Matka Business
-
శ్రీవారిని దర్శించుకున్న మట్కా టీమ్.. వీడియో వైరల్!
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం మట్కా. కరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పోటీకి రెడీ అయింది. కోలీవుడ్ స్టార్ సూర్య మూవీ కంగువాతో బాక్సాఫీస్ బరిలో నిలిచింది. మట్కా, జూదం నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవల వైజాగ్‌లో మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున నిర్వహించారు.తాజాగా మట్కా టీమ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సినిమా విడుదలకు ఒక రోజు ముందు టీమ్ అంతా కలిసి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. మూవీ సూపర్ హిట్ కావాలని ప్రత్యేక పూజులు చేశారు. వీరికి ఆలయ పండితులు మర్యాదలతో సత్కరించారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.ప్రస్తుతం వరుణ్ తేజ్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఇవాళ తిరుపతిలోని ఎన్విఆర్ సినిమాస్‌లో జరిగే ఈవెంట్‌కు హాజరుకానున్నారు. కాగా.. పీరియాడిక్ క్రైమ్ డ్రామాగా వస్తోన్న మట్కా చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ భామ నోరా ఫతేహి కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీతో తెలుగులో నోరా ఫతేహీ అరంగేట్రం చేయనుంది. మట్కా జూదగాడైన రతన్ ఖేత్రి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సలోని అశ్వని, సత్యం రాజేష్, పి రవిశంకర్, కిషోర్, నవీన్ చంద్ర,అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైరా ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. Mega Prince #VarunTej and #Matka team at Tirumala Tirupati Devasthanam. pic.twitter.com/poJsm8diW5— Filmyscoops (@Filmyscoopss) November 13, 2024 -
చోటా డాన్ రజాక్, ఖాజాలకు జేసీ సోదరుల అండ !
తాడిపత్రిలో చీకటి మాటున మట్కా మాఫియా రాజ్యమేలుతోంది. ఒకప్పటి జూదరులు ఇప్పుడు బుకీలుగా అవతారమెత్తి చోటా మట్కా డాన్‌తో కలిసి అమాయక ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపెడుతున్నారు. డబ్బు ఆశ చూపి వారిని రొంపిలోకి లాగుతున్నారు. అత్యాశకు పోయిన సామాన్యులు జేబులకు చిల్లు వేసుకుంటున్నారు. తాడిపత్రి అర్బన్: మట్కా మహమ్మారి అంకెల గారడీతో అమాయకులను బురిడీ కొట్టిస్తోంది. మట్కా తగిలితే రూపాయికి రూ.80 ఇస్తామని ఆశ చూపిస్తోంది. దీంతో ఎంతోమంది కూలీనాలీచేసుకునే వారు, వ్యాపారులు, చిరుద్యోగులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు, సులభంగా డబ్బు సంపాదించుకునేందుకు మట్కాను ఎంచుకుంటున్నారు. పోలీసులు మట్కాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నా టీడీపీ నేతల అండదండలున్న నిర్వాహకులు తమ పంథాను మాత్రం మార్చుకోవడం లేదు. కేరళ నుంచి వలస వచ్చి స్థిరపడిన వ్యక్తి ఈ ప్రాంతానికి మట్కాను పరిచయం చేశాడు. ఆ వ్యక్తి కుమారుడైన రషీద్ మట్కా పగ్గాలు చేపట్టాక అనతికాలంలోనే డాన్‌గా ఎదిగాడు. టీడీపీకి చెందిన జేసీ సోదరుల (మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి – మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి)ఆశీస్సులుండడమే ఇందుకు కారణమన్న విమర్శలు ఉన్నాయి. తెరపైకి చోటా డాన్ రజాక్ మట్కా డాన్ రషీద్ కరోనాతో మృత్యువాతపడ్డాక పట్టణంలో మట్కా కొన్నాళ్లు మరుగున పడింది. తన అన్న (ఎల్లో డాన్) వారసత్వాన్ని అబ్దుల్ రజాక్ కొనసాగించడంతో మట్కా తిరిగి పుంజుకుంది. గతంలో బళ్లారికి చెందిన రిజ్వాన్‌ను శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. రిజ్వాన్ ఇచ్చిన సమాచారంతో ఎస్పీ టీం అప్పట్లో అబ్దుల్ రజాక్‌ను అదుపులోకి తీసుకుంది. కర్ణాటకలోని హుబ్లీకి చెందిన వినాయక్ మేత్రాని అనే మట్కా నిర్వాహకుడిని కూడా పోలీసులు అప్పట్లో అదుపులోకి తీసుకున్నారు. అయితే రిజ్వాన్, వినాయక్ మేత్రాని అనే వీరిరువురు సౌత్ ఇండియాలోనే మట్కా కంపెనీల్లో నంబర్ వన్ షేర్‌హోల్డర్స్. వీరిలో రిజ్వాన్‌కు తాడిపత్రికి చెందిన అబ్దుల్ రజాక్ మట్కా పట్టీలు ఇచ్చేవాడని అప్పట్లో పోలీసులు గుర్తించారు. టీడీపీకి చెందిన మరో మట్కా డాన్ మకందర్ ఖాజా అలియాస్ లప్ప ఖాజా కుటుంబం మొత్తం తాడిపత్రిలో మట్కా పురుడు పోసుకున్నప్పటి నుంచి మట్కా నిర్వహిస్తుండడం విశేషం. వీరి కుటుంబంలో మహిళలే మట్కా నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు కూడా గుర్తించారు. ఇటీవల మకందర్ ఖాజా తండ్రి మునీర్బాషాతో పాటు ఖాజా సతీమణి షేక్ నూరీని అరెస్టు చేశారు. పోలీసులనే టార్గెట్ చేసి.. తాడిపత్రి పచ్చ మట్కా మాఫియాలో కీలక సూత్రధారి రషీద్ సోదరుడు అబ్దుల్ రజాక్‌ను కొద్ది రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మట్కాను పూర్తిస్థాయిలో ఆపాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అబ్దుల్ రజాక్ కుటుంబం ఏకంగా పోలీసులనే టార్గెట్ చేసింది. సీఐ హమీద్‌ఖాన్ తమను వేధిస్తున్నాడంటూ మొసలి కన్నీరు కార్చింది. తెరవెనుక ‘పచ్చ’ కుట్ర మట్కా మాఫియాను ఇన్నాళ్లూ పెంచి పోషించిన ‘పచ్చ’ నేతలకు అర్బన్ సీఐ హమీద్‌ఖాన్ చర్యలు మింగుడుపడడం లేదు. ఈయన ఉంటే తమ ఆటలు సాగవని భావించిన ‘పచ్చ’ నేతలు బురదజల్లేందుకు ప్రయతి్నస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల చోటా డాన్ అబ్దుల్ రజాక్ భార్యతో పోలీసు శాఖలోని కీలక అధికారులపై ఆరోపణలు చేయిస్తున్నారు. మానవ హక్కుల సంఘం, ప్రైవేటు కేసుల పేరుతో పోలీసులను బ్లాక్మెయిల్ చేసి మట్కాను సాగించాలని పథకం రచిస్తున్నారు. మట్కారాయుళ్లపై కొరడా ఎన్నడూ లేని విధంగా తాడిపత్రి పోలీసులు మట్కా రాయుళ్లపై కొరఢా ఝళిపిస్తున్నారు. అర్బన్ సీఐగా పి.హమీద్‌ఖాన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మట్కాపై ఉక్కుపాదం మోపారు. పట్టణంలో మట్కా ఎవరు నిర్వహిస్తున్నారన్న దానిపై ఆరా తీసి వారికి ముందుగా హెచ్చరికలు జారీ చేశారు. తీరు మార్చుకోని వారిని జిల్లా నుంచి బహిష్కరించేందుకు కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపించారు. కలెక్టర్ గౌతమి ఉత్తర్వుల మేరకు మట్కా నిర్వాహకులు బుక్కపట్నం శివకుమార్, చుక్కలూరు చాంద్‌బాషా, మక్తుం పాల మాబు, దూదేకుల కుళ్లాయప్ప, ఉదయగిరి మాబున్నీ, దిగువపల్లి పుల్లయ్య, తుంగ రామాంజులరెడ్డిలపై ఆరు నెలల పాటు జిల్లా బహిష్కరణ వేటు వేశారు. ఆన్లైన్లో మట్కా సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి నిర్వాహకులు మట్కాను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. కొందరు మట్కా నిర్వాహకులు స్వయంగా యాప్ డెవలపర్స్.. మిలాన్డే, మిలాన్ నైట్ పేర్లతో ప్రత్యేక వెబ్సైట్లు రూపొందించి యాప్‌ల ద్వారా అండ్రాయిడ్ ఫోన్లకు లింక్‌లను పంపి గుట్టుగా మట్కా నిర్వహిస్తున్నారు. ఇందుకు గాను సదరు ఆండ్రాయిడ్ యూజర్ రూ.10 వేలు నగదు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. డిపాజిట్‌దారుకు ఐడీ, పాస్వర్డ్ ఇస్తారు. ఆ పాస్వర్డ్ ఉపయోగించి మట్కా నిర్వహించుకోవాలి. రూ.100కు రూ.8వేలు చెల్లిస్తామంటూ అమాయకుల బతుకులను నాశనం చేస్తున్నారు. ఉపేక్షించేది లేదు మట్కా విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదు. ఎక్కడైనా, ఎప్పుడైనా మట్కా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి. నేను బాధ్యతలు తీసుకున్నాక ఇప్పటి వరకు మట్కా స్థావరాలపై దాడులు జరిపి, 33 కేసులు నమోదు చేశాం. మట్కా, గ్యాంబ్లింగ్‌ను కూకటివేళ్లతో పెకలించాలని సీఐ, ఎస్ఐలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. ఆన్లైన్ మట్కాను కూడా నిర్మూలిస్తాం. – సీఎం.గంగయ్య, డీఎస్పీ, తాడిపత్రి -
ఖాకీ అసాంఘిక దోస్తీ..
సాక్షిప్రతినిధి, కర్నూలు: జిల్లాలో మట్కా, క్రికెట్ బెట్టింగ్, పేకాట జోరుగా సాగుతోంది. అక్రమార్జన కోసం కొందరు పోలీసులు అసాంఘిక కార్యకలాపాలకు సహకారం అందిస్తున్నారు. ఈ విషయంపై గతంలో నేరుగా ఎస్పీకి ఫిర్యాదులు అందాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని వీఆర్‌కు పంపినా పరిస్థితిలో మార్పు లేదు. నెలవారీ మామూళ్లు ఇస్తూ కొన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో జూద కేంద్రాలను బహిరంగంగానే నిర్వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మట్కా రాయుళ్ల నుంచి ఒక్కో పోలీస్‌స్టేషన్‌కు నెలకు రూ. 50వేల నుంచి రూ.లక్ష వరకు మామూళ్లు వస్తున్నట్లు తెలుస్తోంది. నంద్యాల కేంద్రంగా.. నంద్యాల కేంద్రంగా మట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగ్ సాగుతోంది. మట్కా శీను అంతా తానై నడిపిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. చాంద్‌బాషా కూడా కొన్ని ప్రాంతాల్లో మాట్కా నడుపుతున్నాడు. ఇతని సోదరి ఏకంగా పోలీసుల వాట్సప్ గ్రూపులో చేరి సమాచారాన్ని సేకరిస్తున్నారంటే విషయం అర్థం చేసుకోవచ్చు. కొన్ని నెలల కిందట పట్టణంలోని ఎన్జీవో కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని పేకాట నిర్వహిస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు దాడులు చేసి రూ.9 లక్షల నగదు, కారు, బైకులు సీజ్ చేశారు. ఆ తర్వాత కూడా ఈ ప్రాంతంలో యథేచ్ఛగా పేకాట ఆడుతున్నారు. అయినా పోలీసులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గాజులపల్లెకు చెందిన ఓ వ్యక్తి నంద్యాల కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. ఇండియా మ్యాచ్‌లే కాకుండా స్పోర్ట్స్ చానెల్లో ఏ దేశం క్రికెట్ మ్యాచ్‌లు జరిగినా, ఏ లీగ్ లైవ్ జరిగినా బెట్టింగ్ నిర్వహిస్తూ యువకుల జేబులు కొల్లగొడుతున్నాడు. బెట్టింగ్ ఊబిలో విద్యార్థులు.. క్రికెట్ బెట్టింగ్ అంటే గతంలో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పేరు వినిపించేది. ఇప్పుడు కర్నూలు, నంద్యాలలో కూడా జోరుగా నడుస్తోంది. బడా వ్యాపారుల నుంచి బార్బర్ షాపు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకుల వరకూ అంతా బెట్టింగ్ ఊబిలో చిక్కుకునిపోయారు. ఇటీవల విద్యార్థులు కూడా దీనికి బానిసవుతున్నారు. ప్రభుత్వం జాబ్ కేలండర్ ప్రకటించడంతో సర్కారు కొలువు దక్కించుకోవాలని చాలామంది హాస్టళ్లలో ఉండి కోచింగ్ తీసుకుంటున్నారు. తల్లిదండ్రుల కష్టపడి పిల్లల చదువు కోసం డబ్బులు పంపిస్తే, తెలిసీతెలియక వ్యసనాలకు వారు బానిసవుతున్నారు. పర్యాటక ప్రాంతాల్లో పేకాట క్లబ్‌ల్లో పేకాట నిషేధించడంతో పేకాట రాయుళ్లు ఇళ్లను అద్దెకు తీసుకుని ఆడుతున్నారు. జిల్లా నుంచి రాయచూరు క్లబ్‌కు వెళ్లేవారు కూడా అధికంగా ఉన్నారు. జిల్లాలో పర్యాటక ప్రాంతాలైన సుంకేసుల, ఓర్వకల్లు రాక్‌గార్డెన్, అవుకు రిజర్వాయర్ సమీపంలో పేకాట ఆడుతున్నారు. ఇటీవలే జిల్లా ఎస్పీగా సుధీర్‌కుమార్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించిన అధికారిగా ఈయనకు పేరు ఉంది. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. -
పోలీస్ వాట్సప్ గ్రూప్‌లో మట్కా డాన్ కూతురు..
సాక్షి, బొమ్మలసత్రం: దొంగకు ఇంటి తాళాలు ఇవ్వడం అనేది ఓ సామెత. ఇక్కడ పోలీసులే ఆ పని చేసి అందిరినీ ఆశ్చర్య పరిచారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులే నిందితులకు స్టేషన్ తాళాలు ఇచ్చేశారు. ముందస్తు దాడుల వివరాలు, ఎఫ్ఐఆర్ నమోదు, నిందితుల రిమాండ్ తదితర వివరాలు నిందితులకు ఎప్పటికప్పుడు తెలిసే లా ఏర్పాటు చేశారు. పోలీసులకు చెందిన వాట్సప్ గ్రూపులో నంద్యాల మట్కా డాన్ కుమార్తె నంబర్ ఉన్నట్లు పోలీసులు ఆలస్యంగా తెలుసుకున్నారు. గ్రూప్‌లో ఆమె నంబర్ ఉండటంతో పోలీసుల దాడుల వివరాలు ముందే తెలుసుకుని ఆ సమాచారాన్ని మట్కా నిర్వాహకులకు తెలియజేస్తూ తప్పించేది. ఈ విషయం బయటపటంతో నంద్యాలలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈనెల 13వ తేదీ పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మట్కా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో త్రీటౌన్ పరిధిలో ఉన్న కొలిమిపేటకు చెందిన చాంద్‌బాషా తన కుటుంబ సభ్యులతో కలిసి మట్కా నిర్వ హిస్తుండగా సీఐ మోహన్‌రెడ్డి, ఎస్ఐలు తిరుపాలు, నగీనా సిబ్బందితో కలిసి దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. చాంద్‌బాషా కుటుంబంలోని ఓ మహిళ సెల్ నెంబర్ త్రీటౌన్ అఫీషియల్ వాట్సప్ గ్రూప్‌లో ఉండటాన్ని పోలీసులు గమనించి వెంటనే గ్రూప్ నుంచి తొలగించారు. ఈ విషయం పోలీసు ఉన్నతాధికారులకు తెలియడంతో విచారణకు ఆదేశించారు. ఇందుకు బాధ్యులైన కానిస్టేబుల్ హరిప్రసాద్‌ను సస్పెండ్ చేసి పూర్తి విచారణ చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. ఇందులో ఇద్దరు మహిళా పోలీసుల పాత్రపై కూడా అనుమానం ఉండటంతో విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. -
మట్కారాయుడి కాంట్రాక్టర్ ముసుగు
ఆదోని టౌన్: రోడ్లు వేసే కాంట్రాక్టర్‌నని నమ్మించి ఓ యువకుడు స్థానిక టీజీఎల్ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. కాంట్రాక్టర్ ముసుగులో ఆదోని, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో మట్కా రాస్తూ, అవసరమైన వారికి గంజాయి విక్రయిస్తూ పోలీసుల చేతికి చిక్కి కటకటాలపాలయ్యాడు. నిందితుడి వివరాలను మంగళవారం డీఎస్పీ రామకృష్ణ తన బంగ్లా వద్ద విలేకరులకు వెల్లడించారు. ఎమ్మిగనూరు పట్టణంలోని మేకల బజార్లో నివాసముంటున్న అదిమి మోహన్‌కుమార్ కాంట్రాక్టర్ ముసుగులో మట్కా రాయడం, గంజాయిని విక్రయి స్తూ నెలకు వేలకు వేలు సంపాదిస్తున్నాడు. ఇటీవల ఆదోని పట్టణంలోని టీజీఎల్ కాలనీకి మకాం మార్చాడు. అక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకొని అసాంఘిక కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నాడు. స్థానికుల సమాచారంతో వన్‌టౌన్ సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ కేపీ ప్రహ్లాద్, సిబ్బంది మంగళవారం వలపన్ని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు గుట్టు బయటపడింది. మొబైల్లో కోడ్‌భాష వినియోగిస్తూ వాట్సాప్, వాయిస్ కాల్స్ ద్వారా మట్కా లావాదేవీలను నిర్వహిస్తున్నట్లు విచారణలో అంగీకరించాడు. నెలకు దాదాపు రూ.5లక్షలకు పైగానే ఆదా యం ఆర్జిస్తున్నట్లు తెలుసుకుని పోలీసులే అవాక్కయ్యారు. అదనపు పనిగా కావాల్సిన వారికి గంజాయి కూడా సరఫరా చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. మోహన్‌కుమార్‌ను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి రూ.66 వేల నగదు, 190 గ్రాముల గంజాయి, మట్కా చీటీలు, మోటార్ సైకిల్, 4ఏటీఎం కార్డులు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరిచినట్లు డీఎస్పీ చెప్పారు. కేసును ఛేదించిన ఎస్ఐ ప్రహ్లాద్, ఇద్దరు కానిస్టేబుళ్లకు డీఎస్పీ, సీఐ నగదు రివార్డును అందజేశారు. -
ఆ సీఐకు రూ.2 లక్షలు ఇవ్వాలట!
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం: ‘స్టేషన్ పరిధిలో ఎంతో మంది మట్కా కంపెనీలు నిర్వహిస్తున్నారు.. అయినా వారిని పోలీసులు పట్టించుకోలేదు.. అయితే మట్కా రాస్తున్నారనే కారణంతో మా పిల్లలను నలుగురిని వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. వారిని కోర్టులో హాజరు పరచకుండా రూ. 2 లక్షలు డబ్బు తీసుకొని రావాలంటూ 15 రోజుల నుంచి సీఐ ఈశ్వరరెడ్డి బెదిరిస్తున్నారు..’ అంటూ మహిళలు ఆదివారం పెద్ద ఎత్తున ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. హైదర్‌ఖాన్ వీధి, కేహెచ్‌ఎం స్ట్రీట్‌కు చెందిన షేక్ కరిముల్లా, సర్ఫరాజ్, యర్రబల్లి ఖాజా, గయాజ్ మట్కా రాస్తున్నారనే కారణంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసులు పట్టుకొని 15 రోజులు అవుతోందని, అయినా కేసు పెట్టకుండా రోజూ స్టేషన్‌కు తిప్పుకుంటున్నారని వారి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసుల చర్యలను నిరసిస్తూ వారి కుటుంబ సభ్యులు, వీధిలోని మహిళలు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. రూ. లక్షలు ఎక్కడి నుంచితెస్తారు..? మట్కా రాయడం తప్పేనని, అయితే కేసు రాసి కోర్టులో హాజరు పరచాల్సిన పోలీసులు తమ అదుపులోనే పెట్టుకున్నారని మహిళలు ఆరోపించారు. స్టేషన్ పరిధిలోనే పెద్ద పెద్ద మట్కా కంపెనీ నిర్వాహకులు ఉన్నారని, వారిని పట్టుకోకుండా రూ. 2 లక్షలు డబ్బు తీసుకొని రావాలని సీఐ ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. కూలి, నాలీ చేసుకొని జీవించే యువకులు రూ. లక్షలు ఎలా తెస్తారని వారన్నారు. కోర్టుకు పెట్టమని అడిగితే కేసులో రూ. 1.06 లక్షలు, స్టేషన్‌కు రూ. 1 లక్ష ఇవ్వాలని డిమాండు చేస్తున్నారని తెలిపారు. శనివారం రాత్రి స్టేషన్లో ఉన్న నలుగురికి అన్నం కూడా పెట్టలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలియడంతో స్థానిక మైనార్టీ నాయకుడు వైఎస్ మహమూద్తో పాటు మరి కొందరు స్టేషన్ వద్దకు వచ్చారు. అక్కడికి వచ్చిన డీఎస్పీ సుధాకర్‌తో మాట్లాడారు. తర్వాత డీఎస్పీ మహిళలతో మాట్లాడి న్యాయం చేస్తానని చెప్పారు. ఎస్పీ విచారణ ? మట్కా కేసులో నలుగురిని అరెస్ట్ చేసిన సంఘటనలో ఆరోపణలు రావడం, కేసులోని నిందితుల బంధువులు, మహిళలు పెద్ద ఎత్తున వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని ఆందోళన చేయడాన్ని జిల్లా ఎస్పీ అన్బురాజన్ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు స్థానిక పోలీసు అధికారులతో ఎస్పీ మాట్లాడినట్లు తెలుస్తోంది.పోలీసుల అదుపులో ఉన్న నలుగురిని ఆదివారం కడపకు తీసుకొని వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. వీరిని ఎస్పీ స్వయంగా విచారణ చేసినట్లు తెలిసింది. ఎస్పీ ఎదుట నలుగురు చెప్పే సమాధానంపై వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ అధికారుల భవితవ్యం ఆధారపడి ఉంది. పోలీసు అధికారులు డబ్బు డిమాండు చేశారని నలుగురు చెబితే మాత్రం కచ్చితంగా శాఖాపరమైన చర్యలు ఉంటాయని పోలీసు వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కేసు నమోదు చేశాం.. కరిముల్లా, సర్ఫరాజ్, యర్రబల్లి ఖాజా, గయాజ్తో పాటు ప్రధాన మట్కా నిర్వాహకుడు ఖదీర్‌పై శనివారం కేసు నమోదు చేశాం. నలుగురి కోసం కుటుంబ సభ్యులు వస్తే జామిన్ ఇచ్చి పంపించాలనుకున్నాం. కానీ ఎవ్వరూ రాలేదు. ఈ లోపే అందరూ స్టేషన్ వద్దకు వచ్చారు. ఇటీవల వైఎస్ మహమూద్‌పై రెండు కేసులు నమోదు చేశాం. అందువల్లనే అతను స్టేషన్ వద్దకు వచ్చి రాద్ధాంతం చేశాడు. డబ్బు ఇవ్వాలని ఎవ్వరినీ డిమాండు చేయలేదు. – ఈశ్వరరెడ్డి, వన్‌టౌన్ సీఐ, ప్రొద్దుటూరు. -
చర్చనీయాంశంగా ‘పచ్చ’పోలీసు
క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే పోలీసు శాఖలో ఓ ఇంటి దొంగ పెత్తనం మితిమీరింది. జిల్లా పోలీసు బాస్ తనదైన శైలిలో అరాచక శక్తుల ఆటకట్టించే ప్రయత్నం చేస్తున్నా.. ఆ ప్రణాళిక సమాచారం దాడులకు ముందే నేరగాళ్లకు చేరిపోతోంది. గత ఎన్నికల సమయంలోనూ ఈ ‘పచ్చ’ పోలీసు ఏకపక్షంగా వ్యవహరించిన తీరు ఆ శాఖలో చర్చనీయాంశమైంది. ఇప్పటికీ ఆయన పంథా ఇలాగే కొనసాగుతోంది. మామూళ్ల మత్తులో అక్రమార్కుల పట్ల ఆయన చూపుతున్న ‘విశ్వాసం’ పోలీసు శాఖ పరువును బజారున పడేస్తోంది. –సాక్షి ప్రతినిధి, అనంతపురం సాక్షి, తాడిపత్రి(అనంతపురం) : నియోజకవర్గంలోని మట్కా డాన్ రషీద్‌తో పాటు క్రికెట్ బుకీలు దాడుల కంటే ముందుగానే అక్కడి నుంచి తప్పించుకుపోయారు. ప్రస్తుతం సదరు మట్కాడాన్ ఏకంగా గోవాలో మకాం వేశారు. పోలీసు శాఖ ఎంతో గోప్యంగా దాడులకు ప్లాన్ చేస్తున్నా.. సమాచారం అసాంఘిక శక్తులకు ముందుగానే చేరిపోతోంది. ఈ వ్యవహారంలో ఓ పోలీసు అధికారి హస్తం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. మట్కా డాన్లు.. క్రికెట్ బుకీలు.. అసాంఘిక శక్తులకు ఆయనో సమాచార కేంద్రం. పోలీసు శాఖ ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరిపై దాడులు చేస్తుందో ముందుగానే తెలుసుకోవడం, సంబంధిత వ్యక్తులకు చేరవేసి తన పబ్బం గడుపుకోవడం గత కొంతకాలంగా జరిగిపోతోంది. మట్కా.. పేకాట.. బెట్టింగ్.. ఇతరత్రాలను సమూలంగా అరికట్టేందుకు జిల్లా పోలీసు బాస్ వాటి మూలాల్లోకి వెళుతున్నా, ప్రధాన నిర్వాహకులు చిక్కినట్లే చిక్కి తప్పించుకుపోతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం వెనుక సొంత శాఖలోనే ఓ లీకు వీరుడు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా టీడీపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి మరీ దాడుల సమాచారం చేరవేస్తున్నట్లు సమాచారం. ఫలితంగా.. తాడిపత్రి నియోజకవర్గంలోని మట్కా డాన్ రషీద్‌తో పాటు క్రికెట్ బుకీలు పోలీసులకు చిక్కకుండా తప్పించుకోగలిగారని పోలీసు శాఖలోనే చర్చ జరుగుతోంది. గతంలో జిల్లావ్యాప్తంగా ఉన్న మట్కాడాన్లతో పాటు క్రికెట్ బుకీలు, గ్యాంబ్లర్ల భరతం పట్టేందుకు జిల్లా ఎస్పీ సత్యయేసు బాబు సిద్ధమయ్యారు. ఆ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న మట్కాడాన్లు, క్రికెట్‌బుకీల జాబితాను పోలీసు ఉన్నతాధికారులు సిద్ధం చేశారు. జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్‌లోని కీలకమైన అధికారులకు మాత్రమే ఈ సమాచారం ఉంది. సదరు వ్యక్తులు ఎక్కడెక్కడ ఉన్నారు? ఏ విధంగా పట్టుకోవాలనే పక్కా ప్లాన్‌ను కూడా అధికారులు వేసుకున్నారు. సిద్ధం చేసిన జాబితాలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే అనుచరులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో సదరు సమాచారాన్ని పోలీసు శాఖలోని ఓ లీకు వీరుడు నేరుగా ఆ మాజీ ఎమ్మెల్యేకే ఫోన్ చేసి చేరవేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందువల్లే అక్రమార్కులు తప్పించుకున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం. పలు ఫిర్యాదులు.. వాస్తవానికి ముందస్తుగా సమాచారాన్ని లీకు చేసిన ఆరోపణలను ప్రధానంగా ఒక పోలీసు అధికారి ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా సదరు పోలీసు అధికారిపై గతంలోనే అనేక ఫిర్యాదులు ఉన్నాయి. అప్పట్లో పూర్తిగా అధికారపార్టీకి తొత్తుగా వ్యవహరించారని కూడా తెలుస్తోంది. ఎన్నికల సమయంలో కూడా అధికార పార్టీ కార్యకర్తగా వ్యవహరించి ప్రతీ సమాచారాన్ని చేరవేయడమే కాకుండా.. పార్టీ మారేందుకు ఎవరెవరు సిద్ధమవుతున్నారు? వారిని జారుకోకుండా చూసుకోవాలని కూడా సూచనలు చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సదరు పోలీసు అధికారిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇలా పట్టుబడకుండా ఉన్న మట్కాడాన్ ప్రధానంగా గోవాలో మకాం వేయడంతో పాటు అప్పుడప్పుడూ తాడిపత్రికి కూడా వచ్చిపోతున్నారనే సమాచారం కూడా పోలీసుల వద్ద ఉంది. అయినప్పటికీ పట్టుకునేందుకు ప్రయత్నించకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
మట్కా మాయ
సాక్షి, సదాశివపేట(సంగారెడ్డి): రూపాయికి 80 తగులుతుందని ఆశపెడుతూ పేద, మధ్యతరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని మట్కా జూదం సాగుతుంది. మట్కా తగలడం మాటేమోగాని, మట్కా రాపిస్తున్న ఏజెట్లు మాత్రం రూ.లక్షలకు పడగలెత్తుతున్నారు. మట్కా జిల్లాలో చాపకింద నీరులో వ్యాప్తి చెందుతుంది. దీని మాయలోపడి అనేక మంది జీవితాలు బుగ్గిపాలవుతున్నాయి. వివిధ కంపెనీల పేరుతో మట్కానడుపుతున్న నిర్వాహకులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నారు. ఇన్నాళ్లు చెట్లకింద, కాలనీలు, ఫౌంహౌజ్ల్లో మట్కా రాసే ఏజెట్లు సెల్ఫోన్లు ఇంటర్నెట్లతోపాటు బహిరంగంగా మట్కా రాస్తున్నారు. ఒక సారి ఈ రొచ్చులో దిగితే బయట పడడం కష్టం, ఒక మట్కా చార్టు పెట్టుకుని అంకెలగారడీ చేసుకుంటూ ఉండాల్సిందే. వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగులు, కార్మికులు, వివిధ పార్టీల నాయకులు, యువకులు విద్యార్థులు సైతం దీనికి అలవాటుపడి బయటపడలేక పోతున్నారు. పోలీసులకు సవాలుగా మట్కా మట్కా ఉచ్చులోపడి వందలాది కుటుంబాలు ఆర్థికంగా చితికి పోతున్నాయి. అప్పులభారంతో ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. మట్కాను నియంత్రించాల్సిన పోలీసులశాఖ కిందిస్థాయి అధికారులు మట్కా ఏజెంట్ల వద్ద నెల వారి మాముళ్లు తీసుకుని ఉరుకుంటున్నారని సమాచారం, పోలీసులకు మాముళ్లు ఇవ్వని ఏజెంట్లను గంజాయి కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారే తప్ప నివారణ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మట్కా అంటే పోలీసులకు ఒకరిద్దరు మాత్రమే గుర్తుకు వచ్చి వారిని పట్టుకుని గంజాయి కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారని సమాచారం. జిల్లాలోని సదాశివపేట, జహీరాబాద్, సంగారెడ్డి, పటాన్చెరు, జోగిపేట తదితర పట్టణాలు గ్రామాల్లో మట్కా జోరుగా సాగుతుందని విశ్వసనీయ సమాచారం. గల్లీకో మట్కా ఏజెంట్.. సదాశివపేట పట్టణంలో పోలీసులకు ఐదారు మంది మాత్రమే మట్కా ఏజెంట్లు ఉన్నారని అనుకుంటూ వారి వద్దకే కానిస్టెబుళ్లు వెళ్లి నెలనెల మాముళ్లు తీసుకుంటున్నారని సమాచారం. కాని పట్టణంలో గల్లీకో మట్కా ఏజెంట్లు తయారై మట్కా రాపిస్తున్నారు. మట్కా జూదం సదాశివపేట పట్టణంలో విచ్చల విడిగా బహిరంగంగా కొనసాగుతున్న పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదని బహిరంగ రహస్యమే. -
మనోళ్లకు మామూళ్లే!
అనంతపురం సెంట్రల్: దొంగతనాలు.. క్రికెట్ బెట్టింగ్.. మట్కా.. అసాంఘిక కార్యకలాపాలకు జిల్లా నిలయంగా మారుతోంది. వీటి విషయంలో స్థానిక పోలీసులు అంటీముట్టనట్లుగా వ్యవహరి స్తుండటం మొత్తం పోలీసు వ్యవస్థను అప్రతిష్టపాలు చేస్తోంది. ముఖ్యంగా అంతర్జిల్లా దొంగలు సైతం ఆయా ప్రాంతాల్లో చోరీ చేసిన సొమ్మును నగరంలోని పలు బంగా రు దుకాణాల్లో విక్రయించిన ఘటనలు వెలుగుచూడటం ఇక్కడి పరిస్థితులకు అద్దం పట్టింది. ఈ నేపథ్యంలో హైదరబాద్, తమిళనాడు పోలీసులు సైతం జిల్లా కేంద్రానికి వచ్చి సొమ్ము రికవరీ చేసుకుపోవడం గమనార్హం. దొంగలు ఈ ప్రాంతాన్ని తమ అడ్డాగా మార్చుకున్నా స్థానిక పోలీసులు ‘ఇంటి దొంగలను’ గుర్తించలేకపోవడం గమనార్హం. క్రికెట్ బెట్టింగ్, మట్కా లాంటి అసాంఘిక శక్తులు సైతం జిల్లాను అడ్డాగా చేసుకుంటున్నాయి. తాడిపత్రిలో జేసీ సోదరుల అనుచరులుగా చెలామణి అవుతున్న వ్యక్తులు మట్కా నిర్వహిస్తున్నట్లు గతేడాది వైఎస్సార్ జిల్లా సీఐ హమీద్‌ఖాన్ జరిపిన దాడుల్లో తేలింది. ఏకంగా పోలీసులపై దాడి చేసి వారి వాహనాలను తగలబెడితే ఖండించాల్సింది పోయి వారికే అనుకూలంగా ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడారు. పోలీసులపైనే కౌంటర్ కేసులు నమోదు చేయించారు. ఈ ఘటనలో నిందితులను అరెస్ట్ చేయలేకపోయినా తాడిపత్రిలో జరుగుతున్న చీకటి మట్కా సామ్రాజ్యం బాహ్య ప్రపంచానికి తెలిసింది. ఇంత జరుగుతున్నా స్థానిక తాడిపత్రి పోలీసులు ఏం చేస్తున్నారనే ప్రశ్న అప్పట్లో తలెత్తింది. నిందితులు టీడీపీ నాయకులు కావడంతోనే వారికి గులాంగిరి చేస్తున్నారనే విషయం అర్థమైంది. నేరస్తులకు రాజకీయనేతల అండ జిల్లాలో చాలామంది ప్రజాప్రతినిధులు, రాజకీయనాయకులు నేరస్తులకు అండగా నిలుస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులు రాజకీయ నాయకుల పంచన చేరి వారి కార్యకలాపాలను యథేచ్ఛగా సాగిస్తున్నారు. పోలీసుల వద్ద నుంచి ఒత్తిళ్లు వచ్చినప్పుడు నేతలతో ఫోన్లు చేయిస్తూ వారి చీకటి పనులను దర్జాగా చేసుకుంటున్నారు. తాజాగా శుక్రవారం క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తులను తప్పించాలని నగరంలోని ఓ ప్రజాప్రతినిధి జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌పై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తీసుకొచ్చినట్లు తెలిసింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కోసం పనిచేశాడని, తప్పించకపోతే తనకు చెడ్డ పేరు వస్తుందని పేర్కొన్నట్లు సమాచారం. అయినప్పటకీ నేరస్తున్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తాడిపత్రిలో ఏకంగా పోలీసులే టీడీపీ నేతల అనుచరులుగా చెలామణి అవుతున్నారు. పోలీసులశాఖలో కింది స్థాయి సిబ్బంది పోస్టింగ్‌లు స్థానిక ప్రజాప్రతినిధుల సిఫార్సులతో జరుగుతుండడంతో విధి నిర్వహణలో వారి అనుచరులు, అనుయాయుల విషయంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరికొన్ని చోట్ల మామూళ్ల మత్తులో నేరాలను అడ్డుకోలేకపోతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితులు జిల్లాలో శాంతి భద్రతలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. తాజాగా శుక్రవారం క్రికెట్ బెట్టింగ్, గంజాయి విక్రేతలను అరెస్ట్ చేసి దాదాపు రూ. 25.10 లక్షలు నగదు, 38 సెల్ఫోన్లు, ఎల్ఈడీ టీవీలు, 500 గ్రామాలు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మొత్తం 17 మందిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో అనంతపురంతో పాటు ధర్మవరం, నార్పలకు చెందిన వారు ఎక్కువ శాతం మంది ఉన్నారు. నిందితులను పట్టుకోవడంలో ఎస్పీ ప్రత్యేక బృందం (ఎస్ఓజీ) కీలకంగా వ్యవహరించింది. బెట్టింగ్ ఈస్థాయిలో సాగుతున్నా స్థానిక పోలీసులు గుర్తించలేకపోవడం గమనార్హం. గతేడాది డిసెంబర్ 30న వైఎస్సార్ జిల్లా సీఐ హమీద్‌ఖాన్ తాడిపత్రిలో మట్కా నిర్వాహకుల అరెస్ట్‌కు యత్నించడం, మట్కా నిర్వాహకులు పోలీసులపైకే తిరగబడి దాడి చేసి, వారి వాహనాలను తగలబెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. స్థానిక పోలీసుల సహకారం లేకపోవడంతో వారిని అరెస్ట్ చేయలేకపోయినా ఈ ఘటనలో జేసీ అనుచరులు నెలకొల్పిన మట్కా చీకటి సామ్రాజ్యాన్ని వెలుగులోకి తేవడంలో ఆ జిల్లా పోలీసులు సఫలీకృతం అయ్యారు. నెలవారీ మామూళ్లు.. స్థానిక నాయకులతో మిలాఖత్.. వెరసి నేరాలకు అడ్డుకట్ట వేయడంలో స్థానిక పోలీసులు విఫలమవుతున్నారు. ఇతర జిల్లా పోలీసులు వచ్చి నేరస్తుల ఆటకట్టించే ప్రయత్నం చేస్తే తప్ప ఇక్కడి నేర సామ్రాజ్యం వెలుగులోకి రాని పరిస్థితి. దీన్నిబట్టి చూస్తే స్థానిక పోలీసుల పనితీరు ఏస్థాయికి దిగజారిందో అర్థమవుతోంది. నేరాల అడ్డుకట్టపై దృష్టి అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకో వాల్సిన బాధ్యత స్థానిక పోలీసులపైనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో విధి నిర్వహణలో ఒత్తిళ్ల కారణంగా జాప్యం జరుగుతుంది. ప్రత్యేక సిబ్బం ది దృష్టి నేరస్తులపైనే ఉంటుంది కాబట్టి త్వరితగతిన ఛేదిస్తారు. ఏదేమైనా నేరాలు అడ్డుకట్ట వేయడంపై అందరూ దృష్టి సారించాలి. – జీవీజీ అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ -
మట్కా మంత్రం.. ఖాకీ తంత్రం
అనంతపురం సెంట్రల్ : అతనో కానిస్టేబుల్.. ట్రాక్ రికార్డు మొత్తం తిరగేస్తే అవినీతి అరోపణలే ఎక్కువ. తాజాగా జిల్లా కేంద్రంలోని పాతూరులో మట్కా నిర్వహణలో అతనే కీలకంగా మారినట్లు బలమైన ఆరోపణలున్నాయి. స్టేషన్ ఉన్నతాధికారుల అండతోమట్కాబీటర్ల నుంచి రూ.లక్షలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే... బీటర్ల పీచమణిచిన హమీద్‌ఖాన్ అనంతపురం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ తీరు తీవ్ర దూమారం రేపుతోంది. ప్రస్తుతం స్టేషన్లో అంతా తానై వ్యవహరిస్తున్నాడు. ముఖ్యంగా మట్కా నిర్వహణకు సంబంధించి మొత్తం వ్యవహారాలు అతనే చూసుకుంటున్నట్లు సమాచారం. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 20కు పైగా మట్కా కేంద్రాలు నడుస్తున్నాయి. ఎస్ఐ హమీద్‌ఖాన్ హయాంలో మట్కా నిర్వాహకులు తమ దుకాణాలు కట్టిపెట్టేశారు. దాదాపు 30 మందికి పైగా మట్కా బీటర్లు, నిర్వాహకులను అప్పట్లో ఆయన అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.60 లక్షలకు పైగా రికవరీ చేశారు. హమీద్‌ఖాన్ దాడులకు భయపడి చాలా మంది బీటర్లు నగరాన్ని వదిలి వెళ్లారు. ఆరు నెలలుగా ఊపందుకున్న మట్కా ఆరు నెలలుగా అనంతపురం పాతూరులో మట్కా మళ్లీ జీవం పోసుకుంది. మట్కా నిర్వాహకులు, బీటర్ల సంఖ్య అతి కొద్ది కాలంలోనే భారీగా పెరిగింది. రూ.కోట్లకు పడగలెత్తిన మట్కా బీటర్లు, నిర్వాహకులు ప్రస్తుతం కొంతమంది పోలీసు సిబ్బందితో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకుని తమ చీకటి సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఓ కానిస్టేబుల్ కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. స్టేషన్లో అతను చెప్పిందే వేదం అన్నట్లుగా నడుస్తోంది. ట్రాక్ రికార్డు అంతాఅవినీతి ఆరోపణలే సదరు కానిస్టేబుల్ ట్రాక్ట్ రికార్డు పరిశీలిస్తే మొత్తం అవినీతి ఆరోపణలే వినిపిస్తాయి. కదిరిలో పనిచేసే సమయంలో ఎర్రచందనం దొంగలతో కుమ్మక్కయాడనే ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారుల విచారణలో కూడా ఈ విషయం తేలడంతో అప్పట్లో సస్పెన్షన్ వేటు పడింది. అనంతరం రాప్తాడు మండలంలోని కళాకారుల కాలనీలో ఓ వేశ్య గృహం నడిపించడంలో కీలకంగా వ్యవహరించినట్లు తేలింది. దీనిపై అప్పట్లో కేసు నమోదు చేస్తే యావత్ పోలీస్ శాఖకే చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశ్యంతో ఉన్నతాధికారులు మిన్నకుండిపోయారు. ప్రస్తుతం నగరంలోని వన్‌టౌన్ స్టేషన్ పరిధిలో మట్కా బీటర్లతో నిరంతరం టచ్‌లో ఉంటూ అక్రమార్జనకు గేట్లు ఎత్తాడనే ఆరోపణలున్నాయి. ఇటీవల వన్‌టౌన్ పోలీసులు దాడులు నిర్వహించి మట్కా బీటర్లను అరెస్ట్ చేసి రూ. 60 వేలకు పైగా సొమ్ము స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రికవరీ చూపింది కేవలం రూ. 11 వేలు మాత్రమే. ఈ కుంభకోణంలో సదరు కానిస్టేబులుకు మరో సహచర ఉద్యోగితో పాటు, ఉన్నతాధికారి పాత్ర ఉన్నట్లు విమర్శలున్నాయి. చేతుల్లో కాసులు గలగలామంటుండడంతో నిరంతరం బార్లు, రెస్టారెంట్లలో వారు గడుపుతున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. వన్‌టౌన్ పరిధిలో మట్కా నిర్వహణ వెనుక దాగి ఉన్న కుంభకోణంపై ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు జరిపితే అసలు దోషులు ఎవరనేది వెలుగు చూసే అవకాశముందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
మస్త్‌గా మట్కా
ఈ చిత్రంలో కనిపిస్తున్నది అనంతపురం పాతూరులోని పూలమార్కెట్ సందులో ఉన్న చిన్న కొట్టు. ఇక్కడ రోజూ రూ. లక్షల్లో మట్కా ఆడిస్తున్నారు. ఇందుకు నాయకత్వం వహిస్తున్నదిఓ మహిళ కావడం గమనార్హం. ఇలాంటి కేంద్రాలు వన్‌టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో దాదాపు 20 నడుస్తున్నట్లు తెలిసింది. అనంతపురం సెంట్రల్: నగరంలో మట్కా మూడు క్లోజులు.. ఆరు బ్రాకెట్లుగా విరాజిల్లుతోంది. జిల్లా వ్యాప్తంగా మాట్కా పూర్తిగా నిర్మూలించామని ఉన్నతాధికారులు ప్రకటిస్తున్నా అనంతపురంలో మాత్రం యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. ఆయా పోలీసుస్టేషన్ అధికారులకు తెలిసే ఇదంతా నడుస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో మట్కా నిర్వాహకులున్నప్పటికీ వన్‌టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో మాత్రం ఈ అక్రమ వ్యవహారం రూ. కోట్లలో నడుస్తోంది. పాతూరులో పూలమార్కెట్, తాడిపత్రి బస్టాండ్, గంగాగౌరీ థియేటర్, రాణినగర్, వినాయక్‌నగర్, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో జోరుగా మట్కా నిర్వహిస్తున్నారు. ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లా వ్యాప్తంగా మట్కా, క్రికెట్ బెట్టింగ్‌లపై ఉక్కుపాదం మోపుతూ వచ్చారు. కానీ కొన్ని నెలలుగా మట్కా, క్రికెట్ బెట్టింగ్ లాంటి వ్యవహారాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఆయా పోలీసుల కనుసన్నల్లోనే ఈ అక్రమ దందా సాగుతున్నట్లు తెలిసింది. కేసులు లేవు.. రికవరీ కావు నగరంలోని పోలీసుస్టేషన్లు పూర్తిగా గాడి తప్పుతున్నాయి. ఎన్నికలకు మూడు, నాలుగు నెలల ముందు నుంచి పోలీసుస్టేషన్లో సెటిల్మెంట్లు మాత్రమే నిర్వహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలపై ఎలాంటి దృష్టీ సారించలేదు. ఆరు నెలల కాలంలో నగరంలో మట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగ్‌ల కేసులు నమోదు కావడం లేదు. వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో ఈ అక్రమ దందా వ్యవహారం యథేచ్ఛగా జరుగుతున్నా నిందితులను అరెస్ట్ చేయడంలో పోలీసులు పక్షపాతధోరణి వ్యవహరిస్తుండడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. నెలవారీ మామూళ్లు అందుతుండడం వలనే వారు ఇలా ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకరిద్దరు కానిస్టేబుళ్లు మట్కా నిర్వాహకులతో నిరంతరం టచ్‌లో ఉంటున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు వన్‌టౌన్ ఎస్ఐగా హమీద్‌ఖాన్ మట్కా నిర్వాహకులపై ఉక్కుపాదం మోపారు. మూడునెలల కాలంలో దాదాపు 30 మందిని అరెస్ట్ చేసి రూ. 60 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆయన బదిలీ అనంతరం రూ.లక్ష కూడా పట్టుకున్న పాపాన పోలేదు. చర్యలు తీసుకుంటాం నగరంలో మట్కా, క్రికెట్ బెట్టింగ్ లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎక్కడైనా మట్కా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం అందించాలి. పోలీసు సిబ్బందిపై ఆరోపణలు వస్తే విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. – పీఎన్ బాబు, డీఎస్పీ, అనంతపురం -
‘కోతముక్క’ జూదరులు అరెస్టు
సాక్షి, అమరావతిబ్యూరో : కోతముక్క పేకాటలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రజలను మోసం చేసి రూ. లక్షలు దండుకోవడానికి సిద్ధమైన ఓ ముఠాను విజయవాడ నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నగర పోలీసు కమిషనర్ ద్వారకాతిరుమలరావు ఆదివారం రాత్రి ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో లోన బయట(కోతముక్క) ఆటను ఆడేందుకు ఎక్కువ మంది మక్కువ చూపుతుండటాన్ని గుర్తించిన ఓ ముఠా ఆ ఆట కోసం ప్రత్యేకంగా రూపొందించిన చీటింగ్ యాప్‌ను ఢిల్లీ నుంచి కార్గో సర్వీస్ ద్వారా నగరానికి తరలించారు వారిని గన్నవరం ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం పైడిపర్రుకు చెందిన గుడివాడ నవీన్, ఏలూరుకు చెందిన యండ్ల అశోక్‌కుమార్, గుంటూరు జిల్లా కోనూరు గ్రామం విద్యానగర్‌కు చెందిన షేక్‌జానీ భాషా, అదే జిల్లాలో ఇస్లాంపేటకు చెందిన మహబుగోరి, విజయవాడ పటమటకు చెందిన మెరుపు సందీప్‌లు గత కొంతకాలంగా ఢిల్లీ నుంచి కోతముక్కకు సంబంధించిన యాప్ కిట్‌ను తెప్పించుకుంటున్నారన్నారు. దీని ద్వారా కోతముక్క ఆడే ఆటగాళ్లను మోసం చేస్తూ అక్రమ మార్గంలో డబ్బు సంపాదిస్తున్నారని చెప్పారు. పక్కా నిఘా పెట్టి.. ముందుగానే స్కాన్ చేసిన ప్లేయింగ్ కార్డుల ద్వారా కోతముక్క ఆటలో ఏ కార్డు ఏవైపు పడుతుందో తెలుసుకుని పెద్ద మొత్తంలో జూదం కాస్తూ పేకాటరాయుళ్లను దోచుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ సమాచారం తెలిసి చాలా రోజులుగా వారిపై నిఘా పెట్టి, ఆదివారం వారిని గన్నవరం ఎయిర్‌పోర్టు పరిసరాల్లో అరెస్టు చేశామని చెప్పారు. వారి వద్ద నుంచి రూ. 2.80 లక్షల విలువైన నాలుగు సీవీకే–458 చీటింగ్ యాప్ కిట్, రహస్య కెమెరాలు కలిగిన రెండు సెల్పోన్లు, మరో ఐదు సాధారణ సెల్ఫోన్లు, రెండు మొబైల్ స్కానింగ్ వ్యాచ్లు, నాలుగు మైక్రో ఇయర్ ఫోన్లు, 168 స్కాన్ ప్లేయింగ్ కార్డు ప్యాకెట్స్తోపాటు బ్యాటరీలు, రిమోట్లు, కేబుళ్లు తదితర వాటిని స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వివరించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇలాంటి పేకాట జూదరుల బారిన పడొద్దని సీపీ హెచ్చరించారు. సమావేశంలో టాస్క్‌పోర్స్ ఏసీపీ రాజీవ్‌కుమార్‌తోపాటు సిబ్బంది పాల్గొన్నారు. -
మట్కా స్థావరాలపై పోలీసుల దాడులు
వైఎస్ఆర్ జిల్లా , ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు పోలీసులు మట్కా స్థావరాలను ఏరిపారేస్తున్నారు. వన్‌టౌన్, టూ టౌన్, త్రీ టౌన్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఏక కాలంలో విస్తృతంగా దాడులు నిర్వహించారు. దాడుల్లో 9 మంది మట్కా నిర్వాహకులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 11 లక్షల 84 వేల నగదు, మట్కా స్లిప్పులను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో మట్కా జూదంలో ఇంత పెద్ద మొత్తం పట్టుకోవడం ఇదే మొదటి సారి. డీఎస్పీ శ్రీనివాసరావు మంగళవారం త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అరెస్ట్ వివరాలను వెల్లడించారు. జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి ఉత్తర్వుల మేరకు దాడులు నిర్వహించినట్లు డీఎస్పీ తెలిపారు. వన్‌టౌన్, టూ టౌన్, త్రీ టౌన్ పోలీసు అధికారులు ప్రత్యేక బృందంగా ఏర్పడి దాడులు నిర్వహించారన్నారు. మట్కా నిర్వహించడానికి ప్రత్యేక అనుమతులున్నాయని కొందరు నిర్వాహకులు ప్రజలను నమ్మించేవారన్నారు. ఈ క్రమంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో మట్కా రాస్తున్నారని సమాచారం రావడంతో ఎస్ఐలు, సీఐలు మంగళవారం ఏక కాలంలో దాడులు నిర్వహించారన్నారు. వన్‌టౌన్ పరిధిలోని మట్టిమసీదు వీధిలో షేక్ ఖాదర్‌బాషా, బీరం జయరామిరెడ్డిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 59, 440, 5 మట్కా పట్టీలు, టూ టౌన్ పరిధిలో మోడంపల్లెకు చెందిన సయ్యద్ ఆలీషేర్ను అరెస్ట్ చేసి రూ. 1 లక్షా 10 వేలు, 10 మట్కా పట్టీలు, త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దొరసానిపల్లెకు చెందిన ఎన్. నారాయణ, కొండయ్య, రవిచంద్రారెడ్డి, కొత్తపల్లె గోపాల్, ఎర్రగంగుల రవికుమార్, ఉండెల వెంకటేష్‌లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 10 లక్షల 15 వేలు నగదు, ఆరు మట్కా పట్టీలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచనున్నామన్నారు. మట్కా బీటర్లను జిల్లా బహిష్కరణ చేస్తాం మట్కా నిర్వహిస్తున్న వారిపై సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తామని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. గతంలో మట్కా నిర్వహిస్తూ మానుకున్నవారు తిరిగి రాస్తున్నారన్నారు. వీరిని జిల్లా బహిష్కరణ చేస్తామని తెలిపారు. ఇంకా కొందరిని గుర్తిస్తున్నామని వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రొద్దుటూరులో మట్కా నిర్వాహకులు ఎక్కడున్నా ఉక్కుపాదం మోపుతామన్నారు. మట్కా స్థావరాలపై దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్న సీఐలు, ఎస్ఐలు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. సమావేశంలో సీఐలు జయానాయక్, మల్లికార్జున గుప్త, రామలింగమయ్య, ఎస్ఐలు కృష్ణంరాజునాయక్, నరసయ్య, మధుమళ్లేశ్వరరెడ్డి, నారాయణయాదవ్, సిబ్బంది పాల్గొన్నారు. -
తాడిపత్రిలో ఏం జరుగుతోంది..?
రామసుబ్బారెడ్డి వైఎస్సార్ జిల్లా కోడూరు వాసి. ఐదేళ్ల కిందట తాడిపత్రికి వచ్చి స్థిరపడిన కొంతకాలానికే పేకాటకు బానిసయ్యాడు. మిగిలిన ఆస్తులతో పాటు ఇల్లుసైతం అమ్మేసి అద్దె ఇంట్లోకి మారాడు. అప్పులు తలకు మించిన భారమయ్యాయి. భార్య పేరుపై ఉన్న కొద్దిపాటి పొలం అమ్మడానికి సిద్ధమైతే ఆమె అంగీకరించలేదు. అప్పులోళ్ల ఒత్తిడికి తట్టుకోలేక భార్య, ఇద్దరు పిల్లలను గతేడాది హత్యచేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఒక్క ఉదాహరణ చాలు తాడిపత్రి ప్రజల జీవితాలను జూదం ఎలా ఛిన్నాభిన్నం చేస్తోందో తెలుసుకోవడానికి. సాక్షి, ప్రతినిధి, అనంతపురం: తాడిపత్రిలో అభివృద్ధి మాటెలా ఉన్నా జూద క్రీడకు తాడిపత్రి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. పేకాట, మట్కా, క్రికెట్ బెట్టింగ్ ఇక్కడ విచ్చలవిడిగా సాగుతున్నాయి. కర్నూలు, వైఎస్సార్ జిల్లాల నుంచి పేకాటరాయుళ్లు నిత్యం తాడిపత్రికి వస్తుంటారు. రోజూ లక్షల్లో ఆటలు సాగుతుంటాయి. మున్సిపాలిటీ పాలకవర్గంలోని ఓ ప్రతినిధి ఇంట్లోనే జూదం సాగుతుంది. అనంతపురం జిల్లాలో జరిగే క్రికెట్ బెట్టింగ్ సైతం తాడిపత్రి కేంద్రంగానే నడుస్తోంది. తాడిపత్రిలో పేకాట, మట్కా నిర్వహిస్తున్నదెవరో? బెట్టింగ్ బుకీలు ఎవరు? అనే విషయం పోలీసులకు తెలిసినా ఎలాంటి చర్యలు ఉండవు. కాదంటే తాడిపత్రిలోని ఓ పెద్దమనిషి నుంచి ఫోన్లు వస్తాయి. దారికొస్తే నెలనెలా మామూళ్లు.. లేదంటే బదిలీ బహుమానంగా ఇస్తారు. దీంతోనే ఇక్కడ వ్యసనాలకు అడ్డుకట్ట పడలేకపోతోంది. వేల కుటుంబాలు వ్యసనాలకు బానిసలైపోయారు. అప్పుల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్య చేసుకునేవారు.. హత్యలకు గురయ్యేవారూ ఉన్నారు. ఆస్తులు పొగొట్టుకుని, పిల్లలను చదివించలేక ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులూ ఉన్నారు. ఈ వ్యసనాలపై పత్రికల్లో కథనాలు వస్తున్నా పోలీసుశాఖ పట్టనట్లు వ్యవహరిస్తోంది. మట్కా అడ్డాగా తాడిపత్రి తాడిపత్రి మట్కాకు అడ్డాగా మారింది. ముంబయి నుంచి నడిచే మట్కాతో పాటు తాడిపత్రిలోని కొందరు స్వతంత్రంగా కంపెనీలు ఏర్పాటు చేసి మట్కా నడుపుతున్నారు. వీరికి అధికారపార్టీ నేతల మద్దతు ఉండటంతో తాడిపత్రిలో మట్కారాయుళ్లు బలంగా స్థిరపడిపోయారు. గతంలో రతనాల్ మట్కా వారానికి ఐదురోజులు జరిగేది. ఇప్పుడు కళ్యాణ్, సత్తా మట్కాలు ఆరురోజులు జరుగుతున్నాయి. వీటికి నంబర్లు గుజరాత్, ముంబయి నుంచి వస్తాయి. ఇవి కాకుండా తాడిపత్రిలోని కొందరు ప్రైవేటు వ్యక్తులు మట్కా నడుపుతున్నారు. ఈ మట్కా ఆదివారం కూడా నడుస్తోంది. కళ్యాణ్, సత్తా మట్కాలు సాయంత్రం 5 గంటల వరకూ చీటీలకు డబ్బులు తీసుకుంటారు. రాత్రి 9.15కు ఓపెన్, రాత్రి 11.15కు క్లోజ్ నంబరు ప్రకటిస్తారు. ఆ వెంటనే బ్రాకెట్ నంబరు రిలీజ్ చేస్తారు. స్థానిక మట్కా నంబర్లు వీటికి గంట ముందే రిలీజ్ చేస్తారు. మట్కాలో భారీగా మోసం మట్కా రెగ్యులర్‌గా రాసేవారి పేర్లను మట్కారాయుళ్లు ల్యాప్‌టాప్‌లో ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా పొందుపరిచారు. ప్రాంతాల వారీగా ఈ పేర్లు విడదీస్తారు. రోజువారీ ఎవరు ఏ నంబర్‌పై పందెం కాశారో ఎప్పటికప్పుడు ల్యాప్‌టాప్‌లో పొందుపరుస్తారు. దీంతో కేంద్రాల వారీగా ఏ నంబర్లపై ఎక్కువ మంది కాశారు? ఏ నంబర్లపై తక్కువ పందెం కట్టారు? అనేది నిర్వాహకులకు క్షణాల్లో స్పష్టత వస్తుంది. దీని ఆధారంగా తక్కువ మంది కట్టిన నంబర్లను ప్రకటిస్తున్నారు. దీంతో మట్కారాయుళ్లు భారీగా ఆర్జిస్తున్నారు. ఈ ఊబిలో కూరుకుపోయి వేలాది కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. అయినా పోలీసులు నివారణ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. మూన్నాళ్ల ముచ్చటే మట్కా, పేకాట, బెట్టింగ్‌పై ఆరోపణలు ఎదుర్కొంటున్న 26 మంది కానిస్టేబుళ్లపై అప్పటి ఎస్పీ రాజశేఖరబాబు వేటు వేశారు. కొందరు సీఐలను కూడా డీఐజీ ప్రభాకర్‌రావు వీఆర్‌కు పంపారు. ఎస్పీగా అశోక్‌కుమార్ బాధ్యతలు తీసుకున్న తర్వాత 76 మంది మట్కా రాయుళ్లను తాడిపత్రి దాటించారు. అయితే రెండు నెలలకే వారంతా తిరిగి తాడిపత్రిలో మకాం వేశారు. ఇప్పుడు ఎలాంటి జంకు లేకుండా ‘పెద్దలు’ జోక్యం చేసుకోవడంతో యథేచ్ఛగా పేకాట, మట్కా నడుపుతున్నారు. -
పోలీసులకే రక్షణ లేకపోతే ఎలా?
-
పోలీసులపై మట్కా మాఫియా దాడి
తాడిపత్రి/అనంతపురం సెంట్రల్: అనంతపురం జిల్లా తాడిపత్రిలో మట్కా మాఫియా రెచ్చిపోయింది. జేసీ అనుచరుడైన మట్కా నిర్వాహకుడిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులపైనే ఏకంగా దాడికి దిగి చితకబాదారు. ఇంట్లో బంధించి కర్రలతో ఇష్టమొచ్చినట్లుగా కొట్టారు. పోలీసులు వచ్చిన వాహనానికి సైతం నిప్పు పెట్టి తగలబెట్టారు. ఈ ఘటనలో సీఐతో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. ఇటీవల తాడిపత్రిలోని పడమటి గేరికి చెందిన మట్కా నిర్వాహకుడు కట్లపొడి సాధిక్‌ను, వైఎస్సార్ జిల్లా ఎర్రముక్కపల్లెకు చెందిన మట్కా రామయ్య, ప్రొద్దుటూరుకు చెందిన పూజల చౌడయ్య, లక్ష్మయ్య, జమ్మలమడుగు పట్టణానికి చెందిన వెంకటదశావరెడ్డి, ఎర్రగుంట్ల మండలం పొట్లదుర్తికి చెందిన శ్రీనివాసులతో పాటు మరికొందర్ని కడప పోలీసులు ఈనెల 21న అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో మట్కా నిర్వాహకుడైన సాధిక్.. తమ డాన్ రషీద్ పేరును వెల్లడించాడు. రషీద్ టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రధాన అనుచరుడు. ఈ నేపథ్యంలో రషీద్‌ను విచారించేందుకు వైఎస్సార్ జిల్లా కడపకు చెందిన సీఐ హమీద్‌ఖాన్.. కానిస్టేబుళ్లు నరేంద్రరెడ్డి, సిద్ధారెడ్డి, ప్రసాద్, డ్రైవర్ ప్రదీప్‌తో కలిసి ఆదివారం సాయంత్రం తాడిపత్రికి చేరుకున్నారు. స్థానిక విజయనగర్‌కాలనీలోని అతని ఇంటి వద్దకు వెళ్లారు. అయితే అప్పటికే అక్కడ కాపుకాసి ఉన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులు దాదాపు 20 మంది పోలీసులపై దాడికి తెగబడ్డారు. ఇంట్లో బంధించి కర్రలతో చితకబాదారు. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న పోలీసు వాహనం(బొలేరో)కు నిప్పంటించారు. ఈ దాడిలో సీఐ హమీద్‌తో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని.. తీవ్రంగా గాయపడ్డ పోలీసులను తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే సీఐ హమీద్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయన్ని అనంతపురంలోని సవేరా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానిక పోలీసులపై నమ్మకం లేదా? సాధారణంగా ఒక జిల్లాకు చెందిన పోలీసులు మరో జిల్లాకు చెందిన నిందితులను అదుపులోకి తీసుకోవాలన్నా, వారిని విచారించాలన్నా స్థానిక పోలీసులకు సమాచారమిస్తారు. అయితే రషీద్.. జేసీ ప్రభాకర్‌కు సన్నిహితుడని తెలియడంతో స్థానిక పోలీసులకు సీఐ హమీద్ తాము వస్తున్నట్లు సమాచారమివ్వలేదని తెలిసింది. ఒకవేళ ముందే సమాచారమిస్తే.. వారు తప్పించుకునే అవకాశం ఉందనే అనుమానంతో నేరుగా రషీద్ ఇంటికి కడప పోలీసులు వెళ్లారు. పోలీసులకే రక్షణ లేకపోతే ఎలా? ప్రజలను రక్షించాల్సిన పోలీసులకే రక్షణ లేకుండా పోతే.. ఇక సామాన్యుల పరిస్థితేమిటని తాడిపత్రి వైఎస్సార్సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరుల దాడిలో గాయపడిన సీఐ హమీద్‌ఖాన్ తదితరులను ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జేసీ సోదరులు అరాచకాలకు పాల్పడటమే కాకుండా.. పోలీసులపైకి సైతం తమ అనుచరులను ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. గతంలో జేసీ దివాకర్‌రెడ్డి పోలీస్ ఉన్నతాధికారులను దూషించారని.. అప్పుడే తగిన చర్యలు తీసుకొని ఉంటే పోలీసులకు ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. అనంతరం నిందితులను అరెస్టు చేయాలంటూ పెద్దారెడ్డి, వైఎస్సార్సీపీ నేత రమేష్‌రెడ్డి తదితరులు స్థానిక పోలీస్‌స్టేషన్ సర్కిల్లో ధర్నా నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ చౌడేశ్వరి ఘటనాస్థలికి చేరుకొని నిందితులను అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో వైఎస్సార్సీపీ నేతలు ధర్నా విరమించారు. నిందితులపై చర్యలు తీసుకుంటాం: ఎస్పీ పోలీసులపై దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ తెలిపారు. సీఐ హమీద్‌ఖాన్, కానిస్టేబుల్ నరేంద్రరెడ్డిని తాడిపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం జిల్లా కేంద్రంలోని సవేరా ఆస్పత్రికి తీసుకొచ్చారు. హమీద్‌ఖాన్ తలకు బలమైన గాయాలవ్వడం.. కళ్లు వాయడంతో ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. క్షతగాత్రులను ఎస్పీ అశోక్‌కుమార్ పరామర్శించారు. అనంతరం ఎస్పీ మీడియా మాట్లాడుతూ.. స్థానిక పోలీసులకు సమాచారమివ్వకుండా సీఐ తన సిబ్బందితో కలిసి విచారణకు వెళ్లారన్నారు. అయితే పోలీసులపైనే దాడి జరగడం విచారకరమన్నారు. మట్కాను నివారించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రషీద్‌కు అధికార పార్టీ అండ..! మట్కా డాన్ కేవీ రషీద్ కేరళకు చెందిన తన తండ్రి నుంచి వారసత్వంగా మట్కా నిర్వహణ తీసుకున్నాడు. జేసీ ప్రభాకర్‌రెడ్డి అండదండలతో యథేచ్ఛగా మట్కా నిర్వహిస్తున్నాడు. తాడిపత్రితో పాటు కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో తన మట్కా సామ్రాజ్యాన్ని విస్తరిం చాడు. అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రధాన అనుచ రుడు కావడంతో స్థానిక పోలీసులు కూడా చూసీచూడనట్లు వ్యవహరించేవారు. దీంతో అతను మట్కాలో కోట్లాది రూపాయలు ఆర్జించాడు. అతనిపై ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడం గమనార్హం. -
మట్కా డాన్ అసదుల్లా అరెస్ట్
కర్నూలు: శాంతి భద్రతలనే శాసిస్తున్న అక్రమార్కుల ఆట కట్టించే క్రమంలో మట్కా, గుట్కా మాఫియాలపై ఉక్కుపాదం మోపే దిశగా జిల్లా పోలీసు బాస్ పావులు కదుపుతున్నారు. అందులోభాగంగానే పక్కా ఆధారాలతో కర్నూలు నగరం బుధవారపేటలో మట్కా డాన్ అసదుల్లాతో కలిపి 9 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.10 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇదే ఇప్పుడు పోలీసు శాఖలో ప్రకంపనలకు కేంద్ర బిందువు అయ్యింది. అసదుల్లాపై ఇప్పటివరకు సుమారు 30కి పైగా మట్కా కేసులు నమోదయ్యాయి. ఎస్పీ రఘురామిరెడ్డి హయాంలో జిల్లా నుంచి బహిష్కరించడంతో కొంతకాలం గుంతకల్లు, మరికొంతకాలం హైదరాబాదుకు మకాం మార్చాడు. ఆయన బదిలీపై వెళ్లగానే కర్నూలు చేరుకుని మట్కా సామ్రాజ్యాన్ని విస్తరించాడు. వారం క్రితం క్రైం పార్టీ పోలీసులు అసదుల్లా ఇంటిపై దాడి చేసి 8 మంది నిర్వాహకులను అదుపులోకి తీసుకుని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో ఉంచి వాస్తవాలను రాబట్టారు. అయితే అసదుల్లా కుటుంబానికి అధికార పార్టీ ‘పెద్ద’ అండ ఉండటం, ఆయన కుమారుడు అబ్బాస్ టీడీపీ నగర కార్యదర్శిగా కొనసాగుతుండటంతో పోలీసు అధికారులతో రాయబారం చేసి మట్కా కేసు నుంచి విముక్తి కల్పించినట్లు పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఓ మంత్రి ద్వారా సిఫారసు చేయించి కేసు నీరుగార్చే ప్రయత్నం చేసినప్పటికీ ఉన్నతాధికారి ససేమిరా అనడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అసదుల్లాను అరెస్టు చూపారు. తన కుమారుడిని అరెస్టు చేసే అవకాశం ఏర్పడితే ఇంతకాలం సహకరించిన పోలీసు అధికారుల పేర్లు బయట పెట్టాల్సి వస్తుందని మట్కా నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఒకరు బెదిరింపులకు దిగినట్లు చర్చ నడుస్తోంది. అసదుల్లా ఇంటిపై పోలీసులు దాడి జరిపిన రోజు నుంచి అబ్బాస్ అజ్ఞాతంలో ఉండి నగరంలోని ‘నక్షత్రాల’ హోటల్లో ఉంటూ అధికార పార్టీ నేత అండతో కేసు నుంచి బయట పడినట్లు చర్చ జరుగుతోంది. మట్కా మామూళ్ల గుట్టు రట్టు.. కర్నూలులో మట్కా ప్రధాన నిర్వాహకుడు అసదుల్లాతో పాటు కిందిస్థాయి వారు 8 మంది క్రైం పార్టీ పోలీసులకు దొరకడంతో విచారణలో అనేక నిజాలు బయటపడ్డాయి. మట్కాలో పోలీసు శాఖకు చెందిన కొందరి పాత్రపై పక్కాగా ఆధారాలు వెలుగు చూశాయన్నది విశ్వసనీయ వర్గాల వాదన. పోలీసులు కొందరు సహకరించిన తీరును మట్కా నిర్వాహకులు విచారణలో వివరించినట్లు తెలుస్తోంది. మామూళ్ల చిట్టాను కూడా విప్పినట్లు సమాచారం. బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ అయిన వివరాల నుంచి ఎవరెవరికి ఎంత ముట్టజెప్పారన్న రిజిస్టర్ జాబితా వరకు అనేక రకాల సమాచారం ఇచ్చినట్లు పోలీసు వర్గాలు చర్చించుకుంటున్నాయి. అలాగే దాడుల్లో భారీ మొత్తంలో నగదు పట్టుబడినా అందులో సగం మాత్రమే రికార్డెడ్‌గా చూపించినట్లు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. గంజాయి కేసు నమోదు.. మట్కా నిర్వహిస్తూ అక్కడికి వచ్చిన వారికి పొట్లాల రూపంలో గంజాయి విక్రయిస్తున్నట్లు విచారణలో బయట పడటంతో అసదుల్లాతో కలిపి తొమ్మిది మందిపై మట్కాతో పాటు గంజాయి కేసు నమోదు చేసినట్లు కర్నూలు డీఎస్పీ యుగంధర్ బాబు వెల్లడించారు. వారి వద్ద నుంచి రూ.10 లక్షల నగదును స్వాధీనం చేసుకుని కటకటాలకు పంపినట్లు తెలిపారు. గురువారం సాయంత్రం మూడవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన వివరాలు వెల్లడించారు. కర్నూలు నగరం బుధవారపేటకు చెందిన టి.లక్ష్మినారాయణ, ప్రదీప్, బి.మధు, ప్రకాష్‌నగర్‌కు చెందిన షేక్షావలి, కొత్తపేటకు చెందిన ఎం.డి.వలి బాషా, బళ్లారి పట్టణానికి చెందిన సి.శ్రీనివాసులు, గుత్తి కోటా వీధికి చెందిన ఎస్.బాషా, మద్దికెర పట్టణం రామాలయం వీధికి చెందిన ప్రభాకర్ తదితరులతో కలసి అసదుల్లా బుధవారపేటలోని జంగాల కుళ్లాయప్ప ఇంట్లో మట్కా నిర్వహిస్తుండగా దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 14 సెల్ఫోన్లు, 11.5 కేజీల గంజాయి, ప్రింటర్, 12 కాలిక్యులేటర్లు, రెండు 4జి హాట్‌స్పాట్స్‌తో పాటు మట్కా చీటీలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. సీఐలు హనుమంతు నాయక్, దివాకర్‌రెడ్డి, ఎస్ఐ తిరుపాలు తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. -
మట్కా నిర్మూలించండి
కర్నూలు: ‘నగరంలో ఇద్దరు మట్కా డాన్లు మనుషులను ఏర్పాటు చేసుకుని ఆన్లైన్ ద్వారా పెద్ద ఎత్తున మట్కా నిర్వహిస్తున్నారు. కూలీనాలీతో జీవనం సాగించే పేదలు, మధ్య తరగతి ఉద్యోగులు ఈ ఉచ్చులో ఇరుక్కుని ఆర్థికంగా నష్టపోతున్నారు’ అంటూ బుధవారపేటకు చెందిన పలువురు ఎస్పీ గోపీనాథ్ జట్టికి ఫిర్యాదు చేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో గోపీనాథ్ జట్టి ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమంలో భాగంగా 9121101200 సెల్ నంబర్‌కు వచ్చిన ఫిర్యాదులను నోట్ చేసుకున్నారు. నేరుగా ప్రజాదర్బార్‌కు వచ్చి కలసిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. బుధవారపేటతో పాటు పాతబస్తీలో కొంతమంది మట్కా నిర్వహిస్తున్నారని, పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని బుధవారపేట వాసులు ఫిర్యాదు చేశారు. జిల్లా నలుమూలల నుంచి 92 ఫిర్యాదులువచ్చాయి. వాటిలో కొన్ని.. ♦ ఆడ పిల్లలు పుడుతున్నారని వేధించడం, ముందే స్కానింగ్ చేయించి మగబిడ్డ, ఆడబిడ్డ అని తెలుసుకుని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి అబార్షన్ చేయించి భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారని, సంబంధిత డాక్టర్లు స్కానింగ్ సెంటర్లపై కఠినమైన కేసులు నమోదు చేయాలని కొంతమంది వ్యక్తులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ♦ తన తలారీ ఉద్యోగాన్ని పెద్ద కుమారుడు వెంకటేశ్వర్లు తీసుకుని బతికినంత కాలం సగం జీతం ఇస్తానని చెప్పి ఇప్పుడు ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తూ, అన్నం పెట్టడం లేదని మిడుతూరు మండలం చింతలపల్లె గ్రామానికి చెందిన పక్కీరయ్య ఫిర్యాదు చేశారు. ♦ తన 20 ఎకరాల పొలాన్ని కుమారుడు లాక్కున్నాడని, అందులో ఆరెకరాలు ఇప్పటికే అమ్మేశాడని, కనీసంతమ బాగోగులు కూడా చూడకుండా కొట్టి, గాయపరిచి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామానికి చెందిన భద్రాద్రి చెన్నయ్య ఫిర్యాదు చేశారు. ♦ తాను ప్రస్తుతం మట్కా రాయడం లేదని, ఐదేళ్లుగా కిరాణం షాపుతో జీవనం సాగిస్తున్నానని, తనపై ఉన్న మట్కా షీటు తొలగించాలని హాలహర్వి మండలం చింతకుంట గ్రామానికి చెందిన ముళ్ల జాఫర్ కోరారు. ♦ కొట్టం విక్రయిస్తానని చెప్పి రూ.60 వేలు అడ్వాన్స్‌గా తీసుకుని కర్నూలుకు చెందిన ఒక వ్యక్తి మోసం చేశాడని సంతోష్‌నగర్‌కు చెందిన మేకల సుజాత ఫిర్యాదు చేశారు. ♦ రైల్వే ఉద్యోగం చేస్తున్న కుమారుడు తన పేరుతో ఉన్న ఆరెకరాల పొలాన్ని రాసి ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నాడని శిరివెల్ల మండలం మహదేవపురం గ్రామానికి చెందిన లక్ష్మీదేవి ఫిర్యాదు చేశారు. పోలీస్ దర్బార్, డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమాలకు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడిషనల్ ఎస్పీ మాధవరెడ్డి, లీగల్ అడ్వైజర్ మల్లికార్జునరావు, డీఎస్పీలు వెంకటాద్రి, బాబుప్రసాద్, నజీముద్దిన్, వినోద్‌కుమార్, మురళీధర్, సీఐలు ములకన్న, మహేశ్వర్‌రెడ్డి, వన్‌స్టాప్ సెంటర్ సిబ్బంది సునిత పాల్గొన్నారు. ♦ కర్నూలు నగరం వెంకటరమణ కాలనీకి చెందిన మూర్తి.. గురుకుల పాఠశాలలో కాంట్రాక్టు టీచర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.1.60 లక్షలు తీసుకుని మోసం చేశాడని బంగారుపేటకు చెందిన కరుణాకర్ ఫిర్యాదు చేశారు. -
ఆన్లైన్ మట్కా గుట్టురట్టు
అనంతపురం సెంట్రల్: రాయలసీమలో ఆన్లైన్ ద్వారా గుట్టుగా సాగుతున్న మట్కా రాకెట్‌ను అనంతపురం పోలీసులు గుట్టురట్టు చేశారు. 20 మంది నిర్వాహకులను అరెస్ట్ చేశారు. బుధవారం పోలీసుకాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ వెల్లడించారు. అరెస్ట్ అయిన వారిలో అచ్చుకట్ట సాధిక్ (తాడిపత్రి పట్టణం పడమటవీధి), హబీబ్‌ఖాన్ (గుత్తి) మట్కా ప్రధాన నిర్వాహకులు. మిగిలిన వారిలో దూదేకుల లాల్‌బాషా, షేక్ సిరాజుద్దీన్‌దౌలా, దూదేకుల ఇబ్రహీం, షేక్ ముల్లా జాఫర్ (కర్నూలు జిల్లా డోన్), అచ్చుకట్ల అబ్దుల్లా, అచ్చుకట్ల మహమ్మద్‌ఖాసీం, మాదిగ నారాయణ (తాడిపత్రి), కోవెలకుంట్ల జాఫర్, కోవెలకుంట్ల జలీల్, కార్మురి ఇంద్రశేఖర్, చౌడం సుబ్బరాయుడు (జమ్మలమడుగు), గోనుగుంట్ల రామయ్య (వైఎస్సార్ జిల్లా ఎర్రముక్కపల్లి), పన్నపు జయచంద్రారెడ్డి, పన్నపు రామచంద్రారెడ్డి (పెద్ద ముడియం మండలం గుళ్లకుంట), రెడ్డి బోయ విజయ్‌కుమార్, ఎల్లావుల గోపాల్ (గుత్తి) ఉన్నారు. వీరి నుంచి రూ. 47.12 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ. 7లక్షలు కంపెనీ బ్యాంక్ ఖాతాలో సీజ్ చేశారు. వీటితో పాటు ఒక కారు, రెండు ల్యాప్‌టాప్‌లు, 32 సెల్ఫోన్లు, ఒక ట్యాబ్, మట్కా పట్టీలు తదితర సామగ్రితో పాటు 3 కేజీల గంజాయిని పట్టుకున్నారు. మిలాన్ మట్కా కంపెనీ పేరుతోప్రత్యేక వెబ్సైట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి మాట్కాను నిర్వాహకులు కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. మిలాన్ డే, మిలాన్ నైట్ పేర్లతో ప్రత్యేక వెబ్సైట్ రూపొందించారు. రూ. 100కు రూ.8000 చెల్లిస్తామంటూ సామాన్య, పేద వర్గాల బతుకులను ఛిద్రం చేస్తున్నారు. ప్రధాన నిందితులైన అచ్చుకట్ల సాదిక్‌వలి బెంగుళూరు కేంద్రంగా చేసుకొని అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలో మట్కా కార్యకలాపాలు సాగిస్తున్నాడు. రోజు వారి టర్నోవర్ మొత్తాలను కర్ణాటకలోని హుబ్లీ, మహారాష్ట్రలోని ముంబయి మట్కా కంపెనీలకు గుట్టు చప్పుడు కాకుండా పంపుతున్నాడు. కొన్నేళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు. రెండవ ముఖ్యుడైన గుత్తి హబీబ్‌ఖాన్ కూడా బెంగుళూరు కేంద్రంగా చేసుకొని తాడిపత్రి, గుత్తి, గుంతకల్, బత్తలపల్లి, కదిరి ప్రాంతాలతోపాటు కడప, కర్నూలు జిల్లాల్లో మట్కా నిర్వహిస్తున్నాడు. నిందితుల్లో ఆరుగురు అచ్చుకట్ల సాదిక్‌వలికి సమీప బంధువులే. మిగతా 12 మంది వివిధ ప్రాంతాల్లో బీటర్లుగా మట్కా పట్టీలు రాస్తూ కంపెనీలకు చేరవేస్తూ ఉంటారు. రాయలసీమ జిల్లాలో యువతను లక్ష్యంగా చేసుకొని మట్కాతో పాటు గంజాయి కూడా సరఫరా చేస్తూ రూ.లక్షల్లో సంపాదిస్తున్నారని తెలుసుకొని ప్రత్యేక నిఘా ఉంచి నిందుతులను పట్టుకున్నామన్నారు. జిల్లాలో మట్కాను శాశ్వతంగా నిర్మూలించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. మట్కా నిర్వాహకుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే కాకుండా అవసరమైన వారిపై జిల్లా బహిష్కరణ కూడా చేస్తామని హెచ్చరించారు. ప్రశంస మట్కా నిర్వాహకులను పట్టుకోవడంతో పాటు భారీగా నగదు, మట్కా నిర్వహణకు ఉపయోగించే సామగ్రిని స్వాధీనం చేసుకోవడంలో కృషి చేసిన డీఎస్పీ వెంకట్రావ్, సీఐలు విజయభాస్కర్‌గౌడ్, హమీద్‌ఖాన్, శ్రీరామ్, ఏఎస్ఐ రాజశేఖర్, వెంకటకృష్ణ, హెడ్కానిస్టేబుల్లు రమేష్, అమర్, వెంకటేష్, శ్రీధర్, కానిస్టేబుళ్లు చంద్రశేఖర్, జయరాం, శివ, ఆనంద్, గిరి, చంద్ర, రామకృష్ణ, నాగరాజు, విజయ్ హోంగార్డు కుళ్లాయప్పలను ఎస్పీ అభినందించి రివార్డులతో సత్కరించారు. -
‘అయినవాళ్ల’ కేసుల మాఫీకి ఒత్తిళ్లు..
కర్నూలు : ‘వాళ్లు నా అనుచరులు. నన్ను నమ్ముకుని పార్టీలో ఉన్నారు. వచ్చే మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలంటే డబ్బు కావాలి. అందుకోసం మట్కా నిర్వహించుకుంటున్నారు. వాళ్లింటి వైపు వెళ్లొద్దు.’ – ఇదీ కర్నూలులోని పోలీసులకు అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి జారీ చేసిన ఆదేశం. ♦ అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు తుంగభద్ర నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదులందాయి. దీంతో వారు నిఘా ఏర్పాటు చేశారు. అయితే.. జిల్లా రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న ముఖ్య నాయకుని సోదరుడు ఓ పోలీసు అధికారికి ఫోన్ చేసి.. ‘వాళ్లు మావాళ్లే. వారి జోలికి వెళ్లొద్దు’ అంటూ ఆదేశాలు జారీ చేశారు. ♦ పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యాన్ని ఓ వ్యాపారి రెండు లారీల్లో వేరే రాష్ట్రానికి తరలిస్తుండగా నగర శివారులోని తుంగభద్ర చెక్‌పోస్టు వద్ద గస్తీ పోలీసులు పట్టుకున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకుడు సదరు బియ్యం వ్యాపారి దగ్గరరూ.4 లక్షలు దండుకుని.. పోలీసు, రెవెన్యూ అధికారులపై ఒత్తిడి చేసి లారీలను విడిపించాడు. కేసు కూడా మాఫీ చేయించాడు. ♦ నందవరం మండలం పెద్దకొత్తిలి గ్రామ సర్పంచ్ ఇరుపాక్షిరెడ్డి వైఎస్సార్సీపీలో ఉంటూ ప్రజల్లో మంచి పట్టు సాధించారు. స్థానిక ఎమ్మెల్యే పోలీసులపై ఒత్తిడి చేసి ఇరుపాక్షిరెడ్డికి సంబంధించిన ట్రాక్టర్లు, పొక్లెయిన్లు సీజ్ చేయించి అక్రమంగా కేసు పెట్టించారు. దాన్ని మాఫీ చేసేందుకు టీడీపీలోకి బలవంతంగా చేర్పించుకున్నారు. ♦ రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీకి పర్యావరణ అనుమతి కోసం రెండు నెలల క్రితం కలెక్టర్, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి ప్రోద్బలంతో వైఎస్సార్సీపీ నేత ఎర్రబోతుల వెంకటరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఉదయ భాస్కర్‌రెడ్డితో పాటు మరికొంతమందిపై అక్రమ కేసులు బనాయించారు. ఖాకీలపై అధికార పార్టీ నేతల పెత్తనం ఎక్కువయ్యిందనడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. శాంతిభద్రతల పరిరక్షణ, పేదలకు భరోసా కల్పించడంలో పోలీసు శాఖ పాత్ర చాలా కీలకం. రాగద్వేషాలకు, కుల మతాలకు అతీతంగా చట్టాన్ని అమలు చేయడం పోలీసుల విధి. ఆ దిశగా పనిచేస్తున్న కొంతమంది అధికారులపై అధికార పార్టీ నేతల పెత్తనం రోజురోజుకూ మితిమీరుతోందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అధికారాన్ని అడ్డు పెట్టుకుని.. అక్రమార్కులకు వంత పాడుతున్నారు. బాధితులకు న్యాయం జరగకూడదంటూ అడ్డగోలు వాదనకు దిగుతున్నారు. అనుంగులు, అయినవాళ్ల లబ్ధి కోసం అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఆరు నూరైనా తాము చెప్పినట్లే వినాలంటూ పోలీసులకు హుకుం జారీ చేస్తున్నారు. కాదంటే బదిలీపై వెళ్లాల్సి వస్తుందంటూ బాహాటంగానే బెదిరిస్తున్నారు. ♦ ఇదెక్కడి చోద్యం! వివాదాలు, ఘర్షణలు తలెత్తుతున్నప్పుడు బాధితులు స్టేషన్‌కు చేరడం, పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేయడం తెలిసిందే. ఇక్కడే నేతలు జోక్యం చేసుకుంటున్నారు. అన్యాయంగా వ్యవహరించిన తమ వారివైపే మొగ్గు చూపాలని నిబంధన విధిస్తున్నారు. వైరివర్గం తప్పు లేకున్నా వారిపై అక్రమ కేసులు బనాయించాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. కర్నూలు నగరంలోని డీవీఆర్ హోటల్ వద్ద రెండు నెలల క్రితం ఎమ్మెల్యే అనుచరులు ఉమాకాంత్ అనే యువకుడిపై దాడి చేసి గాయపరిచారు. ఎమ్మెల్యే జోక్యం చేసుకుని పోలీసులపై ఒత్తిడి చేసి.. బాధితుడిపైనే సంబంధం లేని వ్యక్తితో ఎస్సీ కేసు నమోదు చేయించారు. అలాగే పార్టీ మారిన ఒక ఎమ్మెల్యేను ఉద్దేశించి కర్నూలు నగరానికి చెందిన ఇంద్రసేనారెడ్డి అనే యువకుడు ‘ఎవరి పుణ్యాన గెలిచి పార్టీ మారావు’ అని ఫేస్బుక్లో పోస్టు చేసినందుకు ఆగ్రహించిన సదరు ఎమ్మెల్యే అధికారులపై ఒత్తిడి పెంచి ఆ యువకునిపై కేసు నమోదు చేయించి కోర్టు చుట్టూ తిప్పుతున్నారు. ఆలూరు మండలం హత్తి బెళగల్లో ఇటీవల క్వారీలో భారీ పేలుళ్లు జరిగిన సంగతి తెలిసిందే. క్వారీని బంద్ చేయించాలని ఐదు నెలల క్రితమే గ్రామస్తులు ధర్నా చేశారు. అయితే.. అధికార పార్టీకి చెందిన క్వారీ యజమాని శ్రీనివాస చౌదరి పోలీసులపై ఒత్తిడి చేసి.. ఆందోళనకు దిగిన మల్లికార్జునతో పాటు మరో ఐదుగురిపై కేసు పెట్టించారు. అప్పటి ఎస్ఐ ధనుంజయతో వారిని తీవ్రంగా కొట్టించి జైలుకు కూడా పంపిన ఘటన తీవ్ర విమర్శలకు దారితీసింది. అసాంఘిక శక్తులకు నేతల అండ జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారికి కూడా అధికార పార్టీ నేతలు అండదండలు అందిస్తున్నారు. నిందితులను స్టేషన్‌కు తీసుకొచ్చినప్పటి నుంచే ఫోన్ల పరంపర ఆరంభమవుతోంది. బెట్టింగ్, మట్కా, ఇసుక మాఫియా వంటి వాటిల్లో కూడా అనుయాయులకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తున్నారు. పలు కేసుల్లోని నిందితులు ‘రాజకీయ’ ఆశ్రయం పొందడం, నేతలు పోలీసులపై ఒత్తిడి తీసుకురావడం పరిపాటైంది. ఆలూరుకు చెందిన ఐదుగురు యువకులు ఆదోని పట్టణంలోని బంగారు షాపులో పెద్ద మొత్తంలో చోరీకి పాల్పడ్డారు. వారు ఆ నియోజకవర్గ నాయకుడిని ఆశ్రయించడంతో పోలీసులపై ఒత్తిడి తెచ్చి.. బంగారు షాపు యజమానితో రాజీ కుదిర్చి పెట్టిన కేసు మాఫీ చేయించిన ఘటన అప్పట్లో చర్చనీయాంశమయ్యింది. నంద్యాల పట్టణంలోని నూనెపల్లెలో మూడు మాసాల క్రితం రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. స్థానిక ప్రజాప్రతినిధి పోలీసులపై ఒత్తిడి పెంచి సంఘటనకు ఎలాంటి సంబంధం లేని మాజీ కార్పొరేటర్ అమృతరాజుపై హత్యాయత్నం కేసు పెట్టించారు. కాదంటే బదిలీ బహుమానం తమ మాట వినని పోలీసులపై బదిలీ వేటు తప్పదంటూ నేతలు బాహాటంగానే ప్రకటిస్తుండటం గమనార్హం. ఏ శాఖలో అయినా బదిలీలు అనివార్యమే. అయితే.. పోలీసు శాఖలో ఇది కాస్తా ఎక్కువగా ఉంటోంది. దీన్నే అదునుగా ఎంచుకుని అధికార పార్టీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. ఏటా బదిలీల సీజన్లో నేతల ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. అత్యున్నత స్థాయి అధికారుల దృష్టికి తమ జాబితాలు తీసుకెళ్లి పంతం నెగ్గించుకోవడం జిల్లాలో ఆనవాయితీగా మారింది. తన మాటకు విలువ ఇవ్వలేదన్న అక్కసుతో బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి.. డీఎస్పీ పి.ఎన్.బాబును పట్టుబట్టి బదిలీ చేయించి పంతం నెగ్గించుకున్నారు. ఎమ్మెల్యే స్వగ్రామం యనగండ్లతో పాటు బనగానపల్లెలో వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశానికి అనుమతించడంపై ప్రభుత్వ పెద్దల వద్ద పంచాయితీ పెట్టించి డీఎస్పీపై బదిలీ వేటు వేయించడం అప్పట్లో చర్చనీయాంశమయ్యింది. ఇదే తరహాలో కర్నూలు డీఎస్పీ ఖాదర్ బాషాను కూడా స్థానిక ప్రజాప్రతినిధి పట్టుబట్టి మరీ బదిలీ చేయించారన్న ఆరోపణలున్నాయి. కేవలం తొమ్మిది మాసాలకే ఆయనపై బదిలీ వేటు పడటం ఇందుకు బలం చేకూర్చుతోంది. మైనార్టీ వర్గానికి చెందిన ఖాదర్‌బాషాను ఎమ్మెల్యే ఉద్దేశపూర్వకంగానే బదిలీ చేయించినట్లు విమర్శలున్నాయి. ఏడాది క్రితం డి.వి.రమణమూర్తి స్థానంలో ఐపీఎస్ అధికారి విశ్రాంతి పాటిల్ కర్నూలు డీఎస్పీగా నియమితులయ్యారు. ఆయన బాధ్యతలు చేపట్టకముందే డైరెక్ట్ ఐపీఎస్ అధికారి తమకు వద్దని అడ్డుకున్నారు. మొత్తంగా పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు జిల్లాలో తీవ్ర స్థాయిలో కనిపిస్తున్నాయి. ఇలాంటి వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి సారించి కిందిస్థాయి యంత్రాంగానికి భరోసా కల్పించాల్సిన ఉన్నతాధికారులు సైతం అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. బదిలీల సందర్భంగా ఫలాన సర్కిల్ లేదా స్టేషన్‌కు పోస్టింగ్ కావాలంటే అధికార పార్టీ ఎమ్మెల్యే లేదా నియోజకవర్గ ఇన్చార్జ్ నుంచి లేఖ తెచ్చుకోవాలని ఉన్నతాధికారులే స్వయంగా ఎస్ఐ, సీఐలకు సూచిస్తుండటం గమనార్హం. -
మట్కా రాకెట్ గుట్టు రట్టు
గోరంట్ల: పుట్టపర్తి కేంద్రంగా గోరంట్ల, హిందూపురం తదితర ప్రాంతాల్లో మట్కా నిర్వహిస్తున్న ఐదుగురు నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేసి వారి వద్దనుండి రూ. 30,900 నగదుతో పాటు మట్కా చీటీలు, 7 సెల్ఫోన్లను బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ధర్మవరం డీఎస్పీ వెంకటరమణ తెలిపిన వివరాలమేరకు.. గోరంట్లలోని మధవరాయ దేవాలయ సమీపంలో గోరంట్లకు చెందిన షరిప్సాబ్, శ్రీనివాసులు అనే ఇద్దరు బీటర్లను అరెస్టు చేసి విచారణ చేపట్టగా హిందూపురానికి చెందిన అంబురి బాబాజన్ ఉరుప్ (చికన్బాబా) పుట్టపర్తిలోని ఒక అపార్టుమెంట్లో తన బావమరిది అతావుల్లా సహయంతో రహస్యంగా మట్కా కంపెనీ నిర్వహిస్తున్నాడన్నారు. దీంతో పోలీసు బృందం దాడులు చేసి అతావుల్లాతో పాటు హిందూపురానికి చెందిన నాగరాజు, ఆదినారాయణలను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. -
దారి తప్పిన ‘నాల్గో’ సింహం
అనంతపురంలోని కోవూరు నగర్లో ఓ స్కూల్ సమీపంలో నివాస గృహాల మధ్య జోరుగా వ్యభిచారం సాగుతోంది. దీనిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా చర్యలు శూన్యం. ఉన్నతాధి కారుల దృష్టికి విషయం వెళ్లడంతో ఈ నెల 4న తప్పని పరిస్థితిలో ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 5న అనంతపురంలోని సోమనాథ్‌నగర్‌లో నివాసముంటున్న షేక్ గౌస్ పీరా (27) ఆత్మహత్య చేసుకున్నాడు. క్రికెట్ బెట్టింగ్‌లో రూ. లక్షలు పోగొట్టుకున్న అతను నిర్వాహకుల నుంచి ఒత్తిళ్లు తీవ్రం కావడంతో తట్టుకోలేక ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నాల్గో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జోరుగా సాగుతున్న క్రికెట్ బెట్టింగ్ భూతానికి ఆ కుటుంబం ఛిన్నాభిన్నమైంది. అనంతపురం సెంట్రల్: జిల్లా కేంద్రంలోని నాల్గో పట్టణ పోలీస్ స్టేషన్లో పాలన గాడి తప్పింది. క్రికెట్ బెట్టింగ్, మట్కా, జనావాసాల మధ్య వ్యభిచారం.. తదితర అసాంఘిక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయంటూ జనం గగ్గోలు పెడుతున్నారు. ఇదే విషయమై ఉన్నతాధికారులకు నిత్యం ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దందాలకు అడ్డాగా టీకేఫ్‌లు మారాయి. బార్లు, మద్యం దుకాణాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత కూడా నాల్గో పట్టణపోలీస్ స్టేషన్ పరిధిలో ఎమ్మార్పీ కన్నా ఎక్కువకు మద్యం బాటిళ్లు అమ్ముతున్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దందాలకు అడ్డాగా.. అనంత నాల్గో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యధికంగా సమస్యాత్మక ప్రాంతాలున్నాయి. పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన పేదలు అత్యధికంగా ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు కాలనీల్లో ఉంటున్నారు. వీరిని టార్గెట్‌గా చేసుకుని స్టేషన్‌పరిధిలో ఉన్న 68 రౌడీ షీటర్లు చిన్న చిన్న దందాలకు తెరలేపారు. తమ మాట వినకపోతే దాడులకు సైతం వెనుకాడడం లేదు. స్టేషన్ పరిధిలోని 44వ జాతీయ రహదారిపై బైక్ రేస్, వీలింగ్ జోరుగా సాగుతోంది. సాయంత్రమైతే ఏకంగా జాతీయ రహదారి పక్కనే మందుబాబులు తిష్టవేసి బాటిళ్లను తెప్పించుకుని ఫుల్‌గా తాగి తందనాలాడుతున్నారు. జాతీయ రహదారిపై విచ్ఛలవిడిగా వ్యభిచారం సాగుతున్నా.. పోలీసులు నియంత్రించలేకపోతున్నారు. రియల్ నజరానా.. స్టేషన్‌పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం అత్యధికంగా సాగుతోంది. ఓ అధికారిని లోబర్చుకున్న రియల్‌వ్యాపారులు తమ అక్రమ వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఎలాంటి లావాదేవీలైనా.. తమకు అనుకూలంగా ఉండేలా చేసుకోవడంలో భాగంగా ఎదురయ్యే వివాదాలను సులువుగా పరిష్కరించుకునేందుకు రియల్టర్లు ఎంతకైనా తెగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆ అధికారికి అన్ని హంగులూ సమకూరుస్తున్నారు. బెంగుళూరు నగరానికి పిలుచుకెళ్లి విందూ వినోదాలు ఏర్పాటు చేస్తున్నారు. అధిక వడ్డీ... అసాంఘిక కార్యకలాపాలు నాల్గో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జనావాసాల మధ్య వ్యభిచార కేంద్రాలు, పేకాట స్థావరాలు, క్రికెట్ బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. పనుల కోసం వలస వచ్చిన వారు జీవనోపాధి కోసం చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇలాంటి వారిని ఎంపిక చేసుకుని అధిక వడ్డీకి డబ్బులు ఇచ్చి వడ్డీ వ్యాపారులు పీల్చి పిప్పి చేస్తున్నారు. రూ. 5 నుంచి రూ. 10 వరకు వడ్డీ వ్యాపారం సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలన్నీ పోలీసులకు తెలిసినా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. స్టేషన్లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు అంతా తామై వ్యవహరిస్తూ నెలవారి మాముళ్లను మోస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. మాముళ్లు అందకపోయినా.. స్థానికుల నుంచి ఫిర్యాదులు ఎక్కువైనప్పుడు కంటి తుడుపు దాడులు నిర్వహిస్తూ నిందితుల అరెస్ట్ చూపుతున్నారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. జిల్లాలో మట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగ్ పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ చర్యలు చేపడుతున్నా.. జిల్లా కేంద్రంలోనే అడ్డూఅదుపు లేకుండా సాగుతుండడం గమనార్హం. క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఇటీవల నాల్గో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమనాథ్‌నగర్‌లో షేక్ గౌస్‌పీరా ఆత్మహత్య చేసుకున్న ఉదంతం పోలీసుల వైఫల్యాలకు పరాకాష్టగా మారింది. నేడు ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ రాక అనంతపురం సెంట్రల్: జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ ఆదివారం జిల్లాకు రానున్నారు. పది రోజుల పాటు కుటుంబ సభ్యులతో యూఎస్ఏ పర్యటనకు వెళ్లిన ఆయన ఆదివారం మధ్యాహ్నం బెంగళూరు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రానికి జిల్లాకు వస్తారు. సోమవారం నుంచి విధులకు హాజరుకానున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. -
మట్కా నిర్వాహకురాలు అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక కాలువకట్ట సమీపంలోని గుడి వద్ద దండె సిద్ధమ్మ అనే మట్కా నిర్వాహకురాలిని అరెస్ట్ చేసి ఆమె వద్ద నుంచి త్రీ టౌన్ పోలీసులు రూ. 1 లక్ష నగదును స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ శ్రీనివాసరావు గురువారం సాయంత్రం త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. దండె సిద్ధమ్మ కాల్వకట్ట ప్రాంతంలో కొన్ని రోజుల నుంచి మట్కా నిర్వహిస్తోంది. త్రీ టౌన్ మహిళా కానిస్టేబుల్ సరోజ, మరో కానిస్టేబుల్ గంగాధర్‌లు వీధుల్లో సంచరిస్తుండగా మట్కా రాస్తున్న సిద్ధమ్మ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేసింది. దీంతో పోలీసులు ఆమెను వెంటాడగా వారిని తోసి విధులకు ఆటంకం కలిగించింది. ఎట్టకేలకు పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. గతంలో ఆమెపై రూరల్, త్రీటౌన్ పోలీస్స్టేషన్లలో మట్కా కేసులు ఉన్నాయి. ఆమెపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ వివరించారు. మట్కా నిర్వాహకురాలిని అరెస్ట్ చేసి పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్న ఎస్ఐలు కృష్ణంరాజునాయక్ , నరసయ్య, సిబ్బందిని డీఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు. -
మట్కా.. మాయ!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : పైసా పెట్టుబడి ఉండదు.. అయినా లక్షల రూపాయల బిజినెస్.. ఎవరికీ లెక్కచెప్పాల్సిన అవసరం ఉండదు.. గుట్టుచప్పుడుగా సాగే ఓ రహస్య వ్యాపారం పేరు మట్కా. సరిగ్గా చెప్పాలంటే ఇది పక్కా జూదం. అందరు పోగై ఆడే అటకాదు. కేవలం సెల్ఫోన్ల సాయంతో నంబర్లతో ఆడే ఆట ఇది. దీనిమాయలో పడిన ఎందరో అమాయకులు అప్పులపాలవుతుండగా ఏజెంట్లు మాత్రం కోట్లు సంపాదిస్తున్నారు. మక్తల్ నియోజకవర్గం కేంద్రంగా సాగే ఈ జూదం గురించి పోలీసులకు తెలిసినా మట్కా ఏజెంట్లు రాజకీయ నాయకులు కావడంతో చూసిచూడనట్లు వదిలేస్తున్నారు. అప్పుడప్పుడు నామమ్రాతంగా దాడులు చేస్తూ మేమూ కూడా పనిచేస్తున్నామని కేసులు నమోదు చేస్తున్నారు. మట్కాకు అడ్డాగా మక్తల్ మక్తల్ నియోజకవర్గం ఈ ఆటకు అడ్డాగా మారింది. మక్తల్ పట్టణంతోపాటు కృష్ణ, మాగనూర్ ప్రాంతాల్లో ఏజెంట్లు దశాబ్ద కాలంగా రహస్య స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఈ జూదం ఆడుతున్నారు. నవంబర్ 22వ తేదీన మక్తల్‌లోని ఓ ఇంటిపై పోలీసులు దాడిచేసి తాజొద్దీన్, చాంద్‌పాష అనే ఇద్దరు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో రూ.18,200 నగదు, 12 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అప్పటినుంచి కొన్నిరోజులు మట్కా ఆటకు బ్రేక్ పడినా కొన్నిరోజులుగా మళ్లీ ఊపందుకుంది. అప్పట్లోనే పోలీసులు ఈ జూదంపై సీరియస్‌గా వ్యవహరించి ఉంటే ఈ ఆట మళ్లీ పుంజుకునేది కాదు. ఇంతకు మట్కా ఎలా ఆడతారు.. ఎక్కడినుంచి సమాచారం.. నంబర్లు సేకరిస్తారు.. అనే విషయాలు పూర్తిస్థాయిలో వెలుగులోకి రాలేదు. మొదట కృష్ణ గ్రామంలో ఈ ఆట ఆడేవారని, అక్కడి నుంచి మాగనూర్‌కు పాకిందని.. ప్రస్తుతం మక్తల్‌లో మట్కా జోరందుకోవడంతో ఈ జూదంలో చాలామందే సభ్యులుగా ఉన్నట్టు తెలిసింది. ఈ వ్యాపారంలోతాజొద్దీన్, చాంద్‌పాష కీలక బాధ్యతలు తీసుకుని ఈ తతంగం నడిపిస్తున్నారు. ముందువీరు రాయచూర్ నుంచి ఆటను సాగించేవారు. ఇప్పుడు ఈ ప్రాంతంలో పరిచయాలు పెరగడంతో వారి అడ్డాను మక్తల్‌కు మార్చుకున్నారు. రోజురోజుకు మట్కా నంబర్ల సంఖ్య పెరగడంతో ఏజెంట్లకు ఆదాయం అంతకంతకు పెరుగుతోంది. రోజు లక్షల లాభం పొందుతున్నారంటే ఈ ఆట ఏ స్థాయిలో ఆడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. మట్కా.. ఇలా ఆడతారు మట్కా ఆట రెండురకాలుగా ఉంటుంది. ఒకటి ఓపెన్, రెండోది క్లోజ్. ఈ రెండు ఆటలను మహరాష్ట్రలోని రెండు పట్టణాల్లో ఉండే ప్రధాన కార్యాలయాలు వేర్వేరుగా నిర్వహిస్తాయి. ఒకటి ముంబాయి, రెండోది కల్యాణి. ముంబాయి ఆటలో ఓపెన్ నెంబర్ ను మధ్యాహ్నం రెండు గంటలకు వెలువరిస్తారు. క్లోజ్ నెంబర్‌ను రాత్రి 10గంటలకు ప్రకటిస్తారు. ప్రధానంగా జూదరులు క్లోజ్ కే ఎక్కువగా డబ్బులను వెచ్చిస్తారు. ఇందులో రూ.1కి రూ.80 వస్తాయి. కేవలం ఓపెన్‌కు ఆడితే రూ.1కి రూ.8 మాత్రమే ఇస్తారు. ఇక కల్యాణి ఆటలో కూడా ఇదేవిధంగా ఉంటుంది. ఈ ఆటలో నెంబర్ రాత్రి 12గంటలకు తెలుస్తుంది. ఈ మట్కా జూదం మండలంలో గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఇందులోని ఏజెంట్లకు వచ్చిన కలెక్షన్ల ద్వారా కోటీశ్వరులు అయినవారు ఉన్నారు. దివాళా తీసి ఉన్న ఆస్తులను కూడా అమ్ముకున్న వారున్నారు. మాముళ్ల మత్తులో అధికారులు నియోజకవర్గంలో మట్కా మూడు పూలు, ఆరు కాయలుగా కొనసాగుతోంది. వివిధ పార్టీలకు చెందిన బడా నాయకులే బహిరంగంగా ఏజెంట్లుగా అవతారం ఎత్తారు. వీరు కూడా గ్రామాల్లోని కార్యకర్తలను మెంబర్లుగా, ఏజెంట్లను నియమించి వారి ద్వారా అమాయకులతో జూదమాడిస్తున్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటంతో యువకులు పెడదారిన పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే యువకులు వేరే పని చేయకుండా మట్కాను ఓ ఉద్యోగంలా, వ్యాపారంగా మలుచుకున్నారు. యువకులతోపాటు ఉద్యోగులు, మహిళలలు, రైతులు, కూలీలు, వ్యాపారులు, వయే వృద్ధులు సైతం ఉన్నారు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ఈ మట్కామాయలో పడిన వారిని విముక్తి కల్పించి ఏజెంట్ల ఆట కట్టించాలని విద్యావంతులు కోరుతున్నారు. -
అడ్డుకునే వారెవరు?
తాడిపత్రిలో రాజకీయ అండదండలతో మట్కా జోరందుకుంది. ఒకప్పుడు చీకటిమాటున సాగిన మట్కా.. నేడు బహిరంగంగా కొనసాగుతోంది. సులువుగా డబ్బు సంపాదించొచ్చంటూ అమాయకులను ఉచ్చులోకి దింపి వారిని ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు. అరికట్టాల్సిన పోలీసులు నిర్వాహకులను వదిలి పొట్టకూటి కోసం బీటర్లుగా అవతారమెత్తిన వారిపై ప్రతాపం చూపుతున్నారు. తాడిపత్రి: తాడిపత్రి కేంద్రంగా మట్కా సాగుతోంది. నిర్వాహకులు మాఫియాగా ఏర్పడ్డారు. వీరికి రాజకీయ అండదండలతోపాటు పోలీసుల సహకారమూ ఉండటంతో మట్కా కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ 12 నుంచి ఇప్పటి వరకు దాడులు చేసినప్పటికీ చిన్నా చితక బీటర్లను అదుపులోకి తీసుకున్నారే కానీ నిర్వాహకులను అరెస్ట్ చేయలేదు. మట్కా మహమ్మారిని కూకటి వేళ్లతో నిర్మూలించేందుకు కఠినంగా వ్యవహరించాల్సిన పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. నిఘా పక్కదారి అసాంఘిక కార్యకలాపాలను ముందస్తుగా పసిగట్టి వాటిని ఉన్నతాధికారుల దృష్టికి చేరవేయాల్సిన ఐడీ పార్టీ సిబ్బంది తప్పుడు సమాచారంతో పోలీసులను పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఐడీ పార్టీలోని కొంత మంది సిబ్బందికి పట్టణంలోని మట్కా నిర్వాహకులతో సత్సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. మట్కా కంపెనీలు చెప్పినట్లు విని పోలీసు అధికారుల దృష్టి మట్కా నిర్వాహకులపై మళ్లకుండా ఉండేందుకు చిన్నాచితకా బీటర్ల సమాచారాన్ని మాత్రమే చేరవేస్తున్నట్లు సమాచారం. నిర్వాహకులపై చర్యలేవీ? రాజకీయ అండదండలు లేని తమపై పోలీసులు ప్రతాపం చూపిస్తున్నారని బీటర్లు వాపోతున్నారు. తాడిపత్రి ప్రాంతంలో ఎవరు ఎక్కడ మట్కా కంపెనీలు నిర్వహిస్తున్నారన్న విషయం ప్రతి కానిస్టేబుల్‌కూ తెలిసినా వారిపై చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు. అసలైన నిర్వాహకులను అరెస్టు చేస్తే బీటర్లు చీటీలు రాసేందుకు అవకాశమే ఉండదని పలువురు బీటర్లు అంటున్నారు. -
మట్కాగ్యాంగ్ పట్టివేత
సాక్షి,కరీంనగర్ : కరీంనగర్ కమిషనరేట్‌లో కొంతకాలంగా మట్కా నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్నారు. సోమవారం సాయంత్రం కరీంనగర్ కమిషనరేట్‌లోని హెడ్‌క్వార్టర్‌లో విలేకరుల సమావేశంలో సీపీ కమలాసన్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. కరీంనగర్‌లోని మారుతినగర్‌కు చెందిన కమటం రమేÐశ్(56), చొప్పదండి మండలం గణేష్‌నగర్‌కు చెందిన ఒదెల రాజు(52), కరీంనగర్‌లోని పాతబజారుకు చెందిన వనం రాము(48), బొమ్మదేవి శ్రీనివాస్(45), కోతిరాంపూర్‌కు చెందిన బత్తిని సత్యనారాయణ(50), కొత్తపల్లి మండలానికి చెందిన కన్న అంజిబాబు(55), కరీంనగర్ మండలం నగునూర్‌కు చెందిన కుక్కల నరేందర్(36) ముఠాగా ఏర్పడి కరీంనగర్లో మట్కా నిర్వహిస్తున్నారు. ఏజెంట్లుగా..! కొందరు మట్కా నిర్వహణకు ఏజెంట్లుగా మారారు. రూ.50వేలు నుంచి రూ.లక్ష వరకు డిపాజిట్ చేసి ఏజెంట్‌గా మారారు. కల్యాణిగా వ్యవహరించే ఈ మట్కా ఆటలో సింగిల్ డిజిట్ వస్తే రూ.100కు రూ.800, ఓపెన్, డబుల్ నంబర్లు వస్తే రూ.100కు రూ.8వేలు, మూడు నంబర్లు వస్తే ఓపెన్ పానగా పేర్కొంటూ రూ.100కు రూ.10వేలు ఇస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్నారు. శని, ఆదివారాలు తప్పా మిగిలిన రోజుల్లో సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు, మళ్లీ 9 నుంచి రాత్రి 11.30 గంటల వరకు రెండుసార్లు డ్రాలు తీసి నంబర్లు చెబుతారు. వారు చెప్పిన నంబర్లపై పందెం కాసిన వారికి డబ్బులు ఇస్తారు. కానీ ఇప్పటికీ ఈ ఆటలో ఎవరికీ డబ్బులు రాలేదు. పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నగరంలో వివిధ ప్రాంతాల్లో దాడులు చేశారు. మాట్కా నిర్వాహకులు ఏడుగురిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరి నుంచి రూ.50వేలు నగదు, ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హిస్టరీషీట్లు ప్రజలు కష్టార్జీతాన్ని నమ్ముకోవాలే తప్పా ఇలాంటి వాటిని నమ్మొద్దని సీపీ కోరారు. రెండు అంతకన్న ఎక్కువ కేసులు ఉన్న జూదరులపై హిస్టరీషీట్లు ఓపెన్ చేసి నిఘా ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. టాస్క్‌ఫోర్స్ ఇప్పటి వరకు 30 మంది మట్కా నిర్వాహకులను పట్టుకున్నట్లు తెలిపారు. వీరిలో 10 మందిపై రెండు అంతకన్న ఎక్కువ కేసులున్నాయని.. వారిపై హిస్టరీషీట్లు ఓపెన్ చేస్తున్నట్లు తెలిపారు. టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీనివాసరావు, సిబ్బంది అనిల్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
జీవితాలతో ఆట!
కొండసాని సురేశ్‌రెడ్డి. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి పీఏగా పనిచేసిన వ్యక్తి. జీవా తాడిపత్రి వాసి. వీరి కనుసన్నల్లో నడిచే బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేస్తే రూ.29.90 లక్షలు పట్టుబడింది. తాడిపత్రి అడ్డాగా క్రికెట్ బెట్టింగ్ సాగుతోందని ‘సాక్షి’లో లెక్కలేనన్ని కథనాలు ప్రచురితమయ్యాయి. ఇప్పటికైనా పోలీసులు బెట్టింగ్‌పై దృష్టి సారించారు. ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగడంతో నిర్వాహకులతో పాటు బెట్టింగ్‌రాయుళ్లలో వణుకు పుడుతోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: మట్కా.. క్రికెట్ బెట్టింగ్.. పేకాట. ఈ మూడింటికీ అనంత అడ్డాగా మారింది. తాడిపత్రి కేంద్రంగా ఎన్నో జీవితాలు కూలిపోతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. బడా నేతల అండతో అనుచరవర్గం సాగిస్తున్న దందాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఇప్పటికే ‘సాక్షి’ పలుమార్లు ఈ ఆట గుట్టురట్టు చేసింది. అయితే అప్పటికప్పుడు బుకీలను అరెస్టు చేయడం.. బెట్టింగ్‌రాయుళ్లను అదుపులోకి తీసుకుని వదిలేయడంతో పోలీసులు తమ పని అయిందనిపించడం పరిపాటిగా మారుతోంది. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌ల మధ్య మంగళవారం నుంచి ముక్కోణపు టీ–20 సిరీస్ ఆరంభమైన నేపథ్యం లో ఒక రోజు ముందుగానే బెట్టింగ్ రాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా పీఎస్ఎల్(పాకిస్తాన్ సూపర్‌లీగ్)మ్యాచ్‌లకు బెట్టింగ్ కాస్తూ పట్టుబడ్డారు. సోమవారం బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకున్నా మంగళవారం రాత్రి శ్రీలంక–భారత్ మ్యాచ్‌కు యథేచ్ఛగా భారీగా బెట్టింగ్ సాగడం గమనార్హం. తాడిపత్రి, అనంత కేంద్రంగా బెట్టింగ్ ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో ఇప్పుడు బుకీలు తాడిపత్రి, అనంతపురం, ధర్మవరం, గుంతకల్లు కేంద్రాలుగా బెట్టింగ్ సాగిస్తున్నారు. బుకీలు ముంబయి, హైదరాబాద్‌లో ఉంటారు. ఇక్కడ సబ్ బుకీలను నియమించుకుంటారు. మ్యాచ్ ప్రారంభం నుంచి.. ముగిసే వరకు బెట్టింగ్ ఫీజును ఎప్పటికప్పుడు నిర్ణయిస్తారు. దీనికి వ్యాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసి బెట్టింగ్ రేటును ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. బుకీల ద్వారా మ్యాచ్ గెలుపోటములపై మాత్రమే ఎక్కుగా బెట్టింగ్ నడుస్తోంది. మ్యాచ్ ఆడే రెండు జట్లలో ఒక జట్టును ఫెవరెట్‌గా పరిగణిస్తారు. ఫేవరెట్ జట్టుపై బెట్టింగ్ కాసి ఆ జట్టు విజయం సాధిస్తే తక్కువ డబ్బు వస్తుంది. ఫేవరేట్ కాని జట్టు గెలిస్తే భారీగా డబ్బు వచ్చే అవకాశం ఉంది. పోలీసులకు పట్టుబడిన వారిలో లక్షకు ఐదు లక్షల చొప్పున కూడా బెట్టింగ్ కాశారు. మ్యాచ్‌లో ఫేవరెట్ జట్టు త్వరగా వికెట్లు కోల్పోతే వెంటనే బెట్టింగ్ తీరు మారిపోతోంది. 50–50కి వస్తుంది. మ్యాచ్ తీరును బట్టి బెట్టింగ్ తన స్వరూపాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటుంది. ఇది సబ్‌బుకీల ద్వారా జరుగుతుంది. ఈ తరహా బెట్టింగే జిల్లాలో రోజూ రూ.2 కోట్ల దాకా జరుగుతున్నట్లు తెలుస్తోంది. బాల్‌టు బాల్ బెట్టింగ్ సబ్‌బుకీలతో పనిలేకుండా ‘లోకల్’బెట్టింగ్ రాయుళ్ల కనుసన్నల్లో ‘బాల్ టు బాల్’ బెట్టింగ్ జరుగుతోంది. ఈ బాల్‌కు ఎన్ని పరుగులు వస్తాయి? ఈ బాల్‌కు వికెట్ పడుతుందా? లేదా? సిక్స్? ఫోర్ కొడతాడా? బౌలర్ డాట్ బాల్ వేస్తాడా? బ్యాట్స్‌మన్ ఎన్ని పరుగులు చేస్తాడు? ఇలా ప్రతీ బాల్‌కు బెట్టింగ్ జరుగుతుంది. అంటే ఒక మ్యాచ్ ముగిసే లోపు టాస్, గెలుపుపై కాకుండా మ్యాచ్ జరిగే 240 బాల్స్‌పై బెట్టింగ్ ఆడతారు. ఈ తరహా బెట్టింగ్‌కు కొన్ని లాడ్జీలు, ఇళ్లను రోజువారీ అద్దెకు తీసుకుని నడిపిస్తారు. ఇలాంటి ఇళ్లకు రోజుకు రూ.5వేలు కూడా అద్దె చెల్లిస్తున్నారు. అలాగే 10–20 మంది ఓ గ్రూపుగా ఏర్పడి మ్యాచ్ సమయంలో ఓ లాడ్జీ ని అద్దెకు తీసుకుని అక్కడ బెట్టింగ్ ఆడుతుంటారు. సోమవారం పట్టుబడిన వారు కూడా అనంతలో ఓ గదిని అద్దెకు తీసుకుని పట్టుబడ్డారు. ఈ తరహా బెట్టింగ్ రోజూ రూ.1.50కోట్ల దాకా ఉంటోందని సమాచారం. ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేయిస్తేనే ప్రయోజనం జీవా విజయవాడలో ఎక్కువగా ఉంటాడు. అక్కడి నుంచే బెట్టింగ్‌ను నిర్వహిస్తుంటాడని తెలుస్తోంది. జీవాను విచారిస్తే పూర్తిగా బెట్టింగ్ గుట్టు రట్టయ్యే అవకాశం ఉంది. ఇతని కనుసన్నల్లో తాడిపత్రిలో మరో ఆరుగురు సబ్‌బుకీలు బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ‘అనంత’లోనూ భారీగా బెట్టింగ్ సాగుతోంది. వన్‌టౌన్ పరిధిలోని పంజాబ్నేషనల్ బ్యాంకు వీధిలో రోజూ బెట్టింగ్‌రాయుళ్లు సమావేశమవుతుంటారు. అలాగే కమలానగర్‌లోని ఓ కేఫ్‌లోనూ మరో బృందం రోజూ సమావేశమై బెట్టింగ్ నిర్వహిస్తోంది. రాజు రోడ్డులోని ఓ హోటల్లో సూట్ బుక్ చేసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్ ఆడే మ్యాచ్‌లు కాకుండా ప్రపంచంలోని ఏ దేశంలో ఏ లీగ్, టోర్నీ జరిగినా పందేలు కాస్తున్నారు. రోజూ టీవీలో ఏదో ఒక మ్యాచ్ వస్తుంటుంది. అంటే రోజూ బెట్టింగ్ నడుస్తున్నట్లే లెక్క. భారత్ ఆడే మ్యాచ్‌లు ఉంటే బెట్టింగ్‌కాసే వాళ్లు మరింత ఎక్కువగా ఉంటారు. మంగళవారం నుంచి మొదలైన ముక్కోణపు టోర్నీ జరిగే సమయాల్లో దాడులు నిర్వహిస్తే భారీగా బెట్టింగ్ రాయుళ్లు పట్టుబడే అవకాశం ఉంది. భారీ వడ్డీలకు అప్పులు బెట్టింగ్‌లో కలిసొస్తే పదివేలతో వెళ్లిన వాడు రూ.లక్షతో తిరిగొస్తాడు. లేదంటే రూ.లక్ష తీసుకెళ్లిన వాడు రూపాయి కూడా మిగిల్చుకోలేని పరిస్థితి. దీంతో బెట్టింగ్ కోసం కొందరు నూటికి రూ.10 వడ్డీతో డబ్బులు తెస్తున్నారు. ఇంకొందరు పదివేలు ఇస్తే రోజుకు రూ.2వేలు వడ్డీ వసూలు చేస్తున్నారు. వీరి వద్ద చేతిలోని ఉంగరాలు, మెడలోని బంగారు గొలుసులు, బైక్‌లను కూడా తాకట్టుపెడుతున్నారు. -
అంతర్రాష్ట్ర మట్కా గుట్టు రట్టు
అనంతపురం సెంట్రల్: ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతా ల్లోని అమాయకులకు అత్యాశచూపి వారిని ఆర్థికంగా దెబ్బతీస్తున్న అంతర్రాష్ట్ర మట్కా కంపెనీ గుట్టును పోలీసులు రట్టు చేశారు. హుబ్లీ కేంద్రంగా అనంతపురం, కర్నూలు జిల్లాలో మట్కా ఆడిస్తున్న అంతర్రాష్ట్ర మట్కా నిర్వాహకుడు, గంజాయి విక్రేతలతో సహా మొత్తం ఆరుగురిని అనంతపురం వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి నాలుగు కిలోల గంజాయి, రూ. 20.25 లక్షల నగదు, కారు, మూడు సెల్ఫోన్లు, మట్కా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ వివరాలను శుక్రవారం పోలీసుకాన్ఫరెన్స్‌హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ వెల్లడించారు. అరెస్టయిన వారిలో వినాయక్ మేత్రాని (కర్ణాటక రాష్ట్రం హుబ్లీ), తమటం రమేష్ గౌడ్ (కర్నూలు జిల్లా డోన్), హబీబ్‌ఖాన్ (గుత్తి), జమాల్‌బాషా (హుబ్లీ), పట్నూరు షబ్బీర్‌బాషా (అనంతపురం రూరల్ మండలం పిల్లిగుండ్ల కాలనీ), పోతుల శంకర్ (బిందెల కాలనీ) ఉన్నారు. గుట్టు రట్టయ్యిందిలా.. అరెస్టయిన వారిలో వినాయక్ మే త్రాని అంతర్రాష్ట్ర మట్కా నిర్వాహ కుడు, గంజాయి విక్రేత. కర్ణాటక రా ష్ట్రం ధార్వాడ కేంద్రంగా మట్కా ని ర్వహిస్తున్నాడు. ఇతని కంపెనీకి అనుబంధంగా పట్టుబడిన మిగతా నిందితులు అనంతపురం, గుత్తి, క ర్నూలు జిల్లా డోన్లలోగుట్టుచప్పు డు కాకుండా మట్కా కొనసాగిస్తున్నారు. అమాయక ప్రజల అత్యాశ ను పెట్టుబడిగా మలుచుకొని రూ. కోట్లు అర్జిస్తున్నారు. దీంతో పాటు గంజాయిని కూడా విక్రయిస్తూ అమాయకులను మత్తుకు బానిస చేస్తున్నారు. మట్కా మహమ్మారి నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలనే ఉద్దేశంతో ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ అశోక్కుమార్నుంచి ఆదేశాలు రావడంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. శుక్రవారం చెరువుకట్ట కింద నిందితులు ఉన్నట్లు సమాచారం రావడంతో డీఎస్పీ వెంకట్రావ్ పర్యవేక్షణలో వన్‌టౌన్ సీఐ భాస్కర్‌గౌడ్, రూరల్‌సీఐ కృష్ణమోహన్, ఎస్ఐలు హమీద్‌ఖాన్, మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాసులు సిబ్బంది ప్రత్యేక బృందంగా వారిని అరెస్ట్ చేశారు. అవసరమైతే పీడీ యాక్ట్ కేసు.. అంతర్రాష్ట్ర మట్కా కంపెనీ నిర్వాహకుడిని అరెస్ట్ చేయడం జిల్లా చరిత్రలో ఇదే మొదటిసారని ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. జిల్లా మట్కాను పూర్తిగా నిర్మూలిం చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అవసరమైతే వారి పై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన డీఎస్పీ వెంకట్రావ్, సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లను ఎస్పీ ప్రశంసించారు. జిల్లాలో ఎక్కడైనా ఈ తరహా నేరాలు జరుగుతుంటే డయల్–100, 9989819191 నంబర్లకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
అనంతపురంలో మట్కా ముఠా అరెస్టు
సాక్షి, అనంతపురం: అనంతపురంలో మట్కా ముఠా గుట్టు రట్టైంది. మట్కా నిర్వహిస్తున్న ఆరుగురుని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 20 లక్షలు, 4 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని హుబ్లీ కేంద్రంగా హైటెక్ పద్దతిలో ఈ మట్కా దందా జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో నిఘా పెట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం కోసం విచారణ చేపట్టారు. -
మట్కా కనికట్టు.. బతుకు తాకట్టు
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం గ్రామానికి చెందిన ఐజయ్య (పేరు మార్చాం) మట్కా జూదానికి బానిసయ్యాడు. జహీరాబాద్‌లోని ఓ హోటల్లో సర్వర్‌గా పనిచేస్తూ.. వచ్చిన డబ్బంతా ‘మెయిన్ ముంబై’ మట్కాలో పెట్టాడు. అడ్డగోలు వడ్డీకి అప్పులు చేసి కూడా పందేలు కాశాడు. కానీ ఇప్పటివరకు రూపాయి గెలుచుకున్నది లేదు. చివరికి ఉన్న రెండెకరాల పొలం అమ్ముకున్నాడు. ... వీరే కాదు.. తెలంగాణ పల్లెల్లో వేలకొద్దీ కుటుంబాలు మట్కా జూదానికి చిన్నాభిన్నమవుతున్నాయి. చెమటోడ్చి సంపాదించిన నాలుగు రాళ్లను మాయదారి మట్కానే మింగేస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటకల సరిహద్దు జిల్లాల్లో ఈ జూదం జోరుగా సాగుతోంది. మన రాష్ట్రంలో మట్కాపై నిషేధం ఉన్నా... ఆ రెండు రాష్ట్రాల్లో దానికి చట్టబద్ధత ఉంది. దీంతో ఇక్కడివారు సరిహద్దులు దాటివెళ్లి మరీ పందేల్లో పాల్గొంటున్నారు. కొందరు ఇక్కడి నుంచే ఫోన్ల ద్వారా పందేలు కాస్తున్నారు. దీనిపై ‘సాక్షి’ బృందం క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది. మహారాష్ట్రలో మట్కాకు అడ్డా అయిన ‘ఉమ్మర్గ’ పట్టణానికి వెళ్లి పరిశీలించింది. ఈ సందర్భంగా ఎన్నో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి. అక్కడ మట్కా ఆడుతున్న వారిలో తెలుగువారే ఏకంగా 80 శాతం వరకు ఉండడం గమనార్హం. – వర్ధెల్లి వెంకటేశ్వర్లు, సాక్షి ప్రతినిధి తెల్ల బట్టలు.. మాసిన గడ్డంతో ఉన్న ఈ పెద్దాయన జీవితమంతా జూదంతోనే పండిపోయింది. ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌కు చెందిన ఆయన.. భార్య పుట్టింటి నుంచి తెచ్చిన బంగారు నగలు, వారసత్వంగా వచ్చిన మూడెకరాల భూమిని మట్కాకే తగలేశాడు. చివరికి కుటుంబ సభ్యులను కూడా వదిలేసి వచ్చి మట్కాకు కేంద్రమైన ఉమ్మర్గ (మహారాష్ట్ర)లో మకాం పెట్టాడు. వారానికి రూ.రెండున్నర వేల జీతంతో మట్కా చీటీలు రాసే పని చేస్తున్నాడు. లక్షన్నర మందికిపైగా.. మట్కా జూదం కేవలం సరిహద్దు జిల్లాల్లోనే కాకుండా ఇటీవల ఉమ్మడి వరంగల్, హైదరాబాద్, ఖమ్మం జిల్లాలకు కూడా విస్తరించింది. రాష్ట్రం నుంచి రోజుకు సగటున 1.5 లక్షల మంది మట్కా పందేలు కాస్తున్నట్లు అంచనా. ఇందులో 50 వేల మంది వరకు సరిహద్దులు దాటి మహారాష్ట్ర పట్టణాల్లో ప్రత్యక్షంగా జూదంలో పాల్గొంటున్నట్లు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేకాటపై ఉక్కుపాదం మోపిన నేపథ్యంలో..జూదరులు మట్కా వైపు దృష్టి సారించినట్లు చెబుతున్నారు. అక్కడ చట్టబద్ధమే.. మహారాష్ట్రలో మట్కాకు చట్టబద్ధత ఉంది. మెయిన్ ముంబై, రాజధాని నైట్, న్యూముంబై దబ్రా, సెంట్రల్ ముంబై, శుభలక్ష్మి, న్యూవర్లీ, రాజధానిడే, కల్యాణి.. ఇలా రకరకాల పేర్లలో వందకుపైగా మట్కా కంపెనీలు జూదం నిర్వహిస్తున్నాయి. అన్నీ కూడా నిరుపేదలు, దినసరి కూలీలు, మధ్యతరగతి వారు టార్గెట్‌గా నడుస్తున్నవే. ఇందులో రోహణ్ ఖత్రీ అనే వ్యక్తి నడిపిస్తున్న మెయిన్ ముంబై, కల్యాణ్ మట్కా కంపెనీలకు 75 శాతం మార్కెట్ వాటా ఉంది. ఈ రెండు ఆటలను కూడా అంతా పనులు ముగించుకొని ఇంటికొచ్చే వేళల్లో నిర్వహిస్తుంటారు. దీంతో వ్యాపారులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు, యువత కూడా మట్కా ఆడుతున్నారు. అంకెలు, సంఖ్యల మాయాజాలం! మెయిన్ ముంబై, కల్యాణ్ కంపెనీలు రోజుకు ఒక ఆట నిర్వహిస్తాయి. 00 నుంచి 999 వరకు సంఖ్యల ఆధారంగా ఈ జూదం నడుస్తుంది. ఒక్కో ఆటలో ప్యానల్, సింగిల్, జోడీ, డబుల్ ప్యానల్ అనే విభాగాలు ఉంటాయి. ప్యానల్‌ను కూడగా వచ్చిన చివరి సంఖ్యను సింగిల్ అని పిలుస్తారు. ఆట ఓపెన్ కాకముందు ప్యానల్‌కు పందెం కాస్తే విజేతలకు ప్రతి రూ.10కి రూ.1,400 ఇస్తారు. డబుల్ ప్యానల్ గెలిస్తే రూ.2,400, సింగిల్ నంబర్ గెలిస్తే రూ.95, జోడీ గెలిస్తే రూ.950 చొప్పున చెల్లిస్తారు. చాలా మంది జోడీ నంబర్ మీద పందెం కాస్తుంటారు. ఆట ఓపెన్ అయిన రెండు గంటల్లో ముగుస్తుంది. ఒక్కో ఆటలో 6 లక్షల నుంచి 10 లక్షల మంది వరకు పాల్గొంటారని మట్కా కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచే.. ఆదిలాబాద్ జిల్లా జైనథ్, బేల మండలాలు, ఖానాపూర్, జిన్నింగ్ ఏరియాల్లో, ఖుర్షిద్‌నగర్, ఆదిలాబాద్‌లోని తాంసి బస్టాండ్, సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్, న్యాల్కల్ మండలం రాజోల్, సంగారెడ్డి పట్టణం, నారాయణఖేడ్, సమీప గ్రామాలు, కామారెడ్డి జిల్లాలోని పిట్లం, బిచ్కుంద, మహబూబ్‌నగర్ జిల్లాలోని కృష్ణా్ణ, మన్ననూరు, ఆత్మకూరు, నారాయణపేట మండలాల్లో మట్కా జూదం సాగుతున్నట్లుగా పోలీసుల వద్ద సమాచారం ఉంది. ఇక హైదరాబాద్, వరంగల్‌తో సహా అన్ని నగర, పట్టణ ప్రాంతాల్లో ఆన్లైన్ పందేలు ఎక్కువగా సాగుతున్నాయి. మొత్తంగా రోజుకు రూ. 3 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు చేతులు మారుతున్నట్లు అంచనా. టెక్నాలజీతో విస్తృతమై.. ఒకప్పుడు కోడి పందాల తరహాలో ఒకచోట గుంపులుగా చేరి చీటీలపై నంబర్లతో సాగిన మట్కా దందా... సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో బాగా విస్తృతమైంది. మొబైల్ ఫోన్లో యాప్‌లు, ఎస్సెమ్మెస్‌ల స్థాయికి చేరింది. ఎక్కడున్నా, ఎక్కడి నుంచైనా మట్కా ఆడేలా వీలు ఏర్పడింది. ఇక తెలంగాణలో ప్రభుత్వం పేకాటపై ఉక్కుపాదం మోపడంతో జూదం ఆడేవాళ్లు మట్కావైపు మళ్లారు. పేకాట క్లబ్బులు నిర్వహించడంలో అనుభవమున్న వారు మట్కా ఏజెంట్లుగా మారిపోయారు. పందెం రాయుళ్ల నుంచి రూ.2 వేలు రుసుము తీసుకుని ఏడాది పాటు సభ్యత్వం ఇస్తున్నారు. పందెం డబ్బు చెల్లించడం కోసం బ్యాంకు ఖాతా నంబర్ ఇచ్చి, గెలిస్తే బహుమతి డబ్బు ఇవ్వడం కోసం జూదరుల ఖాతా నంబర్లు తీసుకుంటున్నారు. పందెం కాయాలనుకుంటే.. నిర్వాహకుల ఖాతాలో డబ్బులు వేసి, ఫోన్ చేసి ‘మట్కా’ ఓపెనింగ్ నంబరో, ప్యానల్ నంబరో, జోడీ నంబరో చెబితే నోట్ చేసుకుంటారు. గెలిస్తే పందెం కాసినవాళ్ల బ్యాంకు ఖాతాలో నేరుగా డబ్బులు జమ చేస్తారు. పందెం కాయడం సులువుగా మారిపోవడంతో మట్కా మెల్లమెల్లగా విస్తరిస్తోంది. తెలంగాణలో కార్మికుల నుంచి కాంట్రాక్టర్ల వరకు చాలా మంది దీని మాయలో పడిపోతున్నారు. రాష్ట్రం నుంచి లక్ష మందికిపైగా సభ్యత్వం తీసుకున్నట్లు మహారాష్ట్రలోని ఉమ్మర్గలో ఉన్న మట్కా నిర్వాహకులు చెబుతుండడం గమనార్హం. ఊరూరికీ ఏజెంట్ల వ్యవస్థ ముంబై మాఫియా కనుసన్నల్లో నడిచే మట్కా జూదం ఏజెంట్ల వ్యవస్థ మీద ఆధారపడి కొనసాగుతోంది. ప్రతి పట్టణంతో ఇద్దరు ముగ్గురు ఏజెంట్లను నియమించుకుని.. వారు సేకరించే పందెం సొమ్ము నుంచి 10 శాతం కమీషన్‌గా ఇస్తున్నారు. ఈ ఏజెంట్ల మీద పర్యవేక్షణకు మునీంలు, వారిపై పట్వారీలు.. అలా అధినేత వరకు ఉంటారు. వారికి వేర్వేరుగా కమీషన్లు ఉంటాయి. 1 రాష్ట్రం నుంచి మొదలై.. మట్కా జూదం జరుగుతున్న తీరును గుర్తించడం కోసం ‘సాక్షి’ బృందం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నుంచి మహారాష్ట్రలోని ఉమ్మర్గ పట్టణం వరకు క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. ముందుగా జహీరాబాద్‌లో ఒక ఏజెంట్‌ను కలవగా.. ఆ సమయంలో న్యాల్కల్ మండలం రాజోల్లో జోరుగా పందేలు సాగుతాయని వెల్లడించాడు. కర్ణాటక, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ఆ గ్రామానికి వెళుతుండగా పొలిమేరల్లోనే పందాల గుంపు కనిపించింది. అటువైపు వెళ్లేసరికి పందెం రాయుళ్లు, నిర్వాహకులు అడవిలోకి వెళ్లిపోయారు. అక్కడ జెరప్ప అనే వ్యక్తి, అతని అనుచరులు కలసి మట్కా జూదం నిర్వహిస్తుంటారని.. ప్రతి రోజూ మూడు నాలుగు వందల మంది పందేలు కాస్తుంటారని స్థానికుడొకరు వెల్లడించారు. 2 ఉమ్మర్గ.. పందాలకు అడ్డా అనంతరం ‘సాక్షి’ బృందం మహారాష్ట్రలోని ఉమ్మర్గ పట్టణానికి వెళ్లి పరిశీలించింది. ఈ పట్టణం మట్కాకు ముంబై తర్వాత రెండో రాజధానిగా అభివర్ణిస్తుంటారు. రాష్ట్రం నుంచి చాలా మంది ప్రత్యక్షంగా మట్కా పందేలు కాయడం కోసం ఉమ్మర్గకు వెళుతుంటారు. ఉమ్మర్గ పట్టణం, సమీప గ్రామాల్లో కలిపి 150 వరకు లాడ్జీలు ఉండగా... ఇందులో పది పదిహేను మాత్రమే సాధారణ లాడ్జీలు. మిగతావన్నీ బెట్టింగ్ అడ్డాలే. వాటిల్లోకి ఉచితంగా వెళ్లవచ్చు. డబ్బులు తీసుకుని భోజనం, మద్యం కూడా సమకూర్చుతారు. అసలు ఈ పట్టణ జనాభాలో 40 శాతం మంది మట్కా ఏజెంట్లేనని, సుమారు 1,000 మంది ఏజెంట్లు ఉంటారని స్థానికులు చెప్పారు. ఇక్కడి లాడ్జీల్లో చాలా వరకు తెలంగాణ జిల్లాల నుంచి వచ్చేవారే ఉంటారని వెల్లడించారు. ‘సాక్షి’ బృందం ఓ స్థానిక సహాయకుడిని తోడు తీసుకుని పందేలు కాసే ఓ లాడ్జీలోకి వెళ్లింది. అందులో పది పన్నెండు చిన్న గదులు ఉండగా.. అంతా పందెం రాయుళ్లతో కిక్కిరిసి ఉన్నాయి. వారిలో 80 శాతం మంది తెలుగు వారే కనిపించారు. 20–30 మందితో మాట్లాడగా.. వారంతా హైదరాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి వచ్చినట్టు చెప్పారు. రూ. 50 నుంచి రూ. 500 వరకు పందేలు కాస్తున్నారు. 3 పందెం కోసమంటూ వెళ్లి.. తర్వాత ఉమ్మర్గ పట్టణంలోని మహాదేవుని రోడ్డు ప్రాంతంలో ఉన్న మూడంతస్తుల మరో లాడ్జిలోకి పరిశీలన బృందం వెళ్లింది. అక్కడ దాదాపు 30 గదులు ఉండగా.. అన్నింటిలోనూ తెలుగు వాళ్లు కనిపించారు. రిటైర్డ్ ఉద్యోగుల నుంచి వ్యాపారులు, కూలీల వరకు అందరూ వారిలో ఉండడం గమనార్హం. ఒక్కసారి ఇక్కడికి వస్తే వారం రోజుల వరకు ఉంటారని గదులు శుభ్రం చేసే వ్యక్తి వెల్లడించాడు. ‘సాక్షి’ బృందం కూడా పందెం ఆడటానికంటూ ఆ లాడ్జిలోని ఒక గదిలోకి వెళ్లి పరిస్థితిని పరిశీలించింది. వారికి నమ్మకం కలిగించడానికి రూ.100, రూ.50 పందేలు కూడా కాసింది. ఫలితం వచ్చే సమయం దాకా అక్కడున్నవారితో మాటలు కలిపి.. వివరాలు సేకరించింది. 4 మట్కా చీటీలు రాసేది తెలుగువాళ్లే.. ఆ లాడ్జి నిర్వహించే ఏజెంట్ వద్ద క్లర్కుగా పనిచేసే వ్యక్తిని ‘సాక్షి’ బృందం పలకరించగా.. అతను తన పేరు ‘ఎన్.రాజ్’ అని చెప్పాడు. ఉమ్మర్గ, పర్భణి, ధర్మపురి, నాందేడ్ తదితర ప్రాంతాల్లోని మట్కా కేంద్రాలకు తెలుగు వారే ఎక్కువగా వస్తారని వెల్లడించాడు. అందువల్ల కచ్చితంగా తెలుగు వచ్చిన వారినే ఏజెంటుగా, చీటీలు రాసే క్లర్కుగా తీసుకుంటారని చెప్పాడు. క్లర్కుకు వారానికి రూ. 2.5 వేలు జీతంగా ఇచ్చి భోజనం పెడతారని తెలిపాడు. ఫోన్ ద్వారా పందేలు కాయవచ్చని చెబుతూ.. ఆ ఫోన్ నంబర్లు కూడా రాసి ఇచ్చాడు. బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయాలని.. గెలిస్తే తాము కూడా ఖాతాలో జమ చేస్తామని చెప్పాడు. 5 పెద్ద ఏజెంట్‌పై ఆరా.. మట్కా కంపెనీల్లో నంబర్‌వన్ అయిన ‘మెయిన్ ముంబై’లో భారీగా పందెం కాస్తామని, ఆ స్థాయి ఏజెంట్ ఎవరని సాక్షి బృందం ఆరా తీసింది. దాంతో ఓ మధ్యవర్తి రూ.300 తీసుకుని.. పెద్ద ఏజెంట్ నిర్వహించే లాడ్జికి తీసుకెళ్లాడు. ఆ ఏజెంట్ పేరు రతన్ భాయ్ అని చెప్పాడు. బృందం ఆయనను కలవగా.. తెలుగువారని తెలుసుకుని మర్యాదగా ప్రవర్తించారు. భారీగా పందెం కాస్తామంటే ఐదు నుంచి 10 నంబర్ల మీద పెడితే మంచిదని సలహా కూడా ఇచ్చాడు. బ్యాంకులో డబ్బు వేసి.. ఫోన్‌కాల్, ఎస్సెమ్మెస్ ద్వారానైనా మట్కా స్లాట్ బుక్ చేసుకోవచ్చని చెప్పాడు. ఫోన్ నంబర్లు ఇచ్చాడు. ఆ నంబర్లకు కాల్ చేస్తే.. బ్యాంకు ఖాతాల నంబర్లు ఎస్సెమ్మెస్ చేస్తానన్నాడు. దీంతో పని ముగిసిన బృందం.. సరేనంటూ అక్కడి నుంచి తిరిగి వచ్చేసింది. -
మట్కా నిర్వహకులను పట్టించిన వాట్సాప్
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలోని ఖుర్షీద్‌నగర్ కాలనీలో మట్కా నిర్వహిస్తున్న మహ్మద్ తబ్రేజ్, ఖుర్షిద్ అహ్మద్‌ను గురువారం టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ వాట్సాప్‌లో సమాచారం అందించడంతో టూటౌన్ ఎస్సై రమణరావు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి నిందితులను అరెస్టు చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ నర్సింహారెడ్డి వివరాలు వెల్లడించారు. ఖుర్షిద్‌నగర్ కాలనీకి చెందిన మట్కా ఏజెంట్ మహ్మద్ తబ్రేజ్ అతని తండ్రి ఖుర్షిద్ అహ్మద్‌తో కలిసి పలువురి వద్ద నగదు తీసుకొని మట్కా నిర్వహిస్తున్నట్లు పోలీసు వాట్సాప్ నంబర్ 8333986898కు స్థానికులు సమాచారం అందించినట్లు తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు సీసీ ఎస్ , టూటౌన్ పోలీసులు కలిసి దాడులు నిర్వహించారని పేర్కొన్నారు. ఖుర్షిద్‌ను తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశామని, తబ్రేజ్‌ను కోర్టులో హాజరుపర్చనున్నట్లు పేర్కొన్నారు. వీరి నుంచి రూ.3,250 నగదు, సెల్‌ఫోన్, మట్కా చిట్టీలు స్వాధీనం చేసుకున్నారు. టూటౌన్ ఎస్సై రమణ, సీసీఎస్ హెడ్‌కానిస్టేబుల్ సిరాజ్‌ఖాన్,సిబ్బంది మంగల్సింగ జాకీర్ ఉన్నారు. నిషేధిత తంబాకు స్వాధీనం.. జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ ఆదేశాల మేరకు స్థానిక చిల్కూరి లక్ష్మీనగర్ కాలనీలో గల రెండు గోదాములపై దాడులు నిర్వహించి నిషేధిత బోరితంబాకు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ నర్సింహారెడ్డి తెలిపారు. కాలనీకి చెందిన షేక్ అయుబ్ మహారాష్ట్రాలోని పాండ్రకావడ నుంచి నిషేధిత బోరి తంబాకు తరలించి జిల్లాలో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడని పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న తంబాకు విలువ రూ.96 వేలు ఉంటుందన్నారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. -
మట్కా రాకెట్ గుట్టురట్టు: రూ.30 లక్షలు స్వాధీనం
అనంతపురం: జిల్లా కేంద్రమైన అనంతపురంలో మట్కా రాకెట్ గుట్టు రట్టు అయింది. 15మంది నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా, ముంబయి, హుబ్లి ప్రాంతాల నుంచి వచ్చి మట్కా నిర్వహిస్తున్నట్లు తమకందిన సమాచారం మేరకు పోలీసులు వీరిని అరెస్టు చేశారు. ముంబయి, హుబ్లి జూద కంపెనీలపై ఆరా తీస్తున్నామని ఎస్పీ జి.వి.జి. అశోక్‌కుమార్ చెప్పారు. దీనికి సహకరించే పోలీసులను ఉపేక్షించేది లేదని, మట్కా నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
మట్కా మాయ..
ఆదిలాబాద్: జిల్లాల్లో మట్కాదందా జోరుగా సాగుతోంది. నిత్యం ఎక్కడో ఓ చోట మట్కా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో చిన్నాచితక నిర్వహకులే అరెస్టు కాగా, వారి వెనక ఉన్న బడా నిర్వాహకులు మాత్రం పోలీసులకు చిక్కడం లేదు. జిల్లా కేంద్రంలో పోలీసులు దాడులు నిర్వహిస్తున్నప్పటికి పూర్తిస్థాయిలో నియంత్రించడం లేదు. ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ మట్కా, పేకాట దందాలపై ప్రత్యేక దృష్టి సారించారు. పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా సగటు మనిషి జీవితాన్ని మట్కా దందా నాశనం చేస్తోంది. వ్యాపారులు, కూలీలు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు, యువత మట్కాకు బానిసై డబ్బులు పొగొట్టుకోవడమే కాకుండా తమ జీవితాలను చిధ్రం చేసుకుంటున్నారు. కూలీలు దినమంతా కష్టపడి సంపాదించిన సొమ్మును ఈ జూదంలో పెట్టడంతో కుటుంబ పోషణభారమై జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. కార్మికుల నుంచి కాంట్రాక్టర్లు.. వ్యాపారుల నుంచి రాజకీయ నాయకులు, ఉద్యోగుల వరకు మట్కాలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో యువత కూడా మట్కాజూదం వైపు ఆకర్షితులవుతున్నారు. జిల్లాకు మహారాష్ట్ర సరిహద్దులో ఉండడంతో ఈ మట్కా ఎక్కువగా సాగుతోంది. మహారాష్ట్రకు అనుకొని ఉన్న బేల, జైనథ్ మండలాల్లో కూడా మట్కా దందా యథేచ్ఛగా సాగుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఏటా కోట్లాది రూపాయాలు మట్కాతో చేతులు మారుతున్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముంబాయి ప్రధాన కేంద్రంగా మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో కళ్యాణి, మిలాన్, ముంబాయి, రాజధాని వంటి కంపెనీలు మట్కా నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు ఈ కంపెనీల్లో జిల్లాకు చెందిన వారు కూడా పాల్గొంటున్నారు. ఓపెనింగ్, క్లోజింగ్ నంబర్లపై బ్రాకెట్ నంబర్‌కు పదిరేట్లు చెల్లింపుతో మట్కా జూదం నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఓపెన్, సాయంత్రం 6 గంటలకు క్లోజింగ్ ఉంటుంది. మనం ఎంపిక చేసిన నంబర్‌కు లాటరీ తగిలితే మళ్లీ ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో లాటరీ తగిలేవారు తక్కువ శాతం.. డబ్బులు పోగొట్టుకునే వారే అధికంగా ఉంటారు. అయితే మట్కా ఆడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. కార్మికులు, ఉద్యోగులు, నాయకులు అనే తేడా లేకుండా ధనార్జనే ధ్యేయంగా మట్కా దందా సాగిస్తున్నారు. పట్టణంలో జోరుగా.. జిల్లా కేంద్రంలో మట్కా జోరుగా సాగుతోంది. ముఖ్యంగా కార్మిక వాడల్లో ఎక్కువ సాగుతోంది. ఖానాపూర్, జిన్నింగ్ ఏరియాల్లో, ఖుర్షిద్‌నగర్, పట్టణంలోని తాంసి బస్టాండ్, ఇటీవల స్థానిక ప్రధాన బస్టాండ్ వద్ద గల ఆటోల్లో సైతం మట్కా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు ఇక్కడ ఆటోలు పెట్టుకొని మట్కా నిర్వహిస్తున్నారు. అప్పడుప్పుడు దాడులు చేసే పోలీసులు పూర్తిస్థాయి నిఘా పెట్టకపోవడంతో నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. పోలీసులు దాడులతో పలువురు సెల్‌ఫోన్ మట్కాకు తెరదీశారు. ఒకప్పుడు చిట్టీలపై నంబర్లతో సాగిన ఈ దందా సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో విచ్చలవిడిగా సాగుతోంది. చిట్టీలతో కాకుండా సెల్‌ఫోన్ మెసేజ్‌లతో మట్కా ఆడుతూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గతంలో లక్షల్లో జరిగే ఈదందా ప్రస్తుతం కోట్ల రూపాయల్లో సాగుతోంది. మట్కా నిర్మూలనకు కృషి జిల్లాలో మట్కా నిర్మూలనకు ప్రజలు సహకరించాలి. మట్కా కేంద్రాలపై ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తున్నాం. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి మట్కా అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నాం. ఎక్కడైనా మట్కా, పేకాట ఆడుతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. గతేడాది 109 కేసులు నమోదు చేసి రూ.1,82,360 నగదును స్వాధీనం చేసుకున్నాం. అలాగే 142 మందిని అరెస్టు చేశాం. – నర్సింహారెడ్డి, ఆదిలాబాద్ డీఎస్పీ -
మంత్రి ఇలాఖాలో మంగతాయి
సాక్షి కడప : రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి సొంత నియోజకవర్గంలో మంగతాయి జోరు పెరిగింది. రూ.వేలు, లక్షలు దాటి కోట్లకు చేరింది. మంత్రి ఇలాఖా అయిన జమ్మలమడుగు ప్రాంతంలో ప్రతినిత్యం జూదం జోరందుకున్నా నోరు మెదిపే వారు కరువయ్యారు. ఎవరైనా పోలీసులు సాహసం చేసి దాడులు నిర్వహిస్తే తాము మంత్రి వర్గీయులమంటూ బెదిరిస్తున్నట్లు కూడా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే జమ్మలమడుగు ప్రాంతంలో మట్కాతోపాటు జూదం ఆడేందుకు రాష్ట్రాలు, జిల్లాల నుంచి కూడా వస్తున్నారు. గండికోట పర్యాటక క్షేత్రాన్ని స్థావరంగా ఏర్పరుచుకుని వ్యవహారం చక్కబెడుతున్నారు. ఒకరోజు ఒకచోట, మరొకరోజు మరో ప్రాంతాన్ని అడ్డాగా చేసుకుని అడ్డంగా ఆడుతున్నారు. అయితే మంగళవారం గండికోటలోని జూద స్థావరంపై పోలీసుల దాడి సంచలనం కలిగించినా.. తర్వాత అధికార పార్టీ పెద్దల ఒత్తిళ్లతో కేసు వ్యవహారం కాస్తా పక్కకు మళ్లడం ఆందోళన కలిగిస్తోంది. అన్నీ అనుమానాలే.. జమ్మలమడుగు పరిధిలోని గండికోటలో మంగతాయి ఆడుతున్న జూదరులను పట్టుకోవడం...వారి వద్దనుంచి భారీగా మొత్తాలు స్వాధీనం చేసుకున్న విషయం వరకు పరిశీలిస్తే పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే పట్టుబడిన సొమ్ముతోపాటు పోలీసులకు చిక్కిన జూదరులలో కొంతమందిని తప్పిస్తున్నారని తెలియవచ్చింది. రూ.70 లక్షల వరకు నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు వర్గాల్లోనే చర్చ సాగుతోంది. అంతేకాకుండా ఆ శాఖలోని నిఘా వర్గాలు కూడా దాదాపు కోటి రూపాయల మేర వ్యవహారం సాగినట్లు లెక్కలు కడుతున్నారు. అయితే దొరికిన లెక్కకు పక్కా లెక్కలు ఉండవనుకున్నారో...లేదా అధికార పార్టీ ఒత్తిడితో ఏదో ఒకటి చేశామని చెప్పుకున్నారో తెలియదుగానీ నగదు వ్యవహారం కాస్త జమ్మలమడుగులో హాట్ టాపిక్ అయింది. గండికోటలో జరుగుతున్న జూదం వ్యవహారంలో దాదాపు 50 మంది వరకు పాల్గొనగా. .దాదాపు రెండు కోట్ల మేర అందరి వద్ద నగదు ఉన్నట్లు బయట ప్రచారం సాగుతోంది. అయితే పోలీసులు మాత్రం కేవలం రూ. 30 లక్షలు మాత్రమే చూపించడాన్ని బట్టి పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు తెలుస్తోంది. జమ్మలమడుగు కేంద్రంగా.. రాష్ట్ర మార్కెటింగ్ శాఖా మంత్రి ఆది సొంత నియోజకవర్గంలో మొబైల్ గ్యాంబ్లింగ్ ఎక్కువగా జరుగుతుంది. గండికోట, కర్నూల్, నంద్యాల, బెంగళూరు ప్రాంతాలను ఎంపిక చేసుకుని గ్యాబ్లింగ్ నిర్వహిస్తున్నారు. వీరు ప్రతి రోజు ఒక ప్రాంతాన్ని ఎంచుకుని ఆ ప్రాంతంలో పోలీసులు ఎవరూ రాకుం డా ప్రత్యేక మనుషులతో వలయాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు కోట్లలో మంగతాయి నిర్వహిస్తున్నారు. ఎవరైనా పోలీసులు వస్తే వారికి తాము మం త్రి అనుచరులమంటూ చెబుతూ బెది రింపులకు దిగుతున్నారు. దీంతో చాలా మంది పోలీసు అధికారులకు జూదం వ్యవహారం తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. దొరికింది రూ.30 లక్షలా 72 లక్షలా! గండికోటలో మంగళవారం అర్ధరాత్రి మొబైల్ గ్యాంబ్లింగ్‌లో భాగంగా కొంత మంది మంగతాయి నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో పోలీసులు మారువేషాల్లో వెళ్లి( మఫ్టీలో) వారిని పట్టుకున్నారు. అయితే మంగతాయి ఆడేవారు దాదాపు 52 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరి వద్ద నుంచి దాదాపు 72 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే పోలీసులు మాత్రం తాము స్వాధీనం చేసుకుంది కేవలం రూ.30లక్షల 31వేలు మాత్రమే అని చెబుతున్నారు. అయితే పేకాట ఆడటానికి వెళ్లేవారు ఒక్కొక్కరు కనీసం మూడు లక్షలరూపాయలు దగ్గర పెట్టుకుని వెళితోనే లోపలికి ప్రవేశం ఉంటుంది. ఈ లెక్కన 51 మంది వద్ద కనీసం రెండు కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఎదురుతిరిగిన జూదరులు గండికోట టూరిజం హోటల్లో మంగతై ఆడుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు మఫ్టీలో వెళ్లి పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే అందులో డబుల్ స్టార్ కలిగిన అధికారులపై జూదరులు దౌర్జనానికి పాల్పడటంతో పాటు వాదనకు దిగినట్లు తెలిసింది. ఎట్టకేలకు జూదరులను అదుపులోకి తీసుకోగా వారిలో చాలా మంది ప్రధాన వ్యక్తులే ఉన్నారని తెలుస్తోంది. అయితే వారిని కాకుండా వారు సూచించిన వ్యక్తులను కేసులో పెట్టేలా అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లా స్థాయి అధికారులు కేసులు పెట్టిన 21 మందిని విచారిస్తే అసలు నిజాలు బయటపడే అవకాశం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు. రూ.30 లక్షలు స్వాధీనం జమ్మలమడుగు: గండికోటలోని హరిత హోటల్లో మంగతై జూదం ఆడుతున్న 21మందిని అరెస్టు చేసి వారి వద్దనుంచి 30 లక్షల 31,900 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు జమ్మలమడుగు అర్బన్ సీఐ ప్రవీన్‌కుమార్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండల పరిధిలోని గండికోట టూరిజం హోటల్లో మంగతై ఆడుతున్నట్లు సమాచారం రావడంతో రూరల్ సీఐ ఉమామహేశ్వరరెడ్డి, ఎస్ఐలు హనుమంతు, హరిప్రసాద్, సునీల్‌రెడ్డి, రాఘవేంద్రారెడ్డి, శ్రీనివాసులు, నరసింహారెడ్డిలతో పాటు స్పెషల్ పార్టీ పోలీసులతో కలిసి దాడి నిర్వహించామన్నారు. ఇందులో తమ్మినేని వెంకటేశ్వర్లు, ఉప్పలూరు నాగేశ్వరరెడ్డి, టంగుటూరు కృష్ణమూర్తి, దూదేకుల దస్తగిరి, మాధవాపురం రవికుమార్, నారాయణ, తప్పెట్ల రామసుబ్బారెడ్డి, వేంపల్లి సుబ్బారెడ్డి, వెన్నపూస శ్రీనివాసుల రెడ్డి, లింగాల గారి వెంకటసుబ్బయ్యలతోపాటు మరో11 మందిని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. -
నంబర్లాట..బెట్టింగ్ కోట
నెల్లూరు(క్రైమ్), కావలి : పట్టణంలో నంబర్లాట జూదం జోరుగా సాగుతోంది. మానస సెంటర్, జెండా చెట్టు సెంటర్, దేవి థియేటర్ రోడ్డు, రైల్వే స్టేషన్ సెంటర్, ఒంగోలు బస్టాండ్ సెంటర్, వాయునందన ప్రెస్ వీధి, రామ్మూర్తిపేట, పాతూరు, కచ్చేరిమిట్ట, తుఫాన్‌నగర్, ఇందిరా నగర్, వెంగళరావునగర్, వైకుంఠపురం, తదితర ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని జూదరులు నంబర్లాట నిర్వహిస్తున్నారు. గతంలో పబ్లిక్‌గా నిర్వహించే జూదరులు పోలీసుల దాడులతో ప్రస్తుతం చాటుమాటుగా కొనసాగిస్తున్నారు. ఈ జూదంలో ఆరితేరిన బుకీలు పట్టణంలో వంద మందికి పైగా ఉన్నట్లు సమాచారం. సాధారణ వ్యక్తుల నుంచి వివిధ వృత్తుల్లో గుర్తింపు ఉన్నవారు సైతనం నంబర్లు రాసుకుని బుకీలుగా వ్యవహరిస్తున్నారు. జూదం నిర్వహించే బుకీల్లో కొందరు ఆర్థికంగా నిలదొక్కుకోగా, మరి కొందరు ఆర్థికంగా చితికిపోయారు. బెట్టింగ్‌లు కట్టే వారు సైతం ఆర్థికంగా దెబ్బతిని రోడ్డున పడుతున్నారు. అంతా మోసమే నంబర్లాట, మట్కా, బ్రాకెట్ నంబర్లు, కళ్యాణి, తదితర పేర్లతో నిర్వహించే నంబర్ల గేమింగ్ జూదం ముంబాయి కేంద్రంగా సాగుతోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక నంబర్‌పై అంటే 0 నుంచి 9 వరకు బెట్టింగ్ కాస్తారు. 12 గంటల తర్వాత గెలిచిన నంబర్‌ను ప్రకటిస్తారు. దీనిని ఓపెనింగ్ నంబర్ అంటారు. గెలిచిన నంబర్‌పై నగదు పెట్టిన వారికి రూ.100కు రూ.400 ఇస్తారు. మళ్లీ సాయంత్రం 6 గంటల వరకు రెండు నంబర్ల(01 నుంచి 99 వరకు)పై బెట్టింగ్ పెడతారు. దీనిని క్లోజింగ్ అంటారు. రెండు నంబర్లపై బెట్టింగ్ పెట్టి విజేతగా నిలిచి వారికి రూ.100కు రూ.8వేలు ఇస్తారు. పెద్ద ఎత్తున సాగే ఈ జూదానికి స్థానికులు కొందరు బుకీలుగా వ్యవహరిస్తారు. వాస్తవానికి వారే నిర్వాహకులైన కమీషన్ ఏజెంట్లుగా నమ్మిస్తుంటారు. బెట్టింగ్ కట్టిన నంబర్ రాకపోతే నగదును జేబుల్లో వేసుకొంటారు. నంబర్ గెలిస్తే నగదును చెల్లిస్తుంటారు. నంబర్ గెలవడం చాలా తక్కువ సందర్భాల్లోనే జరుగుతోంది. గెస్సింగ్ నంబర్ చార్ట్ ఏ రోజు ఏ పూట ఏ నంబర్ విజేతగా వస్తోందో తెలియజేసే గెస్సింగ్ నంబర్ చార్టు అంటూ మరో రకం మోసం కూడా ఈ జూదంలో ఉండటం గమనార్హం. గెస్సింగ్ నంబర్లతో ఉండే చార్ట్‌ను జూదం వ్యసనపరులు తాళపత్ర గ్రంథంలా భావిస్తుంటారు. ఈ చార్ట్‌లను ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకొంటారు. ఈ జూదంలో బాగా తలపండిన వారు తామే స్వతహాగా చార్ట్‌ను తయారు చేసుకొంటారు. ఏడాది, నెల, వారం, తేదీ, తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని, ఆ రోజు మొదటి నంబర్ విజేత ఏది, రెండు నంబర్ల విజేత ఏది అన్ని గెస్సింగ్ చేస్తుంటారు. గెస్సింగ్ నంబర్లు చెప్పే నిష్ణాతులుగా పట్టణంలో కొందరికి గుర్తింపు కూడా ఉండటం గమనార్హం. నంబర్లాట జూదం ఆడి డబ్బును పోగొట్టుకుని కటుంబాలను నాశనం చేసుకున్న వారు పట్టణంలో వేలాది మంది ఉన్నారు. నిర్వాహకుల్లో కొందరు ఆర్థికంగా స్థితిమంతులు కాగా, మరి కొందరు ఆస్తులను పోగొట్టుకొని కూలీలుగా మారారు. పట్టణానికి చెందిన ఓ యువకుడు జూదం నిర్వహిస్తూ బాగా సంపాదించాడు. ఒకసారి ఓ వ్యక్తి పెద్ద మొత్తంలో డబుల్ నంబర్‌పై బెట్టింగ్ కాయగా ఆ నంబర్‌ను విజేతగా ప్రకటించారు. దీంతో లక్షలాది రూపాయలు చెల్లించాల్సి రావడంతో ఆస్తులను పోగొట్టుకుని దినసరి కూలీగా మారాడు. అరెస్ట్‌లకు రంగం సిద్ధం పట్టణంలో నంబర్ల జూదానికి పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. తాజాగా బుధవారం ఒకటో పట్టణ పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. రెండో పట్టణ పోలీసులు జూదరులపై దృష్టి సారించారు. జూదం ఆడుతుంటే సమాచారం అందుకుని అదుపులోకి తీసుకోవడానికి వెళ్లిన తమపై బుకీలు తిరగబడ్డారని, కొట్టారని, పారిపోవడానికి ప్రయత్నించి తోసేశారని కేసులు నమోదు చేస్తున్నారు. రౌడీషీట్లు సైతం ఓపెన్ చేయడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. -
అనంత స్వేచ్ఛ ఆటా.. పాట!
♦ జోరుగా పేకాట, మట్కా, క్రికెట్ బెట్టింగ్, వ్యభిచారం ♦ బళ్లారి, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల నుంచి రాకపోకలు ♦ స్టార్ హోటళ్లు, లాడ్జీలు, క్లబ్‌లు, పర్యాటక, అటవీ ప్రాంతాలే అడ్డాలు ♦ బంకినీకో అడ్డాతో నిర్వహణ ♦ వాట్సాప్‌లో అడ్రస్‌లు.. ఫొటోలు, పేకాటరాయుళ్ల వివరాలు పీఏబీఆర్ డ్యాం.. తాడిపత్రి.. పెన్నహోబిళం.. మాసినేని గ్రాండ్! ప్లేస్ ఏదైనా ఆడే ఆట మాత్రం ఒక్కటే! కర్నూలు, వైఎస్సార్ కడప, బళ్లారి జిల్లాల నుంచి అనంతపురానికి పేకాట ఆడేందుకు రోజూ వందల సంఖ్యలో వస్తున్నారంటే ‘అనంత’ స్వేచ్ఛ ఇట్టే అర్థమవుతోంది. పేకాట, మట్కా, క్రికెట్ బెట్టింగ్, వ్యభిచారం దెబ్బకు వేలాది కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. కొన్నేళ్లుగా వేళ్లూనుకున్న ఈ అసాంఘిక కార్యకలాపాల విషయంలో పోలీసు బాస్ నిఘా సారించినా.. కళ్లుగప్పి సాగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: మాసినేనిగ్రాండ్ ఓ త్రీస్టార్ హోటల్. ఇక్కడ ఒకే రోజు ఏకంగా ఆరు గదుల్లో 48 మంది పేకాట రాయుళ్లు పోలీసులకు పట్టుబడ్డారు. అంతమంది ఆరు గదుల్లో ఉంటే ఎందుకు వచ్చారు? ఏం చేస్తున్నారు? అనే విషయాన్ని యాజమాన్యం కూడా గాలికొదిలేయడం చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. పేకాట దెబ్బకు రెండు నెలల క్రితం తాడిపత్రిలో రామసుబ్బారెడ్డి కుటుంబం ఛిద్రమైంది. ఆ ఉదంతం తర్వాత పేకాటపై ఎస్పీ అశోక్‌కుమార్ తీవ్రంగా స్పందించారు. తాడిపత్రితో పాటు పేకాట అడ్డాలపై ప్రత్యేక బృందంతో తనిఖీలు చేయించారు. ఈ క్రమంలో వీరంతా స్టార్‌హోటళ్లు, లాడ్జీలకు మకాం మార్చారు. అక్కడ పోలీసుల తనిఖీలు ఉండవనే భావనతో వీటిని ఎంచుకున్నారు. తాడిపత్రి, పీఏబీఆర్, వై.రాంపురం ప్రాంతాల్లో సాగుతున్న పేకాటకు ఇతర జిల్లాలు, కర్ణాటక వాసులు కూడా వచ్చి వెళ్తున్నారు. ఒక్కో బంకినీ వద్ద రూ.10లక్షల నుంచి రూ.20లక్షలు ఆట జరుగుతున్నట్లు తెలుస్తోంది. పీఏబీఆర్ ప్రాంతంలోనే రోజూ 5–10 బంకినీలు ఉంటాయి. తాడిపత్రి, రాంపురంలో కలిపి మరో 10 వరకూ ఉంటున్నాయి. ఇక్కడ ఒక్కోచోట రూ.10లక్షల వరకు.. హోటళ్లలో రూ. రూ.2లక్షల నుంచి రూ.5లక్షల ఆట జరుగుతోంది. రాయదుర్గంలోని క్లబ్లో పేకాట ఆడి ఓ రాజకీయ నాయకుడి బంధువు రూ.70లక్షలు, మరొకరు రూ.30లక్షలు పొగొట్టుకోవడం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. పోలీసులకు తెలిసిన తంతే.. పేకాట, మట్కా, క్రికెట్ బెట్టింగ్ చిట్టా స్థానిక పోలీసులకు తెలియనిది కాదు. అయితే వారితో ఉన్న సత్ససంబంధాల నేపథ్యంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా నగరంలోని వన్‌టౌన్ పరిధిలో సుదీర్ఘకాలం ఎస్ఐలు, కానిస్టేబుళ్లు తిష్టవేసి ఉండటంతో వీటి నియంత్రణను గాలికొదిలేసినట్లు తెలుస్తోంది. వన్‌టౌన్ ఏరియాలో ఇప్పటికీ మట్కా విచ్చలవిడిగా సాగుతోంది. గతంలో మట్కాకింగ్ అరెస్టు తర్వాత కొద్దికాలం నిలిపేశారనిపించినా.. ఆ తర్వాత ‘మూడు బ్రాకెట్లు.. ఆరు క్లోజ్’లుగా వర్ధిల్లుతోంది. ‘అనంత’తో పాటు తాడిపత్రి, కదిరి, గుంతకల్లు, ధర్మవరం, హిందూపురంలో భారీగా నడుస్తోంది. గతంలో రతన్ మట్కా వారానికి ఐదురోజులు జరిగేది. ఇప్పుడు కళ్యాణ్, సత్తా మట్కాలు ఆరురోజులు నిర్వహిస్తున్నారు. ఈ మాట్కా నెంబర్లు గుజరాత్, ముంబయి నుంచి వస్తాయి. ఇవి కాకుండా ‘అనంత’లోని కొందరు ప్రైవేటు వ్యక్తులు కూడా మట్కా నడుపుతున్నారు. ఇది ఆదివారం కూడా నడుస్తోంది. కళ్యాణ్, సత్తా మట్కాలు సాయంత్రం 5గంటల వరకూ డబ్బు తీసుకుంటారు. రాత్రి 9.15 గంటలకు ఓపెన్, రాత్రి 11.15 గంటలకు క్లోజ్(బ్రాకెట్) నెంబర్ ప్రకటిస్తారు. మట్కా రాసే జాబితాలో కాలేజీ విద్యార్థులు కూడా చేరుతున్నారు. అయినా పోలీసులు నివారణ దిశగా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ‘క్రికెట్ బెట్టింగ్’కు అడ్డాగా ‘అనంత’ ప్రొద్దుటూరులో బెట్టింగ్ ఏ స్థాయిలో నడుస్తోందో, ఇప్పుడు ‘అనంత’లోనూ అదేస్థాయిలో సాగుతోంది. బడా వ్యాపారుల నుంచి బార్బర్ షాపు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకుల వరకూ అంతా బెట్టింగ్ ఊబిలో చిక్కుకున్నారు. క్రికెట్ ఆడే దేశం ఏదైనా టీవీలో ‘లైవ్’ కన్పిస్తే చాలు బెట్టింగ్ తెరపైకి వస్తోంది. వీరిలో అధికశాతం మంది కేఫ్‌లలో కూర్చుని లెక్కలేసుకుంటున్నారు. బెట్టింగ్ ఆడేవారిలో వ్యాపారులతో పాటు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అధికంగా ఉంటున్నారు. మ్యాచ్ గెలుపోటములపై బుకీలు నిర్వహించే బెట్టింగ్‌లతో పాటు ‘లైవ్’ ఉన్న సమయంలో లాడ్జీల్లో గదులు అద్దెకు తీసుకుని గ్రూపులుగా వెళ్లి బాల్ టు బాల్ బెట్టింగ్ ఆడుతున్నారు. యథేచ్ఛగా వ్యభిచారం ‘అనంత’తో పాటు తాడిపత్రి, కదిరి, హిందూపురం, గుంతకల్లులోనూ వ్యభిచారం యథేచ్ఛగా సాగుతోంది. అనంతపురంలోని ఓ ప్రముఖ హోటల్లో 8 నెలల కిందట ఇద్దరు ఆర్డీఓ స్థాయి అధికారులు, ఓ కమిషనర్ స్థాయి అధికారి ఒకే రోజు వేర్వేరు గదుల్లో పోలీసులకు పట్టుబడినట్లు తెలిసింది. అరెస్టు చూపిస్తే ఉద్యోగాలు, పరువు పోతాయని భారీగా ముట్టజెప్పి తప్పించుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ‘అనంత’లోని శ్రీకంఠం సర్కిల్లో వీటికి అడ్డాగా ఉన్న లాడ్జీలను మూయించారు. ప్రస్తుతం బస్టాండ్ సమీపంలోని లాడ్జీలకు మకాం మారింది. దీంతో పాటు ప్రముఖ హోటళ్లలో హైటెక్ వ్యభిచారం నడుస్తోంది. ఆన్లైన్ డేటింగ్సైట్లో బుక్‌చేసుకున్న యువతలు ఇలాంటి హోటళ్లలో దిగుతున్నారు. అలాగే హౌసింగ్‌బోర్డు, శారదానగర్, కళ్యాణదుర్గం రోడ్డులో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. తాడిపత్రిలో పరిశ్రమలు ఎక్కువగా ఉండటంతో ఇతర రాష్ట్రాల వారు ఎక్కువగా ఇక్కడ నివాసం ఉంటున్నారు. వీరు నెలల తరబడి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. వీరిని ఆసరాగా చేసుకుని బుగ్గ సమీపంలో ఎక్కువగా వ్యభిచారం సాగిస్తున్నట్లు సమాచారం. ఎస్పీకి తప్పుడు నివేదికలు: ఎస్పీగా అశోక్‌కుమార్ బాధ్యతలు తీసుకునే సమయంలో జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. ఒకప్పుడు ఫ్యాక్షన్‌తో చితికిపోయిన ఈ జిల్లాలో ఇప్పుడు పేకాట, మట్కా తదితర అసాంఘిక కార్యకలాపాలు మాత్రమే సాగుతున్నాయి. వీటిని నివారిస్తే చాలా కుటుంబాల్లో ప్రశాంతత నింపినట్లే! తద్వారా క్రైం రేటును పరోక్షంగా తగ్గించినట్లు అవుతుంది. ఇది గ్రహించిన ఎస్పీ బాధ్యతలు తీసుకోగానే వీటిపై తీవ్రస్థాయిలో స్పందించారు. ఆ తర్వాత మట్కారాయుళ్ల ఊరొదిలి వెళ్లారు. పేకాట నిలిచిపోయింది, బెట్టింగ్ జరగడం లేదని కొంతమంది మిడిల్ బాస్‌లు ఎస్పీకి తప్పుడు సమాచారం ఇస్తున్నట్లు తాజా పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది. -
హైదరాబాద్‌లో మట్కా దందా
-
మదనపల్లెలో జోరుగా ఆన్లైన్ మట్కా
► ఒడిశా కేంద్రంగా ఆన్లైన్ జూదం ► చేనేత కార్మికులు, కూలీలే లక్ష్యంగా ఎర ► 47 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు ► ఇంటి దొంగలనూ వదిలేది లేదన్న డీఎస్పీ మదనపల్లె రూరల్ : చేనేత కార్మికులు, దినసరి కూలీలే లక్ష్యంగా మదనపల్లె పట్ట ణంలో జోరుగా సాగుతున్న ఆన్లైన్ మ ట్కా గుట్టు రట్టయింది. ఆన్లైన్లో వేలాది రూపాయలు మట్కా ఆడుతూ జీవితా లను బుగ్గిచేసుకుంటున్న 47 మందిని సోమవారం అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ చౌడేశ్వరి తెలిపారు. ఆమె సోమవారం స్థానిక వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లోని సీఐ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. నీరుగట్టువారిపల్లెకు చెందిన ఓ చేనేత కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదుపై జరిపిన పోలీసుల విచారణలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. ఒడిశా కేంద్రంగా రిజిస్టర్ అయిన కపిల్ ఆన్లైన్ మట్కా వెబ్సైట్లో బ్యాంకు అకౌంటు అనుసంధానంతో యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లతో మట్కా ఆడుతున్నట్లు తెలిసిందన్నారు. దీనిపై విచారణ చేపట్టామన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 21 నుంచి నిందితుల ఫోన్ కాల్స్, ఆన్లైన్ వ్యవహారాలపై నిఘా పెట్టామన్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని 14 రాష్ట్రాల్లో ఈ మట్కా ఆడుతున్నట్టు గుర్తిమన్నారు. మదనపల్లె పట్టణంలో 86 మంది ఈ ఆట ఆడుతున్నట్లు తేలిందన్నారు. రూ.1 నుంచి ఎంత అయినా డబ్బు కట్టి మట్కా ఆడితే రూపాయకు 90 రూపాయలు ఇస్తామని నమ్మిస్తూ మోసం చేస్తున్నారని వివరించారు. కొందరు స్మార్ట్ఫోన్లలో ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, కూలీల వద్ద డబ్బులు కట్టిస్తూ, లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో 47 మందిపై సెక్షన్ 420, ఏపి గేమింగ్ యాక్ట్ సెక్షన్ 9(1)కింద కేసు నమోదుచేసి అరెస్టు చేశామన్నారు. మట్కా ఆడే విధానం గూగుల్లోకి వెళ్లి కపిల్ సత్తా మట్కా అని కొట్టగానే వెబ్సైట్ వివరాలతో కూడిన సైట్లు, గేమ్ ఆడే విధానంపై యూట్యూబ్‌కు సంబంధించిన వీడియో కనిపిస్తా యి. వీటిలో మొదట ఉన్న సత్తా మట్కానెట్.కపిల్.మట్కా.ఇన్.మొబి.కామ్‌పై ఎంటర్ చేయగానే కపిల్ మట్కా పేరుతో ఆటకు సంబంధించిన వివరాలు, వివిధ రకాల ఆటలు, వాటి టైమింగ్స్‌కు సంబం ధించిన వివరాలు స్క్రీన్‌పై ప్రతక్ష్యమవుతాయి. అందులో ఇచ్చిన వివరాల ప్రకా రం మన వివరాలు నమోదుచేసి, లాగిన్ అయ్యాక అందులో మనకు ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబరుకు ఫోన్ చేసి మనం ఏ ఆట ఆడాలనుకుంటున్నామో తెలిపితే వారు దానికి సంబం«ధించి రూ.1,000లను తమ అకౌంట్ నంబరుకు వేయమంటారు. మనం అందులో డబ్బులు చెల్లించి ఆ రశీదును వాట్సప్ ద్వారా వారికి పంపితే నిర్వాహకులు మనకు పాయింట్లు కేటాయిస్తారు. వాటిని ఆధారంగా చేసుకుని సింగిల్ నంబర్, డబుల్ నంబర్ గేమ్‌లలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మనం కట్టిన నెంబర్‌కు మట్కా తగిలితే మన అకౌంట్‌కు దానికి సంబంధించిన మొత్తానికి పాయింట్లు యాడ్ అవుతాయి. లేకుంటే మన పాయింట్లు తగ్గుతూ వస్తాయి. మనం గెలిచిన పాయింట్లకు సంబంధించిన డబ్బులు మనం రిజిస్టర్ చేసిన బ్యాంకు ఖాతాకు జమ అవుతాయి. ఇంటి దొంగలను వదిలే ప్రసక్తిలేదు మట్కా వ్యవహారంలో కొంతమంది పో లీసులు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లు తెలిసిందని డీఎస్పీ తెలి పారు. ఈ కేసు విషయంలో ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తి లేదని చెప్పారు. విచారణలో పోలీసుల పాత్ర ఉందని తెలిసినా, ఎవరైనా సమాచారం అందించినా చర్యలు తీసుకుంటామన్నారు. గేమింగ్ యాక్ట్ సెక్షన్ 9(1)కింద కేసులు నమోదైతే ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాల ఎంపికకు అనర్హులు అవుతారని చెప్పారు. మట్కా, ఆన్లైన్ పేకాట, ఇతర జూదాలు ఆడే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. -
గంజాయి పట్టివేత
ఎమ్మిగనూరు రూరల్ : పట్టణ సమీపంలో తుంగభద్ర దిగువ కాల్వ వద్ద మంగళవారం సాయంత్రం 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. నందవరం మండల హలహర్వికి చెందిన మట్కాబీటర్ ఉప్పరి రామాంజనేయులు, పట్టణానికి చెందిన చాకలి గోపాల్ కొన్ని రోజులుగా ఆదోని నుంచి గంజాయి తీసుకువచ్చి ఎమ్మిగనూరు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు తెలిపారు. అందులో బాగంగానే మంగళవారం ఆదోని నుంచి గంజాయిని తీసుకువస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు చేశారున్నారు. చాకలి గోపాల్ పారిపోవడంతో ఉప్పరి రామాంజనేయులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అతని వద్ద నుంచి 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. తహశీల్దార్ వెంకటేశ్వర్లు సమక్షంలో గంజాయికి పంచనామా నిర్వహించామన్నారు. -
మట్కాపై ఉక్కుపాదం
- విధి నిర్వహణలో అలసత్వాన్ని సహించం - సెట్ కాన్ఫరెన్స్‌లో ఎస్పీ గోపీనాథ్ జట్టి కర్నూలు: మట్కాపై ఉక్కుపాదం మోపాలని పోలీస్ అధికారులను ఎస్పీ గోపీనాథ్‌జట్టి ఆదేశించారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు జిల్లాలోని అన్ని స్టేషన్ల పోలీసు అధికారులు, సబ్ డివిజన్ పోలీసు ఆఫీసర్లతో ఎస్పీ..సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మట్కాతో పాటు పేకాట, వ్యభిచారం వంటి అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా బేసిక్ పోలీసింగ్‌పై క్షేత్రస్థాయి అధికారులు దృష్టి కేంద్రీకరించాలన్నారు. విధి నిర్వహణలో సాంకేతిక వినియోగాన్ని పెంపొందించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. రౌడీషీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. సమస్యాత్మక వ్యక్తులపై కఠినంగా వ్యవహరించాలని, అవసరమైతే బైండోవర్ కేసులు నమోదు చేయాలన్నారు. ఫ్యాక్షన్ నిర్మూలనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విధినిర్వహణలో అలసత్వాన్ని సహించబోమని హెచ్చరించారు. నగర సీఐలతో డీఎస్పీ సమీక్ష... సెట్ కాన్ఫరెన్స్‌లో ఎస్పీ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పని చేయాలని డీఎస్పీ రమణమూర్తి నగర సీఐలకు సూచించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4.30 గంటల వరకు నగర పరిధిలోని సీఐలతో నేరాలపై సమీక్షించారు. సీఐలు కృష్ణయ్య, డేగల ప్రభాకర్, మహేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసరావు, నాగరాజు యాదవ్, నాగరాజురావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఎస్పీ ఆదేశాలకు అనుగుణంగా నగర పరిధిలోని పోలీసు అధికారులు విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. -
సంక్షేమానికి జేసీ వ్యతిరేకం
కమీషన్ల కోసం కక్కుర్తి మట్కా, పేకాటను ప్రోత్సహిస్తున్నారు జేసీ బ్రదర్స్‌కు కాలం చెల్లింది.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం తాడిపత్రి ప్లీనరీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత ‘రైతులకు ఉచిత విద్యుత్ వద్దంటారు. రూపాయికి కిలోబియ్యం దండగ అంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే రైతులు, పేదల సంక్షేమానికి జేసీ దివాకర్‌రెడ్డి వ్యతిరేకం’ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ తాడిపత్రి నియోజకవర్గ ప్లీనరీ సోమవారం స్థానిక ఎస్బీఎం ఫంక్షన్‌హాలులో సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా అనంత మాట్లాడారు. ‘‘హంద్రీ–నీవా ద్వారా 2012లో నీళ్లు తీసుకొచ్చాం. పాదయాత్ర చేస్తుంటే నీళ్లు ఎలా వస్తాయన్నావ్! హంద్రీ–నీవా కంటే మూణ్నెల్ల ముందు రూ.560 కోట్లతో యాడికి కాలువకు శంకుస్థాపన చేయించావ్. పీఏబీఆర్ ద్వారా 10 టీఎంసీల జలాలు కేటాయించాం. 13 ఏళ్లయ్యింది. ఇప్పటి వరకూ ఎందుకు ఆ ఫలితాన్ని ప్రజలకు ఇవ్వలేదు. పెండేకల్లుకు చెన్నారెడ్డితో శంకుస్థాపన చేయించావు. అందులోనూ కమీషన్లకు కక్కుర్తిపడ్డావు. శ్రీరామరెడ్డి పథకం ద్వారా మేం నీళ్లిస్తే...జేసీ నాగిరెడ్డి పథకం ద్వారా ఇప్పటికీ మీరు నీళ్లు ఇవ్వలేదు. ఇప్పుడు తిరిగి అవుకు నుంచి తీసుకొస్తా అంటున్నావు. కొత్త పనులు మంజూరు చేయించుకుని కమీషన్లు దండుకోవడం తప్ప ప్రజలకు మేలు చేద్దామనే ధ్యాస లేదు. 2012లో హంద్రీ– నీవా నీళ్లు తీసుకొస్తే ఇప్పుడు పులివెందుల, ముచ్చుమర్రి మీటింగ్‌కు వెళ్లి చంద్రబాబును పొగుడుతున్నారు. తాడిపత్రిని మట్కా, పేకాటలాంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుస్తున్నావ్. జూదం ఆడేవారిని నీ చుట్టూ కోటరీలా పెట్టుకున్నావ్. కర్నూలు, కడప జిల్లాల నుంచి జూదం కోసం తాడిపత్రికి వస్తున్నారు. ఇందులో కమీషన్లు నీ ఇంటికి వస్తున్నాయ్. 1989కి ముందు నీ పరిస్థితేంటి? ఇప్పుడేంటి? తాడిపత్రికి ఏం చేశావో చెప్పు. యాడికి కెనాల్ భూసేకరణ సమస్య ఉందంటున్నావ్. 12శాతం తక్కువకు కోట్ చేసిన నేషనల్ హైవే టెండర్లనే రద్దు చేసిన ఘనుడివి. ఇది నీకు పెద్ద సమస్యనా? తాడిపత్రిలో వాక్ స్వాతంత్య్రం లేదు. మాకు అవకాశం ఇవ్వండి. ఇక్కడి ప్రజలకు వాక్ స్వాతంత్ర్యం తెస్తాం. జేసీ బ్రదర్స్ వ్యవహారంపై ప్రజల్లో చైతన్యం వచ్చింది. వీరికి కాలం చెల్లించింది’ అని అన్నారు. రాష్ట్ర కార్యదర్శి రమేష్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకే ప్లీనరీ ఏర్పాటు చేశామన్నారు. నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎం మోహన్‌రెడ్డి, తాడిపత్రి, పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, యాడికి కన్వీనర్లు నాగేశ్వరెడ్డి, రఘునాథరెడ్డి, శరభారెడ్డి, బొంబాయి రమేష్ నాయుడు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి, యాడికి, పెద్దవడుగూరు జెడ్పీటీసీ సభ్యులు వెంకట్రామిరెడ్డి, చిదంబరరెడ్డి, రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు సూర్యనారాయణ, మైనారిటీ నాయకులు మున్నా, జబ్బార్, నియోజకవర్గ యూత్ అ«ధ్యక్షుడు బాణా నాగేశ్వరరెడ్డి, నాయకులు రవీంద్రారెడ్డి, మధురాజు, పాశం రంగస్వామి యాదవ్ ప్రసగించారు. పార్టీ స్టీరింగ్ కమిటీ జిల్లా సభ్యులు వేమనాథరెడ్డి, నాగిరెడ్డి, బాలరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి వీఆర్ వెంకటేశ్వరరెడ్డి, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీనియర్ నాయకుడు ఆలూరి రామచంద్రారెడ్డి, ఎంఏ రంగారెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు సుంకిరెడ్డి, పట్టణ కన్వీనర్ కంచెం రామ్మోహన్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి జేసీ సోదరుల అరాచకాలతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. మాట వినని వారిని మట్టుబెట్టేందుకు కూడా వెనుకాడటం లేదు. వారు తిన్నింటి వాసాలు లెక్కపెట్టే రకం. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని విధాలా లబ్ధి పొందిన జేసీ సోదరులు.. ఇప్పుడు వైఎస్ విజయమ్మను దూషిస్తున్నారు. తాడిపత్రి పట్టణాభివృద్ధి పేరిట గ్రానైట్ యాజమాన్యాల నుంచి బలవంతంగా కప్పం డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడి పరిశ్రమల వల్ల జేసీ సోదరులు మాత్రమే అభివృద్ధి చెందారు. నియోజకవర్గ ప్రజలకు, వైఎస్సార్సీపీ శ్రేణులకు అన్యాయం జరిగితే సహించేదిలేదు. వారికి అండగా ఉంటాం. జేసీ కుటుంబం అరాచకాల వల్ల నష్టపోయిన వారిలో నేనూ ఉన్నా. వారికి అడ్డుకట్ట వేయాలంటే నియోజకర్గంలోని నాయకులు, కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలి. - కేతిరెడ్డి పెద్దారెడ్డి, వైఎస్సార్సీపీ సమన్వయకర్త, తాడిపత్రి రైతులను పట్టించుకోని బాబు ముఖ్యమంత్రి చంద్రబాబు జేబు నింపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయనకు రైతుల సమస్యలు పట్టడం లేదు. అధికార పార్టీ నేతలు ధనార్జనే ధ్యేయంగా రెచ్చిపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేపట్టి.. అడ్డదారిలో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించాలని చూస్తున్నారు. ఇటువంటి వాటికి భయపడే ప్రసక్తే లేదు. - శంకర్‌నారాయణ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కుటిల రాజకీయాలు తిప్పికొట్టండి శ్రీకృష్ణదేవరాయలు మాదిరిగా వైఎస్ రాజశేఖరరెడ్డి జనరంజక పాలన సాగించారు. చంద్రబాబు పాలన మాత్రం ప్రజాధనం దండుకోవడమే ధ్యేయంగా సాగుతోంది. ఈ ప్రభుత్వంలో నిరుపేదలకు సొంతిల్లు కలగానే మిగిలిపోతోంది. ఎన్నికల్లో గెలిచేందుకు జేసీ సోదరులు ఎంతకైనా దిగజారుతారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి వారి కుటిల రాజకీయాలను తిప్పి కొట్టాలి. వై.శివరామిరెడ్డి, ప్లీనరీ పరిశీలకులు, మాజీ ఎమ్మెల్సీ -
టెక్నాలజీనా.. మజాకా!
- వాట్పాప్‌లో కీలాడీల మట్కా నిర్వహణ - టెక్నాలజీ సాయంతో ఛేధించిన పోలీసులు - ఆరుగురి అరెస్టు.. భారీగా నగదు స్వాదీనం తాడిపత్రిరూరల్: కొత్త పుంతులు తొక్కుతున్న టెక్నాలజీని కొంతమంది కీలాడీలు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. మామూలుగా వాట్సాప్‌లో ఫోటోస్, వీడియోలు షేర్ చేసుకుంటారు. కానీ కొంతమంది ఒక అడుగు ముందుకేసి వాట్సాప్ మెసెజ్‌లతో మట్కా నిర్వహించారు. రూరల్ పోలీసులు టెక్నాలజీతో ఛేధించి నిర్వాహకునితో పాటు ఆరు మందిని అరెస్టు చేసి రూ.3,00,200లు నగదు, మూడు సెల్ ఫోన్లను స్వాదీనం చేసుకున్నాట్లు తాడిపత్రి డిఎస్పీ చిదానందరెడ్డి శుక్రవారం వెల్లడించారు. పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత నెల రోజులుగా మా సిబ్బంది నిర్వాహకులు ఆశోక్‌రెడ్డి పై నిఘా ఉంచి సెల్ఫోన్లలో వాట్సాప్ మెసెజ్‌లతో మట్కా నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఆశోక్‌రెడ్డి వైడికె అనే వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేసుకుని మట్కా పట్టీలను మెసెజ్ద్వారా పోందుతూ నిర్వహిస్తున్నారు. సి.ఐ., ఎస్.ఐ.లు టెక్నాలజీని వినియోగించి వాట్సాప్ మెసెజ్‌లతో మట్కాను నిర్వహిస్తున్నట్లు గుర్తించి నిర్వాహకులు ఆశోక్‌రెడ్డి ఇంటి వద్ద దాడులు చేశారు. మట్కా నిర్వాహకుడుతో పాటు శివసంజీవరాయుడు యాడికి మండలానికి చెందిన అనంతయ్య, శివ, చింతప్రకాష్, సుధాకర్, రామాంజనేయులను పట్టుకుని నగదు, సెల్ఫోన్లను స్వాదీనం చేసుకున్నరని తెలిపారు. టెక్నాలజీని ఉపయోగించి మట్కా నిర్వాహకులను అరెస్టు చేయడంపై సి.ఐ., ఎస్.ఐ., సిబ్బంది రాజా, కిశోర్‌లను డిఎస్పీ అభినందించారు. ఆయన అక్రమ ఇసుక రవాణాపై గట్టి నిఘా ఉంచామని అక్రమంగా ఇసుకను తరలిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జూదం, మట్కాల నిర్మూలనకు చర్యలు తీసుకుంటామని డీఎస్పీ అన్నారు. -
మట్కారాయుళ్ల అరెస్ట్
ఆదోని టౌన్: ఆదోని పట్టణంలో మట్కా నిర్వహిస్తున్న ఇద్దరు బీటర్లు, మట్కా ఆడుతున్న 19 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. చందసా దర్గా సమీపంలో పింజరిగేరికి చెందిన అబ్దుల్ గని, తిరుమల నగర్‌కు చెందిన భూషయ్య మట్కా బీట్ రాస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు త్రీ టౌన్ సీఐ చంద్రశేఖర్, ఎస్ఐలు విజయ్‌కుమార్, రమేశ్‌బాబు, సిబ్బంది రవి, ఎలిసా మరికొంత మంది కానిస్టేబుళ్లు బుధవారం దాడి చేసి వివిధ ప్రాంతాలకు చెందిన 19 మట్కా రాయుళ్లు, ఇద్దరు బీటర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 14 సెల్ఫోన్లు, రూ.8,040, మట్కా చీటీలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. కుటుంబ సభ్యుల మధ్య మట్కా రాయుళ్లకు కౌన్సెలింగ్ మట్కా రాయుళ్లకు వారి కుటుంబ సభ్యుల మధ్య డీఎస్పీ కొల్లి శ్రీనివాసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. మట్కాతో ఎంత సంపాదిస్తున్నారని వారి నుంచి వివరాలు తెలుసుకున్నారు. అయితే రోజూ వంద, రెండొందలు నష్టపోతున్నామని మట్కా రాయుళ్ల సమాధానమిచ్చారు. మట్కా ఉచ్చులో పడి కుటుంబీకులను నిర్లక్ష్యం చేస్తున్నారని, కుటుంబాలను నాశనం చేసుకోవద్దని డీఎస్పీ హితవు పలికారు. మట్కా వ్యసనానికి దూరంగా ఉండాలని రోజూ నెత్తీనోరూ కొట్టుకొని చెప్పినా వినిపించుకోవడం లేదని మహిళలు తమ భర్తలపై డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇక మీదట మట్కా ఆడము, రాయమని కుటుంబ సభ్యుల సమక్షంలోనే ప్రతిజ్ఞ చేశారు. మళ్లీ మట్కా ఆడినా, రాసినా.. ఉపేక్షించేది లేదని, అవసరమైతే పీడీ యాక్ట్‌ను అమలు చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు. -
ఐదుగురు పేకాటరాయుళ్ల అరెస్టు
లేపాక్షి : మండల కేంద్రంలోని కంచిసముద్రం రోడ్డు పక్కన మట్కా ఆడుతున్న ఐదుగురు మట్కారాయుళ్లను శనివారం సాయంత్రం అరెస్ట్ చేసినట్టు ఎస్ఐ శ్రీధర్ తెలిపారు. మట్కా ఆడుతున్నట్టు పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అయితే ఐదుగురు మట్కారాయుళ్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.2,040 స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. కేసు నమోదు చేసుకుని వారిని సోమవారం హిందూపురం కోర్టులో హాజరు పరచనున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
మట్కారాయుళ్లపై రౌడీషీట్ తెరుస్తాం
- డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు హెచ్చరిక - ఇద్దరు నిర్వాహకులతోపాటు 13 మంది అరెస్ట్ - రూ.30 వేల నగదు, చీటీలు స్వాధీనం ఆదోని టౌన్: మట్కారాయుళ్లు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు అన్నారు. మితిమీరితే రౌడీషీట్ తెరుస్తామని హెచ్చరించారు. ఈ నెల 5వ తేదీన ‘సాక్షి’ దినపత్రికలో 3 క్లోజులు, 6 ఓపన్లు అన్న శీర్షికన ప్రచురితమైన వార్తకు స్పందించిన డీఎస్పీ దాడులకు ఆదేశించారు. టూటౌన్ సీఐ గంటా సుబ్బారావు, ఎస్ఐలు రంగ,రమేష్ బాబు మంగళవారం సిబ్బందితో దాడి చేసి 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వెల్లడించారు. మట్కారిగేరికి చెందిన షబీర్ బాషా, కృష్ణ నిర్వహిస్తుండగా వివిధ గ్రామాలకు చెందిన 13 మంది మట్కా రాస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.30,610 నగదు, మట్కా చీటీలను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పర్చారు. మట్కా నిర్వాహకులను అరెస్ట్ చేసిన పోలీసులకు డీఎస్పీ చేతుల మీదుగా నగదు రివార్డులను అందజేశారు. సమావేశంలో సీఐలు గంటా సుబ్బారావు, రామానాయుడు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
డాన్ 'ఆట' క్లోజ్
– పేకాటలో పట్టుబడిన మట్కా డాన్ అసదుల్లా – ఆయనతోపాటు మరో 12 మందిని అరెస్టు చేసిన పోలీసులు – 2.30 లక్షల రూపాయలతోపాటు 13 సెల్ఫోన్ల స్వాధీనం కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): కర్నూలు నగరంలో మట్కాను నిర్వహిస్తూ పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న మట్కా డాన్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. శుక్రవారం నగరంలో పేకాట ఆడుతున్న 13 మందిని అరెస్టు చేశారు. వారిలో మట్కా డాన్ అసదుల్లాతో పాటు పేకాట డాన్ సయ్యద్ అహ్మద్ కూడా ఉన్నట్లు త్రీటౌన్ సీఐ మధుసూదన్‌రావు, రూరల్ సీఐ నాగరాజు యాదవ్, వన్‌టౌన్ సీఐ కృష్ణయ్య తెలిపారు. వీరి నుంచి 2.30 లక్షల రూపాయలతోపాటు 13 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. శుక్రవారం సాయంత్రం త్రీటౌన్ పోలీసు స్టేషన్లో సీఐలు నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ముందస్తు సమాచారం మేరకు బుధవారపేటలోని మాంటిస్సోరి స్కూల్ పక్కన ఉన్న గోడౌన్‌పై దాడి చేసి పట్టున్నట్లు వివరించారు. అరెస్ట్ అయిన వారిలో కడక్పురాకు చెందిన షేక్ బాబు, చిత్తారివీధికి చెందిన సయ్యద్ అహ్మద్, షేక్ అక్బర్ బాఫా, బేకారికట్టకు చెందిన షఫీక్ అహ్మద్, బుధవారపేటకు చెందిన మట్కా డాన్ అసదుల్లా, జానీ, శాంతినగర్‌కు చెందిన గొల్ల లక్ష్మీనారాయణ, నందవరానికి చెందిన గోపిరెడ్డి పెద్దిరెడ్డి, బుధవారపేటకు చెందిన కటికె లతీఫ్, రోజావీధికి చెందిన మెడ్డీ అజంతుల్లా, కృష్ణానగర్‌కు చెందిన చింతా సిరా, సీక్యాంపునకు చెందిన షేక్ నజీర్, రాయచూరుకు చెందిన లవ్‌కుమార్ ఉన్నారు. డాన్ల చాప్టర్ క్లోజ్.. నగరంలో పేకాట, మట్కాలను విచ్చలవిడిగా నిర్వహిస్తూ పోలీసులకు దొరకకుండా అధికార పార్టీ నేతల అండతో సయ్యద్ అహ్మద్, అసదుల్లా తప్పించుకు తిరుగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీరిద్దరూ మట్కా, పేకాట డాన్లుగా చలామణి అవుతున్నారు. గతంలో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి ఒకరికొకరు డాన్ నేను అంటే నేను అని సవాల్ విసుకున్నట్లు సమాచారం ఉంది. దీనిపై ‘డాన్ నువ్వా నేనా’ అన్న శీర్షికన నవంబర్ 11వ తేదీన ‘సాక్షి’లో కథనం కూడా ప్రచురితం అయింది. అయితే వీరిద్దరూ కలసి శుక్రవారం పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడడంతో వారి డాన్ కార్యకలాపాలకు పుల్‌స్టాప్ పడినట్లేనని భావించవచ్చు. పోలీసులు వారికి శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
మీరు పాతనోట్లివ్వండి...
= జిల్లాలో జోరుగా నంబర్‌గేమ్ = పాతనోట్లతో ఆకర్షిస్తున్న మట్కా బీటర్లు = నంబర్ తగిలితే కొత్తనోట్లు ఇస్తామని వల = అనంతపురం రెండు రోజుల్లో రూ.కోటికి పైగా లావాదేవీలు = అన్నీతెలిసీ కళ్లుమూసుకున్న పోలీసులు మీరు పాతనోట్లివ్వండి...మేము కొత్తనోట్లిస్తా మంటున్నారు మట్కానిర్వాహకులు...దీంతో జనం నంబర్‌గేమ్ ఆడేందుకు ఎగబడుతున్నారు. 9.15 గంటలకోసారి...11.15 గంటలకోసారి తమ అదృష్టాన్ని తెలుసుకుంటున్నారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో మట్కా ఆడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. అందువల్లే రెండు రోజుల్లోనే కేవలం అనంతపురం నగర పరిధిలోనే కోట్లలో మట్కా లావాదేవీలు నడిచినట్లు తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం పెట్రోలు బంకులు, ఆస్పత్రులు, రైల్వేస్టేషన్లతో సహా ఎక్కడా పాతనోట్లు చెల్లుబాటు కాదని ఆర్బీఐ తేల్చేసింది. పాతనోట్లు ఉన్నవారు బ్యాంకుల్లో జమ చేయడం మినహా మరోదారి లేదని వెల్లడించింది. కానీ జిల్లాలోని మట్కా నిర్వాహకులు మాత్రం పాతనోట్లు స్వీకరిస్తున్నారు. మట్కా నంబర్ తగిలితే కొత్తనోట్లు ఇస్తామని చెబుతున్నారు. దీంతో గతంలో ఎప్పుడూ లేనివిధంగా మట్కావ్యాపారం జోరుగా నడుస్తోంది. గురు, శుక్ర రెండురోజుల్లో అనంతపురం నగర పరిధిలోనే రూ.కోటికిపైగా మట్కా లావాదేవీలు నడిచాయంటే.. జిల్లా వ్యాప్తంగా మట్కా ఏ స్థాయిలో నడుస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఇదీ మట్కా నడుస్తోన్న తీరు అనంతపురం, తాడిపత్రి, కదిరి, గుంతకల్లు, ధర్మవరం, హిందూపురంలో భారీగా మట్కా నడుస్తోంది. గతంలో రతన్‌లాల్ మట్కా వారానికి ఐదురోజులు జరిగేది. ఇప్పుడు కళ్యాణ్, సత్తా మట్కాలు ఆరు రోజులు జరుగుతున్నారుు. ఈ మాట్కాకు నంబర్లు గుజరాత్, ముంబయి నుంచి వస్తాయి. ఇవి కాకుండా ‘అనంత’లోని కొందరు ప్రైవేటు వ్యక్తులు కూడా మట్కా నిర్వహిస్తున్నారు. ఈ మట్కా ఆదివారం కూడా నడుస్తోంది. కళ్యాణ్, సత్తా మట్కాలు సాయంత్రం 5 గంటల వరకు చీటీలకు డబ్బులు తీసుకుంటారు. రాత్రి 9.15కు ‘ఓపెన్’, రాత్రి 11.15కు ‘క్లోజ్’ నంబరు ప్రకటిస్తారు. ఆ వెంటనే బ్రాకెట్ నంబరు రిలీజ్ చేస్తారు. దీంతోనే మట్కా రాయుళ్లు చాలామంది మట్కా నంబర్ రాసిన తర్వాత నంబర్ వెల్లడయ్యే వరకు టెన్షన్ తట్టుకోలేక ఫస్ట్‌షో, సెకండ్‌షో సినిమాలకు వెళుతుంటారు. అనంతపురం వన్‌టౌన్ పరిధిలో మట్కాబీటర్లు అధికం. ఇక్కడ ఎవరు మట్కా నిర్వహిస్తారు? మట్కా బీటర్లు ఎవరనే సంగతి ఇక్కడి పోలీసులకు క్షుణ్ణంగా తెలుసు. అయినా మట్కా నిర్వహణకు బ్రేక్ వేయలేకపోతున్నారు. దీనికి కారణం మట్కాబీటర్లకు ఇక్కడి కొంతమంది పోలీసులతో ఉన్న సత్ససంబంధాలే అని తెలుస్తోంది. దీంతోపాటు టూటౌన్, త్రీటౌన్, ఫోర్త్‌టౌన్ పరిధిలో కూడా మట్కా నడుస్తోంది. ఇక్కడా అదే పరిస్థితి. తాడిపత్రి, కదిరి, హిందూపురం, గుంతకల్లు, ధర్మవరంలో కూడా జోరుగా సాగుతోంది. ఈ ఊబిలో కూరుకపోరుున వేలాది కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నారుు. మట్కా రాసే వారిలో కాలేజీ విద్యార్థులు కూడా ఉన్నారు. పాతనోట్లతో మట్కా కొత్తపుంతలు పాతనోట్ల స్వీకరణతో మట్కా కొత్తరూపు సంతరించుకుంటోంది. ఇప్పటి వరకూ మట్కాపై రూ.వంద రాసే వ్యక్తి పాతనోట్లతో రూ.500, వెయి రాస్తున్నాడు. ఇలా రాసే మొత్తం పెరగడంతో బీటర్ల ఆదాయం భారీగా పెరిగింది. భారీవ్యాపారాలు చేస్తూ మట్కాకు బానిసలై కొన్నేళ్లుగా చీటీలు రాస్తున్నవారివద్ద భారీగా పాతనోట్లు ఉన్నాయి. వీటిని బ్యాంకులో డిపాజిట్ చేసినా ఐటీ లెక్కల ప్రకారం భారీగా ట్యాక్స్ చెల్లించాల్సి ఉంది. దీంతో ఒక్కొక్కరు 5 నంబర్లపై భారీగా వెచ్చిస్తున్నారు. వీరిని చూసుకుని ఇప్పటి వరకూ మట్కా అలవాటు లేని వ్యక్తులు కూడా పాతనోట్లతో ఆట మొదలు పెడుతున్నారు. జిల్లావ్యాప్తంగా నడుస్తున్న మట్కా వ్యాపారంలో బీటర్లు కొన్ని నంబర్లకు మాత్రమే కంపెనీలకు డబ్బు చెల్లించి తక్కిన మొత్తాన్ని వీరే స్వాహా చేస్తున్నారు. ఈ డబ్బును బెంగళూరు, బళ్లారిలో మట్కా సాగిస్తోన్న వారికి సరఫరా చేసి డబ్బులు మార్చే పనిలో ఉన్నారు. పేకాటకూ పాత నోట్లే.. మట్కాతో పాటు పేకాట కూడా జిల్లాలో జోరుగా నడుస్తోంది. పేకాటరాయుళ్లు కూడా పాతనోట్లతో ’గేమ్’ ఆడుతున్నారు. జిల్లాలో ఓ క్లబ్‌తో పాటు ఏపీబీఆర్, ఎంపీఆర్ డ్యాంల వద్ద భారీగా పేకాట ఆడుతున్నారు. కొందరు బళ్లారితో పాటు కర్ణాటక సరిహద్దు దాటి అక్కడ పేకాట ఆడుతున్నారు. ఎస్పీ దృష్టి సారిస్తే పాతనోట్లతో మట్కాసాగిస్తోన్న వ్యవహారం నగరంలోని ఓ సీఐ దృష్టికి వచ్చింది. అయితే బీటర్లను పిలిపించి, వారితో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎస్పీ మట్కా నిర్వాహకులపై దాడులు చేస్తే భారీస్థారుులో పాతనోట్లు లభించే అవకాశం ఉంది. -
ఖాకీల్లో వణుకు పుట్టిస్తున్న మట్కా
ప్రొద్దుటూరు క్రైం: మట్కా, క్రికెట్ బెట్టింగ్, పేకాట జరుగుతుందంటే.. అది కొందరు పోలీసుల చలవతోనే అని చెప్పవచ్చు. కొందరు పోలీసు అధికారుల చల్లని చూపు ఉండటం వల్లనే అసాంఘిక కార్యకలాపాలు నిరాటంకంగా సాగుతున్నాయి. పోలీసు అధికారులు తల్చుకుంటే ఒక్కరు కూడా మట్కా రాయడానికి సాహసించరు. జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ లాంటి అధికారులు వీటిని ఎంతగా అణచివేయడానికి ప్రయత్నించినప్పటికీ కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది ఆశీస్సులతో అసాంఘిక కార్యకలాపాలకు బ్రేకు పడటం లేదు. మట్కా మామూళ్ల వ్యవహారం పోలీసు శాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. మట్కా డాన్ నాగేశ్వరరావు నుంచి డబ్బు తీసుకున్నారనే కారణంతో త్రీ టౌన్ ఎస్ఐ మహేష్, ఏఎస్ఐ మునిచంద్రను డీఐజీ రమణకుమార్ ఇటీవల సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇద్దరు అధికారులపై వేటుతో ఈ వ్యవహారం సద్దుమణిగిందనుకుంటే పొరపాటే అవుతుంది. మరి కొంత మందిపై వేటు పడే అవకాశం ఉందని పోలీసు శాఖలో జోరుగా చర్చ జరుగుతోంది. పెంచిన మొక్కే కాటేసింది.. మట్కా డాన్ నాగేశ్వరరావు చాలా ఏళ్ల నుంచి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయనగరం వీధిలో నివాసం ఉంటున్నాడు. అతను 45 ఏళ్లుగా మట్కా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పెద్ద కంపెనీ ఏర్పాటు చేసి మట్కా నిర్వహిస్తున్నప్పటికీ నాగేశ్వరరావు ఎప్పుడూ పోలీసుల రికార్డుల్లోకి ఎక్కలేదు. అతని అనుచరులు దొరికిన ప్రతి సారి మట్కా డాన్‌పై కేసు నమోదు చేయకుండా ఉండేందుకై పోలీసులు రూ.లక్షల్లో వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇలా అతను పోలీసులపై రూ.లక్షలు వెదజల్లుతూ తన మట్కా సామ్రాజ్యాన్ని ప్రొద్దుటూరు నుంచి రాయలసీమ వ్యాప్తంగా విస్తరింప చేసుకున్నాడు. ఇలా కొందరు పోలీసులే అతన్ని చిన్న మొక్క నుంచి మహా వృక్షంలా మారడానికి కారకులయ్యారు. అయితే చివరకు పెంచిన మొక్కే పోలీసులను కాటేసింది. దర్యాప్తులో భాగంగా పోలీసుల అదుపులో ఉన్న నాగేశ్వరరావు మామూళ్ల చిట్టా విప్పడం వల్లనే ఎస్ఐ, ఏఎస్ఐలపై వేటు పడింది. ఆదిలోనే అతనిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసి ఉంటే మట్కా డాన్‌గా మారేవాడు కాదని, అతని నేర సామ్రాజ్యం పొరుగు జిల్లాలకు విస్తరించేది కాదని పోలీసు వర్గాల అభిప్రాయం. -
మట్కా, గ్యాంబ్లింగ్‌పై ప్రత్యేక దృష్టి
- ఎస్పీ రామకృష్ణ అట్లూరుః జిల్లాలో మట్కా, గ్యాంబ్లింగ్ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం అట్లూరు పోలీస్‌స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ముందుగా స్టేషన్‌లోని పరిసరాలను పరిశీలించి సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది కూడా క్వాటర్సు లేక రాత్రివేళ బస్సులు రాకపోకలు లేక ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 4 వేల కేసులు పెండింగులో ఉండగా 3750 కేసులు పరిష్కరించామన్నారు. సివిల్‌తో పాటు కోర్టులో ఉన్న కేసులు మాత్రమే పెండింగులో ఉన్నాయన్నారు. ఎర్ర చందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. అట్లూరు మండలంలో వలసపాలెం గ్రామంలో 2013లో చంద్రగిరి నరసింహులును నరబలి ఇచ్చి చంపారని ఆకేసుకు సంబందింధించి, నల్లగొండుగారిపల్లికి చెందిన ఆటో డ్రైవర్ రామకృష్ణను హత్యచేసిన కేసుల్లో ఎటువంటి పురోగతి లేదని విలేకరులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఎస్పీ స్పందిస్తూ ఇంతవరకు నరబలి కేసు తన దృష్టికి రాలేదని ఈ కేసుపై సమగ్ర విచారణ చేసి ముద్దాయిలను పట్టుకుంటామన్నారు. -
మట్కా క్లోజ్
పది రోజులు హాలిడే ప్రకటించిన కంపెనీలు – మట్కాపై నోట్ల రద్దు ప్రభావం - పాలుపోని బీటర్లు - ఆరా తీస్తున్న మట్కారాయుళ్లు కర్నూలు: పెద్ద నోట్ల రద్దు ప్రభావం బ్యాంకులు, ఏటీఎంలపైనే కాదు.. చివరకు మట్కాపైనా పడింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా పది రోజుల పాటు మట్కా బీటర్లు విశ్రాంతి తీసుకోవాల్సిందే. పెద్ద నోట్ల రద్దుతో మట్కాను పది రోజుల పాటు బంద్ చేస్తూ కంపెనీలు ప్రకటించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మట్కా బీటర్లు ఆటను నిలిపివేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ప్రతి రోజూ తెల్లారింది మొదలు సెల్ఫోన్లో రాత్రి పొద్దుపోయే దాకా ఓపెన్, క్లోజ్ నెంబర్లతో బిజీగా ఉండే బీటర్లు ఈ పది రోజుల పాటు తమ వ్యాపారాన్ని క్లోజ్ చేసుకోవడం గమనార్హం. మట్కా రాయుళ్లు ముందుగానే పెద్ద మొత్తంలో బ్యాంకుల్లో జమ చేసి ఏ రోజుకు ఆ రోజు ఫోన్ల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. బ్యాంకుల్లో డబ్బులు డ్రా చేసుకోవడానికి నిర్వాహకులకు ఇబ్బందులు తలెత్తడంతో కంపెనీ నిర్వాహకులే పది రోజులు సెలవు ప్రకటింపజేశారు. కొంతకాలంగా మారిన పంథా ఒకప్పుడు రహస్యంగా కాగితం చీటీలపై నెంబర్లతో సాగిన ఈ దందా సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో బహిరంగంగా సాగుతోంది. కేవలం చీటీలే కాకుండా కంప్యూటర్ ద్వారా ఆన్లైన్, సెల్ఫోన్లో మెసేజ్‌ల ద్వారా ఆడుతూ తమ అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు. కర్నూలు నగరంలోనే వంద మందికిపైగా మట్కా ఏజెంట్లు ఉన్నారు. పోలీసుల నిఘా కొరవడటంతో చాపకింద నీరులా ఈ జూదం జిల్లాలోని అన్ని పట్టణాలకు వ్యాపించింది. మట్కా ఆడుతూ పట్టుబడ్డ వారిపై పెద్దగా కేసులు నమోదు చేసేందుకు అవకాశం లేకపోవడంతో నిర్వాహకులు దీన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. సెల్‌ఫోన్ వినియోగం విస్తృతం కావడంతో మట్కా నిర్వాహకుల పని మరింత సులువైంది. చిన్న మెసేజ్ ద్వారా జూదాన్ని కొనసాగిస్తున్నారు. సెల్‌ఫోన్ ద్వారా ఆన్లైన్లో నెంబర్లను ముందుగానే నమోదు చేయించుకుంటారు. డబ్బులు సైతం ఆన్లైన్ ద్వారా చెల్లింపులు జరిగేవి. పెద్ద నోట్లు రద్దు కావడంతో మట్కా నిర్వహణపై కూడా దాని ప్రభావం పడింది. జిల్లా వ్యాప్తంగా రోజుకు కోటి రూపాయలకు పైగా వ్యాపారం జరిగేది. మట్కా జూదంలో లాభం వచ్చే వారి సంఖ్య పది శాతం ఉంటే, నష్టపోయే వారి సంఖ్య 90 శాతం ఉండటం గమనార్హం. రోజు కూలీ చేసుకునే వ్యక్తి దినమంతా కష్టపడి సంపాదించిన సొమ్మును ఈ జూదంలో పెట్టడంతో కుటుంబ పోషణభారమై జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. నోట్ల రద్దుతో మట్కా వ్యాపారానికి పది రోజులు హాలిడే ప్రకటించడంతో బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. -
మట్కా రాయుళ్లకు నేతల అండ!
- పోలీసుల చేతిలో నిర్వాహకుల జాబితా - కొందరిని కాపాడేందుకు అధికార పార్టీ నాయకుల ప్రయత్నాలు ప్రొద్దుటూరు క్రైం: మట్కారాయుళ్లకు అధికార పార్టీ నేతలు అండదండలు అందిస్తున్నారు. దీంతో వారు యథేచ్ఛగా తమ ఆట కొసాగిస్తున్నారు. వీరిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తుండగా... తప్పించేందుకు నేతలు యత్నిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా మట్కాతోపాటు ఇతర అసాంఘిక కార్యకలాపాలపై జిల్లా ఎస్పీ ఉక్కు పాదం మోపుతున్నారు. రెండు నెలలు గడువు ఇచ్చిన ఎస్పీ తర్వాత కూడా మార్పు రాకుంటే రంగంలోకి దిగుతానని హెచ్చరికలు జారీ చేశారు. చాలా చోట్ల పోలీసు అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకున్నారు. మట్కా రాయుళ్లపై కేసులు నమోదు చేసి జైళ్లకు పంపించారు. మట్కాపై పోలీసుల దాడులు ముమ్మరం కావడంతో చాలా ప్రాంతాల్లోన పేరు మోసిన బీటర్లు ఊళ్లు వదలి కూడా వెళ్లారు. కొందరైతే అజ్ఞాతంలోకి వెళ్లి తమ కార్యకలాపాలకు స్వస్తి చెప్పారు. కొంత కాలం పాటు విరామం ప్రకటిస్తే మేలనే భావనతో మరి కొందరు ఇతర పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ విధంగా సుమారు 50 శాతం దాకా మట్కా ఆగిపోయింది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొందరు ధైర్యంగా మట్కా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. బీటర్లను అదుపులోకి తీసుకోండి జిల్లాలో మట్కా, క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ పోలీసులకు తప్పించుకొని తిరుగుతున్న వారి జాబితాను జిల్లా పోలీసు అధికారులు స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఇప్పటికే తెప్పించుకున్నారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా జిల్లా నుంచి ఆయా పోలీస్స్టేషన్లకు మట్కా, క్రికెట్ బుకీల పేర్ల జాబితా వచ్చినట్లు తెలుస్తోంది. ప్రొద్దుటూరుకు పలువురి మట్కా రాయుళ్ల జాబితాను జిల్లా అధికారులు పంపినట్లు తెలిసింది. పట్టణంలోని పలు పోలీస్స్టేషన్ల పరిధిలో 23 మంది మట్కా నిర్వాహకులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరంతా ఇప్పటి వరకూ పోలీసు రికార్డుల్లో లేనివారే. వారిని అదుపులోకి తీసుకోవాల్సిందిగా జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. వీరిలో సుమారు 12 మంది వన్‌టౌన్ పరిధిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన రామేశ్వరం ప్రాంతానికి చెందిన వ్యక్తి పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం మట్కా కోసమే ఇటీవల పార్టీ మారిన పెన్నానగర్‌కు చెందిన మరో వ్యక్తి కూడా జాబితాలో ఉన్నారు. వీరితో పాటు ఆర్ట్స్ కాలేజీ రోడ్డు, మిట్టమడివీధిలో ఉన్న మరో నలుగురి కోసం పోలీసులు కొన్ని రోజుల నుంచి తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే వీరిలో రామేశ్వరం ప్రాంతానికి చెందిన మట్కా బీటర్ను కాపాడేందుకు అధికార పార్టీ నాయకుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిపై నుంచి పోలీసుల దృష్టి మళ్లించేందుకు ఆ నేత మరో 20 మంది పేర్లు రాసి, వీరు కూడా మట్కా, క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని.. వీరిపై చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు అధికారులకు లెటర్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆరుగురు మట్కా బీటర్లు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసుల గాలింపు ఎక్కువగా ఉంది. దీంతో ఎలాగైనా బయట పడేందుకు ఓ ద్వితీయశ్రేణి నాయకుడి సహకారంతో పార్టీ ప్రధాన నాయకుడి ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. వీరు స్టేషన్ అధికారులపై కూడా ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే టూ టౌన్, త్రీ టౌన్ పరిధిలో ఉన్న మట్కా రాయుళ్ల కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. మూడు రోజుల క్రితం పట్టణానికి చెందిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి గంజాయితో పాటు కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసు జాబితాల్లో ఉన్న బీటర్లు ఎలాగైనా బయటపడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
మట్కా కేసులో ఐదుగురు అరెస్టు
లక్షా 60 వేలు స్వాధీనం రామగుండం సీఐ వాసుదేవరావు జ్యోతినగర్: మట్కా ఆడుతున్న ఐదుగురు నిందితులను రామగుండం సీఐ వాసుదేవరావు, ఎన్టీపీసీ ఎస్సైలు అరెస్టు చేశారు. బుధవారం ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కొద్ది రోజులుగా ఎన్టీపీసీ ఏరియాలో మట్కా ఆడుతున్నారనే సమాచారంతో ఎస్సై చంద్రకుమార్ తనిఖీ చేపట్టారు. టెంపరరీ టౌన్షిప్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో మట్కా ఆడుతున్నట్లు వెల్లడైందన్నారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం ఎన్టీపీసీ అన్నపూర్ణకాలనీకి చెందిన మాదాసు రాజు(35), గోదావరిఖని అశోక్‌నగర్‌కు చెందిన పాశం వివేక్(30), ఒల్లోజుల నరేష్కుమార్(37), లక్ష్మీనగర్‌కు చెందిన కొట్టె లక్ష్మణ్(50), హన్మాన్‌నగర్‌కు చెందిన కోండ్ర సారయ్య(31)లను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వారి వద్ద లభించిన రూ1,60 వేలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మట్కా కేసును చేధించిన ప్రభాకర్‌రావు, రమేశ్, సుధాకర్, సోమరాజు, రవీందర్‌ను సీఐ వాసుదేవరావు అభినందించారు. -
డాన్ నోరు విప్పాడు..
– పోలీసుల చేతిలో మట్కా బీటర్లు, పోలీసుల చిట్టా – డీఐజీ కార్యాలయానికి చేరిన అధికారులు, సిబ్బంది జాబితా – రెండు మూడు రోజుల్లో చర్యలు తీసుకునే అవకాశం ప్రొద్దుటూరు క్రైం: ఊహించినట్టుగా మట్కా డాన్ నోరు విప్పాడు. ఒక దెబ్బకు రెండు పిట్టలన్నట్లు మట్కా నిర్వాహకులతో పాటు వారికి సహాయం చేసిన పోలీసుల పేర్లను కూడా అతను వెళ్లడించినట్లు సమాచారం. దీంతో ఇటు మట్కా స్థావరాలపై దాడులు చేయడంతో పాటు సంబంధాలున్న పోలీసు అధికారులు, సిబ్బందిపై దర్యాప్తు ముమ్మరం చేసే ప్రక్రియ వేగవంతం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల తిరుపతిలో అదుపులోకి తీసుకున్న రాయలసీమ మట్కా డాన్‌ను జిల్లా పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో విచారించినట్లు తెలిసింది. ఇంత కాలంగా తనకు సహకరించిన పోలీసుల పేర్లను చెప్పాడని, ఆ జాబితా చేంతాడంత ఉన్నట్లు పోలీసు వర్గాల సమాచారం. వీరిలో ప్రొద్దుటూరులో గతంలో పని చేసి వెళ్లిన పోలీసు అధికారులు, సిబ్బంది కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగు జిల్లాల మట్కా నిర్వాహకుల పేర్లు వెల్లడి డాన్ తన మట్కా సామ్రాజ్యాన్ని రాయలసీమ వ్యాప్తంగా విస్తరించాడు. అతను జిల్లాల వారీగా పేరు పొందిన మట్కా కంపెనీ నిర్వాహకుల పేర్లను పోలీసులకు వెళ్లడించినట్లు సమాచారం. ఇప్పటికే పోలీసు అధికారులు ఆయా జిల్లా పోలీసు అధికారులకు మట్కా నిర్వాహకుల జాబితాను పంపించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఎర్రగుంట్లకు చెందిన మట్కా బీటర్లను అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా ప్రొద్దుటూరుకు చెందిన మట్కా డాన్ నాగేశ్వరరావుతో పాటు మరో ఇద్దరి పేర్లను చెప్పారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా కడప పోలీసులు ఏక కాలంలో తిరుపతి, ప్రొద్దుటూరులో దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇపుడు వీళ్లిచ్చిన సమాచారంతో పోలీసులు దాడులు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైనట్లు కనిపిస్తోంది. శనివారం జిల్లా అధికారులు ప్రొద్దుటూరు పోలీసు అధికారులను కడపకు పిలిపించినట్లు విశ్వసనీయ సమాచారం. డ్రైవర్ గోపాల్ అరెస్ట్ వ్యవహారంలో చేతులు మారిన నగదు గురించి అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. అంతేగాక మట్కా రాస్తున్న వారి జాబితాను ప్రొద్దుటూరు పోలీసు అధికారులకు ఇచ్చినట్లు సమాచారం. ఈ లిస్టు ఆధారంగా ఇప్పటికే చాలా మంది మట్కా నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వేగంగా దర్యాప్తు... ప్రొద్దుటూరు మట్కా వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులు, సిబ్బందిపై దర్యాప్తు వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరి జాబితాను డీజీపీ కార్యాలయానికి పంపినట్లు తెలుస్తోంది. ఇద్దరు ఎస్ఐలతో పాటు ముగ్గురు హెడ్‌కానిస్టేబుళ్లు, ఒక ఏఎస్ఐ, నలుగురు కానిస్టేబుళ్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఉన్నట్లు సమాచారం. వీరిలో కార్యాలయాల్లో పని చేస్తున్న వారు ఉన్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో వీరిపై శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆరోపణలు మోస్తున్న వారిని బదిలీలతో సరిపెడతారో లేక సస్పెండ్ చేస్తారో వేచి చూడాల్సిందే. -
12 మంది మట్కా బీటర్ల అరెస్ట్
హిందూపురం అర్బన్ : పట్టణంలోని మట్కా స్థావరాలపై దాడులు జరిపి 12 మంది మట్కాబీటర్లను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ సుబ్బారావు తెలిపారు. హిందూపురం వ¯ŒSటౌ¯ŒS పోలీసుస్టేష¯ŒSలో ఆయన వివరాలు వెల్లడించారు. శుక్రవారం సీఐ ఈదుర్‌బాషా ఆధ్వర్యంలో ఎస్ఐలు దిలీప్‌కుమార్, మహబూబ్‌బాషాలు మేళాపురం బైలు ఆంజనేయస్వామి ఆలయం వద్ద మట్కా నిర్వహిస్తున్న దాడులు నిర్వహించి అహ్మద్‌నగర్ వలి, మేలాపురం అంజి, బిలాద్, రవికుమార్, చోళసముద్రం ఆంజినేయులు, సత్యసాయినగర్ శ్రీనివాసులు, కొట్నూరు అశ్వర్థనారాయణ, రషీద్, సంజీవప్ప, మిలాద్నగర్ ఆదినారాయణ, ఆర్టీసీకాలనీ అతావుల్లాలను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.2,25,220 నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. పరారైన మట్కా ఆర్గనైజర్ చికె¯ŒS బాబా కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో సీఐలు మధుభూషణ్, రాజగోపాల్‌నాయుడు ఎస్ఐలు దిలీప్, మహబూబ్‌బాషా తదితరులు పాల్గొన్నారు. -
మట్కా గ్యాంగ్‌లపై పోలీసుల దాడులు
నంద్యాల: నంద్యాల ప్రాంతంలోని మట్కా గ్యాంగ్‌లపై పోలీసులు దాడులు చేసి 8మందిని అరెస్ట్ చేశారు.రూ.లక్షను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం డీఎస్పీ హరినాథరెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. స్థానిక బైర్మల్‌వీధి పాత దీపక్ లాడ్జి ప్రాంతంలోని ఇంట్లో మట్కా ఆర్గనైజర్ గొల్ల శ్రీనివాసులు కుటుంబ సభ్యులతో సహా గ్యాంగ్‌ను నడుపుతున్నట్లు సమాచారం అందడంతో రూరల్ సీఐ మురళీధర్‌రెడ్డి, వన్‌టౌన్ ఎస్ఐ రమణ దాడులను నిర్వహించారని చెప్పారు. గొల్ల శ్రీనివాసులుతో పాటు అతని భార్య పుష్పావతమ్మను అరెస్ట్ చేసి రూ.74,900, రెండు సెల్ఫోన్లను, మట్కా చీటిలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మట్కా బీటర్లు షేక్‌అక్బర్(రాణి మహారాణి ఏరియా) నుంచి రూ.6,300, కొప్పరి ఏసుదాసు, దాట్ల వెంకటేశ్వర్లు(కొత్తపల్లె) నుంచి రూ.7950, అల్ల బ్రహ్మానందరెడ్డి(పొన్నాపురం) నుంచి రూ.3100, షేక్‌జాకీర్(నందమూరినగర్) నుంచి రూ.2400, కమ్మకాపు అశోక్ (వీసీకాలనీ) నుంచి రూ.5600 నగదును, మట్కా చీటిలను, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. దాడులు నిర్వహించిన సీఐ మురళీధర్, ఎస్ఐలు గోపాల్‌రెడ్డి, రమణా, హెడ్‌కానిస్టేబుళ్లు చంద్రశేఖర్, సుధీష్, కానిస్టేబుళ్లు మల్లికార్జున, నాగరాజు, శ్రీనివాసులు, చంద్రశేఖర్, మద్దిలేటి, భూమా కుమారిలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. -
మట్కాష్..!
ఇదిగో ఇప్పుడే వెళ్లి ఎసట్లోకి బియ్యం గింజలు తీసుకొస్తా..ఆ చంటోళ్లను కాస్త బుజ్జగించు అంటూ ఇంటావిడ కొంగుకు ధైర్యం ముడేసి బయలుదేరిన ఆటో కార్మికుడు రాజేష్ (పేరు మార్చాం)..మలి పొద్దువాలాక ఖాళీ చేతులతో దీనంగా ఇంటి గడప తొక్కాడు..ఆకలితో విలవిలలాడుతున్న పిల్లల ఎండిన డొక్కలు..నాన్నా అన్నం అంటూ తండ్రిని చుట్టేస్తుంటే బిడ్డల చిన్ని పేగులకు సమాధానం చెప్పలేక తలదించుకున్నాడు.. ..ఇదీ నరసరావుపేటలో నిత్యం పేద కుటుంబాలను మట్కా ఆట కుదిపేస్తున్న కల్లోలం. కార్మికులు స్వేదాన్ని చిందించగా వచ్చిన నాలుగు డబ్బులను.. ఆశల వలవేసి మట్కా మహమ్మారి లాగేసుకుంటోంది. అత్యాశతో ఆటాడిన వారిని అప్పుల కార్ఖాలో పడేసి సమ్మెట దెబ్బలేస్తోంది. పోలీసు అధికారులను మామూళ్ల మత్తులో ముంచి..పక్క జిల్లాలకూ ఈ వ్యసనం విస్తరిస్తోంది. జిల్లాలో జోరుగా నిషేధిత క్రీడ అత్యాశకుపోయి రోడ్డున.. పడుతున్న కార్మికుల కుటుంబాలు పట్టించుకోని పోలీసు అధికారులు నరసరావుపేట టౌన్: బతుకు బండి చక్రాన్ని లాగేందుకు పేద, మధ్య తరగతి వర్గాలు మట్కా క్రీడ పట్ల మోజు చూపిస్తున్నారు. ప్రతి రోజూ కాయాకష్టం చేసుకొన్న కూలీలు, కార్మికులు మట్కా ఆటకు బానిసై సంపాదించిన సొమ్మును పోగుట్టుకుంటున్నారు. వారిపై ఆధారపడిన జీవితాలను పస్తులపాటు చేస్తున్నారు. నరసరావుపేట కేంద్రంగా జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగుతున్న మట్కా మహమ్మారికి అనేక కుటుంబాలు మటాష్ అవుతున్నాయి. ఒకప్పుడు బ్రాకెట్ అనే ఆటగా పేరొందిన ఈ మట్కా పట్టణంలో జోరుగా కొనసాగుతుంది. రూపాయికి రూ.70 వస్తాయన్న ఆశతో అనేక మంది ఈ ఆటకు బానిసై నేడు కష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. గతంలో వ్యాపారులు తగిలిన నంబర్లను ముందస్తుగా అనుకున్న ప్రదేశాల్లో గల విద్యుత్ స్తంభాలపైనా, ప్రహరీలపైనా రాసేవారు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం పెరగటంతో నెట్లో మట్కా నంబర్లు చూసుకొనే వెసులుబాటు కల్పించారు. ప్రభుత్వం ఈ ఆటను ఎప్పుడో నిషేధించినప్పటికీ అక్రమార్కులు అధికారులకు నెలవారీ మామూళ్లు ముట్టజెప్పి యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. రైల్వేస్టేషన్ సమీపంలోని పావులూరి సుబ్బారావు పాఠశాల వద్ద, ప్రకాష్‌నగర్ రిక్షా సెంటర్‌వద్ద అక్రమ వ్యాపారులు రెండు కార్యాలయాలను తెరచి దర్జాగా వ్యాపారం చేస్తున్నారు. ఈ వ్యవహారం పోలీసులకు తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రతి రోజూ మూడుషోలు.. ప్రతి రోజూ మధ్యాహ్నం 2 నుంచి 5.30 గంటల వరకు మిలాన్ డే, 3 నుంచి 6 గంటల వరకు కల్యాణ్, రాత్రి 7 నుంచి 10 గంటల వరకు మిలాన్నైట్ అనే మూడు రకాల మట్కా ఆటలు కొనసాగుతున్నాయి. ఒకటి నుంచి వెయ్యి అంకెలు కోరుకోవచ్చు. ఏ నంబరు అయితే అదష్టం వరిస్తుందని కోరుకొంటారో అంత నగదు వ్యాపారులకు చెల్లించాలి. ఒక వేళ ఆ అంకె లాటరీలో వస్తే 70 రెట్లు వ్యాపారులు చెల్లిస్తారు. నగదు చెల్లింపు, కోరుకునే నంబర్ ఈ విధానమంతా కోడ్ భాషలో నడుస్తుంది. నంబర్ లాటరీలో ఎలా తీస్తారనే విషయాన్ని మాత్రం కొనుగోలు చేసిన వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో తెలియదు. లక్షల్లో వ్యాపారం.. నరసరావుపేట పట్టణంలో ప్రతి రోజూ రెండు లక్షల రూపాయల వరకు మట్కా వ్యాపారం జరుగుతున్నట్లు సమాచారం. పట్టణంలో ఉన్న ముగ్గురు బడా వ్యాపారుల వద్ద ఉన్న ఏజెంట్లు చిలకలూరిపేట , పిడుగురాళ్ల, వినుకొండ, సత్తెనపల్లి, గుంటూరు, గిద్దలూరు, తాడిపర్తి, నంద్యాలలోని మాట్కా వ్యాపారాన్ని విస్తరించారు. అక్కడ కొనుగోలు చేసిన నంబర్లను ఇక్కడ వ్యాపారులకు ప్రతి రోజూ ఫోన్లో తెలియజేస్తారు. ఎవరికైనా నంబర్ తగిలితే రెండో రోజు పట్టణంలోని ఓ కార్పొరేట్ బ్యాంక్ వద్దకు పిలిచి వ్యాపారులు నగదును అప్పచెబుతున్నట్లు సమాచారం. ఈ డబ్బు ఎక్కనుంచి వస్తుంది..అసలు తెరవెనుక ఉన్న పాత్రధారులు ఎవరు అనే విషయం ఎవరికీ తెలియకుండా వ్యాపారులు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. -
మట్కా ఓపెన్..బతుకులు క్లోజ్
పోలీస్‌స్టేషన్ మామూళ్లు నెలకు రూ.50వేలు.. కానిస్టేబులే మట్కాకు బానిసైన వైనం జూదం పేరుతో రోజూ రూ.3 లక్షలు వసూలు చేస్తున్న బీటర్లు కోడుమూరులో కర్నూలు మట్కాకింగ్ బంధువులదే కీలకం! మట్కా నెంబర్ తగిలితే రూ. 1కి రూ.80 ఇస్తాం. ఇది కోడుమూరు మండలంలో మట్కాబీటర్ల ఆఫర్. కోడుమూరు మండలంలో విచ్చలవిడిగా సాగుతున్న ఈ ఆటకు అమాయక జనం బానిసై ఆర్థికంగా చితికిపోతున్నారు. మరికొందరు ఆస్తులు పోగొట్టుకొని రోడ్డున పడుతున్నారు. ఈ మాయజూదానికి అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులు నెలమాముళ్లకు అలవాటు పడి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కోడుమూరు:కోడుమూరు పట్టణంలోని నాయీ బ్రాహ్మణ వర్గానికి చెందిన ఓ యువకుడు మట్కాకు బానిసై రూ.4లక్షలు అప్పులు చేసి భార్యాపిల్లలను వదిలేసి ఊరు వదిలి పారిపోయాడు. తల్లిదండ్రులు అప్పులు కట్టి మళ్లీ పునరావాసం కల్పించారు. లద్దగిరిలో ఓ వ్యక్తి మట్కాకు బానిసై బస్టాండ్ ప్రాంతంలో ఉన్న ఇల్లు, ఆటో అమ్ముకొని బాడుగ ఇంట్లో నివాసముంటున్నాడు. ఇలా ఎంతోమంది మట్కాకు బానిసై అస్తులు పొగొట్టుకుంటున్నారు. మండలంలో వీధి వీధిన మట్కాబీటర్లు తిష్టవేసి ప్రజలకు డబ్బుఆశచూపి మాయజూదంలోకి లాగుతున్నారు. మట్కా నంబర్ తగిలితే రూపాయకు రూ.80లు ఇస్తామని మభ్యపెట్టి వారి నుంచి వేలకువేలు వసూలు చేస్తున్నారు. ఓపెన్, క్లోజింగ్ నంబర్ల పేరుతో వారంలో ఐదు రోజులు ఈ దందా సాగిస్తున్నారు. మండలంలో రోజుకు దాదాపు రూ.3లక్షలు వసూలవుతున్నట్లు సమాచారం. మట్కా బీటర్లు వీరే: కర్నూలు నగరంలో మట్కా కింగ్‌గా రాజ్యమేలుతున్న మట్కా బీటర్ సమీప బంధువులు కోడుమూరు పట్టణంలో పెద్ద ఎత్తున జూదం నడుపుతున్నారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా కనీసం పోలీస్‌స్టేషన్‌కు కూడా పిలిపించరు. అత్యాధునికమైన నాలుగు భవంతులను ఆ మట్కా బీటర్ కోడుమూరులో నిర్మించాడు. గోరంట్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కర్నూలు రేడియోస్టేషన్ దగ్గర మెడికల్‌షాపు వ్యాపారం ముసుగులో మట్కాను నడుపుతున్నాడు. కోడుమూరు, గోరంట్లలో మట్కా బీటర్లను ఏర్పాటు చేసి డబ్బులు వసూలు చేస్తున్నాడు. అల్లినగరంలో ఓ వ్యక్తి మట్కా బీటర్ అవతారమెత్తి రోజుకు వేలాది రూపాయలు వసూలు చేస్తున్నాడు. గతంలో కోడుమూరు పోలీస్‌స్టేషన్‌లో ఆ వ్యక్తిపై మట్కా కేసులు నమోదయ్యాయి. మట్కా నంబర్ తగిలినా మోసమే : మట్కా నంబర్ తగిలిన రోజు జూదరికి డబ్బులివ్వకుండా బీటర్లు మోసం చేస్తున్నారు. మట్కా నంబర్ తగిలిన రోజు పోలీసుల దాడులు జరిగాయని బుకాయించి తప్పించుకుంటున్నారు. పోలీసుల నిఘా ఎక్కువగా ఉండడంతో డబ్బులు ప్రధాన మట్కా కేంద్రానికి పంపలేదని జూదరులను బెదిరిస్తున్నారు. ఇలా రెండు విధాలుగా మట్కా జూదరులు నష్టపోతున్నారు. బీటర్లు మాత్రం అస్తులు కూడబెట్టుకుంటున్నారు. మట్కాకు పోలీసుల అండ మట్కాపై ఫిర్యాదులొచ్చినా చిన్నా చితక మట్కా ఆడే వారిని పట్టుకొచ్చి అక్రమ కేసులు బనాయిస్తున్నారు. పెద్ద ఎత్తున మట్కా నడిపేవారికి పోలీసులు రక్షణ కవచంగా నిలుస్తున్నారు. లద్దగిరి గ్రామంలో 5మంది యువకులకు రూ.12 లక్షలు మట్కా తగిలిన విషయం పోలీసులకు తెలిసింది. వెంటనే వారందరిని పోలీస్ కస్టడీలో వారం రోజుల పాటు పెట్టుకొని వారి నుంచి రూ.5లక్షలు వసూలు చేసుకుని కేసు లేకుండా వదిలిపెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోడుమూరు పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ మట్కా జూదానికి బానిసయ్యాడు. ఇద్దరు మధ్యవర్తుల ద్వారా రోజు వందలాది రూపాయలు మట్కా బీటర్లకు జూదం కోసం పంపుతున్నట్లు సమాచారం. మట్కాపై నిఘా పెట్టాము : మహేష్‌కుమార్, ఎస్ఐ మట్కాబీటర్లపై నిఘా పెట్టాము. 6నెలల క్రితం మట్కాపై ఒకటో రెండో కేసులు పెట్టాము. కర్నూలు ప్రధాన మట్కా బీటర్ బంధువులపై నిఘా ఉంచాం. ఆధారాలు దొరికితే అరెస్ట్ చేస్తాం. మట్కాను ప్రోత్సహించే వారిని వదిలే సమస్యే లేదు. -
మట్కానివారణకు స్పెషల్ టాస్క్ ఫోర్స్
యువ కానిస్టేబుళ్లతో ప్రత్యేక టీం ఎస్పీ నవీన్‌కుమార్ తాండూరు రూరల్ : జిల్లాలో మట్కా నివారణకు యువ కానిస్టేబుళ్లతో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ టీంను ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ భట్టు నవీన్ కుమార్ అన్నారు. గురువారం సాయంత్రం కరన్‌కోట్ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఆత్మహత్యల నివారణకు పోలీసుల ఆధ్వర్యంలో కళాజాత కార్యక్రమాలతో పాటు సైకాలజిస్టులతో ప్రత్యేక కౌన్సెలింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలోని ఠాణాలను సందర్శించి నేరాలకు సంబంధించి నివేదికల ను తయారు చేస్తున్నామని, క్రైం రేటును ఏవిధంగా తగ్గించాలనే విషయమై కార్యాచరణ చేపడతామన్నారు. రోడ్డు ప్రమాదాల విషయమై వాట్సాప్ ద్వారా సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు ఎస్పీ కరన్‌కోట్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం ఎస్పీ నవీన్‌కుమార్ పట్టణంలోని పోలీస్‌స్టేషన్ కూడా సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ చందనదీప్తి, రూరల్ సీఐ సైదిరెడ్డి, పట్టణ సీఐ వెంకట్రామయ్య, ఎస్ఐలు రేణుకారెడ్డి,చంద్రకాంత్, నాగార్జున ఉన్నారు. ఇసుక రవాణాలో కఠినంగా ఉండండి యాలాల : ఇసుక అక్రమ రవాణా విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ నవీన్‌కుమార్ అన్నా రు. గురువారం యాలాల పోలీస్‌స్టేష న్ను ఆయన సందర్శించారు. ముందు గా పీఎస్‌లోని రిసెప్షన్ సెంటర్‌ను పరిశీలించి పీఎస్‌కు ఎటువంటి కేసులు వస్తున్నాయి? బాధితుల విషయంలో ఎలా వ్యవహరిస్తున్నారు? అన్న విషయాన్ని ఎస్ఐ అరుణ్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఆత్మహత్య చేసుకున్న ఎస్ఐ రమేష్ వివరాలను ఎస్పీ నవీన్‌కుమార్ ఏఎస్పీ చందనదీప్తిని అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ వెంట రూరల్ సీఐ సైదిరెడ్డి, ఎస్ఐ - 2 మల్లారెడ్డి తదితరులు ఉన్నారు. సీసీ కెమెరాలతో సరిహద్దు నిఘా బషీరాబాద్ : సీసీ కెమెరాలతో సరిహ ద్దు గ్రామాల్లో నిఘా ఏర్పాటు చేస్తామ ని ఎస్పీ నవీన్ కుమార్ అన్నారు. గురువారం బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌ను ఆయన ఏఎస్పీ చందనదీప్తితో కలిసి సందర్శించారు. స్టేషన్‌లోని పోలీసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రూ.70 లక్షలతో నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో ఉన్న పోలీస్ స్టేషన్ల పరిధిలో నేరాలను అదుపులోకి తీసుకువచ్చేందు కు త్వరలో కర్ణాటక పోలీసు అధికారులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. సరిహద్దు గ్రామాల్లో సీసీ కెమేరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు శాంతి భద్రతలను పర్యవేక్షిచేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీతో పాటు సీఐ సైదిరెడ్డి, ఎస్ఐ అభినవ చతుర్వేది తదితరులున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మొక్కలు నాటారు. -
తెలంగాణ మట్కా డాన్ అరెస్ట్
ఆదోని రూరల్: తెలంగాణ రాష్ట్రం అలంపూర్ నియోజకవర్గం అయిజకు చెందిన మట్కా డాన్ జంగం రాచయ్యను బుధవారం పెద్దతుంబళం పోలీసులు అరెస్ట్ చేశారు. రాచయ్య కొంతకాలంగా ఆదోని మండలంలోని కొందరు బీటర్ల సహాయంతో మట్కా నిర్వహిస్తున్నట్లు పెద్దతుంబళం ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. ఈయన కింద బీటర్లుగా పనిచేస్తున్న ఆరుగురిని కొన్ని రోజుల క్రితం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపామన్నారు. ప్రత్యేక బృందం రెక్కి నిర్వహించి బుధవారం కోసిగి క్రాస్ రోడ్డు వద్ద రాచయ్యను పట్టుకొని రూ. 75,900 నగదు, మట్కా చీటీలు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా మేజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించారు. చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్స్ ఖాజా, ఆచారిని సన్మానిస్తూ ఎస్ఐ నగదు రివార్డు అందజేశారు. గతంలో వీరు ఆరుగురు మట్కా బీటర్లను పట్టుకున్న కేసులో కూడా రివార్డును అందుకున్నారు. -
మట్కా కింగ్ అరెస్ట్
- అదుపులో మరో 22 మంది నిందితులు -బెంగళూరు కేంద్రంగా వ్యవహారం అనంతపురం: పేదల బతుకులను బుగ్గి చేస్తున్న మట్కా మహమ్మారిపై అనంతపురం ఎస్పీ ఎస్వీ రాజశేఖర్‌బాబు కొరడా ఝుళిపించారు. మట్కా వ్యవహారం, పోలీసుల సహకారంపై ‘సాక్షి’లో వచ్చిన కథనానికి ఎస్పీ స్పందించారు. రాయలసీమ జిల్లాలతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మట్కా కార్యకలాపాలు సాగిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు. ఈ క్రమంలో రాయలసీమ మట్కా కింగ్‌లా వ్యవహరించే వ్యక్తితో పాటు 22 మందిని అరెస్ట్ చేశారు. కంపెనీ నిర్వాహకుడు రెండో రోడ్డు కరీముల్లా, ఈ కంపెనీకి అనుసంధాన కర్తగా ఉంటూ బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అనంతపురం రూరల్ పిల్లిగుండ్లకాలనీకి చెందిన చిగిచెర్ల చంద్రశేఖర్ అలియాస్ మంగలి చంద్ర, అతనికి అత్యంత సన్నిహితుడు రాణీనగర్‌కు చెందిన గోపీనాథ్‌రెడ్డి అరెస్టయిన వారిలో ఉన్నారు. వీరితో పాటు నగరానికి చెందిన కొండారెడ్డి, ఖాదర్‌బాషా, మధుసూదన్, దేవరాజ్, అనిల్‌కుమార్, ఎస్.బాషా, అబ్దుల్‌కలాం, అక్కులప్ప, ముచ్చు వెంకటేష్, నన్నే సాహెబ్, బి.రమణ, మహబూబ్‌బాషా అలియాస్ చిచ్చు, డి. బాబు, వన్నూర్ సాహెబ్, మహబూబ్‌పీరా, పీరా, భాస్కర్, ఖాదర్, అంజన్‌కుమార్ ఉన్నారు. వీరి నుంచి రూ.13.60 లక్షల నగదు, 20 సెల్ఫోన్లు, మట్కా చీటీలు, పట్టీలు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను అనంతపురం డీఎస్పీ మల్లికార్జునవర్మ మంగళవారం డీపీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పీల్చి పిప్పి చేస్తున్న కరీముల్లా అరెస్టయిన వారిలో కరీముల్లా ముఖ్యుడు. ఈయన తండ్రి చాంద్‌బాషా గతంలో కూల్‌డ్రింక్స్ దుకాణం నిర్వహిస్తూ గుత్తిలో మట్కా కార్యకలాపాలు నిర్వహించేవాడు. ఆయన మృతి చెందాక భార్య మాబున్నీ అలియాస్ మున్ని తన కొడుకు కరీముల్లా సహకారంతో మట్కా వ్యవహారం కొనసాగిస్తోంది. గుత్తి నుంచి అనంతపురం మకాం మార్చారు. కరీముల్లా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతూనే తల్లితో కలిసి మట్కా కంపెనీ నిర్వహిస్తున్నాడు. బీటర్ల నుంచి వచ్చిన పట్టీలు ఫోన్‌కాల్స్, మెసేజ్‌ల ద్వారా సబ్ బీటర్లకు అటు నుంచి సదరు కంపెనీకి చేరతాయి. అధిక మొత్తం కల్గిన నంబర్ల లావాదేవీలను ముంబాయిలోని శ్రీనివాస్ సేఠ్, శివప్ప కామాటి కంపెనీలకు వెళ్తాయి. ఇలా నిత్యం ఫోన్ల ద్వారా మట్కా కార్యకలాపాలు, బ్యాంకు ద్వారా ఆర్థిక లావాదేవీలు చేస్తుండేవారు. న్యూరతన్, డేమిలాన్ తదితర మట్కా ఆటలద్వారా పట్టీలు కరీముల్లా కంపెనీకి వస్తాయి. రోజూ లక్షలాది రూపాయలు కలెక్షన్లు చేసేవారు. సబ్‌బీట్‌ల ద్వారా కరీముల్లా కంపెనీకి పట్టీలు బీటర్ల ద్వారా రాయించిన మట్కా వివరాలను సబ్‌బీటర్ల ద్వారా కరీముల్లా కంపెనీకి చేరుతుంటాయి. అనంతపురానికి చెందిన మంగలి చంద్ర, గుంతకల్లు మోహన్, కర్నూలు రాజు, బాషా, రామ్మోహన్, దౌలా, నంద్యాల స్టాలిన్, బాబు, శీను, పాణ్యం సుబ్బు, ప్రకాశం జిల్లా గిద్దలూరు రాచయ్య, మహబూబ్‌నగర్‌కు చెందిన ప్రభాకర్, నాగర్‌కర్నూలు ప్రసాద్, బళ్లారికి మరికొందరి సబ్‌బీటర్ల ద్వారా కరీముల్లా కంపెనీకి ఫోన్లు, మెసేజ్‌ల ద్వారా పట్టీలు చేరుతుంటాయి. బెంగళూరు కేంద్రంగా... కరీముల్లా తర్వాత అతిముఖ్యమైన వ్యక్తి మంగలి చంద్ర. పిల్లిగుండ్లకాలనీలో నివాసం ఉంటాడు. అనంతపురంలో తరచూ పోలీసుల దాడులు పెరగడంతో బెంగళూరు మకాం మార్చాడు. అక్కడి నుంచే మట్కా నిర్వహిస్తున్నాడు. అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల నుంచి మట్కా పట్టీలు ఫోన్లలో తీసుకుంటాడు. డబ్బు వ్యవహారమంతా బ్యాంకుల ద్వారానే జరుగుతుంది. -
మాట్కా.. మామూల్లే!
► మట్కా రాయుళ్లకు పోలీసుల అండ ► నిర్వాహకుల నుంచి మామూళ్లు ► గుట్టు విప్పిన అదుపులోని నిందితులు మట్కా మహమ్మారి ఎన్నో కుటుంబాలను వీధినపడేస్తోంది. ఈ వ్యసనానికి బానిసై అప్పులు చేసి, వాటిని తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న వారూ ఉన్నారు. రూపాయికి రూ.80 తగులుతుందని ఆశ పెడుతూ పేద, మధ్య తరగతి ప్రజలను మట్కా ఊబిలోకిలాగుతున్నారు. వారు రోజంతా కష్టపడి సంపాదించిన సొమ్మును సాయంత్రం మట్కాకు తగలేస్తున్నారు. ఈ మహమ్మారిని నివారించాల్సిన పోలీసు శాఖ మీనమేషాలు లెక్కిస్తోందనే విమర్శలున్నాయి. అనంతపురం : అనంత’లో మట్కా జాఢ్యం జడలు విప్పుతోంది. నగరంలో కొంతకాలంగా తగ్గినట్లు కనిపించినా.. ఇటీవల చాపకింద నీరులా విస్తరిస్తోంది. కొందరు నిర్వాహకులకు పోలీసులే అండగా నిలుస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇటీవల వెలుగు చూసిన ఓ ఉదంతమే ఇందుకు నిదర్శనం. 15 రోజుల కిందట మట్కా నిర్వాహకుడు షబ్బీర్‌ను ప్రత్యేక పోలీసులు నగరశివారులోని పిల్లిగుండ్లకాలనీలో అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా అనుచరులుగా ఉన్న వేణుగోపాల్‌నగర్, నీరుగంటివీధి తదితర ప్రాంతాలకు చెందిన మరో ఐదుగురి పేర్లు చెప్పాడు. వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఏడు కంపెనీల ద్వారా 13 మంది మట్కా నిర్వహిస్తున్నట్లు నిందితులు అంగీకరించినట్లు సమాచారం. ఇదే తరుణంలో తమకు సహకరిస్తున్న పోలీసుల చిట్టా కూడా విప్పారు. నగరంలోని ఒక స్టేషన్లో పని చేస్తున్న సుమారు 10 మంది గ్రేడ్-1 పోలీసులు, 15 మంది సాధారణ పోలీసులు మామూళ్లు తీసుకుంటున్నారంటూ వారి పేర్లు సహా బయట పెట్టినట్లు సమాచారం. ఒక్కొక్కరు ప్రతివారం రూ. వెయ్యి నుంచి రూ.2 వేల తీసుకుంటున్నట్లు ప్రత్యేక పోలీసుల విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. విచారణ అనంతరం ప్రత్యేక పోలీసులు తమ అదుపులో ఉన్న మట్కా నిర్వాహకులను ఓ స్టేషన్‌కు అప్పగించారు. వారు కేసు నమోదు చేశారు. వన్‌టౌన్ సీఐ రాఘవన్ ‘సాక్షి’తో మాట్లాడుతూ...మట్కా నిర్వాహకుడు షబ్బీర్‌ను ఇటీవలే అరెస్టు చేశామన్నారు. ఎస్పీ దృష్టికి పోలీసుల నిర్వాకం! మట్కా నిర్వాహకులకు అండగా నిలుస్తున్న పోలీసుల వివరాలు ఎస్పీ దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. మట్కా నిర్మూలన విషయంలో కఠినంగా వ్యవహరించాలనిపదేపదే చెబుతున్నా.. కొందరి తీరు మారకపోవడం వెనుక కారణాలను విశ్లేషిస్తున్నట్లు తెలుస్తోంది. నగరంలో ఏయే స్టేషన్లలో ఎంతమంది పోలీసులు మట్కా నిర్వాహకులతో టచ్‌లో ఉన్నారనే సమాచారాన్ని తెప్పించుకుంటున్నట్లు సమాచారం. దీంతో అక్రమార్కుల్లో వణుకు పుడుతోంది. త్వరలో సాధారణ బదిలీలున్న నేపథ్యంలో వారిని దూరప్రాంతాలకు బదిలీ చేస్తారనే ప్రచారం పోలీసు వర్గాల్లో సాగుతోంది. మట్కా నిర్వాహకుల అరెస్ట్ అనంతపురం పాతూరులోని నీలం కాంప్లెక్స్ సమీపంలో మట్కా రాస్తున్న ముగ్గురు వ్యక్తులను సోమవారం వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అందిన సమాచారం ఎస్ఐ వెంకటరమణ సిబ్బందితో వెళ్లి దాడులు చేశారు. నీలం బాషా, మోహన్‌తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 2,200 నగదు, చీటీలు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. -
మట్కా కేంద్రంపై దాడి
హైదరాబాద్ నగరంలోని మల్కాజ్ గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మట్కా కేంద్రం పై పోలీసులు గురువారం అర్థరాత్రి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.17,920 రూపాయల నగదు స్వాధీనం చేసుకుని నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. పోలీసుల రాకను గమనించిన ఐదుగురు వ్యక్తులు పరారయ్యారు. -
మట్కా కింగ్ అరెస్ట్
-
మట్కా కింగ్ అరెస్ట్
కదిరి : అనంతపురం జిల్లాలో మట్కా కింగ్‌గా చెలామణి అవుతున్న మట్కా బీటర్ రంగనాయుడును పోలీసులు అరెస్టు చేశారు. కదిరి పోలీసులు శుక్రవారం అతనిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి నుంచి రూ. 2.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో అతని పై కేసులు నమోదైన నేపథ్యంలో జిల్లా బహిష్కరణ చేస్తూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. -
మట్కా బీటర్లపై పీడీ యాక్ట్
తాండూరు రూరల్ (రంగారెడ్డి) : మట్కా నిర్వాహకులపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయాలని రంగారెడ్డి జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి సూచించారు. ఆమె శనివారం మధ్యాహ్నం తాండూరు సర్కిల్ కార్యాలయంలో పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. శుక్రవారం రాత్రి తాండూరులో పోలీసులు అరెస్టు చేసిన ఐదుగురిపై కేసులు పెట్టి, రిమాండ్‌కు తరలించాలని సూచించారు. అలాగే కాగ్నా నది నుంచి ఇసుక పర్మిట్లు మండల పరిషత్ అధికారులు జారీ చేస్తున్నందున పర్యవేక్షణ బాధ్యతలు కూడా వారే చేపట్టాల్సి ఉంటుందని చెప్పారు. పర్మిట్లు దుర్వినియోగం కాకుండా చూసుకునే పని వారిదేనని ఎస్పీ అన్నారు. -
మహమ్మారి మట్కా
- మహారాష్ట్ర కేంద్రంగా జిల్లాలో జోరుగా హైటెక్ జూదం - కోట్లు దాటుతున్న దందా, రాజకీయ నాయకుల అండ - మట్కా నగదులో ఖాకీల కక్కుర్తి ఆదిలాబాద్ క్రైం : జిల్లాలో మట్కా మహమ్మారి కోరలు చాస్తోంది. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా సగటు జీవి జీవితాన్ని నాశనం చేస్తోంది. వ్యాపారులు, కూలీలు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు, యువత మట్కాకు అలవాటు పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. మట్కాకు బానిసై ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలూ జిల్లాలో చోటు చేసుకున్నాయి. రోజంతా కష్టపడి సంపాదించిన సొమ్మును జూదంలో పెట్టడంతో కుటుంబ పోషణ భారమై జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. పోలీసులు అడపాదడపా దాడులు జరిపినా మట్కాను నియంత్రించలేకపోతున్నారు. ఒకరిద్దరిని అదుపులోకి తీసుకుని.. నిర్వాహకులపై చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. నిర్వహకుల నుంచి మమూళ్లు అందడంతో పూర్తిస్థాయిలో పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కోట్లలో వ్యాపారం.. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భైంసా, బాసర, బోథ్, చెన్నూర్, మంచిర్యాల, కాగజ్‌నగర్ పట్టణాల్లో మట్కా జోరుగా సాగుతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో యువత కూడా మట్కాజూదం వైపు ఆకర్షితులవుతున్నారు. జిల్లాలో ప్రతి ఏడాది కోట్ల రూపాయలు మట్కాతో చేతులు మారుతున్నాయి. ముంబయి కేంద్రంగా మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో కళ్యాణి, మిలాన్, ముంబాయి, రాజధాని వంటి కంపెనీలు మట్కా నిర్వహిస్తున్నాయి. ఈ కంపెనీల్లో జిలా ్లకు చెందిన వారూ పాల్గొంటున్నారు. రూ.పదికి రూ.వెయ్యి వస్తుండడంతో యువత అత్యాశకు పోయి మట్కాకు అలవాటు పడుతున్నారు. ఓపెనింగ్, క్లోజింగ్ నంబర్లపై బ్రాకెట్ నెంబర్‌కు వందరేట్ల చెల్లింపుతో మట్కా జూదం నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఓపెన్, సాయంత్రం 6 గంటలకు క్లోజింగ్ ఉంటుంది. మనం ఎంపిక చేసిన నెంబర్‌కు లాటరీ తగిలితే మళ్లీ ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో లాటరీ తగిలేవారు తక్కువ శాతం.. డబ్బులు పోగొట్టుకునే వారే అధికంగా ఉంటారు. కార్మికుల నుంచి కాంట్రాక్టర్లు.. వ్యాపారుల నుంచి రాజకీయ నాయకుల వరకు మట్కా జూదంలో పాత్రధారులే. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా మట్కాలో డబ్బులు పెడుతున్నారంటే అతిశయోక్తి కాదు. కొన్ని రోజులుగా జిల్లాలో మట్కాజూదరుల అరెస్టులను చూస్తే ఏ మేర మట్కా జరుగుతుందో తెలిసిపోతోంది. సెల్‌ఫోన్ ద్వారా ఫలితం.. సెల్‌ఫోన్ మెసేజ్‌ల ద్వారానే ఫలితాలు వెల్లడిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి సెల్‌ఫోన్ మెసేజ్ ద్వారా ఈ మట్కా జోరుగా సాగుతోంది. ఒకప్పుడు చిట్టీలపై నంబర్లతో సాగిన ఈ దందా సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో విచ్చలవిడిగా సాగుతోంది. చిట్టీలతో కాకుండా సెల్‌ఫోన్ మెసేజ్‌లతో మట్కా ఆడుతూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గతంలో లక్షల్లో జరిగే మట్కా వ్యాపారం ప్రస్తుతం జిల్లాలో కోట్ల రూపాయల్లో కొనసాగుతోంది. పోలీసుల నిఘా పెరగడంతో జిల్లా కేంద్రంగా రోజు రూ.20 నుంచి 30 లక్షల వ్యాపారం జరుగుతున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని యావత్మాల్, పాండ్రకవడ, చంద్రపూర్, మాం డ్వ, తదితర ప్రాంతాల నుంచి మట్కా సాగుతోంది. మన రాష్ట్రంలోని కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాల నుంచి కూడా జిల్లాలో మట్కా సాగుతోంది. సరిహద్దుల్లో జోరుగా సాగుతున్న ఈ మట్కా వ్యాపారాన్ని జిల్లా పోలీసులతోపాటు అంతర్రాష్ట్ర పోలీసుల నిఘాతోనైనా అరికట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఖాకీల కక్కుర్తి.. జిల్లాలో కొంతమంది పోలీసు సిబ్బంది సహకారంతోనే ఈ మట్కా విస్తరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అప్పుడప్పుడు దాడులు చేసి మట్కా నిరోధానికి చర్యలు తీసుకుంటున్న ట్లు నిరూపించినా.. అసలు మూలాల్లోకి వెళ్లడం లేదని తెలుస్తోంది. ఇటీవల కాలంలో మట్కా నిర్వాహకులను అరెస్టు చేస్తున్న పోలీసులు స్వాధీనం చేసుకున్న సొమ్ములో కక్కుర్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. అధిక మొత్తంలో మట్కా నగదు దొరికినా తక్కువ సంఖ్యలో చూపించి మిగతాది నొక్కేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మట్కా కేసును పట్టుకున్న పోలీసు అధికారి వచ్చిన సొమ్ములో తనతోపాటు కేసును పట్టుకొచ్చిన సిబ్బందికి కూడా వంతుల వారీగా డబ్బులు చెల్లిస్తున్నారనే విమర్శలున్నాయి. రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రంలో రూ.2.64 లక్షల మట్కా నగదు దొరికినప్పటికీ నాలుగు రోజులు బయటపెట్టకుండా గోప్యంగా ఉంచడం గమనార్హం. నిఘా ఏర్పాటు చేశాం.. మట్కా జూదం నిర్మూలనపై నిఘా ఏర్పాటు చేశాం. జిల్లా కేంద్రంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ప్రత్యేక దృష్టి సారించాం. మహారాష్ట్ర నుంచి నడిచే మట్కా దందాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నాం. మట్కా నిర్వహిస్తున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. గణేష్ ఉత్సవాల్లో కూడా మట్కా, పేకాట ఆడినట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలి. - లక్ష్మీనారాయణ, ఆదిలాబాద్ డీఎస్పీ -
నలుగురు మట్కా బీటర్లు అరెస్ట్
బుక్కరాయసముద్రం(అనంతపురం): బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో నలుగురు మట్కా బీటర్లను అరెస్ట్ చేసినట్లు మండల ఎస్ఐ విశ్వనాథ్ చౌదరి తెలిపారు. శనివారం సాయంత్రం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ నందు విలేఖరుల సమావేశం నిర్వహించారు. కేసుకు సంబందించిన వివరాలను ఎస్ఐ విశ్వనాథ్ చౌదరి వివరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మట్కా నిర్మూలనపై ప్రత్యేక దృష్టి కేటాయించామన్నారు. వీటిలో ఎంతటి వారినైనా విడిచి పెట్టేది లేదన్నారు. మండల కేంద్రంలో ఇందిరమ్మ కాలనీకు చెందిన బోయ శివయ్య, మండల పరిదిలోని నీలాంపల్లి గ్రామానికి చెందిన షేక్ మసూద్‌వలి, అదే గ్రామానికి చెందిన షేక్ చాంద్‌బాషా, జంతులూరు గ్రామానికి చెందిన బోయ సూర్య నారాయణలు గుట్టు చప్పుడు కాకుండా మట్కా నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వీరిపై ఎస్ఐ విశ్వనాథ్ చౌదరి ప్రత్యేక నిఘా వేశారు. శనివారం సాయంత్రం ఈ నలుగురు చిక్కవడియార్ చెరువు సమీపంలో మట్కా నిర్వహిస్తున్నారని సమాచారంతో ఎస్ఐ పోలీస్ బృందంతో మెరుపు దాడి నిర్వహించారు. వీటిలో నలుగురికి అదుపుతోకి తీసుకుని వారి వద్ద నుంచి 80,150 రుపాయలు, పెన్నులు, మట్కా చీటిలు నాలుగు సెల్‌ఫోన్లును స్వాదీనం చేసుకున్నామన్నారు. నిందుతులను కోర్టులో హాజరు పుస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ జనార్థన్,లక్ష్మినారాయణ, కరియప్ప, పద్మావతి, ప్రసాద్, రఘు, సంతోష్, శ్రీనివాసులు, బాషా, తదితరులు పాల్గొన్నారు. -
15 మంది మట్కా బీటర్లు అరెస్ట్
కళ్యాణదుర్గం(అనంతపురం): అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజక వర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో జూదాలు నిర్వహిస్తున్న 15 మంది మట్కా బీటర్లను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 1.13 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లాతో పాటు కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఈ మధ్య కాలంలో మట్కా బీటర్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించి 15 మందిని అరెస్ట్ చేశారు. -
జడలు విప్పిన మట్కా
- నిండా మునుగుతున్న నాపరాతి కార్మికులు - షోలాపూర్ కేంద్రంగా మట్కా జూదం - తెర వెనుక నుంచి ‘పెద్దల’ హస్తం - తాండూరు మండలంలో రూ.లక్షల్లో బెట్టింగులు - పోలీసులకు నెలకు రూ.60 వేల మామూళ్లు? తాండూరు: కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న మట్కా జూదం మళ్లీ జడలు విప్పింది. పేద, మధ్యతరగతి, నాపరాతి కార్మికులను ఆర్థికంగా చిదిమేస్తోంది. ‘పెద్దలహస్తం’తో మట్కా బెట్టింగులు ఇటీవల కాలంలో ఊపందుకున్నాయి. నిత్యం రూ. లక్షల్లో బెట్టింగ్ వ్యవహారాలు సాగుతున్నాయి. మహారాష్ట్ర షోలాపూర్ కేంద్రంగా మట్కా బెట్టింగులు జరుగుతున్నాయని తెలుస్తోంది. మండలంలోని గోపన్‌పల్లి, గౌతాపూర్ ప్రాంతాలను అడ్డాలుగా చేసుకొని మట్కా నిర్వాహకులు బెట్టింగ్‌లు కొనసాగిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. క్షేత్రస్థాయిలో ఒకరిద్దరు ఖాకీలు వెన్నుదన్నుగా నిలుస్తుండంతోనే నిర్వాహకులు మళ్లీ మట్కా జూదానికి తెరలేపారని సమాచారం. మట్కా బెట్టింగుల్లో ఆరితేరిన ఓ పాత నేరస్తుడు సూత్రధారిగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతను సుమారు పది మంది ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని బెట్టింగులు కొనసాగిస్తున్నట్టు సమాచారం. నాపరాతి కార్మికులే లక్ష్యంగా.. మండలంలో వందలాది నాపరాతి గనులు, పాలిషింగ్ యూనిట్లు ఉన్నాయి. దీంతో నాపరాతి కార్మికులు లక్ష్యంగానే ఈ బెట్టింగులు జరుగుతున్నాయి. పదిమంది ఏజెంట్లు గనులు, పాలిషింగ్ యూనిట్ల వద్దకు వెళ్లి కార్మికుల నుంచి బెట్టింగ్ డబ్బులు వసూలు చేస్తూ చిట్టీలు రాసిస్తున్నారు. అమాయక కార్మికులు మట్కా బెట్టింగ్ వలలో చిక్కి నష్టపోతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓపెన్ నంబర్‌కు, రాత్రి క్లోజింగ్ నంబర్‌కు మట్కా బెట్టింగులు జరుగుతున్నాయి. ఓపెన్, క్లోజింగ్ నంబర్లు కలిస్తే బెట్టింగ్ డబ్బులకు రెండింతలు ఏజెంట్లు చెల్లిస్తున్నట్టు సమాచారం. బెట్టింగ్ కట్టిన వారు సూచించిన నంబర్ వస్తే డబ్బులు వసూలు చేసిన ఏజెంట్లే సెల్‌ఫోన్ ద్వారా సదరు వ్యక్తులకు సమాచారం అందజేస్తున్నారు. తర్వాత వారు వచ్చి డబ్బులు తీసుకువెళుతున్నట్లు తెలుస్తోంది. రోజుకు సుమారు రూ.1.5 లక్షల చొప్పున మట్కా బెట్టింగ్ లావాదేవీలు కొనసాగుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మట్కా ప్రధాన నిర్వాహకుడు ఓ పోలీసు అధికారికి నెలకు రూ.40వేలు, ఇద్దరు కిందిస్థాయి అధికారులకు రూ.10వేల చొప్పున మామూళ్లు అందజేస్తుండటంతోనే మట్కా బెట్టింగులు మళ్లీ మొదలయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెరవెనుక కొందరు ‘పెద్దల’ హస్తం ఉండటంతో సదరు అధికారులు బెట్టింగ్ వ్యవహారాల జోలికి వెళ్లడం లేదని సమాచారం. మట్కా మహమ్మారి తాండూరు పట్టణానికి సైతం పాకినట్లు తెలుస్తోంది. పోలీసు ఉన్నతాధికారులు దృష్టిసారిస్తే మట్కా బెట్టింగులకు బ్రేక్‌పడే అవకాశం ఉంది. పోగొట్టుకుంటున్న డబ్బులే ఎక్కువ.. తెల్లవారేసరికి లక్షలు సంపాదించాలనే అత్యాశతో చాలా మంది పేద, మధ్యతరగతికి చెందినవారు మట్కా జూదానికి అలవాటుపడ్డారు. నాపరాతి కార్మికులు మట్కా బెట్టింగులతో గెలుచుకునే సొమ్ముకన్నా ఎక్కువగా పోగొట్టుకున్నట్టు తెలుస్తోంది. మట్కా జూదంలో సింగిల్, డబుల్ నంబర్లు కలిస్తే సబ్ ఏజెంట్లు రూ.10కు రూ.100 చొప్పున చెల్లిస్తున్నట్టు సమాచారం. -
క్రికెట్ బుకీలు, మట్కా నిర్వాహకుల అరెస్ట్
హిందూపురం : అనంతపురం జిల్లా హిందూపురం, లేపాక్షి ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్, మట్కా నిర్వహిస్తున్న 15 మందిని పోలీసులు సోమవారం ఉదయం అరెస్ట్ చేశారు. పక్కా సమాచారం మేరకు దాడి చేసిన పోలీసులు హిందూపురం, పరిసర ప్రాంతాలలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్ ఆడుతున్న ఏడుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1,23,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే లేపాక్షి ప్రాంతంలో మట్కా నిర్వహిస్తున్న 8 మందిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.80వేలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ సుబ్బారావు తెలిపారు. -
మట్కా జూదరుల అరెస్ట్
హిందూపురం : అనంతపురం జిల్లా హిందూపురంలోని మానెసముద్రం గ్రామంలో మట్కా స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో మట్కా ఆడుతున్న ముగ్గుర్ని అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు రూ.90 వేల నగదు, ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మట్కా జూదరుల అరెస్టు
హిందూపురం (అనంతపురం): అనంతపురం జిల్లా హిందూపురం టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం మధ్యాహ్నం మట్కా శిబిరంపై దాడి చేశారు. స్థానిక ప్రైవేట్ బస్ స్టాండ్‌లో మట్కా నడుపుతున్న ఐదుగురిని అరెస్టు చేశారు. ఆ గ్యాంగ్ నుంచి రూ.1.27 లక్షలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితులను సాయంత్రం రిమాండ్‌కు పంపనున్నారని సమాచారం. -
మట్కా నిర్వాహకులు అరెస్ట్
యలనూర్(అనంతపురం): మట్కా నిర్వహిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా యలనూర్ మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాలు.. మండల కేంద్రంలో మట్కా నిర్వహిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారివద్ద నుంచి రూ. 49,950 స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మట్కా మాయ
సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త పుంతలు సెల్ఫోన్లు, ఇంటర్నెట్ ద్వారా లావాదేవీలు కోట్లాది రూపాయలు దండుకుంటున్న బీటర్లు ఆర్థికంగా చితికిపోతున్న పేద, మధ్య తరగతి ప్రజలు మామూళ్ల మత్తులో జోగుతున్న పోలీసులు అనంతపురం క్రైం : రూపాయికి రూ.80 తగులుతుందని ఆశపెడుతూ పేద, మధ్య తరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని మట్కా జూదం సాగుతోంది. మట్కా తగలడం దేవుడుకెరుక గాని మట్కా రాపిస్తున్న బీటర్లు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నారు. మట్కా జిల్లాలో చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. దీని మాయలోపడి అనేకమంది జీవితాలు బుగ్గిపాలవుతున్నాయి. వివిధ కంపెనీల పేరుతో మట్కాను నడుపుతున్న నిర్వాహకులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నారు. ఇన్నాళ్లు చెట్లుకింద..కాలనీల శివార్లలో మట్కా రాసే బీటర్లు ఈరోజు సెల్ఫోన్లు...ఇంటర్ నెట్ సౌకర్యంతో కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఒక సారి ఈ రొచ్చులో దిగితే బయట పడడం కష్టం. ఒకమట్కా చార్టు పెట్టుకుని అంకెలగారడీ చేసుకుంటూ ఉండాల్సిందే. పలువురు ప్రభుత్వ ఉద్యోగులు సైతం దీనికి అలవాటుపడి బయటపడలేక పోతున్నారు. పోలీసులకు సవాలుగా మట్కా మట్కా ఉచ్చులో పడి వేలాది కుటుంబాలు ఆర్థికంగా చితికి పోతున్నాయి. అప్పులభారంతో ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలూ ఉన్నాయి. మట్కాను నియంత్రించాల్సిన పోలీసుశాఖ మీనమేషాలు లెక్కిస్తోందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.కొందరు కిందిస్థాయి పోలీసులు మామూళ్ల మత్తులో తూగుతున్నారు. ఫలితంగా మట్కా నిర్వాహకులు బీటర్లను ఏర్పాటు చేసుకుని రాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అనంతపురంలో పలుమార్లు మట్కా బీటర్లను పట్టుకున్న పోలీసులు వారిపై కేసులు బనాయించారు. అయితే వారి వెనుక ఉన్న వారి జోలికి మాత్రం వెళ్లలేదు. జిల్లాలో హిందూపురం, కదిరి, గుంతకల్లు, తాడిపత్రి, అనంతపురం, ఉరవకొండ, గుత్తి తదితర ప్రాంతాల్లో మట్కా జోరుగా సాగుతోంది. నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాలైన తాడిపత్రి బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్, పోలీస్ కాంప్లెక్స్, విద్యుత్ నగర్ చౌరస్తా, కళ్యాణదుర్గం రోడ్డు, బసవన్నకట్ట సమీపం, పాత కమలానగర్ తదితర ప్రాంతాల్లో సెల్ఫోన్ల ద్వారా మట్కా కార్యకలాపాలను బీటర్లు జోరుగా సాగిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు పోలీసు నిఘా వర్గాలు కూడా ఉన్నతాధికారులకు నివేదిక అందజేసినట్లు తెలిసింది. వారి కనుసన్నల్లోనే... మట్కా కార్యకలాపాలు అంతా పాత బీటర్ల కనుసన్నల్లోనే సాగుతున్నాయని తెలుస్తోంది. నిర్వాహకులు పాత బీటర్లను చేరదీసి ఇంటర్ నెట్, సెల్ఫోన్ల ఆధారంగా మట్కా నడుపుతున్నట్లు సమాచారం. ఈ విషయం పోలీసులకు తెలిసినా మట్కా వ్యవహరం ఎలా ఉన్న తమకు తమ వాటా ఇస్తే చాలన్నట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -
మట్కా బీటర్ల అరెస్ట్
రూ. 2,10,300 నగదు స్వాధీనం క్రైం (కడప అర్బన్) : జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ ఆదేశాల మేరకు కడప డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ పర్యవేక్షణలో అర్బన్ సీఐ సదాశివయ్య, ఎస్ఐలు బాల మద్దిలేటి, గౌస్ హుసేన్, టుటౌన్ ఎస్ఐలు ఎస్వీ నరసింహారావు, రోషన్లు తమ సిబ్బందితో శనివారం సాయంత్రం రవీంద్రనగర్, మార్కెట్‌యార్డు ప్రాంతాలలో మట్కా రాస్తున్న 11 మందిని రెండు సంఘటనల్లో అరెస్టు చేశారు. 11 మంది వద్దనుంచి రూ. 2,10,300 నగదు, మట్కా స్లిప్పులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కడప తాలూకా పోలీసుస్టేషన్లో శనివారం రాత్రి విలేకరుల సమావేశం నిర్వహించారు. సీఐ సదాశివయ్య మాట్లాడుతూ ఎస్పీ ఆదేశాల మేరకు 11 మంది మట్కా బీటర్లను అరెస్టు చేశామన్నారు. రవీంద్రనగర్ వద్ద అరెస్టు చేసిన వారిలో షేక్ జిలానీ, మస్తానయ్య, రాంగోపాల్, నాగప్ప, శ్రీనివాసాచారిలు ఉన్నారు. టుటౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో మార్కెట్‌యార్డు సమీపంలో ఆరుగురిని అరెస్టు చేశామన్నారు. అరెస్టు అయిన వారిలో షేక్ అన్వర్‌బాష, మహమ్మద్ అలీ, మహబూబ్‌బాష, ఖాదర్ హుసేన్, పఠాన్ అమీర్‌ఖాన్, షేక్కరీముల్లాలు ఉన్నారన్నారు. వీరంతా మట్కా రాసి నంద్యాల, జమ్మలమడుగు ప్రాంతాల్లోని వారికి ఇస్తున్నారని విచారణలో తెలిసిందన్నారు. వారిని కూడా అరెస్టు చేసేందుకు తమవంతు కృషి చేస్తామన్నారు. -
11మంది మట్కా బీటర్ల అరెస్టు
కడప క్రైం: వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలో 11 మంది మట్కా బీటర్లను పోలీసులు శనివారం సాయంత్రం అరెస్టు చేశారు. కడప అర్బన్ సీఐ సదాశివయ్య నేతృత్వంలో పోలీసులు హవేలీనగర్, మార్కెట్ యార్డు ప్రాంతంలో దాడులు చేసి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని సోమవారం కోర్టులో హాజరు పరుస్తామని సీఐ తెలిపారు. ఈ దాడుల్లో వారి వద్ద నుంచి రూ. 2.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. హవేలీ నగర్లో ఐదుగుర్ని, మార్కెట్ యార్డు సమీపంలో ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. -
ఆరోపణలు వస్తే ‘వీఆరే’ గతి!.
తాండూరు: విధి నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినా, ఆరోపణలు వచ్చినా ‘వీఆర్’ (వేకెన్సీ రిజర్వ్డ్)కు పంపిస్తానని జిల్లా ఎస్పీ ఎం.శ్రీనివాసులు హెచ్చరించారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తొలిసారిగా గురువారం తాండూరు అర్బన్ సీఐ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. జిల్లా పరిధిలోని పోలీసు అధికారులు సరిగా పని చేయకపోయినా, వారిపై ఆరోపణలు వచ్చినా సహించేది లేదని, వీఆర్‌కు పంపిస్తానని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో ఎస్ఐల బదిలీలపై ఆలోచన చేస్తామన్నారు. మట్కా బెట్టింగ్‌లు కట్టినా, నిర్వహించిన వారిపైనా రౌడీషిట్ ఓపెన్ చేస్తామన్నారు. మట్కా జూదాన్ని పూర్తిగా నిషేధిస్తామన్నారు. మట్కా, ఇసుక అక్రమ రవాణా తదితర అక్రమ కార్యకలాపాలన్నిటి కి చెక్ పెడతామని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలు నిల్వ చేస్తే లెసైన్స్‌దారులను వదిలిపెట్టమని స్పష్టం చేశారు. జనవాసాల మధ్య పేలుడు పదార్థాలు నిల్వ చేస్తే కేసులు పెట్టి జైలుకు పంపుతానన్నారు. లెసైన్స్‌దారులు నిబంధనలు పాటిస్తున్నారా..? లేదా అని స్థానిక డీఎస్పీలు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తారన్నారు. వికారాబాద్, తాండూరు తదితర ప్రాంతాల్లోని రీ క్రియేషన్ క్లబ్ కార్యకలాపాలపై త్వరలోనే సమీక్షించిన అనంతరం అనుమతించాలా? వద్దా? అనేది నిర్ణయం తీసుకుంటామని ఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. జిల్లాలో హైవే పెట్రోలింగ్‌కు వాహనం ఉన్నా ఉపయోగించడం లేదన్నారు. త్వరలోనే హైవే పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు. పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. పెండింగ్ ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్(ఎన్బీడబ్ల్యూ)లను నిత్యం ప్రతి పోలీసుస్టేషన్లో కనీసం ఒక్కటైనా క్లియర్ చేయాలన్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. జిల్లాకు కొత్తగా పది మంది మహిళా కానిస్టేబుళ్లు వచ్చారని, అవసరమైన పోలీస్స్టేషన్లలో వారికి పోస్టింగ్ ఇస్తామని ఆయన వివరించారు. తాండూరులో మహిళా, ట్రాఫిక్ పోలీసుస్టేషన్లు, వికారాబాద్‌లో ఫైరింగ్ రేంజ్ ఏర్పాటు ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని ఎస్పీ ఈసందర్భంగా చెప్పారు. అంతకుముందు ఎస్పీ తాండూరు డీఎస్పీ షేక్ ఇస్మాయిల్, సీఐ వెంకట్రామయ్య, ఎస్ఐలు నాగార్జున, అభినవ చతుర్వేదిలతో కేసుల పురోగతిపై ఆయన సమీక్షించారు. -
కాయ్ రాజా కాయ్..
మనుషులు మానసికంగా బలహీనమవుతారు... కుటుంబాలు ఛిద్రమవుతాయి... సంపాదనంతా దాని పాలే అవుతుంది.. అయినా తృప్తి ఉండదు.. మనసు అటే లాగుతుంది. ఎవరికివారు తనలో తానే మాట్లాడుకుంటారు... వేళ్లపై లెక్కలు వేసుకుంటారు.. తగిలిందా సంతోషం..లేకపోతే విషాదమే... ఇదంతా మట్కా మమమ్మారి మాయ.. కోట్లలో సాగుతున్న దందాతో నిర్వాహకులు శ్రీమంతులవుతుంటే, జూద మాడేవారు మాత్రం బికారులవుతున్నారు. ఇంత జరుగుతున్నా మన పోలీసులు మాత్రం మౌన మునులను మరిపిస్తున్నారు. దీని భావమేమి తిరుమలేశా!! ⇒ ఏటా రూ.100 కోట్లకు పైగా మట్కా దందా ⇒ బీటర్లకు రాజకీయ నేతల అండదండలు ⇒ నిజామాబాద్ కేంద్రంగా భారీ లావాదేవీలు ⇒ రోజు రోజుకూ వీధిన పడుతున్న కుటుంబాలు ⇒ గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న వ్యాపారం ⇒ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘‘వన్ అప్ టూ డౌన్... నైన్ క్లోజ్... టూ బ్రాకెట్... ఇలా వచ్చాడు. ఇక్కడ మనం దారితప్పాం’’ ఇవి మట్కా మాయలో పడి డబ్బులు తగలేసుకుంటున్న సగటు జీవి నిత్యం వల్లె వేసే మాటలు. దినసరి కూలీ మొదలు కొందరు ఉద్యోగులకు వరకు మట్కాను వ్యసనంగా మార్చుకున్నారు. ప్రతి ఒక్కరూ డబ్బు పోగొట్టుకోవడమే తప్ప సంపాదించిన దాఖలాలు లేవు.కొంతకాలం కఠినంగా వ్యవహరించిన పోలీసులు ఇటీవలి కాలంలో మట్కా వ్యాపారులను చూసీ చూడనట్లుగా వదిలేస్తుండటంతో, అమాయకుల జీవితాలు నాశనమవుతున్నాయి. నిజామాబాద్-మహారాష్ట్ర సరి హద్దు నిజామాబాద్, బోధన్, రెంజల్, ఎడపల్లి, నవీపేటతో పాటు బాన్సువాడ, వర్ని, కోటగిరి, ఆర్మూరు, పె ర్కిట్, పోచంపాడ్, బిచ్కుంద తదితర ప్రాంతాలలో మట్కా జడలు విప్పి ఆడుతోంది. పట్టణాలను, గ్రామాలను అల్లకల్లోలం చేస్తోంది. నిజామాబాద్ నగ రంలో వీధి వీధికి విస్తరించిన ఈ జూదం కుటుంబాలనే చిదిమేస్తోంది. పోలీసులు మొదట దాడులు బాగానే జరిపినా,పూర్తి స్థాయిలో నియంత్రణకు చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. నిర్వాహకుల నుంచి కొందరికి పెద్ద ఎత్తున అందుతున్న నెలవారీ మామూళ్లే ఇందుకు కారణమనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సరిహద్దులో విచ్చలవిడిగా ముఖ్యంగా సరిహద్దు గ్రామాలలో మట్కా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. అందులో ఉపయోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మట్కా వైపు యువత ఆకర్షణకు దోహదపడుతోంది. జిల్లాలో ఏడాదికి రూ.100 కోట్లకు పైగా జూదం కొనసాగుతున్నా పోలీసులు ప్రేక్షకులుగా మారుతున్నారన్న ఆరోపణలున్నాయి. ముంబాయి ప్రధాన కేంద్రంగా, మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలు కళ్యాణి, బాంబే మట్కా కంపెనీల వ్యాపారం జోరుగా కొనసాగుతోంది. ధర్మాబాద్, బిలోలి, నర్సి,నయా గామ్, పూసల్, అకోలా ప్రాంతాలకు చెందిన వ్యాపారుల దందా పోలీసులలో కలవరం కలిగిస్తోంది. జిల్లాలో నెలకు రూ. ఎనిమిది కోట్ల నుంచి రూ. పది కోట్ల మట్కా జూదం కొనసాగుతుంది. రూపాయికి తొమ్మిది రూపాయలతో నడిచే సింగిల్ డిజిట్ నంబర్, ఓపెన్, క్లోజింగ్ నంబర్లపై జూదం నడుస్తోంది.ఓపెన్, క్లోజింగ్ నంబర్లతో బ్రాకెట్ నంబర్‌కి వందరెట్ల చెల్లింపులని చెబుతారు. కార్మికుల నుంచి కాంట్రాక్టర్లు వ్యాపారుల నుంచి రాజకీయ నాయకుల వరకు ఇందులో పాత్రధారులే. ప్రభుత్వ ఉ ద్యోగులు జీతం డబ్బులు పెట్టి అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి. దశాబ్ధ కాలంగా సెల్యూలర్ ఫోన్ల వినియోగం పెరగడంతో యువకులు అధిక సంఖ్యలో మట్కాకు ఆకర్షితులవుతున్నారు. ఇప్పుడా భయం లేదు మట్కా అడ్డాలకు వెళ్లాలంటే యువకులు భయపడేవారు. ఇప్పుడా భయం లేదు. ఎందుకంటే సెల్‌ఫోన్ మెసేజ్‌ల ద్వారానే ఫలితాలు వెల్లడవుతున్నాయి. సెల్ఫోన్లో ఎస్ఎంఎస్లు, కళ్యాణి మట్కా మధ్యాహ్నం రెండు గంటలకు ఓపెనింగ్, నాలుగు గంటలకు క్లోజింగ్ నంబర్లను ప్రకటిస్తుంది. అదే విధంగా బాంబే మట్కా కంపెనీ ఓ పెనింగ్ తొమ్మిది గంటలకు, రాత్రి పన్నెండు గంటలకు క్లోజింగ్ నంబర్లను ప్రకటిస్తుంది. అర్ధరాత్రి సమయానికి వచ్చిన నంబర్లు తెలిసే సరికి ఆలస్యం కారణంగా జూదరులకు మాత్రమే మట్కా పరిమితమయ్యేది. ఆధునిక కాలంలో సమాచార వేగం వృద్ధి చెందడం, సింగిల్ డిజిట్ నంబర్ల లాటరీలపై నిషేధం ఉండడంతో ఈ మట్కా జూదంలో జూదరులతోపాటు యువకులు డబ్బులు పెట్టి నష్టపోతున్నారు. గతంలో లక్షల్లో జరిగే మట్కా వ్యాపారం ప్రస్తుతం కోట్ల రూపాయల్లో కొనసాగుతోంది. సామాన్యులే పావులు నిజామాబాద్‌లో రైల్వేస్టేషన్, మిర్చికాంపౌండ్, కోటగల్లి, మైసమ్మగడ్డ, కసాబ్‌గల్లీ, బోధన్‌లో హెడ్ పోస్టాఫీసు, రెంజల్లో బేస్ ఏరియా, ఎడపల్లి, జానకంపేట, నెహ్రునగర్ ప్రాంతాలు ‘బుకీ’లకు అడ్డాలుగా ఉన్నాయి. బాన్సువాడ, వర్ని, కోటగిరి ప్రాంతాలలో ఎక్కువగా దినసరి కూలీలు, సామాన్యులు మట్కాకు ఆకర్షితులు కాగా, దెగ్లూరు నుంచి ‘బుకీ’లు, ఏజెంట్లు వచ్చి లావాదేవీలు జరుపుతున్నారు. ఐదేళ్ల క్రితం ఆర్మూరు, పెర్కిట్, పోచంపాడ్‌లో విచ్చలవిడిగా సాగి, తగ్గిన మట్కా మహమ్మారి మళ్లీ పురుడు పోసుకుంది. కామారెడ్డి ప్రాంతానికి చెందిన పలువురు ఇతర ప్రాంతాలకు ‘కాయ్ రాజా కాయ్’ అంటూ బుకీలను ఆశ్రయిస్తున్నారు. కాగా, ఈ సరిహద్దులో జోరుగా సాగుతున్న ఈ మట్కా వ్యాపారాన్ని అంతర్రాష్ట్ర పోలీసు నిఘాతోనైనా అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
మట్కా స్థావరాలపై పోలీసుల దాడి
కాగజ్‌నగర్ టౌన్ : కాగజ్‌నగర్ పట్టణంలోని మట్కా స్థావరాలపై శనివారం సాయంత్రం పోలీసులు దాడులు నిర్వహించి, ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నగదుతోపాటు మట్కా సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ గుమ్మి చక్రవర్తి వివరాలు వెల్లడించారు. పట్టణంలోని పెట్రోల్‌పంపు, తిరందాజ్ ఏరియా, మార్కెట్ ఏరియాలలో పట్టణ సీఐ జలగం నారాయణరావు ఆధ్వర్యంలో పోలీస్ పార్టీ దాడులు నిర్వహించింది. ఇందులో మట్కా జూదం నిర్వహిస్తున్న నరేశ్, జాడి శ్రీకాంత్, స్వరాజ్, యుసుఫ్‌ఖాన్, గణపతి పట్టుపడగా, వారి వద్ద నుంచి రూ.14955లతోపాటు మట్కా సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో కొందరు గతంలో కూడా మట్కా కేసుల్లో ఉన్నారు. వారిని ఆదివారం తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేయనున్నట్లు డీఎస్సీ తెలిపారు. మట్కా జూదం వైపు వెళ్లి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. ఏఎస్సై మాదం రాజేశ్వర్, హెచ్‌సీలు సయ్యద్ సర్దార్, డి.సురే శ్ ఉన్నారు. -
మట్కాష్..!
కర్నూలు : పోలీస్ శాఖలో పని చేసి రిటైర్ అయిన ఒక పోలీస్ అధికారికి మట్కాపై దృష్టి మళ్లింది. మట్కాలో ఒక నంబర్ ఎంచుకున్నాడు. అదృష్టం కలిసి వచ్చింది. రూ.16 లక్షలు వచ్చాయి. ఆనందంతో స్నేహితులు, బంధువులు, ప్రముఖులకు భారీ ఎత్తున విందు ఇచ్చాడు. కర్ణాటక సరిహద్దులోని ఆలూరు పట్టణంలో మూడు నెలల ిందట చోటుచేసుకున్న ఈ సంఘటనతో ప్రస్తుతం ఆ ప్రాంతంలో పనిచేస్తున్న పోలీసులు కూడా రిటైర్డ్ అధికారిని ఆదర్శంగా తీసుకుని డబ్బుపై మోజుతో మట్కా ఆడేస్తున్నారు. ఆలూరు పట్టణంతో పాటు హాలహర్వి, చిప్పగిరి, హోళగుంద మండలాల్లో పనిచేసే పోలీస్ సిబ్బందితో పాటు ఇతర ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న క్షేత్రస్థాయి ఉద్యోగులు, చిన్నచిన్న పనులు చేసుకుని బతికే ప్రజలు జోరుగా మట్కా ఆడుతున్నారు. గతంలో నియోజకవర్గ, మండల కేంద్రాలకే పరిమితమైన మట్కా ప్రస్తుతం గ్రామాల్లో సైతం విచ్చలవిడిగా కొనసాగుతోంది. ఈ మాయా జూదంలో పేదలు మరింతగా నష్టపోతున్నారు. డబ్బుపై ఆశ మాయా జూదంలో చిక్కుకుపోయేలా చేస్తోంది. ఇళ్లను గుళ్ల పోలీసుల అంచనా ప్రకారం ప్రతి రోజు రూ.రెండు కోట్లపైనే చేతులు మారుతున్నాయి. జిల్లాలో రెవెన్యూ డివిజన్ కేంద్రాలుగా మట్కా కంపెనీలు నడుస్తున్నాయి. వందల సంఖ్యలో నిర్వాహకులు పని చేస్తున్నట్లు పోలీసులకు కూడా సమాచారం ఉంది. మట్కా నియంత్రణ కోసం నిఘా తీవ్రతరం చేశామని పోలీసులు ప్రకటిస్తున్నప్పటికీ తెరచాటున వ్యవహారం గుట్టుగా నడుస్తోంది. ప్రతిరోజు డే మిలన్, రతన్, మిలన్ నంబర్లు విడుదల చేస్తూ వ్యాపారాన్ని భారీగా నడిపిస్తున్నారు. మట్కా ఇలా సాగుతుంది... ఫోన్లో కోడ్ నంబర్‌తో మాట్లాడితే చాలు బీటర్లు నంబర్లను తీసుకుంటారు. ఈ మేరకు ఫోన్‌కు కూడా మెసేజ్‌లు వస్తాయి. జిల్లాలో ఇలా ఫోన్ల ద్వారా మట్కా నంబర్లు బుక్ చేసుకునే వ్యవహారం జోరుగా నడుస్తోంది. మట్కా మాయ అంతా ఆన్లైన్లోనే నడుస్తోంది. బ్యాంకులు, ఏటీఎంల ద్వారా చెల్లింపులు చేస్తూ ఎక్కడా పట్టుపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముంబయి నుంచి వచ్చే నంబర్ల ఆధారంగా చెల్లింపులు చేస్తున్నారు. జిల్లాలోని మట్కా నిర్వాహకులకు తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, బళ్లారి, బెంగళూరు కేంద్రాల్లోని నిర్వాహకులతో ఉన్న సంబంధాలతో వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. డే మిలన్ సాయంత్రం మూడు గంటలకు ప్రారంభ నంబరు(ఓపన్), అర్ధరాత్రి 12 గంటలకు ముగింపు నంబర్(క్లోజ్) విడుదల చేస్తారు. ఇలా వచ్చే నంబర్లకు 70 రెట్లు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో వివరాలు... మట్కా నంబర్ తెలుసుకోవడానికి గతంలో నిర్వాహకులు లేదా బీటర్లను ఆశ్రయించేవారు. ప్రస్తుతం ఫోన్లకు సమాచారం పంపుతున్నారు. మట్కా నిర్వాహకులు ఆన్లైన్ సేవలను కూడా వినియోగించుకుంటున్నారు. డబ్బు చెల్లించే నంబర్ ప్రతి రోజు ముంబయి నుంచి ఆన్లైన్లో వస్తుంది. మట్కాడాన్గా సీమలోనే పేరు మోసిన బుధవారపేట వాసి, పాతబస్తీ బ్రదర్స్ జిల్లా కేంద్రంతో పాటు గ్రామాలను విభజించి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. కర్నూలు, కోడుమూరు, ఆదోని, బనగానపల్లె, మంత్రాలయం, కోవెలకుంట్ల ప్రాంతాల్లో గ్రామాల్లో కూడా విచ్చలవిడిగా మట్కా కొనసాగుతోంది. ఆదోని, కౌతాళం, పెద్దహరివాణం, మంత్రాలయం, ఆలూరు, హాలహర్వి, చిప్పగిరి, హోళగుంద ప్రాంతాల వాసులు బళ్లారి, సిరుగుప్ప కేంద్రాలుగా మట్కాను నిర్వహిస్తుండగా బనగానపల్లె, కోవెలకుంట్ల ప్రాంతాల వాసులు తాడిపత్రి, గుత్తి కేంద్రాలుగా వ్యాపారాన్ని కొనసాగిస్తుండగా కోడుమూరు ప్రాంత వాసులు గుంతకల్ కేంద్రాలుగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. నంద్యాల, కర్నూలు, ఆదోని కేంద్రాలుగా కంపెనీలు నడుస్తున్నాయి. ఆయా కేంద్రాలకు అనుబంధంగా పనిచేస్తున్న బీటర్లు ముందుగానే పెద్ద మొత్తంలో డిపాజిట్ చెల్లించి ఆ మొత్తం పూర్తయ్యే వరకు సెల్ఫోన్ల ద్వారానే వ్యాపారాన్ని గుట్టుగా సాగిస్తున్నారు. కోడుమూరు, వెల్దుర్తి, బేతంచెర్ల ప్రాంతాల్లో మహిళలు కూడా బీటర్లుగా పని చేస్తున్నారు. డోన్, కోవెలకుంట్ల, కోడుమూరు ప్రాంతాల్లోని గ్రామాలకు కూడా ఈ వ్యాపారం విస్తరించింది. డోన్ పట్టణంతో పాటు ఓబులాపురం, గోసానపల్లె, జగదుర్తి, ఉడుమలపాడు, వెంకటనాయనిపల్లె, వేపదిన్నె, ప్యాపిలి, బేతంచెర్ల, వెల్దుర్తి, కోడుమూరు మండలంలో లద్దగిరి, గోరంట్ల, అల్లినగరం, బనగానపల్లె ప్రాంతంలోని పలుకూరు, యనకండ్ల, రామక్రిష్ణాపురం, కోవెలకుంట్ల ప్రాంతంలోని ముదిగేడు ప్రాంతాల్లో మట్కా జోరుగా కొనసాగుతోంది. అడపాదడపా కేసులు.. ఉన్నతాధికారులు గట్టిగా ఆదేశించినప్పుడు తామూ విధులు నిర్వహిస్తున్నామన్నట్లు పోలీసులు తరచూ దాడులు నిర్వహిస్తున్నప్పటికీ మట్కా నిర్వాహకుల వద్ద భారీ మొత్తంలో డబ్బులు దొరికినప్పటికీ వాటిని స్వాధీనం చేసుకుని తక్కువ మొత్తంలో చూపించి కేసులు బనాయిస్తున్నారు. దీంతో నిర్వాహకులు కూడా పోగొట్టుకున్న డబ్బును మళ్లీ సంపాదించుకునేందుకు మట్కా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. కర్నూలు, నంద్యాల, ఆదోని పట్టణాల్లో పోలీసు దాడులు జరుగుతాయన్న సమాచారం ముందస్తుగానే నిర్వాహకులకు చేరుతోంది. పోలీస్ శాఖలో కిందిస్థాయి సిబ్బందికి నెలవారీ మామూళ్లు చేరుతున్నాయి. దీంతో వారు దాడులకు సంబంధించి ముందస్తు సమాచారం అందుకుని మట్కా వ్యాపారులను అప్రమత్తం చేస్తున్నారు. మామూళ్ల మత్తులో ఖాకీలు కల్లూరు రూరల్: కల్లూరు మండల పరిధిలోని గ్రామాల్లో మట్కా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా నడుస్తుంది. రోజుకు లక్షల్లో మట్కా వ్యాపారం నిర్వహిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఒక్క రూపాయికి 100 రూపాయలు వస్తాయనే అత్యాశతో అమాయక ప్రజలు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఉలిందకొండలో ఒక వృద్ధుడు, పెద్దటేకూరులో ఒక యువకుడు వెనక ఉండి వ్యవహారాన్ని చక్కబెడుతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు వారి కింద పనిచేసే వ్యక్తులకు రోజుకు రూ.500 నుంచి రూ.1000 ఇచ్చి మట్కా రాయిస్తున్నారు. వీరి వ్యాపారానికి అడ్డుపడకుండా పోలీసులకు నెలకు రూ.30 వేలు ఇస్తున్నట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఉలిందకొండ, చిన్నటేకూరు, పెద్దటేకూరు, ముజఫర్‌నగర్, కృష్ణానగర్, కల్లూరు ప్రాంతాలలో ఏజెంట్లను నియమించి ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. మట్కా వల్ల చాలా గ్రామాల్లోని జనం రోడ్ల మీద పడుతున్నా పోలీసులలో చలనం కలగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మట్కాలో రతన్ అనే క్రీడ 6 రోజులు, మిలాన్ అనే క్రీడ 5 రోజులు ఆడుతూ వీటితో పాటు కొత్తగా మరికొన్ని ఆటలను రంగంలోకి దించారు. -
ప్రజల చెంతకే పోలీసు వ్యవస్థ
నెల్లూరు(క్రైమ్): పోలీసు సేవలను ప్రజలకు మరింత దగ్గర చేస్తున్నామని ఎస్పీ ఎస్.సెంథిల్‌కుమార్ వెల్లడించారు. నెల్లూరులోని ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్ హాలులో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలీసుల సేవలను మరింత విస్తృతం చేసి ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలను అందేలా చర్యలు చేపట్టామన్నారు. అసాంఘిక శక్తుల ఆగడాలను పూర్తిగా నిర్మూలించేందుకు చేపట్టిన చర్యల్లో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. తమ ప్రాంతాల్లో ఎర్రచందనం అక్రమ రవాణా, గుట్కా, మట్కా, క్రికెట్ బెట్టింగ్, ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్, వ్యభిచారం, రౌడీయిజం, అరాచకశక్తుల ఆగడాలపై ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదన్నారు. వారి కోసం 94946 26644 నంబర్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఈ నంబర్ 24 గంటలూ అందుబాటులో ఉంటుందన్నారు. ఏదేని సమాచారాన్ని ఎస్ఎంఎస్, వాట్సాప్ ద్వారా కూడా తెలియజేయవచ్చన్నారు. మిస్డ్ కాల్ ఇచ్చినా వెంటనే తమ సిబ్బంది కాల్ చేసి సమాచారం తీసుకుంటారన్నారు. ఫేస్‌బుక్‌లోని ‘నెల్లూరు పోలీసు’కు సమాచారం ఇవ్వవచ్చన్నారు. సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. నేరరహిత సమాజ ఏర్పాటులో భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పోలీసు అధికారులు, సిబ్బంది సైతం దీనిపై విసృ్తత ప్రచారం కల్పించాలన్నారు. ఇప్పటికే డయల్ 100, 1090, నెల్లూరు పోలీసు ఫేస్బుక్ అకౌంట్‌కు అనేక ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. వాటిని పరిశీలించి కేసులు సైతం నమోదు చేస్తున్నామన్నారు. 94946 26644నంబర్‌కు తప్పుడు ఫిర్యాదులు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఫోన్ నంబర్ సేవలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రెడ్డి గంగాధర్‌రావు, డీఎస్పీలు బి.వి రామారావు, వీఎస్ రాంబాబు, శ్రీనివాసరావు, మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
మింగేస్తున్న మట్కా...
- జిల్లాలో మట్కా జూదానికి బానిసలై బలైపోతున్న సామాన్యులు - లక్షాధికారులవుతున్న నిర్వాహకులు - పక్కా సమాచారమున్నా.. పట్టించుకోని పోలీసులు గిద్దలూరు : జిల్లాలో మట్కా జూదం చాపకింద నీరులా విస్తరిస్తోంది. కొన్నేళ్ల క్రితం జిల్లావ్యాప్తంగా ఎంతోమంది జీవితాలను నాశనం చేసిన ఈ జూదం.. తాజాగా మళ్లీ సామాన్యులను మింగేస్తోంది. పశ్చిమ ప్రకాశంతో పాటు జిల్లాలోని అనేక ప్రాంతాలకు విస్తరించి పేదల జీవితాలతో చెలగాటమాడుతోంది. దీనికి బానిసలై ఎంతోమంది సర్వం కోల్పోయి బికారులవుతుండగా నిర్వాహకులు మాత్రం లక్షాధికారులవుతున్నారు. నిర్వాహకులపై పోలీసులకు పక్కా సమాచారం ఉన్నప్పటికీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మట్కా జూదమంటే... ముంబై కేంద్రంగా నడిచే చట్ట విరుద్ధమైన జూదం పేరే మట్కా. ఈ జూదం ఆడేందుకు ఆన్లైన్ వెబ్సైట్లో లాగిన్ అవడంతో పాటు స్థానికంగా నిర్వాహకులను సంప్రదిస్తుంటారు. జూదం ఆడేవారు 10 నుంచి 99 వరకూ ఏదోక నంబర్‌ను ఎంపిక చేసుకుంటారు. దానిపై రూపాయి నుంచి లక్షల రూపాయల్లో పందెం కడతారు. రాత్రి సమయంలో ముంబై కేంద్రం నుంచి విడుదల చేసే గేమ్నంబర్.. ఆడేవారు ముందుగానే ఎంపిక చేసిన నంబర్ ఒకటే అయితే రూపాయికి 70 రూపాయల చొప్పున నిర్వాహకులు చెల్లిస్తారు. కనీసం మొదటి అంకె సరిపోలినా రూపాయికి 10 రూపాయల చొప్పున చెల్లిస్తారు. లేకుంటే పందెం కాసిన నగదు పోయినట్టే. ఇలా ప్రతిరోజూ ఒక నంబర్‌పై పందెం కాస్తుంటారు. దానికి సంబంధించి అసలు నంబర్లో మొదటి అంకెను ముంబై నుంచి రాత్రి 11 గంటల సమయంలో, రెండో అంకెను 12 గంటల తర్వాత విడుదల చేస్తారు. రోజుకు రూ.25 లక్షల వరకూ పందేలు... పూర్తిగా చట్టవ్యతిరేకమైన ఈ జూదానికి జిల్లాలోని ఎంతోమంది బానిసలు కావడంతో రోజుకు 25 లక్షల రూపాయల వరకూ జిల్లాలో పందేలు నడుస్తున్నాయి. రోజుకు ఈస్థాయిలో జిల్లావాసులు నష్టపోతుండగా నిర్వాహకులు మాత్రం లక్షల రూపాయలకు పడగలెత్తుతున్నారు. రాజకీయ నాయకుల అండదండలతో పాటు పోలీసుల సహకారంతోనే నిర్వాహకులు ఈ జూదాన్ని క్రమంగా విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. మట్కా నిర్వాహకులను కొందరు అవినీతి పోలీస్ అధికారులు ప్రోత్సహిస్తున్నారన్న విషయం జిల్లాలో బహిరంగ రహస్యంగా మారింది. దీనివల్లే గతంలో రోజుకు 10 లక్షల రూపాయల వరకూ సాగే మట్కా జూదం..ప్రస్తుతం 25 లక్షల రూపాయల వరకూ పెరిగినట్లు సమాచారం. పశ్చిమానే రూ.10 లక్షల్లో పందేలు... జిల్లాలో మట్కా జూదానికి సంబంధించి రోజుకు 25 లక్షల రూపాయల పందేలు జరుగుతుండగా, ఒక్క పశ్చిమ ప్రకాశంలోనే 10 లక్షల రూపాయల వరకూ పందేలు కాస్తున్నారు. ప్రధానంగా పశ్చిమ ప్రకాశంలోని గిద్దలూరు నియోజకవర్గంలో సగానికిపైగా గ్రామాల్లో మట్కా జూదం నిరాటంకంగా సాగుతోంది. గిద్దలూరు పట్టణంలోని పాములపల్లె రోడ్డు, కుమ్మరామంకట్ట, గాంధీ బొమ్మ సెంటర్, రాచర్ల రోడ్డు, కొంగళవీడురోడ్డు, ముండ్లపాడు, కేఎస్ పల్లె, కొత్తపల్లె, రాచర్ల మండలంలోని గుడిమెట్ట, రామాపురం, సోమిదేవిపల్లె, యడవల్లి, కొమరోలు మండలంలోని గుండ్రెడ్డిపల్లె, తాటిచర్లమోటు, కంభం ఇలా అన్ని గ్రామాల్లో మట్కా జూదం నిర్వాహకులున్నారు. రోజువారీ కూలి కోసం పనిచేసే కూలీల నుంచి ఆటోడ్రైవర్లు, ఇతర వ్యాపారస్తులు, సంపన్నులు సైతం ఎవరిస్థాయికి తగ్గుట్టు వారిస్థాయిలో రూపాయి నుంచి లక్షల రూపాయల్లో పందేలు కాస్తుంటారు. కళాశాల విద్యార్థులు సైతం ఈ జూదానికి బానిసలవుతున్నారంటే పరిస్థితిని అర్థంచేసుకోవచ్చు. ఇప్పటికే ఎంతోమంది జీవితాలను బుగ్గిపాలు చేసిన ఈ జూదానికి మరింత మంది బలైపోకముందే పోలీసులు మేల్కొని నిర్వాహకులపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. -
తెగబడ్డ తెలుగు తమ్ముళ్లు
- ప్రయివేట్ పాఠశాలల్లో ఉచిత సీట్లు ఇవ్వాలని అల్టిమేటం - మట్కా బీటర్లనూ వదలని టీడీపీ చోటా నేతలు - పులివెందులలో అధికారులపై రాజకీయ పెత్తనం - చంద్రబాబుకు ఫిర్యాదు చేసే యోచనలో టీడీపీ కీలక నేతలు కడప: పులివెందులలో అప్పుడే అధికార పార్టీ నేతల ఆగడాలు మొదలయ్యాయి. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటంతో పాటు మట్కా బీటర్లను, జూద నిర్వాహకులను మామూళ్లకోసం బెదిరిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీట్లు ఇవ్వాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. అధికారులను తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆది నుంచి పులివెందుల ప్రజలు వైఎస్ కుటుంబానికే పట్టం కడుతూ వస్తున్నారు. వైఎస్ కుటుంబంపై ఉన్న ప్రజాభిమానాన్ని ఓర్వలేక కొంతమంది టీడీపీ నాయకులు కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టారు. 2009లో వైఎస్ మరణానంతరం పులివెందులపై అప్పటి ప్రభుత్వం శీతకన్ను వేసి నిధులు విడుదల చేయలేదు. ఆ తర్వాత ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పోలీసుల ద్వారా వైఎస్సార్సీపీ కార్యకర్తలను అణచివేసే చర్యలకు ఉపక్రమించారు. పులివెందుల నియోజకవర్గంలో జరిగిన సర్పంచ్ ఎన్నికలతోపాటు మున్సిపల్, స్థానిక ఎన్నికలలో వైస్సార్ కాంగ్రెస్‌పార్టీ భారీ ఆధిక్యత ముందు కనీసం టీడీపీ పరువు కూడా దక్కించుకోలేకపోయింది. సార్వత్రిక ఎన్నికల్లో ూడా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డిలకు పులివెందుల ప్రజలు 80వేల పైచిలుకు మెజార్టీ అందించారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలను వేధించడమే లక్ష్యంగా పలువురు టీడీపీ నేతలు పావులు కదుపుతున్నట్లు స్పష్టమవుతోంది. మట్కా బీటర్లనూ వదలని టీడీపీ చోటా నేతలు : ‘నవ్విపోదురుగాక.. నాకేటి సిగ్గు’ అన్న చందంగా పలువురు తెలుగుత మ్ముళ్లు ఎక్కడ పడితే అక్కడ ఆదాయమే పరమావధిగా తెగబడుతున్నారు. నీకు మట్కా.. నాకు గ్యాంబ్లింగ్ అంటూ పలువురు చోటా నేతలు పంపకాలకు తెర తీస్తున్నారు. పులివెందులలో మట్కా, జూదం, మొబైల్ గ్యాంబ్లింగ్‌లు నిర్వహిస్తున్న వారిని టీడీపీ నేతలు బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఏకంగా అధికారం వచ్చిన వారం రోజుల్లోపే పట్టణంలో మట్కా రాస్తున్న వారి వద్దకు వెళ్లి నెలనెలా మామూళ్లు ఇవ్వాలని బెదిరించిన పర్వం వెలుగులోకి వచ్చింది. పైగా మట్కా రాస్తుండగా వచ్చిన సొమ్మునంతా కూడా బీటరు నుంచి కొంతమంది చోటా,మోటాలు లాక్కెళ్లినట్లు పట్టణంలో ప్రచారం జరుగుతోంది. దీంతో బెంబేలెత్తిన కొంతమంది కంపెనీ మట్కా బీటర్లు ఏకంగా కొద్దిరోజులపాటు పులివెందుల విడిచి వెళ్లారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో ఇట్టే అర్థమవుతోంది. పోలీసులకు తెలిసినా పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. కొంతమంది పోలీసులు ఏకంగా మామూళ్లు తీసుకొని మట్కా ఆడిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. టీడీపీ కార్యకర్తలు వ్యవహరిస్తున్న తీరుతోపాటు పోలీసులు పట్టించుకోని వైనంపై త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేయాలని టీడీపీలో కొంతమంది కీలక నేతలు సిద్ధమయ్యారు. రెండు మూడు రోజుల్లో హైదరాబాద్‌లో సీఎంను కలిసి పులివెందులలో జరుగుతున్న మొత్తం పరిస్థితులను చంద్రబాబుకు వివరించనున్నట్లు తెలిసింది. అంతేకాకుండా ఇప్పటికే జిల్లా ఎస్పీకి కూడా టీడీపీలోని కొంతమంది నేతలు మట్కా వ్యవహారంపై ఫిర్యాదు చేసినట్లు భోగట్టా. ప్రయివేట్ పాఠశాలల్లో ఉచిత సీట్లు ఇవ్వాలని అల్టిమేటం : పులివెందులలోని ప్రయివేట్ పాఠశాల యాజమాన్యాలకు కూడా ఉచిత సీట్లు ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి పేరుతో అల్టిమేటం ఇచ్చారు. దాదాపు 60నుంచి 70సీట్లు కావాలని కోరినట్లు తెలిసింది. టీడీపీ ఆఫీసు నుంచి పంపించే లిస్ట్‌లోని విద్యార్థులను చేర్చుకోవాలని కోరగా.. ప్రయివేట్ యాజమాన్యాలు అన్ని సీట్లు ఇవ్వలేమని చేతులెత్తేసినట్లు తెలియవచ్చింది. అధికారులపై రాజకీయ పెత్తనం : అధికారం ఉంది కదా అని టీడీపీ నాయకులు అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారు. ఈ పోస్టు మాకే కావాలని కొందరు.. ఉన్న పోస్టులను రద్దు చేయండని మరికొందరు చేస్తున్న రాజకీయ ఒత్తిడులతో అధికారులు బెంబేలెత్తుతున్నారు. పులివెందుల ప్రాంతంలో ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, జెడ్పీటీసీలతోపాటు మున్సిపల్, ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్న వైఎస్సార్సీపీ నేతలు ఇలా ఎప్పుడు ఒత్తిళ్లకు గురి చేయలేదని.. ప్రతి దానికి టీడీపీ చోటా నేతలు వచ్చి కార్యాలయాల్లో బెదిరించడం తగదని పలువురు అధికారులు వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే మూకుమ్మడిగా సెలవులో వెళ్లడానికి కూడా సిద్ధమని పలువురు అధికారులు పేర్కొన్నారు. -
ఇద్దరు దొంగలు అరెస్ట్: 40 తులాల బంగారం స్వాధీనం
విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నంలో మంగళవారం ఇద్దరు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 40 తులాల బంగారం, అరకిలో వెండిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు మంగళవారం తనిఖీల్లో భాగంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని నర్సీపట్నం పోలీసు స్టేషన్‌కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలోని ఆదోనిలో మంగళవారం మట్కా నిర్వహకుడిని పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ. 6.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని ఆదోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే పోలీసులు అతడి స్కార్పియో వాహనాన్ని స్టేషన్‌కు తరలించి సీజ్ చేశారు. మట్కా నిర్వహకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.