rumors
-
వైఎస్ఆర్ సీపీ హయాంలో మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తి నాకు లేదు: Balanagi Reddy
-
ఇకపై సహించను!
‘‘నాపై ఇప్పటివరకూ చాలా పుకార్లు వచ్చాయి. కానీ, వాటిపై నేను స్పందించ కుండా మౌనంగానే ఉన్నాను. ఎందుకంటే వాస్తవం ఏంటనేది దేవుడికి తెలుసు. అయితే మౌనంగా ఉంటున్నానని పుకార్లు తెగ రాస్తున్నారు. నా గురించి నిరాధారమైన వార్తలు రాస్తే ఇకపై సహించను’’ అంటున్నారు సాయి పల్లవి. ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే సాయి పల్లవి తొలిసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయి పల్లవి ప్రస్తుతం హిందీలో ‘రామాయణ’ సినిమాలో నటిస్తున్నారు. నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణాసురుడి పాత్రలో యశ్ నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయ్యే వరకు సాయి పల్లవి మాంసాహారానికి దూరంగా ఉండాలను కుంటున్నారని, హోటల్స్‌లో కూడా తినడం లేదని, విదేశాలకు వెళ్లేటప్పుడు వంటవాళ్లను వెంట తీసుకెళ్తున్నారనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఉద్దేశించే సాయి పల్లవి పై విధంగా స్పందించి ఉంటారు. ‘‘నా సినిమాల రిలీజ్, నా ప్రకటనలు.. ఇలా నాకు సంబంధించిన వాటి గురించి నిరాధారమైన వార్తలు రాస్తే యాక్షన్ తీసుకుంటాను. ఎంత పెద్ద సంస్థ అయినా లీగల్ యాక్షన్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇన్నాళ్లూ సహించాను. ఇకపై సిద్ధంగా లేను’’ అంటూ ΄ోస్ట్ చేశారామె. -
పార్టీ మార్పులపై అనిల్ కుమార్ యాదవ్ షాకింగ్ కామెంట్స్ ..
-
హార్దిక్ పాండ్యాతో విడాకులంటూ వార్తలు.. ట్రెండింగ్‌లో నటాషా (ఫొటోలు)
-
వెకేషన్లో కోలీవుడ్ క్యూట్ కపుల్: రూమర్స్‌కు ఫుల్స్టాప్!
ఇదిగో పులి అంటే అదిగో తోక అంటూ సోషల్ మీడియాలో వార్తలు పుంఖాను పుంఖాలుగా వస్తూ ఉంటాయి. అదీ సెలబ్రిటీల జీవితాలకు సంబంధించిన వార్తలైతే క్షణాల్లో వైరల్ అయిపోతూ ఉంటాయి. ఇటీవలి కాలంలో అలాంటి వాటిల్లో ఒకటి స్టార్ హీరో సూర్య, నటి జ్యోతిక విడాకుల వార్త. తాజాగా ఒక్క పోస్ట్‌తో ఈ ఊహగానాలకు చెక్ చెప్పింది నటి జ్యోతిక. భర్త సూర్యతో కలిసి జ్యోతిక ఫిన్లాండ్లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. గడ్డకట్టే చలి, చిల్లింగ్ స్నోలో హాయిగా గడుపుతున్న బెస్ట్ మూమెంట్స్ , క్యూట్ వీడియోని జ్యోతిక తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. జీవితం ఇంద్రధనుస్సులా రంగులమయం. ఒక్కో రంగును వెతికి పట్టుకొని ఆస్వాదిద్దాం. ఇదిగో ప్రకాశ వంతమైన నా శ్వేత వర్ణం అంటూ మంచులో తన సహచరుడితో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉన్న వీడియోను పోస్ట్ చేసింది. తద్వారా ఈ రియల్ కపుల్ విడిపోతున్నారనే వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్టైంది. దీంతో అభిమానులు క్యూట్ కపుల్ అంటూ కమెంట్స్ చేశారు. కాగా సూర్యతో గొడవల వల్లే ముంబైకి షిప్ట్ అయిపోయిందన్న వార్తలపై స్పందించిన జ్యోతిక వృత్తిపరమైన కారణాల వల్లే తాను ముంబైకి వెళ్లానంటూ క్లారిటీ ఇచ్చింది. రీఎంట్రీ తర్వాత, జ్యోతికకు బాలీవుడ్లో కూడా ఆఫర్లు వస్తున్నాయి. బాలీవుడ్ కమిట్మెంట్లు పూర్తయిన తర్వాత చెన్నైకి తిరిగి వస్తానని కూడా జ్యోతిక స్పష్టం చేసింది. జ్యోతిక చివరిసారిగా జియో బేబీ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం కథల్: ది కోర్లో అద్బుతమైన నటనతో ఆకట్టుకుంది. లెజెండరీ నటుడు మమ్ముట్టి సరసన పోటీపడి మరీ నటించి మెప్పించింది. అలాగే వికాస్ బహల్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ , ఆర్. మాధవన్ కూడా ప్రధాన పాత్రల్లో వస్తున్న బాలీవుడ్ హారర్/థ్రిల్లర్ షైతాన్‌లో నటిస్తోంది. షైతాన్ గుజరాతీ మూవీ వాష్‌కి రీమేక్‌గా వస్తోంది. View this post on Instagram A post shared by Jyotika (@jyotika) /p> -
నా పెళ్లి వార్తలు అవాస్తవం
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లిస్ట్‌లో విజయ్ దేవరకొండ ఒకరు. అప్పుడప్పుడు విజయ్ దేవరకొండ పెళ్లి గురించిన వార్తలు ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతూ ఉంటాయి. తాజాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నాల నిశ్చితార్థం జరగనుందని, వీరి వివాహ తేదీని కూడా త్వరలోనే ప్రకటిస్తారనే వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఓ ఆంగ్ల మ్యాగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ ఈ విషయంపై స్పందించారు. ‘‘ఈ ఫిబ్రవరిలో ఎవరితోనూ నా నిశ్చితార్థం జరగదు.. పెళ్లి లేదు. నా పెళ్లి గురించిన పుకార్లు తరచూ వస్తూనే.. వినిపిస్తూనే ఉన్నాయి. రెండేళ్లకో సారి నాకు పెళ్లి చేస్తూనే ఉన్నారు’’ అని చెప్పుకొచ్చారు విజయ్ దేవరకొండ. ఇక ప్రస్తుతం ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రంతో బిజీగా ఉన్నారు విజయ్ దేవరకొండ. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ వేసవిలో విడుదల కానుంది. -
ఆస్పత్రిలో దావూద్!
మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో అతన్ని రెండు రోజుల క్రితం పాకిస్తాన్‌లోని కరాచీలో హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఒక ఫ్లోర్ మొత్తాన్నీ ఖాళీ చేయించి అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ చికిత్స అందిస్తున్నట్టు చెబుతున్నారు. ఆస్పత్రి వర్గాలు, కుటుంబీకులకు తప్ప మరెవరికీ ప్రవేశం లేకుండా పోలీసులు భారీ సంఖ్యలో పహారా కాస్తున్నారట. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు మీడియా సంస్థలు ఈ మేరకు వార్తా కథనాలు ప్రసారం చేశాయి. అంతేగాక 67 ఏళ్ల దావూద్‌కు విషప్రయోగం జరిగిందని, అందుకే ఉన్నపళాన ఆస్పత్రికి తరలించారని సోమవారమంతా జోరుగా పుకార్లు షికారు చేశాయి. చికిత్స పొందుతూ ఆదివారమే అతను మరణించినట్టు కూడా వార్తలొచ్చాయి! అయితే దావూద్‌పై విషప్రయోగం, అతని మృతి వార్తలు పూర్తిగా అవాస్తవమని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రి పాలవడం మాత్రం నిజమేనని నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. దావూద్ చాలా ఏళ్లుగా కుటుంబంతో పాటుగా పాకిస్తాన్‌లోనే నివసిస్తున్నట్టు ఇప్పటికే తేలింది. అతను కరాచీలోనే ఉంటున్నట్టు పక్కా ఆధారాలున్నాయని భారత్ వెల్లడించింది కూడా. భారత్‌తో పాటు ఐరాస భద్రతా మండలి కూడా 2003లోనే దావూద్‌ను మోస్ట్ వాంటెడ్ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం తెలిసిందే. అతని తలపై ఏకంగా 2.5 కోట్ల డాలర్ల రివార్డు ఉంది! రోజంతా కలకలం దావూద్‌పై విషప్రయోగం, మృతి వార్తలు సోమవారం ఉదయం నుంచే కలకలం రేపాయి. ఆదివారం అర్ధరాత్రి దాటాక ఓ యూట్యూబర్ వీటిని తొలుత బయట పెట్టాడు. పలు సోషల్ మీడియా వార్తలను ఉటంకిస్తూ ఈ మేరకు కథనం ప్రసారం చేసి దుమారం రేపాడు. ఆది, సోమవారాల్లో పాకిస్థాన్ అంతటా గంటల తరబడి ఇంటర్నెట్ మూగబోవడానికి, దావూద్ మృతికి లింకుందని చెప్పుకొచ్చాడు. ‘‘దేశంలో ఏదో పెద్ద ఉదంతమే జరిగింది. దాన్ని దాచేందుకే నెట్‌పై ఆంక్షలు విధించారు’’ అంటూ ప్రముఖ పాక్ జర్నలిస్టులు ఎక్స్ పోస్టుల్లో అనుమానాలు వెలిబుచ్చడంతో మరింత అలజడి రేగింది. దావూద్ విషమ పరిస్థితుల్లో కరాచీ ఆస్పత్రిలో చేరినట్టు పాక్ జర్నలిస్టు అర్జూ కాజ్మీ ఎక్స్ పోస్టులో నిర్ధారించారు. తొలిసారేమీ కాదు... దావూద్‌పై విషప్రయోగం జరిగిందని, అతను మరణించాడని వార్తలు రావడం ఇది తొలిసారేమీ కాదు. ఏటా కనీసం ఒకట్రెండుసార్లు ఇలాంటి వార్తలు రావడం, అవన్నీ పుకార్లేనని తేలడం పరిపాటిగా మారింది. కరాచీలోనే దావూద్: అల్లుడు పాక్ ఖండిస్తున్నా, దావూద్ కరాచీలో ఉండటం వాస్తవమేనని అతని అల్లుడు అలీ షా పార్కర్ గత జనవరిలో ధ్రువీకరించాడు. కరాచీలోని అబ్దుల్లా గాజీ బాబా దర్గా వెనక రహీం ఫకీ సమీపంలోని డిఫెన్స్ ఏరియాలో దుర్భేద్యమైన ఇంట్లో కొన్నేళ్లుగా దావూద్ నివాసముంటున్నట్టు తెలిపాడు. దావూద్ చెల్లెలు హసీనా పార్కర్ కొడుకైన అలీ షా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు ఇచి్చన స్టేట్మెంట్లో ఇంకా పలు విషయాలు వెల్లడించాడు. ‘‘దావూద్ ఓ పాక్ పఠాన్ స్త్రీని రెండో పెళ్లి చేసుకున్నాడు. దావూద్‌కు ముగ్గురు సోదరులు, నలుగురు అక్కచెల్లెళ్లు, ఒక కొడుకు, ముగ్గురు కూతుళ్లున్నారు. ఒక కూతురును పాక్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ కుమారునికిచ్చి పెళ్లి చేశాడు’’ అని అలీ షా తెలిపాడు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్న గేమ్ ఛేంజర్
-
అమ్మా నాన్న ఒక ఆరిల్
సినిమాలకు దూరమైనా సరే, నటులపై ఆసక్తి మాత్రం దూరం కాదు. ‘ఫలానా నటుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ‘ఫలానా కథానాయిక ఇప్పుడు ఏ దేశంలో ఉంటుందో తెలుసా?’... ఇలాంటి విషయాలు అభిమానులకు ఎప్పుడూ ఆసక్తికరమే. ‘గజిని’ ‘అమ్మా నాన్న ఒక తమిళ అమ్మాయి’ ‘ఘర్షణ’... మొదలైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆశిన్ పెళ్లి తరువాత నటనకు దూరమైంది. కొన్ని నెలల క్రితం... ఆసిన్ భర్త నుంచి విడాకులు తీసుకుందని, మళ్లీ సినిమాలలో నటించనుందని రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ‘అలాంటిది ఏమీ లేదండీ బాబూ. నేను మళ్లీ సినిమాల్లో నటించడం లేదు’ అని ఆసిన్ స్వయంగా ప్రకటించింది. తాజాగా... ప్యారిస్‌లో జరిగిన కుమార్తె ఆరిన్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ఆసిన్. వీటిలో ఆమె భర్త రాహుల్ శర్మ కూడా ఉన్నాడు. ఇక రూమర్స్‌కు ఫుల్స్టాప్ పడినట్లే కదా! -
లెఫ్ట్‌తో పొత్తు ఇంకా ఖరారు కాలేదు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌కు వామపక్షాలకు మధ్య ఎన్నికల పొత్తు కుదిరిందన్న వార్తల్లో వాస్తవం లేదని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సీపీఐ, సీపీఎం పార్టీలకు చెరో రెండు అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు సోమవారం విస్తృత ప్రచారం జరిగింది. ఢిల్లీ స్థాయిలో ఈ పొత్తు కుదిరిందని, సీపీఎంకు మిర్యాలగూడ, భద్రాచలం, సీపీఐకి మునుగోడు, కొత్తగూడెం నియోజకవర్గాలను కేటాయించారని ప్రచారం జరిగింది. అయితే ఈ అంశాన్ని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క సున్నితంగా తోసిపుచ్చారు. వామపక్షాలతో పొత్తు చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని, వామపక్షాలకు నాలుగు స్థానాలు కేటాయించినట్లు జరిగిన ప్రచారం కేవలం ఊహాగానమేనని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం త్వర లోనే అధికారికంగా ప్రకటిస్తుందని, అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి మీడియాలో వస్తున్న కథనాలపై పార్టీ శ్రేణులు ఆందోళనకు గురికావద్దని సోమవారం ఆయన వెల్లడించారు. కాగా, వామపక్షాలు అడుగుతున్న నియోజకవర్గా లకు సంబంధించిన సమాచారాన్ని టీపీ సీసీ, అధిష్టానికి పంపించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈనెల ఒకటో తేదీన సమావేశమై ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్లడానికి కార్యాచరణ సిద్ధం చేస్తా మని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పినా.. అలాంటి సమావేశం ఏదీ జరగకపోగా, చెరో రెండు స్థానాలు ఖరారైనా ఏయే నియోజకవర్గాలన్న అంశంపై మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్నట్లు కామ్రేడ్లు చెబుతున్నారు. అప్పుడు బీఆర్ఎస్తో ఇప్పుడు కాంగ్రెస్‌తో.. ‘ఇండియా’కూటమిలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు కీలకంగా ఉన్నాయి. తెలంగాణలోనూ బీజేపీని ఓడించడమే లక్ష్యంగా కమ్యూనిస్టులు ముందుకు సాగుతున్నారు. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా బీజేపీకి బ్రేక్ వేసేందుకు ఆనాటి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో వామపక్షాలు చేతులు కలిపాయి. ఆ ఎన్నికలో బీజేపీ గెలవకుండా అడ్డుకోవడంలో కమ్యూనిస్టులు కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో సాధారణ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్తో కలసి సాగాలని లెఫ్ట్ పార్టిలు భావించాయి. కానీ వివిధ రాజకీయ కారణాలతో అది సాధ్యం కాలేదు. దీంతో రాష్ట్రంలో బీజేపీని, బీఆర్ఎస్ను ఓడించేందుకు కాంగ్రెస్‌తో కలవాలని కమ్యూనిస్టులు నిర్ణయించుకున్నారు. ఈ మూడు పార్టీలు కలిస్తే పలు నియోజకవర్గాల్లో కమ్యూనిస్టుల ఓట్లు కాంగ్రెస్‌కు కలసి వస్తాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గతంలోనే జాతీయ నేతల భేటీ.. తెలంగాణలో పొత్తుపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిలు గతంలోనే భేటీ అయినట్లు తెలంగాణ లెఫ్ట్ నేతలు వెల్లడించారు. మూడు జాతీయ పార్టిల అధినేతలు తెలంగాణలో పొత్తుకు పూర్తి స్థాయిలో ఆమోదం తెలిపారని చెపుతున్నారు. పొత్తుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆయా పార్టిల రాష్ట్ర నేతలకు అగ్ర నాయకత్వాలు సూచించాయని సమాచారం. కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలసి జాబితాను ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. కాగా, కమ్యూనిస్టులు కోరుతున్న స్థానాల్లోని కాంగ్రెస్ ఆశావహుల నుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తుందోనన్న ఆందోళన హస్తం నేతల్లో నెలకొని ఉంది. -
వదంతులపై స్పందించాల్సిందే
న్యూఢిల్లీ: కంపెనీల వ్యవహారాలపై మార్కెట్లో పుట్టే వదంతుల విషయంలో లిస్టెడ్ కంపెనీలు తప్పనిసరిగా స్పందించాల్సిందేనంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ స్పష్టం చేసింది. తొలుత మార్కెట్ క్యాపిటలైజేషన్ (విలువ) రీత్యా టాప్–100 కంపెనీలకు వదంతులపై స్పందించడాన్ని తప్పనిసరి చేసింది. ఇందుకు ఈ ఏడాది అక్టోబర్ 1 గడువుగా పేర్కొంది. అయితే తాజాగా ఈ గడువును వచ్చే ఏడాది (2024) ఫిబ్రవరి 1 వరకూ పొడిగించింది. ఇక టాప్–250 మార్కెట్ క్యాప్ కంపెనీలకు 2024 ఏప్రిల్ 1 నుంచి కాకుండా 2024 ఆగస్ట్ 1 నుంచి నిబంధనలు అమలుకానున్నాయి. -
షోయబ్ మాలిక్ తో సానియా విడాకులు..ఇదిగో ప్రూఫ్
-
ధోనికి జడేజాకు మధ్య విబేధాలు ఇంకా ప్రూఫ్స్ కావాలా ....!
-
తమన్నాతో డేటింగ్ పై స్పందించిన విజయ్ వర్మ
-
పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్ ప్రదీప్..?
-
శరత్‌బాబుతో హీరోయిన్ నమిత పెళ్లి పుకార్లు.. క్లారిటీ ఇచ్చిన భర్త
Namitha Husband Reaction On Namitha Marriage With Sarath Babu Rumours: హీరోయిన్ నమితకు తెలుగు, తమిళంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 'సొంతం' సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన ఈ భామ తర్వాత వెంకటేష్ సరసన జెమినీ, రవితేజకు జోడీగా ఒక రాజు..ఒక రాణి సినిమాలతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామరస్ హీరోయిన్గా పాపులర్ అయిన నమిత 2017లో వ్యాపారవేత్త, నిర్మాత వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. అయితే నమితపై గతంలో అనేక రూమార్స్ వచ్చిన సంగతి తెలిసిందే. వీరేంద్రతో పెళ్లి ఫిక్సయిన తర్వాత కూడా సీనియర్ నటుడు శరత్‌బాబుతో నమిత పెళ్లంటూ అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై నమిత భర్త వీరేంద్ర స్పందించారు. ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'సరిగ్గా మా పెళ్లి సమయంలోనే సీనియర్ నటుడు శరత్‌బాబుతో నమిత పెళ్లంటూ వార్తలు వచ్చాయి. నా లైఫ్‌లోనే నేను విన్న వరస్ట్ కామెంట్స్ ఇవి. అసలు అలాంటి రూమర్స్ ఎందుకు వచ్చాయో కూడా తెలియదు. ఆయన చాలా పెద్దాయన. అలాంటి వ్యక్తితో ఎఫైర్ క్రియేట్ చేయడం చాలా తప్పు. అలాంటి రూమర్స్‌ని పట్టించుకోవాల్సిన పనిలేదు' అంటూ పుకార్లకి చెక్ పెట్టారు. -
సిరి ఫోటోలు డిలీట్ చేసిన ప్రియుడు.. బ్రేకప్‌కు సంకేతమా?
After Shanmkh And Deepthi Breakup, Shrihan Deleting Siri Pics In Instagram: బిగ్‌బాస్ సీజన్-5 రెండు జంటల మధ్య చిచ్చు రేపింది. ఇప్పటికే దీప్తి సునయన షణ్ముక్‌కు బ్రేకప్ చెప్పేసింది. తమ దారులు వేరంటూ 5ఏళ్ల బంధానికి ముగింపు పలికింది. ఇప్పుడు దీప్తి సునయన బాటలోనే సిరి బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్ కూడా పయనిస్తున్నట్లు తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా సిరిని దూరం పెడుతూ వస్తున్న శ్రీహాన్.. త్వరలోనే ఆమెకు గుడ్‌బై చెప్పనున్నాడంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా బిగ్‌బాస్ షో పూర్తైనా వీరిద్దరూ జంటగా కనిపించలేదు. అయితే తాజాగా సిరితో తెగదెంపులు చేసుకునేందుకు శ్రీహాన్ సిద్ధమయినట్లు తెలుస్తుంది. దీనిలో భాగంగానే తన ఇన్‌స్టాగ్రామ్‌లో సిరి ఫోటోలన్నింటిని డిలీట్ చేసి షాకిచ్చాడు. కేవలం ఇద్దరూ కలిసి చేసిన వెబ్‌సిరీస్‌లకు సంబంధించిన అప్డేట్స్ మినహా సిరితో ఉన్న ఫోటోలన్నింటిని శ్రీహాన్ తన ఇన్స్టాగ్రామ్ పేజ్నుంచి తొలగించాడు. బిగ్‌బాస్ షోలో అనేక సార్లు షణ్నూతో కనెక్షన్ వస్తుందంటూ సిరి చెప్పిన మాటలతో శ్రీహాన్ గుండె బద్దలయ్యిందని, ఎంగేజ్మెంట్ జరిగిందన్న విషయం కూడా మర్చిపోయి షణ్నూతో చేసిన రొమాన్స్ భరించలేక శ్రీహాన్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. దీనిపై వారిద్దరూ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు ఇటీవలె సిరి బర్త్‌డేకు సైతం శ్రీహాన్ విషెస్ చెప్పడం విశేషం. -
ఎట్టకేలకు విడాకులపై స్పందించిన ప్రియాంక-నిక్ జోనస్
Priyanka Chopra-Nick Jonas Respond On Their Divorce Rumours With Instagram Post: సోషల్ మీడియా ఖాతాల నుంచి గ్లోబర్ స్టార్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్ ఇంటి పేరు తొలగించడం హాట్‌టాపిక్‌గా మారింది. ప్రియాంక చోప్రా జోనస్ అని ఉండే తన ప్రోఫైల్ నేమ్‌లో ప్రియాంక చోప్రా అని మాత్రమే ఉంచి చోప్రా, జోనస్ పేరు తీసేసింది. అది చూసి అందరూ షాకయ్యారు. దీని అర్థం ఏంటి త్వరలోనే ఈ స్టార్ కపుల్స్ విడిపోనున్నారా? విడాకులకు ఇది సంకేతమా? అంటూ మూడు రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: ప్రియాంక వీడియోపై సమంత కామెంట్, దీని అంతర్యం ఏంటి సామ్? అచ్చం ఇలానే ఇటీవల విడిపోయిన టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగ చైతన్య-సమంత మధ్య జరగడంతో ఈ రూమర్లకు బీజం పడింది. అయితే ఈ వార్తలపై ఇప్పటికే ప్రియాంక తల్లి మధు చోప్ర స్పందిస్తూ ఖండించింది. ఇక ప్రియాంక సైతం ఓ వీడియో షేర్ చేసి వారి విడాకులపై వస్తున్న వార్తలకు స్పష్టత ఇవ్వకనే ఇచ్చింది. అయినా నిక్-ప్రియాంక విడాకులు అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. దీంతో తాజాగా ఈ జంట ఈ పుకార్లపై స్పందించింది. చదవండి: ఇన్‌స్టాలో భర్త పేరు తొలగించిన ప్రియాంక... అసలేం జరిగింది? ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫొటోను తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ రూమార్లకు చెక్ పెట్టారు. ఈ ఫొటోను నిక్ షేర్ చేస్తూ.. ‘అందరికి థ్యాంక్స్ గివింగ్ శుభాకాంక్షలు! ప్రియాంక మీకు కూడా కృతజ్ఞతలు’ అంటూ ఫొటో షేర్ చేశాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ఇది చూసి గ్లోబల్ కపుల్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అంటే ‘వారు విడిపోతున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నమాట’ అంటూ క్లారిటీ ఇచ్చిన నిక్కు అభిమానులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. చదవండి: షాకింగ్ లుక్‌లో సహజనటి జయసుధ.. ఇంతగా మారిపోయారేంటి? దీంతో ‘మీరు ఎపుడు ఇలాగే హ్యాపీ ఉండాలి’, ‘క్యూట్ కపుల్’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అలాగే ప్రియాంక కూడా అదే ఫొటోను షేర్ చేస్తూ ‘చాలా కృతజ్ఞతతో ఉన్నాను(ఫ్యామిలీ, ఫ్రెండ్స్). లవ్ నిక్ జోనస్. థ్యాంక్స్ గివింగ్ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు’ అంటూ రాసుకొచ్చింది. చూస్తుంటే ఈ జంట తమ విడాకులపై వస్తున్న రూమార్లకు ఈ ఫొటోతో ఫుల్స్టాప్ పెట్టాలనుకున్నట్లు తెలుస్తోంది. కాగా నిక్-ప్రియాంక 2018 డిసెంబర్ 1న పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. View this post on Instagram A post shared by Nick Jonas (@nickjonas) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
విడాకుల రూమర్స్‌కి ఒక్క ఫోటోతో క్లారిటీ ఇచ్చిన మెగా అల్లుడు
Kalyan Dev Sreeja Divorce Rumors: సమంత-నాగచైతన్య విడాకుల తర్వాత ఇండస్ట్రీకి చెందిన మరో జంట విడిపోనున్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ-హీరో కల్యాణ్‌దేవ్‌లు త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనికి తోడు దీపావళి సెలబ్రేషన్స్‌లో సైతం వీరు కనిపించలేదు. అంతేకాకుండా మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌తో పాటు మెగా హీరోలందరూ కలిసి దిగిన ఫొటోలోనూ కళ్యాణ్ దేవ్ మిస్ అయ్యాడు. సాధారంగా మెగా ఫ్యామిలీలో జరిగే దాదాపు అన్ని వేడుకల్లో కల్యాణ్ దేవ్ హాజరవుతుంటారు. అలాంటిది ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో కనిపించకపోవడంతో ఈ వార్తలు నిజమేనేమో అన్న అనుమానం కొందరిలో మొదలైంది. తాజాగా కల్యాణ్‌దేవ్ ఒక్క ఫోటోతో రూమర్స్‌కి చెక్ పెట్టారు. భార్య శ్రీజ బర్త్‌డే సందర్భంగా..హ్యాపీ బర్త్‌డే స్వీటూ అంటూ లవ్ సింబల్‌ను జతచేస్తూ ఫోటోను పోస్ట్ చేశాడు. దీనికి శ్రీజ ఇన్‌స్టా అకౌంట్‌ను కూడా ట్యాగ్ చేశాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన విడాకుల రూమర్స్‌కి బ్రేక్ పడినట్లయ్యింది. 2016లో శ్రీజ-కల్యాణ్‌ల వీరి పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. కాగా విజేత సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన కల్యాణ్ దేవ్ ఇటీవలె సూపర్ మచ్చి, కిన్నెరసాని షూటింగ్స్ పూర్తి చేశారు. త్వరలోనే ఈ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. View this post on Instagram A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) -
‘వ్యాక్సిన్.. పింఛన్ కట్’ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు
సాక్షి, హైదరాబాద్: వ్యాక్సిన్ తీసుకోనివారికి వచ్చేనెల నుంచి రేషన్, పింఛన్ నిలిపివేస్తారని వైద్య, ఆరోగ్యశాఖ చెప్పినట్లు కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు స్పష్టంచేశారు. అలాంటి దుష్ప్రచారాన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం అలాంటి నిర్ణయమేమీ తీసుకోలేదని, ప్రజలు ఈ అసత్య ప్రచారంతో ఆందోళనకు గురికావొద్దని సూచించారు. తప్పుడు వార్తను ప్రసారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదిలాఉండగా, వ్యాక్సిన్ తీసుకోనివారికి రేషన్, పింఛన్ నిలిపివేస్తామని శ్రీనివాసరావు ప్రకటించినట్లుగా మంగళవా రం భారీగా ప్రచారమైన సంగతి తెలిసిందే. చదవండి: మహమ్మారి ఎఫెక్ట్: రెండేళ్లు తగ్గిన భారతీయుల ఆయుర్దాయం -
ChaySam: అఫైర్స్, అబార్షన్ వార్తలపై స్పందించిన సమంత
Samantha Ruth Prabhu: టాలీవుడ్ మోస్ట్ రోమాంటిక్ కపుల్‌గా పేరు గాంచిన నాగ చైతన్య-సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరి విడాకుల వ్యవహారంపై పలు ఊహాగానాలు వెలువడ్డాయి. ముఖ్యంగా సామ్ పిల్లల్ని కనడానికి ఇష్టపడలేదని.. ఇప్పటికే రెండు సార్లు అబార్షన్ చేయించుకుందని.. పిల్లల్ని కంటే కెరీర్‌కు అడ్డుగా మారుతుందని భావించిందని.. ఈ విషయం చైతన్యకు నచ్చకనే ఇద్దరు విడిపోయారనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. పిల్లల విషయంలో నాగ్ కుటుంబం సమంతకు ఎంతో నచ్చచెప్పిందని.. కానీ ఆమె వినలేదనే వార్తలు కూడా వెలువడ్డాయి. (చదవండి: చై-సామ్ కాపురంలో చిచ్చు: 'అక్కా అని పిలిచే వ్యక్తితో'..) ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ఈ పుకార్లపై సమంత తొలిసారి ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. తాను అబార్షన్ చేయించుకున్నానే వార్తల్ని ఖండించారు. ఈ క్రమంలో సామ్ ఇన్‌స్టాలో ఓ స్టోరీ షేర్ చేశారు. ‘‘ఇలాంటి కఠిన సమయంలో మీరు చూపిన ఆదరణకు ధన్యవాదాలు. నాకు మద్దతుగా నిలిచి.. నాపై వచ్చిన అబద్దపు వార్తలని ఖండించారు. ‘వాళ్లు’ నాకు వేరే వాళ్లతో అఫైర్స్ ఉన్నాయని.. నేను పిల్లల్ని కనడానికి ఇష్టపడలేదని.. అబార్షన్ చేయించుకున్నానని.. నేను అవకాశవాదినని ఇలా రకరకాల వార్తలు ప్రచారం చేశారు’’. (చదవండి: మనసులోని బాధను బయటపెట్టిన సమంత.. పోస్ట్ వైరల్) ‘‘కానీ విడాకులు తీసుకోవడం అనేది అత్యంత బాధాకరమైన అంశం. దీన్నుంచి బయటపడటానికి సమయం పడుతుంది. ఇలాంటి సమయంలో నాపై వ్యక్తిగతంగా ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం తగదు. అయితే ఒక్క విషయం చెప్పదల్చుకున్నాను.. ఈ తప్పుడు ప్రచారం నన్ను ఏమాత్రం కుంగదీయలేదు’’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశారు సమంత. ఈ పోస్ట్ చూసిన సమంత అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఇలాంటి తప్పుడు వార్తలపై తప్పక స్పందించాలి సామ్.. ఇక ఇన్నాళ్లు నీ మీద రాళ్లు వేసినవారు ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: సమంత లేటెస్ట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్: భావోద్వేగంతో ఇలా.. సమంత ఇన్‌స్టా పోస్ట్.. పర్సనల్ లైఫ్ గురించేనా? -
టీమిండియా మహిళా క్రికెటర్ తో శిఖర్ ధావన్ పెళ్లి..?
Rumours On Dhawan Second Marriage: సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ విషయం హైలెట్ అవుతుందో తెలియదు. కొన్ని రూమర్స్గా మిగిలిపోతాయి.. కొన్ని నిజాలుగా తేలుతాయి. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకుంటే టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్‌పై ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే కొద్ది రోజులు కిందట శిఖర్ ధావన్ తన భార్య ఆయేషా ముఖర్జీతో విడిపోయన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్, ఓ భారత మహిళా క్రికెటర్‌ను పెళ్లాడబోతున్నాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. శిఖర్ ధావన్, సదరు మహిళా క్రికెటర్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయేషాతో విడిపోవడానకి ఇదే కారణమంటూ కూడా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అసలు ఇందులో నిజం ఉందా లేదంటే.. గాసిప్స్ రాయుళ్ల పనేనా అన్నది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. చదవండి: CSK VS RR: ఫిలిప్స్ ఫన్నీ బ్యాటింగ్ వీడియో.. ‘నోరెళ్లబెట్టిన సామ్’ -
బయటకు రావాలంటే హడల్: ఆ గ్రామానికి ఏమైంది!
కోడూరు(అవనిగడ్డ): సముద్ర తీర ప్రాంతమైన పాలకాయతిప్ప గ్రామంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే హడలిపోతున్నారు. బయటకు వస్తే చనిపోతామంటూ గ్రామమంతా వదంతులు వ్యాపించడంతో గ్రామస్తులు కాలు బయట పెట్టాలంటే వణికిపోతున్నారు. వారం రోజుల వ్యవధిలో గ్రామంలో ఎనిమిది మంది వివిధ అనారోగ్య సమస్యలు, కోవిడ్‌తో మృతిచెందడమే ఈ వదంతుల వ్యాప్తికి కారణమని అధికారులు అంచనా వేశారు. కోడూరు మండలంలోని సముద్రతీరానికి ఆనుకొని ఉన్న హంసలదీవి పంచాయతీలో భాగమే ఈ పాలకాయతిప్ప గ్రామం. ఈ గ్రామంలో 220 కుటుంబాలకు చెందిన 800 మంది జనాభా నివాసముంటున్నారు. వీరంతా మత్స్యకార కుటుంబాల వారే కావడంతో అందరూ సముద్ర వేట మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారం రోజుల నుంచి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పలువురు గ్రామస్తులు మృతి చెందారు. వారం రోజుల వ్యవధిలో గ్రామానికి చెందిన ఎనిమిది మంది చనిపోవడంతోపాటు వీరిలో మంగళవారం (25వ తేదీన) ఒక రోజే ముగ్గురు మృతి చెందడంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఎనిమిది మందిలో ఇద్దరు మాత్రమే కోవిడ్ వైరస్ బారినపడి మృతి చెందగా, మిలిగిన ఆరుగురు వివిధ అనారోగ్య సమస్యలతో మృతి చెందారని అధికారులు తెలిపారు. రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, బందరు ఆర్డీఓ ఖాజావలి దృష్టికి ఈ పాలకాయతిప్ప గ్రామ విషయం వెళ్లడంతో మండలాధికారులను అప్రమత్తం చేశారు. గ్రామస్తుల్లో భయాందోళన పోగొట్టేందుకు మండల అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. గురువారం సాయంత్రం తహసీల్దార్ షేక్ లతీఫ్‌పాషా, వైద్యాధికారి సోమరాజు, కార్యదర్శి యలవర్తి సుబ్రహ్మణ్యం, ఎస్ఐ పి.రమేష్ ఆయా శాఖాల సిబ్బందితో కలిసి గ్రామంలో పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి వదంతులు నమ్మవద్దంటూ మనోధైర్యం కల్పించారు. వైద్య సిబ్బంది జ్వరపీడితుల వివరాలను సేకరించారు. తొమ్మిది మంది కోవిడ్‌తో బాధపడుతున్నారని, మరో 14 మంది గ్రామస్తులకు జ్వరాలు ఉన్నట్లు గుర్తించామని వైద్యాధికారి తెలిపారు. శుక్రవారం గ్రామస్తులందరికి ఆర్టీపీసీఆర్ కోవిడ్ టెస్టులు చేస్తామని, చనిపోయిన వారంతా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారేనని స్పష్టం చేశారు. పంచాయతీ అధికారులు గ్రామమంతా సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేసి, బ్లీచింగ్ చల్లారు. సర్పంచి కొక్కిలిగడ్డ బిక్షాలు, వలంటీర్లు సమస్యను అధికారులకు వివరించారు. చదవండి: కారు హారన్ మోగించాడని... ఎంత పని చేశారంటే.. సాక్షి ఎఫెక్ట్: మాయలేడి అరెస్టు -
5జీ వదంతులపై టెల్కోల ఆందోళన
న్యూఢిల్లీ: కోవిడ్–19 కేసులు పెరగడానికి 5జీ స్పెక్ట్రమ్ ట్రయల్సే కారణమంటూ వస్తున్న వదంతులపై టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఇవన్నీ తప్పుడు వార్తలని, వాటిని నమ్మరాదని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలతో పాటు కొన్ని ప్రాంతీయ మీడియాలో కూడా కోవిడ్–19 కేసుల ఉధృతికి 5జీ స్పెక్ట్రం ట్రయల్సే కారణమంటూ వార్తలు చక్కర్లు కొడుతుండటం తమ దృష్టికి వచ్చినట్లు సీవోఏఐ శుక్రవారం తెలిపింది. ‘ఈ వదంతులన్నీ పూర్తిగా తప్పులతడకలే. ఇలాంటి నిరాధారమైన, తప్పుడు వార్తలను విశ్వసించరాదని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే పలు ప్రపంచ దేశాలు 5జీ నెట్‌వర్క్‌లను ప్రారంభించాయి. ఆయా దేశాల్లోని ప్రజలు కూడా ఈ సర్వీసులను సురక్షితంగా వినియోగించుకుంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా 5జీ టెక్నాలజీకి, కోవిడ్–19కి సంబంధం లేదని ఇప్పటికే స్పష్టం చేసింది‘ అని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ ఒక ప్రకటనలో తెలిపారు. -
నా ఆరోగ్యం బాగుంది!
సినీ సెలబ్రిటీల ఆరోగ్యంపై ఆన్లైన్లో పలు రకాల వార్తలు హల్చల్ చేస్తుంటాయి. ఒక్కోసారి ఏది నిజమో? ఏది అబద్ధమో? తెలియక వారి అభిమానులు కంగారు పడుతుంటారు. ఆ వార్తలు అటూ ఇటూ తిరిగి సంబంధిత సెలబ్రిటీ వద్దకు చేరాక ‘నేను ఆరోగ్యంగానే ఉన్నాను.. వదంతులు నమ్మొద్దు’ అంటూ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. తాజాగా నటి రాధికకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ‘రాధిక ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై తాజాగా ట్విట్టర్ వేదికగా రాధిక స్పందిస్తూ– ‘‘మీరు (అభిమానులు) నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. నా ఆరోగ్యంపై ఎన్నో పుకార్లు వస్తున్నాయి. వాటిని నమ్మొద్దు. నాకు కరోనా సోకలేదు. కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న తర్వాత స్వల్పంగా ఒళ్లు నొప్పులు వచ్చాయి. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను. ఆఫీసుకు హాజరవుతున్నా’’ అన్నారు. -
మమ్మల్ని నమ్మండి.. వాట్సాప్ క్లారిటీ
సాక్షి, న్యూఢిల్లీ: వ్యక్తిగత వివరాలు అడుగుతుందని.. ఫోన్లు, సందేశాలు స్టోరేజీ చేసుకుంటుందని.. వినియోగదారుల వ్యక్తిగత వివరాలు పక్కదారి పడుతున్నాయని వాట్సాప్‌పై వార్తలు వస్తున్నాయి. అయితే ఇవన్నీ పుకార్లనీ.. వాటికి తాము సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉందని వాట్సాప్ తెలిపింది. దీంతో మంగళవారం సోషల్ మీడియా వేదికగా వాట్సాప్ స్పష్టత ఇచ్చింది. అవన్నీ పుకార్లేనని కొట్టిపారేసింది. ఈ వదంతుల కారణంగా వారం రోజుల్లోనే వాట్సప్‌ను అన్ ఇన్స్టాల్ చేయడం.. అన్‌లైక్ చేయడం చేస్తున్నారు. వాట్సప్ వినియోగం ఆపేసి మిగతా యాప్‌లను వినియోగిస్తున్నారు. పెద్దసంఖ్యలో డౌన్లోడ్స్ ఆగిపోయి.. డిస్ లైక్‌లు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో వాట్సాప్ అధికారికంగా స్పందించి కొంత నష్ట నివారణ చర్యలు చేపట్టింది. చివరి వరకు మీ వ్యక్తిగత వివరాలు మేం రక్షణగా ఉంటామని ప్రకటించింది. వాట్సాప్ ప్రకటనలో ముఖ్యమైన అంశాలు ఫేస్‌బుక్‌కు వాట్సాప్ వివరాలు పంపుతామని అబద్ధం. ఎలాంటి వివరాలు పంచుకోం. మీ వ్యక్తిగత చాట్ వివరాలు ఎవరికీ తెలపం. కొత్తగా ప్రైవసీ పాలసీని రూపొందిస్తున్నాం. కొత్త నిబంధనలను అంగీకరిస్తేనే వాట్సప్ వినియోగానికి అర్హులు. లేదంటే వారి ఖాతాను తొలగించేస్తాం. కొత్తగా అప్డేట్ చేసిన వర్షన్ ఫిబ్రవరిలో అమల్లోకి తెస్తాం. 400 మిలియన్ల వినియోగదారులు వాట్సాప్ కు ఉన్నారు. ఫేస్‌బుక్‌కు మీ పరిచయస్తుల (కాంటాక్ట్స్) వివరాలు పంచుకోం. వ్యక్తిగత వివరాలు ఎవరికీ షేర్ చేయం. మీ వివరాలన్నింటి విషయంలో గోప్యత పాటిస్తాం. మీరు సందేశాలు కనిపించకుండా చేసుకోవచ్చు. మీరు పంపిన లోకేషన్స్ కూడా వాట్సప్ పర్యవేక్షించదు. -
కిమ్‌కి ఏమీ కాలేదు
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కోమాలోకి వెళ్లి పోయారని వచ్చిన వదంతులకి తెర పడింది. కరోనా వ్యాప్తి, తుపాన్ ఎదుర్కొనే ఏర్పాట్లపై బుధవారం పొలిట్ బ్యూరో సమావేశంలో కిమ్ సమీక్ష జరుపుతున్నట్లు ఫొటోలను యంత్రాంగం విడుదల చేసింది. అత్యవసర పరిస్థితుల్ని ఎదుర్కోవడంలో ఉన్న లోటుపాట్లను కిమ్ అధికారులతో చర్చించినట్టుగా అధికార వార్తా సంస్థ వెల్లడించింది. ఈ సమావేశంలో కిమ్ పొగతాగుతూ కనిపించారని తెలిపింది. కిమ్‌పై అనారోగ్యం వార్తలు ఇదేమీ కొత్త కాదు. గతంలోనూ కిమ్ మృతి చెందారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న వీడియో బయటకి వచ్చింది. ఇప్పుడు కూడా కిమ్ కోమాలోకి వెళ్లారని సోదరి కిమ్ యో జాంగ్‌కు బాధ్యతలు అప్పగించారని ప్రచారం జరిగింది. -
ప్రణబ్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలను నమ్మొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి చెందినట్లు సోషల్ మీడియాలో వదంతులు వస్తున్నాయి. వాటిని ప్రణబ్ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ, కుమారుడు అభిజిత్ ముఖర్జీ ఖండించారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మొద్దని తెలిపారు. ఆ వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమేనని, తమ తండ్రి కోలుకుంటున్నారని ట్విటర్లో వెల్లడించారు. సోషల్ మీడియాలో తమ తండ్రి అనారోగ్యంపై వచ్చే వార్తలు ఆసత్యమని, ముఖ్యంగా మీడియా గమనించాలని తెలిపారు. Rumours about my father is false. Request, esp’ly to media, NOT to call me as I need to keep my phone free for any updates from the hospital🙏 — Sharmistha Mukherjee (@Sharmistha_GK) August 13, 2020 ఢిల్లీలోని కంటోన్మెంట్ ప్రాంతంలోని ఆర్మీ ఆసుపత్రిలో ప్రణబ్ ఈ నెల 10వ తేదీన చేరిన విషయం తెలిసిందే. మెదడులో ఏర్పడ్డ ఒక అడ్డంకిని తొలగించేందుకు ఆయనకు శస్త్ర చికిత్స కూడా జరిగింది. అదే రోజు ఆయనకు కోవిడ్–19 పరీక్షలు జరపగా పాజిటివ్‌గా తేలింది. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని ఆర్మీ ఆసుపత్రి బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. My Father Shri Pranab Mukherjee is still alive & haemodynamically stable ! Speculations & fake news being circulated by reputed Journalists on social media clearly reflects that Media in India has become a factory of Fake News . — Abhijit Mukherjee (@ABHIJIT_LS) August 13, 2020 -
‘విశాఖ ప్రజలు ఆ పుకార్లను నమ్మవద్దు’
సాక్షి, విశాఖపట్నం: అమ్మోనియం నైట్రేట్ వల్ల నగరానికి ఎటువంటి ప్రమాదం లేదని విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ కె.రామ్మోహన రావు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అమ్మోనియం నైట్రేట్ నిల్వలు గురించి విశాఖ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లని ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. విశాఖ పోర్టులో గత దశాబ్దన్నర కాలం నుంచి పూర్తి భధ్రతా ప్రమాణాలతో అమ్మోనియం నైట్రేట్‌ని రష్యా, ఉక్రేయిన్ తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. (ఆ విషయంలో విశాఖ పోర్టు సురక్షితమే!) అమ్మోనియం నైట్రేట్‌ని బొగ్గు గనులలో వినియోగిస్తారని రామ్మోహన రావు తెలిపారు. విశాఖ పోర్టులో కేవలం హ్యాండ్లింగ్ మాత్రమే జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. షిప్ వచ్చే ముందు పోర్టుకి సమాచారం వస్తుందని.. అన్ని అనుమతుల తర్వాతే హ్యాండ్లింగ్‌కి అనుమతిస్తామన్నారు. అమ్మోనియం నైట్రేట్ గురించి విశాఖ ప్రజలు అపోహ పడవద్దని రామ్మోహనరావు కోరారు. -
నాకేం కాలేదు.. ఆరోగ్యంగా ఉన్నా
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: తాను ఎలాంటి జబ్బుతో బాధపడడం లేదని, పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ట్విట్టర్లో హిందీ భాషలో ఒక ప్రకటన జారీ చేశారు. అమిత్ షా ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వదంతులు వెల్లువెత్తుతుండడంతో ఆయన తన ఆరోగ్యంపై స్పష్టత ఇచ్చారు. ‘గత రెండు రోజులుగా ‘కొందరు మిత్రులు’ నా ఆరోగ్యంపై పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు. నాకు మరణం ప్రాప్తించాలని వారు కోరుకుంటున్నారు. నా ఆరోగ్యంపై ఎలాంటి స్పష్టత ఇవ్వొద్దని నిర్ణయించుకున్నాను. కానీ, లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు నా ఆరోగ్యంపై ఆందోళన చెందుతుండడంతో స్పష్టత ఇవ్వక తప్పడం లేదు. నా ఆరోగ్యంపై ఆరా తీసిన వారందరికీ కృతజ్ఞతలు. పుకార్లు సృష్టించిన వారికి కూడా కృతజ్ఞతలు. వారి పట్ల నాకు ఏమాత్రం ప్రతికూల భావన లేదు. వారు ఇలాంటి పనికిమాలిన వ్యవహారాలు పక్కనపెట్టి సొంత పనులు చూసుకుంటే మంచిది’ అని అమిత్‌షా పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాన్ని ఖండించిన జె.పి.నడ్డా అమిత్ షా ఆరోగ్యంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జె.పి.నడ్డా తీవ్రంగా ఖండించారు. అమానవీయమైన ఇలాంటి ప్రచారం చేసేవారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. అమిత్ షా ఆరోగ్యం విషయంలో సోషల్ మీడియాలో కొనసాగుతున్న ప్రచారాన్ని కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, రవిశంకర్ ప్రసాద్ ఖండించారు. షా ఆరోగ్యంపై నకిలీ ట్విట్టర్ ఖాతా ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చిన నలుగురు వ్యక్తులను అహ్మదాబాద్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. వారు ఏకంగా అమిత్ షా పేరిటే ట్విట్టర్ ఖాతా తెరవడం గమనార్హం. కేంద్ర హోంమంత్రి తీవ్రమైన జబ్బుతో బాధపడుతున్నారంటూ ట్వీట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నలుగురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
టెన్త్ ఎగ్జామ్స్ : ఆ వదంతులు నమ్మొద్దు!
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో పదోవ తరగతి పరీక్షలకు సంబంధించి సామాజిక మాధ్యమంలో వస్తున్న వదంతులు నమ్మవద్దని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చిన వీరభద్రుడు విజ్ఞప్తి చేశారు. రోజుకు ఒకరకంగా పదో తరగతి పరీక్షలకు సంబంధించిన ఫేక్ న్యూస్‌లను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారన్నారు. మొన్న టైమ్ టేబుల్ విషయంలో వదంతులు సృష్టించగా, నేడు ఏకంగా తన పేరును ఫోర్జరీ చేసి పరీక్ష తేదీలను ఆన్లైన్లో పెట్టారని తెలిపారు. (‘అప్పుడే పదో తరగతి పరీక్షల నిర్వహణ’) పదవ తరగతి పరీక్షలపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇలాంటి వదంతులు సృష్టించడం సైబర్ నేరాల కిందకి వస్తోందని, అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే విద్యార్థులు మానసికంగా ఆందోళన చెందుతున్నారని వారిని ఇలా గందరగోళానికి గురిచేయడం సమంజసం కాదన్నారు. ప్రజలెవరు ఈ వదంతులు నమ్మి ఆందోళన చెందవద్దని వీరభద్రుడు కోరారు. (పరీక్షలు జరుగుతాయి.. చదువుకోండి) -
‘డేటింగ్లో లేము.. అప్పటికే నాకు!’
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హాతో గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్నట్లు వస్తున్న పుకార్లను నటుడు జహీర్ ఇక్బాల్ ఖండించాడు. దీనిపై ఓ ఇంటర్యూలో జహీర్ స్పందిస్తూ.. ‘నేను సోనాక్షి ప్రేమలో ఉన్నామంటు వచ్చిన వార్తలను చదివి మేమిద్దరం నవ్వుకున్నాం. ఇది నా మొదటి రుమర్ అందుకే ఎలా స్పందించాలో నాకర్థం కాలేదు’ అని చెప్పాడు. ‘‘తరచూ ఇద్దరం కలిసి వివిధ పార్టీలకు, డిన్నర్లకు వెళ్లేవాళ్లం. అది చూసి అంతా సోనాక్షి, నేను డేటింగ్లో ఉన్నామని భావించి ఉంటారు. నాకు తెలిసి అందువల్లే ఈ పుకార్లు పుట్టుకొచ్చి ఉంటాయి. అయితే ప్రజలు అది మాత్రమే కాదు ఇంకా మా మధ్య ఎముందో కూడా తెలుకోవాలి’’ అంటూ చెప్పుకొచ్చాడు. (నెటిజన్ల ట్రోల్స్‌పై స్పందించిన సోనాక్షి) ఇక తమపై వచ్చిన పుకార్లను చూసి సోనాక్షి, తాను చర్చించుకున్నామని చెప్పాడు. ఇక అందరికి తెలియని విషయం ఏటంటే తాను అప్పటికే మరొకరితో ప్రేమలో ఉన్నానని చెప్పాడు. ఆ విషయం సోనాక్షికి కూడా తెలుసని, దీంతో తమపై వచ్చిన ఈ రూమర్ వల్ల సోనాక్షి చాలా ఇబ్బంది పడిందన్నాడు. అయితే ప్రస్తుతానికి తాను సింగిల్‌గా ఉన్నానని చెప్పాడు. కాగా జాహీర్ గతేడాది దర్శకుడు నితిన్ కక్కర్, రూపొందించిన ‘నోట్‌బుక్’ సినిమాతో బాలీవుడ్లో తెరంగేట్రం చేశాడు. ఈ చిత్రంలో జాహీర్కు సరసన మోహ్నీష్ బహ్ల్ కూతురు ప్రణుతాన్ బహ్ల్ నటించారు. కాగా కండల వీరుడు సల్మాన్ ఖాన్ బ్యానర్లో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుంది. (కరోనా కాలంలో షేక్ హ్యాండ్ ఇచ్చిన హీరో!) -
కోవిడ్‌పై వదంతులు నమ్మొద్దు
న్యూఢిల్లీ: కోవిడ్–19 (కరోనా వైరస్)కు సంబంధించి వస్తున్న వదంతులను నమ్మరాదని, వైద్యుల సలహా, సూచనలను కచ్చితంగా పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రజలు షేక్హ్యాండ్లను మానేసి ఇతరులను పలకరించేందుకు నమస్కారాన్ని వాడాలని కోరారు. జన్ ఔషధి దివస్ సందర్భంగా శనివారం ప్రధాని మోదీ కొంతమంది జన ఔషధి దుకాణదారులు, ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన (పీఎంబీజేపీ) లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ‘కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ఈ తరుణంలో రకరకాల వదంతులు పుట్టుకొస్తాయి. కొంతమంది వైరస్‌కు దూరంగా ఉండేందుకు ఫలానాది తినమని సలహాలిస్తూంటారు. దయచేసి వేటినీ నమ్మవద్దు. ఏం చేసినా.. వైద్యులు చెప్పినట్లు మాత్రమే చేయండి. మీరే వైద్యులు కావొద్దు’అని ఆయన స్పష్టం చేశారు. జన ఔషధి పథకం ద్వారా భారీగా లబ్ధి పొందింది ఈ దేశ పేదలు మాత్రమేనని ప్రధాని మోదీ అన్నారు. పీఎంబీజేపీ ద్వారా దేశం మొత్తమ్మీద నెలనెలా కోటి మందికి ఔషధాలు చౌకగా అందుతున్నాయని, దేశవ్యాప్తంగా ఉన్న ఆరు వేల జన ఔషధి కేంద్రాల ద్వారా పేదల సొమ్ము రూ.2000 నుంచి 2500 కోట్లు ఆదా చేయగలిగామని వివరించారు. ఈ కేంద్రాల్లో మందులు గరిష్ట అమ్మకం రేటు కంటే 50 నుంచి 90 శాతం తక్కువ ధరకు లభిస్తాయని వివరించారు. కేన్సర్ వ్యాధి చికిత్సకు వినియోగించే మందులు మార్కెట్లో రూ.6500 వరకూ ఉంటే జన ఔషధి కేంద్రాల్లో కేవలం రూ.850 మాత్రమే ఉంటుందని ఆయన వివరించారు. ఈ కేంద్రాల నిర్వాహకుల శ్రమను గుర్తించేందుకు అవార్డులు అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. మీరు మా దేవుడు... ప్రధానితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో డెహ్రాడూన్‌కు చెందిన దీపా షా అనే మహిళ మాట్లాడుతూ.. ‘నేను దేవుడిని చూడలేదు. కానీ మీలో మాకు దేవుడు కనిపిస్తున్నాడు’ అని వ్యాఖ్యానించడంతో ప్రధాని ఉద్వేగానికి గురయ్యారు. కాసేపు ఆయన ఏమీ మాట్లాడలేకపోయారు. 2011లో పక్షవాతానికి గురైన దీపా మాట్లాడుతూ.. ‘మొదట్లో నా∙మందుల ఖర్చు చాలా ఎక్కువగా ఉండేది. జన ఔషధి కేంద్రాల కారణంగా నెలకు రూ.3500 ఆదా చేయగలుగుతున్నాను’ అని మోదీతో చెప్పారు. ‘మీరు మీ ఆత్మస్థైర్యంతో∙వ్యాధిని జయించారు’అని మోదీ ఆమెతో అన్నారు. సుమారు 3.5 లక్షల మంది ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగమయ్యారని, మూడు లక్షల మంది వృద్ధులకు పింఛన్ లభిస్తోందని ప్రధాని తెలిపారు. -
అవసరమైనప్పుడు మరిన్ని చర్యలుంటాయ్
న్యూఢిల్లీ: ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న రంగాలకు మరిన్ని ప్రోత్సాహక చర్యలు ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. వృద్ధికి ప్రోత్సాహకంగా అవసరమైనప్పుడు మరిన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు వినియోగాన్ని పెంచడం ద్వారా వృద్ధికి ఊతమిస్తాయన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. శుక్రవారం ఢిల్లీలో సీనియర్ అధికారులతో కలసి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పెంచబోతున్నట్టు తన కార్యాలయం మినహా అంతటా వదంతులు వ్యాప్తి చెందుతున్నట్టు వ్యాఖ్యానించారు. ఈ నెల 18న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహార బకాయిలపై అవగాహన ఉందని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మంత్రి చెప్పారు. ఆర్థిక రంగం ఎప్పుడు పుంజుకోవచ్చంటూ ఈ సందర్భంగా ఎదురైన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. ‘‘నేను ఎటువంటి అంచనాలు వేయను. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అవసరమైనప్పుడు జోక్యం చేసుకుంటాను. పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది’’ అని వివరించారు. స్టాగ్ఫ్లేషన్ (ద్రవ్యోల్బణం పెరుగుతూ, వృద్ధి తగ్గుతుండడం)పై తానేమీ వ్యాఖ్యానించబోనన్నారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ రాజన్ భారత్ స్టాగ్ఫ్లేషన్ దశలోకి వెళుతోందని వ్యాఖ్యానించిన విషయం గమనార్హం. ధరలు దిగొస్తున్నాయి.. ఉల్లిపాయల దిగుమతులతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ధరలు దిగొస్తున్నట్టు మంత్రి చెప్పారు. తాజా పంట దిగుబడులు కూడా మార్కెట్‌కు చేరితే ధరలు మరింత తగ్గుముఖం పడతాయన్నారు. -
నేను బతికే ఉన్నా..
సాక్షి, కొందుర్గు/ రంగారెడ్డి : అంగన్వాడీ టీచర్ బతికుండగానే మృతిచెందినట్లుగా గ్రామ ముఖ్య కూడలీలో గుర్తుతెలియని వ్యక్తులు బోర్డు తగిలించారు. ఈ సంఘటనతో కొందుర్గు మండలం బైరంపల్లి ఆదివారం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. బైరంపల్లి అంగన్వాడీ టీచర్ వినోద పౌష్టికాహారం చెత్తకుప్పలో పడేసిందని ఈ నెల 16న గ్రామస్తులు ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సీడీపీఓ నాగమణి, సూపర్వైజర్ విజయలక్ష్మి గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులతో మాట్లాడి అంగన్వాడీ టీచర్ వినోదకు మెమో జారీ చేశారు. కాగా, ఆదివారం ఉదయం బైరంపల్లి బస్టాండ్ వద్ద అంగన్వాడీ టీచర్ వినోద మృతిచెందిందని బోర్డు తగిలించారు. ఇది చూసిన గ్రామస్తులంతా మనస్తాపంతో చనిపోయిందేమోనని అనుకున్నారు. తోటి అంగన్వాడీ టీచర్ల ఫోన్‌తో విషయం తెలుసుకున్న వినోద కొందుర్గు పోలీసులను ఆశ్రయించింది. తానే బతికే ఉన్నానని, కావాలనే కొందరు చనిపోయినట్లుగా గ్రామ కూడలిలో బోర్డు ఏర్పాటు చేశారని బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంగన్వాడీ టీచర్లు ధర్నా.. అంగన్వాడీ టీచర్ వినోదను ఉద్దేశపూర్వకంగా హింసిస్తున్నారని, బతికుండగానే చనిపోయినట్లు రాయడం బాధాకరమని కొందుర్గు, జిల్లేడ్‌చౌదరిగూడ మండలాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు మండిపడ్డారు.ఈ సందర్భంగా బైరంపల్లి బస్టాండ్ వద్ద రోడ్డుపై ధర్నా చేపట్టారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించి దుండగులను పట్టుకుని శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. -
పాప రేప్‌పై సోషల్ మీడియా గగ్గోలు
సాక్షి, న్యూఢిల్లీ : ‘మూడేళ్ల పాపను రేప్ చేసి హత్య చేశారు. ఆ పాప రెండు కనుగుడ్లను పీకేసారు. ఓ చేయి విరిచేశారు. శరీరంపై యాసిడ్ పోశారు. ఆ తర్వాత కుక్కలు పీక్కుతినేలా చెత్త కుండీలో పడేశారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో జరిగింది. ఇంతటి దారుణానికి ఒడిగట్టింది జాహిద్, అస్లాం అనే యువకులు’.. ఈ వార్త చదవగానే ఎవరికైనా ఒళ్లు జలదరిస్తుంది. ఆ వెంటనే రక్తం సలసలా కాగిపోతుంది. ఆ పాశవిక నేరస్థులు కళ్లముందు కనిపిస్తే పెట్రోలు పోసి తగుల బెట్టాలనిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ఇది. ‘రేప్‌లకు మతం లేదనే వారు నేడెక్కడికి పోయారు? కశ్మీర్‌లోని కథువాలో ఎనిమేదేళ్ల బాలికపై హిందూ యువకులు సామూహిక అత్యాచారం జరిపారంటూ గగ్గోలు ఎత్తిన వారు నేడెక్కడా ?’ అంటూ వరుసగా వెలువడుతున్న ట్వీట్లతో నేడు అలీగఢ్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చేతిలో నేరాన్ని తెలియజేసే బోర్డు పట్టుకున్న ఫొటోతో మాధుర్ అనే వ్యక్తి ఈ నెల ఐదవ తేదీన చేసిన ట్వీట్ మొట్టమొదట అలజడి సృష్టించింది. ఇప్పుడు దానికి అనుగుణంగా వరుసపెట్టి ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. ఇంత దారుణ సంఘటనలో నిజం కొంతే. అసలేం జరిగిందీ...? జూన్ రెండవ తేదీన చీర కొంగులో చుట్టిన రెండున్నర ఏళ్ల పాప మతృదేహం ఓ ఖాళీ స్థలంలో కనిపించినట్లు పోలీసులకు సమాచారం అందింది. అలీగఢ్ పోలీసులు అక్కడికి వెళ్లి పాప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. అనంతరం రిపోర్టు కూడా వచ్చింది. పాపపై ఎలాంటి రేప్ జరగలేదని, గుడ్లు పీకేయడం, చేయి విరిచేయడం లాంటి దారణాలు కూడా జరగలేదని, గుంతు పిసకడం వల్ల ఊపిరాడక పాప మరణించిందని అలీగఢ్ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ ఆకాష్ కుల్హరి మీడియా ముఖంగా తెలిపారు. ఆర్థిక లావాదేవీల కారణంగా పాపను చంపేస్తామని బెదిరించిన హంతకులు అన్యాయంగా పాపను పొట్టనపెట్టుకున్నారని ఆయన చెప్పారు. ఈ కేసులో జాహిద్, అస్లాం అనే యువకులను అరెస్ట్ చేశామని చెప్పారు. -
పాప రేప్‌పై సోషల్ మీడియా గగ్గోలు
-
అవన్నీ వదంతులే : గుత్తా జ్వాల
సాక్షి, హైదరాబాద్ : సెలబ్రిటీ రియాలిటీ షో బిగ్ బాస్ 3లో తాను పాల్గొంటానని వచ్చిన వార్తలను బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల తోసిపుచ్చారు. నాగార్జున హోస్ట్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న బిగ్‌బాస్ 3లో తాను పార్టిసిపేట్ చేస్తున్నట్టు వచ్చిన వార్తలన్నీ వదంతులేనని ఆమె ట్విటర్ వేదికగా కొట్టిపారేశారు. బిగ్‌బాస్ సీజన్ 3లో ప్రముఖ యాంకర్ శ్రీముఖి, హీరో వరుణ్ సందేశ్, ఆర్జే హేమంత్ తదితరులు పాల్గొంటారని తెలిసింది. ఇక బిగ్‌బాస్ సిరీస్‌లో తొలి రెండు షోలు విజయవంతం కావడంతో మూడవ సీజన్‌ను ఎవరు హోస్ట్ చేస్తారు, పార్టిసిపెంట్స్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. -
అవన్నీ వదంతులే : షాహిద్ కపూర్
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ పొత్తికడుపు క్యాన్సర్ తొలి దశలో ఉందని ఇంటర్నెట్లో వార్తలు వైరల్ కావడంతో కుటుంబ సభ్యులు అవి కేవలం వదంతులేనని తోసిపుచ్చారు. తాజాగా తనకు స్టమక్ క్యాన్సర్ సోకిందనే వార్తలు కేవలం వదంతులేనని స్వయంగా షాహిద్ కపూర్ మంగళవారం ట్వీట్ చేశారు. వదంతులను నమ్మవద్దని తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని అభిమానులకు భరోసా ఇచ్చారు. అంతకుముందు షాహిద్ కుటుంబ సభ్యులు కూడా ఇవి కేవలం పుకార్లేనని కొట్టిపారేశారు. అసలు వారిష్టం వచ్చిన రీతిలో కొందరు ఎందుకిలా రాస్తారు..? ఏ ఆధారంగా ఇలా రాశారు..ఇలాంటి వదంతులు వ్యాపింపచేయడం ఆమోదయోగ్యం కాదని వారు పేర్కొన్నారు. ఇక వృత్తిపరంగా శ్రద్ధాకపూర్‌తో కలిసి బట్టి గుల్ మీటర్ చాలులో నటించిన షాహిద్ ప్రస్తుతం అర్జున్‌రెడ్డి రీమేక్ కబీర్ సింగ్‌లో టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఈ మూవీ సెట్లో ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ షాహిద్ హల్చల్ చేస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ 21న కబీర్ సింగ్ థియేటర్లలో సందడి చేయనుంది. -
‘నమ్మండిరా బాబు.. నిజంగా నేనే’
అబుజా : ‘చావుపుట్టుకలు దైవాధీనం’.. ఇది ఒకప్పటి మాట. మరి నేడో.. రేటింగ్స్ కోసం.. పాపులారిటీ కోసం.. సోషల్ మీడియా సాక్షిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎవరినైనా చంపేస్తున్నాం. పాపం ఆనక సదరు వ్యక్తులు ‘బాబోయ్ మేం బతికే ఉన్నాం’ అంటూ టీవీల ముందుకు వచ్చి మొరపెట్టుకోవాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది నైజీరియా అధ్యక్షుడు బుహారికి. మీడియా ముందుకు వచ్చి ‘నేను బతికే ఉన్నాను.. నేను నేనే. నన్ను నమ్మండి’ అంటూ వాదించాల్సిన పరిస్థితి ఎదురయ్యింది బుహారికి. విషయం ఏంటంటే గత ఏడాది గుర్తు తెలియని వ్యాధి చికిత్స నిమిత్తం లండన్ వెళ్లారు బుహారి. ఎక్కువ రోజులు అక్కడే ఉన్నారు. కొన్నాళ్ల క్రితమే తిరిగి స్వదేశానికి వచ్చారు. కానీ ఈ లోపే ఆయన చనిపోయినట్లు.. ఆ స్థానంలో బుహారిని పోలిన మరో వ్యక్తి పరిపాలన సాగిస్తున్నట్టు సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేసాయి. పొరుగున ఉన్న సూడాన్ నుంచి అచ్చం బుహారి లాంటి వ్యక్తినే తెచ్చి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారనే గాసిప్స్ తారస్థాయికి చేరాయి. అంతటితో ఆగక ఆ వ్యక్తి పేరు జబ్రిల్ అని చెప్పుకోవడం మరింత ఆశ్చర్యకరమైన అంశం. స్వదేశానికి వచ్చిన బుహారికి ఈ వదంతుల గురించి తెలిసింది కానీ పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలో వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు పోలండ్ వెళ్లిన బుహారీ ప్రవాస నైజీరియన్లను ఉద్దేశించి ప్రసంగించేందుకు ఓ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడికి వచ్చిన అతిథులందరూ ఇతర విషయాలను వదిలేసి ఈ వదంతుల గురించి ప్రస్తావించడంతో ఆయన ‘నేనే బాబూ.. బతికే ఉన్నాను.. డమ్మీని కాను’ అని చెప్పుకోవాల్సి వచ్చింది. అంతేకాక తన గురించి ఇలాంటి వదంతులు ప్రచారం చేసిన వారు అజ్ఞానులు, మతం పట్ల గౌరవం లేనివాళ్లంటూ ఆయన మండిపడ్డారు. వచ్చే ఏడాది అధ్యక్ష పదవికి తిరిగి పోటీచేయాలని భావిస్తున్నారు బుహారీ. దాంతో ప్రత్యర్ధులు ఆయనకు వ్యతిరేకంగా ఇలాంటి వదంతులు వ్యాపింపచేశారు. బుహారి లండన్‌లో ఎక్కువ రోజులు గడపడం కూడా వారికి ఉపయోగపడింది. అయితే బుహారి ఇప్పటి వరకూ ఆయనకు ఉన్న వ్యాధి ఏమిటో వెల్లడించ లేదు. -
అందుకే ఆమెతో బ్రేకప్ చేసుకున్నా!
ప్రేమలు పుట్టడం. బ్రేకప్ అవడం కొత్తేం కాదు. సెలబ్రెటీల్లో అయితే ఇది సాధారణం. ప్రేమలు పుడుతూనే ఉంటాయి. బ్రేకప్ అవుతూనే ఉంటాయి. ఎంతో మంది జంటలు ప్రేమించుకున్నారు. మళ్లీ బ్రేకప్ చేసుకున్నారు. ఆ జాబితా కూడా చాలా పెద్దదే. అయితే బాలీవుడ్లో మాత్రం ఈ పోకడలు మరీ ఎక్కువ. ప్రస్తుతం బాలీవుడ్లో ఓ ప్రేమకథ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇండియాలో స్టార్ హీరోయిన్గా ఎదిగి.. హాలీవుడ్‌కు ఎగిరిపోయి.. అక్కడ కూడా తన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు ప్రియాంకచోప్రా. ప్రస్తుతం హాలీవుడ్ సింగర్ కమ్ నటుడు నిక్ జోనస్‌తో ప్రేమలో మునిగి తేలుతున్నారు ఆమె. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని విహారం చేస్తున్నారు. వీరిద్దరి పెళ్లి కూడా త్వరలో జరుగబోతోందంటూ కథనాలు వినిపిస్తున్నాయి. ప్రియాంకకు ఇది తొలిప్రేమ కాదు. గతంలో ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది. 2008లో వచ్చిన ‘లవ్‌స్టోరి 2050’ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన హర్మన్ బెవాజా, ప్రియాంక చోప్రాలు ప్రేమలో పడ్డారు. కొంతకాలంపాటు డేటింగ్ కూడా చేశారు. రెండేళ్లు తిరక్కుండానే బ్రేకప్ చెప్పేసుకున్నారు. అప్పట్లో ఈ బ్రేకప్‌పై రకరకాల పుకార్లు వినిపించాయి. హర్మన్ కెరీర్ సరిగా లేదనే కారణం.. వరుసగా ప్లాఫ్ల్లో ఉండడంతోనే ఇద్దరికీ బ్రేకప్ అయిందని రూమర్స్ వినిపించాయి. అయితే వీటిపై హర్మన్ తాజాగా స్పందించాడు. తన సినిమాలు రెండు, మూడు వరుసగా ప్లాఫ్ కావడంతో.. ఆ తరువాత కెరీర్‌పైనే పూర్తిగా తాను దృష్టి పెట్టానని, దాంతో ఆ సమయంలో ప్రియాంకకు సరిగా టైమ్ కేటాయించలేదని, అందువల్లే ఇద్దరి మధ్య దూరం పెరిగి.. బ్రేకప్ అయిందని వివరించాడు. అయినా.. విజయాలు అపజయాలు అనేవి సంబంధాలను చెడగొడతాయని తాను అనుకోవడం లేదంటూ గతంలో జరిగిన బ్రేకప్‌పై క్లారిటీ ఇచ్చాడు. -
చేపలు కొంటున్నారా.. ఇది చదవండి!
నాన్‌వెజ్ ప్రియులకు ఇప్పుడు ఫార్మలిన్ భయం పట్టుకుంది. చేపలను ఎక్కువ కాలం తాజాగా ఉంచేందుకు హానికారక ఫార్మలిన్‌ను వాడుతున్నారనే వార్త దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దీంతో చేపలంటేనే వినియోగదారులు భయపడిపోతున్నారు. దేశ వ్యాప్తంగా భయాందోళనలు ఏపీ, కేరళ నుంచి వస్తున్న చేపలు త్వరగా పాడైపోకుండా వాటిని తాజాగా ఉంచేందుకు ఫార్మలిన్ పూస్తున్నారనే అంశం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. గోవా అసెంబ్లీని సైతం ఈ అంశం కుదిపేసింది. దీంతో కేరళ, ఏపీ సహా ఇతర రాష్ట్రాల నుంచి చేపల దిగుమతిని 15 రోజుల పాటు నిలిపివేస్తు గోవా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేరళలోనూ పలు ఆంక్షలు విధించారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న చేపలను చెక్‌పోస్టుల వద్ద తనిఖీ చేస్తున్నారు. తాజాగా ఫార్మలిన్ అవశేషాలు ఉన్నాయంటూ ఏపీ నుంచి వెళ్లిన ఆరు వేల కేజీల చేపలను డంప్‌యార్డుకు పంపేశారు. ఫార్మలిన్ భయంతో తాజా(బతికివున్న) చేపలనే కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఏమిటీ ఫార్మలిన్ మనుషుల మృతదేహాలను దీర్ఘకాలం పదిల పరిచేందుకు వినియోగించే రసాయనం ఫార్మాలిన్. ఈ రసాయనం ప్రయోగించడంతో మృతదేహాలు త్వరగా కుళ్లిపోకుండా ఉంటాయి. ఇలా చేయడంతో వారాల తరబడి చేపలు తాజాగా ఉంటాయి. ఫార్మాలిన్ ప్రయోగించిన చేపలు సాధారణ చేపల కంటే గట్టిగా ఉంటాయి. దీనిపై పొలుసు సాధారణ చేపల కంటే రాటుదేలి ఉంటుంది. ఫార్మాలిన్ రసాయనం ప్రయోగంతో చేపమొప్పలు ఎర్రగా నిగనిగలాడతాయి. ఈ చేపల్ని వండే సమయంలో భిన్నమైన వాసన వస్తుంది. ఫార్మలిన్ మానవ శరీరంలో చొరబడితే కేన్సర్ సంభవించే ఆస్కారం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.. కడుపులో నొప్పి, వాంతులు అయి ఒక్కోసారి కోమాలోకి వెళ్లే అవకాశం ఉందంటున్నారు. కిట్‌తో పరీక్ష ఇలా.. చేపలు తాజావా కావా? వాటిలో ఏమైనా విషపూరిత రసాయనాలు ఉన్నాయా? అనేవి చాలా సులభంగా తెలుసుకోవచ్చంటోంది... సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ(సీఐఎఫ్టీ) డిపార్ట్మెంట్. వినియోగదారులు సులభంగా పరీక్షించి చేపల తాజాదనాన్ని, అందులో ఫార్మలిన్ అవశేషాలు ఉన్నాయా లేదా అని తెలుసుకునేందుకు వీలుగా ఐసీఏఆర్సీఐఎఫ్టీ ఈ కిట్‌ను రూపొందించాయి. ఇందులో 25 స్ట్రిప్‌లు ఉంటాయి. కెమికల్ పూసిన ఈస్ట్రిప్లను చేపలపై మూడు నాలుగు సార్లు రుద్దాలి. ఈ స్ట్రిప్‌పై ఉన్న పేపర్‌పై డ్రాపర్ సహాయంతో కిట్‌లో ఉన్న సొల్యూషన్‌ను వేయాలి. లేత పసుపు రంగు కలర్లోకి పేపర్ మారుతోంది. తక్కువ మోతాదులో ఫార్మలిన్ ఉంటే లేత ఆకుపచ్చ రంగులోకి మారుతోంది. ఎక్కువ మోతాదులో ఉంటే ముదురు నీలం రంగులో కనిపిస్తుంది. రెండు నిమిషాల వ్యవధిలోనే ఈ రంగులను గుర్తించవచ్చు. ప్రతీ కిట్‌లోనూ ఓ కలర్ కార్డు ఉంటుంది. ఒక్కో టెస్టుకు సుమారు రెండు రూపాయలు ఖర్చవుతుంది. ఇప్పటికే ఈ కిట్లను కేరళలోని ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నామని, జులై 29 నుంచి వీటిని అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇలా చేయాలి.. చేపలను నీటితో పరిశుభ్రంగా కడగాలి. కుళాయి కింద చేపలు ఉంచి నీటిని వదిలి శుభ్రం చేయాలి... నీటితో కడిగినా చెడువాసన వస్తుంటే అవి తాజా చేపలు కాదని గుర్తించి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి. అలాగే 75 డిగ్రీల సెంటీ గ్రేడ్ వద్ద కూరను ఉడికించాలి. ఇలా చేయడం ద్వారా కొంత వరకు విషపూరిత రసాయనాలను కొంత వరకు తగ్గించవచ్చు. -
అమ్మా పెళ్లెప్పుడు? అని అడిగాడు!
‘‘నేను మళ్లీ వార్తల్లోకొచ్చాను. నిన్ననే నా పెళ్లి ఫిక్స్ చేసేసింది సోషల్ మీడియా. చాలా రోజుల తర్వాత నా ఫోను మెసేజ్‌లతో నిండిపోయింది. చాలా సంతోషకరమైన విషయమే కానీ అది నిజం కాదు. అటువంటిది ఏమన్నా ఉంటే నేనే మీకు ముందుగా తెలియచేస్తాను’’ అంటున్నారు తెలుగులో పాపులర్ సింగర్‌గా పేరు తెచ్చుకున్న సునీత. ఇంతకీ విషయం ఏంటి? ఏమీ లేదండీ. నిన్న అంతా సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్‌గా మారింది. అదేంటంటే కొన్ని వెబ్ సైట్లలో ఈ మధ్య పవన్‌కళ్యాణ్ మాజీ భార్య రేణూదేశాయ్ మరో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతోంది కదా.. అలాగే సింగర్ సునీత కూడా రెండో పెళ్లి చేసుకుంటుంది అనే వార్త పాప్ అప్ అయింది. అవునా.. ఆ వరుడు ఎవరో కనుక్కుందామని సునీతకు ఫోన్ చేస్తే ఓ నవ్వు నవ్వారామె. ‘‘సోషల్ మీడియా తలుచుకుంటే ఏమైనా చేస్తారు. ఏ పేరని చెప్పను? ఏమని చెప్పను? ప్రస్తుతానికి అటువంటిది ఏమీ లేదు. నా వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే. నేను ఈ మధ్యే చాలా కాలం ఫైట్ చేసి డివోర్స్ తీసుకున్నాను. అంతలోనే ఈ న్యూస్. అందరూ ఫోన్ చేసి కంగ్రాట్స్ అంటుంటే మొదట నాకేమి అర్థం కాలేదు. నాకు కంగ్రాట్స్ చెప్పిన వాళ్లనే విషయమేంటని అడిగితే ‘మీ పెళ్లంట కదా’ అన్నారు. నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. కానీ ఓ విషయం మాత్రం స్పష్టంగా అర్థం అయ్యింది. అదేంటంటే చాలామంది నేను మళ్లీ పెళ్లి చేసుకుని జీవితంలో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు. అది నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు సునీత. ‘అన్నింటికంటే ఆనందమైన విషయమేంటంటే మా అమ్మ, నాన్న మాట్లాడుతూ.. ప్రపంచమంతా నీ గురించి ఇంతగా ఆలోచిస్తూ నీ మంచి కోరుతున్నారు నిజంగా మళ్లీ పెళ్లి చేసుకుని హ్యాప్పీ=గా ఉండొచ్చు కదా సునీత’ అన్నారు. కొసమెరుపు ఏంటంటే మా అబ్బాయి ఆకాశ్ డిల్లీలో బి.టెక్ చదువుతున్నాడు. వాడు నిన్న నాకు ఫోన్ చేసి ‘అమ్మాల పెళ్లి డేటెప్పుడు? అని అడిగాడు. ‘నిజంగానే చేసుకో మమ్మీ’ అని వాడు మనస్పూర్తిగా కోరుకున్నాడు. అందరూ నా గురించి ఇంత పాజిటివ్‌గా అలోచిస్తుంటే ఇంతకంటే ఏమి కావాలి జీవితానికి అనిపిస్తుంది’’ అన్నారు సునీత. ఇంత ఆహ్లాదంగా అన్ని విషయాలు చెప్తూనే చిన్న చురక కూడా అంటించారామె. ‘‘ఎవరికైనా పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఆ స్పేస్‌ను ఎవరైనా సరే వాళ్ల ఇష్టానికి వదిలేయ్యాలి’’ అని కూడా అన్నారు. ‘‘అటువంటిదేమన్నా ఉంటే ముందుగా నేనే మీడియాకు తెలియ చేస్తాను’’ అని చెప్పారు. ఏదేమైనా పెళ్లి వార్త నిజమా కాదా అనేది మాత్రం ఎక్కడ కమిట్ కాలేదు ఈ బ్యూటిఫుల్ సింగర్. - శివ మల్లాల -
ఆ రూమర్స్‌లో నిజం లేదు!
ఈ మధ్య ఏ వార్త నిజమో ఏ వార్త అబద్దమో తెలియడం చాలా కష్టం. వార్తలు క్షణాల్లో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. తారలకు ఆ వార్తలో నిజం లేదంటూ బయటకు వచ్చి చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఆ మధ్య శ్రీనివాస్ రెడ్డి, ఎన్టీఆర్‌కు చెడిందని, షూటింగ్ సమయాల్లో ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే వాటిలో నిజం లేదంటూ.. ఎన్టీఆర్‌కు తనకు మధ్య ఉన్న బంధాన్ని తెలిసేలా ఓ పిక్‌ను ట్విటర్లో పోస్ట్ చేశారు శ్రీనివాస్ రెడ్డి. ఓ ఇంటర్వ్యూలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాడు. ఇలాంటి సంఘటనే నిన్న వైరల్‌గా మారింది. ‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమా షూటింగ్లో ప్రకాష్ రాజ్, అనుపమా పరమేశ్వరన్ల మధ్య గొడవలు జరిగాయని, అనుపమా కంటతడి పెట్టుకున్నారని వార్తలు బయటకు వచ్చాయి. అయితే వాటిలో నిజం లేదన్నట్టుగా అనుపమ, ప్రకాష్‌రాజ్‌తో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. త్రినాథ్‌రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఎనర్జీటిక్ స్టార్ రామ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటిస్తున్నారు. Those jokes .... 🤣🤣🤣@prakashraaj Sir .... 😇 pic.twitter.com/Ym9cbpaifM — Anupama Parameswaran (@anupamahere) July 8, 2018 -
పెళ్లికి సిద్ధమైన స్వీటీ?
-
‘తేజ్’ వాయిదా పడిందా!
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సరైన హిట్ లేక సతమతమవుతున్నారు. సాయిధరమ్ ‘సుప్రీం’ సినిమా తరువాత వచ్చిన చిత్రాలన్నీ నిరాశ పరిచాయి. ఈ నేపథ్యంలో ప్రేమ కథలను అందంగా తెరకెక్కించే డైరెక్టర్ కరుణాకరన్‌తో ‘తేజ్ ఐ లవ్ యూ’ అనే సినిమాను చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ను ఘనంగా నిర్వహించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. మొదటగా జూన్ 29న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్. ముందు అనుకున్న తేదీ కాకుండా జూలై 6న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సాయి ధరమ్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుండగా, ఈ మూవీకి గోపి సుందర్ సంగీతాన్ని అందించారు. -
విడాకులపై మంచు మనోజ్ స్పందన
‘టాలీవుడ్ దర్శకుడు క్రిష్ అలియాస్ జాగర్లముడి రాధాకృష్ణ తన వివాహ బంధానికి గుడ్‌బై చెప్పాడు.. ఆయనతో పాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా విడాకులు తీసుకోబోతున్నారు.. వారిలో మంచు వారి అబ్బాయి కూడా ఉన్నారు.. మంచు మనోజ్ కూడా విడాకులుకు అప్లై చేశారు’... ఇది గత వారం రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. భార్య ప్రణతితో విభేదాలు వచ్చాయని, ఆమెతో విడాకులు తీసుకునేందుకు మనోజ్ సిద్ధంగా ఉన్నాడని పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే ఈ ప్రచారంపై మంచు మనోజ్ నోరువిప్పాడు. విడాకులు తీసుకున్నట్టు వస్తున్న వార్తలు నిజాలు కావని స్పష్టం చేశాడు. ఇదే విషయంపై ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు మనోజ్ స్పందిస్తూ.. ‘వాళ్ల బొంద. రూమర్స్ పుట్టించేవాళ్లకు ఏం తెలుసు మా గురించి’ అని ఖండించారు. అంతే కాకుండా ‘ 2010 నుండి ప్రణతి నా జీవితంలో అడుగు పెట్టింది.. నా గుండె ఆగిపోయేంతవరకు తనే నా దేవత అంటూ’ బదులిచ్చాడు. మరి ఇప్పటికైనా మనోజ్, ప్రణతిల విడాకుల రూమర్స్‌కి ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి. -
నాని హీరోయిన్... మరో యువ హీరోతో
నాని జెంటిల్మెన్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన కేరళ బ్యూటీ నివేదా థామస్. మొదటి సినిమాతోనే హిట్ కొట్టి, నటిగానూ నిరూపించుకున్నారు నివేదా. ఆ తరువాత నిన్నుకోరి, జై లవకుశ సినిమాలతో హ్యాట్రిక్ కొట్టారు. తరువాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన నివేదా తిరిగి వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. పాత్ర నచ్చితేనే చేస్తానంటున్న ఈ హీరోయిన్ తాజాగా ఓ చిన్న హీరోతో సినిమా చేసేందుకు రెడీ అవుతోందని సమాచారం. మెంటల్ మదిలో, నీదీ నాదీ ఒకే కథ సినిమాలతో సక్సెస్‌ను, విమర్శకుల ప్రశంసలు అందకున్న శ్రీవిష్ణు ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. శ్రీవిష్ణు, నివేదా కాంబినేషన్ సినిమాను వివేక్ ఆత్రేయ (మెంటల్‌మదిలో ఫేం) మరో డిఫరెంట్ జానర్లో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. -
రజనీ సినిమాలో మేఘా ఆకాష్?
లై, ఛల్‌మోహన్ రంగా సినిమాలు ఆశించినంతగా ఆడకపోయినా హీరోయిన్ మేఘా ఆకాష్‌కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. మేఘా తన అందం,నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా.. ఈ భామ తరువాతి సినిమాకు సంబంధించిన ఓ వార్త హల్చల్ చేస్తోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్, కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో మేఘా ఆకాష్ నటించబోతోందన్న ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం కానీ, మేఘా ఆకాష్ కానీ ఇప్పటికీ వరకు స్పందించలేదు. సన్ నెట్వర్క్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి, బాబి సింహా కీలకపాత్రల్లో నటించనున్నారు. మేఘా ఆకాష్ ప్రస్తుతం ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. -
కారేపల్లిలో పట్టుబడిన బెంగాలీ దొంగ
కారేపల్లి: ఓ వైపు బిహార్ దొంగలు ఇంట్లోకి చొర బడి పిల్లలను ఎత్తుకెళ్లిపోతున్నారు, అడ్డు వచ్చిన వారిని హతమార్చుతున్నారు..అంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో అపోహలు పెరిగిపోయి.. రాత్రి వేళల్లో కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పుకార్లుతో ప్రజలు బెంబేలెత్తి పోతుంటే...! తాజాగా కారేపల్లిలో ఓ బెంగాలీ యువకుడు ఆది వారం తెల్లవారు జామున ఆటోను దొంగిలిస్తూ పట్టు పడిన ఘటనతో కారేపల్లిలో మరొక్కసారి అలజడి ప్రారంభమైంది. ఈ మధ్య కాలంలో కారేపల్లిలో నాటు వైద్యం పేరుతో ఇద్దరు మహిళలు పట్టపగలే ఇంటి తలుపులు కొడుతూ.. మీకు ఆ రోగం తగ్గిస్తాం, ఈ రోగం తగ్గిస్తాం అంటూ అనుమానాస్పదంగా తిరిగి, చివరికి గ్రామస్తుల చేతికి చిక్కి పోలీసులకు అప్పగించిన ఘటన మరువక ముందే..ఆదివారం తెల్లవారు జామున జరిగిన ఈ బెంగాల్ దొంగ ఘటన ప్రజల్లో మరోక్క సారి భయాందోళనను రేకెత్తించింది. పశ్చిమ బెంగాల్‌లోని హూగ్లీ జిల్లా చెందిన మోహన్ బిస్వాల్ అనే యువకుడు గత నెల 30వ తేదీన పశ్చిమ బెంగాల్ నుంచి తమ బ్యాచ్ (ముఠా)తో కలిసి హైదరాబాద్‌లోని షేరులింగం పల్లి వద్ద కాంట్రాక్టర్ ఇమ్రాన్ అహ్మద్ వద్ద కన్స్ట్రక్షన్ పనుల్లో భాగంగా హెల్పర్‌గా పని చేసేందుకు వచ్చాడు. దీనికి సంబంధించి డిసెంబర్ 31వ తేదీ వరకు వ్యాలిడిటీతో అతని వద్ద సరోవర్ జెనిత్ కంపెనీలో పని చేసేందుకు కార్డు సైతం ఉంది. ఇదిలా ఉండగా..తన ముఠాతో పశ్చిమ బెంగాల్ నుంచి హైదరాబాద్ వచ్చిన మోహన్ బిస్వాల్..తప్పిపోయి హైదరాబాద్‌లోని కాకతీయ ప్యాసింజర్ ట్రైన్ ఎక్కాడు. తన ముఠా కన్పింక క పోవటంతో..తనకు వచ్చిన బెంగాళీ బాషలో అడ్రస్ చెప్పాలంటూ ట్రైన్లో సైతం ప్యాసింజర్లను విసిగించటం, శనివారం అర్థ రాత్రి వరకు ఆ బోగీలో ఉన్న వారిని సైతం లేపి ఇబ్బందులకు గురి చేయటంతో అతన్ని..కారేపల్లి రైల్వే స్టేషన్ వద్దకు రాగానే ఆదివారం తెల్లవారుజాము 3 గం టల సమయంలో బలవంతంగా దింపివేశారు. దీంతో అయోమయానికి గురైన మోహన్ బిస్వాల్ ఏమి చేయాలో తోచక..కారేపల్లిలో ఒంటరిగా కలియతిరుగుతూ..భారత్‌నగర్‌కు చేరు కున్నాడు. ఈ క్రమంలో ఏమిచేయాలో తోచని మోహన్ బిస్వాల్ రోడ్డు ప్రక్కనే ఉన్న ఆటోను నెట్టుకుంటూ..రోడ్డు పైకి తెచ్చాడు. ఆటోలో ఎటేపైన వెళ్దామనుకున్నాడో..ఏమో తెలియని బిస్వాల్ ఆటో ఎంతకు కదలక పోవటంతో..అదే ఇంటిలోని కుంటుంబ సభ్యులను నిద్ర లేపి..తనకు వచ్చిన బెంగాలి బాషతో వారిని బెంబేలెత్తించాడు. దీంతో దొంగ దొంగ అని అరవటంతో..చుట్టు ప్రక్కల వాళ్లు అక్కడికి చేరుకొని..ఇతడు దొంగేనని తలంచి దేహశుద్ది చేశారు. అనంతరం తాళ్లతో కట్టివేసి కారేపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. -
‘బిగ్‌బాస్ 2’లో నందమూరి హీరో?
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్ బాస్ రియాల్టీ షో ఎంతగా పాపులర్ అయిందో తెలిసిందే. ఈ షోకు ఎంత క్రేజ్ వచ్చిందో పాల్గొన్న పార్టిసిపెంట్స్‌కు కూడా అంతే క్రేజ్ వచ్చింది. ఇలాంటి రియాల్టీ షోలు కేవలం బాలీవుడ్ వాళ్లే కాదు మనోళ్లు కూడా రక్తికట్టించగలరని నిరూపించుకున్నారు. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ రెండో సీజన్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రెండో సీజన్‌కు నాచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. అయితే ఈ సారి ఇంకొంచెం మసాలా ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఈ రెండో సీజన్లో పాల్గొనే వ్యక్తులు వీరే నంటూ సోషల్ మీడియాలో కొన్ని పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. అవి నిజం కాదంటూ ఆ షోలో మేము పాల్గొనడం లేదంటూ కొందరు ఇప్పటికే ప్రకటించారు. అయితే తాజాగా నందమూరి హీరో తారకరత్న ఈ షోలో పాల్గొనబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక సమాచారం మాత్రం రాలేదు. ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే బిగ్ బాస్ బృందం కానీ, తారకరత్న కానీ స్పందించేవరకు వేచి చూడాలి. -
సోషల్ మీడియాలో వదంతులు సృష్టిస్తే ఊరుకోం
-
వదంతులపై నజర్
సంగారెడ్డి క్రైం : రాష్ట్రవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాపిస్తున్న వదంతులు పోలీసులను హడలెత్తిస్తున్నాయి. దొంగల సంచారం పెరిగిదని, పొరుగు రాష్ట్రాల హంతక ముఠాలు సంచరిస్తున్నాయని జరుగుతున్న ప్రచారం ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వదంతుల్లో నిజమెంతో, అబద్ధమెంతో తెలియని అయోమయంలో ప్రజలు పడిపోతున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులపై అక్కడక్కడా దాడులు జరుగుతున్నాయి. పుకార్లతో ఆందోళన.. ఇతర రాష్ట్రాల నుంచి పార్థి గ్యాంగ్, బిహార్, చైన్నై నుంచి పిల్లలను ఎత్తుకుపోయే ముఠాలుగా వచ్చాయని వినిపిస్తున్న పుకార్లతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆ గ్యాంగ్‌ల వద్ద కత్తులు, బ్లేడ్లు ఉన్నాయని, వాటితో దొరికిన వారిపై దాడి చేసి గొంతు కోసి, తల పగులగొట్టి మెదడు తింటున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న సందేశాలను చూసి ప్రజలు జంకుతున్నారు. ఈ క్రమంలో పట్టణాలు, గ్రామాల్లో రాత్రయిందంటే చాలు ఇంట్లో నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. పార్థి గ్యాంగ్ ఆడవారి వేషధారణలో ఇళ్లలో చొరబడి నగలు, డబ్బు దోచుకొని ఇంట్లో వారిని బెదిరించి, చివరికి చంపి వెళ్లిపోతున్నారని వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో వచ్చే వదంతులతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడో జరిగిన ఫొటోలతో హల్చల్.. ఎన్నో ఏళ్ల కింద ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఘటనల ఫొటోలను సేకరించిన కొంత మంది ఆకతాయిలు ప్రజలను భయాందోళకు గురి చేయాలని, వాట్సాప్, ఫేస్బుక్లో వాటిని పోస్టు చేసి తోచిన కథనాలు రాసి ప్రచారం చేశారు. అవి రాష్ట్రవ్యాప్తంగా సర్క్యులేట్ అయి మొత్తం పరిస్థితిని అతలాకుతలం చేస్తున్నాయి. వీటిపై రాష్ట్ర, జిల్లా పోలీస్ యంత్రాంగం చాలా సీరియస్‌గా తీసుకున్నాయి. ప్రజలను భయపెట్టి ఆందోళనకు గురి చేసే సందేశాలకు సోషల్ మీడియంలో ప్రచారం కల్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అక్కడక్కడ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నవారిని గుర్తిస్తూ కటకటాల పాలు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. మాల్‌చెర్వు తండా, శివ్వంపేట మండలంలో కలకలం.. అక్కన్నపేట మండలంలోని మాల్‌చెర్వు తండాలో ఇటీవల కలకలం రేగింది. కత్తులు, బ్లేడ్లతో సంచరిస్తున్న ఓ వ్యక్తిని తండావాసులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు పిల్లల చుట్టూ అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించగా ప్రజలు అరవడంతో కొంత మంది పారిపోయారని, అందులో ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారని ప్రచారం జరిగింది. ఇక శివ్వంపేట మండలంలో చిన్నగొట్టిముక్కుల గ్రామ సమీపంలో మతిస్థిమితం లేని వ్యక్తిని కిడ్నాపర్‌గా భావించి పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అక్కన్నపేటలో పోలీసుల అదుపులో ఉన్న మతిస్థిమితం లేని వ్యక్తిని పోలీసులు అనాథాశ్రమంలో ఉంచారు. వదంతులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రాంతంలో సీపీ జోయల్ డేవిస్ ఆధ్వర్యంలో పుకార్లు నమ్మవద్దని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మేమున్నామని భరోసా కల్పించారు. ఈ వదంతులన్నీ ఆకతాయిల పని అని, ఎవరిపైనైనా అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో ఇటీవల జిల్లా వ్యాప్తంగా పోలీస్ యంత్రాంగం వందతులపై ప్రజలకు అవగాహన కల్పించారు. మెదక్ జిల్లాలో ఎస్పీ చందన దీప్తి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మూడు జిల్లాల పరిధిలో వదంతులపై ప్రజల్లో ధైర్యం నింపేందుకు పోలీస్ యంత్రాంగం కళాబృందాలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వదంతులు నమ్మొద్దు ప్రజలను కొంత మంది ఆకతాయిలు భయాభ్రాంతులకు గురి చేస్తున్నారు. వాట్సాప్, ఫేస్ బుక్కుల్లో నిరాధార సందేశాలు పెట్టే వారి భరతం పడతాం. ఐటీ చట్టం ప్రకారం వదంతులు వ్యాప్తి చేసే వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపిస్తాం. వాట్సాప్‌లు, ఫేస్ బుక్కుల నుంచి ఎవరు ఎవరికి సందేశం పంపుతున్నారనే విషయాన్ని మేం సులువుగా గుర్తిస్తాం. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలి. లేకపోతే 100 నంబర్‌కు సమాచారం ఇవ్వాలి. జిల్లా వ్యాప్తంగా ఈ విషయంపై పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. – చందనాదీప్తి, మెదక్ జిల్లా ఎస్పీ. -
అసత్య ప్రచారాలు చేస్తే కేసులు
కరీంనగర్ క్రైం : వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి హెచ్చరించారు. సోషల్ మీడియా అసత్య ప్రచారాలను పోస్టు చేసేవారిని గుర్తించేందుకు కరీంనగర్ సోషల్ మీడియా ల్యాబ్‌ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వివిధ రకాల గ్రూపుల నుంచి పోస్టు చేసిన వ్యక్తులతోపాటు గ్రూప్ అడ్మిన్లపై క్రిమినల్ కేసులు తప్పవని, ప్రజలను భయబ్రాంతులను గురి చేసే పోస్టులు పంపినవారి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు కొందరిని గుర్తించామని, మరి కొందరిని గుర్తించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. చిన్న పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారని, వివిధ రాష్ట్రాల దొంగ ముఠా సభ్యులు గొంతు కోస్తున్నారని, మెదడు తింటున్నారని వస్తున్న పుకార్లలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. దొంగలొస్తున్నారని ప్రజలు రాత్రి కర్రలు పట్టుకొని ఆపరిచితులను చితకబాదుతున్నారని అన్నారు. వారిపై క్రిమనిల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఇటుకబట్టీలు, గ్రానైట్ క్వారీలు, కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో ఇతర రాష్ట్రాలవారు ఎక్కువగా పని చేస్తున్నారని, వారికి స్థానిక భాష రాకపోవడంతో అనుమానిస్తున్నారన్నారు. అలాంటి వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులు, డయల్ 100కు సమాచారం అందించాలని, కేవలం 10 నిమిషాల్లో సంఘటన స్థలానికి చేరుకుంటారని వివరించారు. నాన్ బెయిలెబుల్ వారెంట్లకు ప్రత్యేక బృందాలు కరీంనగర్ కమిషనరేట్ పెండింగ్‌లో ఉన్న నాన్ బెయిల్‌బుల్ వారెంట్ల అమలు వేగవంతం చేసేందుకు 30 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని సీపీ తెలిపారు. ఈనెల 31 వరకు ఈ బృందాలు పని చేస్తాయని, మరో 4బృందాలను కూడా త్వరలో ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు. మొదట కరీంనగర్ కమిషనరేట్ తర్వాత పక్కా జిల్లాలు, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నాన్ బెయిల్‌బుల్ వారెంట్లు పూర్తి చేసిన తర్వాత ఇతర జిల్లాలకు బృందాలను పంపిస్తామని తెలిపారు. గడిచిన మూడు రోజుల్లో 55 వారెంట్లు అమలు చేశామని, కమిషనరేట్‌వ్యాప్తంగా 800కి పైగా నాన్ బెయిల్‌బుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అమలు చేసే ప్రతి వారెంట్‌కు రూ.750 రివార్డు, ఎక్కువ వారెంట్లు అమలు చేసినవారికి ప్రశంసాపత్రాలు అందిస్తామని తెలిపారు. -
మహేశ్, సుకుమార్ సినిమా కథ ఇదేనట!
రంగస్థలం సినిమాతో సుకుమార్ సత్తా ఏంటో తెలిసింది జనాలకు. మాస్ సినిమాలు తీయలేడంటూ.. మాస్ ప్రేక్షకులను మెప్పించే సినిమాలను సుకుమార్ తీయలేడు అనే వారికి రంగస్థలంతో తన స్టామినా ఏంటో చూపించాడు. ఈ సినిమా మాస్, క్లాస్ తేడా లేకుండా అన్ని సెంటర్స్‌లో రికార్డు కలెక్షన్స్ సాధించాయి. సుకుమార్ తదుపరి చిత్రం మహేశ్ బాబుతో ఉంటుందని ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. భరత్ అనే నేను సినిమాతో మంచి విజయం సాధించిన ఈ సూపర్‌స్టార్ ప్రస్తుతం ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో మహేశ్ బాబు తన తరువాతి చిత్రం చేయబోతున్నారు. దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో సినిమాను చేయనున్నాడు. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ఉండబోతోందట అంతేకాకుండా ఈ సినిమాలో మహేశ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా కనిపించబోతోన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సుకుమార్ తన స్క్రిప్టును తయారు చేసుకుంటున్నట్లు సమాచారం. -
దొంగల భయంతో మేడపై నుంచి దూకిన యువకులు
టెక్కలి రూరల్: దొంగలు వస్తున్నారంటూ స్థానికులు కేకలు వేయడంతో మేడపై నిద్రిస్తున్న ఇద్దరు యువకులు భయంతో దూకేసి గాయాలపాలయ్యారు. ఈ సంఘటన మేజర్ పంచాయతీ పరిధిలోని ఆదిఆంధ్రవీధిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కిర్రి అరుణ్‌కుమార్, దేవాది శ్యామలరావు.. తన స్నేహితులతో కలసి సమీపంలోని ఒక మెట్లు లేని మేడపై పడుకున్నారు. ఆదివారం వేకువజామున స్నేహితుల్లో ఒకరు నిచ్చెనపై నుంచి మేడ ఎక్కడాన్ని స్థానికులు గమనించి.. దొంగలు మేడెక్కుతున్నారంటూ బిగ్గరగా అరవడం ప్రారంభించారు. దీంతో ఉలిక్కిపడి లేచిన అరుణ్‌కుమార్, శ్యామలరావు.. మేడపై నుంచి కిందకు గెంతేశారు. దీంతో వీరిద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. వీరిని టెక్కలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అరుణ్‌కుమార్ కోమాలోకి వెళ్లిపోయారు. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులు వివరాలు సేకరించారు. -
చంద్రయాన్‌గుట్టలో హిజ్రాలపై రాళ్ల దాడి;ఒకరు మృతి
-
సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మొద్దు
-
పార్థీ గ్యాంగ్ ముసుగులో పాతకక్షలు
‘అదిగో పులి... అంటే ఇదిగో తోక’ అన్నట్టు పుకార్ల సంస్కృతి విస్తరిస్తోంది. జిల్లాలో రోజూ ఏదో ఒకచోట పిల్లల్ని ఎత్తుకెళ్లిన ముఠా సంచరిస్తోందంటూ అబద్ధపు ప్రచారం సాగుతోంది. భాష తెలియని అపరిచితులు జనం ఆగ్రహానికి బలైపోతున్నారు. అమాయకులు... మతిస్థిమితం కోల్పోయేవారు ప్రాణాలు కోల్పోతున్నారు. జిల్లాలో ఎలాంటి గ్యాంగ్ లేదంటూ పోలీసులు ప్రచారం చేస్తున్నా... దాడులు ఆగడంలేదు. ఈ పరిస్థితులు ఎటు దారితీస్తున్నాయన్నది అంతుచిక్కడంలేదు. సాక్షిప్రతినిధి, విజయనగరం : భోగాపురం మండలం, మహారాజుపేట వద్ద గత శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు విడిచాడు. జిల్లాలో పిల్లల్ని ఎత్తుకుపోయే గ్యాంగులు తిరుగుతున్నాయని భయపడి పిల్లాడ్ని అమ్మమ్మ వాళ్లింట్లో జాగ్రత్తగా దాచిపెట్టడానికి తండ్రి తీసుకువెళుతుండగా ఈ ఘోరం జరిగింది. పూసపాటిరేగ మండలం, చింతపల్లి గ్రామంలో బిక్షాటనకు వచ్చిన ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో దొంగతనానికి వచ్చాడని భావించిన గ్రామస్తులు కొందరు అతనిని పట్టుకుని తీవ్రంగా కొట్టారు. ఆ దెబ్బలకు అతను చనిపోయాడు. నెల్లిమర్ల జూట్ఫ్యాక్టరీలో పనిచేస్తున్న పరాయి రాష్ట్రానికి చెందినవారిని అనుమానంతో స్థానికులు పట్టుకున్నారు. విషయం తెలుసుకుని వారిని పోలీసులు స్టేషన్‌కు తరలించి విచారించగా వారు పరిశ్రమలో ఉద్యోగులని తేలింది.ఇలాంటి సంఘటనలు గడచిన ఐదు రోజులుగా ఏదో ఒక ప్రాంతంలో సంభవిస్తూనే ఉన్నాయి. ఈ దాడులకు కారణం జిల్లా ప్రజల్లో నెలకొన్న అనవసర భయాలే. జిల్లాలో పార్థీ గ్యాంగులు, చెడ్డీ గ్యాంగులుతిరుగుతున్నాయని, బీహార్ దొంగల ముఠావ చ్చిందని, చిన్న పిల్లల్ని ఎత్తుకుపోయి చంపి అవయవాలు అమ్ముకుంటున్నారని, పెద్దవాళ్ల పీకలు కోసేస్తున్నారని, రకరకాల ప్రచారం విస్తరిస్తోంది. ఐదు రోజులుగా సాగుతున్న ఇలాంటి పరిణామాలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించడంతో పా టు అమాయకులను శిక్షించేలా చేస్తున్నాయి. తప్పుచేసిందెవరో తెలియకుండా కొత్తవారు కనిపి స్తే చాలు చావగొట్టే పరిస్థితులు నెలకొన్నాయి. కొంప ముంచిన సామాజిక మాధ్యమాలు ఈ అనర్థాలకు ప్రధాన కారణం కొందరు పనీపాటా లేని వ్యక్తులు వాట్సాప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా గ్రూపుల్లో ఎక్కడివో ఫొటోలు, వీడియోలు మన దగ్గరే జరిగినట్లు భ్రమింప జేస్తూ మెసేజ్‌లు పోస్ట్ చేయడమే. అవి నిజమైనవో కావో తెలుసుకోకుండానే మరికొందరు వాటిని షేర్ చేస్తుండటం వల్ల తక్కువ సమయంలోనే జిల్లా అంతటా ఈ ప్రచారం పాకేసింది. వెం టనే తేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు అలాం టి ప్రచారాలు నమ్మవద్దని ప్రకటనలు చేసినా వారి మాటలను పట్టించుకోకుండా ఇంకా అమాయకులపై దాడులు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ ప్రచారాన్ని కొందరు వ్యక్తులు తమ పాత కక్షలు తీర్చుకోవడానికి అవకాశంగా కూడా తీసుకుంటున్నారు. గరుగుబిల్లి మండలం కొత్తూరులో ఓ వ్యక్తి బహిర్భూమికి వెళితే గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడిచేసి అతనిని గాయపరిచారు. నెపం మాత్రం గ్యాంగులపై తోసేశారు. అమాయకులు బలి ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాలో ఉపాధి, వ్యాపారం, జీవనం కోసం ఎంతోమంది వస్తుంటారు. అలా వచ్చినవారే నెల్లిమర్ల జ్యూట్‌మిల్లు కార్మికులుగా కూడా పనిచేస్తున్నారు. మంగళవారం వారిని కూడా అనుమానించి స్థానికులు పోలీసులకు అప్పగించారు. వారు తమ కార్మికులేనని మిల్లు యజమాని చెప్పడంతో విడిచిపెట్టారు. గుమ్మలక్ష్మీపురం మండలం అల్లువాడలో దొంగలనే నెపంతో కొందరిని పోలీసుల వద్దకు తీసుకువచ్చారు. వారిని విచారిస్తే బొమ్మలు అమ్ముకునేవారని తేలింది. నాలుగు రోజుల క్రితం విజయనగరంలో ఇద్దరు మతిస్థిమితం లేని వారిని అనుమానించి పోలీసులే స్టేషన్‌కు తీసుకుపోయి విచారించారు. ఇలా జిల్లా వ్యాప్తంగా రోజూ రెండు మూడు సంఘటనలు జరుగుతున్నాయి. మరోవైపు జనం భయంతో వణికిపోతున్నారు. గ్రామాల్లో యువకులు రాత్రి సమయాల్లో కర్రలు, మారణాయుధాలతో గస్తీ తిరుగుతూ కాపలా కాస్తున్నారు. ఇంకోవైపు పోలీసులు వేరే పనులన్నీ మానుకుని జనానికి అవగాహన కల్పించే పనిలో పడ్డారు. ఆటోల్లో మైకులు పెట్టి గ్యాంగులేమీ లేవంటూ ప్రచారం చేస్తున్నారు. కరపత్రాలు పంచిపెడుతూ భయపడొద్దని చెబుతున్నారు. అమాయకులపై దాడులు వద్దు మతిస్థిమితం లేనివాళ్లు, అమాయకులపై దాడులు చేయడం సరికాదు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలి. ఇప్పటికే జిల్లా ఎస్పీ పలుమార్లు ప్రకటనల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ ఎటువంటి మార్పు రాకపోవడం విచారకరం. ప్రజలు కాస్త సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. మానవహక్కులకు భంగం కలిగించరాదు. అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారమివ్వండి. – ఎస్.అచ్చిరెడ్డి, మానవహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, విజయనగరం పుకార్లు చేసే వారిపై చర్యలు తప్పవు పుకార్లను వైరల్ చేసే వారిపై ఐటీ చట్టం ప్రకారం చర్యలు తప్పవు. ఇప్పటికే అదుపులో ఉన్న వ్యక్తుల గురించి నెల్లిమర్ల పోలీసులు విచారణ చేపట్టారు. వారంతా నెల్లిమర్ల జ్యూట్‌మిల్లులో పనిచేస్తున్నారన్నారని మిల్లు మేనేజరు నిర్థారించారు. తెలియని విషయాలను అనవసరంగా ఇతరులకు పంపి, వారిని భయబ్రాంతులకు గురిచేయవద్దు. అనుమానితులు ఎవరైనా కనబడితే వారిపై భౌతిక దాడులకు పాల్పడకుండా, పోలీసులకు అప్పగించాలి. మన ప్రాంతాల్లో ఎటువంటి గ్యాంగులు సంచరించడంలేదు. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే వారిపై ఐటీ చట్టం ప్రకారం చర్యలు తప్పవు. పుకార్లు పుట్టించే వారిపై ఇప్పటికే నిఘా ఉంచాం. – జి.పాలరాజు, ఎస్పీ, విజయనగరం. ప్రజల్లో అవగాహన పెరగాలి ప్రజలు సాధారణ విషయాలను నమ్మకపోయినా, ఇటువంటి రూమర్లను బాగా నమ్ముతారు. సామాజిక వెబ్సైట్లలో ఇటువంటి పోస్టింగులు ఎక్కువయ్యాయి. ఈ విషయంలో ప్రజల్లో అవగాహన పెరగాలి. మతిస్థిమితం లేని వాడు ఏమీ మాట్లడలేడు. సమాజంలో వాళ్లే ఒక రకంగా దురదృష్టవంతులు. ఎటువంటి ఆసరా లేక అలా తిరుగుతుంటారు. భాషరాదు, సరిగ్గాచెప్పలేరు. విజయనగరంలో ఎక్కువ మతిస్ధిమితం లేనివారు మన భాష రానివారే ఉన్నారు. ఒడిశా, కలకత్తా, బీహార్ తదితర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్లు ఉన్నారు. ప్రజలు వారిని కాసేపు పరిశీలించాలి. ఏమైనా సందేహం కలిగితే వెంటనే పోలీసులకు అప్పగించాలి. కొట్టే అధికారం ఎవరికీ లేదు. మారణాయుదాలు గానీ ఉంటే తీసుకుని, పెనుగులాడడం సరికాదు. – డాక్టర్ ఎన్.వి.ఎస్.సూర్యనారాయణ, సైకాలజిస్ట్, విజయనగరం -
పార్థి గ్యాంగ్ తిరుగుతుందట నిజమేనా సారూ?
హుస్నాబాద్ మెదక్ : సారూ మా పిల్లలు పదిలమేనా?, పార్థి గ్యాగ్ తిరుతుందంట నిజమేనా? అని హుస్నాబాద్ ఎల్లం బజార్‌కు చెందిన ఓ మహిళ కార్డున్ సెర్చ్ పర్యవేక్షించడానికి వచ్చిన సీపీ జోయల్ డేవిస్ ఎదుట తన భయం వ్యక్తం చేసింది. గ్రామాల్లో పిల్లలను ఎత్తుకెళ్లే దొంగలు తిరుగుతున్నారని ప్రచారం జరుగుతోంది నిజమేనా సారు? గుంపుల కొద్ది పోలీసులు వస్తే భయమైతాంది అంటూ ఆందోళన వ్యక్తం చేసింది. స్పందించిన సీపీ జోయల్ డేవీస్ అదేమి లేదమ్మా అలాంటి వదంతులు నమ్మవద్దని సూచించారు. మీ ఫోన్లలో వాట్సాప్‌కు వచ్చిన ఫొటోలు ఏమైనా ఉన్నాయా అని సదరు మహిళను ప్రశ్నించారు. తమ వద్ద ఫొటోలు లేవని అందరు అనుకుంటున్నారని ఆమె బదులిచ్చింది. హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లంబజార్‌లో సోమవారం ఉదయం పోలీసులు కార్డూన్ సెర్చ్ నిర్వహిస్తుండగా ఈ సన్నివేశం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ..పిల్లలను ఎత్తుకు పోయేందుకు పార్థి గ్యాంగ్ వంటి ముఠాలు, నేరగాళ్లు, దొంగలు తిరుగుతున్నారన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. అలాంటి సమాచారం, ఆధారాలు పోలీస్‌ల వద్ద లేవని స్థానిక మహిళలకు ధైర్యం చెప్పారు. ఇలాంటి ప్రచారాలను జిల్లా ప్రజలు నమ్మొద్దని సూచించారు. మీ రక్షణకు మేము ఉన్నామని, నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నామని భరోసానిచ్చారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ మా పోలీసుల బాధ్యత అని అన్నారు. గ్రామాలు, పట్టణాల్లోని అనుమానిత ప్రదేశాలు, వ్యక్తులపై మా ప్రత్యేక పోలీస్‌ల నిఘా నిరంతరం ఉంటుందన్నారు. సీపీ వెంట అడిషనల్ డీసీపీ నర్సింహారెడ్డి, ఏసీపీ మహేందర్, సీఐలు శ్రీనివాస్‌జీ, రఘు, ఎస్ఐ సుధాకర్ ఉన్నారు. -
వణికిస్తున్న వదంతులు
తాండూరు, బషీరాబాద్(రంగారెడ్డి) : కర్ణాటక సరిహద్దు మండలం బషీరాబాద్‌లో ఆదివారం అర్ధరాత్రి అలజడి రేగింది. కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన వదంతులతో పల్లెలు వణికి పోతున్నాయి. దావానలంలా వ్యాపించిన నేరస్తుల పాత వీడియోలు, ఫొటోలు జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉక్కపోతతో ఇన్ని రోజులు ఆరుబయట పడుకున్న పల్లె జనం వదంతుల భయంతో గుంపులుగా గుమిగూడి జాగారం చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా, బీదర్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వచ్చిన నేరస్తుల ముఠాలు రాత్రి వేళల్లో గ్రామాల్లో సంచరిస్తున్నాయని సామాజిక మాధ్యమాల్లో సందేశాలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. పిల్లలను, వృద్ధులను కిడ్నాప్ చేసి చంపేస్తున్నారనే పుకార్లు దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో గుల్బర్గా జిల్లా సరిహద్దులోని నావంద్గి, ఇందర్‌చెడ్, క్యాద్గిర, ఎక్మాయి, మంతన్‌గౌడ్, మైల్వార్, కంసాన్పల్లి, నీళ్లపల్లి, జలాల్పూర్, మంతట్టిలో ప్రజలు నిద్ర కూడా పోవడం లేదు. నావంద్గిలో ఆదివారం రాత్రి ఇద్దరు గుర్తు తెలియని అగంతకులు సంచరించారనే అనుమానంతో గ్రామస్తులు రాత్రంతా గాలించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వారికి ధైర్యం చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వీడియోలు, ఫొటోలు నమ్మవద్దని, అవన్నీ ఫేక్ అని వివరించారు. వాట్సప్ గ్రూపుల్లో అలాంటివి వస్తే షేర్ చేయొద్దని సూచించారు. నీళ్లపల్లి గ్రామస్తులు అర్ధరాత్రి సర్పంచ్ ఉమాసుధాకర్‌రెడ్డి ఇంటి వద్ద గుమిగూడి, పోలీసులను పిలిపించాలని విన్నవించారు. అగ్గనూరులో అనుమానిత వ్యక్తిపై దాడి యాలాల (వికారాబాద్) : చిన్న పిల్లలను ఎత్తుకెళ్లేందుకు వచ్చాడని భావిస్తూ ఓ వ్యక్తిపై గ్రామస్తులు దాడికి దిగారు. ఈ సంఘటన మండల పరిధిలోని అగ్గనూరులో సోమవారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి గ్రామంలో అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. ఇతని కదలికలు, వ్యవహారంపై అనుమానం వచ్చిన కొంతమంది అతన్ని పట్టుకుని వివరాలు అడిగారు. సరైన సమాధానం చెప్పకపోవడంతో దేహశుద్ధి చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భయం వద్దు తాండూరులో చిన్నారులను అపహరించే ముఠా సంచరిస్తోందంటూ వస్తున్న వదంతుల్లో వాస్తవం లేదు. ప్రజలు భయపడాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలు, ఫొటోలను నమ్మవద్దు. కావాలనే కొందరు ప్రజలను భయబ్రాంతులను గురి చేసేందుకు ఇలాంటివి ప్రచారం చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎక్కడా చిన్నపిల్లల కిడ్నాప్ కేసులు నమోదు కాలేదు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాం. ఉపాధి కోసం వచ్చే అమాయకులపై దాడులు చేయొద్దు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే మాకు సమాచారం ఇవ్వండి. – రామచంద్రుడు, డీఎస్పీ, సెల్: 94406 27353 -
సోషల్ మీడియాలో వదంతులు నమ్మకండి..
-
సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలను నమ్మి మోసపోవద్దు
-
‘వదంతులు నమ్మకండి.. ఫోన్ చేయండి’
సాక్షి, విశాఖపట్నం/విజయవాడ/ఏలూరు : కిడ్నాప్, సైకో ముఠాల వదంతులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న రూమర్లతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ‘సైకోలు వచ్చారు... పిల్లలను ఎత్తుకుపోతున్నారు.. రాత్రివేళ ఎవరైనా తలుపు కొడితే తీయకండి.. చంపేసి డబ్బు, నగలు దోచుకుపోతారు..’ వంటి హెచ్చరికలతో కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇవన్నీ వదంతులని, వీటిలో ఏమాత్రం వాస్తవం లేదని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. వదంతులు నమ్మకుండా ఉండేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి వార్తలు నమ్మొద్దని విశాఖపట్నం పోలీసు కమిషనర్ టి. యోగానంద్ కోరారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులు వ్యాప్తి చేస్తున్న వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. చిన్నపిల్లలను నరికి చంపుతున్నారనే వాట్సప్ మెసేజ్‌లు వచ్చిన నేపథ్యంలో కృష్ణాజిల్లా గన్నవరం మండలం చనుపల్లివారిగూడెం గ్రామంలో పోలీసులు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వదంతులు నమ్మవద్దని విజయవాడ డీసీపీ గజరావు భూపాల్ ఈ సందర్భంగా ప్రజలను కోరారు. సోషల్ మీడియాలో ఇలాంటి వదంతులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత కొద్ది రోజులుగా జిల్లాలో చిన్నపిల్లలను కిడ్నాప్ చేసే గ్యాంగ్‌లు తిరుగుతున్నాయంటూ సోషల్ మీడియాల్లో వస్తున్న వార్తలు, ఫోటోల్లో నిజం లేదని పశ్చిమగోదావరి జిల్లా డీఎస్పీ ఈశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఇలాంటి వదంతుల వల్ల ఇప్పటికే ఏలూరు డివిజన్ పరిధిలో ఐదు చోట్ల అమాయకులపై దాడి జరిగాయని, ఏలూరు డివిజన్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఈ వదంతులు వ్యాపించి ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు. ఎవరి మీదైనా అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. -
సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మొద్దు
కందుకూరు రంగారెడ్డి : సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలను నమ్మి మోసపోవద్దని సీఐ భాస్కర్ ప్రజలకు సూచించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పిల్లలను ఎత్తుకుపోయే గ్యాంగ్ వచ్చిందని, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని గ్రామాల్లో ప్రజలు నిద్ర పోకుండా జాగారం చేస్తున్నారని ప్రచారం జరుగుతుందన్నారు. అవన్నీ అసత్య వార్తలని, అలాంటి సంఘటనలో ఎక్కడా చోటు చేసుకోలేదన్నారు. అనవసరంగా ప్రజలు తమ విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దన్నారు. ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి కేసులు నమోదు కాలేదన్నారు. వధంతులను నమ్మొద్దన్నారు. ఇలాంటి ఫేక్ న్యూస్ ఫార్వర్డ్ చేసే ముందు ఒక్కటికి పదిసార్లు ఆలోచించాలన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారానికి వడిగట్టే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. -
నేను క్షేమంగానే ఉన్నా: దర్శకుడు
రుద్రమదేవి రైటర్ రాజసింహా తాను క్షేమంగా ఉన్నట్లు ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆయన కొంతకాలంగా సినిమాల్లో అవకాశాలు లేక డిప్రెషన్లో ఉన్నట్టు, ముంబైలోని తన రూంలో ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు నిన్న వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే అలాంటిదేమీ లేదంటూ సోషల్‌మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ‘నేను రాజసింహా. నేను క్షేమంగా ఉన్నాను. నాకు డయాబెటిక్ ఉంది. షుగర్ లెవల్ డౌన్ అవ్వడం, రాత్రి పక్కన ఎవరూ లేకపోవడంతో కాస్త సీరియస్ అయింది. నేను ప్రస్తుతం బాగానే ఉన్నాను. నా గురించి కంగారు పడ్డ వాళ్లందరికి ధన్యవాదాలు. ఇంకో 2, 3 రోజుల్లో హైదరాబాద్ వస్తాను’ అంటూ వీడియోలో తెలిపారు. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ఒక అమ్మాయి తప్ప సినిమాతో రాజసింహా దర్శకుడిగా పరిచయం అయ్యారు. శంకర్‌దాదా ఎంబీబీయస్, బొమ్మరిల్లు, ఝుమ్మందినాధం, అనగనగా ఓ ధీరుడు, రుద్రమదేవి సినిమాలకు రాజసింహా రచయితగా పనిచేశారు. సంబరం, నీ స్నేహం, టక్కరిదొంగ లాంటి సినిమాల్లో నటుడిగానూ కనిపించారు. జయంత్ సీ పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన పలు చిత్రాలకు సెకండ్‌యూనిట్ దర్శకుడిగా పనిచేశారు. -
నేను ప్రస్తుతం బాగానే ఉన్నాను
-
దుష్ప్రచారం ఆపకపోతే రాజీనామా: ఫిరాయింపు ఎమ్మెల్యే
బద్వేలు అర్బన్ : వైఎస్సార్ జిల్లా బద్వేలు నియోజకవర్గంలో కొందరు అధికార పార్టీ ముఖ్య నేతలు పనికట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే జయరాములు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా నాయకత్వానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, ఇప్పటికైనా వారు స్పందించకపోతే తనతో పాటు, తన అనుచర వర్గమంతా మూకుమ్మడి రాజీనామా చేస్తామని హెచ్చరించారు. అంతవరకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననని తేల్చిచెప్పారు. శనివారం బద్వేలు ఆర్అండ్బీ బంగ్లాలో ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీలోని కొందరు అగ్రవర్ణ నేతలు దళితుడినైన తనను అభివృద్ధి పనులు చేయకుండా అడ్డుకుంటున్నారని, తాను చేపట్టే కార్యక్రమాలకు పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఇదే విషయాన్ని జిల్లా నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి తెలియచేసినా చర్యలు తీసుకోకపోగా, వారికే వత్తాసు పలకడం తగదన్నారు. -
అత్యుత్సాహం : మరో నటుణ్ని చంపేశారు..!
ఇటీవల సోషల్ మీడియాలో కొంత మంది చూపిస్తున్న అత్యుత్సాహం సెలబ్రిటీలకు ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. ఏదైన వార్త వచ్చిన సందర్భంలో పూర్తిగా అవగాహన లేకుండా.. జరిగిన సంఘటన గురించి పూర్తిగా తెలుసుకోకుండా సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెట్టడం వెంటనే అవి వైరల్ అవ్వటం జరిగిపోతున్నాయి. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. సోమవారం సీనియర్ నటుడు వంకాయల సత్యనారాయణ మూర్తి అనారోగ్యంతో మృతిచెందారు. ఈయన మరణ వార్త మీడియాలో రావటంతో కొందరు వంకాయల సత్యనారాయణ మూర్తికి బదులుగా కైకాల సత్యనారాయణ మరణించినట్టుగా సోషల్ మీడియలో సంతాప సందేశాలను పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌లను మరికొందరు షేర్ చేయటంతో ఈ వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో కైకాల సత్యనారాయణగారు క్షేమంగా ఉన్నారంటూ మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది. -
‘ఇర్ఫాన్‌ఖాన్ చాంపియన్‌లా తిరిగివస్తాడు’
విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పేయ్, బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇర్ఫాన్‌ఖాన్ అనారోగ్యంపై మీడియాలో వస్తున్న కథనాలపై ట్విటర్ వేదికగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఏదో తెలియని జబ్బుతో బాధపడుతున్నఇర్ఫాన్ ఆ వ్యాధి గురించి తెలిసిన తరువాత తనే చెబుతానని సోమవారం ట్విటర్లో పేర్కొన్నాడు. అరుదైన వ్యాధి అని, దాని గురించి ఇంకా వివరాలు తెలియలేదని, ఇంకో వారం పది రోజుల్లో వివరాలు ప్రకటిస్తానని పోస్ట్ చేశాడు. అయితే దీనిపై మీడియా తనకు తోచిన విధంగా కథనాలు ప్రచురిస్తుండటంతో నటుడు మనోజ్ బాజ్‌పేయ్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ...‘‘అందరినీ దయ చేసి వేడుకుంటున్నాను, మీరు ఇలాంటి తప్పుడు కథనాలను ప్రచారం చేయకండి. తన వైపు నుంచి అధికారికంగా విషయం వెల్లడించేవరకు వేచి చూడండి. తను ఆ వ్యాధిని కనిపెట్టి, ఎదురించి చాంపియన్‌లా తిరిగివస్తాడు. అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి. మనమంతా అతని ప్రైవసీని గౌరవిద్దాం’’ అని ట్విటర్లో పోస్ట్ చేశాడు. -
‘మోదీ కానుక’ పుకార్లతో పరుగులు
వాకాడు: వితంతువులకు ప్రధాని మోదీ రూ.20 వేలు మంజూరు చేస్తున్నారని పుకార్లు షికార్లు చేస్తుండడంతో మండలంలోని వితంతువులు దరఖాస్తులు చేత పట్టుకుని రెవెన్యూ కార్యాలయానికి పరుగులు తీస్తున్నారు. ఇటీవల ఎవరో ఆకతాయిలు ‘నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్’ ద్వారా భర్త చనిపోయిన మహిళల బ్యాంక్ అకౌంట్లలో ప్రధాని మోదీ రూ.20 వేలు జమ చేస్తున్నారని వాట్సప్‌లో మెస్సేజ్ చేశారు. అనంతరం దీన్ని ఆసరాగా తీసుకున్న పలు జెరాక్స్ సెంటర్ల నిర్వాహకులు దరఖాస్తులు తయారు చేసి, విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో భర్తను కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన మహిళలు ఆశగా ‘మోదీ కానుక’ దరఖాస్తును తీసుకుని, దానికి సంబంధిత ధ్రువీకరణ పత్రాలు జత చేసి, తహసీల్దార్ కార్యాలయానికి పరుగులు తీస్తున్నారు. అక్కడ వీఆర్వోలు సైతం వీటిపై సంతకాలు చేసి, తహసీల్దార్‌కు సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో విషయం తెలియని వాకాడు తహసీల్దార్ లావణ్య తొలుత దరఖాస్తులు తీసుకున్నారు. అనంతరం ఉన్నతధికారుల ద్వారా విషయం తెలుసుకున్న ఆమె ‘ఇదంతా బోగస్, దీనిపై మాకు ఎలాంటి జీఓ లేదు’ అని చెప్పి దరఖాస్తులను తిరస్కరించారు. దీంతో విషయం పూర్తిగా తెలుసుకోకుండా రెవెన్యూ అధికారులు తమను ఇబ్బంది పెట్టారని బాధితులు మండిపడ్డారు. తమ పనులు సైతం మానుకుని ఒక్కో దరఖాస్తుకు రూ.వంద ఖర్చు చేశామని వాపోయారు. -
ఆగని వదంతులు..!
రూ.10నాణేలు చెల్లుబాటు కావంటూ పుకార్లు ∙ తీసుకోవడానికి నిరాకరిస్తున్న వ్యాపారులు ∙ అటువంటిదేమీ లేదంటున్న బ్యాంకర్లు రాయవరం : పది రూపాయల నాణేలు చెల్లవనే వదంతులు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. నెల రోజులుగా ఈ పరిస్థితి ఉంది. రూ.10నాణేలను తీసుకునేందుకు వ్యాపారులు వెనుకంజ వేస్తుండగా..నాణేలు చెల్లుబాటు కావన్నది కేవలం వదంతులేనని బ్యాంకర్లు కొట్టిపడేస్తున్నారు. నోట్ల రద్దు నుంచి.. గతేడాది నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం రూ.వెయ్యి, రూ.500 నోట్లను రద్దు చేయడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటికీ అదే పరిస్థిథి నెలకొంది. ఇలాంటి పరిస్థితిలో పది రూపాయల నాణేలు చెల్లవని ఆటోవాలాలు, చిరు వ్యాపారులు, పండ్లు, కూరగాయలు, పాల వ్యాపారులు..ఇలా ప్రతి ఒక్కరూ తీసుకునేందుకు తిరస్కరిస్తున్నారు. రూ.10నాణేలు వచ్చిన కొత్తలో, ఆ తర్వాత కూడా చాలా మంది వీటిని సేకరించి దాచుకోవడానికి ఆసక్తి చూపారు. చాలా మంది వ్యాపారులు మూటలు కట్టి ఇళ్లలో పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో వస్తున్న పుకార్లతో వారు ఆ నాణేలను బయటకు తీస్తున్నారు. అయితే వీటిని తీసుకోవడానికి వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. దీని వల్ల చిన్న చిన్న తగాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే వారికి చిల్లరగా కండక్టర్లు రూ.10నాణేలు ఇస్తే అటు ప్రయాణికులు..ఇటు కండక్టర్లు తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. రూ.10 నాణేలు చెల్లుబాటు అవుతాయి.. రూ.10 నాణేలు చెల్లుబాటు కావన్నది కేవలం అపోహలు మాత్రమే. రిజర్వు బ్యాంకు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాలేదు. ప్రజలు ఈ విషయాన్ని అర్ధం చేసుకుని రూ.10నాణేల మారకాన్ని వినియోగించుకోవాలి. – డి.సత్యనారాయణ, ఏజీఎం, ఆంధ్రాబ్యాంకు, రాయవరం -
ఇన్ఫీపై వదంతులను నమ్మొద్దు: సిక్కా
న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు, యాజమాన్యం మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయన్న వార్తలపై కంపెనీ సీఈఓ విశాల్ సిక్కా పెదవి విప్పారు. కార్పొరేట్ నైతికత, సమగ్రత, విలువల విషయంలో ఇన్ఫోసిస్‌కు ఉన్న నిబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తుతున్న ఇలాంటి ఊహాగానాలను నమ్మొద్దని ఉద్యోగులను కోరారు. కంపెనీ సిబ్బందికి పంపిన అంతర్గత ఈ–మెయిల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సిక్కా వేతనం పెంపు, మరో ఇద్దరు మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు భారీ వీడ్కోలు ప్యాకేజీలను ఆఫర్ చేయడంపై ఇన్ఫీ వ్యవస్థాపకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కంపెనీ బోర్డుకు లేఖ రాసినట్లు వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. కాగా, దీనిపై ఇప్పటికే ఇన్ఫోసిస్ వివరణ కూడా ఇచ్చింది. కంపెనీ పూర్తి ప్రయోజనాలమేరకే ఈ నిర్ణయాలు తీసుకున్నామని స్పష్టం చేసింది. ‘క్లౌడ్, ఎడ్జ్ ఇతరత్రా కొత్త తరం సేవలపై మనం(కంపెనీ) అనుసరిస్తున్న వ్యూహంపై నిశితంగా దృష్టి కేంద్రీకరించండి. మీడియాలో వస్తున్న ఊహాగానాలను అసలు పట్టించుకోవద్దు. నైతికత, సమగ్రత, విలువలను కాపాడేందుకు కంపెనీ కట్టుబడి ఉంది. ప్రస్తుతం నెలకొన్న కొత్త తరహా అసాధారణ పరిస్థితుల్లో సైతం ఇన్ఫోసిస్ అనే గొప్ప కంపెనీని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నాం. మా అంకితభావం విషయంలో మరో ఆలోచనకు తావులేదు. మనమంతా ఇకపై కూడా ఇదే నిబద్ధతతో కలసికట్టుగా సాగుదాం’ అని సిక్కా పేర్కొన్నారు. కాగా, దాదాపు రెండేళ్ల క్రితం ఐటీ పరిశ్రమ వృద్ధితో పోలిస్తే దాదాపు 50% వెనుకబడిన ఇన్ఫోసిస్.. ప్రస్తుతం పరిశ్రమ వృద్ధితో సమాన స్థాయికి చేరిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. నారాయణ మూర్తి తప్పు చేశారు: పాయ్ ప్రస్తుతం ఇన్ఫోసిస్‌లో ఉన్న నాయకత్వం.. వాటాదారులకు విలువను సమకూర్చడంపై దృష్టిసారించడం లేదని కంపెనీ మాజీ సీఎఫ్ఓ టీవీ మోహన్ దాస్ పాయ్ వ్యాఖ్యానించారు. అయితే, సీఈఓ విశాల్ సిక్కా సారథ్యంపై మాత్రం విశ్వాసం వ్యక్తం చేశారు. కంపెనీకి ఇప్పుడు అత్యంత బలమైన చైర్మన్ అవసరం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. 2000 ఏడాది నుంచి 2011 వరకూ ఇన్ఫీ బోర్డు సభ్యుడిగా పాయ్ కీలక బాధ్యతలను నిర్వర్తించారు. కంపెనీతో 17 ఏళ్ల బంధాన్ని వదులుకొని 2011లో రాజీనామా చేశారు. ‘ఇన్ఫీ ప్రమోటర్లలో ఒకరైన ఎన్ఆర్ నారాయణ మూర్తి.. కేవలం వ్యవస్థాపకులు మాత్రమే సారథులయ్యే(సీఈఓలు) విధానంపై దృష్టిపెట్టి తప్పు చేశారు. చాలా మంది ఉద్యోగులు కంపెనీని వీడిపోయేందుకు ఇదే ప్రధాన కారణం. ఇన్ఫీ లాంటి గొప్ప కంపెనీని నిర్మించడంలో మేమంతా కీలక భూమిక పోషించాం. అయితే, ఈ పరిస్థితులను చూసి చాలా బాధపడుతున్నా’ అని పాయ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఆర్.శేషసాయి వ్యవహరిస్తున్నారు. అయితే, ఆయన పేరును ప్రస్తావించకుండా.. ‘ఒక కంపెనీకి బలమైన సీఈఓ ఉన్నప్పుడు అంతే బలమైన చైర్మన్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఇన్ఫోసిస్ పటిష్టమైన చైర్మన్ నాయకత్వంలోనే బలోపేతం అయింది’ అని పాయ్ వ్యాఖ్యానించారు. కాగ్నిజంట్ తరహాలోనే ఇన్ఫీ కూడా షేర్ల బైబ్యాక్‌ను అమలు చేయాలన్నారు. -
అంజలి గురించి మళ్లీ...
నటి అంజలి గురించి చిత్ర పరిశ్రమలో మళ్లీ వదంతులు హల్చల్ చేస్తున్నాయి. కట్రదు తమిళ్ ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన నటి అంజలి. తొలి చిత్రంలోనే మంచి బరువైన పాత్రను సమర్థవంతంగా పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే అంగాడి తెరు చిత్రం ఆమెలోని నటనకు అద్దం పట్టిందనే చెప్పాలి. ఆ చిత్రం తరువాత ఈ పదహారణాల తెలుగమ్మాయి తమిళ ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. కాగా ఎంగేయుం ఎప్పోదుం చిత్రం అంజలిని కమర్షియల్ హీరోయిన్ గా నిలబెట్టింది. అంతే కాదు ఆ చిత్రం హీరో జై తో ప్రేమాయణం అంటూ వదంతులకు దారితీసింది. అంజలి, జై ల ప్రేమ పెళ్లికి దారి తీయనుందనే ప్రచారం జోరుగానే సాగింది. ఆ తరువాత అంజలి తన పిన్నితో మనస్పర్థల కారణంగా హైదరాబాద్‌కు వెళ్లిపోవడంతో ఆ వదంతులకు బ్రేక్ పడింది. కాగా ఐదేళ్ల గ్యాప్ తరువాత మళ్లీ అంజలి తమిళ చిత్రాల్లో నటించడం మొదలెట్టడంతో నటుడు జై, అంజలి ఒకటయ్యారనీ, వారి మధ్య సన్నిహిత సంబంధాలంటూ మళ్లీ వదంతుల పర్వం మొదలైంది. తాజాగా రామ్ దర్శకత్వంలో ఆండ్రియాతో కలిసి తరమణి చిత్రంలో నటిస్తున్న ఈ బహుభాషా నటి ప్రస్తుతం యూకేలో ఉన్నట్లు సమాచారం. ఆమె చెన్నైకి తిరిగొచ్చాక ఈ రూమర్స్‌పై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. -
రింగింగ్ బెల్స్ కథ ఇక కంచికేనా?
నోయిడా: ప్రపంచంలో అతి చవకైన ఫోన్ అంటూ ప్రకంపనలు పుట్టించిన రింగింగ్ బెల్స్ మరోసారి వార్తల్లో నిలిచింది. రూ.251కే ఫ్రీడం 251 స్మార్ట్ ఫోన్ అంటూ దిగ్గజ మొబైల్ కంపెనీలకు ముచ్చెమటలు పోయించిన సంస్థ సంస్థ వ్యవస్థాపకుడు, ఎండీ మోహిత్ గోయల్ సంస్థ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. అన్నదమ్ములు మోహిత్, అన్మోల్ మధ్య ఇటీవల చెలరేగిన విభేదాల నేపథ్యంలో మోహిత్ తో పాటు సంస్థ సీఈవో, మోహిత్ భార్య ధార్న గోయల్ కూడా సంస్థకు రాజీనామా చేశారు. దీంతో 2016 ఆరంభంలో(ఫిబ్రవరి)లో అలజడి రేపిన రింగింగ్ బెల్స్ కథ 2016 తో పాటే ముగిసిపోనుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతం రింగింగ్ బెల్స్‌కు మరో డైరెక్టర్ , మోహిత్ సోదరుడు అన్మోల్ కంపెనీ ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే అశోక్ చడ్దా కన్సల్టింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగనున్నట్టు తెలిపింది. తమ సంస్థ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని అన్మోల వెల్లడించారు. తమ స్పష్టమైన వ్యాపార లక్ష్యాలకు కట్టుబడి వున్నామని వ్యవస్థాపక నిర్వాహకుడైన అన్ మోల్ తెలిపారు. మరోవైపు కంపెనీ నుంచి బయటకు వచ్చిన మోహిత్ ఎండీఎం ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక నూతన సంస్థను ప్రారంభించ బోతున్నట్టు సమాచారం. కాగా అతి చవగ్గా స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి తీసుకు వస్తున్నట్టు రింగింగ్ బెల్స్ ప్రకటించడంతో దాదాపు ఏడుకోట్లకు పైగా ఈ మొబైల్ కోసం రిజిస్టర్ చేసుకున్నారు. దీంతో ఏకంగా కంపెనీ అధికారిక వెబ్ సైట్ కూడా క్రాష్ అయింది. అనంతరం సీబీఐ దాడులు,ఆందోళన తదితర పరిణామాలు తెలిసిన విషయాలే. అయితే బుక్ చేసుకున్నవాళ్లల్లో ఎంతమందికి ఈ ఫోన్లను అందించిందీ స్పష్టత లేదు. -
ఎన్టీఆర్ సినిమాపై కళ్యాణ్ రామ్ క్లారిటీ
జనతా గ్యారేజ్ సక్సెస్ తరువాత గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్, పవర్ ఫేం బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు నటవిశ్వరూపం అనే టైటిల్‌ను నిర్ణయించారని, అదే సమయంలో హీరోయిన్లుగా కాజల్, అనుపమా పరమేశ్వరన్, నివేదా థామస్ లను ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. ఈ వార్తలను చిత్ర నిర్మాత కళ్యాణ్ రామ్ కొట్టిపారేశాడు. ఎన్టీఆర్ హీరోగా తమ బ్యానర్లో తెరకెక్కబోయే సినిమాపై రకాల రకాల రూమర్స్ వినిపిస్తున్నాయన్న కళ్యాణ్ రామ్ అవన్నీ నిరాధారమైనవి అన్నాడు. ఇప్పటి వరకు సినిమా టైటిల్, కాస్టింగ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నాడు. నటీనటులు, టైటిల్ ఫైనల్ అయిన తరువాత అధికారికంగా ప్రకటిస్తామని తెలిపాడు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ అఫీషియల్ సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసిన కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ సినిమాపై వస్తున్న రూమర్స్‌కు తెరదించాడు.Lots of rumours circulating about the title as well as cast and crew of #NTR27. None of them are true.If it's official,it'll come from us.— NTR Arts (@NTRArtsOfficial) 26 December 2016 -
నా ప్రేమ, పెళ్లి సినిమాతోనే
ప్రస్తుతానికి నేను ప్రేమించినా, పెళ్లి చేసుకున్నా సినిమానే అన్నారు నటి వరలక్ష్మీ శరత్‌కుమార్. అయితే ఆమె ఈ వ్యాఖ్యలు కోలీవుడ్‌లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. విదేశాల్లో చదివి వచ్చిన నటి వరలక్ష్మీ శరత్‌కుమార్. తను మంచి డాన్సర్. ముఖ్యంగా బెల్లీ డాన్స్‌లో ప్రావీణ్యం పొందారు. కథానాయకిగా పోడాపోడీ చిత్రం ద్వారా రంగప్రవేశం చేశారు. ఆ తరువాత విశాల్‌తో కలిసి మదగజరాజా చిత్రంలో నటించారు. ఆ చిత్రం పూర్తి అయినా ఆర్థికపరమైన కారణాలతో ఇంకా విడుదల కాలేదు.ఆ మధ్య బాలా దర్శకత్వంలో తారై తప్పట్టై చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.ప్రస్తుతం మలయాళంలో మోహన్‌లాల్‌తో నటిస్తున్నారు. ఈ బ్యూటీకీ నటుడు విశాల్‌కీ మధ్య ప్రేమాయణం నడుస్తోందని చాలా కాలంగా వదంతులు హల్చల్ చేస్తున్నాయి.ఈ వ్యవహారం గురించి వరలక్ష్మి తనకు బాల్యం నుంచి స్నేహితురాలు అని నటుడు విశాల్ స్పందించారు గానీ, నటి వరలక్ష్మి మాత్రం నోరు మెదపకుండా సెలైంట్‌గా అంతా గమనిస్తూ వచ్చారు. అయితే ఇటీవల నటుడు విశాల్ తన పెళ్లి 2018 జనవరిలో జరగుతుందని,అందుకు కొత్తగా నిర్మించనున్న నడిగర్సంఘంలోని హాలు వేదిక కానుందని వెల్లడించారు. అంతే కాదు లక్ష్మీకరమైన అమ్మాయే తన జీవిత భాగస్వామి అవుతుందని పేర్కొని మీడియాకు మరింత మేత వేశారు.దీంతో విశాల్, వరలక్ష్మిల వివాహం ఖాయం అనే ప్రచారం జోరందుకుంది. అలాంటిది ఇప్పటి వరకూ మౌనంగా ఉన్న నటి వరలక్ష్మి శరత్‌కుమార్ తాజాగా కాస్త ఘాటుగానే స్పందించారు. తన ప్రేమ,పెళ్లి గురించి రకరకాల ప్రచారం జరుగుతోందని, అందులో వాస్తవం లేదని అన్నారు. కాబట్టి ఈ విషయం గురించి ఇప్పటికే చాలా ఎక్కువగా ప్రచారం చేశారని అన్నారు. ఇకపై సామాజిక మాద్యమాలు రాద్దాంతం చేయవద్దని, తనకు ప్రస్తుతానికి ప్రేమ,పెళ్లి అన్నీ సినిమానేని తన ట్విట్టర్లో పేర్కొన్నారు. దీంతో ఇంత ఆలస్యంగా వరలక్ష్మీ శరత్‌కుమార్ ఇంత ఘాటుగా స్పందించడానికి కారణాలేమైఉంటాయబ్బా అని కోలీవుడ్ వర్గాలు ఆరా తీసే పనిలో పడ్డారు. -
ఆరోగ్యంగానే హిల్లరీ
వాషింగ్టన్: తన ఆరోగ్యంపై రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ఆరోపణలను హిల్లరీ క్లింటన్ ప్రచారశిబిరం తోసిపుచ్చింది. ఈ మేరకు హిల్లరీ క్లింటన్ ప్రచార కర్త జెన్నీఫర్ పల్మీరీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. డొనాల్డ్ ట్రంప్ నకిలీ వైద్య నివేదికలతో హిల్లరీ ఆరోగ్యంపై దుష్ప్రచారం చేస్తున్నారని సదరు ప్రకటనలో తెలిపారు. రోజర్ స్టోన్, అతని రైట్ వింగ్ పక్షాలు అందిస్తున్న కల్పిత వైద్య నివేదికలతో డొనాల్డ్ ట్రంప్ అబద్ధాల్ని చిలక పలుకుల్లా వల్లెవేస్తున్నారంటూ మండిపడ్డారు. డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం హిల్లరీ క్లింటన్‌ను ఉద్దేశిస్తూ...‘అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌పై చర్యలు తీసుకునేందుకు హిల్లరీ శారీరకంగానూ, మానసికంగాను బలహీనురాలు’అని వ్యాఖ్యానించడం తెలిసిందే. అయితే వీటిని ఖండిస్తూ, హిల్లరీ క్లింటన్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యనివేదికల్ని బుధవారం విడుదల చేశారు. వీటితోపాటు హిల్లరీ క్లింటన్ పన్నుదాఖలు పత్రాలను కూడా విడుదల చే శారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని కూడా ప్రజలకు అందించడంలో ట్రంప్ విఫలమయ్యారని విమర్శించారు. ఇదిలా ఉండగా..హిల్లరీ క్లింటన్ అమెరికా రక్షణా విభాగం కార్యదర్శిగా చేసిన సమయంలో ఈ–మెయిల్ కుంభకోణానికి సంబంధించిన వ్యవహారంలో ఎఫ్‌బీఐ తన విచారణ నివేదికను కాంగ్రెస్‌కు సమర్పించింది. -
అవును... వాళ్లిద్దరూ విడిపోయారు
ప్రేమించి, పెళ్లి చేసుకున్న దర్శకుడు విజయ్, నటి అమలాపాల్ విడాకులు తీసుకోవాలనుకుంటున్నారనే వార్త గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్త నిజమేనని స్పష్టం అయ్యింది. విజయ్ తండ్రి ఏఎల్.అళగప్పన్ స్వయంగా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. విజయ్, అమలాపాల్ విడిపోయారని ఆయన ప్రకటించారు. దర్శకుడు విజయ్ కూడా ఒక భేటీలో అమలాపాల్ ప్రస్తావన అనవసరమనీ, తన తల్లిదండ్రులు ఎలా చెబితే అలా నడుచుకుంటాననీ అనడం గమనార్హం. విజయ్‌కి ఇష్టం లేకపోయినా అమలాపాల్ మళ్లీ నటించడమే వారి మధ్య మనస్పర్థలకు కారణం అని తెలుస్తోంది. అతని తల్లిదండ్రులకు కూడా అమలాపాల్ నటించడం ఇష్టం లేదట. ప్రస్తుతం ధనుష్ సరసన అమలాపాల్ ‘వడచెన్నై’ అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ముందు ఈ చిత్రంలో సమంతను కథానాయికగా తీసుకోవాలనుకున్నారు. అయితే, సమంత నిరాకరించడంతో అమలాపాల్‌ని అడగడం, ఆమె అంగీకరించడం జరిగింది. విజయ్, అమలాపాల్ పెళ్లి 2014లో జరిగింది. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇలా విడిపోవడం చర్చనీయాంశమైంది. -
ఆ పుకార్లను నమ్మొద్దు: మహేందర్ రెడ్డి
హైదరాబాద్ : పేలుళ్లపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దని నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి సూచించారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ప్రజా భద్రతకు ముప్పు ఉన్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయని, అవన్నీ అవాస్తలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు అన్ని ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని మహేందర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పుకార్లు వ్యాపింపచేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. మరోవైపు అదుపులోకి తీసుకున్న ఐసిస్ సానుభూతిపరుల నుంచి ఎన్ఐఏ అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టారు. సిరియా తీవ్రవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఇక ఆయుధాల కోసం హబీబ్, ఇబ్రహీం గత జూన్‌లో అజ్మీర్ వెళ్లినట్లు సమాచారం. రూ.60 వేలు నుంచి రూ.65 వేలు వరకూ ఖర్చు చేసిన ఆయుధాలు దొరకలేదని, ఇటీవలే నందన్ వెళ్లి రెండు ఆయుధాలు సేకరించినట్లు ఐసిస్ సానుభూతిపరులు విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. -
బస్తీ మే దెయ్యం
చేత'న'బడి చీకట్లో ఏడుపులు వినిపిస్తున్నాయి. గుండెల మీద ఎవరో కూర్చున్నట్టుగా ఉంది! చనిపోయిన బాలమ్మ కళ్లను దానం చేశారు కాబట్టి... బాలమ్మ దెయ్యం ఇంటింటికీ... ‘తడుముకుంటూ’ తిరుగుతోందని బస్తీలో పుకార్లు! ఓర్నాయనో! ఎవరిని ఆవహిస్తుందో ఏమో! బస్తీ గజగజలాడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వివేకంగా ఉండాలి! దేనికి జాగ్రత్త? దేనికి వివేకం. చదవండి. రెండు సంఘటనలు. మూడు మరణాలు. ఆ బస్తీని అతలాకుతలం చేస్తున్నాయి. ఎవరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీం పట్నంలో ముదిరాజ్ బస్తీ. మూడు శ్మశానాల మధ్య ఉంది ఆ బస్తీ. అక్కడ నివసించేవారంతా శ్రామికులే. రవి బేల్దారి పని చేస్తుంటాడు. అర్ధరాత్రి నిద్రలో ఉలిక్కిపడి లేచాడు. లేస్తూనే ఇంట్లో వాళ్ల మీద విరుచుకు పడ్డాడు. ‘నేనెన్ని సార్లు మిమ్మల్ని గిచ్చి లేపినా ఒక్కరూ లేవరేం?’ అని అరిచాడు. ‘నువ్వెప్పుడు గిచ్చావయ్యా’ అంటే వినడు. ‘నా గుండెల మీద బ్రహ్మరాక్షసి కూర్చుంది. ఎంతకీ లేవలేదు. మిమ్మల్ని లేపుతుంటే ఒక్కరూ లేవలేదు’ అని రవి ఆరోపణ. అంతే... ఇంట్లో వాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెట్టడం మొదలైంది. ‘ఊరి వాళ్లంతా నెత్తీనోరూ కొట్టుకుని చెప్పినా వినకపోతిరి’ అని సణుగుతూ రవి తల్లి పక్కింటి వైపు తొంగి చూసింది. ఆ పెంకుటింటికి ఎప్పటిలాగే తాళం పెట్టి ఉంది. రవికి కూడా గుబులు మొదలైంది. రవి కళ్ల ముందు గతం మెదిలింది. అది సంతోష ఆత్మేనా?! ఆ పెంకుటిల్లు సంతోషది. ఆమె భర్తకు నల్గొండ జిల్లా చిట్యాలలో ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం. వారి కాపురమూ అక్కడే. సంతోష గర్భవతైంది. అన్యోన్యంగా సాగుతున్న వారి దాంపత్య జీవితంలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ భార్యాభర్తల మధ్య కీచులాటలు ఎక్కువయ్యాయి. సంతోష ప్రాణాలు తీసుకుంది! చిట్యాలలో వారున్నది అద్దె ఇల్లు. ఆ ఇంటి నుంచి దహన సంస్కారాలు చేయడానికి ఇంటి యజమానులు ఒప్పుకోరు. సొంతూరికి వచ్చి సొంత వాళ్ల మధ్యన ఆ కర్మకాండలు నిర్వహించడమే మార్గం. అయితే ఇందుకు ఊరు ఒప్పుకోలేదు. రెండు ప్రాణాలు పోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. సహాయ నిరాకరణ చేసింది. దాయాదులైన రవి కుటుంబం ఒక్కటే ఆదుకుంది. పాడె మోయడం దగ్గర నుంచి అంతిమ సంస్కారం వరకు ఆ కుటుంబం వారే దగ్గరుండి పూర్తి చేశారు. అయితే రోజులు గడిచినా ఊరివాళ్లకు సంతోష మరణం మీద శంకలు తగ్గలేదు. సంతోష ఆత్మ అక్కడే, ఆ ఇంట్లోనే ఉంటుందని, పాడె మోసిన వారిని పీడిస్తుందని భయపెట్టసాగారు. జరిగినదంతా గుర్తొచ్చి రవికి ఒళ్లంతా చెమటలు పట్టాయి. సందేహం లేదు. సంతోష ఆత్మ తన గుండెల మీద కూర్చుని ప్రాణాలు తీయబోయింది అనే నిర్ధారణకు వచ్చేశాడు. ఈ సంగతి ఊరంతా పొక్కింది. అంతలోనే మరో సంఘటన. రెండో ఆత్మ... బాలమ్మ! అదే బస్తీలో ఉండే పోచమ్మ ఓ రోజు పొద్దున్నే కూతుర్ని పిలిచి అర్ధరాత్రి నట్టింట్లో ఏడుపు వినిపించిందని చెప్పింది. అది బాలమ్మ ఏడుపేనేమో అనుకున్నారు తల్లీకూతుళ్లు. అప్పటినుంచి ఆ ఇంట్లో అందరూ అస్థిమితంగానే నిద్రపోతున్నారు. ఊళ్లో దాదాపుగా అందరికీ ఏదో ఒక సమయంలో ఏడుపు వినిపిస్తోంది. ఇదంతా ఏదో అరిష్టానికి సంకేతం అని ఊరంతా నమ్మింది. గుబులుగా రోజులు గడుస్తున్నాయి. ఓ రోజు పోచమ్మ ఇంట్లో సందడి. కల్లు తాగి, తిళ్లు వండుకుని తిన్నారంతా. కొంతసేపటికి పోచమ్మ విచిత్రంగా ప్రవర్తిస్తోంది. టీవీ సీరియళ్లలో, సినిమాల్లో దెయ్యం పాత్రలో కనిపించే హావభావాలన్నీ ఆమె ముఖంలో పలుకుతున్నాయి. వాంతి వస్తోందని కొంతసేపు హడావుడి చేసింది. గర్భిణి సంతోష దెయ్యమై పట్టిందేమోనని వెన్నులో నుంచి చలి మొదలైంది పోచమ్మ కూతురికి. ‘అన్నం అరగలేదేమో, జీర్ణమవడానికి ఏ నిమ్మకాయ రసమో ఇవ్వు’ అనేసి నిద్రకు ఉపక్రమించాడు పోచమ్మ అల్లుడు. మరికొంత సేపటికి పోచమ్మ ఆకలంటూ కేకలు పెట్టింది. ‘కార్జం (కాలేయం), మాంసం పెట్టండి’ అంటోంది. పొంతనలేని మాటలతో ఇంట్లో వాళ్లు భీతిల్లిపోతున్నారు. ‘నువ్వెవరు’ అనగానే ‘మీకు తెల్వదా, నన్ను మర్చిపోయిన్రా... మీ పక్కింటి బాలమ్మను కదా’ అంటోంది పోచమ్మ. ఆ పక్కింట్లోనే బాలమ్మ కొడుకు, కోడలు, ఇద్దరు పిల్లలు నిద్రపోతున్నారు. ‘మీ ఇంటికి పోక, మా ఇంటికెందుకొచ్చావ్’ అన్నది పోచమ్మ కూతురు. ‘నా కొడుకు పూజ చేయించి నన్ను ఇంట్లోకి రానివ్వకుండా కట్టడి చేసిండు’ అని చెప్పింది బాలమ్మ ఉరఫ్ పోచమ్మ. అలా మాట్లాడుకుంటూ ఇంటి బయటికొచ్చింది. కళ్లు కనిపించనట్లు తడుముకుంటూ శ్మశానం వైపు వెళ్లి పోయింది. చూపు లేని దెయ్యం! బాలమ్మ చనిపోయిన తర్వాత ఆమె కళ్లను దానం చేశాడు కొడుకు. దాంతో బాలమ్మ దెయ్యమైన తర్వాత చూపు కోల్పోయిందని, దారి కనిపించక తడుముకుంటూ తిరుగుతోందనేది బస్తీలో వదంతులు లేచాయి. బాలమ్మ దెయ్యమై తిరుగుతోందని, అర్ధరాత్రి వినిపించే ఏడుపు కూడా బాలమ్మదేనని పుకారు పుట్టింది. దాంతో బస్తీలో చాలా మంది భయంతో విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. కొందరి ప్రవర్తన బాలమ్మను స్ఫురింప చేస్తుంటే, కొందరి ప్రవర్తన సంతోషను గుర్తు చేస్తోంది. కాలనీలో మహిళలందరి చీర కొంగులకు, చుడీదార్ చున్నీలకు మంత్రించిన నిమ్మకాయల మూటలు కనిపిస్తున్నాయి. ఊరంతటికీ కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత కాస్తంత సమాధానపడినట్లు కనిపిస్తున్నారు. కానీ వారిలో భయం పూర్తిగా పోలేదు. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి అసలేం జరిగింది? గత డిసెంబర్లో వృద్ధురాలు బాలమ్మ తుదిశ్వాస విడిచింది. అది జరిగి రెండు నెలలు గడవక ముందే ఫిబ్రవరిలో తొమ్మిది నెలల నిండు గర్భిణి సంతోష ఆత్మహత్య చేసుకుంది. గర్భిణి కాబట్టి అది ఒక మరణం కాదు, రెండు మరణాల పెట్టు. అందుకే ఊరికి అరిష్టం పట్టిందని బస్తీవాసులు నమ్మారు. ఏడిచిందెవరు? కుక్కలు... మనిషి చెవులు వినలేని చాలా తక్కువ పౌనఃపున్యం ఉన్న శబ్దాన్ని కూడా గ్రహి స్తాయి. దానికి ప్రతిస్పందనగా తిరిగి అదే లయతో అరుస్తాయి. ఆ అరుపు మనిషి ఏడుపును తలపిస్తుంది. అర్ధరాత్రి నిశ్శబ్దంగా ఉండడంతో చాలా దూరం వినిపిస్తుంది. కల్లు, దెయ్యం కలిశాయి జెవివి సూచన మేరకు పోచమ్మను మరో కూతురు తనింటికి తీసుకెళ్లింది. అక్కడ ఆమెకు ఎటువంటి భ్రాంతులూ కలగడం లేదు. ఈ విచిత్ర ప్రవర్తనకు కారణం దెయ్యం భయం, దానికి తోడు కల్తీ కల్లు. ఆ కల్లు చిన్న మెదడు మీద ప్రభావం చూపిస్తుంది. విచిత్రమైన భ్రాంతులకు లోను చేస్తుంది. రవి పరిస్థితి కూడా అలాంటిదే. ఊరంతా సంతోష దెయ్యమై పట్టుకుంటుందని భయపెట్టడం, కల్తీ కల్లు తాగడం కలిసి ఆరోగ్యం పాడైంది. గుండెలు పట్టేసినట్లు అనిపించడంతో దెయ్యం గుండెల మీద కూర్చున్నదని భయపడ్డాడు. దానికితోడు టీవీ సీరియళ్లు, సినిమాల ప్రభావంతో ఆయాపాత్రల హావభావాలను ఆటోమేటిక్‌గా అనుకరించడం అలవాటైపోయింది. - టి. రమేశ్, జనరల్ సెక్రటరీ,ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ -
చిన్నవాడిని పెళ్లాడిన పుతిన్ మాజీ భార్య
మాస్కో: రష్యాలో ఇప్పుడు ఒకే అంశాన్ని అక్కడి మీడియా కోడై కూస్తోంది. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ మాజీ భార్య ప్రేమ వ్యవహారం గురించి ఆ మీడియా బయటకు చెప్పడంతో అక్కడి జనాలు ఔరా అని చెవులు కొరుక్కుంటున్నారు. పుతిన్ మాజీ భార్య లిద్మిలా పుతినా(58) ఎవరికీ తెలియకుండా రహస్యంగా మరోసారి వివాహం చేసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ఆమెకంటే 21 ఏళ్లు చిన్నవాడిని పెళ్లాడిందని తెలుస్తోంది. రష్యాకు చెందిన ఓ న్యూస్ మేగజిన్ 'సోబెసిడ్నిక్' స్వతంత్ర పరిశీలన ప్రకారం పుతిన్ మాజీ భార్య ఆమె పేరును లిద్మిలా ఓకెరెత్నాయా అని మార్చుకుంది. దీంతో ఆ మేగజిన్ 'లిద్మిలా ఈజ్ నో లాంగర్ పుతిన్' అనే శీర్షికతో కథనాన్ని వెలువరించింది. ఇందులో ఆమె అర్తుర్ ఓకెరెత్నీ 37 ఏళ్ల వ్యాపారవేత్తతో కలిసి ఉంటోందని, అతడిని వివాహం చేసుకున్నట్లుందని పేర్కొంది. అయితే, ఆమె మరో వివాహం చేసుకున్నట్లు ఎక్కడా సర్టిఫికెట్ మాత్రం కనిపించడంలేదని కూడా తెలిపింది. కాగా, దీనిపై స్పందించేందుకు పుతిన్ అధికారప్రతినిధి క్రెమ్లిన్ నిరాకరించారు. పుతిన్‌కు ఆమెకు ఇప్పటికే విడాకులు అయ్యాయని, వారి వ్యక్తిగత జీవితం గురించి తానేది మాట్లాడదలుచుకోలేదని చెప్పారు. 2013 జులై నెలలో పుతిన్, లిద్మిలా విడాకులు తీసుకున్నారు. దాదాపు 30 ఏళ్లపాటు వారి వైవాహిక జీవితం కొనసాగింది. -
ఫేస్బుక్లో అజిత్‌పై అసత్యప్రచారం
తమిళసినిమా: ఫేస్బుక్లో నటుడు అజిత్‌పై హాస్యనటుడు అసత్యప్రచారం చేసినట్లు ప్రచారం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీంతో చిత్రపరిశ్ర మలో కలకలం చెలరేగింది. అజిత్ అబిమానులు కరుణాస్ చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ వ్యవహారం గురించి నటుడు కరుణాస్ బుధవారం నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నటుడు అజిత్‌తో తనకు స్నేహ సంబంధాలున్నాయన్నారు. కాగా తన పేరుతో నకిలీ ఫేస్బుక్లో అజిత్ గురించి అసత్యప్రచారం జరగిందని, ఇది ఎవరో కావాలనే చేసిన దుశ్చర్య అని వ్యాఖ్యానించారు. నిజానికి తనకు ఫేస్‌బుక్‌ను వాడడంలో అంత ఆసక్తి లేదన్నారు. దాని గురించి పూర్తిగా అవగాహన కూడా లేదన్నారు. గత జనవరిలో ఒక దర్శకుడొకరు వత్తిడి చేయడంతో ఫేస్బుక్ అకౌంట్ పారంభించానని వివరించారు. ఆ తరువాత దాన్ని వాడనే లేదని అన్నారు. అలాంటిది తన పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ను ఓపెన్ చేసి అసత్య ప్రచారానికి పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా ఫిర్యాదులో కోరినట్లు కరుణాస్ తెలిపారు. -
సూది 'ఎఫెక్ట్'.. భయంతో ఆస్పత్రిలోచేరిన వ్యక్తి
సూది సైకో గురించిన పుకార్లు పెరిగి పోతుండటంతో జనం భయంతో బిక్కు బిక్కు మంటున్నారు. ఏమూల నుంచి సూది సైకో తమ మీద దాడి చేస్తాడో అని వణికి పోతున్నారు. తాజాగా.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో సూదితో తనపై దాడి చేశారంటూ ఓ వ్యక్తి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. బాధితుడి కధనం మేరకు.. వట్లూరు గ్రామానికి చెందిన దుక్కిపాటి కృష్ణ(30) ఆదివారం ఏలూరు పట్టణానికి వచ్చి తిరిగి ఆటోలో స్వగ్రామానికి బయలు దేరాడు. ఫైర్ స్టేషన్ సెంటర్ లో ఓ గుర్తు తెలియని వ్యక్తి బైక్ పై వచ్చి తన చేతిపై సూదితో గుచ్చి పరారయ్యాడని తెలిపాడు. సదరు వ్యక్తి వస్త్రంతో ముఖం కప్పుకున్నాడు. అయితే చేతిపై గాయం సూదిదా.. కాదా.. అనే విషయాన్ని వైద్యులు ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. -
అన్నవరంలో సైకో సూదిగాడు కలకలం
అన్నవరం (జగ్గయ్యపేట): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైకో సూదిగాడు సోమవారం రాత్రి గ్రామానికి వచ్చాడంటూ వదంతులు రావడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 10 గంటల సమయంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక వ్యక్తి ద్విచక్రవాహనంపై గ్రామానికి వచ్చాడు. ప్రధాన సెంటర్లో కొందరికి అతడిపై అనుమానం రావడంతో వాహనాన్ని ఆపడానికి యత్నించడంతో ఆపకుండా వెళ్ళిపోయాడు. దీంతో గ్రామస్తులు అతడి వాహనాన్ని పట్టుకునేందుకు పరుగులు తీశారు. ఈ విషయాన్ని చిల్లకల్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యస్.ఐ షణ్ముఖసాయి సిబ్బందితో వచ్చి వెంబడించారు. చివరకు అతను బలుసుపాడు సమీపంలో అతన్ని పట్టుకుని వివరాలు అడుగగా తనది తెలంగాణ రాష్ట్రం అని, కాపుసారా అమ్ముకునేందుకు వచ్చానని చెప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. గ్రామ సమీపంలోని అనుమాననాస్పదంగా ఉన్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
వినేవాళ్లు ఉండాలేగానీ...
సోల్ / చాడీలు వదంతులను వ్యాప్తిలోకి తేవడంలానే చాడీలు చెప్పడం కూడా కొందరికి ఒక కాలక్షేపం. స్వప్రయోజనాల సాధన కోసం కొందరు చాడీలు చెబుతారు. ఇద్దరి మధ్య తగవు పెట్టడానికి ఇంకొందరు చాడీలు చెబుతారు. ఎదుటివారి అభివృద్ధినిఅడ్డుకోవడానికి మరికొందరు చాడీలు చెబుతారు. చెప్పేవారు సరే, ఏమైనా చెబుతారు, ఎన్నయినా చెబుతారు. ‘కుఛ్తో లోగ్ కహేంగే... లోగోంకా కామ్ హై కెహనా...’ వినేవాళ్లు లేకుంటే ఎంతటి చాడీకోర్లయినా ఏం చెప్పగలరు చెప్పండి? వినేవాళ్లకు వివేకం, ఇంగితజ్ఞానం లోపించినప్పుడే చాడీలు చెప్పేవాళ్లు చెలరేగిపోతారు. లోకంలో చాడీకోర్లు వర్ధిల్లుతున్నారంటే అది వాళ్ల తప్పు కాదు, వినేవాళ్లకు కామన్సెన్స్ లేకపోవడమే అందుకు అసలు కారణం. అసూయే మూలం సాటివారి పురోగతిపై అసూయ మితిమీరినప్పుడు, జీవితంలో వారిని అధిగమించే శక్తిసామర్థ్యాలు లోపించినప్పుడు వారిని ఇతరుల ద్వారానైనా సాధించాలనే ఉద్దేశంతో చాలామంది చాడీలు చెబుతారు. ఏమీ చేతగాని అసూయాపరులే చాడీలు చెప్పడాన్ని ఒక లలితకళలా సాధన చేస్తారు. మొహమాటానికో, ముఖస్తుతికో అలవాటుపడిన కొందరు అలాంటి చాడీలను వీనులవిందుగా వింటారు. నిజానికి చాడీల వల్ల చెప్పేవాళ్లకు, వినేవాళ్లకు పెద్దగా ప్రయోజనమేమీ ఉండదు. అదొక తాత్కాలిక మానసికానందం మాత్రమే. మానవులకు గల నానా అవలక్షణాల్లో చాడీలు చెప్పడం కూడా ఒకటని ప్రపంచంలోని అన్ని మతాలూ పరిగణిస్తున్నాయి. ఇతరులపై చాడీలు చెప్పడం అత్యంత నీచమైన అవలక్షణమని, ఇలాంటి అవలక్షణాన్ని విడనాడాలని బోధిస్తున్నాయి. అయితే, ఇలాంటి హితబోధలను పట్టించుకునేవారు ఎందరు? మతాలు మతాలే, మానవ స్వభావాలు మానవ స్వభావాలే! పురాణాల్లో చాడీకోర్లు చాడీలు చెప్పడమేమీ ఆధునిక కళ కాదు. పురాణకాలం నుంచే ఈ కళలో ఆరితేరిన వారు కొందరున్నారు. మన పురాణాల్లోని చాడీకోర్లలో ముఖ్యంగా నారదుడిని, మంథరను, శకునిని గుర్తు చేసుకోవచ్చు. బ్రహ్మమానస పుత్రుడైన నారద మహాముని నారాయణ నామస్మరణ చేసుకుంటూ, మహతిని మీటుకుంటూ త్రిలోక సంచారం చేసేవాడని ప్రతీతి. ముల్లోకాలూ తిరిగే నారద మహామునికి కలహభోజనుడనే పేరు కూడా ఉంది. ఎవరికైనా కయ్యం పెట్టనిదే ఆయనగారికి కడుపు నిండదు. బ్రహ్మదేవుడి ద్వారానో, బోళాశంకరుడి ద్వారానో వరాలు పొంది, బలగర్వంతో విర్రవీగే రాక్షసరాజుల వద్దకు వెళ్లి దేవతల మీద చాడీలు చెప్పి రెచ్చగొట్టేవాడు. బుద్ధితక్కువ రాక్షసరాజులు ఆ మాటలకు అనవసరంగా రెచ్చిపోయేవారు. దేవతలతో కయ్యానికి కాలు దువ్వేవారు. చివరకు ఏ మహావిష్ణువో, ఆదిపరాశక్తో వచ్చి, వాళ్లను సంహరించాక అక్కడికా కథ సుఖాంతమయ్యేది. విష్ణుభక్తుడైన నారద మహాముని ఏం చేసినా లోకకల్యాణానికేనని, ఆయన చెప్పే చాడీలు కూడా అందుకేనని పురాణాల సారాంశం. మంథర చాడీలు ఇక త్రేతాయుగంలో మంథర పేరుమోసిన చాడీకోరు. ఆమె చాడీల దెబ్బకు ఏకంగా రామాయణమే మలుపు తిరిగింది. ‘దశరథ మహారాజు రాముడికి పట్టం కట్టాలనుకుంటున్నాడు. అదే జరిగితే నీ కొడుకు భరతుడి గతేం కాను..?’ అంటూ కైకకు నూరిపోసి, దశరథుడు ఏనాడో ఆమెకు ఇచ్చిన వరాలను గుర్తుచేసి రెచ్చగొట్టింది. కైక ఆ వరాల కోసం దశరథుడిని సాధించింది. ఫలితంగా రాముడు సీతా లక్ష్మణ సమేతంగా అడవులకు వెళ్లాడు. పుత్ర వియోగంతో దశరథుడు పరలోకానికి పయనించాడు. చాడీకోరు శకుని మహాభారతంలో శకుని ఆరితేరిన చాడీకోరు. కౌరవుల పంచన చేరిన శకుని దుష్టచతుష్టయంలో పెద్దతలకాయ. పాండవులపై చాడీలు చెబుతూ ఎదిగీ ఎదగని వయసు నుంచే మేనల్లుడైన దుర్యోధనుడి బుర్ర పాడు చేసేవాడు. దుర్యోధనుడు చిన్నప్పటి నుంచే అలవిమాలిన అహంకారి. అహంకారికి కన్నూ మిన్నూ కానదు. అలాంటి స్థితిలో ఉన్నవాడికి విదుర, భీష్మాదులు చెప్పే హితవచనాల కంటే, శకుని మామ చెప్పే చాడీలే పసందుగా ఉండేవి. చాడీకోరు శకునిని ఆంతరంగిక బృందంలో పెట్టుకున్న దుర్యోధనుడు ఎలా దుంపనాశనమయ్యాడో మనందరికీ తెలిసిందే. ఇవీ అనర్థాలు చాడీలు చెప్పేవాళ్లందరూ నారద మహామునులు కాదు. అందువల్ల వాళ్లు చెప్పే చాడీల కారణంగా లోకకల్యాణం మాట దేవుడెరుగు గానీ, నానా అనర్థాలు జరగడం మాత్రం తథ్యం. చాడీల వలలో పడితే ప్రాణస్నేహితులు కూడా బద్ధశత్రువులుగా మారిపోతారు. భార్యాభర్తల్లో ఎవరు చాడీలు నమ్మినా ఇద్దరూ విడాకుల కోసం కోర్టు మెట్లెక్కడం ఖాయం. చాడీల మాయలో చిక్కుకుంటే, తల్లిదండ్రులకు పిల్లలకు నడుమ కూడా కీచులాటలు వస్తాయి. చాడీకోర్ల మాటలను బాసులు నమ్మితే, ఆఫీసుల్లోని అమాయక జీవులు ఉద్యోగాలను పోగొట్టుకుని వీధిన పడతారు. చాడీలు చెప్పేవాళ్లు చెబుతూనే ఉంటారు. వాళ్ల స్వభావాన్ని మార్చడం దుస్సాధ్యం. అయితే, వినేవాళ్లు కాస్త ఇంగితంతో వివేకాన్ని ప్రదర్శించి, ‘వినదగునెవ్వరు చెప్పిన...’ అనే సుమతీ శతకకారుని హితోక్తిని మననం చేసుకుని, సంయమనంతో వ్యవహరిస్తే చాడీల వల్ల తలెత్తే అనర్థాలను నివారించుకోవచ్చు. -
వదంతులు నయన సృష్టే
ఈ రోజుల్లో ఏ రంగంలో అయినా ప్రచారం అనేది చాలా అవసరం. ఇది గ్రహించిన చాలా మంది రకరకాల ప్రచారాలతో కుస్తీ పడుతుంటారు. ఇక సినిమా రంగంలో అయితే కొందరు తెలివిగా సెల్ఫ్ ప్రచారం చేసుకుంటుంటారు.సంచలన నటి నయనతార ఇలాంటి ప్రచారాన్నే ఆశిస్తున్నట్లున్నారు. ఒకప్పుడు కోలీవుడ్‌లో ప్రేమ వ్యవహారాల్లో కలకలర పుట్టించి ఈ భామ కొంత కాలం సెలైంట్‌గా ఉన్నారు. అది అనుభవాల గుణపాఠం ఏమో అనుకున్నారు సినీ వర్గాలు. నయనతార కూడా ఇకపై నా జీవితంలో ప్రేమకు తావు లేదు అంటూ స్టేట్మెంట్స్ ఇచ్చేశారు. చాలామంది నిజమేనేమో అని అనుకున్నారు.అలాంటిది ఇటీవల నయనతార గురించి ప్రేమ,పేళ్లి అంటూ సామాజిక మాధ్యమాల్లో పుకార్లు హోరెత్తాయి. యువ దర్శకుడు విఘ్నేష్‌శివన్, నయనతార పెళ్లి చేసుకున్నారనే ఆ ప్రచారాన్ని వారిద్దరూ ఖండించారు. అయితే ఉన్నట్లుండి ఆ వదంతుల్ని ఏవరు పుట్టించారన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన అంశం. అయితే ఇప్పుడామెకు టాలీవుడ్లో మంచి అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది. నయన మళ్లీతెలుగులో బిజీ కావాలని కోరుకుంటున్నట్లు సమాచారం. మళ్లి పెళ్లి వదంతులు ఈ అమ్మడి సృష్టే కావచ్చునని కోలీవుడ్‌లో ఒక వర్గం మాట. అందుకు వాళ్లు చెప్పే రీజన్ నయన టాలీవుడ్ కెళ్లపోతే కోలీవుడ్ తనను మరిచిపోతుందేమోనన్న ఆమె భయం కావచ్చు ,ఇలా వదంతులతో కొంత కాలం ఇక్కడి జనాల్లో ఉండవచ్చుననేది నయనతార ప్లాన్ కావచ్చునంటున్నారు. -
వదంతులతో బేజారు
మన్యంలో అనవసర అలజడులు అపరిచిత వ్యక్తుల సంచారంపై కలకలం దాడులకు పాల్పడుతున్న సంఘటనలు పుకార్లేనంటున్న పోలీసులు పాడేరు: విశాఖ మన్యంలోని గిరిజన గ్రామాల్లో దొంగల సంచారంపై వదంతులు వ్యాపిస్తున్నాయి. జి. మాడుగుల, చింతపల్లి, జీకేవీధి మండలాల్లోని గిరిజన గ్రామాల్లో దొంగల సంచారిస్తున్నారనే వదంతులపై ఇటీవల ప్రచారం ఎక్కువైంది. 15 రోజులుగా మన్యంలో ఇవే పుకార్లు. ఈ నేపథ్యంలో గిరి జన గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు కనిపిస్తే అనుమానాలు రెట్టింపవుతున్నాయి. జి.మాడుగుల మండలం కోరాపల్లి పంచాయతీ కుమ్మరిపుట్టులో గత వారం ఇదే అనుమానంతో గ్రామస్తులు ఓ మహిళపై దాడి చేసి హతమార్చిన ఘటన చోటు చేసుకుంది. రావికమతం మండలంలోని గిరిజన ప్రాంతమైన కల్యాణపులోవలో కొంతమంది మంగళవారం ఒక మహిళ అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో దాడి చేసి కొత్తకోట పోలీసులకు అప్పగించారు. పిల్లలను ఎత్తుకెళ్ళేందుకే దొంగలు సంచరిస్తున్నారనే అనుమానాలు గిరిజనుల్లో ఎక్కువైంది. వదంతుల నేపథ్యంలో అనుకోని విధంగా రోజుకొక సంఘటన మన్యంలో జరుగుతోంది. కార్లలో ఎవరైనా పర్యాటకులు వచ్చినా సరే కలకలం రేగుతోంది. ఇవి వదంతులేనని పోలీసు అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో చోరీలు గానీ, దొంగలు పిల్లలను ఎత్తుకెళ్ళిపోవడం వంటి ఘటనలు జరగలేదంటున్నారు. ఏ పోలీసు స్టేషన్లో కూడా ఎటువంటి కేసులు నమోదు కాలేదని ఉదహరిస్తున్నారు. వదంతులను పుట్టిస్తున్నారని, వీటిని ప్రజలు నమ్మకూడదని, అనుమానితులు, అపరిచిత వ్యక్తులు గ్రామాల్లోకి వచ్చినట్లైతే వెంటనే ఆయా మండలాల పోలీసులకు సమాచారం అందించాలని స్థానిక సీఐ ఎన్.సాయి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతుచిక్కని గిరిజనుడి హత్య...: జి.మాడుగుల మండలం మారుమూల ప్రాంతమైన పినకిల్తారి గ్రామంలో వంజరి పోతురాజు (45) అనే అవివాహితుడైన ఒక గిరిజనుడు గత ఆదివారం రాత్రి హత్యకు గురయ్యాడు. సామాన్య గిరిజనుడైన వంజరి పోతురాజును తల, మొండెం వేరు చేసి కిరాతకంగా హత్య చేశారు. తల భాగాన్ని పట్టుకుపోయారు. 4 రోజులైనా పోతురాజు హత్యకు గల కారణాలు అంతుచిక్కడం లేదు. హత్యకు గురైన పోతురాజు తలభాగం ఆచూకీ కూడా పోలీసులకు లభించ లేదు. ఈ సంఘటన గిరిజనుల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. -
ఆ వార్తల్లో నిజం లేదు
చెన్నై: నటి ప్రియాఆనంద్‌ను తాను ప్రేమిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని నటుడు గౌతం కార్తిక్ తెలిపారు. గౌతం కార్తిక్, ప్రియాఆనంద్ ప్రేమించుకుంటున్నట్లు కోలీవుడ్ సమాచారం. దీని గురించి గౌతం కార్తిక్ మాట్లాడుతూ ప్రియా ఆనంద్ తనకు స్నేహితురాలు మాత్రమే, అయితే తాము ప్రేమించుకుంటున్నట్లు వార్తలు వెలువడుతున్నాయన్నాడు. 'సిపాయి' చిత్రంలో తనతో నటిస్తున్న లక్ష్మీమీనన్‌తో లవ్ ఎఫైర్ ఉన్నట్లు వదంతులు వ్యాపించాయని, గతంలో 'కడల్' చిత్రంలో నటిస్తుండగా తులసిని ప్రేమిస్తున్నట్లు గుసగుసలు వినిపించాయన్నాడు. అయితే ఆ గాలి వార్తలన్నిటినీ తాను స్పోర్టివ్‌గానే తీసుకుంటున్నానని, తదుపరి రిలీజ్ కానున్న చిత్రాలపైనే దృష్టి సారిస్తున్నట్లు చెప్పాడు. ఈ ఏడాది తాను నటించిన నాలుగు చిత్రాలు రిలీజ్ కానున్నాయని. అందువల్ల ఈ ఏడాది ముఖ్యమైన సంవత్సరంగా భావిస్తున్నట్లు గౌతం కార్తిక్ తెలిపాడు. -
లవ్... బ్రేక్!
బాలీవుడ్ హాటెస్ట్ టాక్ సూపర్‌స్టార్స్ రణబీర్ కపూర్, కత్రినా కైఫ్‌ల డేటింగ్. చాలా కాలంగా ఇంటా బయటా చక్కర్లు కొడుతున్న వీరి ప్రేమకు బ్రేక్ పడేలా ఉంది. నిన్నమొన్నటి దాకా ఇరు వైపు పెద్దలు ఓకే చెప్పేసుకున్నారని, పెళ్లికి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసిందనే వార్తలు గుప్పుమంటున్న సమయంలో రణబీర్ తల్లి నీతూ అందరికీ షాకిచ్చింది. కత్రినాతో రణబీర్ పెళ్లి తనకు ఇష్టం లేదనేది బీ-టౌన్ టాక్. దానికి తోడు నీతూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పిక్చర్ అప్లోడ్ చేసింది. అంతా కిలకిలమంటూ బానే ఉన్నారు గానీ... అందులో ఉన్న కత్రినాను కట్ చేసింది. అయితే రణబీర్ సిస్టర్ రిథిమా సాహ్ని మాత్రం... ఇద్దరూ బయటకు వచ్చి రూమర్లకు తెర దించాలంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. -
మేము కాదు!
జయలలితకు శిక్ష ప్రకటనపై కర్ణాటకకు సంబంధం లేదన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పరప్పన అగ్రహార ఎదుట జయలలిత మద్దతుదారుల నిరసన తమిళనాడుకు కేఎస్ఆర్టీసీ బస్సు సర్వీసుల నిలిపివేత సాక్షి, బెంగళూరు : అన్నా డీఎంకే అధినేత్రి జయలలితకు శిక్ష పడటానికి కర్ణాటక ఏమాత్రం కారణం కాదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కర్ణాటకలో కేసు విచారణ జరిగినందువల్లే జయలలితకు శిక్ష పడిందంటూ తమిళనాడులో కొన్ని వదంతులు వ్యాపిస్తున్నాయంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు సిద్ధరామయ్య ఈ విధంగా సమాధానమిచ్చారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా పాటిస్తుందని, ఇందులో ఎవరి ప్రమేయం ఉండబోదని అన్నారు. అసత్య వదంతులను నమ్మి శాంతికి భంగం కలిగించే ప్రయత్నాలు చేయడం ఎవరికీ మంచిది కాదని సూచించారు. రాష్ట్ర యువజన, క్రీడాశాఖ ఆధ్వర్యంలో ఆదివారమిక్కడి విధానసౌధ ఎదుట నిర్వహించిన యువచేతన బైక్ ర్యాలీని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. న్యాయస్థానంలో జరిగిన విచారణలో జయలలిత దోషి అని తేలిందని, ఇందులో కర్ణాటక ప్రమేయం ఎంతమాత్రం లేదని అన్నారు. అనవసరంగా కర్ణాటకనుగానీ, ఇక్కడి ప్రభుత్వాన్ని గానీ ఈ విషయానికి సంబంధించి బాధ్యులను చేస్తూ అమాయకులైన ప్రజలను రెచ్చగొట్టడం సమంజసం కాదని హితవు పలికారు. పరప్పన ఎదుట ఆందోళన.... ఇక పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో ఉన్న తమ నాయకురాలు జయలలితను కలిసేందుకు ఆదివారం తమిళనాడు రాష్ట్ర మంత్రులతో పాటు వందల సంఖ్యలో మద్దతుదారులు, అన్నా డీఎంకే కార్యకర్తలు వచ్చారు. అయితే వీరిని జైలులోపలికి అనుమతించేందుకు పోలీసులు నిరాకరించడంతో అక్కడ కాసేపు వాతావరణం ఉద్రిక్తంగా మారింది. తమ ‘అమ్మ’ లేకుండా తమిళనాడు రాష్ట్రం అనాధ అయిపోయిందంటూ పరప్పన అగ్రహార వద్దకు చేరుకున్న మహిళలు గుండెలు బాదుకుంటూ రోదించారు. దీంతో పరప్పన అగ్రహార జైలు వద్దకు చేరుకున్న సీనియర్ పోలీసు అధికారులు జయలలిత మద్దతుదారులందరినీ అక్కడినుండి పంపివేసి భద్రతా చర్యలను పర్యవేక్షించారు. కేఎస్ఆర్టీసీ బస్‌ల నిలిపివేత.... ఇక అన్నాడీఎంకే అధినేత్రికి జైలు శిక్ష పడిన నేపథ్యంలో కర్ణాటక నుంచి తమిళనాడుకు వెళ్లే అన్ని బస్ సర్వీసులను కేఎస్ఆర్టీసీ నిలిపివేసింది. జయలలితకు శిక్షను ఖరారుచేస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించిన నేపథ్యంలో తమిళనాడులో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో కేఎస్ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. తమిళనాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేఎస్ఆర్టీసీ బస్‌లకు ఏదైనా హాని కలగవచ్చనే అనుమానంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేఎస్ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఆదివారం రాత్రి తొమ్మిది గంటల తరువాత బస్ సర్వీసులను పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. -
చందుపట్లలో వెండి నాణేలు లభ్యం
- చివరి నిజాం కాలం నాటి నాణేలుగా గుర్తింపు - బంగారు నాణేలూ లభించాయని పుకార్లు - నాణేల సేకరణకు రంగలోకి దిగిన అధికారులు భువనగిరి: భువనగిరి మండలం చందుపట్ల గ్రామంలో వెండి నాణేలు బుధవారం బయటపడ్డాయి. అవి నిజాం ఉల్ ముల్క్ ఆసఫ్జా బహద్దూర్ 7వ రాజు మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ కాలానికి సంబంధించిన నాణేలుగా భావిస్తున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సంబరాలు జరుగుతున్న రోజున యాదృచ్ఛికంగా నిజాం చివరి నవాబు కాలానికి చెందిన నాణేలు లభించడం విశేషం. వివరాలు.. గ్రామానికి చెందిన గొర్రెల కాపరి మాయ స్వామి తన పాత ఇంటిని రెండు సంవత్సరాల క్రితం కుర్మ సంఘానికి విక్రయించాడు.యాదగిరిగుట్ట మండలం మూటకొండూరులో కాపురం ఉంటున్నాడు. కాగా స్వామి వద్ద ఇంటిని కొనుగోలు చేసిన సంఘం ప్రతిని ధులు పాత భవనాన్ని 15 రోజుల క్రితం జేసీబీతో కూల్చివేశారు. ఇల్లు కూలగొట్టిన చోట చిన్న పిల్లలు ఆడుకుంటుండగా ఒక బాలుడికి కొన్ని నాణేలు దొరికాయి. వాటిని జేబులో వేసుకుని వెళ్తుండగా చూసిన గ్రామానికి చెం దిన రాములు అనే వ్యక్తి పిల్లవాడిని పిలిచి అడగడంతో అతను సమాధానం చెప్పకుండా పరు గు తీశాడు. దీంతో అనుమానం వచ్చి ఆరా తీశాడు.ఈలోగా ఈ నోటా ఆనో టా ఊరంతా పాకింది. కొన్ని నాణేలను పరిశీలించి చూడగా వెండి నాణేలు అని తేలడంతో వెంటనే ఎవరికి వారే మంగళవారం రాత్రి నుంచి ఆ స్థలంలో మట్టిని తొలగిస్తూ నాణేల కోసం వెతకడం ప్రారంభించారు. కొం దరికి నాణేలు లభించాయి. అయితే ఇల్లు కూల్చిన సమయం లో తొలగిం చిన గోడల మట్టిలో కూడా నాణేలు ఉండవచ్చునని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రెండు రోజులుగా ఎవరికి వారే మట్టిని తవ్వి నాణేలు తీసుకుపోయారని తెలుస్తోంది. అయితే ఇందు లో బంగారం, వెండి నాణాలు లభించి ఉండవచ్చునన్న అనుమానం వ్యక్తమౌతోంది. కాగా విషయం తెలియగానే రెవెన్యూ,పోలీస్ అధికారులు గ్రామాన్ని సందర్శించి నాణాలను అప్పగించాలని గ్రామస్తులను కోరారు. దీంతో రాత్రి వరకు 21 వెండినాణేలను చిన్న పిల్లల తెచ్చి అధికారులకు అప్పగించారు. మరో మూడు నాణేలు గ్రామానికి చెందిన మ రో వ్యక్తి వద్ద ఉన్నాయని అధికారులకు సమాచారం అం దింది. అతను ప్రస్తుతం యాదగిరిగుట్టకు కుటుంబసమేతంగా వెళ్లిన ట్లు గ్రామస్తులు తెలిపారు. శిథిలాల్లో పెద్దఎత్తున బంగా రం, వెండినాణేలు బయటపడ్డాయనిప్రచారం జరుగుతోంది. ఇవి నిజాం చివరి రాజు కాలానికి చెందనవి చందుపట్ల గ్రామంలో బయటపడిన నాణేలు నిజాం ఉల్ ముల్క్అసఫ్జాహి బహుద్దూర్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నిజాం కాలానికి చెందినవిగా గుర్తించారు. ఒక్కో తులం బరువుకలిగిన ఒక్కో నాణెంపై ఎక్రుపియా(హోలిసి క్కా) అని ఉర్దులో ఉంది. నాణేం మధ్యన ఉన్న చార్మినార్ చిహ్నంలో గల ఐన్ అనే ఉర్దు అక్ష రం అలాగే 7వ నిజాం పరిపాలన కాలం 37 సంవత్సరాల కాలం(18.09,1911 నుంచి 17.09.1948)లో ముద్రించిన నాణేలు ఇవి. నాణేలపై ఉన్న కాలం ఇస్లామిక్ క్యాలెండర్ 1342 సంవత్సరంలో ముద్రించారు. ఆ ప్రకారం ప్రస్తుతం నడుస్తున్న కాలం 1435 సంవత్సరం. దీని ప్రకారం నాణేలు క్రీస్తు శకం 1921 సంవత్సరంలో ముద్రించబడ్డాయి. అధికారులకు నాణేలు అందించిన గ్రామస్తులు నాణేలు బయటపడ్డ విషయం తెలియగానే తహసీల్దార్ వెంకట్‌రెడ్డి, ఎస్ఐ భిక్షపతి తమ సిబ్బందితో కలిసి సాయంత్రం గ్రామాన్ని సందర్శించారు. నాణేలు దొరికిన వారు ప్రభుత్వానికి ఆప్పగించాలని కోరడంతో 21 నాణేలను పలువురు అప్పగించారు. నాణేలు అప్పగించిన వారి వివరాలు ఇప్పటి వరకు 21 గా గుర్తించారు. మొదటగా పూసల రాములు 3, చిన్న నర్సయ్య 1, పన్నీరు గంగయ్య 1, నిలిగొండ మనోజ్ 2, దంతూరి రాజయ్య 2, జూపెల్లి మత్సగిరి 4, సుబ్బురు స్పందన 2, సుబ్బురు శ్రీశైలం 2, దంతూరి లక్ష్మీ వద్ద 4 నాణేలను సేకరించినట్లు గ్రామానికి చెందిన నిలిగొండ బాల్‌రాజు వద్ద 3 నాణేలు రవాల్సి ఉన్నట్లు గ్రామ వీఆర్వో భద్రయ్య తెలిపారు. -
ఆ వార్తలు నిజం కాదు
కోహ్లితో పెళ్లి విషయాన్ని ఖండించిన అనుష్క ముంబై: భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లితో త్వరలో తన వివాహం జరగనుందన్న వార్తల్ని బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఖండించారు. ఆ వార్తలు వాస్తవం కాదని పేర్కొంటూ అనుష్క తరపు ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు. ‘అనుష్క శర్మ పెళ్లి చేసుకోబోతోందంటూ పలు పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ, అందులో ఏమాత్రం నిజంలేదు. అవి పూర్తిగా నిరాధారమైన వార్తలు’ అని ప్రకటనలో పేర్కొన్నారు. -
వదంతుల కలకలం
జాగరణ చేసిన జనం భయంతో వీధుల్లోకి వచ్చిన ప్రజలు సాక్షి నెట్వర్క్ : జిల్లాలో వదంతులు కలకలం సృష్టించాయి. అప్పుడే పుట్టిన శిశువు మాట్లాడిందని... దీంతో అనర్ధం జరుగుతుందని... పిల్లలను పడుకోనివ్వవద్దని... లేకుంటే భూకంపం వస్తుందనే ప్రచారం దావనలంలా వ్యాపించింది. సెల్‌ఫోన్ సౌకర్యంతో ఒక మండలం నుంచి మరో మండలానికి, ఒక గ్రామం నుంచి మరో గ్రామం, తండాలకు.. ఇలా జిల్లావ్యాప్తంగా పుకార్లు షికారు చేశాయి. దీంతో బుధవారం అర్ధరాత్రి ప్రజలు కంటిమీద కునుకులేకుండా తెల్లవార్లూ జాగరణ చేశారు. భయంతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. డోర్నకల్‌లో మహిళలు బొడ్రాయి వద్దకు చేరి తెల్లవారే వరకు కోలాటం ఆడారు. మెయిన్రోడ్లో అర్ధరాత్రి హోటళ్లు, పాన్‌షాప్‌లు తెరుచుకున్నాయి. కురవి మండల కేంద్రంలోని గుడి పరిసర ప్రాంతాల్లో శిశువు పుట్టిందని ప్రచారం జరగడంతో తులిస్యా, లింగ్యా, లచ్చిరాం, రేకులతండా, రాంచంద్రాపురంలల్లో జనం బజార్లకు వచ్చి గుమిగూడారు. చెంచులు డప్పులతో ఊరేగింపుగా వస్తుంటే కురవి ఎస్సై భీమేష్ వారిని చెల్లాచెదురు చేశారు. గుడిలో మైక్ వేసిన అనంతరం కల్లాపు చల్లారు. మరిపెడ, నర్సింహులపేట, మహబూబాబాద్, గూడూరు, కేసముద్రం, కొత్తగూడ, ఏటూరునాగారం, వెంకటాపురం, మంగపేట, కమలాపురం, గోవిందరావుపేట, నల్లబెల్లి, నర్సంపేట, రఘునాథపల్లి, రాయపర్తి, ఆత్మకూరు, సంగెం, ములుగు, హసన్‌పర్తి, వర్ధన్నపేట తదితర మండలాలతోపాటు నగరంలోనూ వదంతులు వ్యాపించడంతో ప్రజలు భయంభయంగా గడిపారు. మూఢనమ్మకాలను విశ్వసించొద్దు పాప పుట్టగానే మాట్లాడుతుందని, గేదెకు ఓ మూడు తలల ఆడ శిశువు జన్మించిందని, ఇద్దరు కవలలు పుట్టారని... వీరు పుట్టగానే రాత్రి వేళ పడుకుంటే భూకంపం వచ్చి చనిపోతారని హెచ్చరించినట్లు వస్తున్నవన్నీ మూఢనమ్మకాలే. వీటిని ఎవరూ నమ్మొద్దు. కరీంనగర్ జిల్లాలో ఒకప్పుడు ఓ స్త్రీ రేపురా అని ఇంటి గోడలపై రాసేవారు. గత ఏడాది హన్మకొండ నగరంలోని వడ్డేపల్లి ప్రాంతంలో ఏడు అడుగుల వ్యక్తి తిరుగుతున్నాడంటూ పుకారు రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇవన్నీ వట్టి పుకార్లే అని తర్వాత తేలింది. ఈ తరహా ప్రచారాలకు ఇప్పటివరకు శాస్త్రీయ అధారాలు లభించలేదు. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా ఉండే ఇలాంటి వందతులను నమ్మెద్దు. సమాజంలో ఉన్న కొందరు స్వార్థపూరిత శక్తులు ఇలాంటి వదంతులను ప్రచారంలోకి తెస్తాయి. ప్రజలు వీటిని నమ్మి ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దు. గేదె కడుపున మానవ శిశువు జన్మించినట్లు ఎక్కడైనా జరిగితే మాకు చెప్పండి. మేము నిజనిర్ధారణ కమిటీ వేసి నిజాలేమిటో తేలుస్తాం. -డాక్టర్ బి.జగదీశ్‌బాబు, జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు -
భూకంపం పుకార్ల్లతో నిద్రపోని జిల్లావాసులు
మంగళవారం రాత్రి 12 గంటలు...జిల్లా వాసుల ఫోన్లు అదే పనిగా రింగయ్యాయి. ఫోన్ తీసిన వారికి చెమటలు పట్టాయి. అవతలి వ్యక్తి హలో.. అన్నా.. భూకంపం వస్తుందంట ఇంట్లోనుంచి బయటకు వెళ్లండని హెచ్చరించడంతో ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తి కుటుంబీకులతో సహా బయటకు పరుగు తీశాడు. ఇలాగే జిల్లాలోని పలు ప్రాంతాల్లోని వారికి భూకంపం వస్తోందంటూ ఫోన్లో సమాచారం అందడంతో మెతుకుసీమ మంగళవారం జాగారం చేసింది. అయితే భూపంకం వార్తలన్నీ పుకార్లేనని తేలడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. - భూకంపం పుకార్లతో బెంబేలెత్తిన ప్రజలు - సర్వే కోసం స్వగ్రామాలకు వస్తే నిద్ర లేని రాత్రి! - వదంతులేనని తేలడంతో ఊపిరి పీల్చుకున్న జనం పుకార్లు.. షికార్లు మిరుదొడ్డి: మండల పరిధిలోని గ్రామాల్లో భూకంపం వస్తున్నట్లు బుధవారం తెల్లవారు జామున పుకార్లు షికార్లు చేశాయి. భూకంపం వస్తోంది.. అందరూ ఇళ్ల నుంచి బయటకు రావాలంటూ మిత్రులు, సన్నిహితులు, కుటుంబ సభ్యుల నుంచి ఫోన్లు రావడంతో జనం భయకంపితులై రోడ్లపైకి వచ్చి చేరా రు. వివిధ గ్రామాల్లో నివసిస్తున్న తమ బంధువుల యోగక్షేమాలను తెలుసుకునేందుకు ఫోన్లు చేశారు. ఇళ్లల్లో పడుకోవద్దని పిల్లాజెల్లాతో సహా ఆరు బయట ఖాళీ ప్రదేశాల్లోనే పడుకోవాలని సూచించారు. సమయం మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట .. ఫోన్ రింగ్.. అవుతోంది.. పది సెకన్ల తర్వాత లిఫ్ట్ చేశాడు శ్రీనివాస్.. అవతలి వ్యక్తి హలో.. అన్నా.. పడుకున్నారే.. నిద్రవట్టిందా.. హా.. ఇప్పుడిప్పుడే కన్నంటుకుందిరా.. ఏం గీ టైంల ఫోన్ జేశినవ్.. ఏం లేదే మన పక్క మండలంల భూకంపమొచ్చిందట.. నాకు ఇప్పుడే ఫోనొచ్చిందే.. తెల్వంగనే అందర్నీ బయటకు తీసుకొచ్చి ఎందుకైనా మంచిదని నీకు గూడ జెప్తున్న..! అలో.. లచ్చక్కా.. నిద్రవోయినారె.. ఏడ శెల్లే.. భూకంపం ఒత్తందని ఈడంత లొల్లిలొల్లి అయితందే.. అయ్యో అక్కా గీ ముచ్చట మీకు ఎర్కైందో లేదోనని భయమై పోన్ జేశిననే.. ఇవీ.. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం ఉదయం వరకూ జిల్లాలో షికార్లు చేసిన పుకార్లు.. ఎవరు సృష్టించారో.. ఎక్కడ మొదలైందో తెలియదు కానీ భూకంపం వదంతులు ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేశాయి. పిల్లాజెల్లాతో కలిసి వాకిళ్లలోనే పడుకున్నారు. చివరకు ఇవన్నీ ఉత్తి మాటలేనని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. కొండపాక మండలంలోనూ... కొండపాక: భూకంపం వస్తుందని కొండపాక మండలంలోని కొన్ని గ్రామా ల్లో బుధవారం తెల్లవారుజామున జోరుగా పుకార్లు లేచాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఇళ్ల నుండి బయటికి వచ్చారు. తీరా ఇవన్నీ వదంతులేనని తెలుసుకొని ఊపిరిపీల్చుకున్నారు. మండలంలోని లకుడారం, మెధినీపూర్, తిమ్మారెడ్డిపల్లి గ్రామాల్లో తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఎవరో ఆయా గ్రామాల్లోని ఒకరిద్దరికి ఫోన్‌చేసి భూకంపం రాబోతోందని, ఇళ్లలో ఉండొద్దని చెప్పడంతో ప్రజలు ఇళ్ల నుండి బయటికి వచ్చి కూర్చున్నారు. ఇవన్నీ పుకార్లేనని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. తెల్లవార్లూ ఆరుబయటే నారాయణఖేడ్ రూరల్: భూకంపం వస్తుందన్న పుకార్లు షికార్లు చేయడంతో జనాలు తెల్లవార్లూ జాగారం చేయాల్సివచ్చింది. బుధవారం తెల్లవారు జాము 2 గంటల ప్రాంతంలో భూకంపం వస్తుందన్న ఫోన్లు రావడం, పుకార్లు వ్యాపించడంతో నారాయణఖేడ్ మండలంలోని అన్ని గ్రామాల్లోనూ జనాలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఫలానా గ్రామంలో భూకంపం ప్రారంభం అయ్యిందంటూ పుకార్లు రావడంతో తమ బంధువులను అప్రమత్తం చేశారు. వెంకటాపూర్, జూకల్, సత్తెగామ, సంజీవర్‌రావుపేట్, నిజాంపేట్, ర్యాలమడుగు, రుద్రార్, పంచగామ, పైడిపల్లి, ర్యాకల్, అబ్బెంద, చాప్టా(కె) తదితర గ్రామాల్లో జనాలు తెల్లవార్లూ ఆరుబయటే నిద్రించారు. ఇళ్లకు తాళాలు వేసి ఆరుబయట, మందిరాలవద్ద సేదతీరారు. సెల్‌ఫోన్ వాడకం పెరగడం వల్ల ఒకరికొకరు ఫోన్లు చేసుకోవడంతో పుకార్లు త్వరితగతిన అన్ని గ్రామాలకూ వ్యాప్తి చెందాయి. దావానలంలా వ్యాపించిన వదంతులు దుబ్బాక: భూమి కంపిస్తోందన్న పుకార్లతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. బుధవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో వదంతులు రావడంతో ఒక్కసారిగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. దూర ప్రాంతంలో ఉన్న బంధువులు, మిత్రులు ఫోన్ల ద్వారా ఒకరికొకరు సమాచారం చేరవేసుకోవడంతో నియోజకవర్గమంతా ఈ వార్త దావానలంలా వ్యాపించింది. కంటి మీద కునుకు లేకుండా రామాయంపేట: భూకంపం వస్తుందనే భయంతో మంగళవారం రాత్రి ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడిపారు. భూకంపం వస్తుందని నిజామాబాద్ జిల్లా నుంచి తమకు సమాచారం అందిందని, దీనితో తాము నిద్రలేకుండా ఇళ్లముందు పడిగాపులు కాశామని మండలంలోని అక్కన్నపేట, కాట్రియాల, కోనాపూర్, నిజాంపేట, నస్కల్ గ్రామాల ప్రజలు తెలిపారు. ఇలా మండలంలోని చాలా గ్రామాలకు పుకార్లు వ్యాపించడంతో ప్రజలు హడలెత్తిపోయారు. భూకంపం వస్తుందని ఎవరో కావాలనే పుకార్లు పుట్టించారని కొందరు చెప్పారు. ఒకటాయె.. రొండాయె.. ఆఖరికి తెల్లారె! పుల్కల్: భూ కంపం వచ్చేస్తోంది.. ఇళ్లు కూలిపోతాయంట.. అందరూ బయటకు వచ్చేయండి.. అంటూ ఫోన్లు.. దీంతో ప్రజలంతా ఆందోళనకు గురయ్యారు. పన్నెండు గంటలకు ఫోన్లు రావడంతో లేచి కూర్చున్న ప్రజలు రాత్రంతా జాగారం చేశారు. ఒకటాయె.. రొండాయె.. ఆఖరికి తెల్లారె.. భూకంపం లేదు.. ఏం లేదు. ఇవన్నీ పుకార్లేనని తేలడంతో ప్రజలు హమ్మయ్యా.. అనుకున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దౌల్తాబాద్: భూకంపం వస్తోందంటూ వదంతులు లేవడంతో జనాలు ఆరుబయటకు వచ్చి జాగారణ చేసిన సంఘటన మంగళవారం రాత్రి దౌల్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో చోటుచేసుకుంది. అర్ధరాత్రి సుమారు 12 గంట ల సమయంలో హైదరాబాద్, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో ఉన్న బంధువులు దొమ్మా ట, గాజులపల్లి, సూరంపల్లి, వడ్డెపల్లి, రామా రం, దౌల్తాబాద్, రాంసాగర్, అనాజీపూర్వాసులకు భూకంపం వస్తోందంటూ ఫోన్లు రావడంతో హడలెత్తిపోయారు. తెల్లారే వరకూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. రాకరాక ఇంటికొస్తె గిదేం గోస! రేగోడ్: మండలంలో మంగ ళవారం సమగ్ర కుటుంబ సర్వే పూర్తి చేసుకుని అధికారులు, ప్రజలు రాత్రి నిద్రపోయారు. అర్ధరాత్రి భూకంపం వస్తుందని ఇక్కడి ప్రజలకు బంధువులు, స్నేహితులు ఫోన్లు చేశారు. ఆ ఒక్క ఫోన్‌కాల్‌తో జనమంతా రాత్రంతా జాగరణ చేశారు. సర్వే వివరాలు తెలిపేందుకు ఆయా పట్టణాల నుంచి గ్రామాలకు వచ్చిన ప్రజలు రాత్రి నిద్రలేక ఇబ్బందులు పడ్డారు. రాకరాక సొంతిళ్లకు చేరుకున్న వారు రాత్రంతా నిద్ర లేక భయంభయంగా గడిపారు. కుక్కిన పేనుల్లా.. బిక్కుబిక్కుమంటూ! నర్సాపూర్: మంగళవారం రాత్రి నర్సాపూర్ తో పాటు మండలంలోని తుజాల్పూర్ తది తర గ్రామాల్లో భూకంపం వస్తోందంటూ పుకార్లు రావడంతో గాఢనిద్రలో ఉన్న ప్రజ లు లేచి కుక్కిన పేనుల్లా బిక్కుబిక్కుమంటూ గడిపారు. తుజాల్‌పూర్‌కు చెందిన ఒకరికి తమ బంధువులు ఫోన్ చేసి తమ ప్రాంతం లో భూకంపం వస్తోందని చెప్పి జాగ్రత్తగా ఉండాలనడంతో కలకలం రేగింది. ఈ వార్తలు గాలి కన్నా వేగంగా వ్యాపించి నియోజకవర్గ ప్రజలకు నిద్ర లేకుండా చేశాయి. ఆరుబయటే జాగారం కల్హేర్: మండలంలో భూకంపం వదంతులు వ్యాపించాయి. మంగళవారం అర్ధరాత్రి భూకంపం వస్తుందని పుకార్లు షికారు చేశాయి. కల్హేర్, మాసాన్‌పల్లి, మార్డి, నాగధర్ తదితర చోట్ల భూకంపం వస్తుందని వదంతులు వచ్చాయి. బుధవారం తెల్లవారుజాము వరకు పుకార్లు కొనసాగాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పిల్లాపాపలతో కలిసి బయటే జాగారం చేశారు. కొందరు ఇంటి బయటే నిద్రించారు. ప్రజల్లో భయాందోళన నారాయణఖేడ్, పెద్దశంకరంపేట: భూకంపం పుకార్లతో నారాయణఖేడ్ పట్టణం, పెద్దశంకరంపేట మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. మంగళవారం అర్ధరాత్రి నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భూమి కంపిస్తోందంటూ స్థానికులకు ఫోన్లు వచ్చాయి. దీంతో నారాయణఖేడ్ పట్టణంలోని కొందరు ఫోన్లు, టీవీ చానళ్లు చూసి భూకంపం వస్తుందా లేదా అని ఆరా తీశారు. పెద్దశంకరంపేట మండలంలోని బూర్గుపల్లి, చీలపల్లి, కోళపల్లి, కె.వెంకటాపూర్, తదితర గ్రామాల ప్రజలు ఇళ్ల నుంచి ఆరుబయటకు వచ్చి పడిగాపులు కాశారు. ఉదయం వరకు భూమి ఎప్పుడు కంపిస్తుందో ఏమోనని ఆందోళన చెంది ఇంటి బయటే గడిపారు. కుక్కిన పేనుల్లా.. బిక్కుబిక్కుమంటూ! నర్సాపూర్: మంగళవారం రాత్రి నర్సాపూర్‌తో పాటు మండలంలోని తుజాల్పూర్ తదితర గ్రామాల్లో భూకంపం వస్తోందంటూ పుకార్లు రావడంతో గాఢ నిద్రలో ఉన్న ప్రజలు లేచి కుక్కిన పేనుల్లా బిక్కుబిక్కుమంటూ గడిపారు. తుజాల్పూర్ గ్రామానికి చెందిన ఒకరికి తమ బంధువులు ఫోన్ చేసి తమ ప్రాంతంలో భూకంపం వస్తోందని చెప్పి జాగ్రత్తగా ఉండాలనడంతో కలకలం రేగింది. ఈ వార్తలు గాలి కన్నా వేగంగా వ్యాపించి నియోజకవర్గ ప్రజలకు నిద్ర లేకుండా చేశాయి. -
రామ్ చరణ్ కొత్త సినిమాపై వదంతులు
రామ్ చరణ్ కొత్త చిత్రం 'గోవిందుడు అందరివాడేలే' నిర్మాణం పూర్తి కాలేదు. షూటింగ్ జరుగుతూనే ఉంది. అప్పుడే ఈ సినిమా ఫ్లాప్ అంటూ వదంతులు వ్యాపించాయి. విడుదలకు చాలా సమయం ఉన్నది. అయినా రామ్ చరణ్ ఈ తాజా సినిమా ప్రాజెక్ట్‌కు అప్పుడే ఫ్లాప్ టాక్ వెంటాడుతోంది. మేకింగ్ స్టిల్స్ గురించి ఎవరు నోరు విప్పినా, ఫిల్మ్ నగర్ గాసిప్స్ విన్నా సరే నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఆ సినిమాకు సంబంధించి చాలా విషయాలే బయటకు వచ్చాయి. నిర్మాత బండ్ల గణేష్, దర్శకుడు కృష్ణ వంశీలతో హీరో రామ్ చరణ్‌కు అస్సలు పొసగడం లేదని సమాచారం. కథను మళ్ళీ మార్చాలంటూ చరణ్ డిమాండ్ చేస్తున్నాడని ఫిల్మినగర్ వర్గాల టాక్. మల్టీస్టారర్‌గా మరో నటుడిని తీసుకోవాలని చరణ్ కోరుతున్నట్లు చెబుతున్నారు. ఇలా సినిమా యూనిట్‌పై ఒత్తిడి పెరుగుతోందని చరణ్‌పై విమర్శలు జోరుగా వినవస్తున్నాయి. అంతేగాక ఆ టార్చర్‌కు తట్టుకోలేక కృష్ణవంశీ అపోలో ఆసుపత్రిలో చేరినట్లు కూడా ప్రచారం నడిచింది. హీరో విక్టరీ వెంకటేష్ తాజా వ్యాఖ్యలు కూడా అందుకు అనుగుణంగానే ఉన్నాయని సినీ విమర్శకులు అంటున్నారు. మల్టీస్టారర్ సినిమాలపట్ల ఆసక్తి చూపే తన వద్దకి చాలా కథలు వస్తున్నాయని, కానీ ఏవీ తనకి నచ్చడం లేదని వెంకటేష్ చెప్పారు. గోవిందుడు అందరివాడేలే కథతో కృష్ణవంశీ తన వద్దకు వచ్చిన విషయాన్ని కూడా వెంకీ ప్రస్తావించాడు. అంటే, కథ నచ్చకే తానూ తప్పుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. రామ్‌చరణ్ తేజ సినీరంగ ప్రవేశం చేసి ఏడేళ్లు పూర్తి అయింది. ఇప్పటి వరకు ఆయన ఏడు సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. వాటిలో మగధీర, రచ్చ, నాయక్, ఎవడు చిత్రాలు మంచి హిట్ సాధించాయి. ఇన్ని సినిమాలు విజయం సాధించడం తండ్రి చిరంజీవి అభిమానుల వల్లే అనేది అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా తండ్రిలా మాస్ పల్స్ ప్రకారం నడవడం వల్లే ఈ క్రెడిట్ సాధించినట్లు భావిస్తున్నారు. విడుదలకు ముందే 'గోవిందుడు అందరివాడేలే' చిత్రంపై ఫ్లాప్ అంటూ ప్రచారం జరుగుతుందంటే ఎవరో కావాలని చేస్తున్నట్లు అర్ధమవుతోంది. ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ - చరణ్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ మూవీపై అభిమానులకు చాలా ఆశలు ఉన్నాయి. దర్శకుడు కృష్ణ వంశీ సామాన్యుడు కాదు. కథ, కథనంలో కొత్తదనం చూపించగల దిట్ట. వీరి కలయికలో వస్తున్న చిత్రం చూడకుండా ఇలా పుకార్లు వ్యాపించడం ఏమిటి? ఇందులో చరణ్ ఇంతకు ముందు నటించిన పాత్రలకు భిన్నంగా కొత్త గెటప్‌లో కనిపిస్తున్నాడు. ఇప్పటి వరకు షూటు, బూటులో కనిపించిన చరణ్ పల్లెటూరి చిన్నవాడి గెటప్‌లో కనిపించడం కొందరికి నచ్చకపోవచ్చు. అంతమాత్రాన ఇలా ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తే ఎలా? కుటుంబ సంబంధాలు, సంప్రదాయాల నేపథ్యంలో వినోదాత్మకంగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ప్రధాన పాత్రలలో శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ, తమిళ నటుడు రాజ్‌కిరణ్ నటిస్తున్నారు. - సూర్యభరత్ -
వదంతులకు భయపడే....
నిప్పు లేనిదే పొగ రాదన్నది సామెత. అయితే మన హీరోయిన్లు మాత్రం నిప్పు లేకుండానే పొగ పెడుతున్నారని వాపోతుంటారు. వీరిలో రెండు రకాల హీరోయిన్లను చూస్తుంటాం. కొందరు వదంతులను ఎంజాయ్ చేస్తున్నాం అంటుంటారు. మరికొందరు ఆవేదన కలిగిస్తున్నాయంటుంటారు. మూడవ రకం కూడా ఉన్నారు. తమపై తామే వదంతులు ప్రచారం చేసుకుంటూ ఉంటారు. మరి ఈ మూడు రకాల నాయికల్లో నటి ప్రియా ఆనంద్ ఏ రకానికి చెందుతారో గానీ వదంతులు వణికిస్తున్నాయంటున్నారు. పస్తుతం కోలీవుడ్‌లో ఈ బ్యూటీ పేరు బాగానే ప్రచారంలో ఉంది. చేతి నిండా చిత్రాలు కూడా ఉన్నాయి. ఎదిర్ నీచ్చల్ చిత్రంలో శివకార్తికేయన్‌తో రొమాన్స్ చేసిన ఈ భామ గాలి వీచేలా చేసింది. ఈ అమ్మడి గురించి పలు గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అవన్నీ అసత్యాలంటున్న ప్రియా ఆనంద్ తన వెర్షన్‌ను చెప్పుకొస్తూ ఇలాంటి అనవసరపు పుకార్లు పుట్టుకొస్తాయనే స్నేహితుల పుట్టిన రోజు పార్టీలకు కూడా దూరంగా ఉంటున్నానన్నారు. ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో తాను ఆశించిన స్థాయి లభించిందన్నారు. అరిమా నంబి, ఒరు ఊరుల రెండు రాజ, వై రాజా వై, ఇరుంబు కుదిరై చిత్రాల్లో నటిస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రాలన్నింటిలోనూ వైవిధ్యభరిత పాత్రలను పోషిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం నాయికలు నేపథ్య గాయనీమణులుగా మారుతున్న సీజన్ తనలోను గాయనికి కావలసిన అర్హతలున్నాయన్నారు. వాటిని సంప్రదాయబద్ధంగా నేర్చుకున్నానని చెబుతూ పాటలు పాడాలనే తన ఆసక్తిని చెప్పకనే చెప్పారు. ఇకపోతే తన గురించి పుకార్లు పరుగులు తీస్తున్నాయని అలాంటి వాటిని జాలీగానే తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. నిజం చెప్పాలంటే తానెవరితోను పోటీలకు వెళ్లనన్నారు. కారణం ఇలాంటి వదంతుల ప్రచారం అవుతాయనేనన్నారు. సినిమా కార్యక్రమాలకు సంబంధించిన పార్టీలకు కూడా వెళ్లనని అయినా తనపై వదంతులు ప్రచారం అవడం వింతగా ఉందని ప్రియా ఆనంద్ చెప్పుకుంటున్నారు. -
ఆ రూమర్ నన్ను ఇబ్బంది పెట్టింది : విశాల్
వాణిజ్య చిత్రాలతో పాటు ప్రయోగాలకు ప్రాధాన్యమిచ్చే విశాల్ ఇటీవలే ‘ఇంద్రుడు’గా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చారు. హైదరాబాద్ వచ్చిన విశాల్‌తో ‘సాక్షి’ జరిపిన సంభాషణ. ఉన్నట్లుండి ఇలా ప్రయోగాల బాట పట్టారేం? ఇప్పుడు చేయపోతే... ఇంకెప్పుడు చేయలేం. అసలు ఇలాంటి పాత్రలు చేసే సామర్థ్యం నాకుందా? అనే మీమాంసలో ఉండేవాణ్ణి మొదట్లో. ‘వాడు-వీడు’ చిత్రంతో ప్రయోగాలు చేయొచ్చని అర్థమైంది. ఏళ్ల తరబడి ప్రేక్షకుల హృదయాల్లో ఉండాలంటే ఇలాంటి పాత్రలే కరెక్ట్. వాణిజ్యపరంగా చూసుకుంటే ఇది రిస్కే. అందుకని రొటీన్‌గా వెళ్లమంటే నా వల్ల కాదు. ‘ఇంద్రుడు’లో నార్కొలస్పీ డిజార్డర్‌తో బాధపడే పాత్ర చేశారు కదా. దీనికోసం ఏమైనా హోమ్‌వర్క్ చేశారా? సాధారణంగా పోరాటాలు, నృత్యాల సమయంలో కష్టం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం ఆ పడిపోయే సన్నివేశాలే కష్టంగా అనిపించాయి. నిల్చున్నవాణ్ణి నిల్చున్నట్లే పడిపోవాలి. చేతుల్ని నేలకు బేలన్స్ చేయకూడదు. దాంతో భారీగా దెబ్బలు తగిలేవి. వాటన్నింటినీ భరిస్తూ చేశాను. హీరో అంటే.. ‘విలన్లను ఒంటిచేత్తో కొట్టేయాలి’ అనేది చాలామంది అభిప్రాయం. కానీ... ఇందులో కంటి ముందు హీరోయిన్ని కొట్టి చంపుతుంటే.. నిద్రపోతాను. ఈ కథ విని కొంతమంది శ్రేయోభిలాషులు వద్దని వారించారు. కానీ నాకు మాత్రం ఈ కథ బాగా నచ్చింది. మీరు తెలుగబ్బాయి. కానీ... తమిళ సినిమాకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. కారణం? నేను పుట్టింది, పెరిగిందీ చెన్నయ్‌లో. సహాయ దర్శకునిగా కెరీర్ మొదలుపెట్టిందీ అక్కడే. అందుకే.. ఆ పరిశ్రమపై మక్కువ ఎక్కువ. ఒకవేళ ఇక్కడే పుడితే ఇలా జరిగేది కాదేమో. నేను తెలుగువాణ్ణి కాబట్టే.. మాతృభాషలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని మా నాన్నగారు తపించారు. అందుకే ఇక్కడా విజయాలు అందుకోగలిగా. త్వరలో తెలుగులో ఓ సినిమా చేయబోతున్నాను. అందులోనూ నా పాత్ర భిన్నంగానే ఉంటుంది. శ్రీనువైట్ల సహాయకుడు శశికాంత్‌ని ఈ సినిమా ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నాను. ‘శివ’ను గుర్తుచేసేలా ఉంటుందీ సినిమా. అక్టోబర్‌లో మొదలుపెడతాం. అన్ని భాషా చిత్రాలూ చూస్తుంటారు కదా. కథల విషయంలో ఎవరు ముందున్నారంటారు? వందశాతం తమిళ సినిమానే. బాలీవుడ్ అంతా ఇప్పుడు మన సౌత్ సినిమాలపైనే ఆధారపడింది. ఇక తెలుగు సినిమా మాత్రం హీరోల ఇమేజ్‌లు, భారీ తనానికే ప్రాధాన్యత ఇస్తోంది. కానీ... తమిళంలో అలా కాదు. కథకే అక్కడ తొలి ప్రాముఖ్యత. ఇటీవల మీపై కూడా రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. వాటిని వింటుంటే ఏమనిపిస్తుంది? పట్టించుకోను. అయితే.. ఈ మధ్య ఓ రూమర్ మాత్రం కాస్త ఇబ్బంది పెట్టింది. శ్రీయతో కలిసి నేను హిమాలయాలకు వెళ్లానట. ఆ రాసిన వారికి ఫోన్ చేశాను. నేను వెళ్లినట్లు మీకెలా తెలుసు? సాక్ష్యాలేమైనా ఉన్నాయా? హిమాలయాలంటే నాకిష్టం... వెళ్తాను. శ్రీయతో వెళ్లాల్సిన పనేంటి? అని అడిగేశాను. మా నాన్న అయితే.. నాపై ఇలాంటి రూమర్లు పేపర్లో రాగానే వాటిని కట్ చేసి దాచుకుంటారు. ఎందుకంటే మా అబ్బాయి పేరు న్యూస్ పేపర్లో వచ్చిందని ఆయన ఆనందం. ఇంతకూ మీ పెళ్లెప్పుడు? నేను పెళ్లికి రెడీ అవ్వలేదు. పెళ్లంటే ఒక పనిగా చేసుకోకూడదు. ఈ టైమ్‌కి బడికెళ్లాలి, ఈ టైమ్‌కి జాబ్ చేసుకోవాలి, ఈ టైమ్‌కి పెళ్లాడాలి అనే పద్ధతికి నేను పూర్తి విరుద్ధం. ఇంకా రెండేళ్ల వరకూ పెళ్లి ప్రస్తావనే రానీయను. -
ఏలూరు కోటలో తోట పాగా
-
మైనారిటీలకు దూరాం
-
తెలుగు తమ్ముళ్లు
-
ఆనంకు ఎదురుగాలి
-
చతుర్ముఖ పోటీ
-
ఒంటరిగా ఉన్నందుకే...
పుకార్లపై అర్జున్‌కపూర్ న్యూఢిల్లీ: సహతారలతో సంబంధాల ఆరోపణలతో వర్ధమాన నటుడు అర్జున్ కపూర్ కు తలబొప్పి కడుతోంది. పరిశ్రమలో పనిచేస్తున్నప్పటికీ ఇప్పటికీ ఒంటరిగా ఉన్నందువల్లనే ఇటువంటి పుకార్లు షికార్లు చేస్తున్నాయని వాపోయాడు. ఇందుకు తాను అనవసరంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందన్నాడు. ఇప్పటివరకూ నాలుగు సినిమాల్లో నటించిన అర్జున్‌కపూర్‌కు... అలియాభట్, పరిణతి చోప్రాలతో సంబంధముందనే పుకార్లు బాలీవుడ్లో షికార్లు చేస్తున్నాయి. వారిరువురి విషయమై అర్జున్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వారితో తెరపైనా, తెరవెనుకా తనకు కెమిస్ట్రీ బాగా కుదురుతుందన్నాడు. వారితో ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నాడు. ‘మేమంతా పరస్పరం ఎంతో సౌకర్యవంతంగా ఉంటాం. గొప్ప స్నేహితులం. అందువల్లనే తెరపైకూడా మామధ్య కెమిస్ట్రీ బాగా కుదురుతుంది. ‘2 స్టేట్స్’ సినిమాకి ముందే పరిణతితో నాకు పరిచయం ఉంది. అటువంటి పుకార్లను నేను పట్టించుకోను. అటువంటివి నన్ను ఎంతమాత్రం బాధ పెట్టవు. నటుడిగా కొనసాగుతూ ఒంటరిగా ఉంటే ఇటువంటివన్నీ సహజమే. కాగా అర్జున్ కపూర్... అలియాతో కలిసి ‘2 స్టేట్స్’లో, ‘గుండే’ సినిమాలో పరిణతిచోప్రాతో కలిసి నటించాడు. ‘గుండే’ సినిమాతోనే అర్జున్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఇదిలాఉంచితే ప్రాక్టర్ అండ్ గాంబ్లర్ సంస్థ మానసిక వికలాంగులైన చిన్నారుల కోసం నిర్వహిస్తున్న ‘శిక్ష’ అనే విద్యా కార్యక్రమానికి అర్జున్ తనవంతు సహకారం అందిస్తున్నాడు. -
జడ్చర్ల జంగ్
-
ఉప్పు...నిప్పు..
-
పినపాకలో పాగా..
-
కుక్క కాటుకు..
-
వద్దు పిన్నమ్మా...
-
చేతులు కాలాక...
-
టూర్ ప్లాప్
-
చతుర్ముఖ పోటీ
-
రివర్స్ గేమ్..
-
ధర్మం వధ
-
అటు...ఇటు జీరో...
-
వంచన
-
క్రాస్ ఓటింగ్
-
మంత్రాలకు చింతకాయలు
-
రెబల్ గుబుల్
-
రూమర్ : గుండెలో గోలయ్య
-
వెనుకడుగు....
-
కావ్రేడ్స్ వార్
-
సైలెంట్ యవ్వారం...
-
పొత్తులు...జిత్తులు
-
పోరు (పెద్ద) పల్లి
-
ఇంకెన్ని మారతారు?
-
కమలంకు షాక్...
-
టార్గెట్ కిషన్
-
నో సపోర్ట్
-
అధ్యక్షా...అన్యాయం..!
-
హస్తానికి షాక్
-
షాక్ తిన్న శంకరన్న
-
నా రూటే సెపరేటు
-
టీఆర్ఎస్ ఎన్నికల టెన్నన్
-
కాంగ్రెస్ వీరులు
-
దేవరకొండల పై రగడ
-
బిజెపి,టిడిపిలో ముసలం
-
టికెట్లు రాలేదని ఆక్రోశం
-
బాలసాని టికెట్ కట్
-
అంబర్ పేట్ కుర్రాడు
-
టికెట్ల చిచ్చు
-
గిరిపై ఎవరు?
-
సీటు గోవిందా....
-
అక్కడా...ఇక్కడా
-
లూజింగ్ బ్రదర్స్
-
కరివేపాకు
-
’బై’ సమైక్యాంధ్ర
-
సిర్ఫ్ హమారా!
-
ముంచుతారా?
-
దగా బాబు!