హైదరాబాద్: కర్నూలు జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణపై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణలో ఏపీ ప్రభుత్వం తమ వాదనను వినిపించింది. ఎన్నికల సంఘం లేకపోవడంతో ఎన్నికలు జరపలేకపోతున్నామని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
నాలుగు వారాల్లో ఎన్నికల సంఘం ఏర్పాటు చేసి ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని ధర్మాసనానికి తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.