ఈడీ ముందుకు చీకోటి ప్రవీణ్‌   | Chikoti Praveen appear ED On 15th May | Sakshi
Sakshi News home page

థాయ్‌లాండ్‌ క్యాసినో కేసు.. ఈడీ ముందుకు చీకోటి ప్రవీణ్‌  

Published Mon, May 15 2023 11:53 AM | Last Updated on Mon, May 15 2023 2:31 PM

Chikoti Praveen appear ED On 15th May - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: థాయ్‌లాండ్‌ క్యాసినో కేసులో అక్కడి పోలీసులకు పట్టుబడిన చీకోటి ప్రవీణ్‌కుమార్‌ సోమవారం ఈడీ అధికారుల విచారణకు హాజరయ్యారు. థాయ్‌లాండ్‌లో క్యాసినో ఆడేందుకు భారత్‌ నుంచి వెళ్లిన వారిని ఆ దేశ పోలీసులు ఇటీవల అరెస్టు చేయడం తెలిసిందే. చీకటితోపాటు దేవేందర్‌, మాధవరెడ్డి, సంపత్‌లకు ఈడీ నోటీసులు ఇచ్చింది.

ఇప్పటికే ట్రావెల్‌ ఏజెంట్‌ సంపత్‌ ఈడీ విచారణకు హజరయ్యారు. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో హవాలాకు ఆస్కారం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో.. ఆర్థిక లావాదేవీలతోపాటు నగదు బదిలీపై  చీకోటి ప్రవీణ్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. కాగా కేసినో కేసులో గతంలో చీకోటి ప్రవీణ్‌ను ఈడీ విచారించింది.
చదవండి: మాంసం ప్రియులకు షాక్‌.. కొండెక్కిన కోడి ధర.. కేజీ చికెన్‌ ఎంతంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement