మరోసారి విజయ్‌ దేవరకొండతో కనిపించిన స్టార్‌ హీరోయిన్‌ | Vijay Deverakonda And Rashmika Mandanna Again Spotted Together Photo | Sakshi
Sakshi News home page

మరోసారి విజయ్‌ దేవరకొండతో కనిపించిన స్టార్‌ హీరోయిన్‌

Published Sun, Nov 24 2024 12:23 PM | Last Updated on Sun, Nov 24 2024 12:51 PM

Vijay Deverakonda And Rashmika Mandanna Again Spotted Together Photo

టాలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ, నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న డేటింగ్‌లో ఉన్నారంటూ ఇప్పటికే పలు ఫోటోలతో చాలా వార్తలు వచ్చాయి. పులు సినిమాల్లో జోడీగా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన వారిద్దరూ నిజ జీవితంలో కూడా ఒకరికొకరు అంతే దగ్గరగా ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ జోడీకి సంబంధించిన ఒక ఫోటో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది.

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న ఇద్దరూ కలిసి ఒకే స్పాట్‌లో ఉన్న ఫోటోలు చాలానే వచ్చాయి. అయితే, తాజాగా వారిద్దరూ ఒక రెస్టారెంట్‌లో ఫుడ్‌ తింటూ కనిపించారు. ఎవరో వారి పోటోను సీక్రెట్‌గా తీసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇంకేముంది కొన్ని గంటల్లోనే లక్షల్లో లైకులు, మిలియన్ల కొద్ది వ్యూస్‌ వస్తున్నాయి. కానీ, ఈ ఫోటో ఎప్పుడు తీశారు..? ఎక్కడ తీశారు వంటి వివరాలు మాత్రం తెలపలేదు.

గీత గోవిందం, డియర్‌ కామ్రేడ్‌ సినిమాలతో మెప్పించిన ఈ జోడీ.. వారిపై వస్తున్న రూమర్స్‌ గురించి ఇప్పటికే స్పందించింది. తామిద్దరం మంచి స్నేహితులం అంటూ క్లారిటీ ఇచ్చింది. మొదట వారు ప్రేమలో ఉన్నారని బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే పరోక్షంగా రివీల్‌ చేయడంతో అప్పటి నుంచి ఈ రూమర్స్‌ ప్రారంభమయ్యాయి. కొద్దిరోజుల క్రితం విజయ్‌ ఓ వేదికపై మాట్లాడుతూ తాను రిలేషన్‌షిప్‌లో ఉన్నానంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు నటించిన వ్యక్తితో డేటింగ్‌లో ఉన్నట్లు కూడా తెలిపారు. విజయ్‌ వ్యాఖ్యలు వైరల్‌ అయిన కొద్దిరోజులకే ఈ ఫోటో బయటకు రావడంతో వారిద్దరి ప్రేమ నిజమేనేమో అనే సందేహాలు వస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement