
సాక్షి, హైదరాబాద్: క్యాసినో నిర్వహిస్తూ కోట్ల రూపాయల హవాలాకు పాల్పడుతున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్ స్పందించాడు. క్యాసినో విషయంలోనే ఈడీ అధికారులు సోదాలు చేసినట్టు మీడియాతో చెప్పాడు. మనదేశంలోని గోవాలో క్యాసినో లీగల్ అని ప్రవీణ్ చెప్పుకొచ్చాడు. దీంతోపాటు నేపాల్, ఇండోనేషియాలో క్యాసినో లీగల్ అని తెలిపాడు.
తాను చేసింది లీగల్ వ్యాపారమేనని అన్నాడు. తానొక సామాన్య వ్యక్తినని ప్రవీణ్ వ్యాఖ్యానించాడు. ఈడీ అధికారులకు కొన్ని సందేహాలు ఉన్నాయని.. అందుకే వాళ్లు వివరణ అడిగారని చెప్పాడు. వాళ్లు కొన్ని ప్రశ్నలు వేస్తే సమాధానాలు చెప్పానని అన్నాడు. వారికి ఏమేం వివరాలు కావాలో చెప్తానని ప్రవీణ్ మీడియాతో వెల్లడించాడు. సోమవారం మరోసారి విచారణకు రమ్మన్నారని, హాజరవుతానని పేర్కొన్నాడు.
(చదవండి: క్యాసినోవాలా... కోట్ల హవాలా! మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖ హీరోలు కస్టమర్లే..)
Comments
Please login to add a commentAdd a comment