నిర్మాత దిల్‌ రాజుపై కేసు నమోదు | Police Case Against producer Dil Raju | Sakshi
Sakshi News home page

నిర్మాత దిల్‌ రాజుపై కేసు నమోదు

Published Sat, Sep 16 2017 6:20 PM | Last Updated on Tue, Sep 19 2017 4:39 PM

నిర్మాత దిల్‌ రాజుపై కేసు నమోదు

నిర్మాత దిల్‌ రాజుపై కేసు నమోదు

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజుపై కేసు నమోదయింది. ‘నా మనస్సు నిన్ను కోరె’ నవల రచయిత్రి శ్యామలారాణి మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాకు తన నవలలోని స్టోరీని అనుమతి లేకుండా కాపీ కొట్టారంటూ ఫిర్యాదు చేశారు.

దీంతో నిర్మాత దిల్‌ రాజుపై పోలీసులు 120ఏ, 415, 420 కాపీ రైట్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా దిల్‌ రాజు నిర్మాణ సారధ్యంలో ప్రభాస్‌ హీరోగా కాజల్‌, తాప్సీ హీరోయిన్లుగా నటించిన మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌ చిత్రానికి ధశరథ్‌ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement