hubli
-
‘నాకు వేరే దారిలేదు’.. విషం తాగుతూ సెల్ఫీ వీడియో
హుబ్లీ(బెంగళూరు): గతంలో అప్పు అంటే భయపడేవాళ్లు. కానీ ప్రస్తుత సమాజంలో అప్పు తీసుకోవడం సర్వ సాధరాణమైపోయింది. మధ్య తరగతి నుంచి లక్షలు సంపాదించే ఐటీ నిపుణులు కూడా అప్పు తీసుకుంటున్నావారే. అయితే ఇలా అప్పు తీసుకుంటున్న వీరిలో కొంతమంది ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఖర్చు పెడుతూ ఇబ్బందులు పాలవుతుండగా, మరికొందరు ఆరోగ్యం కోసమో, లేదా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నారు. అనంతరం చేసిన అప్పుకు వడ్డీతో కలిపి చెల్లించేందుకు నానాతంటాలు పడుతూ చివరికి ఆత్మహత్య చేసుకుంటూ నూరేళ్లు జీవితానికి మధ్యలో ఫుల్స్టాప్ పెడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి అప్పులు తీర్చే మార్గం కనిపించక ఓ విషం తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ధార్వాడ చైతన్య నగరంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు... చైతన్య నగర లింగరాజ సిద్దప్పన్నవర (36) ఓ వ్యక్తి వద్ద రూ. 10 లక్షలు అప్పు తెచ్చాడు. అప్పునకు సంబంధించి రూ. 18 లక్షల వడ్డీని చెల్లించాడు. అప్పు తీరకపోగా ఇంటిని కుదువ పెట్టాలని సదరు వ్యక్తి వేధించాడని ఆ వీడియోలో ‘ఎంత కష్టపడిన అప్పు తీర్చలేకపోతన్న.. నాకు వేరే దారిలేదంటూ’ తన ఆవేదనతో చెబుతూ లింగరాజు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ధార్వాడ ఉపనగర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. చదవండి : 5 కోట్లు గెలిచి 58 కోట్లు పోగొట్టుకున్న అభాగ్యుడు.. -
పేద విద్యార్థికి సాయం.. కేఎల్ రాహుల్ మంచి మనసు
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ఒక పేద విద్యార్థికి సహాయం చేసి తన పెద్ద మనసు చాటుకున్నాడు. విషయంలోకి వెళితే.. హుబ్బళ్లి పరిధిలోని మహాలింగపురకు చెందిన అమృత్ మావినకట్టి అనే విద్యార్థి పీయూసీలో 600కు గాను 571 మార్కులు సాధించాడు. పై చదువులకు డబ్బులు లేక, దాతల కోసం ప్రయత్నించాడు. ఈ క్రమంలో హుబ్బళ్లికి చెందిన నితిన్ అనే వ్యక్తి అమృత్‌ను ఓ ప్రైవేట్ కాలేజీలో చేర్చేందుకు ప్రయత్నించారు. బీకాంతో పాటు సీఏ కోర్సులో చేరేందుకు ఏడాదికి రూ.85 వేలు చెల్లించాల్సి ఉంది. దీంతో నితిన్ తన స్నేహితుడు అక్షయ్ సాయం కోరాడు. కేఎల్ రాహుల్‌కు మిత్రుడైన అక్షయ్ విద్యార్థి సమస్యను ఆయనకు వివరించారు. వెంటనే స్పందించిన రాహుల్.. ఫీజులతో పాటు పుస్తకాల కొనుగోలు, ఇతర అవసరాలకు సరిపడా డబ్బులను నేరుగా విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేశాడు. కేఎల్ రాహుల్ సాయం తనకు అందిందని.. అతని అండతో ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానంలో నిలవడానికి ప్రయత్నిస్తానని విద్యార్థి అమృత్ పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్ ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2023లో ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో రాహుల్ సీజన్ మధ్యలోనే వైదొలిగాడు. అదే నెలలో బీసీసీఐ అనుమతితో భార్య అతియా శెట్టితో కలిసి జర్మనీకి వెళ్లిన కేఎల్ రాహుల్ మోకాలి సర్జరీ చేయించుకున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలో రీహాబిటేషన్‌లో ఉన్న అతను ఎప్పుడు మళ్లీ క్రికెట్లోకి అడుగుపెడతాడనేది క్లారిటీ లేదు. అయితే అక్టోబర్ -నవంబర్‌లో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌కు కేఎల్ రాహుల్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. KL Rahul has financially helped a deserving (95%) student named Amrut Mavinkatti, who lost his mother from Mahalingapura to study B. Com at Hubballi’s KLE College through Akshay Sir. Man With Golden Heart @KLRahul 🥺❤ pic.twitter.com/6xcT9pEsx6 — KLRAHUL TRENDS™ (@KLRahulTrends_) June 11, 2023 చదవండి: కోహ్లి అలా చేస్తాడని అస్సలు ఊహించలేదు.. అది అతడికే తెలియాలి: గంగూలీ -
అది ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వేస్టేషన్.. ఒక సీక్రెట్ ప్లాట్ఫారం కూడా!
భూమిపై నడిచే ప్రజారవాణా వ్యవస్థలలో రైలు అత్యంత చౌకైన ప్రయాణ సాధనమని చెప్పుకోవచ్చు. ఇది ప్రయాణాలకు ఎంతో సౌలభ్యకరమైనదని కూడా అంటారు. అయితే రైలులో ప్రయాణించేందుకు రైల్వే స్టేషన్ వెళ్లాల్సివుంటుందనే సంగతి మనకు తెలిసిందే. స్టేషన్లలోని ప్లాట్‌ఫారాల వద్దకు వచ్చి రైళ్లు ఆగుతుంటాయి. అప్పుడు ప్రయాణికులు రైలులోకి ఎక్కుతుంటారు. అయితే ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్లాట్ఫారం విషయానికొస్తే అది మన దేశంలోనే ఉంది. కర్నాటకలోని హుబ్లీ రైల్వేస్టేషన్ (Hubballi Railway Station)లోని ప్లాట్ఫారం నంబరు-8 ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫారం. దీని పొడవు 1507 మీటర్లు. ఇక అతిపెద్ద రైల్వే స్టేషన్ విషయానికొస్తే హౌరా జంక్షన్ ముందు వరుసలో ఉంటుంది. ఈ స్టేషన్లో మొత్తం 26 ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. అయితే ప్రపంచంలోనే అత్యంత పెద్ద రైల్వేస్టేషన్ ఎక్కడుందో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాలోని న్యూయార్క్ సిటీలోని గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ (Grand Central Terminal) రైల్వేస్టేషన్ ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వేస్టేషన్. దీని నిర్మాణం 1903 నుంచి 1913 మధ్యకాలంలో జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ రైల్వేస్టేషన్లో మొత్తం 44 ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. ఈ రైల్వేస్టేషన్లో రెండు అండర్గగ్రౌండ్ లెవెల్స్ ఉన్నాయి. దీనిలోని పైలెవెల్లో 41 ట్రాకులు, కింది లెవెల్లో 26 ట్రాకులు ఉన్నాయి. ఈ స్టేషన్ మొత్తం 48 ఎకరాల్లో నిర్మితమయ్యింది. ఈ స్టేషన్ మీదుగా ప్రతీరోజు మొత్తం 660 మెట్రో నార్త్ ట్రైన్స్ నడుస్తాయి. లక్షా 25వేల మందికి మించిన ప్రయాణికులు ప్రతీరోజూ ఈ రైళ్లలో ప్రయాణిస్తారు. ఈ రైల్వే టెర్మినల్‌లో ఒక సీక్రెట్ ప్లాట్ఫారం కూడా ఉంది.అది Waldorf Astoria హోటల్‌కు సరిగ్గా దిగువన ఉంది. నాటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డీ రూజ్వెల్డ్ ఈ ప్లాట్ఫారం వినియోగించేవారని చెబుతారు. హోటల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆయన దీనిని వినియోగించేవారట. ఈ సీక్రెట్ ప్లాట్ఫారం రెగ్యులర్ సర్వీసుల కోసం వినియోగించకపోవడం విశేషం. -
Karnataka assembly elections 2023: టికెటివ్వకుంటే పాతిక సీట్లు గోవిందా
హుబ్బళ్లి(కర్ణాటక): కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత జగదీశ్ షెట్టార్ ధిక్కారస్వరం వినిపించారు. ‘హూబ్లీ–ధార్వాద్ సెంట్రల్ టికెట్ నాకివ్వాల్సిందే. లేదంటే ఈసారి ఎన్నికల్లో పార్టీ 20 నుంచి 25 స్థానాల్లో ఓటమిని చవిచూస్తుంది’ అని షెట్టార్ శనివారం వ్యాఖ్యానించారు. నవ తరం, యువ నాయకత్వానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో బీజేపీ అధిష్టానం పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి పోటీచేయొద్దని సూచించింది. అలా షెట్టార్‌కు ఢిల్లీ నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. దీనిని బేభాతరు చేస్తూ ధిక్కార స్వరం వినిపించారు. దీంతో ఆయనను బుజ్జగించేందుకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి హుబ్బళ్లికి వచ్చి షెట్టార్తో మంతనాలు జరిపారు. అయినా సరే వినని షెట్టార్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘ సిట్టింగ్‌లను పక్కనబెడితే ఆ నిర్ణయం ఎన్నికల ఫలితాలపై ప్రతికూల ప్రభావం పడకూడదు. ఒకవేళ పడితే అది ఆ ఒక్క స్థానానికే పరిమితం కాదు. ఉత్తర కర్ణాటకలో కనీసం 20–25 స్థానాల్లో ఓడిపోయే ప్రమాదముంది. ఈ మాట గతంలో మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కూడా చెప్పారు. వేచి చూస్తా. నాకు టికెట్ ఇవ్వకుంటే తదుపరి కార్యాచరణపై ఆలోచిస్తా’ అని అన్నారు. -
పిట్‌బుల్ బీభత్సం.. పరారీలో కుక్క యజమాని
సాక్షి, బెంగళూరు: మనదేశంలో నిషేధించిన పిట్‌బుల్ జాతి కుక్క బాలునిపై పడి కరిచింది. టూషన్‌కు వెళుతున్న విద్యార్థిని కరవడంతో కిమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. హుబ్లీ బంకాపుర చౌక్ వద్ద పాటిల్ గల్లీలో జరిగిన ఘటనలో పవన్ అనిల్ దొడ్డమని (12) అనే బాలునికి తీవ్రగాయాలు అయ్యాయి. గురుసిద్దప్ప చెన్నోజీ అనే వ్యక్తికి చెందిన కుక్క కాంపౌండ్ నుంచి ఎగిరి వచ్చి బాలుని మీద దాడి చేసిందని బెణ్ణిగేరి పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటనతో సదరు కుక్క యజమాని కుక్కను తీసుకుని కుటుంబంతో సహా ఇళ్లు విడిచి పరారయ్యాడు. ఇతడు మాజీ కార్పొరేటర్ బంధువు అని చెబుతున్నారు. పిట్‌బుల్ జాతి కుక్కలు ఉద్రేకమైనవని, ఉట్టి పుణ్యానికే జనం మీద పడి కరుస్తాయని పేరుంది. దీంతో భారత ప్రభుత్వం వీటి పెంపకాన్ని నిషేధించింది. అయినప్పటికీ కొందరు దొంగచాటుగా వీటిని పెంచుకోవడం జరుగుతోంది. అమెరికా వంటి విదేశాల నుంచి ఈ కుక్కలను గతంలో దిగుమతి చేసుకున్నారు. జంట నగరాల్లో కుక్కల గోల కాగా హుబ్లీ–ధార్వాడ జంట నగరాలలో కుక్కల బెడద ఎక్కువైంది. కిమ్స్ ఆస్పత్రిలో నమోదవుతున్న కేసులే దీనికి రుజువు. ఈ మధ్యకాలంలో కుక్కలు కొరికి వ్యాక్సిన్ వేసుకున్న వారు 750 మంది వరకూ ఉన్నారు. ఈ కేసులన్నీ హుబ్లీ నగరానికే చెందినవి. నిత్యం ఐదారు మందికి పైగా కుక్కల బారినపడి కిమ్స్‌కు వస్తున్నారు. ముఖ్యంగా హుబ్లీలోని బంకాపుర చౌక్ సెటిల్మెంట్ ప్రదేశం, పాతహుబ్లీ, గణేష్ పేట, ఆనంద్నగర, తదితర చోట్ల వీధి శునకాల బెడద అధికంగా ఉంది. కొప్పికర్ రోడ్డు ఇటీవల యువకులపై కుక్క దాడి చేసింది. ఆ వెనువెంటనే బంకాపుర్ చౌక్ పాటిల్ గల్లీలో మరో ఘటన జరిగింది. చదవండి: (అందరి చూపు సుప్రీం వైపు.. సరిహద్దుల్లో భారీగా బలగాలు) త్వరలో నియంత్రణ చర్యలు కార్పొరేషన్ ప్రధాన వైద్యాధికారి డాక్టర్.శ్రీధర్ దండెప్పనవర మాట్లాడుతూ కుక్కల నియంత్రణకు కృషి చేస్తున్నాము. ఆ మేరకు టెండర్లును పిలిచాము. రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కుక్కలను పట్టుకొని సంతాన రహిత ఆపరేషన్లను చేస్తామని చెప్పారు. -
యువ రైతులకు దొరకని కన్యలు
సాక్షి, బెంగళూరు: రైతు అనే కారణంతో ఎక్కడా పెళ్లి చేసుకునేందుకు వధువు దొరకడం లేదని యువ రైతులు తహసీల్దార్ వద్ద తమ ఆవేదనను వ్యక్తం చేసిన ఘటన ధార్వాడ జిల్లా కుందగోళ తాలూకా హొసళ్లి గ్రామంలో జరిగింది. రైతు దేశానికి వెన్నెముక అంటారు. అలాంటి రైతుకే పెళ్లి చేసుకోవడానికి కన్యలు దొరకని పరిస్థితి దాపురించిందని యువ రైతులు తహసీల్దార్ ఎదుట వాపోయారు. రైతుల ఇంటిలో పనులు ఎక్కువగా ఉంటాయని, ఎండకు వానకు శ్రమించాల్సి వస్తుందని, పైగా వ్యవసాయం జూదంలా మారిందని రైతులకు తమ ఆడపిల్లలను ఇవ్వడానికి అమ్మాయిల తల్లిదండ్రులు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో యువ రైతులు ఆడపిల్లలు దొరక్క ఎంతో ఆవేదన చెందుతున్నారని వారు తహసీల్దార్ గ్రామ బస వేళ వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ వినతి పత్రంపై ఇప్పడు అందరి దృష్టి మళ్లింది. హొసళ్లి గ్రామంలో జరిగిన తహసీల్దార్ గ్రామ బస కార్యక్రమంలో యువ రైతులు దేశానికి అన్నం పెట్టడానికి రైతులు కావాలి, అలాంటి యువ రైతులకు కన్యను ఇవ్వడానికి జనం నిరాసక్తి చూపుతున్నారని, ఉద్యోగం ఉంటే పిల్లను ఇస్తామంటున్నారన్నారు. అలాంటప్పుడు రైతు పిల్లలు రైతులు కావాలా, వద్దా? అని నిలదీశారు. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి సారించి జనజాగృతి కార్యక్రమం చేపట్టాలని కుందగోళ తహసీల్దార్ అశోక్ శిగ్గాంవి ద్వారా ప్రభుత్వానికి వినతిపత్రాన్ని సమర్పించారు. చదవండి: (Hyderabad-Constable: ఈశ్వర్ లీలలు ఎన్నెన్నో..!) -
'అప్పటి వరకు ఇబ్బందులు తప్పవు.. రాబోయే రోజుల్లో మరిన్ని చావులు'
హుబ్లీ: కార్తీకమాసం నుంచి ఉగాది వరకు రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు తప్పవని ధార్వాడలో కోడి శ్రీ మఠం స్వామీజీ జోస్యం చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది చివరి వరకు, ఆ తర్వాత కూడా అశుభాలే ఉంటాయన్నారు. గాలి వానలు, భుకంపాలు, అగ్నిప్రమాదాలు, చావులు వంటివి పెరుగుతాయన్నారు. రోగాలతో జీవరాశులు మృత్యువాత పడుతాయన్నారు. రాజకీయ అస్థిరత ఉంటుందని, అన్ని పార్టీలు విడిపోయే లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. మూడు పార్టీల్లో చిలికలు తప్పవన్నారు.తాను ఏ వ్యక్తినీ ఉద్దేశించి చెప్పడం లేదని, తాను సన్యాసినని పేర్కొన్నారు. వర్షాలు ఇలాగే కొనసాగుతాయని, రబీ పంటలు అన్నదాతకు చేతికందుతాయన్నారు. చదవండి: (బీకాం విద్యార్థిని ఆత్మహత్య.. తల్లిదండ్రుల మాటలే..) -
మరిది చేతిలో వదిన హతం.. వివాహేతర సంబంధమే కారణమా?
హుబ్లీ (బెంగళూరు): మరిది చేతిలో వదిన దారుణ హత్యకు గురైన ఘటన జిల్లాలోని కుందగోళ తాలూకా ఏరినారాయణపుర గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. హతురాలు సునంద మెణసినకాయి కాగా నిందితుడిని మంజునాథగా గుర్తించారు. కుటుంబ కలహాలు తీవ్ర స్థాయికి చేరడంతో ఈ హత్య జరిగిందని తెలుస్తోంది. కొడవలితో పట్టపగలే హత్య జరగడంతో గ్రామంలో భయాందోళనకర పరిస్థితి తలెత్తింది. కుందగోళ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. వివాహేతర సంబంధమా? మరేదైనా కారణమా అన్న కోణంలో హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. చదవండి: (నగల వ్యాపారి హనీట్రాప్‌లో కొత్త ట్విస్ట్) -
సరళ వాస్తు గురూజీ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి..
హుబ్లీ: రాష్ట్రంతో పాటు ముంబై తదితర ప్రాంతాల్లో సరళ వాస్తు గురూజీగా పేరొందిన చంద్రశేఖర్ గురూజీ దారుణ హత్య రాష్ట్రంలో కలకలం సృష్టించింది. మంగళవారం హుబ్లీలో ప్రెసిడెంట్ హోటల్లో ఆయనను శిష్యులు మహంతేష్, మంజునాథ్ కత్తులతో పొడిచి చంపడం తెలిసిందే. పోలీసులు దర్యాప్తులో అనేక విషయాలు వెలుగుచూశాయి. స్థిరాస్తుల విషయంలో నిందితులు, ఎంతో కాలంగా విశ్వాసంగా ఉన్న మహంతేష్ దంపతులతో గురూజీకి ఆస్తుల గురించి వివాదం తలెత్తింది. ఇటీవల మహంతేష్ ఆస్తులను అమ్మగా రూ. 5 కోట్లు వచ్చిందని తెలిసింది. ఆ రూ.5 కోట్ల మొత్తం తిరిగి ఇవ్వాలని మహంతేష్‌ను గురూజీ ఒత్తిడి చేశాడని, ఇదే హత్యకు కారణమైందని పోలీసులు అనుమానిస్తున్నారు. తన శిష్యులను బినామీ ఆస్తులకు వారసులుగా పెట్టడమే స్వామీజీ చేసిన పెద్ద తప్పు అని తెలుస్తోంది. ముఖ్యంగా ముంబైలో సరళవాస్తు కార్యాలయం పూర్తి బాధ్యతలను మహంతేష్ చూసేవాడు. మరో నిందితుడు మంజునాథ్‌ను కూడా పోలీసులు తీవ్రంగా విచారణ చేస్తున్నారు. హుబ్లీలో ఇద్దరినీ ఒకే చోట ఉంచి తమదైన శైలిలో నిజాలు రాబట్టేందుకు విచారణ చేస్తున్నారు. గురూజీ హత్య తనకెంతో బాధ కలిగించిందని జిల్లా ఇన్చార్జి మంత్రి శంకర్ పాటిల్ మునేనకొప్ప తెలిపారు. చదవండి: (సరళ వాస్తు గురూజీ దారుణ హత్య.. కాళ్లు మొక్కుతున్నట్లు నటించి) నా భర్తకు శిక్ష పడాలి – నిందితుడు మహంతేష్ భార్య గురూజీని హత్య చేయడం తన భర్త మహంతేష్ చేసిన ఘోరమని నిందితుని భార్య వనజాక్షి తెలిపారు. చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. భర్త అకృత్యం వల్ల తాను పోలీసు స్టేషన్‌కు రావాల్సి వచ్చిందన్నారు. విచారణ జరిపిన తర్వాత తనను ఇంటికి పంపించారన్నారు. తన పిల్లలతో కలిసి జీవిస్తానని, చేసిన పాపాన్ని భర్త అనుభవించక తప్పదన్నారు. ఇలాంటి దారుణానికి పాల్పడతారని తాను ఊహించలేదు, ఇంత దారుణంగా చంపేంత ద్వేషం ఏముందో తెలియదని ఆమె అన్నారు. అయితే తన పేరున మాత్రం గురూజీ ఎలాంటి ఆస్తులు చేయలేదన్నారు. తన భర్త పేరిట ఆస్తులు చేసిన విషయం కూడా తనకు తెలియదన్నారు. ఇప్పటికీ తాను కొన్న ఫ్లాట్‌కు వాయిదాల ద్వారా డబ్బులు చెల్లిస్తున్నానన్నారు. తామిద్దరూ పని చేస్తున్న సందర్భంలోనే గురూజీ విశాల హృదయంలో తమ పెళ్లి చేశారన్నారు. తన స్వంత పిల్లల్లా తమని చూశారని తెలిపారు. -
సరళ వాస్తు గురూజీ దారుణ హత్య.. కాళ్లు మొక్కుతున్నట్లు నటించి
హుబ్లీ (కర్ణాటక): సరళవాస్తు ద్వారా రాష్ట్రంతో పాటు పలు రాష్ట్రాల్లో ఖ్యాతి పొందిన చంద్రశేఖర్ గురూజీ మంగళవారం పట్టపగలు దారుణ హత్యకు గురయ్యారు. హుబ్లీ ప్రెసిడెంట్ హోటల్లో ఈ దారుణం జరిగింది. ఆయన శిష్యులే ఈ ఘాతుకానికి పాల్పడడంతో గురువుకే వాస్తు దోషం కలిగిందా? అన్న ప్రశ్న తలెత్తింది. కాళ్లు మొక్కుతున్నట్లు నటించి చంద్రశేఖర్ దగ్గర పని చేస్తున్న మహంతేష్ శిరూర్, మంజునాథలను నిందితులుగా గుర్తించారు. వీరిలో గురూజీకి ఒకరు కాళ్లకు మొక్కుతున్నట్లుగా నటించగా, మరొకరు చాకుతో పొడిచాడు. కిందకు పడినా కూడా వదలకుండా సుమారు 40 సార్లకు పైగా కత్తితో పొడిచి హోటల్ నుంచి తప్పించుకున్నారు. పోలీసులు వెంటాడి బెళగావి జిల్లా రామదుర్గ వద్ద ఈ ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. హత్య జరిగిన 4 గంటల్లోనే నిందితులు పట్టుబడ్డారు. హుబ్లీ పోలీస్ కమిషనర్ లాభురాం మాట్లాడుతూ గురూజీ ప్రెసిడెంట్ హోటల్లో బస చేశారు. ఇద్దరు వ్యక్తులు వచ్చారని తెలిసి వారిని కలవడానికి లాబీలోకి వచ్చారు. ఈ సమయంలో కత్తితో దాడి చేసి పరారయ్యారు అని చెప్పారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. హత్య దృశ్యాలు హోటల్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. నిందితులు మంజునాథ, మహంతేష్ ఆస్తి వివాదమే కారణమా? హత్యకు ఆస్తి వివాదమే కారణమని చెబుతున్నారు. చంద్రశేఖర్ గురూజీ శిష్యుల పేరిట బినామీ ఆస్తులు పెట్టారని, నిందితుడు మహంతేష్ పేరున కోట్లాది రూపాయల ఆస్తి చేశారని చెబుతున్నారు. ఉద్యోగం నుంచి తొలగించాక తన ఆస్తిని తిరిగి ఇచ్చేయాలని గురూజీ ఒత్తిడి చేసేవాడు. అయితే తిరిగి ఇవ్వడం కుదరదని మహంతేష్ తెగేసి చెప్పాడు. ఇదే విషయమై మాట్లాడడానికి హోటల్‌కు వచ్చి ఆయన్ను హత్య చేశారు. కాగా చంద్రశేఖర్ గురూజీ అంత్యక్రియలు సుళ్య గ్రామంలో బుధవారం నెరవేరనున్నాయి. అత్యంత ప్రజాదరణ సొంతం సరళ్ వాస్తు సూత్రాలతో గురూజీ ప్రసిద్ధి చెందారు. అనేక టీవీ చానెళ్లలో నిత్యం కనిపిస్తూ ఉండేవారు. సరళమైన జీవనం గురించి ఉపన్యాసాలిస్తుంటారు. యూట్యూబ్‌లో ఆయన వీడియోలకు లక్షలాది వ్యూస్ రావడం బట్టి ఆయన ప్రజాదరణ ఏమిటో అర్థమవుతుంది. గురూజీ వయసు గురించి ఎప్పుడూ చెప్పేవారు కాదు. సుమారు 55 ఏళ్లకు పైగా వయసు ఉంటుందని అంచనా. ఆయన స్వస్థలం బాగల్‌కోట జిల్లా. తల్లి పేరు నీలమ్మ అంగడి. భార్య, కుటుంబ విషయాలు గుట్టుగా ఉంచారు. చదవండి: (టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ ఎడిటర్ కన్నుమూత) -
Intercity Express Train: పట్టాలెక్కని పేదోడి రైలు
రాజంపేట: ఉమ్మడి వైఎస్సార్ జిల్లా వాసులకు తక్కువ ధరతో గమ్యాలను చేర్చే రైలుగా ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణికుల ఆదరణ దక్కించుకుంది. అలాంటి రైలిప్పుడు జిల్లా ప్రయాణికులకు దూరమయ్యేలా రైల్వేశాఖ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 57273/57274 నంబర్లతో కాకినాడ–తిరుపతి–హుబ్లీ (ఇంటర్సిటీ రైలు) ఉభయ జిల్లాల మీదుగా నడిచింది. అలాగే సీమవాసులు కోస్తా కారిడార్ ప్రయాణానికి ఈ రైలు అందుబాటులో ఉండేది. అన్ని వర్గాల ప్రజల ప్రయాణానికి అనుకూలంగా ఉన్న రైలును ఫస్ట్‌వేవ్ కరోనా సమయంలో రద్దు చేశారు. ఆ తర్వాత పునరుద్ధరణ విషయాన్ని పట్టించుకోలేదు. రెండు రాష్ట్రాల యాత్రికులకు సౌకర్యంగా.. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ జిల్లాలైన అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలకు చెందిన యాత్రికులతోపాటు కర్ణాటక రాష్ట్రానికి చెందిన యాత్రికులకు సౌకర్యంగా ఈ రైలు నడిచింది. తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తక్కువ ధరతో టికెట్ తీసుకొని ప్రయాణించే యాత్రికులపై రైల్వేబోర్డు శీతకన్ను వేసిందనే అపవాదును మూటకట్టుకుంది. సీమ జిల్లాలో పేద ప్రయాణికుల ఆదరణ పొందిన ఏకైక రైలు ఇంటర్సిటీ అని చెప్పుకోవచ్చు. ప్రజాసౌకర్యం కన్నా ఆదాయమే ప్రధానం అన్న విధంగా ఎన్డీఏ సర్కారు వ్యవహరిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. చదవండి: (CM YS Jagan: ఆదోని పర్యటనకు సీఎం జగన్) ఇంటర్ సిటీ దరిచేరని డెమో రేణగుంట–గుంతకల్లు మధ్య నడుస్తున్న డెమో ఎక్స్‌ప్రెస్ రైలుకు పెట్టిన ధరలతో పోలిస్తే ఇంటర్సిటీ మేలంటున్నారు ప్రయాణికులు. ఉదాహరణకు నందలూరు నుంచి కడపకు రూ.10నే. ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ చార్జీతో డెమోను తీసుకొచ్చి రూ.30 తీసుకుంటున్నారు. ఒక వేళ రూ.30 టికెట్ తీసుకున్నా, స్టేషన్ నుంచి ఆటోకు రూ.20 కావడం మొత్తం మీద రూ.50 అవుతోంది. అలాంటప్పుడు బస్సులో వెళితే నేరుగా టౌన్లోకి వెళ్లవచ్చు కదా అనే భావనతో ప్రయాణికులు డెమో వైపు కన్నెత్తి చూడటం లేదని తెలుస్తోంది. 12 బోగీల ఫార్మిసన్‌తో నిత్యం రద్దీగా.. ఇంటర్సిటీ రైలు 12 బోగీల ఫార్మిసన్‌తో నిత్యం రద్దీగా నడిచేది. నందలూరులో కూడా ఈ రైలు క్రూ ఛేంజింగ్ ఉండేది. రెండు రిజర్వేషన్ బోగీలు కూడా ఉండేవి. ఉభయ జిల్లాలకు చెందిన వారు అనేక మంది కర్ణాటక ప్రాంతంలోని హుబ్లీ కేంద్రం వరకు రాకపోకలు సాగించేవారు. రెండు రాష్ట్రాల మధ్య తక్కువ ధరతో గమ్యానికి చేరుకొనేవారు. అందువల్ల ఈ రైలు ఎప్పుడైనా రద్దీతో నడిచేది. ఫుట్‌బోర్డు ప్రయాణం కొనసాగేది. అలాంటి రైలును ఇప్పుడు రైల్వేశాఖ కనుమరుగు చేసేలా తీసుకుంటున్న విధానాలపై ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. -
చిన్నారి కిడ్నాప్.. అంతా కన్నతల్లి నాటకం!
హుబ్లీ(బెంగళూరు): కన్నబిడ్డ లోపాలతో పుట్టిందని స్వయాన కన్నతల్లి ఆ చిన్నారిని పై నుంచి కిందపడేసి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు లాక్కెళ్లారని నాటకమాడింది. పోలీసులు కూపీ లాగడంతో కిడ్నాప్ వెనుకున్న అసలు విషయం వెల్లడైంది. జిల్లాలోని కుందగోళ నెహ్రూనగర్‌కు చెందిన సల్మాషేక్ ఇటీవల 40 రోజుల పసిబిడ్డను ఆస్పత్రికి తీసుకువచ్చింది. బిడ్డను వదిలించుకోవడానికి పైనుంచి కిందపడేసి ఎవరో లాక్కెళ్లారని నాటకం ఆడింది. బిడ్డ గడ్డిపై పడటంతో ఏమీ గాయాలు కాలేదు. పోలీసులు సల్మాషేక్ను విచారించి అసలు విషయం వెల్లడించారు. ప్రస్తుతం తల్లీ బిడ్డ విమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. మరో ఘటనలో.. బైక్, లారీ ఢీ, యువకుడి మృతి బళ్లారి రూరల్: బళ్లారి జిల్లా కుడితిని బైపాస్‌లో బైక్‌ను లారీ ఢీ కొనడంతో యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం ఉదయం జరిగింది. కుడితిని పోలీసుల వివరాలు... ఆంధ్రప్రదేశ్ కర్నూలుకు చెందిన లేపాక్షిరెడ్డి జిందాల్లో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నాడు. కుడితినిలో రూము తీసుకొని ఉంటున్నాడు. గురువారం ఉదయం తన బైక్‌పై కుడితిని బైపాస్‌లో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. తీవ్ర గాయాలతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: వివాహేతర సంబంధం: ప్రియుడితో కలిసి.. -
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. లోకోపైలెట్ అప్రమత్తమైనప్పటికీ...
హుబ్లీ: రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించిన ఘటన గురువారం హుబ్లీలో చోటు చేసుకుంది. రెండుకాళ్లు తెగిపోయి క్షతగాత్రుడు విషమ స్థితిలో హుబ్లీ కిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. వివరాలు... మధ్యాహ్నం షాలీమార్ వాస్కోడిగామా రైలు హుబ్లీ స్టేషన్ వదిలిన నాలుగు నిముషాలకు హెగ్గేరి సమీపంలో వస్తుండగా ఓ వ్యక్తి రైలుకు ఎదురుగా పరుగులు పెట్టాడు. అప్పటికే రైలు వేగం పుంజుకుంటోంది. లోకో పైలెట్ రైలు వేగాన్ని నియంత్రించడానికి ప్రయత్నించినప్పటికి జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. అతని రెండు కాళ్లు తెగిపడ్డాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు బాధితుడిని కిమ్స్‌కు తరలించి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. క్షతగాత్రుడి వివరాలు తెలియల్సి ఉంది. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ధైర్యంగా జీవితంలో ముందుకు సాగండి.. రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com (చదవండి: బ్లూవేల్ తరహా గేమ్స్‌కు ప్రభావితమై ఆత్మహత్య) -
వెంటపడి వేధించి నాలుగేళ్ల క్రితం పెళ్లి.. మాంసం వండాలని ఒత్తిడి, చివరకు
హుబ్లీ: బ్లాక్మెయిల్ చేసి వివాహం చేసుకొని మతం మార్పించి వేధించడంతోపాటు మచ్చుకత్తితో నరికిన కిరాతక భర్త నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని గదగ్‌కు చెందిన అపూర్వ పురాణిక్ అనే మహిళ మంగళవారం మీడియాతో మొరపెట్టుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే భర్త వేధింపులను ఏకరవు పెట్టింది. ఆమె మాటల్లోనే.. నిత్యం కాలేజీకి హిజాజ్ అనే వ్యక్తి ఆటోలో వెళ్తుండేదాన్ని. ఈ క్రమంలో తనను శారీకంగా వేధించి ఆ దృశ్యాలను వీడియో తీసి నా తల్లిదండ్రులకు చూపెడతానని బెదిరించి 2018లో పెళ్లి చేసుకున్నాడు. ఆపై విజయపుర తీసుకెళ్లి రాక్షసంగా వ్యవహరించాడు. మత మార్పిడి చేసుకుంటేనే కాపురం చేస్తానని బెదిరించి మతం మార్పించాడు. మాంసాహారం వండాలని, తానూ తినాలని ఒత్తిడి చేసేవాడు. కొడుకు పుట్టగా అతనికి మాంసం తినిపించేవాడు. నన్ను హిప్నటైజ్ చేశాడు. అతను చెప్పినట్లే నడుచుకునే దాన్ని. అతడికి ఇప్పటికే వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. వేధింపులు తాళలేక పుట్టింటికి వెళ్లా. ఈనెల 12న గదగ్‌కు వచ్చి మాట్లాడుదామని చెప్పి పిలుచుకొని వచ్చి మచ్చుకత్తితో 23 సార్లు నరికాడు. అతని వల్ల తనకు, తన బిడ్డ ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. -
తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం.. మూడు రోజులుగా భర్త మృతదేహంతోనే..
హుబ్లీ (కర్ణాటక): వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం మూడు రోజుల తర్వాత స్థానికుల చొరవతో వెలుగు చూసింది. ఈ ఘటన హుబ్లీ నవనగర ఎల్ఐజీ వద్ద చోటు చేసుకుంది. ధార్వాడలోని ఎత్తినగుడ్డ నివాసి మంజునాథ అబ్బిగెరె(30) తొమ్మిదేళ్ల క్రితం యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. ఎల్ఐజీ వద్ద అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. గురువారం ఇంటినుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు ఏపీఎంసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి పరిశీలించగా మంజునాథ విగతజీవిగా కనిపించాడు. ఇతను మూడు రోజుల క్రితమే మృతి చెందాడని, ఇంట్లో భార్య, పిల్లలు ఉన్నా మృతి విషయాన్ని బయటకు చెప్పలేదని పోలీసులు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మంజునాథ మృతిపై తమకు అనుమానం ఉందని మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: (ప్రేయసితో పెళ్లికి భార్య అంగీకరించలేదని...) -
వ్యభిచార గృహంపై దాడి.. పొరుగు రాష్ట్రాల అమ్మాయిలను పిలిపించి..
హుబ్లీ (కర్ణాటక): హుబ్లీ తాలూకా వరూరు గ్రామంలోని ఎస్జీ టవర్స్, అమృత కంఫర్ట్ హోటల్లో వేశ్యావాటిక నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేశారు. యజమాని వెంకటేష్ నాయక్, మేనేజర్ వీరేష్ మురుడేశ్వర, కేఎం.ప్రదీప్‌గౌడ, మంజునాథ గౌడను అరెస్ట్ చేశారు. అక్కడ చిక్కుకుపోయిన యువతులను రక్షించారు. నిందితులు పొరుగు రాష్ట్రాల నుంచి అమ్మాయిలను పిలిపించి ఆన్లైన్ ద్వారా విటులను రప్పించే వారని పోలీసులు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా కస్టడీకి ఆదేశిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. చదవండి: (స్పాలో అక్రమాలంటూ.. ఓనర్‌ను బెదిరించి, ఆపై) -
Hubli: కళాశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
హుబ్లీ (బెంగళూరు): కళాశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ధార్వాడలో వెలుగు చూసింది. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ధార్వాడలోని ఓ ప్రాంతానికి చెందిన కళాశాల విద్యార్థిని అదే ప్రాంతానికి చెందిన ఐదుగురు యువకులు మాయమాటలు చెప్పి శివారు ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారని ధార్వాడ టౌన్ పోలీసులు తెలిపారు. చదవండి: (భర్త, కుమార్తెను వదిలి ప్రియుడితో వెళ్లిపోయి.. ఆది పరాశక్తి అవతారంలో) -
పుట్టినింటికి వచ్చిన చెల్లెని హతమార్చి.. పోలీస్‌స్టేషన్‌లో లొంగుబాటు
సాక్షి, హుబ్లీ (కర్ణాటక): రక్తం పంచుకుని పుట్టిన చెల్లెలిని హతమార్చిన అన్న పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. జిల్లాలోని నవలగుంద పట్టణంలోని కల్మేశ్వర గుడి ప్రాంతంలో మహంతేష్ శరణప్ప నవర అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఈయన చెల్లెలు శశికళ సుణగార ఇటీవల పుట్టినింటికి వచ్చింది. ఏదో విషయంపై మంగళవారం సాయంత్రం ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. క్షణికావేశంతో మహంతేష్ తన చెల్లెలిని కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం కత్తితో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి శశికళ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: (కాటేసిన పాముతో ఆస్పత్రికి.. అది చూసి డాక్టర్లు షాక్) -
ప్రేమించి పెళ్లి చేసుకున్నాం.. చంపేస్తామంటున్నారు
సాక్షి, బెంగళూరు: కుటుంబ సభ్యుల నుంచి తమను కాపాడాలని ఓ ప్రేమజంట మంగళవారం జంటనగరాల పోలీసు కమిషనర్‌ను ఆశ్రయించారు. హుబ్లీ బీజేపీ కీలక నేత కుమార్తె మోనల్ కొరవి, రాహుల్ చందావరకరలు ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. అమ్మాయి తండ్రి బంధువులు తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని, తమకు రక్షణ కల్పించాలని వారు కమిషనర్ లాబురామ్ను కలిసి విజ్ఞప్తి చేశారు. కాగా, ఈనెల 2న గదగ్ జిల్లా ముండ్రగిలో రిజిష్టర్ వివాహం చేసుకొన్నామని, అమ్మాయి తండ్రి పలుకుబడి ఉన్నవారని, ఆయన కారణంగా తమకు ప్రాణభయం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ఓటేయలేదుగా ఊరు విడిచి పోండి: ఓ నాయకుడి దౌర్జన్యం
హుబ్లీ: పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయలేదని ఓ వ్యక్తి సదరు గ్రామానికి చెందిన వారిని గ్రామం విడిచి వెళ్లాలని హుకుం జారీ చేశాడు. హుబ్లీ తాలూకా తిమ్మసాగర అంచటకేరి గ్రామ పంచాయతీ సభ్యుడు సహదేవప్ప తమను ఊరు విడిచి వెళ్లాలని రోజూ వేధిస్తున్నాడని ఆ గ్రామ ప్రముఖులు మంజునాథ్ తదితరులు మీడియా ఎదుట వాపోయారు. ప్రభుత్వం స్థలంలో వీరు ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు. దివంగత శివళ్లి మంత్రిగా ఉన్న సమయంలో ఇక్కడ రోడ్లు, తాగునీటి సదుపాయం కల్పించారు. ఈ క్రమంలోనే వీరికి ఇళ్ల పట్టాలు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. ఆయన మరణాంతరం పరిస్థితి మారిపోయింది. గ్రామ పంచాయతీ సభ్యుడు సహదేవప్ప, మల్లవ్వ జంబాళ మాకు ఓటు వేయలేదంటూ నిత్యం వేధిస్తున్నారని మేము ఎక్కడి వెళ్లాలని బాధితులు వాపోయారు. చదవండి: ముఖ్యమంత్రిని పంపేందుకు ముహూర్తం పెట్టాం -
మహిళను నమ్మించి నట్టేటా ముంచిన సైబర్ నేరగాళ్లు
హుబ్లీ: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా నగరంలో మరో మహిళ సైబర్ వంచకులు బారిన పడి రూ. లక్షన్నర పోగొట్టుకుంది. వివరాలు... ఇటీవల నగరంలోని యల్లపుర వీధికి చెందిన విజయలక్ష్మీ మొబైల్‌కు సిమ్‌బ్లాక్ అయినట్లు సందేశం వచ్చింది. దీనిని ఓపెన్ చేయాలంటే అందులో మొబైల్ నెంబర్‌కు ఫోన్ చేయాలని సారాంశం ఉంది. దీంతో సదరు మహిళ ఆ నెంబర్‌కు ఫోన్ చేయగా వివరాలు డౌన్లోడ్ చేసుకోవాలని వంచకులు తెలిపారు. ఆ మేరకు విజయలక్ష్మీ యాప్‌డౌన్‌లోడ్ చేసుకున్న క్షణాల్లోనే ఆమె ఖాతా నుంచి రూ.1.50 లక్షల నగదు నేరుగా వంచకుల ఖాతాలోకి వెళ్లిపోయింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పెళ్లైన మరుసటి రోజే వరుడి మృతి
హుబ్లీ: విధి విలాసమో.. వైచిత్రమో తెలియదు కానీ వివాహమైన మరుసటి రోజే వరుడిని మృత్యువు బలితీసుకుంది. పచ్చటి తోరణాలు కళకళలాడుతుండగానే పెళ్లింట చావుడప్పు మోగింది. అటు వరుడు, ఇటు వధువు ఇళ్లలో విషాదాన్ని మిగిల్చిన ఈఘటన జిల్లాలోని కలఘటిగి తాలూకా తబకహొన్నళ్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన శశికుమార్ పట్టణ శెట్టికి శనివారం అతని స్వగృహంలో హావేరి జిల్లా శిగ్గాంవి తాలూకా మూకబసరికట్టికి చెందిన యువతితో వివాహమైంది. తిరుగు పెళ్లిలో భాగంగా వధువు ఇంటికి నవదంపతులు వెళ్లారు. ఆదివారం శశికుమార్ గుండెపోటుకు గురై కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. కళ్లముందే జరిగిన ఈ ఘోరాన్ని చూసి అటు వధువు, పెళ్లికి వచ్చిన బంధువులు విషాదంలో మునిగిపోయారు. కరోనాతోఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మృతి భార్యకు, కుమార్తెకు పాజిటివ్ సాక్షి, బళ్లారి: వారం రోజుల క్రితం ఆ ఇంటిలో వివాహం జరిగింది. బంధువుల సందడి ఇంకా తగ్గలేదు. ఇంతలోనే కరోనా రూపంలో ఆ ఇంటిని విషాదం కమ్మేసింది. కరోనాతో భర్త మృతి చెందగా భార్యకు, ఇటీవల వివాహం జరిగిన కుమార్తెకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వివరాలు...బళ్లారిలోని విశాల్ నగర్లో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ హనుమంతప్ప నివాసం ఉంటున్నారు. వారం రోజుల క్రితం అతని మూడవ కుమార్తెకు వివాహం చేశారు. పెళ్లికి బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. ఈక్రమంలో హనుమంతప్పకు కరోనా సోకింది. శనివారం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కావడంతో విమ్స్‌కు తరలించి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. చికిత్స పొందుతూ హనుమంతప్ప ఆదివారం మృతి చెందాడు. కాగా హనుమంతప్ప భార్య, ఇటీవల వివాహమైన కుమార్తెకు కూడా పాజిటివ్‌గా తేలింది. చదవండి: బెంగళూరులో ఒక్కరోజే 20 వేలకు పైగా కేసులు -
బలిచ్చేందుకు బాలుడిని చిత్రహింసలు పెట్టి..
హుబ్లీ/కర్ణాటక: హావేరి జిల్లా హానగల్ తాలూకా ఉపుఉనసి గ్రామంలో దుర్ఘటన చోటు చేసుకుంది. హరీశయ్య నాగయ్య హిరేమఠ అనే బాలుడిని చిత్రహింసలకు గురి చేసి కొత్త ఇంటి పునాదిలో వేయడానికి ప్రయత్నించారు. విషయం గమనించి కొందరు అడ్డుకొని, తీవ్రంగా గాయపడిన బాలుడిని హుబ్లీ కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. కానీ, చికిత్స ఫలించకపోవడంతో మృత్యువాత పడ్డాడు. ఇంటి నిర్మాణం కోసం బాలుడిని బలి ఇవ్వడానికి ప్రయత్నించారని బంధువులు ఆరోపించారు. దీనిపై హరూరు పోలీస్ స్టేషన్లో బాలుడి తండ్రి నాగయ్య ఫిర్యాదు మేరకు నిందితులు శివరుద్ర హావేరి, బసన్నవ్వ ప్రభాకర్ కరిశెట్టర్, ప్రవీణ్ కరిశెట్టర, కుమార వీరభద్రప్ప హావేరిలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: పుట్టిన రోజున.. పుట్టెడు దు:ఖం -
యువకుడి నగ్న వీడియోలు రికార్డు చేసి..
హుబ్లీ/కర్ణాటక: ఓ యువతి నగరానికి చెందిన వ్యక్తికి ఊహించని షాకిచ్చింది. వాట్సప్ వీడియో కాల్ చేసి అతడి అశ్లీల వీడియోను రికార్డ్ చేసి డబ్బు డిమాండ్ చేసింది. వివరాలు.. ఫేస్బుక్లో ఓ యువతి స్థానిక వ్యక్తిని పరిచయం చేసుకుంది. తరచుగా చాట్చేస్తూ సాన్నిహిత్యం పెంచుకుంది. ఈ క్రమంలో, ఈ నెల 13 నుంచి 16వ తేదీ మధ్యలో అతడికి వాట్సప్ వీడియో కాల్స్ చేసింది. అతడు నగ్నంగా ఉన్న సమయంలో వీడియోను రికార్డ్ చేసి దానిని సదరు వ్యక్తికి పంపి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. అడిగినంత డబ్బు పంపకపోతే సోషల్ మీడియాలో సదరు వీడియోను అప్లోడ్ చేసి పరువుకు భంగం కల్గిస్తానని బెదిరించింది. దీంతో బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. చదవండి: రాసలీలల కేసు: ఢిల్లీ నుంచి వీడియో అప్లోడ్ -
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య
సాక్షి, హుబ్లీ: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడితో హతుడి భార్య వివాహేతర సంబంధం గుట్టు ఈ హత్యతో బట్టబయలైంది. ధార్వాడ జిల్లా హుబ్లీ తాలూకా అంచటగేరి నివాసి అక్షతకు హావేరి జిల్లా హానగల్ నివాసి జగదీష్‌తో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. నాలుగు నెలల క్రితం అక్షతకు ఓ మగబిడ్డ జన్మించింది. ఈక్రమంలో భార్య, బిడ్డలను చూడటానికి వచ్చిన భర్త దారుణ హత్యకు గురయ్యాడు. (మంజీరలో ఏఓ గల్లంతు?) ఈ కేసు కూపీ లాగిన సీఐ రమేష్ గోకాక్ అక్షత కాల్ డేటాను తెలుసుకొని ఆమె ప్రియుడు కాశప్పను అదుపులోకి తీసుకుని పోలీసు పద్ధతిలో విచారించగా అసలు విషయం నిగ్గు తేలింది. అక్షత ప్రియుడు కాశప్ప స్వగ్రామం బాదామి తాలూకా బండకేరి. ఇతడు గత ఐదేళ్ల నుంచి కేఈబీ లైన్మెన్గా ఉంటూ అంచటగేరిలో అక్షత ఇంటి ఎదుట ఇల్లు తీసుకొని ఉండేవాడు. వీరి మధ్య గత ఐదేళ్లుగా వివాహేతర సంబంధం నెలకొంది. అంతేగాక నాలుగు నెలల క్రితం కాశప్పకు మరో యువతితో వివాహమైంది. (పదేళ్ల బాలికపై పూజారి అఘాయిత్యం) తమ వివాహేతర సంబంధం కొనసాగాలంటే అడ్డుగా ఉన్న భర్త జగదీష్‌ను చంపేయాలని ఇద్దరూ పథకం వేశారు. ఆ క్రమంలోనే భార్య, బిడ్డను చూసేందుకు వచ్చిన జగదీష్‌కు మంగళవారం కాశప్ప మందుపార్టీ ఇచ్చి ఊరు చివరలోని చెన్నాపుర క్రాస్ వద్ద తలపై బండరాయిని ఎత్తి వేసి హత్య చేసి పరారయ్యాడు. కొన్ని గంటల్లోనే కేసు మిస్టరీని చేధించిన పోలీసులు గురువారం నిందితులను జుడీషియల్ కస్టడీకి అప్పగించారు. -
సైకో డాక్టర్.. భార్య కాపురానికి రాలేదని..
సాక్షి, హుబ్లీ: పండుగ వేళ ఆ ఇంట్లో రక్తం చిందింది. హుబ్లీ నగరంలో భార్య కాపురానికి రాలేదని ఉన్మాదిగా మారిన వైద్యుడు భార్య, ఆమె తల్లిదండ్రులపై కత్తితో దాడి చేశాడు. మామ మరణించగా భార్య, అత్తకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. శంకర్ ముసన్నవర్ న్యాయ విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్‌గా ఇటీవల రిటైరయ్యారు. ఈయన హుబ్లీ లింగరాజునగర్లో కుటుంబంతో ఉంటున్నారు. శనివారం ఉదయం వాకింగ్ వెళ్లడానికి సిద్ధమవుతుండగా అల్లుడు సంతోష్ చొరబడి కత్తితో విచ్చలవిడిగా దాడిచేశాడు. కత్తిపోట్లతో శంకర్ అక్కడికక్కడే మరణించగా ఆయన భార్య, కుమార్తె లతకు గాయాలయ్యాయి. అరుపులతో అప్రమత్తమైన స్థానికులు ఉన్మాది సంతోష్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. (ప్రేమ వివాహం.. భర్త హత్య) ఇద్దరూ వైద్యులే సంతోష్– భార్య లతల మధ్య గొడవలే ఘోరానికి కారణమని తెలిసింది. వీరిద్దరూ కూడా వైద్యులే కావడం గమనార్హం. గొడవల వల్ల వేరువేరుగా ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా. లతా హుబ్లీలో తండ్రి ఇంట్లో నివసిస్తూ ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పనిచేస్తోంది. దంత వైద్యుడైన సంతోష్ భార్యను తన వద్దకు పంపాలని అప్పుడప్పుడు మామ ఇంటికి వచ్చి ఘర్షణ పడేవాడు. ఎవరూ తన మాట వినడం లేదని చివరకు దారుణానికి ఒడిగట్టాడు. ఘటనాస్థలాన్ని పోలీస్ కమిషన్ లాబురామ్ పరిశీలించారు. నిందితున్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు. -
గంటన్నర టెన్షన్
కర్ణాటక, హుబ్లీ: ప్రతికూల వాతావరణం వల్ల హుబ్లీ ఎయిర్‌పోర్టులో విమానాల ల్యాండింగ్‌కు ఆదివారం తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆకాశం దట్టంగా మేఘావృతం కావడంతో పాటు వర్షం కురుస్తుండడంతో విమానాలను ల్యాండ్ చేయడానికి పైలట్లు తటపటాయించారు. బెంగళూరు నుంచి బయలుదేరిన ఇండిగో విమానం ఉదయం 8.55 గంటలకు హుబ్లీ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. అయితే తీవ్రమైన వాతారణ ప్రతికూల పరిస్థితుల వల్ల దిగడానికి సిగ్నల్ దొరక్క ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది. ఒకవేళ ఇక్కడ సాధ్యం కాకపోతే మంగళూరు, లేదా గోవా విమానాశ్రయాలలో దించాలని అనుకున్నారు. చివరకు సిగ్నల్ లభించడంతో 10.25 గంటలకు సురక్షితంగా ల్యాండింగ్ సాధ్యమైంది. దీంతో సుమారు గంటన్నర పాటు విమానంలోను, విమానాశ్రయంలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ విమానంలో మాజీ కేంద్రమంత్రి, ఎంపీ అనంతకుమార్ హెగ్డేతో పాటు 49 మంది ప్రయాణికులున్నారు. కాగా, మరో 2 విమానాలు దిగకుండానే బెంగళూరుకు వెనుదిరిగాయి. -
స్ట్రాబెర్రీ.. తియ్యటి దిగుబడి
అమెరికా, యూరప్ దేశాల్లో కనిపించే స్ట్రాబెర్రీ పండ్లు హుబ్లీ వద్ద విరగ్గాస్తున్నాయి. ఎర్రగా నిగనిగలాడుతూ చూడగానే ఉల్లాసం కలిగించే పండ్లు ఒక బంజరు భూమిలో పండడం వెనుక శ్రమ,ఉత్సాహం దాగున్నాయి. శశిధర అనే సివిల్ ఇంజనీరు మహారాష్ట్రలో చూసి తమ ఊళ్లోనూ స్ట్రాబెర్రీల సాగుతో ఆదర్శంగా నిలిచారు. సాక్షి, బళ్లారి: ఆయన సివిల్ ఇంజనీర్. వ్యవసాయంపై మక్కువతో వినూత్న పంటలు సాగుచేస్తూ నేలతల్లి సేవలో పులకిస్తున్నారు. హుబ్లీ నగరానికి చెందిన సివిల్ ఇంజనీర్ శశిధర మహారాష్ట్రలో పనిచేస్తున్న సమయంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో స్ట్రాబెర్రీ పండ్ల తోటలను పండించడం చూశారు. అక్కడ అవగాహన పెంచుకుని అక్కడే పొలం కౌలుకు తీసుకుని స్ట్రాబెర్రీ పండించారు. మంచి దిగుబడులు రావడంతో స్వంత ప్రాంతం హుబ్లీ చుట్టుపక్కల ఎక్కడైనా భూమి తీసుకుని స్ట్రాబెర్రీ పండించాలని ఆలోచించి మహారాష్ట్ర తిరిగి వచ్చారు. ఎకరాతో ఆరంభం కలఘటిగి తాలూకా హుల్లంబి గ్రామంలో రాళ్లతో కూడిన ఆరు ఎకరాల బంజరు భూమిని ఎంపిక చేసుకున్నారు. ఇక సాగుకు ఉపక్రమించారు. తొలుత స్ట్రాబెర్రీని గడ్డలను తీసుకుని వచ్చి తన పొలంలోనే నర్సరీ చేసుకుని, ఒక ఎకరంలో 25వేల మొక్కలను నాటేందుకు సిద్ధం చేసుకున్నారు. డ్రిప్ వ్యవసాయ పద్ధతిని అలవరుచుని, ఒక ఎకరా పొలంలో స్ట్రాబెర్రీ మొక్కలను నాటారు. 45 రోజులకే ఎర్రగా నిగనిగలాడే స్ట్రాబెర్రీలు పండడంతో రైతు శశిధర ఆనందానికి అవధుల్లేవు. క్రమంగా మరికొన్ని ఎకరాలకు పంటను విస్తరించారు. బంజరు భూముల్లో ఎవరికి అంతుపట్టని విధంగా ఆమెరికాలో పండించే స్ట్రాబెర్రీని పండిస్తున్న సివిల్ ఇంజనీర్ శశిధర పలువురు రైతులకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. నిత్యం 20 మంది కూలీలకు ఉపాధిని కల్పిస్తూ లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు. కేజీ రూ. 100-400 ఒక కేజీ పండ్లు 100 నుంచి రూ.400 వరకు వరకు అమ్ముడుపోతున్నాయని శశిధర సంతోషంగా చెప్పారు. మార్కెట్లో కూడా మంచి గిరాకీ ఉందని, ఇంజనీర్ వృత్తి కంటే వ్యవసాయం చేయడం సంతృప్తినిస్తుందని, ప్రతి నిత్యం తన కుమారులు, భార్య పొలంలో పనిచేస్తుంటారని తెలిపారు. ఒక ఎకరం స్ట్రాబెర్రీతో పాటు మరో ఐదు ఎకరాల్లో వివిధ రకాలు కూరగాయాలు, పంటలను పండించేందుకు ఏర్పాట్లు చేసుకున్నానన్నారు. రోజుకు రూ.8 వేల ఆదాయం మొక్కలు నాటిన 45 రోజుల్లో పండ్లు కాశాయన్నారు. 11 నెలలుగా మంచి ఆదాయం వచ్చిందన్నారు. ప్రతి రోజు కూలీలు ఖర్చులు పోను రూ.8 వేల వరకు ఆదాయం వస్తోందని శశిధర తెలిపారు. దీంతో పాటు ఎలాంటి రసాయనిక మందులు, పురుగులు మందులు వాడడం లేదన్నారు. పలువురు రైతులు తన పొలం సందర్శించి, సలహాలు అడుగుతూ ఉంటారన్నారు. అందరూ శశిధర మాదిరిగా కృషిచేస్తే వ్యవసాయం పండుగే అవుతుంది. -
నా భార్య నాకు కావాలి.. ప్లీజ్
బెంగళూరు : నా భార్య నాకు కావాలి, దయతో ఆదుకోవాలని ఓ నిస్సహాయక భర్త కనబడిన వారందరినీ వేడుకుంటున్నాడు. హుబ్లీ బసవనబాగేవాడికి చెందిన సిద్ధలింగప్ప అనే ఆ నిస్సహాయక వ్యక్తి వివరాల్లోకి వెళితే.. స్వతహాగా అక్క కూతురైన జ్యోతిని 2004లో పెళ్లి చేసుకున్నాడు. అంతోఇంతో చదువుకున్న భార్యకు ఐటీఐలో శిక్షణ ఇప్పించాడు. ఆ తర్వాత ఉన్న రెండు సెంట్ల స్థలం అమ్మి ఆ డబ్బులు ఖర్చుపెట్టి భార్యకు ఉద్యోగం వచ్చేలా శ్రమించాడు. అంతా బాగానే ఉంది. తనను తన భార్య ఆదుకుంటుందని విశ్వాసంతో ఉన్న సిద్ధలింగప్పకు భార్య జ్యోతి అనుకోని విధంగా షాక్‌నిచ్చింది. సిద్ధలింగప్ప ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగి కాళ్లు పోగొట్టుకుని దివ్యాంగుడిగా మారాడు. తన ఉన్నతి కోసం కష్టపడిన భర్తను ఆదుకోవాల్సిన జ్యోతి తన దారి తాను చూసుకుంది. ఒంటరైన సిద్ధలింగప్ప సుమారు 10 ఏళ్ల నుంచి అవిటితనంతో బతుకు భారంగా వెళ్లదీస్తున్నాడు. ఎవరైనా పెద్దలు తన భార్యకు నచ్చజెప్పి తమనిద్దరినీ కాలపాలని వేడుకుంటున్నాడు. ఐటీఐ అర్హతతో జ్యోతి హుబ్లీ ఆర్టీసీ 3వ నెంబర్ డిపోలో సాంకేతిక సహాయకురాలిగా పని చేస్తున్నారు. మానవతావాదులు తనకు న్యాయం చేయాలని సిద్ధలింగప్ప మరిమరి వేడుకుంటున్నారు. -
ఒకే కాన్పులో ముగ్గురు మగ బిడ్డలు, ఆడపిల్ల
బొమ్మనహళ్లి/హుబ్లీ: ఒక కాన్పులో కవలలు జన్మిస్తే విశేషం. ముగ్గురు పుడితే వింత. ఏకంగా నలుగురు జన్మిస్తే పెద్ద విడ్డూరమే. కర్ణాటకలోని హుబ్లీలో ఓ గర్భిణి నలుగురు బిడ్డలకు జన్మనిచ్చారు. హావేరి జిల్లాలోని సవణూరు గ్రామానికి చెందిన మహబూబ్ బీ అనే గర్భిణి నెలలు నిండడంతో ప్రసవం కోసం హుబ్లీలోని ప్రభుత్వ కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ఆదివారం నొప్పులు రావడంతో వైద్యులు సిజేరియన్ కాన్పు చేశారు. ముగ్గురు మగ బిడ్డలు, ఆడపిల్ల జన్మించారు. ఒక్కో బిడ్డ బరువు రెండు కేజీల వరకూ ఉందని వైద్యులు తెలిపారు. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు. ఆమెకు ఇది రెండవ కాన్పు. మొదటి ప్రసవంలో ఒక కొడుకు పుట్టాడు. -
హుబ్లీ రైల్వే స్టేషన్లో పేలుడు
బెంగుళూరు: కర్ణాటకలోని హుబ్లీ రైల్వేస్టేషన్లో సోమవారం పేలుడు కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకున్నా.. పేలుడుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలిసిరాలేదు. పేలుడు ధాటికి గాయపడిన క్షతగాత్రుడిని దగ్గరలోని ఆస్పత్రికి స్థానికులు హుటాహుటిన తరలించారు. అకస్మాత్తుగా తక్కువ స్థాయిలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంతో రైల్వేస్టేషన్‌లోని జనాలకు ముచ్చెమటలు పట్టాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. గాయపడిన వ్యక్తిని హుసేన్ సాబ్ నాయక్వాలేగా పోలీసులు గుర్తించారు. అనుమానాస్పదంగా ఉన్న ఒక పెట్టెను తెరవడానికి ప్రయత్నించే సమయంలో ఈ పేలుడు సంభవించిందని, పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. Hubli: A box exploded at Hubli Railway Station, today. One person injured, and has been admitted to hospital. Police and Railway Protection Force are at the spot. #Karnataka pic.twitter.com/DtjykGbhJm — ANI (@ANI) October 21, 2019 -
అందుకే ఆమెను పెళ్లాడాను..
కోల్‌కతా : దేశమంతా విజయదశమి వేడుకల్లో మునిగిపోయిన వేళ ఓ యువజంట దుర్గాదేవి ఆశీస్సులతో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. చాటింగ్ చేస్తూ ఒకరినొకరు అర్థం చేసుకుని.. నేరుగా కలిసిన నాలుగు గంటల్లోనే పెళ్లి చేసుకుని తమ బంధాన్ని శాశ్వతం చేసుకున్నారు. దుర్గామాత సాక్షిగా తమ మధుర క్షణాలను జీవితకాలపు ఆల్బమ్‌లో పదిలపరచుకున్నారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్లోని హుగ్లీ నది ఒడ్డున జరిగిన దసరా వేడుకల్లో చోటుచేసుకుంది. హింద్ మోటార్‌కు చెందిన సుదీప్ ఆప్టిక్ లెన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అతడికి సియోరాఫులికి చెందిన ప్రతిమతో పరిచయం ఏర్పడింది. జూలై 25న ఫేస్బుక్లో ఆమెతో చాటింగ్ చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఎన్నోసార్లు వీడియో కాల్స్‌లో మాట్లాడుకున్న వీరి మధ్య స్నేహబంధం బలపడింది. ఈ క్రమంలో అక్టోబరు 6న హుగ్లీ నది ఒడ్డున జరుగుతున్న విజయదశమి వేడుకలకు సుదీప్ హాజరయ్యాడు. ప్రతిమ కూడా అక్కడికి దగ్గర్లోనే ఉన్న మరో వేదిక వద్ద ఉందని తెలుసుకుని.. ఒకసారి నేరుగా కలుద్దామని ఆమెను కోరాడు. ఇందుకు ప్రతిమ అంగీకరించడంతో ఓ పూజా మండపంలో తొలిసారి కలుసుకున్నారు. చూపులు కలిసిన శుభవేళే సుముహూర్తం అన్నట్లుగా ప్రతిమను చూసిన నాలుగు గంటల్లోనే సుదీప్ ఆమె ముందు పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేయగా... మౌనమే ఆమె అంగీకారమైంది. ఇక అక్కడే ఉన్న భక్తులు, ప్రతిమ-సుదీప్‌ల స్నేహితులు హర్షధ్వానాలతో వారిని ఆశీర్వదించారు. ఈ నేపథ్యంలో సుదీప్.. ప్రతిమ నుదుటన సింధూరం దిద్ది పెళ్లి ప్రమాణాలు చేశాడు. ఇరువురు పూలదండలు మార్చుకుని వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. ఈ విషయం గురించి సుదీప్ మాట్లాడుతూ..‘ ముందు మేమిద్దరం మంచి స్నేహితులం. తర్వాత తనతో ఎప్పుడు ప్రేమలో పడ్డానో తెలీదు. ప్రతిమ నా పేరిట సింధూరం ధరించాలని భావించింది. ముహుర్తాల గురించి నేను పెద్దగా పట్టించుకోను. అందుకే తనను పెళ్లాడాను అని చెప్పుకొచ్చాడు. ఇక సుదీప్‌లోని అమాయకత్వం, దయాగుణమే తనను ఆకర్షించిందని.. అందుకే తన మాట కాదనలేకపోయానని చెబుతూ సిగ్గులమొగ్గయింది. ఈ పెళ్లిని తన తల్లిదండ్రులు తొలుత వ్యతిరేకించినా ప్రస్తుతం తమ బంధాన్ని అంగీకరించారని హర్షం వ్యక్తం చేసింది. అత్తగారు కూడా తనను చూసి చాలా సంతోషపడ్డారని.. సుదీప్తో తన పెళ్లి జరగడంతో వారింట ఆనందాలు వెల్లివిరిశాయని పేర్కొంది. -
ఆలయంలో చీరకు మంటలంటుకొని..!
-
ఆలయంలో చీరకు మంటలంటుకొని..!
హుబ్లీ: కర్ణాటక హూబ్లీలోని విశ్వనాథ ఆలయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆలయంలో ఒక మహిళ పూజలు నిర్వహిస్తుండగా.. పక్కన ఉన్న కొవ్వొత్తి వల్ల ఆమె చీరకు మంటలు అంటుకున్నాయి. దీంతో ఆ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ నెల 17న ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రురాలి పేరు ఛాయ అని తెలుస్తోంది. ఇక్కడి కిమ్స్ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. ఆమె చీరకు మంటలు అంటుకోవడంతో, దీంతో భయభ్రాంతులకు గురైన మహిళ సాయం కోసం అర్థించడం ఇదంతా ఆలయంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో నమోదైంది. మంటలు అంటుకొని ఆమె ఒక్కసారిగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్న వ్యక్తులు పరిగెత్తుకొని వచ్చారు. వెంటనే మంటలు ఆర్పి.. ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే, ఈ ఘటనపై ఆలయ అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. గతంలో కోల్‌కతాలోని కారుణ్యమయి కాళీ ఆలయంలో ఓ 50 ఏళ్ల మహిళ పూజలు నిర్వహిస్తుండగా.. ఆమె చీరకు ఇదేవిధంగా మంటలు అంటుకొని.. గాయాలు అయ్యాయి. దీంతో ఆలయంలో కొవ్వొత్తులు, అగరవొత్తులు వంటివి నిషేధించారు. -
ప్రేయసి కోసం హుబ్లీ విమానాశ్రయానికి ఫోన్లు
కర్ణాటక , బొమ్మనహళ్లి : తాను ప్రేమించిన యువతి కోసం ఏడాదిన్నర కాలంగా హుబ్లీ విమానాశ్రయానికి ఫోన్లు చేస్తున్న ప్రేమికుడు ఎవరనే విషయాన్ని అధికారులు గుర్తించారు. వివరాలు..గోవాకు చెందిన రాయ్ డయాన్ అనే వ్యక్తి గోవా విమానాశ్రమలో పనిచేసే సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న యువతిని ప్రేమించాడు. ఆ యువతికి హుబ్లీకి బదిలీ కాగా ఆమె ప్రేమ విషయాన్ని మరచిపోయింది. తర్వాత రాయ్ దుబాయ్ వెళ్లారు. అయితే ఆ యువతికి రోజూ ఫోన్లు చేసేవాడు. దాంతో యువతి తాను వాడుతున్న మొబైల్ నంబర్ మార్చింది. ఆందోళనకు గురైన రాయ్ హుబ్లి ఏటీసీ నంబర్ తెలుసుకొని రోజూ ఫోన్ చేసి యువతికి ఫోన్ ఇవ్వాలని వేధించేవాడు. ఏటీసీ కేంద్రానికి సామాన్యంగా బయట నుంచి ఎలాంటి ఫోన్లు రావు. కేవలం పైలెట్ విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో మాత్రమే ఈ ఫోన్‌కు అనుమతి లభిస్తుంది. అయితే రాయ్ డయాన్ మాత్రం ఏటీసీ ఫోన్ నంబర్ తెలుసుకొని నిత్యం ఫోన్లు చేసేవాడు. విమానాలు ఎగురుతున్న సమయంలో కూడా ఈ నంబర్‌కు ఫోన్ చేసి తన ప్రేయసికి ఇవ్వాలని వేధించే వాడు. దీంతో సిబ్బంది ఇబ్బందులు పడేవారు. ఇలా ఫోన్ చేస్తున్న వ్యక్తి ఎవరనే విషయంపై అధికారులు ఆరా తీయగా రాయ్ డయాన్గా తేలిందని డీసీపీ రవీంద్ర తెలిపారు. -
చెరువులో హెచ్ఐవీ రోగి శవం.. 36 ఎకరాల చెరువును..
బెంగళూరు : అనుమానం ఆ గ్రామస్తుల పాలిట పెనుభూతంలా మారింది. ఎయిడ్స్ కారక హెచ్ఐవీ వైరస్ సోకిన మహిళ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవటంతో.. 36 ఎకరాలలో విస్తరించి ఉన్న చెరువులోని నీటిని తోడిపడేస్తున్నారు. తాగటానికి ప్రధాన వనరుగా ఉన్న ఆ చెరువును ఖాళీ చేసే పనిలో తలమునకలయ్యారు. ఈ సంఘటన కర్ణాటక హుబ్లీ జిల్లా మొరాబ్ గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. నవంబర్ 29న మొరాబ్ గ్రామంలో ఓ మహిళ హెచ్ఐవీతో బాధపడుతూ అక్కడి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. కొద్దిరోజుల తర్వాత మహిళ శవం నీటిపై తేలడంతో గుర్తించిన గ్రామస్తులు దాన్ని బయటకు తీశారు. అప్పటికే ఆ శవాన్ని చేపలు కొద్దిగా పీక్కుతిన్నాయి. దీంతో గ్రామస్తుల్లో భయం మొదలైంది. హెచ్ఐవీ సోకిన మహిళ శవంతో చెరువు నీరు కలుషితమై ఉంటుందని, ఆ నీటిని వాడితే హెచ్ఐవీ తమకు కూడా వస్తుందన్న అనుమానంతో తాగటానికి ఏకైక మార్గంగా ఉన్న 36 ఎకరాల చెరువులోని నీళ్లను తోడేయ్యాలని నిశ్చయించుకున్నారు. దాదాపు గత నాలుగు రోజులనుంచి చెరువులోని నీళ్లను తోడేయ్యటానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. పదుల సంఖ్యలో మోటార్లు ఉపయోగించి చెరువును తోడేస్తున్నారు. మొరాబ్ మాజీ సర్పంచ్ మాట్లాడుతూ.. చాలా కాలం కిందట అదే చెరువులో ఒక బాలుడు దూకి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. అప్పుడు చెరువును తోడేయ్యాలన్న ఆలోచన గ్రామస్తులకు రాలేదని, ఈ మధ్య చెరువులో దూకిన మహిళకి హెచ్ఐవీ ఉండటం వల్ల ఆ నీటిని తాగితే రోగం అందరికి వచ్చే అవకాశం ఉందన్న అనుమానంతో చెరువు నీళ్లను తోడుతున్నారని తెలిపారు. -
గుర్రపు బండి పోటీల్లో అపశ్రుతి
-
రేసులో అపశ్రుతి.. యువకుడి దుర్మరణం
సాక్షి, హుబ్లీ : కర్నాటకలోని హుబ్లీలో దారుణం చోటుచేసుకుంది. గుర్రపు బండి పోటీల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న గుర్రపు బండి పైనుంచి ప్రమాదవశాత్తూ ఓ యువకుడు కిందపడి మృతిచెందాడు. హుబ్లీలోని భూదానగడ్డ బసవేశ్వర ఆలయం ఆధ్వర్యంలో బుధవారం గుర్రపు బండ్ల రేసు నిర్వహించారు. అయితే ఈ రేసులో పాల్గొన్న ఓ యువకుడు గుర్రపు బండి నుంచి కిందపడి వెనకాలే వస్తున్న మరో గుర్రపు బండి కిందపడి మృతిచెందాడు. ఈ గుర్రపు బండ్ల రేసుకి నిర్వాహకులు పోలీసుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తెలుస్తోంది. రోడ్డు పక్క నుంచి తిలకిస్తున్న యువకులు తీసిన వీడియోలో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రమాద దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
అసభ్యంగా ప్రవర్తించారని చెప్పుతో కొట్టింది
-
అత్యాచారం చేయబోతే.. చెప్పుతో దేహశుద్ధి
హుబ్లి : ఇటీవల మహిళలపై జరుగుతున్న అసభ్య ప్రవర్తనలు, లైంగిక వేధింపులు తరుచుగా వింటూనే ఉన్నాం. బస్సులో, బస్‌స్టాపుల్లో, ఆఫీసుల్లో, ఇతరత్రా ప్రదేశాల్లో ఒంటరిగా ఉన్న మహిళలను ఆకతాయిలు వేధిస్తూ ఉన్నారు. తాజాగా కర్ణాటక హుబ్లి బస్సు డిపోలో ఇలాంటిదే ఒక షాకింగ్ సంఘటన జరిగింది. 55 ఏళ్ల మహిళ తన సొంతూరుకు వెళ్లేందుకు హుబ్లీ బస్టాండ్‌కు వచ్చింది. అయితే బస్సు అప్పటికే వెళ్లిపోవడంతో.. ఆమె రాత్రి సమయంలో బస్టాండ్‌లోనే ఉండిపోయింది. మహిళ ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఇద్దరు వ్యక్తులు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో ఆ మహిళ ఏమాత్రం జంకకుండా.. వెంటనే వారిద్దరినీ లాగిపెట్టి చెప్పుతో కొట్టింది. ఆమె అరుపులు విని, పక్కనే నిద్రిస్తున్న వారు కూడా లేచి, ఆకతాయిలకు తగిన గుణపాఠం చెప్పారు. అయితే ఆ ఇద్దరినీ పోలీసులకు అప్పగించేలోపే అక్కడ నుంచి తప్పించుకుని పారిపోయారు. మార్చి 11న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
మట్కా రాకెట్ గుట్టురట్టు: రూ.30 లక్షలు స్వాధీనం
అనంతపురం: జిల్లా కేంద్రమైన అనంతపురంలో మట్కా రాకెట్ గుట్టు రట్టు అయింది. 15మంది నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా, ముంబయి, హుబ్లి ప్రాంతాల నుంచి వచ్చి మట్కా నిర్వహిస్తున్నట్లు తమకందిన సమాచారం మేరకు పోలీసులు వీరిని అరెస్టు చేశారు. ముంబయి, హుబ్లి జూద కంపెనీలపై ఆరా తీస్తున్నామని ఎస్పీ జి.వి.జి. అశోక్‌కుమార్ చెప్పారు. దీనికి సహకరించే పోలీసులను ఉపేక్షించేది లేదని, మట్కా నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
కర్ణాటకలో రగిలిన కంబలా అగ్గి
-
కర్ణాటకలో రగిలిన కంబలా అగ్గి
హుబ్లీ: ఒకపక్క జల్లికట్టు స్ఫూర్తితో ఆంద్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఉద్యమం మళ్లీ పట్టాలెక్కితే.. సంప్రదాయ క్రీడకోసం కర్ణాటకలో కన్నడిగులు రోడ్డెక్కారు. జల్లికట్టు కోసం తమిళ తంబిల ఉడుంపట్టుతో అనుకున్నది సాధించడంతో కర్ణాటకలో కూడా కంబాల క్రీడపై నిషేధాన్ని ఎత్తివేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. కంబాలకు అనుమతివ్వాలంటూ వేలాదిమంది విద్యార్థులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. హుబ్లీలో కంబాలపై బ్యాన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. పెటాను నిషేధించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా కంబాళ క్రీడక బ్యాన్ ఎత్తివేతకు సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం అవసరమైతే నిషేధాన్ని ఎత్తివేయాలని ఆర్డినెన్స్ తేనుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. పెటా కర్నాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది .దీనిపై 2016, నవంబర్ లో కంబాళ ను నిలిపి వేస్తూ దేశాలు జారీ చేసింది. తదుపరి విచారణకు ఈ కేసు ఈ నెల 30 వరకు వాయిదా వేసింది. అటు కన్నడ కమిటీ కూడా స్టే ఎత్తివేయాల్సింది మధ్యంతర పిటీషన్ దాఖలు చేసింది. మరోవైపు కర్ణాటక రాష్ట్రంలో ఎంతో ప్రాచుర్యం పొందిన జానపద క్రీడ కంబాలా (బఫెల్లో రేస్) .ఈ క్రీడ సాధారణంగా నవంబర్ లో మొదలై మార్చి వరకు కొనసాగుతుంది. మూద్ బిద్రిలోని స్వరాజ్ మైదాన్ లో ఈనెల 28న ఆదివారం 50 వేల మందితో నిరసన ప్రదర్శనకు ప్లాన్ చేస్తున్నారు. 250 జతల పోట్ల గిత్తలను కూడా ఈ ఆందోళనకు తీసుకువచ్చేందుకు కంబాళ నిర్వహణ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది.. తొలి ప్రదర్శనలోనే కనీసం అరలక్ష మందితో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. -
హుబ్లీలో ఇంటర్‌స్కూల్ ఫ్యాషన్ షో
-
పసికందును ఎత్తుకుపోయి దొరికిపోయిన మహిళ
-
బాలికపై అత్యాచారం... హత్య
బెంగళూరు(బనశంకరి) : స్థానిక పిల్లగుంప పారిశ్రామిక వాడలో ఎనిమిదేళ్ల బాలికను అత్యాచారం చేసి హతమార్చిన ఘటన సంచలనం రేకెత్తించింది. హుబ్లీలోని కలగటికి చెందిన మహంతేష్, యల్లమ్మ దంపతులు బతుకు తెరువు కోసం బెంగళూరుకు వలస వచ్చి పిల్లగుంప పారిశ్రామిక వాడ సమీపంలో చొక్కహళ్లి గ్రామంలో తాత్కాలిక నివాసం ఏర్పరుచుకున్నారు. వీరికి ఎనిమిదేళ్ల కూతురు ప్రీతి ఉంది. గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లిన బాలిక రాత్రి అయినా ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలింపు చేపట్టారు. సమీపంలోని ఓ షెడ్లో బాలిక నిర్జీవంగా కనిపింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. బాలిక నోటిలో పేపర్ కుక్కి అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సమీపంలోని అంగడి వద్ద ఉన్న సీసీ కెమెరాలోని ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. అందులో ఓ దుండగుడు బాలికను కారు షెడ్లోకి తీసుకెళ్లినట్లు స్పష్టంగా ఉంది. దీని ఆధారంగా మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నట్లు గ్రామాంతర ఎస్పీ రమేష్ బానోత్, అదనపు ఎస్పీ అబ్దుల్ అహ్మద్ తెలిపారు. ఘటనా స్థలాన్ని ఐజీపీ చక్రవర్తి పరిశీలించారు. కాగా, ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. -
ఇరవై ఏళ్ల తర్వాత ఇంటికి..
మొగల్తూరు : యుక్త వయసులో కూలి పనుల కోసం వెళ్లిన కుమారుడు 20 ఏళ్ల తర్వాత తనను వెతుక్కుంటూ స్వగ్రామం చేరుకోవడంతో ఆ కన్నతల్లి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. మొగల్తూరు పోలీస్‌స్టేషన్ పరిధి వెంప పెదపేటకు చెందిన ఇంజేటి పెద్దిరాజు, పద్మావతిల కుమారుడు ఇంజేటి సువర్ణరాజు 1994లో పనుల కోసం హుబ్లీ వెళ్లి ఓ కాంట్రాక్టర్ వద్ద మోసపోయి అష్టకష్టాలు పడ్డాడు. శుక్రవారం స్వగ్రామం వచ్చిన అతడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏడో తరగతి వరకు చదువుకున్న సువర్ణరాజు కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువును మాని కూలి పనులకు వెళ్లేవాడు. కొంతమంది వ్యక్తులు రైల్వే పనులకు వెళితే ఎక్కువ డబ్బులు వస్తాయని సువర్ణరాజుకు చెప్పారు. రైల్వే కాంట్రాక్టర్ వద్ద పని చూపిస్తామని రూ.10 వేలు చెల్లించాలని చెప్పడంతో వారి మాటలు విని ఆ మొత్తాన్ని వారికి ఇచ్చాడు. పనుల కోసం 1994లో రైల్వే కాంట్రాక్టర్ వద్దకు హుబ్లీ వెళ్లాడు. అక్కడ కాంట్రాక్టర్ రాజును చిత్రహింసలకు గురి చేశాడు. పనులు చేయించుకున్నా జీతం ఇవ్వకపోగా బయటకు వెళ్లడానికి వీల్లేదని చెప్పడంతో మోసపోయినట్టు గ్రహించాడు. తిండి కూడా సరిగా పెట్టేవాడు కాదని , స్వగ్రామం వెళ్లడానికి మొహం చెల్లక అదే ప్రాంతంలో ఉండిపోయినట్టు తెలిపారు. ఆ ప్రాంత యువతిని వివాహం చేసుకున్నానని, ఇద్దరు పిల్లలు కలిగినట్టు చెప్పారు. అక్కడ కష్టాలు అనుభవించలేక రాజు 20 ఏళ్ల తర్వాత శుక్రవారం వెంప చేరుకున్నాడు. ఇక భార్యా పిల్లలతో కలిసి వెంపలోనే తల్లి వద్దే ఉంటానని చెప్పాడు. మూడు సంవత్సరాల క్రితం భర్త మరణించడం, మరో కుమారుడు దుబాయ్ వెళడంతో ఒంటరిగా ఉంటున్న పద్మావతికి ఇక రాడు అనుకున్న కొడుకు తిరిగి రావడంతో ఆమె ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. -
అదృశ్యమైన మేక.. ఎక్కడుందో తెలియక...
హుబ్లీ: మేకను పట్టండి.. పది వేల రూపాయలు పట్టుకెళ్లండి. ఇదేదో వాణిజ్య ప్రకటన అనుకోకండి. పశ్చిమబెంగాల్ లోని హవేరి జిల్లాలోని నెగలూర్ గ్రామస్థులు ఈ ప్రకటన చేశారు. దీంతో తప్పిపోయిన మేకకు పట్టుకునేందుకు గ్రామస్థులతో పాటు అందరూ గాలిస్తున్నారు. ఒక్క మేకకు పట్టుకునేందుకు పది వేలా అని ఆశ్చర్యపోకండి. దీని వెనుక చాలా కథ ఉంది. ఇది గ్రామంలోని మసీదుకు చెందినది. 11 ఏళ్ల క్రితం కొందరు భక్తులు దీన్ని మసీదుకు కానుకగా ఇచ్చారు. దీంతో ఈ మేకపై గ్రామస్థులకు అవాజ్యమైన భక్తి ఏర్పడింది. అన్ని పండుగలు, మత కార్యక్రమాల్లోనూ ఇది ప్రధాన ఆకర్షణ నిలిచేది. కొద్ది రోజుల క్రితం ఈ మేక అదృశ్యమైంది. దీని ఆచూకీ చేసిన గ్రామస్థులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇక చేసేది లేక భారీ నజారానా ప్రకటించారు. తమ అభిమాన మేకను తెచ్చిన వారికి రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు. మేక ఆచూకీ కోసం పోస్టర్లు కూడా పెట్టారు. ఈ మేకతో తమకు విడదీయలేని అనుబంధం ఉందని గ్రామస్థులు తెలిపారు. తామెంతో అభిమానంగా చూసుకునే మేక మాయమవడం తమను షాక్‌కు గురి చేసిందని అన్నారు. కావాలనే ఎవరో తమ మేకను ఎత్తుకు పోయారని వారు ఆరోపిస్తున్నారు. దయచేసి తమ మేకకు తమకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. మేక కోసం గ్రామస్థులు పడుతున్న తపన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.