
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లిస్ట్‌లో విజయ్ దేవరకొండ ఒకరు. అప్పుడప్పుడు విజయ్ దేవరకొండ పెళ్లి గురించిన వార్తలు ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతూ ఉంటాయి. తాజాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నాల నిశ్చితార్థం జరగనుందని, వీరి వివాహ తేదీని కూడా త్వరలోనే ప్రకటిస్తారనే వార్తలు తెరపైకి వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఓ ఆంగ్ల మ్యాగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ ఈ విషయంపై స్పందించారు. ‘‘ఈ ఫిబ్రవరిలో ఎవరితోనూ నా నిశ్చితార్థం జరగదు.. పెళ్లి లేదు. నా పెళ్లి గురించిన పుకార్లు తరచూ వస్తూనే.. వినిపిస్తూనే ఉన్నాయి. రెండేళ్లకో సారి నాకు పెళ్లి చేస్తూనే ఉన్నారు’’ అని చెప్పుకొచ్చారు విజయ్ దేవరకొండ. ఇక ప్రస్తుతం ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రంతో బిజీగా ఉన్నారు విజయ్ దేవరకొండ. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ వేసవిలో విడుదల కానుంది.