అరెస్ట్ చేశారు. జీపులో స్టేషన్ కి కూడా తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇంతకీ అసలేం జరిగింది? (ఇదీ చదవండి: చిరంజీవి కొత్త సినిమాలో విలన్‌గా రామ్‌చరణ్ ఫ్రెండ్!) ఏం జరిగింది? కేరళకు చెందిన నటుడు వినాయకన్.. పలు మలయాళ సినిమాల్లో నటించాడు. ఇప్పుడిప్పుడే తమిళ చిత్రాలు కూడా చేస్తున్నాడు. తాజాగా మద్యం ఫుల్‌గా తాగేసి పబ్లిక్ ప్లేసులో అసభ్యంగా ప్రవర్తించాడట. కొందరు అతడిని కంట్రోల్ చేయాలని ప్రయత్నించినప్పటికీ.. అతడు వినకపోగా వారిని ఇష్టమొచ్చినట్లు బూతులు తిడుతూ ఇబ్బంది పెట్టాడట. దీంతో వాళ్లు పోలీసులను ఆశ్రయించారు. ఇక వినాయకన్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వైద్య పరీక్షల నిమిత్తం ఎర్నాకుళంలోని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అయితే వినాయకన్ ప్రవర్తన ఎప్పుడూ ఇలానే ఉంటుందని కొందరు ఆరోపిస్తున్నారు. మలయాళ, తమిళ సినిమాల్లో చేస్తున్న వినాయకన్.. తెలుగులో కల్యాణ్ రామ్ 'అసాధ్యుడు'లో సెకండ్ విలన్‌గా నటించాడు. (ఇదీ చదవండి: పవన్ మతిమరుపు.. సొంత సినిమా గురించే మర్చిపోయాడు!) -
Haryana Communal Clashes: 102 ఎఫ్ఐఆర్లు...200 మంది అరెస్ట్
చండీగఢ్: హరియాణాలో ఇటీవలి మత ఘర్షణలకు సంబంధించి మొత్తం 202 మందిని అరెస్ట్ చేసినట్లు రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్ శుక్రవారం తెలిపారు. ముందు జాగ్రత్తగా మరో 80 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. ఘర్షణలపై 102 ఎఫ్ఐఆర్లను నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇందులో సగం వరకు నూహ్ జిల్లాలోని వన్నారు. మిగతావి గురుగ్రామ్, ఫరీదాబాద్, పల్వాల్ జిల్లాల్లో నమోదయ్యాయన్నారు. ఘర్షణలకు కారకులైన వారిని వదిలే ప్రసక్తే లేదని మంత్రి చెప్పారు. పోలీస్స్టేషన్లపై జరిగిన దాడులకు కారకులను గుర్తించే పని మొదలయ్యిందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం ప్రార్థనలను ఇళ్ల వద్దే చేసుకోవాలని యంత్రాంగం ప్రజలకు సూచించిందన్నారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిని గుర్తించేందుకు ప్రత్యేకంగా కమిటీని వేశామని చెప్పారు. 250 గుడిసెలు కూల్చివేత టౌరు పట్టణంలోని ప్రభుత్వ జాగాలో నిర్మించుకున్న 250కి పైగా గుడిసెలను నూహ్ జిల్లా యంత్రాంగం శుక్రవారం కూల్చివేసింది. హరియాణా షహరి వికాస్ ప్రాధికారణ్(హెచ్‌ఎస్‌వీపీ)కి చెందిన ఎకరం భూమిలో బంగ్లాదేశీ వలసదారులు అక్రమంగా వీటిని నిర్మించుకున్నారని నూహ్ డిప్యూటీ కమిషనర్ ప్రశాంత్ పన్వర్ చెప్పారు. వీరంతా గతంలో అస్సాంలో నివసించారని చెప్పారు. ఇటీవలి మత ఘర్షణలకు తాజాగా గుడిసెల కూల్చివేతకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆక్రమణల తొలగింపులో భాగంగానే ఈ గుడిసెలను కూల్చివేసినట్లు వివరించారు. -
డ్రగ్స్‌తో పట్టుబడిన మోడల్.. గర్భవతిగా నమ్మిస్తూ..
Model Shubham Malhotra Arrested: సినీ సెలబ్రిటీలు, మోడల్స్, అప్పుడే చిత్రసీమలోకి అడుగుపెడుతున్నవారు ఎందరో డ్రగ్స్‌తో పోలీసులకు పట్టుబడ్డారు. తాజాగా మరో మోడల్ డ్రగ్స్‌తో ఢిల్లీ పోలీసులకు చిక్కాడు. మోడల్ శుభమ్ మల్హోత్రా (25) అతడి స్నేహితురాలు కీర్తి (27) రూ. కోటీ విలువ చేసే మాదకద్రవ్యాలతో పోలీసులకు పట్టుబడ్డారు. ఈ డ్రగ్స్‌ను హిమాచల్ ప్రదేశ్ నుంచి తీసుకొచ్చి ఢిల్లీ యూనివర్సిటీలో అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. 'కొందరు ఢిల్లీ విశ్వవిద్యాలయానికి డ్రగ్స్, గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో దర్యాప్తు ప్రారంభించాం. తర్వాత మాదకద్రవ్యాలను తరలిస్తున్న ఈ ఇద్దరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాం' అని క్రైం బ్రాంచ్ డిప్యూటీ కమిషనర్ రోహిత్ మీనా వెల్లడించారు. అయితే కీర్తి దిండు సాయంతో గర్భవతినని నమ్మించి తనిఖీ అధికారులను బురిడీ కొట్టించేదని దర్యాప్తులో తేలిందన్నారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి గంజాయి తీసుకొస్తుండగా పక్కా సమాచారంతో వారి కారును వెంబడించి పట్టుకున్నామని పేర్కొన్నారు. మోడల్ శుభమ్ మల్హోత్రా, కీర్తిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: అతని ప్రేయసి గురించి చెప్పేసిన చిరంజీవి.. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో బుల్లితెర నటి.. చివరికి.. ఆ వార్త నన్ను కలిచివేసింది: సుష్మితా సేన్ తమ్ముడు బాయ్‌ఫ్రెండ్ నుంచి కాల్.. తర్వాత మోడల్ ఆత్మహత్య ఆ షాట్‌ను ఎక్కడ చూడలేదని విదేశీయులు ఫిదా.. -
మెట్రో స్టేషన్లో వికృత చేష్టలు.. మహిళ దగ్గరకు వచ్చి..
ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. యువతులు, మహిళలపై లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. మెట్రో రైల్వే స్టేషన్లో మహిళ పట్ల ఓ ప్రయాణికుడు అనుచితంగా ప్రవర్తించాడు. ఈ ఘటన జూన్ 2వ తేదీన చోటుచేసుకోగా.. 100 గంటలపాటు సీసీ ఫుటేజీని పరిశీలించిన తర్వాత నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం.. ఢిల్లీ మెట్రో స్టేషన్లో ఎల్లో లైన్లో జూన్ 2న ఒక మహిళ మెట్రో రైలులో ప్రయాణించింది. ఆమె స్టేషన్లో కూర్చుని ఉండగా.. ఒక వ్యక్తి ఆమె వద్దకు వచ్చి ఒక అడ్రస్ గురించి అడిగాడు. ఆ అడ్రస్ గురించి చెప్పిన ఆమె జోర్ భాగ్ మెట్రో స్టేషన్లో దిగింది. ఫ్లాట్‌ఫామ్‌పై ఒక చోట కూర్చొని క్యాబ్ బుక్ చేస్తున్నది. నిందితుడు కూడా.. అదే స్టేషన్లో దిగాడు. అనంతరం.. అతడు మళ్లీ ఆమె వద్దకు వచ్చి.. అడ్రస్ అడిగాడు. దీంతో, ఆమె.. అతడికి అడ్రస్ చెబుతుండగా.. నిందితుడు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. దీంతో షాకైన బాధితురాలు.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. అనంతరం, ఈ ఘటన గురించి సిబ్బందికి చెప్పింది. కానీ, వారు పట్టించుకోకపోవడంతో ట్విట్టర్ వేదికగా.. వరుస ట్వీట్స్ చేసింది. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. దాదాపు 100 గంటలు సీసీ ఫుటేజీని చెక్ చేసిన పోలీసులు.. ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు. అతడిని కోట్లా ముబారక్‌పూర్‌లో నివాసం ఉంటున్న మానవ్ అగర్వాల్(40)గా గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం నిందితుడు.. నేపాల్‌కు పారిపోయాడని తెలిపారు. Woman Molested Inside Delhi Metro Station, Horrific Act Caught on CCTV#DelhiMetro #JorBagh pic.twitter.com/iHKP2nMWwl — TIMES NOW (@TimesNow) July 6, 2022 ఇది కూడా చదవండి: మెట్రో స్టేషన్లో యువతిపై లైంగిక వేధింపులు.. మరీ ఇంత దారుణమా..? -
జూపల్లి, బీరం చర్చావేదిక భగ్నం
సాక్షి, నాగర్‌కర్నూల్: కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య బహిరంగ చర్చ సాగక ముందే రచ్చరచ్చ అయింది. కొల్లాపూర్ పట్టణంలో ఆదివారం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గత కొద్దిరోజులుగా వారి మధ్య జరుగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు ప్రతిసవాళ్లతో స్థానికంగా రాజకీయం వేడెక్కింది. ఇరువురు నేతల మధ్య చర్చావేదిక నిర్వహించేందుకు ఉదయం చేసిన ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. పది గంటలకు జూపల్లి ఇంటిని చర్చావేదికగా వారు ఖరారు చేసుకున్నారు. దీంతో శనివారం సాయంత్రం నుంచే కొల్లాపూర్ పట్టణంలో పోలీసులు భారీగా మోహరించారు. జూపల్లి నివాసం వద్ద సైతం భారీ బందోబస్తు నిర్వహించారు. హర్షవర్ధన్‌రెడ్డి సుమారు రెండు వేలమంది కార్యకర్తలతో కలసి జూపల్లి ఇంటి వైపు ర్యాలీగా బయలుదేరారు. స్థానిక పోలీస్‌స్టేషన్ ముందుకు రాగానే పోలీసులు నిలువరించారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే అనుచరులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి వనపర్తి జిల్లా పెబ్బేరు పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది. దమ్ముంటే నిరూపించాలి: జూపల్లి తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డికి దమ్ముంటే సాక్ష్యాలతో నిరూపించాలని జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు. ఆరోపణలపై చర్చించేందుకు ఎక్కడికైనా వస్తానని, నిరూపించకపోతే పరువునష్టం దావా వేస్తానని అన్నారు. తనను ఎదుర్కొనే ధైర్యం లేకనే ఎమ్మెల్యే పారిపోయారని వ్యాఖ్యానించారు. ఆదివారం కొల్లాపూర్ పట్టణంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను బ్యాంకుల్లో తీసుకున్న రూ.ఆరు కోట్ల అప్పును 2007లోనే వడ్డీతో సహా రూ.14 కోట్లు చెల్లించానని పేర్కొన్నారు. ‘పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు చేపడితే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లోని వన్యప్రాణులకు ముప్పు పొంచి ఉందని ఎన్జీటీలో కేసు వేసింది ఎవరు? తర్వాత ఎందుకు విత్‌డ్రా అయ్యారో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి’అని జూపల్లి ప్రశ్నించారు. అభివృద్ధికి అడ్డుపడితే ఊరుకోను: బీరం కొల్లాపూర్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ఆటంకం కలిగిస్తే ఊరుకునే ప్రసక్తేలేదని ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం వనపర్తి జిల్లా పెబ్బేరు సింగిల్‌విండో కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ప్రజల ఆస్తులను, బ్యాంకులను మోసం చేసిన ఘనత నీదే కాబట్టి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. ఈ రోజు బహిరంగ చర్చకు పిలిచి మొహం చాటేసుకున్నావు. ఇక నుంచి నీ ఆటలు, మాటలు సాగనివ్వబోం’అని జూపల్లిని ఉద్దేశించి హెచ్చరించారు. ఇది కూడా చదవండి: జూపల్లి ఇంటి వద్ద పోలీసుల మోహరింపు -
టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్
సాక్షి, గుంటూరు: టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా అనుమర్లపూడి చెరువు వద్ద నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, గ్రామంలో మట్టి తవ్వకాలపై చలో అనుమర్లపూడికి ధూళిపాళ్ల పిలుపునిచ్చారు. ఈ క్రమంలో చలో అనుమర్లపూడికి అనుమతి లేదంటూ పోలీసులు.. గ్రామంలో 144 సెక్షన్ అమలలో ఉందని స్పష్టం చేశారు. అయినప్పటికీ ఆయన.. గ్రామంలో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేశారు. దీంతో, తప్పుడు ప్రచారం చేస్తున్న ధూళిపాళ్లపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ భారీ సంఖ్యలో మోహరించారు. అనంతరం, ధూళిపాళ్లను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: రుణ ఎగవేత కేసులో కేశినేనికి డీఆర్టీ సమన్లు -
సోదాల పేరుతో సీబీఐ అధికారుల రచ్చ
న్యూఢిల్లీ: ఓ వ్యాపారవేత్త నుంచి డబ్బులు గుంజేందుకు సోదాల పేరుతో హంగామా సృష్టించిన సీబీఐ అధికారులు నలుగురు అడ్డంగా దొరికిపోయారు. ఉన్నతాధికారులు వారిని డిస్మిస్ చేయడంతోపాటు అరెస్ట్ చేశారు. ఈనెల 10వ తేదీన సీబీఐ అధికారులమని చెబుతూ కొందరు తన ఆఫీసులోకి వచ్చి, నానా హంగామా సృష్టించారని చండీగఢ్‌కు చెందిన వ్యాపారవేత్త ఒకరు ఫిర్యాదు చేశారు. తనకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయంటూ బెదిరించి, రూ.25 లక్షలివ్వాలని డిమాండ్ చేశారని అందులో పేర్కొన్నారు. తమ సిబ్బంది ఒకరిని పట్టుకోగా, మిగతా వారు పరారయ్యారని వివరించారు. ఈ ఫిర్యాదుపై సీబీఐ డైరెక్టర్ సుబోధ్‌కుమార్ జైశ్వాల్ వెంటనే స్పందించారు. విచారణ జరిపి ఈ నలుగురూ ఢిల్లీ సీబీఐ ఆర్థిక నేరాలు, ఇంటర్‌పోల్ ప్రొటోకాల్ డివిజన్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎస్సైలు సుమిత్ గుప్తా, అంకుర్ కుమార్, ప్రదీప్ రాణా, అకాశ్ అహ్లావత్లుగా గుర్తించారు. వీరి నివాసాలపై సోదాలు చేపట్టి, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురినీ అరెస్ట్ చేయడంతోపాటు వెంటనే విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలిచ్చారు. వీరిపై ఆరోపణలు రుజువైతే 10 ఏళ్ల నుంచి జీవితకాల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. -
సీఎంను చంపేస్తానంటూ వార్నింగ్.. బీజేపీ నేత అరెస్ట్
ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి తజిందర్ సింగ్ బగ్గాను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, బగ్గా.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను చంపేస్తానని వ్యాఖ్యలు చేసిన కారణంగా అతడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం.. మార్చి 30వతేదీన జరిగిన నిరసన ప్రదర్శనలో ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ను బగ్గా బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోలను ఆప్ నేతలు పోలీసులకు అందజేశారు. దీంతో అతడిని శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేసిట్టు తెలిపారు. ఈ మేరకు బగ్గాను అరెస్టు చేసినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నరేష్ బల్యాన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి కపిల్ మిశ్రా స్పందిస్తూ.. తన రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టేందుకే కేజ్రీవాల్ ఇలా అరెస్టులు చేపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం ఇలా అధికార దుర్వినియోగానికి పాల్పడటం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. लुच्चे-लफ़ंगो की पार्टी भाजपा नेता @TajinderBagga को पंजाब पुलिस ने गिरफ़्तार किया। मुख्यमंत्री अरविंद केजरीवाल जी को दिया था “जीने नही देंगे” की धमकी। pic.twitter.com/LzZmPVaDRQ — MLA Naresh Balyan (@AAPNareshBalyan) May 6, 2022 ఇది కూడా చదవండి: మమత, అమిత్ షా పరస్పర విమర్శలు -
వివాహమైన మూడు నెలలకే దారుణం.. మాజీ ప్రియుడు అరెస్ట్
తిరువొత్తియూరు: పుదుక్కోట్టై æజిల్లాలో వివాహమైన 3 నెలలకే నవ వధువు ఆత్మాహుతి చేసుకుంది. దీనికి సంబంధించి మాజీ ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. పుదుక్కొట్టై జిల్లా తిరుమయం సమీపం కొప్పరపు పట్టి, ఆరియన్‌కాడు గ్రామానికి చెందిన పుష్పరాజ్, అతని భార్య దీప (25). వీరికి మూడు నెలలకు క్రితం వివాహమైంది. ఈ క్రమంలో గురువారం దీపా ఇంటిలో ఒంటరిగా ఉన్న సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీప తల్లి యశోద ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. విచారణలో అదే ప్రాంతానికి చెందిన వేలుసామి (35) అనే వ్యక్తితో వివాహానికి ముందే పరిచయం ఏర్పడి సంబంధం ఉందని, ఈ క్రమంలో పెళ్లి చూపులకు ఎవరు వచ్చినా తాను వివాహం చేసుకోనని దీప తెలిపినట్లు తెలిసింది. దీంతో బంధువులు దీపను ఒప్పించి బంధువుకు వివాహం చేశారు. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనతో ఉన్న దీప బలవన్మరణానికి పాల్పడింది. దీంతో పోలీసులు కేసు నమోదుచేసి ఆత్మహత్యకు ప్రేరేపించిన మాజీ ప్రియుడు వేలుసామిని అరెస్టు చేశారు. -
బాయ్‌ఫ్రెండ్‌పై కోపం.. ఆమె చేసిన పనికి షాక్‌లో లవర్
ఓ మహిళ తన బాయ్‌ఫ్రెండ్ మీద కోపంతో దారుణానికి ఒడిగట్టింది. ఈ క్రమంలో తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలవడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. వివరాల ప్రకారం.. విస్కాన్సిన్లోని మాడిసన్‌కు చెందిన కెల్లీ హేస్ తన మాజీ బాయ్‌ఫ్రెండ్స్ మీద కోపంతో అతడి కారుకు నిప్పంటించింది. ఈ క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆమె తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. ఏ మాత్రం లేట్ అయిన ఆమె మంటల్లో చిక్కుకుపోయేది. అయితే, మొదట కారులో ఇంధనం పోసి ఆ తర్వాత లైటర్‌తో మంటలు అంటించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కారు గ్లాస్లో నుంచి మంటలు బయటకు వచ్చాయి. సమయ స్ఫూర్తితో ఆమె మంటలను నుంచి తప్పించుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఈ ఘటన అనంతరం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కెల్లీని వారు అరెస్ట్ చేశారు. This woman nearly k!lls herself setting ex-boyfriend's car on fire pic.twitter.com/dzxilLh0O3 — Snade (@Sw33tSanade) April 27, 2022 -
ఆధారాల చోరీ ఘటనలో ఇద్దరు అదుపులోకి!?
నెల్లూరు (క్రైమ్): నెల్లూరు కోర్టులో ఆధారాల అపహరణ కేసుకు సంబంధించిన దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కోర్టులో చోరీ జరగడం, అదీ ఓ కీలక కేసుకు సంబంధించిన ఆధారాలు దొం గిలించడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. రాజకీయరంగు పులుముకున్న ఈ కేసును ఛేదించేం దుకు జిల్లా ఎస్పీ సీహెచ్ విజయారావు రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో కేసును విచారిస్తున్నారు. కోర్టు ప్రాంగణాన్ని శుక్రవారం పరిశీలించి కీలకపత్రాలు ఎక్కడున్నాయి? ఎక్కడ నుంచి దొంగిలించారు? తదితర వివరాలను ఆరా తీశారు. వివరాలివీ.. 2016 డిసెంబర్లో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వైఎస్సార్సీపీ నేత, ప్రస్తుత మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డితోపాటు మరికొందరిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నెల్లూరు 4వ అదనపు ఫస్ట్‌క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ సాగింది. అనంతరం విజయవాడలో ప్రజాప్రతినిధుల స్పెషల్ కోర్టులో సాగుతోంది. అయితే, కేసు కు సంబంధించిన కీలక ఆధారాలు ల్యాప్‌టాప్, ట్యాబ్, సెల్ఫోన్లు, నకిలీపత్రాలు, రబ్బర్‌స్టాంపులు తదితరాలన్నీ నెల్లూరు కోర్టులోనే ఉన్నాయి. తాళాలు పగులగొట్టి దొంగతనం బుధవారం అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కోర్టు ప్రాంగణంలోకి వెళ్లి తాళాలు పగులగొట్టి లోనికి చొరబడ్డారు. బీరువాలో ఉంచిన కీలక ఆధారాలున్న బ్యాగ్‌ను తస్కరించారు. బ్యాగ్‌తోపాటు కాగితాలను కోర్టు బయటపడేసి అందులో ఉన్న ట్యాబ్, ల్యాప్ టాప్, నాలుగు సెల్ఫోన్లు, నకిలీ పత్రాలు, రబ్బర్ స్టాంప్‌లను అపహరించుకు వెళ్లారు. దీంతో కోర్టు బెంచ్‌క్లర్క్ వి.నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేశారు. నగర ఇన్చార్జ్ డీఎస్పీ వై. హరినా«థ్‌రెడ్డి నేతృత్వంలో చిన్నబజారు ఇన్స్పెక్టర్ వీరేంద్రబాబు దర్యాప్తు ప్రా రంభించారు. కోర్టు ఆవరణలో సీసీ కెమెరాలు లేకపోవడంతో కేసు దర్యాప్తు క్లిష్టతరంగా మారింది. దీంతో కోర్టుకు వచ్చే రహదారులన్నింటిలోని సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో.. గురువారం తెల్లవారుజామున రెండుగంటల ప్రాం తంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా వెళ్లడాన్ని గుర్తించారు. వారు ఖుద్దూస్‌నగర్‌కు చెందిన పాత నేరస్తుడు, పొర్లుకట్టకు చెందిన అతని స్నేహితుడని తేలడంతో వారిద్దర్నీ అదుపులోకి తీసుకుని విచారించి..చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. రెండునెలల కిందట ఓ వృద్ధురాలిని కట్టేసి నగలు దొంగలించిన ఘటనలో పోలీసులు వీరిని అరెస్టు చేశారనీ, పదిరోజుల కిందటే వారు బయటకు వచ్చారని సమాచారం. -
హాలీవుడ్ మూవీ రేంజ్.. స్మగ్లర్లను ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు
సాక్షి, న్యూఢిల్లీ: అక్రమంగా గోవులను తరలిస్తున్న స్మగ్లింగ్ ముఠాను గురుగ్రామ్ పోలీసులు అర్ధరాత్రి ఛేజ్ చేసి పట్టుకున్నారు. దొంగలను పట్టుకునేందు పోలీసులు.. హాలీవుడ్ మూవీ రేంజ్లో రోడ్డుపై లారీని ఛేజ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. వివరాల ప్రకారం.. ఐదుగురు పశువుల స్మగ్లర్లు గోవులను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు వారి వాహనాన్ని వెంబడించారు. అయితే, స్మగ్లర్లు ఢిల్లీ బోర్డర్ నుండి గురుగ్రామ్‌లోకి ప్రవేశిస్తుండగా పోలీసులు వాహనాన్ని తనిఖీ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్మగ్లర్లు లారీని ఆపకుండా స్పీడ్‌గా వెళ్లిపోయారు. దీంతో పోలీసులు వారిని వెంబడించి దాదాపు 22 కిలోమీటర్ల దూరం ఛేజింగ్ చేసిన తర్వాత వారిని పట్టుకున్నారు. Cow Smugglers for Illegal Slaughter Perpetrators: TASLIM, SHAHID, KHALID, BALLU Thanks to Gurugram Police for catching these thieves. https://t.co/JnlW8cfOV9 — शुद्ध | Shuddha (@ShuddhaWorld) April 10, 2022 ఛేజ్ చేసే క్రమంలో పోలీసులు.. స్మగ్లర్ల లారీపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్ల్లో లారీ టైర్ పేలిపోయినప్పటికీ వారు వాహనాన్ని మాత్రం ఆపలేదు. కాగా, లారీ పట్టుకున్న తర్వాత పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత లారీలో తనిఖీలు చేపట్టగా అందులో తుపాకులు, బుల్లెట్లలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆవుల స్మగ్లర్లు గురుగ్రామ్‌లో భీభత్సం సృష్టించడం ఇదేమీ మొదటిసారి కాదు. హర్యానా ప్రభుత్వం ఆవుల స్మగ్లింగ్‌కు వ్యతిరేకంగా కఠినమైన చట్టాలను రూపొందించినప్పటికీ స్మగ్లర్లు రెచ్చిపోతూనే ఉన్నారు. పశువుల అక్రమ రవాణా పెరుగుతూనే ఉంది. -
యూత్ వింగ్ లీడర్ హల్చల్.. వీడియో వైరల్
గాంధీనగర్: పోలీసు కానిస్టేబుల్‌పై హత్యాయత్నం నేరం కింద ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరెస్ట్ అయ్యాడు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీ కింద జైలుకు తరలించారు. వివరాల ప్రకారం.. డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి చేసి, కానిస్టేబుల్‌ను తన కారు బానెట్‌పైకి లాగినందుకు గుజరాత్ ఆప్ యువజన విభాగం నాయకుడు యువరాజ్‌సింగ్ జడేజాను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, మంగళవారం కొందరు నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం గాంధీనగర్‌లోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వద్ద నిరసనలకు దిగారు. వారికి మద్దతు తెలిపేందుకు జడేజా అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు, జడేజా మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం అక్కడి నుంచే వెళ్లిపోయే క్రమంలో జడేజా.. వేగంగా తన కారు నడుపుతూ పోలీసులపైకి దూసుకెళ్లాడు. ఈ క్రమంలో కారు ఓ కానిస్టేబుల్ పైకి దూసుకెళ్లగా.. అతను కారు బ్యానెట్‌పైకి ఎక్కి జాగ్రత్తపడ్డాడు. అనంతరం జడేజా అక్కడి నుంచే పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులపై హత్యాయత్నం కింద ఆప్ నేతపై కేసు నమోదు చేసినట్టు ఇన్స్పెక్టర్ జనరల్ (గాంధీనగర్ రేంజ్) అభయ్ తెలిపారు. Gujarat AAP youth wing leader Yuvrajsinh Jadeja held for attacking cops, dragging constable on his car's bonnet.#AAP #Gujarat #Politics pic.twitter.com/ap5INyGybd — My Vadodara (@MyVadodara) April 6, 2022 జడేజా అరెస్ట్‌పై ఆప్ నేత ప్రవీణ్ రామ్ స్పందిస్తూ.. బీజేపీ ప్రభుత్వం తమను(ఆప్) చూసి భయపడుతోందని ఆరోపించారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదని అన్నారు. ప్రభుత్వ రిక్రూట్మెంట్ పరీక్షల్లో అక్రమాలను బయటపెట్టిన తర్వాత జడేజాను సర్కార్ టార్గెట్ చేసిందన్నారు. ఫారెస్ట్ గార్డుల రిక్రూట్మెంట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం కూడా లీక్ అయిందని జడేజా ఇటీవల పేర్కొన్నాడు. -
రెండోసారి బాధ్యతలు కోరుకోవడం లేదు: లిమాయే
న్యూఢిల్లీ: ఐదేళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత రెండోసారి బాధ్యతలను చేపట్టాలని కోరుకోవడం లేదని నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్ (ఎన్ఎస్ఈ) మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ విక్రమ్ లిమాయే స్పష్టం చేశారు. లిమాయే పదవీకాలం జూలైలో ముగుస్తున్న సంగతి తెలిసిందే. ఎన్ఎస్ఈలో పాలనా పరమైన లోపాలు, కో–లొకేషన్ వ్యవహారంపై సెబీ, సీబీఐ విచారణలు, మాజీ చీఫ్ చిత్రా రామకృష్ణ అరెస్ట్ నేపథ్యంలో లిమాయే ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ‘‘నేను రెండవ టర్మ్‌ను కొనసాగించడానికి ఆసక్తి చూపడం లేదు. అందువల్ల తిరిగి దరఖాస్తు చేయడంకానీ, ప్రస్తుతం జరుగుతున్న నియామకం ప్రక్రియలో పాల్గొనడం కానీ చేయడం లేదు. ఇదే విషయాన్ని బోర్డుకు తెలిపాను. నా పదవీకాలం 2022 జూలై 16వ తేదీతో ముగుస్తుంది’’ అని లిమాయే తెలిపారు. చాలా క్లిష్టమైన కాలంలో సంస్థను నడిపించడానికి, సంస్థను స్థిరీకరించడానికి, బలోపేతం చేయడానికి, పాలనా ప్రక్రియ, సమర్థతను మరింత పటిష్టంగా మార్చడానికి, సాంకేతిక పురోగతికి, వ్యాపార వృద్ధికి తన వంతు కృషి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. -
కెనెడా నిరసనకారుల అరెస్టు
విండ్సార్: కెనెడా– అమెరికా సరిహద్దును దిగ్బంధనం చేస్తున్న పలువురు నిరసనకారులను కెనెడా పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. చాలా రోజులుగా జరుగుతున్న సరిహద్దు దిగ్బంధాన్ని నివారించాలని యూఎస్ కోరిన మరుసటి రోజే కెనెడా అధికారులు చర్యలకు ఉపక్రమించారు. అంబాసిడర్ వారధి (అమెరికా– కెనడా మధ్య సరిహద్దు బ్రిడ్జి)పై నిలిచిన పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటు ట్రక్కులను కూడా తొలగించారు. అనంతరంఅక్కడ పోలీసు బారికేడ్లను పెట్టారు. త్వరలో బ్రిడ్జిని పునఃప్రారంభిస్తామని అధికారులు చెప్పారు. చాలా వారాలుగా కెనెడాలో కరోనా నిబంధనలను వ్యతిరేకిస్తూ పలువురు ఆందోళనలు చేస్తున్నారు. ట్రూడో ప్రభుత్వం వైదొలగాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. వీరి ప్రేరణతో యూరప్, న్యూజిలాండ్‌లో కూడా ఇలాంటి నిరసనలే ఆరంభమయ్యాయి. నిరసనల కారణంగా రాజధానిలో గతవారం ఎమర్జెన్సీ విధించారు. బ్రిడ్జిపై ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నా మరింత మంది అక్కడికి చేరుకుంటున్నారు. -
గంజాయి తరలిస్తున్న తెలుగు యువత నేత అరెస్ట్
సాక్షి, చిత్తూరు: కారులో గంజాయి తరలిస్తున్న చిత్తూరు జిల్లా పుత్తూరు తెలుగుయువత అధ్యక్షుడు బి.ఎస్.హరికృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖపట్నం నుంచి 28 కిలోల గంజాయిని తరలిస్తుండగా ఆయన్ని సోమవారం విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో పోలీసులు పట్టుకున్నారు. ఆయన తెలుగుదేశం నగరి నియోజకవర్గ ఇన్చార్జి గాలి భానుప్రకాష్‌కి ప్రధాన అనుచరుడు. హరికృష్ణ వ్యవహారాలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. చదవండి: రఘరామకృష్ణరాజు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు పుత్తూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారంవిలేకరుల సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ డి.జయప్రకాష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై రోజూ నిందారోపణలు చేసే టీడీపీ నాయకుడు గాలి భానుప్రకాష్ తన ప్రధాన అనుచరుడు హరికృష్ణ అరెస్టుపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో ఇసుక, లిక్కర్ స్మగ్లింగ్ మాత్రమే చేసేవారని, నేడు గంజాయి వరకు వ్యాపారాన్ని పెంచారని చెప్పారు. -
విమానం మిస్సయిందని చెప్పి...
న్యూఢిల్లీ: ప్రముఖ విదేశీ యూనివర్సిటీలో చదువుతున్నానని, ఫ్లైట్ మిస్ కావడంతో వేరే విమానంలో సొంతూరు వెళ్లేందుకు డబ్బు సాయం చేయాలని మోసం చేస్తున్న ఓ యువకుడిని ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయం అధికారులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన మోదెల వెంకట దినేశ్‌కుమార్ నాలుగైదేళ్లుగా ఈ దందా చేస్తూ 100 మందికి పైగా ప్రయాణికులను మోసగించినట్లు అధికారులు తెలిపారు. ఓ వ్యక్తి డిసెంబర్ 19న బరోడా నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కొచ్చారు. టెర్మినల్–3 వద్ద ఉన్న ఆయన్ను దినేశ్ మాటల్లోకి దించాడు. విదేశీ వర్సిటీ విద్యార్థినని పరిచయం చేసుకుని సొంతూరు విశాఖపట్టణం వెళ్లే విమానం మిస్సయిందని టికెట్‌ను చూపించాడు. మరో ఫ్లైట్‌లో వెళ్లాలంటే తన వద్ద ఉన్న రూ.6,500 సరిపోవని, విశాఖకు టికెట్ ఖరీదు రూ.15వేలు ఉంటుందని చెప్పాడు. ఇంటికి వెళ్లాక తిరిగి పంపిస్తానంటూ నమ్మబలికి ఆయన వద్ద నుంచి రూ.9,250 తన బ్యాంకు అకౌంట్‌కు గూగుల్ పేద్వారా వేయించుకున్నాడు. తర్వాత ఎన్నిసార్లు అడిగినా తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 30న దినేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
వ్యభిచారం కేసులో టీడీపీ నేత అరెస్టు
తాడికొండ: వ్యభిచారం కేసులో టీడీపీ నేత, అమరావతి దళిత జేఏసీ నేత చిలకా బసవయ్యను ఆదివారం గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. రాయపూడి – మోదుగ లింగాయపాలెం గ్రామాల మధ్య ఓ రేకుల షెడ్డులో తుళ్లూరుకు చెందిన ఓ యువతితో రాసలీలలు సాగిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దళిత జేఏసీ పేరిట కార్యకలాపాలు నిర్వహిస్తూ మహిళలను లొంగదీసుకుంటున్నాడనే ఆరోపణలు బసవయ్యపై ఉన్నాయి. యువతితో రాసలీలల్లో ఉండగా వీరికి కాపలాగా ఉన్న రామచంద్రవర్మ అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అరెస్ట్
ముంబై: వేల కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్‌ముఖ్ అరెస్ట్ అయ్యారు. దాదాపు 12 గంటల సేపు విచారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం అర్ధరాత్రి దాటాక ఆయనని అరెస్ట్ చేశారు. దేశ్‌ముఖ్‌ను మంగళవారం ముంబై ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి పి.బి.జాదవ్ ఆయనకు నవంబర్ 6 వరకు కస్టడీ విధించారు. అనిల్ దేశ్‌ముఖ్ హోంమంత్రిగా ఉన్నప్పుడు నెలకు రూ.100 కోట్ల వసూలు చేయాలని రాష్ట్ర పోలీసు శాఖకి లక్ష్యంగా నిర్ణయించారని ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ ఆరోపించడంతో దేశ్‌ముఖ్ రాజీనామా కూడా చేసిన విషయం తెలిసిందే. (చదవండి: రూ. 70 వేల చొక్కా.. రూ.25 లక్షల వాచీ) -
క్రికెటర్ యువరాజ్ సింగ్ అరెస్ట్..
Cricketer Yuvraj Singh Arrested: టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చహల్ సామాజిక వర్గాన్ని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌ను హర్యానా పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసినట్లు సమాచారం. అయితే ఆ వెంటనే అతన్ని బెయిల్‌పై విడుదల చేసినట్లు తెలుస్తోంది. గతేడాది జూన్‌లో భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మతో కలిసి ఓ లైవ్ సెషన్లో పాల్గొన్న యువరాజ్.. తోటి క్రికెటర్ చహల్‌ను ఉద్దేశించి మాట్లాడాడు. ఆ సమయంలో చహల్ సామాజిక వర్గాన్ని ప్రస్తావిస్తూ.. కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంపై స్పందించిన యువరాజ్.. తాను ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదని, తన మాటలు ఎవరినైనా నొప్పించినా, ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా క్షమించాలని కోరుతూ అప్పట్లో ట్వీట్ చేశారు. అయితే, యువరాజ్ చేసిన వ్యాఖ్యలు కుల అహంకారాన్ని సూచిస్తున్నాయని ఆరోపిస్తూ ఓ న్యాయవాది హిస్సార్ పరిధిలోని హాన్సీ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఫిర్యాదుపై ఈ ఏడాది లాక్డౌన్ అనంతరం విచారణ జరిపిన హిస్సార్ పోలీసులు.. యువరాజ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసారు. చదవండి: టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తుల ఆహ్వానం -
నకిలీ పోలీసుల ముఠా అటకట్టించిన పోలీసులు
-
లైంగిక వేధింపులకు పాల్పడుతున్న పాస్టర్ అరెస్ట్
-
ఇంగ్లండ్ జట్టును వేధిస్తున్న ప్రాంక్ స్టార్ జార్వో అరెస్ట్..
లండన్: భద్రతా నియమావళిని ఉల్లంఘిస్తూ.. టీమిండియా జర్సీ ధరించి.. మ్యాచ్ మధ్యలో మైదానంలోకి చొరబడి ఇంగ్లండ్ ఆటగాళ్లను వేధిస్తున్న ఇంగ్లండ్ ప్రాంక్ యూట్యూబర్ జార్విస్ అలియాస్ జార్వో 69ను లండన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. అతడు పదేపదే భద్రతా సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి ప్రవేశించి నానా హడావుడి చేస్తున్ననేపథ్యంలో తొలుత మందలింపులతో సరిపెట్టిన ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తాజాగా లండన్ దక్షిణ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జార్వోను అరెస్ట్ చేశారు. Jarvo again!!! Wants to bowl this time 😂😂#jarvo69 #jarvo #ENGvIND #IndvsEng pic.twitter.com/wXcc5hOG9f — Raghav Padia (@raghav_padia) September 3, 2021 'జార్వో 69' పేరిట యూట్యూబ్ ఛానల్ నిర్వహించే ఈ టీమిండియా అభిమాని ఇప్పటి వరకు మూడుసార్లు(లార్డ్స్ టెస్ట్, లీడ్స్ టెస్ట్, ఓవల్ టెస్ట్) మైదానంలోకి ప్రవేశించాడు. తాజాగా ఓవల్ టెస్ట్ రెండో రోజు ఉమేశ్ యాదవ్ బౌలింగ్ చేస్తున్న సందర్భంలో అకస్మాత్తుగా మైదానంలోకి చొరబడ్డ జార్వో.. తాను టీమిండియా బౌలర్‌ని అంటూ హంగామా చేశాడు. ఈ క్రమంలో నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ బెయిర్‌స్టోను ఢీకొంటూ బంతిని విసిరినట్లుగా యాక్షన్ చేశాడు. Jarvo is at the crease #engvsindia pic.twitter.com/XlATed4vGg — JJK (@72jjk) August 27, 2021 ఈ ఘటనతో బెయిర్‌స్టో ఒకింత అసహనానికి గురయ్యాడు. మరో ఎండ్‌లో బ్యాటింగ్ చేస్తున్న ఓలీ పోప్ కూడా తన ఏకాగ్రత దెబ్బతినిందని అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. అనంతరం సెక్యూరిటీ వచ్చి జార్వోను మైదానం నుంచి తీసుకెళ్లడంతో మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. దీనికి సంబంధించిన వీడియో వైరలయ్యింది. కాగా, లీడ్స్ టెస్టు అనంతరం జార్వోపై ఆ స్టేడియం నిర్వాహకులు జీవతకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయినా జార్వో మరోసారి అదే తరహాలో చేయడంతో ఈసీబీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి జార్వో అరెస్ట్‌కు సిఫార్సు చేశారు. India's 12th man 😂#ENGvINDpic.twitter.com/bS1OYIl6Tv — The Cricketer (@TheCricketerMag) August 14, 2021 చదవండి: జార్వో మళ్లీ వచ్చేశాడు.. ఈసారి బౌలర్ అవతారంలో -
మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కొయ్యూరు మండలం మర్రిపాలెం చెక్‌పోస్ట్ వద్ద ప్రభాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన ప్రభాకర్‌ను పోలీసులు అరెస్టు చేసి ఏలూరుకు తరలిస్తున్నట్లు సమాచారం. కాగా నిన్న దెందులూరులో పెట్రోల్ ధరలపై చింతమనేని ఆందోళన చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకుగాను దెందులూరు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఇన్స్పెక్టర్ అరెస్టు: దోపిడీ కేసులో పోలీసుల ఉదాసీనం
తమిళనాడులో ఇటీవల దారికాచి రూ.10 లక్షలు దోపిడీ చేసిన కేసులో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడంపై మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పోలీసులే దారి దోపిడీకి పాల్పడితే ప్రజల గతేమిటి. అరెస్ట్ చేయకుండా కాలయాపన చేస్తుంటే ప్రజల్లో పోలీసు శాఖపై విశ్వాసం ఎలా ఉంటుంది’ అని మండిపడ్డారు. ఈ క్రమంలో పోలీసులు ఎట్టకేలకు మహిళా ఇన్స్పెక్టర్ వసంతిని శుక్రవారం అరెస్ట్ చేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: శివగంగై జిల్లా ఇళయాన్గుడికి చెందిన బేకరీ వ్యాపారి అర్షిత్ (32) సరుకులు కొనుగోలు కోసం రూ.10 లక్షలు తీసుకుని జూలై 5న మదురై–తేని రోడ్డు సమీపంలోకి వచ్చాడు. అదే సమయంలో నాగమలై పుదుకోట్టై పోలీస్ ఇన్స్పెక్టర్ వసంతి.. పాల్పాండి, పాండియరాజన్, ఉక్కిరపాండి, సీమైస్వామిని వెంట బెట్టుకుని అక్కడి చేరుకున్నారు. తనిఖీల పేరు తో అర్షిత్ వద్దనున్న రూ.10 లక్షలు లాక్కుని బెదిరించి పంపేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్పీ ఆదేశాలతో కేసు నమోదు చేసిన మదురై జిల్లా క్రైం బ్రాంచ్ పోలీసు లు విచారణ చేపట్టారు. ఇన్స్పెక్టర్ వసంతి అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో డీజీపీ ఆమెను సస్పెండ్ చేశా రు.చదవండి:బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్ తప్పనిసరి..మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. సంఘటన జరిగిన రోజు వసంతితోపాటు ఉన్న తేనికి చెందిన పాల్ పాండిని ఈ నెల 10వ తేదీన పోలీసులు అరెస్ట్ చేసి రూ.61 వేలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఉక్కిరపాండి, సీమైస్వామి అరెస్ట్ చేసి రూ.1.65 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అజ్ఞాతంలో ఉన్న ఇన్స్పెక్టర్ వసంతి మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంలో తన న్యాయవాది ద్వారా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు నాలుగు రోజుల క్రితం విచారణకు వచ్చింది. పోలీసుల తీరుపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన జరిగి నెలరోజులైనా ఇన్స్పెక్టర్ వసంతిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ఇలాంటి ఉదాసీన పోకడల వల్లే పోలీసులంటే ప్రజల్లో విలువ తగ్గి పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితురాలిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించి కేసు వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో నీలగిరి జిల్లా కొత్తేరిలో ఉన్న వసంతిని, ఆమె కారు డ్రైవర్‌ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. చదవండి: 20 ఏళ్ల క్రితం ఇంటికి తాళం.. దెయ్యాలు ఉంటాయని పూజలు -
మాజీ ఐపీఎస్ అమితాబ్ ఠాకూర్ అరెస్ట్
లక్నో: 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించబోతున్నానంటూ ప్రకటించిన కొద్ది గంటల్లోనే మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ అరెస్టయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. అత్యాచార బాధితురాలికి వ్యతిరేకంగా నిందితుడికి సాయం చేశారన్న ఆరోపణలపై ఆయన్ను ఆరెస్టు చేసినట్లు పోలీసుల ప్రకటించారు. ఈ నెల 16న ఓ యువతి (24) ఆమె స్నేహితుడు కలసి సుప్రీంకోర్టు ఎదుట కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నారు. తనపై బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీ అతుల్‌రాయ్ అత్యాచారం చేయగా, ఆయనకు సాయం చేసేలా కొంత మంది పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ ఆత్మహత్యాయత్నానికి ముందు ఆమె ఆరోపించారు. అనంతరం కాలిన గాయాలతో ఆ యువతి ఈ నెల 24న కన్నుమూశారు. ఈ వ్యవహారంపై ప్రత్యేక విచారణ బృందం (సిట్)ఏర్పాటైంది. ఈ బృందం విచారణ జరిపి అనంతరం ఆ రిపోర్టును శుక్రవారం సమర్పించింది. ఈ నేపథ్యంలోనే ఠాకూర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలికి వ్యతిరేకంగా, నిందితుడు అతుల్‌రాయ్‌కు మద్దతుగా ఆయన వ్యవహరించారని అభియోగాలు మోపి, మొత్తం ఏడు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వ ఒత్తిడితోనే పోలీసులు ఇలా పని చేస్తున్నారని విమర్శించారు. -
తాలిబన్లకు మద్దతిచ్చిన 15 మంది అరెస్టు
గువాహటి/హైలకండి: తాలిబన్లకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు గానూ అస్సాం పోలీసులు 15 మందిని అరెస్టు చేశారు. వీరిలో అస్సాంకు చెందిన పోలీస్ కానిస్టేబుల్, ఒక ఉపాధ్యాయుడు, ముగ్గురు మౌలానాలు, ఓ జర్నలిస్టు కూడా ఉన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వీరిని అరెస్టు చేసినట్లు స్పెషల్ డీజీపీ జీపీ సింగ్ శనివారం ట్వీట్ చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం, ఐటీ చట్టం, సీఆర్పీసీ వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తాలిబన్లకు సంబంధించి పోస్టులను లైక్ చేయడం, ట్వీట్ చేయడం, రీట్వీట్ చేయడం వంటి చర్యలను మానుకోవాలని జీపీ సింగ్ హెచ్చరించారు. అలా చేస్తే వారిపై క్రిమినల్ విచారణ జరుపుతున్నామని డిప్యూటీ ఐజీ వయొలెట్ బారువా తెలిపారు. అలాంటి కేసులు ఏవైనా కనిపిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. -
జైషే ఉగ్ర కుట్ర భగ్నం
జమ్మూ: స్వాతంత్రదినోత్సవం రోజునే బైక్‌బాంబును పేల్చి విధ్వంసం సృష్టించాలన్న జైషే మొహమ్మద్ ఉగ్రసంస్థ పన్నాగాన్ని భద్రతాబలగాలు విజయవంతంగా అడ్డుకున్నాయి. జమ్మూ జిల్లా కేంద్రంలో బాంబు పేలుడుకు సిద్ధమైన నలుగురు జైషే ఉగ్రవాదులు, వారికి సాయపడిన ఉత్తరప్రదేశ్ వాసిని, వారి సహాయకులను పోలీసులు అరెస్ట్‌చేశారు. డ్రోన్ల ద్వారా అందే ఆయుధాలను తోటి ఉగ్రవాదులకు చేరవేసే పనిలో బిజీగా ఉండగా వీరిని అరెస్ట్‌చేశారు. అయోధ్య రామజన్మభూమిపై నిఘా పెట్టాలని, దాడికి సంబంధించిన ఆయుధాలను అమృత్‌సర్‌లో డ్రోన్ ద్వారా అందుతాయని, పాక్‌లోని ఉగ్రవాది.. యూపీకి చెందిన సోనూ ఖాన్ అనే వ్యక్తిని ఆదేశించాడు. ఆ పని పూర్తిచేసేలోపే పోలీసులు ఖాన్‌ను అరెస్ట్‌చేశారు. -
పిస్టొల్తో గాల్లోకి కాల్పులు జరిపిన వ్యక్తి అరెస్ట్
-
గుర్రంలా సకిలించినందుకు జైలుశిక్ష
డోలు.. డోలు కొట్టుకుంటే మధ్యలో ఉన్న మద్దెలను వాయించినట్లు... రష్యాలోని ఓ భార్యభర్తల గొడవ, వీధి ప్రజల నిద్రను మాయం చేసింది. అది కూడా సుమారు రెండున్నర సంవత్సరాల పాటు. కారణం, రోజూ వారి గొడవలు వినలేక కాదు, గుర్రం సకిలింతలు వినలేక. భార్యభర్తల గొడవల మధ్యలో గుర్రం సకిలింతలు ఏంటని ఆలోచిస్తున్నారా? నిజానికి ఆ భార్యభర్తలు గొడవపడి, విడిపోయి మూడు సంవత్సరాలు అవుతోంది. కానీ, అతను మాత్రం భార్య తనని వదిలేసి వెళ్లడాన్ని జీర్ణించుకోలేపోయాడు. ఆ అవమానం, బాధ తట్టుకోలేక కుమిలిపోయాడు. చివరకు మతిస్థిమితం కోల్పోయి, ఓ సైకోలా తయారయ్యాడు. ఎంతలా అంటే కేవలం వీధి ప్రజల నిద్ర చెడగొట్టడానికి వేల రూపాయలు ఖర్చు చేసి, ఓ పెద్ద సౌండ్ సిస్టమ్, స్పీకర్స్ కొన్నాడు. ఇక రోజూ వాటిని ఉపయోగించి, ప్రతిరోజూ గుర్రంలా సకిలిస్తూ, ఆ శబ్దాలతో హోరెత్తించేవాడు. అలా సుమారు రెండన్నర సంవత్సరాల పాటు కొనసాగించాడు. అతని బాధ చూడలేక కొంతమంది, అతన్ని మానసికవైద్యశాలలో చేర్పించాలని కూడా చూశారు. ఎటువంటి లాభం లేకపోయింది. దీంతో విసుగు చెందిన వీధి ప్రజలు ఎంతోమంది అధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి, కోర్టుకు అప్పగించారు. కోర్టు అతడికి మూడున్నర సంవత్సరాల జైలుశిక్ష విధించింది. -
బ్యాంకులకు 3,316 కోట్ల ఎగవేత
సాక్షి, హైదరాబాద్: నకిలీ పత్రాలు సృష్టించి జాతీయ బ్యాంకుల కన్సార్షియం నుంచి రుణాలు తీసుకొని చెల్లించకుండా మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఉప్పలపాటి హిమబిందును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఎస్బీఐ, ఆంధ్రా బ్యాంక్ (ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం అయింది), కార్పొరేషన్ బ్యాంక్‌ల కన్సార్షియం నుంచి వీఎంసీ డైరెక్టర్లు భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నారు. కానీ తిరిగి చెల్లించకపోవడంతో.. ఇప్పుడు బకాయిల మొత్తం ఏకంగా రూ. 3,316 కోట్లకు చేరింది. దీనితో కన్సార్షియం బ్యాంకులు సీబీఐకి ఫిర్యాదు చేశాయి. భారీ మొత్తంలో రుణాలు తీసుకోవడానికి వీఎంసీ డైరెక్టర్లు నకిలీ పత్రాలు సృష్టించారని తెలిపాయి. ఈ నేపథ్యంలో వారిపై కేసులు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఆ సమయంలోనే తమకు బీఎస్ఎన్ఎల్ లిమిటెడ్ నుంచి రూ.262 కోట్ల మేరకు బకాయిలు రావాల్సి ఉందని, ఆ డబ్బులు వచ్చిన తర్వాత రుణాలు చెల్లిస్తామని డైరెక్టర్లు నమ్మబలికారు. అయితే వీఎంసీకి బీఎస్ఎన్ఎల్ నుంచి రావాల్సిన మొత్తం రూ.33 కోట్లు మాత్రమేనని తేలింది. ఈ క్రమంలో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. గత నెల 20వ తేదీన వి.హిమబిందు, వి.సతీష్, వి.మాధవి నివాసాల్లో సోదాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పత్రాలు, 40 ఎక్సటర్నల్ హార్డ్ డిస్క్‌ల్లో నిక్షిప్తమైన డిజిటల్ డేటాతో పాటు, ఆరు మొబైల్ ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. కాగా వీఎంసీ సంస్థ కన్సార్షియం బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను అనుబంధ సంస్థలకు తరలించినట్లు ఆడిట్ నివేదికల్లో బయటపడిందని ఈడీ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. బీఎస్ఎన్ఎల్ నుంచి టెండర్లు దక్కించుకోవడంలో పీఐఎస్‌ఎల్ అనే సంస్థకు ఎలాంటి పాత్ర లేకపోయినా మూడు శాతం కమీషన్‌ను వీఎంసీఎల్ చెల్లించినట్లు తేలిందని వివరించింది. పీవోఎంఎల్ కోర్టులో హాజరు హిమబిందు రూ.692 కోట్ల మేరకు డమ్మీ లెటర్ ఆఫ్ క్రెడిట్ లు (ఎల్వోసీ) సృష్టించినట్లు ఈడీ పేర్కొంది. విదేశాల్లో త మ బంధువులు నడిపిస్తున్న సంస్థలకు పెద్ద మొత్తంలో నిధు లు మళ్లించినట్లు తెలిపింది. దర్యాప్తునకు సహకరించ లేదని, విదేశీ లావాదేవీల గురించి అవాస్తవాలు చెబుతున్న నేపథ్యం లో ఆమెను అరెస్టు చేసి ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ కోర్టు లో హాజరుపర్చినట్లు ఈడీ తెలిపింది. కోర్టు ఈనెల 18వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించినట్లు వివరించింది. -
పోలీసులకు చిక్కిన టైగర్ హుంగా
సుకుమా (చత్తీస్గడ్): మావోయిస్టు కమాండర్ టైగర్ హుంగా సుక్మా పోలీసులకు చిక్కడు. చత్తీస్గడ్ కేంద్రంగా మావోయిస్టులు చేపట్టిన అనేక ఆపరేషన్లలో హుంగా కీలకంగా వ్యవహరించాడు. మావోయిస్టుల పార్టీలో హుంగాను టైగర్‌గా పిలుచుకుంటారు. అయితే టైగర్ హూంగాను అరెస్టు చేసినట్లు సుకుమా ఎస్పీ సునీల్ శర్మ తెలిపారు. టైగర్ హుంగా దాడుల్లో దిట్ట చత్తీస్‌గడ్‌లోని సుకుమా జిల్లా కిస్టారం ప్రాంతంలో మావోయిస్టులు దాడికి సంబంధించి 17 ప్రధాన ఘటనల్లో టైగర్ హుంగా కీలక పాత్ర పోషించాడు. దీంతో పాటు పాలోది ప్రాంతంలో ల్యాండ్ మైన్ ప్రూఫ్ వాహన పేల్చివేతలో టైగర్ హూంగా ప్రధాన బాధ్యత తీసుకున్నాడు. ఈ పేలుడులో 9 మంది జవాన్లు చనిపోయారు. 2020లో టైగర్ హూంగా నేతృత్వంలో జరిగిన ఐఈడీ పేలుడు ఘటనలో సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ మరణించారు. ఇటీవల దండకారణ్యంలో జరిగిన పలు ప్రధాన ఘటనల్లో టైగర్ హుంగా కీలకపాత్ర పోషించినట్లు ఎస్పీ తెలిపారు. -
యువతితో రెండేళ్ల సహజీవనం.. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్
కంభం(ప్రకాశం జిల్లా): ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. స్థానిక పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మార్కాపురం సీఐ బీటీ నాయక్, కంభం ఎస్ఐ నాగమల్లేశ్వరరావులు కేసు వివరాలు వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం.. మండలంలోని చిన్నకంభం గ్రామానికి చెందిన కాగిపోగు ప్రభాకర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ వైద్యశాల వైద్యుడికి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదే వైద్యశాలలో డెంటల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పట్టణానికి చెందిన యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఇద్దరూ ప్రేమలో పడి రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతి అడుగుతుండగా మాట దాటేస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడన్న విషయం తెలుసుకొని అతడిని ప్రశ్నించింది. అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారవడంతో బాధితురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక పోలీసుస్టేషన్ ఈ నెల 14వ తేదీన ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి 16వ తేదీ సాయంత్రం మార్కాపురం బస్టాండ్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి గిద్దలూరు కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు. -
కిలాడీ దేవసేన.. అమ్మకు క్యాన్సర్ అని చెప్పి ఫోన్, ఆపై
టీ.నగర్: కారైకుడిలో నకిలీ మహిళా సబ్ ఇన్స్పెక్టర్ను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. అమరావతి పురూరుకు చెందిన వడివుక్కరసి(33) మానగిరిలోని పాఠశాలలో తమిళ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. ఈమె భర్త మురుగానందం. ఇతను మాజీ సైనికుడు. కొన్ని నెలల క్రితం వడివుక్కరసి సొంతపని నిమిత్తం తిరువాడానై వెళ్లి బస్సులో తిరిగివస్తుండగా పక్క సీట్లో కూర్చున్న మహిళ ఒకరు వడివుక్కరసితో మాటలు కలిపింది. తన పేరు దేవసేన అని, తెన్కాశి పోలీసు శాఖలో టెక్నికల్ విభాగం సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం సెలవుపై వస్తున్నానని, తన సొంతవూరు దొండి అని పేర్కొంది. ఆ తర్వాత తరచుగా ఫోన్లో మాట్లాడడమే కాకుండా, కొన్ని సార్లు వడివుక్కరసి ఇంటికి వచ్చింది. ఒకరోజు వడివుక్కరసికి దేవసేన ఫోన్ చేసి తన అమ్మ కేన్సర్‌తో బాధపడుతున్నట్లు అర్జంటుగా రూ.50 కావాలని తెలిపింది. దీంతో వడివుక్కరసి దేవసేన బ్యాంకు ఖాతాకు రూ.50 వేలు పంపారు. ఆ తర్వాత దేవసేన నుంచి ఫోన్‌కాల్ రాలేదు. ఆమె నెంబరుకు ఫోన్ చేయగా సరిగా మాట్లాడలేదు. దీంతో అనుమానించిన వడివుక్కరసి, ఆమె భర్త దొండి చిరునామాలో విచారించగా ఆమె కారైకుడి కళనివాసల్‌లోని స్నేహితురాలి ఇంట్లో ఉన్నట్లు తెలిసింది. దీంతో వడివుక్కరసి కారైకుడి నార్త్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి శనివారం దేవసేన (20)ను అరెస్టు చేశారు. చదవండి: కరోనా దేవి.. అచ్చం నటి వనిత విజయకుమార్ మాదిరిగానే -
Wrestler Sushil Kumar: సుశీల్ చిక్కాడు...
న్యూఢిల్లీ: పోలీసులు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసినా... కోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించినా... యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో 19 రోజులుగా పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. ఆదివారం ఉదయం ఢిల్లీ శివారులోని ముండ్కా ప్రాంతంలో సుశీల్ కుమార్, అతడి అనుచరుడు అజయ్ కుమార్‌ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం సుశీల్, అజయ్‌లను కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు లోపల సుశీల్‌ను 30 నిమిషాలపాటు ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు మరిన్ని వివరాల రాబట్టేందుకు 12 రోజులపాటు తమ కస్డడీకి అప్పగించాలని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ దివ్యా మల్హోత్రాను కోరగా.... ఆరు రోజులపాటు సుశీల్, అజయ్‌లను కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులకు అనుమతి ఇచ్చారు. ఏం జరిగిందంటే... ఈ నెల నాలుగో తేదీన అర్ధరాత్రి ఛత్రశాల్ స్టేడియంలో జాతీయ గ్రీకో రోమన్ రెజ్లింగ్ చాంపియన్ సాగర్ రాణా, అతని మిత్రులు సోనూ, అమిత్ కుమార్‌లతో సుశీల్ కుమార్, అతని అనుచరులు గొడవ పడ్డారు. ఈ గొడవలో సాగర్, సోనూ, అమిత్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 23 ఏళ్ల సాగర్ రాణా మృతి చెందాడు. తమపై సుశీల్, అతని అనుచరులు దాడి చేశారని ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో సోనూ, అమిత్ పేర్కొన్నారు. దాంతో సుశీల్, అతని అనుచరులపై ఢిల్లీ పోలీసులు ఐపీసీ సెక్షన్ 302 (హత్య)తోపాటు మరో 10 సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఈ సంఘటన జరిగిన తర్వాతి రోజు (మే 5) నుంచి సుశీల్ పరారీలో ఉన్నాడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు సుశీల్ హరియాణా, చండీగఢ్, పంజాబ్, గయా, గురుగ్రామ్ ఇలా ఒక్కో రోజు ఒక్కో ప్రాంతంలో గడిపినట్లు సమాచారం. ఫోన్ ద్వారా తన ఆచూకీ దొరకకూడదనే ఉద్దేశంతో సుశీల్ 14 వేర్వేరు సిమ్ కార్డులు వాడినట్లు తెలిసింది. సుశీల్ ఆచూకీ తెలిపితే రూ. లక్ష రివార్డు కూడా ఇస్తామని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. ఆఖరికి ఆదివారం ఉదయం ఢిల్లీ శివారులో తన అనుచరుడు అజయ్‌తో కలిసి స్కూటర్‌పై వెళ్తుండగా ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు సుశీల్ చిక్కాడు. ఖేల్ ఖతమ్! అంతర్జాతీయస్థాయిలో ఎన్నో గొప్ప విజయాలు సాధించిన 37 ఏళ్ల సుశీల్ కుమార్ పరువు, ప్రతిష్ట తాజా ఉదంతంతో మసకబారిపోయింది. ఈ హత్యతో తనకు సంబంధంలేదని సుశీల్ వివరణ ఇస్తున్నాడు. అయితే అతనికి వ్యతిరేకంగా పోలీసుల వద్ద బలమైన సాక్ష్యాలు ఉన్నట్లు సమాచారం. నార్నర్త్ రైల్వేలో సీనియర్ కమర్షియల్ మేనేజర్ అయిన సుశీల్ ఐదేళ్లుగా ఛత్రశాల్ స్టేడియంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా కొనసాగుతున్నాడు. అయితే సుశీల్ సమక్షంలోనే గొడవ జరగడం... సాక్ష్యాలూ ధ్వంసం కావడం... ఎఫ్ఐఆర్లో అతని పేరు ఉండటం.. తాజాగా అరెస్టు కూడా కావడంతో సుశీల్ ఉద్యోగం ఊడే అవకాశముంది. ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ తరఫున రెండు వ్యక్తిగత పతకాలు నెగ్గిన ఏకైక క్రీడాకారుడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కిన సుశీల్... తాజా సంఘటనతో భవిష్యత్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశాలకు తెరపడిందనే చెప్పాలి. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ లో చివరిసారి భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన సుశీల్ 20వ స్థానంలో నిలిచాడు. సుశీల్ ఘనతలు 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం, 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజతం. 2010 ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం. 2010 ఢిల్లీ, 2014 గ్లాస్గో, 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకాలు 2006 దోహా ఆసియా క్రీడల్లో కాంస్యం. ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం (2010), రజతం (2007), రెండు కాంస్యాలు (2003, 2008). కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో (2003, 2005, 2007, 2009, 2017) ఐదు స్వర్ణాలు, ఒక కాంస్యం (2005). 1998, 1999 ప్రపంచ క్యాడెట్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాలు. అవార్డులు అర్జున అవార్డు: 2005; రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న: 2009; పద్మశ్రీ: 2011 -
రైస్‌పుల్లింగ్: రాగిపాత్రకు రంగుపూసి..
మదనపల్లె టౌన్(చిత్తూరు జిల్లా): రైస్‌పుల్లింగ్ ముఠా సభ్యులు 13 మందిని మదనపల్లె రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. మూదు కార్లు, ద్విచక్ర వాహనం, రూ. 20 వేలకుపైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ దిలీప్‌కుమార్ కథనం మేరకు మదనపల్లె పరిసర ప్రాంతాల్లో ఓ ముఠా రైస్‌పుల్లింగ్ పేరుతో మోసం చేస్తోందని సమాచారం అందింది. బుధవారం సాయంత్రం మదనపల్లె రూరల్ మండలంలో మదనపల్లె–పుంగనూరు మార్గంలోని బసినికొండ వై–జంక్షన్ వద్ద మూడు వాహనాల్లో వచ్చిన కొంతమంది రాగిపాత్రను పరిశీలిస్తున్నారు. పోలీసులు అక్కడికి వెళ్లడాన్ని చూసి పరారయ్యేందుకు యత్నించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. రాగిపాత్రకు రంగుపూసి టార్చిలైట్ వేస్తే కొంత సేపటికి లైటింగ్ ఆగిపోతుందని, తరువాత ఆ పాత్ర మహిమ కలిగిన రైస్ ఫుల్లింగ్(అక్షయపాత్ర)గా మారిపోతుందని నమ్మిస్తున్నారు. ఆ పాత్రను రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షలకు విక్రయించేందుకు యత్నిస్తున్నారు. నిందితులను అరెస్టు చేశారు. మూడు కార్లు, ద్విచక్రవాహనం రూ.20,700 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో తిరుపతి ఎన్జీవో కాలనీకి చెందిన శాంతిలాల్(37), రామచంద్రాపురం మండలం చుట్టగుంట గ్రామానికి చెందిన జె.శ్రీనివాసులు(45), దుర్గసముద్రం ప్రాంతానికి చెందిన ఎన్.శివశంకరయ్య(48), మదనపల్లె రూరల్ మండలం బసినికొండకు చెందిన జి.శ్రీనివాసులు(35) వైఎస్ఆర్ జిల్లా చిప్పిడిరాళ్ల గ్రామానికి చెందిన కె.మధుసూదన్‌రెడ్డి(32), కర్ణాటకలోని ఎలహంకకు చెందిన కె.ఎం.మునీష్(27), చిక్బళ్లాపూర్కు చెందిన వి.నాగరాజు(25), అనంతపురం జిల్లా బండార్లపల్లెకు చెందిన న్యాయవాది డి.చెన్నారెడ్డి(55), తాడిపత్రిలోని సుంకులమ్మ కాలనీకి చెందిన పి.నాగరాజు(40), నంద్యాల రోడ్డు సీపీఐ కాలనీకి చెందిన పి.చంద్రహాస్(21), ఎర్రంకలవారిపల్లెకు చెందిన బి.ప్రేమానందరెడ్డి(42) తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా వెంకటాపూర్‌కు చెందిన డి.రాజేంద్రప్రసాద్(33), కూకుట్‌పల్లెలోని నీలాద్రీ టవర్స్‌కు చెందిన ఎస్.అశోక్‌రెడ్డి(42) ఉన్నారు. చదవండి: యువతి బ్లాక్మెయిల్: డబ్బులు పంపించు.. లేదంటే.. ప్రియుడితో ఏకాంతంగా భార్య.. ఊహించని షాకిచ్చిన భర్త -
బంగ్లాదేశ్‌లో మహిళా జర్నలిస్ట్ అరెస్టు
ఢాకా: వలసవాద కాలానికి చెందిన అధికారిక గోప్యతా చట్టం (1923) కింద బంగ్లాదేశ్ ప్రభుత్వం ఓ ప్రముఖ మహిళా జర్నలిస్టు రోజినా ఇస్లాంను అరెస్టు చేయడంపై అక్కడి జర్నలిస్టు సంఘాలు, హక్కుల సంఘాలు మండిపడ్డాయి. ప్రభుత్వానికి చెందిన కొన్ని ఫైల్స్‌ను ఆమె అనుమతి లేకుండా ఫొటోలు తీశారని, అందువల్ల అరెస్టు చేసినట్లు అధికారులు చెప్పారు. పోలీసులు ఐదురోజుల కస్టడీ కోరగా కోర్టు నిరాకరించి జైలుకు పంపింది. అరెస్టయిన మహిళా జర్నలిస్టు రోజినా ఇస్లాం ఆ దేశంలోని ప్రోతోమ్ అలో అనే వార్తా పత్రికకు పని చేస్తున్నారు. అది దేశంలోనే అతి పెద్ద వార్తా పత్రిక కావడం గమనార్హం. చదవండి: బైడెన్ దంపతుల ఆదాయమెంతో తెలుసా? -
Putta Madhu: భీమవరం ఎపిసోడ్లో నిజమెంత?
సాక్షి, హైదరాబాద్: న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అజ్ఞాతంలోకి వెళ్ళిన పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు.. తన ఆచూకీ పోలీసులకు చిక్కకుండా చాలా పకడ్బందీగా వ్యవహరించాడు. నిన్నమొన్నటి వరకు ఎక్కడా సెల్‌ఫోన్ వాడలేదు, కుటుంబ సభ్యులు, అనుచరులను ఫోన్లో సంప్రదించలేదు. సొంత వాహనం వాడలేదు. హోటళ్లు, లాడ్జిలలో కాకుండా తెలిసిన వారి వద్దే తలదాచుకున్నాడు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌తో పాటు వివిధ రాష్ట్రాల్లో తిరిగాడనే అనుమానాలున్నా, ఎక్కడా సొంత ఏటీఎం కార్డు కూడా వాడలేదంటే ఎంత పకడ్బందీగా వ్యవహరించాడో అర్థమవుతోంది. మధుకు ఆప్తుడైన కర్ణాటకకు చెందిన ఓ మిత్రుడికి ఏపీలోని రావులపాలెంలో ఉన్నవారితో సంబంధాలు ఉన్నాయని, ఆ పరిచయాల ఆధారంగా మధు భీమవరంలో ఆశ్రయం పొందినట్లు పోలీసువర్గాలు చెబుతున్నాయి. మధు ఆచూకీ కనిపెట్టాలని మధుకు దగ్గరగా ఉండే ఓ ఇన్స్పెక్టర్ను ఉన్నతాధికారులు ఆదేశించారని, ఆ అధికారి సూచనల మేరకు ఇటీవల కుటుంబ సభ్యులు మధును సంప్రదించగా.. ఆ సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా భీమవరంలో అతని జాడను కనిపెట్టారని చెబుతున్నారు. సుపారీ టేపులపై రెండున్నరేళ్ల తర్వాత కేసు! వామన్‌రావు దంపతుల హత్య కేసు నిందితుల్లో ఒకరైన కుంట శ్రీను పేరుతో, 2018 ఎన్నికలకు ముందు మధు పేరును ప్రస్తావిస్తూ ఓ హత్యకు సంబంధించి జరిగిన సుపారీ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హత్యకు డీల్ రూ.60 లక్షలకు కుదిరింది. రెండున్నరేళ్ల తర్వాత, వామన్‌రావు హత్య అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు, ఇటీవల వాయిస్ టెస్టుకు అను మతి కోరుతూ మంథని కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఇన్ని రోజులు కుంటశ్రీను ఎవరితో సుపారీ మాట్లాడాడు? అసలు ఆ గొంతు ఎవరిది? అన్న విషయాన్ని తేల్చకపోవడం గమనార్హం. చదవండి: లాయర్ల హత్య: ‘అప్పటి ఆరోగ్య మంత్రిపై అనుమానం’ -
టీవీవీ గౌరవాధ్యక్షుడు రవీందర్రావు అరెస్టు
సాక్షి, రామకృష్ణాపూర్(చెన్నూర్): తెలంగాణ విద్యావంతుల వేదిక (టీవీవీ) రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గురిజాల రవీందర్రావును పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. మావోయిస్టు భావజాల వ్యాప్తి చేస్తున్నారన్న అభియోగాలతో ఆయన స్వగృహం రామకృష్ణాపూర్ పరిధి క్యాతనపల్లిలో అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 7 గంటల నుంచే ఆయన ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 2 సిమ్ కార్డులు, విప్లవ సాహిత్యంతో కూడిన సీడీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ‘రవీందర్రావు టీవీవీ ముసుగులో మావోయిస్టులకు సహకరిస్తున్నారు. రవీందర్రావు ఇటీవల మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు వారణాసి సుబ్రహ్మణ్యానికి ఆశ్రయమిచ్చారు. సుబ్రహ్మణ్యం గత నవంబర్‌లో 20 రోజుల పాటు రవీందర్రావు ఇంట్లో తలదాచుకున్నాడు. రవీందర్రావు మావోయిస్టు కీలక నేతలతో అందుబాటులో ఉంటూ అర్బన్ నక్సలిజాన్ని విస్తరింపజేస్తున్నారు. లా అండ్ ఆర్డర్, ఇంటెలిజెన్స్ పోలీసుల పక్కా సమాచారం మేరకు రవీందర్రావు ఇంట్లో సోదాలు నిర్వహించాం. రవీందర్‌రావుపై 120, 120బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నాం..’అని సీపీ తెలిపారు. పీపుల్స్‌వార్‌లో క్రియాశీలకంగా.. క్యాతనపల్లికి చెందిన రవీందర్రావు 1978 నుంచే ర్యాడికల్ యూత్ వింగ్‌లో పనిచేసినట్లు సీపీ సత్యనారాయణ తెలిపారు. ‘రవీందర్రావు ఆ క్రమంలోనే ఎదుగుతూ అప్పటి పీపుల్స్‌వార్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. కొన్నాళ్ల అనంతరం సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస)లో కీలక బాధ్యతలు చేపట్టారు. కొంతకాలం అజ్ఞాతంలో ఉంటూ పనిచేసి.. రెండు దశాబ్దాల క్రితం లొంగిపోయారు. ప్రస్తుతం టీవీవీని ఆయన ఆసరాగా చేసుకుని మావోయిస్టు భావజాల వ్యాప్తికి హితోధికంగా సహకరిస్తున్నారు..’ అని సీపీ పేర్కొన్నారు. నాకే సంబంధం లేదు.. అరెస్టు అక్రమం: రవీందర్రావు ఇటు పోలీస్‌స్టేషన్‌లో గురిజాల రవీందర్రావు విలే కరులతో మాట్లాడారు.. అకారణంగా తనను పోలీ సులు అరెస్టు చేయడం అక్రమమన్నారు. తాను టీవీవీలో మాత్రమే పనిచేస్తున్నానని, మావోయిస్టు పార్టీతో తనకు సంబంధం లేదని వెల్లడించారు. చదవండి: గెలుపు సంబరాల్లో గన్‌తో హల్చల్ -
సంక్రాంతికి సొంతూళ్లకు వెళుతుంటే జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఆ ఇద్దరు దొంగల వివరాలు తెలిపారు. ఈస్ట్ జోన్ పరిధిలో వరుస ఇళ్ల దొంగతనాలు చేసిన షేక్ అబ్దుల్ జాఫర్‌ని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లోని టౌలిచౌకీకి చెందిన ఇతడు ఆటో డ్రైవర్‌గా కూడా పని చేస్తున్నాడు. ఆటో నడుపుతూనే దొంగతనాలు చేస్తున్నాడు. అతడి నుంచి 23 తులాల బంగారం, డైమండ్ హారంతో పాటు ఒక బైక్‌ని సీజ్ చేసినట్లు వెల్లడించారు. వీటి విలువ రూ.12 లక్షలు ఉంటుందని వివరించారు. 2006 నుంచి ఇప్పటివరకు ఇతడిపై మొత్తం 66 ఇళ్ల దొంగతనాల కేసులున్నాయి. హైదరాబాద్‌లోని కిషన్‌బాగ్‌కు చెందిన హాబీబ్ అజమత్ దక్షిణ జోన్ పరిధిలో దొంగతనాలు చేస్తున్నాడు. ఇతడి సహాయకుడు షారూఖ్ పరారీలో ఉన్నాడు. నిందితుడి నుంచి రూ.10.50 లక్షల విలువైన 20 తులాల బంగారంతో పాటు ఆటోని సీజ్ చేశారు. ఇతడిపై ఇప్పటివరకు 30 కేసులు నమోదై ఉన్నాయి. ఈ ఇద్దరి నుంచి మొత్తం రూ.22.50లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. సంక్రాంతి సెలవులకు సొంతూళ్లకు వెళ్లిన వారికి కొన్ని జాగ్రత్తలు తెలిపారు. తాము ఊళ్లకు వెళ్తున్నామని సోషల్ మీడియాలో ప్రకటించొద్దని.. అది దొంగలకు వరంగా మారుతుందని కమిషనర్ అంజనీకుమార్ చెప్పారు. గ్రామానికి వెళ్తున్న వారు ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని.. తాము నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నా దొంగతనాలు కొనసాగుతూనే ఉన్నాయని వివరించారు. ముందే నివారణ చేసుకుంటే నేరాలు జరిగే అవకాశం లేదని కమిషనర్ అంజనీకుమార్ గుర్తుచేశారు. తాము ప్రవేశపెట్టిన యాప్స్ కూడా వినియోగించాలని సూచించారు. -
కామారెడ్డి: డీఎస్పీ లక్ష్మీ నారాయణ అరెస్ట్
-
కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీ నారాయణ అరెస్ట్
సాక్షి, కామారెడ్డి: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణను ఏసీబీ అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల డీఎస్పీ ఇంట్లో నిర్వహించిన తనిఖీల్లో ఆదాయానికి మించి రూ. 2.11 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. బెట్టింగ్ కేసులో నిందితుల నుంచి కామారెడ్డి సీఐ జగదీశ్, ఎస్సై గోవింద్ డబ్బులు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో అప్పట్లో డీఎస్పీని కూడా విచారించారు. అయితే బెట్టింగ్ కేసులో లక్ష్మీ నారాయణ ప్రమేయం లేదని తేలినప్పటికీ, ఆయన ఆస్తుల వ్యవహారంలో ఏసీబీ విచారణ చేపట్టింది. దీంతో ఆయనను ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిచించారు. చదవండి: ఎస్ఐ గోవింద్‌పై సస్పెన్షన్ వేటు చదవండి: కామారెడ్డి పోలీసుల్లో ఐపీఎల్ బెట్టింగ్ గుబులు! -
ఎర్రచందనం స్మగ్లర్లపై ఆపరేషన్ సక్సెస్
సాక్షి, కడప: జిల్లాలోని అటవీప్రాంతాల్లో ఎర్రచందనం దుంగలను నరికివేసి, బెంగళూరు, చెన్నై నగరాలకు అక్రమంగా తరలిస్తున్న ‘ఎర్ర’గ్యాంగ్‌ల ఆట కట్టించడంలో జిల్లా పోలీసు యంత్రాంగం చేస్తున్న కృషి సఫలీకృతమవుతోంది. తమిళనాడు రాష్ట్రంలో గ్యాంగ్‌లను తయారు చేసుకుని, జిల్లా నుంచి ఆ తరువాత బెంగళూరు నుంచి ఎర్రచందనం దుంగలను అక్రమంగా తీసుకుని వెళ్లే బాషాభాయ్‌ని, అతనికి సహకరించేవారిని గత నెలలో పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా మరికొందరు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేయడంతో అక్రమార్కుల ఆట కట్టించినట్లయింది. స్మగ్లర్ల రూటు ఇలా.. కర్ణాటక రాష్ట్రం కటిగేనహళ్లికి చెందిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లు ఖలీల్‌ఖాన్, అఫ్రోజ్‌ఖాన్‌లు జిల్లాలోని రైల్వేకోడూరుకు చెందిన షేక్ మస్తాన్ అలియాస్ బాబును ఆశ్రయించారు. అతని ద్వారా జిల్లాలో రైల్వేకోడూరు, నందలూరు, ఒంటిమిట్ట, పుల్లంపేట, మైదుకూరు పరిసర ప్రాంతాల్లో లోకల్ ఎర్రగ్యాంగ్‌లను తయారు చేసుకున్నారు. వీరి ద్వారా తమిళకూలీలు వచ్చి అటవీ ప్రాంతాల్లోని ఎర్రచందనం దుంగలను నరికి డంప్‌లను తయారు చేయించి వెళతారు. తరువాత ప్రధాన నిందితుల సూచనల మేరకు వాహనాలలో ఎర్రచందనం దుంగలను లోడింగ్ చేసుకుని అక్రమంగా కటిగెనహళ్లికి తరలిస్తుంటారు. వేర్వేరు ప్రాంతాల్లో 20 మంది అరెస్టు మైదుకూరు సబ్‌డివిజన్ పరిధిలో ప్రధాన నిందితులు ఖలీల్‌ఖాన్, అఫ్రోజ్‌ఖాన్‌లను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 30 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. బడా స్మగ్లర్ల ప్రధాన అనుచరుడైన షేక్ మస్తాన్‌తో పాటు గిరిచంద్ర, అశోక్‌కుమార్, శివయ్య, రాజారెడ్డి, సురేష్, విజయకుమార్, మల్లారెడ్డి, వెంకటశివకుమార్‌రెడ్డిలను సిద్దవటం మండలం భాకరాపేట దగ్గరగల శనేశ్వరస్వామి దేవాలయం సమీపంలో అరెస్టు చేశారు. నందలూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆల్విన్ ఫ్యాక్టరీ వద్ద సురేంద్రనాథరెడ్డి, శివప్రసాద్, రమ్మ మోహన్, అశోక్, చంద్రశేఖర్ నాయుడు, గంగాధర్‌లను అరెస్ట్ చేశారు. పుల్లంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో వత్తలూరు సబ్‌స్టేషన్‌కు దగ్గర జింకల సుబ్రమణ్యం, గణేష్, చెంచయ్య, సుబ్బారెడ్డి, నాగేంద్ర, వెంకటేష్‌లను, రైల్వేకోడూరు పరిధిలో సూరపరాజుపల్లి రైల్వే బ్రిడ్జి సమీపంలో బురుసు రమేష్, నాగేశ్వర, శ్యాంసుందర్, గుండాల శంకరమ్మ, సుబ్బరాజు, వెంకటసుబ్బయ్యలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి నాలుగు టన్నుల బరువున్న 98 ఎర్రచందనం దుంగలను స్వాదీనం చేసుకున్నారు. ఐదు వాహనాలను సీజ్ చేశారు. వీటి విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుందని ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తెలిపారు.జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ పర్యవేక్షణలో జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) దేవప్రసాద్ ఆధ్వర్యంలో మైదుకూరు డీఎస్పీ విజయకుమార్, రాజంపేట డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డిలు, సీఐలు, ఎస్ఐలు ప్రత్యేక బందాలుగా ఏర్పడి ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. త్వరలో మరికొంతమంది అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేస్తామని ఎస్పీ బుధవారం జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మీడియాకు వెల్లడించారు. పీడీ యాక్టుకు ప్రతిపాదనలు ఎర్రచందనం స్మగ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. గత నెలలో ఇద్దరిపై పీడీ యాక్ట్ ప్రయోగించామని, మరో ఆరుగురిపై పీడీ యాక్ట్ ప్రయోగానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. ఈ సంఘటనల్లో నిందితులను అరెస్ట్ చేయడంలో కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు. -
మోస్ట్ వాంటెడ్ ఫహీమ్ దొరికాడు
సాక్షి, హైదరాబాద్: మూడేళ్లుగా దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన మోస్ట్ వాంటెండ్ క్రిమినల్, గ్యాంగ్‌స్టర్ ఫహీమ్ను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్, అల్వాల్‌లోని ఇళ్లలో చోరీలకు పాల్పడి గుర్గావ్కు పారిపోయిన ఇద్దరు సభ్యులతో కూడిన వీరి ముఠాను బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు అక్కడే పట్టుకున్నారు. మంగళవారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సీపీ సజ్జనార్ వివరాలు వెల్లడించారు. జైల్లో కలిసి...జట్టు కట్టి యూపీలోని మోరాదాబాద్ జిల్లా, అజాద్‌నగర్‌కు చెందిన ఫహీమ్ అలియాస్ గ్లాస్ కటింగ్ పనిచేసేవాడు. అదే సమయంలో హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, డబ్బుల కోసం కిడ్నాప్‌లు చేసేవాడు. 2013లో అక్రమ ఆయుధాల కేసులో పోలీసులు అతడిని అరెస్టు చేసి మురాదాబాద్ జైలుకు పంపారు. జైలులో అతడికి మహమ్మద్ ముర్సలిమ్తో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి బయటికి వచ్చిన అనంతరం ఇద్దరు కలిసి హర్యానాలోని గుర్గావ్లో గ్లాస్ కట్టింగ్ వ్యాపారం చేశారు. అయితే సరిపడా ఆదాయం రాకపోవడంతో ఇళ్లల్లో దోపిడీలకు పథకం వేశారు. మూడేళ్లుగా ముప్పుతిప్పలు ముర్సలిమ్, అతడి స్నేహితుడు అరీఫ్ కలిసి ఫహీమ్ గోవా, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చోరీలకు తెరలేపాడు. దాదాపు వందకు చోరీలకు పాల్పడిన అతడు పలు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా మారాడు. తరచు నివాసాలు మార్చే అతను పోలీసుల కంటపడకుండా ఉండేందుకు ఏకంగా చోరీ సొత్తును కరిగించి బిస్కెట్లుగా మార్చి మార్కెట్లో విక్రయించేవాడు. 2017, 2018 మధ్యకాలంలో ఈ ముఠా చందానగర్, రాయదుర్గం, అమీన్పూర్ ఠాణాల పరిధిలో పంజా విసిరింది. సైబరాబాద్‌కు వచ్చి... దొరికిపోయారు ఈ నెల 4న అరీఫ్ ముఠా కారులో మేడ్చల్, అల్వాల్ ఠాణా పరిధిలో రెక్కీ నిర్వహించింది. పగటి వేళ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించిన వీరు వాటిని లూటీ చేసి హైవేపై వెళుతూ కర్ణాటక, గోవా రాష్ట్రాల్లోనూ పలు ప్రాంతాల్లో చోరీలు చేస్తూ గుర్గావ్ చేరుకున్నారు.ఆయా రాష్ట్రాలకు అనుగుణంగా కారు నంబర్ ప్లేట్లను మారుస్తూ పోలీసులకు చిక్కకుండా తెలివిగా వ్యవహరించారు. అయితే మేడ్చల్, అల్వాల్ ఠాణా పరిధిలోని ఘటనాస్థలి వద్ద సేకరించిన శాస్త్రీయ ఆధారాలతో గుర్గావ్లోని సోనా పోలీస్ స్టేషన్లో వీరిపై కేసులు ఉన్నట్లు గుర్తించారు. బాలానగర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి నేతృత్వంలోని బృందం అక్కడికి వెళ్లింది. స్థానిక పోలీసుల సహకారంతో ఫహీమ్, ముర్సలీమ్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పట్టుకున్న ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి బృందంతో పాటు బాలానగర్ డీఐ జేమ్స్‌బాబు, అల్వాల్ పోలీసు సిబ్బందిని సీపీ సజ్జనార్ సత్కరించారు. రెండేళ్లుగా 16 మంది అంతర్రాష్ట నేరగాళ్లను పట్టుకొని 60 కేసులను ఛేదించామని, ఇదంతా ఎస్ఓటీ, సీసీఎస్, క్లూస్‌టీమ్ సిబ్బంది కృషితోనే సాధ్యమైందన్నారు. విల్లాలో మకాం.. యూపీ పోలీసులకు వాంటెడ్‌గా ఉన్న టాప్–10 గ్యాంగ్స్టర్లలో ఒకడైన ఫహీమ్ గుర్గావ్లోని ఎంవీఎన్ సొసైటీ గేటెడ్ కమ్యూనిటీలోని విల్లాలో ఉంటున్నాడు. గతంలో బినామీ పేర్లపై ఉన్న రెండు ఇళ్లను మొరాదాబాద్ పోలీసులు సీజ్ చేయడంతో ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నాడు. దోపిడీ చేసిన సొత్తును విక్రయించగా వచ్చిన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. క్యాసినోతో పాటు లక్షల్లో క్రికెట్ బెట్టింగ్ ఆడేవాడు. -
అర్నబ్ గోస్వామి అరెస్ట్
ముంబై: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామిని రాయగఢ్ జిల్లా అలీబాగ్ పోలీసులు బుధవారం ఉదయం అరెస్టు చేశారు. 2018లో ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయిక్ (53) ఆత్మహత్యకు సంబంధించి అర్నబ్‌ను అరెస్టు చేసినట్టు అలీబాగ్ పోలీసులు పేర్కొ న్నారు. తననెందుకు అరెస్టు చేస్తున్నారని ప్రశ్నిస్తూ, అరెస్టువారెంటు చూపాలని అర్నబ్ వాదించారని పోలీసులు తెలిపారు. అరెస్టు వారంటును చూపించబోగా, అర్నబ్ భార్య ఆయా పేపర్లను చించేశారని పేర్కొన్నారు. ఆ తర్వాత అర్నబ్‌ను అలీబాగ్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచారు. గోస్వామిని అలీబాగ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. వైద్య పరీక్షల అనంతరం మళ్లీ ఆయనను కోర్టులో హాజరుపరచాలని చెబుతూ ఈనెల 18 వరకూ జ్యుడీషియల్ కస్టడీ విధించింది. గోస్వామి ని పోలీసులు అరెస్టు చేసే సమయంలో పోలీసులు అర్నబ్‌పై చేయి చేసుకున్నారని, అర్నబ్‌తోపాటు ఆయన న్యాయవాది గౌరవ్ పార్కర్లు ఆరోపించారు. ఇదిలా ఉండగా, ఆయన్ను అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసుల బృందంలో ఉన్న మహిళా పోలీసుపై అర్నబ్ చేయి చేసుకున్నారన్న అభియోగాలతో ఆయనపై మరో ఎఫ్ఐఆర్ దాఖలైంది. మహిళా పోలీసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు అధికారులు చెప్పారు. తన భర్తకు ఇవ్వాల్సిన బకాయిలు ఇచ్చి ఉంటే నేడు తన భర్త బతికి ఉండేవారని అన్వయ్ నాయక్ భార్య అక్షతా పేర్కొన్నారు. చట్టం ముందు అంతా ఒక్కటే.. చట్టం ముందు ఎవరూ గొప్పవారు కాదని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ పేర్కొన్నారు. అన్వయ్ కుటుంబీకుల ఫిర్యాదు మేరకే ఈ కేసును తిరిగి విచారణ చేపట్టేందుకు కోర్టులో దరఖాస్తు చేసినట్టు చెప్పారు. అనంతరం కోర్టు అనుమతితోనే ఈ అరెస్టు జరిగిందని చట్టప్రకారం పోలీసులు తమ పని తాము చేస్తున్నారన్నారని అనిల్ దేశ్‌ముఖ్ స్పష్టం చేశారు. తప్పు ఎవరు చేసినా పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని శివసేన నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు. -
ఓటమి భయంతో అడ్డదారులు
కరీంనగర్ టౌన్: దుబ్బాక ఎన్నికల్లో ఓటమి భయంతోనే తెలంగాణ ప్రభుత్వం అడ్డదారులు తొక్కే ప్రయత్నం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో సోమవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ రాచరిక, నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని, ఇందుకు సిద్దిపేట సంఘటనే నిదర్శనమన్నారు. ఫాంహౌస్‌కు పరిమితమైన సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే పోలీసులు అరాచకం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం లాగానే మంత్రులు సైతం బరితెగించి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. దుబ్బాక ఎన్నికల్లో గెలిచేందుకు కార్యకర్త కారులో డబ్బుపెట్టి రికవరీ అంటూ రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారని, సిద్దిపేటలో బీజేపీ అభ్యర్థి ఇంట్లో తనిఖీలకు వెళ్లిన పోలీసులు మహిళలు, చిన్నపిల్లల పట్ల సంస్కారహీనంగా వ్యవహరించారని ఆరోపించారు. దుబ్బాక ఎన్నికలకు సిద్దిపేటకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. సిద్దిపేటకు వెళ్తున్న తన కారును అడ్డగించి అరెస్ట్ చేసే సమయంలో గొంతు పట్టి కారులో పడేశారని తెలిపారు. ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని తాము కోరుకుంటే.. ప్రభుత్వం మాత్రం శాంతిభద్రతల సమస్య సృష్టించాలని చూస్తోందని పేర్కొన్నారు. సిద్దిపేట సీపీని సస్పెండ్ చేసి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎలక్షన్ కమిషన్ ఉందో లేదో కూడా తెలియడం లేదన్నారు. ప్రజాస్వామ్యబద్ధం గా ఎన్నికలు నిర్వహించకుంటే ఫాంహౌస్, ప్రగతిభవన్‌పై సైతం దాడి చేస్తామని హెచ్చరించారు. సీపీని సస్పెండ్ చేయాలనే డిమాండ్‌తో ఎంపీ కార్యాలయంలోనే సంజయ్ నిరాహారదీక్షకు దిగారు. -
వ్యభిచార ముఠా గుట్టురట్టు
సాక్షి, మంచిర్యాల: జిల్లా కేంద్రంలో కొంతకాలంగా సాగుతున్న వ్యభిచార ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మరోవైపు పట్టణంలో కొంతకాలంగా బైక్ దొంగతనాలు చేస్తున్న అంతర్ జిల్లా బైక్ దొంగల ముఠాను కూడా అరెస్ట్ చేశారు. సంబంధిత వివరాలను స్థానిక ఏసీపీ కార్యాలయంలో సోమవారం డీసీపీ ఉదయ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. జిల్లాకేంద్రంలోని శ్రీనివాసకాలనీలో ఇంట్లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం మేరకు సీఐ లింగయ్య సిబ్బందితో కలిసి సోమవారం తనిఖీలు చేశారు. మందమర్రికి చెందిన ఓ మహిళ సదరు ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నడిపిస్తున్నట్లు వెలుగుచూసింది. హైదరాబాద్, విజయవాడ, బెంగళూర్ ప్రాంతాల నుంచి మహిళలను తెప్పిస్తున్నట్లు గుర్తించారు. మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, గోదావరిఖని ప్రాంతాల యువతుల ఆర్థిక ఇబ్బందులు గుర్తించి వారిని వ్యభిచారం వైపు నడిపిస్తున్నారని తెలి సింది. విటులను రప్పించేందుకు దినేష్, రమేష్‌కు నెలకు రూ.15వేల వేతనం కూడా చెల్లిస్తున్నట్లు వెలుగుచూసింది. విటుల నుంచి రూ.వెయ్యి చొప్పున వసూలు చేస్తూ రూ.500 సదరు మహిళలకు ఇప్పిస్తున్నట్లు బయటపడింది. తాజాగా ఇద్దరు మహిళలతో వ్యభిచారం కొనసాగిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిర్వాహకురాలితోపాటు 8మందిని అరెస్ట్ చేశారు. అరెస్టయినవారిలో కాగజ్‌నగర్‌కు చెందిన దినేష్, రమేష్, అబ్దుల్‌గఫర్, షేక్‌రియాజ్, షేక్ఇర్ఫాన్, అబ్బుదల్ జబ్బర్, జీషన్‌ఖాన్ ఉన్నారు. నిర్వాహకురాలి నుంచి రూ.15 వేల నగదు, ఏడు సెల్ఫోన్లు, కండోమ్స్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన యువతులను సఖీ సెంటర్‌కు తరలించారు. అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్ జిల్లా కేంద్రంలో తరచూ బైక్ దొంగతనాలు జరుగుతుండటంతో పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో సున్నంబట్టివాడ సమీపంలో ముగ్గురు వ్యక్తులు బైక్‌పై అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అదుపులో తీసుకుని విచారణ చేపట్టగా.. అంతర్ జిల్లా బైక్ దొంగల ముఠా వెలుగు చూసింది. ఇందులో ప్రధాన నిందితుడు బాలుడు కావడం విశేషం. ఇతడు గతంలో బైక్‌ల దొంగతనం, గంజాయి సరఫరా కేసులో సంరక్షణ గృహంలో ఉండి ఈ ఏడాది జూన్‌లో విడుదలయ్యాడు. అనంతరం అతడి మేనమామ, ములుగు జిల్లా వెంకటపురానికి చెందిన శ్రీకాంత్, ఆయన స్నేహితుడు, మంచిర్యాల జిల్లా గోపాల్‌వాడకు చెందిన ఈశ్వర్‌తో కలిసి బైక్‌లు దొంగిలిస్తున్నాడు. వాటిని భూపాలపల్లి జిల్లా సుబ్బక్కపల్లికి చెందిన కిరణ్, మంచిర్యాల అశోక్‌రోడ్‌కు చెందిన మహేందర్లకు అమ్ముతుండేవారు. వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తుండేవారు. వీరిపై మంచిర్యాల, మందమర్రి, లక్సెట్టిపేట, రామగిరి, హన్మకొండ, భూపాలపల్లి, ములుగు, నల్లబెల్లి, కాటారం పోలీస్స్టేషన్ల పరిధిలో 15 బైక్ దొంగతనాల కేసులు ఉన్నాయి. వీరినుంచి 15 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు బైక్‌దొంగలతోపాటు కొనుగోలు చేసి ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. సీఐ లింగయ్య, ఎస్సైలు మారుతి, ప్రవీణ్‌కుమార్, రాజమౌళి గౌడ్, సిబ్బంది భరత్, దివాకర్, శ్రావణ్‌కుమార్, సీసీఎస్ సిబ్బందిని డీసీపీ అభినందించారు. బాలికపై లైంగికదాడి వేమనపల్లి: ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడిన సంఘటన వేమనపల్లి మండలం జక్కెపల్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథ నం ప్రకారం.. గ్రామానికి చెందిన బాలిక కస్తూరి బాలో చదువుకుంటోంది.లాక్డౌన్ కావడంతో ఇంటివద్దే ఉంటోంది. రెండురోజుల క్రితం గ్రామంలో యక్షగాన నాటక ప్రదర్శన ఉండడంతో కుటుంబ సభ్యులు చూసేందుకు వెళ్లారు. దీనిని అదునుగా చూసిన అదే గ్రామానికి చెందిన పొర్‌తెట్టి అంజన్న బాలికను తన ఇంట్లోకి లాక్కెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఇంటికి రాగా.. జరిగిన విషయాన్ని బాలిక వారికి తెలిపింది. వారు నీల్వాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రహీంపాషా తెలిపారు. అలుగును హతమార్చిన ఐదుగురు అరెస్ట్ జన్నారం(ఖానాపూర్): గ్రామ శివారులోకి వచ్చిన అటవీ అలుగును హతమార్చిన ఐదుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు రేంజ్ అధికారి వెంకటేశ్వర్రావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... జన్నారం అటవీ డివిజన్ తాళ్లపేట్ రేంజ్ మేదరిపేట సెక్షన్ లోని దమ్మన్నపేట గ్రామ శివారులో అటవీ అలుగును పలువురు వేటాడినట్లు వచ్చిన సమాచారం మేరకు ఆదివారం సాయంత్రం రేంజ్ అధికారి వెంకటేశ్వర్ రావు సిబ్బందితో కలిసి దమ్మన్నపేటలో డాగ్‌స్క్వాడ్‌తో సోదాలు చేయగా.. ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. కానీ అదే గ్రామానికి చెందిన శ్రీను అలియాస్ మచ్చశ్రీను ఇంట్లో అలుగు ఉందన్న సమాచారంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో గ్రామస్తులు అటవీ అధికారుల వాహనాన్ని అడ్డగించారు. గ్రామ పెద్దల సహాయంతో శ్రీనును కార్యాలయానికి తీసుకువచ్చి విచారించగా అలుగును చంపినట్లు ఒప్పుకున్నాడు. మూడు రోజుల ముందే దమ్మన్నపేట గ్రామ సమీపంలో వాగులోకి చేపలు పట్టేందుకు శ్రీనుతో పాటు చిన్ననర్సయ్య అలియాస్ చిరంజీవి, రాము అలియాస్ చింటు, భీమయ్య అలియాస్ బాలు, నరేశ్ చేపలు పట్టేందుకు వెళ్లారు. ఈ క్రమంలో వాగులో అటవీ అలుగు కనిపించగా.. ప్రాణంతో పట్టుకున్నారు. శ్రీనివాస్ ఇంట్లో అలుగును రెండ్రోజులపాటు ప్రాణంతో ఉంచారు. అటవీ అధికారులకు తెలిసిందని తేలడంతో అలుగును చంపి దొరికిన ప్రదేశంలోనే వదిలేసినట్లు రేంజ్ అధికారి తెలిపారు. ఐదుగురిపై కేసు నమోదు చేసి వారిని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. -
మావోయిస్టులకు ఎదురు దెబ్బ.. కామేష్ అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: మావోయిస్టులకు తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలింది. జిల్లాలోని గాలికొండ ఏరియా కమిటీ సభ్యుడు గమ్మెల కామేష్ అలియాస్ హరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గాలికొండ ఏరియా కమిటీలో హరి కీలకంగా వ్యవహరించేవారు. దీంతో హరిపై 50కి పైగా కేసులు నమోదై ఉన్నాయి. అదే విధంగా అతనిపై రూ. 4లక్షల రివార్డును కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. మాజీ మావోయిస్టు తాంబేలు లంబయ్య హత్య కేసులో హరి ప్రధాన నిందితుడు. హరి అరెస్ట్ సందర్భంగా విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు మాట్లాడుతూ.. మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుతాయని పేర్కొన్నారు. ముగిసిన వారోత్సవాలు ఖమ్మం(చర్ల): మావోయిస్టు వారోత్సవాలు, బంద్ పిలుపుల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతంలో సుమారు రెండు వారాల పాటు ముమ్మరంగా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగింది. వారోత్సవాలు ముగియడంతో కూంబింగ్ ఆపరేషన్‌ను ముగించుకొని బలగాలు వెనుదిరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణాకు చెందిన గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ, సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు పలు ధపాలుగా దండకారణ్యంలోకి వెళ్లాయి. మావోయిస్టుల చర్యలను కట్టడి చేసేందుకు బలగాలు రేయింబవళ్లు తీవ్రంగా శ్రమించాయి. వారోత్సవాలు ముగిసినందున అడవులను విడిచి బలగాలు వస్తున్నాయనే సమాచారంతో సరిహద్దు ప్రజలు ఊపిరి పీల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఒక పక్క మావోయిస్టులు, మరో పక్క బలగాలతో సరిహద్దులోని సుకుమా, బీజాపూర్, దంతెవాడ జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలు.. తెలంగాణాలోని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని మారుమూల గ్రామాలు అట్టుడికాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి సరిహద్దులో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. గుండాల మండలంలో జరిగిన ఎన్కౌంటర్లో ఓ మావోయిస్టు, చర్ల మండలంలోని పూసుగుప్ప సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు, చెన్నాపురం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందడంతో పాటు పోలీసులు మందు పాతరలను వెలికి తీయడం.. వాటిని నిర్వీర్యం చేయడం, మావోయిస్టులు మందుపాతరలను ఏర్పాటు చేసి రహదార్లను పేల్చివేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలీస్ బలగాల్లో గ్రేహౌండ్స్ విభాగానికి చెందిన ఓ సబ్ఇన్స్పెక్టర్ తుపాకీ మిస్‌ఫైర్ అయ్యి.. తూటాలు శరీరంలోకి దూసుకెళ్లి మృతి చెందాడు. -
ప్రేమ, ఉద్యోగాల పేరుతో.. రూ.లక్షల్లో వసూలు
సాక్షి, బెల్లపల్లి: నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని, ఉద్యోగాల ఆశ చూపి, ఓ ముఠా రూ.లక్షల్లో వసూలు చేసింది. అనంతరం బాధితులను మోసగించిన ఘటనలో ఓ మహిళతోపాటు మరో ముగ్గురు వ్యక్తులను కరీంనగర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ పోలీసుల వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఓ మహిళ ఉద్యోగం లేక ఖాళీగా ఉండేది. ఈ క్రమంలో కుటుంబసభ్యులతో విడిపోయి, కరీంనగర్‌లోని ఆదర్శ నగర్లో ఒంటరిగా జీవిస్తోంది. జల్సాలకు అలవాటు పడి, సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్ధేశ్యంతో అమాయక యువకులను లక్ష్యంగా చేసుకొని, ప్రేమ, ఉద్యోగాల పేరుతో మాయమాటలు చెబుతూ వారి నుంచి రూ.లక్షల్లో వసూలు చేసింది. ఆమె తన ముఠా సభ్యులైన కంబాల రాజేశ్(41), కుసుమ భాస్కర్(48), భీమాశంకర్(28)లతో కలిసి కరీంనగర్‌లోని సిక్‌వాడీకి చెందిన ఓ యువకుడిని వరంగల్‌లోని ప్రభుత్వ ఆస్పుత్రిలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించింది. క్యాంటీన్ నిర్వహణ కాంట్రాక్టు పేరుతో రూ.13.5 లక్షలు, కరీంనగర్‌లోని తిరుమల నగర్లో నివాసం ఉంటున్న మరో వ్యక్తి నుంచి ప్రభుత్వ ఊద్యోగం పేరుతో రూ.7 లక్షలు, గోదావరిఖనికి చెందిన ఓ యువకుడి వద్ద రూ.3లక్షలు వసూలు చేశారు. నిందితురాలు వరంగల్‌కు చెందిన యువకుడితో తనను నికితారెడ్డిగా పరిచయం చేసుకొని, అతనితో చేసిన ఫోన్ చాటింగ్ చేసింది. దాన్ని అడ్డుగా పెట్టుకొని బాధితుడిని బ్లాక్ మెయిల్ చేస్తూ రూ.8లక్షల వరకు తీసుకుంది. సదరు మహిళ కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అని, అధికారుల వద్ద పలుకుబడి ఉందని నిరుద్యోగులతో నమ్మబలికింది. ఉద్యోగాలు ఇప్పిస్తానని, రిజిస్ట్రేషన్ నిమిత్తం, అధికారులకు ఇవ్వడానికి డబ్బులు ఖర్చవుతాయని నమ్మించింది. తన మూఠా సభ్యులను అధికారులుగా చూపించి, వసూళ్లకు తెరలేపింది. బాధితులు తాము మోసపోయామని గ్రహించి, డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే రాజేష్, భాస్కర్, భీమాశంకర్‌లను పెద్ద మనుషులుగా చూపించింది. తన మొబైల్లో చాటింగ్‌ను చూపిస్తూ వారిపైనే కేసులు పెడుతూ బెదిరింపులకు గురిచేసింది. ఈ ఘటనలతో నిఘా పెట్టిన పోలీసులు నిందితులందరినీ పట్టుకొని, వారి వద్ద నుంచి రూ.20 వేలు, నకిలీ నియామక పత్రాలు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కరీంనగర్, గోదావరిఖని, వరంగల్, హైద్రాబాద్ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయని తెలిపారు. కరీంనగర్ సీపీ వీబీ.కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగాలు ఇప్పిస్తామని వచ్చేవారి మాయమాటలు నమ్మి, డబ్బు, సమయం కోల్పోవద్దన్నారు. ఈ ముఠా వల్ల మోసపోయిన వారు ఎవరైనా ఉంటే నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అధికారులను సంప్రదించాలని సూచించారు. సీఐ విజయ్‌కుమార్, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్లు ప్రకాష్, శశిధర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
డబుల్ బెడ్రూమ్ ఇళ్లు: రూ.కోటికి పైగా వసూలు
సాక్షి, రంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయిస్తామని నకిలీ కేటాయింపు లేఖలతో నమ్మించి రూ.లక్ష లు వసూలు చేస్తున్న ముఠాను దుండిగల్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.72,80,000 నగదు,తాడేపల్లి గూడెంలోని ప్లాటు డాక్యుమెంట్, నకిలీ డబుల్ బెడ్రూమ్ కేటాయింపు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సీపీ సజ్జనార్ వివరాలు వెల్లడించారు. సెక్రటేరియట్లో పరిచయాలున్నాయని... వెంకట సత్యకృష్ణ వరప్రసాద్ అనే వ్యక్తి దుండిగల్ ఠాణా పరిధిలోని బహూదూర్‌పల్లిలోని ఓ వైన్స్ షాప్ వద్ద మద్యం కొనుగోలు చేస్తుండగా ఓ ఇద్దరు వ్యక్తులు డబుల్ బెడ్రూమ్ కేటాయింపు నకిలీ లేఖలపై చర్చిస్తుండటాన్ని గుర్తించాడు. దీంతో అతను వారితో మాట్లాడి సదరు లేఖ ను తన సెల్ఫోన్లో ఫొటో తీసుకున్నాడు. అనంతరం నకిలీ లేఖలు తయారు చేయడంలో సిద్ధహస్తుడైన బౌరంపేటకు చెందిన వెంకట్‌ను సంప్రదించి అదే తరహాలో లేఖలను తయారు చేయించాడు. అనంతరం అదే ప్రాంతంలో ఉంటున్న తన బంధువు మురళీ కృష్ణ మూర్తిని కలి సి తనకు సెక్రటేరియట్లో మంచి పరిచయాలున్నాయని డబుల్ బెడ్రూమ్లు మంజూరు చేయిస్తానని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన మురళీకృష్ణ తన స్నేహితుడు ఇపూరి వెంకటేశ్వర రాజును పరిచయం చేశాడు. అనంతరం వెంకటేశ్వరరాజు, తన బంధువు కలెపల్లి పద్మదుర్గకు ఈ విషయాన్ని చెప్పాడు. ఇలా తమకున్న పరిచయాల ద్వారా ఒక్కో డబుల్ బెడ్రూమ్కు రూ.1,20,000 నుంచి రూ1,70,000 వరకు వసూలు చేశారు. వసూళ్లలోనూ కమీషన్.. పద్మ 38 మంది నుంచి రూ.47,60,000 వసూలు చేసింది. అందులో తన కమీషన్ రూ.5,80,000 మినహాయించుకొని రూ.44 లక్షలు వెంకటేశ్వరరాజుకు ఇచ్చింది. ఇదే తరహాలో వెంకటేశ్వరరాజు రూ.53,57,000 వసూలు చేశాడు. ఇందులో తన కమీషన్ రూ.6,98,700 మినహాయించుకొని మిగిలిన సొమ్మును వెంకట కృష్ణమూర్తి వరప్రసాద్‌కు అందజేశాడు. ఇలా 89 మంది పెద్ద మొత్తంలో వసూలు చేశాడు. రోజులు గడుస్తున్నా ఇళ్లు మంజూరు కాకపోవడంతో కొంపల్లికి చెందిన తులసమ్మ ఫిబ్రవరి 5న ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన దుండిగల్ పోలీసులు దర్యాప్తు చేపట్టి శుక్రవారం నిందితులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా దుండిగల్ ఇన్స్పెక్టర్ వెంకటేశంతో పాటు ఇతర సిబ్బందిని సీపీ రివార్డులతో సత్కరించారు. -
సమస్యలు చెప్తామంటే అరెస్టులా?
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని ఏ ఒక్క వర్గమూ సంతృప్తిగా లేదని, ప్రజలు నిరాశా నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారని ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ప్రజా సమస్యలపై చర్చిద్దామంటే ప్రతిపక్ష పార్టీ అయిన తమకు అసెంబ్లీలో అవకాశం ఇవ్వలేదని, అర్ధంతరంగా అసెంబ్లీ సమావేశాలను ముగించుకుని వెళ్లిపోయారని ఆమె ధ్వజమెత్తారు. శుక్రవారం రైతు సమస్యలపై కాంగ్రెస్ పార్టీ కిసాన్‌సెల్ ఆధ్వర్యంలో చేపట్టిన చలో ప్రగతిభవన్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సీతక్క, కిసాన్‌సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి ప్రగతిభవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు వారి ప్రయత్నాన్ని భగ్నం చేశారు. నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి గోషామహల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీతక్క పోలీస్‌స్టేషన్‌వద్ద, అనంతరం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరసన వ్యక్తం చేసేందుకు కూడా అవకాశమివ్వక పోవడం దారుణమన్నారు. ప్రభుత్వం అసెంబ్లీలో కూడా రైతుల సమస్యలపై చర్చించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది టీఆర్ఎస్ సర్కార్ నిరంకుశవైఖరికి నిదర్శనమని ధ్వజమెత్తారు. భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, పంటల బీమా కింద రైతులకు చెల్లించాల్సిన పరిహారం రూ.500 కోట్లు చెల్లించాలని, ఏకకాలంలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల దగ్గర పంటలు కొనుగోలు చేయడంలో అక్రమాలు జరిగాయని, అందరికీ రైతుబంధు ఇవ్వలేదని, రాష్ట్రంలో యూరియా కొరత ఉందని, రైతు రుణమాఫీ చేయలేదని, రుణాలు ఇవ్వలేదని.. ఇవన్నీ చెపుదామంటే ప్రగతిభవన్ వద్దకు వెళ్లగానే పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి సమస్యలు తెలిపేందుకు అవకాశం ఇవ్వకుండా వ్యవహరించడం తగదని మండిపడ్డారు. కిసాన్‌సెల్ అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి మాట్లాడుతూ మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని, భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని, రైతు లకు వడ్డీ రాయితీలు ఇవ్వాలని తాము ప్రగతిభవన్‌కు వద్దకు వెళ్తే అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దిష్టిబొమ్మల దగ్ధం కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
నటి సంజన అరెస్ట్
యశవంతపుర: కర్ణాటక సినీరంగాన్ని డ్రగ్స్ భూతం కుదిపేస్తోంది. డ్రగ్స్ రవాణా ఆరోపణలపై తాజాగా బహుభాషా నటి సంజనా గల్రానిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ఉంటున్న బెంగళూరులోని ఇందిరానగర రోడ్డు సాయితేజ్ అపార్ట్‌మెంట్‌పై మంగళవారం తెల్లవారుజామున దాడి చేసి అరెస్ట్ చేశారు. ఆమె నివాసంలో ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్, పెన్‌డ్రైవ్‌తో పాటు అనేక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ కేసులో సంజనా సన్నిహితులు రాహుల్, పృథ్వీశెట్టి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆమెను అరెస్టు చేశారు. డ్రగ్స్ వ్యవహారంలో గత శుక్రవారం ప్రముఖ నటి రాగిణి ద్వివేదిని అరెస్టు చేసి విచారిస్తుండడం తెలిసిందే. అరెస్టు చేయడానికి వెళ్లినప్పుడు నటి సంజనా.. నోటీసు లేకుండా ఎలా వస్తారని ప్రశ్నించడంతో పోలీసులు ఆగ్రహించారు. నీవు చెప్పినట్లు మేం నడుచుకోలేం అని స్పష్టంచేశారు. కోర్టు వారంట్‌ను చూపించి అరెస్టు చేశారు. కాగా, ఓ ఎమ్మెల్యే తనయుడు, ఓ వర్ధమాన నటి, ఇద్దరు సీరియల్ నటుల పేర్లు బయటపడినట్లు సమాచారం. -
రియా చక్రవర్తి అరెస్ట్
న్యూఢిల్లీ/ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ మృతికేసులో మాదకద్రవ్యాల సంబంధిత నేరారోపణలు ఎదుర్కొంటోన్న అతని ప్రియురాలు రియా చక్రవర్తిని మూడు రోజుల విచారణ అనంతరం నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ముంబైలో మంగళవారం అరెస్టు చేసింది. రియా వాట్సాప్ ఛాట్స్ ఆధారంగా విచారణ మొదలుపెట్టిన ఎన్సీబీ తవ్వే కొద్దీ కొత్త విషయాలు బయటికొచ్చాయి. మాదక ద్రవ్యాల మత్తులో జోగుతోన్న బాలీవుడ్ చిత్ర పరిశ్రమ చిట్టా బట్టబయలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలీవుడ్లో మాదకద్రవ్యాలతో సంబంధం ఉన్న దాదాపు 30 మంది పేర్లను రియా ఎన్సీబీ విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది. తనకు మాదక ద్రవ్యాల డీలర్లతో ఎటువంటి సంబంధాల్లేవని ఆ విచారణలో తెలిపారు. కరోనా లాక్డౌన్ కాలంలో డ్రగ్స్ దొరకడం కష్టం కావడంతో, రియాచక్రవర్తి తన సోదరుడి ద్వారా డ్రగ్స్ తెప్పించినట్లు ఎన్సీబీ వర్గాలు తెలిపాయి. నిజానికి రెండో రోజు విచారణ అనంతరమే రియాను అరెస్టు చేయాల్సి ఉండగా, మాదకద్రవ్యాలకు సంబంధించిన మరింత లోతైన సమాచారాన్ని సేకరించే లక్ష్యంతో ఎన్సీబీ, మూడో రోజు కూడా ఆమెను విచారించాలని భావించింది. అందులో భాగంగానే మంగళవారం ఉదయం తిరిగి ముంబైలోని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో కార్యాలయానికి రియాను రప్పించి విచారించింది. విచారణ అనంతరం ఎన్సీబీ రియా చక్రవర్తిని అరెస్టు చేసింది. ఈ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు చేరవేసినట్టు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎన్సీబీ కె.పిఎస్.మల్హోత్రా చెప్పారు. అరెస్టు అనంతరం వైద్య పరీక్షల కోసం ముంబైలోని సియాన్ ఆసుపత్రికి పోలీసులు తీసుకెళ్ళారు. ఆమెకు సాధారణ వైద్య పరీక్షలతో పాటు కోవిడ్–19 పరీక్ష కూడా నిర్వహించగా, నెగిటివ్ వచ్చింది. మాదకద్రవ్యాల చట్టంలోని సెక్షన్8(సి)మాదక ద్రవ్యాలు కలిగి ఉండడం, అమ్మడం, 20(బి)(2) తక్కువ మోతాదులో నిషేధిత డ్రగ్స్ వినియోగం, వాటిని కలిగి ఉండడం తదితర సెక్షన్ల కింద రియాపై కేసు నమోదు చేశారు. రియా బెయిల్ పిటిషన్‌ను స్థానిక కోర్టు తిరస్కరించింది. ఈనెల 22 దాకా జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు రియాను హాజరుపరిచిన ఎన్సీబీ... సుశాంత్‌కు డ్రగ్స్ కొనుగోలు చేసిన సిండికేట్‌లో రియా క్రియాశీలకంగా పనిచేశారని ఆరోపించింది. కస్టడీ కోరడం లేదని తెలిపింది. బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించింది. రియా బెయిల్ కోసం సెషన్స్ కోర్టును ఆశ్రయిస్తామని ఆమె లాయర్ తెలిపారు. ‘‘నేనేం చేసినా సుశాంత్ కోసమే చేశాను’’ రెండో రోజు విచారణలోనే ఎన్సీబీ ఎదుటయ రియా చక్రవర్తి భావోద్వేగంతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ‘‘నేనేం చేసినా, సుశాంత్ కోసమే చేశాను’’అని ఆమె చెప్పారు. ఎన్సీబీ అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానమివ్వకుండా దాటవేశారు. ఆగస్టులో ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వూ్యలో సుశాంత్‌ని డ్రగ్స్ తీసుకోకుండా వారించేదాన్నని కూడా రియా చెప్పారు. సోదరుడిని చూసి బోరుమన్న రియా మంగళవారం రియా చక్రవర్తిని, ఆమె సోదరుడు షోవిక్‌కు కలిపి ఎన్సీబీ విచారించింది. ఈ సందర్భంగా షోవిక్‌ని చూసిన రియా ఒక్కసారిగా బోరున విలపించినట్లు ఎన్సీబీ వర్గాలు తెలిపాయి. క్రితం రోజు తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదన్న రియా మంగళవారం ఎన్సీబీ విచారణలో, తాను అప్పుడప్పుడూ సిగరెట్ ద్వారా డ్రగ్స్ తీసుకునేదాన్నని వెల్లడించారు. రియాను సీబీఐ, ఎన్సీబీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు విచారిస్తున్నాయి. సుశాంత్ మత్తుకు బానిస: న్యాయవాది సుశాంత్ మాదకద్రవ్యాల బానిసై, మానసిక సమస్యలతో బాధపడుతున్నారని, ఆయన్ను రియా చక్రవర్తి ప్రేమించడంతో మూడు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఒక మహిళను వేటాడుతున్నాయని ఆమె లాయర్ సతీష్ షిండే వ్యాఖ్యానించారు. రియా అరెస్టు న్యాయవ్యవస్థని అపహాస్యం చేయడమేనని ఆయన అన్నారు. అక్రమంగా సుశాంత్‌కి మందులు ఇచ్చారని, డ్రగ్స్ కూడా తీసుకుంటాడని... అందువల్లనే ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఈ కేసులో ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి రియా చక్రవర్తి సిద్ధంగా ఉన్నట్టు న్యాయవాది చెప్పారు. ఇదిలా ఉండగా రియా అరెస్టు బీహార్‌కి పెద్ద విజయమని, బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే వ్యాఖ్యానించారు. -
హవాలా ముఠాను పట్టేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు
సాక్షి, విజయవాడ: వావాలా లావాదేవీల ముఠాపై టాస్క్ ఫోర్స్ పోలీసులు కొరడా ఝుళిపించారు. స్విఫ్ట్ కారులో ఓ ముఠా హవాలా సొమ్ము తరలిస్తుందన్న సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ శ్రీనివాస్ బృందం ఆ ముఠాను కాపుకాసి పట్టేసింది. నరసాపురం నుంచి హైదరాబాద్‌కు హవాలా సొమ్ము తరలిస్తుండగా నిందితులు పట్టుబడ్డారు. ఆ కారులో ఉన్న కోటీ నలభై లక్షల రూపాయల ఇండియన్ కరెన్సీని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా రూ.24 లక్షలు విలువ చేసే 30వేల డాలర్లు పట్టుకున్నారు. బంగారం వ్యాపారి ప్రవీణ్ జైన్‌తో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హవాలా మూలాల కోసం టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుల వద్ద కూపీ లాగుతున్నారు. -
ఏసీబీ వలలో ‘ఔషధ’ ఉద్యోగులు
కరీంనగర్ క్రైం: మెడికల్ షాపు లైసెన్స్ పునరుద్ధరణ కోసం లంచం డిమాండ్ చేసిన ఇద్దరు ఉద్యోగులు ఔషధ నియంత్రణశాఖ ఏడీ కార్యాలయంలో ఏసీబీకి పట్టుబడ్డారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణానికి చెందిన రవీందర్ పదేళ్లుగా శ్రీగణేష్ మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. ఫార్మాసిస్టు మారడంతో లైసెన్స్ పునరుద్ధరణ కోసం గత నెల 26న ఔషధ నియంత్రణశాఖ ఏడీ కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ పెద్ది వినాయక్ రెడ్డిని సంప్రదించాడు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించి రూ.3,500 తీసుకున్నాడు. ఈ నెల 2న మళ్లీ సంప్రదించగా రూ.25 వేలు డిమాండ్ చేశాడు. చివరికి రూ.20 వేలకు అంగీకారం కుదిరింది. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సోమవారం కరీంనగర్‌లోని చైతన్యపురిలోని ఔషధ నియంత్రణ ఏడీ కార్యాలయంలో రవీందర్ వద్ద నుంచి రూ.20 వేలు తీసుకుంటుండగా వినాయక్‌రెడ్డిని, పని పూర్తయిందని రూ.500 డిమాండ్ చేసిన అటెండర్ ఎండీ.రిజ్వాన్‌ను పట్టుకున్నారు. నిందితులను కరీంనగర్‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపారు. -
శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో ఆఫ్రికన్ అరెస్టు
బెంగళూరు: కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ వినియోగంపై దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు శనివారం ఈ కేసులో ఆఫ్రికా దేశం సెనెగల్ కు చెందిన వ్యక్తిని అరెస్టు చేశారు. లౌమ్ పెప్పర్ సాంబా అనే ఇతడు సెలబ్రిటీలకు మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నటి రాగిణి ద్వివేదిని సహా మొత్తం ఆరుగురు ఇప్పటికే అరెస్టయ్యారు. మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద మొత్తం 12 మందిపై కేసులు నమోదయ్యాయి. రాగిణిని శుక్రవారం అరెస్టు చేయగా, జయనగర్ ఆర్టీవోలో క్లర్క్‌గా పనిచేస్తున్న రవిశంకర్, రియల్టర్ రాహుల్ షెట్టిలను గురువారం అరెస్టు చేశారు. ఉన్నతవర్గాల పార్టీలను నిర్వహించే వీరేన్ ఖన్నాను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్ డీలర్ సాంబా... రవిశంకర్‌కు, సెలబ్రిటీలకు మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నాడని సీసీబీ పోలీసులు తెలిపారు. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఇటీవల బెంగళూరులో కొన్ని అరెస్టులు చేíసినప్పుడు... కన్నడ నటులు, సంగీతకారులతో డ్రగ్ డీలర్లకు ఉన్న సంబంధాలు వెలుగు చూశాయి. నటి రాగిణిని అరెస్టు చేయడం ప్రకంపనలు రేపింది. కొందరు బడా నేతల కుమారుల ప్రమేయం ఉండటంతో ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
సుశాంత్ సింగ్ కేసులో ఎన్సీబీ అదుపులో మరొకరు
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధం ఉన్న మరో అనుమానితుడు బాసిత్ పరిహార్‌ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సిబి) ప్రశ్నిస్తున్నట్టు అధికారులు చెప్పారు. ఇప్పటికే అరెస్టు అయిన జైద్ విలాత్రా ని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా, ఆయన్ను సెప్టెంబర్ 9 వరకు ఎన్సీబీ కస్టడీకి అప్పగించారు. జైద్ విచారణ సందర్భంగా బాసిత్ పరిహార్ పేరు బయటపడింది. రాజ్‌పుత్ కేసులో రియాచక్రవర్తిపై నమోదైన మాదకద్రవ్యాల కేసుకి, బాసిత్‌కి సంబంధం ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. రియాచక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ మొబైల్ చాట్స్‌లో బాసిత్ ప్రస్థావన ఉన్నట్లు వారు చెప్పారు. షోవిక్‌ని, రాజ్‌పుత్ మేనేజర్ సామ్యూల్ మిరందాని మాదకద్రవ్యాల కేసు విచారణకు పిలవనున్నట్లు అధికారులు తెలిపారు. మహారాష్ట్ర, గోవా, ఢిల్లీలోని మరికొంత మంది మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠాపై నిఘా పెట్టినట్లు అధికారులు తెలిపారు చదవండి: సుశాంత్ డ్రగ్స్ కేసులో ఇద్దరు అరెస్ట్ -
శిరోముండనం కేసు: ఏడుగురు అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: దళిత యువకుడు శిరోముండనం కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు విశాఖ సిటీ పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. ఘటన జరిగిన నూతన్ నాయుడు ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. అరెస్ట్ చేసిన వారిలో నూతన్ నాయుడు భార్య మధు ప్రియను ఏ-1గా గుర్తించారు. మధు ప్రియ ఇంట్లో పని చేసే వరహాలు, ఇందిర, ఝాన్సీ, సౌజన్య, బాలు, రవిపై కేసులు నమోదు చేసినట్లు సీపీ తెలిపారు. అరెస్ట్ చేసిన ఏడుగురు నిందితులను జ్యుడిషియల్ కస్టడీకి పంపినట్లు పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా యువకుడు శ్రీకాంత్‌పై దాడి జరిగిన తీరును పోలీసులు గుర్తించారు. ఇందులో నూతన్ నాయుడు భార్య మధు ప్రియ చూస్తుండగా ఇంట్లో సహాయకులు ఇందిర తదితరులు అత్యంత క్రూరంగా శ్రీకాంత్‌కు శిరోముండనం(గుండు గీయించారు)చేశారు. ఐఫోన్ చోరీ నెపంతో దళిత యువకుడిని పిలిచి శిరోముండనం చేశారని సీపీ మనీష్ కుమార్ సిన్హా పేర్కొన్నారు. శ్రీకాంత్‌పై దాడి, గుండు చేస్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయని చెప్పారు. శిరోముండనం కేసులో మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. ఫోన్ విషయంతో పాటు ఇతర కారణాలపై కూడా లోతుగా విచారణ సాగిస్తామని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో నూతన్ నాయుడు ప్రమేయం పైన ఆరా తీస్తున్నామని తెలిపారు. బాధితుడిని కర్రలు, రాడ్లతో కొట్టినట్లు వీడియోలో ఉందని సీపీ మనీష్ కుమార్ సిన్హా వెల్లడించారు. చదవండి: సీసీ టీవీ ఫుటేజ్‌లో గుండు చేసిన దృశ్యాలు చదవండి: నూతన్ నాయుడు భార్యపై కేసు నమోదు చదవండి: దళిత యువకుడికి శిరోముండనం -
ఈ గేమ్ ఆడితే ‘రంగు’ పడుద్ది!
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ గేమ్స్‌కు యువతను బానిసలు చేసి, భారీగా డబ్బు కొల్లగొడుతున్న సంఘటనలు ఇటీవల అధికమయ్యాయి. ఈ–కామర్స్ పేరుతో సంస్థల్ని, వెబ్‌సైట్స్‌ను రిజిస్టర్ చేస్తున్న చైనా కంపెనీలు.. ఈ ముసుగులో ఆన్లైన్ గేమ్‌ను ప్రోత్సహిస్తూ ఆదాయం గడిస్తున్నాయి. తాజాగా కలర్ ప్రిడిక్షన్ పేరుతో రూపొందించిన ఓ గేమ్ యువతను నిండా ముంచుతోంది. ఒక్క ఈ ఏడాదిలోనే దేశంలో రూ.1100 కోట్ల టర్నోవర్ చేసిన ఈ గేమ్.. ఇప్పటికే రూ.110 కోట్లను విదేశాలకు తీసుకెళ్లింది. దీనిపై ఫిర్యాదు రావడంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు దర్యాప్తు చేసి ఓ చైనీయుడి సహా నలుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. గురువారం కొత్వాల్ అంజనీకుమార్ ఈ వివరాలు వెల్లడించారు. ఈ గేమ్ నిర్వహిస్తున్న సంస్థలకు చెందిన రెండు బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.30 కోట్లు ఫ్రీజ్ చేశామని తెలిపారు. ఎలా ఏ మారుస్తున్నారంటే.. నిర్వాహకులు ఈ గేమ్‌ను ఓ ప్రత్యేక ప్రోగ్రామింగ్ ద్వారా రూపొందించారు. ఓ కొత్త వ్యక్తి ఇందులోకి ప్రవేశించినప్పుడు అతడి ఐపీ అడ్రస్, ఇతర వివరాలను అది సంగ్రహిస్తుంది. అనంతరం తొలుత కొన్నిరోజులపాటు అతడు పందెం గెలిచేలా చేసి బానిసగా మారుస్తుంది. ఆ తర్వాత కొన్నాళ్ళు కొన్ని గేమ్‌లలో ఓడేలా.. పూర్తిగా బానిసగా మారిన తర్వాత అన్నీ ఓడిపోయేలా ప్రోగ్రామింగ్ డిజైన్ చేసి ఉంటోంది. దీంతో దీని వలలో చిక్కి గేమ్ ఆడినవాళ్లు నష్టపోవడమే తప్ప.. లాభపడటం అనేది జరగట్లేదు. ఇలా నష్టపోయినవారిని దళారులుగా మార్చుకుంటూ మరికొంత మందిని తమ వలలో చిక్కేలా గేమ్ నిర్వాహకులు పథకం వేశారు. ఈ గేమ్‌లో సభ్యులుగా ఉన్నవారు ఎవరైనా కొత్తవారిని ఆకర్షించి వారికి రిఫరల్ కోడ్ ఇస్తే.. రూ.1000 కమీషన్‌గా ఇస్తున్నారు. అంతేకాకుండా అతడు ఆడి, కోల్పోయే మొత్తం నుంచి 10 శాతం కూడా ఇస్తున్నారు. ఇలా మరింతమందిని ఈ ఉచ్చులో దింపేలా వారిని ప్రోత్సహిస్తున్నారు. డబ్బు పోగొట్టుకుని ఆత్మహత్యలు: లాక్ డౌన్ అమలులోకి వచ్చిన తర్వాత ఈ గేమ్ ఆడేవారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఈ ఉచ్చులో చిక్కి రూ.లక్షల్లో కోల్పో యిన అనేక మంది యువత ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. హైదరాబాద్‌లో రూ.6 లక్షలు కోల్పోయిన ఎస్సార్‌నగర్ యువకుడితో పాటు రూ.15 లక్షలు కోల్పోయిన ఆదిలాబాద్ యువకుడు, తమిళనాడులో పలువురు ఆత్మహత్య చేసుకోవడంతో కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు రూ.97వేలు, మరో యువకుడు రూ.1.64 లక్షలు పోగొట్టుకోవడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు.. ఈ సంస్థలు, వ్యవహారాలను చైనాకు చెందిన బీజింగ్ టి పవర్ అనే సంస్థ పర్యవేక్షిస్తున్నట్లు నిర్ధారిం చారు. ఈ ఆధారాలను బట్టి ఢిల్లీలో ఉంటున్న ఈ సంస్థ సౌత్ఈస్ట్ ఏషియా ఆపరేషన్స్ హెడ్‌గా ఉన్న చైనా జాతీయుడు యా హౌతో పాటు డైరెక్టర్లుగా పని చేస్తున్న ఢిల్లీ వాసులు ధీరజ్ సర్కార్, అంకిత్ కపూర్, నీరజ్ తులేలను అరెస్టు చేశారు. వీరిపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో 28 కేసులు నమోదు కావడంతో అరెస్టు సమాచారాన్ని ఆయా అధికారులకు తెలపాలని నిర్ణయించారు. ఏమిటీ కలర్ ప్రిడిక్షన్? చైనాకు చెందిన సూత్రధారులు భారత్‌లో ఉంటున్న యువతను టార్గెట్ చేస్తూ కలర్ ప్రిడిక్షన్ గేమ్‌ను తయారుచేశారు. ఢిల్లీలో కార్యాలయాలు ఏర్పాటు చేసిన ఈ సూత్రధారులు.. ఈ–కామర్స్ లావాదేవీల పేరుతో అక్కడి రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో (ఆర్వోసీ) ఎనిమిది సంస్థల్ని నమోదు చేశారు. ఇవన్నీ ఆన్లైన్లో వివిధ ఈ–కామర్స్ వెబ్సైట్లు నడుపుతున్నాయి. ఈ సైట్స్‌లోకి ప్రవేశించినవారు ఓ మూలన ఉండే లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా కలర్ ప్రిడిక్షన్ గేమ్‌లోకి వెళ్లొచ్చు. అయితే ఎవరికి వారు నేరుగా ప్రవేశించడానికి వీలు లేదు. అప్పటికే ఈ గేమ్ ఆడుతున్న వారు ఇచ్చే రిఫరల్ ఐడీ ద్వారా గేమ్‌లోకి ప్రవేశించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. గేమ్‌లోకి ప్రవేశించిన తర్వాత అక్కడ ఉన్న ఆçప్షన్‌లో ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగుల్లో ఒకటి ఎంచుకోవాలి. దానిపై ఎంత మొత్తం పందెం కాస్తున్నామో పేటీఎం ద్వారా చెల్లించాలి. ఇది పూర్తయిన తర్వాత గేమ్‌లో ప్రోగ్రామింగ్ రన్ అయి, ఓ రంగు వచ్చి ఆగుతుంది. పందెం కాసినవారు ఎంచుకున్న రంగు వస్తే ఆ మొత్తానికి రెండు నుంచి నాలుగు రెట్ల డబ్బు వారి పేటీఎం ఖాతాలోకి జమ అవుతుంది. రాకపోతే పందెం కాసిన మొత్తం ఆ సంస్థకు చెందుతుంది. -
ముగ్గురు మావోయిస్టు మిలిటెంట్ల అరెస్టు
మహబూబాబాద్ రూరల్: ముగ్గురు మావోయిస్టు మిలిటెంట్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 414 తుపాకీ తూటాల డంపు, పార్టీ సాహిత్యాన్ని స్వా«ధీనం చేసుకున్నారు. ఆదివారం మానుకోట సబ్ డివిజనల్ పోలీసు అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. జిల్లాలోని గంగారం మండలం దుబ్బగూడెం గ్రామ పరిధి మామిడిగూడెం, మిర్యాలపేట ప్రాంతాలకు చెందిన బండి సుధాకర్, కల్తి సమ్మయ్య, పోలెబోయిన సారయ్య మావోయిస్టు మిలిటెంట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పక్కా సమాచారం మేరకు పోలీసులు ఆ ముగ్గురిని ఆదివారం దుబ్బగూడెంలో అరెస్టు చేశారు. వారిని విచారించిన పోలీసులు రామారం, పొనుగొండ్ల గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన ఒక డంపులోని మూడు వేర్వేరు బ్యాగుల్లో 414 తూటాలను స్వాధీనం చేసుకున్నారు. కొంత కాలం క్రితం మావోయిస్టు పార్టీ నాయకులైన యాప నారాయణ అలియాస్ హరిభూషణ్, బడె చొక్కారావు అలియాస్ దామోదర్, కంకణాల రాజిరెడ్డి, కుర్పం మంగు అలియాస్ భద్రు, మడకం సింగి అలియాస్ అనిత అలియాస్ శాంత, ముచాకి ఉంగాల్ అలియాస్ సుధాకర్, కర్ణాకర్ అలియాస్ క్రాంతి, కొవ్వాసి గంగా అలియాస్ మహేశ్, వెట్టి భీమాలు అలియాస్ భీమా, యాలమ్ నరేందర్ అలియాస్ సంపత్, కొమ్ముల నరేశ్ అలియాస్ బయ్యన్న, మేదరి భిక్షపతి అలియాస్ విజేందర్‌తో పాటు మరికొంత మంది వీరి వద్ద తూటాలను దాచిపెట్టారని ఎస్పీ వివరించారు. ఈ ముగ్గురిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. కాగా, ముగ్గురు మిలిటెంట్ల అరెస్ట్‌లో ప్రతిభ కనబరిచిన గూడూరు సీఐ బాలాజీ, కొత్తగూడ, గంగారం ఎస్సైలు తాహెర్‌బాబా, రామారావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ సాగర్, ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ నిజాముద్దీన్, డీఎస్పీ ఆంగోతు నరేష్‌కుమార్‌ను ఎస్పీ కోటిరెడ్డి అభినందించి రివార్డులు అందజేశారు. రాష్ట్రంలో మళ్లీ తిష్ట వేయడానికి.. మావోయిస్టులు మళ్లీ తెలంగాణలో తిష్ట వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. దాదాపు 10 ఏళ్ల క్రితం తెలంగాణ ప్రజలు మావోయిస్టు నక్సల్స్‌ను తిరస్కరించడం వల్ల ఈ ప్రాంతంలో పనిచేసే వారంతా ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లిపోయారని తెలిపారు. మళ్లీ ఇక్కడ అలజడి సృష్టించేందుకు మావోయిస్టు కేంద్ర కమిటీ పథకం పన్ని హరిభూషణ్, కంకణాల రాజిరెడ్డి, దామోదర్, భద్రు, ఆజాద్‌లను తెలంగాణలో పని చేయాలని పంపుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఛత్తీస్‌గఢ్ గుత్తికోయ నక్సల్స్‌ను సైతం పంపుతోందని, ప్రజలు వారి కుయుక్తులను నమ్మవద్దని ఎస్పీ సూచించారు. -
పోటాపోటీ నిరసనలు
హన్మకొండ: వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు సోమవారం పోటాపోటీగా నిరసనలు తెలిపాయి. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెల కొంది. టీఆర్ఎస్కు చెందిన ఇద్దరు ఎ మ్మెల్యేలపై నిజామాబాద్ ఎంపీ ధర్మ పురి అర్వింద్ చేసిన వివాదాస్పద వ్యా ఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం విదితమే. దీంతో ఆగ్రహించిన టీఆర్ ఎస్ శ్రేణులు.. ఎంపీ కాన్వాయ్, హ న్మకొండలోని బీజేపీ కార్యాలయంపై దాడికి దిగాయి. దీన్ని నిరసిస్తూ సోమ వారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తం గా ఆందోళనలు చేపట్టాలని బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు హన్మకొండలోని అమరుల స్తూపం కూడలి వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, నన్నపునేని నరేందర్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు తమ ఎమ్మెల్యేలను భూకబ్జాదారులని ఆరోపించడంపై టీఆర్ఎస్ శ్రేణులూ భగ్గుమన్నాయి. ధర్నా నిర్వహించి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. అప్పటికే బందోబస్తులో ఉన్న పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు. బీజేపీ కార్యకర్తలను కూడా అరెస్టు చేసి బీమారంలోని ఓ ఫంక్షన్ హాల్‌కు తరలించారు. అంతకుముందు హన్మకొండ బాలసముద్రం లోని చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, వరంగల్‌లోని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ క్యాంపు కార్యాలయాలపై బీజేపీ కార్యకర్తలు కోడిగుడ్లు విసిరారు. మరోవైపు కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించేందుకు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు వెళుతుండగా మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. -
కుశాల్ మెండిస్ అరెస్ట్
కొలంబో: శ్రీలంక క్రికెట్ జట్టు వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ కుశాల్ మెండిస్ ఆదివారం అరెస్టయ్యాడు. ప్రమాదవశాత్తు తన కారుతో ఓ సైక్లిస్టును ఢీకొట్టిన కుశాల్ మెండిస్ అతని మరణానికీ కారణమయ్యాడు. దీంతో అతని ఎస్యూవీ వాహనంతో పాటు మెండిస్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో కొలంబోలోని పనదురా ప్రాంతంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో గోకరెలా ప్రాంతానికి చెందిన 64 ఏళ్ల వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో మెండిస్ మద్యం సేవించి ఉన్నాడా? లేదా? అనే అంశంపై స్పష్టత రాలేదు. 25 ఏళ్ల మెండిస్ ఇప్పటి వరకు శ్రీలంక జట్టుకు 44 టెస్టులు, 76 వన్డేలు, 26 టి20 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. -
మాఫియా డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో మరో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు అయ్యింది. ఆదివారం అమీర్‌పేట్ ప్రాంతంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ పోలీసులు తనిఖీలు నిర్వహించి పలు రకాల నిషేధిత డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో 105 గ్రాముల ఎండీఎంఏ, 25 గ్రాముల కొకైన్, 25 గ్రాముల హషిష్ ఆయిల్, 4 బ్లాట్స్ ఎల్ఎస్డీ, 250 డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే 2 కార్లు, ఒక బైక్, 7 మొబైల్ ఫోన్ల స్వాధీనంతోపాటు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ డ్రగ్స్ రాకెట్‌కు సూత్రధారిగా భావిస్తున్న మధురానగర్‌కు చెందిన భరత్ తుక్రాల్(48)తోపాటు బల్కంపేట్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాణాప్రతాప్(29), షేక్ ఫిరోజ్ అహ్మద్(29)ను అరెస్టు చేశారు. డ్రగ్స్ రవాణాకు వినియోగించిన రెండు కార్లను, ఓ బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎండీఎంఏ డ్రగ్స్‌ను బెంగళూరుకు చెందిన జేమ్స్, ఢిల్లీకి చెందిన జెమీ, చెన్నైకు చెందిన అబ్దుల్ వద్ద కొనుగోలు చేసినట్లు నిందితులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. జేమ్స్, జెమీ, అబ్దుల్ ప్రస్తుతం పరారీలో ఉన్నార న్నారు. కేసు తదుపరి విచారణ కోసం అమీర్ పేట్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించినట్లు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజి రెడ్డి తెలిపారు. కాగా, నిందితులు నగరంలోని పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలకు నిషే ధిత డ్రగ్స్‌ను సరఫరా చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతుండటం గమనార్హం. -
టీపీఎఫ్ నాయకుల అరెస్ట్
భీమదేవరపల్లి: వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్‌కు చెందిన టీపీఎఫ్ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు గొల్లూరి ప్రవీణ్‌కుమార్, టీపీఎఫ్ సభ్యుడు ఉగ్గె శేఖర్ అలియాస్ శంకర్‌తో పాటు కమలాపూర్ మండలం కానిపర్తికి చెందిన రైతు సంఘం నాయకుడు కొత్తూరి ఇంద్రసేన అలి యాస్ చిన్నన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి విప్లవ సాహిత్యం, పేలుడుకు ఉప యోగించే ఐదు డైనమోలు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు కాజీపేట ఏసీపీ రవీంద్రకుమార్ తెలిపారు. ఆదివారం ఆయన వంగర పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడుతూ.. మావోయిస్టు పార్టీ బలోపేతంలో భాగంగా మాణిక్యాపూర్ చెరువు శివారు కట్ట వద్ద సమావేశం జరుగుతోందని సమాచారం రావడంతో ఎల్కతుర్తి సీఐ శ్రీనివాస్‌జీ, ముల్కనూర్, వంగర ఎస్సైలు టీవీఆర్ సూరి, గంజి స్వప్న సిబ్బందితో వెళ్లి ఉగ్గె శేఖర్, గొల్లూరి ప్రవీణ్ కుమార్, ఇంద్రసేనను అదుపులోకి తీసుకు న్నారని చెప్పారు. ప్రవీణ్, శేఖర్, ఇంద్రసేనను హుస్నాబాద్ కోర్టు జడ్జి ఎదుట హాజరుపర్చనున్నట్లు తెలిపారు. -
కరోనా: తప్పుడు ప్రచారానికి ‘సంకెళ్లు’
కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వం, అధికార యంత్రాంగం నానాపాట్లు పడుతుంటే కొందరు అరచేతిలో ఉన్న సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తప్పుడు వార్తలను ప్రచారంలోకి తీసుకొచ్చి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. దీనిపై పోలీసు యంత్రాంగం కన్నెర్ర చేస్తోంది. ఇలాంటి నేరానికి పాల్పడ్డ ఓ వ్యక్తిని చిత్తూరు పోలీసులు బుధవారం అరెస్టు చేసి, జైలుకు తరలించారు. చిత్తూరు అర్బన్: అరచేతిలో సెల్‌ఫోన్ ఉంది కదా అని వాస్తవాలను ధ్రువీకరించుకోకుండా ఎవరో పంపిన మెనేజ్‌లను ఫార్వర్డ్ చేయడం వల్ల సమస్యలు తప్పవు. ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకిందంటూ సామాజిక మాధ్యమాల్లో అతని ఫొటో పెట్టడం, మరికొందరు ఓ కాలనీలో ఐదు పాజిటివ్ కేసులు వచ్చాయని తప్పుడు ప్రచారం చేయడం కచ్చితంగా నేరం కిందకే వస్తుందని పోలీసులు చెబుతున్నారు. అలాంటి వాళ్లపై ఐపీసీ సెక్షన్ 153, 188, 505, 269లతో పాటు ఐపీసీ సెక్షన్ 10 (2),(1) ఆఫ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్–2005, సెక్షన్ 66 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి జైలుకు తరలిస్తున్నారు. ఈ కేసుల్లో నేరం రుజువైతే 2 ఏళ్లకు పైగా జైలుశిక్ష పడుతుంది. కాణిపాకం ఆలయాన్ని క్వారంటైన్ సెంటర్‌గా ఏర్పాటు చేశారంటూ తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లాకు చెందిన ఎం.విష్ణువర్ధన్‌రెడ్డి (56) తన ఫేస్బుక్, ట్విటర్ ఖాతాల్లో తప్పుడు పోస్టులు చేశాడు. వాట్సాప్ ద్వారా పలువురికి పంపాడు. కాణిపాకం ఈఓ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, కోర్టుకు తరలించారు. కోర్టు ఆదేశాలతో చిత్తూరులోని జిల్లా జైలుకు తరలించారు. గత నెల పలమనేరులో ఓ చార్టెడ్ అకౌంటెంట్‌కు కరోనా సోకిందంటూ ఫేస్బుక్, వాట్సప్‌లలో మెసేజ్ పెట్టినందుకు గంగవరానికి చెందిన వారిపై కేసులు నమోదయ్యాయి. నమ్మొద్దు.. వాట్సాప్, ఇతర సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నింటినీ నమ్మొద్దు. ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకున్న తర్వాత నిజాన్ని నమ్మండి. అంతేతప్ప వచ్చిన మెసేజ్‌లను ఫార్వర్డ్ చేస్తూ వెళితే ఓ దశలో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. – ఎస్.సెంథిల్‌కుమార్, ఎస్పీ, చిత్తూరు -
మహారాష్ట్రలో టీవీ జర్నలిస్టు అరెస్టు
ముంబై: లాక్డౌన్ మంగళవారం ముగుస్తుందని, ప్రత్యేక రైళ్ల రాకపోకలు మొదలవుతాయంటూ ప్రచారం చేసి, ముంబైలోని బాంద్రా రైల్వేస్టేషన్‌కు వందలాది వలసకూలీల రాకకు కారణమైన టీవీ జర్నలిస్టు రాహుల్ కులకర్ణిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌లో ఆయనను అరెస్ట్‌చేశారు.æ కులకర్ణి ఓ మరాఠి న్యూస్ చానల్లో పని చేస్తున్నారు. వలస కూలీలను వారి సొంత ప్రాంతాలకు చేర్చడానికి జన్ సాధారణ్ ప్రత్యేక రైళ్లు మంగళవారం నుంచి ప్రారంభమవుతాయని ఆయన ఇటీవల తమ చానల్లో వార్త ప్రసారం చేశారు. ఇది నిజమేనని నమ్మిన వేలాది మంది వలస కూలీలు ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. -
15వ ఏట నుంచే నేరబాట
సాక్షి, హైదరాబాద్: తన పదిహేనో ఏట నుంచే నేరాలు చేయడం ప్రారంభించిన మహేష్ మైనర్‌గానే అనేకసార్లు అరెస్టు అయ్యాడు. ఓ కేసులో శిక్ష పడటంతో స్పెషల్ హోమ్‌కు తరలించారు. శిక్షాకాలం పూర్తికాకుండానే తప్పించుకుని పారిపోయాడు. ఆ వెంటనే మళ్లీ నేరాలు చేయడం ప్రారంభించి వారం రోజుల్లో నాలుగు చోట్ల పంజా విసిరాడు. ఈలోపు మైనార్టీ సైతం పూర్తయి మేజర్‌గా మారిన ఇతగాడిని ఈస్ట్‌జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ నేరగాడి నుంచి రూ.15 లక్షల విలువైన సొత్తు, వాహనం స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ శనివారం వెల్లడించారు. అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మితో కలిసి తన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. నల్లగొండ జిల్లా చంటపల్లి తండాకు చెందిన జటావత్ మహేష్ (19) తన 15వ ఏట నుంచే నేరబాటపట్టాడు. రాజధానితో పాటు నల్లగొండలోని అనేక ప్రాంతాల్లో తొలినాళ్ళల్లో వాహన చోరీలు చేసిన ఇతగాడు ఆపై ఇళ్లల్లో దొంగతనాలు మొదలెట్టాడు. ఇప్పటి వరకు మహేష్‌పై 50కి పైగా కేసులు నమోదై ఉన్నాయి. మూడేళ్ల క్రితం మైనర్‌గా ఉన్న మహేష్‌ను పట్టుకున్న వనస్థలిపురం పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి మూడేళ్ల శిక్ష విధించడంతో గాజులరామారంలోని గవర్నమెంట్ స్పెషల్ హోమ్ ఫర్ బాయ్స్‌లో ఉంచారు. అక్కడి అధికారులు మహేష్ సహా మరికొందరికి వృత్తి విద్యల్లో శిక్షణ ఇప్పించారు. అందులో భాగంగా ఇతగాడిని గచ్చిబౌలిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్లో (ఎన్ఐసీ) చేర్పించారు. రెండేళ్ల ఎనిమిది నెలల శిక్షకాలం పూర్తి చేసుకున్న మహేష్ గత నెల్లో ఎన్ఐసీ నుంచి పరారయ్యాడు. దీనికి సంబంధించి గచ్చిబౌలి ఠాణాలో కేసు నమోదైంది. లాక్‌డౌన్‌కు వారం రోజుల ముందు ఇలా బయటకు వచ్చిన మహేష్‌కు మైనార్టీ సైతం తీరింది. అప్పటి నుంచి లాక్డౌన్ మొదలయ్యే వరకు కంచన్‌బాగ్, సరూర్‌నగర్, నల్లగొండ, మలక్‌పేటల్లో నాలుగు నేరాలు చేశాడు. ఇందులో రెండు వాహనచోరీలు కాగా, మరో రెండు ఇళ్లల్లో దొంగతనాలు. ఇతడి ఆచూకీ కోసం ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. కంచన్‌బాగ్ పరిధిలో శనివారం వాహన తనిఖీలు చేపడుతుండగా చోరీ వాహనంపై వచ్చిన ఇతగాడు చిక్కాడు. ఇతడి నుంచి రూ.15 లక్షలు విలువైన సొత్తు, వాహనం స్వాధీనం చేసుకున్న పోలీసులు తదుపరి చర్యల నిమిత్తం స్థానిక పోలీసులకు అప్పగించారు. మహేష్ పీడీ యాక్ట్ ప్రయోగించాలని నిర్ణయించినట్లు కొత్వాల్ అంజనీకుమార్ పేర్కొన్నారు. నడిరోడ్డు పైనే నగర పోలీసు కమిషనరేట్ చరిత్రలో తొలిసారిగా కమిషనర్ కార్యాలయం ముందున్న రోడ్డు విలేకరుల సమావేశానికి వేదికైంది. ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసిన మహేష్ ప్రెస్‌మీట్‌తో పాటు నటుడు విజయ్ దేవరకొండ, దర్శకుడు శంకర్లు అతిథులుగా హాజరైన ఫేస్‌షీల్డ్స్ పంపిణీ కార్యక్రమం సైతం కమిషనర్ కార్యాలయం ముందున్న రోడ్డుపై జరిగాయి. కరోనా ప్రభావం నేపథ్యంలో కమిషనరేట్‌తో పాటు కాన్పరెన్స్ హాల్లోకి రాకపోకలు నియంత్రించిన అధికారులు ఈ రకంగా రోడ్డుపై తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. విలేకరులు సహా అంతా స్టేజ్ మీద, దాని పక్క, చెట్ల కింద నిల్చునే ఉన్నారు. -
నగరంలో ఢిల్లీ తరహా అల్లర్లకు కుట్ర
సాక్షి, హైదరాబాద్: సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన తరహాలో నగరంలోనూ అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నించిన ఇద్దరు యువకుల్ని దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పట్టుకుంది. సిటీలో మత ఘర్షణలు రేపేందుకు వీరు ఓ ప్రార్థన స్థలంపై 3 కిరోసిన్ బాంబులు విసిరారు. అంతకుముందే రెండు ఏటీఎంలకు నిప్పుపెట్టగా, ఆర్టీసీ బస్సు దగ్ధానికి యత్నించారు. ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న ఓ వివాదాస్పద వ్యక్తి ప్రసంగాలతో ప్రేరణ పొందిన వీరిద్దరూ ఈ ఘాతుకాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాల ఫీడ్ ఆధారంగా వీరిని పట్టుకున్నారు. ప్రసంగాలతో స్ఫూర్తిపొంది.. రియాసత్‌నగర్‌కు చెందిన అర్షద్, హఫీజ్‌బాబానగర్‌కు చెందిన వసీ స్నేహితులు. ఒకరు చిరువ్యాపారి కాగా, మరొకరు విద్యార్థి. వీరిద్దరు స్మార్ట్ ఫోన్ల ద్వారా ఇంటర్నెట్లో ఓ వివాదాస్పద వ్యక్తి ప్రసంగాలు చూసేవారు. వాటి ద్వారా స్ఫూర్తి పొంది..తాము ఏదో ఒక సంచలనం సృష్టించాలని ఆలోచించేవారు. ఈ క్రమంలోనే ఓసారి మిథాని డిపోలో ఆర్టీసీ బస్సును దగ్ధం చేయడానికి, ఫిబ్రవరి 11న చాంద్రాయణగుట్ట చౌరస్తాలోని రెండు ఏటీఎంలకు నిప్పు పెట్టడానికి యత్నించారు. ఇటీవల సీఏఏ, ఎన్నార్సీలపై ఢిల్లీలో జరిగిన ఘర్షణల వంటివి హైదరాబాద్‌లోనూ సృష్టించాలని కుట్రపన్నారు. రెండు వర్గాల మధ్య మత ఘర్షణ సృష్టిస్తేనే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పథకం వేశారు. ఈ క్రమంలో ఈ నెల మొదటి వారం నుంచి వీరిద్దరూ ద్విచక్ర వాహనంపై తిరుగుతూ అనేక ప్రాంతాల్లో రెక్కీ చేశారు. మాదన్నపేటలోని ఓ ప్రార్థన స్థలాన్ని టార్గెట్‌గా చేసుకుని, గత నెల 14 రాత్రి అక్కడకు వెళ్లి మూడు కిరోసిన్ బాంబులు విసిరారు. అవి పేలకపోవడంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఈ ఘటనలపై స్థానిక పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. రంగంలోకి దిగిన దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. పాతబస్తీలోని అనేక ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించి, అనుమానితుల వాహనం నంబర్ గుర్తించారు. దీని ఆధారంగా ప్రత్యేక టీమ్ సోమవారం రాత్రి అర్షద్, వసీని పట్టుకుంది. వీరి నుంచి ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతాలకు అర్షద్.. వసీని ప్రేరేపించాడని పోలీసులు గుర్తించారు. -
రేవంత్‌రెడ్డి అరెస్టు
సాక్షి, మణికొండ/కుషాయిగూడ: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బంధువులకు చెందిన ఫాంహౌస్‌ను అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన కేసులో మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అరెస్టయ్యారు. ఇదే కేసులో ఆయన అనుచరులు ఎం.జైపాల్‌రెడ్డి, ఓంప్రకాశ్‌రెడ్డి, ప్రవీణ్‌పాల్ రెడ్డి, విజయసింహారెడ్డి, డ్రోన్ ఆపరేటర్లు రాజేశ్, శివకృష్ణను పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రేవంత్‌ను మొదటి నిందితుడిగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విచారణ నిమిత్తం గురువారం నార్సింగి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం తెలియడంతో ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. తమ నాయకుడితో మాట్లాడాలని, స్టేషన్ లోపలకు అనుమతించాలంటూ వాదనకు దిగారు. దీంతో రేవంత్‌ను మరో గేటు నుంచి బయటకు తరలించారు. ఆ గేటు దగ్గరే ఉన్న రేవంత్ అను చరులు పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్‌ను తొలుత గోల్కొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిం చారు. అనంతరం ఉప్పర్‌పల్లిలోని 14వ మెట్రోపాలిటన్ కోర్టు జడ్జి సంతోష్కుమార్ఎదుట హాజరు పరిచారు. జడ్జి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు. రేవంత్ లొంగిపోయారు: డీసీపీ ఎంపీ రేవంత్‌రెడ్డి తనంత తానుగా వచ్చి పోలీసులకు లొంగిపోయారని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. దీంతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారని వెల్లడించారు. రేవంత్‌పై సెక్షన్ 188, 287, 109, 120బి, 11ఎ, ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం 5ఏ ప్రకారం కేసులు నమోదు చేసినట్లు వివరించారు. కాగా, ఇదే కేసులో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కూడా నిందితుడిగా ఉన్నారు. అయితే, ఆయన గాయపడి ఉండటంతో పోలీసులు ఇంకా అరెస్టు చేయలేదని తెలుస్తోంది. అవినీతిని ప్రశ్నిస్తే అరెస్టా?: సీతక్క ముఖ్యమంత్రి కుటుంబం అవినీతిని ప్రశ్నించే ప్రతిపక్ష గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. రేవంత్‌రెడ్డిని చర్లపల్లి జైలుకు తీసుకువస్తున్నారని తెలియడంతో సీతక్క కాంగ్రెస్ కార్యకర్తలతో అక్కడకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో అనేక భూములు కబ్జాచేసి ఫాంహౌజ్‌లు నిర్మించుకున్న వ్యవహారంతోపాటు ప్రభుత్వ భూముల్లో హోంల పేరుతో జరుగుతున్న అవినీతి నిర్మాణాలపై పోరాడుతున్న రేవంత్‌ను అక్రమంగా అరెస్టు చేయడం హేయమైన చర్య అని దుయ్యబట్టారు. వాస్తవాలను వెలికితీస్తే కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్న ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారని, కేసీఆర్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే సమయం దగ్గరపడిందని వ్యాఖ్యానించారు. రేవంత్ అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని తెలిపారు. -
పుల్వామా కేసులో తండ్రి, కూతురు అరెస్టు
శ్రీనగర్: గత ఏడాది 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న పుల్వామా ఘటన విచారణలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కీలక పురోగతి సాధించింది. నిందితులకు జమ్మూలోని ప్రత్యేక న్యాయస్థానం 10 రోజుల రిమాండ్ విధించింది. పుల్వామాలోని హక్రిపొరాకు చెందిన ట్రక్ డ్రైవర్ తౌఫిక్ అహ్మద్ షా, అతడి కూతురు ఇన్షాజాన్(23)లు 2018–19 కాలంలో ఉగ్రవాదులకు చాలాసార్లు ఆహారం, ఇతర వస్తువులను సమకూర్చారు. పాకిస్తాన్ ఉగ్రవాది, పేలుడు పదార్థాల నిపుణుడు అయిన మొహ్మద్ ఉమర్ ఫరూక్, పాకిస్తాన్‌కే చెందిన కమ్రాన్, ఇస్మాయిల్ అలియాస్ ఇబ్రహీం, అలియాస్ అద్నాన్‌లు తౌఫిక్ ఇంట్లోనే బస చేశారు. ‘మొహ్మద్ ఉమర్‌తో ఇన్షా జాన్ టెలిఫోన్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ఉత్తరప్రత్యుత్తరాలు సాగించింది. అతడు చనిపోయే దాకా ఈ సంబంధాలు కొనసాగాయని మా దర్యాప్తులో తేలింది’అని ఎన్ఐఏ తెలిపింది. -
దివ్య మరెవరికీ దక్కకూడదనే..
గజ్వేల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బ్యాంకు ఉద్యోగి దివ్య హత్యకేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సిద్దిపేట ఇన్చార్జి పోలీస్ కమిషనర్ శ్వేత గురువారం దీనిపై ఒక ప్రకటన విడుదల చేశారు. వివరాలిలా ఉన్నాయి.. ఈనెల 18న గజ్వేల్‌లో హత్యకు గురైన దివ్య తండ్రి లక్ష్మీరాజం ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేములవాడకు చెందిన వెంకటేశ్‌గౌడ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం రాత్రి వేములవాడలో ప్రత్యేక బృందం పోలీసులు వెంకటేశ్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా.. తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. హత్య అనంతరం వెంకటేశ్ అక్కడి నుంచి సికింద్రాబాద్‌కు వెళ్ళాడని, ఆ తర్వాత రైలులో విజయవాడకు, అక్కడి నుంచి వరంగల్ మీదుగా బుధవారం రాత్రి వేములవాడకు వచ్చాడని పోలీసులు తెలిపారు. తనకు దక్కని దివ్య మరెవరికీ దక్కకూడదనే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు విచారణలో వెంకటేశ్ చెప్పాడని, నిందితునికి కఠిన శిక్ష పడేలా చూస్తామని ఇన్చార్జి సీపీ పేర్కొన్నారు. కేసును 24 గంటల్లో ఛేదించిన గజ్వేల్ ఏసీపీ నారాయణ, సీఐ ఆంజనేయులు, సిబ్బందిని పోలీస్ కమిషనర్ శ్వేత అభినందించారు. నిందితునికి వైద్య పరీక్షలు అరెస్టు అనంతరం నిందితుడు వెంకటేశ్‌గౌడ్‌ను గజ్వేల్ పోలీస్ స్టేషన్ నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రి ప్రాంగణం వద్ద విలేకరులు వెంకటేశ్‌గౌడ్‌ను సంఘటనకు దారితీసిన పరిస్థితులపై ప్రశ్నించగా.. అతను నోరు విప్పలేదు. సుమారు 15 నిమిషాలపాటు వైద్య పరీక్షలు సాగాయి. ఆ తర్వాత పోలీసులు అతడిని గట్టి బందోబస్తు మధ్య గజ్వేల్‌లోని కోర్టులో హాజరు పరిచి, రిమాండ్‌కు తరలించారు. -
ఓజీ కుప్పం గ్యాంగ్ చిక్కింది
సాక్షి, హైదరాబాద్: బ్యాంకు నుంచి నగదు డ్రా చేసిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని వారి దృష్టి మళ్లించి ఆ డబ్బుల్ని దొంగిలించే ఓజీ కుప్పం గ్యాంగ్ నగర పోలీసులకు చిక్కింది. హైదరాబాద్ సహా దక్షిణాదిలోని అనేక నగరాలు, పట్టణాల్లో తమ పనికానిచ్చింది. నలుగురున్న ఈ గ్యాంగులో ఇద్దరిని పోలీసులు పట్టుకుని వారి నుంచి రూ.9.4 లక్షల నగదు, నాలుగు బైక్‌లు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్, డీసీపీ పి. రాధాకిషన్‌రావుతో కలసి గురువారం మీడియాకు వెల్లడించారు. రైళ్లలో వాహనాలతో సహా వచ్చి.. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న ఓరన్ థంగల్ గొల్ల కుప్పంను ఓజీ కుప్పంగా పిలుస్తారు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం 20 మంది నేరగాళ్ళు 12 గ్యాంగ్‌లుగా పని చేస్తున్నారు. గ్యాంగ్ లీడర్లు మినహా సభ్యులు ఒక్కోసారి ఒక్కో గ్యాంగ్‌లో కలిసి ‘పని’కి వెళ్తుంటారు. తెలుగు, తమిళం బాగా, హిందీ ఓ మోస్తరుగా తెలిసిన వీళ్ళు దక్షిణాదినే లక్ష్యంగా చేసుకుంటారు. ఓ నగరం/పట్టణాన్ని టార్గెట్‌గా చేసుకుని వారంతా ఆ ప్రాంతానికి బైక్‌లు తీసుకుని బయల్దేరతారు. లక్ష్యంగా చేసుకున్న ప్రాంతానికి వాహనాలను రైల్వే పార్శిల్ ద్వారా తాము వెళ్లే రైల్లోనే తీసుకువస్తారు. అక్కడకు చేరుకుని లాడ్జిల్లో లేదా శివార్లలో ఇళ్ళు అద్దెకు తీసుకుని బస చేస్తారు. అనంతరం ఓ బ్యాంకుపై దృష్టి సారించి ముగ్గురు వ్యక్తులు బ్యాంకు బయట, మరో వ్యక్తి బ్యాంకులోపల ఉంటారు. అక్కడ నగదు డ్రా చేస్తున్న వ్యక్తులను ప్రధానం వయసు మళ్లిన వారిని లక్ష్యంగా చేసుకుని అతడి కదలికలను ఎప్పటికప్పుడ బయటివారికి దొంగిలించి న సెల్‌ఫోన్ ద్వారా చేరవేస్తుంటాడు. డబ్బు డ్రా చేసిన వ్యక్తి బయటకొచ్చినప్పటినుంచి ఈ గ్యాంగ్ సమయం కోసం వేచి చూస్తూ అతడిని వెంబడిస్తుంది. ఖాతాదారుడు కనుక కారులో వస్తే తమ వద్ద ఉన్న పంక్చర్ చేసే ఉపకరణంతో టైర్‌కు రంధ్రం చేసి, లేదా కారులో డ్రా చేసిన డబ్బు తీసుకువెళ్ళేప్పుడు యజమానితో పాటు డ్రైవర్ కూడా ఉంటే రూ.50, రూ.100 నోట్లు పక్కన పడేయటం ద్వారా అవి మీవే అంటూ తీసుకునేలా చేసి తమ పని పూర్తి చేస్తారు. ఒకవేళ బైక్‌లోని డిక్కీలో నగదు పెడితే పార్క్ చేసేంత వరకు తెలియకుండా వెంటబడతారు. అనంతరం డిక్కీని పగలగొట్టి డబ్బును దొంగిలిస్తారు. ఈ మూడు కాకపోతే వీరి వద్ద దురద పుట్టించే ఓ స్ప్రే సిద్ధంగా ఉంటుంది. ఓ ముఠా సభ్యుడు తమ టార్గెట్ గమనించకుండా అతడి పై దీన్ని స్ప్రే చేసి వెళ్ళిపోతాడు. బాధితుడు ఆ దురదతో ఇబ్బంది పడుతుంటే వెనుక వచ్చే గ్యాంగ్ సభ్యులు సహకరిస్తున్నట్లు నటించి డబ్బు కాజేస్తారు. 300 కెమెరాల ఫీడ్ విశ్లేషించి.. నగరాన్ని టార్గెట్ చేసిన ఈ ముఠా గత నెల, ఈ నెల్లో కలిపి నల్లకుంట, అంబర్పేట్, ఫలక్‌నుమ, మీర్పేట్ ఠాణాల పరిధుల్లో నాలుగు నేరాలు చేసి రూ.16 లక్షలు ఎత్తుకుపోయారు. ఈ కేసుల్ని ఛేదించడానికి నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వరరావు నేతృత్వంలో ఎస్సైలు జి.రాజశేఖర్‌రెడ్డి, బి.పరమేశ్వర్, కె.శ్రీకాంత్‌లతో పాటు గతంలో టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన ఫలక్‌నుమ డీఐ కేఎస్ రవి సైతం బృందంగా ఏర్పడ్డారు. వీరు నేరం జరిగిన నాలు ప్రాంతాల్లోని సుమారు 300 సీసీ కెమెరాల్లో రికార్డైన ఫీడ్‌ను సేకరించి విశ్లేషించారు. రెండు వాహనాలపై తిరుగుతున్న నలుగురు వ్యక్తులు ఈ నేరాలు చేశారని, నేరం తర్వాత తమ ముఖాలు కప్పుకుని తప్పించుకుంటున్నారని గుర్తించారు. సాంకేతికంగా దర్యాప్తు చేసిన అధికారులు తమ వేగుల సాయంతో ఆ నలుగురూ ఓజీ కుప్పం ప్రాంతానికి చెందిన ఆకుల కిరణ్, జి.తులసింధర్, ప్రభుదాస్, శామ్యూల్రాజ్గా నిర్థారించారు. అనంతరం వీరికోసం ఓజీ కుప్పం వెళ్లారు. దాదాపు 15 రోజుల పాటు అక్కడే ఉండి నిందితులు కిరణ్, తులసింధర్లను పట్టుకుని నగరానికి తీసుకొచ్చారు. వీరి నుంచి రూ.9.4లక్షల నగదు, నాలుగు బైక్‌లు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నగరంలో నాలుగు నేరాలతో పాటు ఏపీలోని పెనమలూరు, పామర్రు, చిలకలపూడి, కర్ణాటకలోని బీదర్, తుముకూర్ల్లోనూ నేరాలు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. గతంలో 23 కేసుల్లో నిందితుడిగా ఉన్న కిరణ్‌పై మూడు ఎన్బీడబ్ల్యూలు పెండింగ్‌లో ఉన్నాయి. తులసింధర్పై గతంలో 17 కేసులు ఉన్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నేరగాళ్ళను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు. -
ఐఎంఎస్ కుంభకోణంలో ఓమ్నీ నాగరాజు అరెస్టు
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) మందుల కుంభకోణంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడు కొనసాగుతోంది. మొదటి నుంచి అధికారులతో కుమ్మక్కయి అధిక ధరలకు మందులు కొనుగోలు చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఓమ్నీ మార్కెటింగ్ మేనేజర్ చెరుకూరి నాగరాజును ఏసీబీ అధికారులు గురు వారం అరెస్టు చేశారు. ఈ కేసులో నాగరాజు ఏ–9గా ఉన్నాడు. ఓమ్నీ ఫార్మా ఎండీ శ్రీహరిబాబు అలియాస్ బాబ్జిని ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. శ్రీహరిబాబే లెజెండ్ కంపెనీని సృష్టించి దానికి కృపాసాగర్‌రెడ్డి అనే వ్యక్తిని బినామీగా పెట్టాడని దర్యాప్తు లో అధికారులు గుర్తించారు. శ్రీహరిబాబుకు చెందిన ఓమ్నీ ఫార్మాలో నాగరాజు మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేసేవాడు. లెజెండ్ కంపెనీ ద్వారా అప్పటి డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ ద్వారా అధిక ధరలకు బిల్లులు చెల్లించేలా చేయడంలో నాగరాజు కీలకపాత్ర పోషించినట్లు శ్రీహరిబాబు ఏసీబీ దర్యాప్తులో వెల్లడిం చాడు. దీంతో ఏసీబీ నాగరాజును అరెస్టు చేసింది. -
విమానం కూల్చివేతపై 30 మంది అరెస్ట్
టెహ్రాన్: ఉక్రెయిన్ విమానాన్ని ఇరాన్ కూల్చివేసిన ఘటనలో 30 మందిని అరెస్ట్ చేసినట్లు ఇరాన్ న్యాయ విభాగ అధికార ప్రతినిధి గులాం హుస్సేన్ ఇస్మాయిలీ తెలిపారు. మంగళవారం జరిగిన లోతైన విచారణ అనంతరం బాధ్యులైన వారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ ప్రకటించిన కాసేపటికి గులం హుస్సేన్ అరెస్టు గురించి చెప్పారు. అమెరికా చర్యల వల్లనే ఈ ఘటన జరిగినప్పటికీ.. ప్రమాదాన్ని తాము సమర్థించడంలేదని రౌహానీ చెప్పారు. గతవారం టెహ్రాన్ నుంచి ఉక్రెయిన్ బయలుదేరిన విమానం కొద్దిసేపటికే కుప్పకూలగా 176 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ పొరబాటుపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. -
మైనర్లే కానీ.. కరుడుగట్టిన దొంగలు
సాక్షి, జగద్గిరిగుట్ట : దోపిడీలు, దొంగతనాలు చేస్తున్న ఇద్దరు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ. 5.69 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. శనివారం బాలానగర్ ఏసీపీ పురుషోత్తమ్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సూరారం కాలనీ దయానంద్‌నగర్ కాలనీకి చెందిన ఇద్దరు మైనర్లు 917,14) తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తుంటారు. జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇటీవల నాలుగు ఇళ్లలో చోరీలు చేశారు. సీసీ కెమెరాలు తదితర ఆధారాలతో కేసులను విచారించి ఈ ఇద్దరిని గుర్తించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 4.80 వేలు విలువ చేసే బంగారం, రూ. 84 వేల విలువ చేసే రెండు కేజీల వెండితో పాటు రూ. 5వేలు స్వాధీనం చేసుకున్నారు. మైనర్.. నోఫియర్.. పట్టుబడిన ఇద్దరు మైనర్లు 2018 నుంచి దొంగతనాలకు పాల్పడడంతో వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. వీరిలో ఒకరిపై (17) బాలానగర్ పీఎస్‌లో రెండు, శామీర్‌పేట పీఎస్‌లో ఒకటి, జీడిమెట్ల పీఎస్‌లో ఒకటి, పేట్ బషీరాబాద్ పీఎస్‌లో రెండు, జగద్గిరిగుట్ట పీఎస్‌లో రెండు చొప్పున మొత్తం 8 దొంగతనం కేసులు ఉన్నాయి. మరొకరి(14)పై జగద్గిరిగుట్ట పీఎస్‌లో రెండు దొంగతనం కేసులు నమోదు అయ్యాయి. ఐవో టీమ్‌కు రివార్డు.. దొంగతనాల కేసులను చాలెంజ్‌గా తీసుకున్న జగద్గిరిగుట్ట, జీడిమెట్ల డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సుమన్‌కుమార్, జగద్గిరిగుట్ట ఎస్సై మహబూబ్‌పాటిల్‌లు తమ క్రైమ్ టీమ్‌తో సుదీర్ఘంగా విచారించి చాకచక్యంగా కేసులను ఛేదించారు. వీరితో పాటు క్రైమ్ సిబ్బంది సత్యనారాయణ, అర్జున్, విజయ్, హరిలాల్‌కు రివార్డులను అందించనున్నట్టు ఏసీపీ పురుషోత్తమ్, జగద్గిరిగుట్ట సీఐ గంగారెడ్డిలు తెలిపారు. -
మెంచు రమేష్, శిల్ప అరెస్టు
మల్లాపూర్: మావోయిస్టులతో సంబంధాలున్నట్లు ఆరోపిస్తూ నాచారం దుర్గానగర్‌లో ఉండే తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెంచు రమేష్‌ను గద్వాల పోలీసులు అరెస్ట్ చేశారు. సోదాలు నిర్వహించి కొన్ని విప్లవ సాహిత్య పుస్తకాలను స్వాధీనం చేసుకొని రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా రేపోని గ్రామానికి చెందిన మెంచు ఎల్లయ్య, భారతమ్మల చిన్న కుమారుడు రమేష్(36) ఉస్మానియాలో పీహెచ్డీ చేస్తున్నాడు. 8 ఏళ్ల క్రితం రాణితో వివాహం అయింది. వీరికి పాప ఉంది. మంగళవారం నాచారం దుర్గానగర్‌లోని రమేష్ ఇంట్లో గద్వాల పోలీసులు 6 గంటలపాటు సోదాలు నిర్వహించారు. అనంతరం రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 9 గంటలకు 15 మంది వచ్చి ఇంట్లో తనిఖీలు, సోదాలు చేశారని రాణి తెలిపారు. పోలీసులే విప్లవ సాహిత్య పుస్తకాలను తీసుకొచ్చి కిచెన్ రూమ్‌లో పెట్టి ఇంట్లో దొరికినట్లు ఆరోపిస్తూ తన భర్తను అరెస్ట్ చేసినట్లు ఆమె వెల్లడించారు. 2 నెలల నుంచి రమేష్ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారన్నారు. శిల్ప ఇంట్లో సోదాలు... కీసర: మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ ఎస్వీ నగర్లో ఉంటున్న చైతన్య మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శిల్పను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం నాగారానికి చేరుకున్న గద్వాల పోలీసులు కీసర పోలీసుల సహకారంతో శిల్ప ఇంట్లో సోదాలు నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు సోదాలు నిర్వహించిన పోలీసులు శిల్ప ఇంట్లో నిషేధిత సాహిత్య పుస్తకాలు, లెటర్ ప్యాడ్స్, కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. శిల్పను కూడా అదుపులోకి తీసుకొని గద్వాల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా అరెస్టులపై పౌర హక్కుల సంఘం, ఇతర సంఘాలు నిరసన తెలిపాయి. పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తోందన్నారు. -
రెండో బినామి.. కొరియర్ వీరన్న!
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) మందుల గోల్మాల్ కేసులో మరొకరు అరెస్టయ్యారు. ఈ కేసులో ఇప్పటికే 16 మం దిని అరెస్టు చేసిన అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) తాజా గా ఐఎంఎస్ కార్యాలయం సూపరింటెండెంట్ కె.వీరన్నను అరెస్టు చేసినట్లు గురువారం ప్రకటించింది. కొత్త పేట గ్రీన్‌హిల్స్ కాలనీకి చెందిన వీరన్న స్వస్థలం మహబూబాబాద్ జిల్లా మరిపెడ. మొత్తంగా దేవికారాణికి ఈ భారీ కుంభకోణంలో ముగ్గురు వ్యక్తులు బినామీలు గా వ్యవహరించారు. వారిలో ఒకరైన ఫార్మాసిస్ట్ నాగలక్ష్మిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి విచారించిన సంగ తి తెలిసిందే. తాజాగా సూపరింటెండెంట్ వీరన్నను కూడా అరెస్టు చేయడంతో మరోసారి కలకలం రేగింది. కంపెనీల నుంచి డబ్బు తీసుకొచ్చి.. ఐఎంఎస్‌లో దేవికారాణి డైరెక్టర్‌గా పనిచేస్తోన్న సమయంలో సూపరింటెండెంట్ వీరన్న ఆమె అక్రమాలకు కొరియర్‌గా పనిచేశాడు. జీవో నెం.51ని పక్కనబెట్టిన దేవికారాణి నాన్‌రేటెడ్ కంపెనీ (ఎన్ఆర్సీ)లకు కాంట్రాక్టులను కట్టబెట్టింది. వీటిలో చాలా కంపెనీలు ఆర్థికంగా బాగా చితికిపోయి ఉన్నాయి. దేవికారాణి కాంట్రాక్ట్ ఇవ్వగానే లాభాలు ఆర్జించాయి. దీనికి ప్రతిగా దేవికారాణికి ప్రతిసారీ రూ.2 నుంచి 5 లక్షల రూపాయలు ముడుపులుగా ముట్టాయి. వీటిని తీసుకువచ్చే బాధ్యత వీరన్నదే. దేవికారాణి ఒక ఫోన్‌నెంబర్ ఇస్తుంది. సదరు కంపెనీ ప్రతినిధికి ఫోన్ చేసి లక్షల రూపాయల నగదును వసూలు చేసి తీసుకొస్తాడు. వాటిని దేవికారాణి చెప్పినట్లుగా పీఎంజే జ్యువెలరీస్‌కి వెళ్లి అప్పగించేవాడు. ఆ నగదును దేవికారాణి తన నగల ఆర్డర్ కోసం ఇచ్చే అడ్వాన్సుగా చూపించేది. అలా ఏకంగా రూ. 6.5 కోట్ల విలువైన నగలను ఆమె పీఎంజే జ్యువెలరీస్ నుంచి కొనుగోలు చేసినట్లు సమాచారం. బినామీ కంపెనీల గుట్టు ఇతనివద్దే.. దేవికారాణి బినామీ ఫార్మా కంపెనీల వ్యవహారాల్ని కూడా వీరన్నే నడిపించాడని సహోద్యోగులు ఆరోపిస్తున్నారు. చూడటానికి సాధారణంగా కనిపించే వీరన్న దాదాపు రూ.40 కోట్ల ఆస్తులు కూడబెట్టాడని సమాచారం. అవన్నీ తన బావ, బావమరుదుల పేరిట రిజిష్టర్ చేయించాడని చెబుతున్నారు. ఇతని వద్ద దేవికారాణి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఓ పెన్‌డ్రైవ్ ఉందని, అందులో బినామీ కంపెనీలతోపాటు, ఎవరు ఎంత చెల్లించారన్న బ్యాలెన్స్ షీటు కూడా నిర్వహించాడని సమాచారం. ఇప్పటికే ఇతని ఇంటిపై దాడులు చేసిన ఏసీబీ కుంభకోణానికి సంబంధించి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. ఇతను తేజఫార్మా రాజేశ్వర్‌రెడ్డి నుంచి రూ.50 వేలు, ఆరిజిన్ ఫార్మాకు చెందిన శ్రీకాంత్ గుప్తా నుంచి రూ.3.5 లక్షలు.. మొత్తంగా రూ.4 లక్షలను సొంత బ్యాంకు ఖాతాలకు వేయించుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. రేపోమాపో మూడో బినామీ! దేవికారాణికి సంబంధించిన మూడో బినామీ సెంట్రల్ డ్రగ్‌స్టోర్‌లో పనిచేసే మరో కీలక ఉద్యోగి. ఫార్మా కంపెనీల ద్వారా వసూలు చేసిన డబ్బులతో బీహెచ్ఈఎల్, సంగారెడ్డి, గచ్చిబౌలిలో విలువైన స్థలాలు కొనుగోలు చేశాడు. త్వరలోనే ఇతనినీ ఏసీబీ అరెస్టు చేయనుంది. -
పాక్‌లోకి అక్రమంగా ప్రవేశించిన హైదరాబాదీ
సాక్షి, హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని బైరాగిపట్టి మసీదులో జరిగిన పేలుడు కేసులో టోలిచౌకిలో నివసిస్తున్న ఆర్మీ మాజీ డాక్టర్ అరెస్టైన విషయం మరువక ముందే మరో కలకలం రేగింది. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో ఉన్న బహవాల్పూర్లో ఇద్దరు భారత యువకుల్ని చోలిస్తాన్ పోలీసులు ఈ నెల 14న అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు హైదరాబాద్‌కు చెందిన ప్రశాంత్ అని తెలుస్తోంది. వీరు అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించినట్లు ఆరోపిస్తూ అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరిలో మధ్యప్రదేశ్‌కు చెందిన దరీలాల్‌తోపాటు హైదరాబాద్‌కు చెందిన ప్రశాంత్ ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా ప్రకటించింది. వీరిలో ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడంతో పాకిస్తాన్లో ప్రత్యేక ఆపరేషన్‌కు భారత్ కుట్ర పన్నిందని పాక్ మీడియా ఆరోపించింది. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రశాంతేనని.. అతడు 2017 నుంచి కనిపించట్లేదని సమాచారం. ఆ యువకుడు తెలుగులో మాట్లాడిన 1.03 నిమిషాల నిడివి గల వీడియో సైతం హల్చల్ చేస్తోంది. అందులో అతడి వెనుక ముస్తాఫా అనే పేరు గల నేమ్‌ప్లేట్‌తో ఆకుపచ్చ రంగు యూనిఫాంలో ఒకరు నిల్చుని ఉన్నారు. ఈ ఘటనతో కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ప్రశాంత్ ఎవరనే కోణంలో ఆరా తీస్తున్నాయి. అంతర్జాతీయ మీడియా వార్తల ఆధారంగా విచారణ చేపట్టామని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో అన్నారు. ఆ వీడియోలోని మాటలివి.. ‘‘కెన్ ఐ స్పీక్ ఇన్ మై ఓన్ లాంగ్వేజ్ (నేను నా మాతృ భాషలో మాట్లాడవచ్చా)... మమ్మీ డాడీ బాగున్నారా? ఇక్కడంతా బాగానే ఉంది. నన్ను ఇప్పుడు పోలీసుస్టేషన్ నుంచి కోర్టుకు తీసుకొచ్చారు. ఏ ప్రాబ్లం లేదని డిక్లేర్ అయిన తర్వాత కోర్టుకు తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి జైలుకు తీసుకెళ్తారు. అక్కడ నుంచి వాళ్లు ఇండియన్ ఎంబసీకి సమాచారమిస్తారు. జైలుకెళ్లాక బెయిల్ ప్రాసెస్ ఉంటుంది. అప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చెయ్యడం అవుతుంది. ఇండియా వాళ్లు, పాకిస్తాన్ వాళ్లు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. దీనికి ఓ నెల వరకు పడుతుంది. ఇప్పుడు కోర్టులో ఉన్నా.. జైలుకు వెళ్లిన తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ చెయ్యడానికి అవకాశం ఉంటుంది.’ -
వీసాల మోసగాళ్ల అరెస్టు
వరంగల్ క్రైం: విదేశాల్లో ఉద్యోగాలు కల్పించేలా వీసాలు ఇప్పిస్తామని మోసం చేసి రూ.3 కోట్ల వరకు వసూలు చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రమైన హన్మకొండ సుబేదారి పోలీసు స్టేషన్లో గురువారం ఏసీపీ జితేందర్‌రెడ్డి ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన పడిగల సుమంత్, వరంగల్ ఎల్బీ నగర్‌కు చెందిన కల్వల రాహుల్ విదేశాల్లో ఉద్యోగం చేసేందుకు అవసరమైన వీసాలను ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి డబ్బు వసూలు చేశారు. హన్మకొండ నక్కలగుట్టలో 2017లో ఫైర్ సేఫ్టీ శిక్షణ సంస్థను ఏర్పాటు చేసిన మీర్‌హౌసీర్ హుస్సేన్.. పలువురు అభ్యర్థులను సుమంత్‌కు పరిచయం చేశాడు. వారి నుంచి వీసా కోసం రూ.8 లక్షల చొప్పున తీసుకున్నారు. సుమంత్ తన కుటుంబ సభ్యులు శృతి, హేమ, సుగుణ అకౌంట్లలోకి డబ్బు వేయించుకున్నాడు. నకిలీ అగ్రిమెంట్లపై సంతకాలు చేయించగా.. ఎంత కూ వీసాలు రాకపోవడంతో మహబూబ్‌నగర్, జగిత్యాల, వేములవాడ, హైదరాబాద్ సైబర్ క్రైం, చెన్నారావుపేట, సుబేదారి, మట్టెవాడ, హన్మకొండ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయగా కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారంలో ఏడుగురు సభ్యులకు గాను ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. -
లింక్ ఓపెన్ చేయడంతో ఆమె బుక్కైపోయింది..!
సాక్షి, హైదరాబాద్; కష్టపడటం కంటే మోసగించడం ద్వారానే ఈజీగా మనీ సంపాదించొచ్చన్న దురాశతో కొంతమంది తప్పుడు మార్గాలను ఎంచుకుని జీవితాల్ని దుర్భరం చేసుకుంటున్నారు. అలాంటి తప్పుడు మార్గాల్లో డబ్బు సంపాదించే పనుల్లో ఒకటి ఆన్లైన్ మోసం. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ రకమైన ఆన్లైన్ మోసాలు ఎక్కువయ్యాయంటే అతిశయోక్తి కాదు. ఇలా ఆన్లైన్లో మోసం చేసి డబ్బులు సంపాదించడం..చేసిన తప్పు ఏదో రూపంలో బట్టబయలై నేరస్తులు కావడం వంటి ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. నేరస్తుడిగా మారి మనిషిగా పతనమైపోవడానికి దురాశ దుఃఖానికి చేటన్న చిన్న లాజిక్‌ను మరచిపోవడమే. అలా ఓ ప్రబుద్ధుడు ఇతరుల డబ్బుల కోసం కక్కుర్తి పడి ఓ మహిళ ఫేస్బుక్ వివరాలు తస్కరించి, ఆమె స్నేహితులతో సదరు మహిళగానే చాట్ చేసి వారి నుంచి డబ్బులు తీసుకుని పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఫిషింగ్ సైట్ నుంచి లింక్ పంపి.. కొద్దికాలం క్రితం బాధిత మహిళ ఫేస్బుక్ ఖాతాకు బాలాపూర్ మండలం జిల్లెలగూడ వాసి బత్తుల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఓ ఫిషింగ్ వెబ్సైట్(స్పూఫ్ సైట్) నుంచి ఓ లింక్‌ను పంపించాడు. సదరు మహిళ ఆ లింక్‌ను ఓపెన్ చేయడంతో ఆమె ఫేస్బుక్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను అతడు సేకరించాడు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి బాధిత మహిళ ఫేస్బుక్ ఖాతాను ఓపెన్ చేయడంలేదు. ఇదే సమయంలో నిందితుడు వెంకటేశ్వర్లు బాధిత మహిళ ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ఆమె స్నేహితులతో మహిళగా చాటింగ్ చేయడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో తనకు రోడ్డు ప్రమాదం జరిగిందని, చికిత్స కోసం డబ్బులు సాయం చేయాలని కోరుతూ మెసేజ్‌లు పెట్టాడు. తమ స్నేహితురాలే సాయం కోరుతుందనుకుని ఆ మెసేజ్‌లకు స్పందించిన కొంతమంది అతడిచ్చిన బ్యాంకు అకౌంట్‌కు డబ్బులు జమచేశారు. డబ్బుల పంపాలంటూ బాధిత మహిళ వ్యక్తిగత స్నేహితురాలికి మెస్సేజ్ రావడంతో ఈ విషయాన్ని నేరుగా బాధితురాలి దృష్టికి తీసుకెళ్లింది. ఫేస్బుక్ ఖాతాను బాధిత మహిళ ఓపెన్ చేసినా ఓపెన్ కాకపోవడంతో రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా..ఈ నేరానికి పాల్పడింది బీటెక్ చదివి ప్రస్తుతం మాదాపూర్‌లోని ఓ కంప్యూటర్ గ్రాఫిక్ కార్యాలయంలో పనిచేస్తున్న బత్తుల వెంకటేశ్వర్లుగా గుర్తించారు. దీంతో ఆదివారం అతడిని అరెస్టు చేశారు. బాధితమహిళనే కాకుండా ఇంకా ఎవరినైనా మోసం చేశాడా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా, వెంకటేశ్వర్లు తను చేసిన నేరాన్ని అంగీకరించినట్లు రాచకొండ సైబర్‌క్రైమ్ ఇన్స్పెక్టర్ ఆశిష్ రెడ్డి తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి సెల్‌కు కానీ, సోషల్ మీడియాలో గానీ లింక్‌లు వస్తే ఓపెన్ చేయవద్దని సూచించారు. -
వయసు 16..కేసులు 23
అతని వయసు 16 ఏళ్లు.. నేర చరిత్రేమో ఘరానా దొంగకు ఏ మాత్రం తీసిపోదు. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ ల్లో అతనిపై 23 కేసులు నమోదై ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగకమానదు. ఇతనితో పాటు ఓ మేజర్ బి.గణేష్, మరో ఇద్దరు బాల నేరస్తులను ముషీరాబాద్ పోలీసులు అరెస్టు చేసి జువైనల్ హోంకు తరలించారు. ముషీరాబాద్: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంకు చెందిన పి.వెంకటేశ్వర్లు భార్య పిల్లలతో బతుకుదెరువు కోసం నగరంలోని అశోక్‌నగర్‌కు వచ్చాడు. హాస్టల్లో పనిచేసుకుంటూ జీవనం సాగించేవారు. అతని కుమారుడు పి.వీరబాబు అలియాస్ వినోద్ అలియాస్ వీరా నాల్గవ తరగతి చదువుతున్న సమయంలో పక్క విద్యార్థి చెయ్యి విరిచాడు. దీనితో పాఠశాల యాజమాన్యం వీరబాబుకు టీసీ ఇచ్చి పంపించింది. ఆ తర్వాత ఇతన్ని కూకట్‌పల్లిలోని పెద్దమ్మ దగ్గరకు పంపించగా, చోరీలకు పాల్పడం నేర్చుకున్నాడు. ఈ క్రమంలో బాచుపల్లి పీఎస్‌లో 2 కేసులు, మియాపూర్‌లో 11 కేసులు, కూకట్‌పల్లిలో 1 కేసు, సనత్‌నగర్‌లో 1 కేసు, సైదాబాద్‌లో 1 కేసు.. మొత్తం 16 కేసులు నమోదయ్యాయి. ఇతనితో వేగలేక తల్లిదండ్రులు స్వగ్రామానికి వెళ్లిపోయారు. వీరబాబు నాలుగుసార్లు అరెస్టై జైలు (జువైనల్ హోం)కు వెళ్లాడు. రెండుసార్లు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. తాజాగా హోంలో తోటి బాల నేరస్తున్ని విపరీతంగా కొట్టి తప్పించుకున్నాడు. జువైనల్ హోంలో పరిచయమైన బాకారానికి చెందిన బుషిపాక గణేష్ దగ్గరకు వెళ్లాడు. వీరిద్దరు రాంనగర్ లక్ష్మమ్మ పార్కు వద్ద ఉండే బాల నేరస్తుడు మద్దెల సిద్దార్థ అలియాస్ సిద్దూ, హరినగర్‌కు చెందిన విద్యార్థి నాంపల్లి సాల్మ¯Œ రాజులతో కలసి చోరీలకు పాల్పడటం ప్రారంభించారు. ఈ క్రమంలో ముషీరాబాద్, నల్లకుంట, చిక్కడపల్లి, గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో 7 కేసులు నమోదయ్యాయి. మంగళవారం గోల్కొండ క్రాస్ రోడ్స్‌లో వీరు అనుమానాస్పదంగా సంచరిస్తున్న వీరిని పోలీసులు పట్టుకుని విచారించారు. ద్విచక్ర వాహనాలను, సెల్ఫోన్లను, బంగారు గొలుసులను చోరీ చేసినట్లు అంగీకరించారు. వారి నుంచి రూ.1.70 వేల రెండు యాక్టివాలు, 2 సెల్ఫోన్లు, ఒక్క ముత్యాల దండ, 25 తులాల వెండి పట్టగొలుసులు స్వాధీనం చేసుకున్నట్లు సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్, చిక్కడపల్లి ఏసీపీ నర్సింహారెడ్డి, ముషీరాబాద్ డీఎస్పీ గంగాధర్, డీఐ వెంకన్న, డీఎస్ఐ బాలరాజు తెలిపారు. -
భార్యల పోషణ కోసం మోసం; నిందితుల అరెస్ట్
భోపాల్: స్థానిక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామనే ఎర వేసి మహిళలను మోసం చేసిన నిందితులను ఎట్టకేలకు మధ్యప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక ఎయిమ్స్ ఆస్పత్రిలో నర్సుగా ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకొన్న పోలీసులు ఈ కేసును స్పెషల్ టాస్క్ ఫోర్స్‌కు అప్పగించారు. ఎస్టీఎస్ పోలీసులు కేసుపై పలు కోణాల్లో దర్యాప్తు చేసి మోసానికి పాల్పడ్డ ఇద్దరు నిందితుల ముఠాను పట్టుకుని అరెస్ట్ చేశారు. ఎస్టీఎఫ్ ఏడీజీ అశోక్ అవస్థీ వివరాల ప్రకారం.. ఈ ముఠా భోపాల్‌లోని ఎయిమ్స్‌లో నర్సుగా ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు సుమారు 50 మంది మహిళలను మోసం చేసినట్లు తెలిపారు. పట్టుబడిని ప్రధాన నిందితుడు దిల్షాద్ ఖాన్ జబల్పూర్ వాసి కాగా, సహచరుడు అలోక్ కుమార్ భోపాల్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. దిల్షాద్ ఖాన్‌కు ఐదుగురు భార్యలు ఉన్నారని, భార్యలతో కుటుంబ పోషణ భారంగా మారటంతో ఇలాంటి మోసాలు పాల్పడుతున్నాడని వెల్లడించారు. నిందితుడు దిల్షాన్.. తన భార్యల్లో ఒకరు జబల్పూర్లో ప్రైవేట్ క్లినిక్ నడుపుతున్నారని, అలోక్ కుమార్ భార్య ప్రభుత్వ హాస్టల్లో సూపరింటెండెంట్‌గా పని చేస్తుందని పోలీసులకు వెల్లడించారు. ఈ ఇద్దరు మహిళలకు ప్రత్యక్షంగా ఈ కేసుతో సంబంధం లేకున్నా.. పరోక్ష పాత్ర ఉందనే కోణంలో విచారణ జరుపుతామని అశోక్ అవస్థీ వెల్లడించారు. అదేవిధంగా ఈ ముఠా చేతిలో మోసపోయిన నగర, గ్రామీణ మహిళల వివరాలను తెలుకోవడానికి ఎస్టీఎఫ్ బృందం ప్రయత్నం చేస్తోందని తెలిపారు. -
ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్
సాక్షి, పటమట(విజయవాడ తూర్పు) : నగరపాలక సంస్థ సర్కిల్ కార్యాలయంలో అవినీతికి పాల్పడిన ఓ జూనియర్ అసిస్టెంట్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పేరు మార్పునకు వచ్చిన దరఖాస్తుదారుడి నుంచి రూ.9 వేలు లంచం డిమాండ్ చేయగా బాధితులు అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించడంతో వారు వల పన్ని ఉద్యోగిని పట్టుకున్నారు. వివరాల మేరకు పటమట సర్కిల్–3 కార్యాలయ పరిధిలోని ఎన్ఎంఎం స్కూల్ వద్ద ఉండే కోనేరు శైలజ పటమటలోని శ్రీరామ్స్ కోనేరు ఎన్క్లేవ్ అపార్టుమెంటులో ఆస్తి పన్నుకు మ్యుటేషన్ (పేరు మార్పు) కోసం దరఖాస్తు చేసుకున్నారు. సర్కిల్–3 కార్యాలయంలోని రెవెన్యూ విభాగంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ పొన్నపల్లి సూర్యభగవాన్ రూ.9 వేలు డిమాండ్ చేశారు. సుమారు ఆరు నెలలుగా నిత్యం తనకు లంచం ఇస్తేనే పని పూర్తి చేస్తానని వే«ధింపులకు గురి చేయడంతో బాధితురాలు ఏసీబీని ఆశ్రయించింది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఏసీబీ డీఎస్పీ ప్రసాదరావు వ్యూహాత్మకంగా లంచం ఇచ్చే సమయంలో అవినీతి ఉద్యోగిని వలపన్ని పట్టుకున్నారు. బాధితురాలి నుంచి తీసుకున్న రూ.9 వేలు, సూర్యభగవాన్ టేబుల్ సొరుగులో ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ ప్రకటించారు. నిందితుడిని ఏసీబీ కోర్టులో హాజరుపరి చారు. కాగా, బిల్ కలెక్టర్‌గా అడుగిడిన సూర్యభగవాన్ రెండేళ్లలో రిటైర్డ్ కాబోతున్నాడు. బిల్ కలెక్టర్‌గా విధులు నిర్వహించిన సమయంలో పన్ను చెల్లింపుదారుల నుంచి వసూలు అయిన మొత్తంలో కొంత స్వప్రయోజనాలకు వినియోగించుకునేవాడని, ఈ విషయం వెలుగులోకి రావటంలో అప్పట్లో అకౌంట్స్ సెక్షన్‌కు బదిలీ చేశారని తెలిసింది. అక్కడా తన పద్ధతిని మార్చుకోకపోవటంతో సర్కిల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా బదిలీ చేశారని, అయినా తన ప్రవర్తనలో మార్పు లేకపోవడం శోచనీయమని వీఎంసీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, అకౌంట్స్ విభాగంలో పని చేసిన సమయంలో కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరుకు ముడుపులు తీసుకునే వారని సమాచారం. కాంట్రాక్టర్లకు ప్రతి నెల టార్గెట్ పెట్టి మరీ వసూలు చేసే వారని, వీరపాండ్యన్ కమిషనర్‌గా విధులు నిర్వహించిన సమయంలో సూర్యభగవాన్‌ను సర్కిల్ కార్యాలయంలో రెవెన్యూ విభాగానికి సరెండర్ చేశారని వీఎంసీ వర్గాల ద్వారా తెలుస్తోంది. -
గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట
సాక్షి, హనుమాన్‌జంక్షన్: గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, ప్రధాన సూత్రధారులను పట్టుకునేందుకు దర్యాప్తు బృందాలను నియమించామని నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు తెలిపారు. చెన్నై – కోల్కత్తా జాతీయ రహదారిపై బాపులపాడు మండలం ఎ.సీతారామపురం సెంటర్లో వీరవల్లి పోలీసులు శనివారం గంజాయి అక్రమ రవాణా చేస్తున్న లారీని పట్టుకున్నారు. రూ.20 లక్షలు విలువైన గంజాయి, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాలను నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు వీరవల్లి పోలీస్ స్టేషన్లో మీడియాకు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణాపై పక్కా సమాచారం రావటంతో వీరవల్లి ఎస్ఐ ఎన్.చంటిబాబు నేతృత్వంలో పోలీస్ సిబ్బంది వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఏపీ 16 యూ 8793 నంబర్ గల లారీలో 200 కేజీల బరువు కలిగిన 100 గంజాయి ప్యాకెట్లు తరలించటాన్ని గుర్తించారు. ఈ లారీతో పాటు డ్రైవర్ కూచిపూడి ఫ్రాన్సిస్, సహాయకుడు బండి నాగరాజులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా విశాఖ జిల్లా జె.నాయుడుపాలెం గ్రామం నుంచి ఈ నెల 11వ తేదీన గంజాయి లోడుతో బయలుదేరినట్లు తెలిపారు. ఈ గంజాయి ప్యాకెట్లను గన్నవరం చేర్చేందుకు డ్రైవర్ ఫ్రాన్సిస్‌కు రూ.1.50 లక్షలు, సహాయకుడు బండి నాగరాజుకు రూ.50 వేలు ఇచ్చేట్లుగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. గంజాయి అక్రమ రవాణా ప్రధాన సూత్రధారులు, ఎవరెవరికి వీటిని సరఫరా చేస్తున్నారనే వివరాలపై పోలీసులు వీరిద్దరిని తమదైన శైలిలో విచారణ చేపట్టి ఆరా తీశారు. కాగా ప్రధాన సూత్రధారుడిని పట్టుకునేందుకు ఇప్పటికే ప్రత్యేక బృందాలను నియమించినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. గంజాయి అక్రమ రవాణా, కాలేజి విద్యార్థులకు వీటిని సరఫరా చేయటంపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు ఆయన వివరించారు. ఇప్పటికే నూజివీడులో గంజాయి వ్యసనానికి గురైన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులను అరెస్ట్ చేశామని, వారి తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్ ఇచ్చామని తెలిపారు. కాలేజి విద్యార్థులకు గంజాయి ప్యాకెట్లు విక్రయిస్తున్న ముఠాపై కూడా నిఘా ఉందని పేర్కొన్నారు. అక్రమంగా రవాణా చేస్తున్న 200 కేజీల గంజాయిని సీజ్ చేశామని చెప్పారు. వీటిని తరలిస్తున్న కూచిపూడి ఫ్రాన్సిస్, బండి నాగరాజులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. గన్నవరం మండలం కట్టుబడిపాలెంకు చెందిన ఫ్రాన్సిస్‌కు విశాఖ జిల్లా రోలుకుంట మండలం జె.నాయుడుపాలెం గ్రామానికి చెందిన బండి నాగరాజుతో ఏర్పడిన పరిచయంతోనే గంజాయి అక్రమ తరలింపునకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు డీఎస్పీ వివరించారు. రూ.20 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్న వీరవల్లి ఎస్ఐ ఎన్.చంటిబాబును నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు, హనుమాన్‌జంక్షన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి.వెంకట రమణ అభినందించారు. -
కటకటాల్లోకి కామాంధులు
సాక్షి, పహాడీషరీఫ్: గిరిజన మహిళపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన కేసులో ఐదుగురు నిందితులను పహాడీషరీఫ్ పోలీసులు అరెస్ట్ చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో రాజీ చేసేందుకు యత్నించిన మరో ఎనిమిది మందిని కూడా అరెస్ట్ చేశారు. పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఇన్స్పెక్టర్ శంకర్‌తో కలిసి వనస్థలిపురం ఏసీపీ గాంధీ నారాయణ వివరాలు వెల్లడించారు. నాగర్‌కర్నూల్ జిల్లా, పుర్యనాయక్ తండాకు చెందిన మహిళ, కుటుంబంతో సహా బతుకుదెరువు నిమిత్తం నాలుగు నెలల క్రితం నగరానికి వలసవచ్చి హర్షగూడలోని ముచ్చా ప్రశాంత్ రెడ్డి అలియాస్ ప్రసాద్ రెడ్డి పౌల్ట్రీ ఫారంలో పనికి కుదిరారు. సదరు మహిళకు నెలకు రూ.15 వేలు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. కాగా సదరు దంపతులు దాణా సంచులను దొంగతనంగా విక్రయించినట్లు తెలియడంతో యజమాని ప్రశాంత్ రెడ్డి ఈ నెల 18న రాత్రి పౌల్ట్రీ ఫారానికి వచ్చాడు. మరో ఫౌల్ట్రీఫారం వద్ద చెల్లా చెదురుగా ఉన్న కాకరెల్స్‌ను వేరు చేయాలని తీసుకెళ్లి ఆమెను గదిలో బంధించి బెల్టు, కర్రలు, పైప్‌లతో తీవ్రంగా కొట్టాడు. అనంతరం అతనితో పాటు అతని సోదరుడు అనిల్ రెడ్డి, చాంద్రాయణగుట్టకు చెందిన భరత్(26), అలియాబాద్‌కు చెందిన దేవరశెట్టి పవన్ కుమార్, చిక్కింపురి హన్మత్ ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. మూడు రోజుల పాటు ఆమెను గదిలోనే బంధించి తీవ్రంగా కొట్టడంతో సురేష్ అనే యువకుడికి దాణా సంచులు విక్రయించినట్లు తెలిపారు. దీంతో సురేష్‌ను తీసుకువచ్చిన వారు చోరీ సొత్తు ఎలా కొంటావంటూ తీవ్రంగా కొట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపుతామంటూ బెదిరించారు. రాజీకి యత్నం.. బాధిత దంపతులథక్ష పాటు సురేష్ ఈ నెల 21న ఫిర్యాదు చేసేందుకు పహాడీషరీఫ్ స్టేషన్‌కు వెళ్లేందుకు సిద్ధపడగా తుక్కుగూడ, హర్షగూడ ప్రాంతాలకు చెందిన పది మంది పెద్దలు రాజీ చేసేందుకు రంగంలోకి దిగారు. వర్త్య రవీందర్, భవానీ వెంకట్ రెడ్డి, జెటావత్ రవీందర్, చర్లపల్లి యాదయ్య, జర్పుల రాజు, బేగరీ సురేష్, ఏనుగు లోకేష్, మెగావత్ విజయ్ కుమార్, జనార్దన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు ప్రశాంత్ రెడ్డిని కలిసి బాధితులతో రాజీ కుదురుస్తామని అందుకు బాధితులకు రూ.2.5 లక్షలు చెల్లించాలని సూచించారు. దీంతో నిందితులు రూ.2.5 లక్షలను వారికి అందజేశారు. దీంతో అదే రోజు పంచాయతీ ఏర్పాటు చేసిన వారు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లవద్దని రాజీ కుదుర్చుకున్నట్లు బలవంతంగా బాధితులతో సంతకాలు తీసుకున్నారు. బాధిత దంపతులకు రూ.1.02 లక్షలు, సురేష్‌కు రూ.1.30 లక్షలు ఇచ్చారు. రవీందర్ రూ.3 వేలు తీసుకోగా, మిగిలిన రూ.15 వేలతో విందు చేసుకున్నారు. ఫిర్యాదుతో వెలుగులోకి ఈ విషయం తెలియడంతో బాధితుల బంధువులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని ధైర్యం చెప్పడంతో ఈ నెల 26న బాధితురాలు పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. రాజీ చేసేందుకు యత్నించిన 10 మందిపై కూడా కేసు నమోదు చేసి శనివారం వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు అత్యాచారం కేసు నమోదు చేశామని, ఇందుకు సంబంధించి నివేదికను చార్జిషీట్లో జతచేస్తామని ఆయన పేర్కొన్నారు. -
గుట్టుగా దాటిస్తూ.. కోట్లు కొల్లగొడుతూ..
సాక్షి, కోటబొమ్మాళి: కొంతకాలం క్రితం మెళియాపుట్టి మండలంలో ఎర్రచందనం దుంగలు దొరికాయి.. దిల్లీకి చెందిన ఒక ముఠా వీటిని రైలు మార్గంలో తరలించేందుకు అనువైన ప్రదేశంలో ఉంచినట్టు పోలీసులు గుర్తించారు.. తాజాగా కోటబొమ్మాళి మండలం రేగులపాడు పంచా యతీ పరిధిలో జమ్ము క్వారీని ఆనుకొని ఉన్న కొండ పక్క భారీ సంఖ్యలో ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు.. జాతీయ రహదారికి కూతవేటు దూరంలో ఈ దుంగలను ఉంచడం చూస్తుంటే.. గప్‌చుప్‌గా తరలించేందుకు ఏదో ఒక ముఠా పథకం పన్నిందని అంచనా వేస్తున్నారు. త్వరలోనే ఈ ముఠాల గుట్టు రట్టు చేస్తామని ఎస్పీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి చెప్పారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో స్థానిక ఎస్సై ఎస్.లక్ష్మణరావు హుటాహుటిన ఆ స్థలానికి వెళ్లి అక్కడ ఉన్న 120 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.కోటి వరకు ఉంటుందని అంచనా వేశారు. కొన్ని సంవత్సరాల క్రితం జమ్ము గ్రానైట్ కంపెనీ ఎర్ర చందనం మొక్కలను నాటినట్లు స్థానికులు చెబుతున్నారు. క్రమేపీ మొక్కలు పెద్దవవ్వడంతో కొంతమంది వ్యక్తులు వాటిని అక్రమంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్పీ అమ్మిరెడ్డి బుధవారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న దుంగలను పరిశీలించారు. ఈ ఘటనల వెనుక సూత్రధారులు ఎవరన్న విషయంపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో.. రేగులపాడుకు చెందిన గొలివి హరి అనే ట్రాక్టర్ డైవర్ ఎర్రచందనం దుంగలను లోడు చేస్తుండగా కొంతమంది గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోటబొమ్మాళి ఎస్ఐ ఎస్.లక్ష్మణరావు హుటాహుటిన ఆ స్థలానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అయితే ట్రాక్టర్ డ్రైవర్ అవి ఎర్రచందనం దుంగలని తనకు తెలియదని, వంట చెరుకు తెమ్మని చెప్పగా వెళ్లానని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. విశ్వనాథపురం సమీపంలో గల జమ్ములో గ్రానైట్ సంస్థ 10 సంవత్సరాల క్రితం నాటిన చందనం మొక్కలను ప్రస్తుతం విక్రయించవల్సిందిగా సంబంధిత మెనేజ్మెంట్ చెప్పగా ఆమేరకు వాటిని విక్రయించేందుకు సిద్ధమైనట్లు ఆ కంపెనీలో పనిచేస్తున్న ఆర్.ఉమామహేశ్వరరావు తెలియజేసినట్లు పోలీసులు చెప్పారు. ఈ విషయంపై శ్రీకాకుళం అటవీశాఖలో పనిచేస్తున్న చల్ల శ్రీనివాసరావును పోలీసులు విచారించగా అవి అటవీశాఖ పరిధిలోవి కావని తేల్చినట్లు తెలిసింది. ఎస్పీ అమ్మిరెడ్డి, డీఎస్పీ శివరామిరెడ్డి, సీఐలు నీలయ్య, రమణతోపాటు స్థానిక పోలీసులు రేగులపాడు, విశ్వనాథపురం గ్రామాల్లో పర్యటించి విచారణ చేపట్టారు. ఈ విషయంపై స్థానిక ఎస్సై లక్షణరావు మాట్లాడుతూ.. అనుమానితులను రప్పించి విచారణ చేస్తున్నామని, మరో రెండు రోజుల్లో పూర్తి స్థాయి సమాచారం వస్తుందని తెలిపారు. -
విశాఖలో బైక్ దొంగల ముఠా అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం, ప్రకాశం : విశాఖ జిల్లాలో మోటర్ బైక్‌లు దొంగతనం చేస్తున్న ముఠాను నగర పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లా పరచూరు మండలం దేవరాపల్లి గ్రామానికి చెందిన 37 ఏళ్ల వెలగ వీరయ్య చౌదరి ఇంటర్ చదివిన తర్వాత జల్సాలకు అలవాటు పడి చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. 2005లో హైదరాబాద్‌లోని ఓ కంప్యూటర్ హార్డ్‌వేర్ కంపెనీలో పనిచేస్తూ కంప్యూటర్లు దొంగతనం చేసిన కేసులో జైలుకు వెళ్లాడు. జైలులో బైక్ మెకానిక్‌లైన పాత నేరస్తులతో పరిచయాలు పెంచుకున్న వీరయ్య విడుదలయ్యాక హైదరాబాద్‌లో బైక్ మెకానిక్‌గా పనిచేస్తూనే దొంగతనాలకు పాల్పడేవాడు. అక్కడి నుంచి 2011లో విశాఖ జిల్లాకు వచ్చి నగర శివార్లలో బైక్ మెకానిక్‌గా పనిచేసేవాడు. పలు ప్రాంతాల్లో పార్క్ చేసిన బైక్‌లను మారు తాళాలతో దొంగిలించడం ప్రారంభించాడు. అతనితో పాటు విశాఖకు చెందిన రాజన నాగేశ్వరరావు(32), ఒడిసా వాసి డొక్కినపల్లి బాబీ (37) కలిసి ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడేవారు. ఒకే కంపెనీకి చెందిన బైకులే లక్ష్యం.. ఒకే కంపెనీకి చెందిన బైకులు మాత్రమే దొంగిలించడం వీరి ప్రత్యేకత. దొంగిలించిన బైక్‌ల స్పేర్‌పార్టుల్ని విడదీసి అమ్ముకొని సొమ్ము చేసుకునేవారు. కమిషనరేట్ పరిధిలో ఏటా బైక్ దొంగతనాల కేసులు పెరుగుతుండటంతో కమిషనర్ ఆర్కే మీనా ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశారు. ఆగస్టు 8న స్టీల్‌ప్లాంట్ పరిధిలో బైక్ పోయిందంటూ ఒక వ్యక్తి ఫిర్యాదు చెయ్యడంతో పహరా కాసిన స్పెషల్ టీమ్ ఈ నెల 11న పరవాడలో ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించిన పోలీసులకు ఆరేళ్లుగా చేస్తున్న దొంగతనాల గురించి, దొంగిలించిన బైక్‌లను ఏయే ప్రాంతాల్లో దాచి పెట్టారో వివరించడంతో వాటన్నింటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బైక్‌లతో పాటు రూ.90 వేల నగదు, 5 బైక్ ఇంజిన్లు, రూ.5,01,000 విలువచేసే 167 చ.గజాల స్థలం డాక్యుమెంట్లు, 30 బాక్సుల బైక్‌ల విడిభాగాలు, నకిలీ నంబర్ ప్లేట్లు, తాళాలు స్వాధీనం చేసుకున్నారు. కమిషనరేట్‌లో గురువారం మీడియా సమావేశంలో కమిషనర్ ఆర్కే మీనా చోరీల వివరాలు వెల్లడించారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో 2002 నుంచి 2011 మధ్య కాలంలో ఏకంగా 118 నేరాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం కలిగి ఉన్నట్లు తమ విచారణలో తేలిందని సీపీ వివరించారు. 2013 నుంచి ఇప్పటి వరకు విశాఖ జిల్లాలో 130 బైక్ చోరీ కేసులు వీరయ్య చౌదరిపై నమోదయ్యాయని సీపీ వివరించారు. ముగ్గురు నిందితులతో పాటు స్పేర్‌పార్టులు కొనుగోలు, అమ్మకాలు చేస్తున్న మరో 14 మందిని అరెస్టు చేసినట్లు విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా తెలిపారు. -
ముగ్గురు నకిలీ పోలీసుల అరెస్ట్
సాక్షి, నెల్లూరు(కావలి) : తెలంగాణలో బేల్దారులుగా పనులు చేస్తున్న ‘పసుపులేటి’ సోదరులు ఆంధ్రలో మాత్రం నకిలీ పోలీసుల అవతారం ఎత్తి ప్రజలను బురిడీ కొట్టి అక్రమ వసూళ్లు చేస్తున్నారు. బాధితుడి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కావలి డీఎస్పీ డి.ప్రసాద్ పర్యవేక్షణలో కావలి రూరల్ సీఐ టి.మురళీకృష్ణ ఆధ్వర్యంలో బిట్రగుంట ఎస్సై బి.భరత్‌కుమార్, సిబ్బంది నకిలీ పోలీసుల వేషంలో వసూళ్లకు పాల్పడుతున్న ‘పసుపులేటి’ సోదరులను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ డి.ప్రసాద్ తన కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బోగోలు మండలం అనంతబొట్లవారి కండ్రిగ గ్రామానికి చెందిన పసుపులేటి గోపి, జలదంకి మండలం చామదల గ్రామానికి చెందిన పసుపులేటి మహేష్, పసుపులేటి తిరుమల తెలంగాణలో బేల్దారి పనులు చేస్తున్నారు. వీరు వినాయక చవితి ఉత్సవాల కోసం స్వగ్రామాలకు వచ్చారు. సోదరులైన వీరు ముగ్గురు తెలంగాణ రిజిస్ట్రేషన్ కలిగిన కారులో తిరుగుతూ రోడ్లుపై కనిపించిన వారిని తాము పోలీసులమని బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో బోగోలు మండలం సుందరగిరివారి కండ్రిగ వద్ద మోటారు సైకిల్‌పై వెళ్తున్న పాపన చెంచురామి రెడ్డి అనే వ్యక్తిని ఆపి పోలీసులమని బెదిరించి, బండి కాగితాలు చూపించమని, డబ్బులు ఇవ్వమని దబాయించారు. దీంతో బాధితుడు తన కుమారుడికి ఫోన్ చేసి సమాచారాన్ని తెలియజేశాడు. దీంతో అతని కుమారుడు గ్రామస్తులను వెంట పెట్టుకొని అక్కడికి చేరుకోగానే నకిలీ పోలీసుల అవతారంలో వసూళ్లకు పాల్పడుతున్న ‘పసుపులేటి’ సోదరులు తమ కారులో పరారీ అయ్యారు. ఈ ఘనటపై బాధితుడు బిట్రగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకొన్న పోలీసులు విచారించి నకిలీ పోలీసులను గుర్తించి ఆదివారం బిట్రగుంటలోని రైల్వేగేటు సమీపంలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద ఉన్న కారును స్వాధీనం చేసుకొన్నారు. -
దొంగలు దొరికారు
సాక్షి, విజయవాడ, గుంటూరు : నకిలీ బంగారాన్ని అసలు బంగారంగా చూపించి ప్రజలను మోసం చేస్తున్న ముఠాను బందరు సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పెద్ద మొత్తంలో బంగారంతో పాటు కొద్దిపాటి నగదును స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం సీసీఎస్ బందరు ఇన్చార్జ్ డీఎస్పీ ఎస్కే అబ్దుల్ అజీజ్ విలేకరులకు కేసు వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన డేరంగుల రాజేష్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. వ్యసనాలకు బానిసైన రాజేష్ ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఆలోచన చేశాడు. భార్య లక్ష్మితో పాటు బంధువులైన మల్లెల సురేష్, తురక సురేష్, తురకా మమత, బత్తుల రేణు, తమ్మిశెట్టి బాలవీరాస్వామిలకు ఈజీ మనీ ఆశ చూపించి అతనితో కలుపుకున్నాడు. నేరాలు చేసేందుకు చేయి కలిపిన బంధువులతో కలిసి జనాన్ని మోసగించడం ప్రారంభించాడు. నకిలీ బంగారాన్ని అసలు బంగారంగా చిత్రీకరించి అమాయకులను అడ్డంగా దోచేయడం ప్రారంబించాడు. అలా జూన్ మాసంలో పెడన మండలం సింగరాయపాలెంలో బం«ధువులతో కలిసి ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. అందరూ కూలి పనులు చేసుకుంటున్నట్లు గ్రామస్తులను నమ్మించారు. జూన్ 21న సింగరాయపాలెంకు చెందిన దుర్గాభవానీ అనే మహిళను కలిసి తనకు బంగారం బిస్కెట్ దొరికిందని నమ్మించాడు. అది అమ్మడం తనకు కష్టమని చెప్పి అతి తక్కువ ధరకు దొరికిన బిస్కెట్ అమ్మేస్తానంటూ అమాయకంగా నటించాడు. రాజేష్ మాటలు నమ్మిన దుర్గాభవానీ తన ఒంటిపై ఉన్న బంగారు నానుతాడు, చెవిదిద్దులతో పాటు రూ. 20వేల నగదును అప్పజెప్పి బిస్కెట్‌ను తీసుకుంది. అనుకున్న విధంగా పని ముగియడంతో రాజేష్, అతని బంధువులు ఇల్లు ఖాళీ చేసి అక్కడి నుంచి ఉడాయించారు. అసలు విషయం తెలుసుకున్న దుర్గాభవానీ జరిగిన ఘటనపై పెడన పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా రాజేష్, అతని బంధువులు చిలకలపూడి రైల్వేస్టేషన్లో అదే తరహాలో ప్రయాణికులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తుండగా అందిన సమాచారం మేరకు సీసీఎస్ పోలీసులు దాడిచేశారు. నిందితుడు రాజేష్‌తో పాటు మరి కొందరిని అరెస్టు చేశారు. వీరిని విచారణ చేసి 24 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశారు. నిందితులను కోర్టుకు తరలించారు. ఈ కేసులో మరికొందరిని అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. ఈ ముఠాను పట్టుకోవటంలో ప్రతిభ చూపిన సీసీఎస్ సీఐ సుబ్బారావు, ఎస్సైలు హబీబ్‌బాషా, వెంకటేశ్వరరావులను అబ్దుల్ అజీజ్ అభినందించారు. విలేకరుల సమావేశంలో సీసీఎస్ ఎస్ఐ హనుమంతరావు, పెడన ఎస్ఐ మురళి, జి. సత్యనారాయణ, సీసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. -
జల్సాల కోసం చోరీ
సాక్షి, ఆళ్లగడ్డ: వారంతా యువకులు.. కష్టపడకుండా డబ్బు సంపాదించి జల్సాలు చేయాలనుకున్నారు. పథకం ప్రకారం చోరీ చేసి తప్పించుకున్నామని భావించారు. అయితే 24 గంటలు గడవకుండానే పోలీసులు వారిని పట్టుకుని కటకటాలకు పంపించారు. ఆళ్లగడ్డ నగర పంచాయతీ పరిధిలోని ఏవీ గోడౌన్ సమీపంలో శనివారం ఐదుగురు నిందితులను సీఐ రమణ ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి మూడు సెల్ ఫోన్లు, రూ 5500 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ పోతురాజు ఆదివారం సాయంత్రం విలేకరులకు వెల్లడించారు. కోవెలకుంట్ల మండలం కంపమళ్లకు చెందిన సూర విష్ణువర్ధన్‌రెడ్డి, దొర్ని పాడు మండలం డబ్ల్యూ కొత్తపల్లికి చెందిన మహేశ్వర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి గత నెల 29వ తేదీ సాహు సినిమా చూడటానికి ఆళ్లగడ్డకు వచ్చారు. నైట్ షో తర్వాత గ్రామానికి వెళ్లేందుకు ఆటోను బాడుగకు మాట్లాడుకుని అందులో ఎక్కారు. అయితే వీరి వద్ద పెద్దమొత్తంలో డబ్బులున్నట్లు భావించిన ఆటో డ్రైవర్ జెట్టి లక్ష్మణ్ తన మిత్రులు నీలిశెట్టి భూపతి శివ, దొమ్మరి దామోదర్, భూపతి సురేష్‌బాబుకు ఫోన్ చేసి రప్పించాడు. ఆటో చింతకుంట శివారు హెచ్‌పీ పెట్రోల్ బంకు సమీపానికి వెళ్లే సరికి వారంతా బైకులపై వచ్చి చుట్టుముట్టారు. ఆటోలో ఉన్న సూర విష్ణువర్ధన్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిని కిందకు దింపి దగ్గరున్న సొమ్ములు ఇవ్వాలని బెదిరించారు. డబ్బులు లేవని చెప్పడంతో విపరీతంగా కొట్టి మూడు సెల్ఫోన్లు, రూ.5,500 నగదు లాక్కొని వెళ్లి పోయారు. బాధితులు శుక్రవారం పోలీస్ స్టేషన్ చేరుకుని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన అనంతరం సీఐ రమణ ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. 24 గంటలు గడవకుండానే నిందితులను అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించినట్లు డీఎస్పీ పోతురాజు తెలిపారు. -
కాంగ్రెస్ పాదయాత్ర భగ్నం
సాక్షి, రంగారెడ్డి: సాగు, తాగునీటి సాధన కోసం కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన పాదయాత్రను పోలీసులు భగ్నం చేశారు. నాయకులను, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. పాత డిజైన్ ప్రకారం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును కొనసాగించడం, పాలమూరు–ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తిచేసి జిల్లాకు నీరందించాలన్న డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ జలసాధన మహాపాదయాత్రని మంగళవారం నిర్వహించ తలపెట్టింది. శంకర్పల్లి మండలం మహాలింగాపురం (దోబీపేట్)లో ప్రారం భం కావాల్సిన ఈ పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు నాయకులను అడ్డుకున్నారు. ఉదయం నుంచే కాంగ్రెస్ నాయ కులు, కార్యకర్తల అరెస్టులు మొదలయ్యాయి. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని గృహనిర్బంధం చేశారు. శంకర్‌పల్లికి వెళ్లే అన్ని రూట్లలో పోలీసులు వాహనాలను తనిఖీ చేసి నాయకులను, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు. పెద్ద ఎత్తున నాయకులు, అరెస్టు కావడంతో పాదయాత్ర సభా ప్రాంగణానికి ఒక్కరు కూడా చేరుకోలేదు. ప్రజలేం పాపం చేశారు? జిల్లా ప్రజలకు సాగు, తాగునీరు లేదని, వారు ఏం పాపం చేశారని డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. గాంధేయమార్గంలో పాదయాత్ర చేపట్టాలని సిద్ధమైతే అరెస్టు చేయడమేమిటని ప్రశ్నించారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పరిధి నుంచి జిల్లాను మినహాయించడం చారిత్రక తప్పిదమని, జిల్లా ప్రజల ఉసురు టీఆర్ఎస్కు తప్పక తాకుందని శాపనార్థాలు పెట్టారు. రాష్ట్రాన్ని ఉద్దరిస్తారని ప్రజలు ఓటేస్తే తెలంగాణను అప్పుల కుప్పగా మర్చారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఎదురుతిరిగే గొంతులు లేకుండా సీఎం కేసీఆర్ చేస్తున్నారని విమర్శించారు. గతంలో జిల్లాకు గోదావరి జలాల కోసం పోరాడిన నేతలు టీఆర్ఎస్ పంచన చేరి సర్కారుకు వత్తాసు పలుకుతున్నారని, వారిని జిల్లా ప్రజలు క్షమించబోరన్నారు. రూ.కోట్లు కమీషన్లు కురిపిస్తున్న కాళేశ్వరంపై ఉన్న ప్రేమ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై లేదన్నారు. ఇక్కడి ప్రజలు టీఆర్ఎస్కు ఓటేయలేదా? అని ప్రశ్నించారు. భగ్గుమన్న నాయకులు.. సాగునీటి సాధన కోసం తాము పాదయాత్రకు శ్రీకారం చుడితే అనుమతుల పేరిట యాత్రను అడ్డుకోవడం పట్ల కాంగ్రెస్ నాయకులు భగ్గుమన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్, పీసీసీ కార్యదర్శి సురేందర్‌రెడ్డితోపాటు పలువురు నాయకులు పాదయాత్ర ప్రారంభ ప్రాంగణానికి బయలుదేరగా.. శంకర్పల్లి పోలీసులు నిలువరించారు. తాము రైతుల కోసం పోరాడుతున్నామని నాయకులు వివరించే ప్రయత్నం చేశారు. శాంతియుతంగా తాము చేపట్టిన పాదయాత్రకు వెళ్లనివ్వాలని విజ్ఞప్తి చేశారు. అయినా పోలీసులు ముందుకు కదలనీయకపోవడంతో మండల కేంద్రంలోని చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిపై నినదించారు. అనంతరం వారిని పోలీసులు అరెస్ట్ చేసి శంకర్పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జిల్లా పన్నులతో అక్కడ పనులా.. జిల్లాకు సాగునీరు ఇచ్చేంతవరకు ప్రతి ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారాన్ని రైతులకు అందజేయాలని మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్ సర్కారును డిమాండ్ చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి వచ్చే ఆదాయంతోనే రాష్ట్ర పాలన సాగుతోందని, ఇక్కడి పన్నులతో సమకూరుతున్న ఆదాయాన్ని ఇతర జిల్లాలో ఖర్చుచేస్తున్నారని ఆరోపించారు. సొంత రాష్ట్రంలోనూ సాగునీటి కోసం పాదయాత్ర చేయాల్సిన దౌర్భాగ్యాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిందని మండిపడ్డారు. గోదావరి నికర జలాలను సద్వినియోగం చేసుకునేందుకు వైఎస్సార్ చేపట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పనులు పూర్తయ్యే ముందు నిలిపివేయడం దుర్మార్గపు చర్య అని అన్నారు. -
వ్యసనాలకు బానిసలై జైలుపాలైన విద్యార్థులు
సాక్షి, గుంటూరు : విద్యార్థి కిడ్నాప్‌కు విఫలయత్నం చేసిన కేసులో నలుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఈస్ట్ డీఎస్పీ కార్యాలయంలో సబ్ డివిజనల్ ఆఫీసర్ ఎస్.ఎం.నజీముద్దీన్, కొత్తపేట పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ ఎస్.వి.రాజశేఖరరెడ్డి ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. వారి కథనం ప్రకారం... గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన సానిమల్లికార్జున గుంటూరు హిందూ కళాశాలలో బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. బ్రాడీపేటలోని బీసీ హాస్టల్లో ఉంటూ విద్యనభ్యసిస్తున్నాడు. ఈ నెల 14వ తేదీన ఉదయం 3 గంటల సమయంలో మాచర్ల నుంచి వస్తున్న తన రూమ్మెట్ సాంబశివరావును తీసుకొచ్చేందుకు ఆర్టీసీ బస్టాండ్‌కు తన సైకిల్‌పై మూడు వంతెనల బ్రిడ్జి కింద నుంచి నెహ్రూనగర్ రైల్వే ట్రాక్ పక్కగా రామిరెడ్డితోట ప్రధాన రహదారిపై వెళుతున్నాడు. పోలేరమ్మ ఆలయం వద్దకు వచ్చేసరికి నలుగురు యువకులు కారును అడ్డుపెట్టి మల్లికార్జునను బలవంతంగా కారులో ఎక్కించారు. వారి వద్ద ఉన్న పిస్టల్ చూపించి తాము పోలీసులమని, నీలాంటివాళ్ల వల్ల రాత్రి వేళల్లో విధులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని బెదిరించారు. అయితే సదరు విద్యార్థి నుంచి సెల్‌ఫోన్, ఐడీ కార్డు లాక్కున్నారు. ఆ తర్వాత అక్కడ కారు ఎక్కించుకుని బస్టాండ్ పరిసర ప్రాంతంలోని గాయత్రి హోటల్లో వద్దకు వెళ్లారు. అక్కడ రక్షక్ వాహనాన్ని చూసిన నలుగురు కారు వదిలేసి తలో దిక్కు పారిపోయారు. అనంతరం మల్లికార్జున రక్షక్ ఇన్చార్జి షేక్ యూనస్బేగ్కు సమాచారం చెప్పగా, పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. అయితే కారును, పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కూడా విద్యార్థులే.. కొత్తపేట ఎస్హెచ్ఓ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో రంగంలో దిగిన బృందం నలుగురిని ఈనెల 18వ తేదీన మణిపురం బ్రిడ్జి పక్కన సింగ్ ఆసుపత్రి వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించడంతో కిడ్నాప్‌కు పాల్పడినట్లు అంగీకరించారు. పిడుగురాళ్ల మండలం వీరాపురం గ్రామానికి చెందిన వెనిగండ్ల చైతన్యకృష్ణ, రొంపిచర్ల మండలం కర్లకుంట గ్రామానికి చెందిన వడ్లమూడి నాగబాబు, కాకుమాను మండలం కొండుపాటూరు గ్రామానికి చెందిన పూనం మనోజ్, వినుకొండ మండలం పిట్టంబండ గ్రామానికి చెందిన మక్కెన శ్రీనివాసరావును అరెస్టు చేశారు. నిందితులు ఆయా కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులే. అయితే ఎస్వీఎన్కాలనీలో ఒక రూము అద్దెకు తీసుకుని నివాసం ఉంటూ చెడు వ్యసనాలకు బానిసలుగా మారి ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. బాలాజీ నగర్లో నివాసం ఉండే మద్దుకూరి రామబ్రహ్మం వద్ద నుంచి చైతన్యకృష్ణ సొంత పనుల నిమిత్తం కారు కావాలని తీసుకున్నాడు. దీంతోపాటు, మరో స్నేహితుడు అభిరామ్ అమెరికా వెళుతూ తన ఇంట్లో అప్పగించమని ఇచ్చిన పిస్టల్‌ను దగ్గరపెట్టుకుని అమాయకుల్ని బెదిరించి డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో పక్కా ప్రణాళిక ప్రకారం ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈనెల 14వ తేదీన ఈ ఘటనకు పాల్పడినట్లు నిర్ధారించారు. నిందితుడు ఉపయోగించిన పిస్టల్ సామర్థ్యం, పనిచేసే తీరు తదితర అంశాలు తెలుసుకునేందుకు దాన్ని ల్యాబ్‌కు పంపనున్నారు. అలాగే వెనిగళ్ల చైతన్య కృష్ణ మరికొద్దిరోజుల్లో విదేశాలకు వెళ్లనున్నారు. ఈక్రమంలో అతని పాస్‌పోర్టు కూడా సీజ్ చేశారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన ఏఎస్సై ఆంథోని, హెడ్‌కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ చంద్రశేఖర్‌ను ఉన్నతాధికారులు అభినందించారు. వీరికి రివార్డుల కోసం సిఫార్సులు చేస్తున్నట్లు తెలిపారు. -
నకిలీ మద్యం ముఠా గుట్టురట్టు
సాక్షి, పరిగి/తాండూరు: నకిలీ మద్యం తయారీ ముఠా గుట్టు రట్టయింది. యాదాద్రి జిల్లా భూదాన్‌పోచంపల్లిలో తీగలాగితే వికారాబాద్ జిల్లాలో డొంక కదిలింది. యాదాద్రి, వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో ఇద్దరిని అరెస్టు చేయగా మరొకరు పరారీలో ఉన్నట్లు సమాచారం. నకిలీ మద్యం తయారీకి వినియోగించే ముడి పదార్థాలైన స్పిరిట్, లేబుల్స్, మూతలు తదితర సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. నాలుగు రోజుల క్రితం యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లిలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేసి నకిలీ మద్యంతో పాటు మద్యం తయారీకి వినియోగించే సామగ్రిని పెద్దఎత్తున స్వాధీనం చేసుకున్నారు. అక్కడ అనుమానితులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేశారు. కర్ణాటక, తాండూరు ప్రాంతం నుంచి ముడి పదార్థాలు సరఫరా అవుతున్నట్లు బయటపడింది. దీంతో యాదాద్రి, వికారాబాద్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు తమ సిబ్బందితో కలిసి సోమవారం జిల్లాలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా పెద్దేముల్ మండలం నాగులపల్లిలో బెల్టు షాపు నిర్వహిస్తున్న బిచ్చయ్య, మరో వ్యక్తి మొగులయ్య నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు గుర్తించారు. మొగులయ్యను అదుపులోకి తీసుకోగా బిచ్చయ్య పరారయ్యాడు. నాగులపల్లిలో తమ ఇళ్లలో తనిఖీలు చేసి లేబుళ్లు, స్పిరిట్ తదతితర మద్యం తయారీకి వినియోగించే ముడి పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దోమలోనూ తనిఖీలు మొగులయ్యను అదుపులోకి తీసుకుని విచారించడంతో దోమ మండల కేంద్రానికి చెందిన బెస్ల లక్ష్మణ్‌కు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు తేలింది. దీంతో దోమలో సైతం దాడులు నిర్వహించి లక్ష్మణ్ ఇంట్లో మద్యం తయారికీ వినియోగించే ముడి సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే, నకిలీ మద్యం తయారీ ప్రస్తుతం కాస్త మందగించినా గత ఎన్నికల సమయంలో పెద్దమొత్తంలో తయారు చేసి విక్రయించినట్లు ఎక్సైజ్ పోలీసుల విచారణలో తేలినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సందర్భంగా దోమ మండల కేంద్రంలో 150 నకిలీ లేబుల్స్, నాలుగు లీటర్ల స్పిరిట్, మద్యం బాటిళ్లను అధికారులు స్వాదీనం చేసుకున్నారు. మద్యం షాపుల్లో సోదాలు సోమవారం మొత్తం అధికారులు మద్యం షాపుల్లో ముమ్మరంగా సోదాలు నిర్వహిం చారు. దోమ, పెద్దేముల్, తాండూరులో తనిఖీలు చేశారు. నకిలీ మద్యం వైన్ షాపులకు ఏమైనా సరఫరా అవుతుందా.. అనే కోణంలో తనిఖీలు నిర్వహించారు. యాదాద్రి ఎన్ఫోర్స్మెంట్ సీఐ భరత్‌భూషన్, పరిగి సీఐ చంద్రశేఖర్ ఇతర సిబ్బంది తనిఖీల్లో ఉన్నారు. -
ఏసీబీకి చిక్కిన ‘ఉత్తమ’ పోలీస్
సాక్షి, మహబూబ్‌నగర్ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పరేడ్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ ఉద్యోగిగా అవార్డు తీసుకున్న గంటల వ్యవధిలోనే లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ఓ కానిస్టేబుల్. దీంతో అవినీతి పరులకు ఉత్తమ ఉద్యోగులుగా అవార్డులు ఇస్తున్నారని ఆ శాఖపై విమర్శలు వినిపిస్తున్నాయి. మహబూబ్‌నగర్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన మడవత్ రమేష్ ప్రభుత్వం నుంచి ఆన్లైన్లో అనుమతులు తీసుకొని నిబంధనల ప్రకారం ఇసుక తరలిస్తున్నాడు. ఈ క్రమంలో వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పల్లె తిరుపతిరెడ్డి గత ఏడాది నుంచి నాకు డబ్బులు ఇవ్వడం లేదు, డబ్బులు కావాలని రమేష్‌ను పలు మార్లు ఇబ్బంది పెడుతూ వచ్చాడు. అయితే రూ.17వేలు కావాలని తిరుపతిరెడ్డిని డిమాండ్ చేశాడు. దీనికి రమేష్ ఒప్పుకోకపోవడంతో కొన్ని రోజుల సమయం ఇచ్చాడు. ఆ తర్వాత రమేష్‌తో రూ.15వేలకు బేరం కుదుర్చుకున్నాడు. పక్కా ప్రణాళికతో పట్టుకున్నారు.. ఈమేరకు రమేష్ జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ చేసి ఇసుక తరలించడానికి రూ.17వేలు లంచం అడిగినట్లు రుజువు కావడంతో శుక్రవారం ఉదయం నుంచి ప్రణాళిక ప్రకారం విచారణ సాగించారు. మహబూబ్‌నగర్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పల్లె తిరుపతిరెడిక్డి రూ.17వేలు లంచం ఇస్తుంటే ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ ఆధ్వర్యంలో దాడులు చేసి రెడ్‌హ్యాండ్‌గా పట్టుకున్నారు. కానిస్టేబుల్ తిరుపతిరెడ్డి అడిగిన డబ్బును రమేష్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఉన్న పోలీస్ వాహనం వెనుక భాగంలో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బాధితుడు మాకు తెలపడంతో మా టీంతో లోపలికి వెళ్లి తనిఖీ చేయగా తిరుపతిరెడ్డి ఫ్యాంట్ జేబులో రూ.17వేలు పట్టుబడ్డాయి. ఆ తర్వాత ఏసీబీ అధికారులు కానిస్టేబుల్ తిరుపతిరెడ్డిని పూర్తిగా తనిఖీలు చేసి ఏమైన ఆస్తుల పత్రాలు ఉన్నాయా.. ఏమైన ఆస్తులు ఉన్నాయా? బంధువుల పేర్లమీద ఎలాంటి ఆస్తులు ఉన్నాయి అనే అంశాలపై వివరాలు సేకరించారు. ఈ కేసులో పూర్తిగా విచారణ చేసి కానిస్టేబుల్ తిరుపతిరెడ్డిని హైదరాబాద్ ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ వెల్లడించారు. అవినీతిపరుడికి ఉత్తమ సేవా పతకం టూటౌన్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న సమయంలోనే తిరుపతిరెడ్డి అనేక వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ కూడా పాత పద్దతిలోనే వసూళ్లకు పాల్పడుతూ వచ్చాడు. అలాంటి వ్యక్తికి ఉత్తమ ఉద్యోగిగా పోలీస్ ఉన్నత అధికారులు ఎలా గుర్తించారో అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఇబ్బంది పెడుతూ వచ్చాడు నేను 2017 డిసెంబర్ నుంచి ప్రభుత్వ అనుమతులతో ఇసుక తరలిస్తున్నాను. వన్‌టౌన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ తిరుపతిరెడ్డి గత కొన్ని రోజుల నుంచి డబ్బులు కావాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాడు. రూ.17వేలు అడగగా నా దగ్గర డబ్బులు లేవు మూడు రోజుల సమయం ఇవ్వండి రూ.15వేలు ఇస్తానని చెప్పాను. అనంతరం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశా. సదరు కానిస్టేబుల్‌కు టూటౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేసిన సమయంలో కూడా రెండుసార్లు ఇచ్చాను. ఇతను పల్సర్ వాహనంపై సివిల్ డ్రస్‌లో కోయిలకొండ ఎక్స్‌రోడ్, ఫైర్ స్టేషన్ దగ్గరకు వచ్చి ఇసుక ట్రాక్టర్లతో కలెక్షన్ చేస్తుంటాడు. – మడావత్ రమేష్, ఫిర్యాదుదారుడు -
ఎన్డీ అజ్ఞాత దళ సభ్యుడి అరెస్టు
సాక్షి, కొత్తగూడెం : సీపీఐ(ఎంఎల్ న్యూడెమోక్రసీ) అజ్ఞాత దళ సభ్యుడిని అరెస్టు చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్ వెల్లడించారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు తెలిపారు. లక్ష్మీదేవిపల్లి మండలం చింతకుంట గ్రామ శివారు ఫారెస్టు ఏరియాలో ఎన్డీ పార్టీ అజ్ఞాత దళాలు సంచరిస్తున్నారనే సమాచారంతో లక్ష్మీదేవిపల్లి ఎస్ఐ, స్పెషల్ పార్టీ సిబ్బంది కూంబింగ్ నిర్వహించినట్లు తెలిపారు. ఆ సమయంలో ఆజాద్ దళానికి చెందిన, కొత్తగూడెం టూ టౌన్ పోలీసు స్టేషన్ పరిధి మూల్గుగూడెం పాలవాగు వాస్తవ్యుడు మడివి రమేష్ అలియాస్ రవి తారస పడటంతో అదుపులోకి తీసుకున్నారు. రమేష్ వద్ద కంట్రీమెడ్ తుపాకితో పాటు కిట్‌బ్యాగు లభించినట్లు చెప్పారు. దళ కమాండర్ ఆజాద్, దళ సభ్యులు శ్యామ్, ఇతరులు తప్పించుకున్నారని వివరించారు. రమేష్ గత రెండేళ్ల నుంచి దళంలో తిరుగుతూ, గుండాల, కొమరారం ప్రాంతాల్లో అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడని, ఇప్పటి వరకు ఇతను గుండాలలో పోలీసుల మీద దాడి, అక్రమ వసూళ్లు తదితర నాలుగు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని పేర్కొన్నారు. అరెస్టు చేసిన రమేష్‌ను రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరుస్తున్నట్లు వివరించారు. అజ్ఞాత దళ సభ్యులు ఆయుధాలు వీడి జన జీవన స్రవంతిలో కలవాలని ఎస్పీ కోరారు. ఈ సమావేశంలో ఓఎస్డీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, డీఎస్పీ ఎస్ఎం అలీ, సీఐ గోపి, ఎస్ఐ నరేష్, పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. -
సుపారీ గ్యాంగ్ అరెస్ట్
సాక్షి, అనంతపురం: డబ్బు కోసం పీకలు కోసే సుపారీ గ్యాంగ్‌ను జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. టెక్నాలజీ ఆధారంగా పాత నేరస్తులపై నిఘా ఉంచడంతో నలుగురు వ్యక్తులు హత్యలకు గురికాకుండా కాపాడగలిగారు. జిల్లాలో నాలుగు వేర్వేరు హత్యలకు పన్నిన కుట్రలను ధర్మవరం రూరల్, తాడిపత్రి రూరల్, కళ్యాణదుర్గం పోలీసులు భగ్నం చేశారు. మొత్తం తొమ్మిది మంది నిందితలను అరెస్ట్ చేసి మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మరికొంతమంది నిందితులు పరారీలో ఉన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ బూసారపు సత్యయేసుబాబు శుక్రవారం పోలీసు కాన్ఫరెన్స్హాల్లో మీడియాకు వెల్లడించారు. బత్తలపల్లిలో ఇద్దరి హత్యలకు కుట్ర బత్తలపల్లిలో ఇద్దరి హత్యలకు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ ఆధ్వర్యంలో రూరల్ సీఐ చిన్న పెద్దయ్య, బత్తలపల్లి ఎస్ఐ రామకృష్ణారెడ్డి, సిబ్బంది బృందంగా ఏర్పడి పక్కా సమాచారంతో బత్తలపల్లి – ధర్మవరం రహదారిలో వేల్పుమడుగు క్రాస్ వద్ద ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో బత్తపల్లి మండలం గంటాపురానికి చెందిన బోయపాటి ఈశ్వరయ్య, పావగడ తాలూకా కనికెలబండ గ్రామానికి చెందిన వెంకటేష్, కంబదూరు మండలం రాళ్లపల్లికి చెందిన గంగాధర్, బత్తలపల్లి మండలం గంటాపురం గ్రామానికి చెందిన అక్కిం లక్ష్మినారాయణ, పోట్లమర్రికి చెందిన బొత్తల నాగార్జున, గంటాపురానికి చెందిన అంబక్‌పల్లి శివశంకర్, మాతంగి వెంకటనారాయణ, ఎర్రాయపల్లికి చెందిన గొట్టి రమణ ఉన్నారు. వీరి నుంచి నాలుగు వేటకొడవళ్లు, 8 డిటోనేటర్లు, 8 జెలిటెన్ స్టిక్స్, 200 గ్రాముల నాటు బాంబుబల తయారీ పౌడర్, మూడు ఐరన్ పైపులు, ఒక మారుతీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కుట్రలో మరో నిందితుడైన గంగాధర్ తాడిపత్రి రూరల్‌పోలీసులకు చిక్కాడు. ఆధిపత్య పోరుతోనే.. అరెస్టయిన బోయపాటి ఈశ్వరయ్యకు బత్తలపల్లికి చెందిన ఓ వ్యక్తితో కొంతకాలంగా విభేదాలు ఏర్పడ్డాయి. గ్రామంలో ఆధిపత్య పోరు, రానున్న ఎన్నికల్లో సదరు వ్యక్తి ఉంటే ఇబ్బందులు తప్పవని భావించిన నిందితుడు హత్యకు కుట్ర పన్నాడు. దీంతో పాటు కోర్టు విచారణలో ఉన్న ఓ కేసు విషయంలో తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడనే నెపంతో ఎలాగైనా కడతేర్చాలని పథక రచన చేశాడు. తన పొలం పనులు చూసుకునే చలపతి అనే వ్యక్తితో చర్చించి కిరాయి హంతకులను కూడగట్టాలని సూచించాడు. ఓ హత్యకేసులో నిందితులైన లక్ష్మినారాయణ, అంబక్‌పల్లి శివశంకర్, బొత్తల నాగార్జునలను చలపతి సంప్రదించి విషయాన్ని తెలియజేశాడు. నాగార్జున ద్వారా గొట్టి రమణ, ఈయన ద్వారా నాటు బాంబుల తయారీలో సిద్ధహస్తుడైన వెంకటేష్, గంగాధర్‌లను ఆశ్రయించాడు. తనకు అడ్డు తగులుతున్న వ్యక్తిని అంతమొందించేందు కోసం బోయపాటి ఈశ్వరయ్య రూ. 4 లక్షలు అందజేశాడు. దీంతో హత్యకు అవసరమైన వేటకొడవళ్లు, మందుగుండు సామగ్రి సిద్ధం చేసుకుని కుట్ర పన్నుతుండగా పోలీసులకు పట్టుబడ్డారు. వీరిని విచారించగా దీంతోపాటు మరోరెండు వేర్వేరు హత్యలకు కుట్ర పన్నినట్లు వెల్లడైంది. మనస్పర్ధలతో మరొకటి.. పరారీలో ఉన్న నిందితుడు సుబ్బరాయుడికి బత్తలపల్లి మండలానికి చెందిన మరో వ్యక్తితో కొంతకాలంగా మనస్పర్ధలున్నాయి. ఇద్దరూ సమీప బంధువులే అయినప్పటికీ మండలస్థాయి పదవి విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. తన పదవి పోయేందుకు ఆ వ్యక్తే కారణమని భావించిన సుబ్బరాయుడు అతన్ని చంపాలని భావించాడు. గొట్టి రమణను ఆశ్రయించి రూ.20 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. సుబ్బరాయుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. హత్యకుట్ర భగ్నం తాడిపత్రి మండలానికి చెందిన ఓ గ్రామస్థాయి నాయకుడిని హతమార్చేందుకు జరిపిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. వీరాపురానికి చెందిన లక్ష్మినారాయణ, కంబదూరు మండలం రాల్లపల్లికి చెందిన గంగాధర్‌లను శుక్రవారం అరెస్ట్ చేశారు. తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు పర్యవేక్షణలో రూరల్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ రాజశేఖర రెడ్డి, సిబ్బంది బృందంగా ఏర్పడి పక్కా సమాచారంతో మరువ వంక వద్ద వీరిని అదుపులోకి తీసుకుని, వీరి నుంచి రెండు వేట కొడవళ్లు, ఏడు డిటోనేటర్లు, ఏడు జిలిటెన్ స్టిక్స్, 200 గ్రాముల బాంబుల తయారీ పొడిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో వీరాపురం గ్రామానికి చెందిన రంగనాథరెడ్డి, వెంకటనారాయణ, పావగడకు చెందిన వెంకటేశ్‌లు పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం అరెస్ట్ అయిన ఇద్దరు, పరారీలో ఉన్న ముగ్గురు కలిసి పథకం వేశారు. జిల్లా జైలులో ఉన్నప్పుడు ఈ ఐదుగురు కలిసి కుట్రకు వ్యూహరచన చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 11న జరిగిన వీరాపురం చింతా భాస్కర్‌రెడ్డి హత్య కేసులో లక్ష్మినారాయణ, రంగనాథరెడ్డి, వెంకటనారాయణలు, కంబదూరు పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన పేలుళ్ల కేసులో గంగాధర్, వెంకటేష్‌లు జిల్లా జైలులో ఉండేవారు. తమకు ఓ వ్యక్తి టార్గెట్‌గా ఉన్నాడని, అతనని హతమార్చేందుకు సహకరించాలని వీరాపురానికి చెందిన ముగ్గురు నిందితులు గంగాధర్, వెంకటేష్ అడిగారు. ఇందుకు సహకరిస్తే ఆర్థికంగా సహాయపడతామని చెప్పడంతో సరేనని అంగీకరించారు. మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలు వినియోగించి చంపడంలో తమకు అనుభవముందని, గతంలో కంబదూరు పోలీసు స్టేషన్ పరిధిలో వారు పాల్పడిన పేలుళ్ల హత్యోదంతాన్ని గుర్తు చేశారు. హత్య కుట్రకు అక్కేడే వ్యూవహరచన చేశారు. ఇటీవలే వీరాంతా రెండు వేర్వేరు సందర్భాల్లో బెయిల్‌పై జైలు నుంచి బయటికి వచ్చారు. వీరంతా కలసి శుక్రవారం ఆ వ్యక్తిని చంపాలని సిద్ధమయ్యారు. తాను బత్తలపల్లి హత్యల్లో పాల్గొంటానని వెంకటేష్ చెప్పగా, మందుగుండు సామగ్రి, మారణాయుధాలతో లక్ష్మినారాయణ, గంగాధర్‌లు ఆ వ్యక్తిని చంపాలని బయలుదేరి పోలీసులకు చిక్కాడు. మిగతా ఇద్దరు ఈ విషయం తెలుసుకుని పరారీలో ఉన్నట్లు ఎస్పీ వివరించారు. నాలుగు వేర్వేరు హత్య కుట్రలను భగ్నం చేసిన తాడిపత్రిరూరల్, ధర్మవరం రూరల్, కళ్యాణదుర్గం పోలీసులను ఎస్పీ భూసారపు సత్యయేసుబాబు అభినందించారు. ఆర్వోసీ మాజీ నేత హత్యకు కుట్ర కంబదూరు మండలం రాళ్లపల్లికి చెందిన ఆర్వోసీ మాజీ నాయకుడు రామకృష్ణను చంపాలని కె.బి.వెంకటేష్, ఇ.గంగాధర్‌లు పథకం పన్నారు. ఈ ఇద్దరూ కలిసి ఈ ఏడాది ఫిబ్రవరి 10న రాళ్ళపల్లి దుర్గప్పను మందుపాతర పేల్చి కడతేర్చారు. హతుడి సోదరుడైన రామకృష్ణ నుంచి ప్రతీకారచర్య ఉంటుందని నిందితులు భావించారు. దుర్గప్ప హత్యకేసులో జైలు నుంచి బయటకొచ్చాక కచ్చితంగా చంపుతాడని, అంతకన్నా ముందుగానే రామకృష్ణను తామే చంపితే ఇబ్బందులుండబోవని భావించారు. దీంతో జైలులోనే పథక రచన చేసినట్లు నిందితులు విచారణలో అంగీకరించారు. -
అశ్లీల చిత్రాలు షేర్ చేసిన భార్య, భర్త అరెస్ట్
సాక్షి, బొమ్మలసత్రం: ఓ మహిళా మరో వ్యక్తితో కలిసి ఫొటో దిగినట్లు ఫొటోషాప్‌లో మార్ఫింగ్ చేసిన ఇద్దరిని టూటౌన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సీఐ దైవప్రసాద్ తెలిపిన వివరాలు.. కర్నూలుకు చెందిన ఓ యువతి నవజ్యోతి హ్యుమన్‌రైట్స్ సభ్యురాలుగా ఉండేది. ఆమెతో పాటు నెహ్రూ నగర్‌కు చెందిన భార్య, భర్త శిరీష, రామకృష్ణారెడ్డి కూడా సభ్యులుగా ఉండేవారు. కొంత కాలం క్రితం యువతితో మనస్పర్థలు రావటంతో రామకృష్ణారెడ్డి, శిరీష నవజ్యోతి హ్యుమన్‌రైట్స్ నుంచి తప్పుకున్నారు. అనంతరం ఎలాగైనా యువతిపై కక్ష సాధించాలన్న ఉద్దేశంతో ఆమె ఫొటోను నవజ్యోతి హ్యుమన్‌రైడ్స్ అధ్యక్షుడి ఫొటోను సేకరించి అశ్లీలంగా ఉన్నట్లు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈవిషయంపై యువతి స్థానిక టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు రామకృష్ణారెడ్డి, శిరీషలను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. -
ఎమ్మెల్యే రాపాక అరెస్టు.. విడుదల
సాక్షి, తూర్పుగోదావరి(రాజోలు) : చట్టం ముందు అందరూ సమానమేనని ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ అన్నారు. మలికిపురం పోలీస్‌స్టేషన్‌కు మంగళవారం ఆయన వచ్చారు. ఈ నెల 11న ఈ స్టేషన్ వద్ద జరిగిన ఆందోళనలో ధ్వంసమైన అద్దాలను పరిశీలించారు. పేకాడుతున్న వారి అరెస్ట్ నేపథ్యంలో, రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాదరావు, ఎస్సై కేవీ రామారావు మధ్య వివాదం కారణంగా ఏర్పడిన ఘర్షణ వివరాలను ఆయన తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీసులు తప్పు చేస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ప్రజాప్రతినిధులకు ఉందన్నారు. ఫిర్యాదులపై విచారణ చేసి తప్పు చేసిన పోలీసులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని డీఐజీ చెప్పారు. అలా కాకుండా ఎమ్మెల్యే స్టేషన్ వద్ద ధర్నా చేయడం, అనుచరులతో స్టేషన్‌పై దాడి చేయడం తగదన్నారు. ఇది యువతను తప్పు తోవ పట్టించి ప్రభుత్వం, వ్యవస్థల పట్ల తప్పుడు సంకేతాలు పంపడమేనని ఆయన స్పష్టం చేశారు. బాధ్యులందరిపైనా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్నారు. ఆయన వెంట రాజోలు సీఐ మోహన్ రెడ్డి, ఎస్సై రామారావు ఉన్నారు. ఎమ్మెల్యే రాపాకపై కేసు నమోదైన నేపథ్యంలో మలికిపురంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామంలో పోలీసులు కవాతు నిర్వహించారు. కాకినాడ క్రైం: మలికిపురం పోలీస్‌స్టేషన్‌పై దాడి కేసులో నిందితులు రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, ఆయన అనుచరులు ఎనిమిది మందిని మంగళవారం రాజోలు సీఐ అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్టు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మంగళవారం రాత్రి విలేకర్లకు తెలిపారు. అనంతరం వీరిని బెయిల్‌పై విడుదల చేశామన్నారు. ఈ కేసులో మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. ఈ కేసులోని వారు అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే బెయిల్ రద్దు అవుతుందని, చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఎస్పీ తెలిపారు. ‘చిన్న విషయమని పవన్‌కల్యాణ్ ప్రకటించడం విచారకరం’ మలికిపురం: స్థానిక పోలీస్ స్టేషన్‌పై దాడి సంఘటన.. జనసేన ఎమ్మెల్యే రాపాక, పోలీసుల మధ్య ఏర్పడిన వివాదమే తప్ప ఇందులో తమ పార్టీకి సంబంధం లేదని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు అన్నారు. ఈ విషయంపై కొందరు తమ పార్టీని విమర్శించడం తగదని పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో అన్నారు. పేకాడుతున్న వారిని అరెస్ట్ చేస్తే ఆందోళన చేసిన జనసేన నేతలపై చట్టం తన పని తాను చేసుకు పోతుందన్నారు. జనసేన నేతలు స్టేషన్‌పై దాడి చేసి, దగ్ధం చేయడాన్ని సమర్థించడం పవన్‌కళ్యాణ్‌కు తగదని, ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపుతున్నారని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడ్డి లలిత్‌కుమార్, పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి మంగెన సింహాద్రి, సొసైటీ చైర్మన్లు దివ్వి చిట్టిబాబు, బెల్లంకొండ సూరిబాబు ఏఎంసీ మాజీ చైర్మన్ గెద్దాడ సత్యనారాయణ, ఎస్.శాంతికుమారి, రాయుడు విజయకుమార్, ఓగూరి హనుమంతరావు, చేట్ల సత్యనారాయణ, మేడిది రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
తీగ లాగితే డొంక కదిలింది
సాక్షి, అనంతపురం: తీగలాగితే డొంక కదిలింది. నెలన్నర క్రితం నల్లమాడ మండల కేంద్రంలో జరిగిన మద్యం దుకాణం చోరీ కేసును తాడిపత్రి, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా చేధించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒక యువకుడు, మరో ఇద్దరు మైనర్లు ఉన్నారు. వీరి నుంచి రూ. 10.84 లక్షల నగదు, రెండు ద్విచక్రవాహనాలు, 9 సెల్ఫోన్లు, ఒక డీవీఆర్, సీపీయూ, మూడు కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ.16 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితులను లోతుగా విచారిస్తే మరో రెండు దొంగతనాల కేసులు బయటపడ్డాయి. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ బూసారపు సత్యయేసుబాబు వెల్లడించారు. కదిరి పట్టణం గజ్జెలరెడ్డిపల్లికి చెందిన పోతుల శివకుమార్(23)తో పాటు మరో ఇద్దరు మైనర్లు ఈ ఏడాది జూన్ 20న అర్ధరాత్రి నల్లమాడలోని మద్యం దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. ఆ దుకాణం పైకప్పు రేకును కత్తిరించి లోపలికి ప్రవేశించారు. అందులో రూ. 12లక్షల నగదు, డీవీఆర్ బాక్సును ఎత్తుకెళ్ళారు. దీంతో పాటు తాడిపత్రి పట్టణంలోని సీబీరోడ్డులో ఓ సెల్‌ఫోన్ దుకాణంలో ఈ ఏడాది జూన్ 6న దొంగతనానికి పాల్పడ్డారు. గతంలో 2017లో అనంతపురం మార్కెట్‌యార్డు సమీపంలో ఓ ఫొటో స్టుడియోలో కెమెరాలు దొంగిలించారు. చోరీ సొత్తును సమానంగా పంచుకొని జల్సాలు చేసేవారు. ప్రధాన నిందితుడు పాత నేరస్తుడు ప్రధాన నిందితుడు పోతుల శివకుమార్ పాత నేరస్తుడు. 2014 నుంచి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. జిల్లాతో పాటు తిరుపతి, గుంటూరు, నరసరావుపేట ప్రాంతాల్లో నేరాలకు పాల్పడ్డాడు. ఈ కేసుల్లో రిమాండ్ అనుభవించి జైలు నుంచి బయటకు వచ్చాక తిరిగి నేరప్రవృత్తిని కొనసాగిస్తూ వస్తున్నాడు. నల్లమాడ, తాడిపత్రిలో జరిగిన దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించిన సీసీఎస్, తాడిపత్రి పోలీసులు నిందితులను తాడిపత్రి పట్టణంలోని ఫ్లై ఓవర్ సమీపంలో అరెస్ట్ చేశారు. కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ చౌడేశ్వరి, తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు, సీసీఎస్ డీఎస్పీ శ్రీనివాసులు, అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి, సీఐలు తేజోమూర్తి, నరసింహారావు, శ్యాంరావు, ఎస్ఐలు శంకర్‌రెడ్డి, జగదీష్, జనార్దన్, చలపతి, సిబ్బంది రఘు, గోవిందు, ప్రవీణ్, ఫరూక్, శ్రీనివాసులు, రంజిత్, మల్లికార్జున, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. -
మహిళ దొంగ అరెస్టు!
సాక్షి, ఖమ్మం క్రైం : ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు సంవత్సరాలుగా ఖమ్మం నగరంలో చోరీలు చేస్తూ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న మహిళా దొంగను పోలీసులు అరెస్ట్‌చేశారు. ఆమె వద్ద నుంచి రూ.8.33,400ల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ వివరాలు వెల్లడించారు. ఖమ్మం రూరల్ మండలం దానవాయి గూడేనికి చెందిన శీలం నిర్మల సవరాలు అమ్ముతూ జీవిస్తూ అదేవిధంగా దొంగతనాలకు అలవాటు పడింది. దీంతో ఖమ్మం నగరంలో 2015 నుంచి దొంగతనాలు చేయటం ప్రారంభించింది. తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్.... సవరాలు అమ్మే నిర్మల నగరంలో సవరాలు అమ్ముతా అంటూ వీధుల్లో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా పెట్టుకొనేది. ఎవరూ లేని సమయం చూసి తాళం పగులగొట్టి ఇంట్లో జొరబడి బంగారం, వెండి, నగదు దోచుకొని పోయేది. 2015 నుంచి ఇప్పటి వరకు 15 ఇళ్లలో చోరీలు చేసింది. పోలీసులు ఇది బయట నుంచి వచ్చి చేస్తున్న ముఠా సభ్యులని, లేదా దొంగతనాలలో ఆరితేరిన వారి పనిగా భావించటంతో ఆమె మరింత సులువుగా దొంగతనాలు చేయటం ప్రారంభించింది. అలా పోలీసుల కళ్లుగప్పి నాలుగు సంవతర్సాల నుంచి దొంగతనాలు చేస్తోంది. ఇలా చిక్కింది.. నిర్మల భర్త పోచయ్య గతంలో దొంగతనాలు చేసేవాడు. పోలీసుల నిఘా పెరగటంతో పోచ య్య దొంగతనాలు మానేసి తన భార్య చేత దొంగతనాలు చేయించటం ప్రారంభించాడు. అయితే పోలీసుల కళ్లుగప్పటానికి అతను పోలీసులకు పలు సమాచారాలు అందజేసేవాడు. దీంతో పోలీసులకు నిర్మలపై అనుమానం రాలేదు. ఇటీవల రోటరీనగర్‌లో ఒకేసారి మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడినప్పుడు ఒక ఇంట్లో సీసీ కెమెరాలో నిర్మల చోరీకి పాల్పడి వెళుతున్న దృశ్యాలు పోలీసులకు లభ్యం అయ్యాయి. దీంతో ఆమెపై నిఘా పెట్టిన పోలీసులు శుక్రవారం ఆమెను గాంధీచౌక్ ప్రాంతంలో సంచరిస్తుండగా పట్టుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా వ్యవహారం అంతా బయటపడింది. ఆమె వద్ద నుంచి 255 గ్రాముల బంగారం, 2 కేజీల వెండి, 50వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిర్మల ఇంట్లో సుమారు లక్ష రూపాయల విలువ గల మంచం, ఇతర విలువైన వస్తువులు చూసి పోలీసులు అవాక్కయినట్లు తెలిసింది. పోలీసులకు రివార్డులు మహిళా దొంగను పట్టుకున్న సీసీఎస్ ఏసీపీ జహంగీర్, నగర ఏసీపీ వెంకట్రావ్, సీఐలు షుకూర్, నరేందర్, సాయిరమణ, రమేష్, వసంతకుమార్, ఏఎస్ఐ కృష్ణారావు, హెడ్‌కానిస్టేబుళ్లు లతీఫ్, వెంకటేశ్వరరావు, కానిస్టేబుళ్లు హరీష్, నాగేశ్వరరావు, మంగత్యా, అమీర్, నరేష్, జమలయ్య, నాగేశ్వరరావుకు సీపీ తఫ్సీర్ ఇక్బాల్ రివార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు మురళీధర్, పూజ తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి రవాణా ముఠా అరెస్ట్
సాక్షి, నల్లజర్ల(పశ్చిమ గోదావరి) : ఒక కారులో గట్టుచప్పుడు కాకుండా నర్సీపట్నం నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠాను నల్లజర్ల పోలీసులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్న సంగతి విదితమే. విచారణ అనంతరం గురువారం రాత్రి ముఠా సభ్యులను తాడేపల్లిగూడెం పట్టణ సీఐ ఆకుల రఘు, తహసీల్దార్ కనకదుర్గ నిందితుల్ని అరెస్ట్ చేసి శుక్రవారం కోర్టుకు హాజరుపర్చినట్టు ఎస్సై కె.చంద్రశేఖర్ తెలిపారు. మహబూబ్‌నగర్‌కు చెందిన కాట్రోడ్డు నవీన్, వడిపే సంజీవ్, విశాఖపట్టణానికి చెందిన వెంకటలక్ష్మి బృందంగా ఏర్పడి కమిషన్‌పై గంజాయి రవాణా చేస్తుంటారు. ఇలా అక్రమంగా రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వారివద్ద నుంచి 80 ప్యాకెట్లలో ఉన్న 160 కిలోల గంజాయి, ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు
సాక్షి, నిజామాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలో 15 రోజుల కింద అర్ధరాత్రి వినాయక్‌నగర్‌లోని శ్రీనగర్‌కాలనీలో మూడు బంగారు దుకాణాల్లో చోరీలకు పాల్పడిన వారిని అరెస్టు చేసినట్లు సీపీ కార్తికేయ బుధవారం తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. మహారాష్ట్రకు చెందిన అంతర్రాష్ట్ర ముఠాగా గుర్తించామన్నారు. మహారాష్ట్రలోని జాల్నా జిల్లాకు చెందిన దీపక్‌సింగ్ గ్యాంగ్ నిజామాబాద్ జిల్లాలో వరుస చోరీలకు పాల్పడిందన్నారు. వినాయక్‌నగర్‌లో మూడు బంగారు దుకాణాల్లో మొత్తం ఐదుగురు చోరీకి పాల్పడి నగదును దోచుకెళ్లారన్నారు. సీసీ పుటేజీల ఆధారంగా వీరు టాటా సుమోలో వచ్చి, దోపిడీ చేసి పారిపోయిన దృశ్యాలను పరిశీలించామన్నారు. నవీపేటలో సీసీ పుటేజీని పరిశీలించగా దీన్ని గుర్తించామన్నారు. దీపక్‌సింగ్‌పై నిఘా పెట్టి విచారణ చేపట్టగా ఇదే గ్యాంగ్ చోరీకి పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు. గతంలో ఆర్మూర్‌లో వరుసగా షెట్టర్ చోరీలు, ఇటీవల బోధన్‌లో చోరీ, నిజామాబాద్‌లో మూడు బంగారు దుకాణాల్లో చోరీ ఇదే గ్యాంగ్ చేసిందన్నారు. నాందేడ్ జిల్లాకు చెందిన షేక్‌సద్దామ్, దీపక్‌సింగ్‌ను అరెస్టు చేశామన్నారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారన్నారు. వారి నుంచి 4 కిలోల వెండి, మూడు కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దుండగులు వినియోగించిన బైక్‌లు, టాటా సుమోను స్వాధీనం చేసుకున్నామన్నారు. దీపక్‌సింగ్ ముఠా నిజామాబాద్, మహారాష్ట్రలో వరుస చోరీలకు పాల్పడుతుందని అంతర్రాష్ట్ర దొంగల ముఠాగా కొనసాగుతుందని సీపీ వెల్లడించారు. నగర సీఐ నరేష్, 4వ టౌన్ ఎస్ఐ లక్ష్మయ్య, కానిస్టేబుళ్లను సీపీ అభినందించారు. -
మత మార్పిడి చేసిన మదర్సా నిర్వాహకుల అరెస్ట్
అశ్వారావుపేట: మతమార్పిడి, లైంగిక దాడులకు పాల్పడుతున్న ముగ్గరు వ్యక్తులను పాల్వంచ డీఎస్పీ మధుసూదన్‌రావు బుధవారం అరెస్టు చేసి సత్తుపల్లి కోర్టుకు రిమాండ్ చేశారు. స్థానిక సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. ఏపీ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన ఎస్కే వలీఅహ్మద్ అశ్వారావుపేటలోని ఏఎస్‌ఆర్‌నగర్‌లో మదర్సా నిర్వహిస్తున్నాడు. దీనిని ‘ద రియల్ మెస్సేజ్ సెంటర్ మదర్సా ఈ దావత్ హక్’ పేరుతో 2010లో మేడిపల్లిలో ప్రారంభించారు. ఆ తర్వాత 2011లో అశ్వారావుపేటకు మార్చారు. ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా నడిపి 2018లో ఖమ్మంలోని రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్ నుంచి 116 నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేయించారు. నిరుపేద దూదేకుల కులానికి చెందిన పిల్లలకు ఉర్దూ, అరబిక్ నేర్పడం, చెడు అలవాట్లకు బానిసలైన వారిని మార్చడం, అన్ని మతాలసారం ఒక్కటేనని చెప్పి దేశ సమైక్యతను పెంపొందించడం ఈ మదర్సా స్థాపన లక్ష్యమని రిజిస్ట్రేషన్ కోసం పొందు పర్చిన పత్రాల్లో పేర్కొన్నారు. కానీ, ఈ మదర్సా నిర్వాహకుడు ఎస్కే వలీ.. తన పెద్దకొడుకు ఎస్కే అబ్దుల్ రజాక్, తన బావమరిది ఎస్కే జానీతో కలిసి సాయం కోసం వచ్చే గిరిజన మహిళలతో మతమార్పిడి చేయించడం, వారిపై లైంగికదాడి చేయడం, మదర్సాలో చదివే పిల్లలకు బాల్య వివాహాలు చేయడం, మతమార్పిడి చేసిన వారి ఫొటోలను ఉపయోగించి ఇతర గ్రామాల్లోని మసీదుల వద్ద పెద్దమొత్తంలో చందాలు వసూలు చేయడం లాంటి పనులు చేశారు. ఈ చందాలతో ఆస్తులను కూడబెట్టుకున్నారు. ఇప్పటి వరకు 13 మంది హిందువులను ముస్లింలుగా మార్చాడు. వారిలో 8 మంది గిరిజనులు. గోదావరిఖని గ్రామానికి చెందిన ఎండీ మున్నా కుమార్తె (మైనర్)కు ఎస్కే వలీ బలవంతంగా వివాహం చేశాడని, అతడి కొడుకు అబ్దుల్ రజాక్ లైంగికదాడికి పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేయగా దర్యాప్తులో ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చినట్లు డీఎస్పీ వెల్లడించారు. సమావేశంలో సీఐ ఎం.అబ్బయ్య, ఎస్ఐలు వేల్పల వెంకటేశ్వరావు, మధుప్రసాద్ ఉన్నారు. -
కడపలో స్మగ్లర్ల పట్టివేత
సాక్షి, వైఎస్సార్ కడప: మైదుకూరులో ఇద్దరు అంతరాష్ట్ర స్మగ్లర్లు పట్టుబడ్డారు. పోలీసుల తనిఖీల్లో ఎర్రచందనం కలపను అక్రమంగా తరలిస్తున్న వాహనం పట్టుబడగా, అందులో ఉన్న 90 దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి బరువు 3.30 టన్నులుగా ఉంది. పట్టుబడిన స్మగ్లర్లు తమిళనాడుకు చెందిన ఉలగంధన్ వెల్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన రాణా దత్తలుగా అధికారులు గుర్తించారు. వీరి నుంచి 1 వాహనం, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు. -
చిన్నారిని బలికి టీచర్ యత్నం
ఉడాల్గురి(అస్సాం): ఒక ఉపాధ్యాయుడు, ఆయన కుటుంబం కలిసి తమ మూడేళ్ల చిన్నారిని బలి ఇచ్చేందుకు చేసిన యత్నాన్ని గ్రామస్తులు, పోలీసులు కలిసి అడ్డుకున్నారు. ఈ ఘటన అస్సాంలోని ఉడాల్గురి జిల్లా గనక్పారలో జరిగింది. గ్రామానికి చెందిన ఓ ఉపాధ్యాయుడి ఇంట్లోంచి శనివారం ఉదయం దట్టమైన పొగ రావడం గ్రామస్తులు గమనించి, అప్రమత్తమయ్యారు. వారు వెళ్లి లోనికి చూడగా మహిళలు సహా ఇంట్లోని వారంతా నగ్నంగా కూర్చుని పెద్దగా మంత్రాలు చదువుతున్నారు. మధ్యలో మూడేళ్ల చిన్నారిని కూర్చోబెట్టారు. ఆమె మెడ నరికేందుకు ఓ మంత్రగాడు పెద్దకత్తిని పట్టుకుని ఉన్నాడు. విషయం తెల్సి పోలీసులురాగానే రాళ్లు, ఇతర వస్తువులను ఇంట్లోనివాళ్లు విసిరారు. పోలీసులు గాలిలోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపి, అందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ కాల్పుల్లో టీచర్‌తోపాటు అతని కొడుకు గాయపడ్డారు. బలి ఇవ్వడానికి సిద్ధం చేసిన బాలిక సదరు ఉపాధ్యాయుడి మరదలి కూతురనీ, ఆమె తల్లీ ఆ పూజల్లో పాల్గొందని సమాచారం. -
ద్విచక్రవాహనాల దొంగ అరెస్టు
సాక్షి, మంగపేట: కొంత కాలంగా వివిధ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న తాడ్వాయి మండలం గంగారం గ్రామానికి చెందిన యాస వినోద్(23) అనే వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేసినట్లు ఏటూరునాగారం ఏఎస్పీ శరత్చంద్ర స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఏఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఉమ్మడి వరంగల్ జిల్లా హన్మకొండలోని వడ్డేపల్లికి చెందిన గుండ్ర రామ్రాజ్ అనే భక్తుడు గురువారం మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయ ప్రాంగణంలో తాళం వేసి ఉన్న తన ద్విచక్ర వాహనాన్ని ఎవరో అపహరించుకు పోయారని పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశాడు. శుక్రవారం ఉదయం మండల కేంద్రంలోని కోమటిపల్లి క్రాస్‌రోడ్డు వద్ద ఎస్సై వెంకటేశ్వర్రావు, పిఎస్సై సురేష్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా కాటాపురం వైపు నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న వినోద్ పోలీసులను చూసి ద్విచక్రవాహనాన్ని వదిలి పారిపోతుండగా పట్టుకుని విచారించారు. మల్లూరు గుట్టపై గురువారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో తాళం వేసి ఉన్న ద్విచక్ర వాహనాన్ని తాను దొంగిలించానని, కమలాపురంలో వాహనాన్ని విక్రయించేందుకు వస్తునట్లు ఒప్పుకున్నాడు. మండలంలో ఇటీవల ద్విచక్ర వాహనాలు తరచుగా మాయమవుతున్న సంఘటనల పై అనుమానం వచ్చి విచారించగా హన్మకొండ, వరంగల్, పరకాల వంటి ప్రాంతాల్లో మరో 10 వాహనాలు కూడా దొంగిలించినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. అతను ఇచ్చిన సమాచారం మేరకు దొంగిలించబడిన 11 వాహనాలను స్వాధీనం చేసుకుని నిందితుడు వినోద్‌పై కేసు నమోదు చేసి మరింత లోతుగా విచారణ చేపడుతున్నట్లు ఏఎస్పీ వెల్లడించారు. పట్టుబడిన ద్విచక్ర వాహనాల విలువ సుమారు రూ 2.44 లక్షలు ఉంటుందన్నారు. ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై వెంకటేశ్వర్రావు, పిఎస్సై సతీష్, సిబ్బంది మేర శ్రీనులను ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఏటూరునాగారం సీఐ బత్తుల సత్యనారాయణ, ఏఎస్సై అబ్బయ్య, కానిస్టేబుల్ మేర శ్రీనివాస్, తాటి అశోక్, యాకన్న, వాసు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. -
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్
-
గ్యాంగ్‌స్టర్ నయీం అనుచరుడి అరెస్ట్
సాక్షి, భువనగిరి: గ్యాంగ్‌స్టర్ నయీం అనుచరుడు కత్తుల జంగయ్యను అరెస్ట్ చేసినట్లు సీఐ సురేందర్ తెలిపారు. గురువారం స్థానిక పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నిందితుడి వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌లోని నారాయణగూడకు చెందిన డీఎస్ ప్రాన్సిస్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి భువనగిరి పట్టణ శివారులో ఉన్న ఎస్ఎల్ఎన్ఎస్ వెంచర్లో 1993, 1996 మధ్యలో జీపీఏ హోల్డర్ పక్కిర్ బాల్‌రెడ్డి వద్ద నాలుగు ప్లాట్లను ఒక్కొక్కటి 300 గజాల చొప్పున మొత్తం 1200 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. 2006 సంవత్సరంలో నయీం తన అనుచరులైన పాశం శ్రీను, నాజర్, కత్తుల జంగయ్యతో కలిసి ఎలాగైనా మొత్తం భూమిని కాజేయాలనే ఉద్దేశంతో దౌర్జన్యం చేసి సర్వే నంబర్ 721, 733లో ఉన్న మొత్తం 154 ఎకరాల భూమిని పక్కిరు బాల్రెడ్డికి జీపీఏ చేసిన వ్యక్తుల ద్వారా రిజిస్టర్ చేసుకుని తమ కబ్జాలోకి తీసుకున్నారు. బాధితులు ప్లాట్లలోకి వెళ్లినపుడు ఇక్కడికి వస్తే చంపేస్తాం అంటూ బెదిరించారు. తమ ప్లాట్లను అన్యాయంగా అక్రమించుకున్నారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేయగా పట్టణంలోని స్థానిక సంజీవనగర్‌లో కత్తుల జంగయ్య ఉన్నట్లు సమాచారం రావడంతో అతని నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అతనిని విచారించగా నేరం చేసినట్లు ఒప్పుకోవడంతో కేసునమోదు చేసి కోర్టుకు రిమాండ్‌కు పంపినట్లు చెప్పారు. గతంలో కత్తుల జంగయ్యను మొత్తం 91కేసులలో అరెస్టు చేసినట్లు, పీడీ యాక్టును కూడా నమోదు చేయగా సంవత్సరం జైలు శిక్ష పడినట్లు తెలిపారు. -
మూడు రోజులు..రెండున్నర కోట్లు
సాక్షి, జయపురం: స్థానిక పట్టణ పరిధిలో దాదాపు మూడు రోజుల వ్యవధిలో పలు కేసుల్లో సుమారు రూ.2.5 కోట్ల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే విషయమై జయపురం సబ్‌డివిజన్ పోలీసు అధికారిణి సాగరిక నాథ్ విలేకరుల సమావేశంలో శుక్రవారం మాట్లాడారు. గత రెండు రోజుల వ్యవధిలో జయపురం, బొరిగుమ్మ, బొయిపరిగుడ పోలీస్స్టేషన్ల పరిధుల్లో సుమారు 1015 కేజీల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులలో ఒక యువతి సహా దాదాపు 11 మంది నిందితులను అరెస్టు చేశామని ఆమె వెల్లడించారు. మల్కన్‌గిరి జిల్లాలో తక్కువ ధరకు కొనుగోలు చేసిన గంజాయిను ఛత్తీస్‌గఢ్ మీదుగా ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తున్నారని ఆమె వివరించారు. విజయవాడ–రాంచీ కారిడార్‌లో గురువారం జరిపిన పోలీసుల తనిఖీల్లో దాదాపు 110 కేజీల గంజాయి పట్టుబడిందని ఆమె తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మధ్యప్రదేశ్‌కు చెందిన దాదాపు నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుల్లో చందన నమాలి(25), అనూప్ గౌతమ్, హరిశంకర దువన్యాన్, స్థానికుడైన విష్ణు సాహు ఉన్నారని తెలిపారు. అలాగే అంబాగుడ సమీపంలో ఒక వాహనం ఒక వ్యక్తిని ఢీకొని వెళ్లిపోయిందన్న స్థానికుల సమాచారం మేరకు స్పందించిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే లోపు నిందితులు పరారీ కాగా, వాహనంలోని సుమారు 280 కేజీల గంజాయిను పట్టుకున్నారు. ఈ కేసు నుంచి తప్పించుకున్న వారిలో అనుగూలు వాసి భజనన్ సాహు, మల్కన్‌గిరికి చెందిన రామ ఖెముండులుగా పోలీసులు గుర్తించారు. 10 బస్తాల్లో.. అలాగే జయపురం సదర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని 26వ నంబర్ జాతీయ రహదారిలో నిర్వహించిన తనిఖీల్లో 10 బస్తాల్లో తరలిస్తున్న గంజాయిను పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి, మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రకాష్నాయి, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రాకేష్‌కుమార్ బర్మన్, రాజవిశ్వ బర్మలను పోలీసులు అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.2500 నగదు, 2 మొబైల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు బొయిపరిగుడలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో సుమారు 400 కేజీల గంజాయిను పట్టుకున్నారు. ఇదే కేసుకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్‌కుమార్, టింకు కుమార్, మురతధజ్ శుక్లాలను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ గంజాయి మల్కన్‌గిరి–కొరాపుట్ ప్రాంతాల నుంచి దేశంలోని అనేక రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఆమె వెల్లడించారు. గంజాయి తరలింపునకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. సమావేశంలో జయపురం పట్టణ పోలీసు అధికారి బాలేశ్వర గిడి, సదర్ పోలీసు అధికారి ధిరెన్ కుమిర్ బెహరా, అంబాగుడ పంటి అధికారి నారాయణ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. రాయగడలో.. రాయగడ: వచ్చే సాధారణ ఎన్నికల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలను ముమ్మరం చేసిన ఎక్సైజ్, పోలీస్ యంత్రాంగానికి పెద్దఎత్తున గంజాయి పట్టుబడుతోంది. జిల్లాలోని బిసంకటక్ ప్రాంతంలో భారీగా గంజాయి తరలిస్తున్న వాహనాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా గురువారం జరిపిన తనిఖీల్లో అక్రమంగా గంజాయి తరలిస్తున్న రెండు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని, వాటిల్లో తరలిస్తున్న సుమారు 193 కేజీల గంజాయిను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే శుక్రవారం సాయంత్రం జరిపిన వాహన తనిఖీల్లో దాదాపు 100 కేజీల గంజాయి తరలిస్తున్న ఒక కారును పోలీసులు పట్టుకున్నారు. అయితే కారులో అక్రమంగా తరలిస్తున్న ఈ గంజాయికి రక్షణగా నలుగురు వ్యక్తులు మోటారు సైకిల్‌తో ప్రయాణించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇదే విషయమై ఆ నలుగురు వ్యక్తులను పట్టుకుని, విచారణ చేపట్టగా వారంతా పద్మపూర్, గజపతి, పుటాసింగి, గుణుపురం, మునిగుడ ప్రాంతాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అనంతరం వారి వద్ద ఉన్న సెల్ఫోన్ల ఆధారంగా గంజాయి దొంగల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఐఐసీ అధికారి జశ్వంత్ హీయల్ తెలిపారు. అయితే ముఖ్యంగా యువతకు ఉపాధి లేకపోవడంతో పాకెట్ మనీ కోసం ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తక్కువ వ్యయంతో ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలను యువత అన్వేషిస్తోందని, ఈ క్రమంలో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించేలా చేస్తే చాలావరకు ఇలాంటి దుశ్చర్యలను అరికట్టవచ్చని స్థానికులు పేర్కొంటున్నారు. -
మహిళ హత్య కేసులో నిందితుల అరెస్టు
నూజివీడు: మహిళ హత్య కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ బి.శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పెద నల్లబెల్లి గ్రామానికి చెందిన పిల్లా కమలకు ఆరేళ్ల క్రితం క్రాంతి కుమార్‌తో వివాహమైంది. వీరిరువురికి ఆరు సంవత్సరాల కుమార్తె ఉంది. అయితే మూడేళ్ల క్రితం భర్తను వదిలేసిన కమల అప్పటి నుంచి హైదరాబాద్‌లో కేపీహెచ్‌బీ ఏరియాలో నివాసం ఉంటూ ప్రైవేటు పాఠశాలలో ఆయాగా పనిచేస్తోంది. ఏడాది క్రితం కృష్ణాజిల్లా నూజివీడు మండలం బోర్వంచ శివారు కొన్నంగుంటకు చెందిన పామర్తి పూర్ణ శ్రీకాంత్, హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటుండగా ఫేస్బుక్ ద్వారా ఆమె పరిచయం ఏర్పడింది. తాను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నానని, తనకు ఆస్తులున్నాయని, ఇంకా పెళ్లి కాలేదని పరిచయం చేసుకుంది. దీంతో శ్రీకాంత్ కూడా ఆమెకు దగ్గరై సహజీవనం చేశాడు. కమల సొంత ఊరుకి వెళ్తే.. గత సంక్రాంతి పండుగ సమయంలో కమల స్వగ్రామానికి ఇద్దరూ కలసి వెళ్లారు. అక్కడికి వెళ్లిన తరువాత ఆమెకు వివాహమైందని, భర్తను వదిలేయడమే కాకుండా కుమార్తె కూడా ఉందని శ్రీకాంత్‌కు తెలిసింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన అతడు ఆ తరువాత నుంచి ఆమెతో ఘర్షణ పడుతున్నారు. ఈ నేపథ్యంలో కమల రెండు సార్లు కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనను వదిలిపెడితే ఊరుకోనని బెదిరించింది. వదిలించుకోవాలని.. రోజురోజుకు కమల వేధింపులు ఎక్కువవుతుండడంతో ఎలాగైనా వదిలించుకోవాలని శ్రీకాంత్ నిర్ణయించుకున్నాడు. తండ్రి పామర్తి శోభనబాబును సహకరించాలని కోరాడు. తల్లిదండ్రులు అంగీకరించారు. దీంతో శ్రీకాంత్ అమ్మమ్మగారి ఊరైన చాట్రాయి మండలం పర్వతాపురంలో దినం కార్యక్రమం ఉందని, వెళ్లివద్దామని నమ్మించి గతనెల 28 రాత్రి 9గంటలకు హైదరాబాద్‌లో కమలను బైక్‌పై ఎక్కించుకుని బయలుదేరాడు. దారిలో కీసర వద్ద పెట్రోలు కోని సీసాలో నింపుకుని తీసుకుని మండలంలోని అన్నేరావుపేట రోడ్డులోకి తీసుకెళ్లి చున్నీతో మెడకాయకు చుట్టి గట్టిగా లాగి చంపేసి, రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి లాగి పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఆ తరువాత నేరుగా విజయవాడ వెళ్లి, అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లిపోయాడు. దర్యాపులో నిజాలు.. కాలిన మృతదేహాన్ని తెల్లవారుజామున గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని, ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలు కమల చేతికి ఉన్న వాచ్ తెల్లవారుజామున 3.50గంటలకు ఆగిపోయి ఉంది. అదే రోజు రాత్రి ఒంటి గంట వరకు వర్షం జల్లులు పడ్డాయి. ఈ నేపథ్యంలో ఒంటి గంట నుంచి 3.50గంటల మ«ధ్యే ఘటన జరిగి ఉంటుందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిందితుడిని గుర్తించారు. అలాగే చంపేయమని సలహా ఇచ్చిన నిందితుడి తండ్రి శోభన్‌బాబు, తల్లి పుణ్యవతిని నిందితులుగా కేసులో నిందితులుగా చేర్చారు. సాంకేతిక పరిజ్ఞానంతో కేసును 36 గంటల్లోనే చేధించారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా కోర్టు 15రోజులు రిమాండ్ విధించింది. విలేకరుల సమావేశంలో సీఐ మిద్దే గీతారామకృష్ణ, రూరల్, టౌన్ ఎస్ఐలు కే దుర్గాప్రసాదరావు, రంజిత్‌కుమార్, రూరల్ ఏఎస్ఐ రాధాకృష్ణరెడ్డి పాల్గొన్నారు. -
అనంతపురం జిల్లాలో పేకాటరాయుళ్ళు అరెస్ట్
-
అర్ధరాత్రి అరెస్టులు
శబరిమల/కోజికోడ్: శబరిమలలో ఆదివారం అర్ధరాత్రి కలకలం. పోలీసులు 69 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. దీం తో బీజేపీ, ఆరెస్సెస్ సోమవారం కేరళ వ్యాప్తం గా ఆందోళనలు నిర్వహించాయి. అయితే వారంతా శబరిమలలో అలజడి సృష్టించేందుకు వచ్చారన్న సమాచారంతోనే అదుపులోకి తీసుకున్నామనీ, నిజమైన భక్తులను ఇబ్బంది పెట్టలేదని పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో అయ్యప్ప భక్తులెవరూ లేరనీ, వారంతా శబరిమలలో నిరసనలకు దిగి పరిస్థితిని దిగజార్చేందుకు వచ్చినవారేనని సీఎం పినరయి విజయన్ చెప్పారు. కోజికోడ్‌లో సీఎం మాట్లాడుతూ ‘వారెవరూ అయ్యప్ప భక్తులు కారు. అంతా ఆరెస్సెస్, బీజేపీ కార్యకర్తలే. సమస్యలు సృష్టించేందుకే సన్నిధానం వద్దకు చేరుకున్నారు’ అని చెప్పారు. ఆలయం మూసివేశాక రాత్రి 11 గంటల తర్వాత కూడా వారంతా గుంపుగా చేరి అయ్యప్ప స్వామి నామస్మరణ చేస్తూ నిరసనలకు దిగడంతోనే పరిస్థితి మరింత దిగజారకుండా ముందస్తుగా 69 మందిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. నెయ్యాభిషేకం చేయించడం కోసం వచ్చి, రాత్రి అక్కడే ఉన్న భక్తులను తాము ఇబ్బంది పెట్టలేదని స్పష్టం చేశారు. అయితే బీజేపీ పోలీసుల చర్యను ఖండించింది. కేంద్ర మంత్రి ఆల్ఫోన్స్ కణ్నాంథనమ్ సోమవారం నిలక్కళ్, పంబ, సన్నిధానం వద్ద పర్యటించి భక్తులకు కల్పించిన సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వం ఆలయాన్ని యుద్ధక్షేత్రంగా మార్చింది. భక్తులేమీ తీవ్రవాదులు కారు. యాత్రికులను బందిపోటు దొంగల్లా ఈ ప్రభుత్వం చూస్తోంది’ అని పేర్కొన్నారు. మరోవైపు శబరిమలలో పోలీసులు వ్యవహరించిన తీరుపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ అధికారంతో పోలీసులు భక్తులను అదుపులోకి తీసుకొని సన్నిధానం నుంచి పంపించేశారని ప్రశ్నించింది. ఇలాంటి చర్యలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. సీఎం ఇంటి ముందు ధర్నా అరెస్ట్‌లకు నిరసనగా ఆరెస్సెస్, బీజేపీ, ఆ పార్టీ అనుబంధ సంస్థ యువ మోర్చాల కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. ఇద్దరు కార్యకర్తలు కోజికోడ్‌లో సీఎం కాన్వాయ్‌కు అడ్డు తగిలారు. వారిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. రాజధాని తిరువనంతపురంలో కొందరు కార్యకర్తలు సచివాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టగా, మరికొందరు సీఎం అధికారిక నివాసం ముందు ధర్నాకు దిగారు. సుప్రీంకోర్టులో టీడీబీ పిటిషన్ అన్ని వయసుల మహిళలనూ శబరిమల ఆలయంలోకి అనుమతించాలన్న తీర్పును అమలు చేసేందుకు మరికొంత సమయం ఇవ్వాలని కోరుతూ గుడి నిర్వహణను చూసుకునే ట్రావెన్కోర్ దేవస్థాన బోర్డు (టీడీబీ) సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆగస్టులో సంభవించిన భారీ వరదల కారణంగా ఇప్పటికే ఆలయ పరసరాల్లో వసతులు దెబ్బతిన్నాయనీ, సరైన సౌకర్యాలు లేనందున ఇప్పుడు యాత్రకు వస్తే మహిళలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని టీడీబీ పిటిషన్లో పేర్కొంది. రుతుక్రమం వచ్చే వయసులో ఉన్న మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించకూడదన్న నిషేధాన్ని సుప్రీంకోర్టు సెప్టెంబరు 28న ఎత్తివేయడం తెలిసిందే. -
ఫేస్బుక్లో ఉగ్ర ఎర
శ్రీనగర్: ఫేస్బుక్ ద్వారా యువకుల్ని రెచ్చగొడుతూ ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తున్న కశ్మీరీ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ప్రధానంగా ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ కోసం పనిచేస్తున్నట్లు విచారణలో తేలింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న ఆరోపణలపై కశ్మీర్లో ఒక మహిళను అరెస్ట్ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఉత్తర కశ్మీర్‌లోని బందీపూర్‌కు చెందిన షాజియా(30) అనే మహిళ ఫేస్బుక్ వేదికగా జిహాద్ కోసం పనిచేయాలని, ఆయుధాలు చేతపట్టాలని యువకులు లక్ష్యంగా పోస్టులు పెట్టిందని పోలీసులు గుర్తించారు. ఆ ఫేస్బుక్ ప్రొఫైల్ ఆధారంగా ఆమెను కనిపెట్టిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. అనంత్‌నాగ్‌కు చెందిన ఇద్దరు యువకులకు ఆమె ఆయుధాలు, తుపాకీ మేగజీన్లు అందించినట్లు విచారణలో తెలిసింది. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన షాజియా ఇన్మార్ఫర్‌గా నటిస్తూ పోలీసుల నుంచి సేకరించిన కీలక సమాచారాన్ని మిలిటెంట్లకు చేరవేసినట్లు భావిస్తున్నామని ఓ అధికారి తెలిపారు. మిలిటెంట్లను పట్టుకోవడంలో సాయపడతానని చెప్పి ఆమెనే పోలీసు ఉన్నతాధికారులను సంప్రదించేదని తెలిసింది. షాజియా ప్రవర్తనపై అనుమానంతో కొన్నాళ్లుగా పోలీసులు ఆమెపై నిఘా పెంచారు. షాజియా నుంచి పోలీసులు గ్రెనేడ్లు, ఇతర ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఆమె ఇద్దరు సోదరుల్ని కూడా అరెస్ట్ చేశారు. సీఆర్పీఎఫ్ శిబిరంపై దాడి.. దక్షిణ కశ్మీర్ పుల్వామా జిల్లాలో కొత్తగా ఏర్పాటుచేసిన సీఆర్పీఎఫ్ శిబిరంపై ఆదివారం జరిగిన మిలిటెంట్ల దాడిలో ఒక హవల్దార్ మరణించగా, ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. సాయుధులు శిబిరంపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ గ్రెనేడ్లు విసిరారని అధికారులు తెలిపారు. కశ్మీర్లో స్థానిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాకపురా అనే ప్రాంతంలో ఈ క్యాంపును ఏర్పాటు చేశారు. -
శబరిమల ఆందోళనల్లో 1,500 మంది అరెస్టు
తిరువనంతపురం: ఇటీవల శబరిమల ఆలయంలో ఇటీవలి పూజల సందర్భంగా హింసాత్మక చర్యలకు పాల్పడిన వారి కోసం కేరళ పోలీసులు జల్లెడపడుతున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించిన 10 నుంచి 50 ఏళ్ల మహిళలపై దాడికి యత్నించిన, హింసాత్మక చర్యలకు పాల్పడిన సుమారు 2 వేల మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎర్నాకులం, కోజికోడ్, పలక్కడ్, త్రిసూర్, కొట్టాయం, అలప్పుజ తదితర ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో దాడులు జరిపి 1,500 మందిని అరెస్టు చేశారు. మరో 210 మంది కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. నవంబర్ 17 నుంచి ప్రారంభమయ్యే మండల పూజల నేపథ్యంలో 5వేల అదనపు బలగాలను మోహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
కుట్రపూరితంగానే అరెస్టులు
పటాన్చెరు టౌన్/ సంగారెడ్డి టౌన్/ పుల్కల్: ప్రభుత్వం కుట్ర పూరితంగానే తమ పార్టీ నేతలపై కేసులు బనాయించి రాజకీయంగా దెబ్బ తీయాలనుకుంటోందని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ మండిపడ్డారు. హైదరాబాద్ నుంచి మం గళవారం సంగారెడ్డి వెళ్తున్న ఆయనను పటాన్చెరు మండలం ముత్తంగి టోల్గేట్ వద్ద పోలీసులు అరెస్టు చేసి బీడీఎల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. రాజనర్సింహ మాట్లాడుతూ తోటి రాజకీయ నేత జగ్గారెడ్డిని అరెస్టు చేయడంతో కుటుంబసభ్యులను పరామర్శించడానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారన్నారు. ప్రభుత్వం కక్షగట్టి అరెస్టు చేయడం దారుణమన్నారు. ప్రభుత్వమే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ పోలీసు యంత్రగాన్ని వాడుకుంటూ తప్పుడు కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో జగ్గారెడ్డి పాస్‌పోర్టు అంశం గుర్తుకురానిది ఇప్పుడు గుర్తుకురావడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అయ్యప్ప సొసైటీ, మియాపూర్ భూ కుంభకోణం వంటివి బయటకు రాకుండా వారి నేతలను కాపాడుకుంటూ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. జగ్గారెడ్డి అరెస్టును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని మాజీమంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. జగ్గారెడ్డి సతీమణి నిర్మలా జయప్రకాశ్‌రెడ్డిని పరామర్శించడానికి వచ్చి న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
చంద్రబాబు ముస్లింల దోహి
-
గుంటూరులో అరెస్ట్ అయిన ముస్లిం యువకులు విడుదల
-
ఏటీఎం దొంగ అరెస్టు
కాకినాడ సిటీ : ఇతరుల ఏటీఎం కార్డుల వివరాలతో, వారికి తెలియకుండా నగదు కాజేస్తున్న హైదరాబాద్ చింతల్‌కు చెందిన రామిరెడ్డి రోషన్‌రెడ్డిని అరెస్టు చేశారు. ఈ మేరకు టూటౌన్ పోలీసులు శనివారం ఓ ప్రకటనలో వివరాలు తెలిపారు. కాకినాడ రేచర్లపేటకు చెందిన పేకేటి సారధి ఫిర్యాదు మేరకు సీఐ చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో ఎస్సై కె.వంశీధర్, కానిస్టేబుల్ కె.రూప్‌కుమార్ దర్యాప్తు చేసి, నిందితుడిని స్ధానిక కోకిలా సెంటర్లో అరెస్టు చేశారు. ఆరు నెలలుగా రోష¯Œæరెడ్డి ఏటీఎంల వద్ద ఉంటూ, అమాయకుల ఏటీఎం కార్డులను మోసపూరితంగా తీసుకున్నాడు. తణుకు, గుడివాడ, వినుకొండ, ఏలూరు, తాడేపల్లి గూడెం, రాజమండ్రి, కాకినాడల్లో ఈ నేరాలకు పాల్పడ్డాడు. బాధితుడు సారధి ఖాతా నుంచి రూ.15 వేలు, మిలిగిన చోట్ల సుమారు రూ.4 లక్షలు కాజేశాడు. ఆయా కేసుల్లో నిందితుడు వినియోగించిన టెక్నాలజీని ఛేదించి, బ్యాంకుల నుంచి సెల్‌ఫోన్ డేటా ద్వారా అతడిని పట్టుకున్నారు.