సాక్షి, హైదరాబాద్: గత కొద్ది రోజులుగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తన రాజకీయ ప్రవేశంపై ఆయన స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సినీ పరిశ్రమలో నాపై చిన్న మాట వస్తేనే తట్టుకోలేను. అలాంటిది రాజకీయాల్లో అనేక అడ్డంకులు ఉంటాయి. తాను రాజకీయాల్లో వస్తానా లేదా అనేది అప్రస్తుతమంటూ దిల్ రాజు’’ వ్యాఖ్యానించారు.
కాగా, ఇటీవల హాత్ సే హాత్ జోడోయాత్ర పేరుతో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా దిల్ రాజు తను స్వయంగా నిర్మించి, నిర్వహిస్తున్న ఆలయానికి రేవంత్‌రెడ్డిని ప్రత్యేకంగా పిలవడంతో రాజకీయ వర్గాల్లో దిల్ రాజు పొలిటికల్ అరంగేట్రంపై చర్చ మొదలైంది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి రేవంత్ వచ్చిన సందర్భంగా... మోపాల్ మండలంలోని దిల్ రాజు సొంత గ్రామం నర్సింగ్‌పల్లిలో నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయానికి పిలిచి ఆయనతో ప్రత్యేక పూజలు చేయించారు.
ఈ కార్యక్రమంతో దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీకి బీజం పడ్డట్టేనన్న చర్చకు తెర లేచింది. అయితే అటు బలగం సినిమా సమయంలో మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్‌తోనూ ఆయన చనువుగా ఉండటాన్ని గమనించినవారు.. అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌ను కాదని.. దిల్ రాజు కాంగ్రెస్ వైపు ఎందుకు చూస్తారనే ప్రశ్నలు కూడా వినిపించాయి.
చదవండి: దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా? రేవంత్‌తో ప్రత్యేక పూజలెందుకు?
Comments
Please login to add a commentAdd a comment