హన్మకొండ: వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో టీఆర్‌ఎస్, బీజేపీ శ్రేణులు సోమవారం పోటాపోటీగా నిరసనలు తెలిపాయి. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెల కొంది. టీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు ఎ మ్మెల్యేలపై నిజామాబాద్ ఎంపీ ధర్మ పురి అర్వింద్ చేసిన వివాదాస్పద వ్యా ఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం విదితమే. దీంతో ఆగ్రహించిన టీఆర్ ఎస్ శ్రేణులు.. ఎంపీ కాన్వాయ్, హ న్మకొండలోని బీజేపీ కార్యాలయంపై దాడికి దిగాయి. దీన్ని నిరసిస్తూ సోమ వారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తం గా ఆందోళనలు చేపట్టాలని బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు హన్మకొండలోని అమరుల స్తూపం కూడలి వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, నన్నపునేని నరేందర్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మరోవైపు తమ ఎమ్మెల్యేలను భూకబ్జాదారులని ఆరోపించడంపై టీఆర్‌ఎస్ శ్రేణులూ భగ్గుమన్నాయి. ధర్నా నిర్వహించి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. అప్పటికే బందోబస్తులో ఉన్న పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు. బీజేపీ కార్యకర్తలను కూడా అరెస్టు చేసి బీమారంలోని ఓ ఫంక్షన్ హాల్‌కు తరలించారు. అంతకుముందు హన్మకొండ బాలసముద్రం లోని చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, వరంగల్‌లోని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ క్యాంపు కార్యాలయాలపై బీజేపీ కార్యకర్తలు కోడిగుడ్లు విసిరారు. మరోవైపు కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించేందుకు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు వెళుతుండగా మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment