మున్సిపల్ ఎన్నికల ఫలితాల కోసం మరో వారం రోజు లపాటు నిరీక్షణ తప్పదు. గత నెల 30వ తేదీన జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. వాస్తవంగా బుధవారం ఓట్ల లెక్కింపు, ఫలిలాలు వెల్లడి కావాలి ఉంది. ఓట్ల లెక్కింపు, సార్వత్రిక ఎన్నికల ముందు మున్సిపల్ ఎన్నికలు జరగడం... వీటి ఫలితాలు ప్రకటిస్తే ఆ ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై పడుతుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమైంది.
ఈ క్రమంలో పుర ఫలితాలు వాయిదా వేయాలని కొన్ని పార్టీలు, నాయకులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుపై ైెహ కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. ఈ నెల 9వ తేదీన మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు వెల్లడించాలని తీర్పునిచ్చింది. దీంతో అభ్యర్థులు ఒకింత నిరుత్సాహానికి గురయ్యారు. ఇప్పటికే వెయ్యి కళ్లతో ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వీరికి ఇంకా వారం ఆగాలా అని డీలా పడిపోతున్నారు. ఒక్కో అభ్యర్థి లక్షల రూపాయలు ఖర్చు చేసి ఎన్నికల బరిలోకి దిగారు. ఒక్కో ఓటరుకు గరిష్టంగా 5వేల రూపాయలు అందజేసిన దాఖ లాలూ ఉన్నాయి. పోలింగ్ జరుగుతున్నప్పటి నుంచే తమకెన్ని ఓట్ల వచ్చే అవకాశం ఉందని లెక్కలేసుకున్నారు. ఇతర అభ్యర్థులకు పడిన ఓట్లపై కూడా ఓ అంచనాకు వచ్చారు. మొత్తం మీద పోలైన ఓట్లను కూడికలు.. తీసివేతలు చేస్తూ తర్జనభర్జన పడుతున్నారు. వీటి గురించే మరో వారం రోజు లపాటు ఆలోచించాలా అని అనుకుంటున్నారు.
9న మున్సిపల్ ఓట్ల లెక్కింపు : కలెక్టర్
ఈ నెల 2వ తేదీన జరగాల్సిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఈ నెల 9వ తేదీన నిర్వహిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి. చిరంజీవులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభిస్తామని చెప్పారు. లెక్కింపు ప్రక్రియ పూర్తయిన తదనంతరం ఫలితాలు వెల్లడిస్తామన్నారు.
తప్పని నిరీక్షణ
Published Wed, Apr 2 2014 4:12 AM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM
Advertisement
Advertisement