producer Dil Raju
-
మహేష్ దెబ్బకు స్క్రీన్లు చినిగిపోతాయి
-
ఆ హీరోయిన్ తో నాకు చాల రూమర్ వచ్చింది అందుకే
-
యువతకు నేను ఇచ్చే సలహా ఇది..!
-
నిర్మాత దిల్ రాజు సక్సెస్ సీక్రేట్ ఇదే..!
-
పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన దిల్ రాజు.. రాజకీయాల్లోకి వస్తాడా? రాడా?
సాక్షి, హైదరాబాద్: గత కొద్ది రోజులుగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తన రాజకీయ ప్రవేశంపై ఆయన స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సినీ పరిశ్రమలో నాపై చిన్న మాట వస్తేనే తట్టుకోలేను. అలాంటిది రాజకీయాల్లో అనేక అడ్డంకులు ఉంటాయి. తాను రాజకీయాల్లో వస్తానా లేదా అనేది అప్రస్తుతమంటూ దిల్ రాజు’’ వ్యాఖ్యానించారు. కాగా, ఇటీవల హాత్ సే హాత్ జోడోయాత్ర పేరుతో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా దిల్ రాజు తను స్వయంగా నిర్మించి, నిర్వహిస్తున్న ఆలయానికి రేవంత్‌రెడ్డిని ప్రత్యేకంగా పిలవడంతో రాజకీయ వర్గాల్లో దిల్ రాజు పొలిటికల్ అరంగేట్రంపై చర్చ మొదలైంది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి రేవంత్ వచ్చిన సందర్భంగా... మోపాల్ మండలంలోని దిల్ రాజు సొంత గ్రామం నర్సింగ్‌పల్లిలో నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయానికి పిలిచి ఆయనతో ప్రత్యేక పూజలు చేయించారు. ఈ కార్యక్రమంతో దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీకి బీజం పడ్డట్టేనన్న చర్చకు తెర లేచింది. అయితే అటు బలగం సినిమా సమయంలో మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్‌తోనూ ఆయన చనువుగా ఉండటాన్ని గమనించినవారు.. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ను కాదని.. దిల్ రాజు కాంగ్రెస్ వైపు ఎందుకు చూస్తారనే ప్రశ్నలు కూడా వినిపించాయి. చదవండి: దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా? రేవంత్‌తో ప్రత్యేక పూజలెందుకు? -
నేను అనుకున్నదే ఎన్నికల్లో జరిగింది: దిల్ రాజు
నిర్మాతల మండలి ఎన్నికలు ఏకగ్రీవం చేయాలనుకున్నామని టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు అన్నారు. నిర్మాతల మండలికి ప్రతి రెండేళ్లకొకసారి ఎన్నికలు జరగాల్సి ఉందన్నారు. కానీ నాలుగేళ్లుగా ఎన్నికలు జరగలేదని తెలిపారు. ఈ సారి అత్యధిక మెజార్టీతో నన్ను ఈసీ మెంబర్‌గా గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అందరూ నన్ను వివాదాస్పద వ్యక్తిగా చూసినా.. నా మెజార్టీ చూస్తే ఎంత ప్రేమిస్తున్నారో అర్థమవుతోందన్నారు,. దిల్ రాజు మాట్లాడుతూ.. ' నిర్మాతల మండలి ఎన్నికలు ఏకగ్రీవానికి ప్రయత్నించాం. కానీ కుదరలేదు. నేను ఎప్పుడు చెప్పేది ఒక్కటే. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఉండాలని కోరుకున్నా. ఇప్పుడు అదే జరిగింది. మేమందరం కలసి పని చెస్తాం.' అని అన్నారు. కాగా.. ఇవాళ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల్లో ‘ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్యానెల్’ ఘన విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఈ ఎన్నికల్లో దామోదర ప్రసాద్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో మొత్తం 678 ఓట్లు పోలుకాగా దామోదర ప్రసాద్‌కు 339 ఓట్లు, ప్రత్యర్థి జెమిని కిరణ్‌కు 315 ఓట్లు పడ్డాయి. 24 ఓట్ల తేడాతో దామోదర ప్రసాద్ గెలుపొందాడు. కార్యదర్శకులు ప్రసన్న కుమార్(378), వైవీఎస్ చౌదరి(362) ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రెటరీలుగా భరత్ చౌదరి, నట్టి కుమార్‌లు గెలుపొందారు. ఉపాధ్యక్ష పదవికి సుప్రియ అశోక్ ఏకగ్రీవంగా ఎనికయ్యారు. ట్రెజరర్‌గా రామ సత్యన్నారాయణ గెలుపొందారు. -
అతనే నంబర్‌వన్ హీరో.. దిల్ రాజు కామెంట్స్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం
టాలీవుడ్ అగ్రనిర్మాత దిల్ రాజు కోలీవుడ్ హీరోలతోనూ సినిమాలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే అగ్రహీరో విజయ్ హీరోగా 'వారిసు'(తెలుగులో వారసుడు)గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే అదే రోజు అజిత్ సినిమా తునివు విడుదల కానుంది. దీంతో రెండు చిత్రాలకు థియేటర్ల సమస్య ఏర్పడింది. ఈ సమస్యపై స్పందిస్తూ నిర్మాత దిల్ రాజు చేసిన కామెంట్స్ అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి. ఇంతకీ దిల్ రాజు అన్న మాటలేంటీ? ఫ్యాన్స్ ఎందుకు ఆయనను ట్రోల్స్ చేస్తున్నారో చూద్దాం. ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిల్ రాజు మాట్లాడుతూ.. 'విజయ్ తమిళనాడులో నంబర్‌వన్ హీరో. అజిత్ కంటే పెద్ద స్టార్. కానీ వారిసు, తునివు ఓకే రోజు విడుదలవుతున్నాయి. అందువల్ల తమిళనాడులోని 800 థియేటర్లలో 50:50 ఇస్తామని చెప్పారు. కానీ విజయ్ నంబర్‌వన్ హీరో కావున ఓ 50 థియేటర్లు అదనంగా కావాలని కోరుతున్నా. దీనిపై చెన్నైకి వెళ్లి సీఎం స్టాలిన్ కలిసి విజ్ఞప్తి చేయబోతున్నా.' అని అన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ ట్విటర్లో షేర్ చేయడంతో వైరలైంది. (ఇది చదవండి: 'వారిసు' చిత్ర వివాదం.. అభిమానులతో విజయ్ భేటీపై సర్వత్రా ఆసక్తి) కోలీవుడ్‌లో విజయ్ నంబర్‌వన్ హీరో అనడంపై అజిత్ అభిమానులు మండిపడుతున్నారు. పక్క రాష్ట్రానికి చెందిన వ్యక్తి అభిమానుల మధ్య గొడవ సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న వారిసు చిత్రంలో విజయ్ సరసన రష్మిక మందన్నా నటించింది. తెలుగు, తమిళంలో ఓకేసారి ఈ సినిమాను తెరకెక్కించారు. మరోవైపు భారీ అంచనాల మధ్య అజిత్ 'తునివు' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్ట్‌ను అజిత్, దర్శకుడు హెచ్.వినోత్, నిర్మాత బోనీ కపూర్ కాంబినేషన్లో వరుసగా మూడోసారి కలిసి పని చేస్తున్నారు. ఈ సినిమాలో మంజు వారియర్ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. అజిత్ తొలిసారిగా విఘ్నేష్ శివన్‌తో జతకట్టారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. -
దిల్ వాకిట్లో తేజస్విని
ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు (వెంకట రమణారెడ్డి) వివాహం హైదరాబాద్‌కు చెందిన తేజస్విని (వైఘా రెడ్డి)తో ఆదివారం రాత్రి జరిగింది. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని నర్సింగ్‌పల్లిలోగల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిరాడంబరంగా జరిగిన ఈ వివాహ వేడుకలో కేవలం ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఆదివారం రాత్రి 7.23 గంటలకు పెళ్లి జరిగింది. నూతన దంపతులిద్దరూ సోమవారం ఆలయంలో సత్యనారాయణ వ్రతం చేశారు. కాగా ‘దిల్’ రాజు భార్య అనిత 2017లో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. తన కుమార్తె హన్షితా రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు ఆరు నెలల క్రితమే ‘దిల్’రాజుకు తేజస్వినితో వివాహ ముహూర్తాన్ని నిశ్చయించినట్లు సమాచారం. ‘‘జీవితంలో ఈ కొత్త ప్రారంభం అద్భుతంగా కొనసాగాలని కోరుకుంటున్నాను నాన్నా. మీ ఇద్దరూ ప్రేమతో, సంతోషంగా ఉండాలి’’ అని ‘దిల్’ రాజు కుమార్తె హన్షితా రెడ్డి సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. అన్నట్లు ‘దిల్’ రాజు నిర్మించిన సూపర్ హిట్ చిత్రాల్లో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఒకటి. ఇప్పుడు పెళ్లి జరిగిన సందర్భంగా ఆయన జీవితానికి ఈ టైటిల్ ని ఆపాదించి ‘దిల్ వాకిట్లో తేజస్విని’ అనొచ్చు. -
ప్రేక్షకులు మెచ్చుకునే సినిమాలు తీస్తా..
సాక్షి, సింహాచలం(పెందుర్తి): ప్రేక్షకులు మెచ్చుకునే సినిమాలు తీయడానికే తాను ప్రాధాన్యత ఇస్తానని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు తెలిపారు. సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని సోమవారం ఆయన దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఏడాది ఆరు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చామన్నారు. ప్రేక్షకులు వాటిని ఆదరించారు. కమర్షియల్‌గా కూడా సక్సెస్ అయ్యాయని అన్నారు. మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని తెలిపారు. ఈ ఏడాది కూడా నాలుగు ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయన్నారు. మహేష్‌బాబు హీరోగా ఓ సినిమా ప్రారంభించామని ఆయన తెలిపారు. అలాగే నితిన్ హీరోగా శ్రీనివాస కల్యాణం, రామ్ హీరోగా ఒక సినిమా, మరో సినిమా కూడా తీస్తున్నామన్నామని చెప్పారు. గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మంచి సినిమాలు తీయడానికి ప్రయత్నం చేస్తామన్నారు. ఈసందర్భంగా ఆయన కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతరాలయంలో అష్టోత్తరంపూజ నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ ఉత్తరరాజగోపురంలో జరిగిన శ్రీనృసింహ దీక్షల విరమణ కార్యక్రమాన్ని తిలకించి స్వామిని దర్శించుకున్నారు. శ్రీనృసింహ దీక్షల విరమణ కార్యక్రమంలో రావడం అదృష్టంగా భావిస్తానని తెలిపారు. చిరంజీవి సేవాసమితి అధ్యక్షుడు లంక సూరిబాబు ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
28లో 22 హిట్... గ్రేట్ గ్రాఫ్
‘‘ఒక ప్రాజెక్ట్ ప్రాఫిట్లో ఉంటేనే నా దృష్టిలో అది సక్సెస్ఫుల్ సినిమా. ఎందుకంటే ఇది వ్యాపారం. డబ్బు పోగొట్టుకుని సినిమాలు తీయడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు. డబ్బు పోతే ఇండస్ట్రీలో ఎవరూ ఉండరు. అల్టిమేట్‌గా డబ్బు కావాల్సిందే. సినిమా తీయడానికి ఎంత? కరెక్ట్ కలెక్షన్ ఎంత? ఈ రెండే ‘దిల్’ రాజుగా నాకు అవసరం. డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా నాది డబుల్ రోల్. నిర్మాతగా నా డిస్ట్రిబ్యూటర్స్ను కాపాడుకోవడానికే ట్రై చేస్తాను. సినిమా తీస్తున్నప్పుడు కథ ఎంత ముఖ్యమో, బడ్జెట్ కూడా అంతే ముఖ్యం’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఆయన సక్సెస్ఫుల్ నిర్మాతగా పాతిక పైగా సినిమాలు తీశారు. ఈ ఏడాది ‘శతమానం భవతి’కి నేషనల్ అవార్డు కూడా సాధించారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆదివారం ‘దిల్’ రాజు మీడియాతో పలు విశేషాలు పంచుకున్నారు. ► నిర్మాతగా పద్నాలుగేళ్ల కెరీర్లో 28 సినిమాలు చేశా. డిస్ట్రిబ్యూటర్‌గా 22 ఏళ్ల కెరీర్. ఈ జర్నీలో ఎత్తుపల్లాలు ఉన్నాయి. నేను ప్రొడ్యూస్ చేసిన 28 సినిమాల్లో 22 చిత్రాలు సక్సెస్ టాక్ తెచ్చుకోవడం గ్రేట్ గ్రాఫ్. హ్యాపీగా ఉంది. ఈ ఏడాది ప్రొడ్యూసర్‌గా సక్సెస్ అయ్యాను కానీ డిస్ట్రిబ్యూటర్‌గా బ్యాడ్ ఇయర్. శ్రీ వెంకటేశ్యర క్రియేషన్స్‌ను 1999లో స్టార్ట్ చేశాం. డిస్ట్రిబ్యూటర్‌గా ఇంతటి బ్యాడ్ ఇయర్ ఇప్పటివరకు చూడలేదు. సినిమా హిట్ అయితే సక్సెస్‌ను తీసుకున్నప్పుడు, బ్యాడ్ రిజల్ట్ వచ్చినప్పుడు వేరే వారిని కారణంగా చూపను. ఫెయిల్యూర్‌ను కూడా తీసుకుంటాను. అయితే ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఎందుకు ఇలా జరిగిందని విశ్లేషించుకుంటా. ఈ ఏడాది ‘శతమానం భవతి, నేను లోకల్, డీజే, ఫిదా, రాజా ది గ్రేట్’ తర్వాత వస్తున్న సిక్త్ బాల్ ‘ఎంసీఏ’ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ► ఒక సినిమా కలెక్షన్ స్టామినా ఏంటో తెలియాలంటే వన్ వీక్ పడుతుంది. బాలీవుడ్లో ఉన్నట్లు ఏ సినిమాకైనా గ్రాస్ కలెక్షన్ చెప్పాలి. హైర్లు, షేర్ గ్యారెంటీలు కలుపుకుని ఫస్డ్ డే కలెక్షన్ ఫిగర్స్ చెప్పుకోకూడదు. వీటి వల్ల అంతగా ఉపయోగం లేదు. ఈ మార్పు ఇండస్ట్రీలో రావాలని కోరుకుంటున్నాను. ► సినిమా డిజిటల్ రైట్స్‌ను అమ్మడానికి టైమ్ లిమిట్ సెట్ చేయాలనుకుంటున్న కొందరి నిర్మాతల నిర్ణయం సరైనదే. కానీ సినిమా రిలీజైన రోజునే పైరసీ వస్తోంది. అలా కాకుండా ఆడియన్స్ డిజిటల్ ప్లాట్ఫామ్లో సినిమాను కొనుక్కుని చూడటంలో తప్పులేదనిపిస్తోంది. పైరసీ రూపంలో సినిమాను అన్ అఫీషియల్‌గా చూస్తున్నారు. కాంట్రవర్సీ చేయడం కాదు. నిర్మాతగా డిజిటల్ రైట్స్‌ను అమ్మడం ఆపుదామని కాదు. మేజర్ డ్యామేజ్ జరిగేది పైరసీ వల్లే అన్నది నా అభిప్రాయం. డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ కలసికట్టుగా ఫైట్ చేసి పైరసీ భూతాన్ని ఇండస్ట్రీ నుంచి తరిమేయాలి. ► ఇండస్ట్రీకి వచ్చే కొత్త నిర్మాతలు సక్సెస్ అయిన సినిమాలను కాదు.. ఫెయిల్ అయిన సినిమాలు తీసుకుని విశ్లేషించుకోవాలి. ఆడని సినిమాల లిస్ట్ తీసుకుని ఎందుకు ఆడలేదని చెక్ చేసుకుంటే బెటర్. కొంత వరకు డబ్బు సేవ్ అవుతుంది. ► వచ్చే ఏడాది మా బ్యానర్ నుంచి ఇద్దరు కొత్త డైరెక్టర్లు వస్తున్నారు. కొత్త డైరెక్టర్ శశి ‘అదే నువ్వు అదే నేను’ చేస్తున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో శర్వానంద్, నితిన్ హీరోలుగా ‘దాగుడు మూతలు’ సినిమా నిర్మించబోతున్నా. అనుకోని కారణాల వల్ల కమల్‌హాసన్‌గారు, శంకర్ల కాంబినేషన్ ‘ఇండియన్ 2’ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాను. ► మహేశ్‌బాబుకి నిర్మాత అశ్వినీదత్‌గారితో కమిట్మెంట్ ఉంది. డైరెక్టర్ వంశీతో నాకు కమిట్మెంట్ ఉంది. అలా అశ్వినీదత్‌గారు, నేను కలసి ఈ సినిమా నిర్మించబోతున్నాం. ఏప్రిల్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లొచ్చు. పవన్ కల్యాణ్‌తో సినిమా అంటే.. చేయాలని నాకూ ఉంది. టైమ్, కథ కుదిరితే సెట్స్‌పైకి వెళతాం. ► నితిన్ హీరోగా మేం చేయబోతున్న ‘శ్రీనివాస కల్యాణం’ సినిమాకి అడిగితే, హీరోయిన్ సాయిపల్లవి రిజెక్ట్ చేసిందన్న వార్తలు వచ్చాయి. అందులో నిజం లేదు. అసలు సాయి పల్లవికి ఈ సినిమా కథ కూడా తెలియదు. అంతేకాదు సాయి పల్లవి షూటింగ్ స్పాట్‌కు లేట్‌గా వస్తుందన్న రూమర్లు వచ్చాయి. ‘ఫిదా’ చూశాను. ‘ఎంసీ ఏ’ చుశాను. తను కరెక్ట్‌గా ఉంటుంది. నా బ్యానర్లో మరో సినిమా చేయబోతోంది. బిజీగా ఉండి కూడా సాయిపల్లవి ‘ఎంసీఏ’ సినిమాకి డేట్స్ సర్దుబాటు చేసింది. నిర్మాతగా ఇన్ని సినిమాలు చేస్తున్నారు. డైరెక్షన్ చేసే ఉద్దేశం ఉందా? అన్న ప్రశ్నకు – ‘నో యాక్టింగ్.. నో డైరెక్షన్’ అన్నారు. ఒకే డేట్లో రెండు సినిమాలను రిలీజ్ చేయడం కరెక్ట్ కాదు. కానీ వేరే డేట్ లేనప్పుడు, హాలీడేస్ వచ్చి కుదరనప్పుడు తప్పని పరిస్థితి ఇది. ఆల్టర్నేట్ డేట్స్‌పై అందరికీ ప్రాబ్లమ్ ఉంది. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ రేట్స్ వల్ల మార్చి ఫస్ట్ నుంచి థియేటర్ల మూసివేత అన్న విషయం పూర్తి స్థాయిలో నా వరకు రాలేదు. ఒకవేళ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు ఎక్కువ వసూలు చేస్తే మార్చి ఫస్ట్ నుంచి ఎలా ఉండబోతుందన్న విషయం నిర్మాతలందరూ కలసి మీటింగ్స్‌లో తేలుస్తారు. -
నిర్మాత దిల్ రాజుపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజుపై కేసు నమోదయింది. ‘నా మనస్సు నిన్ను కోరె’ నవల రచయిత్రి శ్యామలారాణి మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాకు తన నవలలోని స్టోరీని అనుమతి లేకుండా కాపీ కొట్టారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో నిర్మాత దిల్ రాజుపై పోలీసులు 120ఏ, 415, 420 కాపీ రైట్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో ప్రభాస్ హీరోగా కాజల్, తాప్సీ హీరోయిన్లుగా నటించిన మిస్టర్ ఫర్ఫెక్ట్ చిత్రానికి ధశరథ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. -
డ్రగ్స్ అంశాన్ని అందరికీ ఆపాదించవద్దు: నిర్మాత
లబ్బీపేట (విజయవాడ): టాలీవుడ్లో డ్రగ్స్ అంశాన్ని అందరికీ ఆపాదించవద్దని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు విజ్ఞప్తి చేశారు. ఫిదా సినిమా ప్రచారంలో భాగంగా విజయవాడలోని ఓ హోటల్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డ్రగ్స్ విషయాన్ని తాము మీడియా ద్వారానే తెలుసుకున్నామని తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే సురేష్‌బాబు, అల్లు అరవింద్‌లు వివరణ ఇచ్చారని చెప్పారు. ఇండస్ట్రీలో ఒకరిద్దరూ డ్రగ్స్‌కు అలవాటు పడినట్లు ఆరోపణలు వచ్చినంత మాత్రాన అందరికీ ఆపాదించడం సరికాదన్నారు. ఇప్పటికే ఈ అంశంపై సిట్ విచారణ జరుగుతోందని చెప్పారు. తాము కూడా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు దిల్ రాజు పేర్కొన్నారు. ఈ సమావేశంలో దర్శకుడు శేఖర కమ్ముల, హీరో వరుణ్‌తేజ్ కూడా పాల్గొన్నారు. -
‘నేను కాదు...సినిమానే మాట్లాడుతుంది’
తిరుచానూరు: దువ్వాడ జగన్నాథం(డీజే) సినిమా విడుదల కోసం నేనూ ప్రేక్షకుడి మాదిరి ఎదురు చూస్తున్నానని హీరో అల్లు అర్జున్ అన్నారు. సినిమా గురించి తాను ఇప్పేడేమీ మాట్లాడేది లేదని, మరో రెండు రోజుల్లో సినిమానే మాట్లాడేస్తుందని నవ్వుతూ చెప్పారు. అల్లు అర్జున్, పూజా హెగ్డేలు జంటగా నటించిన డీజే ఈ నెల 23న విడుదల కానుంది. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు హరీష్ శంకర్‌లతో అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. అభిమానుల అంచనాలకు మించి డీజే సినిమా ఉంటుందని నిర్మాత దిల్‌రాజ్ తెలిపారు. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన 25వ చిత్రం డీజే. శ్రీవారి ఆశీస్సులు, అభిమానులు, ప్రేక్షకుల ఆదరణతో ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. అల్లు అర్జున్ నుంచి అభిమానులు కోరుకునే డ్యాన్స్, ఫైట్స్, వినోదం వంటి అన్ని అంశాలతో ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని తెలిపారు. హీరోయిన్ పూజా హెగ్డే మాట్లాడుతూ అందరరూ మెచ్చేలా ఈ సినిమా ఉంటుందన్నారు. ఈ సినిమాను ఇంటిల్లిపాది కలిసి ఆనందంతో చూసేలా ఉంటుందని అన్నారు. దర్శకుడు ఈ సినిమాను చాలా చక్కగా చేశారని తెలిపారు. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఎన్వీ. ప్రసాద్ మాట్లాడుతూ నిర్మాత దిల్‌రాజుకు శ్రీవారిపై అచంచలమైన భక్తి ఉందన్నారు. తను నిర్మించిన ప్రతి సినిమా రిలీజ్ చేయడానికి ముందు శ్రీవారిని దర్శించుకుంటారని తెలిపారు. ఈ సినిమాలోని ఓ పాటను బ్రాహ్మణ సంఘం అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో లిరిక్స్‌ను మార్చినట్లు ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు నిర్మాత దిల్‌రాజు, డైరెర్టర్ హరీష్ శంకర్లు ఈ సందర్భంగా తెలిపారు. [ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ] -
'ఆ సినిమాపై నాకు చాలా నమ్మకం ఉంది'
చెన్నై: తమిళనాట సూపర్ స్టార్ విజయ్ నటించిన తెరి చిత్రంలో తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందని ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు అన్నారు. ఏప్రిల్ 14న విడుదల అవుతున్న ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ హక్కులు దిల్ రాజు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెరి చిత్రంపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోగా విజయ్, హీరోయిన్లుగా సమంత, అమీ జాక్సన్ నటించారు. 'తెలుగులో తుపాకీ చిత్రంతో విజయ్ నిరూపించుకున్నాడు. ఇక అట్లీ రాజా రాణి చిత్రంతో గుర్తింపు సాధించారు. ఈ సినిమా తెలుగులో విజయం సాధిస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది' అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారు. ఈ చిత్రానికి తెలుగులో విన్నర్ అని పేరు పెట్టనున్నట్లు తెలుస్తోంది. -
అమెరికా టు ఇండియా!
‘‘ఫిబ్రవరి 5న మేము నవ్వించేందుకు రెడీగా ఉన్నాం. అదే రోజున ‘స్పీడున్నోడు’, ఫిబ్రవరి 12న ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ రిలీజ్ చేస్తామని నిర్మాతలు రిక్వెస్ట్ చేశారు. వారికి బెనిఫిట్ అవ్వాలని మా చిత్రం 19కి వాయిదా వేశాం. కుటుంబమంతా కలిసి చూసే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. వాసువర్మ దర్శకత్వంలో సునీల్ హీరోగా, నిక్కీ గల్రానీ, డింపుల్ చోపడే హీరోయిన్లుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఆయన నిర్మించిన చిత్రం ‘కృష్ణాష్టమి’. ‘‘అమెరికా నుంచి ఇండియా వచ్చిన కుర్రాడికి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాటిని అతనెలా ఎదుర్కొన్నాడు? అన్నదే ఈ కథ’’ అని దర్శకుడు అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు శిరీష్, లక్ష్మణ్.