పోలీసులకే రక్షణ లేకపోతే ఎలా? | Matka runners attack police in Tadipatri | Sakshi
Sakshi News home page

పోలీసులకే రక్షణ లేకపోతే ఎలా?

Published Mon, Dec 31 2018 11:05 AM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మట్కా మాఫియా రెచ్చిపోయింది. జేసీ అనుచరుడైన మట్కా నిర్వాహకుడిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులపైనే ఏకంగా దాడికి దిగి చితకబాదారు. ఇంట్లో బంధించి కర్రలతో ఇష్టమొచ్చినట్లుగా కొట్టారు. పోలీసులు వచ్చిన వాహనానికి సైతం నిప్పు పెట్టి తగలబెట్టారు. ఈ ఘటనలో సీఐతో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. ఇటీవల తాడిపత్రిలోని పడమటి గేరికి చెందిన మట్కా నిర్వాహకుడు కట్లపొడి సాధిక్‌ను, వైఎస్సార్‌ జిల్లా ఎర్రముక్కపల్లెకు చెందిన మట్కా రామయ్య, ప్రొద్దుటూరుకు చెందిన పూజల చౌడయ్య, లక్ష్మయ్య, జమ్మలమడుగు పట్టణానికి చెందిన వెంకటదశావరెడ్డి, ఎర్రగుంట్ల మండలం పొట్లదుర్తికి చెందిన శ్రీనివాసులతో పాటు మరికొందర్ని కడప పోలీసులు ఈనెల 21న అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో మట్కా నిర్వాహకుడైన సాధిక్‌.. తమ డాన్‌ రషీద్‌ పేరును వెల్లడించాడు. రషీద్‌ టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రధాన అనుచరుడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement