మధ్యప్రదేశ్లో సంచలం రేపిన పరీక్షల కుంభకోణంలో ఆ రాష్ట్ర గవరర్నర్ రామ్నరేశ్ యాదవ్పై ఎఫ్ఐఆర్ మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఢిల్లీ:మధ్యప్రదేశ్లో సంచలం రేపిన పరీక్షల కుంభకోణంలో ఆ రాష్ట్ర గవరర్నర్ రామ్నరేశ్ యాదవ్పై మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మార్కుల కుంభకోణంలో గవర్నర్ పాత్ర ఉందని స్పెషల్ టాస్క్ ఫోర్స్ తేల్చడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపై గవర్నర్ నుంచి కేంద్ర హోంశాఖ వివరణ కోరింది. కుంభకోణంపై రామ్ నరేశ్ పై ఆరోపణలు ఎదుర్కొవడంతో అతన్ని గవర్నర్ బాధ్యతల నుంచే తప్పించే అవకాశం ఉందని ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది.
మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్ (ఎంపీపీఈబీ) నిర్వహించిన పరీక్షలు, ఉద్యోగాల నియమకాల్లో అవినీతి జరిగిందనే ఆరోపణలు వెలువెత్తడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ టాస్క్ ఫోర్స్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. కుంభకోణం ప్రధాన సూత్రధారి గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్ కుమారుడేనని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. గవర్నర్ పాత్రపైనా అనేక ఆరోపణలు వచ్చాయి. రామ్ నరేశ్ రాజ్యాంగ పదవిలో ఉండటంతో హైకోర్టు అనుమతితో ఎఫ్ ఐఆర్ ను నమోదు చేశారు.