
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సివిల్ జడ్జీల ప్రధాన పరీక్ష రాయడానికి ఏపీకి చెందిన 11 మందికి సుప్రీంకోర్టు అనుమతి ఇచి్చంది. ఏపీకి చెందిన విందేల గీతాభార్గవి, సయ్యద్ సూఫియా, గంటా లావణ్య, రావూరి నాగలలిత శ్రీరమ్య ప్రభ, గుడిపల్లి దినేష్, పులి నాగవర్ధన్‌బాబు, షేక్ ఖమర్ సుల్తానా, మీనిగ హేమలత, మధునిక విశ్వనాథం, టి.రవికుమార్, బి.ప్రశాంత్‌బాబు తెలంగాణ సివిల్ జడ్జీల ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. అయితే తెలంగాణ బార్ అసోసియేషన్ నుంచి ఎన్‌రోల్‌మెంట్ సరి్టఫికెట్లు లేకపోవడంతో ప్రధాన పరీక్షకు సంబంధించి ఆ పత్రాలు సమర్పించలేకపోయారు.
తెలంగాణ బార్ అసోసియేషన్ నమోదు తప్పనిసరి అని నోటిఫికేషన్‌లో నిబంధన పేర్కొనడం వల్ల వీరంతా ప్రధాన పరీక్షకు దరఖాస్తు చేసుకోలేకపోయారు. దీంతో, ఈ నిబంధన ఏకపక్షంగా ఉందని, తెలంగాణ రాష్ట్ర న్యాయ(సరీ్వస్, కేడర్)రూల్స్, 2023కు విరుద్ధంగా ఉందంటూ వారంతా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ డీవై.చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. తెలంగాణ ప్రభుత్వం, రిజిస్ట్రార్ (జ్యుడీషియల్–1)లకు నోటీసులు జారీ చేసింది.
బుధవారం ఆదేశాలు వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసింది. అయితే, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకే సమయం ఉందని, మధ్యంతర ఉపశమనం కల్పించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది రితు భరద్వాజ్, అమోల్ చిత్రవంశి, రజత్‌గౌర్‌లు ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. పిటిషనర్ల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొన్న ధర్మాసనం ఏప్రిల్ 10, 2024న జారీ చేసిన నోటిఫికేషన్‌తో ప్రారంభమైన రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో పాల్గొనడానికి పిటిషనర్లకు అనుమతి ఇస్తున్నట్టు పేర్కొంది. అయితే, కోర్టు తుది ఉత్తర్వులు వచ్చే వరకూ పిటిషనర్ల ఫలితాలు ప్రకటించరాదని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఆగస్టు 23కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment