( ఫైల్ ఫోటో )
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు. రాజకీయ వేడిని పెంచుతున్నాయి. విదేశాల్లో క్యాసినో అక్రమ నిర్వహణ వ్యవహారంపై దర్యాప్తు ముమ్మరం చేసింది ఈడీ. ఈ క్రమంలో.. చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో నోటీసులు అందుకున్న నేతల్లో వణుకు మొదలైంది.
ఇప్పటికే మంత్రి తలసాని సోదరులు మహేష్, ధర్మేంద్రలను సుదీర్ఘంగా ప్రశ్నించారు ఈడీ అధికారులు. క్యాసినో నిర్వహణ, ఆర్థిక లావాదేవీలు, ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘనలు, మనీలాండరింగ్, హవాలా చెల్లింపులపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. శుక్రవారం వీళ్లిద్దరినీ మరోసారి విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక చీకోటి ప్రవీణ్, ఆయన ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ రికార్డులను పరిశీలించిన ఈడీ అధికారులు ఈ కేసీనో వ్యవహారంలో ఎవరెవరూ ఉన్నారన్న పూర్తి సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. ట్రావెల్ ఏజెన్సీల ద్వారా ఫ్లయిట్ టికెట్ బుకింగ్ వివరాలు సేకరించింది. దీనిలో దాదాపు వంద మంది క్యాసినో కస్టమర్లు ఉన్నట్లు గుర్తించి.. ఆ మేరకు జాబితా సిద్ధం చేసినట్లు తెలిసింది. అంతేకాదు..
క్యాసినో వ్యవహారంతో సంబంధమున్న వారికి నోటీసులు ఇవ్వడం ప్రారంభించింది. అందులో భాగంగానే శుక్రవారం విచారణకు హాజరుకావాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ, మెదక్ డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌రెడ్డిలకు సైతం ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో చికోటి ప్రవీణ్‌తో సంబంధాలు ఉన్న రాజకీయ నేతల్లో టెన్షన్ మొదలైంది.
ఇదీ చదవండి: సాఫ్ట్‌వేర్ కొలువు.. ఇక సో ఈజీ!
Comments
Please login to add a commentAdd a comment