
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం మట్కా. కరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పోటీకి రెడీ అయింది. కోలీవుడ్ స్టార్ సూర్య మూవీ కంగువాతో బాక్సాఫీస్ బరిలో నిలిచింది. మట్కా, జూదం నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవల వైజాగ్‌లో మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున నిర్వహించారు.
తాజాగా మట్కా టీమ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సినిమా విడుదలకు ఒక రోజు ముందు టీమ్ అంతా కలిసి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. మూవీ సూపర్ హిట్ కావాలని ప్రత్యేక పూజులు చేశారు. వీరికి ఆలయ పండితులు మర్యాదలతో సత్కరించారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ప్రస్తుతం వరుణ్ తేజ్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఇవాళ తిరుపతిలోని ఎన్‌విఆర్ సినిమాస్‌లో జరిగే ఈవెంట్‌కు హాజరుకానున్నారు. కాగా.. పీరియాడిక్ క్రైమ్ డ్రామాగా వస్తోన్న మట్కా చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ భామ నోరా ఫతేహి కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీతో తెలుగులో నోరా ఫతేహీ అరంగేట్రం చేయనుంది. మట్కా జూదగాడైన రతన్ ఖేత్రి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సలోని అశ్వని, సత్యం రాజేష్, పి రవిశంకర్, కిషోర్, నవీన్ చంద్ర,అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు.
Mega Prince #VarunTej and #Matka team at Tirumala Tirupati Devasthanam. pic.twitter.com/poJsm8diW5
— Filmyscoops (@Filmyscoopss) November 13, 2024
Comments
Please login to add a commentAdd a comment