
ప్రతీకాత్మక చిత్రం
హుబ్లీ(బెంగళూరు): కన్నబిడ్డ లోపాలతో పుట్టిందని స్వయాన కన్నతల్లి ఆ చిన్నారిని పై నుంచి కిందపడేసి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు లాక్కెళ్లారని నాటకమాడింది. పోలీసులు కూపీ లాగడంతో కిడ్నాప్ వెనుకున్న అసలు విషయం వెల్లడైంది. జిల్లాలోని కుందగోళ నెహ్రూనగర్‌కు చెందిన సల్మాషేక్ ఇటీవల 40 రోజుల పసిబిడ్డను ఆస్పత్రికి తీసుకువచ్చింది. బిడ్డను వదిలించుకోవడానికి పైనుంచి కిందపడేసి ఎవరో లాక్కెళ్లారని నాటకం ఆడింది. బిడ్డ గడ్డిపై పడటంతో ఏమీ గాయాలు కాలేదు. పోలీసులు సల్మాషేక్‌ను విచారించి అసలు విషయం వెల్లడించారు. ప్రస్తుతం తల్లీ బిడ్డ విమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.
మరో ఘటనలో..
బైక్, లారీ ఢీ, యువకుడి మృతి
బళ్లారి రూరల్: బళ్లారి జిల్లా కుడితిని బైపాస్‌లో బైక్‌ను లారీ ఢీ కొనడంతో యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం ఉదయం జరిగింది. కుడితిని పోలీసుల వివరాలు... ఆంధ్రప్రదేశ్ కర్నూలుకు చెందిన లేపాక్షిరెడ్డి జిందాల్‌లో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నాడు. కుడితినిలో రూము తీసుకొని ఉంటున్నాడు. గురువారం ఉదయం తన బైక్‌పై కుడితిని బైపాస్‌లో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. తీవ్ర గాయాలతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment