నిర్మాతల మండలి ఎన్నికలు ఏకగ్రీవం చేయాలనుకున్నామని టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు అన్నారు. నిర్మాతల మండలికి ప్రతి రెండేళ్లకొకసారి ఎన్నికలు జరగాల్సి ఉందన్నారు. కానీ నాలుగేళ్లుగా ఎన్నికలు జరగలేదని తెలిపారు. ఈ సారి అత్యధిక మెజార్టీతో నన్ను ఈసీ మెంబర్‌గా గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అందరూ నన్ను వివాదాస్పద వ్యక్తిగా చూసినా.. నా మెజార్టీ చూస్తే ఎంత ప్రేమిస్తున్నారో అర్థమవుతోందన్నారు,.
దిల్ రాజు మాట్లాడుతూ.. ' నిర్మాతల మండలి ఎన్నికలు ఏకగ్రీవానికి ప్రయత్నించాం. కానీ కుదరలేదు. నేను ఎప్పుడు చెప్పేది ఒక్కటే. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో ఉండాలని కోరుకున్నా. ఇప్పుడు అదే జరిగింది. మేమందరం కలసి పని చెస్తాం.' అని అన్నారు.
కాగా.. ఇవాళ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల్లో ‘ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్యానెల్’ ఘన విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఈ ఎన్నికల్లో దామోదర ప్రసాద్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో మొత్తం 678 ఓట్లు పోలుకాగా దామోదర ప్రసాద్‌కు 339 ఓట్లు, ప్రత్యర్థి జెమిని కిరణ్‌కు 315 ఓట్లు పడ్డాయి. 24 ఓట్ల తేడాతో దామోదర ప్రసాద్ గెలుపొందాడు.
కార్యదర్శకులు ప్రసన్న కుమార్(378), వైవీఎస్ చౌదరి(362) ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రెటరీలుగా భరత్ చౌదరి, నట్టి కుమార్‌లు గెలుపొందారు. ఉపాధ్యక్ష పదవికి సుప్రియ అశోక్ ఏకగ్రీవంగా ఎనికయ్యారు. ట్రెజరర్‌గా రామ సత్యన్నారాయణ గెలుపొందారు.
Comments
Please login to add a commentAdd a comment