
కైకాల సత్యనారాయణ (ఫైల్ ఫోటో)
ఇటీవల సోషల్ మీడియాలో కొంత మంది చూపిస్తున్న అత్యుత్సాహం సెలబ్రిటీలకు ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. ఏదైన వార్త వచ్చిన సందర‍్భంలో పూర్తిగా అవగాహన లేకుండా.. జరిగిన సంఘటన గురించి పూర్తిగా తెలుసుకోకుండా సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెట్టడం వెంటనే అవి వైరల్ అవ్వటం జరిగిపోతున్నాయి. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది.
సోమవారం సీనియర్ నటుడు వంకాయల సత్యనారాయణ మూర్తి అనారోగ్యంతో మృతిచెందారు. ఈయన మరణ వార్త మీడియాలో రావటంతో కొందరు వంకాయల సత్యనారాయణ మూర్తికి బదులుగా కైకాల సత్యనారాయణ మరణించినట్టుగా సోషల్ మీడియలో సంతాప సందేశాలను పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌లను మరికొందరు షేర్ చేయటంతో ఈ వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో కైకాల సత్యనారాయణగారు క్షేమంగా ఉన్నారంటూ మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment