హోరాహోరీగా సాగిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజ్.. అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. వైస్ ప్రెసిడెంట్ గా ముత్యాల రామదాసు, కార్యదర్శిగా దామోదర్ ప్రసాద్, ట్రెజరర్‌గా ప్రసన్న కుమార్ ఎంపికయ్యారు. మొత్తం 48 ఓట్లలో దిల్ రాజుకి 31 ఓట్లు పడ్డాయి. దీంతో ఆయం ప్రెసిడెంట్‌గా అధికారం చేజిక్కుంచుకున్నారు.
ఆదివారం జరిగిన ఎన్నికల్లో అగ్ర నిర్మాత దిల్‌రాజు, మరో నిర్మాత సి.కల్యాణ్ ప్యానల్స్ మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడింది. మొత్తం 14 రౌండ్స్‌లో 563 ఓట్లు దిల్ రాజు పానెల్‌కు, సి.కల్యాణ్ పానెల్‌కు 497 ఓట్లు వచ్చాయి. ప్రొడ్యూసర్స్ సెక్టార్‌లోని 12 మందిలో దిల్‌రాజు ప్యానల్ నుంచి ఏడుగురు ఎన్నికయ్యారు. స్టూడియో సెక్టార్ నుంచి గెలిచిన నలుగురిలో ముగ్గురు దిల్‌రాజు ప్యానల్, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్‌లో ఇరు ప్యానల్స్‌లో చెరో ఆరుగురు గెలిచారు.
రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ ఎలక్షన్ లో భాగంగా 2023-25 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో 1,339 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో చిన్న సినిమాల మనుగడ, డిజిటల్ సర్వీసు ప్రొవైడర్ల ఛార్జిల తగ్గింపు హామీతో సి.కల్యాణ్ ప్యానెల్, ఫిల్మ్ ఛాంబర్ మనుగడ, భవిష్యత్ తరాలకు మంచి సినీ పరిశ్రమను అందించాలనే నినాదంతో దిల్‌రాజు ప్యానెల్ బరిలో నిలిచారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు పోలింగ్ జరిగింది.
(ఇదీ చదవండి: తమన్నాకు వింత పరిస్థితి.. ఒకే హీరోకి లవర్, సిస్టర్‌గా!)
Comments
Please login to add a commentAdd a comment