Health issue
-
అతడు సత్యవంతుడు
సత్యవంతుడి కోసం సావిత్రి యముడితో పోరాడింది... నేను నా భార్యకోసం సత్యవంతుడిలా పోరాడుతున్నాను... అంటున్నాడు విజయ్ మండల్.గత నాలుగేళ్లుగా ఇతను భార్యకు 24 గంటల్లో కావలసిన 3 ఆక్సిజన్ సిలిండర్లను రోజూ భుజంపై మోస్తున్నాడు. ఇందుకోసం సిలిండర్‌తో రోజుకు 30 కిలోమీటర్లు నడుస్తాడు. అలుపు లేదు. ఆగిందీ లేదు. బిహార్ భాగల్పూర్కు చెందిన ఈ భర్తకు భార్య కన్నీటి కృతజ్ఞత తెలుపుతుంటోంది. నేటి ఉలిక్కిపడే వార్తల మధ్య ఈ అనుబంధం ఎంతో ఆదర్శం.భర్త కోసం భార్యలు పోరాడిన గాథలు ఉన్నాయి. కాని భార్య కోసం భర్తలు చేసే త్యాగాలు లోకం దృష్టికి రావడం తక్కువ. కాని విజయ్ మండల్ కథ విస్మరించను వీలు కానిది. ఒక మనిషి నిజమైన హృదయంతో పూనుకుంటే తప్ప ఇలాంటి ఘనకార్యాన్ని, ఘనమైన సేవను చేయలేడు. బిహార్‌లోనే ఇటువంటి భర్తలు ఉన్నారేమో. గతంలో దశరథ్ మాంఝీ అనే అతను తన భార్యకు సమయానికి వైద్యం అందనివ్వకుండా అడ్డుగా నిలిచిన కొండను ఒక్కడే తొలిచి, దారి వేసి ‘మౌంటెన్ మేన్’ అనిపించుకున్నాడు. కరోనా తర్వాత రోగగ్రస్త అయిన భార్య కోసం నాలుగేళ్లుగా పట్టుదలగా ఆక్సిజన్ సిలిండర్లు మోస్తున్న విజయ్ మండల్‌ను ‘ఆక్సిజన్ మేన్’ అనొచ్చేమో.భాగల్పూర్ నుంచివిజయ్ మండల్‌ది బిహార్‌లోని భాగల్పూర్కు దగ్గరలోని కహల్గావ్. ఇక్కడ అతను చిన్న కిరాణా షాపు నడిపేవాడు. భార్య అనితాదేవికి 2021లో కరోనా సోకింది. పరిస్థితి చాలా సీరియస్ అయ్యింది. భార్యను బతికించుకోవడానికి విజయ్ మండల్ చేయని ప్రయత్నం లేదు. కూతురి పెళ్లి కోసం దాచిన 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేశాడు. చివరకు ఢిల్లీ ఎయిమ్స్‌కు కూడా తీసుకెళ్లారు. వాళ్లు ఆమెను చేర్చుకొని అన్ని విధాలా వైద్యం చేసి చివరకు ‘ఈమె ఊపిరితిత్తులు పూర్తిగా కోలుకోవు. బతికి ఉన్నంత కాలం ఆక్సిజన్ మీద బతకాల్సిందే’ అని చెప్పి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఇచ్చి పంపారు. అది సంవత్సరంలో చెడిపోయింది. ఇంకోటి కొన్నా దాని పరిస్థితీ అంతే. దాంతో స్థానికంగా దొరికే ఆక్సిజన్ సిలిండర్లే మేలని వాటితో భార్యను బతికించుకోవాలని విజయ్ మండల్ నిశ్చయించుకున్నాడు.ఉదయాన్నే 4 గంటలకు లేచిఒక్కో సిలిండర్ 8 గంటలు వస్తుంది. అందుకే ఖాళీ అయిన దానిని వెంటనే ఇచ్చి నిండింది తెచ్చుకోవాలి. విజయ్ మండల్ దినచర్య ఇలా ఉంటుంది. అతడు తన ఊరు రసల్పూర్ నుంచి తెల్లవారుజాము 4 గంటలకు లేచి ఐదు కిలోమీటర్ల దూరంలోని ‘ఇక్చారి’ రైల్వేస్టేషన్‌కు సిలిండర్ మోసుకొని బయలుదేరుతాడు. అక్కడ రైలు పట్టుకుని 50 నిమిషాల దూరంలోని భాగల్పూర్ చేరుకుంటాడు. అక్కడి నుంచి ఆక్సిజన్ దొరికే చోటుకు వెళ్లి సిలిండర్ తీసుకుని 9 గంటలకు ఇల్లు చేరుతాడు. మళ్లీ 11కు వెళ్లి ఒంటి గంటకు వస్తాడు. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు వెళ్లి 7కు తిరిగి వస్తాడు. అంటే రోజులో భుజాన సిలిండర్‌తో 30 కిలోమీటర్లు అతడు నడుస్తాడు. అతని భుజం కదుం కట్టి పోయింది. ‘ఎందుకు ఆక్సిజన్ మోస్తూ కనిపిస్తావు’ అని ఎవరైనా అడిగితే ‘ఒక పక్షి దాహంతో ఉంది. దాని కోసం’ అని సమాధానం చెబుతాడు.ఆయుష్మాన్ కార్డు‘ఒకరికొకరు తోడుండటమే వివాహం అంటే. ఆమె మరణించేవరకూ నేనే తోడు’ అంటాడు విజయ్ మండల్. ఇతని గాథ అందరికీ తెలిసినా స్థానిక అధికారులు ఆయుష్మాన్ కార్డు ఇచ్చి సరిపెట్టారు. ఒక మనిషి ఆక్సిజన్ కోసం ఇంతగా ఎందుకు తిరగాలి పర్మినెంట్ సొల్యూషన్ ఏమిటి అనేది ప్రభుత్వం ఆలోచించడం లేదు. పిచ్చివాడిలా గడ్డం పెంచుకుని తిరుగుతున్న ఆ భర్తను చూసి భార్య రెండు చేతులూ జోడిస్తుంటుంది. ‘ఉత్త పుణ్యానికి భార్యలను హతమార్చే ఈ రోజుల్లో అనారోగ్యంతో ఉన్న నన్ను కళ్లల్లో పెట్టి చూసుకుంటున్నాడు నా భర్త’ అని కన్నీరు కారుస్తుంది. విజయ్ మండల్ ఆ మాటలు పట్టించుకోడు. తనకు మిగిలిన టైమ్‌లో ఆమె దగ్గర కూచుంటాడు. పాదాలు నొక్కుతాడు. కబుర్లు చెబుతాడు. ఆమెలో జీవితేచ్ఛ నశించకుండా చూసుకుంటాడు. ఒక మనిషి ఇంత గొప్పగా ఉంటాడా? ఉంటాడు. ప్రతి మనిషి ఇలా ఉంటే కనీసం ఇంతలో కొంతగా అయినా ఉంటే ఎంత బాగుణ్ణు. ఇంట్లోని గదినే ఐసియుగా మార్చి...‘నేను బాగా ఆలోచించుకుని ఈ నిర్ణయం తీసుకున్నాను. భార్యను ఎంత బాగా చూసుకోవాలనే విషయం పై నేను ఒక ఉదాహరణగా నిలవాలి’ అన్నాడు విజయ్ మండల్. అతను తాను నడిపే కిరాణా దుకాణాన్ని కొడుక్కు అప్పజెప్పి జీవితాన్ని ఇక పూర్తిగా భార్యకు అంకితం చేశాడు. మూడు ఆక్సిజన్ సిలిండర్లను పర్మినెంట్‌గా ఉండేలా కొనేశాడు. వాటిని నింపుకొని రావడమే ఇప్పుడతని కర్తవ్యం. -
అంతర్జాతీయ ప్రయాణికులకు అలర్ట్.. 17 దేశాల్లో మార్బర్గ్ వైరస్ ఆనవాళ్లు
కిగాలీ : విదేశాలకు రాకపోకలు నిర్వహించే ప్రయాణికులకు ముఖ్యగమనిక. తూర్పు ఆఫ్రికా దేశం రువాండాలో మార్బర్గ్ వైరస్‌లోని ‘బ్లీడింగ్ ఐ’ రకం వైరస్ సోకి 15 మంది మరణించారు. వందల మందికి సోకింది. దీంతో అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూహెచ్‌వో )..ఈ వైరస్ కూడా ఇతర వైరస్‌లా ప్రపంచమంతా విస్తరించకముందే నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది.ఈ తరుణంలో అంతర్జాతీయంగా ప్రయాణాలు చేసే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రపంచంలోని 17 దేశాల్లోని ఈ వైరస్ ఆనవాళ్లు ఉన్నాయనే అంచనాలతో డబ్ల్యూహెచ్‌వో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేలా ఆయా దేశాల్ని అప్రమత్తం చేసింది. మార్బర్గ్ వైరస్ అంటేమార్బర్గ్ వైరస్ అంటే ఎబోలా కుటుంబానికి చెందిన ఒక రకమైన హెమరేజిక్ ఫీవర్ వైరస్‌నే. అడవుల్లో తిరిగే రౌసెట్టూస్ అనే గబ్బిలాలలో ఈ వైరస్ ఎక్కువగా ఆవాసం ఉంటుంది. ఈ వైరస్ మనుషుల్లో కనిపించడం ఇది తొలిసారేమీ కాదు. గతంలో ఈ వైరస్ పలు మార్లు వ్యాపించింది. తాజాగా, మరోసారి ఈ వైరస్ ఆనవాళ్లు వెలుగులోకి రావడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. It's 21 days with no active cases on the 42-day countdown to declaration of end of #Marburg outbreak. @WHO & partners continue to support ongoing 🇷🇼 govt efforts in the Marburg response, with focus on surveillance, IPC, recovered pt (survivor) program & continuity of services. pic.twitter.com/4aaziYd01p— WHO Rwanda (@WHORwanda) November 30, 2024 -
ఆస్పత్రిలో చేరిన మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే
ముంబై : గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సోమవారం రిలయన్స్ ఆసుపత్రిలో చేరారు. గతంలో ఉద్ధవ్ ఠాక్రే యాంజియోప్లాస్టీ ద్వారా రక్తనాళాల్లో బ్లాకుల్ని తొలగించుకున్నారు. తాజాగా, మరోసారి సమస్య ఉత్పన్నం కావడంతో అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారని , డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఉద్ధవ్ ఠాక్రే మే 2016లో లీలావతి హాస్పిటల్లో యాంజియోగ్రఫీ ప్రక్రియ చేయించుకున్నారు. అంతకుముందు జూలై 20, 2012న గుండె ఎనిమిది స్టెంట్లను అమర్చారు. కాగా, శనివారం ముంబైలోని శివాజీ పార్క్‌లో దసరా ర్యాలీలో ఉద్ధవ్ ఠాక్రే బీజేపీపై నిప్పులు చెరిగారు. నేటి ‘హైబ్రిడ్ బీజేపీ’ అంశంపై ఆర్ఎస్ఎస్ ఆలోచించాలని అన్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టిన వెంటనే రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఛత్రపతి శివాజీ మహరాజ్ ఆలయాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 2019లో బీజేపీ హిందుత్వ సంస్కరణపై నమ్మకం లేనందునే ఆ పార్టీతో విడిపోయానని, అయితే తన తండ్రి బాలాసాహెబ్ ఠాక్రే సిద్ధాంతాన్ని తాను ఎప్పటికీ వదులుకోలేదని థాకరే చెప్పారు. -
అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిన హీరో మోహన్ లాల్!
ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ అస్వస్థతకు గురయ్యారట. ఈ మేరకు మలయాళ మీడియాలో వార్తలొస్తున్నాయి. తీవ్ర జ్వరం, శ్వాస సంబంధిత, కండరాల నొప్పితో బాధపడుతున్నారని.. దీంతో కుటుంబ సభ్యులు ఈయన్ని ఆస్పత్రిలో చేర్పించారట. ఐదు రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారట.(ఇదీ చదవండి: చిరంజీవి సినిమాని శ్రీలీల రిజెక్ట్ చేసిందా?)ఈ క్రమంలోనే మోహన్ లాల్ హెల్త్ బులెటిన్ అని ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఇలా అస్వస్థత అని వార్తలు రావడంతో అభిమానులు ఏమైందోనని కంగారు పడుతున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' సినిమాలో కీలక పాత్ర చేసిన మోహన్ లాల్.. ఇప్పటి జనరేషన్ తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమే.ప్రస్తుతం ఎల్ 2, బరోజ్ సినిమాలతో కాస్త బిజీ ఉన్న మోహన్ లాల్.. వీటి షూటింగ్ కోసం గుజరాత్ వెళ్లగా, అక్కడే అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. దీంతో తిరిగి ఊరికొచ్చేసి, ఆస్పత్రిలో జాయిన్ అయ్యారని అంటున్నారు. ఇందులో నిజమేంటనేది ఆయన క్లారిటీ ఇస్తే తప్ప బయటకు రాదు.(ఇదీ చదవండి: టాలీవుడ్ ఆశలన్నీ నాని 'శనివారం' పైనే..) -
ఆయువు తీస్తున్న వాయువు
ప్రపంచవ్యాప్తంగా నిత్యం 2వేల మంది చిన్నారుల మృత్యువాత కలుషిత గాలిని పీల్చడంతోనే బలి 2021లో గాలి కాలుష్యంతో 80 లక్షల మంది మృతి పొగాకు వినియోగం, అధిక రక్తపోటు తర్వాత కాలుష్య మరణాలే ఎక్కువహెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ నివేదికలో వెల్లడిసాక్షి, అమరావతి: ఇప్పటి దాకా ఐదేళ్ల లోపు చిన్నారుల్లో మరణానికి పోషకాహార లోపం ప్రధాన పాత్ర వహిస్తుంటే... తాజాగా ఈ జాబితాలోకి వాయు కాలుష్యం కూడా చేరింది. ప్రపంచ వ్యాప్తంగా రోజూ దాదాపు 2వేల మంది చిన్నారులు కలుషిత గాలిని పీల్చడం వల్ల మృత్యువాత పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అపరిశుభ్రత, కలుషిత నీరు కంటే గాలి కాలుష్యంతోనే ఆరోగ్యంప్రమాదంలో పడుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. హెల్త్ ఎఫెక్టŠస్ ఇన్స్టిట్యూట్ (హెచ్ఈఐ) విడుదల చేసిన కొత్త అధ్యయనం ప్రకారం..2021లో 80లక్షల మందికిపైగా కలుíÙత గాలి కారణంగా మృతి చెందారు. వీరిలో చిన్నారులతో పాటు వయోజనులు ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే... ఇంట్లో కూడా కాలుష్యం పెరుగుతుండటంతో గాలి నాణ్యత మరింత క్షీణించి అనారోగ్య సమస్యలు విజృంభిస్తున్నాయి. పొగాకు, రక్తపోటు తర్వాత ఇదే..ప్రపంచవ్యాప్తంగా పొగాకు వినియోగం, అధిక రక్తపోటు తర్వాత మనిషి ప్రాణాలకు వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకరంగా తయారైంది. అధిక ఆదాయ దేశాల్లో కంటే ఆఫ్రికాలోని చాలా ప్రాంతాల్లో 500 రెట్లు చిన్నారుల మరణాల రేటు ఎక్కువగా ఉండటం గమనార్హం. పీఎం 2.5గా పిలిచే చిన్న కణాలు.. అంటే 2.5 మైక్రోమీటర్ల వ్యాసం కంటే చిన్నవిగా గాల్లో కలిసిపోయి ఉండే వివిధ రకాల ధూళి కణాలు ప్రపంచ వాయు కాలుష్య మరణాల్లో 90 శాతం కంటే ఎక్కువగా కారణం అవుతున్నాయని నివేదిక పేర్కొంది.వాయు కాలుష్యంతో నష్టాలు.. ⇒ శ్వాస తీసుకున్నప్పుడు గాలి ద్వారా ధూళి కణాలు రక్తంలోకి ప్రవేశించి శరీరంలోని అవయవాల పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ⇒ ఊపిరితిత్తుల వ్యాధులు సంభవిస్తున్నాయి. ⇒ గుండెజబ్బులు, మధుమేహం, చిత్త వైకల్యం తలెత్తుతున్నాయి ⇒ మహిళల్లో గర్భస్రావాలువాయు కాలుష్యానికి కారణాలు.. ⇒ చెట్ల నరికివేత, అడవుల్లో కార్చిచ్చు ⇒ తీవ్రమైన కరువులు, భూములు ఎండిపోవడం ⇒తీవ్ర గాలులు, తుపానులు ⇒ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు ⇒ వాయు మార్గంలో ప్రయాణాలతో నైట్రోజన్ ఆక్సైడ్ల విడుదలవాతావరణ సంక్షోభమే కారణమా? వాతావరణ సంక్షోభం కూడా గాలి నాణ్యతను దిగజార్చుతోందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కాలుష్య కారకాలు ఓజోన్లోకి ప్రవేశించడం ద్వారా 2021లో ఐదు లక్షల మందికిపైగా మరణాలకు కారణమైనట్టు నివేదిక తెలిపింది. ప్రధానంగా బయోమాస్, బొగ్గు, పారాఫిన్, ముడి ఇంధనాలతో వంట చేయడంతోనూ కాలుష్యం పెరిగి చిన్నారుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని గుర్తించింది. సోలార్ స్టవ్‌ల వినియోగం అందుబాటులోకి వస్తే పీఎం 2.5 ఉద్గారాలు, కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను చాలా వరకు తగ్గించవచ్చని స్పష్టం చేస్తోంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 230 కోట్ల మందికి శుభ్రమైన వంట ఇంధనాలు అందుబాటులో లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. -
టెకీలూ.. కాస్త విశ్రమించండి
సాక్షి, అమరావతి: జీవితంలో త్వరగా స్థిరపడాలంటే ఐటీ ఉద్యోగమే భేష్ అని చాలామంది అనుకుంటారు. మంచి వేతనం.. వారాంతపు సెలవులు వంటి వెసులుబాట్లు సౌకర్యాలెన్నో వారికి ఉంటాయని చెబుతారు. టెకీల జీవితంలో ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. రెండో వైపు పరిశీలిస్తే వారిని ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఒత్తిడి వల్ల తరచూ వెన్నునొప్పి వంటి సమస్యలతో టెకీలు ఇబ్బందులు పడుతున్నారు. యాంత్రిక జీవన శైలితో 25 నుంచి 40 ఏళ్లలోపే ఇబ్బందులు తలెత్తున్నాయి. ఒకేచోట గంటల తరబడి కూర్చుని పని చేయడం, శారీరక శ్రమ లేమి వంటి కారణాలతో 40 ఏళ్లు పైబడిన వారిలో ఆరోగ్య సూచీలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. 43% మందిలో ఆరోగ్య సమస్యలే దేశంలో 43 శాతం మంది టెకీలు పని నుంచి ఉత్పన్నమయ్యే ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. ఈ అంశాన్ని నాలెడ్జ్ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ (కేసీసీఐ) సంస్థ తన అధ్యయనంలో వెల్లడించింది. టెకీల్లో సగానికిపైగా వారానికి సగటున 52.50 గంటలు పని చేస్తున్నారు. అస్థిరమైన పని షెడ్యూళ్లతో 26 శాతం మంది నిద్ర లేమి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 51 శాతం మంది రోజుకు సగటున ఐదున్నర గంటల నుంచి ఆరు గంటలు మాత్రమే నిద్రపోతున్నారు. ఎక్కువ మందిలో వెన్నునొప్పి ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువ మందిలో మెడ, వెన్నునొప్పి సాధారణంగా ఉంటోంది. ఈ సమస్యలతో తమ దగ్గరకు వచ్చే యువతలో అత్యధికులు టెకీలే ఉంటున్నట్టు వైద్యులు చెబుతున్నారు. టెకీలు గంటల తరబడి కార్యాలయాల్లో కూర్చుని పనిచేస్తుంటారు. మెడ ఎముక, భుజం ఎముక వెన్నెముకతో అనుసంధానమై ఉంటాయి. ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం వల్ల మెడ, వెన్నెముకలో ఒకచోట అమరిక అస్తవ్యస్తమై ఇతర భాగా లపై ప్రభావం పడుతుంది. ఈ క్రమంలో కూర్చోవడంతో పాటు, నిలబడినప్పుడు భంగిమ సరిగా ఉండేలా చూసుకోవాలని వైద్యు లు సూచిస్తున్నారు. నిల్చున్నప్పుడు తల, భుజాల వెనుక భాగం, పిక్కలు గోడకు తాకి ఉండేలా చూసుకోవాలంటున్నారు. ఫోన్, ల్యాప్‌ట్యాప్ చూసేప్పుడు సహజంగానే మెడ ముందుకు వాల్చకుండా ఉండాలి. ఒత్తిడిని అధిగమించడానికి యోగా, మెడిటేషన్ చేయాలని మానసిక వైద్యులు సూచిస్తున్నారు. ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే కుటుంబ సభ్యులు, పిల్లలతో గడపడం, ఇష్టమైన సంగీతం వినడం, సినిమాలు చూడటం ద్వారా ఒత్తిడి నుంచి విముక్తి పొందాలంటున్నారు. యాంత్రిక జీవన శైలితో ఇబ్బందులు పడుతున్న టెకీల వయసు 25 - 40సగానికి పైగా టెకీలు వారానికి (5 రోజులు) సగటున పనిచేస్తున్న గంటలు 52.50అస్థిరమైన పని షెడ్యూళ్లతో నిద్రలేమిని ఎదుర్కొంటున్నవారు (శాతంలో) 26రోజుకు సగటున ఐదున్నర గంటలు మాత్రమే నిద్రపోతున్న టెకీలు (శాతంలో) 51ఐసీఎంఆర్ ఏం చెబుతోందంటే.. పనిలో ఎంత బిజీగా ఉన్నా శారీరక శ్రమను మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని.. శరీరాన్ని కాస్త అటూఇటూ కదల్చాలని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సూచిస్తోంది. ఆ సూచనలు ఇవీ..» ఎంత బిజీగా ఉన్నప్పటికీ పనిచేసే ప్రదేశాల్లో, ఇతర సందర్భాల్లో కుర్చీకే అతుక్కుపోకుండా పనిచేసే ప్రదేశాల్లో స్టాండింగ్ డెస్క్ ఉపయోగించాలి. లేదంటే ప్రతి అరగంటకు ఒకసారి లేచి నిలబడాలి. » ప్రతి కొన్ని గంటలకు లేచి 5 నుంచి 10 నిమిషాలు అటూఇటూ నడవాలి. » ఇల్లు లేదా పని ప్రదేశాల్లో ఫోన్ మాట్లాడేప్పుడు నడుస్తూ ఉండాలి. లిఫ్ట్, ఎలివేటర్‌కు బదులు మెట్లను వినియోగించాలి. » టీవీ చూస్తున్నప్పుడు కుర్చికే పరిమితం కాకూడదు. కమర్షియల్ బ్రేక్ సమయంలో లేచి తిరగాలి. » రోజుకు 30 నుంచి 60 నిమిషాలు మితమైన, తీవ్రమైన వ్యాయామం చేయాలి. వారంలో ఐదు రోజులు వ్యాయామం తప్పనిసరి. » రోజులో 8 గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలి. -
బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ హెల్త్ అప్డేట్
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, రాజకీయ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ ఢిల్లీలోని అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు గురువారం అపోలో ఆసుపత్రి ఒక ప్రకటనలో తెలిపింది.కాగా బుధవారం సాయంత్రం అనారోగ్యానికి గురైన ఆయనను.. కుటుంబసభ్యులు హుటాహుటిన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ వినిత్ సూరి పర్యవేక్షణలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో నేడు డిశ్చార్జ్ అయ్యారు.అయితే వారం రోజుల వ్యవధిలోనే 96 ఏళ్ల అద్వానీ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరడం రెండోసారి. గత నెల 26న వృద్ధాప్యం కారణంగా యూరాలజీ సంబంధిత సమస్యతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయనకు సర్జరీ నిర్వహించిన విషయం తెలిసిందే. సర్జరీ తర్వాత కోలుకున్న ఆయనను డిశ్చార్జ్ చేశారు. మళ్లీ అద్వానీ ఆస్వస్థకు గురవడంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందజేశారు.కాగా ఈ ఏడాది దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అందుకున్నారు అద్వానీ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పురస్కారం ప్రదానం చేశారు. ఈ వేడుకకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ సీనియర్ నేతలు హాజరయ్యారు. అయితే అద్వానీ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన నివాసంలోనే ఈ కార్యక్రమం జరిగింది. -
కిడ్నీలు జర భద్రం!
సాక్షి, హైదరాబాద్: మూత్రపిండాలు మానవ శరీరంలో చాలా కీలకమైన అవయవాలు. అవి సక్రమంగా పనిచేస్తేనే శరీరంలోని మిగతా అన్ని అవయవాలు సరిగ్గా ఉంటాయి. ఆరోగ్యంగా నాలుగు కాలాల పాటు జీవించగలడు. మూత్ర పిండాలు సరిగ్గా పనిచేయకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే కిడ్నీ సమస్యలు ఉన్నట్టు తొలి దశలో అర్థం కాదు. ఎలాంటి లక్షణాలు కూడా బయటపడవు. దాదాపు 80 శాతంపైగా కిడ్నీలు పాడైన తర్వాతే చాలా మందికి అర్థం అవుతుంది. అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగిపోతుంది. కొందరిలో కిడ్నీ సమస్యలు ఉన్నాయని తెలిసిన రెండు మూడు వారాలకే మరణాలు సంభవించే ప్రమాదం ఉంది. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో పేరుకుపోయే వ్యర్థ పదార్థాలను బయటకు వెళ్లిపోవు. దీంతో అవి కాస్తా విషపదార్థాలుగా మారి శరీరంలోని ఒక్కో అవయం దెబ్బతింటుంది. అలా ప్రాణాంతకంగా మారుతుంది. అందుకే కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. వారికి అదొక్కటే మార్గం.. కిడ్నీ ఫెయిల్యూర్ రెండు రకాలుగా ఉంటుంది. కొందరికి తాత్కాలికంగా, మరికొందరు పూర్తిగా కిడ్నీలు పాడైపోతాయి. డీహైడ్రేషన్, పెయిన్ కిల్లర్స్ అతిగా వాడటం, ఇన్ఫెక్షన్లు, గుండెకు రక్త ప్రసరణ నిలిచిపోవడం తదితర కారణాల వల్ల కిడ్నీలు తాత్కాలికంగా పనిచేయవు. తాత్కాలిక కిడ్నీ ఫెయిల్యూర్‌కు కూడా డయాలసిస్ చేయాలి. అయితే శాశ్వత కిడ్నీ ఫెయిల్యూర్‌కు మాత్రం దీర్ఘకాలిక డయాలసిస్ ఒక్కటే మార్గం. డయాబెటిస్, బీపీ, ఆటోఇమ్యూన్ డిసీజ్, జన్యుపరమైన సమస్యల వల్ల మూత్రపిండాలు శాశ్వతంగా పాడవుతాయి. డయాలసిస్ అంటే ఏంటి? సాధారణంగా కిడ్నీలు రక్తంలోని వ్యర్థాలను వడపోస్తాయి. కిడ్నీలు 80 శాతం పాడయ్యే వరకు ఆ పనిని చక్కగా నిర్వర్తిస్తాయి. అప్పటివరకు ఎలాంటి లక్షణాలు బయటపడవు. అంతకుమించి పాడైతే మాత్రం కిడ్నీలు చేయాల్సిన పనులను చేయలేక మొరాయిస్తాయి. అలాంటి సమయంలో వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ఇలాంటి వారికి డయాలసిస్ ప్రక్రియ వరప్రదాయిని అని చెప్పొచ్చు. డయాలసిస్ ప్రక్రియలో కిడ్నీలు చేయాల్సిన పనిని మెషీన్ సాయంతో రక్తాన్ని వడపోసి వ్యర్థాలను తొలగిస్తారు. హీమోడయాలసిస్ ప్రక్రియను వారానికి మూడు సార్లు చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ నాలుగు గంటల పాటు జరుగుతుంది. ఆలస్యమైతే ఏమవుతుంది? కిడ్నీలు పాడైన వారు నిరంతరం డయాలసిస్ చేయించుకోవాలి. డయాలసిస్ ఆలస్యమైతే రక్తంలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోయి మిగతా అవయవాల్లో ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. ఈ విషయంలో కాస్త అలసత్వం వహించినా.. సమస్య మరింత జఠిలం కావచ్చు. కొద్ది రోజులు ఆగి చేయించుకుందామని నిర్లక్ష్యం వహిస్తే ప్రాణానికే ప్రమాదం ఉంటుంది. మూత్రం సరిగ్గానే వస్తోందని, ఆరోగ్యం బాగానే ఉందని ఆలస్యం చేసినా జరగాల్సిన నష్టం జరుగుతుంది. మూత్రపిండాలు మందకొడిగా పనిచేస్తాయి. నీటిని వడగట్టలేకపోవడంలో విఫలమవుతాయి. విషపదార్థాలు రక్తంలోనే ఉండిపోతాయి. కొన్నిసార్లు నీరు ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. దీనివల్ల ‘పల్మనరీ ఎడిమా’ అనే సమస్య ఏర్పడుతుంది. దీంతో శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు, ఆయాసం వస్తుంది. సమయానికి డయాలసిస్ చేయించుకునేవారు ఎక్కువ కాలం జీవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫిస్టులా చేయించుకోవాల్సిందే.. డయాలసిస్ కన్నా ముందు ఫిస్టులా అనే ప్రక్రియ తప్పనిసరి. ఈ పద్ధతిలో చేయి పైన ధమని, సిరాను ఫిస్టులా అనే లావు పాటి సూది(క్యాథటీర్) ద్వారా కలుపుతారు. డయాలసిస్ ప్రక్రియ చేసే సమయంలో ఫిస్టులా లేకపోవడం వల్లే చాలా వరకు రోగి ప్రాణాపాయ స్థితిలో వెళ్లి.. చనిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే డయాలసిస్ ముందు ఫిస్టులా వేయించుకోవడం చాలా ముఖ్యం అని డాక్టర్లు చెబుతున్నారు. నీరు తీసుకోకపోవడం వల్లే.. చాలావరకు కిడ్నీ సమస్యలు పరిశుభ్రమైన నీరు తీసుకోకపోవడం వల్ల వస్తుంటాయి. ముఖ్యంగా నీళ్లలో ఉండే పాదరసం, సీసం, ఫ్లోరిన్ వంటి లోహాలు కిడ్నీలను పాడు చేస్తాయి. పారిశ్రామిక వాడల్లో ఉండే వారు తరచూ కిడ్నీ పరీక్షలు చేయించుకుంటే ముందుగానే సమస్యలను గుర్తించవచ్చు. దీంతో సరైన సమయంలో చికిత్స తీసుకుని ప్రాణాపాయస్థితి నుంచి బయటపడొచ్చు. సౌందర్య సాధనాల్లో ఉండే కెమికల్స్ కూడా కిడ్నీలు పాడయ్యేందుకు కారణం అవుతాయి.ఆహారం విషయంలో అపోహలొద్దు.. సాధారణంగా కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు మంచి ఆహారం తీసుకోవాలి. ఎలాంటి అపోహలకు తావివ్వకుండా వైద్యులు సూచించిన మేరకు సరైన ఆహారం తీసుకోవాలి. అప్పుడే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. సరైన ఆహారం లేకపోతే ఎముకలు, కండరాలు, రక్తనాళాలు, నరాలు బలహీనమై సమస్య మరింత జఠిలమవుతుంది. అది ప్రాణాపాయస్థితికి కూడా దారి తీయొచ్చు. డయాలసిస్ ప్రక్రియ ఇప్పుడు దాదాపు అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. ఎలాంటి భయం, అనుమానాలు, అపోహలు లేకుండా రెగ్యులర్‌గా డయాలసిస్ చేయించుకుంటే ప్రాణాపాయస్థితి నుంచి బయటపడొచ్చని మూత్రపిండాల నిపుణులు చెబుతున్నారు.డయాబెటిస్, హైబీపీ కూడా కారణమే.. డయాబెటిస్ వల్ల కూడా కిడ్నీలు పాడవుతున్నాయి. డయాబెటిస్ సోకిన తర్వాత సరైన శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల పదేళ్లలో కిడ్నీలు పాడవుతుంటాయి. 30– 40 ఏళ్ల వయసు వారు ఎక్కువగా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇక అధిక రక్తపోటు ఉన్న వారిలో కూడా కిడ్నీలు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. బీపీ ఉన్న వారు కిడ్నీ సంబంధిత పరీక్షలు కచి్చతంగా చేయించుకోవాలి. పాలీసిస్టిక్ కిడ్నీ డిసీజ్ వంశపారంపర్యంగా వస్తుంది. ప్రతి నలుగైదుగురిలో ఒకరిలో వస్తుంది. ఇంట్లో ఎవరికైనా ఇలాంటి సమస్య ఉంటే మిగిలిన వారు కూడా పరీక్షలు చేయించుకుంటే ముందుగానే సమస్యలు గుర్తించి సరైన చికిత్స తీసుకోవచ్చు.పెయిన్ కిల్లర్స్ వల్ల.. చిన్న నొప్పి వచి్చనా ఇటీవల పెయిన్ కిల్లర్ మందులు వాడటం ఎక్కువైంది. అలాగే కడుపులో మంట తగ్గించే మందులు, యాంటీ బయాటిక్స్ వంటి మందులను ఎక్కువగా వాడటం వల్ల కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. కిడ్నీల్లో రాళ్లు వస్తే సరైన చికిత్స తీసుకోకపోవడం, వాటిని తొలగించుకోకపోవడంతో ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. దీంతో కిడ్నీలు పాడైపోతాయి. 60 ఏళ్లు దాటిన వారిలో ఎక్కువగా ఇన్ఫెక్షన్ల వల్ల, పెయిన్ కిల్లర్ల, ఎసిడిటీ మందులు వాడకం వల్ల కిడ్నీలు చెడిపోతుంటాయి. కొందరిలో క్యాన్సర్ సోకిన వారిలో కూడా కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంటుంది. మైలోమా, బోన్‌మ్యారో, ల్యుకేమియా కొన్ని రకాల క్యాన్సర్లు కిడ్నీ పరీక్షల ద్వారా కూడా తెలుస్తుంది.కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తాయి? చిన్నపిల్లల్లో కిడ్నీ సమస్యలు పుట్టుకతోనే వస్తున్నాయి. కడుపులో ఉండగానే స్కానింగ్‌ల ద్వారా ఈ విషయాలను గుర్తిస్తున్నారు. కిడ్నీలు సరిగ్గా ఎదగకపోవడం, మూత్ర నాళాలు సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం, ఫిల్టర్లు పాడైపోవడం వల్ల చిన్న వయసులోనే డయాలసిస్ అవసరం పడుతోంది. ఈ పరిస్థితి జన్యుపరమైన లోపాల వల్ల వస్తుంటుంది. ఈ సమస్యలు ఉన్న పిల్లలు వాడే మందుల వల్ల కూడా సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. వీరి శరీరాల్లో రక్త నాళాలు సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం వల్ల వారికి డయాలసిస్ ప్రక్రియ చేయడం కాస్త సంక్షిష్టంగా ఉంటుంది. యువతీ యువకుల్లో కిడ్నీలో రాళ్లు, అనవసరమైన మందులు వాడటం వల్ల కిడ్నీలు పాడవుతున్నాయి.అలసత్వం వద్దు.. డయాలసిస్ చేయించుకోవడంలో అస్సలు అలసత్వం వద్దు. వారానికి మూడుసార్లు కచి్చతంగా చేయించుకుంటే ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటారు. రేపు, మాపు అంటూ నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం. కుటుంబంలో ఎవరికైనా కిడ్నీ సమస్యలు ఉంటే అందరూ పరీక్షలు చేయించుకోవడం మంచిది. దీంతో ప్రాథమిక దశలోనే చికిత్స తీసుకోవచ్చు. ముఖ్యంగా పారిశ్రామికవాడల్లో ఉండేవారు కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. సౌందర్య సాధనాల వల్ల కూడా కిడ్నీలు పాడయ్యే ప్రమాదం ఉంది. – శ్రీభూషణ్ రాజు, నెఫ్రాలజీ విభాగం అధిపతి, నిమ్స్ -
బర్డ్‌ఫ్లూ వేరియంట్‌తో తొలిమరణం.. డబ్ల్యూహెచ్ఓ యూటర్న్
బర్డ్‌ఫ్లూ హెచ్5ఎన్2 వేరియంట్‌తో ఓ వ్యక్తి మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. అంతలోనే యూటర్న్ తీసుకుంది. మరణించిన సదరు వ్యక్తిలో ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని, పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించి, త్వరలో స్పష్టత ఇస్తామని వెల్లడించింది.ఇటీవల హెచ్5ఎన్2 బర్డ్‌ఫ్లూ వేరియంట్‌తో మెక్సికోకు చెందిన ఓ వ్యక్తి మరణించారని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. ఈ వైరస్ వల్ల ప్రపంచంలో నమోదైన తొలి మరణం ఇదే అని తెలిపింది.అయితే, మెక్సికో ఆరోగ్య మంత్రిత్వ శాఖ 59 ఏళ్ల వ్యక్తికి దీర్ఘకాలిక కిడ్నీ సమస్య, టైప్ 2 డయాబెటిస్, దీర్ఘకాలిక రక్తపోటు సమస్య ఉందని అధికారిక ప్రకటన చేసింది.బాధితుడిలో ఇతర అనారోగ్య సమస్యలు ఏప్రిల్ 17న జ్వరం, శ్వాస ఆడకపోవడం, విరేచనాలు, వికారం, సాధారణ అస్వస్థత వంటి తీవ్రమైన లక్షణాలు కనిపించడానికి మూడు వారాల ముందు అనారోగ్యానికి గురయ్యాడు. అత్యవసర చికిత్స కోసం బాధితుడిని ఏప్రిల్ 24న మెక్సికోలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత రోజు మరణించాడు.బర్డ్ ఫ్లూ మరణం కాదుఈ తరుణంలో శుక్రవారం జెనీవాలో జరిగిన మీడియా సమావేశంలో డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి క్రిస్టియన్ లిండ్‌మీర్ మాట్లాడుతూ..ఈ మరణం పలు రకాల అనారోగ్య సమస్యల వల్ల మరణించారని, హెచ్5ఎన్2కి సంబంధించిన మరణం కాదని చెప్పారు. బర్డ్‌ఫ్లూ గుర్తించాం.. అంతేవైద్యం నిమిత్తం ఆస్పత్రికి వచ్చిన వైద్యులు బర్డ్ ఫ్లూ, ఇతర వైరస్ల కోసం పరీక్షలు చేయగా.. బాధితుడిలో హెచ్5 ఎన్2 వేరియంట్ గుర్తించామని లిండ్‌మీర్ చెప్పారు. అతనితో పరిచయం ఉన్న 17 మందికి టెస్ట్‌లు చేయగా నెగిటివ్‌గా తేలిందిత్వరలోనే స్పష్టత ఇస్తాంపరిశోధనలు కొనసాగుతున్నాయి. సెరోలజీ కొనసాగుతోంది. అంటే ముందుగా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని చూడటానికి రక్త పరీక్ష అని లిండ్‌మీర్ చెప్పారు. అతనిలో ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని, వాటిపై విచారణ జరుపుతున్నామని, పూర్తి స్థాయిలో నిర్ధారించిన వెంటనే.. మరణంపై స్పష్టత ఇస్తామని డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి లిండ్‌మీర్ పేర్కొన్నారు. -
వింటర్లో ముఖం తేటగా ఉండాలంటే వెంటనే ఇలా చేయండి!
'చలికాలంలో ముఖం పొడిబారిపోవడమూ, పెదవులు పగలడం, ముఖంపై ముడతలు రావడం చాలా సాధారణం. అందరికీ తెలిసిన చిట్కా వ్యాజలైన్ రాయడంతో పాటు ఈ కాలంలోనూ ముఖం తేటగా, ఆరోగ్యంగా ఉంచేందుకు పాటించాల్సిన చిట్కాలివి..' చలికాలంలో ఉదయం, సాయంత్రం మంచుకురుస్తున్నా.. మధ్యాహ్నపు ఎండ తీక్షణంగా గుచ్చుతున్నట్టుగా ఉంటుంది. ఈ మంచుకూ, మధ్యాహ్నపు ఎండకూ నేరుగా ముఖచర్మం ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఈకాలంలో ఉండే మంచు, పొగ కలిసిన కాలుష్యం.. స్మాగ్లోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలి. తేలికపాటి వ్యాయామం వల్ల ముఖానికి తగినంత రక్తప్రసరణ జరిగి ముఖం తేటగా మారుతుంది. రోజుకి కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్రతో ముఖం తేటబారుతుంది. ఆహార పరంగా.. అన్ని రకాల పోషకాలు అందే సమతులాహారాన్ని రోజూ తీసుకోవాలి. అయితే చలి వాతావరణం కారణంగా నీళ్లు తక్కువగా తాగుతుంటారు. ఇది సరికాదు. రోజూ తప్పనిసరిగా మూడు లీటర్లకు తగ్గకుండా నీళ్లు తాగాలి. ఆకుకూరలు, కూరగాయలూ, ములగకాడల వంటి తాజా కూరలను ఎక్కువగా తీసుకోవాలి. ఈ సీజన్లో దొరికే పండ్లను తప్పక తీసుకోవాలి. ఇందులోని నీటిమోతాదులూ, పోషకాలూ, యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరచి ముఖాన్ని తేటగా కనిపించేలా చేస్తాయి. డ్రైఫ్రూట్స్ పరిమితంగా తీసుకుంటూ ఉండాలి. అందులో జీడిపప్పు వంటి కొవ్వులు ఎక్కువగా ఉండే నట్స్ కంటే బాదం పప్పు వంటి కొవ్వులు తక్కువగా ఉండే నట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఇవి చదవండి: గుడిలో తీర్థం, ప్రసాదాలు ఎందుకు ఇస్తారో తెలుసా? కారణమిదే! -
ఆపదలో చేయూత.. క్రౌడ్ ఫండింగ్
శాంతి, ఏకాంబరం దంపతులు (పేరు మార్చాం) తొలి కాన్పులో పుత్రుడు అని తెలియగానే పొంగిపోయారు. బాబును చూస్తూ భవిష్యత్తుపై ఎన్నో కలలుగన్నారు. చిన్నారి మూడేళ్ల వయసుకొచ్చేసరికి కదల్లేని స్థితి ఏర్పడింది. హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ చిన్నారుల ఆస్పత్రిలో చూపించారు. స్పైనల్ మసు్క్యలర్ అట్రోఫీ(ఎస్ఎంఏ)తో బాధపడుతున్నట్టు తేలింది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే విదేశాల నుంచి ‘జోల్జెన్స్మా’ అనే ఇంజెక్షన్‌ను తీసుకొచ్చి ఇవ్వాలి. ఇందుకు సుమారు రూ.16 కోట్లు అవుతుందని వైద్యులు వెల్లడించారు. ఈ సమయంలో బాబు తల్లిదండ్రులకు ‘ఇంపాక్ట్ గురూ’ ప్లాట్‌ఫామ్ సంజీవనిగా కనిపించింది. చిన్నారి ఎదుర్కొంటున్న పరిస్థితిని వివరిస్తూ విరాళాలకు (ఫండ్ రైజింగ్) పిలుపునిచ్చారు. మూడున్నర నెలల్లో 65,000 మంది దాతల ఉదారంతో ఊహించనిది సాధ్యమైంది. విదేశాల నుంచి సదరు ఇంజెక్షన్‌ను తీసుకొచ్చి ఇవ్వడంతో బాబు కోలుకున్నాడు. వేణు నెట్ బ్రౌజింగ్ చేస్తున్న సమయంలో ఓ బాలిక లివర్ సమస్యతో బాధపడుతుందన్న ‘కెట్టో’ ప్రకటన కనిపించింది. అది క్లిక్ చేయగా, ఆ సమస్య నుంచి బయటపడేందుకు రూ.30 లక్షలు అవుతుందని, దాతలు దయతలిస్తేనే తన కుమార్తె బయటపడుతుందంటూ చిన్నారి తల్లి ఆవేదనతో చెబుతున్న మాటలకు వేణు చలించిపోయాడు. కానీ, కాలేయ చికిత్సకు భారీ మొత్తాన్ని పేర్కొనడంపై అతడిలో అనుమానం కలిగింది. సదరు ప్రకటన నిజమేనా..? అంత ఖర్చు అవుతుందా..? ప్రభుత్వాలు ఎందుకు సాయం చేయవు? ఆస్పత్రులు అయినా బాధితుల విషయంలో కొంత లాభాపేక్ష తగ్గించుకుని చికిత్సలకు ముందుకు రావచ్చుగా..? ఇలాంటి ప్రశ్నలు మెదిలాయి. చివరికి తన సందేహాలన్నీ పక్కన పెట్టేసి రూ.500 అప్పటికప్పుడు డొనేట్ చేశాడు. ఎంత పెద్ద ఆరోగ్య సమస్య వచి్చనా, తమ వల్ల ఏమవుతుంది? అంటూ కుదేలు అయిపోవాల్సిన పని లేదని శాంతి దంపతుల కథనం ధైర్యాన్నిస్తోంది. ఆరోగ్య పరంగా ఎంత కష్టం వచి్చనా, దాతల నుంచి విరాళాలు తెచ్చి పెట్టేందుకు నేడు ఎన్నో వేదికలు పనిచేస్తున్నాయి. వేలాది మంది బాధితుల కుటుంబాల్లో సంతోషానికి దారి చూపిస్తున్నాయి. అదే సమయంలో ఇలాంటి బాధితులకు సాయం చేశామనే సంతృప్తి దాతలకు లభిస్తోంది. కాకపోతే విరాళం ఇచ్చే ముందు కాస్తంత విచారించి, కథనం నిజమైనదేనని నిర్ధారించుకోవడం ద్వారా తమ దానం నిష్ఫలం కాకుండా చూసుకోవచ్చు. మెడికల్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఎలా పనిచేస్తాయో తెలుసుకుంటే.. వీటి సాయం పొందడమే కాకుండా, వీటి ద్వారా నలుగురికీ తోచినంత సాయం చేయడానికి అవకాశం లభిస్తుంది. మనోళ్లకు దాన గుణం ఎక్కువే.. 2021 వరల్డ్ గివింగ్ ఇండెక్స్ ప్రకారం దానంలో భారత్ 14వ స్థానంలో ఉంది. అపరిచితులకు మన దేశంలో 61 శాతం మంది సాయం చేస్తున్నారు. కాకపోతే విశ్వసనీయత విషయంలో ఉండే సందేహాలు ఈ దాతృత్వాన్ని మరింత విస్తరించకుండా అడ్డుకుంటున్నాయని చెప్పుకో వచ్చు. బాధితులకు, దాతలకు మధ్య వేదికగా నిలిచే విశ్వసనీయ సంస్థలు వస్తున్న కొద్దీ, క్రౌడ్ ఫండింగ్ మరింత పరిడవిల్లుతూనే ఉంటుంది. మరింత మంది బాధితులకు చేయూత లభిస్తుంది. నిధుల సమీకరణ ఇలా..? ► చికిత్సలకు దాతల సాయం అవసరమైన వారు క్రౌండ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌లను (ఇంపాక్ట్‌గురూ, మిలాప్, కెట్టో మొదలైనవి) సంప్రదించాలి. ► పాన్, ఆధార్, మెడికల్ డాక్యుమెంట్లు సమర్పించాలి. ► వీటిని క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్ ధ్రువీకరించుకుంటుంది. తగిన విచారణ అనంతరం బాధితుల కథనం నిజమేనని నిర్ధారించుకున్న తర్వాత వారి తరఫున నిధుల సమీకరణ పేజీని అవి సిద్ధం చేస్తాయి. ► ఇక ఇక్కడి నుంచి నిధుల సమీకరణ మొదలవుతుంది. సాయం అవసరమైన వారు ఈ పేజీ లింక్‌ను తమ నెట్‌వర్క్‌లో షేర్ చేసుకోవాలి. తమ వంతు ప్రచారం కలి్పంచుకోవాలి. అలాగే, ప్లాట్‌ఫామ్‌లు సైతం ప్రచారానికి తమ వంతు సాయం అందిస్తాయి. ► సమీకరించే విరాళంలో ఎక్కువ మొత్తాన్ని కమీషన్ రూపంలో మినహాయించుకునేందుకు సమ్మతి తెలియజేస్తే, వారి తరఫున క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌లు సైతం విస్తృత ప్రచారాన్ని చేపడతాయి. ► బాధితులు ఎదుర్కొంటున్న సమస్య, వైద్యులు చెబుతున్న వెర్షన్, చికిత్సకు ఎంత ఖర్చవుతుంది? తదితర వివరాలన్నీ ఈ పేజీలో ఉంటాయి. దాతలు విరాళం చెల్లించేందుకు పేమెంట్ లింక్‌లు కూడా అక్కడ కనిపిస్తాయి. ► కనీసం 300–350 అంతకంటే ఎక్కువ విరాళాలనే అనుమతిస్తున్నాయి. ► దాతలు చేసే చెల్లింపులన్నీ కూడా ప్రత్యేక ఖాతాలో జమ అవుతాయి. ► కావాల్సిన మొత్తం వచి్చనా.. లేదంటే గడువు ముగిసినా లేదంటే అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి అకాలంగా మరణించినా నిధుల సమీకరణ ముగిసిపోతుంది. ► అనంతరం ఈ మొత్తం నుంచి కమీషన్ మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని హాస్పిటల్/బాధితులకు క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌లు చెల్లిస్తాయి. ఇలా చేసే ముందు హాస్పిటల్ బిల్లులను చెక్ చేస్తాయి. ► విరాళం ఇచి్చన వారికి ఎప్పటికప్పుడు మెయిల్ ద్వారా బాధితుల తాజా ఆరోగ్య పరిస్థితిపై వివరాలను ఇవి అప్డేట్ చేస్తుంటాయి. విశ్వసించడం ఎలా..? సాయం అవసరమైన వారికి క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌లు మార్గాన్ని చూపిస్తున్నాయి. మరి విరాళం ఇచ్చే వారు ఈ కథనాలను విశ్వసించేది ఎలా..? ఈ సందేహం చాలా మందికి వస్తుంది. మన దేశంలో విరాళాలకు సంబంధించి భౌతిక వేదికలే ఎక్కువ. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల సేవలు ఇటీవలి కాలంలోనే వెలుగులోకి వచ్చాయి. ఇంటర్నెట్ విస్తరణ ఇందుకు వీలు కలి్పంచిందని చెప్పుకోవాలి. ఆన్లైన్ ప్రపంచంలో అన్నింటినీ నమ్మలేం. సైబర్ మోసాలు గణనీయంగా పెరిగిపోయిన నేపథ్యంలో, అన్నీ విచారించుకున్న తర్వాతే విరాళం ఇవ్వడం సురక్షితంగా ఉంటుంది. కోటక్ ఆల్టర్నేటివ్ అస్సెట్ మేనేజర్స్ సీఈవో (ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ) లక్ష్మీ అయ్యర్ దీనిపై తన అనుభవాన్ని పంచుకున్నారు. ‘‘నాకు రిఫరల్ ద్వారా వచ్చే వాటికే నేను దానం చేస్తాను. ఈ విషయంలో నా మార్గం చాలా స్పష్టం. సులభంగా డబ్బులు సంపాదించే మోసగాళ్లకు కొదవ లేదు’’అన్నది లక్ష్మీ అయ్యర్ అభిప్రాయంగా ఉంది. సన్సేరా ఇంజనీరింగ్ జాయింట్ ఎండీ ఎఫ్ఆర్ సింఘ్వి ఈ విషయంలో సందేహాలు వ్యక్తం చేశారు. ‘‘చాలా వరకు విరాళాలు కోరుతున్న ఆన్లైన్ కేసులు వైద్య పరమైనవే ఉంటున్నాయి. కొన్ని సందర్భాల్లో అవి పేర్కొనే చికిత్సల వ్యయాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. నాకు ఒక ఆస్పత్రితో అనుబంధం ఉంది. కనుక చికిత్సల వ్యయాల గురించి తెలుసుకోగలను’’అని పేర్కొన్నారు. ఇలాంటిదే ఒక విరాళం కేసులో చికిత్సకు రూ.18–24 లక్షలు ఖర్చువుతుందన్న కొటేషన్ కనిపించగా, దీనిపై విచారించగా, తెలిసిన హాస్పిటల్లో రూ.5–6 లక్షలకే చేస్తున్నట్టు విని ఆశ్చర్యపోయినట్టు సింఘ్వి తెలిపారు. నిజానికి కొన్ని కేసుల్లో భారీ అంచనాలు పేర్కొంటున్న ఉదంతాలు లేకపోలేదు. హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్న బాధితుల తరఫున నిధుల సమీకరణ కార్యక్రమాలు నడిపించే కొందరు మోసగాళ్ల ఉదంతాలు సైతం లోగడ వెలుగు చూశాయి. అలా అని కష్టాల్లో ఉన్న బాధితులకు విరాళాలు ఆగకూడదు కదా..? ముందస్తు పరిశీలన క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌లు చికిత్సల వ్యయాలను ముందుగానే నిర్ధారించుకుంటామని చెబుతున్నాయి. హాస్పిటల్ వ్యయ అంచనాలను, చారిత్రక గణాంకాలు, బీమా థర్డ్ పార్టీ అగ్రిగేటర్ సంస్థల డేటా ఆధారంగా పోల్చి చూస్తామని ఇంపాక్ట్‌గురూ సీఈవో జైన్ తెలిపారు. తమ ప్యానల్ డాక్టర్లతోనూ దీనిపై నిర్ధారించుకుంటామని చెప్పారు. నిధుల సమీకరణ నిజమైన కారణాలతో చేసినప్పటికీ, తర్వాత ఆ నిధులు దురి్వనియోగం కాకుండా ఉండేందుకు కూడా ఇవి చర్యలు తీసుకుంటున్నాయి. ‘‘ఇంపాక్ట్ గురూ వేదికగా సమీకరించే నిధుల్లో 80 శాతానికి పైగా నేరుగా హాస్పిటల్స్‌కు బదిలీ చేస్తున్నాం. ఈ హాస్పిటల్స్ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ జాబితాలోనివే’’అని జైన్ తెలిపారు. తమ ప్లాట్‌ఫామ్‌పై లిస్ట్ చేసే వైద్య పరమైన కేసుల్లో విరాళాలను హాస్పిటల్ బ్యాంక్ ఖాతా ద్వారానే తీసుకోగలరని కెట్టో అంటోంది. ► బాధితుల కేవైసీ పత్రాలను ముందుగా ఇవి నిర్ధారించుకుంటాయి. ► వైద్య పరమైన అన్ని డాక్యుమెంట్లు తీసుకుని వాటిని తనిఖీ చేస్తాయి. ► తమ ప్యానెల్ వైద్యులతో మాట్లాడి నిర్ధారణకు వస్తాయి. ► అవసరమైతే క్షేత్రస్థాయిలో హాస్పిటల్‌కు తమ ఉద్యోగిని పంపించి వాస్తవమా, కాదా అన్నది నిర్ధారించుకుంటాయి. ప్రచార మార్గం.. ఇంపాక్ట్ గురూ, కెట్టో, మిలాప్ ఇవన్నీ ప్రముఖ మెడికల్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌లు. ఆన్లైన్ ప్రకటనలు, సామాజిక మాధ్యమాల ద్వారా బాధితుల తరఫున విరాళాల సమీకరణకు ఇవి ప్రచారం కలి్పస్తుంటాయి ఇంటర్నెట్ బ్రౌజ్ చేసే సమయంలో వైద్య చికిత్సల కోసం సాయం కోరుతూ ఈ సంస్థలకు సంబంధించి ప్రకటనలు కనిపిస్తుంటాయి. వీటిని క్లిక్ చేసి చూశారంటే, తర్వాత కూడా అలాంటి ప్రకటనలే మళ్లీ మళ్లీ కనిపిస్తుంటాయి. ప్రకటనల్లో బాధితుల కథనానికి ఆధారంగా వైద్యులు జారీ చేసిన లెటర్, టెస్ట్ రిపోర్ట్‌లను ఉంచుతున్నాయి. సామాజిక మాధ్యమాలతోపాటు, బాధితులు సైతం తమకు తెలిసిన వారికి ఈ లింక్‌లు పంపి సాయం కోరవచ్చు. ఒక్కసారి కావాల్సిన నిధులు లభించగానే, ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమం ముగుస్తుంది. ఈ సంస్థలు విరాళం ఇచి్చన వ్యక్తులను నెలవారీ స్కీమ్‌లతో ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రతి నెలా తోచినంత దానం ఇచ్చే విధంగా స్కీమ్‌లు తీసుకొచ్చాయి. విరాళాలకు సెక్షన్ 80జీ కింద పన్ను మినహాయింపు కల్పిస్తున్నాయి. బాధితుల అనుభవాలు.. లాహిరి సోదరికి బ్రెయిన్ టీబీ నిర్ధారణ కావడంతో 2019 డిసెంబర్లో నిధుల సమీకరణ కోసం మిలాప్ సంస్థను సంప్రదించారు. మిలాప్ ఆమె అభ్యర్థనకు చక్కగా స్పందించింది. ఫొటోగ్రాఫ్‌లు, డాక్యుమెంట్లు అడిగారు. అవన్నీ ఇవ్వడంతో, వాటి ఆధారంగా ఒక ప్రచార ప్రకటనను మిలాప్ రూపొందించింది. తెలిసిన వారి సాయంతో దీనికి మంచి ప్రచారం కలి్పంచుకోవాలని మిలాప్ సూచించింది. తాము ఆ ప్రచారాన్ని చేపట్టబోమని, బాధితులే సొంతంగా నిర్వహించడం వల్ల మరింత విశ్వసనీయత ఉంటుందనే సూచన వచ్చింది. దీంతో లాహిరి తనకు తెలిసిన వారికి షేర్ చేశారు. అలా రూ.45,000 విరాళాలు వచ్చాయి. ఇందులో మిలాప్ తన కమీషన్‌గా రూ.5,000 మినహాయించుకుని, రూ.40,000ను లాహిరి చికిత్స పొందుతున్న ఆసుపత్రికి చెల్లించింది. కానీ, మిలాప్ ద్వారా చేసిన ప్రచారం లాహిరి బంధు మిత్రులకు తెలిసిపోవడంతో, వారి నుంచి ఆమెకు మరో రూ.12 లక్షలు విరాళాల రూపంలో నేరుగా వచ్చాయి. మిలాప్ రూపొందించిన ప్రచారమే లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదని లాహిరి అనుభవం చెబుతోంది. దురదృష్టవశాత్తూ లాహిరి సోదరి బ్రెయిన్ టీబీతో 2020 ఫిబ్రవరిలో మరణించారు. విజయం ఎంత? మీరా అనే వ్యక్తి సైతం, తన భర్త సర్జరీ కోసం కెట్టో ద్వారా నిధుల సమీకరణ చేయగా, మంచి ఆదరణే లభించింది. కెట్టో రిప్రజెంటేటివ్ ఎప్పటికప్పుడు ఆమెతో సంపద్రింపులు చేస్తూ సహకారం అందించడంతో, సర్జరీకి కావాల్సిన మొత్తం 48 గంటల్లోనే సమకూరింది. దేశ, విదేశాల్లోని స్నేహితులు, కుటుంబ సభ్యులు విరాళం ఇచ్చేందుకు సముఖంగా ఉన్నారని తెలిసినా, అందుకు వీలుగా కెట్టో ప్లాట్‌ఫామ్ సాయాన్ని ఆమె తీసుకున్నారు. ఎక్కడ ఉన్నా కెట్టో ద్వారా విరాళం పంపడం సులభమని భావించి అలా చేసినట్టు చెప్పారు. అయితే, అందరికీ ఇదే తరహా అనుభవం లభిస్తుందా..? ప్రతి ఫండ్ రైజింగ్ విజయవంతం అవుతుందా? అంటే నూరు శాతం అవును అని చెప్పలేం. ఇదంతా తమకున్న పరిచయాలు, ఎంపిక చేసుకున్న ప్లాట్‌ఫామ్, రూపొందించిన ప్రకటన, ప్లాట్‌ఫామ్ నుంచి ప్రచారం తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. ‘‘కొన్నేళ్ల క్రితం మేము సాయం కోసం ఇంపాక్ట్ గురూ ప్లాట్‌ఫామ్‌ను సంప్రదించాం. ఇంపాక్ట్ గురూ దాతల నెట్వర్క్ సాయంతో నిధులు సమకూర్చుతారని అనుకున్నాం. కానీ, ఇంపాక్ట్ గురూ అలా చేయలేదు. ప్రచార కార్యక్రమం పేజీని రూపొందించి, ఆ లింక్‌ను తమ పరిచయస్తులతో పంచుకోవాలని సూచించింది’’అని ఓ వ్యక్తి అనుభవం చెబుతోంది. తమ ప్లాట్‌ఫామ్‌పై వేలాది ప్రచార కార్యక్రమాలు నమోదవుతున్నందున.. ప్రతీ ఒక్క ప్రచారాన్ని తామే సొంతంగా చేపట్టడం సాధ్యం కాదని ఇంపాక్ట్ గురూ సహ వ్యవస్థాపకుడు, సీఈవో పీయూష్ జైన్ స్పష్టం చేశారు. దాతల కమ్యూనిటీ నుంచి మంచి స్పందన వస్తుందనుకుంటే, తాము తప్పకుండా ప్రమోట్ చేస్తుంటామని చెప్పారు. కొంచెం కమీషన్.. క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్ లు మొత్తం విరాళం నుంచి నిరీ్ణత మొత్తాన్ని కమీషన్/చార్జీ కింద మినహాయించుకుంటున్నాయి. ఇది ఒక్కో సంస్థలో ఒక్కో విధంగా ఉంటుంది. ‘‘అంతర్జాతీయంగా చూస్తే ప్రతీ మెడికల్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్ ఎంతో కొంత స్వల్ప ఫీజును వసూలు చేస్తున్నాయి. తమ కార్యకలాపాలు నిర్విరామంగా కొనసాగేందుకే ఇలా చేస్తున్నాయి. టెక్నాలజీ సదుపాయాలు, సిబ్బంది, నిధుల సమీకరణ, ముందస్తు విచారణలకు సంబంధించి వ్యయాలు అవుతాయి. మేము నిలదొక్కుకున్నప్పుడే మా లక్ష్యాన్ని (ఫండ్ రైజింగ్) సాధించగలం’’ అని పీయూష్ జైన్ తెలిపారు. ఈ ప్లాట్‌ఫామ్‌లలో కొన్ని ప్రీమియం సేవలను కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఇంపాక్ట్ గురూ అయితే 0 శాతం, 5 శాతం, 8 శాతం ఇలా మూడ్ స్కీమ్‌ల కింద ఈ సేవలను ఆఫర్ చేస్తోంది. మోసాలుంటాయ్.. జాగ్రత్త అవగాహన, జాగ్రత్తలు లేకపోతే ఆన్లైన్ మోసాల బారిన పడే రిస్క్ ఉంటుంది. క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విరాళాలు కోరినా లేక విరాళం ఇచ్చినా సరే.. ఆ తర్వాత ఫోన్ కాల్ లేదా వాట్సాప్ మెస్సేజ్ లేదా మెయిల్ రావచ్చు. కష్టంలో ఉన్న బాధితులకు సంబంధించి అందులో సాయం కోరొచ్చు. లేదంటే అప్పటికే విరాళం ఇచ్చిన కేసుకు సంబంధించి అప్డేట్ అంటూ మోసగాళ్లు మెయిల్ పంపించొచ్చు. ఒక్కసారి విరాళం ఇస్తే, ఆ తర్వాత నుంచి క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఇతర బాధితులకు సంబంధించిన వివరాలను మెయిల్స్, వాట్సాప్ మెస్సేజ్‌లు, కాల్స్ రూపంలో మార్కెటింగ్ చేస్తుంటాయి. ఇదంతా ఇబ్బందికరంగా అనిపించొచ్చు. చాలా మంది సాయం చేయాలని భావిస్తుంటారని, బాధితుల వివరాలను వారు మెయిల్ లేదా వాట్సాప్ సందేశాలు, కాల్స్ రూపంలో తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారని జైన్ తెలిపారు. ఇవి వద్దనుకునే వారు అన్‌సబ్‌స్క్రయిబ్ చేసుకోవాలని సూచించారు. క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌లు అన్నీ కూడా సురక్షిత చెల్లింపుల సాధనాలనే వినియోగిస్తున్నాయి. కానీ, వీటి పేరుతో సైబర్ నేరస్థులు ఆకర్షించే కథనాలు, మోసపూరిత పేమెంట్ లింక్‌లు పంపించి, బ్యాంక్ ఖాతాలో బ్యాలన్స్ మొత్తాన్ని ఊడ్చేసే ప్రమాదం లేకపోలేదు. అందుకే విరాళం ఇచ్చే ముందు సంబంధిత సంస్థల యూఆర్ఎల్ను జాగ్రత్తగా గమనించుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
హైదరాబాద్ నిమ్స్ కు బలగం మొగిలయ్య తరలింపు..
-
ఆరోగ్యంపై స్పందించిన పంచ్ ప్రసాద్, ముక్కులోంచి రక్తం...
జబర్దస్త్ కమెడియన్ ‘పంచ్’ ప్రసాద్ కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల తీవ్ర అనారోగ్యం బారిన పడటంతో పంచ్ ప్రసాద్‌కు సాయం చేసేందుకు తన తోటి కంటెస్టెంట్స్ ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ‘కిరాక్’ ఆర్పీ పంచ్ ప్రసాద్ ఆపరేషన్‌కు అయ్యే ఖర్చు అంతా తానే భరిస్తానని ఇటీవల ఓ ఇంటర్య్వూలో వెల్లడించాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం స్వల్పంగా కోలుకున్న పంచ్ ప్రసాద్ ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌కు ఇంటర్య్వూ ఇచ్చాడు. ఈ సందర్బంగా తన ఆరోగ్యంపై స్పందిస్తూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. చదవండి: నన్ను పెళ్లి చేసుకుంటారా? స్టార్ హీరోయిన్ ఓపెన్ కామెంట్స్ తనకు సాయం చేసేందుకు చాలా మంది జబర్దస్త్ కంటెస్టెంట్స్ ముందుకు వచ్చారని, వారందరికీ రుణపడి ఉంటానన్నాడు. ‘పెళ్లయిన కొత్తలో నా ముక్కులో నుంచి తరచూ రక్తం రావడంతో నా భార్య ఆస్పత్రికి తీసుకెళ్లింది. అప్పడే నా రెండు కిడ్నిలు పాడయ్యాయని డాక్టర్లు చెప్పారు. కిడ్ని సమస్యలు ఉన్న వారిలో ఒక్కొక్కరికి ఒక్కోలా ప్రభావం చూపిస్తుంది. నా కాలు ఎముకకు చీము రావడంతో నడవలేని స్థితికి వెళ్లిపోయా. ప్రస్తుతానికి స్వల్పంగా కోలుకున్నా. షోలు కూడా చేసుకుంటున్నా. ఇప్పుడు బాగానే నడుస్తున్నాను. త్వరలోనే ఆపరేషన్ కూడా చేయించుకోబోతున్నా’ అని చెప్పాడు. చదవండి: అంతర్జాతీయ వేదికపై ఆసక్తికర సంఘటన, స్టేజ్‌పైనే చరణ్‌కు క్షమాపణలు చెప్పిన నటి అయితే తన కాలుకు చీము రావడం వల్లే ఆపరేషన్ని వాయిదా వేశారని తెలిపాడు. ఇప్పటికే తనకి కిడ్నీ డోనర్ దొరికారని, కాలు నొప్పి తగ్గే వరకు డాక్టర్లు ఆపరేషన్ చేయమని చెప్పారని పంచ్ ప్రసాద్ పేర్కొన్నాడు. అయితే తాను త్వరగా కోలుకోవాలని చాలా మంది తన కోసం ప్రార్థించారని, ఓ అభిమాని అయితే కుటుంబంతో సహా తిరుపతి వెళ్లి కాళి నడకన ఏడుకొండలు ఎక్కాడంటూ పంచ్ ప్రసాద్ ఆసక్తిక విషయం చెప్పాడు. అప్పుడే తనని ఇంతలా అభిమానించే అభిమానులు ఉన్నారా? అని ఆశ్చర్యం వేసిందన్నాడు. అనంతరం తన కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞుడిని అని అన్నాడు. -
బుర్ర బద్దలయ్యేలా పని చేస్తున్నారా? అంతొద్దు.. లాభమేమీ లేదు!
సాక్షి, హైదరాబాద్: మెదడు.. మన శరీరంలోని అత్యంత సంక్షిష్టమైన నిర్మాణం. ఆలోచనలు, కళలు, జ్ఞాపకాలు, సృజనాత్మకత, తార్కిక బుద్ధి ఇలా అనేక విషయాల్లో మనిషిని ఇతర జీవజాతులకన్నా ఉన్నతంగా, విభిన్నంగా నిలుపుతున్న అవయవం. కోట్లాది న్యూరాన్ల కలబోతగా దైనందిన జీవితంలో చురుకైన పోషిస్తూ.. ఇన్ఫర్మేషన్–ప్రాసెసింగ్ పవర్‌హౌస్ పాత్ర పోషిస్తున్న ఓ మినీ సూపర్ కంప్యూటర్. అయితే నేటి ఆధునిక కాలంలో మనలో రోజురోజుకూ పెరుగుతున్న మానసిక ఒత్తిళ్లకు మెదడు సైతం ప్రభావితం అవుతోంది. ఫలితంగా నిద్రలేమి సమస్యలు ఎదుర్కొంటున్న వారి సంఖ్య అధికమవుతోంది. ఈ నేపథ్యంలో మెదడుకు విశ్రాంతి ఇవ్వాల్సిన ఆవశ్యకత, ఇవ్వకుంటే కలిగే దుష్ప్రభావాలపై వైద్య నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. అవి ఏమిటంటే... ►మెదడుకు తగిన విశ్రాంతి ఇవ్వకుండా బుర్ర బద్దలయ్యేలా పని చేసేందుకు ప్రయత్నిస్తే దాని వల్ల ఒనగూరే ప్రయోజనాలు అంతంత మాత్రమే. ►మెదడు స్పాంజ్ లాంటిది. అది ఎంతవరకు సమాచారాన్ని భద్రపరచుకోగలదో అంతే చేయగలదు. అందువల్ల బ్రెయిన్‌కు నిత్యం రెస్ట్ అవసరమే. ►పనిచేస్తున్న రోజుల్లో మధ్యలో విరామం తీసుకోవడం వల్ల మూడ్ బాగుకావడంతోపాటు పనితీరు, ఏకాగ్రత మెరుగుపడుతుంది. ►మెదడుకు తగిన విశ్రాంతి ఇవ్వకపోతే అది అనారోగ్య సమస్యలతోపాటు దీర్ఘకాలిక ఒత్తిళ్లకు కారణమవుతుంది. మెదడుకు విశ్రాంతి కోసం... కేవలం నిద్రలోనే మెదడుకు రెస్ట్ దొరుకుతుందనేది కూడా పూర్తిగా శాస్త్రీయం కాదని నిపుణులు అంటున్నారు. మెదడుకు ఎక్కువగా పని కల్పించకుండా ఉంచడం కోసం వివిధ రకాల ధ్యానాలు చేయడం కూడా సరైనదేనని నిపుణులు చెబుతున్నారు. వారి సూచనల ప్రకారం... ►ప్రకృతిలో కాసేపు మమేకం కావాలి. ►మెదడు రిలాక్స్ కావడానికి స్నానం కూడా దోహదపడుతుంది. ►రాత్రిపూట 8 గంటల చొప్పున నిద్ర పోనివారు ఉదయం వేళల్లో కాసేపు కునుకు తీసినా మెదడు పనితీరు మళ్లీ చురుగ్గా మారుతుంది. ►ఏదైనా ఓ ఆట ఆడటం లేదా శారీరక శ్రమతోనూ మెదడుకు విశ్రాంతి లభిస్తుంది. ►సెల్ఫోన్లు, సోషల్ మీడియా వాడకానికి రోజూ కాసేపు విరామం ఇవ్వడం ద్వారా కూడా మెదడు విశ్రాంతి పొందుతుంది. నిద్రలో బ్రెయిన్ వేవ్స్ నెమ్మదిస్తాయి... సుఖనిద్ర సమయంలో బ్రెయిన్ వేవ్స్ (మెదడు కణాలు విద్యుత్ తరంగాల ద్వారా సమాచారం ఇచ్చిపుచ్చుకొనే ప్రక్రియ) నెమ్మదిస్తాయి. ఏదైనా విషయాన్ని 2–3 గంటలపాటు చదివాక కనీసం 15–20 నిమిషాలు నిద్రపోవడమో లేదా కళ్లు మూసుకొని మౌనంగా ఉంటే అది బాగా గుర్తుండిపోతుందని కొత్త అధ్యయనాలు చెబుతున్నాయి. నిద్రలో ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ (ఆర్ఈఎం), నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ (ఎన్‌ఆర్‌ఈఎం) అనే పద్ధతులుంటాయి. ఆర్‌ఈఎంలో కలలు, జ్ఞాపకశక్తి, భావోద్వేగ అంశాల వంటివి ప్రాసెస్ అవుతాయి. మనం మెలకువగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఆదే యాక్టివిటీ కొనసాగుతుంది. నాన్ ఆర్‌ఈఎంలో అవి సరిగ్గా ప్రాసెస్ కాక మనసు కలతచెందేలా భంగం కలిగిస్తుంటాయి. బాగా నిద్రపోయినప్పుడు ఆయా అంశాలను క్రమపద్ధతిలో పెట్టేందుకు మెదడు పనిచేస్తుంటుంది. నాన్ ఆర్‌ఈఎంలో నిద్ర సరిగ్గా పట్టక జ్ఞాపకశక్తి తగ్గడం, భావోద్వేగాలను సరిగ్గా విశ్లేషించకపోవడం వల్ల కలత చెందడానికి కారణమవుతుంది. -
మీరు నిద్రించే సమయం ఇదేనా? తేడా వస్తే కష్టమే! ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు
చిన్నా పెద్దా అని తేడా లేదు.. చాలా మందికి నిద్రలేమి పెద్ద సమస్యగా మారింది.. పైకి తెలియకుండానే శారీరక, మానసిక సమస్యలకు కారణమవుతోంది. ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాలు, విద్యాపరంగా ఒత్తిళ్లు, పోటీ ప్రపంచంలో కెరీర్‌పై ఫోకస్ పెరగడంతో నెలకొన్న ఒత్తిడి వంటివి ఒకవైపు అయితే.. విపరీతంగా స్క్రీన్ టైమ్ (ఫోన్లు, కంప్యూటర్ల వాడకం, టీవీ చూడటం వంటివి) పెరిగిపోవడం మరోవైపు దీనికి కారణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కోవిడ్ కారణంగా గత మూడేళ్లుగా నెలకొన్న పరిస్థితులు, రోజువారీ జీవన విధానంలో వచ్చిన మార్పులూ సమస్య పెరగడానికి దారి తీస్తున్నాయని అంటున్నారు. దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీలు, వైద్య సంస్థలు అధ్యయనం చేసి.. నిద్ర లేమి కారణాలు, దీనివల్ల తలెత్తుతున్న సమస్యలపై నివేదికలు విడుదల చేశాయి. ఆ అంశాలపై ఓ లుక్కేద్దాం. – సాక్షి, హైదరాబాద్ 7 నుంచి 9 గంటల నిద్ర వల్ల ప్రయోజనాలివీ.. ►18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు వారికి కనీసం 7 గంటల రాత్రి నిద్ర అవసరం. ►తగినంత నిద్రతో రోగ నిరోధక శక్తి ఉత్తేజితం అవుతుంది. అనారోగ్యం బారినపడే అవకాశాలు తగ్గుతాయి. ►ఒకవేళ ఏదైనా చిన్నపాటి అనారోగ్యం కలిగినా వేగంగా కోలుకోగలుగుతారు. ►7 నుంచి 9 గంటల మధ్య నిద్రతో జ్ఞాపకశక్తి, సృజనాత్మకత మెరుగుపడుతుంది. ►ఏకాగ్రత కూడా పెరిగి సమస్యలను సులభంగా పరిష్కరించేందుకు తోడ్పడుతుంది. ►రోజువారీ వ్యక్తిగత జీవితం ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. సమస్యను అధిగమించేందుకు ఇలా చేయొచ్చు ► క్రమం తప్పకుండా రోజూ అరగంటకుపైగా వ్యాయామం, నడక ►రాత్రి మితంగా భోజనం చేయాలి. సాయంత్రాలు సిగరెట్లు, మద్యం, పొగాకు వంటివి తీసుకోవద్దు. ►వీకెండ్స్, ఆదివారాలు సహా అన్నిరోజుల్లో నిద్రపోయేందుకు, పొద్దున లేచేందుకు ఒకే సమయం పాటించాలి. ►బెడ్రూంలలో టీవీలు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, మొబైల్స్ వంటి ఎలక్ట్రానిక్, డిజిటల్ పరికరాలను వినియోగించొద్దు. ►నిద్రించే చోట తగిన ఉష్ణోగ్రత, తక్కువ వెలుతురు, శబ్దాలు ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. 5, 6 గంటలు, అంతకంటే తక్కువ నిద్రతో సమస్యలివీ.. ►ఐదారు గంటల కన్నా తక్కువ నిద్రతో రోగ నిరోధక శక్తి బలహీనంగా మారుతుంది. ►ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, గుండెపోటు, కుంగుబాటు వంటివి తలెత్తే ప్రమాదం పెరుగుతుంది. ►5 గంటలు, అంతకంటే తక్కువ నిద్రతో ఊబకాయం వచ్చే అవకాశాలు 20 శాతం పెరుగుతాయి. ►జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గుతాయి. కొత్త అంశాలను నేర్చుకోవాలన్న జిజ్ఞాస 40%పైగా తగ్గిపోతుంది. ►దీర్ఘకాలం నిద్ర సమయం తక్కువగా ఉంటే మానసిక సమస్యలు తలెత్తుతాయి. చిన్న విషయానికే ఆందోళన పడటం, కుంగుబాటు, షార్ట్ టెంపర్, ప్రతీదానికి విసుక్కోవడం, వాహనాలు నడిపేపుడు ఏకాగ్రత కోల్పోవడం వంటివి జరుగుతాయి. ►చేసే పనుల్లో తరచూ తప్పులు దొర్లడం, పనివేగం తగ్గిపోవడం, మార్పులకు తగినట్టు సర్దుబాటుకాకపోవడం, భావోద్వేగాలపై నియంత్రణ కోల్పోవడం లాంటి సమస్యలు వస్తాయి. నిద్ర తగ్గితే శారీరక, మానసిక సమస్యలు గత పదేళ్లలో భారతీయుల్లో నిద్ర అలవాట్లు, పద్ధతుల్లో బాగా మార్పులు జరిగాయి. నిద్ర అనేది కేవలం శరీరానికి విశ్రాంతి మాత్రమే కాదు. మెదడు పనితీరును మెరుగుపర్చుకునేందుకు, ఆ రోజంతా చేసిన పనులను ఒక క్రమపద్ధతుల్లో పెట్టుకోవడానికి, ‘మెటబాలిక్ రియాక్షన్ రిథమ్’లో ఉండటానికి నిద్ర తోడ్ప డుతుంది. అర్ధరాత్రి దాకా మేలుకుని ఉండటం, లేవడం వంటివాటి వల్ల ‘సర్కాడియన్ సైకిల్’ దెబ్బతింటుంది. ఐదు గంటల కంటే తక్కువ నిద్ర ఉంటే.. శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయి. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ ఐటీ ఉద్యోగుల్లో తీవ్రంగా సమస్య మూడేళ్లుగా ఐటీ కంపెనీలు, ఇతర రంగాల ఉద్యోగులు అధికంగా వర్క్‌ఫ్రం హోం పద్ధతికి మారారు. ఇప్పటికీ ఈ విధానాన్ని కొనసాగిస్తున్న వారిలో సరైన నిద్రలేకపోవడం, గురక, మధ్యలో ఉలిక్కిపడి లేవడం, పొద్దున లేచాక ఫ్రెష్‌గా అనిపించకపోవడం వంటి లక్షణాలతో కూడిన ‘అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా’ సమస్య కనిపిస్తోంది. ఈ సమస్యలతో వస్తున్న ఐటీ ఉద్యోగులకు తగిన చికిత్స అందిస్తున్నాం. ఎట్టిపరిస్థితుల్లోనూ రోజుకు 7, 8 గంటల నిద్ర ఉండాలి. సాయంత్రం 5 తర్వాత టీ, కాఫీ తీసుకోకపోవడం, రాత్రి 9 తర్వాత ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం ఆపేయడం మంచిది. నిద్రవచ్చినా, రాకపోయినా రాత్రి 9.30 గంటలకల్లా బెడ్‌పైకి వెళ్తే ఈ సమస్యను అధిగమించవచ్చు. – వీవీ రమణప్రసాద్, పల్మనాలజీ, స్లీప్ డిజార్డర్స్ స్పెషలిస్ట్, కిమ్స్ ఆస్పత్రి -
రాహుల్ ద్రవిడ్‌కు అస్వస్థత
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఉదయం ద్రవిడ్ చికిత్స కోసం కోల్‌కతా నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. అదే సమయంలో భారత ఆటగాళ్లతో పాటు శ్రీలంక జట్లు, సహాయక సిబ్బంది మూడో వన్డే కోసం తిరువనంతపురం బయలుదేరింది. స్వల్ప ఆరోగ్య సమస్యలతో శుక్రవారం తెల్లవారు జామున కోల్‌కతా నుంచి బెంగళూరుకు విమానంలో బయలుదేరాడు. ద్రవిడ్ బ్లడ్ ప్రెజర్(బీపీ) సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. కోల్‌కతాలో వైద్యులు పరీక్షించిన అనంతరం అతను బెంగళూరుకు బయలుదేరాడు. ప్రస్తుతం ద్రవిడ్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఆయన పూర్తిగా క్షేమంగా ఉన్నాడని..పరీక్షల అనంతరం శనివారం జట్టుతో చేరే అవకాశాలున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో బెంగళూరు విమానంలో ద్రవిడ్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక శ్రీలంకతో వన్డే సిరీస్‌ను ఇప్పటికే 2-0తో సొంతం చేసుకున్న టీమిండియా తిరువనంతపురం వేదికగా జరగనున్న మూడో వన్డేలోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తుంది. మరోవైపు షనక నేతృత్వంలోని లంక మాత్రం కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని ఆశిస్తుంది. -
నవరస నటనా సార్వభౌముడి సినీ, రాజకీయ ప్రస్థానం ఇదే..
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు కైకాల సత్యనారాయణ (87) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1935, జులై 25న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు (మ) కౌతారంలో జన్మించారు. 770కిపైగా సినిమాల్లో నటించారు. ఆయన తండ్రి కైకాల లక్ష్మీనారాయణ. కైకాల ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడలలో పూర్తిచేసి, గుడివాడ కళాశాల నుండి పట్టభద్రుడయ్యారు. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో వివాహమైంది. ఆయనకు ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. 1996లో ఆయన రాజకీయాల్లోకి వచ్చి, మచిలీపట్నం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 11వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. ►తన మనవళ్లలో ఒకరిని నటవారసుడిగా చూడాలనేది కైకాల కోరిక ►నవరస నటనా సార్వభౌముడిగా ప్రఖ్యాతిగాంచిన కైకాల ►ఐదు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో కైకాల ప్రయాణం ►కైకాల సత్యనారాయణ నటించిన మొదటి చిత్రం: సిపాయి కూతురు ► చివరి చిత్రం: మహర్షి ►పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద చిత్రాల్లో ఎన్నో పాత్రలు పోషించిన కైకాల ►28 పౌరాణిక, 51 జానపద, 9 చారిత్రక చిత్రాల్లో నటించిన కైకాల ►200 మందికిపైగా దర్శకులతో పనిచేసిన కైకాల సత్యనారాయణ ►100 రోజులు ఆడిన కైకాల నటించిన 223 చిత్రాలు ►అర్ధశతదినోత్సవాలు జరుపుకున్న 59 సినిమాలు ►సంవత్సరం ఆడిన కైకాల నటించిన 10 చిత్రాలు ►ఇంటర్ రెండో సంవత్సరంలో నాటకరంగంలో కైకాల ప్రవేశం ►నాటకరంగ అనుభవంతో సినిమాల్లో వేషం కోసం మద్రాసు వెళ్లిన కైకాల ►కైకాల సత్యనారాయణ నటుడిగా గుర్తించిన డి.ఎల్.నారాయణ ►తొలి సినిమాతోనే కథానాయకుడి అవకాశాన్ని అందుకున్న కైకాల ►సిపాయి కూతురు చిత్రంతో కథానాయకుడిగా తెరకు పరిచయమైన కైకాల ►కైకాల సత్యనారాయణకు కలిసొచ్చిన ఎన్టీఆర్ పోలికలు ►కైకాలను ఎన్టీఆర్ కు నకలుగా భావించిన పరిశ్రమ పెద్దలు ►సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి చిత్రంలో తొలిసారిగా ఎన్టీఆర్ తో కలిసి నటించిన కైకాల ►విఠలాచార్య దర్శకత్వంలో తొలి ప్రతినాయకుడి వేషం వేసిన కైకాల ►కనకదుర్గ పూజ మహిమ చిత్రంలో తొలిసారి ప్రతినాయకుడి పాత్ర పోషించిన కైకాల ►ఎన్టీఆర్ అగ్గిపిడుగు చిత్రంతో మలుపుతిరిగిన కైకాల సినీ జీవితం ►ఎన్టీఆర్ తో కలిసి 101 చిత్రాల్లో నటించిన కైకాల సత్యనారాయణ ►ఎన్టీఆర్ తో పోరాట సన్నివేశాల్లో పోటాపోటీగా నటించిన కైకాల ►యమగోల, యమలీల చిత్రాల్లో యముడిగా అలరించిన కైకాల ►పౌరాణికాల్లో రావణుడు, దుర్యోధనుడు, యముడు, ఘటోత్కచుడు పాత్రలు పోషించిన కైకాల ►సాంఘిక చిత్రాల్లో రౌడీ, తండ్రి, తాత పాత్రల్లో నటించిన కైకాల ►రమా ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్థను స్థాపించిన కైకాల సత్యనారాయణ ►కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు చిత్రాలను నిర్మించిన కైకాల ►1994లో బంగారు కుటుంబం చిత్రానికి నంది పురస్కారం ►2011లో రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్న కైకాల ►కైకాలకు బాగా నచ్చిన సంభాషణ: నీవా పాండవ పత్ని ►1996లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కైకాల సత్యనారాయణ ►తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి లోక్ సభకు కైకాల ఎన్నిక ►తొలి రోజుల్లో ''రాముడు-భీముడు' వంటి ఎన్.టి.ఆర్. ద్విపాత్రాభినయ చిత్రాలలో ఆయనకు డూప్ గా నటించారు. ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ►జీవితకాల సాఫల్య పురస్కారం (2017) నంది అవార్డులు ►ఉత్తమ చలన చిత్రం - బంగారు కుటుంబం (1994) ►రఘుపతి వెంకయ్య అవార్డు - 2011 ఇతర గౌరవాలు ►ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ అవార్డు ►నటశేఖర - అనంతపురంలో ఒక ప్రభుత్వేతర సంస్థ ఇచ్చింది. ►నటశేఖర - గుడివాడ పురపాలక సంఘ వేదికపై ఇచ్చినది ►కళా ప్రపూర్ణ - కావలి సాంసృతిక సంఘంవారు ఇచ్చినది ►నవరసనటనా సార్వభౌమ - ఒక సాంస్కృతిక సంఘం అనేకమంది పెద్దమనుషులు, పురజనుల మధ్య ఇచ్చింది. -
యువత ‘హృదయ’ వేదన
నంద్యాల జిల్లా ఆత్మకూరుకు చెందిన 20 ఏళ్ల ఏసురత్నం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతను తీవ్రమైన ఛాతినొప్పితో నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరాడు. ఈసీజీ, 2డీఎకో పరీక్షల అనంతరం అతనికి యాంజియోగ్రామ్ పరీక్షలు చేశారు. అతని గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో బ్లాక్‌లు ఏర్పడినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా స్టెంట్ వేసి అతని ప్రాణాలను వైద్యులు కాపాడారు. లద్దగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న డాక్టర్ సతీష్(45) గత నెలలో గుండెపోటుకు గురై మరణించారు. కోడుమూరులో జరిగిన సమావేశానికి హాజరైన ఆయన ప్రసంగం చేసి కూర్చుని అలాగే గుండెపోటుకు గురికావడంతో సహ ఉద్యోగులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు. .. వీరిద్దరే కాదు ఇటీవల కాలంలో మధ్యవయస్సు వారు గుండెపోటుతో ఎక్కువగా మరణిస్తున్నారు. చిన్న వయస్సులోనే దురలవాట్లకు లోనుకావడం, శారీరక వ్యాయామం లేకపోవడం, మితం లేని ఆహారం వల్ల గుండెపోటుకు గురవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కర్నూలు(హాస్పిటల్): ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారికి మాత్రమే వచ్చే గుండెజబ్బులు నేడు 20 ఏళ్లకే పలకరిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రికి గుండెచేతబట్టుకుని వస్తున్న వారిలో 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు వారే అధికంగా ఉంటున్నారు. అంతేగాకుండా వంశపారంపర్యం, జన్యులోపాలు, మేనరికపు వివాహం వంటి కారణాలతో గుండెజబ్బులతో జన్మించే పిల్లలూ ఇటీవల అధికమయ్యారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కార్డియాలజీ విభాగానికి వారానికి రెండు రోజుల ఓపీ ఉంటుంది. ప్రతి ఓపీ రోజున రోగుల సంఖ్య 250 నుంచి 300 వరకు ఉంటోంది. నెలలో 400 మంది వార్డులో చేరి చికిత్స పొందుతున్నారు. నగరంలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ పలువురు చికిత్స పొందుతున్నారు. ఏటా ఐదువేల మందికి గుండె సమస్యలతో ఆసుపత్రులకు వస్తున్నారు. వీరిలో యువకులు ఎక్కువగా ఉండడం ఆందోళనకరం. లక్షణాలు ఇవీ.. కొద్దిదూరం నడవగానే ఆయాసం, ఛాతిలో పట్టేసినట్లుగా ఉండటం, చెమట ఎక్కువగా పడుతుండటం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటం ఉంటే గుండెజబ్బుగా అనుమానించాల్సి ఉంటుంది. సమీప ఆసుపత్రికి వెళ్లి వైద్యపరీక్షలు చేయించుకుని, అవసరమైన చికిత్స తీసుకోవాలి. గుండెపోటు వచి్చన మొదటి కొద్దినిమిషాలు కీలకమైనవి. గుండెపోటు రావడానికి కారణాలివీ.. ధూమపానం, నెయ్యి వాడకం, పరగడుపున రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉండటం, అధిక కొల్రస్టాల్, రక్తపోటు, శారీరక వ్యాయామం బాగా తగ్గడం, తల్లిదండ్రుల్లో గానీ, తోబుట్టువలలో గానీ ఎవ్వరికైనా గుండెపోటు వచి్చనా కానీ ముందుగానే ఈ సమస్య ఉండటం, లిపోప్రోటీన్–ఎ, హైపర్ హోమోసిస్టెమియా, హైపర్ కాగ్యులబుల్ పరిస్థితి, కొకైన్ వాడకం లాంటివి ఉంటే ఈ సమస్యలు వస్తాయి. ధూమపానం ఉంటే 72శాతం, అధిక కొలె్రస్టాల్ ఉంటే 52శాతం, కుటుంబంలో ఎవ్వరికైనా హార్ట్ ఎటాక్ చరిత్ర ఉంటే 35శాతం గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. హైపర్ హోమోసిస్టీనిమియా పెరగడమే కారణం రక్తంలో హైపర్ హోమోసిస్టీనిమియా పెరగడం వల్లే ఇటీవల కాలంలో యుక్త వయస్సులోనూ గుండెపోట్లు కేసులు పెరుగుతున్నాయి. పాశ్చాత్యులు కూరగాయలను పచి్చగానే తింటారు. కానీ మన దేశంలో మాత్రం ఎక్కువగా ఉడికించడమో, ఫ్రై చే యడమో చేసి తింటారు. దీనివల్లే హైపర్ హోమోసిస్టీనిమియా లెవెల్స్ పెరుగుతున్నాయి. గతంలో గుండెపోటు కేసుల్లో 5శాతంలోపు మాత్రమే యువకులు ఉండేవారు. ఇప్పుడది 14 నుంచి 15శాతానికి పెరిగింది. ఇది ప్రమాదకర పరిణామం. గుండెజబ్బులపై ప్రజలకు అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. –డాక్టర్ పి.చంద్రశేఖర్, కార్డియాలజి హెచ్‌వోడీ, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల జీవనశైలిలో మార్పుల వల్లే... శారీరక శ్రమలేని వ్యక్తుల రక్తంలో కొలె్రస్టాల్ శాతం పెరిగి గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అధిక బరువు ఉన్నవారిలో కూడా ఈ జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. మధుమేహవ్యాధి గుండె రక్తనాళాలను దెబ్బతినేటట్లు చేయడం వల్ల కూడా గుండెజబ్బులు రావచ్చు. అధిక చక్కెర, మాంసాహారం, వెన్న, నూనెలు వంటివి కొవ్వు పదార్థాలు గుండెజబ్బులు రావడానికి ముఖ్యపాత్ర వహిస్తాయి. ముఖ్యంగా కోవిడ్ అనంతరం ఈ కేసులు మరింత పెరిగాయి. కోవిడ్ సమయంలో చాలా మంది రక్తనాళాల్లో బ్లాక్‌లు ఏర్పడ్డాయి. గుండెజబ్బులు రాకుండా ఉండాలంటే... - మద్యపానం, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. ప్రతిరోజూ వాకింగ్, యోగా, ధ్యానం చేయాలి. - శాస్త్రీయ సంగీతం వినాలి. పాత పాటల్లోని సాహిత్యం మనస్సుకు ఎంతో హాయినిస్తుంది. - లిఫ్ట్‌లో వెళ్లడం కంటే మెట్లు ఎక్కడమే మేలు. సమతుల ఆహారం వల్ల గుండెకు బలం చేకూరుతుంది. - నూనెలో వేయించిన ఆహారాన్ని తగ్గించుకోవాలి. బయట లభించే ఫాస్ట్ఫుడ్స్, బేకరీ ఫుడ్స్‌కు, దిగుమతి చేసుకున్న చికెన్ లెగ్స్‌కు దూరంగా ఉండాలి. - బజ్జీలు తినాల్సి వస్తే ఇంట్లోనే చేసుకోవాలి. - బీపీ, షుగర్‌ను నియంత్రణలో ఉంచుకోవాలి. స్థూలకాయం తగ్గించుకోవాలి. - వయస్సుకు తగినట్లు నిద్రపోవాలి. నిద్రతగ్గితే శరీరం రోగాలను ఆహా్వనిస్తుంది. -
Indraja: ఇది కదా స్పందన అంటే.. హామీ ఇచ్చిన క్షణం నుంచే...
సాక్షి, శ్రీకాకుళం: వినతిపత్రాలు తీసుకోవడం.. చూద్దాం, చేద్దాం.. అని దాటవేసే నేతల తీరుకు అలవాటు పడిన రాష్ట్ర ప్రజలకు సీఎం వైఎస్ జగన్ స్పందిస్తున్న తీరు అద్భుతంగా కనిపిస్తూ సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది. ఆరోగ్య సమస్యలతో చేయూత కోసం తన వద్దకు ఎవరు.. ఏ సమయంలో వచ్చినా ఆయన అక్కున చేర్చుకుని తక్షణ వైద్య సహాయం అందేలా అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఎన్ని లక్షలు ఖర్చు అయినా ప్రభుత్వం నుంచి భరించేందుకు సై అంటున్నారు. దానికి తాజా ఉదాహరణ ఉమ్మడి జిల్లాకు చెందిన చిన్నారి ఇంద్రజ. తల అసాధారణంగా పెరిగిపోయే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఈ పాపను తల్లిదండ్రులు ఈ నెల 23న నరసన్నపేట వచ్చిన సీఎం వద్దకు తీసుకెళ్లి తమ గోడు విన్నవించుకోవడమే ఆలస్యం.. సీఎంవో నుంచి కలెక్టర్ వర కు ముఖ్యమంత్రి అందరినీ ఉరుకులెత్తించారు. దాంతో అదే రోజు రాత్రి నుంచి జెమ్స్‌లో బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు. శస్త్ర చికిత్సకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖర్చులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.లక్ష చెక్కును కూడా బాలిక తల్లిదండ్రు లకు ఇచ్చారు. ఇవన్నీ చూసి బాలిక తల్లిదండ్రులతో పాటు వారి గ్రామ ప్రజలు అబ్బుర పడుతున్నారు. మేనమామలా ఆదుకుంటానని ఇచ్చిన హామీని వైఎస్ జగన్ అక్షరాలా అమలు చేస్తూ ఆ కుటుంబంలో వెలుగులు నింపుతూ దేవుడు మామయ్యనని అనిపించుకున్నారని ప్రశంసలు కురిపిస్తున్నారు. నవంబర్ 23 ఇంద్రజ తల్లితో చర్చిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ హామీ ఇచ్చిన క్షణం నుంచే... ► ఈ నెల 23న నరసన్నపేటలో తమ కుమార్తె ఇంద్రజను ఆదుకోవాలంటూ సీఎం జగన్‌ను బాధితురాలి తల్లిదండ్రులు కోరారు. ► పది నిమిషాలకే సీఎం జగన్ నేరుగా వారితోనే మాట్లాడి ఆదుకుంటానని హామీ ఇచ్చారు. దేశంలో ఎక్కడికైనా తీసుకెళ్లి నయం చేస్తామని భరోసా అందించారు. ► అదే రోజు సాయంత్రం 7 గంటలకు కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ బాధితురాలి తల్లిదండ్రులతో మాట్లాడి.. డీఎంహెచ్‌వో మీనాక్షి పర్యవేక్షణలో ఇంద్రజను జెమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ►అదే రోజు రాత్రి 10 గంటల నుంచే జెమ్స్‌లో ఇంద్రజకు ప్రాథమిక వైద్య పరీక్షలు ప్రారంభించారు. న్యూరో సర్జన్ వైద్య బృందాల సమీక్షించాయి. ►ఈ నెల 24న జెమ్స్ ఆసుపత్రిలో ఇంద్రజకు ఉన్న వ్యాధి హైడ్రోసిఫలిస్ అని నిర్ధారించారు. ►ఈ నెల 25న జెమ్స్ చైర్మన్ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు నేరుగా వైద్య పరీక్షలు చేసి అవసరమైతే హైదరాబాద్‌లో ఆపరేషన్ చేస్తామని ప్రకటించారు. తల్లిదండ్రుల నిర్ణయం మేరకు దేశంలో ఎక్కడైనా ఆపరేషన్ చేయించాలంటూ సీఎం కార్యాలయం నుంచి తమకు ఆదేశాలు వచ్చినట్టుగా స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే చిన్నారికి వైద్యం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, విశాఖలో చేయాలా, విజయవాడలోనా.. హైదరాబాద్‌లోనా అన్నది మీరే నిర్ణయించుకోవాలని కలెక్టర్ ఆ చిన్నారి తల్లిదండ్రులకు ఆప్షన్ ఇచ్చారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.లక్ష చెక్ అందజేశారు. మా కుటుంబానికి దేవుడు... మా కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేవుడు. 11 ఏళ్లుగా ఇంద్రజ చికిత్స కోసం అప్పులు చేసి ఆసుపత్రుల చుట్టూ తిప్పాను. ప్రయోజనం లేదు. దిక్కు తోచని స్థితి. వావిలవలసకు చెందిన పాలూరి సిద్ధార్థ నరసన్నపేటకు ముఖ్యమంత్రి వస్తున్నారని చెప్పి మమ్మల్ని తీసుకెళ్లారు. పాపతో కలిసి అక్కడ నిలబడి ఉండగా ముఖ్యమంత్రి జగనన్న చూసి పరుగున వచ్చి మా పాప పడుతున్న బాధను పరిశీలించారు. మా కుమార్తె ఆపరేషన్‌కు భరోసా ఇచ్చారు. నా భర్త అప్పలనాయుడు కిడ్నీరోగి. రాజమండ్రిలో ఉంటున్నారు. మాకు ముగ్గురు కుమార్తెలు. ఇంటి వద్దనే పెద్ద పాప ఆలనా, పాలనా చూసుకొని ఉంటున్నాను. ఓ వైపు బతకడం కష్టంగా ఉంది. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి మమ్మల్ని ఆదుకున్నారు. ఆయన చల్లగా ఉండాలి. –మీసాల కృష్ణవేణి, ఇంద్రజ తల్లి, చిన్నశిర్లాం, రేగిడి మండలం -
సీఎం జగన్‌ను అడిగిన 6 రోజుల్లోనే వైద్యానికి రూ.12లక్షలు
సాక్షి, అమలాపురం టౌన్: పట్టణంలోని నారాయణపేటకు చెందిన 9 ఏళ్ల దంగేటి జశ్వంత్ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణమే స్పందించి తొలి విడతగా రూ.12 లక్షలను గురువారం మంజూరు చేశారు. జశ్వంత్ శస్త్ర చికిత్సకు రూ.21 లక్షలు ఖర్చువుతుందని, అంత ఖర్చు భరించే స్తోమత ఆ కుటుంబానికి లేదని, మీరే ఆదుకోవాలని ఈ నెల 4న తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దృష్టికి సెంట్రల్ డెల్టా బోర్డు చైర్మన్ కుడుపూడి బాబు తీసుకుని వెళ్లిన సంగతి తెలిసిందే. చలించిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తక్షణమే సంబంధిత అధికారులను చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కుడుపూడి బాబు సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్లిన మర్నాడే తాడేపల్లి సీఎం కార్యాలయం నుంచి ఒక ప్రతినిధి అమలాపురంలోని రోగి జశ్వంత్ ఇంటికి వెళ్లి అతని వైద్య రికార్డులను పరిశీలించి వెళ్లారు. జశ్వంత్ తండ్రి కనకరాజును తాడేపల్లికి గురువారం వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరు చేసిన రూ.12 లక్షల చెక్‌ను తీసుకుని వెళ్లాలని వర్తమానం వచ్చిది. కనకరాజు గురువారం తాడేపల్లి వెళ్లి ఆ చెక్‌ను తీసుకున్నారు. హైదరాబాద్‌లోని అమెరికన్ అంకాలజీ ఇనిస్టిట్యూట్ కేన్సర్ సెంటరు పేర చెక్ ఇచ్చారు. మిగిలిన రూ.9 లక్షలను జశ్వంత్‌కు శస్త్ర చికిత్స అయిన తర్వాత ఆ ఆస్పత్రి ఇచ్చిన పత్రాలకు అనుగుణంగా మంజూరు చేస్తామని అక్కడి అధికారులు తెలిపారు. సీఎంకు జశ్వంత్ కుటుంబీకులు, కుడుపూడి బాబు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: (అన్ని విధాల మైనార్టీలకు న్యాయం చేస్తున్నాం: సీఎం జగన్) -
అరుదైన వ్యాధితో బాధపడుతున్న ‘జాతిరత్నాలు’ డైరెక్టర్
జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కేవీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ మూవీ హిట్‌తో ఆయన రాత్రికి రాత్రే పాపులర్ అయ్యాడు. తాజాగా ప్రిన్స్ సినిమాతో మరో హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఇక అనుదీప్ ఏ ఇంటర్య్వూ ఇచ్చి అది సోషల్ మీడియా వైరల్ కావాల్సిందే. అందులో ఆయన వేసే సరదా పంచ్‌లకు, కామెడీకి ప్రేక్షకులు కడుబ్బా నవ్వాల్సిందే. అలా తనకంటూ ప్రత్యేక మార్క్‌ను క్రియేట్ చేసుకున్న అనుదీప్ ఓ ఇంటర్య్వూలో షాకింగ్ విషయం బయట పెట్టాడు. రీసెంట్గా ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించిన ఆయన.. తాను అరుదైన వ్యాధి బాధపడుతున్నట్లు చెప్పాడు. చదవండి: ‘కాంతార’కి ఫస్ట్ చాయిస్ నేను కాదు, ఆ హీరో: అసలు విషయం చెప్పిన రిషబ్ శెట్టి తను హైలీ సెన్సీటీవ్ పర్సన్ (హెచ్ఎస్పీ) అనే డిజార్డర్ ఉందని తెలిపాడు. ఈ మేరకు అనుదీప్ మాట్లాడుతూ.. ‘ప్రతి ఒక్కరిలో ఈ డిజార్డర్ లక్షణాలు కామన్‌గా ఉంటాయి. కానీ అర్ధం చేసుకోలేరు. నా శరీరంలో చోటు చేసుకున్న కొన్ని మార్పుల వల్ల నాలో ఈ వ్యాధిని గుర్తించాను. నాకు గ్లూటెన్ పడదు. కాఫీ తాగితే రెండు రోజుల పాటు నిద్ర రాదు. ఏదైనా పళ్ల రసం తాగితే మెదడు పనితీరు ఆగిపోతుంది. మైండ్ అంతా బ్లాక్ అవుతుంది. ఏం చేస్తున్నానో అర్థం కాదు. అయితే ఈ డిజార్డర్ ఉన్న వారి సెన్సెస్ చాలా స్ట్రాంగ్‌గా పని చేస్తాయి’ అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: హన్సిక కాబోయే భర్త ఎవరు, ఏం చేస్తుంటాడో తెలుసా? కానీ ఈ వ్యాధి ఉన్నవారు చాలా తొందరగా అలసిపోతారని తెలిపాడు. అనంతరం ‘తాను ఎక్కువ కాంతివంతమైన లైట్స్, ఘాటైన వాసనలు చూసినా వాటి తీవ్రతను తట్టుకోలేను. చాలా ఇబ్బంది పడతా. దీని గురించి శాస్త్రీయంగా ఎక్కడా నిరూపించబడలేదు. ఈ వ్యాధిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇక ఈ వ్యాధి లక్షణాలు ఉన్నావారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే దాని గురించి పరిశోధించి అవే పాటిస్తున్నాను’ అన్నాడు. ఇక తనకు ఉన్న ఈ వ్యాధిపై భవిష్యత్తులో సినిమా తీస్తానని, దాని వల్ల కొందరై హీల్ అవతారని ఆశిస్తున్నానంటూ అనుదీప్ పేర్కొన్నాడు. -
‘మతి’తప్పుతోంది! దేశం మాత్రమే కాదు.. ప్రపంచమే పరేషాన్లో ఉంది..
కంచర్ల యాదగిరిరెడ్డి మీకేమైనా మెంటలా? అని ఎవరైనా అన్నారంటే.. ఒంటికాలిపై లేస్తాం.. చెడామడా తిట్టేస్తాం.. కానీ ఈ భూమ్మీద ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఏదో ఒక రకమైన మానసిక సమస్యతో బాధపడుతున్నారు తెలుసా? భయం, ఒంటరితనం, మనోవ్యాకులత, యాంగ్జైటీ వంటివన్నీ మానసిక సమస్యలేనని.. తగిన చికిత్స, సాయం అందకపోతే ఇవి శారీరక ఆరోగ్య సమస్యలుగా మారుతాయని ఎందరికి తెలుసు? మానసిక సమస్యల సంక్షోభం కొత్తేమీకాదుగానీ.. కోవిడ్ మహమ్మారి పుణ్యమా అని ఇది మరింత జటిలమైపోయింది! నిమిషానికో ఆత్మహత్య, మత్తుమందుల విచ్చలవిడి వాడకంతో లక్షల మంది ప్రాణాలను బలిగొంటున్న మానసిక సమస్యల మహాభూతంపై సమగ్ర కథనాలు మీకోసం.. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇదో పాత సినిమా డైలాగ్. కానీ మానసిక సమస్యల విషయానికొస్తే దేశం మాత్రమే కాదు.. మొత్తం ప్రపంచమే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటోంది. ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్లకు చేరువవుతున్న ఈ తరుణంలో అందులో వంద కోట్ల మంది ఏదో ఒక రకమైన మానసిక సమస్యతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చెప్తున్నాయి. అంతేకాదు బాధితుల్లో ఎక్కువ మంది పేదదేశాలకు చెందిన వారే కావడం.. వీరిలో 75 శాతం మంది తమ జీవితకాలంలో దీనికి చికిత్స పొందలేని పరిస్థితి ఉండటం గమనార్హం. మానసిక సమస్యల్లో సగం మేర లేత వయసులోనే మనిషిని చుట్టేస్తాయని, స్పష్టంగా చెప్పాలంటే పద్నాలుగేళ్ల వయసు నుంచే ఈ సమస్య మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఉదాహరణగా తీసుకుంటే.. ఆ ఘర్షణ ప్రభావం ఎందరు పసిమనసులపై పడి ఉంటుందో ఊహించుకోవచ్చు. మానసిక ఆరోగ్యాన్ని పట్టించుకునేదెవరు? భూమ్మీద ఇలాంటి ఘర్షణలు, ప్రకృతి విపత్తులు, మరికొన్ని అత్యవసర పరిస్థితుల కారణంగా 16 కోట్ల మందికిపైగా ఇబ్బందుల్లో ఉన్నారని, వారికి మానవతా సాయం అందాల్సిన అవసరముందని ఒక అంచనా. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఐదుగురిలో ఒకరు మానసిక సమస్యల బారినపడుతుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. కోవిడ్ మహమ్మారి కారణంగా దాదాపు 93శాతం దేశాల్లో మానసిక ఆరోగ్యం కోసం చేపట్టిన అంతర్జాతీయ కార్యక్రమాలు స్తంభించిపోయాయి. వాస్తవానికి మానసిక ఆరోగ్యం గురించి పట్టించుకునే దేశాలు, ప్రభుత్వాలు చాలా తక్కువ. ఆరోగ్య బడ్జెట్లో రెండు శాతానికి మించి నిధులు ఈ విభాగంపై ఖర్చు పెట్టడం లేదు. ఫలితంగా రానున్న పదేళ్లలో కేవలం కుంగుబాటు (డిప్రెషన్) అనే మానసిక సమస్యను పరిష్కరించేందుకే బోలెడంత వ్యయం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. మానసిక సమస్య అంటే? మనలో చాలా మందికి అసలు మానసిక సమస్య అంటే ఏమిటో స్పష్టంగా తెలియదు. బాధపడటం కూడా మానసిక సమస్యేనా? అని కుంగుబాటు, ఆందోళన వంటివాటిని తేలిక చేస్తూంటారు. దీనివల్ల చికిత్సగానీ, మాట సాయం అవసరమనిగానీ గుర్తించని పరిస్థితి నెలకొంటుంది. మానసిక సమస్య అంటే ఏమిటనేది సింపుల్‌గా చెప్పుకోవాలంటే.. మన ఆలోచనల్లో, ప్రవర్తనలో, ఉద్వేగాల్లో అసాధారణమైన మార్పులు వస్తే మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం పడినట్టుగా భావించాలి. మన మానసిక ఆరోగ్యం దైనందిన జీవితం, ఇతరులతో మన సంబంధాలను మాత్రమేకాదు భౌతిక ఆరోగ్యాన్నీ ప్రభావితం చేయగలదు. చిత్రమైన విషయం ఏమిటంటే.. మన దైనందిన జీవితం, ఇతరులతో సంబంధాలు, శరీరక సమస్యలు కూడా మానసిక ఆరోగ్యాన్ని పాడు చేసే అవకాశం ఉంటుంది. వ్యాయామాలు, మంచి ఆహారం, మంచి జీవనశైలి ద్వారా మంచి ఆరోగ్యం కోసం ప్రయత్నించినట్టే.. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కూడా ప్రతి ఒక్కరు ప్రయత్నించాలని, అప్పుడే జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించగలరని మానసిక శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఎవరూ అతీతులు కారు! మానసిక సమస్యల్లో బోలెడన్ని రకాలున్నాయి. అవి ఫలానా వారికే వస్తాయి. కొందరికి రానే రావు అన్న వెసులుబాటు ఏమీ ఉండదు. వయసు, స్త్రీపురుషులు, ఆదాయం, జాతి వంటి వాటన్నింటికి అతీతంగా ఎవరికైనా మానసిక సమస్యలు రావొచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సామాజిక, ఆర్థిక పరిస్థితులు, బాల్యంలో ఎదురైన అనుభవాలు, శారీరక, వైద్యపరమైన అంశాలు వంటివన్నీ మన మానసిక ఆరోగ్యాన్ని నిర్ణయించే విషయాలు. చాలామంది బాధితుల్లో ఒకటి కంటే ఎక్కువ మానసిక సమస్యలు ఉంటాయి. మానసిక సమస్యల లెక్క ఇదీ.. ►35 కోట్లు.. ప్రపంచవ్యాప్తంగా కుంగుబాటు సమస్య ఎదుర్కొంటున్న వారి సంఖ్య ►8,00,000.. ఏటా ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారి సంఖ్య. మలేరియా వల్ల కోల్పోతున్న ప్రాణాలకు ఇది రెట్టింపు ►20,63,52,50,00,00,000 రూపాయలు.. మానసిక సమస్యల కారణంగా ఏటా జరుగుతున్న ఆర్థిక నష్టం(ఉత్పాదకత తగ్గడం, అనారోగ్యం వంటి కారణాలతో..) ►రానున్న రెండు దశాబ్దాల్లో కేన్సర్, మధుమేహం, శ్వాసకోశ వ్యాధులకు పెట్టే ఖర్చు కంటే ఎక్కువగా మానసిక సమస్యల పరిష్కారానికి ఖర్చు చేయాల్సి ఉంటుందని వరల్డ్ ఎకనమిక్ ఫోరం చెబుతోంది. ►మానసిక ఆరోగ్య పరిరక్షణకు పెట్టే ప్రతి పైసా ఖర్చుకు వచ్చే సామాజిక, ఆర్థిక లాభాలు 3.3 నుంచి 5.7 రెట్లు ఎక్కువ! -
స్కిన్ ట్రీట్మెంట్ కోసం అమెరికాకు సమంత..?, మేనేజర్ ఏం చెప్పారంటే..
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సమంత.. గత కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్నారు. కొత్తగా ఫోటో షూట్స్ కానీ, యాడ్ షూట్స్‌లో కానీ కనిపించడంలేదు. సినిమా ఫంక్షన్స్‌కి దూరంగా ఉంటున్నారు. దీంతో ఆమె అనారోగ్యానికి గురైయ్యారని ఆ మధ్య సోషల్ మీడియా కోడై కూసింది. దీనిపై ఆమె మేనేజర్ స్పందిస్తూ సమంత సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని స్పష్టం చేయడంతో ఆ పుకార్లకు చెక్ పడింది. తాజాగా మరోసారి సామ్ హెల్త్‌పై అలాంటి వార్తలే నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కొంత కాలంగా సమంత ‘పాలీమర్ ఫోర్స్ లైట్ ఎరప్షన్’ అనే స్కిన్‌కు సంబంధించిన వ్యాధితో బాధపడుతోందని, దీంతో మరోసారి షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి చికిత్స కోసం అమెరికాకు వెళ్లడానికి సిద్ధమవుతుందని ప్రచారం నెట్టింట జోరుగా సాగుతుంది. (చదవండి: కూతురి చేతిలో ఓడిపోయిన బన్నీ..వీడియో వైరల్) తాజాగా ఈ విషయంపై ఆమె మేనేజర్ స్పందించాడు. సమంత అరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని, ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని చెప్పాడు. ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని స్పష్టం చేశాడు. అయితే, సమంత అమెరికాకు ఎందుకు వెళ్తున్నారనే విషయంపై మాత్రం ఆయన స్పందించలేదు. ఇక సమంత సినిమా విషయాలకొస్తే.. ప్రస్తుతం ఆమె నటించిన యశోద, శాకుంతలంల చిత్రాలు రెండూ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న ‘ఖుషీ’ నెక్ట్స్ షెడ్యూల్డ్ స్టార్ట్ కావాల్సి ఉంది. -
సామ్‌కు అస్వస్థత, అందుకే బయటకు రావట్లేదు.. స్పందించిన మేనేజర్
గత కొంత కాలంగా సమంత పేరు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా నాగ చైతన్యతో విడాకుల తర్వాత సోషల్ మీడియాలో సామ్‌పై నిత్యం ఏదో ఒక పుకారు వస్తూనే ఉంది. పర్సనల్ లైఫ్‌తో పాటు నటించిన సాంగ్స్, కనిపించే యాడ్స్ .. ఇలా ఏదో ఒకరకంగా సామ్ నేమ్ ట్రెండింగ్ అవుతూనే ఉంది. అయితే సామ్ మాత్రం ఇవన్ని లైట్ తీసుకుంది. తనపై వచ్చే పుకార్లకు స్పందించడం లేదు. అంతేకాదు సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటుంది. కొత్తగా ఫోటో షూట్స్, ఇంటర్వ్యూస్ ఇవ్వడం లేదు. దీంతో తాజాగా సమంతకు సంబంధించిన ఓ బిగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొంత కాలంగా సామ్ చర్మ సంబంధింత సమస్యతో బాధ పడుతోందని, అందుకే ఆమె బయటకు రావడం లేదనేది ఆ వార్త సారాంశం. (చదవండి: ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే చిత్రాలివే) దీనిపై తాజాగా సమంత పర్సనల్ మేనేజర్ స్పందించాడు. తాజాగా ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. సమంతకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని స్పష్టం చేశాడు. కొంతమంది కావాలనే తప్పులు వార్తలు సృష్టిస్తున్నారని, వారిపై సమంత లీగల్ యాక్షన్ తీసుకునే చాన్స్ ఉందని ఆయన చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సమంత ఆరోగ్యంగా ఉన్నారని, ఈ నెలాఖరులో షూటింగ్లో పాల్గొనబోతున్నారని చెప్పారు. ఇక సామ్ సినిమాల విషయానికొస్తే... ఆమె నటించిన యశోద, శాకుంతలం చిత్రాలు రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. ఓ హిందీ వెబ్ సిరీస్ నిర్మాణంలో ఉంది. విజయ్ దేవరకొండతో కలసి నటిస్తున్న ఖుషి నెక్ట్స్ షెడ్యూల్ స్టార్ట్ కావాల్సి ఉంది. -
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి అనారోగ్యంతో మృతి
బాసర/సంగెం: అనారోగ్యం కారణంగా సుమారు నెల కిందట ఇంటికి వెళ్లిన బాసర ట్రిపుల్ ఐటీకి చెందిన ఓ విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వరంగల్ జిల్లాలో ఈ విషాద ఘటన మంగళవారం చోటుచేసుకుంది. బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వరంగల్ జిల్లా రంగంపేట గ్రామానికి చెందిన శాబోతు సంజయ్ కిరణ్ (18) కొంతకాలంగా కాలేయ, జీర్ణవ్యవస్థ (ప్యాంక్రియాటైటిస్) సంబంధ వ్యాధితో బాధపడుతున్నాడు. జూన్ 20న కడుపునొప్పి వస్తోందని.. అన్నం తింటే వాంతులు అవుతున్నాయని చెప్పి ఇంటికి వెళ్లాడు. అప్పటి నుంచి అతని తల్లిదండ్రులు వరంగల్, హనుమకొండల్లోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. అయినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఈ నెల 16న హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేర్చారు. సంజయ్ వైద్యం కోసం సుమారు రూ.16 లక్షలు వెచ్చించారు. అయినా పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున సంజయ్ మృతిచెందాడు. అయితే తమ కుమారుడి అనారోగ్యానికి బాసర ట్రిపుల్ ఐటీలో జరిగిన ఫుడ్ పాయిజనే కారణమని మృతుడి తల్లిదండ్రులు శ్రీలత, శ్రీధర్ ఆరోపించారు. ఈ ఆరోపణను వర్సిటీ అధికారులు ఖండించారు. ఫుడ్ పాయిజన్ జరిగిన రోజు విద్యార్థి తమ కళాశాలలోనే లేడని పేర్కొన్నారు. విద్యార్థి మృతికి సంతాపం తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. -
Queen Elizabeth II: మహారాణి రాయల్ డ్యూటీస్ కుదింపు
లండన్: ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరూ అనుభవించనంత వైభవాన్ని బ్రిటీష్ సామ్రాజ్యపు మహారాణి క్వీన్ ఎలిజబెత్. ఎంతలా అంటే.. బ్రిటన్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థ(Democracy) వచ్చినా.. ఆమె కుటుంబం రాయల్ డ్యూటీస్ అనుభవిస్తోంది. అయితే తాజాగా అనూహ్య పరిణామం ఒకటి చోటు చేసుకుంది. క్వీన్ ఎలిజబెత్ రాయల్ డ్యూటీస్ ను తగ్గించేశారు. రాజకుటుంబ వార్షిక నివేదికలో రాణి రాయల్ డ్యూటీస్ ను తగ్గించిన విషయాన్ని పేర్కొన్నారని న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. రాజకుటుంబం తరపున తప్పనిసరిగా ఆమె హాజరు కావాల్సిన కార్యక్రమాలకు ఇక నుంచి ఆమె దూరంగా ఉండనున్నారు. ఎలిజబెత్ రాణి విధులను సర్దుబాటు చేయడం గత దశాబ్ద కాలంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. క్వీన్ ఎలిజబెత్ వయసు 96 సంవత్సరాలు. గత ఫిబ్రవరిలో ఆమె కరోనా బారిన పడి కోలుకున్నారు. ఆమె కోసం నిర్వహించిన ప్లాటినం జుబిలీ వేడుకులకు కూడా... వయసు ఇబ్బందుల కారణంగా ఆమె హాజరు కాలేకపోయారు. సెయింట్ పాల్ కేథడ్రల్ లో జరిగిన థ్యాంక్స్ గివింగ్ సర్వీసుకు కూడా ఆమె హాజరు కాలేదు. వయసు పెరిగిన నేపథ్యంలో, రాణికి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఆమె విధులను కుదించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ప్రతి ఈవెంట్ కు తాను వ్యక్తిగతంగా హాజరు కాలేనప్పటికీ... తన హృదయం ఎల్లప్పుడూ మీ అందరితో ఉంటుందని ఎలిజబెత్ రాణి ఇటీవల తెలిపారు. తన కుటుంబ సహకారంతో తన శక్తి మేరకు మీకు సేవ చేస్తానని ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు కూడా. -
పోస్ట్ కోవిడ్ .. పావురం!
సాక్షి, హైదరాబాద్: మూడు దశల కరోనా కాలంలో వైరస్ బారిన పడిన కొందరు ఇప్పటికీ ఇతరత్రా అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. ఏడాది, రెండేళ్ళు గడిచిన తర్వాత కూడా గుండె, ఊపిరితిత్తులు సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సినీ నటి మీనా భర్త కోవిడ్ అనంతరం (పోస్ట్ కోవిడ్) ఊపిరితిత్తులు పాడవ డం కారణంగా చనిపోయినట్లు వార్తలు రావడంతో ఇది మరోసారి చర్చనీయాంశమైంది. పోస్ట్ కోవిడ్ సమస్యలున్న వారు పావురాల వ్యర్థాల నుంచి విడుదలయ్యే వాయువులు, ధూళిని పీల్చడం వల్ల మరింత హాని జరుగుతుందనే చర్చ కూడా సోషల్ మీడియాలో జరుగుతోంది. పావురాల వ్యర్ధాల నుంచి విడుదలయ్యే వాయువులు ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తాయనే అభిప్రాయం ముందు నుంచే ఉంది. పావురాలకు ఫీడింగ్ పేరిట వాటికి దగ్గరగా వెళ్లడం వల్ల బ్రాంకై ఆస్థమా, క్రానిక్ బ్రాంకైటీస్, హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటీస్, హిస్టోప్లా స్మాసిస్ వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకా శం ఉందని కూడా చెబుతున్నారు. పోస్ట్ కోవిడ్‌లో ప్రధానంగా వస్తున్న సమస్యలు ►పోస్ట్ కోవిడ్‌లో ప్రధానంగా గుండె, ఊపిరితిత్తులు, మెదడు సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. ►కొందరిలో ఇన్ఫెక్షన్లు, టీబీ వంటివి వస్తున్నాయి. పక్షవాతం కేసులు కూడా భారీగా పెరుగు తున్నాయి. ►మానసిక సమస్యలు, ఒత్తిడి, నిద్రపట్టక పోవడం, ఏకాగ్రత లోపించడం, నీరసం వంటివి చోటు చేసుకుంటున్నాయి. ఎముకలకు రక్త సరఫరా తగ్గిపోతోంది. ►హెపటైటిస్, వర్టిగో, ఇతర సమస్యలు వస్తున్నాయి. ఆలస్యం వల్లే అనర్ధం కరోనా వచ్చాక ఆలస్యంగా డాక్టర్ వద్దకు రావడం, చికిత్స తీసుకో వడం వల్ల ఇలా జరుగుతుంది. డయాబెటిస్, ఆర్థరైటీస్, హెచ్ఐవీ ఉన్న కొందరిలో ఊపిరితిత్తుల సమస్య తలెత్తే అవకాశం ఉంది. – డాక్టర్ సీహెచ్ రాజు, పల్మనాలజిస్ట్ సోరియాసిస్ సమస్యలు వస్తున్నాయి కోవిడ్ సమయంలో అనేక మం దులు వాడి ఆపేస్తారు. తర్వాత పోస్ట్ కోవిడ్ సమస్యలు వస్తున్నా యి. కొందరిలో చర్మంపై సోరియా సిస్ (బొల్లి), బొబ్బలు, మొటి మలు వంటివి వస్తాయి. వెంట్రుకలు కూడా ఊడి పోతాయి. చర్మం పొడిబారుతుంది. – డాక్టర్ రవళి యలమంచిలి, హైదరాబాద్ -
అరటి పండు ఎంత పనిచేసింది.. 120 మందికి అస్వస్థత
అరటి పండు తినే ఎంత ఆరోగ్యంగా ఉంటామో చెప్పాల్సిన పనిలేదు. ప్రతీరోజు ఒక అరటి పండు తిన్నాలని పలువురు ఆరోగ్య నిపుణులు సైతం సూచిస్తుంటారు. అలాంటి అరటి పండు తిని ఏకంగా 120 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. వైశాలి జిల్లాలోని పాతేపూర్ బ్లాక్‌లో శనివారం రోజున.. సత్యనారాయణ స్వామి పూజ చేశారు. అనంతరం, ఆదివారం ఆ పూజకు వాడిన అరటి పండ్లను బ్లాక్‌లో ఉన్న మహతి ధరంచంద్ పంచాయతీ వార్డు-10లో పలువురి ప్రసాదంగా పంచారు. దీంతో అరటి పండు ప్రసాదంగా తిన్న వారందరూ ఒక్కసారిగా వాంతులు చేసుకున్నారు. కడపు నొప్పి, విరోచనాలతో అనార్యోగానికి గురయ్యారు. దీంతో స్థానికులు వైద్యులకు సమాచారం అందించారు. పాతేపూర్ బ్లాక్‌కు చేరుకున్న వైద్యులు.. వారికి వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ అమితాబ్ కుమార్ సిన్హా మాట్లాడుతూ.. ప్రసాదంగా పంచిన అరటి పండ్లలో కెమికల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయన్నారు. అందుకే వారందరూ అస్వస్థతకు గురైనట్టు తెలిపారు. అంతేకాకుండా.. అరటిపండ్లను ఉడకబెట్టడం వల్ల ప్రసాదం కలుషితమైందని వెల్లడించారు. అందుకే బాధితులకు వాంతులు, కడుపునొప్పి వచ్చాయన్నారు. కాగా, బాధితులు వెంటనే కోలుకోవటానికి ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందించినట్టు చెప్పారు. అలాగే వారికి అవసరమైన మందులను కూడా సరఫరా చేశామన్నారు. మరోవైపు.. బాధితుల్లో ఐదుగురి ఆరోగ్య పరిస్థితి బాగా క్షిణించడంతో వెంటనే వారిని పాతేపూర్ హెల్త్ సెంటర్‌కు తరలించినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: ఔషధాల ఖజానా పుదీనా -
దేవుడి మీద కోపంతో ఆ కూలీ ఏం చేశాడంటే..
భోపాల్: అతనో దినసరి కూలీ. రోజూ పనికి వెళ్తేగానీ.. భార్యాబిడ్డల కడుపు నిండదు. కాయకష్టంతో పాటు దేవుడ్ని కూడా నమ్ముకున్నారు. అలాంటిది అనారోగ్యం ఆ కుటుంబాన్ని చుట్టుముట్టింది. ఆస్పత్రుల చుట్టూ తిరిగాడు. పెద్దల సలహాతో ఎన్నో పూజలు చేశాడు. పుణ్యక్షేత్రాలు దర్శించాడు. అయినా లాభం లేకపోయింది. చివరకు కలత చెందిన చేసినపని అతన్ని కటకటాల వెనక్కి నెట్టింది. మధ్యప్రదేశ్ ఛట్టార్పూర్ జిల్లాకు చెందిన వినోద్ కుమార్ అలియాస్ భూరా(27)పై.. బేటా 2 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు అయ్యింది. స్థానికంగా ఉన్న ఓ ఆలయంలో మూడు దేవతావిగ్రహాలను ధ్వంసం చేశాడని అతనిపై అభియోగం నమోదు అయ్యింది. సోమవారం ఉదయం అతను ఆ దాడికి పాల్పడ్డాడు. ఘటన తర్వాత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా అక్కడ పోలీసులను మోహరించారు. వినోద్‌కు భార్యా, ఐదేళ్ల బిడ్డ ఉన్నారు. గత మూడునాలుగేళ్లుగా వీళ్లద్దరి ఆరోగ్యం బాగుండడం లేదు. ఎన్ని మందులు వాడినా.. దేవుళ్లకు ఎంత మొక్కినా వాళ్ల ఆర్యోగం మెరుగుపడలేదట. ఈమధ్యే అతనికి పిల్లనిచ్చిన అత్త కూడా చనిపోయింది. ఈ పరిణామాలన్నీ అతన్ని మానసికంగా కుంగదీశాయి. దేవుడి మీద కోపం పెంచుకున్న వినోద్.. సుత్తి, శిలతో పూజారి లేని ఆ ఆలయానికి చేరుకుని విగ్రహాలు ధ్వంసం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మంగళవారం అతన్ని అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్ 295 (ప్రార్థనా స్థలాలను అప్రవిత్రం చేయడం) కింద కేసు నమోదు చేసుకుని వినోద్‌ను జైలుకు తరలించారు. చదవండి: ఒంటి కాలితో బడికి.. చిన్నారికు అంతా ఫిదా -
PCOD And PCOS రెండూ ఒకటేనా? ట్రీట్మెంట్
-
పుతిన్ ఫొటో వైరల్!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(69) ఆరోగ్యం గురించి పాశ్చాత్య మీడియా చేస్తున్న ప్రచారం గురించి తెలిసిందే. పార్కిన్సన్ లేదంటే క్యాన్సర్‌తో ఆయన బాధపడుతున్నారంటూ వరుస కథనాలతో ఊదర గొడుతోంది. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణించి.. ఆపరేషన్ అవసరమని, తద్వారా ఆయన విశ్రాంతి తీసుకునే సమయంలో అధికారం మరొకరికి అప్పగిస్తారంటూ వార్తలు ప్రచురించాయి. అయితే వీటిలో దేనికి క్రెమ్లిన్ వర్గాలు స్పందించలేదు. ఈ తరుణంలో రష్యా టెలిగ్రామ్ చానెల్ జనరల్ ఎస్వీఆర్ సైతం ఈ వార్తల్ని ప్రచురించడంతో.. ఆ కథనాలు నిజమనే అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా యూకేకు చెందిన ఇండిపెండెంట్ మరో కథనం ప్రచురించింది. విక్టరీ డే సందర్భంగా.. మాస్కో రెడ్ స్క్వేర్ వద్ద నిర్వహిస్తున్న మిలిటరీ పరేడ్‌లో పుతిన్ దిగిన ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఆయన అనారోగ్యంపై మరిన్ని సందేహాలు రేకెత్తించేలా.. మందంగా ఉన్న దుప్పటితో కాళ్లను కప్పుకుని దర్శనమిచ్చారు. అంతేకాదు, పుతిన్ దగ్గుతూ కనిపించాడని, అక్కడున్న వారందరిలో చలి నుంచి కాపాడుకోవడానికి అదనపు దుస్తులు ధరించింది పుతిన్ ఒక్కడేనని ఇండిపెండెంట్ పేర్కొంది. తొమ్మిది డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్.. అందులో తనకంటే వయసు పైబడిన వాళ్లు ఉన్నా కూడా పుతిన్ ఒక్కడే అలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇటీవల ఓ సమావేశంలో టేబుల్ ను గట్టిగా పట్టుకుని కూర్చుని ఉన్న దృశ్యాలు కూడా సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి. సమావేశం జరిగినంత సేపు పుతిన్ టేబుల్ ను పట్టుకుని.. వణికిపోతుండడంతో ఆయన ఆరోగ్యంపై అనుమానాలు బలపడుతున్నాయి. -
Vladimir Putin: క్షీణిస్తున్న పుతిన్ ఆరోగ్యం?
రష్యాకు హెచ్చరికలు.. పాశ్చాత్య దేశాలకు వ్లాదిమిర్ పుతిన్ ప్రతిహెచ్చరికల నేపథ్యంలో ఉక్రెయిన్ యుద్ధం కీలక మలుపు తిరుగుతోంది. ఈ తరుణంలో.. పుతిన్ ఆరోగ్యం మీద సంచలన కథనాలు వెలువడుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం మొదయ్యాక రష్యా అధ్యక్షుడు పుతిన్(69) వ్యక్తిగత జీవితంతో పాటు ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటూ వరుస కథనాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉంటే.. యుద్ధం తారాస్థాయికి చేరుతున్న తరుణంలో పుతిన్ ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తోందన్న పుకార్లు సుడులు తిరుగుతున్నాయి. ఈమధ్యకాలంలో పుతిన్ పాల్గొన్న సమావేశాలు, హాజరైన బహిరంగ ర్యాలీలను అందుకు ఉదాహరణలుగా చూపిస్తున్నారు. పుతిన్ తాజా ఫొటోలు, వీడియో ఫుటేజీల ఆధారంగా.. పుతిన్ బాడీ లాంగ్వేజ్‌లో తీవ్రమైన మార్పులు వచ్చాయనేది ఆరోగ్య నిపుణులు చెప్తున్నమాట. ఎక్కువ సేపు నిల్చోలేకపోతుండడం, ఆయన చేతులు వణుకుతుండడం, ఆయాస పడుతుండడం, అలాగే ఆయన ముఖం ఏదో ఒక రకమైన కాస్మోటిక్ సర్జరీ చేయించుకున్నట్లు కనిపిస్తుందని వాదిస్తున్నారు. అంతేకాదు.. ఒలింపిక్ అథ్లెట్స్‌ను గౌరవించే ఓ కార్యక్రమంలో పుతిన్ పాల్గొనగా.. ఆ ఈవెంట్ ఫొటోల ఆధారంగా శరీరంలో విపరీతమైన మార్పులు వచ్చాయని న్యూయార్క్ పోస్ట్ సైతం ఓ కథనం ప్రచురించింది. బెలారస్ అధ్యక్షుడితో భేటీ సందర్భంలోనూ.. పుతిన్ టేబుల్‌ను సపోర్ట్‌గా పట్టుకోవడంపైనా అనుమానాలు వ్యక్తం చేస్తూ పుతిన్ ఆరోగ్యంపై కథనం ప్రచురించింది న్యూస్ వీక్. ఇదిలా ఉంటే.. వైట్‌హౌజ్ మాత్రం రష్యా అధ్యక్షుడి ఆరోగ్యంపై స్పందించేందుకు నిరాకరిస్తోంది. ఇదంతా పాశ్చాత్యదేశాల కల్పిత కథనాలంటూ క్రెమ్లిన్ కొట్టిపాడేస్తుండగా.. వయసు పైబడుతున్న పుతిన్‌లో పార్కిసన్ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయంటూ కొందరు నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. dictators can be brutal they can be capricious but they can’t be weak serious problem for putin pic.twitter.com/OGFejK09i9 — ian bremmer (@ianbremmer) April 22, 2022 View this post on Instagram A post shared by Cosmetic doctor in Sydney (@drjakesloane) -
నాగసులోచనా నన్ను క్షమించు..!.. నేను బాధపడుతూ నిన్ను మరింత..
సాక్షి, హిందూపురం: నాగసులోచనా..నన్ను క్షమించు..! నా ఆరోగ్య విషయంలో ఎన్నో ఆస్పత్రులు తిప్పావు. వెన్ను నొప్పి తగ్గలేదు. కూర్చోడానికి, కాలు కింద పెట్టడానికీ ఇబ్బందిగా ఉంది.. బతికి ఉండి పదే పదే డాక్టర్ల వద్దకు వెళ్లలేను.. నేను బాధపడుతూ నిన్ను మరింత బాధపెట్టలేను..నీకు భారమైపోతాను.. ఇలాంటి జబ్బు ఏ ఒక్కరికీ రాకూడదు.. అందుకే రెండు నెలల క్రితమే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నా.. నన్ను క్షమించు..! అంటూ తన భార్యకు విశ్రాంత తహసీల్దార్ రాజశేఖర్‌శెట్టి నోట్ రాసి, తహసీల్దార్ కార్యాలయం వెనుకవైపున పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. హిందూపురం కంసాలిపేటలో నివాసం ఉంటున్న రాజశేఖర్ శెట్టి (70) రెవెన్యూశాఖలో వివిధ హోదాల్లో లేపాక్షి, హిందూపురం, మడకశిర, అమరాపురం తదితర ప్రాంతాల్లో పనిచేశాడు. పదేళ్ల క్రితం తహసీల్దార్‌గా ఉద్యోగ విరమణ చేశాడు. దీర్ఘకాలికంగా షుగరు, బ్యాక్‌బోన్, కడుపునొప్పి తదితర సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నాడు. అయినా ఫలితంలేక పోయింది. అవసాన దశలో తాను అనారోగ్యంతో బాధపడుతూ కుటుంబ సభ్యులకు భారం కాకూడదని, బెడ్ రెస్ట్‌లో పడితే తన భార్యకు మరింత భారమవుతాననుకున్నాడు. చదవండి: (దారుణం: ఒక ఇంట్లో రెండేళ్లపాప నాన్నను ఇంకెపుడు చూడలేదు.. మరో ఇంట్లో) జీవితంపై విరక్తి చెంది సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ప్రజలు, అధికారులు రాజశేఖర్‌శెట్టి మృతి చెందినట్లు గుర్తించి, వన్‌టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ ఇస్మాయిల్ ఘటనాస్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య నాగసులోచన ఉన్నారు. కుమార్తె వివాహమై కర్ణాటక రాష్ట్రం కోలార్‌లో ఉంటోంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
భార్య దారుణంగా మోసం చేసిందన్న భర్త.. ఇదొక విచిత్రమైన కేసు!
పెళ్లయిన కొత్తలోనే భర్తకు భార్య, భార్యకు భర్త షాకిచ్చిన ఉదంతాలు, మోసపోయిన కథనాల గురించి వినే ఉంటారు. అయితే ఇక్కడో భర్త.. భార్య మీద అనూహ్యమైన ఆరోపణలకు దిగాడు. తన భార్య అసలు ఆడదే కాదని.. తనను మోసం చేసి అంటగట్టారంటూ వైద్య నివేదికలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. తన భార్యకు పురుషాంగం ఉందని.. తనను మోసం చేసి పెళ్లి చేశారంటూ ఓ వ్యక్తి ఏకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలోని బెంచ్ తొలుత ఈ పిటిషన్ స్వీకరించేందుకు తొలుత నిరాకరించింది. అయితే వైద్య పరీక్షల రిపోర్టులన్నీ పరిశీలించాక.. శుక్రవారం సదరు యువతితో పాటు ఆమె తల్లిదండ్రులకు నోటీసులు పంపింది. నాలుగు వారాల్లోగా నోటీసులపై స్పందించాలని ఆదేశించింది. తొలి రాత్రే షాక్.. మధ్యప్రదేశ్ గ్వాలియర్‌కు చెందిన వ్యక్తికి 2016లో వివాహం జరిగింది. ఆ తర్వాత చాలాకాలం పాటు ఆ అమ్మాయి కార్యానికి సహకరించలేదు. పీరియడ్స్, ఆరోగ్యం బాగోలేదంటూ వాయిదా వేస్తూ పోయారు అమ్మాయి తరపు ఇంటివాళ్లు. చాలా కాలం ఓపిక పట్టిన ఆ యువకుడు.. చివరకు తన తల్లిదండ్రులను రంగంలోకి దించి.. ఓ ముహూర్తం ఖరారు చేసుకున్నాడు. చివరకు ఆ రాత్రి.. భార్యకు పురుషాంగం ఉందంటూ రచ్చ చేశాడు. తాను మోసపోయానని, అమ్మాయిని కాకుండా అబ్బాయిని తనకు కట్టబెట్టారని ఆ రాత్రే పెద్దలను పిలిచి పంచాయితీ పెట్టాడు. జెనెటిక్ లోపం.. Imperforate Hymen ఇంపర్‌ఫోరేట్ హైమన్.. ఇదొక జెనెటిక్ లోపం. పుట్టుకతో అండాశయాలతో స్త్రీగానే ఉన్నా.. బాహ్యంగా మాత్రం పురుషాంగం చిన్నసైజు పరిమాణంలో ఉంటుందని డాక్టర్లు తెలిపారు.ఆ అమ్మాయికి అదే సమస్య ఉంది. ఇది సర్జరీతో సరి చేయొచ్చు. కానీ, పిల్లలు పుట్టే అవకాశాలు చాలా చాలా తక్కువ!. ఆ యువతిని పరిశీలించిన వైద్యులు ఈ విషయమే ఆమె భర్తకు చెప్పారు. పుట్టుకతో వచ్చిన అడ్రినల్ హైపర్ప్లాసియా అనే జన్యుపరమైన రుగ్మతగా వెల్లడించారు. ఈ విషయం తెలిశాక.. ఆ యువతిని ఆ వ్యక్తి పుట్టింటికి పంపించేశాడు. సర్జరీ చేయించి.. తిరిగి ఆమె భర్త ఇంట్లో దిగబెట్టి వెళ్లాడు ఆమె తండ్రి. అయితే మోసం చేసి వివాహం చేయడం, పిల్లలు పుట్టే అవకాశాలు లేకపోవడంతో విడాకులకు పట్టుబట్టాడు ఆ యువకుడు. దీంతో బెదిరింపులకు దిగింది ఆ యువతి కుటుంబం. ఈ క్రమంలోనే.. సదరు వ్యక్తి స్థానిక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాడు. విచారణ కొనసాగుతున్న సమయంలో ట్రయల్ కోర్టు సదరు యువతికి నోటీసు జారీ చేసింది. అయితే మధ్యప్రదేశ్ హైకోర్టు మాత్రం.. ఆ వ్యక్తి ఆరోపణలకు తగిన ఆధారల్లేవంటూ కేసును కొట్టేసింది. దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించిన యువకుడు.. న్యాయం కోరుతున్నాడు. ఈ నేపథ్యంలో.. భర్త ఆరోపణలపై స్పందించాలంటూ ఆ యువతికి.. సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
Bappi Lahiri: బప్పీలహరి మృతికి కారణం ఇదే! సాధారణమే కానీ..
పాత కొత్త తరం బాలీవుడ్‌కే కాదు.. బప్పీలహరి పాటలు తెలుగునాట కృష్ణ, చిరు, బాలయ్య, మోహన్‌బాబు లాంటి వాళ్లకు బ్లాక్ బస్టర్ సాంగ్స్‌తో కెరీర్ బూస్ట్ ఇచ్చాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అలాంటి మ్యూజిక్ ఐకాన్ అస్తమించడం భారత సినీ పరిశ్రమను, ఆయన పాటల అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. అయితే ఆయన హఠాన్మరణం వెనుక.. అబ్ స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (ఓఎస్ఏ) కారణమని వైద్యులు ప్రకటించారు. ఈ సమస్య కారణంగానే ఆయన గుండె ఆగిపోయింది కూడా!. స్లీప్ అప్నియా అనేది బ్రీతింగ్ డిజార్డర్(శ్వాస సంబంధిత వ్యాధి). నిద్రలో ఆగి ఆగి శ్వాస తీసుకోవడం దీని లక్షణం. ఇందులో మూడు రకాలు ఉంటాయి. అబ్ స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, సెంట్రల్ స్లీప్ అప్నియా, కాంప్లెక్స్ స్లీప్ అప్నీయా. నిజానికి స్లీప్ ఆప్నియా చాలా సాధారణమైన డిసీజ్ అనుకుంటారు చాలామంది. కానీ, అదే సమయంలో ఇది ప్రాణాంతకమైంది కూడా. నిద్రిస్తున్న సమయంలో అప్పర్ ఎయిర్ వేస్ (శ్వాస తీసుకునే ఎగువ భాగంలో) బ్లాక్ కు గురి అవుతాయి. దీంతో గాలి తీసుకునే మార్గాన్ని మరింత వ్యాకోచింపచేసి, గాలిని ఊపిరితిత్తుల్లోకి పంపించేందుకు వీలుగా ఛాతీ కండరాలు బలంగా పనిచేస్తాయి. దీంతో పెద్ద జెర్కింగ్ చప్పుడుతో లేచి గాలి తీసుకుంటారు. ఈ సమస్య ఉన్న వారు చాలామందే ఉంటారు. పిల్లల దగ్గరి నుంచి వృద్ధుల దాకా.. ముఖ్యంగా ఓవర్‌వెయిట్ ఉన్నవాళ్లపై తీవ్ర ప్రభావం చూపెడుతుంది. సాధారణంగా.. గాలి నోరు, ముక్కు, ఊపిరితిత్తుల గుండా గాలి ప్రవాహం ఉంటుంది. అది నిద్రలో కూడా. శ్వాసనాళ కండరాలు మూసుకుపోవడం వల్ల ఓఎస్ఏ సమస్య ఏర్పడుతుంది. నిద్ర సమయంలో గొంతు భాగంలో సాఫ్ట్ టిష్యూ వ్యాకోచించడం వల్ల గాలి వెళ్లే మార్గానికి అడ్డుపడుతుంది. దీంతో శ్వాస నాళాల ఎగువభాగం అడ్డంకికి గురవుతుంది. గాలి సరిపడా అందకపోవడంతో లేచి గాలి తీసుకోవాలంటూ మెదడు అదే పనిగా సంకేతాలు అందిస్తుంది. దీంతో ఈ సమస్య ఉన్నవాళ్లు మంచి నిద్ర పోలేరు. ఇది దీర్ఘకాలంలో వారి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. లక్షణాలు ► పెద్ద శబ్దంతో గురక ► అలసటలేమితో పడుకున్నప్పుడు ► ఉలిక్కిపడి లేచి ఊపిరి పీల్చుకోవడం, ఉక్కిరి బిక్కిరి కావడం. ►పగటి పూట ఎక్కువసేపు నిద్ర ►నిద్రలో శ్వాసకు ఆటంకం ►రాత్రిళ్లు చెమటలు పోయడం ►పొద్దుపొద్దునే తలనొప్పులు ►నిద్రలో పదేపదే మేల్కొనడం వల్ల మతిమరుపు, నిద్రమబ్బు, మాటిమాటికి ఇరిటేషన్ ►పెద్దగా గురకపెట్టడం స్లీప్ అప్నియాకు సంకేతంగా చూడాలి. రిస్క్ ఫ్యాక్టర్స్ ►ఓవర్ వెయిట్ ఉన్నవాళ్లే ఎక్కువగా దీని బారినపడతారు. ►వయసు మళ్లినవాళ్లు, షుగర్ పేషెంట్ల మీదా ప్రభావం ఉంటుంది. ►శ్వాసనాళాలు ఇరుక్కుగా ఉన్నవాళ్లకు ఈ డిజార్డర్ రావొచ్చు. టాన్సిల్స్ వాపునకు గురి కావడం, అడినాయిడ్స్ వాపు సమస్యలతో నాళాలు మూసుకుపోయేవాళ్లకు కూడా ఈ సమస్య ఎదురు కావొచ్చు. ►హైబీపీ పేషెంట్లు, ఎక్కువగా పొగ తాగే అలవాటు ఉన్నవాళ్లు సైతం స్లీప్ ఆప్నియా బారిన పడే అవకాశాలు ఎక్కువ. స్లీప్ అప్నియా కలిగించే సమస్యలనే అబ్ స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా కలిగిస్తుంది. చికిత్స, జాగ్రత్తలు తీసుకోకుంటే.. ప్రమాదం కూడా. అందుకే పగటి పూట ఎక్కువ నిద్ర పోకపోవడం మంచిది. ఆడవాళ్లలో ఈ సమస్య ఉంటే గనుక వెయిట్‌లెస్ పిల్లలు పుట్టే అవకాశం, ఇతర సమస్యలు ఎదురు కావొచ్చు. అంతేకాదు డ్రై ఐ, గ్లౌకోమా సమస్యలు రావొచ్చు. ట్రీట్మెంట్ ఆప్షన్స్ ►బరువు తగ్గించుకోవడం ►సీపీఏపీ (CPAP) కంటిన్యూయస్ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెజర్.. ఈ పరికరాన్ని వైద్యులు సూచించిస్తుంటారు. దీన్ని తలకు ధరించి పడుకుంటే శ్వాస నాళాల్లోకి పాజిటివ్ ప్రెజర్ ను పంపిస్తుంది. దాంతో అవి తెరచుకుంటాయి. దీనివల్ల గురక రాకుండా, శ్వాసకు ఇబ్బంది లేకుండా మంచిగా నిద్రపోవచ్చు. ►ఒక పక్కకు తిరిగి పడుకోవడం. బోర్లా పడుకోవడం ఓఎస్ఏను మరింత దారుణంగా చేస్తుంది. ►సర్జరీ.. అదీ అవసరమైతేనే. గమనిక.. పైన ఇచ్చిన సమాచారం.. సాధారణమైనది మాత్రమే. ఇలాంటి డిసీజ్ బారిన పడినప్పుడు, లక్షణాలు కనిపించినప్పుడు, ఓఎస్ఏ పరిస్థితి ఎదురైనప్పుడు.. స్పెషలిస్టులను, ఫ్యామిలీ వైద్యులను సంప్రదించడం ఉత్తమం. స్లీప్ అప్నియా బారినపడితే.. జీవిత కాలం 12-15 ఏళ్లపాటు తగ్గుతుందని పలు పరిశోధనలు వెల్లడించాయి. కనుక దీన్ని నిర్లక్ష్యం చేయకుండా చికిత్స తీసుకోవడం మంచిది. -
కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం.. ఇంటర్ విద్యార్థిని మృతి..!
సాక్షి, వీపనగండ్ల (మహబూబ్‌నగర్): తీవ్ర అస్వస్థతకు గురైన ఓ ఇంటర్ విద్యార్థిని హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. ఉన్న ఒక్కగానొక్క కుమార్తె మృతి చెందడంతో తల్లిదండ్రులు భోరున విలపించారు. వారి కథనం మేరకు.. మండలంలోని గోవర్ధనగిరి సర్పంచ్ చంద్రకళ, సురేశ్‌రెడ్డి ఏకైక కుమార్తె అస్మిత (17) హైదరాబాద్‌లోని నాగోల్‌శాఖ శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. 4 రోజులుగా తీవ్ర జ్వరం, వాంతులు అవుతున్నా.. కళాశాల యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదు. గురువారం బంధువు ఒకరు అస్మితను చూసేందుకు కళాశాలకు వెళ్లగా అస్వస్థతతో బాధపడుతూ కనిపించింది. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో పాటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందింది. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంతోనే తమ కుమార్తె మృతిచెందిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. బాధిత కుటుంబానికి పరామర్శ.. విషయం తెలుసుకున్న కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, సింగిల్‌విండో చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు శుక్రవారం గ్రామానికి వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అస్మిత మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
గుండెల్ని పిండే ఘటన: అమ్మా లే అమ్మ.. అమ్మా లే అమ్మ!
భువనేశ్వర్/బొలంగీరు: తల్లి ఒడి ప్రతి బిడ్డకు అమోఘం. ప్రాణం లేకున్నా తల్లి ఒడిని వీడేందుకు ఇష్టపడని ఓ చిన్నారి ఏకంగా 2 రోజుల పాటు తల్లి శవంతో కలిసి జీవించడం హృదయాన్ని కలచివేస్తోంది. బొలంగీరు సగరపడా శివాలయం దగ్గర ఈ హృదయ విదారక సంఘటన సోమవారం వెలుగుచూసింది. ఇళ్లల్లో పాచి పనులు చేసుకుని తన మూడేళ్ల పాపని పోషించుకుంటున్న కున్ని నాయక్ కొన్నిరోజుల క్రితం అనారోగ్యంతో మంచానపడింది. సరిగ్గా రెండు రోజుల క్రితం ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆమె చనిపోయింది. ఈ విషయం ఎరుగని ఆ పసిబిడ్డ తల్లి పడుకునే ఉందనుకుని మృతదేహంతో నిద్రాహారాలు మానేసి 2 రోజులు గడిపింది. మూడో రోజు నాటికి తన అమ్మ నోటి నుంచి పురుగులు బయటకు రావడంతో కంగారుపడిన ఆ పసిబిడ్డ ఇరుగుపొరుగు వారికి ఈ విషయం తెలియజేసింది. దీంతో తన తల్లి చనిపోయిన వాస్తవం బయటపడింది. ఇది తెలుసుకుని కన్నీరుమున్నీరవుతున్న ఆ పసికందు అమ్మా లే అమ్మ.. అమ్మా లే అమ్మ.. నాకు అమ్మ కావాలి.. అని ఆ బాలిక ఏడుపు విన్నవారి గుండె బరువెక్కింది. చిన్న బిడ్డకు ఎంత పెద్దకష్టం వచ్చిందని, ఈ పసిపాప ఆలనా పాలనా ఎవరు చూసుకుంటారని తల్లడిల్లుతున్నారు. చదవండి: (దేవుడా ఎంతపని చేశావయ్యా.. పెళ్లై నెలైనా కాలేదు.. ఇంతలోనే) వివరాలిలా ఉన్నాయి.. భర్త మరణించిన తర్వాత పుట్టినింటి వారు, మెట్టినింటి వారు నిరాకరించడంతో కున్ని నాయక్ బతుకు వీధిన పడింది. చేత చిన్నారి పసి పాపను పట్టుకుని బొలంగీరు సగరపడా ప్రాంతంలోని శివాలయం దగ్గర ఒకేఒక్క గది ఉన్న ఇంట్లో అద్దెకు చేరింది. ఆ ఇంటా ఈ ఇంటా పాచి పనులు చేసుకుని ఇరుగుపొరుగు వారి ఆదరణతో జీవితం సాగనంపింది. ఇలా ఏడాదిన్నర గడిచేసరికి కున్ని తరచూ అనారోగ్యం బారినపడేది. ఎప్పటిలాగే ఒంట్లో బాగోలేకపోవడంతో కున్ని నాయక్ నిద్రపోయింది. అలా నిద్రలోనే ఉంటుండగా ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆమె ప్రాణాలు విడిచింది. ఇది తెలియని ఆ పసి బిడ్డ ఇరుగుపొరుగు వారు అమ్మ ఏదని అడిగితే ఒంట్లో బాగోలేక అమ్మ నిద్ర పోతుందని చెప్పేది. ఉదయం తన తల్లి నోటి నుంచి పురుగులు వస్తున్న విషయం బయటకు రావడంతో తన తల్లి చనిపోయినట్లు తెలుసుకుని ఆ పసి హృదయం రోదించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి మృతదేహం తరలించారు. చదవండి: (భర్త, కుమార్తెను వదిలి ప్రియుడితో వెళ్లిపోయి.. ఆది పరాశక్తి అవతారంలో..) -
చిన్నారి ఆరోగ్యంపై మంత్రి కేటీఆర్ స్పందన
సాక్షి,మంచిర్యాలటౌన్: పాతమంచిర్యాలకు చెందిన బోర్లకుంట అక్షిత(9) బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతోందని ఈ నెల 20న ‘సాక్షి’లో ప్రచురితం కాగా, మంత్రి కే.తారకరామారావుకు పలువురు ట్వీట్ చేశారు. మంత్రి స్పందిస్తూ.. ఆ చిన్నారి వైద్యానికి అవసరమైన సాయం తన బృందం సభ్యు ల ద్వారా అందిస్తానని ట్విట్టర్ ద్వారా తెలి పారు. మంత్రి కార్యాలయం నుంచి చిన్నా రి ఆరోగ్యంపై ఫోన్ చేసి ఆరా తీయగా, చికిత్సకు అవసరమయ్యేందుకు సహాయం అందిస్తామని భరోసా కల్పించారు. మరో ఘటనలో.. వ్యసనాలకు బానిసై భవితను నాశనం చేసుకోవద్దు’ బెల్లంపల్లి: దుర్వ్యసనాలకు బానిసై బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ అన్నారు. మంగళవారం బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీసు ఆధ్వర్యంలో ‘యువత భవిత’ కార్యక్రమం స్థానిక ప్రభు త్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ లక్ష్యాన్ని ఎంచుకుని సాధించడానికి కఠోర సాధన చేయాలని సూచించారు. లక్ష్యం లేకుండా సరదా లు, సెల్ఫోన్లు, మద్యం, డ్రగ్స్‌కు అలవాటు పడి జీవితాలను దుర్భరం చేసుకుంటున్నారని, ఈ తీరు అత్యంత దురదృష్టకరమని అ న్నారు. బెల్లంపల్లి షీటీమ్ ఇంచార్జి, ఎస్సై మానస మాట్లాడుతూ బాల్య వివాహాలు, ఆన్లైన్ మోసాల సమాచారాన్ని డయల్ 100 కు అందించాలని, 6303923700 షీటీమ్ నంబర్‌కు వాట్సాప్ చేయాలని తెలిపారు. బెల్లంపల్లి రూరల్ సీఐ కె.జగదీష్, ఎస్సైలు సమ్మయ్య, గంగాధర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గోపాల్ పాల్గొన్నారు. చదవండి: ‘కొడుకా.. ఎంత పనాయె.. నీ పిల్లలకు దిక్కెవరు బిడ్డా’ -
సామీజీల వేషం.. పూజలంటూ మోసం
సాక్షి, జగిత్యాల(కరీంనగర్): వారు స్వామీజీల వేషం కట్టారు.. రెండ్రోజులుగా ఇంటింటికీ తిరుగుతున్నారు.. సమస్యలు పరిష్కరిస్తామని నమ్మిస్తున్నారు.. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మార్చుతామని చెబుతూ పూజలు చేస్తున్నారు.. తాయత్తులు కడుతూ అందిన కాడికి దండుకుంటున్నారు.. నిందితులను జగిత్యాల ఖిలాగడ్డ ప్రాంతంలో స్థానికులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ముగ్గురు వ్యక్తులు స్వామిజీల అవతారంలో రెండు రోజులుగా ఖిలాగడ్డ ప్రాంతంలో ఇంటింటికీ వెళ్తున్నారు. ముందుగా వీరిలో ఒకరు మీ ఇంట్లో సమస్య ఉందని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించి, వెళ్తారు. గంట తర్వాత మరొకరు వచ్చి, లేని సమస్యలు ఉన్నట్లు నమ్మించి, రూ.2 వేలు, రూ.2,500 విలువైన తాయత్తులు ఉన్నాయని, వాటిని కట్టుకుంటే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని నమ్మిస్తారు. ఇలా పెద్దఎత్తున డబ్బు వసూలు చేస్తున్నారు. విషయం స్థానికులకు అర్థమవడంతో నిందితులను మంగళవారం ఉదయం పట్టుకొని, దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. -
ఒక్కగానొక్క కూతురు.. మృత్యువుతో పోరాడి ఓడింది
సాక్షి,నందవరం( కర్నూలు): మండల కేంద్రమైన నందవరానికి చెందిన బుట్టా కల్యాణి(17) శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందినా శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. నందవరం గ్రామానికి చెందిన బుట్టా శేఖర్, శోభల ఏకైక కుతూరు బుట్టా కల్యాణి గత కొన్ని నెలలుగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతోంది. ఆమె నందవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో గతేడాది పదో తరగతి పూర్తి చేసింది. అయితే శ్వాసకోశ వ్యాధి చికిత్సకు రూ.లక్షల్లో ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలపడంతో దాతలను సంప్రదించారు. వారి సహకారంతో కొన్ని నెలలు ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేసి ఆక్సిజన్ అందించారు. వ్యాధికి ఆరోగ్యశ్రీ వర్తించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ సీఎం రిలీఫ్ ఫండ్ అందిస్తామని చెప్పడంతో గత సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్లు ఆరోగ్య శ్రీ పథకం ద్వారా డిసెంబర్ 1వ తేదీన బాలికకు ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ పూర్తి చేశారు. అనంతరం ఐసీయూలో ఉంచారు. శుక్రవారం తెల్లవారుజామున కల్యాణి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఏకైక కుమార్తె మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చదవండి: డ్రైవింగ్ చేసేందుకు డోర్ వద్దకు వెళ్లి నిల్చున్నాడు.. బస్సు తలుపు ఊడి.. -
చిన్నారుల్లో ఎదుగుదల డీలా!
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్లలోపున్న పిల్లల్లో శారీరక ఎదుగుదలలేమి ఆందోళనకరంగా ఉంది. పౌష్టికాహార సమస్యల కారణంగా 35 శాతం మంది చిన్నారుల్లో ఎదుగుదల మందగించింది. దీంతో వయసుకు తగినట్లుగా శారీరక ఎత్తు ఉండటంలేదు. అలాంటివారిలో ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తవచ్చనే ఆందోళన ఉంది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఐదేళ్లలోపు చిన్నారుల ఎత్తు, బరువు నమోదు చేస్తుంటారు. నెలవారీగా ఆ వివరాలను ఐసీడీఎస్ ప్రాజెక్టులకు, రాష్ట్ర కార్యాలయానికి చేరవేస్తుంటారు. ఈ గణాంకాలను విశ్లేషిస్తే చిన్నారుల్లో 17.05 శాతం మంది వయసుకు తగిన ఎత్తు లేరని తేలింది. మరో 18.52 శాతం మందిలో కూడా ఎత్తుకు తగిన బరువు లేనప్పటికీ, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం తక్కువగా ఉంది. 64.43 శాతం మందిలో మాత్రం వయసుకు తగిన శారీరక ఎదుగుదల నమోదైంది. పల్లె ప్రాంతాల్లోనే ఎక్కువ వ్యత్యాసం 33 జిల్లాలో పరిధిలో 149 ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలోని 35,700 అంగన్వాడీ కేంద్రాల్లో 12.96 లక్షలమంది చిన్నారుల వయసు, ఎత్తును తూచి అంచనాలు రూపొందించారు. ఇందులో ఎక్కువగా గ్రామీణ నేపథ్యం ఉన్న జిల్లాల్లోని చిన్నారులు పౌష్టికాహార సమస్యలతో ఉన్నట్లు కనిపిస్తోంది. వయసుకు తగిన ఎత్తు లేకుండా ఎక్కువ వ్యత్యాసంతో ఉన్న చిన్నారులు రాష్ట్రవ్యాప్తంగా 17.05 శాతం మంది ఉన్నారు. రాష్ట్ర సగటు కంటే ఎక్కువశాతం చిన్నారులు గ్రామీణప్రాంతాల్లోనే ఉన్నారు. అత్యధికంగా జనగామ జిల్లాలో 28.23 శాతం మంది చిన్నారుల్లో వయసుకు తగిన ఎత్తు లేకపోవడం గమనార్హం. ఆ తర్వాత స్థానాల్లో నారాయణపేట్(24.79%), మహబూబ్‌నగర్(21%), వికారాబాద్(26.78%), ఆదిలాబాద్(23.79%), కామారెడ్డి(21.29%), మెదక్(20.61%) జిల్లాలున్నాయి. తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తే... సాధారణంగా చిన్నారుల్లో ఎదుగుదల వేగంగా ఉంటుంది. మానసిక ఎదుగుదలతోపాటు శారీరక ఎదుగుదల సక్రమంగా ఉండాలంటే సరైన పౌష్టికాహారాన్ని అందించాలి. కానీ, చాలాచోట్ల చిన్నారులకు ఒకేరకమైన ఆహారాన్ని అందిస్తున్నట్లు జాతీయ ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ పరిశీలనలు చెబుతున్నాయి. నిత్యం ఒకేరకమైన ఆహారాన్ని ఎక్కువ పరిమాణంలో ఇస్తుండటంతో కేవలం కొన్నిరకాల ప్రోటీన్లు, విటమిన్లు మాత్రమే అందుతాయి. శరీరానికి కావాల్సిన అన్నిరకాల విటమిన్లు, ప్రోటీన్లు, ఇతర పోషకాలు అందాలంటే భిన్నరకాలైన ఆహారాన్ని తగిన మోతాదులో అందించాలి. ఈ అంశాలపై గ్రామీణ ప్రాంత తల్లిదండ్రులకు అవగాహన ఉండటంలేదు. దీంతో ఎదుగుదలలో లోపాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించాలంటే పిల్లలకు ఇవ్వాల్సిన ఆహార పదార్థాలపై తల్లిదండ్రులకు సరైన అవగాహన కల్పించాలని, ప్రభుత్వం కూడా విస్తృత ప్రచార కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించాలని చిన్నపిల్లల వైద్య నిపుణులు కిశోర్ ఈగ ‘సాక్షి’తో అన్నారు. -
రజనీకాంత్ త్వరగా కోలుకోవాలంటూ అభిమానుల పూజలు
సాక్షి, చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు ఆలయాల్లో పూజలు నిర్వహించా రు. రజనీకాంత్ గురువారం సాయంత్రం చెన్నైలో ని కావేరి ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కావేరి ఆస్పత్రి వర్గా లు శుక్రవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. బ్రెయిన్‌కి రక్తాన్ని సరఫరా చేసే ఓ రక్తనాళంలో బ్లాక్స్‌ను గుర్తించామని.. సర్జరీ చేసి వాటిని తొల గించామని, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ పేర్కొన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇండియా రజనీకాంత్ అభిమానుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సుధాకర్ శుక్రవారం ట్వీట్ చేశారు. త్వరలోనే ఆయన డిశ్చార్జ్ అవుతారని తెలిపారు. చదవండి: (విశ్వాసం అంటే ఇదేరా !) -
బ్రేకింగ్ రికార్డ్.. ఏడడుగుల సౌకుమార్యం
డ్రెస్ అయినా, చీర అయినా కాస్త పొడవుగా ఉన్నవాళ్లకు చూడముచ్చటగా ఉంటుంది. అందుకే ఇంకాస్త పొడవుంటే నా పర్సనాలిటికీ ఈ డ్రెస్ బాగా నప్పుతుంది అని టీనేజ్ అమ్మాయిల నుంచి పెళ్లయిన మహిళల వరకు అంతా తెగ మదనపడుతుంటారు. వీళ్లు ఇలా ఫీల్ అవుతుంటే రుమేసా మాత్రం ప్రపంచంలో నా అంతా ఎత్తు ఎవరూ లేరు, ప్రపంచంలో నేనే పొడవైన మహిళనంటోంది. అనడమేకాదు తన పేరుమీద గిన్నిస్ రికార్డులను కూడా తిరగ రాసేస్తుంది. టర్కీకి చెందిన 24 ఏళ్ల రుమేసా గల్గీ ప్రంచంలోనే అతిపొడవైన మహిళగా గిన్నిస్‌బుక్ రికార్డు నెలకొల్పింది. నిలుచున్నప్పుడు 7 అడుగుల 0.7 (215.16 సెంటీమీటర్లు) అంగుళాలతో ప్రపంచంలో జీవించి ఉన్న పొడవైన వనితగా నిలిచింది.అయితే రుమేసా గిన్నిస్బుక్ను రికార్డు నెలకొల్పడం ఇది తొలిసారి కాదు. ఆమెకు 18 ఏళ్లు ఉన్నప్పుడు మొదటిసారి టాలెస్ట్ మహిళా టీనేజర్‌గా గిన్నిస్‌బుక్ రికార్డు సృష్టించింది. అప్పుడు రుమేసా ఎత్తు 7 అడుగుల 0.09 అంగుళాలు(213.6 సెంటీమీటర్లు). రుమేసా చేతులు 24.5 సెంటీమీటర్లు, కాళ్లు 30.5 సెంటీమీటర్లు పొడవు ఉన్నాయి. అయితే రుమేసాకంటే ముందు ప్రపంచంలో పొడవైన మహిళ రికార్డు చైనాకు చెందిన యోడిఫెన్ పేరు మీద ఉంది. ఈమె ఎత్తు 7 అడుగుల 7 అంగుళాలు (233.3 సెంటీమీటర్లు), ఈమె 2012లో మరణించింది. ప్రపంచంలోనే అతిపొడవైన వ్యక్తి కూడా టరీ్కకి చెందిన వారు కావడం విశేషం. జీవించి ఉన్న అతిపొడవైన వ్యక్తి సుల్తాన్ కొసెన్ ఎత్తు 8 అడుగుల 2.8 అంగుళాలు. ప్రపంచంలోనే అతిపొడవైన మహిళగా చైనాకు చెందిన జెంగ్ జిన్లియన్ పేరు మీదే ఇప్పటికీ రికార్డు ఉంది. ఆమె ఎత్తు 8 అడుగుల ఒక అంగుళం(246.3 సెంటీమీటర్లు). జెంగ్ 1982లో మరణించారు. వీవర్ సిండ్రోమ్.. రుమేసా వీవర్ సిండ్రోమ్ కారణంగా ఇంత పొడవు పెరిగింది. ఇది చాలా అరుదుగా కనిపించే సమస్య. ఈ సమస్య ఉన్నవాళ్లలో అస్థిపంజరం సాధారణం కంటే అధికంగా పెరిగిపోతుంది. ఇలా ఉన్నవాళ్లు స్వయంగా నడవడం కూడా కష్టమే. ఎక్కువగా వీరు ఇతరుల సాయం లేదా వీల్ చెయిర్, వాకర్ స్టిక్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. రుమేసా ఎక్కువగా వీల్ చెయిర్‌ను వాడుతుంది. తనకు ఈ సిండ్రోమ్ ఉందని రుమేసా ఎప్పుడూ బాధపడకపోగా తనలాంటి వారికి..ఇది కేవలం ఒక ఆరోగ్య సమస్య అని, దీనిని అంగీకరించి ధైర్యంగా ఉండాలని చెబుతోంది. ప్రతి ప్రతికూలతకు ఒక అనుకూలత ఉంటుంది. అది బయట పడేంతవరకు వేచి ఉండి, మనలో ఉన్న సామర్థ్యాలతో ముందుకు సాగాలని చెబుతూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. -
వృద్ధుల కన్నీటి గాథ: ఒక్కగానొక్క కొడుకు మృతి.. కిడ్నీలు ఫెయిల్.. పింఛనే ఆధారం
మునగాల: రెండు కిడ్నీలు చెడిపోవడంతో పాటు వయస్సు మీదపడడంతో కేవలం వృద్ధాప్య పింఛన్‌తోనే బతుకు వెళ్లదీస్తున్న వృద్ధ దంపతులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. వివరాలు.. మండలంలోని బరాఖత్‌గూడెం గ్రామానికి చెందిన జిల్లేపల్లి లచ్చయ్య (80), ఎల్లమ్మ (70) దంపతుల ఒక్కగానొక్క కుమారుడు పదేళ్ల కిందట అనారోగ్యంతో మృతిచెందాడు. నాటి నుంచి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా రెండేళ్ల కిందట లచ్చయ్యకు రెండు కిడ్నీలు చెడిపోవడంతో ఇద్దరు ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం వృద్ధాప్య పింఛన్‌తోనే కాలం వెళ్లదీస్తున్నారు. కనీసం మందులు కొనుగోలు చేసే స్థోమత లేకపోవడంతో తమను దాతలు ఎవరైనా ఆదుకోవాలని ఈ వృద్ధ దంపతులు వేడుకుంటున్నారు. మా ఆయన ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుండటంతో ఏమి చేయాలో పాలుపోవడం లేదని భార్య ఎల్లమ్మ తెలిపింది. పింఛన్ పైసలతో పూట గడవడమే కష్టంగానే ఉందని వాపోయింది. ఆపన్నహస్తం అందించి ఆదుకుంటే రుణపడి ఉంటామని ఎల్లమ్మ చెబుతోంది. -
నేను బాగానే ఉన్నా..ఆ వార్తలు బాధించాయి: బప్పీ లహరి
Bappi Lahiri Rubbishes Rumours About His Health: ప్రముఖ బాలీవుడ్ సింగర్, కంపోజర్ బప్పీ లహరి తనపై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టారు. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందించారు. నా ఆరోగ్యం గురించి కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా ఫేక్ న్యూస్‌లు సర్య్కులేట్ చేయడం బాధగా అనిపిస్తుంది. నా శ్రేయోభిలాషులు, అభిమానుల ఆశీస్సుల వల్ల నేను బాగానే ఉన్నాను. అంటూ ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేశారు. కాగా బప్పీ లహరికి ఈ ఏడాది ఏప్రిల్‌లో కోవిడ్ సోకడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల అనంతరం ఆయన కోలుకున్నారు. అయితే కరోనా కారణంగా ఆయన గొంతు పూర్తిగా దెబ్బతిందని పలు వార్తలు నెట్టింట షికార్లు చేశాయి. తాజాగా తన ఆరోగ్యంపై వస్తున్న వార్తల్లో నిజం లేదని బప్పీ లహరి స్పష్టం చేశారు. దీంతో ఈ పుకార్లకి ఫుల్ స్టాప్ పడినట్లయ్యింది. కాగా 1970-80ల కాలంలో చల్తే చల్తే, డిస్కో డాన్సర్, షరాబీ వంటి సినిమాలకు బప్పీ లహరి పాడిన పాటలు అప్పట్లో ఎంత ఫేమస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చివరగా ఆయన బాఘీ3 చిత్రంలో భంకాస్ అనే పాటను పాడారు. View this post on Instagram A post shared by Bappi Lahiri (@bappilahiri_official_) -
Tamannaah: 'అనారోగ్యం.. అందుకే ప్రతిరోజు ఆ జ్యూస్ తాగుతా'
Tamannaah Reveals About Her Health Issue: 'శ్రీ' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 16 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ టాప్ హీరోయిన్గా కొనసాగుతుంది. విభిన్న పాత్రలతో ఎంటర్టైన్ చేస్తున్న తమన్నా ఇటీవలె మాస్ట్రో సినిమాలో విలన్ రోల్‌తో అలరించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తమన్నా..'కొన్నాళ్లుగా తాను అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు పేర్కొంది. 'నాకు మంచి ఆహారపు అలవాట్లు ఉన్నాయి. కానీ ఎక్కువగా వర్కవుట్స్ చేయడం, ఒత్తిడి కారణంగా ఓ అనారోగ్య సమస్యను ఎదుర్కొన్నాను.దాన్నుంచి బయటపడేందుకు నిపుణుల సూచనలతో వ్యాయామాలు చేస్తున్నా. ఫ్రై ఫుడ్ ఐటమ్స్ పూర్తిగా మానేశా. ప్రస్తుతం సేంద్రీయ ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటున్నా. అంతేకాకుండా క్రమం తప్పకుండా నోని లేదా తొగరి ఫలం(Noni juice)ను తీసుకుంటా. ఈ జ్యూస్ నాకున్న సమస్య నుంచి బయటపడేందుకు ఎంతో ఉపయోగపడుతుంది' అని తెలిపింది. అంతేకాకుండా ప్రతిరోజు ఉసిరి రసం, బాదం పాలు,పసుపు, కొబ్బరి నీళ్లు తన డైట్లో ఉండేలా చూసుకుంటానని చెప్పింది. ఫిట్‌గా, స్లిమ్‌గా ఉండేందుకు లిక్విడ్ పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నట్లు వివరించింది. అయితే తనకున్న ఆరోగ్య సమస్య ఏంటన్న దాన్ని మాత్రం తమన్నా బయటపెట్టలేదు. చదవండి: మాస్ట్రో: తమన్నాను అలా చూసి ఏడ్చిన డైరెక్టర్ గాంధీ కూతురు Bigg Boss Telugu 5: 'అర్థపావు భాగ్యం'.. ఆ ఒక్క తప్పు చేయకపోయి ఉంటే.. -
ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన బాలీవుడ్ నటి
ముంబై: బాలీవుడ్ నటి, వెటరన్ యాక్టర్ సైరా బాను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఆమె ఫ్యామిలీ ఫ్రెండ్ ఫైజల్ ఫారూఖీ అతని ట్విటర్ అకౌంట్ ద్వారా ఆమె అభిమానులతో పంచుకున్నాడు. కాగా 77 ఏళ్ల నటి సైరా బాను ఊపిరి అందక ఆగస్టు 28న ముంబైలోని హిందుజ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో చేరిన మూడు రోజుల తర్వాత ఊపిరితిత్తుల సమస్య తీవ్రంగా ఉండడంతో ఆమెను ఐసీయూలోకి మార్చారు. ఆమె ఆరోగ్యం కుదుటపడడంతో డిశ్చార్జి చేసినట్లు ఆసుపత్రి వర్గాలు ఓ మీడియా ఏజెన్సీకి తెలిపాయి. ఫారుఖీ ఈ విషయం గురించి తెలుపుతూ.. "సైరా బానుజీ ఇంటికి వచ్చేశారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. విశ్రాంతి తీసుకుంటున్నారు. మీ ప్రేమ, ప్రార్థన వల్లే ఆమె కోలుకున్నారు" అని నటి అభిమానులను ఉద్దేశించి ఫైజల్ ఫారూఖీ పోస్ట్‌లో హర్షం వ్యక్తం చేశారు. అంతకుముందు సైరా బాను గుండె జబ్బుతో తీవ్రమైన కరోనరీ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు గుర్తించిన వైద్యులు, నిర్ధారణ తర్వాత కరోనరీ ఆంజియోగ్రామ్ చేయించుకోమని సూచించగా నటి నిరాకరించినట్లు ఆసుపత్రి వైద్యుడు ఒకరు మీడియా ఏజెన్సీకి తెలిపాడు. సైరాబాను భర్త, బాలీవుడ్ స్టార్ దీలిప్ కుమార్ 98 ఏళ్ల వయసులో మరణించిన విషయం అందరికి తెలిసిందే. ఆయన కూడా ఊపిరి అందక అదే హిందుజా హిస్పిటల్‌లో చేరి, అనంతరం జూలై 7న తుదిశ్వాస విడిచారు. ఈ రియల్ లైఫ్ కపుల్ సగిన, గోపి, బైరాగ్, దునియా వంటి హిట్ సినిమాల్లో కలిసి నటించారు. కాగా, ఆమె దివంగత బాలీవుడ్ నటుడు షామ్మీ కపూర్ హీరోగా నటించిన జంగ్లీ సినిమాతో వెండితెరకి పరిచయం అయ్యారు. అనంతరం ఆమె పదోసన్, హేరా పేరి, దివానా వంటి ఎన్నో మంచి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. చివరిగా 1988లో ఫైస్లాలో నటించారు. #SairaBanu ji is back home. Discharged from the hospital. Doing well. Resting. Your love and prayers are truly appreciated. 🙏 — faisal farooqui (@FAISALmouthshut) September 5, 2021 చదవండి: Kim Sharma- Leander Paes: టెన్నిస్ స్టార్‌తో రిలేషన్.. కన్ఫర్మ్ చేసిన కిమ్ శర్మ! -
ఎక్సైజ్ కానిస్టేబుల్ బలవన్మరణం.. కారణం అదేనా?
శంషాబాద్(హైదరాబాద్): రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్, ప్రొహిబిషన్ కార్యాలయంలో రాత్రి పూట రక్షణగా విధులు నిర్వర్తించడానికి వచ్చిన కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలివీ.. వికారాబాద్ జిల్లా ఎన్కతల గ్రామానికి చెందిన ఆశయ్య(48) చేవెళ్ల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. శంషాబాద్ పట్టణంలోని జిల్లా ఎక్సైజ్, ప్రొహిబిషన్ కార్యాలయంలో సెంట్రీ విధులు నిర్వర్తించడానికి ఆయా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లకు చెందిన కానిస్టేబుళ్లకు రోజువారీగా కేటాయిస్తారు. ఈ క్రమంలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు డ్యూటీ నిమిత్తం ఆశయ్య శంషాబాద్ ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చాడు. సాయంత్రం ఉద్యోగులంతా వెళ్లిన తర్వాత ఒక్కడే ఉన్నాడు. ఆదివారం ఉదయం మరో ఎక్సైజ్ కానిస్టేబుల్ కార్యాలయానికి వచ్చే సరికి ఓ గదిలో ఆశయ్య ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆశయ్యకు అతిగా మద్యం తాగే అలవాటున్నట్లు గుర్తించారు. ఆదివారం రాత్రి కూడా మద్యం తాగిన తర్వాతే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కుటుంబసభ్యుల సమాచారం మేరకు అతడికి ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉండడంతో బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. అంతేకాకుండా గుండె ఆపరేషన్ చేసుకున్న తనకి సెంట్రీ విధులు వేయడంపై కూడా మనస్తాపంతో ఉన్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కత్తులు పట్టుకొని బాలీవుడ్ డైలాగులు.. వాట్సాప్ స్టేటస్ -
‘ఆశారాంకు జైలులోనే ఆయుర్వేద చికిత్స అందించండి’
న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు మంగళవారం తిరస్కరించింది. కాగా, ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని.. దీనికోసం ఉత్తర ఖండ్ వెళ్లి చికిత్స తీసుకోవడానికి రెండు నెలల పాటు మధ్యంతర బెయిల్‌ను కోరుతూ ఆశారాం బాపూ సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు ఆయన బెయిల్ అభ్యర్థనను తిరస్కరిస్తూనే ఆయనకు జైలులోనే ఆయుర్వేద చికిత్సను అందించాలని జైలు అధికారులను ఆదేశించింది.. ఆశారాం బాపూ 2013 తన ఆశ్రమంలో 16 ఏళ్ల మైనర్ బాలికను అత్యాచారం చేశారు. ఈ ఘటన రుజువు కావడంతో ఆయనకు జోధ్‌పూర్ కోర్టు జీవిత ఖైదు శిక్షను విధించిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు మరో ఇద్దరు నిందితులకు జోధ్‌పూర్ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది. గతంలో.. ఆశారాం బాపూకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన 9 మందిపై ఆయన అనుచరులు దాడిచేశారు. దీనిలో ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు. ఆయన గతంలో కూడా పలుసార్లు ఆరోగ్యం నిలకడగా లేదని బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు కోరారు. అయితే, దీనిపై గతంలో సుప్రీంకోర్టు ఆయన ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించడానికి ప్రత్యేక వైద్యులను నియమించింది. కాగా, ఆశారాం బాపూను పరీక్షించిన వైద్యులు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సుప్రీం కోర్టుకు తెలియజేశారు. చదవండి: అన్నీ తెరిచాక ఇంకేం... డ్రామా మాత్రమే -
నేస్తమా త్వరగా కోలుకో..: సచిన్
ముంబై: న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, దిగ్గజ ఆల్‌రౌండర్ క్రిస్ కెయిన్స్ పక్షవాతం బారినపడ్డ సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాలో గుండెకు ఎమర్జెన్సీ సర్జరీ చేసేటప్పుడు వెన్నెముకలో స్ట్రోక్ రావడంతో రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. ప్రస్తుతం అతనికి రీహాబిలిటేషన్ ప్రక్రియ నిర్వహించేందుకు ఆస్ట్రేలియాలోనే మరో ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా క్రిస్ కెయిన్స్ త్వరగా కోలుకోవాలంటూ బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. '' గెట్ వెల్ సూన్ క్రిస్ కెయిన్స్.. నేస్తమా త్వరగా కోలుకో.. నీ ఆరోగ్యం తొందరగా బాగవ్వాలని దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.'' అంటూ ట్వీట్ చేశాడు. కాగా 51 ఏళ్ల క్రిస్ కెయిన్స్ అంతర్జాతీయ క్రికెట్లో 1989 నుంచి 2006 వరకు న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. తన 17 ఏళ్ల కెరీర్లో కెయిన్స్ కివీస్ తరపున 62 టెస్టుల్లో 3320 పరుగులు.. 218 వికెట్లు , 215 వన్డేల్లో 4950 పరుగులు.. 201 వికెట్లు పడగొట్టాడు. టెస్టు, పరిమిత ఓవర్ల క్రికెట్లో మంచి ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన కెయిన్స్ ఎక్కువగా ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగేవాడు. చదవండి: Chris Cairns: ఎమర్జెన్సీ సర్జరీ చేస్తుండగా దిగ్గజ ఆల్‌రౌండర్‌కు పక్షవాతం Concerned to know about Chris Cairns. Hoping & praying. 🙏🏻 Get well soon mate, the entire cricketing fraternity wishes for your wellbeing. — Sachin Tendulkar (@sachin_rt) August 27, 2021 -
ఎడమచేయి, నడుములో లోపం ఉందని..
బనశంకరి: బస్టాండ్‌లో పడి ఉన్న గోనె సంచిని ఓ మహిళ ఇంటికి తీసుకెళ్లగా అందులో నుంచి పసికందు బయట పడింది. ఈ ఘటన ఉత్తర కన్నడ జిల్లా శిరసి తాలూకాలో చోటు చేసుకుంది. తాలూకాలోని కోగిళికుళి గ్రామానికి చెందిన మాదేవి వ్యవసాయ కూలీ. రోజూలానే బుధవారం ఉదయం కూలీ పనులకు వెళ్తూ గౌడళ్లి సమీపంలోని ఖాన్నగర బస్టాండుకు వెళ్లగా గోనె సంచి కనిపించింది.ఎవరో మరిచిపోయి ఉంటారని భావించి ఇంటికి తీసుకెళ్లింది. సంచిని పరిశీలించగా రోజుల వయసున్న మగబిడ్డ కనిపించింది. పోలీసులు, శిరసి సహాయట్రస్ట్ అధ్యక్షుడు సతీశ్శెట్టి వచ్చి పరిశీలించి ఆస్పత్రికి తరలించారు. నాలుగు రోజుల క్రితం శిశువు జన్మించిందని, బరువు 1.6కిలోలు ఉందని, ఎడమచేయి, నడుములో లోపం ఉందని, ఆరువేళ్లు ఉన్నాయని గుర్తించారు. కార్వార పోలీసులు పసికందు తల్లిదండ్రుల కోసం గాలిస్తున్నారు. -
ఎముకలు, కీళ్లు జాగ్రత్త
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మన అలవాట్లు అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. పిల్లలు మొదలు యువత, మధ్య వయస్సు వారిపై వివిధ రూపాల్లో ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మిగతా శరీర అవయవాల మాదిరిగానే ఎముకలు, కీళ్లకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. అయినా దీనిపై ప్రజలు పెద్దగా దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు డాక్టర్ దశరథరామారెడ్డి తేతలితో ‘సాక్షి’ ఇంటర్వూ్య జరిపింది. ముఖ్యాంశాలు ఇలా... సమస్యలేంటి? – సాక్షి, హైదరాబాద్ఎముకలు, కీళ్లకు సంబంధించి వస్తున్న ►డా. దశరథ: 30–40 ఏళ్లు దాటాక ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలంటే ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్ వల్ల పిల్లలపై.. మద్యం, ధూమపానం వల్ల యువతపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఆల్కహాల్, ధూమపానం అనేవి కాలేయాన్ని, ఊపిరితిత్తులనే కాకుండా ఎముకలనూ పాడు చేస్తాయి. ఆస్టియోపోరోసిస్ లేదా ప్రమాదవశాత్తు ఫ్రాక్చర్లు అయితే అతుక్కోవడం కష్టం కావొచ్చు. పొగతాగడం వల్ల ‘నికోటిన్ బోన్ సీజ్’, అధిక మద్యపానం వల్ల ‘ఎవాస్క్యూలర్ నెక్రోసిస్’తో తుంటి జాయింట్లు దెబ్బతింటాయి. చర్మవ్యాధులు లేదా ఆస్తమా వంటి వాటికి ఇష్టారీతిన స్టెరాయిడ్స్ తీసుకుంటే ఎముకలు బోలుగా మారి ఆస్టియోపోరోసిస్ రావొచ్చు. ఎందువల్ల ఈ సమస్యలు పెరుగుతున్నాయి ? ►డా. దశరథ: శారీరక శ్రమ, వ్యాయామం లేకపోతే బరువు పెరిగి ఆస్టియో ఆర్థరైటిస్, వెన్నుపూస నొప్పికి దారితీస్తాయి. అధిక సమయం మొబైల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం వల్ల, సరిగా కూర్చోకుండా కొన్ని గంటల పాటు కంప్యూటర్ల వద్ద పనిచేయడం వల్ల మెడ, భుజం, నడుం, చేతుల నొప్పులు వస్తాయి. తరచుగా వచ్చే వెన్నుపూస, మెడ, భుజం నొప్పులతో రిపిటేటివ్ స్ట్రెస్ ఇంజూరీస్, కండరాల్లో వచ్చే ‘టీనో సైనోవిటీస్’ నొప్పి, కార్పల్ టన్నెల్ సిండ్రోమ్, నడుము నొప్పి, సయాటికా వంటివి ప్రధానమైనవి. బరువులు ఎత్తేటప్పుడు సరిగా ఎత్తాలి, కూర్చునే విధానం కూడా సరిగా ఉండాలి, ఇప్పుడొస్తున్న ఖరీదైన విలాసవంతమైన సోఫాలతోనూ సమస్యలొస్తున్నాయి. అవి గది అలంకరానికి బాగా కనిపిస్తాయి కానీ వీటి వల్ల మోకాళ్లు, నడుముపైనా బాగా ఒత్తిడి పడుతుంది. చెక్కబల్ల మీద, నేలపై పడుకోవడం చేయొచ్చా? ►డా. దశరథ: నడుం నొప్పి వస్తే చెక్కబల్ల మీద పడుకోవడం, నేలపై నిద్రపోవడం వంటివి చేస్తే అది తగ్గిపోతుందనే అపోహ ఉంది. కొంతమంది ఎక్కువ దిండ్లు పెట్టుకుని పడుకుంటున్నారు. ఇది మంచిది కాదు. డయాబెటిస్ వల్ల భుజాల నొప్పితో ‘పెరి ఆర్థరైటిస్’ వస్తుంది. అందువల్ల మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. ఈ మధ్యకాలంలో ‘రుమటాయిడ్ ఆర్థరైటిస్’ వ్యాధి భారత్‌లో ఎక్కువగా పెరుగుతోంది. దానివల్ల తుంటి, మోకాలు జాయింట్లపై ప్రభావం పడుతోంది. ఇది వచ్చినపుడు తొలిదశలోనే ఆర్థోపెడిక్ లేదా రుమటాలజిస్ట్ను సంప్రదించి సరైన మందులు, ఆహారంతో తీసుకోవడంతోపాటు వ్యాయామం చేయాలి. విటమిన్ బీ–12 లోపం వల్ల కాళ్లు తిమ్మిర్లు రావడం, సయాటికా మాదిరి లక్షణాలు కనిపిస్తాయి. చిన్నవయసులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ►డా. దశరథ: చిన్న వయసులో మోకాలి జాయింట్ గాయాలైనపుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ‘లిగ్మెంట్ ఇంజూరీ’ వల్ల మోకాళ్లపై ఒత్తిడి సరిసమానంగా పడక ఒకవైపు అరిగిపోయి ‘ఆస్టియో ఆర్థరైటిస్’ వస్తుంది. చిన్నప్పుడే లిగ్మెంట్ల గాయాలను అశ్రద్ధ చేయకుండా ఆర్థోస్కోపి ఆపరేషన్ చేయించు కోవాలి. చిన్నపిల్లల్లో ‘ఫ్లాట్ ఫుట్’కు గతంలో అంత ప్రాధాన్యత ఇచ్చే వాళ్లం కాదు. దీనివల్ల కాళ్లపై సరిసమానంగా బరువు పడక మున్ముందు మోకాళ్లు అరిగిపోతాయి. దీనిని తల్లితండ్రులు ముందుగానే గుర్తించి వైద్యం చేయించాలి. చిన్నపుడే దానికి తగ్గట్టుగా కాలి జోళ్లు మార్చుకుంటే ఈ సమస్యను అధిగమించొచ్చు. ఆయా సమస్యలకు మీరు చేసే సూచనలేంటి? ►డా. దశరథ: సమస్య వచ్చినపుడు అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించాలి. ప్రతి ఒక్కరూ యుక్తవయసు నుంచి విటమిన్–డి, థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలి. 45 ఏళ్లు దాటిన స్త్రీ, పురుషులు బీఎండీ పరీక్ష చేయించుకోవాలి. ధూమపానం, మద్యపానం మానేయాలి. పోషకాహారం తీసుకోవాలి. సూర్యరశ్మి తగిలేలా రోజూ కాసేపు ఎండలో కూర్చోవాలి. సైక్లింగ్, స్విమ్మింగ్ చేస్తే మంచిది. మహిళలు చిన్న చిన్న సమస్యలకే హిస్టరెక్టమీ ఆపరేషన్ల వల్ల భవిష్యత్‌లో ఎముకలు బలహీనమయ్యే అవకాశముంది. అవసరమైతేనే ఆ ఆపరేషన్లు చేయించుకోవాలి. ఈ మధ్య నడుంనొప్పి సమస్యలు పెరుగుతున్నాయి. ఏం చేయాలి? ►డా. దశరథ: నడుం నొప్పి అనగానే ఆపరేషన్ చేసుకోవాలి... ఆ తర్వాత లేవకుండా మంచానికే పరిమితం కావాలనే అపోహ చాలామందిలో ఉంటోంది. వెన్నుపూస జారిపోయి ‘స్పాండిలో లిíస్తిసిస్’, కాళ్లలో తిమ్మిర్లు వచ్చి నడవలేకపోవడం వంటి వారికే వాస్తవంగా ఆపరేషన్ అవసరమౌతుంది. ఒట్టి నడుం నొప్పి ఉన్న వారికి ఆపరేషన్ అవసరం లేదు. ఈ నొప్పి క్రమం తప్పకుండా విపరీతంగా వస్తుంటే మిగతా ఏవైనా ఇన్ఫెక్షన్లు వచ్చాయేమోనన్నది సరిచూసుకోవాలి. కొన్నిసార్లు శరీరంలో ఎక్కడైనా కేన్సర్ సోకితే అది ఎముకల్లోకి రావొచ్చు. దానివల్ల నడుం నొప్పి రావొచ్చు. నడుం నొప్పి అనేది వ్యాధి కాదు. శరీరంలో చోటుచేసుకునే అనేక అనర్థాలకు అదొక లక్షణంగానే పరిగణించాలి. -
కరోనా కల్లోలం: ఎయిమ్స్‌లో చేరిన కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి సామాన్యుల నుంచి వీఐపీల వరకు ఏ ఒక్కరిని వదలడం లేదు. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడిన వారిలో చాలా మంది ఆసుపత్రులలో చేరుతున్నారు. అయితే, కరోనా సోకిన తర్వాత ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడం, రుచి తెలియక పోవడం, ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్కు గురవ్వడం మొదలైన లక్షణాలు ఉంటాయన్న విషయం మనకు తెలిసిందే. అయితే, ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో సరైన చికిత్స తీసుకొన్న కూడా కోవిడ్ నెగెటివ్ అనంతరం కూడా అనేక శారీరక సమస్యలు కొత్తగా ఉత్పన్న మవుతున్నాయి. వీటిని పోస్ట్ కోవిడ్ సమస్యలుగా పేర్కొంటారు. తాజాగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియల్ నిశాంక్ కోవిడ్ అనంతరం సమస్యలతో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఆసుపత్రిలో చేరారు. కాగా, 61 ఏళ్ల వయస్సున్న పోఖ్రియల్ నిశాంక్ గత ఏప్రిల్ 21 న కరోనా బారిన పడ్డారు. ఆ తర్వాత డాక్టర్ల పర్యవేక్షణలో సరైన మందులు, డైట్ పాటించడం జరిగింది. ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత ఆయన కోవిడ్ నుంచి కోలుకున్నారు. అప్పటి నుంచి ఆన్లైన్లో విద్యా శాఖ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కొత్తగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే డాక్టర్ల సూచన మేరకు ఆయన ఎయిమ్స్‌లో చేరారు. అయితే, ఇప్పటికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా వుండగా కేంద్ర విద్యాశాఖ గత కొన్ని రోజులుగా సిబిఎస్ఇ పరీక్షల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకొలేదు. ఈ క్రమంలో సుప్రీం కోర్ట్ వెంటనే సిబిఎస్ఇ పరీక్షలపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అయితే, ప్రస్తుతం కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియల్ ఆసుపత్రిలో ఉన్న తరుణంలో, సిబిఎస్ఇ పరీక్షలపై సరైన నిర్ణయం తీసుకోవడానికి మరో రెండు రోజుల సమయం కావాలని కేంద్ర విద్యాశాఖ సుప్రీం కోర్టును కోరింది. చదవండి: ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకం.. నల్లగా మారిన మహిళ చేయి -
చిన్నారి ఆరోగ్యానికి కేటీఆర్ భరోసా
సాక్షి, ఆదిలాబాద్: అపత్కాలంలో ముందుండి సా యం చేస్తున్న రాష్ట్ర మున్సిపల్, ఐటీ శా ఖ మంత్రి కేటీఆర్ తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని హత్తిగుట్ట గిరిజన గ్రామానికి చెందిన టేకం భీంరావు, సంగీతాబాయి దంపతుల కుమార్తే కరిష్మా (2) ఆరోగ్యానికి భరోసా కల్పించారు. చిన్నారికి పుట్టుక నుంచి కాళ్లు, చేతులు పని చేయడం లేదు. ఎన్ని ఆస్పత్రులకు తీసుకెళ్లినా నయం కాలేదు. పాప తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వైద్యం చేయించే స్థోమత లేక పాపను ఇంటి వద్దనే ఉంచి పనులకు వెళ్తున్నారు. ఈ పరిస్థితిని గమనించిన నిర్ణయ్ ఫర్ ఆదిలాబాద్ స్వచ్ఛంద సంస్థ తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈ విషయం మంత్రి దృష్టికి వెళ్లడంతో చిన్నారి ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ కేటీఆర్ ఆది వారం ట్వీట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన హోమియోపతి డాక్టర్ సుభాష్ చందర్ కూడా చిన్నారికి చికిత్స, అవసరమైన మందులు ఉచితంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు పాప తండ్రి భీంరావు తెలిపారు. చదవండి: దారుణం: తిట్టాడని సిమెంట్ ఇటుకతో తలపై బాది.. -
రాష్ట్రపతికి విజయవంతంగా బైపాస్ సర్జరీ
న్యూఢిల్లీ: ఛాతీలో నొప్పితో అనారోగ్యానికి గురయిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇటీవల ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం మంగళవారం ఆయనకు బైపాస్ సర్జరీ విజయవంతంగా చేశారు. ఈ విషయాన్ని ఎయిమ్స్ అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రపతి ఆరోగ్యం కుదుటగా ఉందని.. కోలుకుంటున్నారని వెల్లడించింది. ఈ విషయాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ వైద్యులను ఆయన అభినందించారు. ఈనెల 27వ తేదీన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఛాతీ నొప్పితో సైనిక (ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్) ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం ఆ ఆస్పత్రి వర్గాలు ఢిల్లీలోని ఎయిమ్స్‌కు వెళ్లాలని సూచించాయి. సాధారణ వైద్య పరీక్షలు రావడంతో రామ్‌నాథ్ కోవింద్‌కు బైపాస్ సర్జరీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తాజాగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో వైద్యులు రాష్ట్రపతి రామ్‌నాథ్‌కు బైపాస్ సర్జరీ విజయవంతంగా ముగించారు. దీనిపై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. ‘ఢిల్లీలోని ఎయిమ్స్‌లో రాష్ట్రపతికి విజయవంతంగా బైపాస్ సర్జరీ జరిగింది. విజయవంతంగా సర్జరీ చేసిన వైద్యులను అభినందిస్తున్నా. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎయిమ్స్ డైరెక్టర్‌తో మాట్లాడి తెలుసుకున్నా. రాష్ట్రపతి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని రాజ్‌నాథ్ సింగ్ ట్విటర్లో పోస్ట్ చేశారు. The President of India, Shri Ramnath Kovind has undergone a successful bypass surgery at AIIMS, Delhi. I congratulate the team of Doctors for successful operation. Spoke to Director AIIMS to enquire about Rashtrapatiji’s health. Praying for his well-being and speedy recovery. — Rajnath Singh (@rajnathsingh) March 30, 2021 -
నిద్రమాత్రలు వాడుతున్నారా.. జర జాగ్రత్త!
నిద్రమాత్ర వేసుకోకపోతే ఆ రాత్రికి ఇక నిద్ర లేనట్లే అన్న పరిస్థితిలో చాలామంది తమకు తెలియకుండా నిద్రమాత్రలకు బానిసవుతుంటారు. ఈ మాత్రలు మెదడు, కేంద్ర నాడీవ్యవస్థల పనితీరుపై ప్రభావం చూపి, ఆందోళనను తగ్గించి నిద్రపట్టేలా చేస్తాయి. అయితే వీటి వాడకం ఎక్కువైతే ఎదురయ్యే సైడ్ఎఫెక్ట్స్ చాలా శక్తిమంతమైనవి. పగలు కూడా నిద్ర ముంచుకొస్తున్నట్లు, మెదడు పని చేయడానికి సహకరించక బద్దకంగా అనిపించడం, తల తిరగడం, అయోమయం, చూపు అస్పష్టంగా మారడం, తలంతా పట్టేసినట్లు ఉండడం, మానసిక ఆందోళన అంతలోనే ఉద్వేగం వెంటనే ఆనందం ఇలా క్షణక్షణానికీ మారడం (మూడ్ స్వింగ్స్), జ్ఞాపకశక్తి లోపించడం వంటి సమస్యలను కొనితెచ్చుకున్న వాళ్లమవుతాం. నిద్రమాత్రలను వరుసగా రెండువారాలు వాడితే దేహం వాటికి అలవాటు పడిపోతుంది. ఆ తర్వాత డోస్ పెంచాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. నిద్రమాత్ర వేసుకోకపోతే మానసిక ఆందోళన, చేతులు వణకడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రదశకు చేరితే మూత్రవిసర్జన కష్టం కావడం, ఇతర మూత్ర సంబంధ సమస్యలు, నోరు పొడిబారిపోవడం వంటి లక్షణాలకు దారి తీస్తుంది. మరి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు స్లీపింగ్ పిల్స్ వాడకాన్ని డాక్టర్లు ఎందుకు సూచిస్తారంటే... అనారోగ్య సమస్యతో బాధపడుతున్నప్పుడు ఇక తప్పని పరిస్థితుల్లో తగుమాత్రం డోస్‌ను సూచిస్తారు. వాటి వాడకం ఆ సమస్య నుంచి బయటపడే వరకు మాత్రమే పరిమితం చేస్తారు. ప్రిస్క్రిప్షన్‌లో నిద్రమాత్రలను రాసినట్లు తెలియనివ్వరు. తెలిస్తే ఎవరికి వారు తరచూ వాడి ఇతర సమస్యలు కొనితెచ్చుకుంటారనే ఉద్దేశంతోనే ఈ జాగ్రత్త. -
26 రోజుల్లోనే మనసు మార్చుకున్న రజనీకాంత్
కొమ్ములు తిరిగిన నాయకులు సైతం ఎందుకొచ్చిన రాజకీయాలు అనుకునే ఏడు పదుల వయసులో రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నట్టు ఈనెల 3న హఠాత్తుగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచిన సూపర్‌స్టార్ రజనీకాంత్ 26 రోజుల్లోనే మనసు మార్చుకున్నారు. రాజకీయాల్లోకి రావటంగానీ, పార్టీ స్థాపించే ఆలోచనగానీ ఇక లేదని మంగళవారం తేల్చిచెప్పారు. హైదరాబాద్‌లో ఒక సినిమా షూటింగ్ తర్వాత అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొంది ఈ మధ్యే డిశ్చార్జి అయినందువల్ల పార్టీ ఆవిర్భావం తేదీని ముందనుకున్నట్టు ఈ నెల 31న ప్రకటించకపోవచ్చని అందరూ అనుకున్నారు. కానీ ఏకంగా పార్టీ ప్రసక్తే లేదని చెప్పటం అభిమానుల్ని నిరాశానిస్పృహల్లో ముంచెత్తింది. రాకపోవడానికి గల కారణాల గురించి రజనీకాంత్ సుదీర్ఘమైన ప్రకటన విడుదల చేశారు. అది ఆయన పడిన అంతస్సంఘర్షణకు అద్దం పడుతోంది. తాను అస్వస్థుణ్ణి కావటం ఆయన ‘దైవలీల’ అన్నారు. వైద్యులు, శ్రేయోభిలాషులు వద్దన్నా వినకుండా హైదరాబాద్‌కు షూటింగ్‌కని వెళ్తే అక్కడ అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకున్నా నలుగురికి కరోనా సోకడం, ఆతర్వాత తనకు హైబీపీ రావటం ఇవన్నీ దేవుడి హెచ్చరికలుగా ఆయన పరిగణించారు. ఎన్నో జాగ్రత్తలమధ్య 120మంది వున్నచోటే కరోనా వస్తే రాష్ట్రమంతా తిరగటం, వేలాదిమందితో ర్యాలీల్లో పాల్గొనటం కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న తనకూ, తన కోసం రాజకీయాల్లోకి దిగేవారికీ ఎంత ప్రమాదకరమో అంచనా వేసుకున్నారు. వీటన్నిటినీ బేఖాతరు చేసి ఇచ్చిన మాట నిలుపుకోవటం కోసమంటూ రాజకీయాల్లోకి దిగడమంటే తనను నమ్ముకున్నవారిని బలిపశువుల్ని చేయటమే అవుతుందన్నదే ఆయన ఆలోచన. అటు వైద్యుల హెచ్చరిక, ఇటు ఇంట్లోవారి ఒత్తిళ్లు ఆయనలో అంతస్సంఘర్షణను ప్రేరేపించి తాజా నిర్ణయానికి దారి తీసివుండొచ్చునని కొందరి అంచనా. రజనీకాంత్‌లో ఆధ్యాత్మిక చింతన మొదటినుంచీ ఎక్కువే. కొన్నేళ్లక్రితం రాజకీయాల్లోకి రాద ల్చుకున్నట్టు ప్రకటన చేసినప్పుడు తనవి ‘ఆధ్యాత్మిక రాజకీయాల’ని చెప్పారు. అంతకు చాన్నాళ్ల ముందు ఒకసారి ఆధ్యాత్మిక చింతనతో ఆయన హిమాలయాలకు వెళ్లొచ్చారు. ఒక సాధారణ వ్యక్తిగా చెన్నైకు వచ్చిన తనకు సినిమాల్లో నటించాలనే ఉద్దేశమే లేనప్పుడు అనుకోకుండా బాలచందర్ చిత్రంలో సహాయపాత్ర నటించే అవకాశం రావటం, అంచెలంచెలుగా అత్యున్నత స్థాయికి ఎద గటం–వీటన్నిటి వెనకా ఆయన ఒక అతీత శక్తిని చూశారు. రాజకీయాల్లో సైతం అదేవిధంగా విజయం సాధిస్తానన్న నమ్మకం ఆయనకు ఏదో ఒకమూల వుండిపోయింది. అసెంబ్లీ ఎన్నికల ప్పుడు ఒకసారి డీఎంకేకు, మరోసారి అన్నాడీఎంకేకు మద్దతు పలికి వారి విజయానికి దోహద పడ్డారు. మధ్యమధ్యన ఊగిసలాటలు లేకపోలేదుగానీ, రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తిని పాతి కేళ్లుగా ప్రకటిస్తూనే వున్నారు. ఈసారి ఎంతో దృఢంగా ఆ మాట చెప్పినట్టు కనబడిన రజనీకాంత్ చివరకు మరోసారి కూడా వెనక్కి తగ్గారు. ఈ ఊగిసలాటలకు తన అస్వస్థతే కారణమని ఆయన చెబుతున్నమాటను కొందరు విశ్వసించటం లేదు. ఆయన ప్రైవేటుగా చేయించుకున్న సర్వేలో రెండెంకెలకు మించి సీట్లు వచ్చే అవకాశం లేదని తేలటం వల్లే ఆయన ఈ నిర్ణయానికొచ్చివుండొచ్చు నని ఊహాగానాలు బయల్దేరాయి. వాటి సంగతలావుంచి తమిళనాడు ప్రస్తుత రాజకీయాలు అంత స్పష్టంగా లేవు. ఇప్పటికే అనేకానేక రాజకీయ పార్టీలతో కిక్కిరిసివున్న ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఒంటరిగా పోటీ చేయదల్చుకున్న మరో పార్టీకి స్థానం వుండటం అనుమానమే. అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగైదు నెలల్లో జరగాల్సివుంది. ఇంత తక్కువ వ్యవధిలో పార్టీని స్థాపించి, దాన్ని విజయవంతంగా అధికారంవైపు నడిపించటం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్నది. పైగా రాజకీయాల్లో తలపడటం గురించి రజనీకాంత్‌కు కొన్ని విలక్షణమైన ఆలోచనలున్నాయి. తమిళనాట వ్యవస్థలు నాశనమయ్యాయని, ద్రవిడ పార్టీలే అందుకు కారణమని ఆయన నమ్మినా...అందుకు సంబంధించి ఎవరిపైనా విమర్శలు చేయదల్చుకోలేదని అన్నారని ఈమధ్యే ఆయన సన్నిహితుడు రాశారు. తప్పులు ఎత్తి చూపకపోతే ఎలా అని అడిగితే, ఆ తప్పులేమిటో ప్రజలందరికీ తెలుసు గనుక వాటిని ప్రస్తావించనవసరం లేదని జవాబిచ్చారట. తప్పొప్పుల సంగతి వదిలిపెట్టినా తన ప్రత్యర్థి పార్టీల విధివిధానాల గురించి తన అభిప్రాయాలు చెప్పటం, వారికి తానెట్లా భిన్నమో వివరించటం తప్పనిసరవుతుందని గ్రహించలేదని ఆయన మాటలు చూస్తే అర్థమవుతుంది. వర్తమాన రాజకీయ దుస్థితి చూసి ఆగ్రహం కలగటంతో రాజకీయాల్లోకి రావాలనిపించిందన్నది ఆయన చెప్పిన మాటే. ఎవరినీ శత్రువులుగా భావించనని రజనీ అనడం స్వాగతించదగ్గదే. అయితే ప్రత్యర్థులుగానైనా పరిగణించకపోతే, వారి విధానాల్లోని డొల్లతనాన్ని ఎత్తి చూపకపోతే ప్రజలకు అవగాహన కలిగేదెలా? ఎవరి మాటెలావున్నా ఆయన ‘ఆధ్యాత్మిక రాజకీయాలు’ తమకు లాభిస్తాయని బీజేపీ బాగానే ఆశలు పెట్టుకుంది. అయిదు దశాబ్దాలుగా జాతీయ పార్టీలకు కాస్తయినా చోటీయని తమిళనాట రజనీ రాకతో మారుతుందని అనుకుంది. ఈలోగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి స్వరం మారింది. ఆదివారంనాటి ర్యాలీలో ఆయన బీజేపీకి హెచ్చరికలాంటి ప్రకటన చేశారు. తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా గుర్తిస్తేనే కూటమిలో కొనసాగనిస్తామని, అధికారం పంచుకునే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. ఇప్పుడు అర్థాంతరంగా రజనీ వెనక్కి తగ్గారు గనుక ఈ సమీకరణాల్లో మార్పు తథ్యం. రజనీ వెనక్కు తగ్గటం ఎంతో కొంత డీఎంకేకు లాభించే పరిణామం. రాజకీయాల్లోకి రావడమైనా, రాకపోవటమైనా రజనీ వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు సంబంధించింది. తనకున్న సమస్యలరీత్యా పునరాలోచన తప్పలేదంటున్నారు గనుక ఆయన నిర్ణయాన్ని అందరూ గౌరవిం చాల్సిందే. -
ఇంటికే వస్తారు.. జబ్బుల్ని పట్టేస్తారు
సాక్షి, అమరావతి: ప్రజలకు సంక్రమించే జీవన శైలి జబ్బులపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో చురుగ్గా సర్వే జరుగుతోంది. దేశంలో ఎక్కడా చేయని విధంగా మధుమేహం, కుష్టు, హైపర్ టెన్షన్, క్యాన్సర్ తదితర జబ్బుల బారినపడిన వారిని గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేయిస్తోంది. ఇప్పటికే 15 రోజులుగా సుమారు 19 వేల మంది ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి వ్యాధి లక్షణాలను పరీక్షిస్తున్నారు. మరీ ముఖ్యంగా రక్తహీనతతో బాధపడుతున్న వారిని గుర్తించి తక్షణమే ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగా చికిత్స అందించడంతోపాటు అవసరమైన మందులను ఉచితంగా ఇస్తారు. మొత్తంగా రాష్ట్రంలోని 5.34 కోట్ల మంది ఆరోగ్య స్థితిగతులను ప్రతి ఇంటికీ వెళ్లి సేకరిస్తున్నారు. సమగ్ర సర్వే పూర్తి కావడానికి మరో 90 రోజులు పట్టే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద సర్వే అని అధికారులు పేర్కొంటున్నారు. 19 శాతం సర్వే పూర్తి రాష్ట్రంలో ఇప్పటివరకూ 19.01 శాతం జనాభాను సర్వే చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 19.43 శాతం, పట్టణ ప్రాంతాల్లో 17.27 శాతం సర్వే పూర్తయింది. గ్లూకోమీటర్, హిమోగ్లోబిన్ మీటర్ల ద్వారా మధుమేహం, రక్తహీనతల్ని గుర్తిస్తున్నారు. ఇప్పటివరకూ జరిగిన సర్వేలో హైపర్ టెన్షన్ (రక్తపోటు) బాధితులు అధికంగా ఉన్నట్టు ప్రాథమికంగా తేలింది. దీనికి కొంచెం అటూఇటుగా మధుమేహ బాధితులూ ఉన్నారు. విచిత్రం ఏమంటే.. 35 ఏళ్లలోపు వారికి కూడా మధుమేహం లక్షణాలు ఉన్నట్టు తేలింది. (చదవండి: దసరా కానుక.. ఏపీ ప్రభుత్వం తీపి కబురు) యాప్‌లో నమోదు చేసి.. ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలనూ ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నారు. మొత్తం సర్వే పూర్తయ్యాక రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖకు నివేదిక ఇస్తారు. దీని ఆధారంగా వ్యాధి లక్షణాలున్న వారికి ఏ ఆస్పత్రిలో వైద్యం అందించాలి, ఎక్కడ మందులు ఇవ్వాలనేది నిర్ణయిస్తారు. అనంతరం వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్న వారింటికి ఏఎన్ఎంలు వెళ్లడం లేదంటే ఫోన్ ద్వారా వారిని ఆస్పత్రులకు పిలిపించి వైద్య సదుపాయం కల్పిస్తారు. ఈ వివరాలన్నీ 104 సేవలకు, పీహెచ్‌సీలకు అనుసంధానం చేసి పర్యవేక్షణ చేయాలనేది సర్కారు యోచన. ప్రతి ఒక్కరికీ ఎంత ఖరీదైన మందులైనా ప్రభుత్వమే ఉచితంగా ఇచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. (చదవండి: అన్ని పథకాలకు అండగా నిలుస్తాం) జిల్లాల వారీగా ఇప్పటికే సర్వే పూర్తయిన ఇళ్ల సంఖ్య జిల్లా పట్టణ ప్రాంతాల్లో సర్వే చేసిన ఇళ్లు గ్రామీణ ప్రాంతాల్లో సర్వే చేసిన ఇళ్లు విజయనగరం 22,594 1,29,356 శ్రీకాకుళం 4,929 91,816 విశాఖపట్నం 27,116 2,01,737 తూర్పు గోదావరి 66,321 3,11,412 పశ్చిమ గోదావరి 40,953 2,07,383 కృష్ణా 71,081 2,10,787 గుంటూరు 60,760 1,44,198 ప్రకాశం 6,034 1,15,083 నెల్లూరు 29,640 1,24,161 చిత్తూరు 59,232 2,34,059 కర్నూలు 16,828 1,49,117 వైఎస్సార్ 41,554 1,87,662 అనంతపురం 44,472 2,22,656 ప్రాథమిక దశలోనే గుర్తించే వీలు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు సేకరించడమనేది మహాయజ్ఞం లాంటిది. దీనివల్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు సంక్రమించే వివిధ వ్యాధులను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి తక్షణ చికిత్స అందించే వెసులుబాటు కలుగుతుంది. ఏఎన్ఎంలు పక్కాగా వివరాలు సేకరిస్తున్నారు. దీనివల్ల రాష్ట్రంలో వివిధ జబ్బులతో బాధపడుతున్న వారిపై కచ్చితమైన అంచనా వస్తుంది. - అనిల్‌కుమార్ సింఘాల్, ముఖ్య కార్యదర్శి, వైద్య, ఆరోగ్య శాఖ -
ఆస్పత్రిలో చేరిన జపాన్ ప్రధాని.. రాజీనామా!
టోక్యో : జపాన్ ప్రధానమంత్రి షింజో అబే అనారోగ్య సమస్యలతో సోమవారం టోక్యోలోని ఆస్పత్రిలో చేరారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి ఫలితాలను వెల్లడించనున్నారని స్థానిక మీడియా పేర్కొంది. ప్రధాని అబేకు దాదాపు ఏడున్నర గంటలు పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. ప్రధాని కాన్వాయ్‌లో ఆస్పత్రికి చేరుకోవడంతో పెద్ద మొత్తంలో మీడియా అక్కడకు చేరుకుంది. కాగా షింజో అబే అనారోగ్యానికి గురవ్వడంతో దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. (అణు ఆయుధాలను నిషేధించండి: జపాన్) అయితే అబే ఆస్పత్రిలో చేరడం ఇదేం మొదటి సారి కాదు. ఇంతకు ముందు కూడా అబే ఆరోగ్యం క్షీణించడంతో ఆయన ఆస్పత్రిలో చేరారని స్థానిక మీడియా నివేదించింది. జూలై 6న అబే తన కార్యాలయంలో రక్తపు వాంతులు చేసుకున్నట్లు వీక్లీ మ్యాగజైన్ ప్రచురించింది. అయితే ఈ వార్తలను ప్రభుత్వం ఖండించింది. ఆయన కేవలం జనరల్ చెకప్ కోసం వచ్చినట్లు, అబే ఆరోగ్యం క్షేమంగానే ఉందని ఆర్థికమంత్రి కట్సునోబు కటో తెలిపారు. ఇదిలా ఉండగా దేశంలో ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా కొనసాగిన వ్యక్తిగా అబే రికార్డు సృష్టించారు. (చైనాకు మద్దతుపై డైలమాలో జపాన్..) ఇంతకముందు తన మేనమామ ఐసాకు పేరు మీద ఉన్న ఈ రికార్డును అబే సోమవారంతో అధిగమించాడు. ఈ మైలురాయిని చేరుకున్న తరువాత అతను రాజీనామా చేయవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే 2007లో కొంత ఆరోగ్య సమస్యల వల్ల తన పదవీకి రాజీనామా చేసి 2012లో మళ్లీ అధికారంలోకి వచ్చారు. ఒకవేళ అబే తన పదివి నుంచి తొలగిపోతే ప్రస్తుతం ఉప ప్రధానిగా ఉన్న తారో అసో తాత్కాలికంగా ప్రధాని బాద్యతలు స్వీకరించనున్నారు. అలా కాకుండా అబే తాను రాజీనామా చేయాలని నిర్ణయించుకుంటే ఎన్నికల అనంతరం అధికారికంగా మరొకరు ప్రధానమంత్రి అయ్యేవరకు అతను ఈ పదవిలో కొనసాగుతారు. -
వరవరరావుకు సీరియస్
సాక్షి, హైదరాబాద్: విప్లవ కవి పి.వరవరరావు ముంబైలోని తలోజ జైలులో తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారని, వారిని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడాలని ఆయన కుటుంబసభ్యులతో పాటు హక్కుల కార్యకర్తలు విజ్ఞప్తి చేశారు. మహా రాష్ట్ర– ముంబై–తలోజ జైలులో విచా రణ ఖైదీగా ఉన్న వరవరరావుతో జైలు అధి కారులు తనతో ఫోన్లో మాట్లా డించారని, వీవీ మాట్లాడిన తీరు పొంతన లేకుండా ఉందని, మాట మొద్దు బారిపోయిం దని ఆయన సహచరి హేమలత ఆవేదన వ్యక్తం చేశారు. వీవీ ఆరోగ్యం బాగా చెడిపోయిందని ఆయన పక్కనే ఉన్న వ్యక్తి ఫోన్ తీసుకుని తనతో చెప్పాడని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వరవర రావును ఆస్పత్రికి పంపించి చికిత్స అందించే ఏర్పాట్లు చేయాలని నిర్బంధ వ్యతిరేక వేదిక తెలంగాణ కన్వీనర్ ప్రొఫెసర్ జి.హరగోపాల్ సీఎం కేసీఆర్‌కు శనివారం లేఖ రాశారు. వీవీ బెయిల్‌పై విడుదలై, తన కుటుం బంతో కలసి ఉండి, సరైన చికిత్స పొందేవిధంగా సీఎం కేసీఆర్ తగిన సహకారం అందిం చాలని విజ్ఞప్తి చేశారు. వీవీకి తక్షణమే వైద్య సదు పాయం అందేలా చర్యలు తీసుకోవా లని చాలామంది కవులు, సాహితీ వేత్తలు సామాజిక మార్గాల్లో సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. -
షాకిచ్చిన కోర్టు.. ఐదు లక్షల ఫైన్
న్యూఢిల్లీ: శీతల పానీయాలు థమ్సప్, కోకాకోలాలు ఆరోగ్యానికి హానికరం.. నిషేధించాలంటూ పిల్ దాఖలు చేసిన వ్యక్తికి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. పిటిషనర్ చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేశారని, ఆయన చేసిన వాదనలను నిరూపించలేకపోయారంటూ రూ.5లక్షల జరిమానా విధించింది. వివరాలు.. చావ్డా అనే వ్యక్తి కోకాకోలా, థమ్స్ అప్ ఆరోగ్యానికి హానికరం.. వాటిని నిషేధించాలంటూ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ తరపు వాదనలు విన్న తరువాత న్యాయమూర్తులు డి.వై.చంద్రచుడ్, హేమంత్ గుప్తా, అజయ్ రాస్తోగిలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ‘పిటిషనర్ ఒక 'సామాజిక కార్యకర్త' అని చెప్పుకుంటున్నారు. పిటిషనర్‌కు ఈ విషయంపై సాంకేతిక పరిజ్ఞానం లేకుండానే పిటిషన్ దాఖలైంది. అతని వాదనలు నిరూపించబడలేదు. అతనికి జరిమానా విధించడం సమంజసం. అందుకే అతడికి రూ. 5లక్షల జరిమానా విధిస్తున్నాం’ అని తెలిపారు. ఒక నెలలోపు 5 లక్షల రూపాయలను టాప్ కోర్ట్ రిజిస్ట్రీలో జమ చేయాలని.. అదే మొత్తాన్ని సుప్రీంకోర్టు న్యాయవాదుల రికార్డ్ అసోసియేషన్‌కు పంపిణీ చేయాలని కోర్టు చావ్డాను ఆదేశించింది. -
24 గంటల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరు మృతి
సాక్షి, చెన్నై: తమిళనాడులో 24 గంటల్లో డీఎంకే పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు చనిపోయారు. గుడియాథం నియోజకవర్గానికి చెందిన ఎస్. కథవరాయణ శుక్రవారం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చనిపోయారు. గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కథావరయణ్.. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. కథావరయణ్.. వేలూరు జిల్లాలోని గుడియథం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డీఎంకే ఎమ్మెల్యే మృతిపట్ల రాజకీయ పార్టీల నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. డీఎంకే పార్టీ మరో ఎమ్మెల్యే తిరువత్తియూరు నియోజకవర్గ ఎమ్మెల్యే (డీఎంకే), మాజీ మంత్రి కేపీపీ స్వామి (58) గురువారం కన్నుమూశారు. శుక్రవారం మధ్యాహ్న 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 1962 జూలై 1వ తేదీన జన్మించిన స్వామి చెన్నై కేవీ కుప్పంలో నివసిస్తున్నారు. ఐదు నెలలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆ తరువాత ఇంటివద్దనే వైద్యసేవలు అందుకుంటున్నారు. ఈ పరిస్థితిలో ఆరోగ్యం మరింత విషమించగా గురువారం ఉదయం 6.10 గంటల సమయంలో గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచారు. స్వామి మరణవార్త తెలుసుకుని పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ నేతలు తరలివచ్చారు. ఆయన భౌతికకాయాన్ని పార్టీశ్రేణులు, అభిమానుల సందర్శనార్థం ఇంటి వద్ద ఉంచారు. అంచెలంచెలుగా.. డీఎంకే సీనియర్ నేత, మాజీ కౌన్సిలర్ పరశురామన్ కుమారుడు స్వామి. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో తిరువత్తియూరు నియోజకవర్గం నుంచి గెలుపొంది మత్స్యశాఖా మంత్రిగా పనిచేశారు. 2011 ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి కుప్పన్ చేతిలో ఓడిపోయారు. 2016 నాటి ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. డీఎంకే మత్స్య విభాగం ఇన్చార్జ్గా నియమితులైనారు. డీఎంకే అగ్రనేత కరుణానిధితో ఎంతో సఖ్యతగా మెలిగేవారు. కేపీపీ స్వామి భార్య, మాజీ కౌన్సిలరైన ఉమ, పెద్ద కుమారుడు ఇనియవన్ కొంతకాలం క్రితం మరణించారు. కుమార్తె ఉదయకు వివాహం కాగా భర్తతో ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు. చిన్నకుమారుడు పరశు ప్రభాకరన్ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. కేపీపీ స్వామికి ముగ్గురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. స్వామి కుటుంబ సభ్యుల్లో దాదాపుగా అందరూ డీఎంకేలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు పట్టినత్తార్ ఆలయం వీధి సమీపంలోని శ్మశానవాటికలో స్వామి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. స్వామి మరణంతో అసెంబ్లీలో డీఎంకే బలం 99కి తగ్గింది. మత్స్యకార కుటుంబాలకు ఎనలేని సేవ : స్టాలిన్ మత్స్యకార సామాజికవర్గానికి స్వామి ఎనలేని సేవలు చేశారని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కొనియాడారు. కేవీకుప్పంలోని స్వామి భౌతికకాయానికి ఆయన నివాళులర్పించారు. స్వామి మరణం తనను ఎంతో కలచివేసిందని ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీలో అనేక బాధ్యతలు నిర్వర్తించిన స్వామి అన్ని కార్యక్రమాల్లో ఎంతో చురుకుగా వ్యవహరించేవారని, మత్స్యశాఖామంత్రిగా పనిచేసిన కాలంలో ఆ సామాజిక వర్గానికి ఆయన అందించిన సేవలను మరువలేమన్నారు. మత్స్యకార కుటుంబాల సంక్షేమం కోసం అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తనతో పట్టుబట్టి మరీ పనులు చేయించుకునేవారని గుర్తుచేసుకున్నారు. అనారోగ్యానికి గురైనపుడు స్వయంగా వెళ్లి క్షేమసమాచారాలు అడిగి తెలుసుకున్నానని, అయితే తన ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా నియోజకవర్గ ప్రజల కష్టనష్టాలను వివరించారని అన్నారు. స్వామి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని చెప్పారు. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు తిరునావుక్కరసర్ సంతాపం ప్రకటించారు. గవర్నర్ సంతాపం డీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి కేపీపీ స్వామి ఆకస్మిక మరణం ఎంతో ఆవేదనను కలుగజేసిందని గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. తిరువొత్తియూరు నియోజకవర్గ ప్రజలకు తీరనిలోటని అన్నారు. స్వామిని కోల్పోయిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు. -
శోకసంద్రంలో దర్శకుడు రాజ్‌కపూర్ కుటుంబం
సీనియర్ దర్శకుడు, నటుడు రాజ్‌కపూర్ కుమారుడు షారూఖ్‌కపూర్ అనారోగ్యంతో సోమవారం మక్కాలో మృతి చెందాడు. ఆయన కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. తాలాట్టు కేట్కు దమ్మా, అవ న్ వరువాళా, ఆనంద పూంగాట్రు తదితర చిత్రాల దర్శకుడు రాజ్‌కపూర్. ఈయనకు భార్య సజీలాకపూర్, కుమారుడు షారూఖ్‌కపూర్, కుమార్తెలు షమీమా, షాని యా ఉన్నారు. కొడుకు షారూఖ్కపుర్ సోమవారం మక్కాలో అనూహ్యంగా మృతి చెందాడు. ఇతను కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురవ్వడంతో ఆరోగ్యం బాగు అయితే మక్కా కు వస్తామని అతని తల్లి మొక్కుకున్నారట. షారూక్కపూర్కు ఆరోగ్యం బాగుపడడంతో రాజ్‌కపూర్ భార్య కొడుకును తీసుకుని మక్కా కు వెళ్లారు. అక్కడ వాతావరణం అతి శీతలంగా ఉండడంతో షారూఖ్‌కపూర్ ఇంతకు ముందే శ్వాసకోశ సంబంధిత సమస్య ఉండడంతో అనారోగ్యానికి గురయ్యాడు. అయితే వాతావరణ ప్రభావం అని భావించిన అతని తల్లి ఉదారంగా ఉన్నారు. దీంతో షారూఖ్‌కపూర్ శ్వాసకోశ సమస్య కారణంగా అనూహ్యంగా సోమవారం మక్కాలోనే కన్ను మూశాడు. దర్శకుడు రాజ్‌కపూర్ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనతో సినీ పరిశ్రమ ధిగ్భ్రాంతికి గురైంది. షారేఖ్కపూర్ మయసు 23 ఏళ్లు. చదువు పూర్తి కాగానే నటనలో శిక్షణ ఇప్పించాలని తండ్రి రాజ్‌కపూర్ భావించారట. అయితే చిన్న వయసులోనే షారూక్కపూర్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం బాధాకరం. -
కిడ్నీ.. కిలాడీలు!
సాక్షి, నల్లగొండ : కిడ్నీ సమస్యతో చావుకు దగ్గరైన కన్న కూతురును దక్కించుకునేందుకు ఓ తండ్రి కిడ్నీ మాయగాళ్ల వలలో చిక్కాడు. తన పేరు బయటకు రావడం ఇష్టం లేని నల్లగొండ మండలానికి చెందిన ఆ బాధితుడి కన్నీళ్లను జిల్లా పోలీసులు తుడిచారు. నమ్మించి మోసం చేసిన వారినుంచి మొత్తం డబ్బులు రికవరీ చేసి.. బాధితుడికి రూ.10.17 లక్షలు అప్పజెప్పడంతో కథ సుఖాంతం అయ్యింది. అయితే, ఆరోగ్య అత్యవసరాలను కొందరు దళారులు ఎలా సొమ్ము చేసుకుంటున్నారో ఈ కేసును పరిశీలిస్తే ఇట్టే అర్థమవుతుంది. ఏం... జరిగిందంటే.. నల్లగొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు కిడ్నీ సమస్యతో చనిపోయింది. కొన్నాళ్లకు రెండో కూతురుకూ అదే సమస్య వచ్చింది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. కిడ్నీ మార్పిడి మినహా మరో మార్గం లేదని వైద్యులు తేల్చి చెప్పారు. ఈ సమస్యనుంచి ఎలా బయట పడాలో తెలియక కన్నీళ్లతో ఆస్పత్రి వెలుపల కూర్చున్న బాధితుడిని.. అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ మహిళ తనకు తెలిసిన వాళ్లు ఉన్నారని, కిడ్నీలు ఇప్పిస్తారని చెప్పి.. ఇద్దరు వ్యక్తులతో మాట్లాడించింది. ఆ తర్వాత నేరుగా సదరు దళారులు.. బాధితుడి గ్రామానికి వచ్చి ఒక కిడ్నీకి రూ.16.50లక్షలకు బేరం కుదుర్చుకుని రూ.లక్ష అడ్వాన్స్‌గా తీసుకువెళ్లారు. అది మొదలు వరుసబెట్టి నెల రోజుల్లోనే రూ.8.70లక్షలు వసూలు చేశారు. ఆ తర్వాత కూడా పరీక్షలు, ఇతరత్రా పేర మొత్తంగా రూ.10.17లక్షలు వసూలు చేసుకున్నారు. తీరా కిడ్నీ ఎక్కడ అని అడిగేసరికి మొఖం చాటేశారు. ఫోన్ చేసిన ప్రతిసారీ ఇదిగో అదిగో అంటూ దాటవేసిన వారు చివరికి బెదిరింపులకూ దిగారు. ఉన్న ఎకరం పొలం అమ్మగా వచ్చిన సొమ్మును మాయగాళ్ల చేతిలో పోసిన బాధితుడు రోజురోజుకూ క్షీణిస్తున్న తన కూతురు ఆరోగ్యాన్ని బాగు చేయించుకోలేని నిస్సాహాయ స్థితిలో లబోదిబోమంటూ ఎస్పీ ఏవీ రంగనాథ్‌ను కలిశాడు. తన గోడు వెళ్లబోసుకున్నాడు. తీగలాగిన పోలీసులు జరిగిన మోసాన్ని నిగ్గుతేల్చాలని ఎస్పీ .. వెంటనే టాస్క్‌ఫోర్స్‌ను పురమాయించారు. సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల, ముస్తాబాద్‌కు చెందిన శ్రీనివాస్, లింబరాజు అనే వ్యక్తులను నిందితులుగా గుర్తించి జిల్లాకు పట్టుకొచ్చారు. పోలీసుల విచారణలో వీరు తాము చేసిన మోసాన్ని పూసగుచ్చినట్టు చెప్పారు. బాధితుడినుంచి వసూలు చేసుకున్న సొమ్మునంతా రికవరీ చేసిన పోలీసులు వారిపై నల్లగొండ రూరల్స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇదే తరహాలో సదరు మధ్యవర్తులు గతంలో కరీంనగర్, వరంగల్ తదితర జిల్లాలో కూడా మోసాలకు పాల్పడినట్లు ‘ఇంటరాగేషన్ ’లో తెలుసుకుని ఆ జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం బాధితుడికి సొమ్ములు అందడంతోపాటు.. నిందితులు రిమాండ్‌లో ఉన్నారు. దళారుల తరఫున ఓ జెడ్పీటీసీ సభ్యుడి వకాల్తా! ఈ మొత్తం ఉదంతంలో ఆసక్తికరమైన మరో చిన్న సంఘటన కూడా జరిగింది. కిడ్నీ దళారులు శ్రీనివాస్, లింబరాజులను పోలీసులు అరెస్టు చేసి రూరల్ స్టేషన్లో కేసు నమోదు చేశాక.. వసూలు చేసిన సొమ్ములు రికవరీ చేసి బాధితుడికి అప్పజెప్పే సమయంలో పంచాయితీ పేర ఓ జెడ్పీటీసీ సభ్యుడు నిందితుల పక్షాన వకాల్తా పుచ్చుకున్నాడు. ఆయనకు అదే స్టేషన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ బాసటగా నిలిచాడు. కేసు ఎందుకు పెట్టారని బాధితుడిపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమొత్తం మాత్రమే డబ్బులు ఇస్తారు.. పూర్తిగా ఇవ్వరంటూ బెదిరింపులకూ పాల్పడ్డాడు. అయితే, ఎస్పీ ఈ కేసును నేరుగా పర్యవేక్షించడంతో సదరు జెడ్పీటీసీ సభ్యుడి, రూరల్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ పప్పులు ఉడకలేదు. మాయమాటలు నమ్మి మోసపోవద్దు మాయ మాటలతో బురిడీ కొట్టించే వారు ప్రతిచోటా ఉంటారు. కన్న కూతురుకు కిడ్నీ ఆపరేషన్ చేయించడం కోసం ఉన్న పొలం అమ్మి సొమ్ములు పోగొట్టుకున్న వ్యక్తి కలిసి వివరాలు చెప్పడంతో నిందితులను ట్రేస్ చేసి అరెస్టు చేసి తీసుకువచ్చాం. బాధితుడికి డబ్బులన్నీ తిరిగి ఇప్పించడమే కాకుండా, నిందితులపై కేసు నమోదు చేశాం. వివిధ రకాలుగా మోసపోయిన వారెవరైనా ధైర్యంగా ముందుకు వచ్చి సమాచారం ఇస్తే నిందితులను కచ్చితంగా పట్టుకుని న్యాయం జరిగేలా చూస్తాం. – ఏవీ రంగనాథ్, ఎస్పీ -
బతికుండగానే బయటపడేశారు!
దండేపల్లి (మంచిర్యాల): మానవత్వం మంటగలిసి పోయింది. వింత వ్యాధితో అనారోగ్యానికి గురైన ఓ యాచకుడికి వైద్యం అందించక బతికుండగానే బయటపడేసి చేతులు దులుపుకున్నారు. ఈ ఘటన శనివారం దండేపల్లి మండలం గూడెం గోదావరి ఒడ్డున వెలుగు చూసింది. లక్సెట్టిపేటలోని సాయిబాబా ఆలయం వద్ద వృద్ధ యాచకుడు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి ఓ వింత వ్యాధి సోకి, మెడ సమీపంలో గాయంలా తయారై అందులో పురుగులు పడ్డాయి. మూడు రోజుల క్రితం పరిస్థితి విషమించి స్పృహకోల్పోయాడు. స్థానికులు లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా, వింత వ్యాధిగా పరిగణించిన వైద్య సిబ్బంది అతన్ని ఓ ప్రైవేటు అం బులెన్స్లో మంచిర్యాలకు పంపినట్లు సమాచారం. వారు అతనికి చికిత్స అందించకుండా, వరంగల్‌కు రెఫర్ చేశారు. అయితే.. యాచకుడికి నా అనే వారు ఎవరూ లేకపోవడంతో వరంగల్‌కు తీసుకెళ్లకుండా గూడెం గోదావరి వంతెన కింద పడేసినట్లు గూడెం గ్రామస్తులు అంటున్నారు. అయితే అతని పక్కన పడి ఉన్న బెడ్ షీట్‌పై లక్సెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రిగా రాసి ఉంది. శనివారం మధ్యాహ్నం వరకు అతను కొన ఊపిరితో కొట్టుకున్నాడు. పరిస్థితి విషమించి శనివారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాం తంలో తుదిశ్వాస వదిలాడు. దండేపల్లి ఎస్సై విజయ్‌కుమార్.. పంచాయతీ సిబ్బంది సహకారంతో నది ఒడ్డున శవాన్ని పూడ్చి పెట్టించారు. కాగా, ఈ ఘటనపై గ్రామస్తులు రాస్తారోకోకు దిగారు. గోదావరి ఒడ్డున యాచకుని మృతదేహం -
నవాజ్ షరీఫ్ ఆరోగ్య పరిస్థితి విషమం
లాహోర్ : పనామా పేపర్స్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొని అరెస్టైన నవాజ్ షరీఫ్ ప్రస్తుతం లాహోర్ జైల్లో శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో నవాజ్ షరీఫ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనారోగ్యం కారణంగా మెడికల్ పర్మిటెన్స్ కింద నవాజ్ షరీఫ్‌కు లాహోర్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో జైలు అధికారులు షరీఫ్‌ను ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నవాజ్ షరీఫ్‌కు అత్యుత్తమ చికిత్స అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. -
13 వరకు సెలవులో సిద్దిపేట కలెక్టర్
సాక్షి, సిద్దిపేట: జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఈ నెల 13 వరకు సెలవులో ఉండనున్నారు. చెవినొప్పి ఎక్కువ కావడంతో మరో 11 రోజుల సెలవు కావాలని కోరుతూ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధార్ సిన్హాను కోరారు. పరిశీలించిన ఆయన 13 వరకు సెలవు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి వరకు రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కృష్ణబాస్కర్కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
అన్నయ్యా.. నా పిల్లలను బాగా చూసుకో...
సాక్షి, సోంపేట(శ్రీకాకుళం) : ‘నా భార్య పిల్లలను నీవే చూసుకోవాలి’ అని తన అన్నయ్య శ్రీనివాసరావుకు బాధాతప్తం హృదయంతో ఫోన్ చేసి మాట్లాడిన పలుకులే తమ్ముడు పిట్ట ఢిల్లీరావు(32)కు చివరివయ్యాయి. తన తలలో ఏర్పడిన కణితి బాధ భరించలేక, కుటుంబ సభ్యులకు భారం కాకూడదని నిర్ధారించుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సోంపేట పట్టణంలోని తెలగవీధికి చెందిన ఈయన ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. సోంపేట పోలీసుల వివరాల ప్రకారం... పట్టణంలో బైక్ మెకానిక్ షాపు నిర్వహిస్తున్న ఈయన తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తరచుగా తలనొప్పి రావడంతో వైద్య పరీక్షలు చేయించారు. తలలో కణితి ఏర్పడిందని, ప్రమాదస్థాయిలో ఉందని వైద్యులు వెల్లడించారు. ఇక తలనొప్పి తగ్గదని నిర్ధారించుకుని శుక్రవారం మధ్యాహ్నం 12 గంట ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే విషయాన్ని అరగంట ముందు హైద్రాబాద్‌లో ఉంటున్న తన అన్నయ్యకు సమాచారం అందించాడు. స్థానిక ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న పెద్ద కుమారుడికి భోజనం క్యారేజ్ తీసుకెళ్లిన భార్య తేజేశ్వరికి విషయం తెలిసి బోరుమని రోదించింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు ఎస్ఐ కే వెంకటేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పేదల పాలిట సంజీవని.. ఆరోగ్యశ్రీ
సాక్షి, గంపలగూడెం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అమలు చేసిన ఆరోగ్యశ్రీ పేదల పాలిట సంజీవనిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయింది. ఆరోగ్యశ్రీ లేకుంటే కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళే స్థాయి పేద, మధ్య తరగతి కుటుంబాలకు లేదు. ఆ పరిస్థితిలో పెద్ద రోగం వస్తే దేవుని మీద భారం వేసి స్థానికంగా ఉండే వైద్య సేవల్ని మాత్రమే పొందుతూ ఉండే వారు. ఆరోగ్యశ్రీ పథకం వచ్చాక ఎంతో ధైర్యంగా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి వైద్య సేవలు ఉచితంగా పొందామంటూ ప్రజలు మహానేతను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. వైఎస్ మరణానంతరం ఆరోగ్యశ్రీ పథకాన్ని టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేశారని మండిపడుతున్నారు. ఆరోగ్యశ్రీ పథకం తిరిగి పూర్తిస్థాయిలో అమలు జరగాలంటే వైఎస్ తనయుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని అన్ని వర్గాల ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఎందరికో ప్రాణదానం చేసింది.. ఆరోగ్యశ్రీ పథకం ఎంతో మంది ప్రాణాల్ని కాపాడింది. పేదలకు సంజీవని లాంటిది. ఆరోగ్యశ్రీకి ముందు పేదలకు సరైన వైద్య సదుపాయాలు లేక అనేక ఇబ్బందులు పడేవారు. అయితే, టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నీరుగార్చింది. – కోట దాసు, మాజీ ఎంపీపీ, గంపలగూడెం పథకాన్ని టీడీపీ నీరుగార్చింది.. పేదలకు వరంలా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికే దక్కుతుంది. ఈ పథకం ద్వారా అవసర సమయాల్లో నిరుపేదలు సైతం లక్షలాది రూపాయల వైద్య సేవల్ని పొందగలిగారు. ఈ పథకాన్ని టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. –చెరుకు నర్సారెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు, కనుమూరు ఉచితంగా పెద్ద ఆపరేషన్లు.. ఆరోగ్యశ్రీ పథకంతో అవసరమైన రోగులకు పెద్ద పెద్ద శస్త్రచికిత్సలు సైతం ఉచితంగా నిర్వహించటంతో ప్రాణదానం అయ్యింది. ఈ పథకమే లేకుంటే ఎన్నో కుటుంబాలు తీవ్రంగా నష్టపోయేవి. వెయ్యి రూపాయలు దాటిన వైద్య సేవల్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తానని జగన్ ప్రకటించడం పేదలకు మరింత మేలు చేసే విధంగా ఉంది. – బొల్లా కరుణాకరరావు, కొణిజెర్ల -
ఒబెసిటీతో కిడ్నీలకు ప్రమాదమే
మారుతున్న జీవన విధానం, ఫ్లోరైడ్ నీరు, రసాయన ఆహార పదార్థాలతో జన్యు సంబంధ వ్యాధులు పెరుగుతున్నాయి. ప్రధానంగా కిడ్నీ వ్యాధుల బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో 2 నుంచి 3 లక్షల మంది వరకు వివిధ రకాల కిడ్నీ వ్యాధులకు గురైన వారు ఉన్నారు. వీరిలో కిడ్నీ వ్యాధి ముదిరిపోయి చివరి దశలో డయాలసిస్ చేయించుకుంటున్న వారు నెలకు 1,500 నుంచి 2 వేల మంది వరకు ఉన్నట్లు అంచనా. అధిక బరువుతో అనర్థాలు తప్పడం లేదు. ప్రధానంగా ఊబకాయం(అధిక బరువు)తో మూత్ర పిండాలకు చేటు తప్పదని వైద్యులు అంటున్నారు. శనివారం వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. నెల్లూరు(బారకాసు): ఊబకాయం కిడ్నీ ఆర్యోగాన్ని దెబ్బతీస్తోంది. రాష్ట్రంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్యలో నెల్లూరు జిల్లా నాల్గో స్థానంలో ఉంది. జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు రోజురోజుకు పెరుగుతున్నారు. నేటి ఆధునిక కాలంలో చిన్నచిన్న పిల్లలు కూడా దీని బారిన పడుతున్నారు. బీపీ, షుగర్ ఉన్న వారి సంఖ్య రోజు రోజుకు అధికంగా పెరగడం వల్ల కూడా ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కనిగిరి, వింజమూరు, అనంతసాగరం, ఆత్మకూరు, కొండాపురం, పొదలకూరు, వెంకటగిరి, వరికుంటపాడు, ఉదయగిరి మండలాల్లో ఫ్లోరైడ్ నీరు లభ్యతతో ఆ నీటిని తాగినవారు కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నందున ఇతర చుట్టు పక్కల జిల్లాల కంటే జిల్లాలోనే కిడ్నీ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు - షుగర్ (డయాబెటీస్) ఉన్న వారిలో 40 శాతం మందికి కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం. - మూత్రంలో ప్రొటీన్ పోతున్న కారణంగా కిడ్నీ సమస్య ఏర్పడుతుంది. - ఫ్లోరైడ్ నీరు తాగడం వల్ల కిడ్నీ వ్యాధుల బారిన పడతారు. - నొప్పుల మాత్రలు అధికంగా వాడటం వల్ల, యూరిన్ ఇన్ఫెక్షన్, కిడ్నీలో రాళ్లు ఏర్పడటం వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయి. - వంశపారపర్యంగాను, జన్యు లోపం వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి. - కిడ్నీ వ్యాధులకు గురైన వారిలో మొదట్లో పాదాలు వాపు, ఆ తర్వాత కాళు మొత్తం వాపు రావడం, కళ్లు చుట్లూ వాపు, బీపీ అధికంగా ఉండటం, మూత్రం తగ్గిపోవడం, మూత్రంలో నురగ రావడం, రక్తహీనత (అనీమియా) ఏర్పడటం, చిన్నపనికి అలిసిపోవడం, ఎముకలు నొప్పులు ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి. - షుగర (డయాబెటీస్) వచ్చిన వెంటనే ఒకసారి కిడ్నీ పరీక్ష చేయించుకోవాలి. ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి విధిగా కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. - వీలైనంత వరకు నొప్పుల మాత్రల వాడకం తగ్గించుకోవాలి. - ప్రతి రోజు 3లీటర్ల మంచి నీటిని తాగాలి. - అధిక బరువు అంటే ఒబెసిటి, ఊబకాయం లేకుండా చూసుకోవాలి. - పొగతాగడం మానేయాలి. నిత్యం పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. నాన్ వెజిటేరియన్ ఫుడ్‌ను తగ్గించాలి. లేదా వీలైతే మానేయడం మంచిది. కిడ్నీ వ్యాధులు రావడానికి కారణాలు లక్షణాలు – డాక్టర్ మాధవ్దేశాయి, చీఫ్ నెఫ్రాలజిస్ట్, సింహపురి హాస్పిటల్ ప్రాథమిక దశలో గుర్తిస్తే మేలు. కిడ్ని వ్యాధిని ప్రాధమిక దశలో గుర్తిస్తే ఎంతో మేలు. లేకుంటే చాలా ప్రమాదం ఉంది. కిడ్నీ వ్యాధి ముదిరితే గుండెపోటు లేక, పక్షవాతంతో మరణించే ప్రమాదం ఉంది. జిల్లాలోని 2 నుంచి 3లక్షల మందికి వివిధ రకాల కిడ్నీ వ్యాధులు ఉండే అవకాశం ఉంది. అయితే వీరిలో కేవలం 20 వేల మంది మాత్రమే ముందస్తుగా సంబంధిత వైద్యుడిని కలిసి తగిన వైద్యం పొందుతున్నారు. మిగిలిన వారంతా కిడ్నీ వ్యాధి ముదిరిన తర్వాత చివరి దశలో మాత్రమే వైద్యుడిని కలవడం జరుగుతోంది. -
త్వరలో షూటింగ్‌కు ఇర్ఫాన్ ఖాన్
కొంతకాలంగా బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఆరోగ్యంపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇర్ఫాన్ న్యూరోఎండోక్రైన్ ట్యూమర్‌తో బాధపడుతున్నట్టుగా ప్రకటించిన దగ్గర నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇర్ఫాన్ స్వయంగా ట్వీట్ చేసినా, ఆయన భార్య మీడియా ద్వారా స్పందించినా రూమార్స్ మాత్రం ఆగలేదు. తాజాగా ఇర్ఫాన్ ఖాన్ సన్నిహితుడు, ప్రముఖ దర్శకుడు సూజిత్ సర్కార్.. ఇర్ఫాన్ ఆర్యోగ పరిస్థితిపై క్లారిటీ ఇచ్చారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ప్రస్తుతం ఇర్ఫాన్ ఆరోగ్యం బాగుంది. త్వరలోనే ఆయన ఉద్ధమ్ సింగ్ బయోపిక్‌లో నటిస్తారు’ అంటూ రూమర్స్‌కు చెక్ పెట్టారు. జలియన్‌వాలా బాగ్ ఉదంతాన్ని ప్రతీకారంగా పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్‌ను మట్టుపెట్టిన స్వతంత్ర్య సమరయోధుడు ఉద్ధమ్ సింగ్. సూజిత్ సర్కార్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ కథలో ముందుగా రణబీర్ కపూర్ నటిస్తాడన్న వార్తలు వినిపించినా.. సూజిత్.. ఇర్ఫాన్ ఖాన్ ఉద్ధమ్ పాత్రలో నటించనున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు. -
18 రకాల పురుగు మందులపై నిషేధం
కేంద్ర వ్యవసాయశాఖ సాక్షి, హైదరాబాద్: పురుగు మందులతో పండిం చే పంటలన్నీ విషపూరితం అవుతున్నాయని కేంద్రం ఆందోళన వ్యక్తంచేసింది. ‘కొన్ని రకాల పురుగు మందులతో పండించే పంటల వల్ల మానవుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. పర్యావరణం దెబ్బతింటుంది. భూమి, నీరు, గాలి కలుషితం అవుతున్నాయి. ఆయా పంటలు తినే పశు పక్ష్యాదులు, మానవజాతి తీవ్ర ప్రమా దంలో పడింది. క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు జనాన్ని భయాందోళనకు గురిచేస్తున్నా యి’అని కేంద్ర వ్యవసాయశాఖ స్వయంగా తేల్చి చెప్పింది. అందుకే 18 రకాల పురుగు మందుల ను నిషేధిస్తూ తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖకు తెలియజెప్పింది. అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అమెరికా వంటి దేశాల్లో ఎప్పుడో వీటిని నిషేధించగా.. కేంద్రం ఇప్పుడు మేల్కొంది. పురుగుమందుల నిషేధపు ఉత్తర్వు–2016 కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటి ఫికేషన్‌ను ‘పురుగుమందుల నిషేధపు ఉత్తర్వు– 2016’గా పిలుస్తారు. వాస్తవంగా దేశంలో ఏ పురుగు మందులు ప్రమాదకరమో నిర్ధారించేం దుకు 2013లో అప్పటి కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. ఆ కమిటీ ప్రపంచంలో నిషేధంలో ఉన్న 66 రకాల పురుగు మందులు భారతదేశంలోనూ వినియోగిస్తున్నా రని తేల్చింది. చివరకు ఆ కమిటీ నిషేధించా ల్సిన పురుగు మందు లపై వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించింది. అందులో 18 రకాల పురుగు మందులను నిషేధించాలని నివేదించింది. ఇవి మనుషులు, జం తుజాలానికి తీవ్ర ప్రమాదం (హైరిస్క్) కలిగిస్తా యని పేర్కొంది. అందువల్ల తక్షణమే చర్యలకు విన్నవించింది. నిషేధించిన 18 రకాల పురుగు మందులివే ► హాబెనోమిల్. ఈ తెగులు మందును పంటలకు మచ్చలు వస్తే వాడుతారు. ఇది చల్లిన పంటను తినే పశుపక్ష్యాదులు, మనుష్యులపై ప్రభావం చూపుతుంది. గర్భిణులకు హాని చేస్తుంది. ► హాకార్బరిల్ పురుగు మందును పంటలకు ఒకసారి వేస్తే దాని ప్రభావం ఆ పంటపై దాదాపు 45 రోజులు ఉంటుంది. కూరగాయల పంటలపై ఈ పురుగు మందును చల్లితే ఎంత కడిగినా అది పోదు. అది మన శరీరాన్ని విషమయం చేస్తుంది. ► హాడయాజినాన్ కూడా పురుగుమందే. ఇది జీవజాతిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ► హాసోడియం సైనేడ్. ఇది సైనేడ్ అంత స్పీడ్‌గా జీవజాతిని నాశనం చేస్తుంది. ► హాఅలాగే ఫెనారిమోల్, ఫెన్తియాన్, లిను రాన్, ఎంఈఎంసీ, మిత్యాల్ పారతియాన్, తైమి టాన్, త్రైడిమార్ప్, ట్రిఫ్లురాలిన్, అలాక్లోర్, వైచ్ లార్వోస్, పోరేట్, పాస్పమిడాన్, త్రైయా జోఫాస్, త్రైక్లోర్ఫాన్లు ఉన్నాయి. -
జయాస్త్రం
చెన్నై, సాక్షి ప్రతినిధి: ‘ధిక్కారమున్ సైతునా’ అంటూ ముఖ్యమంత్రి జయలలిత ప్రతిపక్ష నేతలపై పరువునష్టం దావాలను సంధిస్తున్నారు. పార్టీ నేతలకే కాదు, పత్రికల వారికి సైతం పరువునష్టం కేసులు పంపుతున్నారు. అన్నాడీఎంకే పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శించినా, పథకాలను ఎద్దేవా చేసినా, వ్యక్తిగత విమర్శలకు పాల్పడినా పరువునష్టం కేసులు వేయడం జయకు పరిపాటి. ప్రతిపక్షాలన్న తరువాత విమర్శలు చేయడం మానవు, పరువునష్టం కేసులు దాఖలు చేయడం జయ మానరు. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) అధ్యక్షులు ఈవీకేస్ ఇళంగోవన్ ఇటీవల కలైంజర్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జయ ఆరోగ్యంపై విమర్శలు సంధించారు. దీంతో వెంటనే జయ పరోక్షంగా మంత్రి ఏడపట్టి పళనిస్వామి కేసుల వెంటపడ్డాయి. ఇళంగోవన్‌తోపాటూ కలైంజర్ టీవీ ఎండీ అమృతం, డెప్యూటీ ఎండీ కుమాయూన్, ఛీఫ్ రిపోర్టర్ డాయల్ ఆగష్టు 21న కోర్టులో హాజరుకావాల్సిందిగా మంగళవారం సమన్లు అందాయి. తమిళ పక్షపత్రిక సైతం జయ ఆరోగ్యంపై కథనాన్ని ప్రచురించగా పరువునష్టం దావా కేసులో ఆగష్టు 27న కోర్టుకు హాజరుకావాలని మంగళవారం సమన్లు అందుకున్నారు.తాజాగా స్వామిపై: ఇదిలా ఉండగా, భారతీయ జనతా పార్టీ నేత సుబ్రహ్మణ్య స్వామిపై పరువునష్టం దావా పడింది. ఈనెల 13వ తేదీన ఏక్షణంలోనైనా చికిత్స కోసం అమెరికాకు పయనం అవుతారు’ అంటూ స్వామి ట్వీట్ చేశారు.