మట్కానివారణకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ | Special Task Force for Matka prevention | Sakshi
Sakshi News home page

మట్కానివారణకు స్పెషల్ టాస్క్ ఫోర్స్

Published Fri, Jun 10 2016 3:03 AM | Last Updated on Tue, Oct 16 2018 2:30 PM

మట్కానివారణకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ - Sakshi

మట్కానివారణకు స్పెషల్ టాస్క్ ఫోర్స్

యువ కానిస్టేబుళ్లతో ప్రత్యేక టీం ఎస్పీ నవీన్‌కుమార్

 తాండూరు రూరల్ : జిల్లాలో మట్కా నివారణకు యువ కానిస్టేబుళ్లతో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ టీంను ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ భట్టు నవీన్ కుమార్ అన్నారు. గురువారం సాయంత్రం కరన్‌కోట్ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఆత్మహత్యల నివారణకు పోలీసుల ఆధ్వర్యంలో కళాజాత కార్యక్రమాలతో పాటు సైకాలజిస్టులతో ప్రత్యేక కౌన్సెలింగ్ ఏర్పాటు చేస్తామన్నారు.

జిల్లాలోని ఠాణాలను సందర్శించి నేరాలకు సంబంధించి నివేదికల ను తయారు చేస్తున్నామని, క్రైం రేటును ఏవిధంగా తగ్గించాలనే విషయమై కార్యాచరణ చేపడతామన్నారు. రోడ్డు ప్రమాదాల విషయమై వాట్సాప్ ద్వారా సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు ఎస్పీ కరన్‌కోట్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం ఎస్పీ నవీన్‌కుమార్ పట్టణంలోని పోలీస్‌స్టేషన్ కూడా సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ చందనదీప్తి, రూరల్ సీఐ సైదిరెడ్డి, పట్టణ సీఐ వెంకట్రామయ్య, ఎస్‌ఐలు రేణుకారెడ్డి,చంద్రకాంత్, నాగార్జున ఉన్నారు.

 ఇసుక రవాణాలో కఠినంగా ఉండండి
యాలాల : ఇసుక అక్రమ రవాణా విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ నవీన్‌కుమార్ అన్నా రు. గురువారం యాలాల పోలీస్‌స్టేష న్‌ను ఆయన సందర్శించారు. ముందు గా పీఎస్‌లోని రిసెప్షన్ సెంటర్‌ను పరిశీలించి పీఎస్‌కు ఎటువంటి కేసులు వస్తున్నాయి? బాధితుల విషయంలో ఎలా వ్యవహరిస్తున్నారు? అన్న విషయాన్ని ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఆత్మహత్య చేసుకున్న ఎస్‌ఐ రమేష్ వివరాలను ఎస్పీ నవీన్‌కుమార్ ఏఎస్పీ చందనదీప్తిని అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ వెంట రూరల్ సీఐ సైదిరెడ్డి, ఎస్‌ఐ - 2 మల్లారెడ్డి తదితరులు ఉన్నారు.

 సీసీ కెమెరాలతో సరిహద్దు నిఘా
బషీరాబాద్ : సీసీ కెమెరాలతో సరిహ ద్దు గ్రామాల్లో నిఘా ఏర్పాటు చేస్తామ ని ఎస్పీ నవీన్ కుమార్ అన్నారు. గురువారం బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌ను ఆయన ఏఎస్పీ చందనదీప్తితో కలిసి సందర్శించారు. స్టేషన్‌లోని పోలీసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రూ.70 లక్షలతో నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు.  అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో ఉన్న పోలీస్ స్టేషన్ల పరిధిలో నేరాలను అదుపులోకి తీసుకువచ్చేందు కు త్వరలో కర్ణాటక పోలీసు అధికారులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. సరిహద్దు గ్రామాల్లో సీసీ కెమేరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు శాంతి భద్రతలను పర్యవేక్షిచేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీతో పాటు సీఐ సైదిరెడ్డి, ఎస్‌ఐ అభినవ చతుర్వేది తదితరులున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మొక్కలు నాటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement