
బనశంకరి: బస్టాండ్‌లో పడి ఉన్న గోనె సంచిని ఓ మహిళ ఇంటికి తీసుకెళ్లగా అందులో నుంచి పసికందు బయట పడింది. ఈ ఘటన ఉత్తర కన్నడ జిల్లా శిరసి తాలూకాలో చోటు చేసుకుంది. తాలూకాలోని కోగిళికుళి గ్రామానికి చెందిన మాదేవి వ్యవసాయ కూలీ. రోజూలానే బుధవారం ఉదయం కూలీ పనులకు వెళ్తూ గౌడళ్లి సమీపంలోని ఖాన్‌నగర బస్టాండుకు వెళ్లగా గోనె సంచి కనిపించింది.ఎవరో మరిచిపోయి ఉంటారని భావించి ఇంటికి తీసుకెళ్లింది. సంచిని పరిశీలించగా రోజుల వయసున్న మగబిడ్డ కనిపించింది. పోలీసులు, శిరసి సహాయట్రస్ట్ అధ్యక్షుడు సతీశ్‌శెట్టి వచ్చి పరిశీలించి ఆస్పత్రికి తరలించారు. నాలుగు రోజుల క్రితం శిశువు జన్మించిందని, బరువు 1.6కిలోలు ఉందని, ఎడమచేయి, నడుములో లోపం ఉందని, ఆరువేళ్లు ఉన్నాయని గుర్తించారు. కార్వార పోలీసులు పసికందు తల్లిదండ్రుల కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment