genitic problm
-
పాపం చిట్టితల్లి.. రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్ వస్తేనే వైద్యం
సాక్షి,దుమ్ముగూడెం(ఖమ్మం): బోసినవ్వులతో ఇంట్లో ఆడుకోవాల్సిన పసిపాప అరుదైన వ్యాధి బారిన పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. వేలల్లో ఒకరికి వచ్చే జన్యుసంబంధిత వ్యాధితో 14 నెలల ఎల్లెన్ వైద్యశాలలో చికిత్స పొందుతుండడం హృదయాలను కలిచివేస్తోంది. చికిత్సకు రూ.16కోట్లు అవసరమని వైద్యులు చెప్పగా.. అంత స్థోమత లేని పాప తల్లిదండ్రులు బరువెక్కిన హృదయాలతో బోరున విలపిస్తున్నారు. సహృదయం కలిగిన దాతలు ముందుకొస్తే తప్ప తమ పాపను దక్కదని వేడుకుంటున్నారు. సత్వర వైద్యం అందకపోతే.. దుమ్ముగూడెం మండలంలోని రేగుబల్లి గ్రామానికి చెందిన రాయపూడి ప్రవీణ్ – స్టెల్లా దంపతులు నిరుపేద కుటుంబానికి చెందిన వారు. ప్రవీణ్ ప్రైవేట్ మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వీరికి 2018లో వివాహం కాగా 14నెలల ఎల్లెన్ పాప ఉంది. పాప నాలుగో నెల నుంచి మెడ భాగం పటిష్టంగా లేకపోవడం, కిందకు వాలిపోతుండడాన్ని తల్లిదండ్రులు గమనించారు. నెలలు గడుస్తున్నా శరీర భాగాల్లో కదలికలు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన వారు విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. అయినా ఏమీ తెలియకపోవడంతో జన్యుసంబంధిత సమస్యగా అనుమానిస్తూ మరో రెండు పరీక్షలు నిర్వహించారు. అయినా చిన్నారి సమస్య బహిర్గతం కాలేదు. రోజురోజుకూ చిన్నారి కదల్లేని పరిస్థితికి చేరుతుండడంతో తల్లిదండ్రులు చెన్నైలోని వేలూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. తమ స్థోమతకు మించి అప్పులు చేసి గత ఏడాది డిసెంబర్ 7న జెనెటిక్ పరీక్షలు చేయిస్తే ఈ నెల 10న రిపోర్టులు వచ్చాయి. ఈ నివేదిక ఆధారంగా ఎల్లెన్ జన్యుసంబందిత వ్యాధితో బాధపడుతోందని.. నరాలు, కండరాలు బలహీనంగా అయ్యాయని వైద్యులు వెల్లడించారు. సత్వర వైద్యం అందకపోతే భవిష్యత్ ప్రశ్నార్థకమేనని చెప్పడం... రానురాను చిన్నారి శరీర భాగాల్లో కదలికలు తగ్గుతుండడంతో తల్లిదండ్రులు దిగాలు చెందుతున్నారు. ప్రస్తుతం రోజుకు చిన్నారి మందులు, చికిత్స కోసం రూ.25వేల వరకు ఖర్చు అవుతుండగా ఆ తల్లిదండ్రులు పడుతున్న బాధ వర్ణనాతీతం. రూ.కోట్లల్లో ఖర్చు... చిన్నారి ఎల్లెన్‌కు నిర్వహించిన పరీక్షలలో జన్యుసంబంధిత వ్యాధిగా నిర్ధారించారు. అయితే, ఈ వ్యాధికి చికిత్స చేయించాలంటే రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్ (జోల్జెన్స్మా)ను అమెరికా నుంచి తెప్పించాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబ పరిస్థితిల్లో ఇంత ఖర్చు అంటే సాధారణ విషయం కాదు. ప్రస్తుతం చేస్తున్న వైద్యం అంతా తాత్కాలికమేనని వైద్యులు సూచించారు. ఈ మేరకు ప్రభుత్వం, దాతలు ముందుకు వచ్చి చిన్నారి ఎల్లెన్‌కు ప్రాణభిక్ష పెట్టాలని ఆమె తల్లిదండ్రులు ప్రవీణ్ – స్టెల్లా కోరుతున్నారు. కాగా, ఎల్లెన్‌కు ప్రస్తుతం విజయవాడలోని రెయిన్బో ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఆమె చికిత్స కోసం సాయం చేయాలనుకునే దాతలు 99085 89604 నంబర్లో సంప్రదించాలని ప్రవీణ్ కోరారు. చదవండి: అంగన్వాడీల్లో గుడ్డు వెరీబ్యాడ్ -
Karnataka: కిమ్స్‌లో వింత శిశువు జననం..
సాక్షి, హబ్లీ (కర్ణాటక) : కిమ్స్ ఆస్పత్రిలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. కాగా, అరుదైన శిశువు జన్మించింది. ఆదివారం మధ్యాహ్నం పురిటి నొప్పులతో ఓ మహిళ కిమ్స్ ఆస్పత్రిలో చేరింది. సిజేరియన్ ద్వారా కాన్పు చేశారు. అయితే శిశువు విచిత్ర ఆకారంలో ఉండటం చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. ఆ శిశువుకి నడుము కింద కేవలం ఓ కాలు మాత్రమే ఉంది. మిగతా ఎలాంటి భాగాలు లేవు. దీంతో ఇప్పుడు ఈ సంఘటన ఆ ప్రాంతంలో వింతగా మారింది. ఆ బాలుడిని చూడటానికి ఆసుపత్రికి చాలా మంది చేరుకుంటున్నారు. అయితే, దీనికి కొన్ని జన్యుపరమైన లోపాల వలన శిశువు ఈ విధంగా జన్మించాడని తెలిపారు. -
ఆమె... దశాబ్దం తర్వాత అతడయ్యాడు
ముస్తాబాద్: అందమైన చిరునవ్వు.. అంతే అందమైన పేరు.. మానస. అందరు పిల్లల్లాగే పెరిగి పెద్దవుతున్న కొద్దీ మానసలో కొన్ని అసహజ మార్పులు..! ఆందోళన చెందిన తల్లిదండ్రులు వైద్యులకు చూపించగా... ఆమెలో పురుష లక్షణాలున్నాయని చెప్పారు. కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ వైద్యుడు చింతోజు శంకర్‌ను సంప్రదించగా ఆయన శస్త్రచికిత్స నిర్వహించి మానసను మనోజ్‌గా మార్చారు. వివరాలివీ.. మెదక్ జిల్లా సిద్దిపేటకు చెందిన గవ్వల రాజు, లావణ్య కూతురు మానస(11). వీరు ఉపాధి కోసం నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో స్థిరపడ్డారు. మానస అక్కడే ఓ ప్రైవేట్ స్కూల్లో ఐదో తరగతి చదువుతోంది. ఆమె పుట్టినప్పుడు కొంత పురుష అవయవాలతో జన్మించగా.. దానిని తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు. మానస జన్మించినప్పుడు వృషణాలు పొత్తికడుపులో ఉండడంతో గమనించలేదు. స్త్రీ మర్మావయాలు కొంతమేరకు ఉండడంతో ఆమ్మాయిగానే భావించారు. అందరు ఆడపిల్లల్లాగే పెంచారు. ఇటీవల ఆమెలో పురుష లక్షణాలు కనిపిస్తుండటంతో గమనించిన తల్లిదండ్రులు కరీంనగర్, హైదరాబాద్‌లోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చూపించారు. మానసలో పురుష లక్షణాలు ఉన్నాయని, గర్భాశయం, అండాశయం లేవని వైద్యులు తేల్చారు. కానీ, శస్త్రచికిత్స చేసేందుకు వైద్యులు ముందుకు రాలేదు. రెండు నెలల క్రితం ఎల్లారెడ్డిపేట మండలం వీర్నపల్లికి చెందిన కొర్రె వేణుకు స్త్రీ, పురుష జననాంగాలు ఉండగా, జిల్లాలోని ముస్తాబాద్‌లోని పీపుల్స్ హాస్పిటల్లో డాక్టర్ చింతోజు శంకర్ శస్త్రచికిత్స చేసి సరిచేశారని ‘సాక్షి’ లో వచ్చిన కథనం చూసిన మానస తండ్రి గవ్వల రాజు... డాక్టర్ శంకర్‌ను సంప్రదించాడు. బైలాటరల్ ఆర్కిటోపెక్సీగా పిలిచే అరుదైన కేసు అని డాక్టర్ శంకర్ పేర్కొన్నారు. గర్భంలో ఉన్నప్పుడు వైక్రోమోజోం సరిగా ఎదగకపోవడంతో జెనెటిక్ సమస్య వచ్చిందన్నారు. మానసలో టెస్టోస్టిరాన్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని, శస్త్రచికిత్స ద్వారా మూత్రనాళం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కొద్దిరోజుల్లోనే కోలుకుంటుందని తెలిపారు. శస్త్రచికిత్సతో మానస జీవితం మారిపోయిందని, ఆమెను మనోజ్‌గా పిలుచుకుంటామని తల్లిదండ్రులు పేర్కొన్నారు.