Hanmakonda Police
-
పోటాపోటీ నిరసనలు
హన్మకొండ: వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు సోమవారం పోటాపోటీగా నిరసనలు తెలిపాయి. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెల కొంది. టీఆర్ఎస్కు చెందిన ఇద్దరు ఎ మ్మెల్యేలపై నిజామాబాద్ ఎంపీ ధర్మ పురి అర్వింద్ చేసిన వివాదాస్పద వ్యా ఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం విదితమే. దీంతో ఆగ్రహించిన టీఆర్ ఎస్ శ్రేణులు.. ఎంపీ కాన్వాయ్, హ న్మకొండలోని బీజేపీ కార్యాలయంపై దాడికి దిగాయి. దీన్ని నిరసిస్తూ సోమ వారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తం గా ఆందోళనలు చేపట్టాలని బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు హన్మకొండలోని అమరుల స్తూపం కూడలి వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, నన్నపునేని నరేందర్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు తమ ఎమ్మెల్యేలను భూకబ్జాదారులని ఆరోపించడంపై టీఆర్ఎస్ శ్రేణులూ భగ్గుమన్నాయి. ధర్నా నిర్వహించి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. అప్పటికే బందోబస్తులో ఉన్న పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు. బీజేపీ కార్యకర్తలను కూడా అరెస్టు చేసి బీమారంలోని ఓ ఫంక్షన్ హాల్‌కు తరలించారు. అంతకుముందు హన్మకొండ బాలసముద్రం లోని చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, వరంగల్‌లోని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ క్యాంపు కార్యాలయాలపై బీజేపీ కార్యకర్తలు కోడిగుడ్లు విసిరారు. మరోవైపు కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించేందుకు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు వెళుతుండగా మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. -
ఆర్థిక లావాదేవీలతోనే ఆనంద్‌రెడ్డి హత్య
సాక్షి ప్రతినిధి, వరంగల్/కాజీపేట అర్బన్/భూపాలపల్లి: ఖమ్మం అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆనంద్‌రెడ్డి హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి తెలిపారు. బుధవారం హన్మకొండ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కేసుకు సంబంధించి ఆరుగురు నిందితుల్లో ముగ్గురి ని అరెస్టు చేశామని, మిగిలిన ముగ్గురు పరారీలో ఉన్నారని తెలిపారు. వారి కోసం 4 ప్రత్యేక బృందా లు గాలిస్తున్నాయని చె ప్పారు. నిందితుల నుంచి ఒక వాహనం, 2 కత్తులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఏడాదిన్నర క్రితం ఖమ్మం అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆనంద్ రెడ్డికి, కమలాపూర్ మండలం శనిగరం గ్రామానికి చెందిన పింగిళి ప్రదీప్‌రెడ్డితో పరి చయం ఏర్పడింది. ఇది స్నేహంగా మారింది. ప్రదీప్‌రెడ్డి మహారాష్ట్రలో గోదావరి అవతల ఇసుక క్వారీ నడిపిస్తున్నాడు, ఈ క్రమంలో ఆనంద్‌రెడ్డి ఇసుక వ్యాపారం నిమిత్తం డబ్బులు వెచ్చించాడు. తిరిగి డబ్బులు చెల్లించాలని ఇటీవల ప్రదీప్‌రెడ్డిపై ఒత్తిడి పెంచాడు. దీంతో ఈనెల 7న∙ఆనంద్‌రెడ్డిని హన్మకొండలోని అశోకా హోటల్‌కు పిలిపించిన ప్రదీప్‌రెడ్డి.. తాను తీసుకున్న డబ్బులకు సరిపోయే భూపాలపల్లిలోని తన భూమిని రాసి ఇస్తానని నమ్మబలికాడు. ఉదయం 9 గంటల ప్రాంతంలో హన్మకొండలోని ఓ హోటల్ నుంచి ప్రదీప్‌రెడ్డి, డ్రైవర్ రమేశ్, మిత్రుడు విక్రమ్‌రెడ్డిలు వెంగళ్రావు పేరిట ఉన్న ఇన్నోవా వాహనంలో ఆనంద్‌రెడ్డిని వెనుక కూర్చోబెట్టి తీసుకెళ్లారు. మర్డర్ చేసేదుంది.. రెడీగా ఉండండి.. ‘ఆనంద్‌రెడ్డిని భూపాలపల్లికి తీసుకొస్తున్నా.. మర్డర్ చేసేది ఉంది మీరు రెడీగా ఉండండి’ అంటూ ఇసుక క్వారీలో పనిచేసే వెంగళ శివరామకృష్ణ, మీనుగు మధుకర్, నిగ్గుల శంకర్లకు ప్రదీప్‌రెడ్డి సమాచారం అందించాడు. కొంతదూరం వెళ్లాక ప్రదీప్‌రెడ్డి, విక్రమ్‌రెడ్డి, రమేశ్‌లు వెనుక కూర్చున్న ఆనంద్‌రెడ్డి నోటికి ప్లాస్టర్ వేసి వెనుకకు చేతులు కట్టేసి ఉంచారు. మధ్యాహ్నం 3.30 నిమిషాలకు వీరి వాహనం భూపాలపల్లి అడవుల్లోని రామారం కు చేరుకోగానే.. వాహ నం ఆగడమే ఆలస్యం శివరామకృష్ణ, శంకర్, మధుకర్‌లు ఆనంద్‌రెడ్డిని కింద పడేసి తమ వెంట తెచ్చుకున్న రెండు కత్తుల తో కడుపు, గొంతులో పాశవికంగా పొడిచి దారుణంగా హత్య చేశారు. ముగ్గురు నిందితుల అరెస్టు కాగా, ఆనంద్‌రెడ్డి ఆచూ కీ కోసం ఏర్పాటు చేసిన 4 ప్రత్యేక బృందా లు హన్మకొండ పబ్లిక్ గార్డెన్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా క్వాలిస్ వాహనంలో తారస పడిన శివరామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా హత్య చేసింది తామేనని అంగీకరించాడని అడిషనల్ డీసీపీ తెలిపారు. దీంతో ఈ కేసుకు సంబంధం ఉన్న శివరామకృష్ణతో పాటు మధుకర్, శంకర్లను అదుపులోకి తీసుకున్నామన్నారు. ప్రధాన నిందితుడు పింగిళి ప్రదీప్‌రెడ్డి సహా నిగ్గుల రమేశ్, విక్రమ్‌రెడ్డిలు పరారీలో ఉన్నారన్నారు. ప్రశాంత్ రెడ్డి ప్రమేయంపై సమాచారం లేదు ఆనంద్‌రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడైన ప్రదీప్‌రెడ్డి సోదరుడు, ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్‌రెడ్డి ప్రమేయంపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదని అదనపు డీసీపీ స్పష్టం చేశారు. నాకు ఎలాంటి సంబంధం లేదు: ప్రశాంత్‌రెడ్డి ఆనంద్‌రెడ్డి హత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ పింగిళి ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. -
ఆత్మరక్షణకు గన్ లైసెన్స్ ఇవ్వండి
హన్మకొండ చౌరస్తా: ఇటీవల మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతోన్న నేపథ్యంలో ఆత్మరక్షణ కోసం గన్ లైసెన్స్ మంజూరు చేయాలని ఓ అధ్యాపకురాలు పోలీసులకు అర్జీ పెట్టుకుంది. దీనికి సంబంధించిన విజ్ఞాపన పత్రం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెలుగులోకి వచ్చింది. గిరిజన సంక్షేమ మహిళల డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నా నంటూ.. తన పేరు నౌషీన్ ఫాతిమాగా కమిషనర్‌కు ఇచ్చిన అర్జీలో ఆమె పేర్కొంది. కేవలం ఈ–మెయిల్ ఐడీని మాత్రమే పేర్కొన్న నౌషీన్ ఫాతిమా ఇతర వివరాలను వెల్లడించలేదు. ఉద్యోగరీత్యా నిత్యం ఖమ్మం జిల్లాకు ఒంటరిగా ప్రయాణిస్తానని, తెల్లవారుజామున ఇంటి నుంచి బయలుదేరితే తిరిగి వచ్చేసరికి రాత్రి అవుతుందని పేర్కొంది. ఈ నెల 28న మానస హత్య జరిగిన ప్రాంతానికి సమీపంలోనే తన ఇల్లు ఉందని, నిత్యం అదే మార్గంలో వెళ్తానంటూ తెలిపింది. ప్రియాంకారెడ్డి, మానసపై జరిగిన అఘాయిత్యాలు ఇతర మహిళలపైనా జరగొచ్చని, అత్యవసర పరిస్థితుల్లో 100 నంబర్‌కు ఫోన్ చేసినా, మొబైల్ యాప్ ద్వారా తక్షణ సహాయం కోరినా పోలీసులు రక్షిస్తారన్న నమ్మకం లేదని దరఖాస్తులో పేర్కొంది. మానవ మృగాల మధ్యలో ఉంటూ ప్రతిక్షణం నన్ను నేను కాపాడుకోవాలంటే రివాల్వర్ కలిగి ఉండటమే సురక్షిత మార్గమని నమ్ముతున్నట్లు వివరించింది. ‘అతడిని శిక్షించి ఉంటే ఈ ఘటనలు జరిగేవి కావు’ సాక్షి, హైదరాబాద్: హాజీపూర్ వరుస హత్యల నిందితుడిని కఠినంగా శిక్షించి ఉంటే ప్రియాంకారెడ్డి, మానస హత్యలు జరిగేవి కావని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. మహిళలు, బాలికల హత్యల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రియాంకారెడ్డి హత్యోదంతంపై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తిచే విచారణ జరిపించి నిందితులను బహిరంగంగా ఉరి తీయాలన్నారు. ఇకనైనా మద్య నిషేధం అమలు చేయాలని కోరారు. -
సెల్ఫోన్ల చోరీ: హన్మకొండ టు పాతగుట్ట..!
సాక్షి, యాదగిరిగుట్ట: చాకచక్యంగా సెల్ఫోన్లను కొట్టేస్తూ వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ జిల్లా పోలీసుల కంటిమీద కునుకులేకుండా చేస్తోన్న ఓ ముఠా జిల్లాలోని యాదగిరిగుట్టలో తలదాచుకుంది. ఇటీవల ఈ ముఠాలోని ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్న అక్కడి పోలీసులు ముఠా సభ్యుల సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా యాదగిరిగుట్టలో ఉన్నట్టు గుర్తించారు. మూడు బృందాలుగా వచ్చిన హన్మకొండ పోలీసులు పట్టణంలోని ఓ ప్రైవేట్ లాడ్జిపై దాడి చేయగా అప్పటికే మఫ్టీలో వచ్చింది ఖాకీలని గుర్తించిన ఆ ముఠా సభ్యులు పారిపోయారు. సినీఫక్కీలో ఛేజింగ్ చేసి ఆ ముఠాలోని మరో బాలుడిని అదుపులోకి తీసుకోగా మిగతావారు పరారయ్యారు. ఆ ముఠా సభ్యులను ఎలగైనా పట్టుకోవాలని హన్మకొండ పోలీసులు స్థానిక పోలీసుల సహాయంతో యాదగిరిగుట్టలో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. హన్మకొండ పోలీసుల కథనం మేరకు.. హన్మకొండలో నివాముంటున్న ఓ న్యాయవాదికి చెందిన సెల్‌ఫోన్ పోయిందని అక్కడి పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు కొద్ది రోజులకే పదుల సంఖ్యలో ఫోన్లు చోరీకి గురైనట్టు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు రద్దీ ప్రాంతాల్లోని సీసీ పుటేజీలను పరిశీలించగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనపించాడు. అతడి వెంట ఉన్న ఓ బాలుడిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో కర్నూల్ జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన సుమారు ఎనిమిది మంది (ఇందులో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు, మరో ఇద్దరు చిన్నారులు) ఉన్నారు. ముగ్గురు మహిళల్లో ఓ గర్భిణి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. యాదగిరిగుట్ట: సెల్‌ఫోన్ అపహరిస్తూ పట్టుబడిన దొంగ (ఫైల్) సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా... పోలీసుల అదుపులో ఉన్న బాలుడు తమకు చెందిన ముఠా సభ్యుడి ఫోన్ నంబర్ చెప్పాడు. దీంతో హన్మకొండ పోలీసులు ఆ నంబర్ లొకేషన్, సిగ్నల్స్ ఆధారంగా సోమవారం రాత్రి యాదగిరిగుట్ట పట్టణ పరిధిలోని పాతగుట్టకు హన్మకొండ ఎస్ఐ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో మూడు బృందాలుగా పోలీసులు వచ్చారు. దీంతో పట్టణంలోని ఓ ప్రైవేట్ లాడ్జీకి మకాం మార్చారు. పాతగుట్టలో టెక్నాలజీ లొకేషన్ టీమ్ తిరుతున్న క్రమంలో ఓ ప్రైవేట్ లాడ్జీ వద్దకు రాగానే సిగ్నల్ ట్రేస్ అయ్యింది. దీంతో అప్పటికే అప్రమత్తమైన దుండగులు మఫ్టీలో ఉన్న ఖాకీలతో వచ్చిన తమ ముఠాలోని బాలుడిని చూసి లాడ్జికి వెనుక భాగంలో ఉన్న ప్రహరీ దూకి పాతగుట్టకు వెనుక భాగంలో ఉన్న పెద్దగుట్టపైకి పరుగెత్తారు. ఇందులో మహిళలు దాతారుపల్లి వైపునకు వెళ్లి, అక్కడి నుంచి పెద్దగుట్టపైకి, మరో ఇద్దరు పురుషులు గుట్టల్లో రాళ్ల మధ్యలో నుంచి పెద్దగుట్టపైకి వెళ్లినట్లు స్థానికులు చెప్పారు. వీరితో ఉన్న మరో బాలుడిని, హన్మకొండలో పట్టుబడిన బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి పేర్లు అడిగితే సరిగా చెప్పడం లేదని, వారి వద్ద ఆధార్ కార్డులు లేనట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన హన్మకొండ పోలీస్ టీంలు, యాదగిరిగుట్ట పోలీసులకు స మాచారం ఇచ్చారు. హన్మకొండ, యాదగిరిగుట్ట పోలీసులు బృందాలుగా విడిపోయి ముఠా సభ్యులను పట్టుకునేందుకు యాదగిరిగుట్టను జల్లెడ పడుతున్నారు. అయితే లాడ్జిలో పార్కిం గ్ చేసిన ముఠాకు చెందిన కారును పరిశీలించగా అందులో దాదాపు 80కి పైగా ఉన్న సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు రంగుల చొక్కాలు ధరించి.. ఒక్కో సెల్‌ఫోన్ దొంగ ఒంటిపై రెండు రంగులు కనిపించే చొక్కా (బయటకి ఒక రంగు, లోపల నుంచి మరో రంగు).. దాని లోపల కాలర్ ఉన్న టీషర్ట్, దాని కింద రింగ్‌గా ఉండే టీషర్టు ధరించారని, పట్టుబడే క్రమంలో వెంట వెంటనే చొక్కా, టీషర్టు మార్చి దృష్టి మళ్లించడానికి ముఠా సభ్యులు పకడ్బందీగా చేశారని పోలీసులు అంటున్నారు. రద్దీ ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకుని.. సెల్ఫోన్ల చోరీ ముఠా సభ్యులు కర్నూల్ జిల్లాలోని ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులుగా పోలీసులు భావిస్తున్నారు. అయితే వీ రు రద్దీగా ఉండే ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకుని ప్రజల వద్దనుంచి చాకచక్యంగా సెల్ఫోన్లను తస్కరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల హన్మకొండలో పట్టుబడిన బాలుడికి చెందిన అక్క, బావ, వారి కుమారుడు వచ్చారని, పండుగలు జరిగినప్పుడు, రద్దీ గా ఉండే ప్రాంతాలు, కూరగాయల దుకా ణాల్లో, కూడళ్లు, పుణ్యక్షేత్ర ప్రాంతాల్లో సెల్ఫోన్లు కొట్టేసినట్లు సమాచారం. హన్మకొండలో బాలుడితో కలిపి నలుగురు అనుకున్న పోలీసులకు పాతగుట్టకు రాగానే మరో నలుగురు ఎక్కువ కనిపించడంతో కంగుతిన్నారు. అసలు ఈ ముఠా సభ్యులు ఎంత మంది..? వీరు ఎక్కడ ఉన్నారని ఆరా తీస్తునట్లు తెలుస్తోంది. గుర్తింపు కార్డులు లేకుండానే.. లక్ష్మీనర్సింహస్వామి దర్శనానికి వచ్చిన వివిధ ప్రాంతాల్లో భక్తులు యాదగిరిగుట్ట పట్టణంతో పాటు పాతగుట్టలో ఉన్న పలు ప్రైవేట్ లాడ్జీల్లో బస చేస్తుంటారు. అయితే ఇదే తరుణంలో వివిధ ప్రాంతాల్లో దొంగతనాలు చేసిన దొంగలు సైతం భక్తి ముసుగులో ఇక్కడికి వచ్చి ప్రైవేట్ లాడ్జీల్లో తలదాచుకుంటున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. అయితే లాడ్జీల నిర్వహకులు, వాటిని కాంట్రాక్టు తీసుకున్న వారు బస చేయాలనుకునే వారి గుర్తింపు కార్డులు, ఎలాంటి ఆధారాలు లేకుండానే గదులను అద్దెకు ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇవే కాకుండా ప్రతి లాడ్జీలో సీసీ కెమెరాలు ఉండాలని పోలీసులు గతంలోనే సూచిం చినా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. హన్మకొండలో సెల్ఫోన్లు దొంగతనం చేసిన ముఠా సభ్యులకు చెందిన ఐడీ ఫ్రూఫ్, సీసీ కెమెరాలు ఉంటే మరింత సులువుగా కేసు ఛేదించవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అంతే కాకుండా లాడ్జీ సమీ పంలో ప్రస్తుతం కర్నూల్ ముఠాకు చెందిన రెండు చొప్పున కార్లు, బైక్‌లు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. కచ్చితంగా మఠా సభ్యులు తమ విలువైన వాహనాల కోసం రావాలి కాబట్టి పోలీసులు అక్కడే మకాం వేశారు. వీరితో పాటు యాదగిరిగుట్ట పోలీసులు సైతం ముఠా సభ్యులు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ‘గుట్ట’లో పట్టుబడిన దొంగతో సంబంధాలున్నాయా..? మూడ్రోజుల క్రితం యాదగిరిగుట్ట పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో యాదాద్రి క్షేత్రానికి వచ్చిన భక్తుల వద్ద సెల్ఫోన్లు అపహరిస్తూ స్థానికులకు ఓ దొంగ చిక్కాడు. చితకబాదిన అతడిని పోలీసులకు అప్పగించారు. అయితే ఆ దొంగకు, హన్మకొండ నుంచి వచ్చిన సెల్ఫోన్ల చోరీ ముఠాకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. యాదగిరిగుట్టలో దొంగ దొరికిన మూడు రోజులకే ఇక్కడ ఓ ప్రైవేట్ లాడ్జిలో దొంగల ముఠా తలదాచుకోవడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల యాదగిరిగుట్టలో పట్టుబడిన దొంగ అడ్రస్ తప్పుగా చెప్పి ఉంటాడని, అతడు కూడా కర్నూల్‌కు చెందిన ఈ ముఠాలోని సభ్యుడై ఉంటాడని స్థానికంగా చర్చ జరుగుతోంది. -
ఇక ఇంటింటికీ పోలీస్
వరంగల్ క్రైం : ప్రజా రక్షణ కోసం ఇకనుంచి ఇంటింటికీ పోలీసుల సందర్శన ఉంటుందని వరంగల్ రూరల్ ఎస్పీ, అర్బన్ ఇన్చార్జి ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా అన్నారు. దొంగతనాలను నిరోధించడానికి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ‘మీ కోసం పోలీసు’ సదస్సును హన్మకొండ పోలీసులు అమృత గార్డెన్స్‌లో గురువారం నిర్వహించారు. సదస్సుకు నగరంలోని వివిధ కళాశాలలకు చెందిన ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు పాల్గొన్నారు. ఎస్పీ ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. సదస్సులో పాల్గొన్న ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వలంటీర్లకు ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేయాలి.. ఎలాంటి సూచనలు సలహాలు ఇవ్వాలనే పద్ధతులపై హన్మకొండ ఇన్స్పెక్టర్ కిరణ్‌కుమార్ వివరించారు. అనంతరం ఎస్పీ చేతులమీదుగా ‘అప్రమత్తంగా ఉండండి-దొంగతనాలను నివారించండి’ అనే నినాదంతో కూడిన స్టిక్కర్‌ను విడుదల చేసిన తర్వాత వలంటరీ బృందాలకు ప్రచార సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. దొంగతనాలను నిరోధించడంలో ప్రజల సహకారం తప్పనిసరి అని ఇందుకోసం ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసే బాధ్యత పోలీసులపై ఉందన్నారు. కార్యక్రమ నిర్వహణ కోసం యువత అవసరం ఎంతైనా ఉందని, ఇందులో వారిని భాగస్వాములను చేస్తున్నామన్నారు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వలంటీర్లను వినియోగించడం ద్వారా శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలపై అవగాహన కల్పించడంతోపాటు వారికి సమాజం పట్ల ఉన్న బాధ్యత పెంపొం దుతుందని అన్నారు. ఇక్కడ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజు నుంచి పోలీసు అధికారులు, సిబ్బందితోపాటు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి శాంతిభద్రతల పరిరక్షణకు అనేక ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన తెలిపారు. హన్మకొండ ఠాణా పరిధిలోనే తొలిసారిగా ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా ఆలోచనతో రూపుదిద్దుకున్న ప్రజా రక్షణ కార్యక్రమం ‘మీ కోసం పోలీసు’ తొలిసారిగా హన్మకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాదాపు 20వేల కుటుంబాలను అప్రమత్తం చేయడంతోపాటు వారిని చైతన్యవంతులను చేసేందుకు స్టేషన్ సిబ్బంది, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వలంటీర్లతో 350 బృందాలను ఏర్పాటు చేయగా.. ఒక్కో బృందంలో ఇద్దరు వలంటీర్లు ఉంటారు. వీరు ఇంటింటికీ దొంగల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అపరిచితుల పట్ల వ్యవహరించాల్సి తీరు, వీటిపై ఎలా స్పందించాలనే తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. తర్వాత పోలీసు సూచనలతో కూడిన స్టిక్కర్ ఆ ఇంటికి అతికించి ఇంటి యజమానికి కరపత్రాన్ని అందజేస్తారు. కార్యక్రమంలో హన్మకొండ డీఎస్పీ శోభన్‌కుమార్, కేయూసీ, సుబేదారి ఇన్స్పెక్టర్లు దేవేందర్‌రెడ్డి, నరేందర్, కేయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ సురేష్‌లాల్, ఎస్సై శ్రీనివాస్, పులి రమేష్, తాజొద్దీ, ఎన్సీసీ ఇన్చార్జి మహేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.