
కరుణాస్
తమిళసినిమా: ఫేస్‌బుక్‌లో నటుడు అజిత్‌పై హాస్యనటుడు అసత్యప్రచారం చేసినట్లు ప్రచారం సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. దీంతో చిత్రపరిశ్ర మలో కలకలం చెలరేగింది. అజిత్ అబిమానులు కరుణాస్ చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ వ్యవహారం గురించి నటుడు కరుణాస్ బుధవారం నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నటుడు అజిత్‌తో తనకు స్నేహ సంబంధాలున్నాయన్నారు.
కాగా తన పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌లో అజిత్ గురించి అసత్యప్రచారం జరగిందని, ఇది ఎవరో కావాలనే చేసిన దుశ్చర్య అని వ్యాఖ్యానించారు. నిజానికి తనకు ఫేస్‌బుక్‌ను వాడడంలో అంత ఆసక్తి లేదన్నారు. దాని గురించి పూర్తిగా అవగాహన కూడా లేదన్నారు. గత జనవరిలో ఒక దర్శకుడొకరు వత్తిడి చేయడంతో ఫేస్‌బుక్ అకౌంట్ పారంభించానని వివరించారు. ఆ తరువాత దాన్ని వాడనే లేదని అన్నారు. అలాంటిది తన పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ను ఓపెన్ చేసి అసత్య ప్రచారానికి పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా ఫిర్యాదులో కోరినట్లు కరుణాస్ తెలిపారు.