Chikoti Praveen
-
బీజేపీలో చేరిన చీకోటి ప్రవీణ్
కాచిగూడ (హైదరాబాద్): ధర్మరక్ష సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సమక్షంలో శనివారం ఆ పార్టీలో చేరారు. బర్కత్‌పురలోని బీజేపీ నగర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రవీణ్‌తోపాటు ఆయన అనుచరులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు, పార్టీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్.గౌతంరావుతో కలిసి డీకే అరుణ మాట్లాడుతూ సీఎం పదవి కోసం మంత్రి కేటీఆర్.. సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతుంటే ఆస్పత్రిలో చేర్పించకుండా ఫామ్‌హౌస్‌లో ఉంచడం అనుమానాలకు దారితీస్తోందన్నారు. సీఎం ఆరోగ్యంపట్ల జాగ్రత్తలు తీసుకోకుండా మంత్రులు కేటీఆర్, హరీశ్రావులిద్దరే తెలంగాణలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారని, ఎవరికి వారే సీఎం పదవి కోసం పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు. ఉద్యోగాల కోసం దొంగ నోటిపికేషన్లు వేసి నిరుద్యోగులను మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కానిస్టేబుల్ పరీక్షల ఫలితాలు ప్రకటించారని, అందులో కూడా అభ్యర్థులకు తీవ్ర నష్టం జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రవీణ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిందని, ధర్మరక్షణ కోసం బీజేపీలో చేరినట్లు తెలిపారు. అధిష్టానం నిర్ణయం మేరకు పార్టీ కోసం పనిచేస్తానని, పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచి అయినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. -
అమిత్ షా జోక్యంతో లైన్ క్లియర్.. బీజేపీలో చేరిన చీకోటి ప్రవీణ్
సాక్షి, హైదరాబాద్: క్యాసినో కింగ్‌గా అందరి దృష్టిలో నిలిచిన చీకోటి ప్రవీణ్ కుమార్ బీజేపీలో చేరారు. బర్కత్‌పూరలోని బీజేపీ కార్యాలయంలో చీకోటివెళ్లి పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ చీకోటి ప్రవీణ్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కాగా చికోటి ప్రవీణ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. హైదరాబాద్‌లోని ఏఓ ఒక క నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలోనే చీకోటి బీజేపీలో చేరాలనుకున్నారు. ఇందుకు బీజేపీ ఆఫీస్‌కు తన అనుచరులతో వెళ్తే పార్టీలో చేర్చుకునేందుకు నేతలు నిరాకరించారు. కండువా కప్పేందుకు పార్టీ ఆఫీస్‌లో ఎవరు లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. చదవండి: హంగు కాదు.. బీజేపీ డకౌట్ అవుతుంది: హరీష్ రావు కిషన్ రెడ్డికి ఇష్టం లేక.. తాజాగా చికోటి ప్రవీణ్‌కు బీజేపీ అగ్ర నాయకత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడంతో కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా జోక్యంతో చీకోటికి లైన్ క్లియర్ అయ్యింది. ప్రవీణ్‌ను పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ రాష్ట్రనాయకత్వానికి అమిత్ షా ఆర్డర్ వేశారు. అయితే చీకోటిని బీజేపీలో చేర్చుకోవడం కిషన్ రెడ్డికి ఇష్టం లేకపోవడంతో డీకే అరుణ సమక్షంలో చేరారు. కేసీఆర్ ఆరోగ్యం నిర్లక్ష్యం చేయోద్దు ఈ సందర్భంగా డీకే అరుణ మీడియా ముందు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఆరోగ్యంపై అనుమానాలున్నాయన్నారు. ముఖ్యమంత్రి కావాలన్న ఆత్రుతతో కేసీఆర్ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని కోరుతున్నట్లు తెలిపారు. కేసీఆర్‌ను జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. ఒక్కసారి బీజేపీకి అధికారం ఇచ్చి చూడండి ‘బావ బావమరుదులు ఆదరాబాదరాగా పనులు పూర్తికాకుండానే తెళ్లసున్నాలు వేసి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఎన్నికల కోసం జిమ్మిక్కులు చేస్తున్నారు. గృహలక్ష్మి పథకం ఇన్నాళ్లు గుర్తురాలేదా?. తెలంగాణ ప్రజలను మోసం చేయవద్దు. తండ్రి ఆరోగ్యంపై ఆందోళన లేకుండా... సీఎం కావాలనే ఆరాటంలోనే కేటీఆర్ ఉన్నారు. దొంగ నోటిఫికేషన్లు వేసి.. పేపర్లు లీక్ చేసి నిరుద్యోగులను మోసం చేశారు. ఒక్కసారి బీజేపీకి అధికారం ఇచ్చి చూడండి. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారు. కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉంటే తనకేంటి అన్నట్లు కేటీఆర్ వ్యవహరిస్తున్నారు. పెద్దాయనను ఫాంహౌజ్‌లో పడుకోబెట్టి నువ్వా నేనా అన్నట్టుగా కేటీఆర్, హరీష్ పరిగెత్తుతున్నారు. వారి ఉరుకులాట సీఎం పదవి కోసమే. ఎన్నికల గిమ్మిక్కులను ప్రజలు నమ్మొద్దు’ అని అన్నారు. -
నిన్న కృష్ణయాదవ్.. నేడు చికోటి
-
బీజేపీలో చికోటి చేరికకు బ్రేకులు
సాక్షి, హైదరాబాద్: చికోటి ప్రవీణ్ బీజేపీలో చేరికపై నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీజేపీలోకి చేరడానికి మంగళవారం.. పెద్ద సంఖ్యలో అభిమానులతో కలిసి కర్మన్‌ఘాట్ నుంచి నాంపల్లి వరకు చికోటి భారీగా ర్యాలీగా వెళ్లారు. కానీ చివరి నిముషంలో బీజేపీలో చేరికకు ప్రవీణ్‌కు బ్రేకులు పడ్డాయి. రేపు దీక్ష కారణంగా సీనియర్లు అందుబాటులో లేరని బీజేపీ కార్యాలయం సిబ్బంది చెప్పడంతో ఆయన నిరాశగా వెనుదిరిగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ పట్ల అభిమానంతో వచ్చానన్న చికోటి.. మిస్ కమ్యూనికేషన్ ఉండొచ్చన్నారు. జాతీయ నేతలతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ స్పూర్తితోనే పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన క్యాసినో కేసులో చీకోటి ప్రవీణ్ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రవీణ్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కూడా విచారించింది. కాగా, తెలంగాణలో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ.. పార్టీల్లోకి చేరికలు పెరుగుతున్నాయి. చదవండి: తెలుగు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు? -
బీజేపీలో చేరుతున్న చికోటీ ప్రవీణ్.. నేడు భారీ ర్యాలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ.. పార్టీల్లోకి చేరికలు పెరుగుతున్నాయి. ఎవరూ ఊహించని విధంగా తెరపైకి కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. చీకోటి ప్రవీణ్ బీజేపీలో చేరేందుకు ముహర్తం ఫిక్స్ అయ్యింది. నేడు కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సమక్షంలో చికోటీ ప్రవీణ్ బీజేపీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో అభిమానులతో కలిసి బీజేపీ ఆఫీసుకి చికోటీ ప్రవీణ్ భారీ ర్యాలీతో రానున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు కర్మాన్‌ఘాట్‌లోని హనుమాన్ టెంపుల్ నుంచి భారీ ర్యాలీ తీయనున్నారు. ఎల్బీనగర్ మీదుగా దిల్సుఖ్నగర్, నల్లగొండ క్రాస్‌రోడ్స్, మలక్‌పేట్, కోఠి, అబిడ్స్, నాంపల్లి వరకు ర్యాలీ జరగనుంది. ఇక, బీజేపీలో చేరికపై చికోటీ ప్రవీణ్ స్పందిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ స్పూర్తితోనే పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అక్రమాలకు బీజేపీనే అడ్డుకోగలదని.. అందుకనే బీజేపీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన క్యాసినో కేసులో చీకోటి ప్రవీణ్ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రవీణ్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కూడా విచారించింది. ఇది కూడా చదవండి: తెలంగాణ బీజేపీలో ఇక పరిశీలన పర్వం -
బండి సంజయ్‌ని కలిసిన చీకోటి ప్రవీణ్
సాక్షి, ఢిల్లీ: చికోటి ప్రవీణ్.. తెలంగాణలో సంచలనం సృష్టించిన పేరు. విదేశాల్లో అక్రమ క్యాసినో నడిపించిన వ్యవహారంలో ఫెమా నిబంధనల ఉల్లంఘన, హవాలా చెల్లింపులపై ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ప్రవీణ్.. అటుపై నిబంధనలకు విరుద్ధంగా కొన్ని జంతువుల్ని పెంచుకున్నాడనే అభియోగాలు సైతం ఉన్నాయి. ఈ క్రమంలో గతకొంతకాలంగా రాజకీయాల్లోకి వస్తాడంటూ జరుగుతున్న ప్రచారానికి తాజా పరిణామాలు మరింత ఊతం ఇచ్చాయి. చికోటి ప్రవీణ్ రాజకీయాల్లోకి వస్తాడనే ప్రచారానికి బలం చేకూర్చేలా ఇవాళ కొన్ని పరిణామాలు జరిగాయి. బీజేపీలో చేరొచ్చనే సంకేతాలు ఇస్తూ.. గురువారం ఢిల్లీలో కొందరు తెలంగాణ బీజేపీ నేతలను కలిశాడు ప్రవీణ్. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణలను కలిశాడు. వాళ్లకు శాలువా కప్పి సత్కరించాడు. వీళ్లతో పాటు తాజాగా బీజేపీలో చేరిన జయసుధను సైతం ప్రవీణ్ కలిశాడు. బీజేపీలో చేరడానికి లైన్ క్లియర్ చేసుకునే క్రమంలోనే వీళ్లందరినీ కలుస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. అయితే ఇక్కడి నేతలను ఢిల్లీ వెళ్లి మరీ కలవడం గమనార్హం. ఇక.. వివాదాలతో వార్తల్లోకి ఎక్కుతున్న వ్యక్తి, పైగా ఈడీలాంటి దర్యాప్తు సంస్థ విచారణ ఎదుర్కొంటున్న ప్రవీణ్‌ను బీజేపీ అక్కున చేర్చుకుంటుందా? తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. -
బోనాల వేళ చికోటి ప్రవీణ్ ఓవరాక్షన్.. పోలీసుల దెబ్బకు పరారీ
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన లాల్‌దర్వాజ బోనాల సందర్భంగా అమ్మవారి ఆలయం వద్ద చికోటి ప్రవీణ్ ఓవరాక్షన్ ప్రదర్శించిన విషయం తెలిసిందే. చికోటి ప్రవీణ్ లాల్ దర్వాజ ఆలయంలోకి ప్రైవేటు సెక్యూరిటితో వెళ్లారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది ప్రైవేటు సెక్యూరిటీని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, వీరి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాగా, రిమాండ్ రిపోర్టు ప్రకారం.. చికోటి ప్రవీణ్ పరారీలో ఉన్నాడు. ప్రవీణ్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు. ఈ కేసులో చికోటి ప్రవీణ్‌ను పోలీసులు ఏ1గా చేర్చారు. లాల్ దర్వాజ బోనాల్లో టాస్క్‌ఫోర్స్‌కు పట్టుబడ్డ ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది వద్ద లైవ్ రౌండ్స్, మూడు తుపాకులు స్వాధీనం చేసుకున్నాం. ఈ నేపథ్యంలో చికోటి సహా మరో ముగ్గురిపై కేసులు నమోదు అయ్యింది. చీటింగ్ సహా ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. సాయుధ వ్యక్తిగత గార్డులుగా కొనసాగేందుకు అధికారం లేదు. లైసెన్స్ లేకుండా అక్రమంగా చికోటీ ప్రైవేటు సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ముగ్గురు నిందితులు సిఆర్ఫీఎఫ్ నుండి రిటైర్ అయ్యి.. ఎలాంటి లైసెన్స్ లేకుండానే సెక్యూరిటీ ఉద్యోగం చేసుకుంటున్నారని తెలిపారు. తమకు వచ్చే జీతం సరిపోకపోవడంతో చికోటిని ఆశ్రయించిన ముగ్గురు ప్రైవేట్ గన్ మెన్‌గా ఉంటామని ఆయన్ని ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. పర్సనల్ సెక్యూరిటీ కోసం చికోటి దగ్గరికి వెళ్లిన ఈ ముగ్గురు తాము వెపన్స్ ఉపయోగించకూడదు అని చికోటికి చెప్పినా అతను పట్టించుకోలదని చెప్పారు. అదంతా తాను చూసుకుంటానని.. ఎక్కడ లైసెన్స్ క్యారీ చేయద్దు అని చికోటి వారికి చెప్పినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిసిందని వెల్లడించారు. అయితే, ప్రవీణ్ ప్రస్తుతం గోవాలో తలదాచుకున్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో అతి త్వరలోనే చీకోటి ప్రవీణ్‌ను ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది కూడా చదవండి: పొలిటికల్ అలర్ట్.. తెలంగాణలో చక్రం తిప్పిన కాంగ్రెస్! -
సాక్షి చేతిలో చికోటి రిమాండ్ రిపోర్ట్
-
వచ్చే ఎన్నికల్లో నేనేంటో చూపిస్తా..
-
పోలీసుల అదుపులో చీకోటి ప్రవీణ్ సెక్యూరిటీ సిబ్బంది
-
చికోటి ప్రవీణ్‌కు షాక్.. సెక్యూరిటీ సిబ్బందిపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: క్యాసినో వ్యవహారంలో సంచలనం సృష్టించిన చికోటి ప్రవీణ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆదివారం లాల్ దర్వాజా సింహవాహిణి అమ్మవారి ఆలయం వద్దకు అనుమతి లేకుండా ఆయుధాలు కలిగిన ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని వెంట తీసుకెళ్లినందుకు చత్రినాక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. చీకోటి సహా ముగ్గురిపై పోలీసులు చీటింగ్‌తోపాటు ఫోర్జరీ, ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. A1గా చికోటి, A2గా రాకేష్, A3గా సుందర్ నాయక్, A4గా రమేష్ గౌడ్లుగా చేర్చారు. ఈ కేసులో చీకోటి ప్రవీణ్‌కు చెందిన ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందిని (సుందర్ నాయక్, రాకేష్ కుమార్, రమేష్) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేగాక వారి వద్ద ఉన్న ఆయుధాల లైసెన్స్ ఫేక్ డాక్యుమెంట్స్‌గా పోలీసులు తేల్చారు. నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కాగా బోనాల పండుగ సందర్భంగా చీకోటి ప్రవీణ్ ఆదివారం సింహావాహిని అమ్మవారి గుడికి వెళ్లిన విషయం తెలిసిందే. ప్రైవేట్ సెక్యూరిటీని తెచ్చుకున్న ప్రవీణ్ వారితో కలిసి ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులు ప్రైవేట్ సెక్యూరిటీని అడ్డుకున్నారు. వాళ్లను తనిఖీ చేయగా ఆయుధాలు బయటపడటంతో ఖంగుతున్నారు. జన సమూహంలోకి ప్రైవేటు సిబ్బందితో రావడం చట్టరీత్యా నేరం కావడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముగ్గురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త.. అయితే వెపన్స్ లైసెన్స్ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఏడాది క్రితమే ఛత్రినాక పోలీస్ స్టేషన్‌కు పంపామని చీకోటి ప్రవీణ్ చెబుతున్నారు. తనకు ప్రాణ హాని ఉందని ప్రైవేట్ భద్రత ఏర్పాటు చేసుకున్నానని తెలిపారు. గన్స్కు లైసెన్స్ ఉందని తమకు డాక్యుమెంట్స్ చూయించారని వెల్లడించారు. డాక్యుమెంట్స్ మొత్తం పరిశీలించాలని లోకల్ పోలీస్ స్టేషన్లలో సమర్పించానని, వారు డాక్యుమెంట్స్ చూసి ఎలాంటి నివేదిక ఇవ్వలేదని పేర్కొన్నారు. ఇప్పుడు డాక్యుమెట్స్ ఫోర్జరీ అని కేసు నమోదు చేశారని తెలిపారు. ఫోర్జరీ డాక్యుమెంట్స్ అని సైదాబాద్ పోలీసులు ముందే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఇందుకు పోలీసుల తప్పిదమే కారణమని చెప్పారు. ఫోర్జరీ డాక్యుమెంట్స్ ఉంటే చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలో పార్టీ జాయిన్ గురించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. తనను రాజకీయంగా ఎదుర్కొనలేక తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మతం కోసం, హిందూత్వం కోసం తాను పోరాటం చేస్తూనే ఉంటానని, గజ్వేల్ ఘటన తర్వాత తనను టార్గెట్ చేశారని పేర్కొన్నారు. -
పోలీసుల అదుపులో చికోటి ప్రవీణ్ ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది
-
లాల్‌దర్వాజ బోనాలు: ఆలయం వద్ద చికోటీ ప్రవీణ్ ఓవరాక్షన్!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని లాల్‌దర్వాజలో బోనాల సందడి నెలకొంది. ఆలయాల దగ్గర బోనాలతో మహిళలు బారులుతీరారు. లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారిని కొలిచేందుకు భక్తి శ్రద్ధలతో భక్తులు ఆలయానికి తరలి వచ్చారు. కాగా, లాల్ దర్వాజ అమ్మవారి ఆలయం వద్ద చికోటి ప్రవీణ్ ఓవరాక్షన్ ప్రదర్శించారు. చికోటి ప్రవీణ్ లాల్ దర్వాజ ఆలయంలోకి ప్రైవేటు సెక్యూరిటతో వెళ్లారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది ప్రైవేటు సెక్యూరిటీని అడ్డుకున్నారు. ఇక, ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్స్ వద్ద వెపన్స్ ఉండటంతో పోలీసులు కంగుతిన్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. జన సమూహంలోకి ప్రైవేటు సిబ్బందితో రావడం చట్టారీత్యా నేరమని తెలిపారు. అనంతరం.. ముగ్గురు సెక్యూరిటీ గార్డ్స్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక, వెపన్స్‌కు లైసెన్స్ లేకపోతే కేసులు నమోదు చేయనున్నట్టు పోలీసులు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో లాల్‌దర్వాజ బోనాల సందడి.. పట్టు వస్త్రాలు సమర్పించిన తలసాని -
తెలంగాణలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా..ఏ పార్టీ నుంచి అంటే.
-
రాజకీయాల్లోకి వస్తున్నా.. సంచలనం రేపుతున్న చికోటి ప్రవీణ్ లేటెస్ట్ ఇంటర్వ్యూ
-
టీడీపీ నేత పట్టాభి అధికారం లేక పిచ్చిమాటలు మాట్లాడుతున్నాడు: చికోటి
సాక్షి, హైదరాబాద్: థాయిలాండ్ క్యాసినో కేసులో ఈడీ ఎదుట సోమవారం విచారణకు హజరైన చికోటి ప్రవీణ్ సాక్షి టీవీతో మాట్లాడారు. తాను ఆర్గనైజర్ కాదు అని పేర్కొన్నారు. థాయ్‌లాండ్ క్యాసినో కేసులో తన ప్రమేయం లేదన్నారు. అందుకే అక్కడి న్యాయస్తానం తమకు 2000 బాత్‌లు(రూ.4,850) ఫైన్ విధించి వదిలేసిందన్నారు. థాయ్‌లాండ్‌లో కేసు ముగిసిందన్నారు. ఈడీ అడిగిన అన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని, దర్యాప్తు సంస్థ మీద తనకు పూర్తి నమ్మకం ఉందని చికోటి అన్నారు. మళ్లీ ఎప్పుడూ పిలిచినా అందుబాటులో ఉండాలని చెప్పారని వివరించారు. టీడీపీ నేత పట్టాభి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని చికోటి మండిపడ్డారు. ఆయనకు అధికారం లేక పిచ్చిమాటలు మాట్లాడున్నాడని ధ్వజమెత్తారు. తన భుజంపై తుపాకీ పెట్టి ప్రత్యర్థులను కాల్చే కుట్ర సాగుతోందన్నారు. త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేస్తానని, ఏ పార్టీలో చేరేది ప్రకటిస్తానని అన్నారు. తనను రాజకీయాల్లోకి రానివ్వకూడదనే రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు కనీసం సెన్స్ లేదని, అందుకే పట్టాభి లాంటి వ్యక్తిని పార్టీ అధికార ప్రతినిధిగా పెట్టుకున్నాడని మండిపడ్డాడు. పట్టాభి అన్నీ పనికిరాని మాటలు చెబుతున్నాడని, ఆయన తీరు చూస్తే మతి భ్రమించినట్టుగా భావిస్తున్నానని చికోటి చెప్పాడు. చికోటి ప్రవీణ్ సాక్షి టీవీకి ఇచ్చిన పూర్తి ఇంటర్వ్యూ ఈ లింకులో చూడవచ్చు. చదవండి: హైదరాబాద్‌లో ఉగ్రవాద కార్యకలాపాలపై దర్యాప్తు ముమ్మరం..మరో ఇద్దరు అరెస్టు -
ఈడీ ముందుకు చీకోటి ప్రవీణ్
సాక్షి, హైదరాబాద్: థాయ్‌లాండ్ క్యాసినో కేసులో అక్కడి పోలీసులకు పట్టుబడిన చీకోటి ప్రవీణ్‌కుమార్ సోమవారం ఈడీ అధికారుల విచారణకు హాజరయ్యారు. థాయ్‌లాండ్‌లో క్యాసినో ఆడేందుకు భారత్ నుంచి వెళ్లిన వారిని ఆ దేశ పోలీసులు ఇటీవల అరెస్టు చేయడం తెలిసిందే. చీకటితోపాటు దేవేందర్, మాధవరెడ్డి, సంపత్‌లకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ట్రావెల్ ఏజెంట్ సంపత్ ఈడీ విచారణకు హజరయ్యారు. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో హవాలాకు ఆస్కారం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో.. ఆర్థిక లావాదేవీలతోపాటు నగదు బదిలీపై చీకోటి ప్రవీణ్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. కాగా కేసినో కేసులో గతంలో చీకోటి ప్రవీణ్‌ను ఈడీ విచారించింది. చదవండి: మాంసం ప్రియులకు షాక్.. కొండెక్కిన కోడి ధర.. కేజీ చికెన్ ఎంతంటే? -
నేడు ఈడీ ముందుకు చికోటి ప్రవీణ్
-
నాకే సంబంధం లేదు .. ఉంటే వెంటనే వచ్చే వాడిని కాదు: చీకోటి
సాక్షి, హైదరాబాద్, కొండపాక(గజ్వేల్): మొన్నటికి మొన్న ఈడీ మనీలాండరింగ్ కేసు... నిన్నటికి నిన్న థాయ్‌లాండ్‌లో గుట్టురట్టయిన అక్రమ కెసినో వ్యవహారం... ఈ రెండింటిలోనూ ప్రధానంగా వినిపించిన పేరు చీకోటి ప్రవీణ్ కుమార్. నగరానికి చేరుకున్న ప్రవీణ్ పటాయా కెసినో వ్యవహారంపై స్పందిస్తూ మీడియాకు ఓ వీడియో విడుదల చేశారు. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని ఆరోపించారు. ఆ వీడియోలో ప్రవీణ్ మాట్లాడుతూ... ‘థాయ్‌లాండ్‌లో నేను ఎలాంటి ఈవెంట్ నిర్వహించలేదు. ఆ ఈవెంట్ దేవ్, సీత అనే వాళ్లు నిర్వహించారు. పోకర్ టోర్నమెంట్ 4 రోజులు పాటు జరుగుతోందని నాకు ఆహ్వానం పంపారు. నేను అక్కడకు వెళ్లిన నాలుగో రోజు సదరు హోటల్లోని కాన్ఫరెన్స్ రూమ్‌ను సందర్శించా. అందులో అడుగుపెట్టిన 15 నుంచి 20 నిమిషాల్లోనే పోలీసులు దాడి చేశారు. అప్పుడే నాకు వాళ్లు పంపింది నకిలీ ఆహ్వానపత్రిక అని తెలిసింది. ఆ అక్రమ కెసినో నిర్వహించింది నేనే అయితే ఇంత తేలిగ్గా తిరిగి రాలేను. అలాంటి వాటికి అక్కడ కఠినమైన శిక్షలు ఉన్నాయి. థాయ్‌లాండ్‌లో అక్రమంగా పేకాట శిబిరాలు నిర్వహిస్తే ఆరు నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్షపడుతుంది. నా పాస్‌పోర్టు కూడా బ్లాక్‌లిస్ట్ చేసే వాళ్లు. పోలీసులు దాడి చేసిన రోజు అక్కడి న్యాయస్థానానికి సెలవు. మరుసటి రోజు కోర్టులో స్వల్ప జరిమానాతో విడిచిపెట్టారు’ అని వివరించారు. నామీద చాలా కుట్రలు ‘నా చుట్టూ చాలా కుట్రలు జరుగుతున్నాయి. నేను రాజకీయ పార్టీలోకి వస్తున్నానని కొందరు అనుకుంటున్నారేమో..! ఇంకా దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పటాయాలో అక్రమ కెసినోతో నాకు ఎలాంటి సంబంధం లేదని నిర్వాహకులు దేవ్, సీత కూడా అక్కడి పోలీసుల వద్ద అంగీకరించారు. ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి నేను అక్కడ రూ.50 లక్షలు లంచం ఇచ్చానని జరుగుతున్న ప్రచారం సత్యదూరం. ఆ ఈవెంట్‌కు నాకు ఎలాంటి సంబంధం లేదు’అని ప్రవీణ్ అన్నారు. నాకేం సంబంధం లేదు: దేవేందర్‌రెడ్డి థాయ్‌లాండ్‌లోని పటాయాలో జరిగిన గ్యాంబ్లింగ్ డెన్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా కొండపాకలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విహార యాత్రకు వెళ్లగా.. అక్కడి హోటల్లో ఇండియన్ ఫుడ్ తయారు చేయించామంటూ స్నేహితులు చెప్పడంతో ఆ హోటల్‌కు వెళ్లామన్నారు. 10 నిమిషాల్లోనే పోలీసులు వచ్చి పట్టుకున్నారని చెప్పారు. అక్కడ ఫోకర్ గేమ్ మాత్రమే పెట్టారని తెలిపారు. తమపై పెట్టిన కేసు నిరాధారమంటూ కోర్టు కొట్టివేసిందన్నారు. కొందరు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. చీకోటి ప్రవీణ్ -
‘చీకోటి’ దందాలో మంచిర్యాల వాసులు! థాయ్‌ల్యాండ్‌లో పట్టుబడినట్లు ప్రచారం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: థాయ్‌లాండ్‌లో గ్యాబ్లింగ్ ఆడుతూ పట్టుబడిన వారిలో జిల్లా వాసులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో కీలకంగా ఉన్న ‘చీకోటి’తో చాలా కాలంగా జిల్లా వారితోనూ సంబంధాలు ఉన్నాయి. గతంలో గోవా, హైదరాబాద్ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న జూదాల్లో పాల్గొంటున్నవారు ఉన్నారు. ఈనెల 1న థాయ్ పోలీసులు చట్టవిరుద్ధంగా గ్యాబ్లింగ్ చేస్తున్నారంటూ అక్కడి ఓ హోటలో రైడింగ్ చేశారు. ఈ రైడ్‌లో 93 మందిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో 83 మంది భారతీయులే. వారి నుంచి సెల్ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడినవారిలో ఎక్కువగా తెలుగు, అందులోనూ హైదరాబాద్, ఇతర జిల్లా ప్రాంత వాసులు ఉన్నారు. రాష్ట్రానికి చెందిన వారిలో వ్యాపారులు, రాజకీయ నాయకులు, రియల్టర్లు, ఉద్యోగులు ఉన్నారు. మంచిర్యాల జిల్లా నుంచి కూడా ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. దేశం దాటిన జూదం.. జిల్లాకు చెందిన పేకాటరాయుళ్లు.. పొరుగున ఉన్న మహారాష్ట్ర వెళ్లి పేకాడడం సాధారణం. ఇన్నాళ్లు రాష్ట్రం దాటిన జూదం.. ఇప్పుడు దేశం దాటినట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రానికి చెందిన ఓ కాంట్రాక్టర్‌తోపాటు గతంలో పేకాట వ్యసనంలో ఆరి తేరిన ఒకరు ఉన్నట్లు సమాచారం. జిల్లా నుంచి పలువురు పేకాట, కేసినో ఆడేందుకు తరచూ గోవా వెళ్తుంటారు. ఇటీవల జిల్లా నుంచి కొందరు దుబాయ్ మీదుగా థాయ్‌లాండ్ వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక కొందరు థాయ్‌లాండ్ జరుగుతున్న గ్యాబ్లింగ్‌ను లైవ్‌లో సీసీ కెమెరాలతో హైదరాబాద్‌లో వీక్షిస్తూ, డబ్బులు పెట్టి ఆడుతున్నారు. ఇందులో ఈ ప్రాంత వాసులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కేసు, దర్యాప్తు అంతా విదేశాల్లోనే జరుగుతుండడంతో అధికారికంగా వివరాలేవి వెల్లడికావడం లేదు. తెలంగాణలో నిషేధం.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పేకాటను పూర్తిగా నిఽషేధించారు. దీంతో రమ్మీ లాంటి ఆటలు ఆడేందుకు వీలు లేకుండా పోయింది. ఏళ్లుగా పేకాటకు బానిసలుగా ఉన్న కొందరు కొంతకాలంపాటు మహారాష్ట్రలోని చంద్రాపూర్, రాజురా, సిరోంచ, సిర్పూర్ టీ సరిహద్దు పోడ్సా తదితర ప్రాంతాల్లో పేకాట క్లబ్‌ల్లో రాత్రింబవళ్లు ఆడేవారు. జిల్లా నుంచి ప్రతీరోజు అనేక మంది వెళ్తుండేవారు. జిల్లా వాసులే పేకాట నిర్వాహకులుగా ఉండేవారు. ఫంటర్లు (పేకాట ఆడేవారు)వాహనాల్లో తీసుకెళ్లేవారు. స్పోర్ట్స్ క్లబ్‌ల మాటున.. స్పోర్ట్స్ క్లబ్‌ల మాటున అనధికారికంగా రూ.కోట్ల దందా సాగుతున్న తీరును మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని నిర్వాహకులపై కేసులు నమోదు చేయడంతో అన్నిచోట్ల క్లబ్‌లు బంద్ అయ్యాయి. ఇప్పటికీ జిల్లాలో మామిడితోటలు, అపార్ట్మెంట్లు రహస్య స్థావరాల్లో పేకాడుతూ పోలీసులకు చిక్కుతున్నారు. అప్పట్లో తెలంగాణ మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రా సరిహద్దు గ్రామాల్లో కొన్నాళ్లు పేకాట సాగింది. అన్ని చోట్లారైడింగ్లు జరుగుతుండడంతో రూటు మార్చి పేకాటరాయుళ్లు గోవా, దుబాయ్, థాయ్‌లాండ్‌కు వెళ్లి అడుతున్నట్లు తెలుస్తోంది. అక్కడ పేకాట కన్నా కేసినోకు ఎక్కువగా డిమాండ్ ఉండడంతో వ్యసనపరులు ఆ గేమ్‌లోనూ డబ్బులు పెట్టి ఆడుతున్నట్లు సమాచారం. విదేశీ పర్యటన పేరుతో రోజుల తరబడి వెళ్లి లక్షల రూపాయలు పోగొట్టుకుని ఇంటికి చేరుతున్నారు. -
నేను నిర్దోషిని: చికోటి ప్రవీణ్
సాక్షి, హైదరాబాద్: చీకోటి ప్రవీణ్ సహా 84 మంది భారతీయుల అరెస్టుకు కారణమైన థాయ్‌లాండ్‌లోని అక్రమ క్యాసినోలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై అక్కడి పోలీసులు స్పష్టత ఇచ్చారు. గత నెల 27 నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు రూ.50 కోట్ల టర్నోవర్ జరిగినట్లు తేల్చారు. ఈ మేరకు చోన్బూరీ ప్రావిన్స్ పోలీసు చీఫ్ కంపోన్ లీలప్రపపోన్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఏడు అంతస్తుల్లో విస్తరించిన ఆసియా హోటల్లో మొత్తం 300 గదులు ఉన్నాయి. గత నెల 27న కొన్ని రూముల్లోకి దిగిన 84 మంది ఆ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో వెలసిన అక్రమ జూదగృహంలో పేకాట, స్నూకర్ ఆడుతున్నారు. గేమింగ్ చిప్స్‌తో లావాదేవీలు జరుగుతుండగా ఆ వివరాలను 40 గేమింగ్ క్రెడిట్ పుస్తకాల్లో నమోదు చేస్తున్నారు. నాలుగు రోజుల్లోనే రూ.50 కోట్ల లావాదేవీలు వాటిలో నమోదైనట్లు చోన్బూరీ పోలీసులు గుర్తించారు. చికోటి స్పందన.. థాయిలాండ్ వ్యవహారంపై చికోటి ప్రవీణ్ మంగళవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. తనకు దేవ్, సీత అనే వ్యక్తుల నుంచి ఫోకర్ టోర్నమెంట్ ఉందని ఆహ్వానం అందితేనే థాయ్‌లాండ్ వచ్చానని పేర్కొన్నారు. ఇక్కడ గ్యాంబ్లింగ్ నిషేధం అనే విషయం తనకు తెలియదని, ఆ అక్రమ క్యాసినో నిర్వాహకుడిని తాను కాదన్నారు. తన నిర్దోషిత్వాన్ని థాయ్ పోలీసుల ఎదుట నిరూపించుకున్నట్లు చెప్పారు. సదరు హాల్లోకి తాను అడుగు పెట్టిన పది నిమిషాలకే పోలీసులు దాడి చేశారన్నారు. హైదరాబాద్‌లో స్ట్రీమ్ అయ్యేలా: అక్రమంగా నడుస్తున్న ఈ పేకాట శిబిరంపై అక్కడి పోలీసులకు అదే హోటల్లో బస చేసిన ఓ గోవా వాసి ద్వారా సమాచారం అందింది. హోటల్‌పై దాడి చేసిన పోలీసులు అందులో నాలుగు పేకాట టేబుళ్లు, మూడు పోకర్ టేబుళ్లు ఉన్నట్లు గుర్తించారు. 16 మంది మహిళల సహా 84 మంది భారతీయులు, థాయ్‌లాండ్‌కు చెందిన నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలను పట్టుకున్నారు. వీరిలో చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి సహా అనేక మంది తెలుగు వాళ్లు ఉన్నారు. వీరందరికీ థాయ్‌లాండ్ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. పూచీకత్తుగా 4,500 బాట్స్ (దాదాపు రూ.11వేలు) చెల్లించాలని ఆదేశించింది. ఈ తతంగమంతా పూర్తి చేసుకుని, పాస్‌పోర్టులు పొందిన తర్వాత భారతీయులంతా తిరిగి రానున్నారు. అయితే... ఆ పేకాట శిబిరంలో 8 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులు వాటిని ఇంటర్నెట్తో అనుసంధానించారు. ఆ లైవ్ ఫీడ్ హైదరాబాద్‌లో స్ట్రీమ్ అయ్యేలా ఏర్పాటుచేసినట్లు చోన్బూరీ పోలీసులు గుర్తించారు. సాధారణంగా ఇలాంటి అక్రమ ఈవెంట్లు భారీ పెట్టుబడితో ముడిపడి ఉంటాయి. ఈ నేపథ్యంలోనే నిర్వాహకులు నగదు కోసం ఫైనాన్షియర్లను ఆశ్రయిస్తుంటారు. అలాంటి ఫైనాన్షియర్ కోసమే ఈ క్యాసినో లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఆ హామీ మాకెందుకు ఇవ్వరు?: కేటీఆర్ -
థాయ్‌లాండ్‌లో చికోటి ప్రవీణ్‌కు బెయిల్ మంజూరు
సాక్షి, హైదరాబాద్: గ్యాంబ్లింగ్‌పై నిషేధం ఉన్న థాయ్‌లాండ్‌లో.. ఓ హోటల్లో రహస్యంగా క్యాసినో నిర్వహిస్తూ పట్టుబడిన చికోటి ప్రవీణ్‌కు థాయ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్‌ను థాయ్ కోర్టు మంజూరు చేసింది. చికోటి ప్రవీణ్‌తో పాటు 83 మందికి బెయిల్ మంజూరైంది. 4500 బాట్స్ జరిమానాను కోర్టు విధించింది. ఫైన్ కట్టించుకుని పాస్‌పోర్టులను పోలీసులు తిరిగిచ్చేశారు. కాగా, థాయ్‌లాండ్ చోనుబురి జిల్లా బాంగ్ లమంగ్‌లోని ఆసియా పట్టాయా హోటల్ హోటల్ వద్ద పెద్ద ఎత్తున్న గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నారని గోవా నుంచి ఓ వ్యక్తి, థాయ్ పోలీసులకు అందించిన సమాచారం ఆధారంగా అక్కడి పోలీసులు రైడ్ నిర్వహించారు. పోలీసులను చూడగానే అక్కడున్నవాళ్లంతా పరుగులు అందుకున్నారు. అయితే సకాలంలో స్పందించిన పోలీసులు వాళ్లను తప్పించుకోనివ్వలేదు. మొత్తం 93 మందితో కూడిన ముఠాను థాయ్‌లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. చివరికి.. ఆ ముఠాకు బాస్ చికోటి ప్రవీణ్‌గా తేలిన విషయం తెలిసిందే. చదవండి: థాయ్‌లాండ్‌లో చికోటి చీకటి దందా.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు -
థాయిలాండ్ గ్యాంబ్లింగ్ కేసులో సంచలన విషయాలు
-
చికోటి చీకటి దందా.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు
సాక్షి, హైదరాబాద్: చికోటి ప్రవీణ్ చీకటి దందా బయటపడింది. గ్యాంబ్లింగ్‌పై నిషేధం ఉన్న థాయ్‌లాండ్‌లో.. ఓ హోటల్లో రహస్యంగా క్యాసినో నిర్వహిస్తూ పట్టుబడ్డాడు చికోటి. ఈ క్రమంలో ఈ కేసు విచారణను థాయ్ పోలీసులు వేగవంతం చేయగా.. దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. థాయ్‌లాండ్ చోనుబురి జిల్లా బాంగ్ లమంగ్‌లోని ఆసియా పట్టాయా హోటల్ హోటల్ వద్ద పెద్ద ఎత్తున్న గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నారని గోవా నుంచి ఓ వ్యక్తి, థాయ్ పోలీసులకు సమాచారం అందించారు. ఆ సమాచారం ఆధారంగా రైడ్ నిర్వహించారు అక్కడి పోలీసులు. పోలీసులను చూడగానే అక్కడున్నవాళ్లంతా పరుగులు అందుకున్నారు. అయితే సకాలంలో స్పందించిన పోలీసులు వాళ్లను తప్పించుకోనివ్వలేదు. మొత్తం 93 మందితో కూడిన ముఠాను థాయ్‌లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. చివరికి.. ఆ ముఠాకు బాస్ చికోటి ప్రవీణ్‌గా తేలింది. ప్రభుత్వ ఉద్యోగులు కూడా! మొత్తం 93 మందిలో 80 మంది భారతీయులే ఉన్నారు. వాళ్లను స్వయంగా వెంటపెట్టుకుని మరీ థాయ్‌లాండ్‌కు తీసుకెళ్లిన చికోటి.. వాళ్లతో ఆటాడిస్తూ వస్తున్నాడు. చివరికి పక్కా సమాచారంతో ఈ రాకెట్‌ను చేధించారు థాయ్ పోలీసులు. అయితే.. అరెస్ట్ అయిన వాళ్లలో హైదరాబాద్‌కు చెందిన పలువురు వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు, పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. మెదక్ డీసీసీబీ చైర్మన్.. బీఆర్ఎస్ నేత చిట్టి దేవేందర్‌రెడ్డితో పాటు ఇసుక వ్యాపారి సాగర్, మరికొందరు వ్యాపార ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లేకాకుండా గాజులరామారం వీఆర్ఏ వాసు సైతం అరెస్ట్ అయిన వాళ్లలో ఉన్నాడు. గత నెల 27వ తేదీ నుంచి థాయ్‌లాండ్ వెళ్లి క్యాసినో ఆడుతున్నాడు వాసు. అయితే.. అనుమతి లేకుండా థాయ్‌లాండ్ వెళ్లిన వాసును తాజాగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు కలెక్టర్. వాసుతో పాటు వెళ్లిన వర్మ, యాన్సాగర్ అనే ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యారు. క్యాసినోకు ఫైనాన్స్ చేసిన వినోద్‌రెడ్డితోపాటు చికోటి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి, తిరుమలరావు, బిల్డర్ మధు అరెస్ట్ అయ్యారు. ప్రముఖ ట్రావెల్స్ ఓనర్‌ను కూడా థాయ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ పేరు బయటకు రావాల్సి ఉంది. ఆమె సహకారం.. భారీగా వసూళ్లు అక్రమంగా క్యాసినో నిర్వహణ కోసం ఫేమస్ పట్టాయా హోటల్‌ను ఎంచుకున్నాడు చికోటి. ఈ వ్యవహారంలో సితార్నన్ కెల్వెల్కర్ అనే మహిళ చికోటికి కుడి భుజంగా వ్యవహరించిందని పోలీసులు నిర్ధారించారు. ఫకిన్ అనే థాయ్ వ్యక్తిని నియమించుకుని మరీ గ్యాంబ్లింగ్ వ్యవహారం ఆమె నడిపించిదట. ఇక గ్యాంబ్లింగ్ నిర్వహణ కోసం ఇల్లీగల్ మైగ్రేంట్ వర్కర్స్‌ను సైతం చికోటి ఉపయోగించినట్లు తెలిసింది. పట్టాయాలో గ్యాంబ్లింగ్ వ్యవహారంపై దాడి నిర్వహించిన థాయ్ పోలీసులు.. అక్కడి సెటప్ చూసి ఆశ్చర్యపోయారు. సుమారు రూ.20 కోట్లు విలువ చేసే ఇండియన్ కరెన్సీతో పాటు కోట్లు విలువ చేసే గేమింగ్ చిప్స్‌ను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆట ఆడేందుకు ఒక్కో భారతీయుడి నుంచి అక్కడ కరెన్సీ ప్రకారం 50 వేల బాట్స్(మన కరెన్సీలో లక్షా ఇరవై వేల రూపాయల దాకా..) చికోటి వసూలు చేసినట్లు తెలుస్తోంది. సదరు హోటల్లో కన్వెన్షన్ హాల్‌ను క్యాసినోగా మార్చేసిన చికోటి.. నాలుగు బక్కరాట్, మూడు బ్లాక్‌జాక్ టేబుల్స్ ఏర్పాటు చేయించాడు. అక్కడి గేమింగ్‌ను సీసీ కెమెరాల ద్వారా హైదరాబాద్‌కు లైవ్ రికార్డింగ్ కనెక్ట్ చేశాడని థాయ్ పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన చికోటి ఇప్పటికే ఈడీ నుంచి ఫెమా దర్యాప్తును ఎదుర్కొంటున్నాడు. భారత్‌తోపాటు నేపాల్లోనూ క్యాసినో నిర్వహణకుగానూ.. ఫెమా నిబంధనలు ఉల్లంఘించి ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు ఈడీ అభియోగాలు నమోదు చేసింది. ఇదీ చదవండి: కేంద్రం తీరుపై హరీష్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు -
థాయ్ లాండ్ పోలీసుల అదుపులో చికోటి, మాధవరెడ్డి, దేవేందర్ రెడ్డి