Kaikala Satyanarayana
-
కైకాల సత్యనారాయణ విగ్రహానికి భూమి పూజ చేసిన కొడాలి నాని
-
కైకాల సత్యనారాయణ రేర్ పిక్స్
-
అశ్రునయనాలతో తుది వీడ్కోలు
రాయదుర్గం(హైదరాబాద్): అశ్రునయనాల మధ్య సినీనటుడు కైకాల సత్యనారాయణకు కుటుంబసభ్యులు, అభిమానులు తుదివీడ్కోలు పలికారు. ఆయన పార్థివదేహానికి రాయదుర్గంలోని మహాప్రస్థానంలో శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు పూలతో అలంకరించిన ప్రత్యేక వాహనంలో పోలీసు బందోబస్తు, లాంఛనాలతో ఆయన పార్థివదేహాన్ని మహాప్రస్థానానికి తీసుకొచ్చారు. సత్యనారాయణ చితికి ఆయన పెద్ద కుమారుడు రామారావు నిప్పు అంటించారు. అంత్యక్రియలకు బంధువులు, కుటుంబసభ్యులు, సినీ, రాజకీయ నాయకులు భారీగా తరలివచ్చారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జూబ్లీహిల్స్‌లోని కైకాల నివాసానికి వెళ్లి పార్థివదేహం వద్ద నివాళి అర్పించారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశం మేరకు కైకాల అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరిగాయి. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనాన్ని సమర్పించి గాలిలోకి మూడుసార్లు తుపాకులతో కాల్పులు జరిపారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు బాలశౌరి వల్లభనేని, టీటీడీ సభ్యుడు దాసరి కిరణ్, ప్రజాగాయకుడు గద్దర్, సినీనిర్మాత అల్లు అరవింద్‌తోపాటు పలువురు రాజకీయనాయకులు, సినీ ప్రముఖులు, కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు. కైకాల కళాక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తాం... వైకుంఠ మహాప్రస్థానంలో కైకాల పార్థివదేహానికి నివాళి అర్పించిన అనంతరం మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాలు అనే తేడా లేకుండా అన్ని సినిమాల్లో దాదాపు ఆరు దశాబ్దాలపాటు నటించి ప్రేక్షకులను మెప్పించారని కొనియాడారు. ‘గుడివాడలో ఉన్న కైకాల కళాక్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేసి చిరస్థాయిగా నిలిపే విధంగా కృషి చేస్తాను. ఆయన స్వగ్రామం కౌతవరంలో ఆయన పేరు మీద ఒక కమ్యూనిటీ హాలు నిర్మించటానికి సాయం చేస్తాను. గుడివాడలో కైకాల సత్యనారాయణ కళాక్షేత్రం అని ఉంది. ఆ కళాక్షేత్రాన్ని మరింతగా డెవలప్ చేసి ఆయన పేరును చిరస్థాయిగా నిలిపేవిధంగా ఒక పార్లమెంట్ సభ్యునిగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను’అన్నారు. -
మహా ప్రస్థానంలో ముగిసిన కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు (ఫొటోలు)
-
కౌతవరం ముద్దుబిడ్డ కైకాల
సాక్షి, విజయవాడ పశ్చిమ(కృష్ణా జిల్లా): కౌతవరం ముద్దుబిడ్డ కైకాల సత్యనారాయణ మృతితో ఆయన అభిమానులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. కృష్ణాతీరం నుంచి నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తరహాలో కళారంగాన్ని సుసంపన్నం చేసిన మరో ఆణిముత్యం కైకాల సత్యనారాయణ. కళాకారులు ఎవరికీ దక్కని ‘నవరస నటనా సార్వభౌమ’ బిరుదు కైకాల సొంతం. బెజవాడలో ఆయన మిత్రులు చాలా మంది ఉండేవారు. వారందరితో చక్కని సంబంధాలను కొనసాగించేవారు. సిద్ధార్థ అకాడమీలో ఆయన సభ్యు నిగా ఉన్నారు. ప్రతి ఏటా ఆయన సిఫారసు మేరకు సీట్ల కేటాయింపు కూడా జరిగేది. మచిలీపట్నం పార్లమెంట్ సభ్యునిగా ఉన్న సమయంలో బెజవాడ నుంచే ఆయన చురుకుగా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. 2017లో మహానటి సావిత్రి కళా పీఠం ఆయనకు విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఆత్మీయ సత్కారం చేసి గౌరవించింది. కళాక్షేత్రంలోనే నటుడు ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహం ఆవిష్కరణకు మెగాస్టార్ చిరంజీవితో పాటుగా సత్యనారాయణ కూడా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆ సభలో చిరంజీవి సత్యనారాయణకు స్వర్ణ కంకణాన్ని తొడిగి ఆయనపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. కనకదుర్గమ్మ చరిత్రపై సినిమాను చిత్రీకరించిన సమయంలోనూ విజయవాడలో ఆయన చాలా రోజులు ఇక్కడే ఉండి స్థానిక మిత్రులతో గడిపారు. ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైనప్పటికీ సరైన గుర్తింపు రాలేదనే బాధ ఆయనలో ఉండేది. టీడీపీ తనకు కేంద్ర స్థాయిలో అవార్డు రాకుండా అడ్డుకున్న విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో కూడా వ్యక్తం చేశారని ఆయన అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. కైకాలకు నివాళులు కైకాల మరణ వార్త తెలియగానే నగరంలోని పలు సంస్థలు ఆయనకు నివాళులర్పించాయి. నగరంలోని కౌతా కళావేదిక ప్రాంగణంలో మహానటి సావిత్రి కళాపీఠం ఆధ్వర్యంలో కైకాల సత్యనారాయణను స్మరిస్తూ నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కళాపీఠం అధ్యక్షురాలు పరుచూరి విజయలక్ష్మీ, సభ్యులు బాలాజీ కుమార్, దాసరి రమణ, పైడిపాటి వెంకన్న నివాళులర్పించారు. కైకాల మహానటుడు : జాతీయ కాపు సమాఖ్య కైకాల సత్యనారాయణ మహానటుడు అని జాతీయ కాపు సమాఖ్య జాతీయ అధ్యక్షుడు నరహరశెట్టి శ్రీహరి అన్నారు. కైకాల అన్ని రకాల పాత్రల్లో గొప్ప నటనను కనబరచి యావత్ ప్రేక్షక లోకాన్ని ఉర్రూతలూగించారని కొనియాడారు. ఆయన మరణం కళారంగానికి తీరని లోటని అన్నారు. బందరు ఎంపీగా సేవలందించిన కైకాల మచిలీపట్నంటౌన్: సినీ నటుడు కైకాల సత్యనారాయణ బందరు ఎంపీగా రెండేళ్ల పాటు సేవలు అందించారు. 1996లో మధ్యంతర ఎన్నికలు రావటంతో టీడీపీ ఎంపీ అభ్యరి్థగా పోటీ చేసి దాదాపు 70 వేలకు పైగా ఓట్ల మెజారీ్టతో కైకాల గెలుపొందారు. దాదాపు రెండేళ్ల పాటు ఆయన ఎంపీగా పనిచేశారు. ఎంపీగా ఉన్న సమయంలో మచిలీపట్నం విచ్చేసి కార్యకర్తలతో సమాలోచనలు చేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. ఎంపీ నిధులతో పలు గ్రామాల్లో కమ్యూనిటీ హాళ్లు, బస్షెల్టర్లు వంటివి నిర్మించేందుకు కృషి చేశారు. మచిలీపట్నం వచ్చిన సమయంలో ఆర్అండ్బీ అతిథి గృహంలో బస చేసి ప్రజలకు అందుబాటులో ఉండేవారు. ఆ తరువాత సమీపంలోని ఆయన స్వగ్రామం కవుతరం వెళ్లేవారు. కైకాల సత్యనారాయణ మృతితో టీడీపీ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయం వద్ద మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, బీసీ సంఘ నాయకుడు కొనకళ్ల బుల్లయ్య తదితరులు నివాళులరి్పంచారు. -
ప్రభుత్వ లాంఛనాలతో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు
-
కైకాల మృతి.. స్వగ్రామంలో విషాదఛాయలు.. కంటతడి పెట్టిన స్నేహితులు
గుడ్లవల్లేరు: ప్రముఖ సినీనటుడు కైకాల సత్యనారాయణ మరణవార్తతో ఆయన స్వగ్రామం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో విషాదఛాయలు అలముకున్నాయి. కైకాలతో అనుబంధాన్ని గుర్తుచేసుకుని ఆయన స్నేహితులు, గ్రామస్తులు విచారం వ్యక్తంచేశారు. ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుని కంటతడి పెట్టారు. సినీనటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా తరచూ తాను పుట్టి, పెరిగిన ఊరికి వచ్చేవారని, అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ సందడి చేసేవారని చిన్ననాటి స్నేహితులు కానూరి పూల రామకృష్ణారావు, బాడిగ ఫణిభూషణరావు, కానూరి రాజేంద్రప్రసాద్‌లు చెప్పారు. కౌతవరంలో తన తాత కంభంమెట్టు రామయ్య పేరిట ప్రభుత్వ ప్రసూతి కేంద్రం ఏర్పాటుకు కృషిచేశారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో సుమారు రూ.40లక్షల ప్రభుత్వ నిధులతో కొత్త ఆస్పత్రిని నిర్మించేలా చూశారు. కౌతవరం–చేవెండ్ర రోడ్డు నిర్మాణం కూడా ఆయన వల్లే సాధ్యమైందని గ్రామస్తులు తెలిపారు. -
కైకాల నివాసం నుండి ప్రారంభమైన అంతిమ యాత్ర
-
ఆ విషయం అన్నయ్యకు కూడా తెలుసు..కానీ ఏం చేయలేం: కైకాల తమ్ముడు
మేం మొత్తం ఐదుగురం. అన్నయ్య సత్యనారాయణ తర్వాత ముగ్గురు అమ్మాయిలు, తర్వాత నేను. 1958లోనే అన్నయ్య సినిమా ఇండస్ట్రీకి వెళ్లారు. ఒక ఏడాదిన్నర కష్టాలు పడ్డారు. అన్నయ్య మద్రాస్ (ఇప్పుడు చెన్నై) వెళ్లిన నాలుగేళ్లకు మా నాన్నగారు చనిపోయారు. దాంతో ఇంటి బాధ్యత అన్నయ్య తీసుకున్నారు. అప్పటికి మా ఇద్దరి అక్కల పెళ్లి అయింది. మా మూడో అక్క పెళ్లి అన్నయ్యే చేశారు. నన్ను మద్రాస్ తీసుకెళ్లి, చదివించారు. ఆ తర్వాత నిర్మాతని కూడా చేసి, మంచి భవిష్యత్తుని ఇచ్చారు. ఒక ఇంటి యజమానిగా అందరి బాగోగులను చూసుకున్నారు. మాకు మంచి అన్నయ్య దొరికారు. తోడబుట్టినవాళ్లకు, జీవిత భాగస్వామికి, కన్న పిల్లలకు సౌకర్యవంతమైన జీవితం ఇచ్చారు. నేను హైదరాబాద్‌లోనే ఉంటాను. ప్రతి ఆదివారం అన్నయ్య ఇంటికి వెళ్లడం అలవాటు. మమ్మల్ని చూసి, ఆనందపడేవారు. ఆరోగ్యం పాడయ్యాక తాను సఫర్ అవుతున్నానని అన్నయ్యకు తెలుసు. అన్నయ్య అనారోగ్యంతో బాధపడుతుంటే ఏం చేయలేని నిస్సహాయ స్థితి మాది. ఎందుకంటే ఆపరేషన్ చేయించుకునే వయసు కాదు ఆయనది. అన్నయ్య మాకు దూరం కావడం అనేది భరించలేని విషయం. అయితే ఆయన బాధకు ముక్తి లభించింది. ఓ ఇంటి యజమానిగా చిన్నవాళ్ల బాగోగులు చూసుకుని, చక్కగా సెటిల్ చేసి, పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించి, వెళ్లిపోయారాయన. అన్నయ్య లేని లోటు మాకు ఎప్పటికీ ఉంటుంది. – కైకాల సత్యనారాయణ తమ్ముడు, నిర్మాత నాగేశ్వరరావు -
Kaikala Satyanarayana: కైకాల.. లక్ష నక్షత్రాల నటుడు
నటుడు తెలిసిపోయాక నటన తెలియడమే బాకీ ఉంటుంది. అదే ముఖం... ప్రతి పాత్రా పోషించాలి. అదే రూపం... ప్రతి వేషం పండించాలి. అదే మాట... ప్రతి రసం చిందించాలి. అదే బాట... ప్రతి అడుగు కొత్తగా పడుతుండాలి. తెర మీద నవ రసాలు పోషించడానికి ఐదు దశాబ్దాల పాటు బహురపిగా వరిన అసామాన్య ప్రతిభా సంపన్నుడు కైకాల. తన అభినయంతో, వాచకంతో, కర్కశత్వంతో, కనికరంతో ప్రేక్షకులను భయపెట్టాడు. బాధ పెట్టాడు. నవ్వించాడు. ఏడ్పించాడు. అంతిమంగా తెలుగువారి ఇంటి మనిషిగా మారిపోయాడు. హీరోలు సూపర్ స్టార్లే. కాదనం. కాని ప్రేక్షకుల నుంచి అత్యధిక స్టార్లు పొందినవాడు కైకాల. నిజంగా అతడు లక్ష నక్షత్రాల నటుడు. యముడు తెలుగువాడు. అతడు అచ్చు మన కైకాల సత్యనారాయణలాగా ఉంటాడు. కన్ఫర్మ్. ఎలానో తర్వాత తెలుసుకుందాం. ∙∙ గిరాకీ సందర్భాలు, గీటురాయి సందర్భాల్లోనే మనమంటే ఏంటో తెలుస్తుంది. 1976. ఒకేసారి ఇండస్ట్రీలో రెండు పెద్ద సినిమాలు. ‘దాన వీర శర కర్ణ’. ‘కురుక్షేత్రం’. ఒక సినిమా ఎన్టీఆర్‌ది. ఒక సినిమా కృష్ణది. హోరాహోరి పోటాపోటీ. ఇటు మేకప్ అటు అంటకూడదని పంతం. ఇటు కాస్ట్యూమ్ అటు కనపడకడదని ఆదేశం. ఈ సెట్ మీద నుంచి ఆ సెట్ మీదకు వాలలేక కాకులన్నీ కకావికలం అయిపోయాయి. అలాంటి సందర్భంలో కైకాల సత్యనారాయణ మాత్రం తాపీగా ఉన్నాడు. రెండు సినిమాల్లోనూ ఉన్నాడు. ‘అదెలా బ్రదర్. ఆ సినిమా వదలుకోండి’ అన్నాడు ఎన్టీఆర్. ‘వాళ్లు ముందు అడ్వాన్స్ ఇచ్చారు సార్’ అన్నాడు కైకాల. ఎన్టీఆర్ ఆలోచనలో పడ్డాడు. ‘దాన వీర శర కర్ణ’లో భీముడి వేషం– కైకాలే వేయాలి. ‘తప్పదా బ్రదర్?’ ‘తప్పదు సార్’ మరుసటి రోజు ఇండస్ట్రీలో న్యూసు. రెండు సినిమాల్లోనూ నటించడానికి కైకాలకు ఎన్టీఆర్ స్పెషల్ పర్మీషన్ ఇచ్చాడట. ఏమిటతని గొప్ప? ఎస్వీఆర్కు దీటుగా కైకాల.. ‘అరివీర భయంకరుడగు కురురాజునకు ప్రతిజోడు భీమబలుడగు భీమసేనుడు. ఉభయులూ గదా యుద్ధ ప్రదర్శన గావింప మేము ఆదేశించుచున్నాము’ ‘దానవీరశూర కర్ణ’లో ద్రోణాచార్యుడైన రాజనాల ఆదేశం అందగానే గదతో బరిలో దూకిన సింహం– సుయాధనుడు ఎన్టీఆర్. గదా యుద్ధం మొదలైంది. షాట్లో గదతో కొడుతున్నట్టు అభినయిస్తే చాలు. కాని ఎన్టీఆర్‌కు ఆవేశం వస్తే నిజమైన బలమే చూపిస్తాడు. అందుకే గదను శక్తి కొద్ది విసురుతున్నాడు. బలం కొద్ది బాదుతున్నాడు. మరొకడైతే వేషం వదిలి పారిపోయేవాడే. కాని ఎదుర్కొంటున్నది కైకాల. పులిలా కదులుతున్నాడు. గదకు గద.. బలానికి బలం.. జబ్బకు జబ్బ. ఉద్విగ్నమైన ఆ భీమ సుయోధనుల పోరాటం కౌరవ సభకే కాదు ప్రేక్షకులకు కూడా వణుకు పుట్టించింది. కరతాళధ్వనులు. ఒకప్పుడు ఆకారంలో ఆహార్యంలో ఎన్టీఆర్‌ను నిలువరించగలిగినవాడు ఎస్వీఆర్. ఇప్పుడు? కైకాల. ఎన్టీఆర్ కైకాలను ఎందుకు వదలుకోలేకపోయాడో ఇండస్ట్రీకి ఆధారంతో సహా అర్థమైంది. కైకాల నటుడుగా మరో మెట్టు ఎదిగాడు. మెస్ టికెట్లకు కూడా డబ్బులివ్వలేదు ఎన్టీఆర్, ఏ.ఎన్.ఆర్. ఒక గొప్ప కేరెక్టర్ ఆర్టిస్ట్ ఆ జిల్లాలోనే పుట్టాడు. ఎస్వీ రంగారావు. ఆ గాలి సోకకుండా ఉండటం కష్టం. గుడివాడకు దాపున కౌతారంలో పుట్టిన సత్యనారాయణ స్కూల్, కాలేజీ రోజుల్లోనే నాటకాలు వేసేవాడు. అందంగా ఉండేవాడు. బుగ్గలు తగు వత్రం ఉండటం చేత హావభావాలు పలికేవి. ఎన్టీఆర్‌కు తమ్ముడిలా ఉన్నావని పోలిక ఒకటి. డిగ్రీ అయిపోయాక కుటుంబానికి ఉన్న కలపడిపో నడుపుకుంట కూచుంటే జీవితం వెళ్లమారిపోతుంది. కాని నటన అనే పురుగు కుట్టింది. అది రైలెక్కు... రైలెక్కు అని చెవిలో రొద కూడా పెట్టసాగింది. రైలెక్కించింది. 1956– తన 21వ ఏట మద్రాసుకు చేరుకున్నాడు సత్యనారాయణ. పెద్ద నగరం. తెలియని భాష. తెలియనట్టు ఉన్న తెలుగువారు. ప్రోత్సహించినవారు తోడు రాలేదు. మెస్ టికెట్లకు డబ్బులివ్వలేదు. వేషాలూ ఇప్పించలేదు. అవన్నీ తానే సమకూర్చుకోవాలి అని అర్థమయ్యాక ఉక్కిరి బిక్కిరిగా అనిపింంది సత్యనారాయణకు. కొన్ని దెబ్బలు కుంగదీశాయి. కొన్ని చరుపులు నేలకు కరిచేలా చేశాయి. హీరోగా తొలి సినిమా ‘సిపాయి కూతురు’ ఫ్లాప్ అయ్యింది. వేషాలు తెల్లముఖం వేశాయి. చివరకు? తెర మీద మాయలనూ మంత్రాలను నమ్మే దర్శకుడు విఠలాచార్య నిజ జీవితంలో మాత్రం సత్యనారాయణను పరిశీలించి చూసి అతడిలోని టాలెంట్‌ను నమ్మాడు. విఠలాచార్య వల్ల సత్యనారాయణ కేరెక్టర్ ఆర్టిస్టుగా మారాడు. కాదు కాదు విలన్‌గా. ‘నవగ్రహ పూజా మహిమ’లో మొదటిసారి విలన్ వేషం కట్టాడు. విఠలాచార్య నమ్మకం సరైనదే. ఆ తర్వాతి కాలంలో అతడు ఇండస్ట్రీని ఏలబోతున్నాడు. ‘నిప్పులాంటి మనిషి’ ఎస్వీఆర్ మెచ్చిన సత్యనారాయణ పోలికలతో చెప్తే సరిపోతుంది. హిందీలో ప్రాణ్‌తో సమానమైనవాడు కైకాల సత్యనారాయణ. ప్రాణ్ కూడా విలన్. కేరెక్టర్ ఆర్టిస్ట్. కామెడీ చేస్తాడు. ఏ హీరోకైనా దీటుగా నటిస్తాడు. సత్యనారాయణ ఇండస్ట్రీకి వచ్చే వేళకు ఎస్వీఆర్ రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నాడు. రాజనాల విలన్‌గా ఏలుతున్నాడు. కాని రాజనాల విలనీ మాత్రమే చేయగలడు. కేరెక్టర్లకు నప్పడు. నాగభూషణం డైలాగ్ ఆర్టిస్టే కాని ఫైటింగ్‌లకు పనికి రాడు. ఫైటింగ్‌లు చేస్త నటన కూడా చేస్త ఇతర పాత్రలు కూడా పండించే ప్రాణ్ వంటి వాడే ఇప్పుడు ఇండస్ట్రీకి కావాలి. ఆ వాడు– కైకాల. ఈ సంగతి ఎస్వీ రంగారావే కనిపెట్టాడు. ‘జంజీర్’ను తెలుగులో ‘నిప్పులాంటి మనిషి’గా రీమేక్ చేస్తుంటే ప్రాణ్ కేరెక్టర్‌ను నిర్మాతలు ఎస్వీఆర్‌నే వేయమన్నారు. ఆయన ‘జంజీర్’ చూసి ‘ఈ వేషాన్ని ఇప్పుడు నేను వేయలేను. ఎనర్జీ కావాలి. సత్యనారాయణతో చేయించండి’ అన్నాడు. సత్యనారాయణ ‘షేర్‌ఖాన్’ వేషం వేశాడు. ‘నిప్పులాంటి మనిషి’లో నిప్పులాంటి కేరెక్టర్. సత్యనారాయణ ఇప్పుడు నటుడిగా పూర్తిగా స్థిరపడ్డాడు. అతణ్ణే ముఖ్యపాత్రగా చేసి సినిమాలు తీస్తున్నారు. ‘దేవుడే దిగివస్తే’, ‘తాయారమ్మ– బంగారయ్య’, ‘పార్వతీ పరమేశ్వరులు’, ‘నా పేరే భగవాన్’, ‘వ వూళ్లో మహా శివుడు’, ‘మొరటోడు’.. రావు గోపాలరావు, సత్యనారాయణ, అల్లురామలింగయ్య ఫార్ములా టీమ్‌గా మారారు. కె.రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి ఈ టీమ్‌ను ఎక్కువగా ఉపయోగించారు. ‘వేటగాడు’లో రావు గోపాలరావు ప్రాసల పరోటాలు విసిరితే పై నుంచి కింద వరకు ఒకే రంగు డ్రస్సు వేసుకుని కనిపించే సత్యనారాయణ నవ్విస్తాడు.∙∙ కొన్నిసార్లు నటులు పాత్రలను వెతుక్కుంటూ వెళతారు. కొన్నిసార్లు పాత్రలు నటులను వెతుక్కుంటూ వస్తాయి. రచయిత డి.వి.నరసరాజు యముణ్ణి మెయిన్ రోల్‌గా తీసుకుని ‘యమగోల’ స్క్రిప్ట్ రాశాడు. ఎన్టీఆర్ చేత యముడి వేషం, బాలకృష్ణ చేత హీరో వేషం వేయించాలని ప్లాన్. కాని స్క్రిప్ట్ విన్న ఎన్టీఆర్ యముడి పాత్రలోని కామెడీ టచ్‌కు పగలబడి నవ్వి ‘హీరో పాత్ర నేను వేస్తాను. యముడి వేషం సత్యనారాయణ చేస్తాడు’ అన్నాడు. అలా తెలుగు తెర మీద మరెవరికీ వీలవని, మరెవరూ మెప్పించలేని, తనకు మాత్రమే సరిపోయిన, తనకే అద్భుతంగా కుదిరిన యముడి పాత్ర సత్యనారాయణకు దక్కింది. ‘యముండా’ డైలాగ్ ఇంటింటా మోగింది. యముడంటే కైకాల సత్యనారాయణే.. సాధారణంగా యముడంటే అందరికీ భయం. కాని సత్యనారాయణ వల్ల తెలుగువారికి ఆ భయం పోయింది. సినిమాల్లో యముడు సత్యనారాయణ వల్ల ప్రియమైన వాడుగా మారిపోయాడు. ‘యమగోల’ను తమిళంలో శివాజీ గణేశన్‌తో రీమేక్ చేశారు. యముడి వేషం ఏకంగా శివాజీ గణేశనే చేశాడు. ఫ్లాప్ అయ్యింది. ఎందుకంటే యముడు తెలుగువాడు. తెలుగుదనం ఉన్నవాడు. సత్యనారాయణతనం ఉన్నవాడు. అందుకే ఇక్కడ నచ్చినట్టుగా అక్కడ నచ్చలేదు. ఇదే సినిమా హిందీలో జితేంద్రతో రీమేక్ చేస్తే యముడి వేషం గ్రేట్ యాక్టర్ ప్రేమ్‌నాథ్ వేశాడు. రిజల్ట్ డిటో. ఆ తర్వాత సత్యనారాయణ యముడిగా చేసిన ‘యముడికి మొగుడు’ తమిళంలో రజనీకాంత్‌తో రీమేక్ అయ్యింది.యముడి వేషం పాపులర్ ఆర్టిస్ట్ విను చక్రవర్తి చేశాడు. ఫ్లాప్. సత్యనారాయణ యముడిగా చేసిన ‘యమలీల’ తమిళంలో కార్తిక్ హీరోగా రీమేక్ చేస్తే యముడిగా కమెడియన్ గౌండర్‌మణి వేశాడు. ఫ్లాప్. ‘యమలీల’ హిందీ రీమేక్‌లో యముడు ఖాదర్‌ఖాన్. ఫ్లాప్. యముడు తెలుగువాడు. అతడు అచ్చు సత్యనారాయణలాగా ఉంటాడు. ఇది కన్ఫర్మ్. సత్యనారాయణ తర్వాత తెలుగులో యముడిగా వేసినవారు ఎవరూ తెలుగువారికి నచ్చలేదు. ఇక మీదట నచ్చబోరు. కైకాల ఒక పాత్రను అలా తన పేరుతో తెలుగువారికి కానుకగా ఇచ్చాడు. ఈ సీన్ చూడండి– ‘యమగోల’లో భూలోకం వచ్చి నగరమంతా బలాదూరు తిరిగాక ఆకలికి యముడి డైలాగ్: ఏమది... కడుపులో ఒక మాదిరిగా ఉన్నది. దానికి చిత్రగుప్తుడైన అల్లు జవాబు: నాకు రెండు మాదిరులుగా ఉన్నది ప్రభూ. ప్రేక్షకులకు వచ్చే నవ్వు జీవితకాలం స్మరణకొస్తుంటుంది. మంచి దర్శకులు మంచి పాత్రను రాసుకుని ఆ పాత్రను మంచి నటుడు చేస్తుంటే తెగ ఎంజాయ్ చేస్తారు. ఆ నటుడికి మరిన్ని మంచి పాత్రలు రాస్తారు. కె.విశ్వనాథ్ కైకాలను ఉత్తమంగా తన పాత్రల కోసం ఉపయోగించాడు. కైకాల ఎబిలిటీస్‌ని బయటకు తెచ్చాడు. తెలివైన ప్రేక్షకుల ఇంటెలెక్చువల్ లెవల్స్‌కు కైకాలను మేచ్ చేశాడు. తిడుతూ ఉత్తరాలు రాసినవాళ్లే 'శారద’, ‘జీవనజ్యోతి’, ‘సిరిసిరి మువ్వ’, ‘శుభలేఖ’, ‘జననీ జన్మభమి’, ‘శ్రుతిలయలు’, ‘సత్రధారులు’... వీటన్నింటిలో కొత్త సత్యనారాయణను చస్తాం. ‘శుభలేఖ’లో పొలిటీషియన్ ఆదిశేషయ్యగా కటువుగా ఉంటూనే సొంత కొడుకుల పట్ల ఎనలేని ప్రేమ ఉన్నవాడిగా ప్రతి మాటను రెండుసార్లు పలికే మేనరిజంతో సత్యనారాయణ గొప్పగా నటిస్తాడు. ‘శారద’లో శారద అన్నయ్యగా వేసిన పాత్రకు వచ్చిన పేరు తెలియంది కాదు. విలన్‌గా చూసి అప్పటి వరకూ ‘ఆ సత్తిని కత్తితో పొడవాలి.. అతని చేతులిరగా.. కాళ్లిరగా’ అని శాపనార్థాలు పెట్టిన ఆడవాళ్లు ‘శారద’ తర్వాత కైకాలలో అన్నను చూసుకోవడం మొదలుపెట్టారు. తిడుతూ ఉత్తరాలు రాసినవాళ్లే ‘జీవితంలో మీలాంటి అన్నయ్య మాకు లేడనేది కొరతగా ఉందండీ’ అని రాశారు. ‘దేవుడు చేసిన మనుషులు’, ‘జ్యోతి’, ‘బ్రహ్మం గారి చరిత్ర’, ‘ఇల్లాలి కోరికలు’, ‘మండే గుండెలు’, ‘అన్వేషణ’... ఈ సినిమాల్లోని సత్యనారాయణ సవాలు చేసేలా నటించే సత్యనారాయణ. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్‌బాబుల తరం వెళ్లింది. సత్యనారాయణ ఉన్నాడు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్ తరం వచ్చింది. సత్యనారాయణ ఉన్నాడు. ఎన్టీఆర్ నుంచి మహేశ్ బాబు వరకు.. జూనియర్ ఎన్టీఆర్, మహేశ్‌బాబు తరం వచ్చింది. సత్యనారాయణ కొనసాగాడు. ‘గ్యాంగ్ లీడర్’, ‘సమర సింహారెడ్డి’, ‘మురారి’, ‘అరుంధతి’ సత్యనారాయణ పాత్రలు చేస్తనే వెళ్లాడు. ఆయన నటించిన చివరి చిత్రం ‘మహర్షి’ అయినా దాదాపు చివరి చిత్రంగా చెప్పుకోవాల్సింది ఎన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’ సినిమానే. తనకెంతో ఇష్టమైన ఎన్టీఆర్ బయోపిక్‌లో సత్యనారాయణ హెచ్.ఎం.రెడ్డి పాత్రను పోషించడం ప్రకృతి మెచ్చే ముగింపుగా చెప్పుకోవచ్చు. సత్యనారాయణ ఒక అచ్చమైన నటుడు అని తెలుగువారు ఎందుకు చెప్పుకోవాలంటే ఆయన ఇతర భాషలకు సూట్ కాడు. కాలేడు. ఆయన రూపం, మాట, బాడీ లాంగ్వేజ్ అన్నీ తెలుగుదనం నిండినవే. కొన్ని రకాల వృక్షాలు, పక్షులు, కొన్ని రకాల గిరులు, కొన్ని జలపాయలు కొన్ని ప్రాంతాలలోనే ఉంటాయి. మన్నుతాయి. ఆ ప్రాంతం వారికే సొంతమవుతాయి. అలా తెలుగువారికి సొంతమైనవాడు కైకాల సత్యనారాయణ. స్వర్గం, నరకం ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. కాని సత్యనారాయణ మరణంతో స్వర్గపురికి అభినవ యముడిని సాగనంపుతున్న అనుభూతి వత్రం తెలుగు వారికే సొంతమైంది. కైకాల సత్యనారాయణకు సగౌరవ నివాళి. తల వొంచి వీడ్కోలు. - ఖదీర్ -
పెద్ద కొడుకు చేతుల మీదుగా కైకాల అంత్యక్రియలు
Kaikala Satyanarayana Funeral Live Updates: ►కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ముగిశాయి. హిందూ సాంప్రదాయ పద్దతిలో తంతు ముగించారు. ►కైకాల సత్యన్నారాయణకు అంతిమ సంస్కారాలు నిర్వహించిన పెద్ద కుమారుడు లక్ష్మి నారాయణ ►చివరిచూపు కోసం తండోపతండాలుగా వచ్చిన కైకాల అభిమానులు.. ► మహా ప్రస్థానంలో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ► కైకాల భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు ► కైకాల సత్యనారాయణ అంతిమ యాత్ర ప్రారంభమైంది. ప్రభుత్వ లాంఛనాలతో మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు. నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ మృతితో టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల శుక్రవారం తెల్లవారుజామున ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. అయితే నేడు(శనివారం)ఉదయం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. అభిమానుల సందర్శనార్థం భౌతికకాయన్ని 10.40కి ఫిలిం చాంబర్‌కు తరలించనున్నారు. అటు నుంచి 11.30గంటలకు మహాప్రస్థానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ లాంఛనాలతో కైకాల అంత్యక్రియలు జరగనున్నాయి. -
నటనలోనే కాదు పాటకి అభినయించడంలోనూ దిట్ట
-
విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా మెప్పించిన కైకాల
-
నింగికేగిన కైకాల..
అసలు విలన్లా వికటాట్టహాసం చేసినా.. పక్కన చిన్న విలన్ కమ్ కమెడియన్‌గా డైలాగులు పలికినా.. ‘యముండా’ అంటూ గర్జించినా.. తండ్రిగా, తాతగా ప్రేమను కురిపించినా.. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా పాత్ర ఏదైనా.. సాంఘికం, పౌరాణికం, జానపదం జానర్ ఏదైనా.. మూడు తరాల ప్రేక్షకులను ముచ్చటగా అలరించిన నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ. తెలుగు సినీ అభిమానులను విషాదంలో ముంచుతూ దివికేగారు. సాక్షి, హైదరాబాద్/ న్యూఢిల్లీ: వందల సినిమాలు.. ఎన్నో రకాల పాత్రలు.. అన్నింటా తనదైన ముద్ర వేసి నవరస నటనా సార్వభౌముడు అనిపించుకున్న కైకాల సత్యనారాయణ (87) ఇకలేరు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య నాగేశ్వరమ్మ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కైకాల మృతితో చిత్ర పరిశ్రమతోపాటు ఆయన అభిమానుల్లో విషాదం నెలకొంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సత్యనారాయణ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. సినీ హీరోలు చిరంజీవి, పవన్‌కల్యాణ్, వెంకటేశ్, దర్శకులు కె.రాఘవేందర్రావు, త్రివిక్రమ్ శ్రీనివాస్, బాబీ, నిర్మాత చినబాబు తదితరులు ఇందులో ఉన్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు కైకాల సత్యనారాయణ భౌతికకాయానికి శనివారం ఉదయం పదిన్నర గంటలకు ఫిలింనగర్‌లోని మహాప్రస్థానంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరనున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వపరంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కైకాల తన నటనతో మూడు తరాల ప్రేక్షకులను అలరించారని.. ఆయన మృతి తెలుగు చిత్రసీమకు తీరని లోటు అని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. జానర్ ఏదైనా.. పాత్ర ఎలాంటిదైనా.. ఏపీలోని కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో 1935 జూలై 25న కైకాల సత్యనారాయణ జన్మించారు. గ్రామంతోపాటు గుడ్లవల్లేరు, గుడివాడ, విజయవాడలలో చదువుకున్నారు. విద్యార్థిగా ఉన్నప్పుడే సత్యనారాయణ పలు నాటకాల్లో పాత్రలు పోషించారు. ఆజానుబాహుడు కావడంతో సినిమాల్లో ప్రయత్నించాలని స్నేహితులు సూచించడంతో 1956 సెప్టెంబర్ 27న మద్రాసులో (చెన్నై)లో అడుగుపెట్టారు. కొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చినా చేజారిపోయాయి. 1959లో ‘సిపాయి కూతురు’ సినిమాలో తొలుత అవకాశం వచ్చింది. తర్వాత ‘సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి’ సినిమాలో ముగ్గురు హీరోల్లో ఒకరిగా చేశారు. ఆ సమయంలో దర్శకుడు విఠలాచార్య ప్రోత్సాహంతో విలన్ వేషాలకు ఓకే చెప్పారు. ఎన్టీఆర్ హీరోగా తీసిన ‘అగ్గిపిడుగు’లో విలన్‌గా సత్యనారాయణకు మంచిపేరు వచ్చింది. ఎన్టీఆర్ ఏ సినిమా చేసినా కైకాల విలన్‌గా ఉండేవారు. ఎన్టీఆర్‌తో రూపురేఖలు దగ్గరగా ఉండటంతో కొన్ని సినిమాల్లో ఆయనకు డూప్‌గా కూడా చేశారు. మరోవైపు పౌరాణిక చిత్రాల్లోనూ నటనా కౌశలాన్ని చూపారు. శ్రీకృష్ణార్జున యుద్ధం, లవకుశ, నర్తనశాల, దానవీరశూరకర్ణ వంటి సినిమాల్లోని వివిధ పాత్రలతోపాటు యముడి పాత్రల్లో ‘యముండా’ అంటూ విజృంభించారు. రమా ఫిల్మ్ ప్రొడక్షన్ పేరిట పలు సినిమాలు నిర్మించారు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నటించారు. కైకాల సత్యనారాయణ నటించిన చివరి చిత్రం ‘మహర్షి’. ఈ చిత్రంలో హీరోయిన్‌కు తాతగా నటించారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన కైకాల.. ఆరు దశాబ్దాల కెరీర్లో సుమారు ఎనిమిది వందల చిత్రాల్లో నటించారు. అయితే తన నటవారసులుగా కుమారులను ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు. ఎన్టీఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి.. ఎన్టీఆర్ స్ఫూర్తితో కైకాల సత్యనారాయణ రాజకీయాల్లోకి కూడా వచ్చారు. 1996లో టీడీపీ తరఫున మచిలీపట్నం ఎంపీగా గెలిచారు. తర్వాత మరోసారి పోటీచేసి ఓటమిపాలయ్యారు. పలు ప్రజాసేవా కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. తాత పేరిట కౌతవరంలో ప్రభుత్వ సాయంతో ప్రసూతి కేంద్రాన్ని స్థాపించారు. తెలుగువారు గర్వించదగ్గ నటుడు కైకాల: సీఎం కేసీఆర్ కైకాల సత్యనారాయణ మరణవార్త తెలిసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఫిలింనగర్‌లోని నివాసానికి వచ్చారు. పార్థివదేహం వద్ద నివాళులు అర్పించి.. కైకాల కుటుంబ సభ్యులను పరామర్శించారు. హీరోలతో సమానంగా కైకాల సత్యనారాయణకు గ్లామర్ ఉండేదని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘‘కైకాల సత్యనారాయణ మరణం బాధాకరం. ఆయన ఏ పాత్రలో అయినా హీరోలతో పోటీపడుతూ అద్భుతంగా నటించేవారు. తన వైవిధ్యమైన నటనతో మూడు తరాల ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. తెలుగు ప్రజలు గర్వించదగ్గ నటుడు. ఆయన మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు..’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కైకాల ఎంపీగా ఉన్న సమయంలో కొంతకాలం కలిసి పనిచేశానని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం వెంట ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, బాల్క సుమన్, మరికొందరు నేతలు ఉన్నారు. ప్రధాని మోదీ సంతాపం సినీనటుడు కైకాల సత్యనారాయణ మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ట్వీట్ చేశారు. ‘‘ప్రసిద్ధ సినీ దిగ్గజం కైకాల సత్యనారాయణ గారి మృతి పట్ల చింతిస్తున్నాను. విభిన్న పాత్రలతో, అద్భుత నటనా చాతుర్యంతో ప్రేక్షకులకు ఆయన చిరపరిచితులు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’’ అని పేర్కొన్నారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా కైకాల మృతిపట్ల సంతాపం తెలిపారు. ప్రజల మదిలో నిలిచిపోతారు: తమిళిసై కైకాల సత్యనారాయణ మృతిపట్ల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నటుడిగా, ఎంపీ సేవలందించిన ఆయన మరణం తెలుగు ప్రజలకు, సినీ రంగానికి తీరని లోటు అని.. కైకాల నవరస నటనా సౌర్వభౌముడిగా ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. తెలుగు ప్రజలకు తీరని లోటు: రేవంత్‌రెడ్డి విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ మృతి తెలుగు ప్రజలకు తీరని లోటు అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. వందల సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న కైకాల మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
కృష్ణం రాజు కోసమే కైకాల ఆ పని చేశారు: శ్యామల
దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ మృతితో ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కడసారి ఆయనను కళ్లారా చూసి కంటనీరు పెట్టుకుంటున్నారు సెలబ్రిటీలు. సోషల్ మీడియా వేదికగా తారలు, రాజకీయ నేతలు, అభిమానులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి కైకాల మరణంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "కైకాల సత్యనారాయణ గారు కాలం చేశారని తెలిసి చాలా బాధపడ్డాం. ఆయన భార్య, కుమార్తెలతో మేమంతా చాలా క్లోజ్‌గా, ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా ఉంటాం. ఆ మధ్య కృష్ణంరాజు గారు.. ఏం సత్యనారాయణ మా ఇంటికి వచ్చి భోజనం చేయాలి.. అని అడిగితే ఖచ్చితంగా వస్తానని, మీరే ఒక టైం చూసి చెప్పమన్నారు. కానీ ఆయన మా ఇంటికి రాలేకపోయారు. కైకాల సత్యనారాయణ కృష్ణంరాజుతో అనేక అద్భుత చిత్రాల్లో నటించారు. బొబ్బిలి బ్రహ్మన్న సినిమాలో కృష్ణంరాజు గారితో కలిసి కైకాల సత్యనారాయణ ఒక పాత్ర చేశారు, అది పూర్తిస్థాయి కామెడీతో సాగే పాత్ర. అలాంటి పాత్ర ఆయన ఒప్పుకోవడం చాలా గొప్ప విషయం. లెజెండరీ నటుడైన కైకాల ఇలాంటి పాత్ర ఒప్పుకున్నాడంటే కేవలం అది నా మీద ఉన్న గౌరవమే అని కృష్ణంరాజు అంటూ ఉండేవారు. నవరసాలను పండించగల నవరస నటనా సర్వ భౌమ కైకాల సత్యనారాయణ గారు ఇప్పుడు మన మధ్య లేరంటే బాధగా ఉంది. ఈ ఏడాది ఇండస్ట్రీకి చెందిన లెజెండ్స్ దూరమవడం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. కైకాల కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను' అని తెలిపారు శ్యామల. చదవండి: అదే ఆయన చివరి కోరిక.. కానీ అది తీరకుండానే కన్నుమూసిన కైకాల దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ చివరి వీడియో ఇదే! -
కైకాల పార్థీవదేహానికి ప్రముఖుల నివాళి (ఫొటోలు)
-
కైకాల కుటుంబసభ్యులను పరామర్శించిన సీఎం కేసీఆర్
-
కైకాల లేని లోటు ఎవరూ పూడ్చలేరు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: నట దిగ్గజం కైకాల సత్యనారాయణ పార్థీవ దేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నివాళి అర్పించారు. శుక్రవారం మధ్యాహ్నాం నగరంలోని కైకాల నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్.. ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. సినీ నటులు కైకాల సత్యనారాయణగారు విలక్షణమైన నటులు. ఎలాంటి పాత్రలోనైనా జీవించి, హీరోలకు సమానమైన పేరు తెచ్చుకున్నారు. ఆయన ఎంపీగా ఉన్న రోజుల్లో.. ఆయనతో కలిసి పని చేసిన అనుభవం ఉంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఓ దిగ్గజాన్ని కోల్పోయింది. ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేరు. ఆయనకు సమానమైన నటులు ఈ తరంలో ఎవరూ లేరు. కైకాల మృతి చాలా బాధాకరం. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాం అన్నారు సీఎం కేసీఆర్. సీఎం కేసీఆర్ వెంట మంత్రి తలసానితో పాటు పలువురు సినీ ప్రముఖులు ఉన్నారు. అనారోగ్యంతో నటసార్వభౌమ కైకాల సత్యనారాయణ కన్నుమూసిన సంగతి తెలిసిందే. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కైకాల సత్యనారాయణ మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
-
చివరి కోరిక తీరకుండానే చనిపోయిన కైకాల
యముండ.. అంటూ గర్జించిన కైకాల సత్యనారాయణ గొంతు ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంది. హీరోగా, విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. ఇలా అన్నిరకాల పాత్రలు పోషించి నవరసాలను పండించిన ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. యముడు, ఘటోత్కచుడు, కృష్ణుడు, దుర్యోధనుడు, రావణాసురుడు.. వంటి పౌరాణిక పాత్రల్లో జీవించేసిన కైకాల సత్యనారాయణ ఇక సెలవంటూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఏడు వందలకు పైగా సినిమాల్లో నటించిన ఆయనకు ఓ బలమైన కోరిక ఉండేదట. మల్టీస్టారర్ సినిమాల్లో నటించాలని తపించారట. గతంలో నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు కలిసి నటించిన దేవుడు చేసిన మనుషులు చిత్రంలో కైకాల ముఖ్య పాత్ర పోషించారు. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాతి జనరేషన్ అయిన చిరంజీవి, బాలకృష్ణ మల్టీస్టారర్ మూవీ చేస్తే అందులో నటించాలని తెగ ఆరాటపడ్డారట. కానీ ఆ కోరిక తీరకుండానే కన్నుమూశారాయన. ఇక ఇటీవల జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ జంటగా నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ చూసి చాలా సంతోషించారట కైకాల. ఇలా చిరు, బాలయ్య కాంబినేషన్లో కలిసి నటిస్తే బాగుండనుకున్నారట. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: కైకాల సత్యనారాయణ చివరి వీడియో ఇదే! సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత -
కైకాల గారు మా ఫ్యామిలీకి చాలా క్లోజ్ : విక్టరీ వెంకటేష్
-
కైకాలను తలచుకొని కన్నీళ్లు పెట్టుకున్న చిరంజీవి
ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ మరణం ఇండస్ట్రీకే కాదు, తన కుటుంబానికే తీరని లోటని చిరంజీవి అన్నారు. పలు సినిమాల్లో కైకాలతో కలిసి నటించిన చిరంజీవి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కుటుంబ పెద్దను, అన్నయ్యను కోల్పోయాను. నన్ను ‘తమ్ముడూ’ అని తోడబుట్టినవాడిలా ఆదరించారు. కల్మషం లేని చిన్నపిల్లల మనస్తత్వం ఆయనది.ఆయనతో నాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయన్ను దూరం చేసుకోవడం దురదృష్టకంగా భావిస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు నా ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ చిరు పేర్కొన్నారు. ఇక పవన్ కల్యాణ్ సైతం కైకాలతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కైకాలను అజాత శత్రువని అభివర్ణించిన పవన్ ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని అన్నారు. వారి కుటుంబసభ్యులకు ఆ భగవంతుడు దైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నానంటూ సంతాపం వ్యక్తం చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కైకాల సత్యనారాయణ భౌతికఖాయానికి నివాళులు అర్పించిన చిరంజీవి
-
ఎన్టీఆర్‌తో ప్రత్యేక అనుబంధం.. కంచు కంఠంతో ఆకర్షించిన కైకాల
టాలీవుడ్ సీనియర్ నటుడు, నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ మృతితో టాలీవుడ్లో విషాదచాయలు అలుముకున్నాయి. 60 ఏళ్ల సినీ జీవితంలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా,కామెడీ పాత్రల్లో దాదాపు 750కి పైగా సినిమాల్లో నటించారాయన. చిన్నప్పటి నుంచే నాటకాలపై ఉన్న ఇష్టంతో 1959లో ‘సిపాయి కూతురు’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.మొదటి సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా నిండైన రూపం, కంచు కంఠంతో కైకాల అందరి దృష్టిని ఆకర్షించారు. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ పోలికలకు దగ్గరగా ఉండడం సత్యనారాయణకు కలిసొచ్చింది. ఈ విషయం గ్రహించిన ఎన్టీఆర్ కూడా ఆయనకు తన సినిమాల్లో అవకాశాలిచ్చారు. ఇక వీరిద్దరు కలిసి 100సినిమాలకు పైగా నటించారు. అంతేకాకుండా ఎన్టీఆర్ పోలికలు ఉండటంతో తొలి రోజుల్లో ''రాముడు-భీముడు' వంటి ఎన్.టి.ఆర్. ద్విపాత్రాభినయ చిత్రాలలో ఆయనకు డూప్ గా నటించారు.నటనలోనే కాదు.. రాజకీయ రంగంలో కూడా ఆయనతో కలిసి అడుగులేశారు సత్యనారాయణ. 1996లో ఆయన రాజకీయాల్లోకి వచ్చి, మచిలీపట్నం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 11వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇక ‘ఉమ్మడి కుటుంబం’ సినిమాలో ఓ పాత్రకోసం ఎన్టీఆర్కే సవాల్ విసిరారు కైకాల. అప్పటికే విలన్‌గా రాణిస్తున్న కైకాల ఈ చిత్రంలో సెంటిమెంట్ పాత్ర చేయగలడా అని సందేహంతో కైకాలను వద్దని చెప్పారట ఎన్టీఆర్. దీంతో కైకాల.. రెండు రోజులు షూట్ చేయండి, నేను చేసింది నచ్చకపోతే పంపించేయండి అంటూ ఎన్టీఆర్ కి సవాలు విసిరారు. ఇక చేసేది లేక ఆ పాత్రని కైకాలతో చేయించిన ఎన్టీఆర్.. ఆ తరువాత కైకాల నటన చూసి ప్రశంసించకుండా ఉండలేకపోయారట. ఇలా ఎన్టీఆర్‌తో కైకాల ప్రత్యేక అనుబంధం ఉండేదని గుర్తుచేసుకుంటున్నారు సినీ విశ్లేషకులు. -
కైకాల సత్యనారాయణ భౌతికఖాయానికి నివాళులు అర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
-
అదే నాకు మిగిలిన సంతృప్తి.. కైకాలతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న చిరంజీవి
నవరస నటసార్వభౌమ కైకాల సత్యనారాయణతో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. గతేడాది కైకాల పుట్టినరోజు నాడు స్వయంగా చిరు దంపతులు ఆయన ఇంటికి వెళ్లి బెడ్‌పైనే కేక్ కట్ చేయించి ఆప్యాయంగా పలకరించారు. కైకాలను అలా చూడటం అదే చివరిసారి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. కైకాల మరణం పట్ల చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొంటూ సుధీర్ఘ పోస్ట్ పెట్టారు. ‘‘తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డ, నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ మరణం నన్ను ఎంతగానో కలచివేస్తోంది. తెలుగు సినీ రంగానికే కాదు.. భారత చిత్ర పరిశ్రమకు గర్వకారణమైన అత్యంత ప్రతిభావంతుడైన నటుడాయన. ఆయన పోషించినన్ని వైవిధ్యమైన పాత్రలు బహుశా భారతదేశంలో మరో నటుడు పోషించి ఉండరు. ఆయనతో నేను ఎన్నో చిత్రాల్లో నటించాను. ఆ సందర్భంగా ఆయన నటనా వైదుష్యాన్ని, వ్యక్తిత్వాన్ని దగ్గర నుండి పరిశీలించే అవకాశం నాకు కలిగింది. డైలాగ్ డెలివరీలో ఆయనది ప్రత్యేక పంథా. స్వచ్ఛమైన స్పటికం లాంటి మనిషి, నిష్కల్మషమైన మనసున్న మనిషి, ఎటువంటి అరమరికలు లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వభావం కలవారు.నన్ను ‘తమ్ముడూ’ అంటూ తోడబుట్టినవాడిలా ఆదరించారు. మా మధ్య అనుబంధం, ఆత్మీయత అంతకంతకూ బలపడుతూ వచ్చాయి. ఆయనతో నాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. నటన, రుచికరమైన భోజనం రెండూ ఆయనకు ప్రాణం. నా శ్రీమతి సురేఖ చేతి వంటను ఆయన ఎంతో ఇష్టంగా తినేవారు. గతేడాది ఆయన జన్మదినం సందర్భంగా ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేయడం నాకు మిలిగిన సంతృప్తి. అప్పుడు ఆయన సురేఖతో.. ‘‘అమ్మా.. ఉప్పు చేప వండి పంపించు’’ అని అన్నప్పుడు..‘‘మీరు త్వరగా కోలుకోండి ఉప్పు చేపతో మంచి భోజనం చేద్దాం’’ అని చెప్పాం.ఆ క్షణాన ఆయన చిన్న పిల్లాడిలా ఎంతో సంతోషపడ్డారు.సత్యనారాయణ గొప్ప సినీ సంపదను అందరికీ అందించి వెళ్లిపోయారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. Rest in peace Navarasa Natana Sarvabhouma Sri Kaikala Satyanarayana garu 🙏 pic.twitter.com/SBhoGATr0y — Chiranjeevi Konidela (@KChiruTweets) December 23, 2022 -
కైకాల సత్యనారాయణ మృతి.. తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం
సాక్షి, హైదరాబాద్: బహుముఖ కళాకారుడు, మాజీ లోక్‌సభ సభ్యుడు కైకాల సత్యనారాయణ మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. పురాణాల నుంచి క్రైమ్ థ్రిల్లర్స్ వరకు స్పష్టమైన వ్యక్తీకరణలతో విభిన్న పాత్రలను అలవోకగా పోషించిన మహోన్నత వ్యక్తిగా కైకాలను సీఎం జగన్ ప్రశంసించారు. నటుడిగా సుదీర్ఘకాలం సేవలందించిన కైకాలది తెలుగు చిత్ర సీమలో ప్రత్యేక స్థానం అంటూ కొనియాడారు. కైకాల మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు అన్నారు. ఈ సందర్భంగా కైకాల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కైకాల సత్యనారాయణ గారు. నటునిగా సుదీర్ఘ కాలం సేవలందించి ఎన్నో మరపురాని పాత్రలతో మెప్పించారు. ఎంపీ గానూ ప్రజలకు మరింత దగ్గరయ్యారు. కైకాల మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. pic.twitter.com/eJdUwqnINz — YS Jagan Mohan Reddy (@ysjagan) December 23, 2022 సీఎం కేసీఆర్ సంతాపం టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. చలన చిత్ర రంగంలో తొలితరం నటుడిగా పలు విభిన్నమైన పాత్రలను పోషిస్తూ తన వైవిధ్యమైన నటన ద్వారా, మూడు తరాల తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని సీఎం గుర్తుచేసుకున్నారు. కైకాల మరణం తెలుగు చలన చిత్ర రంగానికి తీరనిలోటని విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ప్రముఖ నటుడు శ్రీ కైకాల సత్యనారాయణ మృతి పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. తెలుగు చలన చిత్ర రంగంలో తొలితరం నటుడిగా విభిన్న పాత్రలను పోషిస్తూ, తమ వైవిధ్యమైన నటన ద్వారా, మూడు తరాల ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని సీఎం గుర్తుచేసుకున్నారు. — Telangana CMO (@TelanganaCMO) December 23, 2022 చదవండి: (నవరస నటనా సార్వభౌముడి సినీ, రాజకీయ ప్రస్థానం ఇదే..) -
గొప్ప జీవితం అనుభవించాడు..!
-
యుముడిగా ట్రేడ్‌మార్క్.. యముడి పాత్రలో కైకాల చివరి సినిమా ఇదే!
నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ పౌరాణిక, జానపద, సాంఘీక చిత్రాల్లో నటించి మెప్పించారు.భయపెట్టే విలనిజం నుంచి కరుణ రసం, కామెడీ పాత్రల్లో సైతం తన నటనతో మెప్పించిన నటుడిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. యముడు అంటే బహుశా ఇయనలాగే ఉంటారేమో అనేంతలా కెరీర్లో పదుల సంఖ్యలో యముడి పాత్రలు పోషించి భళా అనిపించారు. యముండ అంటూ ఆయన గర్జించే గర్జన ఇప్పటికీ మరువలేనిది. యముడి పాత్రలో కైకాలను తప్ప మరొకరిని ఊహించుకోలేము అనేంతగా తన నటనతో కట్టిపడేశారు. యముడి పాత్రల్లో కైకాల నటించిన సినిమాలను ఓసారి గుర్తుచేసుకుందాం.. 1977లో వచ్చిన యమగోల సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాతో ఎన్టీఆర్‌కు ఎంత పేరు వచ్చిందో యముడిగా కైకాల సత్యనారాయణకు కూడా అంతటి పేరు వచ్చింది. 1998లో వచ్చిన యముడికి మొగుడు అనే సినిమాలో కైకాల పోషించిన యముడు పాత్ర మరువలేనిది. ఆయుష్షు తీరకుండానే యమలోకానికి వెళ్లిన చిరు యముడికి చుక్కలు చూపించే సన్నివేశాలు జనాలను ఎంతో ఆకట్టుకున్నాయి. ఇక ఎస్వీ క్రిష్ణారెడ్డి తెరకెక్కించిన యమలీలలో కూడా కైకాల పాత్ర అత్యద్భుతం. కమెడియన్ అలీ హీరోగా నటించిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది. అలాగే యమగోల మళ్ళీ మొదలైంది చిత్రంలో కూడా యుముడిగా ఆకట్టుకున్నారు. ఇక తొట్టెంపూడి వేణు, శ్రీకాంత్ హీరోలుగా నటించిన యమగోల మళ్లీ మొదలైందిలోనూ రిటైర్డ్ అయ్యే యముడి పాత్రలో కైకాల సత్యనారాయణ కనిపించారు. చివరగా ఆయన రవితేజ నటించిన 'దరువు' చిత్రంలోనూ యముడి పాత్రలో మెప్పించారు. -
కైకాల సత్యనారాయణ భౌతికఖాయానికి నివాళులు అర్పించిన ప్రముఖులు
-
కైకాల మృతి పట్ల రాజకీయ ప్రముఖుల సంతాపం
దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్, మంత్రులు, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.. కైకాల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘సార్వ భౌమ’ అనిపించుకున్న మేటి నటుడు: మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విభిన్నపాత్రల్లో నటించి, తన విలక్షణ నటన ద్వారా నవరసనటనా సార్వ భౌమ అనిపించుకున్న మేటి నటుడు కైకాల సత్యనారాయణ మరణం విచారకరమని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ‘‘కైకాల ఆరు దశాబ్దాల సినీ జీవితంలో 777 చిత్రాలలో నటించారు. కేవలం నటుడు గానే కాకుండా చిత్రం నిర్మాణం కూడా చేపట్టి పలు సినిమాలు నిర్మించి మంచి ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్నారు. రాజకీయ రంగంలో అడుగు పెట్టిన ఆయన మచిలీపట్నం లోక్ సభ నుంచి ఎన్నికై పార్లమెంటు సభ్యుడి గాను తన సేవలను ప్రజలకు అందించారు. సత్యనారాయణ మరణం సినీ రంగానికి తీరని లోటు’’ అని మంత్రి కారుమూరి అన్నారు. ఇండస్ట్రీకి తీరని లోటు: మంత్రి వేణు కైకాల మృతి పట్ల మంత్రి వేణుగోపాలకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 700 చిత్రాలకు పైగా నటించిన కైకాల మృతి ఇండస్ట్రీకి తీరని లోటు అన్నారు. సత్యనారాయణ కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎంతో బాధాకరం: మంత్రి రోజా సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ గారు 750 కిపైగా సినిమాల్లో నటించి `నవరసనటనా సార్వభౌముడు` అనిపించారని మంత్రి రోజా ట్విట్ చేశారు. మరణం ఎంతో బాధాకరమని వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. కైకాల కుటుంసభ్యులకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
కైకాల సత్యనారాయణ చివరి వీడియో ఇదే..
-
దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ చివరి వీడియో ఇదే..
సాక్షి, హైదరాబాద్: కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నటుడు కైకాల సత్యనారాయణ.. శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతున్న ఆయన.. జూలై 25న 87వ పుట్టిన రోజు జరుపుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఆయన నివాసానికి కేక్ తీసుకెళ్లి బైడ్పైనే కట్ చేయించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బర్త్‌డేకు సంబంధించిన ఫొటోలు చిరంజీవి షేర్ చేస్తూ కైకాలకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచానికి చూపిన కైకాల చివరి వీడియో ఇదే. కైకాల సత్యనారాయణ 1935, జులై 25న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు (మ) కౌతారంలో జన్మించారు. 770కిపైగా సినిమాల్లో నటించారు. ఆయన తండ్రి కైకాల లక్ష్మీనారాయణ. కైకాల ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడలలో పూర్తిచేసి, గుడివాడ కళాశాల నుండి పట్టభద్రుడయ్యారు. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో వివాహమైంది. ఆయనకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. 1996లో ఆయన రాజకీయాల్లోకి వచ్చి, మచిలీపట్నం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 11వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. చదవండి: నవరస నటనా సార్వభౌముడి సినీ, రాజకీయ ప్రస్థానం ఇదే.. -
కైకాల సత్యనారాయణ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం
ప్రముఖ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మరణంతో టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 1935 జులై 25న జన్మించిన కైకాల నటనపై ఆసక్తితో కాలేజీ రోజుల్లోనే ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు.‘సిపాయి కూతురు’లో తొలిసారి వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఆయన పౌరాణికం, జానపదం, కమర్షియల్.. ఇలా ఎన్నో చిత్రాల్లో హీరోగా, కమెడియన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించారు. 2019లో ‘మహర్షి’ సినిమాలో చివరిసారిగా కనిపించారు.కైకాల మృతి పట్ల టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మా కుటుంబంతో కైకాలకు స్నేహ సంబంధాలు : బాలయ్య ‘‘కైకాల సత్యనారాయణ గారి మరణం దిగ్భ్రాంతి కలిగించింది. కైకాల సత్యనారాయణ గారు ఆరు దశాబ్దాలు పాటు తెలుగు సినిమా రంగంలో పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రల్లో నవరస నటనా సార్వభౌముడిగా తన వైవిధ్యమైన నటనతో అలరించారు. మా కుటుంబంతో కైకాల సత్యనారాయణ గారికి స్నేహ సంబంధాలు వున్నాయి. నాన్నగారితో కలిసి ఎన్నో సినిమాల కోసం పనిచేశారు. నా చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు. మంచి నటుడిగానే కాకుండా పార్లమెంట్ సభ్యునిగా తనదైన ముద్రవేశారు. సినీ జీవితంలోనూ, ప్రజాజీవితంలోనూ ఎంతో బాధ్యతాయుతంగా ఆయన అందించిన సేవలు మరువలేనివి. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ -నందమూరి బాలకృష్ణ ► కైకాల ఒక చరిత్ర క్రియేట్ చేసాడు. గొప్ప జీవితం అనుభవించిన వ్యక్తి. అందరితో స్నేహంగా ఉండేవాడు. వచ్చే తరం వాళ్ళకి ఆయన ఆదర్శం- డైరెక్టర్ రాఘవేంద్రరావు ► సీనియర్ నటులు.. నవరస నటనా సార్వబౌమ.. కైకాల సత్యనారాయణ గారి మరణం.. చిత్ర పరిశ్రమకు తీరని లోటు. కళామతల్లికి ఎంతో సేవ చేసి.. రాజకీయంగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని.. ఆ దేవుడ్ని కోరుకుంటున్నా- వై. కాశీ విశ్వనాధ్ ప్రెసిడెంట్.. తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం Extremely saddened by the passing away of #KaikalaSatyanarayana garu. I have some very fond memories of working with him. He will be missed. My deepest condolences to his family and loved ones. May his soul rest in peace 🙏🙏🙏 — Mahesh Babu (@urstrulyMahesh) December 23, 2022 Legendary actor #KaikalaSatyanarayana garu 🙏 RIP May his soul rest in peace 🙏 pic.twitter.com/ZjHUeKHkQ3 — BANDLA GANESH. (@ganeshbandla) December 23, 2022 Grief-stricken by the demise of the legendary actor Kaikala Satyanarayana garu. He is One of the finest actors Indian cinema has ever seen. My sincere condolences to his family & dear ones. Om Shanti 🙏 — Ravi Teja (@RaviTeja_offl) December 23, 2022 Rest in peace Navarasa Natana Sarvabhouma Sri Kaikala Satyanarayana garu 🙏 pic.twitter.com/SBhoGATr0y — Chiranjeevi Konidela (@KChiruTweets) December 23, 2022 Woke up to this terrible news and saddened at the demise of Legendary Actor Kaikala Satya Narayana Garu. You're a stalwart of versatility and your work will always inspire generations to come. End of an era 🙏 May your soul rest in peace.#RIPKaikalaSatyanarayana Garu — Sai Dharam Tej (@IamSaiDharamTej) December 23, 2022 Saddened to hear about the passing away of legendary actor Kaikala Satyanarayana garu. He was one of the rarest acting personalities who can breathe life into any character. May his family find peace & strength in this hour of grief! Om shanti — Anil Ravipudi (@AnilRavipudi) December 23, 2022 Om Shanti Kaikala Satyanarayana garu 🙏🏼 My thoughts and prayers with the family 🙏🏼 — Sharwanand (@ImSharwanand) December 23, 2022 Deeply saddened to hear the demise of Kaikala Satyanarayana Garu.. His contribution to our film industry will be remembered forever !! May his soul rest in peace🙏 — Ram Charan (@AlwaysRamCharan) December 23, 2022 Deeply Saddened to hear that Legendary actor #KaikalaSatyanarayana garu is no more. May his soul rest in peace and Strength to his family and friends. Om Shanti 🙏🙏 pic.twitter.com/abTtF666ui — SRIKANTH MEKA (@actorsrikanth) December 23, 2022 Kaikala Satyanarayana gaaru 💔 One of my favourite actors from golden era of Telugu cinema. Mana intlo Manishi la anipistharu. Legendary body of work. Condolences to family🙏🏼 — Nani (@NameisNani) December 23, 2022 Very sad news! End of an era! Kaikala Satyanarayana garu is no more. Navarasa Nata Sarvabhowma.#Kaikala Satyanarayana pic.twitter.com/ZOrp3H4bGT — Ananya Nagalla (@AnanyaNagalla) December 23, 2022 Deeply saddened waking up to the news of Kaikala Satyanarayana garu’s demise..He was my most favourite actor as I was growing up..fell in love with him in and as Ghatotkachudu❤️He will always be remembered for his versatility and his enormous contribution towards TFI..Om Shanti🙏🏻 pic.twitter.com/h88N2WgQMQ — Anasuya Bharadwaj (@anusuyakhasba) December 23, 2022 Saddened to know about the passing of Kaikala Satyanarayana garu. An absolute legend who immortalised many characters on our Telugu silver screen. Om Shanti — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) December 23, 2022 Rest in peace legend 💔#KaikalaSatyanarayana garu We miss you for ever pic.twitter.com/remzBGxvrY — Director Maruthi (@DirectorMaruthi) December 23, 2022 #KaikalaSatyanarayana one of the greatest of all time that celebrated telugu cinema. Rest in Peace NavaRasa Natanaa Sarwabhouma. 🙏 pic.twitter.com/YngpyjB2Nz — BVS Ravi (@BvsRavi) December 23, 2022 -
Kaikala Satyanarayana: నవరస నటనా సార్వభౌముడి అరుదైన (ఫొటోలు)
-
విలక్షణ నటనతో తెలుగు ప్రజల మనసు గెలిచిన కైకాల
-
సినీ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత
-
నవరస నటనా సార్వభౌముడి సినీ, రాజకీయ ప్రస్థానం ఇదే..
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు కైకాల సత్యనారాయణ (87) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1935, జులై 25న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు (మ) కౌతారంలో జన్మించారు. 770కిపైగా సినిమాల్లో నటించారు. ఆయన తండ్రి కైకాల లక్ష్మీనారాయణ. కైకాల ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడలలో పూర్తిచేసి, గుడివాడ కళాశాల నుండి పట్టభద్రుడయ్యారు. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో వివాహమైంది. ఆయనకు ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. 1996లో ఆయన రాజకీయాల్లోకి వచ్చి, మచిలీపట్నం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 11వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. ►తన మనవళ్లలో ఒకరిని నటవారసుడిగా చూడాలనేది కైకాల కోరిక ►నవరస నటనా సార్వభౌముడిగా ప్రఖ్యాతిగాంచిన కైకాల ►ఐదు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో కైకాల ప్రయాణం ►కైకాల సత్యనారాయణ నటించిన మొదటి చిత్రం: సిపాయి కూతురు ► చివరి చిత్రం: మహర్షి ►పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద చిత్రాల్లో ఎన్నో పాత్రలు పోషించిన కైకాల ►28 పౌరాణిక, 51 జానపద, 9 చారిత్రక చిత్రాల్లో నటించిన కైకాల ►200 మందికిపైగా దర్శకులతో పనిచేసిన కైకాల సత్యనారాయణ ►100 రోజులు ఆడిన కైకాల నటించిన 223 చిత్రాలు ►అర్ధశతదినోత్సవాలు జరుపుకున్న 59 సినిమాలు ►సంవత్సరం ఆడిన కైకాల నటించిన 10 చిత్రాలు ►ఇంటర్ రెండో సంవత్సరంలో నాటకరంగంలో కైకాల ప్రవేశం ►నాటకరంగ అనుభవంతో సినిమాల్లో వేషం కోసం మద్రాసు వెళ్లిన కైకాల ►కైకాల సత్యనారాయణ నటుడిగా గుర్తించిన డి.ఎల్.నారాయణ ►తొలి సినిమాతోనే కథానాయకుడి అవకాశాన్ని అందుకున్న కైకాల ►సిపాయి కూతురు చిత్రంతో కథానాయకుడిగా తెరకు పరిచయమైన కైకాల ►కైకాల సత్యనారాయణకు కలిసొచ్చిన ఎన్టీఆర్ పోలికలు ►కైకాలను ఎన్టీఆర్ కు నకలుగా భావించిన పరిశ్రమ పెద్దలు ►సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి చిత్రంలో తొలిసారిగా ఎన్టీఆర్ తో కలిసి నటించిన కైకాల ►విఠలాచార్య దర్శకత్వంలో తొలి ప్రతినాయకుడి వేషం వేసిన కైకాల ►కనకదుర్గ పూజ మహిమ చిత్రంలో తొలిసారి ప్రతినాయకుడి పాత్ర పోషించిన కైకాల ►ఎన్టీఆర్ అగ్గిపిడుగు చిత్రంతో మలుపుతిరిగిన కైకాల సినీ జీవితం ►ఎన్టీఆర్ తో కలిసి 101 చిత్రాల్లో నటించిన కైకాల సత్యనారాయణ ►ఎన్టీఆర్ తో పోరాట సన్నివేశాల్లో పోటాపోటీగా నటించిన కైకాల ►యమగోల, యమలీల చిత్రాల్లో యముడిగా అలరించిన కైకాల ►పౌరాణికాల్లో రావణుడు, దుర్యోధనుడు, యముడు, ఘటోత్కచుడు పాత్రలు పోషించిన కైకాల ►సాంఘిక చిత్రాల్లో రౌడీ, తండ్రి, తాత పాత్రల్లో నటించిన కైకాల ►రమా ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్థను స్థాపించిన కైకాల సత్యనారాయణ ►కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు చిత్రాలను నిర్మించిన కైకాల ►1994లో బంగారు కుటుంబం చిత్రానికి నంది పురస్కారం ►2011లో రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్న కైకాల ►కైకాలకు బాగా నచ్చిన సంభాషణ: నీవా పాండవ పత్ని ►1996లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కైకాల సత్యనారాయణ ►తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి లోక్ సభకు కైకాల ఎన్నిక ►తొలి రోజుల్లో ''రాముడు-భీముడు' వంటి ఎన్.టి.ఆర్. ద్విపాత్రాభినయ చిత్రాలలో ఆయనకు డూప్ గా నటించారు. ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ►జీవితకాల సాఫల్య పురస్కారం (2017) నంది అవార్డులు ►ఉత్తమ చలన చిత్రం - బంగారు కుటుంబం (1994) ►రఘుపతి వెంకయ్య అవార్డు - 2011 ఇతర గౌరవాలు ►ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ అవార్డు ►నటశేఖర - అనంతపురంలో ఒక ప్రభుత్వేతర సంస్థ ఇచ్చింది. ►నటశేఖర - గుడివాడ పురపాలక సంఘ వేదికపై ఇచ్చినది ►కళా ప్రపూర్ణ - కావలి సాంసృతిక సంఘంవారు ఇచ్చినది ►నవరసనటనా సార్వభౌమ - ఒక సాంస్కృతిక సంఘం అనేకమంది పెద్దమనుషులు, పురజనుల మధ్య ఇచ్చింది. -
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత
టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని తన నివాసంలో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, కమెడియన్‌గా ఇలా అన్ని రకాల పాత్రలను పోషించి తనదైన గుర్తింపును సంపాదించుకున్నారాయన. నిర్మాతగానూ సినిమాలు రూపొందించారు. ఆయన పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తింపుగా ‘నవరస నటనా సార్వభౌమ’ అనే బిరుదు పొందారు కైకాల. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్.వి. రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో కైకాల ఒకరు. కైకాల మరణ వార్తతో టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించేందుకు పలువురు సినీ ప్రముఖులు ఆయన ఇంటికి తరలివస్తున్నారు. కృష్ణా జిల్లా బంటుమిల్లి గ్రామంలో1935 జులై 25న జన్మించిన కైకాల సత్యనారాయణ గుడివాడ కళాశాల నుంచి పట్టభద్రుడైయ్యారు 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో వివాహం జరిగింది కైకాలకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు నవరస నటనా సార్వభౌముడిగా ప్రఖ్యాతిగాంచిన కైకాల.. 777 చిత్రాల్లో నటన కైకాల సత్యనారాయణ నటించిన మొదటి చిత్రం: సిపాయి కూతురు కైకాల సత్యనారాయణ నటించిన చివరి చిత్రం: మహర్షి -
కైకాల జన్మదిన వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి (ఫొటోలు)
-
బెడ్‌పైనే కైకాలతో కేక్ కట్ చేయించిన చిరు.. ఫొటోలు వైరల్
సీనియర్ నటుడు కైకాల బర్త్‌డే నేడు. సోమవారం(జూలై 25న) ఆయన 87వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయన జన్మదిన వేడుకను నిర్వహించారు. ఇందుకోసం స్వయంగా కైకాల ఇంటికి వెళ్లి బెడ్‌పైనే ఆయనతో కేక్ కట్ చేయించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను చిరు షేర్ చేస్తూ కైకాలకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: ‘ఒక్క సినిమా కంటే ఎక్కువ చేస్తాననుకోలేదు.. మీ ప్రేమకు కృతజ్ఞురాలిని’ ఈ మేరకు చిరంజీవి ట్వీట్ చేస్తూ.. ‘పెద్దలు శ్రీ కైకాల సత్యనారాయణ గారి పుట్టినరోజున,వారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయటం ఎంతో సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చింది. ఆ భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటుంటున్నాను’ అంటూ రాసుకొచ్చారు. కాగా కైకాల ప్రస్తుతం వృద్యాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బెడ్‌పైనే చికిత్స పొందుతున్నారు. ఆయన కనీసం నిలబడి లేని, కదలలేని స్థితిలో ఉన్నారు. దీంతో ప్రస్తుతం ఆయన బెడ్‌పైనే చికిత్స పొందుతున్నారు. పెద్దలు శ్రీ కైకాల సత్యనారాయణ గారి పుట్టినరోజున,వారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయటం ఎంతో సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చింది. ఆ భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటుంటున్నాను 💐💐🙏🏻 pic.twitter.com/Dt2Yo2rp6i — Chiranjeevi Konidela (@KChiruTweets) July 25, 2022 -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - కైకాల సత్యనారాయణ
-
సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ నన్ను కదిలించింది: కైకాల సత్యనారాయణ
Legendary actor Kaikala Satyanarayana: గత ఏడాది నవంబర్ లో అనారోగ్యం పాలై అపోలో హాస్పిటల్ లో చేరిన టాలీవుడ్ సినీ దిగ్గజం కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి పూర్తి స్థాయిలో మెరుగుపడింది. పూర్తిగా కోలుకున్న ఆయన.. తన అనారోగ్య సమయంలో సహాయం అందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్‌కి ఓ లేఖ రాశారు. ‘బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా కాల్ చేసి, ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందిస్తామని హామీ ఇవ్వడం ద్వారా మీరు చూపిన శ్రద్ధకు పట్ల నేను చాలా సంతోషిస్తున్నానని ఆయన అన్నారు. మీరు హామీ ఇచ్చినట్టుగానే మీ ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా హాజరయ్యారు, వైద్య ఖర్చులను తీర్చడానికి ఆర్థిక సహాయంతో సహా అన్ని రకాల సహాయాన్ని అందించారు. ఆ కష్ట సమయాల్లో మీ సహాయం నాకు, నా కుటుంబానికి అద్భుతమైన శక్తిని ఇచ్చింది. మీరు చూపిన ఈ శ్రద్ధ మీకు కళాకారుల పట్ల మరియు వారి శ్రేయస్సు పట్ల ఉన్న గౌరవాన్ని మరోసారి రుజువు చేసింది. ప్రజల పట్ల మీకు ఉన్న శ్రద్ధ రాష్ట్రం మంచి చేతుల్లో ఉందనే భరోసా ఇస్తుంది’ అని కైకాల లేఖలో పేర్కొన్నారు. తాను సంతకం చేయలేక పోవడంతో, తన కుమారుడు ఈ కృతజ్ఞతా లేఖపై సంతకం చేశారని ఆయన వెల్లడించారు. అంతే కాక తనకు బాగోనప్పుడు తన కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని ఆయన పేర్కొన్నారు. అలాగే అభిమానుల ప్రార్థనలే తనని మళ్ళీ మాములు మనిషిని చేశాయని ఆయన అన్నారు. -
Deergaishmaanbhava: ఆకట్టుకుంటున్న‘వదిలి వెళ్ళిపోకే’ సాంగ్
కార్తీక్ రాజు, మిస్తీ చక్రవర్తి హీరో హీరోయిన్లుగా నోయెల్, ఆమని, పృద్వీ, సత్యం రాజేష్, కాశి విశ్వనాధ్, తాగుబోతు రమేష్, గెటప్ శ్రీను తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'దీర్ఘాయుష్మాన్ భవ'. ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ యముడి పాత్రలో నటించగా డాక్టర్ ఎంవీకే రెడ్డి సమర్పణలో ప్రతిమ ఈ సినిమా ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. పూర్ణానంద మిన్నకూరి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం వహించారు. మలహర్ భట్ జోషి ఛాయాగ్రహణం అందించగా వినోద్ యాజమాన్య సంగీతం సమకూరుస్తున్నారు. కిషోర్ మద్దాలి ఎడిటర్ గా చేస్తున్నారు. కాగా ఈ సినిమాలోని ‘వదిలి వెళ్ళిపోకే’ అనే పాట యూట్యూబ్ లో విడుదల కాగా ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతుంది. సోసియో ఫాంటసీ ప్రేమకథా చిత్రం గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా త్వరలోనే విడుదలతేదీ ని ప్రకటించనున్నారు. -
కైకాల కుమారుడికి సీఎం జగన్ ఫోన్
సాక్షి, అమరావతి: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కైకాల కుమారుడికి ఫోన్ చేశారు. కైకాల చిన్న కుమారుడు, కేజీఎఫ్ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కైకాల రామారావు(చిన్నబాబు)కు సీఎం జగన్ ఫోన్ చేసి.. కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్ తెలిపారు. ప్రస్తుతం కైకాల హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అదే విధంగా రాష్ట్ర మంత్రి పేర్ని నాని కూడా కైకాల ఆరోగ్య పరిస్థితి గురించి వారి కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చదవండి: Smart Policing: స్మార్ట్ పోలీసింగ్‌లో సర్వేలో ఏపీ అరుదైన రికార్డు.. కైకాల కుమారుడి ఫోన్ చేసిన సినీ ప్రముఖులు సినీ ప్రముఖులు చిరంజీవి, అల్లు అరవింద్, నందమూరి బాలకృష్ణ, మోహన్ బాబు, సీనియర్ నటుడు రావు రమేష్ కన్నడ సూపర్ స్టార్ యష్, మరో స్టార్ శివ రాజ్ కుమార్‌లు కైకాల కుమారుడికి ఫోన్ చేసి కైకాల ఆరోగ్యం గురించి వాకబు చేశారు. కైకాలకు ఏమీ కాదని, తామంతా ఉన్నామని సినీ ప్రముఖుల ధైర్యం చెప్పారు. మరోవైపు కైకాల కోలుకుంటున్నారని, ఎలాంటి ఇబ్బంది లేదని, దయచేసి పుకార్లు సృష్టించి ప్రజలను, కైకాల అభిమానులను ఆందోళనకు గురి చేయవద్దని ఆయన కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. -
నాన్నగారు కోలుకుంటున్నారు, వదంతులు నమ్మవద్దు: కైకాల సత్యనారాయణ కుమార్తె
ప్రముఖ నటులు కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే సత్యనారాయణ ఆరోగ్యం గురించి సోషల్‌మీడియాలో వదంతులు ప్రచారమయ్యాయి. దీంతో ఆయన కుమార్తె కైకాల రమాదేవి ఈ విషయంపై మంగళవారం ఓ ఆడియో సందేశం విడుదల చేశారు. ‘‘సత్యనారాయణగారి పరిస్థితి బాగానే ఉంది. నాన్నగారు కోలుకుంటున్నారు. బాగానే స్పందిస్తున్నారు. అందరితో మాట్లాడుతున్నారు. నిన్న (సోమవారం) డాక్టర్ మాదాల రవిగారు కూడా వచ్చారు. ఆయనతో నాన్నగారు మాట్లాడి థంబ్స్ అప్ కూడా చూపించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తప్పుడు సమాచారం ఇచ్చి ఎవర్నీ ఆందోళనకి గురిచేయొద్దు’’ అన్నారు రమాదేవి. -
నటుడు కైకాల ఆరోగ్యంపై సీఎం జగన్ ఆరా
CM YS Jagan Inquires About Kaikala Satyanarayana Health Condition: నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. తాజాగా కైకాల ఆరోగ్యంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కైకాల కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల సత్యనారాయణ ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కొన్ని రోజుల క్రితం ఇంట్లో ఆయన జారిపడటంతో నొప్పులు ఎక్కువగా ఉండటంతో అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అయితే బీపీ లెవల్స్ చాలా తక్కువగా ఉండటంతో వాసో ప్రెజర్ సాయంతో చికిత్స అందిస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు. కైకాలను ఎప్పటికప్పుడు వైద్యుల బృందం పరిశీలిస్తోందని తెలిపారు. -
కైకాల ఆరోగ్యంపై ఆడియో సందేశం ఇచ్చిన కూతురు రమాదేవి
టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. మూడు రోజుల క్రితం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేరిన ఆయనకు వైద్యులు వెంటిలెటర్‌పై చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన పరిస్థితి కాస్తా విషమంగా ఉందని, ఆయనను కాపాడేందుకు కృషి చేస్తున్నామంటూ రెండు రోజుల క్రితం అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. చదవండి: కైకాల సత్యనారాయణకు వెంటిలేటర్‌పై చికిత్స దీంతో ఆయన ఆరోగ్యంపై రకరకాలుగా పుకార్లు పుట్టుకొస్తున్నాయి, ఒక దశలో ఆయన పరిస్థితి విషమించిందని, పరిస్థితి చేచారిందంటూ సోషల్ మీడియాల్లో ప్రచారం మొదలు పెట్టారు. ఇక ఈ పుకార్లకు చెక్ పెడుతూ కైకాల కూతురు రమాదేవి ఓ ఆడియో సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె తన తండ్రి కోలుకుంటున్నారని, చికిత్సకు స్పందిస్తున్నట్లు వెల్లడించారు. చదవండి: నిక్‌తో ప్రియాంక విడాకులు? తల్లి మధు చోప్రా క్లారిటీ అంతేగాక తన తండ్రి కైకాల ఆరోగ్యం కొంత మెరుగుపడిందని, ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నట్లు ఆమె చెప్పారు. ఇక ఆయన ఆరోగ్యంపై అనవసరపు ప్రచారం చెయోద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇక ఆయన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను కూడా ఎవరూ నమ్మోద్దని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవరం లేదని ఆమె స్పస్టం చేశారు. కాగా ప్రస్తుత సమాచారం ప్రకారం కైకాల సత్యనారాయణ అపోలోలోనే చికిత్స తీసుకుంటున్నారు. ఆయన చికిత్సకి స్పందిస్తున్నారు. త్వరలోనే కైకాల కోలుకుంటారని వైద్యులు చెప్తున్నారు. -
కైకాల సత్యనారాయణకు వెంటిలేటర్‌పై చికిత్స
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు ఆదివారం సాయంత్రం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. కైకాల స్పృహలోనే ఉన్నారని, ఆయనకు చికిత్స కొనసాగుతోందని అపోలో వైద్యులు తెలిపారు. అయితే ఇంకా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు వివరించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని తెలిపారు. బీపీ లెవల్స్ చాలా తక్కువగా ఉండటంతో వాసో ప్రెజర్ సాయంతో చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. చదవండి: కొడుకుని ప్రేమతో ముద్దాడిన ఎన్టీఆర్.. వైరలవుతోన్న ఫోటో కైకాలను ఎప్పటికప్పుడు వైద్యుల బృందం పరిశీలిస్తోందని తెలిపారు. కాగా గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల సత్యనారాయణ ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కొన్ని రోజుల క్రితం ఇంట్లో ఆయన జారిపడటంతో నొప్పులు ఎక్కువగా ఉండటంతో అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్ధిస్తున్నారు. -
కైకాల ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్
Kaikala Satyanarayana Health: టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఆయనతో ఫోన్లో మాట్లాడానని, తన మాటలకు కైకాల ఆనందం వ్యక్తం చేశారని చెప్పారు. ఈ మేరకు కైకాల ఆరోగ్యం పై చిరంజీవి ఓ ట్వీట్ చేశాడు. ‘ఐసీయూలో చికిత్స పొందుతున్న సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ స్పృహలోకి వచ్చారని తెలియగానే క్రిటికల్ కేర్ డాక్టర్ సుబ్బారెడ్డి సహాయంతో ఆయనతో ఫోన్లో మాట్లాడాను. ఆయన త్వరితగతిన కోలుకుంటారన్న పూర్తి నమ్మకం ఆ క్షణం నాకు కలిగింది. ట్రాకియాస్టోమి కారణంగా ఆయన మాట్లాడలేకపోయినా, ‘త్వరలో మీరు ఇంటికి తిరిగి రావాలి, అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి’అని నేను అన్నప్పుడు ఆయన నవ్వుతూ థంబ్స్‌అప్ సైగ చేసి, థ్యాంక్యూ అని చూపించినట్టుగా డాక్టర్ సుబ్బారెడ్డి నాతో చెప్పారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో త్వరగా తిరిగి రావాలని ప్రార్థిస్తూ, ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులందరితో ఈ విషయం పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది’ అని చిరంజీవి పేర్కొన్నారు. #GetWellSoonKaikalaGaru #KaikalaSatyanarayana#NavaRasaNatanaSarvabhouma pic.twitter.com/Log3ohKtnz — Chiranjeevi Konidela (@KChiruTweets) November 21, 2021 -
నటుడు కైకాల ఆరోగ్య పరిస్థితి మరింత విషమం
Kaikala Satyanarayana Health Condition: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో ఈ రోజు ఉదయం ఆయన అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం విషమంగా ఉండటంతో వైద్యులు వెంటిలెటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు అపోలో వైద్యులు కైకాల ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఈ రోజు ఉదయం 7.30 గంటలకు ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యారని, ఆయన ఆరోగ్యం విషమంగానే ఉంది. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే కైకాల ఆరోగ్యం మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నామని అపోలో వైద్యులు తమ ప్రకటనలో వెల్లడించారు. చదవండి: బ్రేకప్‌లు, విడాకులు మన స్టార్ హీరోయిన్స్‌కు కలిసోచ్చాయా?! -
నటుడు కైకాల సత్యనారాయణ పరిస్థితి విషమం
Kaikala Satyanarayana: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై అందించి చికిత్స అందిస్తున్నారు. గతనెల 30న ఇంట్లో జారిపడటంతో అనారోగ్యానికి గురైన కైకాల కొన్ని రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా మరోసారి ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రిలో చేర్పించారు. -
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణకు అస్వస్ధత
Kaikala Satyanarayana Hospitalized: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం ఇంట్లో ఆయన జారిపడ్డారు. దీంతో గతరాత్రి నొప్పులు ఎక్కువగా ఉండటంతో సికింద్రాబాద్‌లోని ప్రముఖ ప్రైవేటు హాస్పిటల్లో ఆయనను చేర్పించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉందని, ఆందోళన పడాల్సి అవసరం లేదని కుటుంబసభ్యులు తెలిపారు. చదవండి: పునీత్ మా ఇంటికి వచ్చేవారు..కలిసి భోజనం చేసేవాళ్లం: బన్నీ పునీత్ రాజ్‌కుమార్‌కు పవర్‌స్టార్ అనే బిరుదు ఎలా వచ్చిందంటే.. -
భార్యతో కలిసి 'కైకాల' ఇంటికి వెళ్లిన చిరంజీవి
ప్రముఖ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. భార్య సురేఖతో కలిసి కైకాల ఇంటికి వెళ్లిన చిరంజీవి ఆయనకు నేరుగా విషెస్ తెలియజేసి కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘తెలుగు సినిమా ఆణిముత్యం, నవరస నటనా సార్వభౌముడు, నాకు అత్యంత ఆప్తులు కైకాల సత్య నారాయణ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని,ఈ రోజు నేను, నా సతీమణితో కలిసి ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసి కాసేపు ఆయనతో ముచ్చటించడం ఓ మధురమైన అనుభూతి’ అని చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. చిరంజీవి, కైకాల సత్యనారాయణ కాంబినేషన్లో ఎన్నో హిట్ చిత్రాలు వచ్చాయి. స్టేట్ రౌడీ, కొదమ సింహం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, యముడికి మొగుడు, బావగారు బాగున్నారా వంటివి వీరి సినిమాలు బ్లాక్ బస్టర్ చిత్రాలుగా నిలిచిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమా ఆణిముత్యం, నవరస నటనా సార్వభౌముడు, నాకు అత్యంత ఆప్తులు కైకాల సత్యనారాయణ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని,ఈ రోజు నేను,నా సతీమణితో కలిసి ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసి కాసేపు ఆయనతో ముచ్చటించడం ఓ మధురమైన అనుభూతి.Happy Birthday #KaikalaSatyanarayana garu! pic.twitter.com/NTm8RCf0LE — Chiranjeevi Konidela (@KChiruTweets) July 25, 2021 -
‘ఏదో సామెత చెప్పినట్టు.. డిక్కీలో పడుకోబెట్టేస్తాను’
‘వేటగాడు’లో దివాన్జీ అయిన రావు గోపాలరావుకు విలువైన హారం కావాలి. దానిని మెడలో వేసుకొని మారువేషంలో ఎన్.టి.ఆర్ వస్తాడు. ‘మా గురువు కల్లు కొండయ్య గారు’ అని నగేష్ ఎన్.టి.ఆర్ గురించి బిల్డప్ ఇస్తాడు. ఎన్.టి.ఆర్ ఊరికే ఉంటాడా? ‘ఏరా కుయ్యా’ అని రావు గోపాలరావును తిడతాడు. తిడితే పర్వాలేదు. ‘ఏవన్నాను’ అని ఆయన్నే రిపీట్ చేయమంటాడు. అప్పుడు రావుగోపాలరావు ‘ఏదో కుయ్యా అని చిన్న సౌండ్ ఇచ్చారండీ’ అంటాడు. ప్రేక్షకులు ఎంత నవ్వుతారో. ఆ సినిమాలోనే రావు గోపాలరావు ప్రాసతో ప్రాణాలు తీస్తుంటాడు. కొడుకైన సత్యనారాయణ విసిగిపోయి గుక్క తిప్పుకోకుండా ఎంత ప్రాస మాట్లాడతావో మాట్లాడు చూస్తాను అంటాడు. దానికి రావు గోపాలరావు చెప్పే డైలాగ్– ‘ఈస్టు స్టువర్టుపురం స్టేషనుమాస్టరు గారి ఫస్టు సన్ వెస్ట్‌కెళ్లి తనకిష్టమైన అతి కష్టమైన బారిష్టరు టెస్టులో ఫస్టు క్లాసులో బెస్టుగా పాసయ్యాడని తన నెక్స్ట్ ఇంటాయాన్ని ఫీస్టుకని గెస్టుగా పిలిస్తే ఆయన టేస్టీగా ఉన్న చికెను రోస్టుతో బెస్టు బెస్టు అంటూ తినేసి హోస్టుకు కూడా మిగల్చకుండా ఒక్కముక్క కూడా వేస్టు చేయకుండా సుష్ఠుగా భోంచేసి పేస్టు పెట్టి పళ్లు తోముకుని మరీ రెస్టు తీసుకున్నాడట ఏ రొస్టు లేకుండా. చాలా, ఇంకా వదలమంటావా భాషా బరాటాలు మాటల తూటాలు యతిప్రాసల పరోటాలు..... ’ ఇంకెక్కడి సత్యనారాయణ. పాయే. రావు గోపాలరావు విలన్‌గా తెలుసు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుసు. కాని కామెడీని పండించే నటుడుగా వచ్చిన అవకాశాలను వదలుకోలేదటాయన. ‘ముత్యాల ముగ్గు’లో అంత సీరియస్ విలనే అయినా ‘డిక్కీలో పడుకోబెట్టేస్తానని’ ప్రేక్షకులు భయంభయంగానే అయినా నవ్వేలా చేశాడు. చిరంజీవి ‘మగ మహారాజు’లో రావు గోపాలరావు ఎప్పుడూ ఒక మరుగుజ్జు పిల్లాడిని చంకనేసుకొని దింపినప్పుడల్లా వాడు ఏడుస్తుంటే హైరానాపడుతూ తెగ నవ్విస్తాడు. ‘మా ఊళ్లో మహాశివుడు’ రావు గోపాలరావు ప్రతిభకు మచ్చుతునక. అందులో ఆయన శివుడుగా భూమ్మీదకు వచ్చి పూజారి అయిన సత్యనారాయణతో పాలిటిక్స్, కరప్షన్, ప్రత్యేకరాష్ట్ర ఉద్యమాల గురించి మాట్లాడుతూ నవ్విస్తాడు. శోభన్‌బాబు ‘దేవత’ సినిమాలో రావు గోపాలరావు జయప్రదకు వరుసకు బాబాయ్. కాని జయప్రదకు చెల్లెలు శ్రీదేవి పెళ్లి కానిదే తాను చేసుకోకూడదని ఉంటుంది. ఆ సంగతి తెలిసినా రావు గోపాలరావు శ్రీదేవితో జయప్రద పెళ్లి గురించి మాట్లాడుతుంటే సడన్‌గా జయప్రద వస్తుంది. ఆ సమయంలో కప్పిపుచ్చుకోవడానికి రావు గోపాలరావు చేసే కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. రావు గోపాలరావుతో జంధ్యాల ‘రావు గోపాలరావు’ సినిమా తీశాడు. అందులో ఆయనకు మతిమరుపు ప్రొఫెసర్ వేషం ఇచ్చాడు. కోడి రామకృష్ణ ‘తోడు దొంగలు’ సినిమాలో పూర్తి స్థాయి కామెడీ వేషం చేయించాడు. అందులో లాంచి గైడుగా రావు గోపాలరావు చాలా సందడి చేస్తాడు. ఇక రాజేంద్ర ప్రసాద్‌తో నటించిన ‘ఆఒక్కటీ అడక్కు’లో రొయ్యల నాయుడుగా కామెడీ పండిస్తాడాయన. చివరి రోజులలో ఆయన నాగార్జున ‘అల్లరి అల్లుడు’లో వాణిశ్రీ భర్తగా నటించారు. ‘ఏదో సామెత చెప్పినట్టు’ అనేది ఆయన ఊతపదం. ఆయన చెప్పే సామెతలు అసలు సామెతలేనా అని సందేహం వస్తుంటుంది. ‘ఇదెలా ఉందంటే చీర కట్టుకోవే చిలకమ్మా గుడికెళదాం అని గుండూరావంటే తొక్కతో సహా ఎప్పుడో తినేశాను అనందంట అనసూయమ్మ. అలా ఉంది వ్యవహారం’... ఇది ఆయన చెప్పే సామెత. 57 ఏళ్ల చిన్న వయసులోనే రావు గోపాల రావు మరణించారు. కాని ఆయన ఇదిగో ఇలాంటి పాత్రలతో ప్రేక్షకుల ముఖాలపై మందస్మితమై వెలుగుతుంటారు. -
కైకాల సత్యనారాయణ బర్త్‌డే స్పెషల్ రేర్ ఫోటోలు
-
‘ఏనాడు ఆయనలో గర్వం చూడలేదు’
శుక్రవారం మరణించిన టాలీవుడ్ సీనియర్ దర్శకులు కోడి రామకృష్ణ మృతదేహానికి సినీ రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేత బొత్స సత్యనారాయణతో పాటు దర్శకుడు కే. రాఘవేంద్ర రావు, సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ, జగపతిబాబు, సంగీత దర్శకుడు కోటి లాంటి వారు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 100కు పైగా చిత్రాలను తెరకెక్కించినా కోడి రామకృష్ణలో ఏనాడు గర్వం చూడలేదన్నారు రాఘవేంద్ర రావు. దాసరి గారి తరువాత అత్యథిక చిత్రాలకు డైరెక్ట్ చేసిన దర్శకుల జాబితాలో కోడి రామకృష్ణ ముందుంటారని, గురువు బాటలోనే ఆయన కూడా ఎంతో మందిని వెండితెరకు పరిచయం చేశారని గుర్తు చేసుకున్నారు. -
12న కైకాల సినీ షష్టిపూర్తి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం–భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ‘వంశీ ఇంటర్నేషనల్’ సంస్థ ఈ నెల 12న నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ సినీ షష్టిపూర్తి (1959–2019), కనకాభిషేక మహోత్సవం నిర్వహించనుంది. ‘‘కైకాల సినీ షష్టిపూర్తి (1959–2019), కనకాభిషేక మహోత్సవం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నాం. ఈ కార్యక్రమంలో తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య, దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి, కోడి రామకృష్ణ, బి.గోపాల్, రేలంగి నరసింహారావు తదితర ప్రముఖులు పాల్గొంటారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో 12 సాయంత్రం 5గంటలకు జరిగే ఈ వేడుకలో శివశంకరి గీతాంజలి సమర్పణలో సినీసంగీత విభావరి ఉంటుంది’’ అన్నారు ‘వంశీ’ వ్యవస్థాపకులు శిరోమణి డా. వంశీ రామరాజు. -
కేజీఎఫ్.. నిజంగా అద్భుతం: రాజమౌళి
లెజెండరీ నటుడు కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్న చిత్రం ‘కేజీఎఫ్’.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తుండగా.. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా పరిచయం అవుతోంది. డిసెంబర్ 21న పలు భాషల్లో భారీగా విడుదలవుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో ‘వారాహి చలనచిత్ర’ బ్యానర్‌పై నిర్మాత సాయికొర్రపాటి విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కైకాల సత్యనారాయణతో పాటు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ‘కేజీఎఫ్ కన్నడ సినిమాలాగా కాకుండా పాన్ ఇండియన్ సినిమాలా రిలీజ్ అవుతోంది. చాలా సంతోషంగా ఉంది. అంత మంచి విజువల్స్ రావాలంటే డబ్బులు పెడితేనో, హీరో డేట్స్ ఇస్తేనో రావు. కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ ఉండాలి. అలాంటి టీమ్ వీళ్లకు దొరికింది కాబట్టే ఇలాంటి సినిమా తీయగలిగారు. ఇండియాలో ఏ భాషలోనూ లేని గొప్పతనం మన తెలుగువాళ్లకు ఉంది. ఒక సినిమా నచ్చితే భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తారు. కేజీఎఫ్ చాలా పెద్ద విజయం సాధించాల’ని రాజమౌళి కోరుకున్నారు. ‘రాజమౌళి ఇండియన్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లి మా అందరికీ బాట వేశారు. విజన్ ముందు బడ్జెట్ అనేది చాలా చిన్న విషయం అని నిరూపించారు. మీ అడుగుల్లోనే మేము ధైర్యంగా ఈ చిత్రన్ని పాన్ ఇండియాన్ సినిమాగా తీసుకొస్తున్నాం. హ్యాట్సాఫ్ సర్. నా టీమ్‌లోని ప్రతి టెక్నీషియన్ ఎంతో కష్టపడి పని చేయడం వల్లే ఇలాంటి సినిమా సాధ్యమైంది. చాలా ఎఫర్ట్ పెట్టి ఈ చిత్రాన్ని రూపొందించాం. తెలుగు ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరిస్తార’ని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆకాంక్షించారు. -
మిగతా ఇండస్ట్రీలకు పోటీగా పోరాడుతున్నాం
‘‘ఈ చిత్రం ట్రైలర్ గ్రాండ్‌గా ఉంది. కన్నడ సినిమా స్థాయిని ఇండియన్ సినిమా స్థాయికి పెంచేలా ఉంది. డైరెక్టర్ ప్రశాంత్, ప్రొడ్యూసర్ విజయ్‌కు అభినందనలు’’ అన్నారు కన్నడ నటుడు అంబరీష్. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మాతగా రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘కేజీఎఫ్’ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్). తెలుగులో వారాహి చలన చిత్ర బ్యానర్‌పై నిర్మాత సాయి కొర్రపాటి విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 21న ఈ చిత్రం విడుదల కానుంది. ట్రైలర్‌ని బెంగళూరులో విడుదల చేశారు. కన్నడ ట్రైలర్ విడుదల చేసిన సీనియర్ నటుడు అంబరీష్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటున్నా. తమిళంలో 5 కోట్ల బడ్జెట్‌తో ఒక్కపాట తీస్తుంటారు. మేం (కన్నడ) 5 సినిమాలు తీస్తాం. మిగతా ఇండస్ట్రీలకు పోటీగా కన్నడ ఇండస్ట్రీ ప్రాముఖ్యత కోసం పోరాడుతున్నాం. ఆ పోరాట పటిమ నాకు ఇష్టం. చరిత్రను రాసిన రాజ్‌కుమార్‌గారి పోస్టర్ ఒక్కటి కూడా కర్ణాటక సెంటర్లో చూడలేం. అది మా దురదృష్టం. ఈ సినిమా ప్యాన్ ఇండియా సినిమా అవుతుందనుకుంటున్నాను ’’ అన్నారు. ‘‘ రాబోయే రోజుల్లో ఇండియన్ సినిమాలో ప్రశాంత్ పేరు గుర్తుండి పోతుంది. నిర్మాత ఈ సినిమాకి అసలు హీరో. ఆయన లేకుంటే ఇంత భారీగా తెరకెక్కేది కాదు. కొన్ని క్లిప్పింగ్స్ చూసి ఈ సినిమాను ఆయా భాషల్లో విడుదల చేయడానికి ముందుకు వచ్చిన విశాల్, సాయికొర్రపాటి, అనిల్ తాండన్‌కు థ్యాంక్స్. అలాగే బాలీవుడ్ స్టార్స్ రితేష్ సిధ్వానీ, ఫర్హాన్ అక్తర్‌లకు కూడా థ్యాంక్స్. కన్నడ సినిమా స్థాయిని ఇండియన్ సినిమా స్థాయికి తీసుకెళ్లే చిత్రమిది’’ అన్నారు యష్. ‘‘నేను బళ్లారి నుంచి హైదరాబాద్ వెళ్లి నిర్మాతగా మారాను. ఈ సినిమాతో కన్నడ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాను. తెలుగులో మా వారాహి చలన చిత్రం బ్యానర్‌పై ఈ చిత్రాన్ని విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు సాయి కొర్రపాటి. విశాల్ మాట్లాడుతూ.. ‘యష్ నాకు సోదరుడితో సమానం. ‘కేజీఎఫ్’తో కన్నడ సినిమా.. ప్యాన్ ఇండియా మూవీగా నిలుస్తుంది. భాషా పరమైన సరిహద్దులను ఈ సినిమా చెరిపేస్తుంది. ‘బాహుబలి’తో ఇది వరకే ఈ విషయం నిరూపితమైంది. ఇప్పుడు ‘కేజీఎఫ్’తో మారోసారి రుజువుకాబోతోంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి’’ అన్నారు. అనిల్ తాండన్ మాట్లాడుతూ– ‘‘బాహుబలి, రోబో’ లాంటి భారీ సినిమాల తర్వాత విడుదల చేస్తున్న సౌతిండియన్ మూవీ ఇది. ఇది కూడా భారీ విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘నా తొలి సినిమా ‘ఉగ్రం’. ఆ సినిమా విడుదలకు ఒక్కరోజు ముందు హిట్ అవుతుందో లేదో అనుకున్నాను. చాలా పెద్ద హిట్ అయింది. దాంతో నాకు నమ్మకం కుదిరింది. అదే నమ్మకంతో నిర్మాత విజయ్ గారు ‘కేజీఎఫ్’ సినిమా చేయడానికి ముందుకొచ్చారు. నా 4ఏళ్ల కల సాకారమైంది’’ అన్నారు డైరెక్టర్ ప్రశాంత్. ‘‘అందరూ ఈ సినిమా బడ్జెట్ ఎంత అని అడుగుతున్నారు.. నాకు డబ్బు ముఖ్యం కాదు.. బంధాలే ముఖ్యం. కొత్త టాలెంట్ బయటకు రావాలనే ఆలోచనతో చేసిన చిత్రమిది. ప్రశాంత్ అద్భుతమైన డైరెక్టర్. యష్ నా తమ్ముడి లాంటి వాడు. ఈ సినిమా కోసం తను చాలా కష్టపడ్డాడు. నిర్మాతగా ఇది నాకో గొప్ప చిత్రం అవుతుంది’’ అన్నారు నిర్మాత విజయ్ కిరగందూర్. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు కన్నడ సూపర్‌స్టార్ పునిత్ రాజ్ కుమార్, బాలీవుడ్ స్టార్స్ రితేష్ సిధ్వానీ, ఫర్హాన్ అక్తర్‌లు వీడియో సందేశం ద్వారా అభినందనలు తెలిపారు. -
ప్రమాదం జరిగిన తీరు భయంకరంగా ఉంది!
హైదరాబాద్: రాజ్యసభ మాజీ ఎంపీ, సినీ నటుడు నందమూరి హరికృష్ణ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. హరికృష్ణ మృతి తనకు బాధ కలిగించిందన్నారు. ప్రమాదం జరిగిన తీరు చూస్తే చాలా భయంకరంగా ఉందన్నారు. ఎన్టీఆర్ కుటుంబంలో తనకు హరికృష్ణ అత్యంత ఆప్తుడని పేర్కొన్నారు. హరికృష్ణకు డ్రైవింగ్ అంటే ఇష్టమని, మంత్రిగా ఉన్న సమయంలో కూడా సొంతంగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లేవాడని తెలిపారు. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మాట్లాడుతూ.. హరికృష్ణ మృతి పట్ల బాధ వ్యక్తం చేశారు. హరికృష్ణ తండ్రి ఎన్టీఆర్ తనను సొంత తమ్ముడి కంటే ఎక్కువగా చూసేవారని, హరికృష్ణ తనను బాబాయి అని పిలిచేవాడని గుర్తు చేసుకున్నారు. చాలా హుందా గల మనిషి, హృదయం ఉన్న మనిషి, నిజాయతీ కలిగిన వ్యక్తి అకాల మరణం చెందడం తనకు బాధ కలిగించిందని వెల్లడించారు. -
మహానుభావుడి పాత్రలో మహానటుడు
ఏ పాత్రకైనా జీవం పోయగల నటులు కైకాల సత్యనారాయణ. అనేక చిత్రాల్లో విభిన్నమైన పాత్రలను పోషించి ప్రేక్షకులను మెప్పించారాయన. ఇప్పుడు తెలుగు సినిమా పితామహుడు, ప్రముఖ నిర్మాత హెమ్. ఎమ్. రెడ్డి పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) జీవితం ఆధారంగా రూపొందుతోన్న సినిమా ‘యన్టీఆర్’. ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ టైటిల్ రోల్లో నటిస్తూ, నిర్మిస్తున్నారు. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరు సమర్పణలో క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ) దర్శకత్వం వహిస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఈ సినిమాలో హెచ్.ఎమ్. రెడ్డి పాత్రలో నటిస్తున్నారు కైకాల సత్యనారాయణ. బుధవారం కైకాల సత్యనారాయణ జన్మదినం సందర్భంగా సినిమాలో ఆయన లుక్‌ను విడుదల చేశారు. ‘‘ఆ మహానుభావుడి పాత్రను ఈ మహానటుడు అమోఘంగా చేస్తున్నారు’’ అన్నారు క్రిష్. -
ఎన్టీఆర్ బయోపిక్: ‘టైగర్’ పాత్రలో కైకాల
విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న సినిమా ఎన్టీఆర్. టాప్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు రివీల్ చేస్తూ చిత్రబృందం సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కీలక పాత్రలకు పలువురిని ఫైనల్ చేసిన చిత్ర బృందం.. తాజాగా మరో కీలక పాత్రకు సంబంధించిన విషయాన్ని వెల్లడించింది. ఈ చిత్రంలో దర్శకుడు హెచ్ఎమ్ రెడ్డి పాత్రలో కైకాల సత్యనారాయణ నటించినట్లు దర్శకుడు క్రిష్ స్వయంగా ట్విటర్లో పేర్కొన్నాడు. నేడు(జులై25) కైకాల సత్యనారాయణ జన్మదిన సందర్బంగా క్రిష్ శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన ట్వీట్ నెటిజన్లను తెగ ఆకట్టుకోంటోంది. ‘కాళిదాస, భక్త ప్రహ్లాద చిత్రాలతో దక్షిణ భారతీయ సినిమాకు పునాది వేసిన పితామహుడు టైగర్ హెచ్ ఎమ్ రెడ్డి పాత్రలో నటించిన నవరస నట సార్వభౌమ శ్రీ కైకాల సత్యనారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ క్రిష్ ట్వీట్ చేశాడు. బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న ఈసినిమాలో ఆయన భార్యగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్నారు. కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, సీనియర్ నరేష్‌లు కనిపించనున్నారు. టైగర్ H.M Reddy గారి పాత్రలో నటించిన నవరస నట సార్వభౌమ శ్రీ కైకాల సత్యనారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు #NTR pic.twitter.com/5aiK0gcKla — Krish Jagarlamudi (@DirKrish) July 25, 2018 -
రాజధాని అభివృద్ధికి సినీ నటులు కృషి చేయాలి
ఆత్మకూరు(మంగళగిరిటౌన్): రాజధాని అభివృద్ధికి సినీ రంగం కూడా కృషి చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి పత్తిపాటి పుల్లారావు పిలుపునించారు. శనివారం రాత్రి మంగళగిరి మండల పరిధిలోని ఆత్మకూరు గ్రామంలోని హ్యాపీ రీసార్ట్ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర మండలి ఉగాది పురస్కారాల వేడుకల కార్యక్రమం కనులపండువగా నిర్వహించారు. చలన చిత్ర అవార్డుల కమిటి చైర్మన్ అంబటి మధుమోహనకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి పుల్లారావు మాట్లాడుతూ అమరావతి ప్రాంతంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తుళ్లూరు మండలంలోని అనంతవరం గ్రామం వద్ద మీడియా సిటి నిర్మిసామని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారని, విశాఖపట్టణంలో సినీ పరిశ్రమకు ప్రభుత్వం పలు ప్రోత్సాహాలను అందిస్తుందన్నారు. ఈ సదర్భంగా ప్రముఖ సినీనటుడు సత్యనారాయణ గురించి మాట్లాడుతూ సినీకళాకారునిగా, ఎంపిగా రాష్ట్రానికి ఎన్నో సేవలు చేశారని, నటనలో తనదైన శైలిలో సత్యనారాయణ తెలుగు పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. కైకాలకు జీవిత సాఫల్య పురస్కారం ప్రధానం... ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు కైకాల సత్యనారాయణ 750 చిత్రాలలో విలక్షణపాత్రలను పోషించి, చిత్రసీమకు పేరు ప్రఖ్యాతలను తీసుకు వచ్చేందుకు తనదై శైలిలో విశేష కృషి చేశారని తెలిపారు. చలనచిత్ర అవార్డుల కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి పత్తిపాటి పుల్లారావు చేతులు మీదుగా సత్యనారాయణకు జీవిత సాఫల్య పురస్కారం అందించారు. సత్యనారాయణతో పాటు ఉత్తమ దర్శకులుగా గరుడవేగ చిత్ర దర్శకుడు ప్రవీణ్ సత్తార్, మళ్లీరావా చిత్ర దర్శకుడు గీతంనాయుడుకు, శేఖరం గారి అబ్బాయి చిత్రం దర్శకుడు అక్షిత్శ్రీనివాసన్, ఒక్కడే మిగిలాడు చిత్ర దర్శకుడు అజెయ్ ఆడ్రూస్లకు ఉత్తమ దర్శకులు అవార్డులను ప్రదానం చేవారు. ఉత్తమ నటులు రవివర్మ(గరుడవేగ), అప్పాజి(మళ్లిరావే), ఉత్తమ నటి సాయిసుధభీమిరెడ్డి(అర్జున్‌రెడ్డి), హిమజ(శతమానంభవతి), కల్పాలిత్(బహుబలి2), ఉత్తమ నిర్మాతలు రాహుల్‌యాదవ్(మళ్లీరావే), దిల్‌రాజు(ఫిదా), త్తమ గాయకురాలు సోని(బహుబలి2), సంగీత దర్శకులు శక్తీకార్తిక్(ఫిదా) ప్రత్యేక పురస్కారాలు సౌమ్యావేణుగోపాల్(కాటమరాయుడు), మనారాచోప్రా(రోగ్), మనాలీరాథోడ్(లేడీస్టైలర్), సోనీచరిస్టా(టాప్‌ర్యాంకర్)గా ఎంపికైయ్యారు. జీవిత సాఫల్య పురస్కారం స్వీకరిస్తున్న కైకాల -
అత్యుత్సాహం : మరో నటుణ్ని చంపేశారు..!
ఇటీవల సోషల్ మీడియాలో కొంత మంది చూపిస్తున్న అత్యుత్సాహం సెలబ్రిటీలకు ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. ఏదైన వార్త వచ్చిన సందర్భంలో పూర్తిగా అవగాహన లేకుండా.. జరిగిన సంఘటన గురించి పూర్తిగా తెలుసుకోకుండా సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెట్టడం వెంటనే అవి వైరల్ అవ్వటం జరిగిపోతున్నాయి. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. సోమవారం సీనియర్ నటుడు వంకాయల సత్యనారాయణ మూర్తి అనారోగ్యంతో మృతిచెందారు. ఈయన మరణ వార్త మీడియాలో రావటంతో కొందరు వంకాయల సత్యనారాయణ మూర్తికి బదులుగా కైకాల సత్యనారాయణ మరణించినట్టుగా సోషల్ మీడియలో సంతాప సందేశాలను పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌లను మరికొందరు షేర్ చేయటంతో ఈ వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో కైకాల సత్యనారాయణగారు క్షేమంగా ఉన్నారంటూ మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది. -
ఆయనే నిజమైన కళాకారుడు – కైకాల సత్యనారాయణ
‘‘ఆ ఈశ్వరుడికి, కళకు సంబంధం ఉంది. కళలో ఈశ్వర శక్తి ఉంది. అందుకే కళలను ప్రేమిస్తాను. ఆరాధిస్తాను. కళాకారులపై అభిమానంతో, వారిని అభినందించి సత్కరిస్తాను. దీనికి రాజకీయంతో సంబంధం లేదు. కళలను ఆరాధిస్తూ అందర్నీ ప్రేమిస్తూ, అజాత శత్రువుగా ఉండాలన్నదే జీవితంలో నా కోరిక అన్నారు’’ కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి. మహా శివరాత్రి సందర్భంగా విశాఖ సముద్ర తీరాన టీయస్సార్ ఆధ్వర్యంలో కోటి శివలింగాల ప్రతిష్ట, మహా కుంభాభిషేకం కార్యక్రమం ఈ నెల 13న జరగనుంది. ఈ సందర్భంగా సీనియర్ నటులు కైకాల సత్యనారాయణకు ‘విశ్వనట సమ్రాట్ బిరుదు’ ప్రదానం చేయనున్నారు. అలాగే యశ్ చోప్రా స్మారక జాతీయ అవార్డును ప్రముఖ గాయని ఆశా భోంస్లేకు ప్రదానం చేయనున్నారు. ఈ వేడుకల వివరాలను హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో టి. సుబ్బరామిరెడ్డి వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ – ‘‘కోటి లింగాల ప్రతిష్ట, మహా కుంభాభిషేకం కార్యక్రమం ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తయింది. ఫిబ్రవరి 13న సిల్వర్ జూబ్లీ చేయనున్నాం. ఆ రోజు 7 గంటలకు ప్రారంభమయ్యే అభిషేకం మధ్యాహ్నం మూడు గంటల వరకు సాగుతుంది. అలాగే సాయంత్రం 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు శివజాగారం కొరకు భక్తి రస కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. దాదాపు వెయ్యి చిత్రాల్లో కైకాల సత్యనారాయణ నటించారు. ఎన్టీఆర్ వంటి గ్రేట్ ఆర్టిస్ట్‌తో వర్క్ చేశారు. ఆయనకు ‘విశ్వనట సమ్రాట్’ బిరుదును ప్రదానం చేయనున్నాం. స్వర్ణకంకణ ఘనసన్మానం కూడా జరుగుతుంది. యశ్ చోప్రాగారు దేశం గర్వించదగ్గ ఫిల్మ్‌మేకర్. ఆయనతో కలిసి ‘చాందినీ, లమ్హే’ లాంటి చిత్రాల నిర్మాణంలో పాలు పంచుకున్నందుకు ఆనందంగా ఉంది. ఆయన జ్ఞాపకార్థం 2014లో ప్రారంభించిన యశ్ చోప్రా స్మారక జాతీయ పురస్కారాన్ని ఈ ఏడాది గాయని ఆశా భోంస్లేకు అందజేయాలని జ్యూరీ కమిటీ నిర్ణయించింది. త్వరలో మహబూబ్‌నగర్‌లో కాకతీయ కళా వైభోత్సవాన్ని నిర్వహించాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘మహాశివరాత్రి రోజున ప్రజల సమక్షంలో విశ్వనట సమ్రాట్ బిరుదుతో నన్ను సత్కరించనుండటం ఆనందంగా ఉంది. కళాకారులు గౌరవాన్ని కోరుకుంటారు. ఏమీ ఆశించకుండా డబ్బును కళాసేవకు వినియోగిస్తున్నారు టి.సుబ్బరామిరెడ్డిగారు. ఆయనే నిజమైన కళాకారుడు. కళామతల్లి ముద్దుబిడ్డ అన్నది నా ఉద్దేశం. ఇలాంటి కార్యక్రమాలు ఆయన ఎన్నో చేయాలి. నాకు పద్మశ్రీ, పద్మ విభూషణ్ కంటే ఈ అవార్డు గొప్పదని నేను భావిస్తున్నాను’’ అన్నారు కైకాల సత్యనారాయణ. ఈ కార్యక్రమంలో మురళీమోహన్, పరుచూరి వెంకటేశ్వరరావు, పద్మినీ కొల్హాపురి, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కైకాలఃదీర్ఘాయుష్మాన్ భవ
సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ చాలా విరామం తర్వాత ఓ కీలక పాత్ర చేసిన చిత్రం ‘దీర్ఘ ఆయుష్మాన్ భవ’. కార్తీక్ రాజు, మిస్తీ చక్రవర్తి జంటగా ఎం.పూర్ణానంద్ దర్శకత్వంలో జి.ప్రతిమ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ లోగోను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఎం.పూర్ణానంద్ మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు వచ్చిన ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా తెరకెక్కుతోన్న సోషియో ఫాంటసీ ప్రేమకథా చిత్రమిది. సినిమా ఆద్యంతం ఫ్రెష్ లుక్‌తో ఉంటుంది. మూడు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. గ్రాఫిక్ వర్క్ జరుగుతోంది. ఫిబ్రవరిలో సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు. ‘‘నా గత చిత్రాల కంటే వైవిధ్యంగా ఉండే సినిమా ఇది. పూర్ణానంద్గారు ఓ గమ్మత్తెన ప్రేమకథతో తీస్తున్నారు. ‘దీర్ఘ ఆయుష్మాన్ భవ’ ఈ కథకు కరెక్ట్ టైటిల్’’ అన్నారు కార్తీక్ రాజు. ‘‘నేటి తరం ప్రేమకథల్లో ఇదొక విభిన్నమైన కథ, కథనాలతో తెరకెక్కుతోంది. నా పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంటుంది’’ అన్నారు మిస్తీ చక్రవర్తి. నోయల్, ఆమని, పృథ్వీరాజ్, కాశి విశ్వనా«థ్, ‘సత్యం’ రాజేష్, ‘తాగుబోతు’ రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సిద్ధార్థ్, కెమెరా: మల్హర్‌భట్ జోషి. -
ఎన్టీఆర్ సన్నిహితులను టీడీపీ పక్కన పెట్టేసింది
విజయవాడ కల్చరల్: సీనియర్ ఎన్టీఆర్‌తో సన్నిహితంగా ఉన్నవారిని తెలుగుదేశం పార్టీ పక్కన పెట్టేసిందని సినీ నటుడు, టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు కైకాల సత్యనారాయణ చెప్పారు. విజయవాడలో శుక్రవారం మహానటి సావిత్రి కళాపీఠం ఆధ్వర్యంలో సత్కారం అందుకోవడానికి వచ్చిన ఆయన సాక్షితో మాట్లాడారు. పార్టీ వ్యవస్థాపక సభ్యుడినైన తనను సలహాల కోసం టీడీపీ ప్రభుత్వం ఏనాడూ సంప్రదించలేదన్నారు. టీడీపీ ప్రారంభం నుంచి ఎన్టీఆర్‌తో కలసి తిరిగానని, ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడానికి అన్నగారు ప్రయత్నం చేశారని చెప్పారు. అయితే విధి అనుకూలించక అది సాధ్యం కాలేదన్నారు. ఆ తర్వాత మచిలీపట్నం నుంచి ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిచానని తెలిపారు. సీనియర్ ఎన్టీఆర్ తనను నమ్ముకున్నవాళ్లకి ఏదోఒకటి చేశారని గుర్తు చేశారు. నమ్మకద్రోహంతో పదవి పోగొట్టుకొన్న సమయంలోనే ఎన్టీఆర్ గతంలో ఎప్పుడూ లేనంతగా బాధపడ్డారని గుర్తు చేసుకున్నారు. ఇక ప్రభుత్వ పురస్కారాల వెనక పెద్ద లాబీ ఉండాలని, అది తనకు లేదన్నారు. ప్రభుత్వం నామినేట్ చేయాలని, కారణం అడిగితే పార్టీ సభ్యుడివి అంటారని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆ దిశగా ప్రయత్నం చేసినట్లు తనకు ఎక్కడా కనిపించలేదన్నారు. నేడు పద్మశ్రీ,, పద్మభూషణ్ పురస్కారాలు పొందిన వారు ఏదోఒక పార్టీతో అనుబంధం ఉన్నవారేనన్నారు. పురస్కారాలు నటీనటుల బాధ్యతను మరింత పెంచుతాయి పురస్కారాలు నటీనటుల బాధ్యతను మరింత పెంచుతాయని సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. ఏపీ భాషా సాంస్కృతిక శాఖ, మహానటి సావిత్రి సాహిత్య సాంస్కృతిక కేంద్రం సంస్థలు సంయుక్తంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం లో శుక్రవారం కైకాల సత్యనారాయణకు ఆత్మీయ సత్కారం నిర్వహించాయి. ఈ సందర్భంగా కైకాల మాట్లాడుతూ.. నటనను తపస్సులా భావించాలన్నారు. -
అద్భుతం.. అభినందనీయం
-
అద్భుతం.. అభినందనీయం
‘సాక్షి ఎక్సలెన్స్’ అవార్డులపై ప్రముఖ టీవీ జర్నలిస్ట్ బర్ఖాదత్ ∙అంగరంగ వైభవంగా పురస్కారాల ప్రదానోత్సవం కళాతపస్వి కె విశ్వనాథ్, మెగాస్టార్ చిరంజీవి తదితర అతిరథ మహారథులతో కళకళలాడిన వేదిక దర్శకరత్న దాసరికి తెలుగు శిఖరం అవార్డు ∙కైకాల సత్యనారాయణకు జీవిత సాఫల్య పురస్కారం మొత్తం 29 మందికి పురస్కారాల ప్రదానం సాక్షి, హైదరాబాద్: ‘‘సామాజిక సేవారంగం, కళలు, విద్య, వైద్యం తదితర రంగాల్లో అద్భుత ప్రతిభాపాటవాలున్న విశిష్ట వ్యక్తులను గుర్తించి సత్కరించేందుకు ‘సాక్షి’ చేసిన ప్రయత్నం అద్భుతం.. అభినందనీయం.. తొలిసారి ఇంత మంది గొప్ప వ్యక్తులను ఒకే వేదికపై కలుసు కున్నందుకు గర్వపడుతున్నాను. వారిని కలుసు కోవడం ఎంతగానో సంతృప్తినిచ్చింది’’ అని ప్రముఖ టీవీ జర్నలిస్ట్ బర్ఖాదత్ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ‘సాక్షి’ ఎక్సలెన్స్ మూడో వార్షిక అవార్డుల ప్రదానోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళాతపస్వి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్, మెగాస్టార్ చిరం జీవి, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తదితరులు హాజరయ్యారు. తొలుత ‘సాక్షి’ చైర్పర్సన్ వైఎస్ భారతీరెడ్డి, బర్కాదత్, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బర్ఖాదత్ మాట్లాడుతూ ‘ప్రస్తుతం న్యూస్ మీడియా సంక్షోభం ఎదుర్కొంటోంది. కొన్ని జాతీయ చానళ్లలో న్యూస్ యాంకర్స్ టీవీ స్టూడియోల్లోకి ప్రవేశించి రాబోయే రోజుల్లో చోటుచేసుకునే పలు కీలక పరిణామాలపై సొంత వ్యాఖ్యానాలు చేయడం శోచనీయం. మీడియా సామాన్యుల గొంతుకలా నిలవాలి. ‘సాక్షి’ మీడియా అవార్డులకు ఎంపికైన వారి ప్రస్థానంపై ప్రదర్శించిన వీడియో క్లిప్పింగులు చూసిన తర్వాత నేను క్షేత్రస్థాయికి వెళ్లి రిపోర్టింగ్ చేసిన అనుభూతిని తలపించింది’ అని అన్నారు. వివిధ రంగాల్లో ఎంపికైన వారికి బర్ఖాదత్, చిరంజీవి, వైఎస్ భారతీరెడ్డి, కె.విశ్వనాథ్, అల్లు అరవింద్ తదితరుల చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. విజేతలతోపాటు ముఖ్య అతి థులను ఘనంగా సన్మానించారు. తెలుగు శిఖరం అవార్డుకు ఎంపికైన దర్శకరత్న దాసరి నారాయణరావు ఆరోగ్యకారణాల రీత్యా అవా ర్డును అందుకోవడానికి రాలేకపోయారు. ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణకు కె.విశ్వనాథ్ చేతుల మీదుగా జీవన సాఫల్య పురస్కారం అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ మాట్లాడుతూ.. విలన్ పాత్రలకే పరిమితమైన సత్యనారాయణను శారద సినిమా ద్వారా గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్టుగా చూపామన్నారు. ఆయన విలక్షణ నటుడని కొనియాడారు. అనంతరం మెగాస్టార్ చిరంజీవిని సాక్షి చైర్పర్సన్ వైఎస్ భారతీరెడ్డి, డైరెక్టర్లు రాణీరెడ్డి, రామచంద్రమూర్తి, కేఆర్పీ రెడ్డి, పీవీకే ప్రసాద్ ఘనంగా సన్మానించారు. 29 మందికి అవార్డులు.. కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన 29 మంది ప్రముఖులకు అవార్డులు ప్రదానం చేశారు. అవార్డులు అందుకోలేకపోయిన వారి తరఫున వారి కుటుంబ సభ్యులు అందుకున్నారు. ఈ అవార్డులకు ఎంపికైన విజేతలు ఆయా రంగాల్లో చేసిన కృషిని గుర్తుచేస్తూ ప్రదర్శించిన స్వల్ప నిడివి వీడియో వీక్షకులను మంత్రముగ్ధులను చేసింది. కార్యక్రమ ప్రారంభంలో దీపికారెడ్డి బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గాయని మాళవిక ఆలపించిన ‘ఉంటాలే..ఉంటాలే.. నీతో ఉంటాలే..’ పాట వీక్షకులను అలరించింది. నటి లావణ్య త్రిపాఠి హిందీ సినీ గీతం ఆలపించి ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వినోద్ అగర్వాల్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, సమాచార శాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్, జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి, అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్) అంజనీకుమార్, డాక్టర్ ప్రణతీరెడ్డి, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, హీరో నిఖిల్, నటుడు రాజా రవీంద్ర, దర్శక నిర్మాత మధుర శ్రీధర్‌రెడ్డి, హీరోయిన్ రీచాపనయ్, శాలిని, సప్తగిరి ఎక్స్‌ప్రెస్ నిర్మాత రవికిరణ్, దర్శకుడు అరుణ్ పవార్, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి, బిగ్‌సి డైరెక్టర్ స్వప్నకుమార్, వైఎస్సార్సీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి, విద్యావేత్త చుక్కారామయ్య, జ్యూరీ మెంబర్స్ జయధీర్ తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. -
నేడు సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవం
ముఖ్య అతిథిగా బర్ఖాదత్ - ‘తెలుగు శిఖరం’గా డాక్టర్ దాసరి నారాయణరావు - కైకాల సత్యనారాయణకు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు సాక్షి, హైదరాబాద్: సమాజంలోని వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలందజేసిన ప్రముఖులకు ప్రతి ఏటా అందజేసే ‘సాక్షి’ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఫిల్మ్‌నగర్ జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. ప్రముఖ టెలివిజన్ జర్నలిస్టు, రచయిత్రి బర్ఖాదత్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, అడిషనల్ డీజీపీ అంజనీ కుమార్, రెయిన్బో హాస్పిటల్ క్లినికల్ డైరెక్టర్–మెటర్నల్ అండ్ ఫెటల్ మెడిసిన్ డాక్టర్ ప్రణతీరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వినోద్ అగర్వాల్, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, జలమండలి ఎండీ దానకిశోర్, పర్యాటక శాఖ కమిషనర్ బుర్రా వెంకటేశం, సమాచార శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలేంద్రకుమార్ జోషి, సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్, డైరెక్టర్ బోయపాటి శ్రీను, సాగర్ తదితర ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. తెలుగు శిఖరం దాసరి కన్నులపండువగా జరగనున్న ఈ వేడుకల్లో తెలుగు సినీ దిగ్గజం, డాక్టర్ దాసరి నారాయణరావుకు ‘తెలుగు శిఖరం’ అవార్డును అందజేయనున్నారు. అలా గే ప్రముఖ సినీ నటుడు కైకాల సత్యనారాయణ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకోనున్నా రు. సామాజిక సేవ, సాహిత్య, సాంస్కృతిక రంగాలు, విద్య, వైద్యం, వ్యవసాయం, క్రీడలు, సినిమా తదితర రంగాల్లో ఉత్తమ సేవలందజేసిన వ్యక్తులు, సంస్థలు, నటీనటులు, క్రీడాకారులకు ‘సాక్షి’ ఎక్సలెన్స్ అవార్డులను అందజేయనున్నారు. గత రెండేళ్లుగా సాక్షి ఆయా రంగాలకు చెందిన వారి సేవలను గుర్తించి, విజేతలను ఎంపిక చేసి అవార్డులను అంద జేస్తున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా ఈ ఏడాది కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన న్యాయ నిపుణుల బృం దం విజే తల ఎంపికలో ప్రతిష్టాత్మకంగా వ్యవహ రించింది. ఆయా రంగా ల్లో వారు అందజేస్తున్న సేవలు, సాధించిన విజయాలు, సమాజ పురోగమనంలో వారి ప్రభావం వంటి అంశా లను ప్రామాణికంగా తీసుకుని అవార్డులకు ఎంపిక చేశారు. -
నవరసాల కైకాల
-
సినీ పరిశ్రమకు ఎంత చేశాడో..
-
మనస్ఫూర్తిగా నచ్చి చేశా...
‘‘ఇటీవల సినిమాలు చూస్తుంటే నాకు బాధ కలుగుతోంది. పెద్ద తరహా పాత్రలు చేయమని చాలామంది అడుగుతున్నా, ఆ తరహా సినిమాల్లో నటించి ఉన్న పేరు పోగొట్టుకోవడం ఇష్టం లేక ఒప్పుకోవడంలేదు. పూసల చెప్పిన కథ నచ్చి, మనస్ఫూర్తిగా నా పాత్ర నచ్చి, ఈ సినిమా చేశా’’ అని సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ చెప్పారు. యశ్వంత్, మిత్ర జంటగా పూసల దర్శకత్వంలో బేబీ శ్రీక్రితి సమర్పణలో సత్యం నిర్మించిన ‘డాలర్‌కి మరో వైపు’ చిత్రం లోగో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. పూసల మాట్లాడుతూ -‘‘ఈ తరం వారికి అమెరికాపై ఉన్న మోజు, డాలర్లకు బానిసలవ్వడం, ఉమ్మడి కుటుంబంలోని ప్రేమానురాగాలు కరువవ్వడం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. నవంబరు మొదటి వారంలో పాటలను, అదే నెల 14న చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఇంకా యశ్వంత్, మిత్ర, సందీప్తి తదితరులు మాట్లాడారు. -
ఆ వేషం ఇవ్వకపోతే సత్యాగ్రహం చేస్తానన్నాను!
నవరస నటనా సార్వభౌముడంటే కైకాల సత్యనారాయణే! నో సెకండ్ థాట్! వందలాది సినిమాలు... వందలాది పాత్రలు.. ఏం చేసినా... ఆయన ముద్ర మాత్రం సుస్పష్టం. కైకాలను గురువుగా భావించే నటుల్లో ముందు వరుసలో నిలిచే వ్యక్తి గిరిబాబు. తెలుగు తెరపై ఈయనదొక సెపరేట్ హిస్టరీ. నేడు కైకాల సత్యనారాయణ పుట్టినరోజు... ఈ సందర్భంగా సమ్‌థింగ్ స్పెషల్ చేయాలనిపించింది. కైకాలను గిరిబాబుతో ఇంటర్వ్యూ చేయిస్తే? ఇద్దరూ గుడ్ అన్నారు... ఓకే అన్నారు. గురుశిష్యులు మాట్లాడుకున్నట్టుగా... స్నేహితులు మనసు విప్పి ఎన్నో అనుభూతులు పంచుకున్నట్టుగా... సీనియర్ నటులు తమ అనుభవాల చిట్టా విప్పినట్టుగా... వీరిద్దరి సంభాషణ సాగింది. గిరిబాబు: గురువుగారూ... నమస్కారం. మామూలుగా మనల్ని రిపోర్టర్లు ఇంటర్వ్యూలు చేస్తారు. ఇప్పుడు ‘సాక్షి’ పేపర్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి నన్ను రిపోర్టర్ని చేసింది. చాలా సంతోషంగా ఉందండీ... కైకాల: సంతోషం గిరిబాబు. నిన్నందరూ ‘ఎన్సైక్లోపీడియా’ అంటారు. అందుకే, నీతో నన్ను ఇంటర్వ్యూ చేయించాలనుకుంటున్నానని భవానీ చెప్పగానే ఓకే అనేశాను. మనం ఈ మధ్య కలుసుకుని కూడా చాలా రోజులైంది. గిరిబాబు: అవునవును... మీరు, నేను, నాగేశ్వరరావుగారు వారానికి రెండు, మూడుసార్లయినా కలుసుకునేవాళ్లం. గుమ్మడిగారి ఇల్లే మనకు మీటింగ్ ప్లేస్. అప్పుడప్పుడూ నాగేశ్వరరావుగారింటికి వెళ్లేవాళ్లం. గుమ్మడిగారు పోయాక మన మీటింగులు తగ్గాయి. నాగేశ్వరరావుగారు దూరమైన తర్వాత సాంతం మానేశాం. గిరిబాబు: మీ గురించి నాకు తెలిసినా.. మిగతావాళ్లకి తెలియాలని అడుగుతున్నా.. మీరెంతవరకు చదువుకున్నారు? పెద్దయ్యాక ఏమవ్వాలనుకునేవారు? కైకాల: ఇప్పుడు ‘ఏయన్నార్ కాలేజ్’ అంటున్నారు కదా.. అప్పట్లో ‘ది గుడివాడ కాలేజ్’ అనేవారు. అందులోనే ఇంటర్, బీఏ చదివా. నాకు డాక్టర్ కావాలని ఉండేది. అందుకే ముందు బీఎస్సీలో చేరాను. బీఎస్సీ అంటే ప్రతిరోజూ రికార్డులు రాయాల్సి ఉంటుంది. కానీ, నాకేమో నాటకాల పిచ్చి. ఇలా రికార్డుల మీద రికార్డులు రాస్తూ కూర్చుంటే, ఇక నాటకాలకు సమయం ఉండదనుకున్నా. అందుకే, మా ప్రిన్సిపాల్ త్యాగరాజుగారిని అడిగి, ‘బీఏ - ఎకనామిక్స్’లో చేరా. గిరిబాబు: మీరేమో మంచి అందగాడు.. స్పోర్ట్స్‌లో ఛాంపియన్. మరి, మీరెవరితోనైనా ప్రేమలో పడ్డారా? కైకాల: చాలామంది అమ్మాయిలకు నేనంటే ఇష్టం. కానీ, నా మనసు మాత్రం కుసుమ దగ్గరే. మా ఇద్దరికీ ఓ లెక్చరర్ మధ్యవర్తి. నేను, కుసుమ పెళ్లి చేసుకోవాలనుకున్నాం. మా ఇంట్లోవాళ్లకీ, వాళ్ల ఇంట్లోవాళ్లకీ నచ్చలేదు. పెద్దవాళ్ల అనుమతి లేకుండా పెళ్లి చేసుకుంటే సంసారం సజావుగా ఉండదని పెళ్లి నిర్ణయాన్ని విరమించుకున్నాం. గిరిబాబు: అలా ట్రాజెడీగా మీ ప్రేమకథ ముగిసిందన్నమాట. పోతే అందరూ మిమ్మల్ని అందగాడు అనడం వల్ల నాటకాలు వేసి, సినిమాల్లోకి రావాలనుకున్నారా? కైకాల: నాకు నాటకాలంటే ఇష్టం ఉండేది. నేను నైన్త్ ఫారమ్‌లో ఉన్నప్పుడు మా గుడివాడలో ‘ప్రేమలీల’ అనే నాటకంలో నటించా. గోల్డ్ మెడల్ వచ్చింది. అప్పట్నుంచీ నటన మీద ఆసక్తి బాగా పెరిగిపోయింది. 1953 నుంచి 55 వరకు బీఏ చేస్తున్నప్పుడు మేం కొంతమంది కలిసి ఓ నాటక సమాజం ఆరంభించి, నాటకాలు వేసేవాళ్లం. హీరో వేషాలతో రెండేళ్లు నేను ‘బెస్ట్ యాక్టర్’ని. నాటకాల్లో నన్ను చూసి, ‘రామారావుగారి తమ్ముడు’ అని విజిల్స్ వేసేవాళ్లు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత నాటకాలు వేస్తూనే, మాకున్న కలప వ్యాపారం చూసుకునేవాణ్ణి. ఇలా సాగుతుండగా కేయం. ధర్ అని మద్రాసులో ఎల్వీ ప్రసాద్‌గారి కంపెనీలో కళా దర్శకుడు తోట దగ్గర అసిస్టెంట్ ఆర్ట్ డెరైక్టర్‌గా ఉండేవారు. ఆయన దగ్గరకెళ్లి ‘‘నాటకాల్లో మంచి పేరుంది. సినిమాలకు పనికొస్తానా’’ అనడిగా. పనికొస్తావన్నారు. గిరిబాబు: సరే.. మద్రాస్ ఎప్పుడెళ్లారు? కైకాల: రాజమండ్రిలో మాకు హోల్‌సేల్ డిపో ఉండేది. ఓ రెండు నెలలు ఆ వ్యాపారం చూసుకున్నాను. ఇంటికెళ్లి చాలా కాలమైంది కదా అని మా గుడివాడ వెళ్లాను. అప్పుడు కేయం ధర్గారు ‘‘ఎల్వీ ప్రసాద్‌గారు కొత్తవారితో ‘కొడుకులు కోడళ్లు’ సినిమా తీస్తున్నారు. మద్రాస్ రావాలి’’ అంటూ కబురు పెట్టారు. 1956 సెప్టెంబర్ 26న గుడివాడలో బయలుదేరి 27న మద్రాసులో అడుగుపెట్టాను. అప్పుడు తెలిసింది కష్టాలంటే ఎలా ఉంటాయో. ఎల్వీ ప్రసాద్ గారు నెల రోజులు ఆగాలన్నారు. ఈలోగా తినడం, తిరగడం.. రాత్రి నిద్రపోవడం విసుగొచ్చేసింది. ‘‘ఏమిట్రా ఈ ఖర్మ.. ’’ అంటూ ఓ రోజు దుఃఖం పట్టలేక ఏడ్చాను కూడా. సూర్యనారాయణగారని మా బంధువు సౌండ్ ఇంజినీర్‌గా చేసేవారు. ఆయన ద్వారా బి.ఏ. సుబ్బారావు గారినీ, సుబ్బారావు గారి సలహా మీద ఎల్వీ ప్రసాద్ గారినీ, ప్రసాద్ గారు పంపడంతో కేవీ రెడ్డిగార్ని కలిశాను. కేవీ రెడ్డి బృందం టెస్టులు చేసి, ‘పెళ్లి నాటి ప్రమాణాలు’ సినిమా కోసం నన్ను సెలక్ట్ చేశారు. తీరా చివరకు, ‘‘సత్యనారాయణా.. ఏమీ అనుకోకు. కొన్ని కారణాల వల్ల ఆర్. నాగేశ్వరరావును తీసుకున్నాం. నీకు నేనే పెద్ద వేషం ఇస్తా’’ అని కేవీ రెడ్డి మాటిచ్చారు. నన్ను రోజూ కలవమన్నారు. ఈలోపు పి. పుల్లయ్యగారు, డీఎల్‌గారు.. ఇలా అందరికీ నా గురించి చెప్పారు. కానీ, నాకా సంగతి తెలియదు. అవకాశం కోసం నేను డీఎల్గారిని కలిశాను. కేవీ రెడ్డిగారు చెప్పింది నా గురించే అని డీఎల్ గారికి అర్థమైంది. ‘‘నువ్విప్పటి వరకూ ఎక్కడా చిన్న వేషాలు వేయలేదంటే నీకు హీరోగా అవకాశం ఇస్తా’’ అన్నారు. అదే ‘సిపాయి కూతురు’. నెలకు మూడు వందలు జీతం. మూడేళ్లు అగ్రిమెంట్. బయటి సినిమాలు చేయాలంటే, అనుమతి తీసుకోవాలి. చివరికి ‘సిపాయి కూతురు’ విడుదలైంది, ఫ్లాపైంది. గిరిబాబు: ‘సిపాయి కూతురు’ టైమ్‌లోనే విఠలాచార్య మీకు అవకాశమివ్వబోయారు కదా. ఆయన్ని కలిశారా? కైకాల: అప్పుడు మోడ్రన్ థియేటర్స్ వారు ‘సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి’ సినిమా ప్లాన్ చేశారు. ఎస్.డి. లాల్ దర్శకుడు. ఆ సినిమాలో ముగ్గురు హీరోలు. ఒక కుర్రాడిగా నా పేరు సూచించారు విఠలాచార్యగారు. కానీ, డిస్ట్రిబ్యూటర్ పూర్ణా పిక్చర్స్ కామరాజుగారు నన్ను తీసేయమన్నారు. అయినా సరే, విఠలాచార్యగారు మొండిగా ‘రెండు రోజులు డెరైక్ట్ చేసి, ఆ రషెస్ అందరికీ చూపిస్తా, నచ్చితేనే తీసుకోండి. లేకపోతే ఆ రెండు రోజుల ఖర్చు నేనే భరిస్తా’ అని చెప్పారు. అందుకే మొదటి రెండు రోజులు ఆయనే డెరైక్ట్ చేశారు. ఫస్ట్ సినిమాయేమో ఫెయిల్. రెండో అవకాశం ఇలా. ఇక, ఏ మొహం పెట్టుకుని ఊరెళ్లాలి.? ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. ఆ సాయంత్రం రషెస్ చూసి, నా నటన నచ్చిన మోడ్రన్ థియేటర్స్ అధినేత సుందరంగారు ‘‘నేను ఈ అబ్బాయిని తీసుకుంటున్నా’’ అని, 25 వేలు చెక్ ఇచ్చారు. ఆ విధంగా విఠలాచార్యగారు నాకు హెల్ప్ చేశారు. సినిమాలపరంగా కన్నతండ్రి డీఎల్గారైతే, పెంచిన తండ్రి విఠలాచార్యగారనే చెప్పాలి. గిరిబాబు: ఆర్. నాగేశ్వరరావుగారు చనిపోయాక విలన్‌గా రాజనాల నంబర్ వన్. ఆయనను మీరు అధిగమించారు కదా. రాజనాల మీతో ఎలా ప్రవర్తించేవారు? కైకాల: నన్ను సబార్డినేట్‌లా చూసేవారు. ఎక్కడికెళ్లినా నన్ను, కాంతారావుగారిని సెకండ్రీగా చూసేవారు. ఇలా ఉండగా విఠలాచార్యగారు ‘ఇక్కడ హీరోల మధ్య బాగా పోటీ ఉంది. మీకు బ్యాక్‌గ్రౌండ్ లేదు కాబట్టి, మీరు పైకి రావడం కష్టం. విలన్ అంటారా ఒక్క రాజనాల మాత్రమే ఉన్నాడు. అందుకని మీరు విలన్‌గా చేయండి. నేను మీకు మొదటి అవకాశం ఇస్తాను’ అన్నారు. అన్నట్లుగానే ‘కనకదుర్గ పూజా మహిమ’లో విలన్ వేషం ఇచ్చారు. ఆ తర్వాత ఆయనే ‘అగ్గిపిడుగు’ తీశారు. అందులో రామారావుగారు డ్యుయల్ రోల్. ఇందులో నేను రాజనాల సహచరుడిగా చేశా. నాకు చాలా పేరొచ్చింది. ఆ తర్వాత రామారావుగారి సినిమాలన్నీటికీ నన్ను విలన్‌గా బుక్ చేయడం మొదలుపెట్టారు. ఆ విధంగా రాజనాలను దాటి ముందుకు దూసుకెళ్లిపోయాను. గిరిబాబు: విలన్‌గా నంబర్ వన్‌గా ఉన్నప్పుడే ‘రాముడు-భీముడు’లో రామారావుగారికి డూప్‌గా చేశారు కదా.. ఎవరి బలవంతం మీదైనా అలా చేయాల్సి వచ్చిందా? కైకాల: ‘అగ్గిపిడుగు’కి కెమెరామేన్ రవికాంత్ నగాయిచ్ గారు. నేను రామారావుగారి పోలికలతో ఉంటాను కాబట్టి, డ్యుయల్ రోల్ షాట్స్‌లో నన్ను డూప్‌గా వేయమని అడిగారు. నేను ఓకే అన్నాను. ఇక, ‘రాముడు-భీముడు’ విషయానికొస్తే.. స్వయంగా రామారావుగారే నాకు కబురు పంపారు. ‘‘బ్రదర్.. ఒకే ఒక్క కాల్షీట్ ఉంది. రామానాయుడుగారు రిలీజ్ కూడా ప్లాన్ చేసేశారు. మీరు చేస్తే బాగుంటుంది’’ అన్నారు. అలా డూప్‌గా చేశాను. ఆ తర్వాత విఠలాచార్యగారు తీసిన ‘మంగమ్మ శపథం’లో కూడా నేను రామారావుగారికి డూప్‌గా చేశాను. గిరిబాబు: హీరోలందరికీ మీరు ఎదురులేని విలన్. ఆ తర్వాత మీ కొడుకులుగా మాలాంటివాళ్లు వచ్చాం. ఇక, నేను పరిచయమైన ‘జగమే మాయ’లో నేను వేసిన పాత్రకు ముందు మిమ్మల్ని అనుకున్నారట? కైకాల: అవును. అప్పుడు నేను ఫుల్ బిజీ. నెల రోజుల డేట్స్ కావాలన్నారు. ‘‘చేసే పొజిషన్లో లేనండీ’’ అని చెబితే, ‘‘అయితే కొత్తవాళ్లతో చేయిస్తాను’’ అని నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావుగారన్నారు. నేను ‘ఓకే’ అన్నా. గిరిబాబు: ఆ విధంగా మీరు మానుకోవడంవల్ల ఆ సినిమాలో చేసే అదృష్టం నాకు దక్కింది. ‘జగమే మాయ’ షూటింగ్ అప్పుడు నేను, మురళీమోహన్ క్రాంతికుమార్ ఆఫీసులో కూర్చునేవాళ్లం. అప్పుడు మీరు మాకు ‘‘ఇండస్ట్రీలో నెగ్గుకు రావాలంటే నటనే కాదు, మంచి ప్రవర్తన కూడా ముఖ్యం. అప్పుడే పది కాలాల పాటు ఉంటారు’’ అని హితబోధ చేశారు. అప్పట్నుంచీ ఇప్పటివరకు అదే సలహా పాటిస్తున్నాం. మిమ్మల్ని గురువుగా భావిస్తున్నాం. కైకాల: అవును.. ఆ సంఘటను నాకూ గుర్తుంది. గిరిబాబు: మంచి విలన్‌గా క్షణం తీరిక లేని మీకు ‘ఉమ్మడి కుటుంబం’, ‘శారద’ చిత్రాల్లో పాజిటివ్ కేరక్టర్స్ ఆఫర్ చేసినప్పుడు చేయాలని ఎందుకనిపించింది? కైకాల: వాస్తవానికి ఆ పాత్రలకు నన్నడగలేదు. నా అంతట నేనే ప్రాథేయపడి చేశా. ‘ఉమ్మడి కుటుంబం’ అనే సినిమా తీస్తున్నా అని, ఆ కథ చెప్పారు రామారావుగారు. నేను వ్యవసాయదారుడి పాత్ర చేస్తానన్నాను. విలన్‌గా చేసి, అంత పాజిటివ్ కేరక్టరా అన్నారు. ‘‘ఆ వేషం ఇవ్వకపోతే ... సత్యాగ్రహం చేస్తా’’ అని సరదాగా అన్నాను. ఫైనల్‌గా నాకే ఇచ్చారు. సినిమాకి అది కీలకమైన పాత్ర. సినిమా పూర్తయ్యింది. ఫస్ట్ కాపీ వచ్చింది. డ్రైవర్ని పంపించి, రామారావుగారు నన్ను వెంటనే రమ్మన్నారు. ఏమంటారో అని నేను బిక్కు బిక్కుమంటూ వెళ్లాను. వెళ్లగానే నన్ను అమాంతం కౌగలించుకున్నారు. ‘‘అయామ్ ది ఫస్ట్ పర్సన్ టు కంగ్రాచ్యులేట్ యు. నేను కూడా అలా చేయలేకపోయేవాణ్ణేమో. అంత సహజంగా ఉంది’’ అని చెప్పారు. అది చూసి, ‘శారద’లో పాజిటివ్ కేరక్టర్ ఇచ్చారు. గిరిబాబు: రామారావుగారు ‘దానవీర శూరకర్ణ’, కృష్ణగారు ‘కురుక్షేత్రం’ చిత్రాలను పోటాపోటీగా తీశారు. ఆ రెండు సినిమాల్లోనూ మీరున్నారు. అదెలా జరిగింది? కైకాల: ‘దానవీర..’కన్నా ముందే నన్ను ‘కురుక్షేత్రం’లో దుర్యోధనుడిగా బుక్ చేశారు. రామారావుగారు ‘దానవీర..’లో భీముడి పాత్రకు అడిగేటప్పుడు, ‘‘మీరు ‘కురుక్షేత్రం’లో చేయడానికి వీల్లేదు’’ అన్నారు. ‘‘ఒకవేళ ‘కురుక్షేత్రం’కన్నా ముందు మీరడిగి ఉంటే, ఆ సినిమా వదులుకునేవాణ్ణి. ఇప్పుడెలా కుదురుతుంది? అడ్వాన్స్ కూడా తీసుకున్నా. పైగా, దుర్యోధనుడి పాత్ర చేయాలని నాకూ ఉంటుంది కదా’’ అని రామారావుగారితో అన్నా. దాంతో ‘‘ఇక్కడ భీముడు, అక్కడ దుర్యోధనుడు... రెండు సినిమాలూ చేసుకోండి’’ అన్నారు నవ్వుతూ. గిరిబాబు: ‘యమగోల’, ‘యముడికి మొగుడు’, ‘యమలీల’ తదితర చిత్రాల్లో మీ యముడి పాత్రపోషణ అద్భుతం. ఇప్పుడు కూడా ఆ పాత్ర చేయడానికి మీరు సిద్ధమేనా? కైకాల: ఇటీవల ‘బలుపు’లో యముడి పాత్ర చేశాను. అప్పుడే కొంచెం ఇబ్బందిపడ్డాను. యముడిగా చేసీ చేసీ అలసిపోయాను. ఇక ఆ పాత్ర చేయలేను. గిరిబాబు: మీరు చాలామంది దర్శకులతో పనిచేశారు. నా అదృష్టం కొద్దీ నేను కూడా మిమ్మల్ని డెరైక్ట్ చేయగలిగాను. నా డెరైక్షన్ మీకెలా అనిపించింది? కైకాల: నీలో మంచి దర్శకుడు ఉన్నాడు. కథను ఏ విధంగా చూపిస్తే ప్రేక్షకుల్ని రంజింపజేయొచ్చో ఆ పట్టులన్నీ నీకు బాగా తెలుసు. అయితే డెరైక్షన్‌తో పాటు ప్రొడక్షన్లో కూడా వేలుపెట్టడం వల్ల నీకు ఏకాగ్రత కుదర్లేదు. లేకపోతే దర్శకుడిగా నువ్వు ఎక్కడో ఉండేవాడివి. గిరిబాబు: ఇప్పుడు మనం సినిమాలు నిర్మించే పరిస్థితి ఉందా? కైకాల: అప్పట్లో మనం ఓ సినిమా చేశామంటే.. ‘‘మన కారణంగా నిర్మాత నష్టపోకూడదు.. దర్శకుడికి తగిన సహకారం అందించాలి’’ అనుకొనేవాళ్లం. కానీ, ఇప్పుడు నిర్మాత డబ్బులిచ్చి, చేతులు కట్టుకుని నిలబడుతున్నాడు. అప్పట్లో రామారావుగారు కథ విన్న తర్వాత, వేరే ఏ విషయంలోనూ వేలు పెట్టేవారు కాదు. దర్శక, నిర్మాతలు ఎలా అంటే అలా చేసేవారు. ఈ కాలంలో అలాంటివాళ్లు ఉన్నారా? అందుకే, ఇప్పుడు సినిమా నిర్మాణం మన వల్ల కాదు. ఈ పరిస్థితులు మన మనస్తత్వాలకు సరిపడవు. గిరిబాబు: 1950 నుంచి 1970 వరకు స్వర్ణయుగం అనాలి. ఆ కాలంలోలాగా మంచి పాటలతో వచ్చిన ఉత్తమ చిత్రాలు ఇప్పుడు వస్తాయని ఎదురు చూడొచ్చా? కైకాల: అస్సలు ఎదురు చూడకూడదు. ఇప్పుడు అంతా స్పీడ్. అందుకని అలనాటి ఆణిముత్యాలు వచ్చే అవకాశం లేదు. కొత్త సినిమాలు ఎప్పుడైనా టీవీలో చూడ్డం తప్ప... థియేటర్‌కి వెళ్లి చూడటం లేదు. ఏమైనా ఆ స్వర్ణయుగాన్ని ఇప్పుడు కాదు.. భవిష్యత్తులో కూడా చూడలేం. సమన్వయ సాక్షి: డి.జి. భవాని గిరిబాబు: పాజిటివ్, నెగటివ్ పాత్రలు చేసి ‘నవరస నటనాసార్వభౌమ’ అనిపించుకున్న మీకు, ప్రభుత్వపరంగా రావాల్సిన ‘పద్మ’ పురస్కారం రాలేదు. ఎస్వీఆర్, సావిత్రి, గుమ్మడిగార్లకు కూడా రాలేదు. అది దారుణం అనిపిస్తుంది. కైకాల: కారణాలు నీకు తెలుసు. ఇక నేనేం చెప్పను? గిరిబాబు: అప్పట్లో బ్యాక్‌గ్రౌండ్ లేని మనలాంటివారికి అవకాశం ఇచ్చారు. సక్సెస్ అయ్యాం. ఇవాళ కూడా అందగాళ్లు, ప్రతిభావంతులున్నా, అవకాశాలు రావడం లేదు. దానికి కారణం మనమూ, మన వారసులేనా? కైకాల: నన్నడిగితే కేవలం వారసత్వ జాడ్యం వల్లే... గాడ్‌ఫాదర్స్ లేని వారికి అవకాశాలు రావడం లేదు. ఇవాళ బయటివాళ్లు ఎంతమంది వస్తున్నారో గుండెల మీద చెయ్యేసుకుని చెప్పండి. ఇవాళ ఓ పౌరాణిక చిత్రం తీశారనుకోండి.. ఆ భారీ డైలాగులు చెప్పే శక్తి ఎవరికైనా ఉందా? ఇదివరకు రామారావుగారు, నాగేశ్వరరావుగారు 2 లక్షలు పారితోషికం తీసుకోవడానికి రెండేళ్లు పట్టేది. ఇప్పుడు రెండు సినిమాలకే కోట్లు తీసుకుంటున్నారు. గిరిబాబు: మీ సమకాలీనులు, తర్వాత నాలాంటివాళ్లు మా వారసులను తెచ్చాం. మీరెందుకు మీ వారసులను తీసుకురాలేదు? కైకాల: మా ఇద్దరబ్బాయిలకూ ఆసక్తి లేదు. కొంచెమైనా ఆసక్తి ఉండి ఉంటే.. నేను ప్రోత్సహించేవాణ్ణి. మా రెండోవాడు విలన్‌గా చేస్తానని కొంత ఆసక్తి చూపించాడు. ఈలోపు మా తమ్ముడితో కలిసి ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఇద్దరబ్బాయిలు వ్యాపారంలో బిజీగా ఉన్నారు. -
నవరస నటనాసార్వభౌముడు
నటన ఆయనకు ప్రాణప్రదం. నవరసభరితమైన నటనకు ఆయన చిరునామా. అది గంభీరమైనా, వీరమైనా, రౌద్రవమైనా ఆయన హావభావాల్లో మాత్రమే అద్భుతంగా ప్రతిఫలిస్తుంది. పౌరాణికమైనా, జానపదమైనా, సాంఘికమైనా సరే ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతారు. ఆ పాత్రలకే ప్రాణప్రతిష్ట చేస్తారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలను తెలుగు ప్రేక్షక లోకానికి ఎల్లకాలం గుర్తుండిపోయేలా చేసిన ఘనత ఎన్టీఆర్‌కు దక్కితే... ‘యమధర్మరాజు’కు జీవం పోసిన ఖ్యాతి మాత్రం ఈయనకే దక్కింది. ఆయనెవరో కాదు కైకాల సత్యనారాయణ. నిలువెత్తు విగ్రహం. చక్కటి దేహదారుఢ్యం. గంభీరమైన అభినయం. తలపై బంగారు కిరీటం. ఒక చేతిలో భారీగద. మరో చేత్తో మెలిపెట్టే కోరమీసం. నాటి యమగోల నుంచి నేటి యమలీల వరకు యముడంటే సత్యనారాయణే. యమధర్మరాజును ఎంతో ఉన్నతంగానూ, మరెంతో హాస్యభరితంగానూ ఆవిష్కరించిన వైవిధ్యభరితమైన నటన ఆయనకే సొంతం. తెలుగు సినిమాకు ఎస్వీ రంగారావు అంతటి ప్రతినాయకుడు కైకాల. మహానటుడు ఎన్టీఆర్ నటనలోని అనేక లక్షణాలను పుణికి పుచ్చుకొని ఎదిగిన వ్యక్తి. ‘ఏదీ దానంతట అదే రాదు. కష్టపడి సాధించాలి. ఏ రంగంలోనైనా రాణించాలంటే కృషి, పట్టుదలలే పెట్టుబడి’ అని నమ్మిన కైకాల తన కెరీర్లో మొక్కవోని దీక్షతో ఎదిగారు. మంచి క్యారెక్టర్ వస్తే నటించేందుకు తాను ఎప్పటికీ సిద్ధమేనని చెబుతున్న ఆయన అంతరంగ ఆవిష్కరణే ఈ వారం‘లెజెండ్’... ‘చిన్నప్పటి నుంచే నాటకాలు వేసేవాడ్ని. పెద్ద జులపాల జుత్తు ఉండేది నాకు. నేను నాటకాలు వేసే రోజుల్లోనే అందరూ ఎన్టీఆర్ పోలికలు ఉన్నాయంటూ అభినందించేవారు. ఎప్పటికైనా సినిమాల్లో రాణిస్తారనే వాళ్లు. నాకు సినిమాల్లో నటించాలనే అభిప్రాయం అప్పటికైతే లేదు. కానీ బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలనుకున్నాను. పదోతరగతిలో, ఇంటర్లో ‘ప్రభాకర్ నాట్యమండలి’, ‘నటరాజ కళా సమితి’పేర్లతో రాష్ర్టమంతటా నాటకాలు ప్రదర్శించాం. పదోతరగతిలోనే ‘ప్రేమ లీలలు’ అనే నాటకంలో మొదటి సారి విలన్ పాత్రలో నటించాను. దానికి బంగారు పతకం లభించింది. ‘పల్లెపడుచు’, ‘కులం లేని పిల్ల’, ‘బంగారు సంకెళ్లు’, ఆడది, సుల్తాన్ వంటి నాటకాలు ప్రదర్శించాం. విజయవాడ హనుమంతరాయ గ్రంథాలయంలో ‘ఎవరుదొంగ’ అనే నాటకంలో హీరో పాత్రలో నటించాను. మంచి గుర్తింపు లభించింది. నా నటనలో ఎన్టీరామారావు పోలికలు ఉన్నాయంటూ ప్రముఖ రంగస్థల నటులు గరికపాటి రాజారావు ఎంతగానో ప్రశంసించారు. సినిమాల్లోకి ఆహ్వానించారు. కానీ సినిమా వైపు వెళ్లకుండా డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగప్రయత్నాలు ప్రారంభించాను. ఇదంతా 1954-55 నాటి సంగతి. ఉద్యోగం రాలేదు. అప్పటికే మాకు ఉన్న కలప వ్యాపారం చూసుకొనేందుకు రాజమండ్రికి వెళ్లాను. అక్కడ 3 నెలలు మాత్రమే ఉన్నాను. అక్కడి నుంచి మద్రాస్ వెళ్లాను. నా చిన్నప్పటి స్నేహితుడు కెఎల్ ధర్ 1956లో ఒక ఉత్తరం రాశాడు. సినిమాలో నటించే అవకాశం వచ్చింది. వెంటనే రమ్మని. అలా అనుకోకుండా అతని ఆహ్వానం మేరకు మద్రాస్ వెళ్లవలసి వచ్చింది. ఎన్టీఆర్ నా అన్నయ్య.. మహానటుడు ఎన్టీరామారావు నన్ను సొంత తమ్ముడిలా ఆదరించారు. ఆయనతో కలిసి చాలా చిత్రాల్లో నటించడం వల్ల ఎంతో దగ్గరయ్యాము. నన్ను ఆయన ‘తమ్ముడూ’అనే పిలిచేవారు. ఎంతో ప్రేమగా చూసుకొనే వారు. తారకమ్మ గారు కూడా సొంత మరిదిలాగానే నన్ను ఆదరించారు. సినిమా పరిశ్రమలో నాకు డీఎల్ నారాయణ కన్నతండ్రి వంటి వారైతే విఠలాచార్య పెంచిన తండ్రి. కెరీర్లో పైకి తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీరామారావు. ఆయన పార్టీ స్థాపించిన సమయంలో నేను, నాదెండ్ల ఇద్దరమే ఉన్నాము. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం పార్టీ గురించే ఎక్కువగా చర్చించేవారు. ప్రజల కోసం ఏదైనా చేయాలనే తపన ఉండేది. అప్పుడే జన్మ సార్థకమవుతుందనే వారు. ఆ తరువాత ఆయన పార్టీ పెట్టి అపూర్వమైన విజయం సాధించారు. నన్ను పార్టీలోకి ఆహ్వానించారు. కానీ నాకు ఉన్న బాధ్యతల దృష్ట్యా వెళ్లలేదు. కానీ 1996లో మచిలీపట్నం నుంచి తెలుగుదేశం తరఫున ఎంపీగా పోటీచేసి గెలిచాను. ఆ తరువాత ప్రభుత్వం పడిపోవడం, తిరిగి చంద్రబాబు హయాంలో మరోసారి పోటీ చేయడం తెలిసిందే. కానీ అప్పుడు ఓడిపోయాను. ఇక మరో మహానటుడు అక్కినేనితోనూ నాకు చిన్నప్పటి నుంచే మంచిసంబంధాలు ఉండేవి. ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్. మలుపుతిప్పిన ‘సిపాయి కూతురు’.. ప్రసాద్ ప్రొడక్షన్స్‌లో సహాయ కళాదర్శకుడుగా పని చేసేవాడు ధర్. ‘కొడుకులు-కోడళ్లు’ అనే సినిమాలో నటించేందుకు నన్ను రమ్మని పిలిచాడు. కానీ నేను వెళ్లిన తరువాత ప్రసాద్ ప్రొడక్షన్స్ వాళ్లు అసలు ఆ సినిమా తీయనేలేదు. నన్ను అన్ని విధాలుగా పరీక్షించారు ప్రసాద్. సినిమాలో అవకాశం మాత్రం రాలేదు. అప్పటికే ‘రాజు-పేద’ వంటి సినిమాలు తీసిన అగ్రశ్రేణి నిర్మాత బీవి సుబ్బారావును కలిశాను. అభినయం బాగుందన్నారు. అవకాశం ఉన్నప్పుడు పిలుస్తానన్నారు. ఆ తరువాత తెలుగు చలన చిత్ర పితామహులు కేవీ రెడ్డిని కలిశాను. అప్పటికే నేను మద్రాస్ వచ్చి ఏడాది అయింది. మరో నాలుగైదు రోజుల్లో సంక్రాంతి.. ఇక సినిమాల్లో అవకాశం రాదని నిర్ణయించుకున్నాను. నిరాశా నిస్పృహలు అలుముకున్నాయి. అలాంటి సమయంలో ఆయన నాలుగు రోజులు నన్ను టెస్ట్ చేశారు. సంతృప్తి చెందారు. అవకాశాలు తప్పకుండా వస్తాయని, ఓపిగ్గా ఎదురు చూడాలని చెప్పారు. ఇంటికి వెళ్లిపోవద్దని సలహా ఇచ్చారు. ‘దేవదాసు’ చిత్ర నిర్మాత డీఎల్ నారాయణ రూపంలో ఆ అవకాశం వచ్చింది. ఆయన తీసిన ‘సిపాయి కూతురు’ సినిమాలో హీరోయిన్ జమున సరసన హీరోగా నటించాను. ఆ తరువాత మరో మూడేళ్ల పాటు ఎలాంటి అవకాశాలు రాలేదు. అప్పుడే బి.విఠలాచార్య నన్ను విలన్ పాత్రల్లో నటించమని ప్రోత్సహించారు. రాజనాల తరువాత విలన్‌గా రాణించినవాళ్లు పెద్దగాలేరన్నారు. దాంతో 1960 జనవరిలో విడుదలైన ‘సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి’ సినిమాలో విలన్ పాత్రలో నటించాను. ఆ తరువాత వరుసగా అవకాశాలు వచ్చాయి. ‘కనకదుర్గ పూజా మహిమ’, శ్రీకృష్ణ పాండవీయం’ ఎన్టీరామారావు ద్విపాత్రాభినయం చేసిన ‘అగ్గిపిడుగు’వంటి అనేక సినిమాల్లో ప్రతి నాయకుడిగా నటించాను. ‘ఉమ్మడి కుటుంబం’ సినిమా ఒక మరిచిపోలేని అనుభూతి. ఎన్టీరామారావుకు అన్నయ్యగా జాలిగొలిపే పాత్రలో నటించాను. మంచిపేరు వచ్చింది. ‘శారద’ సినిమా నా కెరీర్లో మరో మలుపు. ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమా కూడా మంచి గుర్తింపు తెచ్చింది. కేవలం విలన్ పాత్రలే కాదు. కామెడిలో కూడా బాగా నటించగలనని చాటుకున్నాను. ‘సీతాకల్యాణం’లో రావణాసురుడిగా, ‘దానవీరశూరకర్ణ’లో భీముడిగా, ‘కురుక్షేత్రం’లో దుర్యోధనుడిగా, ‘పాండవ వనవాసం’లో ఘటోత్కచుడిగా, ‘చాణక్య చంద్రగుప్త’లో రాక్షస మంత్రిగా ‘మొల్ల’ సినిమాలో శ్రీకృష్ణ దేవరాయలుగా ‘యమగోల’, ‘యమలీల’చిత్రాల్లో యమధర్మరాజుగా నటించాను. అన్ని రకాల పాత్రలు వేశాను. మొత్తం 772 సినిమాల్లో నటించాను. ఈ మధ్య ‘దరువు’లో కూడా యముడి పాత్రలోనే నటించాను. వ్యక్తిగతం పేరు: కైకాల సత్యనారాయణ పుట్టిన తేదీ: 25 జూలై, 1935 తల్లిదండ్రులు: సీతారామమ్మ, లక్ష్మీనారాయణ భార్య: నాగేశ్వరమ్మ సంతానం: లక్ష్మీనారాయణ, కేవీ రామారావు, పద్మావతి, రమాదేవి సేవా కార్యక్రమాలు స్వస్థలం కౌతారం(కృష్ణాజిల్లా)లో తాత పేరు మీద ‘కమ్మంమెట్టు రామయ్య మొమోరియల్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి’ కట్టించారు. గుడివాడలో ‘కైకాల సత్యనారాయణ పురపాలక కళామండపం’ నిర్మించారు. పేద విద్యార్థుల చదువులు, పెళ్లిళ్లు, ఉపాధికి సహకారం అందిస్తున్నారు. అవార్డులు.. -తాత-మనవడు, సంసారం-సాగరం, కచదేవయాని చిత్రాల్లో అత్యుత్తమ నటనకు మూడు సార్లు నంది అవార్డులు. - ప్రతిష్టాత్మక రఘుపతి వెంక య్య అవార్డు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సన్మానం.. ఇలాంటివెన్నో...