వైషమ్యాలు రెచ్చగొట్టడానికే టాస్క్ఫోర్స్: రోజా
హైదరాబాద్ : ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టడానికే టాస్క్ఫోర్స్ బృందాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపిందని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తుపాను, వరదల వల్ల రాష్ట్రం అల్లకల్లోలంగా ఉంటే...నష్టాన్ని అంచనా వేయడానికి బృందాన్ని పంపాల్సిన కేంద్రం...టాస్క్ఫో ర్స్ ను పంపించటం కేంద్ర ప్రభుత్వ తీరుకు నిదర్శమని ఆమె అన్నారు.
వైఎస్ఆర్ సీపీ పార్టీ కార్యాలయంలో రోజా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తన తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు రైతులకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ చెప్పినట్లుగా... కాంగ్రెస్ నేతలు కల్లు తాగిన కోతుల్లా మాట్లాడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. విభజన కారకులను దీపావళి రోజున నరకాసురుడిని వధించినట్లు చేయాలని అన్నారు.
మరోవైపు విభజన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. విభజన నేపథ్యంలో తలెత్తే శాంతిభద్రతల సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి, ఎటువంటి వ్యూహాలను,తలెత్తే శాంతిభద్రతల సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి, ఎటువంటి వ్యూహాలను అనుసరించాలనే దానిపై కేంద్ర టాస్క్ఫోర్స్ కమిటీ హైదరాబాద్ చేరుకుని సమాచారం సేకరిస్తోంది.