ఈనెల 18న ప్రవేశ పరీక్ష నిర్వహణ
సీటు సాధించాలంటే మెలకువలు తప్పనిసరి
మదనపల్లె సిటీ: గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థుల జీవితానికి జవహర్ నవోదయ విద్యాలయం విజ్ఞాన వారధిగా నిలుస్తోంది. విలువలతో కూడిన విద్య, నైపుణ్యాలు, దేశభక్తి, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిత్రలేఖనం, ఎన్‌సీసీ ఇలా అన్నింటికి నవోదయ విద్యాలయం ప్రసిద్ధి. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సామాన్య, బడుగు, బలహీనవర్గాల పేద విద్యార్థులకు విద్యనందిస్తోంది.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లె సమీపంలోని వలసపల్లెలోని నవోదయ విద్యాలయం, ఉమ్మడి వైఎస్సార్ జిల్లా పరిధిలోని రాజంపేట నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశానికి ఈనెల 18న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు.ఈ నేపథ్యంలో ఇందులో సీటు సాధించేందుకు మెలకువలను అక్కడి ఉపాధ్యాయులు తెలియజేస్తున్నారు. ఒకే బుక్లెట్లో (ప్రశ్నపత్రం) మూడు భాగాలుంటాయి.
అంకగణితం పరీక్ష
ప్రవేశ పరీక్షలో అంకగణితంలోని 23 చాçప్టర్ల నుంచి ఒక లెక్క వస్తుంది. సరాసరి, సంఖ్యల మీద మూల ప్రక్రియ, దశాంశాలను భిన్నంకాలుగా మార్చడం, భిన్నాంకాలను దశాంశాలుగా మార్చడం, వివిధ రకాల కొలతలు, పొడవులు, శక్తి, కాలం, ధనం మొదలైన వాటితో సంఖ్యతో వినియోగం, చిన్న సంఖ్యలు భిన్నంతో కూడిక, తీసివేత, గుణకారం,శాతాన్ని లెక్కించడం, లాభం, నష్టం (శాతం లెక్కింపు లాభం, నష్టం అంశం నుంచి వినహాయింపు) చుట్టుకొలత, ప్రాంతం–బహుభుజి, దీర్ఘచతురస్రం, త్రిభుజాలు వస్తాయి.
వీటిపై ఎక్కువ సాధన చేయాలి. కోణం రకాలు, బార్ రేఖాచిత్రం తప్పకుండా వస్తుంది. –చలపతినాయుడు, గణిత ఉపాధ్యాయుడు, మదనపల్లె
విద్యార్థి సామర్థ్యం అంచనా
విద్యార్థి పఠనాశక్తిని అంచనా వేయడానికి పరీక్ష ఉంటుంది. సొంతంగా గద్యభాగం ఇస్తారు. ప్రతి అంశానికి ఐదు ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థి ప్రతి అంశాన్ని జాగ్రత్తగా చదివి ప్రశ్నలకు జవాబులను సమాధానపత్రంలో గుర్తించాలి. కింద ఒక గద్యాంశం, దానికి కొన్ని ప్రశ్నలు ఇస్తారు. అభ్యర్థి దీనిని ఒక నమునాగా గ్రహించాలి.
గద్యభాగం అర్థం, తెలుగుకు సంబంధించిన గద్యభాగాలను ఎక్కువగా ఇస్తారు. చిన్న పిల్లలకు ఇచ్చే పుస్తకాల్లో ఏదైనా ఒక కథ అంశాన్ని ఎంచుకుని ఇస్తారు. తెలుగు వాచకంలో ఎక్కడ ఉండవు. వీటికి మంచి మార్కులు తెచ్చుకుంటే సీటు సాధింవచ్చు. –క్రిష్ణయ్య, ఉపాధ్యాయుడు, మదనపల్లె
పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశాం
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పరీక్షలు రాసే విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు చేశాం. 26 కేంద్రాలకు సిబ్బంది,ప్రత్యేక స్క్వాడ్, ఫ్లయింగ్ స్వా్కడ్ ఉంటారు. ప్రవేశపరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి నేరుగా సీట్లు కేటాయిస్తాం.
ఇక్కడ సీటు వస్తే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అన్ని వసతులు ఉంటాయి. ఒత్తిడి చేయడం, ప్రయోగ పూర్వకంగా బోధిస్తాం. ప్రతి రోజూ ఆయా తరతగతుల ఉపాధ్యాయుల పర్యవేక్షణ ఉంటుంది. –వేలాయుధన్, ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్, జవహర్ నవోదయ, మదనపల్లె
ప్రవేశ పరీక్ష తేదీ: 18–1–2025
ప్రవేశం: 6వ తరగతి
పరీక్షా కేంద్రాలు: 26
సమయం: ఉదయం 11.30 నుంచి
మధ్యాహ్నం 1.30 గంటల వరకు
దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు: 5058
సీట్లు: రాజంపేటలో 80, మదనపల్లెలో 80
Comments
Please login to add a commentAdd a comment