సాక్షి, హైదరాబాద్: సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టుల కోసం గత నెల 25న నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు హైకోర్టు రిజిస్ట్రార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 97 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షలో అర్హత సాధించి మౌఖిక పరీక్ష కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితాను హైకోర్టు వెబ్‌సైట్ (http://hc.tap.nic.in)లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు.