Special Task Force
-
భారీ ఆపరేషన్.. ఐసిస్ ఇండియా చీఫ్, సహాయకుడు అరెస్ట్
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ ఇండియా చీఫ్ హరీస్ ఫారూఖీ అరెస్ట్ అయ్యారు. ఆయనతో పాటు ఐసిస్‌కు చెందిన మరో వ్యక్తి(సహాయకుడు)ని అదుపులోకి తిసుకున్నట్లు అస్సాం స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) బుధవారం వెల్లడించింది. ఎన్ఐఏ జాబితా మోస్ వాంటెడ్‌గా ఉన్న హరీస్ ఫారూఖీ బంగ్లాదేశ్ నుంచి అస్సాంలోని ధుబ్రీలో ప్రవేశించి విధ్వంస కార్యకలపాలకు పాల్పడుతున్నట్లు ఎస్టీఎఫ్ టీంకు సమాచారం అందింది. దీంతో ఎస్టీఎఫ్ టీం చేపట్టిన భారీ ఆరేషన్లో హరీస్ ఫారూఖీ పట్టుబడ్డారు. బంగ్లాదేశ్‌లో ఉంటూ భారత్‌లోని అస్సాం ధుబ్రీ ప్రాంతంలో విధ్వంస కార్యకలాపాలకు పాల్పడాలని ప్రణాళిక వేస్తున్నట్లు ఎస్టీఎఫ్ పోలీసులు గుర్తించారు. హరీష్ ఫారూఖీ అలియాస్ హరీష్ అజ్మల్ ఫారూఖీ భారత ఐసిస్ చీఫ్‌గా ఉన్నారు. అయనతో పాటు మరో వ్యక్తి రెహ్మన్‌ను భారీ ఆపరేషన్ చేపట్టి ఆరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ‘మా బృందానికి నమ్మదగిన సమాచారం అందింది. ఇండియా-బంగ్లాదేశ్ సరిహద్దులో ఐసిస్ ఉగ్రవాదులు ఉన్నరని మేం కూడా నిర్ధారించుకున్నాం. వారు సరిహద్దును దాటే సమయంలో మా టీం ఉదయం వారిని పట్టుకొని అరెస్ట్ చేసింది’ అని స్పెష్ల్ టాస్క్ ఫోర్స్ ఐజీ పార్థసారధి మహంతా తెలిపారు. ఐసిస్ విస్తరణలో భాగంగా.. భారత్‌లో నియామకాలు చేపట్టడానికి కుట్ర పన్నుతున్నారని తెలిపారు. పలు చోట్ల ఉగ్రవాద కార్యకలాపాల కోసం నిధుల సేకరణ, ఐసిస్ కార్యకలాపాలు విస్తరించడానికి ప్రయత్నిస్తున్నారని ఐజీ పార్థసారధి వెల్లడించారు. ఢిల్లీ, లక్నో ప్రాంతాల్లో హరీష్ ఫారూఖ్ మీద పలు ఎన్ఐఏ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. తదుపరి చర్యలు తీసుకోవటం కోసం అరెస్ట్ చేసిన ఐసిస్ ఉగ్రవాదులను ఎన్ఐఏకు అప్పగించినట్లు అస్సాం స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. చదవండి: బీజేపీతో పొత్తు: లోక్‌సభ బరిలో దినకరన్ పార్టీ.. ఎన్ని సీట్లంటే? -
బ్రిటన్–భారత్ పరిశ్రమల టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
లండన్: స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) సాకారం అయ్యే దిశగా పరిశ్రమల మధ్య సహకారాన్ని మరింత పెంపొందించుకునే ఉద్దేశంతో భారత్, బ్రిటన్ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశాయి. కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్రిటీష్ ఇండస్ట్రీ (సీబీఐ), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) కలిసి ఈ జాయింట్ కమిషన్‌ను ఏర్పాటు చేశాయి. ఇరు దేశాలకూ ప్రయోజనం చేకూర్చే విధంగా ఎఫ్‌టీఏను తీర్చిదిద్దేందుకు అవసరమైన అంశాలపై చర్చించేందుకు ఇది వేదికగా ఉంటుందని సీబీఐ ప్రెసిడెంట్ లాార్డ్ కరణ్ బిలిమోరియా తెలిపారు. కోవిడ్, ఉక్రెయిన్ సంక్షోభ ప్రభావాల నుంచి ఇరు దేశాలు కోలుకునే క్రమంలో వాణిజ్యం, పర్యావరణం, ఆరోగ్య రంగం మొదలైన విభాగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవడంపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎఫ్‌టీఏ సాకారమైతే 2035 నాటికి బ్రిటన్–భారత్ మధ్య వాణిజ్యం 28 బిలియన్ పౌండ్లకు చేరుతుందని అంచనా. ప్రస్తుతం ఇది 23 బిలియన్ పౌండ్ల స్థాయిలో ఉంది. -
వంటింటికి ఊరట.. రైతు బజార్లలో వంటనూనె విక్రయాలు
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ పరిణామాల కారణంగా బహిరంగ మార్కెట్లో వంట నూనెల ధరలు మండిపోతుండటంతో ఆ సెగ నుంచి ప్రజలకు ఊరట కల్పిస్తూ రైతు బజార్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విక్రయాలు చేపట్టింది. కాగుతున్న నూనెల ధరలను నియంత్రించేందుకు కృత్రిమ కొరత సృష్టించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అధికారులు ప్రత్యేక బృందాల ద్వారా హోల్‌సేల్, రిటైల్ షాపుల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. బ్లాక్ మార్కెట్‌కు తరలించే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. సీఎస్ సమీర్‌శర్మ ఆదేశాల మేరకు మార్కెటింగ్ కార్యదర్శి వై.మధుసూదన్‌రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ నిత్యం మార్కెట్లో వంట నూనెల ధరలను సమీక్షిస్తోంది. మరోవైపు ధరలను అందుబాటులో ఉంచేందుకు ఏపీ ఆయిల్‌ఫెడ్‌ను ప్రభుత్వం రంగంలోకి దించింది. రైతుబజార్లలో నాణ్యమైన విజయ వంట నూనెలను విక్రయిస్తున్నారు. గతంలోనూ ఉల్లి ధరలు, టమాటాల రేట్లు భారీగా పెరిగిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతు బజార్ల ద్వారా అందుబాటు ధరల్లో విక్రయాలు చేపట్టి వినియోగదారులకు ఊరట కల్పించడం తెలిసిందే. అది మరింత ‘ప్రియ’ం ఉక్రెయిన్–రష్యా యుద్ధం ప్రభావం పలు రకాల ఉత్పత్తులతోపాటు వంట నూనెలపైనా పడింది. 40 రోజుల క్రితం లీటర్ సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ.170–175, పామాయిల్ రూ.158–160, వేరుశనగ నూనె రూ.170–173, రైస్ బ్రాన్ ఆయిల్ రూ.170– 172 ఉన్నాయి. మార్కెట్లో డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఎమ్మార్పీ ధరలపై ప్రముఖ సూపర్ మార్కెట్లలో ఐదు నుంచి పది శాతం డిస్కౌంట్‌తో విక్రయాలు నిర్వహిస్తుంటారు. మార్చి మొదటి వారంలో ప్రముఖ ఆయిల్ కంపెనీలు ప్రకటించిన ఎమ్మార్పీ ధరలను పరిశీలిస్తే పామాయిల్‌తో సహా నూనెలన్నీ లీటర్ రూ.200 పైనే పలుకుతున్నాయి. మిగిలిన కంపెనీల ధరలతో పోలిస్తే ప్రియా నూనె ధరలు తారస్థాయిలో ఉన్నాయి. రైతు బజార్లలో ‘విజయ’ నూనెలు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు వంట నూనెలను అందుబాటులో ఉంచే లక్ష్యంతో ఏపీ ఆయిల్ ఫెడ్ రంగంలోకి దిగింది. రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా విజయ నూనెలను విక్రయిస్తున్నారు. సరఫరాలో ఎక్కడా ఆటంకం లేకుండా విజయ డిస్ట్రిబ్యూటర్లను సమీప రైతుబజార్లతో అనుసంధానించారు. ధరల్లో వ్యత్యాసాన్ని తెలియచేస్తూ ప్రత్యేకంగా బోర్డులను ప్రదర్శిస్తున్నారు. ధర తక్కువ.. నాణ్యమైన నూనె ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో రూ.200 నుంచి రూ.265 వరకు పలుకుతున్న పామాయిల్, సన్‌ఫ్లవర్, వేరు శనగ, రైస్‌బ్రాన్ నూనెలను రైతు బజార్లలో రూ.163 నుంచి రూ.178కే అందుబాటులో ఉంచారు. ఎలాంటి కోటా లేకుండా విక్రయిస్తున్నారు. ఇప్పటివరకు 61 ప్రధాన రైతుబజార్లలో విక్రయాలను ప్రారంభించారు. వీటిలో 27 చోట్ల విజయ ఆయిల్ అవుట్‌లెట్స్ ఉండగా మిగిలిన చోట్ల రైతుబజార్లలోని ఇతర దుకాణాల ద్వారా విక్రయిస్తు న్నారు. లీటర్ పామాయిల్ రూ.163, రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ.178, వేరుశనగ, రైస్‌బ్రాన్ నూనెలు రూ.170 చొప్పున విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ ఆయిల్ ఫెడ్ వద్ద సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయి. అవసరమైతే మరిన్ని నిల్వలు సేకరించైనా ప్రజలకు వంటనూనెలు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టారు. మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకు లభ్యం కావడంతోపాటు నాణ్యత బాగుందని వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందుబాటులో వంటనూనెలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రైతుబజార్లలో కౌంటర్లు ఏర్పాటు చేసి వంట నూనెలు విక్రయిస్తున్నాం. బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే లీటర్ రూ.37 నుంచి రూ.87 తక్కువ ధరకే విజయ నూనెలను అందుబాటులో ఉంచాం. ధరలు అదుపులోకి వచ్చేవరకు విక్రయాలు కొనసాగుతాయి. –చవల బాబూరావు, ఎండీ, ఏపీ ఆయిల్ ఫెడ్ ఇతర కంపెనీలను ప్రోత్సహిస్తే చర్యలు మార్కెట్లో ధరలను నియంత్రించేందుకు రైతు బజార్ల ద్వారా వంట నూనెల విక్రయాలను ప్రారంభించాం. ధరల్లో వ్యత్యాసం తెలియచేసేలా రైతుబజార్లలో బోర్డులు ప్రదర్శిస్తున్నాం. విజయ నూనెలను కాకుండా అధిక ధరలు కలిగిన ఇతర కంపెనీల నూనెల విక్రయాలను ప్రోత్సహిస్తే చర్యలు తీసుకుంటాం. – బి.శ్రీనివాసరావు, సీఈవో, రైతు బజార్లు నాణ్యత బాగుంది.. రోజురోజుకు పెరుగుతున్న వంట నూనెల ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం రైతుబజార్లలో కౌంటర్లు ఏర్పాటు చేసి తక్కువ ధరకే విజయ నూనె విక్రయాలు చేపట్టటాన్ని స్వాగతిస్తున్నాం. భవానీపురం రైతు బజార్లో లీటర్ రూ.170 చొప్పున రెండు వేరుశనగ నూనె ప్యాకెట్లు కొనుగోలు చేశా. నాణ్యత చాలా బాగుంది. –వి.వెంకటలక్ష్మి, భవానీపురం, విజయవాడ ఎంతో ఊరట.. మార్కెట్లో నూనె ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రైతు బజార్లలో తక్కువ ధరకే అందుబాటులో ఉంచడం ఎంతో ఊరటనిస్తోంది. ఎన్ని కావాలంటే అన్ని ఇస్తున్నారు. భవానీపురం రైతు బజార్లో ఆయిల్ చాలా బాగుంది. ఉల్లి, టమాటా ధరలు పెరిగిన ప్పుడు కూడా ఇదే రీతిలో రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయించారు. –వన్నంరెడ్డి సురేష్, రామలింగేశ్వరనగర్, విజయవాడ -
మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ ఆటకట్టించిన పోలీసులు..
పట్నా: గత కొంత కాలంగా బిహర్ పోలీసులకు కంటిమీదకునుకు లేకుండా చేసిన గ్యాంగ్‌స్టర్ మున్న మిశ్రాను బిహర్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. యూపీకి చెందిన మిశ్రాను దేవోరియా ప్రాంతంలో యూపీ, బిహర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. అయితే, నిందితుడిపై ఇప్పటికే అనేక హత్యలకు సంబంధించిన కేసులు, కిడ్నాప్‌లు, లూటీ కేసులు ఉన్నాయని తెలిపారు. మున్న మిశ్రా ఆచూకీని తెలియజేస్తే యాభైవేలు ఇస్తామని గతంలోనే యూపీ ప్రభుత్వం ప్రకటించింది. కాగా, విశ్వసనీయ సమాచారం మేరకు.. యూపీలోని దియోవరియా ప్రాంతంలోని ఒక ఇంట్లో మున్న మిశ్రా ఉన్నట్లు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత దాడిచేసి అతడిని అదుపులోని తీసుకున్నామని యూపీ పోలీసులు పేర్కొన్నారు. నిందితుని దగ్గర నుంచి ఏకే 47 రైఫిల్ గన్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా, యూపీలోనే మరొక గ్యాంగ్‌స్టర్ బదన్ సింగ్‌కు, పోలీసులకు మధ్య కాల్పులు జరిగిన మరుసటి రోజే మిశ్రాను పట్టుకున్నామని అధికారులు పేర్కొన్నారు. బదన్ సింగ్‌పై కూడా ఒక లక్ష రూపాలయల రివార్డు ఉందని తెలిపారు. కాగా, పోలీసులు ఆగ్రా, రాజస్థాన్ బార్డర్లో తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అనుమానస్పదంగా ఉండటాన్ని గమనించారు. వారి వద్దకు చేరుకునేలోపే.. పోలీసులుపై కాల్పులకు తెగబడ్డారు. పోలీసులు కాల్పులలో నిందితులు కూడా తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ క్రమంలో వారిని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారని అధికారులు తెలియజేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు యూపీ పోలీసులు తెలిపారు. -
ఈ నకిలీ.. మహారాష్ట్ర మకిలి!
సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్– మంచిర్యాల–రామగుండం–ఖమ్మం ఇది మన రాష్ట్రంలో ఒక రైలు మార్గం. అంతేకాదండోయ్... ఈ దారి పొడవునా నకిలీ విత్తనాల కేసులున్నాయి. అంటే, మహారాష్ట్ర నుంచి ప్రయాణికుల రాకపోకలే కాదు, నకిలీ విత్తనాలు కూడా ప్రవేశిస్తున్నాయన్నమాట. ఈ మహారాష్ట్ర మకిలీ మన రాష్ట్ర రైతుకు మిక్కిలి కష్టాలను, నష్టాలను మిగులుస్తోంది. ప్రతిఏటా ఇదే తంతు. రైతులు ఆరుగాలం చేసిన శ్రమ నకిలీ విత్తనాల కారణంగా మట్టిలోనే కలసిపోతోంది. ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న కరెంటు, సాగునీరు, రైతుబంధు వంటి పథకాల ద్వారా ఖర్చు చేస్తున్న రూ.వేల కోట్ల రూపాయల ధనం నకిలీ విత్తనాల కారణంగా వృథాగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి రాష్ట్రంలో నకిలీ విత్తనాల బెడదలేకుండా చేయాలని ఇటీవల డీజీపీ ఆదేశాల మేరకు ఐజీ నాగిరెడ్డి నేతృత్వంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటైంది. వ్యవసాయ అధికారులతో కలసి ఈ టాస్క్‌ఫోర్స్‌కు రూపకల్పన చేశారు. ఈ నకిలీ విత్తనాలేవీ కూడా మన రాష్ట్రంలో తయారుకావు. ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాల రవాణాను అడ్డుకోవాలన్న సంకల్పంతో ప్రత్యేక వ్యూహం ఖరారు చేశారు. ఇందు కోసం మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోలీసు– వ్యవసాయాధికారుల ప్రత్యేక సంయుక్త బృందాలను ఏర్పాటు చేసి అనుమానితులపై నిఘా పెట్టారు. పోలీసు, వ్యవసాయ అధికారుల మధ్య సమన్వయం, సంప్రదింపుల నిమిత్తం ప్రత్యేక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశారు. టాస్క్‌ఫోర్స్ సభ్యులకు నకిలీ విత్తనాల గుర్తింపుపై శిక్షణ ఇవ్వనున్నారు. నకిలీ విత్తనాలు విక్రయించినవారిపై వెంటనే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తారు. ఏ వ్యాపారి అయినా విత్తన ప్యాకెట్లను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కాకుండా అధిక ధరలకు విక్రయించినా వెంటనే లైసెన్స్ రద్దయ్యేలా చర్యలు చేపడతారు. అధికంగా మహారాష్ట్ర నుంచే.. నకిలీ విత్తనాల్లో అధికశాతం మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరభారత దేశం వెళ్లే రైలు రూటే వీరికి ప్రధాన మార్గం. అందుకే, అధికారులు ఈసారి ప్యాసింజర్ రైళ్లపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఏపీలోని కర్నూలు కేంద్రంగా సాగుతున్న దందా కూడా గుట్టుచప్పుడు కాకుండా అనేక మార్గాల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో విస్తరించినట్లు పోలీసులకు సమాచారం ఉంది. పీడీ యాక్ట్ కింద 27 కేసులు తెలంగాణలో 2016 నుంచి 2020 వరకు నకిలీ విత్తనాలపై పోలీసులు 27 పీడీ యాక్ట్ కేసులు పెట్టారు. వీటిలో అధికంగా ఖమ్మం(7), రాచకొండ(7), రామగుండం (4) కమిషనరేట్ల పరిధిలో ఉన్నాయి. అందులో 14 కేసులు కేవలం 2020లోనే నమోదవడం గమనార్హం. అనుమానం వస్తే ఫిర్యాదు చేయండి: ఐజీ నాగిరెడ్డి రాష్ట్రంలో నకిలీ విత్తనాల విక్రయాలను ఉక్కుపాదంతో అణచివేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నాం. ఈ విత్తనాల వల్ల ఏ రైతు కుటుంబమూ ఇబ్బంది పడకూడదన్నదే ప్రభుత్వ ధ్యేయం. నకిలీ విత్తనాలపై మీ వద్ద ఎలాంటి సమాచారం ఉన్నా డయల్ 100 లేదా సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. అధికధరలు, నకిలీ విత్తనాలపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తాం. ఎవరినీ ఉపేక్షించేది లేదు. (చదవండి: తాగి రచ్చ చేసిన వరుడు.. పెళ్లికి నిరాకరించిన వదువు) -
ఏలూరు ఆంధ్రా హాస్పిటల్‌పై క్రిమినల్ కేసు
ఏలూరు టౌన్: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ఆంధ్రా హాస్పిటల్లో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీలు చేసింది. రోగుల నుంచి నిర్దేశిత ధరల కంటే అధికంగా ఫీజులు వసూలు చేసినట్లు ఈ సందర్భంగా నిర్ధారించింది. హాస్పిటల్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయించింది. వివరాలు.. ఏలూరు ఆర్ఆర్ పేటలోని ఆంధ్రా హాస్పిటల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై రీజనల్ విజిలెన్స్ అధికారి ఎస్.వరదరాజు వెంటనే స్పందిస్తూ.. తనిఖీలకు ఆదేశాలిచ్చారు. ఈ మేరకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందంలోని విజిలెన్స్ డీఎస్పీ కేవీ రమణ, సీఐ యూజే విల్సన్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రవితేజ, డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎస్కే అబిద్ ఆలీ శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు హాస్పిటల్లో తనిఖీలు చేశారు. ఆరోగ్య శ్రీ పథకానికి అర్హులైన కరోనా బాధితుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేసినట్లు నిర్ధారించారు. ఒక రోగి నుంచి 7 రోజులకు రూ.1.91 లక్షలు, మరొకరి నుంచి ఐదు రోజులకు గానూ రూ.1.28 లక్షలు వసూలు చేసినట్లు తెలిసింది. ఇక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన రోగులకు సంబంధించి కేస్షీట్లను పరిశీలించగా డిశ్చార్జ్ తేదీనే లేదు. ఆరోగ్య శ్రీ కార్డులను నిరాకరించి మరీ.. పలువురి నుంచి అధికంగా ఫీజులు వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. సంబంధిత రోగులకు సంబంధించి ఏ విధమైన బిల్లులు లేకుండా చేసినట్లు అధికారులు గుర్తించారు. రోగులకు ఆరోగ్య శ్రీ కింద వైద్యం చేయలేదని అధికారులు నిర్ధారించారు. వీటన్నింటిపై ఏలూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని విజిలెన్స్ హెచ్చరించింది. -
ఇస్త్రీ చేసేయ్.. వీసా మార్చేయ్!
ఉద్యోగ వీసాను కంప్యూటర్లో ఫొటోషాప్ ద్వారా సందర్శక వీసాగా మార్చి ఇమిగ్రేషన్ అధికారులను బోల్తా కొట్టించి కువైట్‌కు పలువురిని అక్రమంగా తరలిస్తున్న 15 మంది ఏజెంట్లు, వారికి సహకరించిన ఇద్దరు ఎయిర్‌లైన్స్ సిబ్బంది, ఒక పోలీసు కానిస్టేబుల్‌ను సైబరాబాద్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఏజెంట్లు ఢిల్లీ, ముంబై రాయబార కార్యాలయం ద్వారా లైసెన్స్ ఏజెంట్ స్టాంపింగ్ చేసిన పాస్‌పోర్టు తమను ఆశ్రయించిన వారి చేతికి అందిన వెంటనే .. వేడిచేసిన ఇస్త్రీపెట్టెను వినియోగించి పాస్‌పోర్టుకు అంటించి అది చిరగకుండా వీసా స్టిక్కర్‌ను తొలగించి ..ఇంక్ రిమూవర్‌తో మిగిలిన స్టాంప్‌ను తుడిచేసి ఈ అక్రమ రవాణా సాగిస్తున్నారని పోలీసులు గుర్తించారు.ఎంప్లాయిమెంట్ వీసా మీద వెళ్లాలంటే ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రాంట్స్ నిబంధనల ప్రకారం కువైట్‌లో ఉద్యోగం ఇచ్చే యజమాని ప్రవాసీ భారతి బీమా యోజన కింద రూ.1,50,000 వరకు ఉద్యోగిపై ఇన్సూరెన్స్ కట్టినట్లు రుజువు చూపాలి.ఉద్యోగ ఒప్పంద పత్రం తనిఖీ చేస్తారు. వీటినుంచి తప్పించుకునేందుకు ఏజెంట్లు ‘ఇస్త్రీపెట్టె’మార్గాన్ని ఎంచుకున్నారని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీపీ వీసీ సజ్జనార్ బుధవారం మీడియాకు తెలిపారు. నిందితుల నుంచి 250 పాస్‌పోర్టులు, నకిలీ వీసాలు, రబ్బర్ స్టాంప్‌లు, 160 పోలీసు వెరిఫికేషన్ సర్టిఫికెట్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లతో పాటు రూ.ఐదు లక్షలకుపైగా నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఒక్క మార్చి నెలలోనే నకిలీ వీసాలపై ఆర్జీఐ ఎయిర్‌పోర్టు పోలీసు స్టేషన్లో పది కేసులు నమోదైనట్లు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ టీమ్ గుర్తించినట్లు తెలిపారు. జనవరి నుంచి 14 కేసులు నమోదైతే 71 మందిని అరెస్టు చేశామన్నారు. – సాక్షి, హైదరాబాద్ మెడికల్ ఫిట్ ఉంటే హైదరాబాద్ నుంచే... హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్ విజయనగర్ కాలనీలో ఉంటున్న నెల్లూరు జిల్లా కలువాయిమండలం వెంకటరెడ్డి పాలెం గ్రామానికి చెందిన తోట కంఠేశ్వర్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల ముఠా కడప, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అమాయకుల అవసరాలను ఆసరాగా చేసుకొని కువైట్‌లో ఉద్యోగాలంటూ ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు వసూలు చేస్తున్నారు. వీరికి విదేశాలకు పంపించే అనుమతి లేకపోవటంతో ముంబై, బెంగళూరు, శ్రీలంకలోని లీగల్ ఏజెంట్లను కలసి ఎంప్లాయిమెంట్ వీసాలు తెప్పిస్తున్నారు. పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం మీ సేవలో రూ.135లు ఫీజు చెల్లించి చేవెళ్ల చిరునామాలు ఇస్తుండటంతో అక్కడి పోలీసు కానిస్టేబుల్ జి.మధు రూ.2,500లు తీసుకొని క్లియరెన్స్ ఇచ్చేవాడు.ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రాంట్స్ నిబంధనల ప్రకారం ఎస్ఎస్సీ చదువుకోని వారు ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ (ఈసీఆర్) క్లియరెన్స్‌ను తప్పించుకునేందుకు ఎంప్లాయిమెంట్ వీసా స్థానంలో నకిలీ విజిట్ వీసాను కంప్యూటర్లో ఫొటోషాప్ ద్వారా మారుస్తున్నారు. ఆ తర్వాత ఢిల్లీ, ముంబై రాయబార కార్యాలయాల ద్వారా లైసెన్స్ ఏజెంట్ స్టాంపింగ్ చేసిన పాస్‌పోర్టు తీసుకొని ఏజెంట్లు ‘ఇస్త్రీపెట్టె’వినియోగించి నకిలీ విజిట్ వీసాను సిద్ధం చేసేవారు. నెలరోజుల విజిట్ వీసాతో పాటు నకిలీ తిరుగు ప్రయాణ టికెట్లను గల్ఫ్ ఎయిర్‌లైన్స్ ఉద్యోగి మహమ్మద్ ముజీబ్ ఖాన్, ఒమన్ ఎయిర్ ఉద్యోగి అనప్ప రెడ్డి రామలింగారెడ్డి సమకూర్చి సహకరిస్తున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలకు చెందిన పలువురిని కువైట్‌కు పంపించినట్టు తేలింది. ఈ ముఠా సభ్యులైన తోట కంఠేశ్వర్, సురేందర్, నర్సింహ, అనిల్ కుమార్, యుగంధర్, వినయ్ కుమార్, వెంకటసుబ్బారాయుడులను పోలీసులు అరెస్టు చేశారు.చేవెళ్ల పోలీసు కానిస్టేబుల్ మధును కూడా అరెస్టు చేశారు. ఇతర పోలీసుల పాత్రపైనా ఆరా తీస్తున్నామని సీపీ సజ్జనార్‌తెలిపారు. మెడికల్ అన్‌ఫిట్ అయితే శ్రీలంక నుంచి... హైదరాబాద్‌లోని ఆరు ఆస్పత్రుల్లో వైద్యపరీక్షలు చేయించే ఈ ముఠా ఫిట్ ఉంటే శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆశ్రితులను కువైట్‌కు పంపించేవారు.ఎవరైనా అన్‌ఫిట్ అని తేలితే ట్రాన్సిట్ పాస్‌పోర్టుపై ఏడు రోజుల వీసాతో శ్రీలంకకు పంపించే బాధ్యతను 8 మంది సభ్యులతో కూడిన పుష్ప అనే ఆమె నేతృత్వంలోని మరో ముఠా చూసుకునేది. ఈ ముఠాలో ఉన్న ఏపీకి చెందిన గెడ్డం శశి, చింతల సాయిరామ్‌కుమార్, షేక్ అక్రమ్, పిల్లి శ్రీకర్, అకరం బాలకృష్ణ, షేక్ ఖాదర్ బాషా, పూసపాటి రామకృష్ణ, విజయభాస్కర్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులకు పట్టుబడ్డ నిందితులు ఇలా చేస్తే మేలు... విదేశాల్లో పనిచేసేందుకు వెళ్లేందుకు రిజిస్టర్డ్ ఏజెంట్ల కోసం ఇమిగ్రేట్.జీవోవీ.ఇన్‌లో తెలుసుకోవాలి. నాంపల్లిలోని ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ ఆఫీసులో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో వివరాలు నమోదుచేసుకుంటే విదేశాలలో మెడికల్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది.అక్కడ పనిచేసే ప్రాంతంలో వేధింపులకు గురికాకుండా అక్కడి భారత ప్రభుత్వ రాయబార కార్యాలయం జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇప్పటికే ఎవరైనా ఏజెంట్లు మాయమాటలు చెప్పి పాస్‌పోర్టులు, డబ్బులు తీసుకుంటే వాటిని వెనక్కి తీసుకోవాలని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ సూచించారు. -
చిత్తూరు శేషాచల అటవీప్రాంతంలో మళ్లీ అలజడి
-
రీసైక్లింగ్‌పై సీరియస్..!
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందాపై ఉక్కుపాదం మోపేందుకు పౌరసరఫరాల శాఖ మరింత సీరియస్‌గా వ్యవహరిస్తోంది. అక్రమ వ్యాపారం చేస్తున్న రైసుమిల్లర్లపై పీడీ అస్త్రాన్ని ప్రయోగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందం నెలరోజులుగా తనిఖీలు చేస్తోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి రేషన్ బియ్యం సేకరించి రీసైక్లింగ్ చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న కీలక సూత్రధారి, జగిత్యాల హనుమాన్ సాయి ట్రేడర్స్ యజమాని కొండా లక్ష్మణ్ (45)పై మూడురోజుల క్రితం పీడీ కేసు నమోదు చేశారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ వేసిన ప్రత్యేక బృందాల తనిఖీ నివేదికల ఆధారంగానే ఈ కేసును నమోదు చేశారు. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లోనూ కస్టమ్ మిల్లింగ్ బియ్యం (సీఎంఆర్)లో అక్రమాలు, రేషన్ బియ్యం రీసైక్లింగ్‌పై టాస్క్‌ఫోర్స్ బృందాలు ఇంకా తనిఖీలు నిర్వహిస్తుండటంతో అక్రమ వ్యాపారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ కమిటీ నివేదికలపై గురువారం పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ సమావేశం ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆగని ‘టాస్క్‌ఫోర్స్’ తనిఖీలు.. బయడపడుతున్న అక్రమాలు నిరుపేదల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీపై రేషన్‌షాపుల ద్వారా రూపాయికే కిలో చొప్పున పంపిణీ చేస్తున్న బియ్యం అక్రమార్కులకు వరంగా మారాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లిలో ఈ దందా నిర్విరామంగా కొనసాగుతోందన్న సమాచారంతో టాస్క్‌ఫోర్స్ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. దీంతో కొంతమంది రైసుమిల్లర్లు అవే బియ్యాన్ని తిరిగి పౌరసరఫరాల శాఖకే అమ్మిన సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాణ్యత లేని సన్నబియ్యాన్ని ప్రభుత్వానికి సరఫరా చేస్తున్నారన్న విషయం ఇటీవలే వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ నిబంధనల పరకారం 10 శాతానికి మించి బ్రోకెన్ (నూక) రైస్ ఉండకూడదు. కానీ ఇక్కడ 35 శాతం వరకు ఉన్నట్లు తనిఖీల్లో తేలింది. ఒక్కో ఏసీకే (లారీ)లో 400 నుంచి 500 బస్తాలు పంపించే మిల్లర్లు, అందులో సగం వరకు రీసైక్లింగ్ బియ్యం కలిపినట్లు వెల్లడైంది. ఏసీకే నంబర్లు 131, 136, 137, 149, 163, 165లో 1080 బస్తాలు తేలాయి. ఇదే పద్ధతిలో రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి సరఫరా చేసిన 11 వేల బస్తాల్లో 35 శాతం మేరకు బ్రోకెన్ రైస్ ఉందని వెల్లడి కాగా.. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో ఈ తనిఖీలు ఇంకా కొనసాగుతుండటం గమనార్హం. ఏళ్ల తరబడిగా రీసైక్లింగ్ దందా చేస్తున్న వ్యాపారులు, వారి సంస్థలపై నమోదైన 6ఏ కేసుల వారీగా జాబితాను తయారు చేసిన టాస్క్‌ఫోర్స్ బృందాలు సీడబ్ల్యూసీ గోదాములు, ఎంఎల్ఎస్ పాయింట్లు, రైసుమిల్లుల్లో పకడ్బందీగా తనిఖీలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే జగిత్యాలకు చెందిన కొండా లక్ష్మణ్‌పై కేసు పీడీ కేసు నమోదు చేసిన అధికారులు మరికొందరిపై చర్యలకు సిద్ధం కావడం కలకలం రేపుతోంది. అక్రమాలకు నిలయాలు సీడబ్ల్యూసీ గోదాములు ప్రభుత్వం ప్రజాపంపిణీ అవసరాల దృష్ట్యా తీసుకుంటున్న ప్రతి నిర్ణయమూ అక్రమార్కులకు వరంగా మారుతున్నాయి. ఇక్కడ రేషన్‌బియ్యమే రంగు మారి గోదాములకు చేరుతుండగా.. ఈ గోదాములే అక్రమాలకు నిలయాలుగా మారుతున్నాయి. సరిపడా నిల్వలు లేక ప్రభుత్వం ఏటా మిల్లర్లనుంచి 6 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం, ప్రభుత్వ వసతిగృహాలు, మధ్యాహ్న భోజనం పథకం కోసం 1.5 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని మిల్లర్ల నుంచి కొనుగోలు చేస్తున్నది. ఈ క్రమంలో ప్రభుత్వ అవసరాన్ని ఆసరాగా చేసుకుని రేషన్‌బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వానికే అప్పగిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ తరహా బాగో తం వెలుగుచూడగా.. సరఫరా అయిన 11 వేల బి య్యం బస్తాల స్థానంలో ప్రమాణాల ప్రకారం నాణ్య త కలిగిన బియ్యాన్ని ఇవ్వాలని మిల్లర్లను ఆదేశించిన కమిషనర్, ఇకపై రైసుమిల్లర్లు ఎలాంటి అవకతవకలకు పాల్పడినా ఏ మాత్రం ఉపేక్షించేది లేదనీ, చర్యలు కఠినంగా ఉంటాయనీ హెచ్చరించి వదిలేశారు. ఇటీవల ఈ తరహా ఫిర్యాదులపై ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పౌరసరఫరాల సంస్థకు సంబంధించిన బియ్యం నిల్వలు ఉన్న సిడబ్ల్యూసీ, ఎస్‌డబ్లు్యసి తదితర అన్ని గోదాముల్లో నిఘా బృందాలు, సాంకేతిక సిబ్బందితో ప్రత్యేక తనిఖీలు కొనసాగిస్తుండటం అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. -
గోరఖ్‌పూర్ ఉదంతం.. ఆ డాక్టర్ అరెస్ట్
సాక్షి, గోరఖ్‌పూర్: ఉత్తర ప్రదేశ్ లో బాబా రాఘవ దాస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో 30 మంది చిన్నారుల ప్రాణాలు తీసిన ఉదంతంలో పోలీసులు మరొకరిని అరెస్ట్ చేశారు. ఘటనకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న వైద్యుడు డాక్టర్ కఫీల్ ఖాన్‌ను స్పెషల్ టాస్క్‌ఫోర్స్ దళాలు అదుపులోకి తీసుకున్నాయి. సిలిండర్ల కొరతకు ప్రధాన కారణం కఫీలేనన్న ఆరోపణలు ఉన్నాయి. మెదడువాపు వ్యాధి విభాగాన్ని నోడల్ అధికారిగా ఉన్న కఫీల్ ఖాన్, డెంటిస్ట్ అయిన భార్యతో కలిసి ఓ ప్రైవేట్ ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. తన ఆస్పత్రి కోసం బీఆర్డీ ఆస్పత్రి నుంచే సిలిండర్లను తరలించాడని, తద్వారా సిలిండర్ల కొరత ఏర్పడి పిల్లల మరణాలు సంభవించాయని ఆరోపణలు వినిపించాయి. ఇందుకు ఘటన జరిగిన సమయంలో కాలేజీ ప్రిన్సిపాల్ అయిన డాక్టర్ ఆర్కే మిశ్రా కూడా సహకరించాడని విచారణలో తేలింది. సొంత డబ్బులతో పిల్లల కోసం సిలిండర్లు కొంటున్నట్లు కలరింగ్ ఇచ్చి ‘హీరో’గా మీడియాకెక్కిన కఫీల్ తర్వాత అసలు విషయం వెలుగు చూడగా సస్పెన్షన్ కు గురికావటంతోపాటు ఇప్పుడు జైలు పాలయ్యారు. -
మట్కానివారణకు స్పెషల్ టాస్క్ ఫోర్స్
యువ కానిస్టేబుళ్లతో ప్రత్యేక టీం ఎస్పీ నవీన్‌కుమార్ తాండూరు రూరల్ : జిల్లాలో మట్కా నివారణకు యువ కానిస్టేబుళ్లతో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ టీంను ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ భట్టు నవీన్ కుమార్ అన్నారు. గురువారం సాయంత్రం కరన్‌కోట్ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఆత్మహత్యల నివారణకు పోలీసుల ఆధ్వర్యంలో కళాజాత కార్యక్రమాలతో పాటు సైకాలజిస్టులతో ప్రత్యేక కౌన్సెలింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలోని ఠాణాలను సందర్శించి నేరాలకు సంబంధించి నివేదికల ను తయారు చేస్తున్నామని, క్రైం రేటును ఏవిధంగా తగ్గించాలనే విషయమై కార్యాచరణ చేపడతామన్నారు. రోడ్డు ప్రమాదాల విషయమై వాట్సాప్ ద్వారా సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు ఎస్పీ కరన్‌కోట్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం ఎస్పీ నవీన్‌కుమార్ పట్టణంలోని పోలీస్‌స్టేషన్ కూడా సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ చందనదీప్తి, రూరల్ సీఐ సైదిరెడ్డి, పట్టణ సీఐ వెంకట్రామయ్య, ఎస్ఐలు రేణుకారెడ్డి,చంద్రకాంత్, నాగార్జున ఉన్నారు. ఇసుక రవాణాలో కఠినంగా ఉండండి యాలాల : ఇసుక అక్రమ రవాణా విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ నవీన్‌కుమార్ అన్నా రు. గురువారం యాలాల పోలీస్‌స్టేష న్ను ఆయన సందర్శించారు. ముందు గా పీఎస్‌లోని రిసెప్షన్ సెంటర్‌ను పరిశీలించి పీఎస్‌కు ఎటువంటి కేసులు వస్తున్నాయి? బాధితుల విషయంలో ఎలా వ్యవహరిస్తున్నారు? అన్న విషయాన్ని ఎస్ఐ అరుణ్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఆత్మహత్య చేసుకున్న ఎస్ఐ రమేష్ వివరాలను ఎస్పీ నవీన్‌కుమార్ ఏఎస్పీ చందనదీప్తిని అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ వెంట రూరల్ సీఐ సైదిరెడ్డి, ఎస్ఐ - 2 మల్లారెడ్డి తదితరులు ఉన్నారు. సీసీ కెమెరాలతో సరిహద్దు నిఘా బషీరాబాద్ : సీసీ కెమెరాలతో సరిహ ద్దు గ్రామాల్లో నిఘా ఏర్పాటు చేస్తామ ని ఎస్పీ నవీన్ కుమార్ అన్నారు. గురువారం బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌ను ఆయన ఏఎస్పీ చందనదీప్తితో కలిసి సందర్శించారు. స్టేషన్‌లోని పోలీసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రూ.70 లక్షలతో నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో ఉన్న పోలీస్ స్టేషన్ల పరిధిలో నేరాలను అదుపులోకి తీసుకువచ్చేందు కు త్వరలో కర్ణాటక పోలీసు అధికారులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. సరిహద్దు గ్రామాల్లో సీసీ కెమేరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు శాంతి భద్రతలను పర్యవేక్షిచేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీతో పాటు సీఐ సైదిరెడ్డి, ఎస్ఐ అభినవ చతుర్వేది తదితరులున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మొక్కలు నాటారు. -
కోల్‌కతాలో ముగ్గురు ఐఎస్ఐ ఏజెంట్ల అరెస్ట్
కోల్‌కతా: పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్న ముగ్గురు వ్యక్తులను ఆదివారం కోల్‌కతా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ కంపెనీలో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్న ఇర్షాద్ అన్సారి (51), అతని కొడుకు అస్ఫాక్ అన్సారి (23), బంధువు మహ్మద్ జహంగీర్‌లను దక్షిణ కోల్‌కతా ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్టు సీనియర్ ఎస్టీఎఫ్ అధికారి చెప్పారు. నిందితుల నుంచి డాక్యుమెంట్లు, భారత నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇర్షాద్, జహంగీర్లు పదేళ్లుగా ఐఎస్ఐ ఏజెంట్లుగా పనిచేస్తున్నట్టు ఎస్టీఎఫ్ అధికారి చెప్పారు. దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని పాక్‌కు చేరవేస్తున్నట్టు తెలిపారు. కాగా బీఏ రెండో సంవత్సరం చదువుతున్న అస్ఫాక్ పాత్రపై ఇంకా నిర్ధారించాల్సివుందని చెప్పారు. నిందితులు పలుమార్లు పాక్‌కు వెళ్లారని, అక్కడ ఐఎస్ఐ వారికి శిక్షణ ఇచ్చిందని చెప్పారు. ఐఎస్ఐలో వీరి పాత్ర గురించి విచారిస్తున్నట్టు ఎస్టీఎఫ్ అధికారి తెలిపారు. -
ఆర్మీ కీలక పత్రాలతో పట్టుబడ్డ పాక్ గూఢచారి!
లక్నో: ఇండియన్ ఆర్మీకి సంబంధించిన కీలక పత్రాలతో పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐకి చెందిన ఓ ఎజెంట్ పట్టుబడ్డాడు. పాకిస్థాన్ జాతీయుడైన మహమ్మద్ ఈజాజ్‌ను ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కాంట్ ప్రాంతంలో ఆ రాష్ట్ర స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) అరెస్టు చేసింది. ఇస్లామాబాద్‌లోని ఇర్ఫాన్‌బాద్ తారామడి చౌక్‌కు చెందిన అతను మీరట్‌కాంట్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నామని ఎస్టీఎఫ్ ఐజీ సుజీత్ పాండే శనివారం విలేకరులకు తెలిపారు. భారత ఆర్మీకి సంబంధించిన పత్రాలు, పాకిస్థాన్ గుర్తింపు కార్డు, పశ్చిమబెంగాల్‌కు సంబంధించిన నకిలీ ఓటర్ కార్డు, బరెల్లీకి చెందిన నకిలీ ఆధార్ కార్డు, మెట్రో ఐడీ కార్డు, లాప్టాప్, పెన్‌డ్రైవ్‌లు అతని నుంచి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. భారత సైన్యం కార్యకలాపాల గురించి తెలుసుకోవడానికి ఓ పాకిస్థానీ పశ్చిమ యూపీకి వచ్చినట్టు నిఘా వర్గాలు సమాచారమిచ్చాయని, ఆ సమాచారం ఆధారంగా ఈజాజ్‌ను అరెస్టు చేశామని తెలిపారు. భారత ఆర్మీ సమాచారాన్ని సేకరించి పంపేందుకు ఐఎస్ఐ సూచన మేరకు 2012లో భారత్‌కు వచ్చానని అతను తమ విచారణలో వెల్లడించడాని ఐజీ పాండే తెలిపారు. -
వాయుకాలుష్యంపై శాస్త్రీయ అంచనా అవసరం
స్వతంత్ర సంస్థ ద్వారా కారణాల అన్వేషణ {పభుత్వ రంగ సంస్థలకు జీవీఎంసీ పార్కుల దత్తత స్పెషల్ టాస్క్ ఫోర్స్ తొలిసారి భేటీ విశాఖపట్నం : నగరంలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. ముఖ్యంగా పారిశ్రామిక, వాణిజ్య, నివాస, తీర ప్రాంతాల్లో కాలుష్య స్థాయిని శాస్త్రీయంగా అంచనా వేస్తేకానీ నియంత్రణకు ఏ స్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఒక నిర్ణయానికి రాలేరు. ప్రస్తుతం నగరంలో ఒకటి రెండు ప్రాంతాల్లో మాత్రమే వాయుకాలుష్య అంచనా పరికరాలున్నాయి. వీటిని నగరమంతా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది...’ అని కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ కమిటీ సూచించింది. కమిటీ తొలి భేటీ శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ ఎం.టి.కృష్ణబాబు అధ్యక్షతన జరిగింది. నగరంలో పలు ప్రాంతాల్లో వాయు కాలుష్య స్థాయిని అధ్యయనం చేసి విశ్లేషించి అందుకు కారణమయ్యే సంస్థలను గుర్తించే బాధ్యతలను గీతం విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేసే బాధ్యతను పర్యావరణ నిపుణులు ప్రొ.ఎస్.రామకృష్ణారావుకు అప్పగిస్తూ ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. పారిశ్రామిక సంస్థలు, కాలుష్య నియంత్రణ మండలి వద్ద లభించే సమాచారంతో పాటు తాము స్వతంత్రంగా కొన్ని ప్రాంతాల నుంచి నమూనాలను సేకరించి కాలుష్య కారకులపై విశ్లేషణ జరపాలని ప్రొ.రామకృష్ణారావును సమావేశం కోరింది. నగరంలో ప్రస్తుత కాలుష్యం జాతీయ సగటు కంటే తక్కువగానే ఉందని కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి ప్రసాద్ వివరించారు. క్రీడాసదుపాయాల గురించి చర్చిస్తూ ఏదైనా ఒక ప్రాంతంలో కనీసం 20 ఎకరాల స్థలాన్ని గుర్తించినట్లయితే భారీ క్రీడా సముదాయాన్ని నిర్మించే అవకాశం ఉంటుందని పోర్టు ట్రస్ట్ చైర్మన్ కృష్ణబాబు వివరించారు. అథ్లెటిక్స్, ట్రాక్స్, ఇండోర్ స్టేడియం వంటివాటిని నిర్మించవచ్చునని, ఆ బాధ్యతను తాను చేపడతామని కలెక్టర్ యువరాజ్ చెప్పారు. ఇక నగర సుందరీకరణలో భాగంగా జీవీఎంసీలోని ప్రధాన పార్కులన్నీ పారిశ్రామిక సంస్థలకు అప్పగించినట్లయితే ఆయా సంస్థలు అభివృద్ధి చేసేలా ప్రతిపాదనలు తయారు చేసే బాధ్యతను జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌కు అప్పగించారు. అలాగే కేజీహెచ్‌లో ప్రస్తుతం పారిశ్రామిక సంస్థలు ఇవ్వడానికి అంగీకరించిన నిధులతోనే అదనపు భవనాలు నిర్మించేలాప్రణాళిక రూపొందించుకోవాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు సూచించారు. సీపీ అమిత్‌గార్గ్, వుడా వైస్ చైర్మన్ టి.బాబూరావు నాయుడు, హెచ్‌పీసీఎల్ జీఎంలు జీఎస్ ప్రసాద్‌శర్మ, విఎస్ షనాయ్, కేజీహెచ్ సూపరింటెండెంట్ డా.మధుసూదనరావు పాల్గొన్నారు. -
‘వ్యాపమ్’ చార్జిషీట్లకు ఓకే: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: వ్యాపమ్ కుంభకోణంలో అన్ని కేసులను సీబీఐకి బదలాయించే ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ చార్జిషీట్లను దాఖలు చేసేందుకు మధ్యప్రదేశ్ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్), ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. పిటిషన్‌ను సోమవారం విచారించిన సుప్రీంకోర్టు చార్జిషీట్ల దాఖలుకు అనుమతినిచ్చింది. విచారణను జూలై 24కు వాయిదా వేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ తరఫున కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాది సిబల్.. సీబీఐకి వివరణ ఇవ్వడానికి మరింత గడువు కావాలన్నారు. కుంభకోణానికి సంబంధించిన కేసులన్నింటినీ సీబీఐకి బదలాయించాలని ఈ నెల 9న కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
మధ్యప్రదేశ్ గవర్నర్‌పై ఎఫ్ఐఆర్
భోపాల్: ఫారెస్ట్ గార్డుల నియామకాల్లో అక్రమాలకు సంబంధించిన కేసులో మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్‌పై స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్) మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఐపీసీలోని 420తో పాటు పలు సెక్షన్లు, అవినీతి నిరోధక చట్టం కింద దీన్ని నమోదు చేసినట్లు ఎస్టీఫ్ సీనియర్ అధికారి చెప్పారు. యాదవ్ ఐదుగురు అభ్యర్థుల పేర్లను ఫారెస్ట్ గార్డుల ఉద్యోగాల కోసం మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు అధికారులకు సిఫార్సు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. -
మధ్యప్రదేశ్ గవర్నర్ పై ఎఫ్ఐఆర్ నమోదు
ఢిల్లీ:మధ్యప్రదేశ్‌లో సంచలం రేపిన పరీక్షల కుంభకోణంలో ఆ రాష్ట్ర గవరర్నర్ రామ్‌నరేశ్ యాదవ్‌పై మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మార్కుల కుంభకోణంలో గవర్నర్ పాత్ర ఉందని స్పెషల్ టాస్క్ ఫోర్స్ తేల్చడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపై గవర్నర్ నుంచి కేంద్ర హోంశాఖ వివరణ కోరింది. కుంభకోణంపై రామ్ నరేశ్ పై ఆరోపణలు ఎదుర్కొవడంతో అతన్ని గవర్నర్ బాధ్యతల నుంచే తప్పించే అవకాశం ఉందని ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్ (ఎంపీపీఈబీ) నిర్వహించిన పరీక్షలు, ఉద్యోగాల నియమకాల్లో అవినీతి జరిగిందనే ఆరోపణలు వెలువెత్తడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ టాస్క్ ఫోర్స్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. కుంభకోణం ప్రధాన సూత్రధారి గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్ కుమారుడేనని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. గవర్నర్ పాత్రపైనా అనేక ఆరోపణలు వచ్చాయి. రామ్ నరేశ్ రాజ్యాంగ పదవిలో ఉండటంతో హైకోర్టు అనుమతితో ఎఫ్ ఐఆర్ ను నమోదు చేశారు. -
ఎంపీ గవర్నర్‌పై ఎఫ్ఐఆర్
మధ్యప్రదేశ్‌లో సంచలం రేపిన పరీక్షలు, ఉద్యోగ నియమాకాల కుంభకోణంలో ఆ రాష్ట్ర గవరర్నర్ రామ్‌నరేశ్ యాదవ్‌పై కోర్టు అంగీకారం తెలపడంతో మంగళవారం నాడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్ (ఎంపీపీఈబీ) నిర్వహించిన పరీక్షలు, ఉద్యోగాల నియమకాల్లో అవినీతి జరిగిందనే ఆరోపణలు వెలువెత్తడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ టాస్క్ ఫోర్స్ విచారణకు ఆదేశించింది. కుంభకోణం ప్రధాన సూత్రధారి గవర్నర్ రాంనరేశ్ యాదవ్ కుమారుడేనని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. గవర్నర్ పాత్రపైనా అనేక ఆరోపణలు వినవచ్చాయి. ఈ నేపథ్యంలో అటు కుమారుడితో పాటు తండ్రినీ విచారించేందుకు టాస్క్ ఫోర్స్ సిద్ధమైంది. రాంనరేశ్ రాజ్యాంగ పదవిలో ఉండటంతో హైకోర్టు అనుమతితో ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. -
దళితుల హత్యపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్
గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఆదేశం సాక్షి, ముంబై : అహ్మద్‌నగర్ జిల్లాలోని జావ్‌ఖేడ గ్రామంలో ఇటీవల ముగ్గురు దళితులు హత్యకు గురైన ఘటనపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను నియమించాలని రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు శనివారం రాష్ట్ర డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సంజీవ్ దయాల్‌ను ఆదేశించారు. ఈ ఘటన జరిగి నాలుగు రోజులు కావస్తున్నా దర్యాప్తులో ఎలాంటి పురోగతి సాధించలేదన్నారు. ఈ విషయమై గవర్నర్ డీజీపీతో ఫోన్లో మాట్లాడారు. త్వరలోనే ఈ అంశమై రాజ్‌భవన్‌లో ఆర్పీఐ (ఏ) డెలిగేషన్ నాయకులతో ఓ సమావేశం కూడా ఏర్పాటు చేయనున్నట్లు గవర్నర్ తెలిపారు. ఇలాంటి సంఘటనలను మున్ముందు సహించేది లేదన్నారు. మృతుల కుటుంబాలకు రూ.3.75 లక్షల నష్టపరిహారం చెల్లించాలని గవర్నర్ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులకు సంబంధించిన కేసుల విషయమై త్వరలోనే విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తానన్నారు. ఇదిలా వుండగా ఆర్పీఐ జాతీయ అధ్యక్షుడు రాందాస్ ఆఠవలే ఆధ్వర్యంలో ఆ పార్టీకి చెందిన 20 మంది సభ్యులు శనివారం గవర్నర్‌ను కలిసి దళితుల హత్యపై సీఐడీ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన చోటుచేసుకొని దాదాపు నాలుగు రోజులు పూర్తి కావస్తున్నా ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టులు చేయలేదని ఆరోపించారు. ముగ్గురు దళితులు (సంజయ్ జాధవ్, జయశ్రీ జాధవ్, సునీల్ జాధవ్)లను హత్య చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆఠవలే డిమాండ్ చేశారు. అహ్మద్‌నగర్ జిల్లాలో ప్రస్తుతం ఇది దళితులపై జరిగిన నాలుగవ అతి పెద్ద ఘటనగా రాందాస్ పేర్కొన్నారు. అహ్మద్‌నగర్ జిల్లాను ఎట్రాసిటీ-ప్రోన్ జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా మృతుల కుటుంబానికి రూ.15 లక్షల నష్ట పరిహారం అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
వైషమ్యాలు రెచ్చగొట్టడానికే టాస్క్‌ఫోర్స్: రోజా
హైదరాబాద్ : ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టడానికే టాస్క్‌ఫోర్స్ బృందాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపిందని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తుపాను, వరదల వల్ల రాష్ట్రం అల్లకల్లోలంగా ఉంటే...నష్టాన్ని అంచనా వేయడానికి బృందాన్ని పంపాల్సిన కేంద్రం...టాస్క్ఫో ర్స్ ను పంపించటం కేంద్ర ప్రభుత్వ తీరుకు నిదర్శమని ఆమె అన్నారు. వైఎస్ఆర్ సీపీ పార్టీ కార్యాలయంలో రోజా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తన తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు రైతులకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ చెప్పినట్లుగా... కాంగ్రెస్ నేతలు కల్లు తాగిన కోతుల్లా మాట్లాడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. విభజన కారకులను దీపావళి రోజున నరకాసురుడిని వధించినట్లు చేయాలని అన్నారు. మరోవైపు విభజన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. విభజన నేపథ్యంలో తలెత్తే శాంతిభద్రతల సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి, ఎటువంటి వ్యూహాలను,తలెత్తే శాంతిభద్రతల సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి, ఎటువంటి వ్యూహాలను అనుసరించాలనే దానిపై కేంద్ర టాస్క్‌ఫోర్స్ కమిటీ హైదరాబాద్ చేరుకుని సమాచారం సేకరిస్తోంది. -
బీహార్‌లో రెచ్చిపోయిన మావోయిస్టులు
బీహార్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోమారు రెచ్చిపోయారు. జాముయ్ జిల్లాలోని పరాశి గ్రామంలో సమీపంలో ఎస్టీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు జరిపన కాల్పుల్లో ఓ జవాను మరణించాడని ఆ జిల్లా ఎస్పీ జితేంద్ర రాణా శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. ఆ ఘటనలో మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారని వారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని చెప్పారు. ఈ రోజు తెల్లవారుజామున జిల్లాలోని పరాశి గ్రామంలోని పీడబ్ల్యూడీ శాఖకు చెందిన భవనాన్ని సాయుధలైన మావోయిస్టులు పేల్చివేశారు. ఆ ఘటనపై సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ జవాన్లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడే మాటు వేసిన మావోయిస్టులు జవాన్లపై కాల్పులకు ఉపక్రమించారని జిల్లా ఎస్పీ వివరించారు. అయితే మరణించిన, గాయపడని జవాన్లు బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారని ఆయన తెలిపారు. అయితే పరాశి పరిసర ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్‌ను జవాన్లు తీవ్రతరం చేశారు.