Kaikala Satyanarayana Death: Satyanarayana Biography – Movies, Awards, Politics & Personal Life - Sakshi
Sakshi News home page

Kaikala Satyanarayana:నవరస నటనా సార్వభౌముడి సినీ, రాజకీయ ప్రస్థానం ఇదే..

Published Fri, Dec 23 2022 8:02 AM | Last Updated on Fri, Dec 23 2022 8:41 AM

Actor Kaikala Satyanarayana Passed Away, Movie, Political career here - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సినీ నటుడు కైకాల సత్యనారాయణ (87) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1935, జులై 25న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు (మ) కౌతారంలో జన్మించారు. 770కిపైగా సినిమాల్లో నటించారు. ఆయన తండ్రి కైకాల లక్ష్మీనారాయణ.

కైకాల ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడలలో పూర్తిచేసి, గుడివాడ కళాశాల నుండి పట్టభద్రుడయ్యారు. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో వివాహమైంది. ఆయనకు ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. 1996లో ఆయన రాజకీయాల్లోకి వచ్చి, మచిలీపట్నం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 11వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.

►తన మనవళ్లలో ఒకరిని నటవారసుడిగా చూడాలనేది కైకాల కోరిక
►నవరస నటనా సార్వభౌముడిగా ప్రఖ్యాతిగాంచిన కైకాల
►ఐదు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో కైకాల ప్రయాణం
►కైకాల సత్యనారాయణ నటించిన మొదటి చిత్రం: సిపాయి కూతురు
► చివరి చిత్రం: మహర్షి
►పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద చిత్రాల్లో ఎన్నో పాత్రలు పోషించిన కైకాల
►28 పౌరాణిక, 51 జానపద, 9 చారిత్రక చిత్రాల్లో నటించిన కైకాల
►200 మందికిపైగా దర్శకులతో పనిచేసిన కైకాల సత్యనారాయణ
►100 రోజులు ఆడిన కైకాల నటించిన 223 చిత్రాలు 
►అర్ధశతదినోత్సవాలు జరుపుకున్న 59 సినిమాలు
►సంవత్సరం ఆడిన కైకాల నటించిన 10 చిత్రాలు
►ఇంటర్ రెండో సంవత్సరంలో నాటకరంగంలో కైకాల ప్రవేశం
►నాటకరంగ అనుభవంతో సినిమాల్లో వేషం కోసం మద్రాసు వెళ్లిన కైకాల
►కైకాల సత్యనారాయణ నటుడిగా గుర్తించిన డి.ఎల్.నారాయణ
►తొలి సినిమాతోనే కథానాయకుడి అవకాశాన్ని అందుకున్న కైకాల
►సిపాయి కూతురు చిత్రంతో కథానాయకుడిగా తెరకు పరిచయమైన కైకాల
►కైకాల సత్యనారాయణకు కలిసొచ్చిన ఎన్టీఆర్ పోలికలు
►కైకాలను ఎన్టీఆర్ కు నకలుగా భావించిన పరిశ్రమ పెద్దలు
►సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి చిత్రంలో తొలిసారిగా ఎన్టీఆర్ తో కలిసి నటించిన కైకాల
►విఠలాచార్య దర్శకత్వంలో తొలి ప్రతినాయకుడి వేషం వేసిన కైకాల
►కనకదుర్గ పూజ మహిమ చిత్రంలో తొలిసారి ప్రతినాయకుడి పాత్ర పోషించిన కైకాల
►ఎన్టీఆర్ అగ్గిపిడుగు చిత్రంతో మలుపుతిరిగిన కైకాల సినీ జీవితం
►ఎన్టీఆర్ తో కలిసి 101 చిత్రాల్లో నటించిన కైకాల సత్యనారాయణ
►ఎన్టీఆర్ తో పోరాట సన్నివేశాల్లో పోటాపోటీగా నటించిన కైకాల
►యమగోల, యమలీల చిత్రాల్లో యముడిగా అలరించిన కైకాల 
►పౌరాణికాల్లో రావణుడు, దుర్యోధనుడు, యముడు, ఘటోత్కచుడు పాత్రలు పోషించిన కైకాల
►సాంఘిక చిత్రాల్లో రౌడీ, తండ్రి, తాత పాత్రల్లో నటించిన కైకాల
►రమా ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్థను స్థాపించిన కైకాల సత్యనారాయణ 
►కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు చిత్రాలను నిర్మించిన కైకాల
►1994లో బంగారు కుటుంబం చిత్రానికి నంది పురస్కారం 
►2011లో రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్న కైకాల
►కైకాలకు బాగా నచ్చిన సంభాషణ: నీవా పాండవ పత్ని
►1996లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కైకాల సత్యనారాయణ
►తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి లోక్ సభకు కైకాల ఎన్నిక
►తొలి రోజుల్లో ''రాముడు-భీముడు' వంటి ఎన్.టి.ఆర్. ద్విపాత్రాభినయ చిత్రాలలో ఆయనకు డూప్ గా నటించారు.

ఫిల్మ్‌ఫేర్ అవార్డులు
►జీవితకాల సాఫల్య పురస్కారం (2017)

నంది అవార్డులు
►ఉత్తమ చలన చిత్రం - బంగారు కుటుంబం (1994)
►రఘుపతి వెంకయ్య అవార్డు - 2011

ఇతర గౌరవాలు
►ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ అవార్డు
►నటశేఖర - అనంతపురంలో ఒక ప్రభుత్వేతర సంస్థ ఇచ్చింది.
►నటశేఖర - గుడివాడ పురపాలక సంఘ వేదికపై ఇచ్చినది
►కళా ప్రపూర్ణ - కావలి సాంసృతిక సంఘంవారు ఇచ్చినది
►నవరసనటనా సార్వభౌమ - ఒక సాంస్కృతిక సంఘం అనేకమంది పెద్దమనుషులు, పురజనుల మధ్య ఇచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement