కిగాలీ : విదేశాలకు రాకపోకలు నిర్వహించే ప్రయాణికులకు ముఖ్యగమనిక. తూర్పు ఆఫ్రికా దేశం రువాండాలో మార్‌బర్గ్ వైరస్‌లోని ‘బ్లీడింగ్ ఐ’ రకం వైరస్ సోకి 15 మంది మరణించారు. వందల మందికి సోకింది. దీంతో అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూహెచ్‌వో )..ఈ వైరస్ కూడా ఇతర వైరస్‌లా ప్రపంచమంతా విస్తరించకముందే నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది.
ఈ తరుణంలో అంతర్జాతీయంగా ప్రయాణాలు చేసే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రపంచంలోని 17 దేశాల్లోని ఈ వైరస్ ఆనవాళ్లు ఉన్నాయనే అంచనాలతో డబ్ల్యూహెచ్‌వో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేలా ఆయా దేశాల్ని అప్రమత్తం చేసింది.
మార్‌బర్గ్ వైరస్ అంటే
మార్‌బర్గ్ వైరస్ అంటే ఎబోలా కుటుంబానికి చెందిన ఒక రకమైన హెమరేజిక్ ఫీవర్ వైరస్‌నే. అడవుల్లో తిరిగే రౌసెట్టూస్ అనే గబ్బిలాలలో ఈ వైరస్ ఎక్కువగా ఆవాసం ఉంటుంది. ఈ వైరస్ మనుషుల్లో కనిపించడం ఇది తొలిసారేమీ కాదు. గతంలో ఈ వైరస్ పలు మార్లు వ్యాపించింది. తాజాగా, మరోసారి ఈ వైరస్ ఆనవాళ్లు వెలుగులోకి రావడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి.
It's 21 days with no active cases on the 42-day countdown to declaration of end of #Marburg outbreak. @WHO & partners continue to support ongoing 🇷🇼 govt efforts in the Marburg response, with focus on surveillance, IPC, recovered pt (survivor) program & continuity of services. pic.twitter.com/4aaziYd01p
— WHO Rwanda (@WHORwanda) November 30, 2024
Comments
Please login to add a commentAdd a comment