ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ ఇండియా చీఫ్ హరీస్ ఫారూఖీ అరెస్ట్ అయ్యారు. ఆయనతో పాటు ఐసిస్‌కు చెందిన మరో వ్యక్తి(సహాయకుడు)ని అదుపులోకి తిసుకున్నట్లు అస్సాం స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) బుధవారం వెల్లడించింది. ఎన్‌ఐఏ జాబితా మోస్ వాంటెడ్‌గా ఉన్న హరీస్ ఫారూఖీ బంగ్లాదేశ్ నుంచి అస్సాంలోని ధుబ్రీలో ప్రవేశించి విధ్వంస కార్యకలపాలకు పాల్పడుతున్నట్లు ఎస్‌టీఎఫ్ టీంకు సమాచారం అందింది. దీంతో ఎస్‌టీఎఫ్ టీం చేపట్టిన భారీ ఆరేషన్‌లో హరీస్ ఫారూఖీ పట్టుబడ్డారు.
బంగ్లాదేశ్‌లో ఉంటూ భారత్‌లోని అస్సాం ధుబ్రీ ప్రాంతంలో విధ్వంస కార్యకలాపాలకు పాల్పడాలని ప్రణాళిక వేస్తున్నట్లు ఎస్‌టీఎఫ్ పోలీసులు గుర్తించారు. హరీష్ ఫారూఖీ అలియాస్ హరీష్ అజ్మల్ ఫారూఖీ భారత ఐసిస్ చీఫ్‌గా ఉన్నారు. అయనతో పాటు మరో వ్యక్తి రెహ్మన్‌ను భారీ ఆపరేషన్ చేపట్టి ఆరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ‘మా బృందానికి నమ్మదగిన సమాచారం అందింది. ఇండియా-బంగ్లాదేశ్ సరిహద్దులో ఐసిస్ ఉగ్రవాదులు ఉన్నరని మేం కూడా నిర్ధారించుకున్నాం. వారు సరిహద్దును దాటే సమయంలో మా టీం ఉదయం వారిని పట్టుకొని అరెస్ట్ చేసింది’ అని స్పెష్‌ల్ టాస్క్ ఫోర్స్ ఐజీ పార్థసారధి మహంతా తెలిపారు.
ఐసిస్ విస్తరణలో భాగంగా.. భారత్‌లో నియామకాలు చేపట్టడానికి కుట్ర పన్నుతున్నారని తెలిపారు. పలు చోట్ల ఉగ్రవాద కార్యకలాపాల కోసం నిధుల సేకరణ, ఐసిస్ కార్యకలాపాలు విస్తరించడానికి ప్రయత్నిస్తున్నారని ఐజీ పార్థసారధి వెల్లడించారు. ఢిల్లీ, లక్నో ప్రాంతాల్లో హరీష్ ఫారూఖ్ మీద పలు ఎన్‌ఐఏ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. తదుపరి చర్యలు తీసుకోవటం కోసం అరెస్ట్ చేసిన ఐసిస్ ఉగ్రవాదులను ఎన్‌ఐఏకు అప్పగించినట్లు అస్సాం స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వెల్లడించారు.
చదవండి: బీజేపీతో పొత్తు: లోక్‌సభ బరిలో దినకరన్ పార్టీ.. ఎన్ని సీట్లంటే?
Comments
Please login to add a commentAdd a comment