Casino
-
ఉన్నట్టుండి రూ. 33 కోట్ల జాక్‌పాట్ : గుండె ఆగినంత పనైందట!
సింగపూర్‌లో జరిగిన ఒక సంఘటన పుట్టెడు దుఃఖాన్నయినా తట్టుకునే గుండె పట్టరాని ఆనందాన్ని భరించ లేదా? అనే ప్రశ్నను లేవనెత్తింది. ఎపుడూ నష్టాలను మూటగట్టుకునే వ్యక్తికి ఊహించని అదృష్టం వరించడంతో ఉక్కిరిబిక్కిరయ్యి గుండె ఆగిపోయినంత పనైన ఘటన తాజాగా వెలుగు చూసింది.వివరాలను పరిశీలిస్తే.. సింగపూర్‌లోని మారినా బే సాండ్స్ క్యాసినోలో ఒక వ్యక్తి జాక్‌పాట్ కొట్టాడు. లాస్ వెగాస్‌కు చెందిన గేమింగ్ అండ్ రిసార్ట్ కంపెనీ నిర్వహిస్తున్న ఐకానిక్ క్యాసినోలో ఏకంగా 33 కోట్ల రూపాయలు (4 బిలియన్ డాలర్లు) గెలుచుకున్నాడు. అయితే ఎపుడూ నష్టపోయే అతడు ముందుగా ఆ విషయాన్ని నమ్మలేదు. కలో మాయో తెలియని సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. ఆ ఆనదంలోనే గుండెపోటు రావడంతో కుప్పకూలి పోయాడు. ఆ ఆనందంలోనే గుండెపోటుతో కుప్పకూలిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ షాక్‌తోనే అతను చనిపోయినట్టు ఎక్స్‌లో పేర్కొన్నారు.🚨 A man won $4 million at Marina Bay Sands Casino in Singapore but tragically suffered a fatal cardiac arrest from the excitement.How f”cked up is that to win millions and didn’t even get the chance to enjoy it and die on the spot. Didn’t get a chance to set up a trust or… pic.twitter.com/UdNxNfbJZH— J Wise (@JWiseKingRa) June 24, 2024అయితే శివుడు ఆజ్ఞలేనిదే చీమ అయినా కుట్టదన్నట్టు ఆ వ్యక్తి సజీవంగానే ఉన్నాడని తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది. క్యాసినో నిర్వాహకులు అతనికి తక్షణ వైద్య సహాయం అందించారని, దీంతో అతను కోలుకుంటున్నాడని కాసినో. ఆర్గ్ తెలిపినట్టుగా కమెంట్ సెక్షన్లో చూడవచ్చు. -
ఆ కంపెనీలకు రూ.లక్ష కోట్ల జీఎస్టీ నోటీసులు!
పన్ను ఎగవేతలకు పాల్పడిన ఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు జీఎస్టీ అధికారులు రూ.లక్ష కోట్ల విలువైన షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం ఓ సీనియర్ అధికారి ధ్రువీకరించారు. ప్రభుత్వం సవరించిన జీఎస్టీ చట్టం ప్రకారం..అక్టోబర్ 1 నుంచి విదేశీ ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు భారతదేశంలో నమోదు చేసుకోవడం తప్పనిసరి. అయితే, అప్పటినుంచి ఎలాంటి సంస్థలు రిజిస్టర్ అవ్వలేదని సమాచారం. ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పెట్టే బెట్టింగ్‌ల పూర్తి విలువపై 28 శాతం జీఎస్టీ చెల్లించాలని ఆగస్టులో సవరించారు. కానీ ఇప్పటివరకు పన్ను చెల్లించని గేమింగ్ సంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పన్ను చెల్లించని కంపెనీలపై ఇప్పటివరకు సుమారు రూ.1లక్ష కోట్ల విలువైన నోటీసులు పంపింది. ఆన్లైన్ గేమ్‌లు, గుర్రపు పందేలు, క్యాసినోలు ఆడేందుకు డిపాజిట్ చేసిన మొత్తం నిధులపై 28 శాతం జీఎస్టీ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటినుంచి దేశంలోని ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. మొబైల్ ప్రీమియర్ లీగ్ వంటి కొన్ని సంస్థలు ఉద్యోగులను సైతం వదులుకోవడానికి దారితీసింది. జీఎస్టీ స్లాబ్‌ను తగ్గించాలని, ఇది విదేశీ ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని కోల్పోతుందని గేమింగ్ సంస్థలు ప్రభుత్వాన్ని అభ్యర్థించాయి. అయినప్పటికీ, రియల్ మనీ ఆన్లైన్ గేమింగ్‌ను నియంత్రించడానికి ప్రభుత్వం అధిక పన్నులతో ముందుకుసాగుతుంది. -
డెల్టా కార్ప్ కథ కంచికేనా? జియా మోడీ మేజిక్ చేస్తారా? అసలెవరీ మోడీ?
Delta Corp-Zia Mody: గత కొన్ని రోజులు డెల్టా కార్ప్ లిమిటెడ్ వార్తల్లో నిలుస్తోంది.ముఖ్యంగా GST ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ జనరల్ (DG) నుండి ఇటీవల రూ. 16,822 కోట్ల పన్ను నోటీసుల నేపథ్యంలో స్టాక్మార్కెట్లో భారీ నష్టాలను నమోదు చేసింది. దీనికి తోడు ప్రముఖ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా కంపెనీలో సగటు ధరకు 15,00,000 షేర్లను విక్రయించడం మార్కెట్లో ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. ఫలితంగా రెండు రోజుల్లో ఏకంగా 24 శాతం కుప్పకూలింది. సెప్టెంబర్ 25న ఎన్ఎస్ఈలో స్టాక్ 52 వారాల కనిష్ట స్థాయి రూ.140.35కి పడిపోయింది. అయితే బుధవారం నాటి మార్కెట్లో లాభాలతో కొనసాగుతోంది. భారతదేశంలో క్యాసినో కంపెనీలకు వేల కోట్ల పన్ను ఎగవేత ఆరోపణలతో జీఎస్టీ అధికారులు పలు కంపెనీలకు షాక్ ఇచ్చింది. భవిష్యత్‌లో మరింతమందికి నోటీసులిచ్చే అవకాశం ఉందని అంచనా. ఈ నోటీసులపై ఇప్పటికే డ్రీమ్ 11ను కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో డెల్టా కార్ప్ న్యాయపోరాటం చేస్తుందా? చేస్తే ఫలితం ఎలా ఉండబోతోంది? అసలు డెల్టాకార్ప్ ఎవరిది అనే విషయాలను ఒక సారి చూద్దాం. (నీతా అంబానీకి మరో అరుదైన గౌరవం) డెల్టాకార్ప్ ఓనర్ ఎవరో తెలుసా డెల్టా కార్ప్ ప్రముఖ న్యాయవాది జియా మోడీ భర్త జయదేవ్ మోడీకి చెందినది. జియా ప్రముఖ కార్పొరేట్ లాయర్. పాపులర్ మహిళా వ్యాపారవేత్త. అంతేకాదు భారత మాజీ అటార్నీ జనరల్ సోలి సోరాబ్జీ కుమార్తె. జియా మోడీ ప్రముఖ లా సంస్థ AZB & పార్టనర్స్ కి సహ వ్యవస్థాపరాలు మేనేజింగ్ భాగస్వామిగా ఉన్నారు. మూడు నెలల క్రితం క్యాసినోల కోసం స్థూల పందెం విలువపై 28 శాతం GST విధించాలని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఆన్లైన్ కంపెనీలు గందరగోళం పడ్డాయి. డెల్టా కార్పొ, డ్రీమ్ 11 సమా పలు కీలక కంపెనీలకు వేల కోట్ల పన్ను ఎగవేత నోటీసులందాయి. నెల రోజుల క్రితం డెల్టా కార్పొ ముఖ్య ఆర్థిక అధికారి రాజీనామా చేశారు. రెండు నెలల క్రితం కంపెనీ తన ఆన్లైన్ గేమింగ్ బిజినెస్కంపెనీ తన ప్రారంభ పబ్లిక్ ఆఫర్‌ను నిలిపివేసినట్లు సమాచారం. 16,822 కోట్ల పన్ను నోటీసు మీడియం-టర్మ్‌లో ప్రతికూలమని ఎనలిస్టుల అంచనా. (వేల కోట్ల జీఎస్టీ ఎగవేత: అధికారుల షాక్..కోర్టుకెక్కిన డ్రీమ్11) ఎలాంటి కేసునైనా..ఇట్టే! RSG ఇండియా నివేదిక ప్రకారం, భారతదేశంలో, ఆసియాలోనే అతిపెద్ద కార్పొరేట్ అటార్నీలలో ఒకరైన జియా ఎలాంటి క్లిష్ట సమస్యనైనా ఈజీగా పరిష్కరించే చాకచక్యం సొంతమని ఆమె క్లయింట్లు నమ్ముతారు. ఈ నేపథ్యంలో కంపెనీ ఈ పన్ను నోటీసు వివాదంనుంచి విజయవంతంగాగా బయపడుతుందా అనే చర్చ జోరుగా నడుస్తోంది. గత ఐదేళ్లలో కంపెనీ అమ్మకాలు 11 శాతం, నికర లాభం 13 శాతం పెరిగాయి. కంపెనీపై పెట్టుబడిదారుల నమ్మకంతోపాటు, టాక్స్‌ల కు సంబంధించిన కొన్ని టెక్నికల్ సమస్యల రీత్యా డెల్టాకార్ప్‌కు లాంగ్ టర్మ్‌లో పెద్దగా ఇబ్బంది లేదనేది ఇండస్ట్రీ వర్గాల అంచనా. డెల్టా కార్ప్ పని అయిపోయినట్టేనా? భారతీయ కాసినో పరిశ్రమలో ఆధిపత్యం, బలమైన బ్రాండ్ నమ్మకమైన కస్టమర్ బేస్ కారణంగా డెల్టా కార్ప్ దీర్ఘకాలిక దృక్పథం ఆశాజనకంగా కనిపిస్తుంది. సవాళ్లను నావిగేట్ చేయగల కంపెనీ సామర్థ్యాన్ని నమ్మే పెట్టుబడిదారులు, ప్రస్తుత స్టాక్ ధర తగ్గుదల కొనుగోలు అవకాశమని రైట్ రీసెర్చ్ వ్యవస్థాపకుడు, క్వాంట్-బేస్డ్ PMS ఫండ్ మేనేజర్ సోనమ్ శ్రీవాస్తవ అన్నారు. పన్ను ఎగవేత ఆరోపణలమొత్తం జూలై 2017-మార్చి 2022 వరకు ఉన్న లాభాలపై, అయితే కొత్త జీఎస్టీ అక్టోబర్ 2023 నుండి మాత్రమే అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో విజయం డెల్టా కార్ప్దే అని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా దివంగత బిలియనీర్ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా భార్య రేఖ ఒకప్పుడు క్యాసినో ఆపరేటర్లో వాటాదారులుగా ఉన్నారు. అయితే 2022లో తమ వాటాలను విక్రయించారు. డెల్టా కార్ప్‌లో 1 శాతం కంటే ఎక్కువ వాటా ఉన్న వాటాదారులెవరూ లేరు. -
‘క్యాసినో గేమ్’ కోసం కన్నం.. ఎలాగైనా డబ్బు సంపాదించాలని.. చివరికీ..
వరంగల్: ఓ విద్యార్థి ఆన్లైన్ గేమ్ ‘క్యాసినో’కు అలవాటు పడ్డాడు. ఆ గేమ్‌లో భారీగా నగదు పోగొట్టుకున్నాడు. చేసిన అప్పు తీర్చాలి. పోయిన డబ్బు ఎలాగైనా సంపాదించాలనుకున్నాడు. దీనికి చోరీలే మార్గమనుకున్నాడు. ఇంకేముందు తాళం వేసిన ఇళ్లకు కన్నం వేయడం మొదలుపెట్టాడు. చోరీ చేసిన డబ్బుతో ఆన్లైన్ గేమ్ ఆడుతూ జల్సాలు చేస్తున్నాడు. ఇలా చోరీలకు పాల్పడుతున్న ఓ విద్యార్థితోపాటు అతడికి సహకరించిన స్నేహితుడు శనివారం ఐనవోలు పోలీసుల చేతికి చిక్కగా వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు శనివారం సాయంత్రం మా మునూరు ఏసీపీ కార్యాలయంలో వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ యాదవ్ వివరాలు వెల్లడించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటకు చెందిన విద్యార్థి టెల్లి సందీప్ ఆన్లైన్ గేమ్ ‘క్యాసినో’కు అలవాటు పడ్డాడు. ఈ గేమ్ కోసం అప్పు చేశారు. అనంతరం ఆడగా డబ్బు మొత్తం పోగొట్టుకున్నాడు. దీంతో అప్పు తీర్చేందుకు చోరీలు చేయాలని నిశ్చయించుకున్నాడు. తాళం వేసిన ఇళ్లల్లో చోరీలు చేయడం మొదలెట్టాడు. ఈ క్రమంలో గతనెల 23న ఐనవోలు మండల కేంద్రంలో పల్లకొండ రాజేష్ ఇంట్లో చోరీకి పాల్పడి రూ.80వేల నగదు, బంగారం, వెండి ఆభరణాలను అపహరించాడు. చోరీ చేసిన డబ్బు నుంచి రూ.60 వేలతో ఓ బైక్, రూ.30వేలతో ఫోన్ కొనుగోలు చేశాడు. అనంతరం జూలై 24న ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట గ్రామంలో అడ్డ గట్ల ఎల్ల య్య ఇంట్లోకి చోరీకి పాల్పడ్డాడు. రూ.2వేల నగదుతోపాటు 2తులాల బంగారం,వెండి ఆభరణాలు అపహరించాడు. చోరీ చేసిన నగదు నుంచి రూ.2వేలు ఖర్చు చేశాడు. అనంతరం చోరీ చేసిన బంగారు, వెండి ఆభరణాలను తన స్నేహితుడు జనగామ జిల్లా పెద్దపహాడ్ గ్రామానికి చెందిన భూక్య సంపత్ వద్ద భద్రపర్చాడు. ఈ క్రమంలో శనివారం ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలో వాహన తనిఖీలు చేస్తున్న ఎస్సై నవీన్‌కుమార్.. అనుమానాస్పందగా కనిపించిన సందీప్‌ను అదుపులోకి తీసుకున్నాడు. విచారించగా చోరీలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్న సందీప్.. ఆ డబ్బు ను తన స్నేహితుడు భూక్య సంపత్ వద్ద దాచిన పెట్టినట్లు తెలిపాడు. దీంతో సందీప్‌తోపాటు సంపత్‌ను అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. తల్లిదండ్రులకు తమ పిల్లలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని మొబైల్ గేమ్స్ అడకుండా చూడాలని డీసీపీ సూచించారు. సమావేశంలో మామునూరు ఏసీపీ సతీష్ బాబు, మామునూరు, వర్ధన్నపేట సీఐలు క్రాంతికుమార్, శ్రీనివాస్, ఎస్సైలు కృష్ణవేణి, నవీన్‌కుమార్ పాల్గొన్నారు. ద్విచక్రవాహనాల దొంగల అరెస్టు.. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో బైక్‌లు, తాళం వేసి ఉన్న షట్టర్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను సీసీఎస్, మట్టెవాడ, సుబేదారి పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేసినట్లు క్రెం ఏసీపీ మల్లయ్య శనివారం తెలిపారు. నిందితుల నుంచి సుమారు రూ.6లక్షల విలువైన తొమ్మిది బైక్‌లు, రూ.1.60 లక్షల నగదు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. వరంగల్ పోచమ్మమైదాన్ చెందిన బరిపట్ల సాయి వరంగల్ కమిషనరేట్‌తోపాటు మహబూబాబాద్ జిల్లాలో చోరీలకు పాల్పతుండగా పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. గత జూన్‌లో జైలు నుంచి విడుదలైన సాయి మరోమారు చోరీలకు పాల్పడుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఘటనలో హనుమకొండ దీన్‌దయాల్ కాలనీ చెందిన బూకరాజు సందీప్ వరంగల్ కమిషనరేట్ పరిధితో పాటు కరీంనగర్, ఖమ్మం ప్రాంతాల్లో ద్విచక్రవాహనాలు చోరీలకు పాల్పడుతుండగా పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. గత మే నెలలో ఖమ్మం జైలు నుంచి విడుదలైన సందీప్ మరోమారు వరంగల్ ,హైదరాబాద్‌లో తాళం వెసిన షట్టర్లు, ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడ్డాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పక్కా సమాచారంతో నిందితులను పట్టుకున్నారు. వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారించగా తమ నేరాలను అంగీకరించారు. వీరి సమాచారంలో మిగతా ద్విచక్రవాహనాలు, నగదుతో పాటు ఇతర చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు క్రైమ్ ఏసీపీ తెలిపారు. -
జీఎస్టీ మార్పులకు కేబినెట్ ఓకే
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందెం క్లబ్‌లలో బెట్టింగ్‌ల ప్రవేశ స్థాయి పూర్తి ముఖ విలువపై 28 శాతం పన్ను విధించేలా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చట్టాల్లో మార్పులకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపిందని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ ), ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) చట్టాల్లో సవరణలకు ఆగస్టు 2వ తేదీన జరిగిన 51వ జీఎస్టీ మండలి భేటీలో ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. సంబంధిత చట్ట సవరణలను ఆగస్టు 11న ముగియనున్న ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టవచ్చని ఆ వర్గాలు వెల్లడించాయి. ప్రవేశ స్థాయి పందెం పూర్తి ముఖ విలువపై 28% జీఎస్టీ విధించడం వల్ల ఈ పన్ను రాబడులు పెరుగుతాయి. రిజి్రస్టేషన్, పన్ను చెల్లింపు నిబంధనలను పాటించడంలో విఫలమైతే, విదేశాల్లోని ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ నిరోధించడం కూడా సవరణల్లో భాగంగా ఉన్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. అక్టోబర్ నుంచి అమల్లోకి జీఎస్టీ చట్టాలలో సవరించిన నిబంధనలు అక్టోబర్ 1 నుండి అమలులోకి వస్తాయి. ఆన్లైన్ గేమింగ్, ఆన్లైన్ మనీ గేమింగ్లతోపాటు ఆన్లైన్ గేమ్‌లకు చెల్లించడానికి ఉపయోగించే వర్చువల్ డిజిటల్ అసెట్స్ అలాగే ఆన్లైన్ గేమింగ్ విషయంలో సప్లయర్ వంటి పదాలకు తాజా సవరణలలో విస్పష్ట నిర్వచనాలు కూడా ఉండడం గమనార్హం. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ప్రతినిధులతో కూడిన ఆగస్టు 2 మండలి సమావేశం అనంతరం, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో సీజీఎస్టీ, ఐజీఎస్టీ సవరణలు ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ నిర్ణయాల విషయంలో రాష్ట్రాలు తమ తమ అసెంబ్లీలలో రాష్ట్ర జీఎస్టీ చట్టానికి సవరణలను ఆమోదిస్తాయి. ప్రస్తుత పన్నుల తీరు ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ, కొన్ని గుర్రపు పందెం క్లబ్‌లు ప్రస్తుతం ప్లాట్‌ఫారమ్ ఫీజు/కమీషన్ (5– 20%) పూర్తి ముఖ విలువలో 18% చొప్పున జీఎస్టీని చెల్లిస్తున్నాయి. అయితే కొన్ని గుర్రపు పందెం క్లబ్‌లు పూర్తి ముఖ విలువపై 28% చెల్లిస్తున్నాయి. బెట్టింగ్, జూదం రూపంలో చర్య తీసుకోగల క్లెయిమ్‌లపై విధిస్తున్న ఈ తరహా 28% లెవీపై ఆయా క్లబ్‌లు న్యాయపోరాటం చేస్తున్నాయి. క్యాసినోలూ ప్రస్తుతం స్థూల గేమింగ్ రెవెన్యూ (జీజీఆర్)పై 28% జీఎస్టీ చెల్లిస్తున్నాయి. ప్రవేశ స్థాయి పందెం పూర్తి ముఖ విలువపై 28% జీఎస్టీ వల్ల ఖజానాకు మరింత మొత్తం సమకూరనుంది. -
టీడీపీ నేత పట్టాభి అధికారం లేక పిచ్చిమాటలు మాట్లాడుతున్నాడు: చికోటి
సాక్షి, హైదరాబాద్: థాయిలాండ్ క్యాసినో కేసులో ఈడీ ఎదుట సోమవారం విచారణకు హజరైన చికోటి ప్రవీణ్ సాక్షి టీవీతో మాట్లాడారు. తాను ఆర్గనైజర్ కాదు అని పేర్కొన్నారు. థాయ్‌లాండ్ క్యాసినో కేసులో తన ప్రమేయం లేదన్నారు. అందుకే అక్కడి న్యాయస్తానం తమకు 2000 బాత్‌లు(రూ.4,850) ఫైన్ విధించి వదిలేసిందన్నారు. థాయ్‌లాండ్‌లో కేసు ముగిసిందన్నారు. ఈడీ అడిగిన అన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని, దర్యాప్తు సంస్థ మీద తనకు పూర్తి నమ్మకం ఉందని చికోటి అన్నారు. మళ్లీ ఎప్పుడూ పిలిచినా అందుబాటులో ఉండాలని చెప్పారని వివరించారు. టీడీపీ నేత పట్టాభి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని చికోటి మండిపడ్డారు. ఆయనకు అధికారం లేక పిచ్చిమాటలు మాట్లాడున్నాడని ధ్వజమెత్తారు. తన భుజంపై తుపాకీ పెట్టి ప్రత్యర్థులను కాల్చే కుట్ర సాగుతోందన్నారు. త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేస్తానని, ఏ పార్టీలో చేరేది ప్రకటిస్తానని అన్నారు. తనను రాజకీయాల్లోకి రానివ్వకూడదనే రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు కనీసం సెన్స్ లేదని, అందుకే పట్టాభి లాంటి వ్యక్తిని పార్టీ అధికార ప్రతినిధిగా పెట్టుకున్నాడని మండిపడ్డాడు. పట్టాభి అన్నీ పనికిరాని మాటలు చెబుతున్నాడని, ఆయన తీరు చూస్తే మతి భ్రమించినట్టుగా భావిస్తున్నానని చికోటి చెప్పాడు. చికోటి ప్రవీణ్ సాక్షి టీవీకి ఇచ్చిన పూర్తి ఇంటర్వ్యూ ఈ లింకులో చూడవచ్చు. చదవండి: హైదరాబాద్‌లో ఉగ్రవాద కార్యకలాపాలపై దర్యాప్తు ముమ్మరం..మరో ఇద్దరు అరెస్టు -
ఈడీ ముందుకు చీకోటి ప్రవీణ్
సాక్షి, హైదరాబాద్: థాయ్‌లాండ్ క్యాసినో కేసులో అక్కడి పోలీసులకు పట్టుబడిన చీకోటి ప్రవీణ్‌కుమార్ సోమవారం ఈడీ అధికారుల విచారణకు హాజరయ్యారు. థాయ్‌లాండ్‌లో క్యాసినో ఆడేందుకు భారత్ నుంచి వెళ్లిన వారిని ఆ దేశ పోలీసులు ఇటీవల అరెస్టు చేయడం తెలిసిందే. చీకటితోపాటు దేవేందర్, మాధవరెడ్డి, సంపత్‌లకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ట్రావెల్ ఏజెంట్ సంపత్ ఈడీ విచారణకు హజరయ్యారు. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో హవాలాకు ఆస్కారం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో.. ఆర్థిక లావాదేవీలతోపాటు నగదు బదిలీపై చీకోటి ప్రవీణ్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. కాగా కేసినో కేసులో గతంలో చీకోటి ప్రవీణ్‌ను ఈడీ విచారించింది. చదవండి: మాంసం ప్రియులకు షాక్.. కొండెక్కిన కోడి ధర.. కేజీ చికెన్ ఎంతంటే? -
నేడు ఈడీ ముందుకు చికోటి ప్రవీణ్
-
నేను నిర్దోషిని: చికోటి ప్రవీణ్
సాక్షి, హైదరాబాద్: చీకోటి ప్రవీణ్ సహా 84 మంది భారతీయుల అరెస్టుకు కారణమైన థాయ్‌లాండ్‌లోని అక్రమ క్యాసినోలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై అక్కడి పోలీసులు స్పష్టత ఇచ్చారు. గత నెల 27 నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు రూ.50 కోట్ల టర్నోవర్ జరిగినట్లు తేల్చారు. ఈ మేరకు చోన్బూరీ ప్రావిన్స్ పోలీసు చీఫ్ కంపోన్ లీలప్రపపోన్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఏడు అంతస్తుల్లో విస్తరించిన ఆసియా హోటల్లో మొత్తం 300 గదులు ఉన్నాయి. గత నెల 27న కొన్ని రూముల్లోకి దిగిన 84 మంది ఆ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో వెలసిన అక్రమ జూదగృహంలో పేకాట, స్నూకర్ ఆడుతున్నారు. గేమింగ్ చిప్స్‌తో లావాదేవీలు జరుగుతుండగా ఆ వివరాలను 40 గేమింగ్ క్రెడిట్ పుస్తకాల్లో నమోదు చేస్తున్నారు. నాలుగు రోజుల్లోనే రూ.50 కోట్ల లావాదేవీలు వాటిలో నమోదైనట్లు చోన్బూరీ పోలీసులు గుర్తించారు. చికోటి స్పందన.. థాయిలాండ్ వ్యవహారంపై చికోటి ప్రవీణ్ మంగళవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. తనకు దేవ్, సీత అనే వ్యక్తుల నుంచి ఫోకర్ టోర్నమెంట్ ఉందని ఆహ్వానం అందితేనే థాయ్‌లాండ్ వచ్చానని పేర్కొన్నారు. ఇక్కడ గ్యాంబ్లింగ్ నిషేధం అనే విషయం తనకు తెలియదని, ఆ అక్రమ క్యాసినో నిర్వాహకుడిని తాను కాదన్నారు. తన నిర్దోషిత్వాన్ని థాయ్ పోలీసుల ఎదుట నిరూపించుకున్నట్లు చెప్పారు. సదరు హాల్లోకి తాను అడుగు పెట్టిన పది నిమిషాలకే పోలీసులు దాడి చేశారన్నారు. హైదరాబాద్‌లో స్ట్రీమ్ అయ్యేలా: అక్రమంగా నడుస్తున్న ఈ పేకాట శిబిరంపై అక్కడి పోలీసులకు అదే హోటల్లో బస చేసిన ఓ గోవా వాసి ద్వారా సమాచారం అందింది. హోటల్‌పై దాడి చేసిన పోలీసులు అందులో నాలుగు పేకాట టేబుళ్లు, మూడు పోకర్ టేబుళ్లు ఉన్నట్లు గుర్తించారు. 16 మంది మహిళల సహా 84 మంది భారతీయులు, థాయ్‌లాండ్‌కు చెందిన నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలను పట్టుకున్నారు. వీరిలో చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి సహా అనేక మంది తెలుగు వాళ్లు ఉన్నారు. వీరందరికీ థాయ్‌లాండ్ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. పూచీకత్తుగా 4,500 బాట్స్ (దాదాపు రూ.11వేలు) చెల్లించాలని ఆదేశించింది. ఈ తతంగమంతా పూర్తి చేసుకుని, పాస్‌పోర్టులు పొందిన తర్వాత భారతీయులంతా తిరిగి రానున్నారు. అయితే... ఆ పేకాట శిబిరంలో 8 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులు వాటిని ఇంటర్నెట్తో అనుసంధానించారు. ఆ లైవ్ ఫీడ్ హైదరాబాద్‌లో స్ట్రీమ్ అయ్యేలా ఏర్పాటుచేసినట్లు చోన్బూరీ పోలీసులు గుర్తించారు. సాధారణంగా ఇలాంటి అక్రమ ఈవెంట్లు భారీ పెట్టుబడితో ముడిపడి ఉంటాయి. ఈ నేపథ్యంలోనే నిర్వాహకులు నగదు కోసం ఫైనాన్షియర్లను ఆశ్రయిస్తుంటారు. అలాంటి ఫైనాన్షియర్ కోసమే ఈ క్యాసినో లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఆ హామీ మాకెందుకు ఇవ్వరు?: కేటీఆర్ -
థాయ్‌లాండ్‌లో చికోటి ప్రవీణ్‌కు బెయిల్ మంజూరు
సాక్షి, హైదరాబాద్: గ్యాంబ్లింగ్‌పై నిషేధం ఉన్న థాయ్‌లాండ్‌లో.. ఓ హోటల్లో రహస్యంగా క్యాసినో నిర్వహిస్తూ పట్టుబడిన చికోటి ప్రవీణ్‌కు థాయ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్‌ను థాయ్ కోర్టు మంజూరు చేసింది. చికోటి ప్రవీణ్‌తో పాటు 83 మందికి బెయిల్ మంజూరైంది. 4500 బాట్స్ జరిమానాను కోర్టు విధించింది. ఫైన్ కట్టించుకుని పాస్‌పోర్టులను పోలీసులు తిరిగిచ్చేశారు. కాగా, థాయ్‌లాండ్ చోనుబురి జిల్లా బాంగ్ లమంగ్‌లోని ఆసియా పట్టాయా హోటల్ హోటల్ వద్ద పెద్ద ఎత్తున్న గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నారని గోవా నుంచి ఓ వ్యక్తి, థాయ్ పోలీసులకు అందించిన సమాచారం ఆధారంగా అక్కడి పోలీసులు రైడ్ నిర్వహించారు. పోలీసులను చూడగానే అక్కడున్నవాళ్లంతా పరుగులు అందుకున్నారు. అయితే సకాలంలో స్పందించిన పోలీసులు వాళ్లను తప్పించుకోనివ్వలేదు. మొత్తం 93 మందితో కూడిన ముఠాను థాయ్‌లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. చివరికి.. ఆ ముఠాకు బాస్ చికోటి ప్రవీణ్‌గా తేలిన విషయం తెలిసిందే. చదవండి: థాయ్‌లాండ్‌లో చికోటి చీకటి దందా.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు -
చికోటి చీకటి దందా.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు
సాక్షి, హైదరాబాద్: చికోటి ప్రవీణ్ చీకటి దందా బయటపడింది. గ్యాంబ్లింగ్‌పై నిషేధం ఉన్న థాయ్‌లాండ్‌లో.. ఓ హోటల్లో రహస్యంగా క్యాసినో నిర్వహిస్తూ పట్టుబడ్డాడు చికోటి. ఈ క్రమంలో ఈ కేసు విచారణను థాయ్ పోలీసులు వేగవంతం చేయగా.. దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. థాయ్‌లాండ్ చోనుబురి జిల్లా బాంగ్ లమంగ్‌లోని ఆసియా పట్టాయా హోటల్ హోటల్ వద్ద పెద్ద ఎత్తున్న గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నారని గోవా నుంచి ఓ వ్యక్తి, థాయ్ పోలీసులకు సమాచారం అందించారు. ఆ సమాచారం ఆధారంగా రైడ్ నిర్వహించారు అక్కడి పోలీసులు. పోలీసులను చూడగానే అక్కడున్నవాళ్లంతా పరుగులు అందుకున్నారు. అయితే సకాలంలో స్పందించిన పోలీసులు వాళ్లను తప్పించుకోనివ్వలేదు. మొత్తం 93 మందితో కూడిన ముఠాను థాయ్‌లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. చివరికి.. ఆ ముఠాకు బాస్ చికోటి ప్రవీణ్‌గా తేలింది. ప్రభుత్వ ఉద్యోగులు కూడా! మొత్తం 93 మందిలో 80 మంది భారతీయులే ఉన్నారు. వాళ్లను స్వయంగా వెంటపెట్టుకుని మరీ థాయ్‌లాండ్‌కు తీసుకెళ్లిన చికోటి.. వాళ్లతో ఆటాడిస్తూ వస్తున్నాడు. చివరికి పక్కా సమాచారంతో ఈ రాకెట్‌ను చేధించారు థాయ్ పోలీసులు. అయితే.. అరెస్ట్ అయిన వాళ్లలో హైదరాబాద్‌కు చెందిన పలువురు వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు, పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. మెదక్ డీసీసీబీ చైర్మన్.. బీఆర్ఎస్ నేత చిట్టి దేవేందర్‌రెడ్డితో పాటు ఇసుక వ్యాపారి సాగర్, మరికొందరు వ్యాపార ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లేకాకుండా గాజులరామారం వీఆర్ఏ వాసు సైతం అరెస్ట్ అయిన వాళ్లలో ఉన్నాడు. గత నెల 27వ తేదీ నుంచి థాయ్‌లాండ్ వెళ్లి క్యాసినో ఆడుతున్నాడు వాసు. అయితే.. అనుమతి లేకుండా థాయ్‌లాండ్ వెళ్లిన వాసును తాజాగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు కలెక్టర్. వాసుతో పాటు వెళ్లిన వర్మ, యాన్సాగర్ అనే ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యారు. క్యాసినోకు ఫైనాన్స్ చేసిన వినోద్‌రెడ్డితోపాటు చికోటి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి, తిరుమలరావు, బిల్డర్ మధు అరెస్ట్ అయ్యారు. ప్రముఖ ట్రావెల్స్ ఓనర్‌ను కూడా థాయ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ పేరు బయటకు రావాల్సి ఉంది. ఆమె సహకారం.. భారీగా వసూళ్లు అక్రమంగా క్యాసినో నిర్వహణ కోసం ఫేమస్ పట్టాయా హోటల్‌ను ఎంచుకున్నాడు చికోటి. ఈ వ్యవహారంలో సితార్నన్ కెల్వెల్కర్ అనే మహిళ చికోటికి కుడి భుజంగా వ్యవహరించిందని పోలీసులు నిర్ధారించారు. ఫకిన్ అనే థాయ్ వ్యక్తిని నియమించుకుని మరీ గ్యాంబ్లింగ్ వ్యవహారం ఆమె నడిపించిదట. ఇక గ్యాంబ్లింగ్ నిర్వహణ కోసం ఇల్లీగల్ మైగ్రేంట్ వర్కర్స్‌ను సైతం చికోటి ఉపయోగించినట్లు తెలిసింది. పట్టాయాలో గ్యాంబ్లింగ్ వ్యవహారంపై దాడి నిర్వహించిన థాయ్ పోలీసులు.. అక్కడి సెటప్ చూసి ఆశ్చర్యపోయారు. సుమారు రూ.20 కోట్లు విలువ చేసే ఇండియన్ కరెన్సీతో పాటు కోట్లు విలువ చేసే గేమింగ్ చిప్స్‌ను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆట ఆడేందుకు ఒక్కో భారతీయుడి నుంచి అక్కడ కరెన్సీ ప్రకారం 50 వేల బాట్స్(మన కరెన్సీలో లక్షా ఇరవై వేల రూపాయల దాకా..) చికోటి వసూలు చేసినట్లు తెలుస్తోంది. సదరు హోటల్లో కన్వెన్షన్ హాల్‌ను క్యాసినోగా మార్చేసిన చికోటి.. నాలుగు బక్కరాట్, మూడు బ్లాక్‌జాక్ టేబుల్స్ ఏర్పాటు చేయించాడు. అక్కడి గేమింగ్‌ను సీసీ కెమెరాల ద్వారా హైదరాబాద్‌కు లైవ్ రికార్డింగ్ కనెక్ట్ చేశాడని థాయ్ పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన చికోటి ఇప్పటికే ఈడీ నుంచి ఫెమా దర్యాప్తును ఎదుర్కొంటున్నాడు. భారత్‌తోపాటు నేపాల్లోనూ క్యాసినో నిర్వహణకుగానూ.. ఫెమా నిబంధనలు ఉల్లంఘించి ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు ఈడీ అభియోగాలు నమోదు చేసింది. ఇదీ చదవండి: కేంద్రం తీరుపై హరీష్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు -
అందుకే నన్ను టార్గెట్ చేస్తున్నారు: చికోటి ప్రవీణ్ షాకింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తన కారు చోరీ సాధారణ దొంగతనం కాదని, తనకు కేసీనో ఇండస్ట్రీలోని ప్రత్యర్ధుల నుండి ప్రాణహాని ఉందని కేసినో కింగ్ చికోటి ప్రవీణ్ అన్నారు. బుధవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ, కొంత కాలంగా రెక్కి నిర్వహిస్తున్నారని, పోలీసులు విచారణ జరిపి సెక్యూరిటీ పెంచాలని కోరారు. ‘‘నేను రాజకీయాల్లోకి వస్తునాన్నని తెలిసి టార్గెట్ చేశారు. ఈడీ విచారణ మొదలైనప్పటి నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈడీ విచారణ దర్యాప్తులో ఉందన్నారు. కేసీనో నిర్వహిస్తున్నానని, అది తన ప్రొఫెషన్ అన్న చికోటి.. ప్రభుత్వానికి టాక్స్‌లు చెల్లించి లీగల్ ఉన్న దగ్గరే కేసీనో నడుపుతున్నానన్నారు. హిందూత్వం కోసం కేసీనోను వదులుకోవడానికి తాను సిద్ధమని, అవకాశం ఉంటే రాజకీయాల్లోకి రావడానికి రెడీ అని చికోటి ప్రవీణ్ అన్నారు. కాగా, చీకోటి ప్రవీణ్ కారు చోరీకి గురైంది. సైదాబాద్ ఇంట్లో కారును దుండగులు దొంగిలించారు. ఇన్నోవా కార్ కీస్ వెతికి కారుతో పరారయ్యారు. సైదాబాద్ పీఎస్‌లో చికోటి ప్రవీణ్ ఫిర్యాదు చేశారు. సీసీటీవీ కెమెరాలో చోరీ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. చదవండి: ఉపాధ్యాయుల వివాహేతర సంబంధం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త -
కంబోడియా క్యాసినోలో భారీ అగ్ని ప్రమాదం
-
క్యాసినో హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. 19 మంది సజీవ దహనం..
దక్షిణ ఆసియా దేశం కంబోడియాలోని ఓ క్యాసినో హోటల్లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ విషాద ఘటనలో 19 మంది సజీవదహనమయ్యారు. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. పయోపెట్లోని గ్రాండ్ డైమెండ్ హోటల్లో ఈ ప్రమాదం జరిగింది. అగ్నీ కీలక భారీగా ఎగిసిపడ్డాయి. వందల మంది అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నప్పటికీ మంటలు ఆర్పేందుకు రెండు గంటలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ప్రమాద సమయంలో మొత్తం 400 మంది క్యాసినోలో ఉన్నారు. అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే వారంతా భయంతో పరుగులు తీశారు. కొందరైతే అగ్నిమాపక సిబ్బంది కాపాడేందుకు వెళ్తున్నా ప్రాణభయంతో ఐదో అంతస్తు నుంచి కిందకు దూకేశారు. ప్రమాద సమయంలో విదేశీయులు కూడా లోపల ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 360 మంది అత్యవసర సిబ్బంది, 11 ఫైరింజన్లు సహాయక చర్యలు చేపట్టాయి. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అయితే న్యూఇయర్ సందర్భంగా భారీ విద్యుత్ దీపాల అలంకరణ చేపట్టడం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. చదవండి: Viral: జారిపోతున్న కార్లు.. అమెరికా మంచు తుఫాన్ వీడియోలు వైరల్.. -
క్యాసినో కేసు: ఈడీ విచారణకు మంత్రి తలసాని పీఏ హాజరు
సాక్షి, హైదరాబాద్: చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా.. మంత్రి తలసాని యాదవ్ పీఏ అశోక్.. ఇవాళ(సోమవారం) ఈడీ ఎదుట హాజరయ్యాడు. ఈ వ్యవహారానికి సంబంధించి.. అశోక్‌ను సుదీర్ఘంగా ఈడీ విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఇంతకు ముందు చీకోటితో లింకులున్నాయనే కోణంలో తలసాని సోదరులు మహేష్ యాదవ్, ధర్మేంధర్ యాదవ్‌లను సుదీర్ఘంగా ప్రశ్నించింది ఈడీ. అలాగే.. ఎమ్మెల్సీ రమణను సైతం విచారించింది. క్యాసినో కేసుకు సంబంధించి.. ట్రావెల్ ఏజెన్సీ ద్వారా పలువురికి ఇదివరకే నోటీసులు జారీ చేసింది ఈడీ. ఆ లిస్ట్‌లో ఉన్న మరికొందరిని త్వరలో ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
కేసినోపై ఈడీ దూకుడు
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో కేసినో ఆడిన వ్యక్తుల విచారణ పర్వంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచింది. వ్యాపారవేత్త బుచ్చిరెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) హరీశ్ సోమవారం ఈడీ ఎదుట హాజరయ్యారు. బుచ్చిరెడ్డి ఉదయం ఈడీ ఎదుట హాజరయ్యారు. విచారణ సమయంలో బ్యాంకు లావాదేవీల రికార్డులు అందించాల్సిన ఆయన సరైన పత్రాలు లేకుండా రావడంతో ఆరేళ్ల బ్యాంకు లావాదేవీలు తీసుకుని రావాలని అధికారులు ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసినోలో మనీలాండరింగ్‌కు, హవాలాకు అవకాశం లేదని చెప్పారు. కేసినోలో తనకు 5% వాటా ఉందన్న బుచ్చిరెడ్డి జనవరిలో నేపాల్ వెళ్లినట్లు, తనతోపాటు మరో పది మంది వచ్చినట్లు వివరించారు. కేసినో ఆడటానికి వెళ్లే సమయంలో తమ వద్ద రూ.15 వేలకు మించి ఎక్కువ డబ్బు తీసుకెళ్లడానికి వీల్లేదన్నారు. డబ్బంతా ఇక్కడే డిపాజిట్ చేస్తామని, అక్కడ కేసినోలో గెలిచిన వారికి ఇక్కడకు ఇచ్చిన తర్వాతే డబ్బు చెల్లిస్తారని, ఇందులో మనీలాండరింగ్‌కు అవకాశమే లేదని చెప్పారు. అనంతరం బ్యాంకు స్టేట్మెంట్లతో వచ్చిన బుచ్చిరెడ్డిని రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ప్రశ్నించారు. కేసినోలో భాగస్వామ్యం, నేపాల్, గుడివాడ కేసినోలకు సంబంధించి ప్రశ్నించినట్లు సమాచారం. బుధవారం కూడా విచారణకు హాజరుకావాలని అధికారులు ఆదేశించారు. కాగా హరీశ్‌ను అధికారులు 7 గంటలపాటు ప్రశ్నించారు. బ్యాంకు లావాదేవీల స్టేట్మెంట్లతోపాటు ఆయన కాల్‌డేటాపై కూడా అధికారులు విచారణ చేసినట్లు సమాచారం. కేసినో అడటానికి ఎన్నిసార్లు వెళ్లావు.? డబ్బెలా చెల్లించావు..? ఎవరికి చెల్లించావు.? ఎంత మొత్తం చెల్లించావు.? మీతో పాటు వచ్చిన వారు ఇంకెవరు ఉన్నారు?.. తదితర అంశాలపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదిలా ఉండగా, కేసినోల కేసులో నోటీసులు అందుకున్న మెదక్ డీసీసీ బ్యాంక్ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి ఈడీ ఎదుట హాజరుకాలేదని సమాచారం. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణకు నోటీసులిచ్చిన సమయంలోనే దేవేందర్‌రెడ్డికి నోటీసులు జారీ చేసినా.. ఆయన ఇంకా విచారణకు హాజరుకాకపోవడం గమనార్హం. ఈ కేసులో ఇప్పటి వరకు మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సోదరులు మహేష్, ధర్మేంద్ర, ఊర్వశీ బార్ యజమాని యుగంధర్‌ను విచారించారు. గ్రానైట్ వ్యాపారులు కూడా.. ప్రభుత్వానికి సీనరేజ్ ఎగ్గొట్టి.. నిబంధనలకు విరుద్ధంగా విదేశాలకు గ్రానైట్ ఎగుమతి చేసిన వ్యాపారులను కూడా ఈడీ అధికారులు ఈరోజు విచారించినట్లు సమాచారం. అనుమతించిన పరిమాణం కంటే ఎక్కువ మొత్తాన్ని విదేశాలకు పోర్టుల ద్వారా ఎగుమతి చేసిన వ్యాపారులు అక్కడ నుంచి హవాలా రూపంలో డబ్బు తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి. 2012–13లో రాష్ట్ర విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి దాదాపు ప్రభుత్వానికి రూ.124 కోట్ల సీనరేజి చెల్లింపులు ఎగ్గొట్టారని తేల్చారు. సీనరేజి చట్టం ప్రకారం.. ఎగ్గొట్టిన మొత్తానికి ఐదు రెట్లు జరిమానా, వడ్డీలు కలిపి మొత్తం రూ.748 కోట్లు చెల్లించాలని అప్పట్లోనే వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా కేసులు నమోదు చేసిన ఈడీ ఇటీవల మళ్లీ గ్రానైట్ వ్యాపారుల ఇళ్లలో సోదాలు నిర్వహించింది. వారికి నోటీసులు కూడా ఇచ్చి విచారణకు హాజరుకావాలని ఆదేశించిన విషయం విదితమే. ఈడీ అధికారుల ఆదేశాలతోనే పలు కంపెనీల డైరెక్టర్లు హాజరైనట్లు తెలిసింది. ఈడీ ఆఫీస్‌లో బుచ్చిరెడ్డి, హరీశ్ -
కేసినో వ్యవహారంలో ఈడీ విచారణ
సాక్షి, హైదరాబాద్: విదేశాలకు తీసుకెళ్లి కేసినోలు ఆడించిన చీకోటి ప్రవీణ్‌కుమార్ కేసుకు సంబంధించి పూర్తిస్థాయిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కూపీ లాగు తోంది. ఫెమా నిబంధనల ఉల్లంఘన, మనీ లాండరింగ్, హవాలా లావాదేవీలు తదితర అంశాలు ఇందులో ముడిపడి ఉన్న నేపథ్యంలో ఈడీ అధికారులు ఈ కేసినోలో పాలుపంచుకున్న వారందరికీ నోటీసులు జారీ చేసి క్షుణ్ణంగా విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. ఇదివరకే నోటీసులు అందుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ శుక్రవారం ఈడీ ఎదుట హాజరయ్యారు. తన బ్యాంకు లావాదేవీల పత్రాలతో వచ్చిన రమణ తాను కేసినోలో పాలు పంచుకోలేదని స్పష్టం చేసినట్లు సమాచారం. నేపాల్‌లోని డాడీ గ్యాంగ్ కేసినోకు సంబంధించి తనకు ఆహ్వానం అందిన విషయం వాస్తవమే అయినా.. తాను వ్యక్తిగత కారణాలతో హాజరుకాలేదని చెప్పినట్లు తెలిసింది. ఈడీ అధికారులు మాత్రం నేపాల్‌కు వెళ్లడానికి తీసుకున్న విమాన టికెట్ల ఆధారంగా ఆయనను ప్రశ్నించినట్లు చెబుతున్నారు. ఉదయం పది గంటల సమయంలోనే రమణ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. బ్యాంకు లావాదేవీల పత్రాలను అధికారులకు అందించినట్లు సమాచారం. మూడంతస్తులు మెట్లు ఎక్కి వెళ్లిన ఆయన.. ఈడీ అధికారులు ప్రశ్నలు సంధిస్తున్న సమయంలో ఘగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురయ్యారు. దీనితో అధికారులు ఆయనను సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. మంత్రి తలసాని పీఏకు కూడా .. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పీఏ హరీశ్‌ను విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల వ్యవహారం ఇంకా ఎక్కడి దాకా వెళ్తుందోనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కేసినో వ్యవహారంలో మొత్తం 18 మంది రాజకీయ నేతలకు సంబంధం ఉందని అధికారులు గుర్తించినట్లు సమాచారం. వీరందరికీ నోటీసులు జారీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. చీకోటి ప్రవీణ్‌కుమార్ తన సన్నిహితుడు మాధవరెడ్డితో జరిపిన సంభాషణలో బయటపడిన వివరాలు, నేపాల్, ఇండోనేషియా, శ్రీలంక, గోవాకు కేసినో ఆడటానికి విమానాల్లో వెళ్లిన టికెట్ల ఆధారంగా వీరిని ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే చీకోటి ప్రవీణ్‌కుమార్, మాధవరెడ్డిలతోపాటు తలసాని సోదరులు మహేశ్, ధర్మేందర్, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, ఊర్వశీ బార్ యజమాని యుగంధరను ప్రశ్నించిన విషయం విదితమే. మెదక్ డీసీసీబీ చైర్మన్ దేవందర్రెడ్డిని కూడా విచారించనున్నారు. -
చికోటి ప్రవీణ్ క్యాసినో కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం
-
క్యాసినో వ్యవహారం.. చికోటి పొలిటికల్ లింకుల్లో టెన్షన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు. రాజకీయ వేడిని పెంచుతున్నాయి. విదేశాల్లో క్యాసినో అక్రమ నిర్వహణ వ్యవహారంపై దర్యాప్తు ముమ్మరం చేసింది ఈడీ. ఈ క్రమంలో.. చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో నోటీసులు అందుకున్న నేతల్లో వణుకు మొదలైంది. ఇప్పటికే మంత్రి తలసాని సోదరులు మహేష్, ధర్మేంద్రలను సుదీర్ఘంగా ప్రశ్నించారు ఈడీ అధికారులు. క్యాసినో నిర్వహణ, ఆర్థిక లావాదేవీలు, ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘనలు, మనీలాండరింగ్, హవాలా చెల్లింపులపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. శుక్రవారం వీళ్లిద్దరినీ మరోసారి విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక చీకోటి ప్రవీణ్, ఆయన ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ రికార్డులను పరిశీలించిన ఈడీ అధికారులు ఈ కేసీనో వ్యవహారంలో ఎవరెవరూ ఉన్నారన్న పూర్తి సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. ట్రావెల్ ఏజెన్సీల ద్వారా ఫ్లయిట్ టికెట్ బుకింగ్ వివరాలు సేకరించింది. దీనిలో దాదాపు వంద మంది క్యాసినో కస్టమర్లు ఉన్నట్లు గుర్తించి.. ఆ మేరకు జాబితా సిద్ధం చేసినట్లు తెలిసింది. అంతేకాదు.. క్యాసినో వ్యవహారంతో సంబంధమున్న వారికి నోటీసులు ఇవ్వడం ప్రారంభించింది. అందులో భాగంగానే శుక్రవారం విచారణకు హాజరుకావాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ, మెదక్ డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌రెడ్డిలకు సైతం ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో చికోటి ప్రవీణ్‌తో సంబంధాలు ఉన్న రాజకీయ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఇదీ చదవండి: సాఫ్ట్వేర్ కొలువు.. ఇక సో ఈజీ! -
‘చీకోటి’ కేసులో ఈడీ దూకుడు.. ఎమ్మెల్సీ రమణకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో కేసినో వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచింది. ప్రత్యేక విమానాల్లో శ్రీలంక, నేపాల్, ఇండోనేషియా తీసుకెళ్లి అక్కడ కేసినో ఆడించిన వ్యవహారంలో ఇప్పటికే చీకోటి ప్రవీణ్‌పై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సోదరులు మహేశ్, ధర్మేందర్ సంబంధాలపై ఈడీ బుధవారం ప్రశ్నించింది. చీకోటి నిర్వహించిన ఈ కేసీనోలకు వీరు కూడా హాజరయ్యారన్న సమాచారం మేరకు అధికారుల వారి నుంచి కూపీ లాగుతున్నారు. విదేశాల్లో కేసినో నిర్వహణ, ఆర్థిక లావాదేవీలు, మనీ లాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనలపై వారిపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. ఇక్కడ కరెన్సీని విదేశాలకు హవాలా ద్వారా చేరవేసి, అక్కడ కరెన్సీ తీసుకున్నారా? నిబంధనల ప్రకారం మార్పిడి చేశారా?.. ఇలా పలు అంశాలపై మంత్రి సోదరులను ప్రశ్నించినట్లు తెలిసింది. ట్రావెల్ ఏజెన్సీ ద్వారా జరిగిన విదేశీ ప్రయాణాల విమాన టికెట్ల బుకింగ్ వ్యవహారాలనూ ఈడీ సేకరించినట్లు చెబుతున్నారు. వీరిని గురువారం కూడా మరోసారి విచారించనున్నట్లు తెలిసింది. చీకోటి ప్రవీణ్, ఆయన ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ రికార్డులను పరిశీలించిన ఈడీ అధికారులు ఈ కేసీనో వ్యవహారంలో ఎవరెవరూ ఉన్నారన్న పూర్తి సమాచారాన్ని రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. దీనిలో దాదాపు వంద మంది వరకు ఉన్నట్లు గుర్తించి.. ఆ మేరకు జాబితా సిద్ధం చేసినట్లు తెలిసింది. కేసీనోలతో సంబంధమున్న వారికి నోటీసులు ఇవ్వడం ప్రారంభించింది. అందులో భాగంగానే శుక్రవారం విచారణకు హాజరుకావాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ, మెదక్ డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇదీ చదవండి: కేసీఆర్ కాళ్లుమొక్కిన ఉన్నతాధికారి.. ఎమ్మెల్యే టిక్కెట్ కోసమేనా! -
చికోటి ప్రవీణ్ క్యాసినో కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం
-
క్యాసినో వ్యవహారం.. ఈడీ ముందుకు తలసాని సోదరులు
సాక్షి, హైదరాబాద్: చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఈడీ మళ్లీ విచారణ షురూ చేసింది. హవాలా లావాదేవీలపై దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే చీకోటి ప్రవీణను పలుమార్లు విచారించిన ఈడీ.. ప్రస్తుతం ఈ కేసులో పలువురు ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్సీ ఎల్ రమణ, మెదక్ డీసీసీబీ చైర్మన్ దేవేందర్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. చీకటితో కలిసి నేపాల్‌కు వెళ్లిన ప్రముఖులను విచారించనుంది. వీరితోపాటు మంత్రి తలసాని శ్రీనివాస్ సోదరులు మహేష్, ధర్మేందర్ యాదవ్‌కు నోటీసులు అందగా.. బుధవారం వారు ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.. మనీలాండరింగ్, హవాలా వ్యవహారంలో ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. చీకటితో కలిసి తలసాని మహేష్, ధర్మేందర్ యాదవ్ విదేశాలకు వెళ్లిన్నట్లు గుర్తించారు. ఎనిమిది గంటలుగా తలసాని సోదరులను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. విదేశాల్లో కేసినో నిర్వహణ, ఆర్థిక లావాదేవీలపై ఈడీ ప్రశ్నిస్తోంది. ఫెమా యాక్ట్ నిబంధనలు, మనీ ల్యాండరింగ్‌పై ఈడీ కూపీ లాగుతోంది. హవాలా చెల్లింపులపై కూడా ఈడీ ప్రశ్నిస్తోంది. ఇప్పటికే మరికొందరికి నోటీసులు ఇచ్చిన ఈడీ.. సుమారు వంద మంది కేసినో కస్టమర్లను చీకోటి ప్రవీణ్, మాధవ్ రెడ్డిల కాల్ డేటా ఆధారంగా ఈడీ వివరాలు సేకరించింది. ట్రావెల్ ఏజెన్సీ ద్వారా ఫ్లైట్స్ టికెట్స్ బుకింగ్స్ వివరాలు ఈడీ సేకరించింది. చదవండి: CM KCR: కేంద్రం టార్గెట్‌గా సీఎం కేసీఆర్ కొత్త వ్యూహం! -
క్యాసినో కింగ్ చికోటితో ఆర్జీవీ భేటీ.. త్వరలో సినిమా?
రామ్‌గోపాల్ వర్మ.. నిత్యం ఏదో ఒక వివాదానికి పురుడు పోస్తూ జనం నోళ్లలో నానే వ్యక్తి. చికోటి ప్రవీణ్.. నిన్న మొన్నటి దాకా కేసులంటూ స్టేషన్ల చుట్టూ తిరిగిన వ్యక్తి. ఈ ఇద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది? అది కూడా నగరానికి దూరంగా ఫాం హౌజ్ లో సిట్టింగ్ వేస్తే జరిగే చర్చ ఏంటీ? క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్‌కుమార్‌తో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భేటీ అయ్యాడు. చికోటీ ప్రవీణ్ కుమార్ ఫాంహౌజ్‌కి వెళ్లి మరీ ఆయనను కలిశాడు. ఈ సందర్భంగా చికోటీ ఫాంహౌజ్‌లో ఉన్న జంతువును సందర్శించాడు ఆర్జీవీ. ఈ విషయాన్ని ట్వీటర్ వేదికగా తెలియజేస్తూ.. ‘వైల్డ్ మ్యాన్ చికోటి ప్రవీణ్‌తో కలిసి అతని వైల్డ్ పాంహౌజ్ని సందర్శించాను. అతని అన్యదేశ అడవి జంతువుల సేకరణ చాలా ఆకట్టుకుంది’అని ఆర్జీవీ చెప్పుకొచ్చాడు. An IGUANA in Chikoti Praveen’s hands ..He treats it like his own baby 🙏 pic.twitter.com/KjGhqixTDv — Ram Gopal Varma (@RGVzoomin) November 2, 2022 కాగా ఇటీవల క్యాసినో వ్యవహారంతో పాటు హవాలా రూపంలో నగదు బదిలీపై చీకొటి ప్రవీన్ ను ఈడీ అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఆర్జీవీ అతన్ని కలవడంతో సర్వాత్రా అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. త్వరలోనే చికోటిపై ఆర్జీవీ సినిమా చేయనున్నాడా? అని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. మరి వారిద్దరు ఏం చర్చించారు? సినిమా గురించా?, క్రైం గురించా? లేక జరిగిన క్రైంపై సినిమా తీయడం గురించా? అనేది తెలియాలంటే ఆర్జీవీ నుంచి మరో ట్విట్ వచ్చే వరకు ఆగాల్సిందే. Chikoti Praveen showing off his beautiful OSTRICH ..THEY LOVE EACH OTHER 💪💪💪 Never seen a man who’s more passionate about wild animals than CHIKOTI PRAVEEN 👌 pic.twitter.com/pZjgojtHI1 — Ram Gopal Varma (@RGVzoomin) November 2, 2022 -
చీకోటితో ఏమిటి సంబంధం?
సాక్షి, హైదరాబాద్: క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్‌కుమార్ వ్యవహారంలో మనీలాండరింగ్, ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి వచ్చిన మంచిరెడ్డిని అధికారులు రాత్రి వరకు ప్రశ్నించారు. చీకోటితో ఏమిటి సంబంధం? మనీలాండరింగ్‌కు పాల్పడ్డారా? తరలించిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకోసం తరలించాల్సి వచ్చింది? అన్న అంశాలపై స్టేట్మెంట్ రికార్డు చేసినట్టు తెలిసింది. చీకోటితో ఆయన కుటుంబసభ్యులకున్న ఆర్థిక లావాదేవీలపైనా ప్రశ్నించినట్టు సమాచారం. కాగా, మంచిరెడ్డిని 9 గంటల పాటు విచారించి ఇంటికి పంపించిన ఈడీ అధికారులు, బుధవారం కూడా విచారణకు హాజరు కావాలని సూచించారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘించి.. క్యాసినో వ్యవహారంలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారంటూ చీకోటిని రెండు నెలల క్రితం ఈడీ ప్రశ్నించింది. ఆయనతో సంబంధాలున్నట్టుగా అనుమానాలున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను సైతం విచారించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా చీకోటితో 2015 నుంచి మంచిరెడ్డికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. 2015–16లో ఇండోనేసియాలోని పెట్టుబడులు పెట్టేందుకు చీకోటి నెట్వర్క్ ద్వారా మంచిరెడ్డి భారీగా డబ్బును హవాలా రూపంలో తరలించినట్టు అనుమానిస్తోంది. ఇందులో ఫెమా నిబంధనల ఉల్లంఘన చోటు చేసుకున్నట్టు గుర్తించింది. ఈ నేపథ్యంలోనే కిషన్‌రెడ్డిని ఈడీ ప్రశ్నించినట్టు తెలిసింది. క్యాసినోల్లోనూ మంచిరెడ్డి పెట్టుబడులు క్యాసినోలోనూ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి లావాదేవీలున్నట్టుగా ఈడీ కీలక ఆధారాలు గుర్తించింది. ఇండోనేసియాలోని బాలి, నేపాల్, గోవాలోని క్యాసినోల్లో చీకోటితో పాటు మంచిరెడ్డి కొంతమేర పెట్టుబడి పెట్టినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. అదే సమయంలో కిషన్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబీకుల్లో ఒకరికి చీకోటి ప్రవీణ్‌తో ఆర్థిక లావాదేవీలున్న విషయాన్ని దర్యాప్తు అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా మంచిరెడ్డిని ఈడీ అధికారులు విచారించినట్టు తెలిసింది. ఇలావుండగా మంచిరెడ్డి తర్వాత జాబితాలో ఎవరున్నారన్నదానిపై చర్చ జరుగుతోంది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ మంత్రికి ఈడీ తాఖీదులు తప్పవని తెలుస్తోంది. -
చైనా కంపెనీకి అమ్మేశారు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉపాధి కోసం వెళ్లి కాంబోడియాలో చిక్కుకున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువకుల విషయంలో కొత్త కోణం వెలుగుచూసింది. మంచి ఉద్యోగం, వీసా, దండిగా టిప్పులు వస్తాయని ఆశచూపిన ఏజెంట్లు.. మరో ఏజెంట్‌కు అప్పగించారు.. ఆ ఏజెంట్ యువకులను కాంబోడియాలో చైనాకు చెందిన కేసినో నిర్వాహకులకు అమ్మేశాడు. దీనిపై బాధితుల కుటుంబ సభ్యులు సోమవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అసలు ఏం జరిగింది? షాబాజ్‌ఖాన్ (మానకొండూరు), షారూఖ్ ఖాన్ (హుస్సేనీపుర, కరీంనగర్), హజీబాబా సయ్యద్ (శాత్రాజ్పల్లి, సిరిసిల్ల), నవీద్ అబ్దుల్ (సిరిసిల్ల), సలీం మహమ్మద్ (శాంతినగర్, చింతకుంట) అనే యువకులు కరీంనగర్ గాంధీనగర్‌లో ఉన్న ఇండో అరబ్ ఓవర్సీస్ కన్సల్టెన్సీని వేర్వేరుగా సంప్రదించారు. విదేశాల్లో ఉపాధి అవకాశాల కోసం ఆరా తీశారు. కన్సల్టెన్సీ ఏజెంట్లు మేనాజ్ అలీ, అబ్దుల్ రహీం వారికి కాంబోడియా వీసాలు ఉన్నాయని, తలా రూ.రెండు లక్షలు చెల్లిస్తే పంపుతామని చెప్పారు. కేసినోలో కంప్యూటర్ ఉద్యోగమని, రోజూ టిప్పులు కూడా వస్తాయని ఆశ చూపారు. ఆ యువకులు దొరికినకాడల్లా అప్పు చేసి మేనాజ్, అబ్దుల్ రహీంలకు డబ్బులు ఇచ్చారు. ఏజెంట్లు ఈ ఐదుగురు యువకులను ఆగస్టు చివరివారంలో ఢిల్లీకి తీసుకెళ్లి అబ్దుల్లా అనే మరో ఏజెంటుకు అప్పగించారు. అబ్దుల్లా వారిని విమానంలో బ్యాంకాక్‌కు, అక్కడి నుంచి బస్సులో కాంబోడియాకు చేర్చాడు. అక్కడ కేసినో నిర్వహిస్తున్న చైనీయులకు అప్పగించాడు. ప్రతిఫలంగా ఒక్కో యువకుడికి 2,700 డాలర్ల చొప్పున తీసుకుని వెళ్లిపోయాడు. కేసినో నిర్వాహకులు మూడు రోజుల పాటు యువకులకు శిక్షణ ఇచ్చి.. క్రిప్టో కరెన్సీ, క్రెడిట్ కార్డు, హనీ ట్రాప్ వంటి పనులు చేయాలన్నారు. ఆ పని చేయమనడంతో బంధించారు. తిండి పెట్టడం మానేశారు. తాము ఇచ్చిన మేర సొమ్ము చెల్లిస్తేనే వదిలిపెడతామన్నారు. తమను రక్షించకుంటే ఆకలితో చచ్చిపోయేలా ఉన్నామంటూ ఆ యువకులు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి కన్నీళ్లు పెట్టుకున్నారు. సోమవారం బాధిత కుటుంబ సభ్యులు కరీంనగర్ సీపీ సత్యనారాయణను కలిసి ఫిర్యాదు చేశారు. వెంటనే టాస్క్‌ఫోర్స్ పోలీసులతో విచారణ చేపడుతున్నట్టు సీపీ తెలిపారు. మరోవైపు ఈ పరిణామాలపై ఇంటెలిజెన్స్ పోలీసులు సీఎంవో కార్యాలయానికి నివేదిక పంపినట్టు తెలిసింది. మా వాళ్లను కాపాడండి ఏజెంట్లు విదేశాలకు వెళితే మంచి జీతం వస్తుందని చెప్పి తమ వారిని అమ్మేశారని షాబాజ్ సోదరుడు అఫ్జల్, నవీద్ సోదరుడు అబ్దుల్ ముహీద్ వాపోయారు. 3 వేల డాలర్లు చెల్లిస్తే వదిలేస్తామంటున్నారని పేర్కొన్నారు. ఏజెంట్లను అడిగితే తమకేం సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారని తెలిపారు. విదేశాంగ శాఖకు బండి సంజయ్ లేఖ కాంబోడియాలో యువకులు చిక్కుకున్న అంశంపై ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ స్పందించారు. ఆ యువకులను దేశానికి రప్పించడానికి తగిన చర్యలు చేపట్టాలని విదేశాంగ మంత్రి జయశంకర్‌కు లేఖ రాశారు. -
వల్లభనేని, కొడాలి పేర్లు చెప్పాలి.. లేకపోతే సుపారీ ఇచ్చి చంపేస్తామంటూ బెదిరింపులు
సాక్షి, హైదరాబాద్: క్యాసినో వ్యవహారంలో, ఈడీ విచారణలో ఏపీకి చెందిన మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేర్లు చెప్పాలని పదేపదే బెదిరింపు ఫోన్‌కాల్స్ వస్తున్నాయని చీకోటి ప్రవీణ్ కుమార్ తెలిపారు. వారి పేర్లు చెప్పకపోతే ఓ ప్రమాదకరమైన వెబ్సైట్ ద్వారా తనని చంపేందుకు సుపారీ ఇస్తున్నట్టు బెదిరిస్తున్నారని చీకోటి ప్రవీణ్ ‘సాక్షి’కి చెప్పారు. బెదిరింపుల వెనక అక్కడి ప్రతిపక్ష పార్టీ ఉందా లేదా ఆ పార్టీ ముసుగులో ఎవరైనా చేస్తున్నారా అన్నది పోలీసుల విచారణలో తేలుతుందన్నారు. తాను రాష్ట్రంలో కాకుండా లీగల్‌గా క్యాసినో ఎక్కడ నడుస్తుందో అక్కడే వ్యాపారం చేస్తున్నట్టు వెల్లడించారు. తనకు వ్యక్తిగతంగా రెండు రాష్ట్రాల్లో చాలామంది రాజకీయ నాయకుల్లో స్నేహితులున్నారని, అలా ఉండటంలో తప్పేంటన్నారు. స్నేహితులుగా ఉన్నంత మాత్రాన వారికి సంబంధంలేని వ్యవహారాల్లో వాళ్ల పేర్లు చెప్పడం పద్ధతి కాదంటూ చీకోటి చెప్పుకొచ్చారు. అదేవిధంగా నేపాల్ క్యాసినో వ్యవహారంలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు తప్ప పెద్దగా ఎవరు రాలేదని, పలువురు సినీ ప్రముఖులకు తాను కోట్ల రూపాయలు చెల్లించినట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని స్పష్టంచేశారు. ఈ లెక్కల వ్యవహారాలు పూర్తిగా ఈడీకి వివరించినట్టు తెలిపారు. తాను చిన్ననాటి నుంచి జంతు ప్రేమికుడినని, కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకునే పలు జంతువులు, పక్షులను పెంచుతున్నట్టు చెప్పారు. ఈడీ విచారణకు తాను పూర్తిగా సహకరిస్తున్నట్టు తెలిపారు. తన భద్రత విషయంలో హైదరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టాలని, లేకపోతే మరోసారి హైకోర్టుకు వెళతానని చెప్పారు. -
నేను ఏ తప్పు చేయలేదు..క్యాసినో లీగల్ : చికోటి ప్రవీణ్
-
గేమింగ్, క్యాసినోలపై జీఎస్టీ ఉంటుందా? లేదా?
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలపై పన్ను పెంచాలన్న ప్రతిపాదనపై రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన ప్యానెల్ తన పని పూర్తి చేసింది. నివేదికను రెండు రోజుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అందించనుంది. ఈ విషయాన్ని అధికార వర్గాలు వెల్లడించాయి. మంత్రుల గ్రూపు సమర్పించే నివేదికపై ఈ నెల చివర్లో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో భేటీ అయ్యే జీఎస్టీ కౌన్సిల్లో నిర్ణయం తీసుకోనున్నారు. చదవండి:Kia Seltos:కియా మరోసారి అదరగొట్టింది,సెల్టోస్ కొత్త రికార్డు గుర్రపు పందేలు, ఆన్లైన్ గేమింగ్, క్యాసినోల స్థూల వ్యాపారంపై 28 శాతం జీఎస్టీ విధించాలని లోగడ మంత్రుల గ్రూపు సిఫారసు చేయడం గమనార్హం. దీన్ని ఆయా పరిశ్రమలు వ్యతిరేకిస్తున్నాయి. క్యాసినోలపై పన్నును 28 శాతానికి పెంచడం పట్ల మరోసారి చర్చించాల్సి ఉందంటూ గోవా కోరింది. దీంతో మరింతగా చర్చించి నివేదిక ఇవ్వాలని మంత్రుల బృందాన్ని జీఎస్టీ కౌన్సిల్ కోరడం గమనార్హం. ఇందులో భాగంగా పరిశ్రమకు చెందిన భాగస్వాములతో మంత్రుల బృందం సమావేశమై వారి అభిప్రాయాలను కూడా తీసుకుంది. చదవండి: Maruti Suzuki Swift S-CNG వచ్చేసింది, ఫీచర్లు చూసి వావ్ అనాల్సిందే! -
అన్నా.. మనల్ని పిలుస్తారే!.. బెంబేలెత్తుతున్న ఎమ్మెల్యేలు, మాజీలు
సాక్షి, హైదరాబాద్: క్యాసినో వ్యవహారంలో హవాలా వ్యవహారం ఇప్పుడు పలువురు రాజకీయ నేతలను, ప్రముఖులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చీకోటి ప్రవీణ్‌కుమార్‌తో సన్నిహితులుగా ఉన్నవారితోపాటు ఆయన కస్టమర్లుగా ఉన్నవారి మెడకు ఈడీ ఉచ్చు బిగిసేలా కనిపిస్తోంది. చీకోటి ప్రవీణ్ వాట్సాప్ ద్వారా సందేశాలు సాగించిన ఎమ్మెల్యేలు, మాజీఎమ్మెల్యేలు, మం్రతుల్లో ఇప్పటికే తీవ్ర చర్చ మొదలైనట్టు తెలుస్తోంది. క్యాసినో హవాలా దందాపై చీకోటి ప్రవీణ్‌తోపాటు మాధవరెడ్డి, సంపత్, గౌరీశంకర్ తదితర నిందితుల నివాసాల్లో సోదాలతోపాటు నాలుగు రోజులపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించింది. అయితే ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చిన సంచలనాత్మకమైన వాట్సాప్ సందేశాలతో ఓ మంత్రితోపాటు పలువురు ఎమ్మెల్యేలకు సంబంధాలున్నాయని ఈడీ బలంగా విశ్వసిస్తోంది. దీనికి తగ్గట్టుగా సాగిన వాట్సాప్ చాట్లను రిట్రీవ్ చేసిన ఈడీ సంబంధిత ప్రముఖులకు శ్రీముఖాలు జారీచేయాలని భావిస్తోంది. ఈడీ నిజంగానే తమను పిలుస్తుందా? పిలిస్తే ఏంటన్న పరిస్థితిపై ఎమ్మెల్యేలు ఒకరికొకరు చర్చించుకుంటున్నట్టు అనుచరుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. చదవండి: (Telangana: డీజీపీ కుర్చీ ఎవరికి?.. రేసులో ఆ ముగ్గురు..!) క్యాసినో.. హవాలా.. ఏం చెప్పాలి ఈడీ పిలిస్తే ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి ప్రశ్నలు సంధించే అవకాశముందనే అంశాలపై లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లతో పలువురు ఎమ్మెల్యేలు చర్చిస్తున్నట్టు తెలిసింది. క్యాసినోకు ఎన్నిసార్లు వెళ్లారు, ప్రవీణ్‌కు అందించిన డిపాజిట్.. అందులో హవాలా వ్యవహారం ఏంటన్న అంశాలను నెమరేసుకుంటున్నట్టు తెలిసింది. డిపాజిట్‌కు పంపిన డబ్బుకు లెక్క చెప్పాల్సి వస్తే ఏం చేయాలన్న దానిపై సీఏలతో చర్చించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే కేవలం క్యాసినోకు వెళ్లినవారిలో పెద్దగా భయం లేకున్నా, క్యాసినో చాటున హవాలా వ్యవహారం సాగించిన వారిలోనే తీవ్ర అలజడి నెలకొన్నట్లు తెలుస్తోంది. హవాలా సాగించే అంత రేంజ్ ఉన్న నేతలు ఎవరన్నదానిపై ప్రస్తుతం రాజకీయంగా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. హవాలా ఆధారాలుంటే.. చీకోటి ప్రవీణ్ ఈడీకి ఏం చెప్పాడు, ఎవరెవరు ఎన్నిసార్లు వచ్చారు, డిపాజిట్ చేసిన మొత్తంలో క్యాసినోకు ఉపయోగించిందెంత, మిగిలిన హవాలా ఎంత అన్న అంశాలపై నేతలు ఆరా తీస్తున్నారు. ఒకవేళ హవాలా వ్యవహారంలో ఈడీకి పక్కగా ఆధారాలు దొరికితే పరిస్థితి ఏంటన్న దానిపైనా నేతలు ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది. పైగా తమను విచారణకు రావాలని నోటీసులిస్తే రాజకీయ భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం ఉంటుందన్న కలవరం కూడా నేతల్లో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఈడీ దాడులపై రాజకీయంగా రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అటు బీజేపీ నేతలు నిత్యం ఈడీ దాడులపై ప్రకటనలు చేస్తుండటం ప్రముఖనేతలకు నిద్ర పట్టకుండా చేస్తున్నట్టు తెలుస్తోంది. కొంతమంది నేతలు చీకోటిని సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నారని, అయితే ఈడీ విచారణలో తెలిపిన అంశాలు ఏమాత్రం బయటకు పొక్కినా చీకోటి ప్రవీణ్‌కు చట్టప్రకారం కొత్త కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని ఆయన తరపు లాయర్లు స్పష్టం చేసినట్టు తెలిసింది. దీంతో క్యాసినో జాబితాలో ఉన్నవారంతా ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. -
చికోటితో కొంతమంది వీఐపీలు చాటింగ్ చేసినట్టు గుర్తింపు
-
‘చీకోటి’ కేసులో ఓ మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలు? వాట్సాప్ చాట్లు వెలుగులోకి
సాక్షి, హైదరాబాద్: క్యాసినోవాలా చీకోటి ప్రవీణ్‌కుమార్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. క్యాసినో వ్యవహారంలో హవాలా ద్వారా డబ్బును నేపాల్‌తోపాటు ఇండోనేసియా తదితర దేశాలకు తరలించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి వాట్సాప్ చాట్లలో ప్రముఖుల జాబితా వెలుగులోకి రావడం సంచలనం రేపుతోంది. ప్రవీణ్ మొబైల్ వాట్సాప్ మెసెంజర్లో తెలంగాణకు చెందిన ఓ మంత్రి, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు క్యాసినో వ్యవహారంలో చేసిన చాటింగ్ కీలకంగా మారినట్లు ఈడీ అధికార వర్గాలు వెల్లడించాయి. జూన్ 10 నుంచి నేపాల్‌లో జరిగిన క్యాసినో వ్యవహారంలో ఎక్కడ, ఎవరికి ఎంత డబ్బు డిపాజిట్ చేయాలనే అంశాలకు సంబంధించి వారి మధ్య జరిగిన చాటింగ్ వివరాలను ఈడీ గుర్తించినట్లు తెలిసింది. ఈ లావాదేవీల వ్యవహారం ఇప్పుడు మంత్రితోపాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేల మెడకు చుట్టుకొనేలా కనిపిస్తోంది. ప్రవీణ్, ఆ నలుగురి మధ్య జరిగిన వాట్సాప్ చాట్లను రిట్రీవ్ చేసిన ఈడీ అధికారులు.. వాటిని తర్జుమా చేసి ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయానికి పంపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వారికి నోటీసులు ఇచ్చేందుకు కేంద్ర కార్యాలయం నుంచి అనుమతి లభిస్తే మంత్రి, ఎమ్మెల్యేలు, వారి సన్నిహితులకు నోటీసులు జారీ చేయనున్నట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ సోమవారంలోగా అనుమతి వస్తే అదేరోజు లేదా మంగళవారం నుంచి ఈడీ ఎదుట హాజరుకావాలని నోటీసులు జారీ చేస్తామని ఈడీ వర్గాలు స్పష్టం చేశాయి. ఓవరాక్షన్‌తో బట్టబయలు... మంత్రితోపాటు ముగ్గురు ఎమ్మెల్యేల వ్యవహారం వారి ఓవరాక్షన్ వల్లే వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. చీకోటి ప్రవీణ్‌కుమార్‌తో ఫొటోలు, వీడియోలు తీసుకున్న ఆయా ప్రముఖులు వాటిని ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్, యూట్యూబ్‌లలో పోస్టు చేయడమే ఈడీకి అధారాలు చిక్కేలా చేసినట్లు తెలుస్తోంది. వీడియో ఫుటేజీల్లో చీకోటితో అత్యంత సన్నిహితంగా వ్యవహరించడం, పుట్టినరోజుతోపాటు ఇతర వేడుకల్లో ఆయనతో కలిసి నృత్యాల వంటి వ్యవహారాలే కొంపముంచినట్లు తెలిసింది. వారి ప్రొఫైళ్లను గుర్తించిన ఈడీ అధికారులు.. చీకోటి మొబైల్ వాట్సాప్ నుంచి డిలీట్ చేసిన డేటాను తిరిగి రిట్రీవ్ చేయడంతో చీకోటికి, ప్రముఖులకు మధ్య జరిగిన సందేశాలు ఏకంగా హవాలా లావాదేవీలను బయటపెట్టినట్లు తెలుస్తోంది. రాజకీయంగా సంచలనమే... ఓ మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలకు ఈడీ నోటీసులు జారీ చేస్తే రాష్ట్రంలో పెను సంచనలమే అవుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చీకోటి వ్యవహారంలో ఇప్పటికే చాలా మంది రాజకీయ ప్రముఖులున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఓ మంత్రితోపాటు ముగ్గురు ఎమ్మెల్యేలకు నోటీసులు వస్తే ప్రభుత్వానికి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈడీ విచారణతో ఆ మంత్రి, ఎమ్మెల్యేలకు ఇబ్బందులు తప్పవన్న వాదన బలంగా వినిపిస్తోంది. -
నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: చికోటి ప్రవీణ్
సాక్షి, హైదరాబాద్: క్యాసినోవాలా చికోటి ప్రవీణ్‌ను నాలుగో రోజు విచారించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. విచారణ అనంతరం బయటకు వచ్చిన ప్రవీణ్.. మీడియాతో మాట్లాడాడు. ఈడీ అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాను. విచారణ అంతా పూర్తి అయిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేస్తా. పనిగట్టుకుని కొంతమంది నాపై దుష్ప్రచారం చేస్తున్నారు అని చికోటి వెల్లడించాడు. ‘సోషల్ మీడియాలో నా పేరుతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ఇదే విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేశాను. నాకు ప్రాణహాని ఉందని నాకు రక్షణ కల్పించాలని హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాను. నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. ఇకపై కూడా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాను. క్యాసినో బిజినెస్ చేసాను. అందులో తప్పేముంది. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. పని గట్టుకొని కొంతమంది నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఈడీ విచారణ పూర్తి అయినా తర్వాత అన్ని వివరాలు వెళ్లాడిస్తా.’ అని తెలిపాడు. ఇదీ చదవండి: ఖాతాలు ఎవరివి.. కాసులు ఎక్కడివి? రెండో రోజు చీకోటిపై ప్రశ్నల వర్షం -
క్యాసినో వ్యవహారంలో ఈడీ సుదీర్ఘ విచారణ
-
ఖాతాలు ఎవరివి.. కాసులు ఎక్కడివి? రెండో రోజు చీకోటిపై ప్రశ్నల వర్షం
సాక్షి, హైదరాబాద్: క్యాసినోవాలా చీకోటి ప్రవీణ్ వ్యవహారంలో ఈడీ విచారణ రెండో రోజూ కొనసా గింది. మంగళవారం ప్రవీణ్‌తోపాటు ఆయన భాగ స్వామి మాధవరెడ్డి కూడా విచారణకు హాజరయ్యా రు. తొలిరోజు విచారణలో భాగంగా ప్రవీణ్ లావా దేవీల్లో కొన్ని విదేశీ ఖాతాలను ఈడీ అధికారులు గుర్తించినట్టు తెలిసింది. హవాలా మార్గంలో ఆ విదేశీ ఖాతాలకు డబ్బు వెళ్లినట్టు గుర్తించిన అధికా రులు.. ఆ కోణంలో ప్రశ్నించినట్టు సమాచారం. ఆ విదేశీ ఖాతాలు ఎవరివి? ప్రవీణ్ ల్యాప్‌ట్యాప్, మొబైల్లోని ఈ–మెయిల్స్, వాట్సాప్ చాటింగ్‌లలో కీలక సమాచారాన్ని ఈడీ అధికారులు గుర్తించారు. ఇందులో విదేశీ ఖాతాల నంబర్లు, వాటికి పంపించిన సొమ్ము లావాదేవీల వివరాలు ఉన్నట్టు తెలిసింది. దీంతో ఆ 18 ఖాతా లెవరివి, హవాలా ద్వారా అంత పెద్ద మొత్తంలో సొమ్మును ఎందుకు తరలించారన్న వివరాలపై ప్రవీణ్‌ను ప్రశ్నించినట్టు తెలిసింది. ఇక నేపాల్, ఇండోనేషియాల్లో క్యాసినో ఆడేందుకు హవాలా మార్గం ద్వారా డబ్బు తరలించడాన్ని ప్రస్తావిస్తూ.. హవాలా కోసం హైదరాబాద్‌లో ఇచ్చిన డబ్బులు ఎక్కడివని ప్రవీణ్‌ను, మాధవరెడ్డిని ఆరా తీసినట్టు సమాచారం. ఒక్క జూన్‌లోనే రూ.40 కోట్లకుపైగా నేపాల్‌కు చేరినట్టు ఈడీ గుర్తించింది. ఆ డబ్బు ఎవరెవరి నుంచి ఎంత మేర తీసుకున్నారు? ఏ హవాలా ఏజెంట్ ద్వారా నేపాల్‌కు చేరవేశారు? అక్కడ ఎవరి ద్వారా తీసు కున్నారన్న వివరాలపై ప్రశ్నించినట్టు తెలిసింది. అయితే క్యాసినో ఆడిన వా రిలో చాలామంది వీఐపీలు ఉండటంతో వారి పేర్లు చెప్పేందుకు ప్రవీణ్, మాధవరెడ్డి భయపడుతున్నారని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు సినీ సెలబ్రిటీలు, ఇతర వీఐపీలు కూడా ఈ జాబితాలో ఉన్నట్టు ఈడీ అనుమానిస్తోంది. ప్రవీణ్ వాట్సాప్ డేటాను బ్యాకప్ చేసి, క్యాసినోల కోసం డబ్బులు ఇచ్చినవారి వివరాలు తేల్చాలని ఈడీ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మీడియాపై రుసరుస.. రెండో రోజు విచారణ కోసం ఈడీ కార్యాలయానికి వచ్చిన ప్రవీణ్ మీడియాపై రుసురుసలాడారు. ఒక్కో మీడియా సంస్థ ఒక్కో రకంగా తనపై ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. కాగా, చీకోటి ప్రవీణ్ వ్యవహారంలో మంత్రి కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్సీ కవిత, చినజీయర్ స్వామిలను కూడా విచారించాలని ఏఐసీసీ సభ్యుడు బక్కా జడ్సన్ మంగళవారం ఈడీకి ఫిర్యాదు చేశారు. -
సోషల్ మీడియాలో ‘చీకోటి’ ట్వీట్స్ హల్చల్!
హైదరాబాద్: క్యాసినో, హవాలా వ్యవహారాలకు సంబంధించి చీకోటి ప్రవీణ్ కేసు సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ చేస్తోంది. ఈ క్రమంలోనే చికోటి ప్రవీణ్ ట్వీట్స్ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చీకోటి ప్రవీణ్ పేరుతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసినట్లు తెలిసింది. @praveenchikotii పేరుతో ట్విట్టర్లో నకిలీ ఖాతాను గుర్తించాడు చీకోటి ప్రవీణ్. వాటి ద్వారా ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నేతలను ప్రవీణ్ బెదిరిస్తున్నట్టు.. ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను సైతం ఆయా ట్వీట్లలో ప్రస్తావిస్తు ఫేక్ పోస్ట్‌లు పెట్టినట్లు సమాచారం. సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు.. సోషల్ మీడియాల్లో ఫేక్ అకౌంట్లపై ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించాడు చీకోటి ప్రవీణ్. తప్పుడు ఫేక్ అకౌంట్లపై చర్యలు తీసుకుంటానని పేర్కొన్నాడు. ఆయా నకిలీ ఖాతాలపై చర్యలు తీసుకోవాలని.. సీసీఎస్ పోలీస్‌లకు ఫిర్యాదు చేశాడు ప్రవీణ్. ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇదీ చదవండి: ‘చీకోటి’ ల్యాప్‌టాప్‌లో ఏముంది?.. ఈడీ ముందుకు ప్రవీణ్ -
హవాలా సొమ్ము ఎవరిది ఎక్కడికి తరలించారు? ఈడీ ప్రశ్నల వర్షం
సాక్షి, హైదరాబాద్: క్యాసినోవాలా చీకోటి ప్రవీణ్ హవాలా మార్గంలో మళ్లించిన సొమ్మెవరిది? అంత మొత్తంలో నగదు ఏ దేశానికి తరలించారన్న వివరాలను రాబట్టేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం అతనితో పాటు మరికొందర్ని ప్రశ్నించింది. ఐదు రోజులక్రితం చీకోటితో పాటు, మాధవరెడ్డి నివాసాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ కీలక ఆధారాలు సేకరించింది. విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో చీకోటితో పాటు మాధవరెడ్డి, బాబులాల్ అగర్వాల్, గౌరీశంకర్, సంపత్ బషీర్‌బాగ్‌లోని కార్యాలయంలో ఈడీ ఎదుట హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన విచారణ అర్ధరాత్రి వరకు కొనసాగింది. క్యాసినో కాకుండా.. విశ్వసనీయ సమాచారం మేరకు.. నేపాల్, ఇండోనేసియా, సింగపూర్, శ్రీలంక తదితర దేశాల్లో క్యాసినో ఆడిస్తూ చేసిన హవాలాతో పాటు మరికొన్ని లావాదేవీలపై చీకోటితో పాటు మాధవరెడ్డిని ఈడీ ప్రశ్నించింది. ఒకేసారి రూ.27 కోట్ల మేర జరిపిన లావాదేవీలు ఎవరికి సంబంధించినవి, అవి క్యాసినో వ్యవçహారంలోనివా? లేక విదేశాలకు తరలించేందుకు ఎవరైనా ఇచ్చిన డబ్బా? అన్న కోణంలో లోతుగా ప్రశ్నించింది. జనవరి నుంచి జూలై వరకు కస్టమర్లను తీసుకెళ్లి క్యాసినో ఆడించగా వచ్చిన డబ్బుతో పాటు ఇతర లావాదేవీలకు సంబంధించిన వివరాలు రాబట్టింది. చిట్‌ఫండ్ డబ్బు ఎక్కడికెళ్లింది? వరంగల్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ చిట్‌ఫండ్ సంస్థకు సంబంధించిన డబ్బును హవాలా ద్వారా ఎక్కడికి మళ్లించారని అడిగింది. ఈ వ్యవహారంతో చిట్‌ఫండ్ యజమానితో పాటు ఉమ్మడి కరీంనగర్‌లోని ఓ నూతన జిల్లా జెడ్పీ చైర్మన్‌కున్న లింకులపై ఆరా తీసింది. ఆ జెడ్పీ చైర్మన్, చిట్‌ఫండ్ యజమాని ఈడీ సోదాలకు ఒక్కరోజు ముందు చీకోటితో ఆయన నివాసంలోనే భేటీ అయినట్టు ఈడీ గుర్తించింది. పెద్ద మొత్తంలో నగదును హైదరాబాద్ నుంచి దుబాయ్‌కి హవాలా ద్వారా మళ్లించినట్టు అనుమానిస్తోంది. ఆ చిట్‌ఫండ్ చాటున జరుగుతున్న చీకటి దందా ఏంటన్న దానిపై ఆరా తీసింది. సంపత్తో డీల్స్ ఏంటి? చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి మొబైల్స్‌లోని వాట్సాప్ మెసెంజర్లలో హవాలా లావాదేవీలకు సంబంధించి కోడ్ భాషల్లో జరిగిన వ్యవహారంపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది. అందులో భాగంగా సంపత్ అనే వ్యక్తితో చాటింగ్‌ను గుర్తించింది. సంపత్, మాధవరెడ్డి, ప్రవీణ్ మధ్య నిత్యం డబ్బు లావాదేవీలకు సంబంధించిన సందేశాలున్నట్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో సంపత్ ఎవరు? అతడితో జరుగుతున్న డీల్ ఏంటన్న దానిపై ఆరా తీసింది. హవాలా కోసం డబ్బును సంపత్‌కు అందించేవారా? లేక సంపత్ కేంద్రంగానే హవాలా జరిగిందా? అన్న వ్యవహారంపై మరింత క్లారిటీ కోసం ఈడీ ఈ ఇద్దరిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. దేశాలు దాటిన మొత్తమెంత? మరోవైపు చీకోటి, సంపత్‌ను ఎదురెదురుగా కూర్చోబెట్టి మరీ ఈడీ విచారించింది. రూ.27 కోట్ల వ్యవహారంతో పాటు క్యాసినోలకు సంబంధించిన డబ్బు ఎవరికిచ్చారు? ఎంత మొత్తంలో హవాలా ద్వారా దేశాలు దాటించారు? తదితర అంశాలపై ఈడీ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ ప్రశ్నించినట్టు తెలిసింది. కాగా గౌరీ శంకర్‌ను మరో ఈడీ అధికారి ప్రశ్నించారు. చీకోటి వ్యవహారాలను దగ్గరుండి చూసుకునే గౌరీ శంకర్‌ను కూడా హవాలా వ్యవహారంపైనే ప్రశ్నించింది. జిగ్రీదోస్త్ బాబులాల్ అగర్వాల్.. క్యాసినోల నిర్వహణతో పాటు పేకాట ఆడించడంలో చీకోటికి కీలక అనుచరుడిగా కొన్నాళ్ల పాటు కొనసాగిన అతని ఆప్తమిత్రుడు బాబులాల్ అగర్వాల్‌ను ఈడీ విచారించడం ఆసక్తికరంగా మారింది. 2017లో ట్యాంక్‌బండ్‌లోని మ్యారియట్ హోటల్లో పేకాట ఆడిస్తుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు చీకోటితో పాటు బాబులాల్‌ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బాబులాల్ ఎక్కడా పెద్దగా కనిపించలేదు. కాగా తాజా కేసులో వెలుగులోకి రావడం, ఈడీ ప్రశ్నించడంతో.. అగర్వాల్ పాత్ర ఉత్కంఠ రేపుతోంది. అగర్వాల్‌కు చాలామంది పారిశ్రామిక వేత్తలు, ప్రముఖులతో మంచి పరిచయాలున్నాయి. అతన్ని ఈడీ ప్రశ్నిస్తుండటంతో వీరందరిలో కలవరం మొదలైనట్టు తెలిసింది. ప్రముఖులకు పారితోషికాలపై దృష్టి చీకోటి, మాధవరెడ్డికి చెందిన 6 బ్యాంకు ఖాతాలను ఈడీ గుర్తించింది. వాటి స్టేట్మెంట్లతో పాటు లాకర్ల వ్యవహారంపై కూడా దృష్టి సారించింది. మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, సినీ సెలబ్రిటీలకు చెల్లించిన పారితోషికాల వ్యవహారంపై కూడా దృష్టి సారించినట్టు తెలిసింది. చీకోటి మొబైల్ వాట్సాప్ సందేశాల ప్రకారం ప్రస్తుతం నలుగురు ప్రముఖులకు నోటీసులు జారీ చేయాలని ఈడీ నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. -
‘చీకోటి’ ల్యాప్‌టాప్‌లో ఏముంది?.. ఈడీ ముందుకు ప్రవీణ్
సాక్షి, హైదరాబాద్: క్యాసినో, హవాలా వ్యవహారాలకు సంబంధించి చికోటి ప్రవీణ్‌ను ఈడీ విచారణ చేస్తోంది. సోమవారం ఉదయం ఈడీ కార్యాలయానికి చేరుకున్న చికోటి.. తన వెంట బ్యాంక్ స్టేట్మెంట్లు, నోటీస్ కాపీతో పాటు న్యాయవాదిని తీసుకొచ్చారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. చదవండి: చీకోటి హవాలా దందాలో మరో నలుగురు చీకోటి ప్రవీణ్ హవాలా దేవీలపై ఈడీ అధికారులు కూపీ లాగుతున్నారు. చికోటి వాట్సాప్ కీలక సమాచారాన్ని ఈడీ సేకరించింది. చీకోటి ఫోన్, ల్యాప్‌ట్యాప్‌ను అధికారులు సీజ్ చేశారు. పెద్ద మొత్తంలో హవాలా జరిగినట్లు ఈడీ గుర్తించింది. సినీ, రాజకీయ నేతలకు చెల్లింపులపై అధికారులు ఆరా తీస్తున్నారు. 10 మంది సినీ ప్రముఖులతో పాటు 20 మంది రాజకీయ నేతలు, 200 మంది కస్టమర్స్ లిస్ట్ ముందుంచి ఈడీ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఫ్లైట్, హోటల్స్ బుకింగ్‌పై కూడా ఈడీ కీలక సమాచారం సేకరించింది. -
నేడు ఈడీ ముందుకు చికోటి ప్రవీణ్
-
ఉమ్మడి మెదక్‌లోనూ ‘చీకోటి’ కార్యకలాపాలు.. లిస్ట్‌లో డీసీసీబీ ఛైర్మన్!
సాక్షి, మెదక్: క్యాసినోవాలాగా పేరుగాంచిన చీకోటి ప్రవీణ్‌కుమార్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ చికోటి కార్యకలాపాలు కొనసాగినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లా నేతలతో చికోటి ప్రవీణ్ కుమార్‌కు సత్సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఈ నెల 19వ తేదీన ఏడుపాయలలో చికోటి ప్రవీణ్ బర్త్‌డే వేడుకలు నిర్వహించారు. హరిత హోటల్లో నిర్వహించిన వేడుకలకు సుమారు 150 మంది ప్రముఖులు హాజరైనట్లు తెలిపింది. జన్మదిన వేడుకల కోసం హరిత హోటల్లో చక్రపాణి పేరుతో 6 గదులు, 2 హాల్స్ బుకింగ్ చేశారు. గోవా టూర్‌తో చీకోటి ప్రవీణ్ కుమార్‌కు మెదక్ జిల్లాలోని ప్రముఖ నేతలు, వ్యాపారులు పరిచయం ఏర్పడినట్లు తెలిసింది. చీకోటితో చీకటి కార్యకలాపాలు సాగిస్తున్నారు. చికోటి లిస్ట్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ సైతం ఉన్నట్లు సమాచారం. చీకోటి కేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రముఖ పేర్లు బయటకు వస్తుండటం కలకలం సృష్టిస్తోంది. ఇదీ చదవండి: చీకోటి హవాలా దందాలో మరో నలుగురు -
TDP-Chikoti Praveen: టీడీపీతో చికోటి ప్రవీణ్‌కు లింకులు!
సాక్షి, అమరావతి: క్యాసినో, హవాలా వ్యవహారాలకు సంబంధించి ఈడీ విచారణ ఎదుర్కొంటున్న చికోటి ప్రవీణ్‌తో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. అతనితో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగే పలువురు టీడీపీ నేతలు ఇక్కడ క్యాసినో ఏర్పాటుకు సైతం సన్నాహాలు చేశారు. కొద్దిరోజుల క్రితం విజయవాడ సమీపంలోని కంకిపాడు వద్ద ఈడుపుగల్లులో టీడీపీకి చెందిన పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ చికోటి ద్వారా ఇందుకు అన్ని ఏర్పాట్లుచేశారు. ఖాళీ వ్యవసాయ భూమిలో బ్యాంకాక్ తరహాలో క్యాసినో సెట్టింగ్ వేయడానికి అవసరమైన సరంజామాను కూడా తీసుకొచ్చారు. కొంత పనికూడా పూర్తయింది. అలాగే, గోవా నుంచి కొందరు మహిళలను కూడా తీసుకొచ్చారు. పేకాట సహా పలు రకాల జూదాలు, మద్యం, డ్యాన్సులు వంటి సకల సౌకర్యాలు అక్కడ ఉంటాయని ప్రచారం చేశారు. సోషల్ మీడియాలోనూ క్యాసినోకు సంబంధించిన వివరాలు, పోస్టర్లూ చక్కర్లు కొట్టాయి. నిర్వాహకులే ప్రచారం కోసం వాటిని విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన వారికి దీని గురించి సమాచారమిచ్చారు. రాజకీయంగా ఇబ్బంది వస్తుందని వెనక్కి.. అయితే, ఈ విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడం.. విజయవాడ, కంకిపాడు పరిసర గ్రామాల్లో విస్తృతంగా చర్చ మొదలవడంతో వెనక్కి తగ్గారు. తానే క్యాసినో ఏర్పాటుకు కారణమని తెలిస్తే రాజకీయంగా ఇబ్బంది వస్తుందని, స్థానికంగా ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదురవుతాయనే భయంతో చివరి నిమిషంలో దాన్ని రద్దుచేసుకుని తెచ్చిన సరంజామా, అమ్మాయిలందరినీ వెనక్కి పంపేశారు. ఇదంతా చికోటి ప్రవీణ్, బోడె ప్రసాద్‌ల నేతృత్వంలోనే జరిగింది. పలువురు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కూడా తెర వెనుక ఇందుకు సహకరించినట్లు తెలిసింది. చికోటిపై ఇప్పుడు ఈడీ విచారణ మొదలవడంతో అతనితో బోడె ప్రసాద్‌కున్న సంబంధాలు వారి వ్యవహారాలు చర్చనీయాంశమయ్యాయి. కాల్‌మనీ సెక్స్ రాకెట్‌లోనూ పాత్ర విజయవాడ కేంద్రంగా గతంలో వెలుగుచూసిన కాల్‌మనీ సెక్స్ రాకెట్‌లోనూ టీడీపీ నేతల పాత్ర అందరికీ తెలిసిందే. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంలో బోడె ప్రసాద్, బుద్దా వెంకన్నతో పాటు మరికొందరు టీడీపీ నేతలు కాల్‌మనీ వ్యవహారాల్లో ఆరితేరినట్లు స్పష్టమైంది. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండడంతో వారందరినీ ఆ కేసు నుంచి తప్పించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ కేసు బయటపడినప్పుడు బోడె ప్రసాద్ బ్యాంకాక్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని అప్పట్లో ఆయనే స్వయంగా ఒక వీడియో ద్వారా వెల్లడించారు. చికోటి ప్రవీణ్‌తో కలిసి ఆయన పలుమార్లు బ్యాంకాక్, శ్రీలంక వంటి ప్రాంతాలకు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. చికోటి హవాలా వ్యవహారాల్లోనూ టీడీపీ నేతలకు లింకు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
చీకోటి హవాలా దందాలో మరో నలుగురు
సాక్షి, హైదరాబాద్/కందుకూరు: క్యాసినోవాలాగా పేరుగాంచిన చీకోటి ప్రవీణ్‌కుమార్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. బుధ, గురువారాల్లో చీకోటితోపాటు మాధవరెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో హవాలా లావాదేవీలకు సంబంధించి మరో నలుగురు పేర్లు బయటపడినట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి. అందులోభాగంగా అధికారులు జూబ్లీహిల్స్‌లోని బబ్లూ, బేగంబజార్‌లోని సంపత్, సికింద్రాబాద్‌లోని రాకేష్, వెంకటేశ్ నివాసాల్లోనూ ఏకకాలంలో సోదాలు చేసినట్టు తెలిసింది. చెన్నై, హైదరాబాద్ నుంచి విదేశాలకు తరలించాల్సిన హవాలా డబ్బును ఈ నలుగురే ఆపరేట్ చేసినట్టు ఈడీ అనుమానిస్తోంది. అయితే వీరిలో సంపత్‌కు రాజకీయ ప్రముఖులతో సంబంధాలున్నాయని, ఎన్నికల సమయంలో పలువురికి ఇచ్చిన డబ్బును డైరీలో రాసుకున్నట్టు ఈడీ వర్గాల ద్వారా తెలిసింది. చీకోటి కీలకంగా ఉంటూ హవాలా డబ్బు మొత్తం సంపత్ ఆపరేట్ చేస్తున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నలుగురి ఇళ్లలో సోదాలు చేసిన అధికారులు వీరికీ నోటీసులిచ్చి విచారించాలని భావిస్తున్నారు. సోమవారం ఈడీ ఎదుట చీకోటితోపాటు మాధవరెడ్డి హాజరుకానున్నారు. వీరి విచారణ తర్వాత ఈ నలుగురికి నోటీసులిచ్చి విచారించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా జూన్‌లో చీకోటి ప్రవీణ్ జన్మదిన వేడుకలకు రూ.5 కోట్లకు పైగా ఖర్చుపెట్టినట్టు ఈడీ పలు ఆధారాలు సేకరించింది. అందులో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల పాత్రపైనా ఆరా తీసేందుకు ఈడీ ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. మంత్రితో చీకోటికి ఉన్న సాన్నిహిత్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు సమాచారం. విదేశీ ఊసరవెల్లులు, కొండ చిలువలు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో చీకోటి ప్రవీణ్‌కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం అటవీశాఖ అధికారులు దాడులు చేశారు. అటవీశాఖ రేంజ్ అధికారి రమేశ్‌కుమార్, డీఆర్ఓలు విజయ శ్రీనివాస్‌రావు, హేమ తదితరులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. సాయిరెడ్డిగూడ పరిధిలో 12 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వ్యవసాయ భూమిని 2016–17లో ప్రవీణ్ కొనుగోలు చేశాడు. అందులో ఉన్న పౌల్ట్రీతోపాటు మిగతా ప్రాంతంలో షెడ్లు నిర్మించాడు. విదేశాల నుంచి తెప్పించిన కొండ చిలువలు, ఊసరవెల్లులు, ఆఫ్రికన్ పాములు, మకావ్ చిలుకలు, హంసలు, బాతులు, ఉడుము, బల్లి జాతికి చెందిన రకాలు, జింక రకం మేకలు, టర్కీ కోళ్లు, ఆస్ట్రిచ్ పక్షులు, మేలు జాతి గుర్రాలు, సాలీళ్లు, రకరకాల కుక్కలు, పక్షుల వంటి వాటితోపాటు ఆవులు, గేదెలను పెంచుతున్నాడు. అలాగే, పురాతన కాలం నాటి రథం కూడా ఉంది. ఎఫ్ఆర్ఓ రమేశ్‌కుమార్ మాట్లాడుతూ.. నిబంధనల మేరకు అన్నీ సక్రమంగా ఉన్నట్లుగా ప్రాథమికంగా గుర్తించామన్నారు. ఇంకా పూర్తిస్థాయిలో పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. -
కేసినో వ్యవహారానికి నాకు సంబంధం లేదు: మాజీ మంత్రి బాలినేని
-
‘చీకోటి’ వ్యవహారంపై స్పందించిన మాజీ మంత్రి బాలినేని
సాక్షి, ప్రకాశం జిల్లా: కేసినో వ్యవహారానికి తనకు ఎటువంటి సంబంధం లేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. కేసినో ప్రవీణ్ ఎవరో తనకి అసలు తెలియదని, తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదన్నారు. ఒంగోలు నగరాన్ని ఈ రెండేళ్లలో అద్భుతంగా అభివృద్ధి చేస్తానని బాలినేని అన్నారు. ప్రతి సచివాలయం పరిధిలో అభివృద్ధికి రూ.20 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసిందన్న ఆయన, ప్రతి ఇంటికి, ప్రతి వీధికి తిరిగి ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని బాలినేని అన్నారు. చదవండి: చంద్రబాబు పాలనలో జరిగింది డీపీటీ: సీఎం జగన్ -
క్యాసినో వ్యవహారంలో చికోటి ప్రవీణ్, మాధవరెడ్డికి మరోసారి ఈడీ నోటీసులు
-
ఇక్కడి నుంచే దేశం దాటింది
సాక్షి, హైదరాబాద్/ సైదాబాద్: చీకోటి ప్రవీణ్ కుమార్ క్యాసినో కేంద్రాలుగా సాగించిన హవాలా లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరే ట్ (ఈడీ) దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వందల కోట్ల సొమ్ము చెన్నై, హైదరాబాద్ కేంద్రాల నుంచి విదే శాలకు డాలర్ల రూపంలో తరలిపోయినట్లు ఈడీ అనుమానిస్తోంది. చీకోటితోపాటు ఆయన భాగ స్వామి మాధవరెడ్డి ఇళ్లలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు గురువారం ఇద్దరికీ నోటీసులు జారీచేశారు. సోమవారం ఈడీ కార్యా లయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. నేపా ల్, శ్రీలంక, ఇండోనేసియా తదితర దేశాల్లో క్యాసి నోలకు ఉపయోగించిన రూ.కోట్లాది సొమ్ము కేవ లం జూదరుల కోసమేనా లేక హవాలా మార్గం ద్వారా దేశం దాటించారా అన్న దానిపై ఈడీ అధి కారులు తీగలాగుతున్నట్టు తెలిసింది. రూ.వందల కోట్ల మేర జరిగిన లావాదేవీలు కేవలం క్యాసినో కోసం కాదని, బంగారం హవాలా కోసం కూడా దారి మళ్లించి ఉంటారని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఇక్కడి నుంచి ఒక దేశానికి హవాలా జరిగిన సొమ్ము అక్కడి నుంచి మరెన్ని దేశాలకు దాటించి ఉంటారన్న దానిపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలిసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీ సెలబ్రిటీలు ప్రవీణ్‌తో లావాదేవీలు సాగించిన వ్యవహారంలో ఈడీ పలు సంచలనాత్మక సందేశాలను మొబైల్ ఫోన్లో గుర్తించినట్టు తెలిసింది. ప్రధానంగా ఇద్దరు మంత్రులకు సంబంధించి వాట్సాప్, సిగ్నల్ మెసెంజర్ల ద్వారా సాగిన సంభాషణలు ఆసక్తికరంగా ఉన్నట్టు ఈడీ వర్గాలు చెప్పాయి. అదేవిధంగా పలువురు ఎమ్మెల్యేలకు సంబంధించిన వాట్సాప్ సందేశాల్లో క్యాసినో కేంద్రాల వివరాలు, విమాన టికెట్లు, క్యాసినో ఆడేందుకు డబ్బు ఎక్కడ ఇవ్వాలి, ఎవరికి అప్పజెప్పాలి అన్న కీలక విషయాలను ఈడీ గుర్తించినట్టు తెలిసింది. ఓ జిల్లా డీసీసీబీ చైర్మన్ భూమి పత్రాలు సైతం ప్రవీణ్ ఇంట్లో లభించడం కలకలం రేపింది. ఇకపోతే సినీ ప్రముఖుల నంబర్లకు లొకేషన్ మ్యాప్లుండటంపై అధికారులు కూపీలాగే పనిలో ఉన్నట్టు తెలిసింది. ప్రముఖులకు సంబంధించిన ఖాతా నంబర్లు, వాటి ద్వారా జరిగిన లావాదేవీల స్క్రీన్ షాట్లు తదితరాలను ఈడీ స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఆ నలుగురు ఎవరు? హవాలా మార్గంలో సొమ్ము తరలించేందుకు చీకోటితో మరో నలుగురు భాగస్వాములుగా ఉన్నట్టు ఈడీ ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు, బెంగళూరుకు చెందిన ఒకరు, చెన్నైకి చెందిన మరొకరు హవాలా ఏజెంట్లుగా వ్యవహరించిన వివరాలను ప్రవీణ్ మొబైల్‌తోపాటు ల్యాప్‌టాప్‌లో గుర్తించినట్టు ఈడీ వర్గాలు తెలిపాయి. సోదాల్లో లభించిన డాక్యుమెంట్లతోపాటు హార్డ్‌డిస్క్ నుంచి రిట్రీవ్ చేయాల్సిన అంశాల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేయాలని భావిస్తున్నారు. నేపాల్, శ్రీలంక, ఇండోనేసియానే కాకుండా సింగపూర్, మలేసియా, థాయ్‌లాండ్ దేశాల్లోనూ ప్రవీణ్ క్యాసినోలు నిర్వహించినట్లు సమాచారం. స్టిక్కర్‌ను రోడ్డు మీద పడేశానన్న మంత్రి హవాలా ఆరోపణలెదుర్కొంటున్న మాధవరెడ్డి కారుకు మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండటంపై మంత్రి స్పందించారు. మార్చి 2022 వరకు చెల్లుబాటున్న స్టిక్కర్‌ను తీసి ఎక్కడో రోడ్డు మీద పడేశానని, అది ఎవరో తీసుకుని పెట్టుకుంటే తనకేం సంబంధమన్నారు. అయితే ఎమ్మెల్యే స్టిక్కర్‌ను ఎక్కడపడితే అక్కడ పడేయటం ఏంటన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. చట్టపరంగానే క్యాసినోలు: చీకోటి గోవాలో, నేపాల్‌లో చట్టపరంగానే తాను క్యాసినోలు నిర్వహించానని చీకోటి ప్రవీణ్‌కుమార్ చెప్పారు. ఈడీ దాడుల అనంతరం గురువారం తన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు. ఈడీ అధికారులు ఎందుకు మీ ఇంటిపై దాడులు నిర్వహించారని ప్రశ్నించగా.. ఎందుకో మీకు తెలియదా అంటూ వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. ఈడీ నోటీసుల మేరకు సోమవారం విచారణకు హాజరై అధికారుల సందేహాలను నివృత్తి చేస్తానని చెప్పారు. ఎంటర్టైన్మెంట్ పేరుతో... గత జూన్ 10 నుంచి నాలుగు రోజులపాటు నేపాల్‌లో క్యాసినో నిర్వహణలో భాగంగా ఎంటర్టైన్మెంట్ పేరుతో సినీ సెలబ్రిటీలకు భారీగా పారితోషకాలిచ్చినట్టు ఈడీ గుర్తించింది. అందులోభాగంగా బాలీవుడ్ నటులు మల్లికా షెరావత్కు రూ.కోటి, అమీషా పటేల్‌కు రూ.80 లక్షలు, గోవిందకు రూ.50 లక్షలు, డింపుల్ హయతీకి రూ.40 లక్షలు, టాలీవుడ్ నటి ఇషారెబ్బకు రూ.40 లక్షలు, గణేష్ ఆచార్యకు రూ.20 లక్షలు, ముమైత్‌ఖాన్‌కు రూ.15 లక్షలు పారితోషకం కింద ఇచ్చినట్టు ఈడీ ఆధారాలు సేకరించినట్టు తెలిసింది. -
‘చీకోటి’ కేసులో సంచలన విషయాలు.. సినీ హీరోయిన్లకు కళ్లు చెదిరే పారితోషికాలు
సాక్షి, హైదరాబాద్: చీకోటి ప్రవీణ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో సినీ తారల పారితోషికాల లిస్ట్ బట్టబయలైంది. టాలీవుడ్, బాలీవుడ్ తారలకు ఇచ్చిన భారీ పారితోషికాలపై ఈడీ నోటీసులు సిద్ధం చేస్తోంది. నేపాల్‌లో నిర్వహించిన క్యాసినోకు ప్రచారకర్తలుగా వ్యవహరించిన సినీ తారలపై ఈడీ అధికారుల దృష్టి పెట్టారు. మల్లికా షెరావత్కు రూ.కోటి, అమిషా పటేల్‌కు రూ.80 లక్షలు, గోవిందకు రూ.50 లక్షలు, ఈషా రెబ్బాకు రూ.40 లక్షలు, డింపుల్ హయతీకి రూ.40 లక్షలు, గణేష్ ఆచార్యకు రూ.20 లక్షలు ముమైత్‌ఖాన్‌కు రూ.15 లక్షలు పారితోషికాలను చీకోటి ఇచ్చినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. చదవండి: క్యాసినోవాలా... కోట్ల హవాలా! మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖ హీరోలు కస్టమర్లే.. చీకోటికి మంత్రులు, ఎమ్మెల్యేలు డీసీసీబి ఛైర్మన్లతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం. చికోటితో విఐపీల లింకులు బయటపడుతున్నాయి. నేపాల్ వెళ్లిన కస్టమర్లలో 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈడీ కీలక ఆధారాలు సేకరిస్తోంది. ప్రవీణ్ ల్యాప్‌ట్యాప్‌లో వీఐపీల వివరాలు, చెల్లింపులు ఉన్నట్లు సమాచారం. చెన్నైకి చెందిన బంగారం వ్యాపారికి హవాలా ఏజెంట్‌గా చీకోటి ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో దేశానికి ఒక్కో రేటు వసూలు చేస్తున్న చీకోటి.. ఇండోనేషియా, శ్రీలంక, నేపాల్ దేశాలను క్యాసినో అడ్డాలుగా మార్చుకున్నాడు. కోల్‌కతా మీదుగా నేపాల్‌కు కస్టమర్ల తరలిస్తూ.. ఒక్కో విమానానికి లక్షల రూపాయలు చెల్లింపు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో హోటల్‌కు లక్షలు చెల్లించి ఈవెంట్స్ నిర్వహణకు కస్టమర్ల నుంచి 5లక్షలు ఎంట్రీ ఫీజు ప్రవీణ్ వసూలు చేస్తున్నట్లు సమాచారం. ప్రవీణ్ రెగ్యులర్ కస్టమర్లు 200 మంది ఉన్నట్లుగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
డాన్ చికోటి వ్యవహారంపై స్పందించిన కొడాలి నాని
-
డాన్ చీకోటి వ్యవహారంపై స్పందించిన కొడాలి నాని
సాక్షి, కృష్ణా జిల్లా: డాన్ చీకోటి వ్యవహారంపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చీకోటి వ్యవహారాన్ని తమపై ఆపాదించడం సరికాదన్నారు. టీడీపీ నేతలకు దమ్ముంటే తనను ఈడీతో అరెస్ట్ చేయించాలని సవాల్ విసిరారు. గుడివాడిలో జూదం అంటూ వచ్చిన టీడీపీ నిజనిర్థారణ కమిటీ నివేదిక ఈడీకి ఇవ్వాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. దేశంలో ఏం జరిగినా.. చంద్రబాబు భజన బృందం తమకు ముడిపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. చదవండి: మరి కేంద్రం అప్పుల సంగతి ఏంటి?: ఎంపీ విజయసాయిరెడ్డి -
చికోటి ప్రవీణ్ జూదం దందాలో విస్తుపోయే విషయాలు
-
Casino: ఈడీ సోదాలపై స్పందించిన క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్
సాక్షి, హైదరాబాద్: క్యాసినో నిర్వహిస్తూ కోట్ల రూపాయల హవాలాకు పాల్పడుతున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్ స్పందించాడు. క్యాసినో విషయంలోనే ఈడీ అధికారులు సోదాలు చేసినట్టు మీడియాతో చెప్పాడు. మనదేశంలోని గోవాలో క్యాసినో లీగల్ అని ప్రవీణ్ చెప్పుకొచ్చాడు. దీంతోపాటు నేపాల్, ఇండోనేషియాలో క్యాసినో లీగల్ అని తెలిపాడు. తాను చేసింది లీగల్ వ్యాపారమేనని అన్నాడు. తానొక సామాన్య వ్యక్తినని ప్రవీణ్ వ్యాఖ్యానించాడు. ఈడీ అధికారులకు కొన్ని సందేహాలు ఉన్నాయని.. అందుకే వాళ్లు వివరణ అడిగారని చెప్పాడు. వాళ్లు కొన్ని ప్రశ్నలు వేస్తే సమాధానాలు చెప్పానని అన్నాడు. వారికి ఏమేం వివరాలు కావాలో చెప్తానని ప్రవీణ్ మీడియాతో వెల్లడించాడు. సోమవారం మరోసారి విచారణకు రమ్మన్నారని, హాజరవుతానని పేర్కొన్నాడు. (చదవండి: క్యాసినోవాలా... కోట్ల హవాలా! మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖ హీరోలు కస్టమర్లే..) -
హైదరాబాద్: చికోటి ప్రవీణ్ ఈడీ కేసులో కీలక అంశాలు
-
ఈడీ రైడ్స్.. మాధవరెడ్డి కారుపై టీఆర్ఎస్ మంత్రి స్టిక్కర్
సాక్షి, హైదరాబాద్: క్యాసినో నిర్వహాకుడు చికోటి ప్రవీణ్ వ్యవహారం తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. కాగా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. ప్రవీణ్‌పై కేసులు నమోదుచేసి బుధవారం నగరంలోని 8 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. రూ.కోట్ల హవాలా ద్వారా ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది. ఇదిలా ఉండగా.. బోయినపల్లికి చెందిన అతడి భాగస్వామి మాధవరెడ్డి ఇంట్లోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. ముఖ్యమైన డాక్యుమెంట్లు, క్యాసినోలతో చేసుకున్న ఒప్పందాలు, హవాలా మార్గంలో తెచ్చిన నగదుకు సంబంధించి ఆధారాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో మాధవరెడ్డి ఇంట్లో ఉన్న ఓ కారుపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి పేరుతో ఉన్న స్టిక్కర్ కనిపించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సదరు కారు స్టిక్కర్‌పై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కారుపై ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ స్టిక్కర్‌ను తాను మూడు నెలల క్రితమే పడేసినట్టు స్పష్టం చేశారు. తానే పడేసిన స్టిక్కర్‌ను ఎవరో పెట్టుకుంటే నాకేంటి సంబంధం అని మంత్రి ప్రశ్నించారు. మరోవైపు.. క్యాసినో వ్యవహారంలో చికోటి ప్రవీణ్, మాధవరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. సోమవారం ఈడీ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. కాగా, హవాలా లావాదేవీలపై ఈడీ.. ప్రవీణ్‌ను ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది. సోదాల్లో ఈడీ.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు నుంచి పెద్ద సంఖ్యలో వ్యక్తులను వీరు ప్రత్యేక విమానాల్లో తరలించి అక్కడ క్యాసినో నిర్వహించినట్టు ఆధారాలు సేకరించింది. ఇది కూడా చదవండి: క్యాసినోవాలా... కోట్ల హవాలా! మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖ హీరోలు కస్టమర్లే.. -
క్యాసినోవాలా... కోట్ల హవాలా! మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖ హీరోలు కస్టమర్లే..
సాక్షి, హైదరాబాద్/సైదాబాద్: ఆయన చుట్టూ మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఆయన ఏ కార్యక్రమం చేసినా ఫుల్ హడావుడి, సెలబ్రిటీలే దగ్గరుండి ఏర్పాట్లు చూస్తారు. అలా అనీ ఆయనేం పవర్ సెంటర్ కాదు.. పత్తాలాడించే ఓ సామాన్య వ్యక్తేగానీ.. గల్లీలో పేకాట ఆడించే వాడు కాదు. ఏకంగా ప్రత్యేక విమానాల్లో విదేశాలకు తీసుకెళ్లి కోట్లలో క్యాసినోలు ఆడించే ఖతర్నాక్ ఆర్గనైజర్. అతడే చీకోటి ప్రవీణ్. అలాంటివాడిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులు నమోదుచేసి బుధవారం నగరంలోని 8 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. రూ.కోట్ల హవాలా ద్వారా ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది. బోయినపల్లికి చెందిన అతడి భాగస్వామి మాధవరెడ్డి ఇంట్లోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. ముఖ్యమైన డాక్యుమెంట్లు, క్యాసినోలతో చేసుకున్న ఒప్పందాలు, హవాలా మార్గంలో తెచ్చిన నగదుకు సంబంధించి ఆధారాలను ఈడీ స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ప్రవీణ్‌పై ఈడీ దాడులు తీవ్ర కలకలం రేపాయి. అలాగే, మాధవరెడ్డి ఇంట్లో ఒక కారుపై మంత్రికి సంబంధించిన కారు స్టిక్కర్ అతికించి ఉంది. హవాలాతో అడ్డంగా దొరికి.. చీకోటి ప్రవీణ్ ఒకప్పుడు నగరంలో సాదాసీదా పేకాట క్లబ్బులు నడిపించిన వ్యక్తి. బేగంపేట, వనస్థలిపురం, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్ తది తర ప్రాంతాల్లో సెలబ్రిటీల కోసమే క్యాసినోలు ఏర్పాటుచేసి దందా సాగించేవాడు. 2014 తర్వాత అతడి సుడి మారిపోయిందని చెబుతారు. ఇద్దరు మంత్రులు, 16 మంది ఎమ్మెల్యేల సాన్నిహిత్యంతో చీకోటి వ్యవహారం విదేశాలకు విస్తరించింది. ప్రత్యేక విమానాల్లో ఇండోనేషియా, నేపాల్‌కు తీసుకెళ్లి రూ.కోట్లలో పేకాట ఆడించడం వరకు వెళ్లాడు. ఇక్కడే అసలు కథ అడ్డం తిరిగింది. ఇండోనేషియా, నేపాల్, శ్రీలంకలో పేకాట ఆడించేందుకు హవాలా ద్వారా నగదు లావాదేవీలు చేసి ఈడీకి అడ్డంగా బుక్కయినట్టు తెలిసింది. హైదరాబాద్‌లో భారత కరెన్సీని హవాలా రూపంలో అందించి.. నేపాల్, ఇండోనేషియాలో తనకు ఎంత కావాలో ఆమేరకు అక్కడి కరెన్సీని తీసుకునేవాడు. ఇలా గత జూన్ 10, 11, 12, 13 తేదీల్లో 8 ప్రత్యేక విమానాల్లో నేపాల్‌లోని హోటల్ మిచీక్రౌన్‌లో భారీ ఎత్తున క్యాసినో ఏర్పాటుచేసి చాలామంది ప్రముఖులను తరలించాడు. సమాచారం అందుకున్న ఈడీ అధికారులు హవాలా ద్వారా వెళ్లిన నగదుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించి రంగంలోకి దిగినట్టు తెలిసింది. బుధవారం తెల్లవారుజాము నుంచే ప్రవీణ్ నివాసం, ఫాంహౌజ్తోపాటు మరో 6 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. దీనికి సంబంధించి ఈడీ అధికారికంగా ఇంకా ప్రకటన చేయలేదు. సెలబ్రిటీల వీడియోలు బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరోలు, హీరోయిన్లు సైతం చీకోటితో సాన్నిహిత్యంగా ఉన్న ఫొటోలు, వీడియోలు ఈడీ అధికారులను షాక్ తినేలా చేసినట్టు తెలుస్తోంది. గతంలో బేగంపేటలోని ఓ అపార్ట్మెంట్లో జరిగిన బర్త్‌డే ఫంక్షన్లో క్యాసినో ఏర్పాటుచేసిన అంశం పెద్ద దుమారమే రేపింది. ఆ పార్టీకి ఓ మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతోపాటు సీనియర్ ఐఏఎస్‌లు హాజరవడం సంచలనం రేపింది. ఆరు నెలల క్రితం చీకోటి పేకాట వ్యవహారాలపై ‘సాక్షి’ పలు కథనాలు ప్రచురించింది. ఆయనకు సారీ చెప్పి మరీ... గత నెల 17న కర్మన్‌ఘాట్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో చీకోటి తన 46వ పుట్టినరోజు వేడుకలు నిర్వహించాడు. ఫంక్షన్ హాలంతా సెలబ్రిటీలే. బర్త్‌డే సందర్భంగా తాను ఇష్టపడి బుక్ చేసుకున్న రేంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ కారును ప్రముఖ హీరో, ఓ రాజకీయ పార్టీ అధినేత కూడా ఇష్టపడ్డాడు. సేమ్ కలర్ కూడా కావడంతో ఆ హీరో ప్రవీణ్‌కు ఫోన్‌చేసి ఆ కారు కావాలని అడగ్గా, సారీ.. సర్.. తనకే కావాలని సున్నితంగా చెప్పి సొంతం చేసుకున్నట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. కారు విలువ సుమారు రూ.3.5 కోట్లు. ►నగర శివార్లలోని కడ్తాల్‌లో ప్రవీణ్‌కు 20 ఎకరాల్లో ఫామ్‌హౌస్ ఉందని సమాచారం. ఇక్కడే అనేక మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, పోలీసు ఉన్నతాధికారులకు హైఫై పార్టీలు ఇస్తుంటాడని తెలుస్తోంది. వీటిలో అత్యంత ఖరీదైన మద్యం ఏరులై పారుతుంది. అనేక మందిని ఆకర్షించడానికి టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన కొందరు హీరోయిన్లతో గానా బజానాలూ ఏర్పాటు చేస్తుంటాడు. ఉత్తరాది టాప్ మోడల్స్ కూడా తళుక్కుమంటారని సమాచారం. జైల్లో పరిచయాలతో... ఓ రియల్టర్‌ను బెదిరించి రూ.30 లక్షలు గుంజిన కేసులో ప్రవీణ్ కొద్ది రోజులు జైల్లోఉన్నాడు. అప్పడు ఏర్పడిన పరిచయాలతోనే ప్రవీణ్ క్యాసినో నిర్వాహకుడిగా మారాడని అంటుంటారు. తొలినాళ్లల్లో క్రికెట్ బుకీగా వ్యవహరించాడు. రాష్ట్రంలో క్లబ్స్ నిషేధించడంతో గోవాకు చెందిన ప్రముఖ గో డాడీ క్యాసినోలో పార్ట్నర్గా మారాడని, ఆపై చెన్నై శివార్లలో సొంతంగా ఓ క్యాసినో పెట్టాడని తెలుస్తోంది. సంక్రాంతి సీజన్లో వివిధ ప్రాంతాల్లో జరిగే కోళ్ల పందాలు, పేకాట శిబిరాలూ ఇతడి నేతృత్వంలోనివే అని పోలీసులు చెప్తున్నారు. కుడి భుజంగా మాధవరెడ్డి బోయిన్‌పల్లికి చెందిన మాధవరెడ్డి.. ప్రవీణ్‌కు కుడిభుజంగా వ్యవహరిస్తున్నారు. ఈయనకు ఓ మంత్రితో దగ్గర బంధుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రవీణ్ నిర్వహించే క్యాసినోలు, గ్యాంబ్లింగ్‌లకు ప్రముఖులను తీసుకొచ్చే బాధ్యతల్ని తీసుకునేవాడు. బోయిన్‌పల్లికే చెందిన ఓ వ్యక్తి ఇటీవల నేపాల్‌లోని వీరి క్యాసినోకు వెళ్లారు. ముందుగానే రూ.10 లక్షలు చెల్లించారు. అయితే అక్కడ అదనపు ఖర్చులకంటూ మాధవరెడ్డి ఆయనకు డబ్బులు ఇచ్చాడు. తిరిగి వచ్చాక ఆ డబ్బు ఇవ్వాలని బెదిరించి ఆ వ్యక్తికి సంబంధించిన స్థలాన్ని తమ వారి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు సమాచారం. యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాలకు చెందిన అనేక మంది పేకాటరాయుళ్ల భూములను వీరిద్దరూ ఇదే పంథాలో బినామీల పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న సందర్భాలు అనేకం. కొంపల్లిలో ఓ ఫంక్షన్ హాల్ ఇప్పటికీ పేకాటరాయుళ్లకు అడ్డాగా ఉంది. ప్రవీణ్, మాధవరెడ్డి దాన్ని లీజ్‌కు తీసుకున్నారు. అక్కడ ప్రతి నెలా రెండు రోజులపాటు పేకాట శిబిరం నిర్వహిస్తున్నారు. ఇటువైపు పోలీసులు కన్నెత్తి చూడరన్న ఆరోపణలున్నాయి. బంగారం వ్యాపారంలోనూ... చీకోటి ఇంట్లో సోదాలు చేసిన ఈడీ అధికారులు క్యాసినో ద్వారా జరిగిన హవాలా లావాదేవీలు మాత్రమే కాకుండా బంగారం దందా వ్యవహారంలోనూ సంబంధాలున్నట్టు గుర్తించినట్లు తెలుస్తోంది. చెన్నైకి చెందిన ప్రముఖ బంగారు వ్యాపారికి హవాలా ద్వారా డబ్బు ఏర్పాట్లు చేసి తాను బంగారం బ్లాక్‌మార్కెట్ ద్వారా తీసుకున్నట్లు ఈడీ గుర్తించినట్టు సమాచారం. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని ఈడీ అధికారి ఒకరు చెప్పారు. ఫామ్‌హౌస్‌లో ప్రైవేట్ జూ చీకోటి కుటుంబం ప్రస్తుతం ఐఎస్ సదన్ డివిజన్ వినయ్‌నగర్ కాలనీలోని సాయి కిరణ్ రెసిడెన్సీ అపార్ట్మెంట్లో నివసిస్తోంది. ప్రవీణ్ కడ్తాల్‌లోని ఫామ్‌హౌస్‌లో ఓ ప్రైవేట్ జూ ఏర్పాటు చేసుకున్నాడు. అందులో రూ.కోట్ల విలువైన వైట్హార్స్తోపాటు మాట్లాడే చిలుకలు, కొండచిలువలు, పశువులు.. ఇలా అనేక రకాల జంతువులు, పక్షులను పెంచుతున్నట్టు వీడియోల్లో కనిపిస్తోంది. సినిమాలపై ఎంతో ఆసక్తి ఉన్న ప్రవీణ్ 15 ఏళ్ల క్రితం ఒక తెలుగు సినిమాలో విలన్‌గానూ నటించాడు. 2007లో పోలీసులు అరెస్టు చేసినప్పుడు ఓ చిత్ర నిర్మాణం కోసం ఒక హీరోకి కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు గుర్తించారు. ప్రవీణ్ తొలినాళ్లల్లో కాంగ్రెస్ నాయకుడిగా చురుగ్గా తిరిగి తర్వాత రాజకీయాలకు స్వస్తి చెప్పాడు. ఆడంబర జీవితం గడిపే అతని వెంట అనునిత్యం ప్రైవేట్ సైన్యం ఉంటుంది. తన కుమారులకు రూ.కోట్ల విలువైన కార్లు బహుమతులుగా ఇచ్చాడు. ఒక్కో దేశానికి ఒక్కో రేటు చీకోటి ప్రవీణ్ ఒక్కో ఆటకు ఒక్కో రేటు ఫిక్స్ చేస్తాడు. ఒక్కో దేశానికి ఒక్కో రకమైన డిపాజిట్ తీసుకుంటాడు. హైదరాబాద్ నుంచి ప్రతీ శుక్ర, శని, ఆదివారాల్లోనే విదేశాలకు క్యాసినో ఆడేందుకు ఏర్పాట్లు చేస్తాడు. ఇలా తనకు 200 మంది రెగ్యులర్ కస్టమర్లుండగా వారికి అన్ని ఏర్పాట్లు తానే దగ్గరుండి చేసి పెడతాడు. ప్రయాణానికి ముందే కస్టమర్ల నుంచి డిపాజిట్లు తీసుకుంటాడు. ఇండోనేషియా, నేపాల్‌కు క్యాసినో ఆడేందుకు వెళ్లే వారు రూ.5 లక్షల నుంచి 50లక్షల వరకు డిపాజిట్ చేస్తారు. రూ.15లక్షల వరకు చెల్లించిన వారిని సాధారణ విమానాల్లో ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో తీసుకెళ్తాడు. రూ.20లక్షల నుంచి రూ.50 లక్షలు డిపాజిట్ చేసే వారిని ప్రత్యేక విమానాల్లో తీసుకెళ్తాడు. ఒక్కో వీకెండ్‌కు రూ.40 లక్షల సంపాదన ఒక్కో టేబుల్‌పై రూ.2 లక్షల నుంచి 2కోట్ల వరకు పేకాట నడుస్తుంది. ఇందులో ఒక్కో గేమ్‌ను ఒక్కో కిట్‌గా పిలుస్తారు. ప్రతీ కిట్‌పై 5 శాతం కమిషన్‌ను ముందే తీసుకుంటాడు. ఉదాహరణకు ఐదుగురు కలిసి రూ.5లక్షల గేమ్ ఆడితే మొత్తం ఆట విలువ రూ.25లక్షలు అవుతుంది. ఈ ఆటలో కమీషన్ కింద 5 శాతం అంటే రూ.1.75లక్షలు వస్తుంది. ఇలా ఒక్కో వీకెండ్లో రూ.40 లక్షల వరకు ప్రవీణ్ సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది. రూ.5లక్షల వరకే ఆడదామని వెళ్లిన వారు అక్కడి వాతావరణానికి రెచ్చిపోయి రూ.20లక్షల వరకు ఆడతారని జూదరులు చెప్పారు. 2017లో మారియట్ హోటల్లో... హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు 2017 అక్టోబర్‌లో లోయర్ ట్యాంక్‌బండ్‌లో ఉన్న ఫైవ్‌స్టార్ హోటల్ మారియట్‌పై దాడి చేశారు. దీపావళి నేపథ్యంలో ఏర్పాటు చేసిన క్యాసినో గుట్టురట్టు చేశారు. కేవలం మూడు రోజుల్లో రూ.80 లక్షలకు పైగా చేతులు మారింది. వారాసిగూడకు చెందిన సంజయ్‌కుమార్ ఈ శిబిరం ఏర్పాటు చేయగా... ప్రవీణ్ సహా నలుగురు కీలకపాత్ర పోషించి పోలీసులకు చిక్కారు. ఈ శిబిరంలో ప్రవేశించడానికి పేకాటరాయుళ్లు కనీసం రూ.2 లక్షలు చెల్లించి కాయిన్స్ (చిప్స్) తీసుకుని పేకాట టేబుల్‌పై కూర్చునేలా చేశారు. ఏడో అంతస్తు మొత్తాన్ని బుక్ చేసి... సూట్ రూమ్‌లో ఒక్కో టేబుల్‌పై 8 మంది కూర్చునేలా మొత్తం ఆరు టేబుళ్లు ఏర్పాటుచేశారు. -
క్యాసినో,ఆన్లైన్ గేమింగ్‌పై భారీ జీఎస్టీ.. ఎంతంటే!
గేమింగ్ ఇండస్ట్రీపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ వారం చివరిలో ఆన్లైన్ గేమింగ్‌పై ఎంత జీఎస్టీ విధించాలనే అంశంపై ఓ స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. గోవా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడు,మహారాష్ట్ర ఆర్థిక మంత్రులు,తెలంగాణకు చెందిన రెవెన్యూ అధికారులు ఆన్లైన్ గేమింగ్‌పై ట్యాక్స్ విధింపును ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఈ మంత్రుల బృందానికి మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా నాయకత్వం వహించనున్నారు. దేశంలో బెట్టింగ్, జూదంతో పాటు సరిసమానంగా ఆన్లైన్ గేమింగ్‌పై పన్ను విధించాలని మంత్రుల ప్రతిపాదన ఉంది. ఆ ప్రతిపాదనల మేరకు 28 శాతం గేమింగ్‌పై జీఎస్టీ పడనుంది. జీఎస్టీ ఖరారు ఎప్పుడంటే ఆన్లైన్ గేమింగ్‌పై జీఎస్టీని ఖరారు చేయడానికి ఆర్ధిక మంత్రుల బృందం జూలై 23న బెంగళూరులో భేటీ కానున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రుల బృందం ప్రతిపాదనను ఫెడరల్ జీఎస్టి కౌన్సిల్ పరిశీలిస్తుంది. దీంతో పాటు ఆన్లైన్ గేమ్‌లో పెట్టే బెట్టింగ్‌పై 28 శాతం జీఎస్టీ విధించాలనే ప్రతిపాదనను కూడా రాష్ట్ర ఆర్థిక మంత్రుల బృందం పరిశీలిస్తుంది. క్యాసినోల విషయంలో, ఎంట్రీ పాయింట్ వద్ద చెల్లించిన మొత్తంపై ట్యాక్స్ విధించాలని నిర్ణయించబడింది. ప్రతిసారి కాకుండా చిప్స్ కొనుగోలు చేసేటప్పుడు మాత్రమే ఈ జీఎస్టీ ఉండనుంది. హార్స్ రైడింగ్‌లో పందెం మొత్తంపై 28 శాతం జిఎస్టి విధించే ప్రస్తుత పద్ధతి కొనసాగుతుందని ప్రతిపాదించబడింది. -
క్యాసినోలు,ఆన్లైన్ గేమ్స్‌పై 28 శాతం జీఎస్టీ?
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలపై 28 శాతం జీఎస్టీ విధించాలన్న ప్రతిపాదనపై ఈ వారంలో సమావేశమయ్యే జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించనుంది. చండీగఢ్‌లో ఈ నెల 28, 29 తేదీల్లో జీఎస్ట్ కౌన్సిల్ భేటీ కానుంది. ఆన్లైన్ గేమింగ్‌ను యూజ ర్ చెల్లించే ప్రవేశ రుసుం సహా పూర్తి విలువపై పన్ను విధించాలని మేఘాలయ ముఖ్యమంత్రి కోనార్డ్సంగ్మ అధ్యక్షతన మంత్రుల గ్రూపు సిఫా రసు చేసింది. రేస్ కోర్స్‌లకు బెట్టింగ్ పూర్తి విలువపై విధించాలని సూచించింది. అదే క్యాసినోలు అయితే ఆడేవారు కొనుగోలు చేసే చిప్స్/కాయిన్స్ విలువపై విధించాలని సిఫారసు చేసింది. ఇలా అన్ని రకాల ఫీజులు, చార్జీలు, పందెం విలువపై 28 శాతం జీఎస్టీ రేటును మంత్రుల గ్రూపు సిఫారసు చేయడం గమనార్హం. ఆహారం, పానీయాలపైనా ఇదే పన్ను రేటు వర్తించనుంది. అంటే స్థూల విలువపై పన్ను ఉండాలన్నది మంత్రుల గ్రూపు ప్రతిపాదన. ప్రస్తుతం ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందేలపై 18% జీఎస్టీ అమలవుతోంది. కానీ, పరిశ్రమ మాత్రం పన్ను పెంపును వ్యతిరేకిస్తోంది. -
మార్పింగ్ కు సచిన్ టెండూల్కర్ బలి
-
ఏనాడూ అలాంటి పని చేయలేదు.. బాధగా ఉంది: సచిన్
సోషల్ మీడియాలో సెలబ్రిటీల మీద పుకార్లు వైరల్ కావడం సహజమే. చాలామంది వాటిని తేలికగా తీసుకుంటారు. కొందరు మాత్రం అసహనం వ్యక్తం చేస్తూ ఒక రేంజ్‌లోనే కౌంటర్లు ఇస్తుంటారు. ఈ క్రమంలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌కి మార్ఫింగ్ ఫొటోలతో తనను బద్నాం చేయడం ఇబ్బంది పెట్టిందట. అందుకే న్యాయపరమైన చర్యలకు సిద్ధమయ్యారు ఆయన. గోవాకు చెందిన ఓ కాసినోపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గరం అయ్యారు. అనుమతి లేకుండా తన ఫొటోలను వాడుకోవడంపై లీగల్ యాక్షన్‌కు సిద్ధమయ్యారు ఆయన. ఈ మేరకు మార్ఫింగ్ చేసిన తన ఫొటోలను ‘బిగ్ డాడీ’ క్యాసినో ప్రమోషన్ కోసం ఉపయోగించుకుంటోందని అసహనం వ్యక్తం చేశారాయన. Requesting everyone to remain vigilant about misleading images on social media. pic.twitter.com/VCJfdyJome — Sachin Tendulkar (@sachin_rt) February 24, 2022 ‘‘నా ఇన్నేళ్ల కెరీర్లో గ్యాంబ్లింగ్గానీ, టొబాకోగానీ, ఆల్కాహాల్ ఉత్పత్తులనుగానీ.. నేరుగా గానీ, పరోక్షంగా గానీ తాను ఏనాడూ ఎండోర్స్ చేయలేదని, అలాంటిది తన ఫొటోలు ప్రజల్ని తప్పుదోవ పట్టించేదిగా ఉండడం తనని బాధించిందని చెప్తున్నారు 48 ఏళ్ల టెండూల్కర్. ‘నా లీగల్ టీం అవసరమైన చర్యలు తీసుకుంటోంది. కానీ, ప్రతి ఒక్కరికి ఈ సమాచారం అందించాలనే ఉద్దేశంతో ఈ పోస్ట్ చేస్తున్నా. తప్పుదోవ పట్టించే ఆ ఫొటోలను నమ్మకండి’ అంటూ ట్విటర్లో సచిన్ ఇవాళ ఒక ట్వీట్ చేశారు. -
గుడివాడ క్యాసినో వ్యవహారంపై త్వరలో బైడెన్‌కు ఫిర్యాదు..?
సాక్షి, కృష్ణా: గుడివాడ క్యాసినో వ్యవహారంపై మంత్రి కొడాలి నాని స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'గుడివాడలో క్యాసినో నిర్వహించామని టీడీపీ చీర్ బాయ్స్ అల్లరి అల్లరి చేశారు. మూడు రోజులు గుడివాడలో నిర్వహించిన క్యాసినోకు ఐదు వందల కోట్లు వస్తే, 50 క్యాసినోలు ఉన్న గోవాలో ఎన్ని వేల కోట్లు రావాలి. గుడివాడలో నన్ను ఒడించలేకే లేనిపోని ప్రచారాలు చేస్తున్నారు. గుడివాడ ప్రజలు అమాయకులు కాదు, వారికి అన్ని విషయాలు తెలుసు. స్థానిక టీడీపీ నేతలు కూడా పట్టించుకోని విషయాన్ని, టీడీపీ చీర్ బాయ్స్ పోలీసులకు ఫిర్యాదులు చెయ్యడం అవివేకం. గుడివాడలో క్యాసినో వ్యవహారంపై త్వరలో బైడెన్‌కు కూడా టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తారేమో?. గుడివాడలో మూడు రోజులు క్యాసినో జరిగితే, 362రోజులు టీడీపీ చీర్ బాయ్స్ ప్రచారం చేస్తున్నారు. టీడీపీ నేతలకు జీవితకాలం టైం ఇచ్చాను వారికి చేతనైంది చేసుకోవాలి' అని మంత్రి కొడాలి నాని అన్నారు. చదవండి: (వారి తరపున సీఎం జగన్‌కు పాదాభివందనం: మంత్రి కొడాలి నాని) -
క్యాసినో పేరుతో చంద్రబాబు రాజకీయం: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
సాక్షి, వైఎస్సార్ కడప: టీడీపీ అధినేత చంద్రబాబు సీనియారిటీతో దేశానికి, రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు క్యాసినో పేరుతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం కడపలో శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సంక్రాంతి అయిపోయి పదిరోజులైనా జూదం, క్యాసినోలని మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూదాన్ని ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహించలేదన్నారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తుందని ధ్వజమెత్తారు. చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ.. తాను ముఖ్యమంత్రి అయిన తరువాతే హైదరాబాద్‌లో నైట్ లైఫ్ కల్చర్ ఏర్పాటు చేశానని చెప్పారని గుర్తు చేశారు. డిస్కోలు, బార్లు, పబ్‌లు, క్యాసినోలే నైట్ లైఫ్ అన్నారు. నైట్ లైఫ్ ఉంటేనే మనకు పరిశ్రమలు వస్తాయని మాట్లాడిన చంద్రబాబు ఇవాళ ప్రభుత్వంపై చంద్రబాబు కవాలనే బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ఇదే చంద్రబాబు హయాంలో జరిగి ఉంటే ప్రజల సంతోషాన్ని కాలరాస్తున్నారు అని మాట్లాడే వాడని విమర్శించారు. ‘ఉద్యోగులు టీడీపీ హయాంలో సంఘాలు ఏర్పాటు చేసుకుంటే..చంద్రబాబు ఈ సంఘాల అంతు చూస్తా..తోకలు కత్తరిస్తానని బెదిరించాడు. ఈ రోజు సంఘాలన్ని ఏకతాటిపైకి రండి అని పిలుపునిస్తున్నారు. ఈ రోజురాష్ట్రంలో ప్రెండ్లీ ప్రభుత్వం ఉంది. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకుందామని ప్రభుత్వం కోరుతోంది. కరోనా లేని సమయంలో ఉద్యోగులు అడగకపోయినా కూడా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే ఐఆర్ 27 శాతం ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితిలో ఐదు డీఏలు ఇస్తే వెసులుబాటు ఉంటుందని ఇలా చేస్తున్నారు. వైఎస్ జగన్ ఇస్తున్న రూ.10 వేల కోట్ల భారం ఎక్కడికి వెళ్తుంది. ప్రభుత్వానికి భారమైన ఉద్యోగుల సంక్షేమాన్ని సీఎం వైఎస్ జగన్ ఆలోచిస్తున్నారని చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. -
‘లేదంటే నా దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ విడుదల చేస్తా’
విజయవాడ: తన కె కన్వెన్షన్‌లో ఎలాంటి కాసినో జరగలేదని మంత్రి కొడాలి నాని మరోసారి తేల్చిచెప్పారు. పక్క ప్లాన్ ప్రకారం ఇలాంటి ప్రచారం చేస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు. శనివారం సాక్షి న్యూస్‌తో మాట్లాడిన కొడాలి.. చంద్రబాబు బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పెట్టింది పేరని విమర్శించారు. ‘నాపై ఆరోపణలు చేస్తే భయపడతానని అనుకుంటున్నాడు. కాసినో జరగలేదని ఆధారాలు ఉన్నప్పుడు నిజనిర్థారణ కమిటీ ఎందుకు?, టీడీపీ నేతలు చేసిన ఆరోపణలు నిరూపించాలి. లేదంటే నా దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ విడుదల చేస్తా. కాసినో పెట్టినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా. టీడీపీ హయాంలో నియోజకవర్గానికో క్లబ్ నడిపిన చరిత్ర చంద్రబాబుది. రాష్ట్రంలో క్లబ్‌లన్నీ మూసేసిన చరిత్ర జగన్ ప్రభుత్వానిది’ అని కొడాలి తెలిపారు. ‘కాసినో’ వ్యవహారం నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా.. లేకుంటే మీరేం చేస్తారు?: మంత్రి కొడాలి నాని -
బాబు, లోకేష్‌లకే కాసినో గురించి బాగా తెలుసు
సాక్షి, అమరావతి: కాసినోలు, అశ్లీల నృత్యాల గురించి చంద్రబాబు, లోకేష్‌లకు బాగా తెలుసని రాష్ట్ర మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. గతంలో లోకేష్ స్విమ్మింగ్ పూల్‌లో మహిళలతో అర్ధ నగ్నంగా, చేతిలో మద్యం గ్లాసు పెట్టుకుని చేసిన వేషాలను అందరూ చూశారన్నారు. శుక్రవారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తన కల్యాణ మండపంలో కాసినో, జూదం నిర్వహించినట్టు రుజువు చేస్తే రాజీనామాతో పాటు ఆత్మహత్య చేసుకుంటానని సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే చంద్రబాబు, లోకేష్, ఆయన కుల మీడియా ఏం చేస్తారో చెప్పే దమ్ముందా అని నిలదీశారు. ప్రశాంతంగా ఉండే గుడివాడలో చంద్రబాబు చిచ్చు రాజేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసింది, చేస్తోంది కూడా చంద్రబాబే అని మండిపడ్డారు. ఇప్పటికీ మహిళలను అడ్డు పెట్టుకుని బతుకుతున్న చరిత్ర చంద్రబాబుదేనన్నారు. గతంలో లక్ష్మీపార్వతిని సాకుగా చూపించి ఎన్టీఆర్ నుంచి అధికారాన్ని లాక్కున్నారన్నారు. మరో మహిళను అడ్డుపెట్టుకుని బ్రోకర్ పని చేసి సైకిల్ గుర్తు తెచ్చుకున్నారని చెప్పారు. చివరికి కట్టుకున్న భార్యను కూడా రాజకీయాల కోసం రోడ్డుపైకి తెచ్చారన్నారు. రాజకీయాలకు చంద్రబాబు అనర్హుడని వ్యాఖ్యానించారు. రెండు వారాలుగా గుడివాడలో లేను తాను గత రెండు వారాలుగా గుడివాడలో లేనని, కోవిడ్‌తో హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందిæ కేబినెట్ మీటింగ్ కోసం వచ్చినట్టు తెలిపారు. అటువంటిది చంద్రబాబు పెట్టే పెడిగ్రీ తింటూ.. ఆయన ఏం చెబితే.. అది చూపించే డబ్బా మీడియా, మొరిగే తొత్తులు గుడివాడలోని తన కల్యాణ మండపంలో ఏదో జరిగిపోతోందని, ఎక్కడో తీసుకొచ్చిన వీడియోలు చూపించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. న్యూట్రల్ మీడియా గుడివాడ వెళ్లి వాస్తవాలేమిటో తెలుసుకుని ప్రజలకు చెప్పాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయంగా చంద్రబాబు ఎప్పుడో సమాధి అయ్యారని, ఇంకా సిగ్గూ, శరం లేక దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నిజ నిర్ధారణ కమిటీ పేరుతో ఎప్పుడూ ఎన్నికల్లో గెలవని వర్ల రామయ్య, విజయవాడలో ఆస్తులు ఆక్రమించి, మహిళల్ని వేధించిన బోండా ఉమ గుడివాడ వెళ్తారా అని ప్రశ్నించారు. సంక్రాంతికి సంప్రదాయంగా జరిగే కోడి పందేలే గుడివాడలో కూడా జరిగాయన్నారు. ఎక్కడో డ్యాన్సులు జరుగుతున్నాయని మీడియాలో వార్తలు వస్తే.. తానే స్వయంగా డీఎస్పీకి ఫోన్ చేసి ఆపించానని చెప్పారు. చంద్రబాబు కాదు కదా.. ఎవరొచ్చినా గుడివాడలో ప్రజల అండ ఉన్నంత వరకు తనను ఎవరూ ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. -
అమెరికాలో కాల్పులు.. తెలుగు వ్యక్తి దారుణ హత్య
న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాలో దుండగుడి కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి మృత్యువాత పడ్డారు. తెలుగు వ్యక్తి శ్రీరంగ అర్వపల్లి(54) న్యూజెర్సీలోని ప్లెయిన్స్‌బోరోలో నివసిస్తున్నారు. 2014 నుంచి అరెక్స్ ల్యాబోరేటరీస్ ఫార్మా సంస్థ సీఈఓగా పని చేస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఇంట్లో ఉన్న శ్రీరంగపై దుండగుడు కాల్పులు జరిపాడు. ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చి ఈ దురాగతానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పెన్సిల్వేనియాలోని నారిస్‌టౌన్‌కు చెందిన జెకై రీడ్ జాన్(27)గా గుర్తించారు. చదవండి: (మెక్సికోలో భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్య) శ్రీరంగ తన ఇంటి నుంచి 80 కిలోమీటర్ల దూరంలోని పార్క్స్ క్యాసినోలో మంగళవారం అర్ధరాత్రి తర్వాత 10,000 డాలర్లు గెలుచుకున్నారు. ఇదంతా అక్కడే ఉన్న రీడ్ జాన్ గమనించాడు. ఆ డబ్బు దోచుకోవడానికి శ్రీరంగను కారులో వెంటాడాడు. శ్రీరంగను అనుసరిస్తూ ఇంటిదాకా వచ్చాడు. ఇంట్లోకి రాగానే అతడిపై పిస్తోల్‌తో కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన శ్రీరంగ అక్కడికక్కడే కన్నుమూశారు. రీడ్ జాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫస్ట్ డిగ్రీ మర్డర్ కేసు నమోదు చేశారు. శ్రీరంగ అర్వపల్లికి స్థానికంగా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
గోవా కాసినోలో టాలీవుడ్ స్టార్
వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న టాలీవుడ్ సీనియర్ స్టార్ జగపతి బాబు గోవాలోని బిగ్ డాడీ కాసినోలో ఎంజాయ్ చేశారు. స్వయంగా ఆయన కాసినోలో దిగిన ఫోటోను తన ట్విటర్ పేజ్‌లో పోస్ట్ చేసి ‘నేను గోవా, బిగ్ డాడీ కాసినోలో ఎంజాయ్ చేస్తున్నాను. నన్న విష్ చేయండి’ అంటూ ట్వీట్ చేశారు. జగపతి బాబు జూద ప్రియుడన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన షూటింగ్ సమయాల్లో ఏమాత్రం గ్యాప్ దొరికిన కాసినోలకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. ఈ అలవాటు కారణంగానే జగపతిబాబు తన ఆస్తులను కోల్పోయారన్న అపవాదు కూడా ఉంది. అయితే జగ్గుభాయ్ మాత్రం కొంతమంది నమ్మిన వ్యక్తులు మోసం చేయటం, సినిమా ఎంపికలో సరిగ్గా వ్యవహరించకపోవటం లాంటి కారణాలతోనే తాను ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాను గానీ, తన అలవాట్ల కారణంగా కాదని చెపుతుంటారు. ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరుస సినిమాలు చేస్తున్నారు ఈ సీనియర్ స్టార్. Enjoying myself in big daddy casino Goa ..... Pls wish me luck.... pic.twitter.com/dDovDKqHKs — Jaggu Bhai (@IamJagguBhai) August 3, 2019 -
విమానాశ్రయంలో సెల్ఫ్ చెక్ కయాస్కులు
భువనేశ్వర్ : స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల సౌకర్యాలను మరింతగా మెరుగుపరుస్తున్నారు. విమానాశ్రయంలో ప్రయాణికుల కోసం 5 సెల్ఫ్ చెక్ కయాస్కులు ఏర్పాటు చేశారు. స్వదేశీ టెర్మినల్–1 ప్రాంగణంలో ఈ సదుపాయం కల్పించారు. ఈ యంత్రాలతో ప్రయాణికులు స్వీయ నిర్వహణతో సీటుతో పాటు బోర్డింగ్ పాస్ పొందడానికి వీలవుతుంది. ఈ యం త్రాలను బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం డైరెక్టర్ ఎస్.సీ హొత్తా ప్రారంభించారు. ఈ సదుపాయంతో ప్రయాణికుల తనికీ సమయం ఆదా అవుతుంది. తక్కువ(చేతి) లగేజితో ప్రయాణించే వర్గాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీంతో ప్రయాణికులు బారులు తీరి నిలబడాల్సిన అవసరం ఉండదని డైరెక్టర్ ఎస్.సీ. హొత్తా తెలిపారు. టచ్ స్క్రీన్‌తో ఏర్పాటు చేసే ఈ యంత్రాల్లో ప్రయాణికుల పీఎన్ఆర్ నంబరుతో అనుబంధ సమాచారం నమోదు చేస్తే కోరిక మేరకు సీటుతో పాటు బోర్డింగ్ పాస్ పొందేందుకు వీలవుతుంది. బోర్డింగ్ పాస్ పొందడంతో ప్రయాణికులు నేరుగా సెక్యూరిటీ చెక్కు వెళ్ల గలుగుతాడు. రూ.20 లక్షల వ్యయంతో 5 సెల్ఫ్ చెక్ కయాస్కులు ఏర్పాటు చేశారు. అంచెలంచెలుగా మరిన్ని కయాస్కులు ఏర్పాటు చేస్తామని డైరెక్టర్ తెలిపారు. అంతర్జాతీయ విమాన రవాణా సంస్థ(ఐఏటీఏ,) కామన్ యూజ్ సెల్ఫ్ సర్వీస్(సీయూఎస్ఎస్) మార్గదర్శకాల మేరకు ఈ సదుపాయం ప్రవేశపెట్టడం విశేషం. ప్రారంభ కార్యక్రమానికి విమానాశ్రయ సిబ్బందితో పాటు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు హాజరయ్యారు. -
కొలంబోలో.. తెలుగు వారి కాయ్ రాజా కాయ్!
సాక్షి, అమరావతి: జూద ప్రియులను ఇప్పుడు శ్రీలంక అమితంగా ఆకర్షిస్తోంది. పొద్దున్నే విమానం ఎక్కి వెళ్లి పేకాడుకుని మర్నాడు ఉదయమే ఇంటికి తిరిగి వచ్చే సంస్కృతి తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తోంది. కాసినో (జూద క్రీడ) కోసం ఇన్నాళ్లూ గోవా, మకావూ, మలేషియా, సింగపూర్ తదితర చోట్లకు వెళ్తున్న వారి చూపు ఇప్పుడు శ్రీలంకవైపు మళ్లింది. హైదరాబాద్, విశాఖల నుంచి శ్రీలంకకు నేరుగా విమాన సర్వీసులు అందుబాటులోకి రావడంతో జూదరులు కొలంబోకి క్యూ కడుతున్నారు. గతేడాది హైదరాబాద్, విశాఖల నుంచి జూద క్రీడల (కాసినో) కోసం సుమారుగా 26,000 మంది వచ్చినట్లు కొలంబోలోని బెలాజియో కాసినో మార్కెటింగ్ హెడ్ సిసిరా సెమసింఘే తెలిపారు. ఈ ఏడాది ఈ సంఖ్య 30,000 దాటుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. గోవాతో పోలిస్తే చౌకనే.. కాసినో కోసం శ్రీలంక వెళ్తున్న వారిలో రాజధాని అమరావతి, భీమవరం ప్రాంతాలకు చెందిన బడాబాబులే అధికంగా ఉంటున్నారు. గోవాలో కాసినో కోసం సముద్రంలో సరిహద్దు జలాల వరకు వెళ్లాల్సి రావడం, పన్నుల భారం పెరగడం లాంటి కారణాలతో కొలంబో వెళ్తున్నట్లు చెబుతున్నారు. గోవా కంటే తక్కువ ఖర్చులో కాసినో కేంద్రాలు ఉండటంతో కొలంబో వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం కొలంబోలో అతిపెద్ద కాసినోలు 5 ఉన్నాయి. మందు, విందు... సకల సదుపాయాలు కాసినో కోసం వచ్చే బడాబాబుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కాసినోలు, ఫైవ్‌స్టార్ హోటల్స్, ఎయిర్‌లైన్స్ సంస్థలు ఉమ్మడిగా ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తున్నాయి. ఫ్లైట్‌లో తీసుకెళ్లి ఫైవ్‌స్టార్ హోటళ్లలో వసతి ఏర్పాటు చేయడమే కాకుండా మందు, విందు లాంటి సకల సౌకర్యాలు కల్పిస్తున్నాయి. మూడు రాత్రులు, నాలుగు రోజులు కలిపి హోటల్లో రూము, ఏర్పాట్లను బట్టి రూ. 3 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు సెమసింఘే తెలిపారు. కేవలం గంటన్నర వ్యవధిలోనే కొలంబో చేరుకునే అవకాశం ఉండటం, టికెట్ ధరలు కూడా తక్కువగా ఉండటం కలిసి వస్తోందంటున్నారు. విమానాల్లో ప్రత్యేక ధరలు ఒకరోజు వెళ్లి ఆడుకుని వచ్చే విధంగా విమాన సర్వీసులను నడుపుతున్నట్లు శ్రీలంక ఎయిర్‌లైన్స్ తెలంగాణ, ఏపీ మేనేజర్ చమ్మిక ఇద్దగోడగే తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైతే మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుంటారని చెప్పారు. మర్నాడు ఉదయం 7.15కి బయలు దేరితే 9.15 కల్లా వచ్చే విధంగా సర్వీసులను నడుపుతున్నట్లు వివరించారు. కొలంబోకు విశాఖ నుంచి రూ. 11,000, హైదరాబాద్ నుంచి రూ. 15,500 ధరలతో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించినట్లు చమ్మిక తెలిపారు. డబ్బు కడితే ఏజెంట్లే చూసుకుంటారు.. జూద క్రీడల పట్ల మక్కువ చూపే బడా బాబులను గుర్తించేందుకు ఈ సంస్థలు విశాఖ, విజయవాడ, హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఏజెంట్లను కూడా నియమించుకుంటున్నాయి. ఏడాదికి ఒకసారి ప్రమోషన్ ఈవెంట్లు నిర్వహించి ఆకర్షిస్తున్నారు. ప్యాకేజీ మొత్తాన్ని స్థానిక ఏజెంట్‌కు చెల్లిస్తే విమాన టికెట్లు, బస దగ్గర నుంచి వారే చూసుకుంటారు. వసతి, విందు, మందు ఉచితంగా అందించడంతోపాటు డిపాజిట్ చేసిన మొత్తానికి కాసినో టోకెన్లు ఇస్తున్నారని వెళ్లిన చాలామంది కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నారని స్థానిక కాసినో ప్రియుడు ఒకరు తెలిపారు. మరికొంత మంది అయితే కాసినో టేబుళ్లను కొనుగోలు చేసి లాభనష్టాలను పంచుకునే విధంగా ఒప్పందాలు చేసుకుంటున్నారు. అవకాశమిస్తే విశాఖలో కాసినో: పర్యాటకులను ఆకర్షించడానికి విశాఖలో కాసినో ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన తమ దృష్టికి వచ్చిందని, ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తే ఇక్కడ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సెమసింఘే తెలిపారు. ఇప్పటికే నేపాల్‌లో ఏర్పాటు చేసిన కాసినోకి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. -
సినిమా సెట్ అనుకుంటే....తీరా..
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో తరచూ సినిమా, టీవీ షూటింగ్‌లు జరిగే సువిశాల ఫామ్‌హౌస్‌లో సాగుతున్న చీకటి దందాకు పోలీసులు తెర దించారు. గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న క్యాసినో బాగోతాన్ని రట్టు చేశారు. పోలీసుల దాడిలో 30 మంది అరెస్ట్ అయ్యారు. దేరామండి రోడ్డులోని 13 ఎకరాల లగ్జరీ ఫామ్‌హౌస్ నుంచి 13 విలాసవతంమైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. జూదం ఆడుతున్న 14 మందిని అదుపులోకి తీసుకున్నామని, క్యాసినో..బార్లో సేవలందిస్తున్న ఐదుగురు మహిళలనూ అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. లిక్కర్ బాటిల్స్, క్యాసినో చిప్స్, హుక్కాలను సీజ్ చేశామని వెల్లడించారు. గత ఏడాది అక్టోబర్‌లో దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో అక్రమంగా నిర్వహిస్తున్న క్యాసినోపై పోలీసుల దాడిలో ఎనిమిది మంది అరెస్ట్ అయ్యారు. కోట్లాది రూపాయల విలువైన దాదాపు 3000 గ్యాంబ్లింగ్ చిప్‌లను స్వాధీనం చేసుకున్నారు. భారత్‌లో గోవా, సిక్కిం, డామన్ మినహా క్యాసినోలు నిర్వహించడం చట్టవిరుద్ధం. -
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో బీభత్సం
-
కాసినోలో కాల్పులు
37 మంది మృతి ► ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఘటన.. ► దోపిడీ కోసం కాల్పులు ► పొగతో ఊపిరాడక బాధితుల మృతి మనీలా: ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలోని ఓ కాసినో.. రంగురంగుల లైట్ల వెలుగుల్లో జనం కేరింతలు. ఒక్కసారిగా రైఫిల్ పేలిన శబ్దం.. ప్రజలు బయటికి పరుగులు తీయడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. మరోవైపు టీవీ స్క్రీన్ పేలి పొగ దట్టంగా వ్యాపిం చడంతో చాలామంది అక్కడే కుప్పకూలారు. పోలీసులు కాసినోను చుట్టుముట్టి లోనికి ప్రవేశించారు. 5 గంటల తర్వాత.. కాల్పులు జరిపిన దుండగుడి మృతదేహంతోపాటు 37 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇదీ గురువారం అర్థరాత్రి కాసినోలో జరిగిన హృదయవిదారక ఘటన. రూ. 14 కోట్ల విలువజేసే కాసినో చిప్స్(ఆట కోసం వాడే కాయిన్స్) కోసమే దుండగుడు ఈ దారుణా నికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి కాసినోలోకి వచ్చినే దుండగుడు ఆటోమెటిక్ రైఫిల్‌తో కాల్పులు ప్రారంభించాడు. జనాన్ని టార్గెట్ చేయకుండా టీవీ ్రïస్కీన్‌కు గురిపెట్టి కాల్చా డు. టీవీ పేలి మంటలు వ్యాపించాయి. కాసి నో అంతా దట్టమైన పొగతో నిండిపో యిం ది. ప్రజలంతా బయటకు పరుగులు తీశారు. తొక్కిసలాటలో పలువురు గాయపడ్డారు. చాలామంది లోపలే చిక్కుకుపోయారు. ఇంగ్లిష్‌లో మాట్లాడిన ముష్కరుడు యూరో పియన్లా ఉన్నాడని, కాల్పుత తర్వాత అతడు పెట్రోల్ పోసుకుని నిప్పంటిచుకుని ఉంటాడని భావిస్తున్నారు. మృతుల్లో ఎవ రూ కాల్పుల్లో చనిపోలేదని, పొగలు వ్యాపిం చడంతో ఊపిరాడక మృతిచెందినట్లు పోలీ సులు తెలిపారు. ఇది ఉగ్రవాద దాడి కాద న్నారు. ఇదిలా ఉండగా ఈదాడికి పాల్ప డింది తామేనని ఐఎస్ ప్రకటించింది. -
గోవాలో క్యాసినోలు బంద్: కాంగ్రెస్ మేనిఫెస్టో
పణజీ: అధికారంలోకి వస్తే గోవాలోని అన్ని క్యాసినో(జూద శాలలు)ల్ని మూసి వేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం ఆ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. నదుల్లో సాగుతున్న క్యాసినోల్ని కూడా శాశ్వతంగా మూసివేస్తామని కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాదిత్య సిందియా పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల ఉపాధికి ఎలాంటి నష్టం వాటిల్లదని గోవా కాంగ్రెస్ అధ్యక్షుడు లుజిన్హో ఫలైరో చెప్పారు. -
నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు: సీఎం
పణజి: గోవా ఆర్థిక వ్యవస్థ కేసినో(పేకాట క్లబ్బులు)లపై ఆధారపడి ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ చెప్పారు. వాటిని మూసివేయడం లేదా సంఖ్యను పెంచడం చేయబోమని అన్నారు. ఆఫ్‌షోర్ (తీరానికి దూరంగా నీటి మధ్యలో ఏర్పాటు చేసేవి) కేసినోలను తరలించమని పర్సేకర్ చెప్పారు. గోవాలో ఎంతోమంది స్థానికులు కేసినోల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిని పొందుతున్నారన్నారు. అయితే తాను కేసినోల సంఖ్య పెంచడానికి మద్దతు పలుకుతున్నానని తనను తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరారు. పక్షుల సంరక్షణ కేంద్రానికి దగ్గరగా ఉన్న కేసీనోను తరలించాలని ఆదేశించినట్టు అటవీశాఖ మంత్రి రాజేంద్ర ఆర్లెకర్ వెల్లడించిన నేపథ్యంలో పర్సేకర్ ఈవిధంగా స్పందించారు. గోవాలో ఐదు ఆఫ్‌షోర్, మిగతావి మామూలు కేసినోలున్నాయి. కేసినోల వల్ల వ్యభిచారం, నేరాలు పెరుగుతున్నాయని ఆందోళనలు జరుగుతున్నాయి. -
పేకాట.. ప్రాణం తీసింది!!
-
ఒక రోజు సంపాదన వందకోట్లు!
ఒక వ్యక్తి ఒక రోజలో ఎంత సంపాదించగలడు.. మా అంటే వేయి.. లేదా లక్ష.. కాదంటే పది లక్షలు.. కానీ హంగ్‌కాంగ్‌కు చెందిన ఓ వ్యక్తి సంపాదన వింటే దిమ్మతిరిగిపోతుంది. ఆయన ఏకంగా వంద కోట్లు సంపాదించగలడు. ఆయన చేసే దందా ఏంటో తెలుసా.. గ్యాంబ్లింగ్.. పైగా అంతా చట్టబద్ధంగానే చేస్తాడు. ప్రభుత్వానికి పన్ను కడుతూనే. అతను ఎవరో తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. హంగ్‌కాంగ్‌కు చెందిన లూయి చీ వూ ఈ ఆటల స్వరూపాన్నే మార్చేశాడు. క్యాసినో, పేకాట వంటివాటిని నిజాయితీగా ఆడటం నేర్పించాడు. మోసం, దగా, అవినీతి అనేది లేకుండా చేశాడు. దీంతో జనాల్లో లూయి గ్యాంబ్లింగ్‌పై నమ్మకం ఏర్పడింది. అదే అతనికి కోట్లు సంపాదించి పెట్టింది. ప్రస్తుతం అతని సంపద 66 వేల 340 వేల కోట్లు.. అంటే మన ముఖేష్ అంబానీ ఆస్తుల కన్నా ఎక్కువ.. ఈ విషయాన్ని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ అనే సంస్థ ఇటీవల లెక్క తేల్చి చెప్పింది. ఆసియా ధనవంతుల్లో లూయి రెండో వ్యక్తిగా నిర్ధారించింది. లూయి చీ వూకు ఇంత ఆస్తి ఉన్నా.. అతను ఎలాంటి ఆడంబరాలకు వెళ్లడు. 83 ఏళ్లు వయస్సులోనూ.. బిజినెస్ విస్తరణ గురించే ఆలోచిస్తాడు. ఐదుగురు కొడుకుల్లో.. పెద్ద కొడుకు ఫ్రాన్సిస్ లూయి గ్యాంబ్లింగ్ బిజినెస్ వ్యాపారాలు చూస్తుంటాడు. లూయి ప్రధాన ఆదాయ వనరు గేమ్స్ అయినా.. రియల్ ఎస్టేట్, హోటల్స్ కూడా ఉన్నాయి. చైనాలో క్యాసినో మార్కెట్లో లూయి కింగ్. గెలాక్సి ఎంటర్టైన్మెంట్ పేరుతో ఓ సంస్థను ప్రారంభించాడు. దీని ద్వారా చైనాలోని మాకావ్ రాష్ట్రంలో ఆరు క్యాసినో సెంటర్లను ఏర్పాటు చేశాడు. ప్రపంచంలో అతి పెద్ద క్యాసినో సెంటర్‌ను మాకావ్ ఉంది. అది లూయిదే. మాకావ్ రాష్ట్ర బడ్జెట్‌కు లూయి వ్యాపారాల ద్వారా వచ్చేదే ప్రధాన ఆదాయ వనరు. బడ్జెట్లో 24 శాతం లూయి కట్టే ట్యాక్సే ఉంటుంది. ప్రభుత్వానికి ట్యాక్స్‌లు ఎగ్గొట్టడాలేం ఉండవని అతడు తరుచూ చెబుతుంటాడు. అయితే.. లూయి ప్రారంభంలో అంటే.. 1950 మొదటిసారిగా జపాన్ నుంచి చిన్న చిన్న వస్తువులు తెప్పించి.. చైనాలో అమ్మేవాడు. ఆ తర్వాత గ్యాంబ్లింగ్ వ్యాపారంలోకి ప్రవేశించాడు. అప్పటి నుంచి అతని సంపద గ్రాఫ్ ఆకాశ మార్గం పట్టింది. -
క్యాసినో... ‘డామన్’!
గ్యాంబ్లింగ్‌కి, బెట్టింగ్‌కి పేరొందిన మకావూ, లాస్ వెగాస్ తరహాలో దేశీయంగా డామన్‌లోనూ అతి పెద్ద క్యాసినో సిద్ధమవుతోంది. ఏకంగా 10 ఎకరాల విస్తీర్ణంలో డెల్టా కార్ప్ దీన్ని సిద్ధం చేస్తోంది. భారత్‌లో గ్యాంబ్లింగ్ (రేసింగ్‌లు, బెట్టింగ్‌లు మొదలైనవి)మార్కెట్ విలువ ఏటా సుమారు 60 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ఇందులో సగభాగం అక్రమంగానే జరుగుతోంది. ప్రస్తుతం దేశీయంగా కొన్ని రాష్ట్రాలు మాత్రమే క్యాసినోలను అనుమతిస్తున్నాయి. సిక్కిం, గోవాలో మాత్రమే క్యాసినోలు ఉండగా.. తాజాగా పంజాబ్ వీటిపై దృష్టి సారిస్తోంది. ఇక, ఇక్కడ కుదరని వారు మకావూ, సింగపూర్, లాస్ వెగాస్ వంటి చోట్లకు వెడుతున్నారు. మొత్తం గ్యాంబ్లింగ్ మార్కెట్ టర్నోవర్‌లో సుమారు నాలుగు శాతం వాటా భారతీయులదే ఉంటోందని అంచనా. దీంతో ఇందులో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయి. దీనిలో భాగంగానే డెల్టా కార్ప్ దేశంలోనే అతి పెద్ద క్యాసినో ‘ది డెల్టిన్’ని డామన్ భూభాగంపై ఏర్పాటు చేస్తోంది. (ప్రస్తుతం చాలా మటుకు క్యాసినోలు ఆఫ్‌షోర్ అంటే సముద్ర భాగంలో ఉంటున్నాయి). డెల్టా కార్ప్‌కి గోవాలో 3 ఆఫ్‌షోర్ క్యాసినోలు ఉన్నాయి. అనేక ప్రత్యేకతలు..: ది డెల్టిన్లో 10 ఎకరాల్లో 60,000 చదరపు అడుగుల గేమింగ్ స్పేస్ ఉంటుంది. ఇందులో 187 గదులు కూడా ఉంటాయి. అలాగే, మూడు బార్లు, వివిధ రకాల వంటకాలను వడ్డించే నాలుగు రెస్టారెంట్లు ఉంటాయి. కార్పొరేట్ క్లయింట్ల కోసం డెల్టా కార్ప్ ప్రత్యేకంగా 29,000 చ.అ. స్థలం కేటాయిస్తోంది. దీన్ని కాన్ఫరెన్సులు, ఇన్డోర్ మీటింగులు, ఎగ్జిబిషన్లు మొదలైన వాటికి ఉపయోగించుకోవచ్చు. అలాగే, అంతర్జాతీయ క్యాసినోల తరహాలో 8,000 చ.అ. స్థలంలో హై ఎండ్ రిటైల్ బ్రాండ్స్ కొలువుతీరనున్నాయి. క్యాసినో ఏర్పాటుకు డామన్‌ని ఎంచుకోవడానికి ప్రత్యేక కారణం ఉందని వివరించారు డెల్టా కార్ప్ చైర్మన్ జైదేవ్ మోడి. అటు ముంబైకి, ఇటు గుజరాత్‌కి దగ్గర్లో ఉండటం వల్లే దీన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. ముంబై నుంచి 3 గంటల ప్రయాణ దూరంలోనూ, గుజరాత్‌లోని ప్రధాన నగరాలకు ఇది దగ్గర్లోనూ ఉంది. ఏటా 20 శాతం వృద్ధి.. గోవాలో డెల్టా కార్ప్‌కి చెందిన క్యాసినో వ్యాపారం గణనీయంగా వృద్ధి చెందుతోంది. కంపెనీ క్యాసినోలకి వచ్చే వారి సంఖ్య ఏటా 20% పెరుగుతోంది. డెల్టా కార్ప్‌కి చెందిన ఇతర క్యాసినోలకు వచ్చే వారు ప్రతిసారీ సగటున రూ.12,000-15,000 ఖర్చు చేస్తున్నారు. ఈ క్యాసినోలకు వచ్చే వారిలో భారతీయులే ఉంటున్నారు. 24-34 ఏళ్ల మధ్య వయస్సు గలవారు పోకర్ని ఆడేందుకు ఇష్టపడుతున్నారని మోడి వివరించారు.