
సాక్షి, హబ్లీ (కర్ణాటక) : కిమ్స్ ఆస్పత్రిలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. కాగా, అరుదైన శిశువు జన్మించింది. ఆదివారం మధ్యాహ్నం పురిటి నొప్పులతో ఓ మహిళ కిమ్స్ ఆస్పత్రిలో చేరింది. సిజేరియన్ ద్వారా కాన్పు చేశారు. అయితే శిశువు విచిత్ర ఆకారంలో ఉండటం చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. ఆ శిశువుకి నడుము కింద కేవలం ఓ కాలు మాత్రమే ఉంది. మిగతా ఎలాంటి భాగాలు లేవు.
దీంతో ఇప్పుడు ఈ సంఘటన ఆ ప్రాంతంలో వింతగా మారింది. ఆ బాలుడిని చూడటానికి ఆసుపత్రికి చాలా మంది చేరుకుంటున్నారు. అయితే, దీనికి కొన్ని జన్యుపరమైన లోపాల వలన శిశువు ఈ విధంగా జన్మించాడని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment