
సాక్షి, కృష్ణా జిల్లా: డాన్ చీకోటి వ్యవహారంపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చీకోటి వ్యవహారాన్ని తమపై ఆపాదించడం సరికాదన్నారు. టీడీపీ నేతలకు దమ్ముంటే తనను ఈడీతో అరెస్ట్ చేయించాలని సవాల్ విసిరారు. గుడివాడిలో జూదం అంటూ వచ్చిన టీడీపీ నిజనిర్థారణ కమిటీ నివేదిక ఈడీకి ఇవ్వాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. దేశంలో ఏం జరిగినా.. చంద్రబాబు భజన బృందం తమకు ముడిపెడుతున్నారని ఆయన మండిపడ్డారు.
చదవండి: మరి కేంద్రం అప్పుల సంగతి ఏంటి?: ఎంపీ విజయసాయిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment