
అనంతపురం: జిల్లా కేంద్రమైన అనంతపురంలో మట్కా రాకెట్ గుట్టు రట్టు అయింది. 15మంది నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా, ముంబయి, హుబ్లి ప్రాంతాల నుంచి వచ్చి మట్కా నిర్వహిస్తున్నట్లు తమకందిన సమాచారం మేరకు పోలీసులు వీరిని అరెస్టు చేశారు. ముంబయి, హుబ్లి జూద కంపెనీలపై ఆరా తీస్తున్నామని ఎస్పీ జి.వి.జి. అశోక్‌కుమార్ చెప్పారు. దీనికి సహకరించే పోలీసులను ఉపేక్షించేది లేదని, మట్కా నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment