civil judge
-
తెలంగాణ సివిల్ జడ్జీల ప్రధాన పరీక్ష రాసేందుకు ఆ 11 మందికి అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సివిల్ జడ్జీల ప్రధాన పరీక్ష రాయడానికి ఏపీకి చెందిన 11 మందికి సుప్రీంకోర్టు అనుమతి ఇచి్చంది. ఏపీకి చెందిన విందేల గీతాభార్గవి, సయ్యద్ సూఫియా, గంటా లావణ్య, రావూరి నాగలలిత శ్రీరమ్య ప్రభ, గుడిపల్లి దినేష్, పులి నాగవర్ధన్‌బాబు, షేక్ ఖమర్ సుల్తానా, మీనిగ హేమలత, మధునిక విశ్వనాథం, టి.రవికుమార్, బి.ప్రశాంత్‌బాబు తెలంగాణ సివిల్ జడ్జీల ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. అయితే తెలంగాణ బార్ అసోసియేషన్ నుంచి ఎన్రోల్మెంట్ సరి్టఫికెట్లు లేకపోవడంతో ప్రధాన పరీక్షకు సంబంధించి ఆ పత్రాలు సమర్పించలేకపోయారు.తెలంగాణ బార్ అసోసియేషన్ నమోదు తప్పనిసరి అని నోటిఫికేషన్లో నిబంధన పేర్కొనడం వల్ల వీరంతా ప్రధాన పరీక్షకు దరఖాస్తు చేసుకోలేకపోయారు. దీంతో, ఈ నిబంధన ఏకపక్షంగా ఉందని, తెలంగాణ రాష్ట్ర న్యాయ(సరీ్వస్, కేడర్)రూల్స్, 2023కు విరుద్ధంగా ఉందంటూ వారంతా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ డీవై.చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. తెలంగాణ ప్రభుత్వం, రిజిస్ట్రార్ (జ్యుడీషియల్–1)లకు నోటీసులు జారీ చేసింది.బుధవారం ఆదేశాలు వెబ్సైట్లో అప్డేట్ చేసింది. అయితే, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకే సమయం ఉందని, మధ్యంతర ఉపశమనం కల్పించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది రితు భరద్వాజ్, అమోల్ చిత్రవంశి, రజత్‌గౌర్‌లు ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. పిటిషనర్ల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొన్న ధర్మాసనం ఏప్రిల్ 10, 2024న జారీ చేసిన నోటిఫికేషన్‌తో ప్రారంభమైన రిక్రూట్మెంట్ ప్రక్రియలో పాల్గొనడానికి పిటిషనర్లకు అనుమతి ఇస్తున్నట్టు పేర్కొంది. అయితే, కోర్టు తుది ఉత్తర్వులు వచ్చే వరకూ పిటిషనర్ల ఫలితాలు ప్రకటించరాదని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఆగస్టు 23కు వాయిదా వేసింది. -
జడ్జి భర్తపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి
సాక్షి, మహబూబ్‌నగర్: ఆస్పత్రికి వెళుతున్న జడ్జి భర్తతో పాటు ఓ సివిల్ కానిస్టేబుల్‌పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం గండేడ్‌లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెంట్యానాయక్ ఆధ్వర్యంలో రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. అదే సమయంలో కోస్గి సివిల్ జడ్జి ఫరీనాబేగం భర్త, న్యాయవాది శశికిరణ్ తన అత్తమామలు వెంకటేశ్, లక్ష్మిలను తీసుకొని మహబూబ్‌నగర్ ఆస్పత్రికి బయల్దేరారు. రాస్తారోకో వల్ల ఆలస్యమవుతుందని భావించిన శశికిరణ్.. బీఆర్ఎస్ కార్యకర్తల వద్దకెళ్లి పక్షవాతం వచ్చిన వాళ్లున్నారు, ఆస్పత్రికి వెళ్లేందుకు దారి ఇవ్వాలని కోరారు. ఆందోళన ముగిసే వరకు ఆగాలని కొందరు నాయకులు సూచించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు, అడ్వొకేట్ శశికిరణ్ మధ్య మాటామాటా పెరిగింది. దీంతో కొందరు శశికిరణ్‌పై దాడికి దిగారు. అదే సమయంలో అటుగా వెళుతున్న కోస్గి మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన రాజాపూర్ కానిస్టేబుల్ కృష్ణారెడ్డి.. గొడవను గమనించి శశికిరణ్కు కొట్టకుండా బీఆర్ఎస్ కార్యకర్తలను వారించబోయారు. దీంతో అతడిపైనా కార్యకర్తలు దాడికి దిగారు. తర్వాత కొందరు ఇరువర్గాలకు నచ్చజెప్పారు. అనంతరం రేవంత్‌రెడ్డి దిష్టిబొ మ్మను దహనం చేసి ఆందోళన విరమించారు. కాగా, ఈ సంఘటనలో ఇరువర్గాల ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసులు నమోదు చేసినట్లు మహమ్మదాబాద్ ఎస్ఐ సురేష్ తెలిపారు. దాడికి పాల్పడిన మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పెంట్యానాయక్‌తో పాటు జోగు కృష్ణయ్య, వెంకట్రాములు, మల్లేశ్‌లపై కేసు నమోదు చేశారు. తమపై దాడి చేశారంటూ పెంట్యానాయక్, జోగు కృష్ణ చేసిన ఫిర్యాదుపై జడ్జి భర్త శశికిరణ్, హెడ్‌కానిస్టేబుల్ కృష్ణారెడ్డిపై కూడా కేసు నమోదు చేశారు. చదవండి: ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణనే మహిళలకు ఎక్కువ సేఫ్... -
ఏపీ హైకోర్టులో సివిల్ జడ్జి పోస్టులు.. ఆన్లైన్లో దరఖాస్తులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్... సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 22(డైరెక్ట్ రిక్రూట్మెంట్–18, ట్రాన్స్ఫర్ పద్ధతి–04) ► అర్హత: లాలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ► వయసు: 01.07.2021 నాటికి 35ఏళ్లు మించకూడదు. ► వేతనం: నెలకు రూ.27,700 నుంచి రూ.44,770 వరకు; ► ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, స్క్రీనింగ్ టెస్ట్(కంప్యూటర్ బేస్డ్), రాతపరీక్ష, వైవా వాయిస్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► పరీక్షా విధానం: షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు మొదట 100 మార్కులకు కంప్యూటర్ బేస్డ్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ పరీక్ష మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటుంది. పరీక్షా సమయం 2 గంటలు. ఈ పరీక్షలో 40 శాతం పైగా మార్కులు సాధించిన అభ్యర్థుల్ని 1:10 నిష్పత్తిలో రాత పరీక్షకు ఎంపికచేస్తారు. రాతపరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. ఈ పరీక్ష ఆధారంగా అభ్యర్థుల అకడమిక్ నాలెడ్జ్‌ని పరీక్షిస్తారు. సివిల్ లా, క్రిమినల్ లా, ఇంగ్లిష్ ట్రాన్స్లేషన్ టెస్ట్, ఎస్సే రైటింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ప్రతి పేపర్ 100 మార్కులకు ఉంటుంది. పరీక్షా సమయం ప్రతి పేపర్‌కు 3 గంటలు. వైవా వాయిస్ 50 మార్కులకు నిర్వహిస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 30.08.2021 ► హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే తేది: 15.09.2021 ► స్క్రీనింగ్ టెస్ట్(కంప్యూటర్ బేస్ట్) తేది: 03.10.2021 ► వెబ్సైట్: hc.ap.nic.in -
ఏపీ హైకోర్టులో 55 సివిల్ జడ్జి పోస్టులు
అమరావతిలోని హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 55 ►అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ(లా) ఉత్తీర్ణులవ్వాలి. ► వయసు: 01.07.2021 నాటికి 35 ఏళ్లు మించకుండా ఉండాలి. ► జీతభత్యాలు: నెలకు రూ.27,700 నుంచి రూ.44,700 చెల్లిస్తారు. ►ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్(కంప్యూటర్ బేస్డ్), రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు. పరీక్షా విధానం ► స్క్రీనింగ్ టెస్ట్: ఈ పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో మొత్తం 100 ప్రశ్నలు–100 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం 2 గంటలు. దీనిలో 40శాతం, ఆపై మార్కులు సాధించిన వారిని 1:10 పద్ధతిలో రాతపరీక్షకు షార్ట్‌లిస్ట్ చేస్తారు. (ఎంబీబీఎస్‌తో.. కేంద్ర ప్రభుత్వ కొలువు) ► రాతపరీక్ష: ఇందులో మొత్తం 3 పేపర్లు ఉంటాయి. 1. సివిల్ లా, 2. క్రిమినల్ లా, 3. ఇంగ్లిష్ ట్రాన్స్లేషన్ టెస్ట్, ఎస్సే రైటింగ్ టెస్ట్ విభాగాలు ఉంటాయి. ప్రతి పేపర్ని 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి పేపర్ పరీక్ష సమయం 3 గంటలు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని వైవా వాయిస్‌కు ఎంపికచేస్తారు. దీన్ని 50 మార్కులకు నిర్వహిస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 20.08.2021 ► స్క్రీనింగ్ టెస్ట్ తేది: 26.09.2021 ► పరీక్షా కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి,తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. ►వెబ్సైట్: https://hc.ap.nic.in -
కోర్టుకు జీన్స్ ప్యాంటుతో వస్తారా?
సాక్షి, అనంతపురం లీగల్: తహసీల్దారు నోటీసు అందుకొని వీఆర్వోను పంపడమేంటి..? వీళ్లకు ఏమీ తెలియదు. కోర్టుకు వచ్చేటప్పుడు జీన్స్ ప్యాంటుతో వస్తారా. ఒక ఉద్యోగిలా ఉన్నారా? కక్షిదారుడిలా కనిపిస్తున్నారు.’’ అని అనంతపురం అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి పి.శ్రీనివాసులు మంగళవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీరైనా వాళ్లకు చెప్పండి అని ప్రభుత్వ న్యాయవాదికి సూచన చేశారు. ఒక సివిల్ దావాలో నోటీసులు అందుకున్న తహసీల్దార్ గైర్హాజరు కావడమే కాకుండా ఆయన తరఫున వచ్చిన వీఆర్వో జీన్స్ వేసుకుని కోర్టుకు రావడంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు తహసీల్దారు బదిలీ అయ్యారని, అందుకే హాజరు కాలేకపోయారని ప్రభుత్వ న్యాయవాది వివరణ ఇచ్చారు. ఒకసారి నోటీసులు అందుకున్న తర్వాత ఆ విషయం తర్వాత బాధ్యతలు తీసుకున్న వారికి తెలపాలి కదా? బాధ్యతారాహిత్యంగా ఉంటే ఎలా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. తదుపరి వాయిదాకు తహసీల్దారు హాజరు కావాలని, గౌరవప్రదమైన దుస్తుల్లోనే కోర్టుకు రావాలని చురకలంటించారు. -
పాక్‌లో జడ్జిగా హిందూ మహిళ
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో మొదటిసారి సుమన్ కుమారి అనే హిందూ మహిళ సివిల్ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఖంబర్–షాదద్కోట్ జిల్లాకు చెందిన సుమన్ హైదరాబాద్‌లో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. అనంతరం కరాచీలోని స్జాబిస్ట్ యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. సుమన్ తండ్రి పవన్ కుమార్ బోదన్ మాట్లాడుతూ.. ఖంబర్ షాదద్కోట్ జిల్లాలోని పేదలకు ఉచితంగా న్యాయపరమైన సాయం అందించేందుకు తన కూతురు పాటుపాడుతోందని చెప్పారు. ‘సుమన్ ఒక సవాల్‌గా వృత్తిని ఎంచుకున్నారు. ఆమె ఎక్కడికి వెళ్లినా కచ్చితంగా న్యాయం కోసం నిజాయతీతో పోరాడుతుంది..’అని అన్నారు. సుమన్ తండ్రి పవన్ కంటి వైద్య నిపుణుడు కాగా, పెద్ద చెల్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్, మరో చెల్లి అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. సుమన్ కంటే ముందు హిందూ మతం నుంచి జస్టిస్ రానా భగవాన్ దాస్ కొద్దికాలం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా సేవలందించారు. పాక్ జనాభాలో 2 శాతం మంది హిందువులున్నారు. -
జడ్జి, ఐఏఎస్ అంటూ 'టెక్కి'టమారా విద్యలు!
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ సమీపంలోని గుర్గావ్లో సీనియర్ సివిల్ జడ్జీ అవతారం ఎత్తి దాదాపు 40 మందికి రూ.2 కోట్ల వరకు టోకరా వేశాడో టెక్కీ. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన నిందితుడు హైదరాబాద్ వారాసిగూడలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన కేదార్నాథ్ సాగర్ శర్మగా అక్కడి పోలీసులు గుర్తించారు. ఓ పక్క జడ్జీగా, మరోపక్క సీనియర్ ఐఏఎస్ అధికారిగా చెప్పుకుంటూ ఇతడు మోసాలు చేసినట్లు గుర్గావ్ పోలీసులు చెబుతున్నారు. శర్మ అరెస్టు విషయం తెలుసుకున్న ఇక్కడి పోలీసులు ఇక్కడా ఎవరినైనా మోసం చేశాడా.. అన్నది లోతుగా ఆరా తీస్తున్నారు. దాదాపు ఐదేళ్ల క్రితం బీటెక్ పూర్తి చేసిన కేదార్నాథ్ నగరంలోని ఓ ప్రముఖ ఐటీ ఫర్మ్‌లో సూపర్వైజర్గా చేరాడు. నెలకు రూ.13 లక్షల జీతం వచ్చే ఈ ఉద్యోగాన్ని, తన కుటుంబాన్ని 2012లో వదిలేశాడు. ఆ తర్వాత నగరంలోనే అనేక ఉద్యోగాలు చేసినా ఎక్కడా నిలదొక్కుకోలేకపోయాడు. 2016లో సిటీలో కేదార్నాథ్ ఆన్లైన్ వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం ఏడాది క్రితం గుర్గావ్ వెళ్లి అక్కడి సెక్టార్ 102లో ఉన్న హెరిటేజ్ మ్యాక్స్ సొసైటీలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. వ్యాపారంలో తీవ్ర నష్టాలు రావడంతో మళ్లీ వారాసిగూడకు వచ్చేసినా... అప్పుడప్పుడు గుర్గావ్ వెళ్లి వస్తుండేవాడు. జడ్జీగా, ఐఏఎస్‌గా అవతారం.. దాదాపు ఆరు నెలల క్రితం అక్కడే ఓ సెకండ్ హ్యాండ్ బీఎండబ్ల్యూ కారు ఖరీదు చేసిన శర్మ హఠాత్తుగా బోగస్ జడ్జీ అవతారమెత్తాడు. తన వాహనంపై ‘సీనియర్ సివిల్ జడ్జీ’అని రాయించుకోవడంతో పాటు ఆ హోదాతో కొన్ని స్టాంపులు, గుర్తింపు కార్డు తయారు చేయించుకున్నాడు. ఉద్యోగాలు, కేంద్రీయ విద్యాలయాల్లో సీట్లు, ఇళ్లు ఇప్పిస్తానంటూ మోసాలు చేస్తూ అందినకాడికి దండుకోవడం మొదలుపెట్టాడు. తాను తెలంగాణలో సీనియర్ సివిల్ జడ్జీనని, ప్రస్తుతం సెలవులో ఉన్నానని, త్వరలో డిప్యూటేషన్‌పై గుర్గావ్ కోర్టుకు వచ్చానంటూ నమ్మబలికాడు. సీనియర్ ఐఏఎస్ అధికారిగా మరో గుర్తింపు కార్డు తయారు చేసుకున్న శర్మ అలా కూడా చెలామణి అయ్యాడు. ప్రభుత్వం నిర్మించి ఇచ్చే ఇళ్లను తక్కువ ధరకు ఇప్పిస్తానంటూ చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేశాడు. ఎయిమ్స్‌లో నాలుగో తరగతి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మరి కొంతమంది నుంచి వసూళ్లకు పాల్పడ్డాడు. కేంద్రీయ విద్యాలయాల్లో సీట్లు ఇప్పిస్తానంటూ ఒక్కో సీటుకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు దండుకున్నాడు. ఇలా కొద్ది రోజుల్లోనే ఢిల్లీ, గుర్గావ్కు చెందిన 40 మంది నుంచి రూ.2 కోట్ల వరకు వసూలు చేశాడు. ఢిల్లీకి చెందిన విడాకులు తీసుకున్న ఓ యువతిని వివాహం చేసుకుంటానని నమ్మించి రూ.4 లక్షలు తీసుకుని మోసం చేశాడు. వ్యాపారి ఫిర్యాదుతో చెక్ హద్దూఅదుపూ లేకుండా సాగుతున్న కేదార్నాథ్ వ్యవహారానికి ఓ కారు స్పేర్‌పార్ట్స్ వ్యాపారి ఫిర్యాదుతో చెక్ పడింది. జూన్ 9న తన కారు మరమ్మతుల కోసం కేదార్నాథ్ గుర్గావ్ సెక్టార్ 51లో మర మ్మతు, స్పేర్‌పార్ట్స్ దుకాణం నిర్వహించే గగన్ భాత్రా వద్దకు వెళ్లాడు. ఆ వాహనంపై ఉన్న ‘జడ్జీ’ స్టిక్కర్‌ను చూసిన భాత్రా నిజమని నమ్మాడు. మాటల్లో ప్రభుత్వం రూ.4 లక్షలకు విక్రయించే ఇంటిని రూ.2 లక్షలకు ఇప్పిస్తానంటూ చెప్పాడు. ఈ మాటలు నమ్మిన గగన్ ఆ మొత్తం ఇచ్చాడు. అనంతరం కేదార్నాథ్ కనిపించకుండా పోయాడు. దీంతో అతని కారు నంబర్ (డీఎల్12సీ4707) ఆధారంగా గగన్ గుర్గావ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో మోసాల చిట్టా బయటపడింది. ప్రస్తుతం పోలీసులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో అక్కడి పీడబ్ల్యూడీ గెస్ట్‌హౌస్‌కు తన కారులో వెళ్లిన కేదార్నాథ్ జడ్జీగా చెప్పుకుని ఉచితంగా 14 రోజులు ఉండి రాచమర్యాదలు పొందినట్లు గుర్తించారు. జనాన్ని మోసం చేసి వసూలు చేసిన డబ్బుతో ఇటీవలే థాయ్‌లాండ్ టూర్‌కు వెళ్లివచ్చినట్లు తేలింది. ఇతడి చేతిలో మోసపోయిన వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారని గుర్గావ్ ఏసీపీ షంషేర్ సింగ్ ప్రకటించారు. -
పెండింగ్ కేసులు పరిష్కరించడమే లక్ష్యం
– జూనియర్ సివిల్ జడ్జి ఆర్ఎం.శుభవల్లి బద్వేలు అర్బన్: దీర్ఘ కాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులను ఇరువురి సమ్మతంతో పరిష్కరించడమే లోక్ అదాలత్ లక్ష్యమని జూనియర్ సివిల్ జడ్జి ఆర్ఎం.శుభవల్లి అన్నారు. శనివారం స్థానిక జూనియర్ సివిల్ కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్‌లో ఆమె మాట్లాడుతూ ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి సమయం వృధా చేసుకోకుండా కేసులు పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకున్నప్పుడే మానవ జీవితానికి సార్థకత ఉంటుందని తెలిపారు. ఈ లోక్ అదాలత్‌లో 14 క్రిమినల్ కేసులు , ఒక సివిల్ కేసు పరిష్కరించినట్లు కోర్టు వర్గాలు తెలిపాయి. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డిఎ.కుమార్, ఈ.చంద్ర ఓబుల్‌రెడ్డి, సీనియర్ న్యాయవాదులు బ్రహ్మారెడ్డి , లీగల్ ఎయిడ్ కౌన్సిల్ న్యాయవాది వాసుదేవరావు, న్యాయవాదులు రమణారెడ్డి, మురళి, లోక్ అదాలత్ బెంచ్‌మెంబర్లు నాగభూషణమ్మ, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
సెలవుల మంజూరు అధికారం పునరుద్ధరణ
ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల్లోని ఆయా జిల్లాల పరిధిలో పనిచేస్తున్న జూనియర్, సీనియర్ సివిల్ జడ్జీలకు సెలవుల మంజూరు విషయంలో ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జీలు, మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జీలు, మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జీల అధికారాలను హైకోర్టు పునరుద్ధరించింది. ఈ మేరకు హైకోర్టు ఇటీవల నిర్ణయం తీసుకుంది. న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపుల్లో తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ తెలంగాణ న్యాయాధికారుల సంఘం ఆధ్వర్యంలో న్యాయాధికారులందరూ నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే. ఆ జాబితాను వెనక్కి తీసుకోవాలని కోరుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో న్యాయాధికారులు మూకుమ్మడి సెలవులపై వెళ్లాలని నిర్ణయించారు. ఉభయ రాష్ట్రాల్లోని జూనియర్, సీనియర్ సివిల్ జడ్జీల సెలవుల మంజూరుకు సంబంధించి ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జీలు, మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జీలు, మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జీల అధికారాలను హైకోర్టు ఉపసంహరించింది. తదుపరి ఉత్తర్వుల జారీ వరకు ఉపసంహరణ కొనసాగుతుందని హైకోర్టు అప్పట్లో స్పష్టం చేసింది. సెలవుల దరఖాస్తులను ఫ్యాక్స్ ద్వారా హైకోర్టుకు పంపాలని జిల్లా, సెషన్స్ జడ్జీలు, మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జీలు, మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జీలను ఆదేశించింది. కాగా, సెలవుల మంజూరు అధికారాలను ఇప్పటికీ పునరుద్ధరించలేదు. దీంతో ఉభయ రాష్ట్రాల్లోని జూనియర్, సివిల్ జడ్జీల సెలవుల దరఖాస్తులు హైకోర్టుకు చేరుతున్నాయి. వీటి ఆమోదం కోసం హైకోర్టు రిజిస్ట్రీ వర్గాలు ఆయా జిల్లాల పోర్టుఫోలియో జడ్జీల ముందు ఉంచాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో హైకోర్టు తాజా ఉత్తర్వులు జారీ చేసింది. -
సివిల్ జడ్జి ఇంట్లో చోరీ
మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సివిల్ జడ్జి నాగరాజు ఇంట్లో దొంగలు పడి బీభత్పం సృష్టించారు. జడ్జి కుటుంబసభ్యులు ఊరు వెళ్లిన సమయంలో ఈ సంఘటన జరిగింది. ఇరుగుపొరుగువారు ఇచ్చిన సమాచారం మేరకు మిర్యాలగూడ పోలీసులు క్లూస్ టీమ్‌తో చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. జడ్జికి సమాచారం ఇచ్చారు. జడ్జి కుటుంబసభ్యులు వస్తేకాని ఎంతమేర చోరీ జరిగిందనే విషయం తెలియదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పాలకుడు చేసిన పాపం...అక్క చెల్లెళ్లకు శాపం
- పశ్చిమగోదావరిలో డ్వాక్రా మహిళలకు కోర్టు సమన్లు - నాడు రుణాలన్నీ మాఫీ అన్నారు.. ఇపుడు కోర్టులకీడుస్తున్నారు.. - ఘొల్లుమంటున్న డ్వాక్రా మహిళలు..అప్పు చెల్లించినా కొందరికి సమన్లు సాక్షి, నరసాపురం : ‘డ్వాక్రా మహిళలూ.. మీరు బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పుల బకాయిల్లో ఒక్క పైసా కూడా కట్టొద్దు. నేను అధికారంలోకి రాగానే మీ అప్పులన్నీ మాఫీ చేసేస్తా’ ఎన్నికల ముందు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీ ఇది. ఎన్నికలయిపోయాయి.. వాగ్దానాలన్నీ అటకెక్కిపోయాయి... డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలలో పైసా కూడా మాఫీ కాలేదు. అప్పులు తడిసిమోపెడయ్యాయి. వడ్డీలు తలకుమించిన భారంగా పరిణమించాయి. ఇప్పటికే అన్ని జిల్లాల్లో బ్యాంకుల నుంచి నోటీసులు, వత్తిళ్లతో మహిళలు సతమతమవుతున్నారు. ఇదే తరుణంలో వారి తలపై మరో పిడుగుపడింది. కోర్టుల నుంచి ఏకంగా సమన్లు అందుతున్నాయి. తక్షణమే అప్పు చెల్లించాలని... లేదంటే కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందన్నది ఆ సమన్ల సారాంశం. కోర్టు సమన్లతో మహిళలంతా బెంబేలెత్తిపోతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారామపురం గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళలకు రెండురోజులుగా కోర్టు సమన్లు అందుతున్నాయి. అసలు అప్పు తీసుకోని వారికి సైతం సమన్లు అందుతుండడంతో వారు ఘొల్లుమంటున్నారు. బకాయి మొత్తం చెల్లించినా.. సీతారామపురంలోని 7 గ్రూపులకు చెందిన 70 మంది మహిళలు 2009-13 సంవత్సరాల మధ్య గ్రామంలోని ఎస్బీఐ శాఖ నుంచి అప్పు తీసుకున్నారు. వారిలో చాలామంది ఆ మొత్తాలను తిరిగి చెల్లించారు. అయినా ఇంకా బకాయిలు ఉన్నాయని, తక్షణమే వాటిని చెల్లించాలని లేనిపక్షంలో చర్యలు తప్పవంటూ నరసాపురం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నుంచి అందరికీ సమన్లు అందాయి. అప్పు తీసుకున్నవారికి, తీసుకోని వారికి, అప్పు కట్టేసిన వారికి కూడా ఈ నోటీసులు రావడంతో వారంతా లబోదిబోమంటున్నారు. బకాయిదారులంతా న్యాయవాది ద్వారా కౌంటర్ ఆఫిడవిట్ దాఖలు చేయాలని, లేనిపక్షంలో ఆగస్టు 9న కోర్టుకు హాజరు కావాలని ఈ నోటీసులో పేర్కొన్నారు. బకాయి చెల్లించినా నోటీసులు వచ్చాయని, ఆ అప్పులతో సంబంధం లేని వారికీ నోటీసులు ఇచ్చారని మహిళలు చెబుతున్నారు. బ్యాంకుకు వెళ్లి నోటీసులు గురించి అడిగితే కోర్టులో తేల్చుకోండని బ్యాంకు అధికారులు సమాధానమిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము కోర్టుకు వెళ్లాల్సినంత తప్పు ఏం చేశామని వాపోతున్నారు. ఈ మహిళలు బ్యాంకు నుంచి రూ.17 లక్షల రుణం తీసుకున్నారు. అయితే వడ్డీతో కలిపి రూ.28 లక్షలు చెల్లించాలంటూ నోటీసుల్లో పేర్కొనడం విశేషం. దీంతో దిక్కుతోచని మహిళలు ఏం చేయాలో తెలియక ఐకేపీ కార్యాలయాల చుట్టూ, బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు. ఈ విషయం తమ పరిధిలో లేదని, కోర్టు ద్వారానే తేల్చుకోండని బ్యాంకు అధికారులు సమాధానం ఇవ్వడంతో అవాక్కవుతున్నారు. మహిళల ఆందోళనబాట... కోర్టు నుంచి సమన్లు అందుకున్న మహిళలంతా తమను నిలువునా మోసం చేసిన చంద్రబాబు సర్కారు తీరుకు నిరసనగా ఆందోళన బాటపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. స్పందన, విజయా సింగ్, ప్రియాంక గాంధీ, జ్యోతి, అరుణ, ప్రియదర్శిని గ్రూపులకు చెందిన సభ్యులు మంగళవారం సమావేశమయ్యారు. తమకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం దిగివచ్చే వరకు ఉద్యమబాట పట్టాలని, అవసరమైతే న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధం కావాలని నిర్ణయించారు. సొమ్ము మొత్తం కట్టేశాను 2008లో బ్యాంకు నుంచి రూ.20 వేలు అప్పు తీసుకున్నా. వడ్డీతో పాటు తిరిగి చెల్లించాను. ఇప్పుడు రూ.2 లక్షలు చెల్లించాలని నోటీసులు ఇవ్వడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. - పిల్లి అనితాబాబూజీ, పిల్లివారి పేట, సీతారామపురం కట్టినవారికీ సమన్లు దుర్మార్గం మా గ్రూపులో ఎవరైనా సొమ్ము చెల్లించకపోతే వారికి నోటీసులు ఇవ్వాలి. అంతేతప్ప లక్షల్లో అప్పు ఉన్నారంటూ మిగతా వారందరికీ నోటీసులు ఇవ్వడం దుర్మార్గం. - పట్టా లక్ష్మీకాంతం,పిల్లివారి పేట, సీతారామపురం వన్‌టైమ్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు బ్యాంకులో 2008-13 మధ్య కాలంలో డ్వాక్రా రుణాలు పొందిన 70 మంది మహిళలకు కోర్టు ద్వారా నోటీసులు జారీ చేశాం. ఈ రుణాలన్నీ స్వయం సహాయక సంఘాల ద్వారా తీసుకున్నవే. ఏ ఒక్కరు చెల్లించకపోయినా గ్రూపు సభ్యులందరూ బాధ్యులే. ప్రస్తుతం వన్‌టైమ్ సెటిల్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. -పి.వాసుదేవరావు, బ్యాంక్ మేనేజర్ -
సివిల్ జడ్జి పరీక్ష ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టుల కోసం గత నెల 25న నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు హైకోర్టు రిజిస్ట్రార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 97 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షలో అర్హత సాధించి మౌఖిక పరీక్ష కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితాను హైకోర్టు వెబ్సైట్ (http://hc.tap.nic.in)లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. -
సివిల్ జడ్జీల భర్తీ ప్రక్రియ మళ్లీ షురూ
హైదరాబాద్: గతంలో నిలిచిపోయిన సివిల్ జడ్జీల భర్తీ ప్రక్రియను ఉమ్మడి హైకోర్టు మళ్లీ ప్రారంభించింది. గతంలో ఆగిపోయిన 97 సివిల్ జడ్జి పోస్టులకు వచ్చే నెల 8న ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించాలని హైకోర్టు నిర్ణయించింది. ఇదే సమయంలో 2015 సంవత్సరానికి ఖాళీగా ఉన్న 34 సివిల్ జడ్జి పోస్టులను నోటిఫై చేసింది.ఈ నోటిఫికేషన్‌ను గురువారం విడుదల చేసింది. హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, వరంగల్ జిల్లాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్ష జరుగనుంది.