
సాక్షి, హైదరాబాద్: చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఈడీ మళ్లీ విచారణ షురూ చేసింది. హవాలా లావాదేవీలపై దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే చీకోటి ప్రవీణను పలుమార్లు విచారించిన ఈడీ.. ప్రస్తుతం ఈ కేసులో పలువురు ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్సీ ఎల్ రమణ, మెదక్ డీసీసీబీ చైర్మన్ దేవేందర్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. చీకటితో కలిసి నేపాల్‌కు వెళ్లిన ప్రముఖులను విచారించనుంది.
వీరితోపాటు మంత్రి తలసాని శ్రీనివాస్ సోదరులు మహేష్, ధర్మేందర్ యాదవ్‌కు నోటీసులు అందగా.. బుధవారం వారు ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.. మనీలాండరింగ్, హవాలా వ్యవహారంలో ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. చీకటితో కలిసి తలసాని మహేష్, ధర్మేందర్ యాదవ్ విదేశాలకు వెళ్లిన్నట్లు గుర్తించారు.
ఎనిమిది గంటలుగా తలసాని సోదరులను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. విదేశాల్లో కేసినో నిర్వహణ, ఆర్థిక లావాదేవీలపై ఈడీ ప్రశ్నిస్తోంది. ఫెమా యాక్ట్ నిబంధనలు, మనీ ల్యాండరింగ్‌పై ఈడీ కూపీ లాగుతోంది. హవాలా చెల్లింపులపై కూడా ఈడీ ప్రశ్నిస్తోంది. ఇప్పటికే మరికొందరికి నోటీసులు ఇచ్చిన ఈడీ.. సుమారు వంద మంది కేసినో కస్టమర్లను చీకోటి ప్రవీణ్, మాధవ్ రెడ్డిల కాల్ డేటా ఆధారంగా ఈడీ వివరాలు సేకరించింది. ట్రావెల్ ఏజెన్సీ ద్వారా ఫ్లైట్స్ టికెట్స్ బుకింగ్స్ వివరాలు ఈడీ సేకరించింది.
చదవండి: CM KCR: కేంద్రం టార్గెట్‌గా సీఎం కేసీఆర్ కొత్త వ్యూహం!
Comments
Please login to add a commentAdd a comment