React
-
ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటన.. రాహుల్ గాంధీ రియాక్షన్..
ఢిల్లీ: ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటనపై ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రభుత్వ సంస్థల బాధ్యతారాహిత్యానికి సామాన్య ప్రజలు మూల్యం చెల్లించకుంటున్నారని మండిపడ్డారు. భారీ వర్షాల కారణంగా సివిల్స్ శిక్షణా కేంద్రంలోకి వరద పోటెత్తి ముగ్గురు అభ్యర్థులు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాల పట్ల రాహుల్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.‘‘ఢిల్లీలోని ఓ భవనం బేస్మెంట్లో నీరు చేరి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మృతి చెందడం చాలా బాధాకరం. గతంలో వర్షాలకు విద్యుత్ షాక్ కారణంగా ఓ విద్యార్థి మృతి చెందాడు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ ఘటన వ్యవస్థల వైఫల్యం. అసురక్షిత నిర్మాణం, పేలవమైన భవన నిర్మాణ ప్రణాళిక, సంస్థల బాధ్యతారాహిత్యం వల్ల సామాన్య పౌరులు తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. సురక్షితమైన, సౌకర్యవంతమైన జీవితం ప్రతీ పౌరుడి హక్కు. దాన్ని అందించడం ప్రభుత్వాల బాధ్యత’’ అంటూ రాహుల్ ట్విట్ చేశారు. दिल्ली की एक बिल्डिंग के बेसमेंट में पानी भर जाने के कारण प्रतियोगी छात्रों की मृत्यु बहुत ही दुर्भाग्यपूर्ण है। कुछ दिन पहले बारिश के दौरान बिजली का करंट लगने से एक छात्र की मृत्यु हुई थी।सभी शोकाकुल परिजनों को अपनी भावपूर्ण संवेदनाएं व्यक्त करता हूं।इन्फ्रास्ट्रक्चर का ये…— Rahul Gandhi (@RahulGandhi) July 28, 2024 -
తండ్రి ఓటమిపై స్పందించిన ‘చిరుత’ హీరోయిన్
లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై దేశమంతా ఆసక్తికనబరిచింది. ఈ ఎన్నికల్లో కంగనా రనౌత్, అరుణ్ గోవిల్ తదితర నటులతో పాటు బాలీవుడ్ నటి నేహా శర్మ తండ్రి అజిత్ శర్మ కూడా పోటీ చేశారు. ఆయన బీహార్‌లోని భాగల్పూర్ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేశారు. అయితే జేడీయూ అభ్యర్థి అజయ్ మండల్ చేతిలో శర్మ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.తన తండ్రి ఓటమిపై నేహా శర్మ ఆవేదనతో సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఆమె తమ కుటుంబానికి ఎదురైన అనుభవాన్ని కవితారూపంలో రాశారు. తన కుటుంబం తదుపరి అధ్యాయం ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నదని ఆమె దానిలో పేర్కొన్నారు.‘ఇది మాకు కష్టమైన రోజు. మేము అన్నివిధాలా పోరాడాం. మా నాన్నను నమ్మి ఆయనకు ఓటు వేసిన వారికి కృతజ్ఞతలు. మేము తదుపరి దశలో సాగే ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాం. ఓటమితో కుంగిపోకుండా ఎప్పుడూ ముందుకు సాగాలని మనం గుర్తుంచుకోవాలి. పర్వతంలా ధృడంగా నిలవాలి. సింహంలా గర్జించాలి. నిర్భయంగా నిలబడాలి. ధైర్యంగా ముందుకు సాగాలి’ అని నేహాశర్మ రాశారు. ఆమె భాగల్పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగిన తండ్రి తరపున విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. నేహా శర్మ తెలుగులో రామ్‌చరణ్ సరసన ‘చిరుత’ సినిమాలో నటించారు. -
నా పెళ్లి వార్తలు అవాస్తవం
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లిస్ట్‌లో విజయ్ దేవరకొండ ఒకరు. అప్పుడప్పుడు విజయ్ దేవరకొండ పెళ్లి గురించిన వార్తలు ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతూ ఉంటాయి. తాజాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నాల నిశ్చితార్థం జరగనుందని, వీరి వివాహ తేదీని కూడా త్వరలోనే ప్రకటిస్తారనే వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఓ ఆంగ్ల మ్యాగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ ఈ విషయంపై స్పందించారు. ‘‘ఈ ఫిబ్రవరిలో ఎవరితోనూ నా నిశ్చితార్థం జరగదు.. పెళ్లి లేదు. నా పెళ్లి గురించిన పుకార్లు తరచూ వస్తూనే.. వినిపిస్తూనే ఉన్నాయి. రెండేళ్లకో సారి నాకు పెళ్లి చేస్తూనే ఉన్నారు’’ అని చెప్పుకొచ్చారు విజయ్ దేవరకొండ. ఇక ప్రస్తుతం ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రంతో బిజీగా ఉన్నారు విజయ్ దేవరకొండ. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ వేసవిలో విడుదల కానుంది. -
చూపున్న పాట
‘నవ్వినా ఏడ్చినా కన్నీళ్లు వస్తాయి’ అన్నాడు కవి. పట్టలేని ఆనందంలో, ప్రశంసించడానికి మాటలు దొరకని పరిస్థితుల్లో కూడా కన్నీళ్లు వస్తాయి. మేనుక పౌదెల్ పుట్టు అంధురాలు. మంచి గాయకురాలు. ఇండియన్ ఐడల్ 14 సీజన్లో ‘లగాన్’ సినిమాలో లతా మంగేష్కర్ పాడిన ‘ఓ పాలన్ హరే’ పాట పాడింది. అద్భుతమైన ఆమె పాట వింటూ జడ్జీలలో ఒకరైన శ్రేయా ఘోషల్ ఏడ్చేసింది. ఈ ఎపిసోడ్ ఇంటర్నెట్లో వైరల్ అయింది. వైరల్ కావడం మాట ఎలా ఉన్నా ‘శ్రేయ ఓవర్‌గా రియాక్ట్ అయ్యారు’ అని కొందరు విమర్శించారు. మరి ఆమె అభిమానులు ఊరుకుంటారా? వాళ్లు ఇలా స్పందించారు...‘రెండు దశాబ్దాలకు పైగా శ్రేయ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉన్నారు. ఎన్నో జాతీయ అవార్డ్లు అందుకున్నారు. ఆమెకు ప్రతిభ లేకపోతే ఇలా వచ్చి అలా వెళ్లిపోయేవారు. ఇలాంటి టాలెంటెడ్ సింగర్ గురించి నెగెటివ్ కామెంట్స్ పెట్టడం తగదు’. -
ఆనంద్ మహీంద్ర గిప్ట్‌కు: ప్రజ్ఞానంద రియాక్షన్ ఇదీ!
RPraggnanandhaa Reacts Parents Long Term Dream పారిశ్రామికవేత్త, బిలియనీర్ తన తల్లి దండ్రులకు ప్రకటించిన బహుమతిపై భారత చెస్ గ్రాండ్ మాస్టర్, ఫైడ్ చెస్ ప్రపంచ కప్ రన్నర్ అప్ ఆర్ ప్రజ్ఞానంద స్పందించారు. ఒక ఎలక్ట్రిక్ కారుకోసం కల గన్న తన అమ్మా నాన్నల చిరకాల వాంఛను ("లాంగ్ టర్మ్ డ్రీమ్") తీర్చినందుకు ధన్యవాదాలు సార్ అంటూ ప్రజ్ఞానంద ట్వీట్ చేశారు. తన కృతజ్ఞతను తెలియజేయడానికి పదాలు లేవు...చాలా ధన్యవాదాలు అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రజ్ఞానంద సాధించిన ఘనతకు గౌరవంగా అతని తల్లిదండ్రులకు ఆల్-ఎలక్ట్రిక్ SUVని బహుమతిగా ఇవ్వాలని ఆనంద్ మహీంద్రా నిర్ణయించిన సంగతి తెలిసిందే. (ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు ఆనంద్ మహీంద్ర అదిరిపోయే గిఫ్ట్) కాగా పిల్లవాడి ఆసక్తిని గమనించి, ప్రోత్సహించిన ప్రజ్ఞానంద పేరెంట్స్ నాగలక్ష్మి రమేష్‌బాబులను ఆనంద్ మహీంద్ర అభినందించారు. ఇందులో భాగంగానే వారికి ఆల్ ఎలక్ట్రిక్ SUV XUV400ని ఇవ్వనున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అంతేకాదు దేశంలో తల్లిదండ్రులు దీన్ని ప్రేరణగా తీసుకోవాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే మహీంద్ర ఆల్ ఎలక్ట్రిక్ SUV XUV400ని ప్రత్యేక ఎడిషస్ను ఆ దంపతులకు ఇవ్వనున్నామని మహీంద్రా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవో బదులిచ్చారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. No words to express my Gratitude 🙏 Thankyou very much @anandmahindra sir and @rajesh664 sir It is a long term dream of my parents to own an EV car thanks for making it a reality! https://t.co/YWCK1D99ik — Praggnanandhaa (@rpragchess) August 29, 2023 Sky is the limit! @rpragchess and @GM_JKDuda showed us that the mind of a genius knows no bounds! #chess #mind pic.twitter.com/TWzvPefBNV — WR_Chess_Masters (@wr_chess) August 29, 2023 -
'టెంపుల్ ఆఫ్ టీ సర్వీస్' వృద్ధుని దుకాణంపై ఆనంద్ మహీంద్ర పోస్ట్..
'టీ ' అంటే మనందరికీ ఇష్టమే. ఉదయం లేచిన దగ్గర నుంచి టీ తాగకుండా ఇంకే పని మొదలుపెట్టము. పనిలో కాస్త ఇబ్బంది అనిపిస్తే వెంటనే ఓ కప్ టీ తాగి మళ్లీ ఫ్రెష్‌గా ప్రారంభిస్తాము. అందుకే ఏ సందులో చూసినా టీ షాప్ ఉంటుంది. ఇది ఎందరికో జీవనోపాధిని కల్పిస్తుంది. అయితే.. తాజాగా అమృత్‌సర్‌లో ఓ వృద్ధుడు కొనసాగిస్తున్న టీ షాప్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గత 45 ఏళ్లుగా వృద్దుడు ఓ మర్రి చెట్టు మొదలులో టీ షాప్‌ని నడిపిస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర షేర్ చేశారు. 'అమృత్‌సర్‌లో చాలా ప్రదేశాలు చూశాను. కానీ వీడియోలో కనిపిస్తున్న ఈ టీ షాప్‌ని ఎప్పుడూ చూడలేదు. ఈ సారి అమృత్సర్ వెళ్లినప్పుడు ఈ దుకాణాన్ని తప్పుకుండా చూస్తాను. గత 40 ఏళ్లుగా ఓ వృద్ధుడు నడిపిస్తున్న టీ షాప్‌ని 'టెంపుల్ ఆప్ టీ సర్వీస్' గా పేర్కొంటూ' ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. ఆలోచిస్తే మన హృదయమే దేవాలయం అని పోస్టులో పేర్కొన్నారు. ఈ వీడియోపై నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. There are many sights to see in Amritsar. But the next time I visit the city, apart from visiting the Golden Temple, I will make it a point to visit this ‘Temple of Tea Service’ that Baba has apparently run for over 40 years. Our hearts are potentially the largest temples.… pic.twitter.com/Td3QvpAqyl — anand mahindra (@anandmahindra) July 23, 2023 ఈ వీడియోలో 80 ఏళ్ల వయస్సు ఉన్న ఓ వృద్ధుడు ఓ భారీ వృక్షం సందులో టీ షాప్‌ని నిర్వహిస్తున్నాడు. గత 45 ఏళ్ల నుంచి తను ఒకటే పనిని కొనసాగిస్తున్నారు. అందరూ అతన్ని బాబాగా పిలుస్తారు. స్థానికంగా అతనంటే తెలియని వారుండరు. ఈ టీ విక్రయదారునికి పని పట్ల ఉన్న నిబద్ధత, విధేయత, ఆసక్తి నెటిజన్లను ఆకర్షించింది. Amidst the timeless charm of Amritsar, under the embracing canopy of a majestic tree, a venerable man gracefully serves the elixir of Indian Tea. With every cup poured, he weaves a tapestry of tradition, warmth, and hospitality, earning the title of the "Temple of Tea Service 😊 — Rahul Verulkar (@verulkar_rahul) July 23, 2023 The city has a lot of magnetic qualities. Truly Golden city.....City with the legendary Golden temple and seems to have lovable human beings like Babaji too 😍👏🥳🙏..... — Sunil Balachandran (@Sunil_bchandran) July 23, 2023 ఇదీ చదవండి: రామ నవమి అల్లర్ల కేసు.. సీఎం మమతా బెనర్జీకి సుప్రీంకోర్టు షాక్ -
రష్యా దుస్థితి చూసి..ప్రపంచ నాయకుల రియాక్షన్ ఎలా ఉందంటే..
ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో యుద్ధం వద్దు చర్చలే ముద్దు అని పిలుపునిచ్చిన రష్యా ఖాతారు చేయలేదు. ఊహించని విధంగా ఉక్రెయిన్‌పై దురాక్రమణ యుద్ధానికి సై అంటూ.. బాంబులతో దద్ధరిల్లే చేసింది రష్యా. దీంతో ఒక్కసారిగా దేశాలన్ని విస్తుపోయాయి. అక్కడికి ప్రపంచ నాయకులంతా ముందుకు వచ్చి రష్యాకు హితవు పలికిన ససేమిరా అంది. పైగా తమను తాము రక్షించుకునేందుకు చేస్తున్న ప్రత్యేక సైనిక యుద్ధంగా సమర్థించుకుంది. చివరికి రష్యానే ఊహించని రేంజ్లో ప్రైవేట్ సైనిక సంస్థ వాగ్నర్ గ్రూప్ ఇచ్చిన ఝలక్కి గడగడలాడింది. దీంతో రష్యా ఎదుర్కొన్న ఈ అసాధారణ పరిస్థితి గురించి ప్రపంచ నాయకులు ఏమన్నారంటే.. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అండదండగా ఉన్న ప్రైవేట్ సైనిక సంస్థ వాగ్నర్ గ్రూప్ రష్యాపై తిరుబాటు జెండా ఎగరేసింది. ఈ వాగ్నర్ గ్రూప్ అనేది కిరాయి సైన్యం. ఈ సంస్థకి చీఫ్ యెవ్గెనీ ప్రిగోజిన్. ఉక్రెయిన్ యుద్ధంలో కీలకంగా వ్యవహరించింది ఈ సంస్థ సైనికులే. అయితే తమ సైనికులకు తగిన గుర్తింపు లేదని పైగా తమ సైనికులనే లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగుతోందంటూ రష్యా మిలటరీపై ఆరోపణలు చేస్తూ ప్రిగోజిన్ రష్యాపై దాడి చేసేందుకు సన్నద్ధమయ్యారు. అంతేగాదు మిలటరీ నాయకత్వాన్ని కూల్చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అతని పేరే ఎత్తకుండకునే దేశద్రోహి, ఇలాంటి వాళ్లకు ఎప్పటికైనా శిక్షపడుతుందంటూ మీడియా ముందు పెడబొబ్బలు పెట్టారు పుతిన్. ప్రిగోజిన్‌పై తీవ్రవాదం వంటి నేరాలు మోపేందుకు రెడీ అయ్యారు కూడా. ఇలా ప్రకటించారో లేదో వాగ్నర్ సైన్యం రష్యాలో కల్లోలం సృష్టించింది. అప్పటికే ఆర్మీ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుని ఉత్తర రష్యా వైపు వస్తున్నట్లు ప్రకటించాడు ప్రిగోజిన్. దెబ్బకి రష్యా వెనక్కి తగ్గి.. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాశెంకోతో మంతనాలు జరిపించి పరిస్థితిని చక్కబెట్టుకుంది. పైగా ప్రిగోజిన్‌పై మోపిన నేరాన్ని ఎత్తివేయడమే గాక తిరుబాటులో పాల్గొన్న సైనికులపై కూడా ఎలాంటి విచారణ ఉండదని, యథావిధిగా విధులకు హాజరవ్వచ్చని రష్యా ప్రకటించడం విశేషం. పుతినే కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్‌ని పెంచి పోషించినట్లు సమాచారం. దీని అండ చూసుకునే ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగాడు. చివరికి అదే శూలంలా మారి గుండెల్లో గుచ్చుకుంది. ఈ ఘటన అతని దీర్ఘకాల నాయకత్వానికి పెను సవాలుగా మారడమేగాక సందిగ్ధంలో పడేసింది. ఇక రష్యా పని అయిపోయిందనకునేలా మచ్చెమటలు పట్టించింది వాగ్నర్ సైనిక సంస్థ. రష్యా తాను ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధం కరెక్ట్ అని సమర్థించుకుంటే..తానే పెంచి పోషించి.. రంగంలోకి దింపిన కిరాయి సైన్యమే ఎదురు తిరిగి ద్రోహం చేసేందుకు రెడీ అయ్యింది. తన వరకు వస్తేగానీ బాధ అంటే ఏంటో తెలియదంటే ఇదే కాబోలు. ఈ ఘటనతో రష్యా బలం, బలహీనతో ఏమిటో ప్రపంచ దేశాలకు అర్థమైపోయాయి. ఈ పరిణామాలన్నింటిని నిశితంగా గమనిస్తున్న కూటమి దేశాలకు కూడా ఈపాటికే అక్కడి పరిస్థితి అర్థమైపోయింది. ఈ పరిణామాలపై దేశాధి నేతల స్పందించారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షడు జో బైడెన్ కూడా రష్యా పరిస్థితిని గమనిస్తున్నారని, మిత్ర దేశాలతో చర్చలు జరుపుతున్నట్లు అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి ఆడమ్ హాడ్జ్ తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కీ కూడా రష్యా బలహీనత స్పష్టంగా కనిపిస్తోంది, దాడి చేసేందుకు ఈ కిరాయి సైన్యంపై ఆధారపడితే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తప్పవన్నారు. అంతేగాదు నాటో ప్రతినిధి ఓనా లుంగెస్కు కూటమి కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలపడం విశేషం. ఇక బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ సైతం పరిస్థితిని పర్యవేక్షించడమే గాక ఈ సమయంలో అన్ని దేశాలు సంయమనంతో వ్యవహరిస్తున్నాయన్నారు. కాగా, ఇదే క్రమంలో యూరోపియన్ యూనియన్ చీఫ్ చార్లెస్ మిచెల్ సైతం రష్యా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలిపారు. అలాగే జీ7 దేశాల భాగస్వామ్యాలతో టచ్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇది రష్యా అంతర్గత సమస్య అని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో ఉక్రెయిన్ మద్దతు విషయంలో మార్పు ఉండదని దృఢంగా తెలిపారు. Closely monitoring the situation in Russia as it unfolds. In touch with European leaders and @G7 partners. This is clearly an internal Russian issue. Our support for Ukraine and @ZelenskyyUa is unwavering. — Charles Michel (@CharlesMichel) June 24, 2023 (చదవండి: తిరుగుబాటు సైన్యంపై ప్రశంసల వర్షం కురిపిస్తోన్న స్థానికులు.. ) -
మెగా ప్రిన్సెస్ రాక.. నిహారిక రియాక్షన్ చూశారా?
రామ్‌చరణ్- ఉపాసనల దంపతులకు జూన్ 20న పండంటి పాప పుట్టింది. సాక్షాత్తూ లక్ష్మీదేవి తమ ఇంట అడుగుపెట్టిందని మెగా ఫ్యామిలీ సంబరాలు చేసుకుంటోంది. గత సంవత్సరం చివర్లో శుభవార్త అందినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తమ కుటుంబం ఎంతో సంతోషంగా ఉందని నిహారిక కొణిదెల మొదటిసారి ఇలా స్పందించింది. (ఇదీ చదవండి: మా నాన్న అందుకే అలా అయ్యారు.. రాకేష్ మాస్టర్ కుమారుడు ఫైర్) 'ఈ సంతోషం కోసం మా కుటుంబం మొత్తం ఎంతగానో నిరీక్షించింది. పాప పుట్టిన శుభవార్తతో మా ఆనందానికి అవధులు లేవు. ఆ సమయంలో పాపను చూడడానికి ఎక్కువసేపు వేచి ఉండలేకపోయాను. మా అందరి ఆనందాన్ని పాప రెట్టింపు చేసింది. దీంతో మా అన్నయ్య కుటుంబం సంపూర్ణంగా అనిపిస్తుంది. నాకు గుర్తున్నంత వరకు చరణ్ అన్న మా కజిన్స్ గ్రూప్‌కి పేరెంట్. అతను ఎప్పుడూ మా అందరికి రక్షణగా ఉంటాడు, అందుకే నేను అతనిని 'బాపూజీ' అని పిలుస్తాను. ఉపాసన వదిన ఒక శక్తివంతమైన మహిళ కాబట్టి వారిద్దరి సంరక్షణలో పాప మంచి ఉన్నతస్ధాయికి చేరుకుంటుంది.' అని నిహారిక తెలిపింది. (ఇదీ చదవండి: టాప్ లేకుండా వెళ్తేనే నిర్మాతలకు నచ్చుతారు: అర్చన) -
కీర్తి సురేష్ పెళ్లి పై ఆమే తండ్రి సీరియస్
-
కూతురు పెట్టిన పోలీసు కేసుపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి స్పందించారు
-
రఘునందన్ రావు ఎవరి మెప్పు కోసం నాపై ఆరోపణలు చేశారో తెలియదు
-
పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన దిల్ రాజు.. రాజకీయాల్లోకి వస్తాడా? రాడా?
సాక్షి, హైదరాబాద్: గత కొద్ది రోజులుగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తన రాజకీయ ప్రవేశంపై ఆయన స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సినీ పరిశ్రమలో నాపై చిన్న మాట వస్తేనే తట్టుకోలేను. అలాంటిది రాజకీయాల్లో అనేక అడ్డంకులు ఉంటాయి. తాను రాజకీయాల్లో వస్తానా లేదా అనేది అప్రస్తుతమంటూ దిల్ రాజు’’ వ్యాఖ్యానించారు. కాగా, ఇటీవల హాత్ సే హాత్ జోడోయాత్ర పేరుతో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా దిల్ రాజు తను స్వయంగా నిర్మించి, నిర్వహిస్తున్న ఆలయానికి రేవంత్‌రెడ్డిని ప్రత్యేకంగా పిలవడంతో రాజకీయ వర్గాల్లో దిల్ రాజు పొలిటికల్ అరంగేట్రంపై చర్చ మొదలైంది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి రేవంత్ వచ్చిన సందర్భంగా... మోపాల్ మండలంలోని దిల్ రాజు సొంత గ్రామం నర్సింగ్‌పల్లిలో నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయానికి పిలిచి ఆయనతో ప్రత్యేక పూజలు చేయించారు. ఈ కార్యక్రమంతో దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీకి బీజం పడ్డట్టేనన్న చర్చకు తెర లేచింది. అయితే అటు బలగం సినిమా సమయంలో మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్‌తోనూ ఆయన చనువుగా ఉండటాన్ని గమనించినవారు.. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ను కాదని.. దిల్ రాజు కాంగ్రెస్ వైపు ఎందుకు చూస్తారనే ప్రశ్నలు కూడా వినిపించాయి. చదవండి: దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా? రేవంత్‌తో ప్రత్యేక పూజలెందుకు? -
హైదరాబాద్ లో కుక్కల బెడదపై స్పందించిన కేటీఆర్
-
కందుకూరు సంఘటన దురదృష్టకరం : నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు
-
ప్రజ్ఞారెడ్డి వినతిపై స్పందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
-
సల్మాన్ రష్డీ దాడిపై మౌనం వీడిన ఇరాన్
టెహ్రాన్: బుకర్ ప్రైజ్ రచయిత, భారత సంతతికి చెందిన సల్మాన్ రష్డీ దాడిపై ఇరాన్ మౌనం వీడింది. దాడి వెనుక ఇరాన్ ప్రమేయం ఉందంటూ దాడి జరిగినప్పటికీ నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. అయితే దాడి విషయంలో తమను నిందిచడంపై ఇరాన్ తీవ్ర అసహనం వెల్లగక్కింది. ఈ దాడి విషయంలో నిందించాల్సింది.. సల్మాన్ రష్డీ, ఆయన మద్దతుదారులనేనని ఇరాన్ విదేశాంగ శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. వాక్ స్వాతంత్ర్యం అనేది.. తన రచనలో ఒక మతానికి వ్యతిరేకంగా రష్దీ చేసిన అవమానాలను ఎంత మాత్రం సమర్థించదు అని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి నాజర్ కన్నాని తెలిపారు. ఇస్లామిక్ పవిత్రతలను అవమానించడం ద్వారా ఆయన కోట్ల మంది ఉన్న ఇస్లాం సమాజం నుంచి వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. దాడికి ఆయన్ని, ఆయన అనుచరులను తప్ప ఎవరినీ నిందించలేం. అంతేగానీ.. ఈ దాడి విషయంలో అసలు ఇరాన్‌ను నిందించే హక్కు ఎవరికీ లేదు. అది మాకు సంబంధంలేని విషయం అని నాజర్ కన్నాని తెలిపారు. ‘నిందితుడిని పొగుడుతూ వెలువడ్డ కథనాలు, సోషల్ మీడియా సంబురాల’ గురించి మీడియా నుంచి ప్రశ్న ఎదురుకాగా.. ఆ కథనాలు ప్రధానంగా ప్రచురితం అయ్యింది మాజీ అధ్యక్షుడు అయతొల్లా రుహోల్లాహ్కు చెందిన పత్రికల్లోనే అని, ఇక సోషల్ మీడియాలో ప్రజాభిప్రాయాలను తప్పుబట్టడం సాధ్యం కాదని ఆయన వెల్లడించారు. సల్మాన్ రష్డీపై దాడికి పాల్పడ్డ నిందితుడు హాది మతార్ గురించి మీడియాలో చూడడమే తప్ప.. అతని గురించి తమకెలాంటి సమాచారం లేదని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఇదిలా ఉంటే.. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని అనుమానాలు ఉన్నాయి. 1998లో పబ్లిష్ అయిన ది సాటానిక్ వెర్సెస్.. ఇస్లాంకు వ్యతిరేకంగా ఉండడం, ఆ నిషేధిత నవలపై ఆగ్రహం వెల్లగక్కిన అప్పటి ఇరాన్ అధినేత అయతొల్లా రుహోల్లాహ్ ఖోమెయిని.. ఒక ఫత్వా జారీ చేశారు. రష్డీని చంపిన వాళ్లకు భారీ రివార్డు ప్రకటించారు. ఆ భయంతో దాదాపు చాలా ఏళ్లు సల్మాన్ రష్డీ అజ్ఞాతవాసంలోనే ఉండిపోయారు. శుక్రవారం న్యూయార్క్‌లో జరిగిన ఓ ఈవెంట్‌కు వెళ్లిన ఆయనపై నిందితుడు హాదీ మతార్.. పదునైన ఆయుధంతో దాడి చేశాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: కిమ్‌తో దోస్తీకి పుతిన్ తహతహ -
డాన్ చికోటి వ్యవహారంపై స్పందించిన కొడాలి నాని
-
డాన్ చీకోటి వ్యవహారంపై స్పందించిన కొడాలి నాని
సాక్షి, కృష్ణా జిల్లా: డాన్ చీకోటి వ్యవహారంపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చీకోటి వ్యవహారాన్ని తమపై ఆపాదించడం సరికాదన్నారు. టీడీపీ నేతలకు దమ్ముంటే తనను ఈడీతో అరెస్ట్ చేయించాలని సవాల్ విసిరారు. గుడివాడిలో జూదం అంటూ వచ్చిన టీడీపీ నిజనిర్థారణ కమిటీ నివేదిక ఈడీకి ఇవ్వాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. దేశంలో ఏం జరిగినా.. చంద్రబాబు భజన బృందం తమకు ముడిపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. చదవండి: మరి కేంద్రం అప్పుల సంగతి ఏంటి?: ఎంపీ విజయసాయిరెడ్డి -
కేఎల్ రాహుల్‌కి ఇష్టమైన క్రికెటర్ ఆయనే..
లాక్డౌన్ కారణంగా క్రికెటర్ కేఎల్ రాహుల్ ఇంట్లోనే సరదాగా గడుపుతూ ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటున్నాడు. తాజాగా తన కొత్త హెయిర్ కట్‌కి సంబంధించిన ఓ ఫోటోను షేర్ చేస్తూ.. "మైండ్ పోయింది, జుట్టు పోయింది "అంటూ సరదాగా ఓ క్యాప్షన్ కూడా జోడించాడు. దీనికి బాలీవుడ్ తారలు సైతం స్పందించారు. నటి అనుష్క రంజన్ గిల్టీ అనే చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రంజాన్ కపూర్ రాహుల్ హెయిర్‌కట్‌పై లాల్ అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు. ఈ ఏడాది మార్చిలో న్యూజిలాండ్‌తో టీమ్ ఇండియా చివరిసారిగా మ్యాచ్ ఆడగా, ఆ తర్వాత కరోనా కారణంగా అన్ని మ్యాచ్‌లు రద్దైన సంగతి తెలిసిందే. దీంతో ఎప్పుడూ బిజి బిజీగా గడిపే క్రికెటర్లకు బోలెడంత సమయం దొరికినట్లయ్యింది. దీంతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్ లాంటి క్రికెటర్లు రెగ్యులర్‌గా లైవ్ చాట్లతో అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. (పాక్ మాజీ క్రికెటర్ తౌఫిక్ ఉమర్‌కు కరోనా ) Mind gone, hair gone 🤯🔒 pic.twitter.com/RD6utJY3eW — K L Rahul (@klrahul11) May 23, 2020 ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న రాహుల్.. తన వర్కవుట్ వీడియోలను అభిమానులతో పంచుకున్నాడు. అంతేకాకుండా క్రికెట్, తన కెరియర్ లాంటి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. మీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు అని ఇటీవలె ఓ అభిమాని అడగ్గా..ఎబి డివిలియర్స్ తన ఆల్ టైమ్ ఫేవరెట్ బ్యాట్స్ మాన్ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 13 వ సీజన్లో పంజాబ్‌కు చెందిన ఫ్రాంచైజీకి కెఎల్ రాహుల్ నాయకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఐపీఎల్ ఆడాల్సి ఉన్నా కరోనా మహమ్మారి కారణంగా బీసీసీఐ మ్యాచ్‌ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. (కేంద్రం అనుమతిస్తేనే ఐపీఎల్ ) -
విశాఖ దుర్ఘటన: ఒక్క ఫోన్ కాల్ కాపాడింది
విశాఖ సిటీ, బీచ్ రోడ్డు, సాక్షి, అమరావతి: విశాఖలో విష వాయువు లీకేజీ ఘటనపై పోలీసు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రాణాలకు తెగించి విశేష సేవలందించాయి. సమాచారం అందిన పది నిమిషాల్లోనే పోలీసులు అక్కడకు చేరుకోవడం, ఉన్నతాధికారులు సైతం వెంటనే రంగంలోకి దిగి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను చేపట్టడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అధికార యంత్రాంగం సకాలంలో రంగంలోకి దిగడంతో ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగారు. జీవీఎంసీ కమిషనర్ సృజన ఆధ్వర్యంలో సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన పారిశుధ్య పనులను చురుగ్గా నిర్వహిం చారు. గ్రామాల్లో బ్లీచింగ్ చల్లారు. నీటిట్యాంకర్లతో గ్రామాల్లో నీటిని స్ప్రే చేయించారు. (విషవాయువు పీల్చి 10 మంది మృతి) ఒక్క ఫోన్ కాల్ కాపాడింది ► విషవాయువు వ్యాప్తి చెందిన సమయంలో స్థానికుడు ఒకరు సత్వరం స్పందించి డయల్ 100కు చేసిన ఒక్క ఫోన్ పెను ముప్పు నుంచి ప్రజలను కాపాడింది. తెల్లవారు జామున 3.25కి గ్యాస్ లీకైనట్టు స్థానికుడు అరుణ్‌కుమార్ డయల్ 100కి సమాచారమందించారు. పోలీసులు అదే వేగంతో స్పందించారు. ► 3.26కి ఎస్ఐ సత్యనారాయణతోపాటు నలుగురు కానిస్టేబుళ్లు ఆర్ఆర్ వెంకటాపురానికి రక్షక్ వాహనంలో బయలుదేరి 3.40కల్లా చేరుకున్నారు. వెంటనే మర్రిపాలెం పోలీస్‌స్టేషన్‌కు, అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. ► 3.40కి కంచరపాలెం సీఐ, ఆర్ఐ భగవాన్, గాజువాక ఎస్సై గణేష్‌లు సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టారు. ఇళ్లలో నిద్రిస్తున్న వారిని అప్రమత్తం చేశారు. సమీప ప్రాంతాల్లోని 4,500 కుటుంబాలను ఖాళీ చేయించారు. ► 3.45కి అగ్నిమాపక విభాగం సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. ► 3.45 – 4 గంటల మధ్య 12 రక్షక్ వాహనాలు, 108 వాహనాలు 15, అంబులెన్సులు 12, నాలుగు హైవే పెట్రోలింగ్ వాహనాలు çఘటన స్థలానికి చేరుకుని బాధితులను హుటాహుటిన తరలించాయి. మినీ బస్సులను సైతం ఏర్పాటు చేసి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ► 4.30 గంటలకు విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, డీసీపీ జోన్–2 ఉదయ్‌భాస్కర్‌లు అక్కడకు చేరుకుని తరలింపు ఆపరేషన్‌లో పాలుపంచుకున్నారు. ► 7 గంటలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు çఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ఉదయం 8కి లీకేజీని అదుపులోకి తెచ్చారు. ► ప్రజలను కాపాడే క్రమంలో విశాఖ డీసీపీ–2 ఉదయ్భాస్కర్తోపాటు మరో 20 మంది పోలీస్ సిబ్బంది విషవాయువు పీల్చడంతో అస్వస్థతకు గురయ్యారు. ► వందలమందిని రక్షించిన పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్లో అభినందించారు. విధులు నిర్వహిస్తూ అస్వస్థతకు గురైన ట్రాఫిక్ ఎస్ఐ వెంకటరావు బాధితులు ఏమన్నారంటే.. విశాఖపట్నం నగరంలోని గోపాలపట్నం సమీపంలో ఆర్ఆర్ వెంకటాపురంలో గురువారం తెల్లవారుజామున విష రసాయనం వెలువడటంతో ప్రజలు భీతిల్లిపోయారు. ఒళ్లంతా మంటలు.. దద్దుర్లు. ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో ప్రజలంతా ఉన్నఫళంగా బయటకు పరుగెత్తారు. వాహనాలు ఉన్నవారు ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడ నుంచి దూరంగా తమ బంధువులు, తెలిసినవారి ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డ బాధితులు ఏం చెబుతున్నారంటే.. స్పృహ కోల్పోయిన ఫైర్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ ఆరు కిలోమీటర్లు పరుగెత్తాం నేను.. ముగ్గురు పిల్లలు, నా చెల్లెలు జయలక్ష్మితో కలిసి బీసీ కాలనీలో నివసిస్తున్నాను. విష వాయువు నుంచి తప్పించుకోవడానికి తెల్లవారుజామున నాలుగు గంటలకి ఊరు విడిచి చీమాలపల్లి వైపు ఆరు కిలోమీటర్లు పరుగెత్తాం. నా చెల్లెలు మాత్రం వాం తులు, వికారంతో స్పృహ తప్పిపోయింది. దీంతో అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తరలిం చాం. ప్రస్తుతం స్పృహలోకి వచ్చింది. ప్రా ణాలతో బయటపడతామని అనుకోలేదు. – బిల్ల సూర్య దేముడు, బీసీ కాలనీ, విశాఖపట్నం నా కూతుళ్లు నిద్ర లేపారు మేము పాలిమర్స్ కంపె నీకి సమీపంలోనే నివాసం ఉంటున్నాం. ఉదయం నాలుగు గంటల సమయంలో నా కూతుళ్లు నిద్ర లేపారు. కంపెనీలో ఏదో ప్రమాదం జరిగిందని, అందరినీ వెళ్లిపోమంటున్నారని చెప్పారు. అప్పటికే తీవ్రమైన, భరించలేని వాసన వస్తోంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తొలుత చీమలాపల్లి వైపు పరు గులు తీశాం. ఆ తర్వాత మమ్మల్ని సింహాచలం వైపు వెళ్లమనడంతో అటు వెళ్లాం. – నీలాపు తాతారావు, వెంకటాపురం అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలిస్తున్న స్థానికులు ఊపిరి తీసుకోలేకపోయా పాలిమర్స్‌లో ప్రమాదం జరిగిందని నన్ను చుట్టుపక్కల వాళ్లు నిద్రలేపారు. అప్పటికే తీవ్రమైన వాసన వస్తోంది. ఊపిరి తీసుకోలేకపోయా. మా ఆయనకు ఆస్తమా ఉండటంతో ఏమవుతుందోనని భయపడ్డా. కొంచెం ఆలస్యమైతే మా ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించేది. ఇంటి నుంచి ఆగమేఘాలపై సింహాచలం వైపు పరుగులు తీశాం. – గుడివాడ కృష్ణవేణి, వెంకటాపురం ఉన్నఫళంగా వచ్చేశాం పాలిమర్స్ కంపెనీ పక్కనే ఉంటున్నాం. వేకువజామున కేకలు వినిపించడంతో నిద్రలేశాం. గ్యాస్‌లీక్ అయిందని అందరూ పరు గులు పెడుతున్నారు. మా ప్రాణాలు కాపా డుకోవడానికి ఉన్నఫళంగా పిల్లలను తీసుకుని.. ముడసర్లోవ పార్కుకు వచ్చేశాం. –ఎస్.కనక, వెంకటాపురం పోలీసులు వచ్చి తలుపుకొట్టారు వేకువజామున 5 గంటల సమయంలో పోలీసులు ఇంటికి వచ్చి తలుపు కొట్టారు. మేము నిద్రలేచి బయటకు వచ్చాం. విషయం చెప్పి బయటకు వెళ్లిపోమన్నారు. వెంటనే ఆటోలో ముడసర్లోవకు వచ్చేశాం. – ఎ.పరదేశమ్మ, వెంకటాపురం ప్రాణభయంతో బయటకు వచ్చేశాం నాకు ఈ మధ్యే ఆపరేషన్ జరిగింది. నేను నడవలేని పరిస్థితిలో ఉన్నాను. గ్యాస్ లీక్ సంఘటన తెలియగానే ప్రాణ భయంతో అందరం ఇంటి నుంచి బయటకు వచ్చేశాం. వీల్‌చైర్‌లో ఉన్న నన్ను మా కుటుంబ సభ్యులు ఆటో ఎక్కించి ముడసర్లోవకు తీసుకొచ్చారు. – ముఖేష్, వెంకటాపురం -
సుమోటోగా తీసుకోవాలి
చిలకలగూడ: అణగారిన వర్గాలపై తెలంగాణ ప్రభుత్వం చూపిస్తున్న వివక్షకు నిరసనగా ఈ నెల 8న కొంగర కలాన్‌లో ఎస్సీ, ఎస్టీ యుద్ధభేరీ సభను నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రకటించారు. సికింద్రాబాద్ పార్శిగుట్టలోని ఎమ్మార్పీఎస్ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. మాజీ డీజీపీ హెచ్‌జే దొర ఆత్మకథ పుస్కకావిష్కరణ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటలు సరికాదన్నారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ను సమర్థించినట్లు చేసిన వ్యాఖ్యలను సుప్రీం, హైకోర్టు, మానవ హక్కుల కమిషన్లు సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసి విచారణ జరిపించాలన్నారు. ఎన్కౌంటర్ వెనుక మా నేత నిర్ణయం ఉందని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారని, ప్రభుత్వ నిర్ణయంతోనే ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తోందని, కఠిన నిర్ణయాలు చట్టానిక లోబడే చేయాలని లేకుంటే హత్యల కిందకే వస్తాయన్నారు. ఈ విషయమై మానవ హక్కుల సంఘాలకు ఫిర్యాదు చేయనున్నట్లు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. కొంగర కలాన్ యుద్ధభేరీ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
నిందితులను కఠినంగా శిక్షించాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ ప్రియాంకారెడ్డిపై సామూహిక అత్యాచారం, హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టాల్లో ఇంకా కఠినమైన మార్పులు తీసుకురావాలని కోరారు. ఇలాటి ఘటనలపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే బాధ్యత వహించాలి: జీవన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్య దురదృష్టకరమని, ఈ ఘటనను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. బాధితురాలి తల్లిదం డ్రులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే పోలీసులు జాప్యం చేశారని, అయినా తమ నిర్లక్ష్యం ఏమీ లేదని పోలీస్ కమిషనర్ చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. మహిళలపై నేరాలను నియంత్రించలేమా?: పొంగులేటి సాక్షి, న్యూఢిల్లీ: ‘ఇంకా ఎంత మంది అమ్మాయిలు చనిపోవాలి? ప్రభుత్వం, రాజకీయ వ్యవస్థ దీనిని నియంత్రించలేదా? దోషులను నిర్దిష్ట కాల వ్యవధిలో శిక్షించలేరా?’అంటూ సమాజం ప్రశ్నిస్తోందని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. మహిళలపై నేరాలను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాకు పొంగులేటి శనివారం ఓ లేఖ రాశారు. మహిళలపై నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ పీనల్ కోడ్‌ను సరికొత్తగా తీసుకురావాలని పొంగులేటి పేర్కొన్నారు. స్త్రీలపై నేరాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించేలా చట్టం రావాలన్నారు. మంత్రుల వ్యాఖ్యలు బాధ్యతారహితం: ఎంపీ సంజయ్ సాక్షి, హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి అత్యాచారం, హత్య కేసుపై మంత్రుల మాటలు బాధ్యతారహితంగా ఉన్నాయని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ మండిపడ్డారు. ఈ ఘటనపై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాల్సిన హోంమంత్రి మహమూద్ అలీ బాధితురాలు పోలీసులకు ఫోన్ ఎందుకు చేయలేదని ఎదురు ప్రశ్నించడం దారుణమన్నారు. ఇంటింటికీ పోలీసులను పెట్టలేమన్న మంత్రి తలసాని శ్రీనివాస్ వ్యాఖ్యలు ప్రజలను హేళన చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని శనివారం ఓ ప్రకటనలో సంజయ్ డిమాండ్ చేశారు. ప్రియాంకారెడ్డి ఘటన బాధ కలిగించింది: దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి ఘటన తన మనసుకు తీవ్ర బాధ కలిగిం చిందని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. ఇది చాలా తీవ్రమైన దుశ్చర్యగా భావిస్తున్నానని, ఈ సంఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి పాశవిక దారుణానికి ఒడిగట్టిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి అండగా ఉండాలని శనివారం ఓ ప్రకటనలో కోరారు. -
ఆకట్టుకుంటున్న చిన్నారి పెళ్ళికూతురు!
మేలి ముసుగు వేసుకొని తెల్లని బ్రైడల్ ఫ్రాక్‌తో మెరిసిపోతున్న 12 ఏళ్ల వధువు... సూటూ బూటూ వేసుకొని.. చూసేందుకు ఆమెకు తాతలా కనిపిస్తున్న వరుడు.. సముద్ర తీరంలో జరిగిన ఆ వివాహ వీడియో అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. చిన్నారి పెళ్లి కూతురికి... అంత పెద్ద వరుడితో పెళ్లి చేయడం అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ పెళ్లి వీడియో చాలా మందికి ఆగ్రహం కూడా తెప్పించింది. కానీ వాళ్లిద్దరూ యాక్టర్లు అన్న సంగతి తెలిసిన తర్వాత అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. విడుదలైన క్షణాల్లోనే ఆ పెళ్లి వీడియో సుమారు 20 లక్షల మందిని ఆకట్టుకుంది. అందులో కనిపించే దృశ్యం కథే అయినా.. లెబనాన్, సిరియాతో పాటు ప్రపంచంలోని అనేక దేశాల్లో బలవంతపు పెళ్లిళ్లకు బలవుతున్న వేలమంది చిన్నారుల జీవితాల వాస్తవిక గాధ అది. ఈ వీడియోనే కాదు... అందులోని విషయం కూడా షాక్‌కు గురి చేసేదేనని వీడియో ప్రచారకర్త మాయా అమ్మర్ అంటున్నారు. మధ్యతరగతి కుటుంబాల్లో ప్రతి ముగ్గురిలో ఒకరికి 18 ఏళ్ల వయసు రాకముందే బలవంతంగా పెళ్లిళ్లు చేస్తున్నారని ఆమె చెబుతున్నారు. ఎనిమిదేళ్ల వయసులోపు బాలికలు సుమారు కోటిన్నర మందికి 60-70 ఏళ్ల వయసువారితో బలవంతంగా పెళ్లిళ్లు చేయిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. యుఎన్ఎఫ్ పిఏ లెక్కల ప్రకారం 2050 నాటికి ఆ లెక్కలు 120 కోట్లకు చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బాల్య వివాహాలను నిషేధించడంలో భాగంగా తాజాగా లెబనాన్ ప్రభుత్వం సివిల్ రిజిస్ట్రేషన్ చట్టాన్ని ప్రవేశ పెట్టింది. ప్రతి వివాహం రిజిస్టర్ కావడంతో బాల్య వివాహాలు అరికట్టే అవకాశం ఉంటుందని భావిస్తోంది. ప్రస్తుతం 14 సంవత్సరాలు వచ్చేవరకూ బాలికలకు వివాహానికి అనుమతి లేకపోయినా.. తల్లిదండ్రులు తొమ్మిదేళ్ళు వచ్చేసరికల్లా బలవంతంగా పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ప్రపంచంలోని అనేక దేశాలను పరిశీలిస్తే చట్ట ప్రకారం బాలికల పెళ్ళి వయసు కనీసం 12 ఏళ్ళుగా తెలుస్తోంది. ట్రినిడాడ్, తొబాగోల్లో 12 ఏళ్ళు, సిరియాలో 13 ఉంది. కాగా కనీసం 14 ఉండాలని కెనాన్ చట్టం చెప్తోంది. కాంగోలో 15, వెనెజులాలో 18 ఉండగా అక్కడి తల్లిదండ్రులు మాత్రం 14 లోపు వయసువారికే బలవంతపు పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. అలాగే బొలీవియాలో చట్టప్రకారం బాలికల పెళ్ళి వయసు 21 ఉండగా... కుటుంబీకులు 14 నుంచి 16 ఏళ్ళ వయసులోపు బాలికలను వివాహానికి అనుమతిస్తున్నారు. దీంతో మైనర్లే గర్భవతులుగా కూడ మారుతున్నారు. అలాగే ఇరాన్ లో అబ్బాయిలకు 15, అమ్మాయిలకు 13 ఏళ్ళ వయసును చట్టప్రకారం నిర్ణయించినా.. అంతకన్నా ముందే కుటుంబీకులు వివాహాలకు అనుమతిస్తున్నారు. ఇరాక్, సిరియా, యెమన్లలోనూ సుమారు 18 సంవత్సరాల వయసులో పెళ్ళి చేయాలని చట్టం చెప్తుంటే 13 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ లోపు బాలికలకే బలవంతపు పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. అఫ్ఘానిస్థాన్‌లో మాత్రం అబ్బాయికి 18, అమ్మాయికి 16 ఏళ్ళు ఉండాలని చట్టం చెప్తోంది. అయితే అంతకన్నా ముందు బలవంతపు పెళ్ళిళ్ళు చేస్తే శిక్షార్హులవుతారని కూడా చట్టం హెచ్చరిస్తోంది. లిబియాలో చట్టబద్ధమైన వయసు మహిళలు, పురుషులకు 20 సంవత్పరాలుగానే ఉన్నా... అంతకు ముందు చేసుకోవాలనుకున్నవారిని కోర్టులు అనుమతిస్తున్నాయి. జోర్దాన్ లో ఎటువంటి అనుమతి అవసరం లేకుండా పెళ్ళికి ఇద్దరికీ 18 సంవత్సరాలు ఉండాలని చట్టం ఉండగా... షరియాలో అబ్బాయిలు మినహా.. స్పెషల్ పర్మిషన్ తీసుకుంటే 15 ఏళ్ళ బాలికలకు వివాహం చేసేందుకు కోర్టులు అనుమతిస్తున్నాయి.